Showing posts with label Poetry. Show all posts
Showing posts with label Poetry. Show all posts

Monday, January 8, 2024

Odyssey - Homer, Emily Wilson

"Each generation must translate for itself" అంటారు T. S. Eliot. ఆయన మాటలు బ్రిటిష్ రచయిత్రి ఎమిలీ విల్సన్ ఇటీవలే అనువదించిన హోమర్ 'ఒడిస్సీ'కి సరిగ్గా సరిపోతాయి. నేను కొంతకాలం క్రితం చదివిన మార్గరెట్ ఆట్వుడ్ 'పెనెలోపియాడ్', మాడెలైన్ మిల్లర్ 'కిర్కె' (Circe)- ఈ రెండు రచనలూ ఎప్పటికైనా హోమర్ 'ఒడిస్సీ' మూలాన్ని చదవాలనే ఆసక్తి కలిగించాయి. ఎమిలీ పుణ్యమాని ఆ కోరిక ఇన్నాళ్ళకు తీరింది. రెండు ప్రఖ్యాత గ్రీకు కావ్యాల్లో ఒకటైన ఈ 'ఒడిస్సీ'కి 1614 లో తొలి ఆంగ్లానువాదం వెలువడిందట. ఆధునికాంగ్లంలో మూలానికి అతి దగ్గరగా చేసిన అనువాదమంటూ ఈ రచనకు న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన రివ్యూలు చూసాక ఇక పుస్తకం చదవాల్సిందే అని మొదలుపెట్టాను.

Image Courtesy Google

ఈ 'ఒడిస్సీ' కథ ట్రోజన్ యుద్ధం ముగిసిన పదేళ్ళ తరువాత మొదలవుతుంది. పదేళ్ళపాటు జరిగిన ట్రోజన్ యుద్ధంలో ప్రియమ్ పట్టణాన్ని నాశనం చేసిన  తర్వాత ఒడిస్సియస్ 'ఇథాకా'కి తిరుగుప్రయాణమవుతాడు. దారిలో ఒక ద్వీపంలో మనుషుల్ని తినేసే ఒక కాలిప్సో (సముద్రపు దేవుడు పొసెడన్ కొడుకు, పోలిఫెమస్) గుహలో (ల్యాండ్ ఆఫ్ లోటస్ ఈటర్స్) తన సహచరులతో సహా చిక్కుకుపోతాడు. తన కొడుకుని గుడ్డివాడిగా మార్చాడన్న కోపంతో ఒడిస్సియస్ ని పొసెడన్ నానా కష్టాలపాలు చేస్తాడు. ఆ క్రమంలో ఒడిస్సియస్ మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె దగ్గర ఏడాదిపాటు, వనదేవత కాలిప్సో దగ్గర ఏడేళ్ళపాటు చిక్కుకుపోతాడు. యుద్ధం తర్వాత 20 ఏళ్ళపాటు అసలు జీవించి ఉన్నాడోలేడో తెలియని ఒడిస్సియస్ కోసం భార్య పెనెలొపె, కొడుకు టెలేమకస్ ఇథాకాలో వేచిచూస్తూ ఉంటారు. ఈలోగా ఒడిస్సియస్ మరణించి ఉంటాడని అనుకుని ఇథాకాలో పురుషులందరూ (suitors) పెనెలొపె ని తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వత్తిడితెస్తూ ఒడిస్సియస్ అంతఃపురంలో అతడి సంపదని తింటూ బైఠాయిస్తారు. ఈలోగా టెలేమకస్ తండ్రి జాడ వెతుక్కుంటూ పైలోస్, స్పార్టా లకు ప్రయాణమవుతాడు. ఒడిస్సియస్ సముద్రప్రయాణంలో Scylla and Charybdis వంటి రాక్షసులను తప్పించుకుంటూ గమ్యం చేరడం, భార్యను అవమానించిన వాళ్ళందర్నీ చంపడంతో కథ ముగుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథ ఇంతే.

గ్రీకు గాథల్తో పరిచయం ఉన్న వాళ్ళకి ఇదంతా తెలిసిందే. కానీ ఈ కథనల్లుకుని మనకు తెలియని ఆసక్తికరమైన అనేక చిన్న చిన్న కథలుంటాయి. మూలకథ విషయంలో మన రామాయణానికీ దీనికీ అనేక పోలికలు కూడా కనిపిస్తాయి. భర్త కోసం ఎదురుచూసే పెనెలొపె కొన్నిచోట్ల  సీత పాత్రని తలపిస్తుంది. తనని పెళ్ళిచేసుకోవాలంటే ఒడిస్సియస్ విల్లును ఎక్కుపెట్టాలని (string it and shoot an arrow through 12 axes) Suitors కి పరీక్షపెట్టడం సీతా స్వయంవరాన్ని తలపిస్తుంది. ఒడిస్సియస్ తన ఇంట్లో  ముష్టివాడిలా మారువేషంలో తిరగడం మన విరాటపర్వాన్ని జ్ఞప్తికి తెస్తుంది.

 గ్రీకు పురాణాల్లో దేవుళ్ళ పాత్ర కీలకం. ఎటొచ్చీ ఆ దేవుళ్ళు కూడా మనుషుల్లాగే పగాప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు, వాళ్ళని శాంతపరచకపోతే ఆగ్రహిస్తారు. మనుషులు కీలుబొమ్మల్లా వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతుంటారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోడానికి జంతుబలులు ఇస్తుంటారు. జ్యూస్, పోసెడన్, ఎథేనా, కిర్కె, కాలిప్సో వంటి దేవతలు మౌంట్ ఒలింపస్ సభలో మనుష్యజాతికి దిశానిర్దేశం చేస్తుంటారు. ఒడిస్సియస్ ప్రయాణంలో జ్యూస్ కూతురు ఎథేనా అతడి వెన్నంటి ఉండి అడుగడుగునా సాయపడుతుంది.

నాకు సమకాలీన రచనల్లో ఉపయోగించే భాషతో చాలా పేచీలున్నాయి. ఆ మధ్య ఆహా-ఓహో అంటుంటే Chuck Palahniuk రచన ఒకటి మొదలుపెట్టి పట్టుమని పాతిక పేజీలు కూడా చదవలేక ప్రక్కన పెట్టాను. ఇక క్లాసిక్స్  అనువాదాల విషయంలో అయితే సమకాలీనానికి పూర్తిగా దూరం. కానీ ఈ తరం రచయితల్లో సారా హాల్, క్లైర్ కీగన్ వంటి కొందరు తమ రచనలతో నాలో ఆ చికాకుని పోగొట్టారు. 'ఒడిస్సీ'కి ఇన్ని అనువాదాలుండగా ఎమిలీ అనువాదమే  ఎందుకు చదవాలి అంటే, ఆమె భాష కోసం, సొగసైన శైలి కోసం అంటాన్నేను. ఇంత చక్కని భాష ఈరోజుల్లో అరుదు.

రోజుకో యాభై పేజీలు అనుకున్నప్పటికీ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చదివితే సుమారు ఆరువందల పేజీల పుస్తకాన్ని రిఫెరెన్సులతో సహా చదివి  పూర్తి చెయ్యడానికి నాకు ఇరవై రోజులు పట్టింది. ఎప్పుడూ చదివేటప్పుడు ఈబుక్ లో నోట్స్ మార్క్ చేసుకోవడం అలవాటు. అలాంటిది ఈసారి ఒక రీడింగ్ నోట్స్ పెట్టుకుని నోట్స్ చేత్తో రాసుకున్నాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. 'ఒడిస్సీ'లో అనేక పాత్రలు, వాటి గ్రీకు పేర్లన్నీ చాలా దగ్గరగా, ఒకేలా అనిపిస్తాయి. ఇక బంధుత్వాలు గుర్తుపెట్టుకోవడం సరేసరి. అలా నోట్స్ రాసుకుంటూ వెళ్తే ఆ పేర్లు గుర్తుండడమే కాకుండా అవి పునరావృతం అయినప్పుడు వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకోవడం కూడా సులభం. ఇలాంటి రచనలు చదివేటప్పుడు సమ్మరీ రాసుకుంటూ బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవడం బావుంటుంది.

ఇక హోమర్ 'ఒడిస్సీ' మూలానికీ, మనకు సినిమాల ద్వారానో, కథలుగానో తెలిసిన కథకూ కొన్ని తేడాలు గమనించాను.

* హెలెన్ భర్త మెనెలాస్ ను ప్రిన్స్ హెక్టర్ చంపేసినట్లు 'ట్రాయ్' లో చూపిస్తాడు. కానీ మెనెలాస్ ఈ మూలకథలో స్పార్టాకి తిరిగి వెళ్ళి భార్య హెలెన్ తో కలిసి సంతోషంగా రాజ్యమేలుతుంటాడు. తండ్రి ఆచూకీ కోసం వచ్చిన టెలేమకస్ ను ఆదరించి ఒడిస్సియస్ ని వెతికే క్రమంలో సాయంచేస్తాడు. ఇందులో హెలెన్ పారిస్ తో సంబంధం పెట్టుకోవడం కూడా కేవలం దైవేచ్ఛని అంటారు. 

* మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె ఒడిస్సియస్ తన బృందంతో వచ్చినప్పుడు అతడి సహచరులందర్నీ ఉత్తిపుణ్యానికి పందులుగా మార్చేస్తుంది. మూల కథలో ఆమెను ఒక మంత్రగత్తెగా (wicked) చూపిస్తారు. కానీ మాడెలైన్ మిల్లర్ 'కిర్కె'లో ఇదే కథను మరో కోణంలో చూపిస్తారు. ఒడిస్సియస్ బృందం కిర్కె ఇంట్లో బస చెయ్యడానికి సహాయం కోసం వచ్చి, అతిథి మర్యాదలు అందుకుంటూ, తోడు లేని ఒంటరి స్త్రీ అని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోతే అప్పుడు ఆమె వాళ్ళను పందులుగా మార్చివేసిందని రాస్తారు.

* 'పెనెలోపియాడ్'లో ఈ కథను పూర్తిగా పెనెలొపె, ఆమె చెలికత్తెల దృష్టి కోణం నుండి చెప్పుకొస్తారు ఆట్వుడ్. అందులో ఒడిస్సియస్ suitorsతో బాటుగా  పన్నెండుమంది చెలికత్తెలను కూడా పెనెలొపె ఎంత వారించినా వినకుండా ఊచకోత కోస్తాడని రాశారు. కానీ 'ఒడిస్సీ' మూలంలో మొత్తం యాభై మంది చెలికత్తెలుంటే అందులో పన్నెండు మందిని మాత్రమే (విధేయతలేకుండా suitors తో కలిసిపోయిన కారణంగా) ఒడిస్సియస్ హతమారుస్తాడు.

నావరకూ ఈ పుస్తకం 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' ని మరోసారి పూర్తిగా అనుభవంలోకి తెచ్చింది. హోమర్ 'ఒడిస్సీ' చదవాలనుకునే ఈ తరానికి ఇది చక్కని అనువాదం. హ్యాపీ రీడింగ్ :)

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :

Suitors అందర్నీ చంపి ఇంటి ఆవరణలో ఉగ్రరూపంలో నిలబడిన ఒడిస్సియస్ వర్ణన : 

"After a lion eats a grazing ox,
its chest and jowls are thick with blood all over;
a dreadful sight. Just so, Odysseus
had blood
all over him—from hands to feet."

ఒడిస్సియస్ పేరు వెనుక కథ : 

“Name him this. I am
disliked by many, all across the world,
and I dislike them back. So name the child
‘Odysseus.’

హెలెన్ పశ్చాత్తాపంతో కూడిన మాటలు : 

I wished that Aphrodite had not made me
go crazy, when she took me from my country,
and made me leave my daughter and the bed
I shared with my fine, handsome, clever husband.”

ఒడిస్సియస్ ని వివాహమాడాలని నిర్ణయించుకుని అతణ్ణి చెరబట్టిన వనదేవత కాలిప్సో ఆగ్రహం :

Calypso shuddered and let fly at him.
“You cruel, jealous gods! You bear a grudge
whenever any goddess takes a man
to sleep with as a lover in her bed.

'లోటస్ ఈటర్స్' గురించి రాస్తూ :

With heavy hearts we sailed along and reached
the country of high-minded Cyclopes,
the mavericks. They put their trust in gods,
and do not plant their food from seed, nor plow,
and yet the barley, grain, and clustering wine-grapes 110
all flourish there, increased by rain from Zeus.
They hold no councils, have no common laws,
but live in caves on lofty mountaintops,
and each makes laws for his own wife and children,
without concern for what the others think.

పద్యానికీ, వచనానికీ మధ్య పరిధులు చెరిపేస్తూ ఎమిలీ వర్ణనలు : 

"fair wind
befriending us behind the dark blue prow."

"The sun set. It was dark in all directions.
We reached the limits of deep-flowing Ocean,
where the Cimmerians live and have their city.
Their land is covered up in mist and cloud;
the shining Sun God never looks on them
with his bright beams—not when he rises up
into the starry sky, nor when he turns
back from the heavens to earth."

భార్య నమ్మకద్రోహం కారణంగా మరణించిన ఆగమేమ్నోన్ ఆత్మ ఒడిస్సియస్ తో అన్న మాటలు : 

"So you must never treat your wife too well.
Do not let her know everything you know.
Tell her some things, hide others. But your wife
will not kill you, Odysseus. The wise
Penelope is much too sensible
to do such things."

మరి కొన్ని వాక్యాలు :

* I disapprove of too much friendliness
and of too much standoffishness. A balance
is best.

* Shame is not a friend to those in need

* Of all the creatures
that live and breathe and creep on earth, we humans are weakest. When the gods bestow on us
good fortune, and our legs are spry and limber,
we think that nothing can ever can go wrong;
but when the gods bring misery and pain,
We have to bear our suffering with calm.

Monday, January 16, 2023

Sounds, Feelings, Thoughts - Wisława Szymborska

Only that which is human can be truly alien.
The rest is all mixed forests, the burrowing of moles, and wind. - Wisława Szymborska.

ఆధునిక సాహిత్యంలో పాఠకుల ఊహాత్మకతకు రెక్కలు కత్తిరించెయ్యడం రచయితలకు అత్యంత ఇష్టమైన హాబీ అయిపోయింది. ఏం చెప్పినా కొంచెం కూడా అనిశ్చితికి తావివ్వకుండా అన్నిటికీ స్పష్టమైన నిర్వచనాలిచ్చెయ్యాలన్న తపనే నేటి రచనల్లో ఎక్కువ కనిపిస్తోంది. ఈ మధ్య చూసిన కొన్ని సినిమాల్లో సైతం హింసను భయంగొల్పేలా కంటే ఏవగింపు కలిగే విధంగానే ఎక్కువ చూపిన విధానం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ మధ్య ఒక రీడర్స్ వెబ్సైటులో సాహిత్యాన్ని పలు విభాగాలుగా చేస్తూ నేటి ఆధునిక యువతకు వీలుగా అనేక ఆప్షన్స్ పెట్టారు. జాగ్రత్తగా గమనిస్తే అందులో లేని విభాగం ఒక్కటే, "ఎస్తెటిక్స్".

Image Courtesy Google

ఇదీ  కాకపోతే పాఠకుణ్ణి బలవంతంగా ఏదో ఒక చట్రంలో ఇమిడ్చే ప్రయత్నంతోనో, అనేక ఫర్మానాలూ, తీర్మానాలతోనో కూడిన రచనలే ఎక్కువ. వైల్డ్ లాంటి అనేకమంది కళాకారులు అభిప్రాయపడ్డట్లు కళ యొక్క పారమార్థికతే "మనిషి స్వేచ్ఛ" అనుకుంటే, ప్రస్తుతం సాహిత్యం మొదలు అన్ని కళలూ దానికి దూరంగానే జరుగుతున్నాయి. నిజానికి ఏ వాదానికీ, సిద్ధాంతానికీ లొంగనీ, కట్టుబడనీ కళకు ముడిసరుకంటూ దొరకని (?) ఆధునిక సమాజంలోని మనిషి నుండి అంతకంటే గొప్ప కళను ఆశించడం గొంతెమ్మ కోరికే కావచ్చు. కానీ ఠాగోర్, రూమీ, మేరీ ఆలివర్, విస్లవా వంటి కొందరు విశ్వకవులు అవి గొంతెమ్మ కోరికలు కావని పదే పదే నిరూపిస్తునే ఉంటారు.

ఏదేమైనా ఉన్నదాన్ని ఉన్నట్లు నిజాల్ని కుప్పపోసి డాక్యుమెంట్ / జర్నల్ చేస్తూ హేతువాదపు చర్నాకోల ఝుళిపించే రచనలో, లేదా ఆధునిక మానవుడిలో ఒక చిన్న భావోద్వేగాన్నీ, ప్రతిస్పందననూ కలిగించలేని అంతరించిపోయిన భావజాలాలను దట్టించిన రచనలో తప్ప, ఈకాలంలో ఏ ఇరుకిరుకు 'ఇజాల' చిక్కుముడుల మధ్యా చిక్కుకోని రచనలు బహు అరుదనే చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో పోలిష్ రచయిత్రీ, నోబెల్ గ్రహీతా విస్లవా సిమ్బోర్స్కా రచనలు ఆ లోటును పూర్తిగా తీర్చేస్తాయి. "Sounds, Feelings, Thoughts" పేరిట పోలిష్ నుండి ఆంగ్లంలోకి అనువదించిన విస్లవా డెబ్భై కవితల్ని చదువుతుంటే మునుపటిలాగే ఆవిడ మన ఉనికి ఈ విశ్వంలో ఒక చిన్న పరమాణువంత మాత్రమే అనే నిజం గుర్తుచేస్తున్నట్లు అనిపించింది. ఏ ఒక్క జాతికీ, సమూహానికీ, వర్గానికీ, వాదానికీ కట్టుబడని మనిషి అనుభవించేది మాత్రమే నిజమైన స్వేచ్ఛ అని ఇందులో విస్లవా ప్రతీ కవితా మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది.

After so many eras of not being here ?
For all times and tides, for all vegetations ?
For all the crustaceans, for all constellations ?
Just at this moment ? Right down to the marrow ?
Alone at my place with myself ?

సమస్త జంతుజాలంతో కూడిన ప్రకృతి మొదలు మనిషి వరకూ మనమంతా  ఒకే తానులో ముక్కలమనీ, జీవావరణ, పర్యావరణ వ్యవస్థల్ని అన్నిటినీ  ఒక్కటిగా చూడడం అవసరమని నమ్మే కవులూ, రచయితలూ ఇప్పుడెక్కడ ? నేటి రచయితల కలాలు వర్గీకరణల గీతలు గీయడంలో కనబరిచే నైపుణ్యం  మనిషినీ,మనిషినీ కట్టి ఉంచే స్నేహం, సౌభ్రాతృత్వం, సహనం వంటి అంశాలను అక్షరాల్లో పొందుపరచడం విస్మరిస్తున్నారేమోననిపిస్తుంది ! బహుశా అందుకే కావచ్చు, కాల్పనిక ప్రపంచాలకు ఆనాటి జాతివైషమ్యాల మొదలు నేటి అస్తిత్వవాదాల వరకూ అన్నీ ప్లేగు వ్యాధిలా పట్టుకోగా కళ యొక్క పారమార్థికతను పూర్తిగా బుట్టదాఖలు చేసిన పుంఖానుపుంఖాల రచనల మధ్య విస్లవా వంటి కవయిత్రులులను చదవడం ఎంతో హాయిగా అనిపించింది.

I apologize to everything that I cannot be everywhere.
I apologize to everyone that I cannot be every man and woman.
I know that as long as I live nothing can justify me,
because I myself am an obstacle to myself.

ఇందులో డెబ్భై కవితల మధ్యా మునుపు చదివిన కొన్ని కవితలు మళ్ళీ కనిపించాయి కానీ అనువాదకులు వేరవ్వడంతో నాకు పాత అనువాదాల్లోనే పదాల అమరిక  బాగున్నట్లు అనిపించింది. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన 'ట్రూ లవ్', "థాంక్యూ నోట్" లాంటి కవితల్ని ఇందులో 'ఎ హ్యాపీ లవ్', 'గ్రాటిట్యూడ్' పేరిట చేసిన అనువాదాలు అంతగా రుచించలేదు. ప్రత్యేకం విస్లవా రచనల అనువాదాల విషయంలో Stanislaw Baranczak, Clare Cavanagh చేసిన అనువాదాలు బావుంటాయి. ఇది ప్రక్కన పెడితే ఎప్పుడైనా అనువాదాల విషయంలో భాష పట్ల ఎక్కువ పట్టున్న పాతతరం అనువాదకుల వైపు మొగ్గుచూపడం నాకు అలవాటు.

విశ్వ ప్రేమ అన్నాను కదాని విస్లవా రచనల్లో వర్గీకరణలుండవనుకుంటే పొరపాటే. ఎటొచ్చీ విస్లవా కవితల్లో కనిపించే గీతలు నేటి మానవ సమాజపు వర్గీకరణల కంటే భిన్నమైనవి. అవి ప్రాపంచిక దృక్పథానికి పెద్దపీట వేస్తూ మనిషికీ-సమాజానికీ, మనిషికీ-ప్రకృతికీ, మనిషికీ- మనిషికీ మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తూ, ఆ సంబంధాలను విచ్ఛిన్నం చేసే దిశగా కాకుండా, పటిష్టంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి. ఈ పుస్తకంలో Portrait of a Woman, Utopia, In Praise of My Sister, Experiment, The Museum లాంటి కొన్ని జెమ్స్ ఒకదాన్ని మించి మరొకటిగా అనిపిస్తాయి. వీటిల్లో ఫలానా కవిత ఇష్టమని చెప్పడమంత కష్టం మరొకటి లేదు. :) 

ఏదేమైనా అన్నిటినీ తర్కానికి పెట్టరాదు, ఎన్టీరామారావ్, సారీ మాయాబజార్లో శ్రీకృష్ణుడు కూడా "రసపట్టులో తర్కం కూడదన్నాడు" మరి. కొన్నిటిని ఆస్వాదించి వదిలెయ్యాలి, మరి ముఖ్యంగా ఇటువంటి కవిత్వాన్ని. ప్రతీదాన్నీ తర్కానికి పెడితే ఎంత అద్భుతమైన కావ్యమైనా కూడా రసవిహీనం అయిపోతుంది. ఇక విస్లవా కవిత్వం గురించి మునుపు కొన్ని వ్యాసాల్లో రాశాను కాబట్టి ఈ పోస్ట్ లో నాకు నచ్చిన కొన్ని కవితల గురించి మాత్రం ప్రస్తావిస్తాను. 

 "Advertisement" అనే కవిత నిలకడలేని కోతిలా నిరంతరం భోగవిలాసాల్లోనో, మత్తులోనో మునిగితేలే నేటి ఆధునిక మానవుడి దుస్థితిని అచ్చంగా ప్రతిబింబిస్తుంది. ఆధునిక మానవుడిలో నేను నేననే అహంభావంతో దేవుడి పట్ల లోపించిన నమ్మకాన్నీ (లాస్ ఆఫ్ ఫెయిత్), తత్పరిణామంగా అతడు ఎదుర్కునే సోషల్ ఏంగ్జైటీనీ ప్రతిబింబిస్తుందీ కవిత. తనను తాను క్షణమైనా భరించలేని ఆత్మలేని దేహాల డొల్లతనాన్ని బయటపెడుతుంది.

Advertisement :

I am a tranquilizer.
I am effective at home,
I work well at the office,
I take exams,
I appear in court,
I carefully mend broken crockery—
all you need do is take me,
dissolve me under the tongue,
all you need do is swallow me,
just wash me down with water.
I know how to cope with misfortune,
how to endure bad news,
take the edge off injustice,
make up for the absence of God,
help pick out your widow’s weeds.
What are you waiting for—
have faith in chemistry’s compassion.
You’re still a young man/woman,
you really should settle down somehow.
Who said
life must be lived courageously?
Hand your abyss over to me—
I will line it with soft sleep,
you’ll be grateful for
the four-footed landing.
Sell me your soul.
There’s no other buyer likely to turn up.
There’s no other devil left.

కొన్నిసార్లు అది ప్రేమైనా, వైరమైనా మనిషికి తోటి మనిషి తోడు ఎంత అవసరమో చెబుతున్నట్లున్న ఈ వాక్యాలు చూస్తే,

Did someone have someone to love?
Did someone have someone to fight with?
Did everything happen or nothing
there or not there ? అని తనకేమీ తెలీనట్లు చాలా అమాయకంగా అడగడం ఆవిడకే చెల్లుతుంది. 

ఇక ఈ క్రింది కవిత భలే చిత్రంగా అనిపించింది. పైకి గతిలేక నటిస్తూ లోలోపలే కపటత్వాన్ని దాచుకుంటూ తోటి మనిషితో సత్సంబంధాలు నెఱపలేని మనిషి అంతఃసంఘర్షణని ఇందులో ఎంత అద్భుతంగా ఒడిసిపట్టుకున్నారో కదా !

Unexpected Meeting :

We are very polite to each other,
insist it’s nice meeting after all these years.
Our tigers drink milk.
Our hawks walk on the ground.
Our sharks drown in water.
Our wolves yawn in front of the open cage.
Our serpents have shaken off lightning,
monkeys—inspiration, peacocks—feathers.
The bats—long ago now—have flown out of our hair.
We fall silent in mid-phrase,
smiling beyond salvation.
Our people
have nothing to say.

యాత్రల్లో ప్రోగు చేసుకున్న జ్ఞాపకాల్ని 'ట్రావెల్ ఎలిజీ' గా మలుస్తూ,

All is mine but nothing owned,
nothing owned for memory.

కొన్నేళ్ళు కలిసుంటే వారు వీరవుతారంటారు. మనిషికి మనిషి కేవలం అలవాటైపోవడం వలన పుట్టే ప్రేమ, వచ్చే పరివర్తన గురించి రాస్తూ ఇలా అంటారు విస్లవా,
 
Little by little staring produces twins.
Familiarity’s the very best of mothers—
favoring neither of the little cherubs,
barely remembering which is which.

శాశ్వతత్వాన్ని నమ్మకపోతే జీవించడానికి ఆశెలా మిగులుతుంది ?? :)

For everyday purposes I believe in permanence,
in the prospects for history.

"డిస్కవరీ" పేరిట రాసిన మరో కవిత : నమ్మకానికున్న బలాన్ని గురించి ఇంత సరళంగా చెప్పిన వాక్యాలు మునుపు చదివింది లేదు.

I believe in the stayed hand,
I believe in the ruined career,
I believe in the wasted labor of many years.
I believe in the secret taken to the grave.
For me these words soar above all rules.
They seek no support in examples of any kind.
My faith is strong, blind, and without foundation.

Saturday, September 3, 2022

Ade Nadi Iddaridee - Nanda Kishore

నిజానికంతా తెలిసిందే ; తెలిసిందే తెలియందై అంతో ఇంతో అనుభవాన్ని పంచుతుంది. ఎంతోకొంత అశాంతినీ దహిస్తుంది. 

ఇటువంటి వాక్యాలు చదివాక ఇక మాటలనవసరమనిపిస్తూ మౌనం చాలాసేపు వెన్నంటి ఉంది.


నేను హేతువాదిని, భావుకురాల్ని కాదు. ఈ కారణంగా నాలో భావోద్వేగాన్ని  కలిగించలేనిదేదీ నా దృష్టిలో కవిత్వం కాదు. నిజానికి "నా కోసం రాసిన కవిత్వం" కాదు అనడం సమంజసం. ఇప్పటివరకూ మేరీ ఆలీవర్, విస్లావా సింబ్రోస్కా వంటి అతి కొద్దిమంది మాత్రమే ఆ పని చెయ్యగలిగారు. ఇక తెలుగు వెబ్ పత్రికలు చదివే అలవాటు పెద్దగా లేకపోవడం, పద్యం కంటే గద్యం ఎక్కువగా చదివే అలవాటు ఉండడం కారణంగా నాకు నంద కిషోర్ కవిత్వంతో పరిచయం అంత త్వరగా కలగలేదు. గత ఏడాది నాగరాజు పప్పు గారి 'Bankrupt Circus' చదువుతుంటే అందులో ఆయన తెలుగు నుండి అనువదించిన కవితల్లో నందూ పేరు తొలిసారి చూశాను.

ఇక ఫేస్బుక్ లో నందూ పంచుకునే కవిత్వంతో నాకు తెలీకుండానే ప్రేమలో పడిపోయాను. ఇది యాదృచ్ఛికంగా ఎక్కడో ఒకచోట ఒక్క కవిత చదివి అమాంతం కలిగిన అభిమానం కాదు. క్రమంగా, స్థిరంగా, అతి మెల్లగా ఏర్పడిన ఇష్టం. ఒకటి రెండు క్షణాల్లో, ఒకట్రెండు కవితలతో అంతరించిపోకుండా బహుశా తుదకంటా నిలచియుండే ఇష్టం.

నాకు తెలిసి హేతువాదుల్ని భావుకత్వంతో కదిలించడం అంత సులభం కాదు. ఇదేదో గొప్ప విషయమని అనను. అక్షరాల్లో అంతర్లీనంగా ధ్వనించే కపటత్వాన్నీ, పదవిన్యాసాల నడుమ లోతులేని బోలుతనాన్నీ అతి సునాయాసంగా కొలవగల శాపగ్రస్తులు వాళ్ళు. ఇవన్నీ వద్దనుకున్నా వారి దృష్టిని దాటిపోవు. 'Interpretation is the revenge of the intellectual upon art.' అంటారు Susan Sontag.

ఇటువంటి శాపగ్రస్తుల్ని ఊరడిస్తూ అలసిసొలసిన సాయంత్రపు వేళల్లో ఎక్కడో అల్లంత దూరంనుంచి వినిపించే స్వచ్ఛమైన అమ్మ జోల పాట నందూ కవిత్వం. నందూ కవిత్వం ఈ హేతువాదపు చీకట్లు కమ్ముకోక మునుపటి వెలుగుల గతంలోనుండి కొన్ని జ్ఞాపకాలని తిరిగి కళ్ళముందు నిలిపింది. అదే నదినీ, దానితో ముడిపడ్డ జ్ఞాపకాలనీ గుర్తుకుతెచ్చింది. కొన్ని కవితలు చదువుతుంటే మా గోదావరి ఇసుక తిన్నెల్లో వదిలేసి వచ్చిన అడుగు జాడలవైపు కాలం వెనక్కి ప్రయాణించినట్లనిపించింది. ప్రేమనూ, ప్రేమరాహిత్యాన్నీ, వియోగాన్నీ, విరహాన్నీ, వైఫల్యాన్నీ, అస్తిత్వవాదాన్నీ, తాత్వికతనూ అన్ని వర్ణాల్లోనూ చిత్రించిన అందమైన కాన్వాసు నందూ కవిత్వం. చాలాచోట్ల నెరుడా ఛాయలు కనిపించాయి. ఇంతకుమించి నందూ కవిత్వాన్ని గురించి ఇంకేమీ చెప్పే సాహసం చెయ్యను. రసాస్వాదనలో హేతువాదానికీ, తర్కానికీ పనిలేదు. 

ఇక్కడొక చిన్న సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక పండితుడిని "మీరు ఈ విధంగా చేస్తే మీ రచనలు ఎక్కువమందికి చేరతాయి కదా" అని అమాయకంగా ప్రశ్నిస్తే , ఆయన చాలా ప్రశాంతంగా, "ఎక్కువమందికి ఎందుకు ,ఒకరిద్దరు చదివినా చాలు" అన్నారు. ఆమాట అర్థం కావడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాలుగు పుస్తకాలు ప్రచురించినా ముందుమాట / చివరి మాట  ఎవరితోనూ అడిగి రాయించుకోలేదనీ చెప్పిన నందూని చూస్తే ముచ్చటేసింది. తన కవిత్వానికి ఒకరిచ్చే అక్రిడేషన్/సర్టిఫికేషన్ పై ఆసక్తి లేదనీ, Poetry can speak for itself  అని నమ్ముతాననీ చెప్పిన ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం,నిజాయితీల పై అమితమైన గౌరవం కలిగింది.

ఈ కవిత్వాన్ని మీరు కేవలం వెలకట్టి సొంతం చేసుకోగలమనుకుంటే పొరపాటే. ఇటువంటి కవిత్వాన్ని ఆస్వాదించడానికి భావుకత్వంతో పాటు పాఠకుడికి కూడా మరింకేదో అర్హత కావాలి. నంద కిషోర్ కవిత్వం  దారిచేసుకుంటూ ప్రవహించే నదిలా అచ్చంగా ఎవరికోసం రాశారో అటువంటి అర్హత కలిగిన పాఠకులను తప్పకుండా వెతుక్కుంటూ వెడుతుంది.

నిన్న పుస్తకం చేరిన దగ్గరనుండీ పేజీలు తిరగేస్తూనే ఉన్నాను. చదివిన కవితలు కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.

మచ్చుకి ఈ ఆణిముత్యాలు :

కల్లోలాన్ని అనుభవిస్తూ ఒక్కడూ ఏం చేస్తాడు ? తీరాన కూర్చుని కెరటల్ని గురించి కవిత్వం రాస్తాడు. అలల మీదా, నీటి తరగల నాట్యం మీదా పదాలు అల్లుతూ పాటకడతాడు. ఉప్పెన మీదికి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే చేపపిల్లలాగా తుళ్లిపడతాడు. అలలతో పాటే ఊపిరి పోతే ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.

సముద్రం వాణ్ణి ప్రేమించిందని ఎవ్వరికీ చెప్పడు. కల్లోలాన్ని వాడు కోరుకున్నట్లు ఎప్పటికీ తెలియదు. తెలిసేదల్లా వాడికలేడనే !

--------------------------------------------------------

ఎలుగెత్తి నువ్వలా పాట పాడితే, ఎదకెత్తి నువ్వలా జోలపాడితే, పారిపోయేటినిశ్శబ్దాన్ని తెచ్చి పాటపాటలోనూ పదిలంగా నింపితే - మసకలోకమ్మీది మోహాలపొద్దులో సూర్యుడు,చంద్రుడు నిలవరనిపిస్తుంది. మరలిపోయేటి ప్రాణాలకోసం ఏడ్వడం,నవ్వడం కూడదనిపిస్తుంది.

Saturday, February 12, 2022

Time Lived, Without Its Flow - Denise Riley

కొన్ని పుస్తకాలు అమెజాన్ టాప్ 100, టైమ్ మ్యాగజైన్ బుక్స్, ఓప్రా బుక్ క్లబ్ పిక్స్ లాంటి బెస్ట్ సెల్లర్ క్యాటగిరీల్లో కనపడవు. అవి "ఒక పాఠకుడి నుంచి మరో పాఠకుడికి ఒక విలువైన రహస్యాన్ని అందించినట్లు చేతులు మారతాయి" అంటారు 'Time Lived, Without Its Flow' అనే ఈ పుస్తకానికి అద్భుతమైన ముందుమాట రాసిన మాక్స్ పోర్టర్. నాకు 'Grief is the Thing with Feathers' పుస్తకం ద్వారా మాక్స్ పోర్టర్ ను ఏడెనిమిదేళ్ళ క్రిందట పరిచయం చేసిన నాగరాజు పప్పు గారే ఈ పుస్తకాన్ని కూడా 'ఒక విలువైన రహస్యంలా' చదవమని రికమెండ్ చేశారు. అమ్మతో సహా,అనేకమంది ఆత్మీయుల్నీ వరుసగా పోగొట్టుకున్న ఆ మూడు నాలుగేళ్ళ సమయంలో గ్రీఫ్ గురించి అనేక రచనలు చదివినా, చక్కని వర్ణనలతో పద్యానికీ,గద్యానికీ పరిథుల్ని చెరిపేసిన పోర్టర్ రచన నాకు ఇప్పటికీ ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.

Image Courtesy Google

2008 లో లండన్ కు చెందిన కవయిత్రి డెనిస్ రిలే కుమారుడు జాకబ్ రోగనిర్ధారణకు లొంగని ఒక అంతుబట్టని హృదయసంబంధిత వ్యాథితో హఠాత్తుగా మరణించాడు. చేతికందొచ్చిన వయసులో కొడుకు హఠాన్మరణం తాలూకా షాక్ నుండి తేరుకునే సమయంలో ఆమె తన అనుభవాలకు వివిధ దశల్లో అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులకు విడో/ విడోవర్ అని పేర్లున్నట్లు బిడ్డను కోల్పోయిన తల్లికి ప్రత్యేకమైన పదమేదీ లేదని నిష్టూరపడతారు రచయిత్రి.

సంతాప సమయంలో కాలప్రవాహం కదలిక లేకుండా స్థంభించిపోతుందంటారు డెనిస్. అందువల్ల ఈ రచన మరణం తాలూకా సంతాపాన్ని ఒక ప్రేక్షక స్థానంలో ఉండి అనుభవించడం కంటే, తానే స్వయంగా సంతాపంగా మారిపోవడంలా ఉంటుంది. ఈ కారణంగా ఈ పుస్తకంలో మూలాంశం 'మృత్యువు' కాదు, 'స్థంభించిన కాలం' అంటారు పోర్టర్. 

Riley’s project is to describe and interrogate ‘that acute sensation of being cut off from any temporal flow after the sudden death of your child.’

నిజానికి ఈ వ్యాసం మృత్యువును గురించి కంటే ఆ కారణంగా చలనరహితంగా ఆగిపోయిన క్షణాల గురించే ఎక్కువ చెబుతుంది. ఇది మృత్యువు తుఫానులా వచ్చి మన ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన తరువాత వచ్చే ప్రశాంతతను తలపిస్తూ కాలప్రవాహపు అడుగులతో అడుగు కలపలేని నిస్సహాయ,నిశ్శబ్ద, నిశ్చలమైన నిముషాలూ, గంటలూ, రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలను గురించిన వ్యాసం. 

No tenses any more. Among the recent labels for temporality is ‘time dilation’, referring to our perception’s elasticity, its capacity to be baggy. But are there any neurological accounts of this feeling of completely arrested time? It feels as if some palpable cerebral alteration has taken place. As if, to make the obvious joke, your temporal lobes have been flooded and are now your a-temporal lobes.

ఇలాంటి సమయాలో భావోద్వేగాలను భాషతో పొదివి పట్టుకోవడమంత కష్టం మరొకటి ఉండదు. మహా అయితే వాటి చుట్టూ అల్లిబిల్లిగా అటూఇటూ పదవిన్యాసాలు చేస్తూ తిరుగాడగలం. ఒక్కోసారి యాధృచ్ఛికంగా వాటికి సన్నిహితంగా జరిగిన లిప్తకాలపు అనుభూతిని చూసి వాటిని అచ్చంగా అందిపుచ్చుకున్నామని అపోహపడతాం. తీరాచూస్తే ఇదంతా భ్రమే. మనిషి తెలివిడిని తప్పించుకోలేని కల్పనల కల్తీ సోకకుండా వాటిని సహజసిద్ధమైన రూపంలో పట్టుకోవడం ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా అసంభవం అనిపిస్తుంది. కానీ ఇదంతా డెనిస్ ని చదవడానికి మునుపు. ఆగిపోయిన కాలాన్నీ, ఆ కాలంలో  అనుభవించిన సంతాపాన్నీ ఆమె భాషలో పొదిగిన తీరు సంతాపాన్ని గురించి ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక రచనలను అమాంతం ప్రక్కకు తోసి ఈ రచనను మొదటివరుసలో నిలబెడుతుంది. తనివితీరక కొన్ని వాక్యాలను రెండు మూడుసార్లు చదువుకున్న క్షణాలూ, మరోసారి చదివితే దృష్టినిదాటిపోయిన గుప్తనిధులేమన్నా దొరుకుతాయేమో అని పదాలను తడుముకుంటూ, వెతుక్కుంటూ చదివిన అనుభవాలూ పాఠకులకు ఈ చిన్న పుస్తకం చదువుతున్నప్పుడు అనేకం ఎదురవుతాయి. ఒక ఫిక్షన్ రచయిత రాసే పదాలకూ, కవి రాసే పదాలకూ తేడా ఉండదూ ! 

పోర్టర్ అన్నట్లే ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన తరువాత మళ్ళీ అలవోకగా మన వాస్తవ జీవితానికి తిరుగుప్రయాణం కట్టడం అంత తేలికైన విషయమేమీ కాదు. డెనిస్ శైలికి మనం చదివినదాన్ని పునఃసమీక్షించుకోమని ఆజ్ఞాపించే శక్తి ఉంది. ఉదాహరణకు డెనిస్ రాసిన ఈ క్రింది వాక్యాలు చూడండి, ఇవి పుస్తకం పూర్తిచేసిన తరువాత కూడా పాఠకుల్ని అంత సులువుగా వదిలిపోవు.

Not that I have delusions, as such. But a strong impression that I’ve been torn off, brittle as any dry autumn leaf, liable to be blown onto the tracks in the underground station, or to crumble as someone brushes by me in this public world where people rush about loudly, with their astonishing confidence. Each one of them a candidate for sudden death, and so helplessly vulnerable. If they do grasp that at any second their own lives might stop, they can’t hold on to that expectation. As I do now. Later everyone on the street seems to rattle together like dead leaves in heaps.

రాయాలంటే మృత్యువు గురించి ఎంతైనా రాయొచ్చు.కానీ ముందు చెప్పుకున్నట్లు ఈ పుస్తకం 'ఒక రహస్యం'. ఎవరికివారు ఛేదించుకోవాల్సిన రహస్యం. హ్యాపీ రీడింగ్ :) 

పుస్తకంనుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు,

Far from taking refuge deeply inside yourself, there is no longer any inside, and you have become only outward. As a friend, who’d survived the suicide of the person closest to her, says: ‘I was my two eyes set burning in my skull. Behind them there was only vacancy.’

And you yourself will not be the same. But something, nevertheless, stays: recognition as re-cognition; to know again, but because of the interval, to know a bit differently.

సంతాప సమయంలో ఆగిపోయిన కాలాన్ని గురించి రచయిత్రి ఇందులో ప్రస్తావించిన  Emily Dickinson రెండు కవితలు చాలా అర్థవంతంగా ఉన్నాయనిపించింది :

The thought behind I strove to join
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.
--------------------------
I felt a cleaving in my mind
As if my brain had split;
I tried to match it, seam by seam,
But could not make them fit.
The thought behind I strove to join
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.

Previously I hadn’t believed that speech is simply the translation of something already formulated in thought. Now I was faced with the evidence that sometimes it is, but that the translation can fail. 

Perhaps only through forgetting the dead could it become possible to allow them to become dead. To finally be dead. And that could only follow – once time itself had taken the initiative here – from consigning them to a time that had decided to resume its old flow. Of its own accord. When or if this may ever happen, I can’t know. And can’t want it.

You’ve slipped into a state of a-chronicity. From its serene perspective you realize, to your astonishment, that to dwell inside a time that had the property of ‘flowing’ was merely one of a range of possible temporal perceptions. For your time can pause, and you with it – though you’re left sharply alive within its stopping. Your apprehension of sequence itself is halted. Where you have no impression of any succession of events, there is no linkage between them, and no cause. Anything at all might follow on from any one instant. You are tensed for anything – or, equally, are poised for nothing. No plans can be entertained seriously, although you keep up an outward show of doing so. Where induction itself has failed, so does your capacity for confident anticipation. So your task now is to inhabit the only place left to you – the present instant – with equanimity, and in as much good heart as you can contrive. For one moment will not, now, carry you onward to the next.

సంతాప సమయంలో సాహిత్యంలో సాంత్వనను వెతుక్కోవడం గురించి రాస్తూ,  

Nevertheless your search for any evidence of fellow feeling is restless, almost comically so. You’re paralysed and not, as far as you know, temporarily (for this condition feels eternal) but temporally. And yet some longing drives you onward to comb through any writing that might carry the reassurance that this cessation of your time is both well known and fully recorded. At times of great tension, we may well find ourselves hunting for some published resonances in literature of what we’ve come to feel. I realize that this might quickly be condemned as a sentimental search for ‘identification’, for the cosiness of finding one’s own situation mirrored in print. Still, I think we can save it from that withering assessment. Instead we might reconsider the possibility of a literature of consolation, what that could be or what it might do.

Monday, October 11, 2021

The Ink Dark Moon : Love Poems by Ono no Komachi and Izumi Shikibu, Women of the Ancient Court of Japan

జాపనీస్ సాహిత్యంలో స్వర్ణయుగంగా (Heian era) పరిగణించే 794-1185 ల మధ్య కాలానికి చెందిన ఇద్దరు కీలకమైన కవయిత్రులు ఓనో నో కొమచి,ఇజుమీ షికిబు ల కవితలను అమెరికన్ కవయిత్రి జేన్ హిర్ష్ఫీల్డ్  'ఇంక్ డార్క్ మూన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కవయిత్రులిద్దరూ జపాన్ రాజ్యసభలో (అనగా ఇప్పటి క్యోటో) భాగంగా ఉండేవారట. ఓనో కొమచి తన కవితల్లో ప్రేమ విరహం,శృంగారం,సంతాపం వంటి విషయాల్లో స్త్రీ సహజమైన భావోద్వేగాలకూ,స్పందనలకూ తాత్విక దృష్టితో అక్షరరూపమిస్తే , షికిబు కవితలలో శృంగారంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాముఖ్యతనిస్తూ రాసిన కవితలు ఉంటాయి. నిజానికి విరహాన్నీ,ప్రేమనూ స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో మగవారికి ఉండే స్వేచ్ఛ గానీ,సాధనాలు గానీ స్త్రీకి అందుబాటులో లేని కాలం అది. 4,5 శతాబ్దాలలో చైనీస్ భాష జపాన్ లో మొట్ట మొదటి లిపి ఉన్న భాషగా వ్యవహారంలో ఉండేదట, కానీ 8 వ శతాబ్దం వరకూ ఆ భాష స్త్రీలకు అందుబాటులోకి రాలేదు.

జపాను కవిత్వానికి మూలాలు మానవ మస్తిష్కంలోనుండి వ్రేళ్ళూనుకుని  ఉంటాయి కాబట్టి గాఢమైన అనుభవప్రధానమైన ఈ కవితలు హృదయపు లోతుల్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. ఎంతమంది మనుషులుంటే అన్ని విధాలైన వ్యక్తీకరణ మార్గాలు గనుక ఈ కవితల్లో ఆ కాలపు సంస్కృతిలో కన్నవీ,విన్నవీ యథాతథంగా అక్షరీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. కొమ్మల్లో దాక్కుని కూసే కోయిల, తటాకాల్లోని కలువల మధ్య నుండి వినిపించే కప్పల సందడి వంటివి ఈ కవితల్లో విరివిగా ప్రస్తావనకొస్తాయి.

Image Courtesy Google

సహజంగా ఎప్పుడూ ముందుమాట పుస్తకం చివర్లో చదివే అలవాటు నాకు. గద్యం చదివేటప్పుడు ఈ అలవాటు ఫర్వాలేకపోయింది కానీ ఈ మధ్య కవిత్వం చదివేటప్పుడు ఖచ్చితంగా ముందుమాట చదివిన తరువాతే మిగతా పేజీల్లోకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కవిత్వం చదివేముందు పరిచయ వాక్యాలు చదివితే కవితల నేపథ్యం అర్థమై ఆ వాక్యాలు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి, లేకపోతే కాంటెక్స్ట్ తెలీని ఖాళీ వాక్యాల్లా మిగిలిపోతాయి. ముఖ్యంగా ప్రాచీన కవిత్వం చదివే విషయంలో కవితల నేపథ్యం తెలియడం మరింత ముఖ్యమని తమిళ కవి ఎ.కె. రామానుజన్ కూడా అభిప్రాయపడతారు. నిజానికి ఈ కవితలు విడివిడిగా చదివినప్పుడు నాకంత గొప్పగా అనిపించలేదు. కానీ నేపథ్యం తెలిశాకా అవే కవితలు మరింత అర్థవంతంగా ధ్వనించాయి. 

స్త్రీ పురుష సంబంధాలు ప్రధాన వస్తువుగా ఉండే ఈ కవితలపై ఆ కాలపు సామజిక పరిమితులూ, పితృస్వామ్యం వంటి అంశాల ప్రభావం కనిపిస్తుంది. ఆ కాలంలో కులీన వర్గాల్లో వివాహితుడైన పురుషుడు ఎంత మంది స్త్రీలతోనైనా సంబంధం కలిగి ఉండవచ్చు. కానీ వివాహిత అయిన స్త్రీ మాత్రం పాతివ్రత్యంతో భర్త పట్ల విధేయతతో మెలగాలి. అవివాహిత స్త్రీలకు మాత్రం ఈ  విషయంలో మినహాయింపు ఉండేది కానీ సాధారణంగా వారు ఇటువంటి సంబంధాలను రహస్యంగా నెరపేవారట. ఈ పుస్తకంలో కోర్టింగ్ విషయంలో రాసిన మరి కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ కాలంలో మగవారు ఎవరినైనా ఇష్టపడితే ఆ స్త్రీకి లిఖితరూపంలో నాలుగైదు పంక్తుల కవిత రాసి పంపేవారట. ఆమెకు ఆ కవిత్వం, కవిత్వపు భాష గనుక నచ్చితే అదే మార్గంలో తిరిగి జవాబు అందేదట. అంటే కవిత్వానికీ, భాషకీ ఆ కాలంలో అంతటి ప్రాముఖ్యత ఉండేదని అర్ధమవుతుంది.

ఇందులోని కొన్ని కవితలకు నా స్వేచ్ఛానువాదం :

నీ విరహంలో ఈ హృదయం వెయ్యి ముక్కలైంది

నేనొక్క ముక్కను కూడా కోల్పోలేదు. 

 

నేను నీకోసం పరితపిస్తున్నప్పుడు నీవు చేరువకాకుండా దూరంగా ఉండి ఉంటే

ఈపాటికి నేను నిన్ను మరచిపోయి ఉండేదాన్ని.


ఈ ప్రపంచమొక జాగృత స్వప్నమని నీకు తెలియదా ?

నేను నీకోసం తపించిన ఆనాటి క్షణాలు, అవి కూడా అశాశ్వతమైన భావనలే  కదా !


నేను నీ పేరు పదేపదే పలవరించినా  ఈ వాస్తవం నా హృదయపు  తీవ్రతను ప్రతిబింబించగలదా ?  


నా సన్నిహితుడూ, నా శరీరమూ  కూడా  త్వరలో మేఘాలుగా  రూపాంతరం చెంది  

తలోదిక్కుకీ ప్రవహిస్తాయి.


నిరంతరం అలుపెరగక నా స్వప్నాల దారుల వెంట అతన్ని చేరుకోవడం

వాస్తవ ప్రపంచానికి వచ్చేసరికి ఒక క్రీగంట చూపుతో  సరిసమానం కాదు.  

 

అతడి ఆలోచనలతో నిద్రకుపక్రమించాను కాబట్టి అతడు నా నిదురలో అగుపించాడా !

అది స్వప్నమని అవగతమైతే నేను నిదుర మేల్కొనేదాన్నే కాదు !

 

ఈ విరహపు తీవ్రత అవధుల్లేనిది. 

నిశీధి స్వప్నాల దారులవెంట నీ చెంతకు చేరుకునే వేళ

కనీసం నన్నెవరూ నిందించలేరు.

   

నీవు వదిలివెళ్ళిన జ్ఞాపకాల బహుమతులు

నాకు శత్రువులుగా  మారాయి. 

అవి లేకపోతే కనీసం క్షణకాలపు మరుపు సాధ్యమయ్యేది.

Saturday, March 20, 2021

The Interior Landscape : Classical Tamil Love Poems - A.K.Ramanujan

ది న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ వారు NYRB పోయెట్స్ సిరీస్ లో భాగంగా ఎ.కె.రామానుజన్ అనువాదం చేసిన క్లాసికల్ తమిళ్ లవ్ పోయెమ్స్ ను 'ది ఇంటీరియర్ ల్యాండ్ స్కేప్' పేరిట పునఃముద్రించారు..నేను రామానుజన్ జానపద కథలు (Folk tales from India) తప్ప ఆయన కవిత్వం గానీ, అనువాదాలు గానీ చదివింది లేదు..అందులోనూ తమిళ వ్యావహారిక భాష తప్ప రాయడం,చదవడం తెలియదు కాబట్టి తమిళ కవిత్వం అనగానే అర్థమవుతుందో లేదో అని ముందు సంకోచించాను..కవిత్వమంటే అన్నిసార్లూ వ్యక్తిగతమే కానక్కర్లేదు, అందునా ప్రాచీన కవిత్వం వ్యక్తిప్రధానమైన కవిత్వానికి బహు దూరం..కవిత్వం చదివేటప్పుడు కవి చరిత్ర,అతడి నేపథ్యం పాఠకుడికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ప్రాచీన కవిత్వం చదివేటప్పుడు ఇటువంటి వివరాలు తెలియడం మరింత ముఖ్యం, ఎందుకంటే అవి తెలియకుండా ఆ కవిత్వపు నాడి పట్టుకోవడం కష్టం..సహజంగా పుస్తకం ముందు మాటల్నీ,తుదిపలుకుల్నీ చివర చదివే అలవాటున్న నేను ఈ పుస్తకం విషయంలో మాత్రం తుదిపలుకు మొదట చదివి అప్పుడు కవితలు చదివాను..ఈ కవితల నిర్మాణం అర్ధం కావాలంటే కవిత్వంతో ఎక్కువ స్నేహం లేని వారికీ,పరాయి సంస్కృతికి సంబంధించిన కవిత్వం చదివేవారికి అది తప్పనిసరి అనిపించింది.

Image Courtesy Google

ఈ రచనలో 300 A.D కి చెందిన 55 మంది కవులు రాసిన తమిళ ప్రాచీన కవిత్వానికి సంబంధించిన ఎనిమిది సంకలనాల్లో ఒకటైన 'కురుంతోకై' అనే సంకలనం నుండి సంగ్రహించిన 76 కవితలు ఉంటాయి..ఈ సంకలనాల్లో కవిత్వాన్ని అకం(అంతర్గతం) ,పూరం(బహిర్గతం) అనే రెండు భాగాలుగా విభజించారు..మొదటి భాగం ప్రేమ కవిత్వం కాగా, రెండవ భాగంలో యుద్ధాలూ,రాజులూ,రాజ్యాలూ,మరణం,మంచి-చెడు లాంటివి థీమ్స్ గా ఉంటాయి..'పబ్లిక్ పోయెట్రీ' అయిన పూరంలో వీరమరణాలు,రాజుల కీర్తి,కవుల పేదరికం లాంటివి గానం చెయ్యబడతాయి..నిజానికి ప్రాచీన తమిళ కవితా సంప్రదాయం వ్యక్తిగతమైనది కాదంటారు రామానుజన్.

ఏదైనా ఒక పరాయి భాషను అనువదించడమంటే పాఠకుణ్ణి ఆ ప్రాంతీయతలోకి  'అనువదించడానికి' ప్రయత్నించడమే..తమిళ ప్రాకృతిక దృశ్య నేపథ్యంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమను మూలాధారంగా రాసిన ఈ పుస్తకంలోని కవితలు పైన చెప్పుకున్న 'అకం' శ్రేణి కి చెందుతాయి..ఈ వర్గానికి చెందిన కవిత్వంలో అంతః ప్రపంచాన్ని కవిత్వంలో పొదగడానికి స్త్రీపురుషుల మధ్య ప్రేమను ఒక అనువైన వ్యక్తీకరణ మార్గంగా వాడేవారు..ప్రేమ రూపురేఖలు నిరంతరం మారిపోయే ఈ 'అకం' కవిత్వానికి కలయిక,ఎడబాటు ,వివాహానంతర ప్రేమ ,పవిత్ర ప్రేమ,అపవిత్ర ప్రేమ లాంటి అన్ని రకాల ప్రేమలూ థీమ్స్ గా ఉంటాయి..రామానుజన్ తుదిపలుకులో ఏడు రకాలైన ప్రేమల్ని వర్ణిస్తారు : అందులో మొదటిది, సామజిక కట్టుబాట్లవల్ల ముడిపడిన బంధం అంటే ప్రేమలేని పెళ్ళి : ఎటువంటి ఆకర్షణా లేకపోయినా తప్పనిసరిగా,ఒక బాధ్యతగా నిలబెట్టుకోవాల్సినది కాగా చివరిది,వన్ సైడెడ్ ప్రేమ : మానసిక పరిపక్వత లేని వయసులో తొలి యవ్వనపు పొంగులో కలిగే ప్రేమ...అకం కవిత్వంలో ఆ ఈ మొదటి,చివరి ప్రేమలకు స్థానం లేదు..వాటిలో కవిత్వానికి అవసరమైన భావావేశాలు ఉండే అవకాశం లేదు..ఇక మిగిలిన ఐదు రకాలు మాత్రమే పరిపూర్ణమైన ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి కాబట్టి వీటినే అకం శైలిలో ఉపయోగించుకుంటారు..ఈ కవిత్వంలో స్త్రీ పురుషులిద్దరూ అన్నివిధాల ఒకరికొకరు సరిసమానులై ఉండాలి అంటే అందచందాల్లో,గుణగణాల్లో,వయసులో,సామజిక స్థితిగతుల్లో అన్ని విధాలా ఒకరికొకరు సమఉజ్జీలై ఉండాలి..సంస్కారవంతులై,నాగరికత తెలిసినవారై ఉండాలి..అటువంటి జోడీ  మాత్రమే పూర్తి స్థాయి ప్రేమకు/కలయికకు లేదా వియోగానికి అర్హమైనది అంటారు.

ఈ శైలికి చెందిన కవిత్వం క్రియాదూరమైనదీ, అనుభవ ప్రధానమయినదీను..దానికి తోడు అకం కవిత్వంలో వ్యక్తుల పేర్లు ప్రస్తావించకూడదన్న నియమం ఒకటి ఉంటుందట..'పూరం' శైలి చారిత్రక వివరాలతో కూడినది గనుక అందులో రాజులూ,కళాకారులూ మొదలైన వారి పేర్లు ప్రస్తావించవచ్చు..ఈ కారణంగా ఈ రచనలో స్త్రీ పురుషుల పేర్లు సర్వనామాల రూపంలో 'హి'/ 'షి' (He, She, Her Friend, Her Foster Mother, Passers-By, Concubine) అని వాడతారు..ఉదాహరణకు ఈ కవితను చూడండి : 

What She Said :
The still drone of the time
past midnight.
All words put out,
men are sunk into the sweetness
of sleep. Even the far-flung world
has put aside its rages
for sleep.

Only I
am awake.

 ఇక ఈ కవిత్వానికి ఉపయోగించిన వ్యాకరణం 'తోల్కాప్పియం' : శబ్దం (ఫోనోలజీ), పదాలు (సెమాంటిక్స్), అర్థం(మోర్ఫోలజీ) అనే మూడు అంశాల మిశ్రమ నిర్మాణంలో ఉంటుంది..నిజానికి ఈ రచనలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న వేర్వేరు కవులు రాసిన చిన్న చిన్న కవితల్ని కలిపి ఒకే కావ్యంగా తయారుచేశారు రామానుజన్..అంతేకాకుండా ఈ కవితల్ని పాఠకులు తమకు నచ్చిన క్రమంలో పేర్చుకుంటే ఒక పజిల్ లో ముక్కల్ని పేర్చినట్లు అనేక విభిన్నమైన నేరేటివ్స్ తయారవుతాయి.

ఐదు రకాల ప్రాకృతిక దృశ్యాలతో కూడిన భౌగోళికాంశాల కవితా నేపథ్యం ఈ కవిత్వంలో మరో ప్రత్యేకత..ఒక్కో లాండ్స్కేప్ కూ ఆహారం,దేవుళ్ళు,జంతువులు,పక్షులు,సంగీతం,వృత్తులు  వంటి కొన్ని స్వాభావికమైన అంశాలు ఉంటాయి..వీటిని ప్రేమలోని ఒక్కో దశనీ వర్ణించడానికి మెటఫోర్లుగా వాడడం వల్ల ఒక్కో దశలో ఒక్కో ఇమేజ్ తయారవుతుంది..వీటిని సింబాలిజంగా  ఉపయోగించడం వల్ల అడవి మల్లెలు,కురింజి పూలు,వసంత,గ్రీష్మ,వర్ష,శరద్ ,హేమంత,శిశిర ఋతువులన్నీ కలిగిన ఈ కవిత్వం జీవం తొణికిసలాడుతూ ఉంటుంది..ఉదాహరణకు ప్రేమికుల కలయికను కొండల్లోని కురింజి పూలతోనూ,ఎడబాటును ఎడారితోనూ, విరహంతో సహనంగా వేచి చూడడాన్ని దట్టమైన అడవులతోనూ, భావావేశాలు ఎగసిపడుతుండగా ఆతృతతో వేచి చూడడాన్ని సముద్రతీరంతోనూ వర్ణిస్తారు..ప్రేమలో నమ్మకద్రోహాన్నీ ,తద్వారా పెల్లుబికిన క్రోధాన్నీ వర్ణించడానికి మతవ్యవస్థ వ్రేళ్ళూనుకున్న కట్టుబాట్లతో కూడిన ప్రాంతాన్ని ఎన్నుకున్నారు..ఏదేమైనా ఈ కవిత్వం భాష తమిళం అని అనిపించదు..చారిత్రక అంశాలు లేకపోవడం,ప్రాకృతిక అంశాలు జోడించడం వల్ల 'అకం' విశ్వజనీనమైన కవిత్వంగా అగుపిస్తుంది.

ఆమె-అతడు ప్రేమించుకుంటారు..ఇచ్చినమాట తప్పి అతడు మగవాడి సహజ స్వభావంతో ప్రపంచంలో తన స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా (సంపద కోసమో,కీర్తి కోసమో,యుద్ధానికో అనే స్పష్టత ఉండదు) ఆమెను వదిలి వెళ్ళిపోతాడు..

అతడి ఎడబాటులో ఆమె ఈ విధంగా అంటుంది. 

What She Said :
Friend,
with no regard for youth
in search of riches he went
no one knows where,
and he will not come back.

మరోచోట అతడు ఆమెను ఈ విధంగా తలుచుకుంటాడు.

What He Said:

O did I not think of you?
and thinking of you,
did I not think and think again of you?
and even as I thought of you
was I not baffled
by the world’s demands
that held me to my work?

O love, did I not think of you,
and think of you till I wished
I were here to sate my passion
till this flood of desire
that once wet the branch of the tall tree
would thin
till I can bend and scoop a drink of water
with my hands ?

వర్షాకాలం-శరదృతువులను మేళవించి ఆమె విరహాన్ని  వర్ణించిన మరో కవిత :

What She Said : 
The rains, already old,
have brought new leaf upon the fields.
The grass spears are trimmed and blunted
by the deer.
The jasmine creeper is showing its buds
through their delicate calyx 
like the laugh of a wildcat. 
In jasmine country, it is evening 
for the hovering bees,
but look, he hasn’t come back.
He left me and went in search
of wealth.

Thursday, February 25, 2021

Remember - Christina Rossetti

Image Courtesy Google

జ్ఞాపకం - క్రిస్టినా రోసెట్టి కు నా స్వేచ్ఛానువాదం :

మాటల్లేని మౌన తీరాలకు నీ నుండి దూరంగా నేను తరలి వెళ్ళిపొయినప్పుడు నన్ను నీ జ్ఞాపకాల్లో నిలుపుకో.

నేను రెండడుగులు ముందుకు వేసి వెనుదిరిగి నీదరికి చేరలేనప్పుడూ ,నన్ను నీ చేతుల్లోకి ఇక ఎప్పటికీ తీసుకోలేనప్పుడూ నన్ను నీ జ్ఞాపకాలో నిలుపుకో.

ప్రతిరోజూ మన భవిష్యత్తు గురించి నువ్వు కనే బంగారు కలలు నాతో పంచుకోలేనప్పుడు  నన్ను నీ జ్ఞాపకాల్లో నిలుపుకో.

నాకు మంచి-చెడుల గురించి ఇక  నేర్పించలేనప్పుడూ, నా గురించి  ప్రార్ధించలేనప్పుడూ ,నన్ను మాత్రమే నీ జ్ఞాపకాల్లో నిలుపుకో.

ఇక నువ్వు నన్ను మరచిపోక తప్పనప్పుడూ , ఎప్పుడైనా మళ్ళీ నేను జ్ఞాపకం వచ్చినప్పుడూ చింతపడకు.
నాలోని అవినీతితో కూడిన ఆలోచనల చీకటి అవశేషాలు నీలో మిగిలిపోయినప్పుడూ,
జ్ఞాపకాలతెరల్లో నా తలపులతో దుఃఖపడడం కంటే ,నాకు దూరంగా నన్ను మరచి సంతోషంగా ఉండడం శ్రేయస్కరం.

Remember by Christina Rossetti :

    Remember me when I am gone away,
         Gone far away into the silent land;     
  When you can no more hold me by the hand,
Nor I half turn to go yet turning stay.
Remember me when no more day by day
         You tell me of our future that you plann'd:
         Only remember me; you understand
It will be late to counsel then or pray.
Yet if you should forget me for a while
         And afterwards remember, do not grieve:
         For if the darkness and corruption leave
         A vestige of the thoughts that once I had,
Better by far you should forget and smile
         Than that you should remember and be sad.

Tuesday, December 22, 2020

If I Have to Say It - A Poem by Frida Kahlo

ఈ మధ్య ఏదో లిటరరీ రిఫెరన్సు కోసం వెతుకుతుంటే ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో తన భర్త డియాగో రివెరానుద్దేశించి రాసిన ఈ కవిత కనిపించింది..ఇప్పటివరకూ ఆమె చిత్రాల్ని చూడడమో,అంతకుమించిన ఆమె కాంట్రవర్షియల్ లైఫ్ స్టైల్ గురించి అక్కడక్కడా చదవడమో తప్ప ఫ్రిడా కవితలు కూడా రాస్తారన్నఎరుకలేదు..ఈ కవిత చదివాక ఆమె మరికొన్ని కవితలు చదివాను..కొన్ని కవితల్లో ఫ్రిడా స్వరంలో అంతర్లీనంగా కమలా దాస్ స్వరం ధ్వనించినట్లనిపించింది..తొలిపంక్తులు చదువుతున్నప్పుడు ఈ 'మెక్సికన్ కమలా దాస్' తన చిత్రాల వెనుక నీలెక్క నాకేంటన్నట్లు సర్వస్వతంత్రురాలిలా,ధీరవనితలా కనిపిస్తుంది కదా,మరి ఈ కవితలో ఇంతటి మనోదౌర్బల్యం, దైన్యమేమిటబ్బా అనుకున్నాను..ఈ కవిత చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రిడా ఈమె కాదే అని ఆమెను వెతుక్కుంటూ చదివాను..ఆమె స్థిరగంభీరమైన వ్యక్తిత్వం భర్త డియాగో విషయానికొచ్చేసరికి పేలవమైన రూపుదాల్చడంలో మర్మమేమిటో !! బహుశా ప్రేమ కావచ్చు !! కానీ చివర్లో ఆమె ఇవన్నీ నిన్ను అడగాల్సొస్తే అవేమీ నాకు అక్కర్లేదు పొమ్మంటుంది చూశారా,అప్పుడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఫ్రిడా మళ్ళీ కనిపించింది.

Image Courtesy Google

ఏదేమైనా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టులను కొందర్ని చూసినప్పుడు వారిలో ఆత్మన్యూనతపాళ్ళు చాలా ఎక్కువ అనిపిస్తుంది..ఈ న్యూనతలూ ,బలహీనతలూ , వైఫల్యాలు ,నైరాశ్యాలూ , సమాజంలో ఇమడలేకపోవడాలూ , తత్పరిణామంగా నిరంతరం జరిగే అంతః సంఘర్షణలోనుండే కదా అద్భుతమైన ఆర్ట్ పుడుతుంది..మెదడునిండా గ్యాప్ లేని ఇంటెలెక్ట్,రేషనాలిటీ,లాజిక్ వీటన్నిటితో నిండిన సాధారణ వ్యక్తులు (నాలాంటివాళ్ళు ? :) ) ఒక చిన్న పీస్ ఆఫ్ ఆర్ట్ కూడా సృజించలేకపోవడానికి కారణం బహుశా ఇదేనేమో కదా !! 'స్పష్టత' సృజనకు ప్రధాన శత్రువు.

ఆమె అంటోంది "నేను నిన్నేమీ అడగను,నీవే తెలుసుకోవాలి..నిన్ను అడగాల్సివస్తే అది నాకొద్దు" అని.. ఫ్రిడా, నువ్వు పైకి కనిపించేటంత రాడికల్ కాదు సుమా :) నేటితరంలో అందరం 'స్ట్రెయిట్ ఫార్వర్డ్' , ఆమెలా ఓల్డ్ ఫ్యాషన్డ్ తరం కాదు కదా..మనకి సమయం చాలా విలువైనది,"క్యా పతా కల్ హో నహో"..ఈ క్షణం చేతిలోంచి జారిపోయేలోగా దాన్ని అర్జెంటుగా జీవించెయ్యాలి అని మేనేజ్మెంట్ గురువులు బోధిస్తూ ఉంటారు..అందుకే ఈ తరానికి రొమాన్స్ కు నిర్వచనాలు తెలీదు..'When all is said and done' మిగిలేదేమిటి !! ఎవరి మొబైల్ ఫోన్లు వాళ్ళు చెక్ చేసుకోవడం తప్ప..ఇదే విషయాన్ని మరో కాంటెక్స్ట్ లో మన ముళ్ళపూడి బాపు సినిమా 'పెళ్ళిపుస్తకం' లో విలన్ మాటల్లో నర్మగర్భంగా ఇలా చెప్పిస్తారు : "ఒలిచిన అరటిపండుకీ,ఒలుచుకు తినే అరటిపండుకీ తేడా లేదూ ?"  అంటూ..ఆర్టిస్టులు వెర్రివాళ్ళు కాదు వారికీ విషయం బాగా తెలుసు..ఫ్రిడా కు కూడా ఖచ్చితంగా తెలుసు.

ఆమె కవిత 'If I Have to Say It' కు నా స్వేఛ్ఛానువాదం :

నన్ను ముద్దాడమని నేను నిన్ను అడగబోవడం లేదు.

నువ్వు పొరపాటో,తప్పో చేశావని నాకు నమ్మకంగా తెలిసినప్పుడు కూడా నన్ను క్షమాపణ కోరమని అడగబోవడంలేదు.

నీ సాన్నిహిత్యం నాకు చాలా అవసరమైనప్పుడు నన్ను నీ కౌగిలిలో బిగించి సేద తీర్చమని అడగబోవడంలేదు.

లేదా మన పెళ్ళిరోజు నన్ను విందుకి ఆహ్వానించమని నిన్ను అడగబోవడంలేదు. 

కొత్త అనుభవాలకోసం ప్రపంచాన్ని చుట్టివద్దాం రమ్మనో లేదా ఆ కొత్త నగరంలో ఉన్నప్పుడు నాచేతిని నీ చేతిలోకి తీసుకొమ్మనో అంతకంటే అడగబోవడం లేదు.

అబద్ధమే అయినప్పటికీ నేను ఎంతటి సౌందర్యరాశినో చెప్పమనీ,లేదా నాకు అందమైన పదాలతో ఏర్చికూర్చిన లేఖ రాయమనీ నిన్ను అడగబోవడంలేదు.

నీ రోజు ఎలా గడిచిందో చెప్పడానికో, లేదా నన్ను మిస్ అయ్యావని చెప్పడానికో నాకు కాల్ చెయ్యమని నిన్ను అడగబోవడం లేదు.

నీ మీద ప్రేమతో నీకోసం నేను చేసిన ప్రతి చిన్న పనికీ కృతజ్ఞతలు చెప్పమనీ,నా చిరాకుపరాకుల్లో నా గురించి చింతపడమనీ నిన్ను అడగబోవడంలేదు.

అంతేకాదు,నా నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలబడమని కూడా నిన్ను అడగబోవడంలేదు. 

నీకు చెప్పడానికి నా దగ్గర కథలూ,బాసలూ,ఊసులూ కోకొల్లలున్నా, అవన్నీ తీరిక చేసుకుని  వినమని నిన్ను నేను అడగబోవడం లేదు.

కనీసం నిన్ను నా తోడూ నీడగా నాతో కడదాకా ఉండమని కూడా అడగబోవడం లేదు.

ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ నేను నిన్ను అడిగి సాధించుకోవాల్సిన పక్షంలో 

అవేమీ నాకు అఖ్ఖర్లేదు.


If I Have to Say It

I’m not going to ask you to kiss me,

neither ask for forgiveness when I believe that you have done wrong,

or that you have made a mistake.

Nor am I going to ask you to hug me when I need it the most,

or to invite me to dinner on our anniversary.

I’m not going to ask you to go around the world

to live new experiences, much less

ask you to give me your hand when we are in that city.

I’m not going to ask you to tell me how pretty I am,

even if it’s a lie or that you write me anything nice.

Nor will I ask you to call me to tell me

how your day was or tell me you miss me.

I’m not going to ask you to thank me for everything I do for you,

for you to worry about me when my moods are down

and of course I will not ask you to support me in my decisions.

I’m not going to ask you to listen to me when I have a thousand

stories to tell you.

I’m not going to ask you to do anything,

not even to stay by my side forever.

Because if I have to ask you,

I do not want it anymore.

- Frida Kahlo, to her husband, Diego Rivera. 

Monday, November 9, 2020

అనేకుడు పెస్సోవా

కళల్ని ఆత్మసాక్షాత్కారానికి సాధకాలుగా చూస్తారు..కళాకారుడు ఏ కళ ద్వారానైనా తనలో ప్రపంచానికి తెలీని మరో 'అంశ'ని బయల్పరచాలని ఆరాటపడతాడు..కళకు మూలాధారమే అస్తిత్వవాదం అనుకుంటే చిన్ని కృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండాన్నీ తన నోట్లో చూపించినట్టు తనలో ఉన్న అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ ప్రపంచానికి చూపించే సాహసం చేసిన ఏకైక రచయిత బహుశా 'ఫెర్నాండో పెస్సోవా' మాత్రమే..పోర్చుగీసు కవి 'ఫెర్నాండో ఆంటోనియో నోగైరా పెస్సోవా' 1888 జూన్ 13 న లిస్బన్ లో జన్మించారు..తండ్రి మరణానంతరం తల్లి ద్వితీయ వివాహం కారణంగా ఏడేళ్ళ వయసు నుండీ పెస్సోవా విద్యాభ్యాసం అంతా బ్రిటీష్ పాలన క్రింద ఉన్న దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో జరిగింది..ఈ కారణంగా ఆయన పోర్చుగీసు,ఇంగ్లీషు రెండు భాషల్లోనూ విరివిగా రచనలు చేశారు..1905 లో తిరిగి లిస్బన్ చేరిన తరువాత ఆయన మళ్ళీ  పోర్చుగీసు వదిలిపోలేదు..ఆ కాలంలో Orpheu మరియు Athena అనే పత్రికలకు వ్యాసాలూ,కవితలూ రాయడం ద్వారా సాహితీప్రపంచానికి పరిచయం అయ్యారు పెస్సోవా.

Image Courtesy Google

ఫెర్నాండో పెస్సోవా మానవనైజాన్ని నిర్దేశించ వీలులేదని ఘంటాపథంగా చెప్తూ,మనిషి వ్యక్తిత్వం క్షణక్షణానికీ మారిపోయే అస్థిరమైన లక్షణం కలిగి ఉంటుందని హ్యూమన్ సెల్ఫ్ లోని కన్ఫర్మిటీని తీవ్రంగా ఎద్దేవా చేశారు..రచయితల్లో ఈ తరహా 'ఆల్టర్ ఇగోస్' సంస్కృతి చాలా పాతదే అయినా,మిగతా రచయితలు మరో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే తమ హెటెరోనిమ్స్ గా చూపించడంలో సఫలీకృతులయ్యారు..ముఖ్యంగా ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో,రచయితల్లో ఈ ఆల్టర్ ఇగోస్ ఫ్యాషన్ కొనసాగుతున్న కాలంలో ఎజ్రా పౌండ్ కు -మాబెర్లీ, రిల్కే కు -మాల్టె లారిడ్స్ బ్రిగ్గే,వొలర్ కు - మిష్యుర్ టెస్టే లాంటి కొన్ని హెటెరోనిమ్స్ వాడుకలో ఉండేవి..ఇక్కడే పెస్సోవా మిగతా అందరికంటే కాస్త భిన్నంగా కనిపిస్తారు,ఈ 'ఆల్టర్ ఇగోస్' గేమ్ లో చాలామంది సాహితీ దిగ్గజాలు భాగం పంచుకున్నా,దాన్నిపెస్సోవా తీసుకెళ్ళినంత దూరం మరెవ్వరూ  తీసుకెళ్ళలేదు..పెస్సోవా ఈ ఆటను తుదికంటా ఆడారు.

ప్రవృత్తి రీత్యా ఒంటరి అయిన పెస్సోవాకు సామాజిక,వైవాహిక జీవితాలు లేవు ..1910 లో పోర్చుగీసు మోడర్నిస్ట్ మూవ్మెంట్ లో చురుగ్గా పాల్గొన్నా ఆయనెప్పుడూ లైమ్ లైట్ కి దూరంగానే ఉన్నారు..పెస్సోవా జీవనకాలంలో ఆయన రచనలు వెలుగు చూడలేదు..1935లో లిస్బన్ లో ఆయన మరణానంతరం ఒక చిన్న గదిలోని ట్రంక్ పెట్టెలో అస్తవ్యస్తమైన దస్తూరీలో పోర్చుగీసు,ఇంగ్లీష్,ఫ్రెంచ్ భాషల్లో రాసిన ప్రతులు దొరికాయి..ఆ ప్రతుల్లో కవితలూ,కథలూ,ఫిలాసఫీ,అనువాదాలూ,విమర్శలూ,రాజకీయ,భాషాపరమైన వ్యాసాలతో కూడిన పెస్సోవా సమగ్ర సాహిత్యం అంతా నోటుపుస్తకాల్లోనూ,బిల్లుల మీదా,చిత్తు కాగితాల మీదా,ఉత్తరాల వెనుక,ఇలా ఎక్కడపడితే అక్కడ విడదీయడానికి వీల్లేని విధంగా లభ్యమైంది..ఆయన చనిపోయిన ఎనభై ఏళ్ళ తరువాత కూడా ఆయన రచనల్ని ప్రచురణకు తీసుకువెళ్ళే దిశగా ఇంకా తీవ్రమైన పరిశ్రమ జరుగుతూనే ఉంది..పెస్సోవాని అనువదించడాన్ని 'ఒక పీడకల'గా అభివర్ణిస్తారు అనువాదకులు..ఎందుకంటే ఆ ప్రతుల్లో ఉన్నది 'ఫెర్నాండో పెస్సోవా' అనే ఒక్క వ్యక్తి కాదు,అనేకమంది రచయితల సమూహాన్ని తనలో ఇముడ్చుకుని లెక్కలేనన్ని ఆల్టర్ ఇగోస్ తో రచనలు చేశారాయన.

పెస్సోవా 'హెటెరోనిమ్స్','సెమీ హెటెరోనిమ్స్' అని ముద్దుగా పిలుచుకునే డజన్ల కొద్దీ  'ఆల్టర్ ఇగోస్' ఈ సందర్భంగా వెలుగు చూశాయి..ఎన్ని వలిచినా తరగని ఈ ఉల్లిపొర జీవితాల మధ్య పెస్సోవా తో పాటు ఆల్బర్టో కైరో,రికార్డో రైస్ మరియు అల్వారో డి కాంపోస్ అనే మరో ముగ్గురు కవుల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి...పెస్సోవా తన ఆల్టర్ ఇగోస్ కు పేర్లు మాత్రమే ఇచ్చి ఊరుకోకుండా వారికి విభిన్నమైన వృత్తులూ,ప్రవృత్తులూ,ఆహార్యాలూ కూడా ఆపాదించారు..ఒకదానికొకటి పొంతన లేని ఈ వ్యక్తిత్వాల మధ్య నిజమైన పెస్సోవా(?) ఎవరంటే కనుక్కోవడం కష్టమే..పాఠకులకు పుస్తకాల్లో ఎక్కడో ఒకచోట తమని తాము వెతుక్కోవడం పరిపాటైతే పెస్సోవా పాఠకులు మాత్రం తమ గురించి పూర్తిగా మర్చిపోయి రచయితను అన్వేషించే పనిలో పడతారు..'నా ఆలోచనలో నేనున్నాను,కానీ నా ఆలోచనలు అనంతమైనవి' అని ఒక సందర్భంలో అంటారు అల్వారో డి కాంపోస్..అంటే నా ఉనికి కూడా అనంతమేనని చెప్పడం అన్నమాట..యవ్వనం దాటాకా ఎప్పుడూ లిస్బన్ వదిలి బయటకి వెళ్ళకపోయినా పెస్సోవా వ్యక్తిత్వాలన్నీ ఆయన తన గదిలో కిటికీ ప్రక్కన కూర్చుని ఊదే సిగరెట్ పొగ అంత తేలిగ్గా విశ్వంలోకి వ్యాపిస్తాయి..పెస్సోవా మాగ్నమ్ ఓపస్ 'ది బుక్ ఆఫ్ డిస్క్వైట్' అనువాదకులు రిచర్డ్ జెనిత్ ఆ పుస్తకాన్ని ఒక అరుదైన 'అక్షరాలతో మలిచిన ఛాయాచిత్రం' గా అభివర్ణిస్తారు,ఇరవయ్యో శతాబ్దం మొత్తంలో 'హ్యూమన్ సెల్ఫ్' గురించి అంత నిజాయితీతో కూడిన రచన మరొకటి లేదని అభిప్రాయపడతారు.

సాహిత్యంలో సహజంగా  కనిపించే ప్రయోగాలూ,ప్రమాణాలూ పెస్సోవా శైలిలో కనిపించవు..సాహితీ విలువల నిర్వచనాలకు ఆయన రచనలు ఆమడదూరంలో నిలబడతాయి..పెస్సోవా రచనల్లో ముడిసరుకు స్వయంగా ఆయనే..బాహ్యప్రపంచాన్ని తన అంతఃప్రపంచంతో పోలుస్తూ రచనలు చేసే రచయితలకు భిన్నంగా తనలో దాగున్న అనంతమైన ప్రపంచాల్లో విహరిస్తూ,తన ప్రతిబింబాలైన విభిన్న వ్యక్తిత్వాలతో సంభాషిస్తూ,తాను మాత్రం వీటన్నిటినుంచీ విడివడి దూరంగా నిలబడి ఒక ప్రేక్షక పాత్ర పోషించడం ఏమంత సులభతరం కాదు..జె.ఎమ్.కాట్జీ 'యూత్' అనే నవల్లో రాసినట్లు "కళని సృజించే క్రమంలో కళాకారుణ్ణి అతనిలోనే ఉండే మరో వ్యక్తి ఆవహిస్తాడు,ఆ సమయంలో ఒక జ్వరతీవ్రతతో ఉన్న వ్యక్తిలా కళాకారుడు పని చేస్తాడు" అని..మరి ఒకరికి మించిన వ్యక్తిత్వాలు ఆవహించిన కళాకారునిలో ఈ జ్వరతీవ్రతను పూర్తిస్థాయిలో భరించగలిగిన పెస్సోవా ప్రత్యేకత నిరాకరించడానికి వీలులేనిది..ఈ పోర్చుగీసు రచయితను ప్రత్యేకం ఒక దేశ,కాలమాన చట్రాల్లో పెట్టి వర్గీకరించాడానికి వీలులేదు.."నేను పోర్చుగీసు వాణ్ణయినా నేను పోర్చుగీసులో రాయను,నన్ను నేను రాసుకుంటాను" అని చెప్పడం రచయితగా ఆయన పరిధి ఎంత విశాలమో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ 10త్ నవంబర్ 2020. 
https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-635153

Sunday, October 11, 2020

View with a Grain of Sand - Wisława Szymborska

True Love,ఈ మాట వింటే నవ్వొస్తుంది..ప్రేమలో నిజమైన ప్రేమలూ,అబద్ధమైన ప్రేమలూ ఉండవేమో కదా ! లవ్ ఈజ్ లవ్..ఈ మధ్య సినిమాలు,సాహిత్యం చేతిలో పడి ఈ 'ప్రేమ' అన్న పదం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది.సీరియస్ ప్రేమ,క్యాజువల్ ప్రేమ,ప్రాక్టికల్ ప్రేమ అంటూ  ప్రేమను వెడ్డింగ్ బఫె లో మెనూ కార్డు ఐటెం చేసిపారేశారు.చాలా ఛీజీ సెంటెన్స్ లా అనిపించినా (ఈ మాట చాలా సినిమాల్లో వాడేశారు మరి) ప్రేమ ఎప్పుడు,ఎక్కడ,ఎందుకు,ఎవరి మీద,ఎలా ఏర్పడుతుందో చెప్పడం కష్టం..పంచాంగాలు చూసుకుని,సందర్భాసందర్భాలు నిర్ణయించుకుని పుట్టేది ప్రేమ కాదు..జాతి,కులం,మతం,వయసు,వర్గం లాంటి తారతమ్యాలేవీ మనిషి ఉనికిలో అతి స్వచ్ఛమైన ఈ భావోద్వేగాన్ని నియంత్రించలేవు..No one will ever understand unless they've been through it themselves.బట్ వై హిమ్ ? వై హర్ ? అని ప్రేమికులను నిలదీసినా కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వలేరేమో.ఇంత విశాల ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ ఇద్దరి మధ్యే ఎందుకు ఇటువంటి సంబంధం ఏర్పడుతుంది ? 

The light descends from nowhere.
Why on these two and not on others?
Doesn’t this outrage justice? Yes it does. అంటారు నోబెల్ గ్రహీత,పోలిష్ కవయిత్రి విస్లవా సింబోర్స్కా.

ఇద్దరు మనుషులను ముడివేసి ఉంచే పెళ్ళి లాంటి సామజిక బంధం కంటే,ఎవరి ప్రమేయమూ లేకుండా పుట్టే ఈ మానసికమైన బంధం గొప్పది అని చెప్పడమే రచయిత్రి ఉద్దేశ్యమా ?.

ప్రశాంతంగా ఉన్న నదిలో బలమైన తుఫాను తాకిడికి రేగిన అలజడిలా మనిషి అంతః ప్రపంచాన్ని అతలాకుతలం చేసి వదిలిపెట్టగల శక్తి ఈ ప్రేమకు ఉంటుంది..మీరెప్పుడైనా ప్రేమికుల్ని గమనిస్తే సహజ స్థితిలో ఉండే లాజిక్,రీజనింగ్ లాంటివేవీ లేని స్వప్నావస్థలో ఈ భూమిమీద దారితప్పి తిరుగాడుతున్న పసిపిల్లల్లా కనిపిస్తారు..కానీ నిశితంగా గమనిస్తే వాళ్ళ ముఖాలు అనిర్వచనీయమైన తేజస్సుతో (యుఫోరియా అంటారేమో) వెలిగిపోతూ ఉంటాయి.The language they use – deceptively clear అంటారు కవయిత్రి..వారి లోకంలో ప్రేమ పరిభాష కూడా చాలా స్పష్టమైనదీ,ప్రత్యేకమైనదీను..అంతేనా !! "కనీసం అసూయపడుతున్న స్నేహితులకోసమైనా ఈ జంట కాస్త ఫేక్ డిప్రెషన్ నటించరు కదా" అని హాస్యమాడతారు..ఈ ప్రపంచంతో పని ఏమి నాకు అన్న తీరుగా తమదైన ప్రపంచంలో ఉన్న అటువంటి ఇద్దరు వ్యక్తులనుండి ఈ ప్రపంచం పొందేదేమిటి ? అని సూటిగా ప్రశ్నిస్తారు సింబోర్స్కా..నిజానికి అద్భుతమైన ఆర్ట్ పుట్టినట్లే ప్రేమ కూడా స్వచ్ఛందంగా పుట్టాలి..అకస్మాత్తుగా..అసంకల్పిత చర్యలా..అలా కాని పక్షంలో అనుమానం అఖ్ఖర్లేదు,అది ప్రేమ కాదు.వ్యామోహం మాత్రమే.

కవిత్వం విషయానికొచ్చేసరికి ఎంతమందిని చదివినా చివరకు నాలాంటి సెరిబ్రల్ జీవులైన మేరీ ఆలివర్,సింబోర్స్కా ల దగ్గరకు వచ్చి ఆగడం రివాజైపోయింది.తొలి పరిచయంలోనే నా మనసులోకి సూటిగా వచ్చి తిష్టవేసుకుని కూర్చున్నారు వీళ్ళిద్దరూ.అందులోనూ సున్నితమైన భావోద్వేగాలను కవితలుగా మలచడంలో  సింబోర్స్కాకు ఒక ప్రత్యేకత ఉంది.View with a Grain of Sand చదువుతున్నప్పుడు ఈ కవిత సూటిగా నా హృదయాన్ని తాకింది.

Image Courtesy Google

ప్రేమికులు ఏం కోరుకుంటారు.it had to happen this way – in reward for what?
For nothing. అంటారు విస్లవా..ఎస్ ప్రాక్టికల్ గా ఏమీ కోరుకోరు.ప్రేమించినవాళ్ళు స్వచ్ఛందంగా చూపించే ప్రేమ తప్ప.ఇందులో అనైతికత,అనాగరికతలకు తావులేదు.విశ్వంలో ఒక ప్రాణి మరో ప్రాణితో ఏర్పరుచుకునే ఎమోషనల్ బాండింగ్ (ప్రేమందామా ?) నేరం కాదు.

"మరి అటువంటి జంటను ఆదర్శంగా తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి ?" అంటూ తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తారు కవయిత్రి.

"మతం,కవిత్వం ఏమైపోవాలి ? దేన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి ? దేన్ని పరిత్యజించాలి ? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని హద్దుల్లో ఉండాలని ఎవరు కోరుకుంటారు ? "

True Love,నిజానికి ఇది అవసరమేనా ? మన వివేకము,కామన్ సెన్స్,ఈ ప్రేమను ఉన్నత వర్గాల్లో ఒక స్కాండల్ ని దాచినట్లు మనసులోనే దాచేసుకోమంటుంది.వీలైతే ఆ మనసుకి తలుపు మూసి గొళ్ళెం బిగించి తాళం కూడా వేసెయ్యమని సలహా ఇస్తుంది.కానీ నిజానికి ట్రూ లవ్ అనుభవపూర్వకంగా తెలియని వాళ్ళే దాని ఉనికిని ప్రశ్నిస్తారు..కానీ వాళ్ళ నమ్మకం కూడా ఒక విధంగా మంచిదేనంటారు కవయిత్రి. 

ఎందుకంటే "అది వాళ్ళ జీవితాన్నీ,మరణాన్నీ కూడా చాలా సులభతరం చేస్తుంది."

True Love :

True love. Is it normal
is it serious, is it practical?
What does the world get from two people
who exist in a world of their own?

Placed on the same pedestal for no good reason,
drawn randomly from millions but convinced
it had to happen this way – in reward for what?
For nothing.
The light descends from nowhere.
Why on these two and not on others?
Doesn’t this outrage justice? Yes it does.
Doesn’t it disrupt our painstakingly erected principles,
and cast the moral from the peak? Yes on both accounts.

Look at the happy couple.
Couldn’t they at least try to hide it,
fake a little depression for their friends’ sake?
Listen to them laughing – it’s an insult.
The language they use – deceptively clear.
And their little celebrations, rituals,
the elaborate mutual routines –
it’s obviously a plot behind the human race’s back!

It’s hard even to guess how far things might go
if people start to follow their example.
What could religion and poetry count on?
What would be remembered? What renounced?
Who’d want to stay within bounds?

True love. Is it really necessary?
Tact and common sense tell us to pass over it in silence,
like a scandal in Life’s highest circles.
Perfectly good children are born without its help.
It couldn’t populate the planet in a million years,
it comes along so rarely.

Let the people who never find true love
keep saying that there’s no such thing.

Their faith will make it easier for them to live and die.

---- From 'View with a Grain of Sand' - Wisława Szymborska.

Wednesday, June 10, 2020

Blue Horses - Mary Oliver

క్వారంటైన్ సమయం నుండి విముక్తి లభించిన ఆనందంలో 'కొండా కోనల్లో లోయల్లో' అని పాడుకుంటూ నీలగిరుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలసిసొలసి హోమ్ స్వీట్ హోమ్ అనుకుంటూ ఇల్లు చేరిన తరువాత సగంలో ఉన్న పుస్తకాలు ప్రక్కన పెట్టి మరీ ఈ మేరీ ఆలివర్ 'బ్లూ హార్సెస్' చదివాను..ఉదగమండలంలో చూసిన ప్రకృతి సౌందర్యం తనివితీరక ఆ అనుభవాన్ని ఆలివర్ కవితల్లో మరోసారి పొందాలని చేసిన ప్రయత్నం ఇది..ఆమె కవితలు చదివిన మనసుతో చూస్తే ప్రకృతిలో ఎన్నెన్ని వర్ణాల్లో ! సంపాదన,సంసారం,ఇవేమీ చాలనట్లు నిరంతరం వెయ్యి గొంతుకలెత్తి వాదులాడుకునే సోషల్ మీడియా రణగొణ ధ్వనుల మధ్య భవసాగరాల్లో ఊపిరాడకుండా కొట్టుకుపోతున్న మనిషికి ఆగి తన చుట్టూ ఉన్నప్రపంచాన్ని చూడడం నేర్పిస్తారు ఆలివర్..నిశ్శబ్దంగా సెలయేటి ఒడ్డున కూర్చుని తనలోతాను ధ్యానమగ్నమై ఆ ప్రవాహపు సంగీతాన్ని వినమంటారు ..తొలకరి జల్లుల్లో మైమరచిపోయి తడవడం తప్ప మరో ముఖ్యమైన పని లేదంటారు..పూర్ణోదయాలూ,సంధ్యాసమయాల మధ్య నులివెచ్చని అపరాహ్నవేళల్ని అనుభవించడాన్ని మించిన మోక్షం,జీవిత సాక్షాత్కారం వేరే ఏముంటుందంటారు ! పచ్చని పసిరిక వాసనలు,తొలకరి చినుకుల సోయగాలు,ఎండుటాకుల గలగలలు ఆహా ఎన్నని చెప్పగలం ! ఆమె కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి స్వచ్ఛమైన ప్రతీకలుగా కనిపిస్తాయి..మనిషీ ప్రకృతీ వేర్వేరు కాదని ఘంటాపథంగా చెప్తాయి..ఇందులో ఒక కవితకు నా స్వేచ్ఛానువాదం :
Image Courtesy Google
I'm Feeling Fabulous,Possibly Too Much So.But I Love It  - Mary Oliver.

ఈ వసంతోత్సవం జరుపుకోవడానికి మాకింగ్బర్డ్ తనకు తాను సరికొత్త మార్గాలు నేర్పుకుంటోంది.
ఇక ఈ ఈదురుగాలులు మోసుకొచ్చే అర్ధంపర్ధంలేని కబుర్లు ఊహించగలవా.
ఒకప్రక్క ఆకాశం క్రొంగొత్తగా ముస్తాబవుతూ తనకు తాను చక్కని చిక్కని నీలి రంగులద్దుకుంటోంది,
ఎటొచ్చీ ఆ నీలంలో చాలా భాగం ప్రక్కనే ఉన్న కొలనులో ఒలికిపోతోంది.
నేనేమంత బరువైనదానిని కానుగానీ,ఈ క్షణంలో అయితే
మరీ దూదిపింజలా ఉన్నాను.
నువ్వంటావూ నా మనసంతా మిశ్రమభావాలతో కలగలిసిపోయి ఉందనీ.

ఒక గొంతుక,ఆహా అదిగో అది మాకింగ్బర్డ్ అంటోంది.
మరో గొంతుక,ఈ కొలను మునుపెన్నడూ ఇంత నీలంగా లేదే అంటోంది.
ఇంకో గొంతుక,ఈ క్షణంలో నేను ఈ ప్రపంచంలో భాగమై ఉన్నాను,ఇంతకంటే అద్భుతమైన ప్రపంచం మరొకటుండే అవకాశమే లేదంటోంది.
ఈలోగా ఆనందపారవశ్యంతో కూడిన ఒక ఊహ తళుక్కుమంది,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలనని.
నాకు నమ్మకమే,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలను.

మరో గొంతుక,ఇక ఈ తేలియాడే మేఘాల్లోంచి క్రిందకి దిగి వద్దామా ? అంటోంది.
ఇంకో గొంతుక సమాధానమిచ్చింది,సరేలే.
కానీ శాశ్వతంగా కాదు,కాసేపటికి వద్దాంలే.

Friday, April 10, 2020

Felicity: Poems - Mary Oliver

మేరీ ఆలివర్ సాహచర్యం లేకపోతే ఈ క్వారన్టైన్ సమయంలో ఏమైపోయి ఉండేదాన్నో అనిపిస్తుంది..ఈ 'ఫెలిసిటీ' అనే కవితా సంపుటి పేరుకి తగ్గట్టే 'ఆనందం'..'సంపూర్ణానందం'.నాలుగైదు పుస్తకాలు సమాంతరంగా చదువుతూ అక్కడో వాక్యం ఇక్కడో వాక్యం నెమరువేసుకుంటూ,భౌతిక ప్రపంచపు నీడలు విస్తరించని నాది మాత్రమే అయిన చోటులో ఏదో ఒక మూలన,చేతిలో పుస్తకంతో ఏ నూతన ప్రపంచపు నీడలో సేదతీరాలా అనే కాసేపు వెతుకులాటకి స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశిస్తూ,అస్తవ్యస్తంగా గడిచిపోతున్న రోజుల్లో కూడా తన అందమైన ప్రపంచంలోకి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయారు అమెరికన్ కవయిత్రి మేరీ ఆలివర్..నాకు బ్రెయిన్ పికింగ్స్ పరిచయం చేసిన కొందరు ఆణిముత్యాల్లాంటి రచయిల్లో ఆలివర్ ఒకరు..కానీ నేను మొదట ఆవిడ 'Upstream' పేరిట రాసిన వ్యాసాలు చదివాను,తరువాత మెల్లిగా ఆవిడ కవితలతో కూడా ప్రేమలో పడ్డాను.
Image Courtesy Google
ఆలివర్ రెండు కవితలు Moments,Storage లకు నా స్వేఛ్ఛానువాదం :

క్షణాలు : 

కొన్ని క్షణాలు వాటిని పూరించమని ఆజ్ఞాపిస్తాయి,
ఎవరినైనా ప్రేమించామని వారికి చెప్పడం,
లేదా,నీ సంపద మొత్తాన్నీ వదులుకోవడం.

నీ హృదయం స్పందిస్తోంది కదా ?
నీవు సంకెళ్ళచే బందీవి కాదు కదా ?

జాగ్రత్తను మించిన విషాదం మరొకటి లేదు,
అనాలోచితంగా వేసే అడుగు ఒక ప్రాణాన్ని రక్షించగలిగినప్పుడు,
బహుశా,అది నీ ప్రాణమే అయినా కావచ్చు.

గిడ్డంగి :

నేను ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినప్పుడు
నాకు ఆ ఇంట్లో పెట్టడానికి చోటు సరిపోని వస్తువులు చాలా ఉండేవి.
ఎవరైనా ఏం చేస్తారు ? నేనొక స్టోరేజీని అద్దెకు తీసుకున్నాను.
దాన్ని సామానుతో నింపాను.సంవత్సరాలు గడిచాయి.
అప్పుడప్పుడూ నేను అక్కడకు వెళ్ళి ఆ స్టోరేజ్ లోపల వస్తువుల్ని చూసుకునేదాన్ని.
కానీ ఏమీ జరగలేదు,చివరకు నా హృదయంలో చిన్నపాటి నెప్పి కూడా కలుగలేదు.

నేను వృద్ధాప్యం దరిచేరుతున్న కొద్దీ,
చాలా ముఖ్యమైనవి తప్ప,నేను ఆశించే వస్తువుల సంఖ్య
తగ్గుతూ వచ్చింది.
అందువల్ల ఒకరోజు నేను నా స్టోరేజ్ తాళం తీశాను,
చెత్త ప్రోగుచేసేవాణ్ణి పిలిచాను.
అతడు అంతా తీసుకెళ్ళిపోయాడు.

చివరకు బరువు దింపితే  ఊపిరిపీల్చుకున్న
అల్పమైన గాడిదలా అనిపించింది.వస్తువులు !
వాటిని తగలబెట్టండి,తగలబెట్టండి !
ఒక అందమైన చలిమంట వేసుకోండి !
మీ మనసులో మరికాస్త ఎక్కువ చోటు,ప్రేమకూ,
చెట్టుచేమలకూ ! పక్షులకు సొంతమైనదంటూ ఏదీ లేదు,
బహుశా అవి స్వేచ్ఛగా ఎగరడానికి కారణం అదే.

Friday, October 4, 2019

The Seasons of the Soul: The Poetic Guidance and Spiritual Wisdom of Herman Hesse - Hermann Hesse

హెర్మన్ హెస్సే రాబర్ట్ వాల్సర్ గురించి మాట్లాడుతూ “if he had a hundred thousand readers, the world would be a better place,” అంటారు..వాల్సర్ ను చదివినవారికి ఆ మాటలెంత కమ్మగా అనిపిస్తాయో..ఇప్పుడు హెస్సే కవిత్వం చదివినప్పుడు సరిగ్గా నాకు అటువంటి భావనే కలిగింది..ఇలాంటి రచయితల అనుభవసారాన్ని వంటబట్టించుకుంటే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అనిపించింది..ఇరవయ్యో శతాబ్దంలో అనేక సాంస్కృతిక సంక్లిష్టతలనడుమ ఏ మార్గాన్ననుసరించాలో స్పష్టత లేక సతమతమవుతూ ఆధ్యాత్మికాన్వేషణలో ఉన్న యువతకు నోబుల్ గ్రహీత హెర్మన్ హెస్సే 'సిద్ధార్థ' కొన్ని ఆచరణయోగ్యమైన మార్గాలను సూచించిందనడంలో అతిశయోక్తి లేదు..జర్మన్ దేశీయుడైన హెస్సే తూర్పు పడమరల ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసంధానం చేస్తూ రాసిన సిద్ధార్ధను చదవనివారు బహు అరుదు..కానీ హెస్సే గద్యం తెలిసినంతగా పాఠకులకు ఆయన పద్యం గురించి తెలియదు..హెస్సే రాసిన 'The Seasons of the Soul' అనే కవితా సంపుటిలో ఆయన 64 ఏళ్ళ జీవనకాలంలో వివిధ దశల్లో రాసిన 68 కవితలు ఉంటాయి..నేను సిద్ధార్థ,Steppenwolf లు చదివిన చాలా ఏళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఆయన కవిత్వం చదవడం తటస్థించింది,కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయన స్వరంలోని అదే సుపరిచితమైన సహజత్వం,నిజాయితీ,పదాడంబరాలు లేని శైలిలో ఎటువంటి మార్పూ కనిపించలేదు..హెస్సే గద్యంలో కనిపించే సరళత్వమే పద్యంలో కూడా కనిపిస్తుంది..ఈ కవితలు కష్టసుఖాలన్నిటినీ సమానంగా స్వీకరించి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని దర్శించిన వయోవృద్ధుని అనుభవసారాలని చెప్పొచ్చు.
Image Courtesy Google
హెస్సే రచనల్లో ఎంతో సునిశిత పరిశీలన చేత మాత్రమే దర్శించగలిగే సూక్ష్మమైన ఆధ్యాత్మిక,తాత్వికపరమైన అంశాలు ఆయన్నొక సాధారణ నవలా రచయితగా కాక ఒక తత్వవేత్తగా నిలబెడతాయి..హెస్సే మీద ఈస్టర్న్ ఫిలాసఫీ,ముఖ్యంగా చైనా ఫిలాసఫీ ప్రభావం ఈ కవితల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది..అదే దేశానికీ చెందిన Friedrich Nietzsche,Arthur Schopenhauer వంటి వారి ఫిలాసఫీలో కనిపించే సంక్లిష్టత,మార్మికత,వాస్తవికతకు దూరం ఉండే ఉన్మాదం లాంటి తీవ్రమైన అంశాలు  అణుమాత్రం కూడా కనిపించకపోవడం హెస్సే తత్వంలోని ప్రత్యేకత..సత్యదూరమైన సిద్ధాంతాలు హెస్సే పదాల్లో ఇమడలేవు..ఈ కవితల్లో ఆయన బోధించిన తత్వం కర్మ సిద్ధాంతాన్ననుసరించిన ఒక సామాన్యుని అనుభవాల్లో నుండి పుట్టుకొచ్చినవే గానీ కేవలం పుస్తక జ్ఞానంతోనో,సత్యదూరమైన విశ్లేషణల ఆధారంగానో ఊహామాత్రంగా రాసినవి ఎంతమాత్రం కాదు,బహుశా ఈ కారణంగానే ఆయన కవితల్లో ఒక స్వచ్ఛమైన నిజాయితీ కనిపిస్తుంది..చైనీస్ ఆధ్యాత్మిక గురువులు Li po,Wang Wei వంటివారి ప్రభావం హెస్సే మీద ఉండటం వల్లనేమో ఆయన కవితలు కూడా చైనీస్ కవిత్వమంత సరళంగానూ,సూటిగానూ ఉంటాయి..సహజంగా ఏ ఫిలాసఫీ అయినా స్వార్ధపూరితమైన ఆత్మాభిమానం,అహంకారం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ Self-gratification దిశగా సాగడం ఎక్కువ చూస్తుంటాం..కానీ హెస్సే కవితలు దీనికి విరుద్ధంగా మనిషికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ జీవితపు వైశాల్యాన్ని అర్ధంచేసుకోవడంలో మనిషిని యవ్వనం మొదలు వృద్ధాప్యం వరకూ చేసే ప్రయాణంలో మానసికంగా బలోపేతం చెయ్యడానికి దోహదపడతాయి..ఆయన కవితలన్నీ అనుభవం,విచారణ,విశ్లేషణ, తత్పరిణామంగా జరిగే అనేక అంతఃశోధనల ఫలితం..

ఈ కవితల్లో ద్యోతకమయ్యే ప్రేమరాహిత్యం హెస్సే కు బాల్యం నుండీ వెన్నంటే ఉన్న నేస్తం..ఆయన ఒక సందర్భంలో "I was an orphan whose parents happened to be alive" అంటూ తన బాల్యాన్ని చేదుగా గుర్తు చేసుకుంటారు..అలాగే ఆయన కవిత్వానికి ఎంచుకున్న థీమ్స్ కూడా ప్రకృతితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తాయి..హెస్సే దృష్టికోణంలో ప్రకృతిలోని ప్రతీ పక్షీ,పువ్వూ,ఆకూ మనిషి నుండి వేరు కాదు..ఈ కవితల్లో ప్రకృతిలోని ఋతువులను మెటాఫోర్లుగా వాడుతూ మానవజీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు..స్థలకాలాదులనూ,ఋతువులనూ మానవజీవనానికి మూలాధార సత్యంగా చూపించడం హెస్సే ప్రధానోద్దేశ్యం..మానవ జీవితంలో ప్రతీదీ ఒక విశిష్ట సమయాన్ననుసరించి జరుగుతుంది...తపించడానికో సమయం...విరహానికో సమయం...స్వంతం చేసుకోడానికో సమయం...సేదతీరడానికో సమయం..విడుదలకో సమయం..ఇలా హెస్సే కవిత్వంలో మనిషి కూడా ప్రకృతిలో ఋతువులు రంగులు మార్చుకున్నట్లు ఒక్కో దశలో ఒక్కో తీరుగా రూపాంతరం చెందుతూ ఉంటాడు.

'The Tides of Love' విభాగంలోని కొన్ని కవితల్లో లో హెస్సే వ్యక్తిగత జీవితంలోని విఫలప్రేమల ఛాయలు కనిపిస్తాయి..ఈ కవితల్లో స్త్రీని మనిషిని మస్తిష్కాన్ని కమ్మేసే సుందరమైన మాయగా అభివర్ణిస్తారు..జీవితంలో ప్రేమతో పాటుగా ప్రేమరాహిత్యాన్ని కూడా తుది శ్వాసవరకూ ప్రేమించమంటూ,ఈ విధంగా రాస్తారు..

Wild heart of mine, remember this.
And love each feverish passion
and the bitterness of pain, love too
before you have to enter your eternal rest.

ఇరవయ్యో శతాబ్దాన్ని ఏలుతున్న 'ఆధునికత సంస్కృతి' దుష్పరిణామాలు హెస్సే దృష్టిని దాటిపోలేదు..ఒకానొకప్పుడు ఒక భారతీయ సాధువు డిస్నీ ల్యాండ్ ను సందర్శించినప్పుడు ఆ 'Temple of Distraction' ని చూస్తూ “There must be very little joy in a culture which needs to have that much fun.” అని వ్యాఖ్యానించారట..హెస్సే కూడా ఆయన వాదననే సమర్థిస్తారు..ఆత్మను విస్మరించి భౌతికమైన క్షణికానందాలకు అర్రులుచాస్తున్ననేటి తరానికి స్వాప్నికుని సృజనాత్మక ప్రపంచపు ఔన్నత్యాన్ని వివరించే దిశగా కవిత్వం ప్రాముఖ్యతను గూర్చి 'To Imagine is to Inspire' విభాగంలో కొన్ని కవితలు రాశారు.

'The Living Word' అనే కవితలో ఈ విధంగా రాస్తారు..

Poetry and music invite you
to understand the splendors of creation.
A look into a mirror will confirm it.
What disturbs us often as disjointed
becomes clear and simple in a poem:
Flowers start laughing, the clouds release their rain,
the world regains its soul, and silence speaks.

'In dialogue with the divine' విభాగం అక్కడక్కడా రవీంద్రుని గీతాంజలిని జ్ఞప్తికి తెస్తుంది.. జాతివిద్వేషాల మధ్య యుద్ధం,అశాంతి,హింసలతో సమిధగా మారుతున్న ప్రపంచాన్ని నిస్సహాయంగా చూస్తూ గీతాసారాన్ని గుర్తుచేసుకుంటూ 'భగవద్గీత' అనే ఒక కవిత రాశారు..

“War and peace, they count the same
 because no death can touch the spirit realm.

 “Whether peace reigns or is ruined,
 the world’s woes will wear on.

 “You have to struggle, cannot rest.
 Apply your strength, it is God’s will!

 “But even if you succeed a thousand times,
 the world’s heart will beat on unchanged."

అనేక ఇజాలు,ఫిలాసఫీలూ,ఆధ్యాత్మికపరమైన మార్గాలలో ఏది అనుసరణీయమో,ఏది కాదో తెలీక ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి సంక్లిష్టమైన ప్రపంచానికి తన సరళమైన కవిత్వంతో స్వాంతన చేకూర్చే స్వచ్ఛమైన గళం హెర్మన్ హెస్సేది..సూఫీ కవిత్వంలో ప్రశాంతతనూ,గిబ్రాన్ కవిత్వంలో వివేకాన్నీ,జ్ఞానాన్ని కలబోసినట్లుండే హెస్సే కవిత్వం ఈ తరం వారికి ఏ సెల్ఫ్ హెల్ప్,పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లో లేని జీవిత తత్వాన్ని బోధిస్తుంది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

"In spite of all the pain and sorrow I’m still in love with this mad, mad world"

My mind gazes on life’s landscape with detachment and keeps the homesick, quickened heartbeats at an even pace like a well-tempered tune.

Demons and devils will haunt you everywhere because your true enemy rules your heart, from whom you cannot run or flee.

నాకు నచ్చిన కొన్ని కవితలు..

1) My Misery

 My misery comes from my great talent
 to wear too many masks too well.
 I learned to deceive every one, myself included.
 I became a master manipulator of my feelings.
 No true song could reach my heart.
 Behind each step I take lurks a shrewd scheme.

 I know the source of all my suffering.
 I have traced it to my innermost core:
 Even my heartbeat is controlled and calculated.
 I make sure no dream’s deep, dark foreboding,
 no imprisoned passion, no stirring sorrow
 can break through this armor to my soul.

 2) Books

 All the books of the world
 will not bring you happiness,
 but build a secret path
 toward your heart.

 What you need is in you:
 the sun, the stars, the moon,
 the illumination you were seeking
 shines up from within you.

 The quest for wisdom
 made you comb the libraries.
 Now every page speaks the truth
 that flashes forth from you

3) Alone

 You can travel so many roads
 and so many trails all over this world,
 but remember all paths
 lead to the same finish.

 You can ride, you can drive
 in twos or in threes,
 but you must take
 the last step alone.

 No schooling, no skill
 will suffice or save you
 from having to face
 each grave challenge alone