Friday, December 16, 2022

Murder in the Age of Enlightenment: Essential Stories - Ryūnosuke Akutagawa

"It is better, I believe, to kill oneself than to endure spiritual bankruptcy" అనే వాక్యాలు చదివిన వారికి అకుతాగావా రచనలు పైకి కనిపించినంత సరళం కావని ఇట్టే అర్థమవుతుంది.

రెండేళ్ళ క్రితం ప్రఖ్యాత జాపనీస్ రచయిత Ryūnosuke Akutagawa 'త్రీ స్ట్రేంజ్ టేల్స్' అనే రచన చదివిన్నప్పుడు ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో ఆయన విలక్షణ శైలికి దాసోహం అయిపోయాను. తరువాత అకుతాగావా కథలు మరికొన్ని చదువుదామనుకున్నా వేరే పుస్తకాల ధ్యాసలోపడి కుదరలేదు, ఈలోగా పుష్కిన్ ప్రెస్ వారు  ఆయన కథల్లో కొన్నిటిని "Murder in the Age of Enlightenment: Essential Stories" పేరిట పుస్తకంగా తీసుకొచ్చారని తెలిసింది. ఎందుకో తెలీదు గానీ, "పుష్కిన్ ప్రెస్" రచనలంటే అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కొత్త చందమామ కథల పుస్తకాన్ని మిరపకాయ బజ్జీల పొట్లంతో కలిపి ఆఫీసు నుంచి వస్తూ వస్తూ నాన్నగారు తెచ్చి చేతిలో పెట్టినంత సంతోషంగా అనిపిస్తుంది. ఇక సగం సగం చదువుతున్న పుస్తకాలు కూడా ప్రక్కన పెట్టి ఈ పుస్తకం పట్టుకున్నాను. విచిత్రం ఏమిటంటే ఇది పూర్తి చేసినా కూడా ఎందుకో నాకు తనివితీరలేదు. మరికొన్ని కథల్ని చదవాలనిపించింది. ఒక రచయితని ఒకసారంటూ చదివాక మళ్ళీ వెంటనే రెండో పుస్తకం చదవడం నా వరకూ చాలా అరుదూ, అద్భుతమూను. అటువంటిది "హెల్ స్క్రీన్", "కాగ్ వీల్స్", "డెత్ రిజిస్టర్", "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" ఇలా చిన్న చిన్న నవలికల్ని పోలిన ఆయన రచనలన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్ళాను.

Images Courtesy Google

13 ఏళ్ళ సాహితీ ప్రస్థానానికి స్వల్పకాలంలోనే ముగింపు పలుకుతూ 35 ఏళ్ళకే జీవితాన్ని అంతం చేసుకున్న అకుతాగావా జీవితంపై మనోవైకల్యం ఉన్న ఆయన తల్లి ప్రభావం ఎక్కువ ఉందంటారు. తల్లిదండ్రుల దగ్గర బాల్యం రేకెత్తించిన భయాలకు దూరంగా తల్లి సోదరి చేరదీసినప్పుడు తాత్కాలికంగా సాహితీ లోకంలో శాంతిగా బ్రతికినప్పటికీ,  బాల్యం తాలూకూ చీకటి నీడలు ఆయన్ను జీవితాంతం వదిలిపోలేదు. ఈ కారణంగా స్కిజోఫ్రీనియా తాలూకూ భ్రమలతో, భ్రాంతులతో నిరంతరం భయాందోళనల మధ్యే జీవించారంటారు.

బహుశా ఈ కారణంగానే ఆయన కథల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్యనుండే  లోకాలకు చెందిన అస్పష్టమైన, అసంబద్ధమైన వర్ణనలు సృజనాత్మకత వైశాల్యపు పరిథుల్ని పూర్తిగా చెరిపేస్తూ పాఠకుల ఊహలకు రెక్కలిస్తాయి.  ఆయన కథ చెప్పే తీరు కొన్నిసార్లు ఖాళీ కాన్వాసు మీద కళాకారుడు గీసిన అందమైన చిత్రంగానూ, అదే సమయంలో అస్తవ్యస్తంగా, అపసవ్యమైన వెతుకులాటను తలపిస్తూ అసంబద్ధంగానూ అనిపిస్తుంది. ముఖ్యంగా 'కాగ్ వీల్స్', 'డెత్ రిజిస్టర్' , 'ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్' ఈ మూడు రచనలూ అకుతాగావా స్వానుభవాల ఆధారంగా రాసినవి కావడంతో రచయితగా ఆయన మెదడులోని మెకానిజమ్స్ ని మరికాస్త సానుభూతితో అర్థం చేసుకునే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. 'హెల్ స్క్రీన్' కథ అకుతాగావాలోని స్వచ్ఛమైన కళాకారుడి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

Hell Screen : "హెల్ స్క్రీన్" ఒక  కళాకారుడిగా తన స్వేచ్ఛ యొక్క పరిధుల్ని సవాలు  చేసిన చిత్రకారుడు యోషిహిడే కథ. యోషిహిడే జీవితాన్ని అడ్డం పెట్టుకుని అకుతాగవా ఈ కథలో అంతర్లీనంగా ఒక రచయితగా తన అంతఃసంఘర్షణనీ, మనఃస్థితినీ చెప్పుకున్నారా అనిపిస్తుంది. 

ఏ కళాకారుడి జీవితం అయినా సాధారణ సంఘజీవి మానసిక స్థితికి చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే సాహిత్యంలో కళను 'స్వేచ్ఛ' కు పర్యాయపదంగా వాడడం చూస్తుంటాం. కానీ కళాకారుడి స్వేచ్ఛకు పరిధులు ఏమిటనేదే నేటి వరకూ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏదేమైనా  గతాన్ని పరిశీలిస్తే, ఆ పరిధుల్ని సవాలు చేసినవారు మాత్రమే చరిత్రలో గొప్ప గొప్ప కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు, అటువంటి కళ ఉత్కృష్టమైన కళగా పరిగణింపబడుతోంది. దీనికి భిన్నంగా ఒక చట్రంలో ఇమడడానికి ప్రయత్నించిన కళాకారుడి సృష్టీ, సృజనాత్మకతలు అంతంతమాత్రమే. కళాసృజన విషయంలో నైతిక,సామాజిక విలువలకు సైతం తిలోదకాలివ్వడనికి వెనుకాడని యోషిహిడే అంతఃసంఘర్షణకూ, కళ పట్ల అతడికున్న నిబద్ధతకూ అద్దంపడుతుందీ కథ. 

నేను ఒకానొక సమయంలో చదివిన జె. ఎమ్. కోట్జీ, మిలన్ కుందేరా, హెస్సే , గిడే లాంటివాళ్ళతో బాటు ఇటీవలే చదివిన థామస్ బెర్న్హార్డ్ లాంటి రచయితలు కూడా ధృవీకరించినట్లు కళాకారుడికి సామజిక నైతికానైతికతలు వర్తించవు (?) , ఎటువంటి సామజిక చట్రంలోనూ అతణ్ణి ఇమడ్చడం సాధ్యపడదు. నిజమైన  కళాకారుడి మానసిక స్థితి నిరంతరం వాస్తవానికీ, కల్పనకూ మధ్య హేతువాదం, తర్కం చొరబడ వీలులేని ఒక రహస్య ప్రదేశంలో ఊగిసలాడుతూ ఉంటుంది.

కానీ సాంఘికంగా ఆమోదయోగ్యమైన సంప్రదాయవాదపు విలువలు వేరు. బౌద్ధంలో మానవజాతి నీతి నియయమాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి గాను ప్రధానంగా ఐదు ధర్మాలను ప్రతిపాదిస్తారు. 

* జీవహింస చేయరాదు. అనగా జీవించి ఉన్న ఏ ప్రాణినీ చంపరాదు.

* నీకు ఇవ్వనిదేదీ బలవంతంగా లాక్కోరాదు, అనగా చౌర్యం చెయ్యరాదు.

* ఇంద్రియాలను దుర్వినియోగం చెయ్యరాదు. అనగా భోగలాలసత్వాన్ని అదుపులో ఉంచుకుని ఇంద్రియ నిగ్రహం పాటించాలి. 

* దుర్భాషలాడరాదు.

* చిత్తమును భ్రమింపజేయు మత్తుపదార్థాలు ఉపయోగించరాదు.

కానీ యోషిహిడే కథ చదివినప్పుడు నిజమైన కళాకారుడి జీవితం ఈ ఐదు ధర్మాలనూ దాటుకుని గానీ మొదలవ్వదేమో అనిపిస్తుంది. ఈ కథలో ఒక పాత్ర ద్వారా, “Excel though he may in art, if a man does not remember the Five Virtues, his path can lead only to Hell.” అనిపించడంలో, కళాకారుడి నిబద్ధతను పాటించే క్రమంలో అకుతాగావా తన నైతిక పతనపు భారాన్ని దించుకునే ప్రయత్నం చేశారేమోననిపిస్తుంది.

"Murder in the Age of Enlightenment" లో అకుతాగావా రాసిన వాటిల్లో ప్రముఖమైన ఏడు కథలున్నాయి. [In a grove, Hell screen, Murder in the age of enlightenment, The General, Madonna in black, Cogwheels] 

The Spider's thread : ఇందులో చదివిన కథలన్నిటిలోనూ నైతికతను బోధించే కథ ఇదొక్కటే. ఇది పిల్లలకు కూడా చెప్పగలిగిన చిన్న ఫేబుల్ లాంటి నీతి కథ. నరకకూపంలోని రక్తపు సరస్సులో కాందాత తాను చేసిన పాపాలకు మిగతా జీవులతో శిక్షననుభవిస్తూ ఉంటాడు. అనేక పాపాల మధ్య అతడు చేసిన చిన్న దయగల పనికి సంతసించిన బుద్ధ శాక్యముని కాందాతకు నరకంనుండి విముక్తి కలిగించాలనుకుంటాడు. ఈ కథలో కాందాత సాలెగూడు దారాన్ని పట్టుకుని స్వర్గానికి ఎగబాకడం గురించిన వర్ణనల్లో అకుతాగావా జీవితంలో స్వర్గ-నరకాల నడుమ నిరంతరం జరిగిన ఊగిసలాట, మనోవైకల్యాలను అధిగమించి శాంతిగా బ్రతకాలనే తపన కనిపిస్తాయి.

ఇక ఈ కథల్లో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఒకటుంది. రాయడం విషయంలో నేను మునుపు చదివిన హెర్మన్ హెస్సే, ఉర్సులా లెగైన్, బోర్హెస్ , కాల్వినో, సిగిజ్మండ్ లాంటి కొందరు రచయితల శైలిలో కనిపించిన సారూప్యతే అకుతాగావా రచనల్లో కూడా కనిపించడం విశేషం. వీరందరి రచనల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం ఏమిటంటే, వీరికి పురాణేతిహాసాలూ, గ్రీకు రోమన్ మైథాలజీలతో పాటు, దేశ విదేశీ రచనలపై ఉన్న అపారమైన పట్టు. "కాగ్ వీల్స్" లో కనిపించే అనేకానేకమైన సాహితీ ప్రస్తావనలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. Strindberg’s Legends, Madame Bovary, డాంటే ఇన్ఫెర్నో, Stendhal, Anatole France, A Dark Night’s Passing, The Collected Letters of Prosper Mérimée వంటి అనేక ప్రస్తావనలు పాఠకులకు మునుపు పరిచయం లేని కాల్పనిక ప్రపంచాలకు తలుపుల్ని తెరుస్తాయి.

దీనికి తోడు "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" రచన మొదలవ్వడమే అకుతాగావా పఠనానుభవాలతో కూడిన ఈ ప్రారంభపు వాక్యాలతో మొదలవుతుంది. 

He was upstairs in a bookstore. Twenty years old at the time, he had climbed a ladder set against a bookcase and was searching for the newly-arrived Western books: Maupassant, Baudelaire, Strindberg, Ibsen, Shaw, Tolstoy, Nietzsche, Verlaine, the Goncourt brothers, Dostoevsky, Hauptmann, Flaubert …

Life is not worth a single line of Baudelaire.

ఇక మిగిలిన అకుతాగావా కథలు కూడా ఈ ఏడాది చదవాలని అనుకుంటూ, హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరో కొన్నివాక్యాలు : 

హెల్ స్క్రీన్ కథ నుండి,

After that, almost no one—at least not in the Horikawa mansion—spoke ill of Yoshihide. Perhaps this was because anyone who viewed the screen, no matter his accustomed loathing for the artist, was struck by the mysteriously solemn sentiment inspired by witnessing the mighty and wondrous tortures of Hell in all their manifest reality.

కురసోవా మాస్టర్ పీస్ 'రషోమాన్' పేరుతో తీసిన 'In a Grove' కథ గురించి తెలియని వారు అరుదు. ఈ వాక్యాలు అందులోవి. 

Oh, come off it. Killing a man isn’t as difficult as you people seem to think it is. At any rate, if you want to rob a man of his woman, it’s only natural that you’re going to have to kill him. Only, when I do it, I do it with a sword. People like you don’t use swords. You gentlemen kill with power, with money, sometimes with words alone—all on the pretence of doing a man a favour. True enough, no blood is shed. He might even live well. But you’ve killed him all the same. It’s hard to say whose sin is greater—yours or mine. [An ironic smile.]

ది జనరల్ కథ నుండి, 

Stendhal: Whenever I see a man decked in medals, I cannot help thinking how many cruelties he must have committed in order to be given such reward …

మడోన్నా ఇన్ బ్లాక్ కథ నుండి, 

Take a look. Do you see the engraving? Desine fata deum flecti sperare precando … ‘Cease to hope that the decrees of Heaven can bend to prayer.’”

With an instinctive sense of fear, I beheld the Madonna—the very embodiment of fate. Clad in blackest ebony, she wore a look of eternal indifference, her beautiful ivory face crossed by a cruel smile tinged with malice.

"కాగ్ వీల్స్" నుండి, 

“Great man”: this was the worst possible epithet anyone could have bestowed on me back then. I believed that I had committed all manner of sin, but still, whenever the opportunity arose, they went on calling me a “great man”. I couldn’t help but feel that I was somehow being mocked. By whom though? My affirmation of materialism did not allow such mysticism. Only a few months previously, I had written in a certain little niche magazine: “I have no artistic conscience; indeed, I have no conscience whatsoever. I have only nerves.”

Soon enough, I began to feel that anything and everything was a lie. Politics, industry, arts, science—all this seemed to me little more than a gaily coloured enamel concealing the true horror of human life.

“The Four Most Terrible Adversaries: Doubt, Fear, Arrogance, Lust”

As I sat there, staring at Napoleon, I thought of the works I had written. The first to drift into mind was “Words of a Dwarf” and its aphorisms—particularly the line, “Life is more hellish than Hell itself.” Then it was the fate of my artist Yoshihide, the protagonist of “Hell Screen”.

This mercurial change in attitude, from customary diffidence to sudden boldness, is one of my worse traits.

An hour later I found myself shut away in my room, seated at the desk in front of the window and making a start on a new story. My pen raced over the manuscript paper with a speed that I found quite astonishing, but after two or three hours it came to a halt, as though stayed by some invisible force. Having no other recourse, I stood up and began pacing about the room. It was at times like this that my megalomania was at its most extreme. In my savage joy, I felt that I had no parents, no wife or children, but only the life that gushed forth from my pen.

Not long after that, I was alarmed by the unexpected sight of a small white signboard hanging from the eaves of a shop. It was emblazoned with a trademark: an automobile tyre with wings. It made me think of the ancient Greek who placed his faith in artificial wings. He soared up high into the sky, until his wings were burnt by the sun and he went plunging into the ocean, where he drowned.

My only salvation now was sleep. But I didn’t have a single sleeping pill left. The grim prospect of more insomnia was utterly intolerable, but still, mustering a sort of desperate courage, I ordered coffee to be brought to the room and, like one demented, took up my pen. Two pages, five, seven, ten pages—the manuscript kept growing before my very eyes. I was filling the world of this novel with supernatural beasts, one of which was a self-portrait. But all of a sudden, fatigue began to cloud my head. At last I got up from the desk and lay down on the bed. I must have slept for forty or fifty minutes, when again I heard a voice whispering to me: “Le diable est mort.”

“To think, one minute you can be so detached from the world around, and the next, at the mercy of violent human passions …”

“To think, man can be virtuous one moment, and wicked the next.”

Monday, November 28, 2022

ముఖంపై మారే ముసుగులు చెప్పిన కథలు - లూగీ పిరాండెల్లో

"జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ పాత్రను నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే వేదికపై నువ్విక లేనట్లే" అనే ఇటాలియన్ రచయిత లూగీ పిరాండెల్లోను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించదు. ఆధునిక యుగంలో రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనిషికి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ సరికొత్తగా నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఆ కాలంలో కవులూ, రచయితలూ చేసిన సింహభాగం రచనల్లో ఈ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుంది. అటువంటి ఆధునిక యుగపు రచయితల్లో హెన్రిక్ ఇబ్సెన్, జార్జ్ బెర్నార్డ్ షా, శామ్యూల్ బెకెట్ వంటి వారికి సమకాలీనులైన నోబెల్ గ్రహీత లూగీ పిరాండెల్లో (1867-1936) కూడా ఒకరు. ఇబ్సెన్ సామజిక సమస్యల నేపథ్యంలో వాస్తవికతతో కూడిన రచనలు చేస్తే, బెకెట్ మనిషిలోని నిరాశా నిస్పృహలతో కూడిన సాంఘికమైన వేర్పాటుతనాన్నీ, సామజిక పరాయీకరణనీ ఆధారంగా చేసుకుని అసంబద్ధమైన అంశాలతో కూడిన రచనలు చేశారు, వీరిరువురికీ భిన్నంగా పిరాండెల్లో రచనలు మానసిక విశ్లేషణల చుట్టూ తిరుగుతాయి.

Image Courtesy Google

ఆధునిక రచయితలు తమ నాటకాల్లో మనస్తత్వ శాస్త్రంతోబాటు సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ వంటి వారి మానసిక విశ్లేషణలకు ప్రాధాన్యతనివ్వడం గమనిస్తాం. ఈ క్రమంలో పిరాండెల్లో నాటకాల్ని 'సైకో డ్రామా' శైలికి చెందిన రచనలుగా వర్గీకరిస్తారు. ఈ 'సైకో డ్రామా' అనే పదానికి సృష్టికర్త అయిన జాకబ్ లెవీ మోనెరో ఈ శైలికి చెందిన నాటకాలు మనుషులకు తమ మానసిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా సహాయపడగలవని భావిస్తారు. ఉదాహరణకు షేక్స్పియర్ 'హేమ్లెట్'ను ఈ శైలికి చెందిన నాటకంగా పరిగణిస్తారు. ప్రప్రథమంగా ఒక నాటక రచయితగానే ఖ్యాతిని కూడగట్టుకున్నప్పటికీ తరువాతి కాలంలో పిరాండెల్లో మంచి కథకుడిగా, నవలాకారుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రచనల్లో తరచూ 'కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్' ను ప్రధాన పాత్రగా చేస్తూ, "నేను ఎవరు ?", "ఏది వాస్తవం? ", "ఏది భ్రమ ?" అనే ప్రశ్నల్ని చర్చకు పెడతారు. ఒక సంఘజీవిగా స్పష్టమైన గుర్తింపు సంపాదించుకోవడంలో మనిషి ఎదుర్కునే సంక్లిష్టతల్నీ, భావప్రకటన విషయంలో మనుషుల మధ్య సంభాషణల్లోని అసంపూర్ణత్వాన్నీ, వాస్తవికత-భ్రమల మధ్య నిరంతరం స్థానభ్రంశం చెందే పరిధులనూ ఆయన తన రచనలకు థీమ్స్ గా వాడుకుంటారు.

19 వ శతాబ్దికి చెందిన ఆస్ట్రియన్ న్యూరాలజిస్ట్ ,సైకో ఎనాలిసిస్ ఆద్యుడూ   సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో మానసిక  విశ్లేషణలు ఎక్కువగా కనిపించడంలో నిజానికి వింతేమీ లేదు. పిరాండెల్లో రచనలు ఉపచేతనావస్థలో మానవ మస్తిష్కంలోని లోపలి పొరల్ని మానసిక విశ్లేషణల ద్వారా విడదీసే ప్రయత్నం చేస్తూ, మనిషి యొక్క ఉనికినీ, గుర్తింపునీ శోధిస్తాయి. అలాగని ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మనిషి మెదడులోని రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలమే దీనికొక కారణం కావచ్చు. నిజానికి ఫ్రాయిడ్, పిరాండెల్లో, ఈ ఇద్దరి రచనల్లోనూ సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ,  వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. కానీ ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణలు చదువుతున్నప్పుడు, వాటిల్లో కనిపించే మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అసంబద్ధంగా  ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్తుల్ని పోలి ఉంటాయి. ఈ కారణంగా మనిషి ప్రవర్తనా సరళిలో అసహజంగా అనిపించే లోపాలూ, పిచ్చితనంలాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. Six Characters in Search of an Author ,హెన్రీ-IV ఈ రెండు నాటకాల్లోనూ ప్రధాన పాత్రలు గతాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ వర్ణన జ్ఞాపకాల్లో నుండీ, అచేతనావస్థలో నుండీ వచ్చేది కావడం వల్ల వాళ్ళు ఆ క్రమంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకూ, అస్థిమితానికీ లోనవడం చూస్తాం. పిరాండెల్లో కథల సంపుటి 'The Tales of Madness' లో మనిషిలో విపరీత ధోరణులు మొదలుకుని చిత్త వైకల్యాలవంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు. ఈ కథల్లో అస్తిత్వవాదాన్ని విశ్లేషించడానికి 'madness' ను ఒక మెటఫోర్ గా వాడతారు. మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం మానసికవైకల్యాలపై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు.

ప్రతి మనిషిలో మనకు తెలిసి కొంతా, తెలియక కొంతా పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని పిరాండెల్లో కథలు  నిరూపిస్తాయి. వాస్తవం నుండి దూరం జరగడం, ఏదో జరుగుతుందని భయపడడం, నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం, సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం లేదా 'తను' కాని తనను సామాజిక చట్రంలో ఇమిడ్చేసుకోవడం, ఈ కారణాల వల్ల ఉత్పన్నమయ్యే అనేక భయాలూ, బాధలూ, కోపతాపాలు, నిరాశా-నిస్పృహలూ వెరసి పిరాండెల్లో కథలు అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మెదడులోని రహస్యాలను లోతంటా కొలవడానికి ప్రయత్నిస్తాయి.

పిరాండెల్లో అస్తిత్వాన్ని నిరంతరం రూపాంతరం చెందుతూ మిగిలిపోయే  జ్ఞాపకంగానూ, మనిషి గుర్తింపుని కాలాన్ని బట్టి నిరంతరం మారే ముసుగు  వెనుక రహస్యంగానూ చూస్తారు. అందువల్ల మనిషి తన స్పష్టమైన ఉనికిని నిర్వచించుకోవడం దాదాపూ అసాధ్యమనేది ఆయన వాదన, అందునా భావదారిద్య్రం రాజ్యమేలే ఆధునిక సమాజం ఇటువంటి అంశాలను పూర్తిగా కోల్పోయిందని మనసావాచా నమ్మేవారాయన. అందువల్ల ప్రతి మనిషీ తనని తాను కోల్పోయి మాత్రమే ఇటువంటి ఒక వ్యవస్థలో భాగం కాగలడని ఆయన రచనలన్నీ మనకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరూపించే ప్రయత్నం చేస్తాయి. ఈ కారణంగానే పిరాండెల్లో పాత్రలన్నీ సంఘజీవిగా రూపాంతరం చెందే క్రమంలో తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఒక అనుకూలమైన ముసుగు చాటున దాచే ప్రయత్నం చేస్తాయి.'హెన్రీ IV' నాటకంలో ప్రధాన పాత్రధారికి గుర్రం మీద నుండి పడిపోవడంతో మతిస్థిమితం తప్పుతుంది. కానీ అతడు కొంతకాలానికి కోలుకుని మామూలు మనిషైనప్పటికీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని సమాజం నుండి దాచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా పిచ్చివాడిలా నటిస్తుంటాడు. ఇలా తన అస్తిత్వాన్ని చెరిపేసుకుని నటించడం ద్వారా అతడు సామజిక శృంఖలాలనుండి తప్పించుకుని స్వేచ్ఛగా తనకు తోచినట్లు జీవించే అవకాశం ఉందని భావిస్తాడు. పిరాండెల్లో నవలల్లో బాగా పేరుపొందిన నవల 'ది లేట్ మటియా పాస్కల్' కూడా ఇటువంటి కథే. మరణించాడని సమాజం పొరపాటుగా భావించిన కథానాయకుడు తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని, వారికి నిజం చెప్పకుండా తన అస్తిత్వాన్ని సరికొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త జీవితం ప్రారంభించాలని తలపోస్తాడు. ఈవిధంగా మనిషి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ కనుగొనడానికి సహాయపడే శాస్త్రమైన కార్ల్ యుంగ్ మానసిక విశ్లేషణల్ని 'Six Characters in Search of an Author' ,'హెన్రీ -IV', 'The Late Mattia Pascal' వంటి రచనల ద్వారా పిరాండెల్లో తన కాల్పనిక ప్రపంచాలకు అన్వయించడాన్ని చూస్తాం. కార్ల్ యుంగ్ ఇగోని మనిషి గుర్తింపుకి కేంద్రంగా చూస్తారు. ఈ కారణంచేత ఎవరైనా తన వ్యక్తిత్వానికి ఒక ముసుగు తొడుక్కున్నప్పుడు తనని తాను ఆ ముసుగు ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతాడు కాబట్టి అతడు తన స్వతఃసిద్ధమైన ఐడెంటిటీని కోల్పోతాడని ప్రతిపాదిస్తారాయన. ఒకవేళ పైకి అగుపించే ఆకారస్వరూపాలే మనిషి అస్తిత్వాన్ని నిర్వచించే చిహ్నాలైతే, ఆ వాస్తవికత నిరంతరం రూపాంతరం చెందుతుందని పిరాండెల్లో రచనలు పదేపదే నిరూపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఆయన దృష్టిలో ఖచ్చితమైన, విశ్వజనీనమైన వాస్తవమంటూ అసలుండే అవకాశం లేదు కాబట్టి భ్రమను అపాయకారిగా కంటే ఒక వ్యక్తిగత ధృవీకరణగా, సమాజానికి సవాలు విసిరే అంశంగా చూడాలన్నది ఆయన భావన. 

పిరాండెల్లో కథల్లో నేపథ్యాలే కాదు ఆయన కథ చెప్పే తీరు కూడా విలక్షణంగా ఉంటుంది. జీవితంలోని అబ్సర్డిటీకి హాస్యాన్నీ, వ్యంగ్యోక్తుల్నీ జోడించి దాన్నొక హాస్య కథలా చెప్పడం ఆయన ప్రత్యేకత. కథలో ఎక్కడో ఒకచోట లోతైన విషయం చర్చిస్తున్నారనుకునేలోగా ఉన్నట్లుండి చిన్న చమత్కారం దొర్లుతుంది. మరోచోట ఏదో ఒక సరదా సందర్భంలో అంతర్లీనంగా నిరాశా నిస్పృహలు, ఇదిగో మేమున్నామంటూ తొంగిచూస్తాయి. ఇంకోచోట మానవసంబంధాలను ఆవిష్కరించే క్రమంలో ఉన్నట్లుండి తాత్వికత తెరపైకొస్తుంది. ఆయన కథల్లో వర్ణనలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఆయన శైలి పాదరసంలా ఒక వర్ణన నుండి స్వగతానికీ , స్వగతం నుండి ఒక నాటకీయ సంభాషణకూ, దాన్నుండి ప్రత్యక్ష ఉపన్యాసానికీ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో గమనించే సమయం పాఠకులకు ఇవ్వరు. 

తాను జీవించి ఉన్న కాలంలో సుమారు 200 పై చిలుకు కథలు రాసిన ఆయన, తాను తొలినాళ్ళలో రాసిన కథల్నే పునాదులుగా చేసుకుని తరువాతి కాలంలో అనేక నాటకాలకు రూపకల్పన చేశారంటారు. ఆయన కథల్లో అంతఃసంఘర్షణలూ, వ్యక్తిగత సమస్యల ఆధారంగా రాసివి కొన్నైతే, అధికశాతం కథలు మాత్రం మనిషి సామజిక సాలెగూడులో చిక్కుకుని ఎదుర్కునే సంఘర్షణలూ, సామజిక కట్టుబాట్లను ఉల్లంఘించలేని నిస్సహాయత వల్ల సంఘజీవిగా మనడానికి అవసరమయ్యే ముసుగు ధరించే దిశగా పురిగొల్పే పరిస్థితుల (పిరాండెల్లో చాలా ఏవగించుకునే విషయం ) చుట్టూ తిరుగుతాయి. బహుశా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పాఠకులు పిరాండెల్లో రచనల్ని ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా ఇదే కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో పాత్రల జీవితాలు విధి లిఖితంగా,ఊహించని మలుపులతో అనూహ్యంగా ఉంటాయి. అనేక వైరుధ్యాల పోగుగా ఉండే విభిన్నమైన మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు లూగీ పిరాండెల్లో. కాల్పనికత, వాస్తవికతలనే రెండు పాయలనూ రెండు వైపుల నుంచీ సరిసమానంగా అల్లుకొచ్చి చిట్టచివరకి వాస్తవికతకు ముడి పెట్టడంలో పిరాండేల్లో నైపుణ్యం ఆయన ప్రతీ రచనలోనూ కనిపిస్తుంది. ఆయనను చదవడమంటే తాత్వికతనూ, మానసిక తత్వశాస్త్రాన్నీ, అస్తిత్వవాదాన్నీ, కాల్పనికతనూ అన్నిటినీ సమపాళ్ళలో కలిపి వండిన విందుభోజనం చెయ్యడంలా ఉంటుంది. పిరాండెల్లో రచనలు పాఠకులకు అన్నిఅంశాలూ తగుపాళ్ళలో కుదిరిన ఒక పూర్తి స్థాయి రచన చదివిన తృప్తినిస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో కనబరిచే నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 28th నవంబర్ 2022

https://www.andhrajyothy.com/2022/editorial/stories-told-by-changing-face-masks-956143.html

https://epaper.andhrajyothy.com/Home/ShareImage?Pictureid=e0fe4a13

Thursday, November 24, 2022

The Loser - Thomas Bernhard

“The only way to deal with an unfree world is to become so absolutely free that your very existence is an act of rebellion.” అన్న ఆల్బర్ట్ కామూ మాటలు ఎవరికైనా అతికినట్లు సరిపోతాయంటే అది ఒక్క థామస్ బెర్న్హార్డ్ కే అనిపిస్తుంది. తిరుగుబాటునే తన జీవితానికి నిర్వచనంగా చేసుకున్న ఈ ఆస్ట్రియన్ రచయిత స్వదేశంలో జర్మన్ పదమైన Nestbeschmutzer [ person who fouls their own nest ] గా అభివర్ణించబడినా స్వదేశానికి ఆవల మాత్రం కుండబద్దలుకొట్టినట్లుండే ఆయన రచనల శైలికి గాను యావత్ సాహితీ ప్రపంచపు మన్ననలందుకున్నారంటారు.

బాల్యంలో తల్లిదండ్రుల తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం, చిన్న వయసులోనే క్షయ బారినపడడం, యువకుడిగా ఉండగా 'హిట్లర్ యూత్' లో భాగంగా బలవంతంగా పనిచెయ్యాల్సిరావడం వంటి కారణాల వల్ల బెర్న్హార్డ్ రచనలపై తీవ్రమైన నిరాశావాదపు ఛాయలు కనిపిస్తాయి. బెర్న్హార్డ్ "ది లూజర్" చదువుతున్నంతసేపూ జులియన్ బార్నెస్ "ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్"  గుర్తుకువచ్చింది. ఆ రచనలో జీవితానికి అంతిమ లక్ష్యం, పరమార్థం మృత్యువేననే నిరాశావాదం ఈ రచనలో కూడా కనిపిస్తుంది. బార్నెస్ నిరాశావాదానికి తోడు జె.ఎమ్.కోట్జీ కళాత్మకత, మిలన్ కుందేరా రచనల్లో అంతర్లీనంగా ధ్వనించే కళాకారుడి అహంభావం కూడా కలిపితే ఒక థామస్ బెర్న్హార్డ్ తయారవుతాడు.

Image Courtesy Google

"ది లూజర్" మనకు కథను చెబుతున్న పేరు తెలియని కథానాయకుడితో కలిపి పియానో ప్లేయర్స్ అయిన ముగ్గురు స్నేహితుల కథ. మిగతా ఇద్దరిలో  ఒకరు ప్రపంచ ప్రసిద్ధ 'కెనెడియన్ ప్రాడిజీ' గ్లెన్ గౌల్డ్ కాగా మరొకరు Wertheimer. రచయిత కథను ఉత్తమపురుషలో చెబుతారు. కాగా 'బ్రెత్లెస్' టోన్ లో చెబుతున్నట్లుండే గొలుసుకట్టు వర్ణనలు బెర్న్హార్డ్ వచనానికి అదనపు ఆకర్షణ.

ప్రతి మనిషికీ అతడి శక్తిసామర్ధ్యాల దృష్ట్యా, వ్యక్తిగత నైపుణ్యాల దృష్ట్యా తనదంటూ ఒక ప్రత్యేకమైన గమ్యం నిర్దేశించబడి ఉంటుంది. దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తనదైన మార్గంలో అడుగు ముందుకు వెయ్యడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని గుర్తించకుండా నిరంతరం వేరొకరి విజయాలతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురై జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమంత మూర్ఖత్వం, పరాజయం మరొకటి ఉండదు. ఒక ప్రపంచ ప్రసిద్ధ పియానో వాద్యకారుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకునే క్రమంలో గ్లెన్ గౌల్డ్ లాంటి జన్మతః సాక్షాత్ సరస్వతీ పుత్రుడి స్థాయికి చేరలేక నిరంతరం ఆత్మన్యూనతతో సతమతమయ్యి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాడు Wertheimer, మరోవైపు ఎంత ప్రయత్నించినా సంగీత ప్రపంచంలో గ్లెన్ స్థాయికి ఎప్పటికీ చేరలేనని గుర్తించిన కథానాయకుడు తన తనదైన తాత్విక గమ్యం వైపు దిశను మార్చుకుంటాడు. నిజానికి గ్లెన్ సాహచర్యంలో వాళ్ళిద్దరూ కూడా బాగుపడే అవకాశం ఉన్నప్పటికీ, అతడి శిఖరసమానమైన కీర్తిప్రతిష్ఠలు మిగతా ఇద్దరు స్నేహితుల జీవితాలనూ తాత్విక, హేతువాద కోణాల్లో ప్రభావితం చేస్తూ పరోక్షంగా వారి జీవితాలను ఎలా అథఃపాతాళానికి నెట్టేశాయన్నదే ఈ కథ. 

The whole time on my way to the teacher’s I kept on saying these three words: Absolutely no artist! Absolutely no artist! Absolutely no artist! If I hadn’t met Glenn Gould, I probably wouldn’t have given up the piano and I would have become a piano virtuoso and perhaps even one of the best piano virtuosos in the world, I thought in the inn. When we meet the very best, we have to give up, I thought.

ఈ కథలో పరాజితుడంటే ఎవరనే ప్రశ్నకి, తన బలాలూ, బలహీనతల సహితం తనను తానుగా అంగీకరించలేనివాడని Wertheimer జీవితం రుజువు చేస్తుంది. కథ జరుగుతున్న సమయంలో నేరేటర్ వేర్వేరు కారణాలతో మరణించిన తన ఇద్దరి స్నేహితులతో తన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. కథ మొదట్లోనే నేరేటర్ గ్లెన్ ను పరిచయం చేస్తూ, he was so possessed by his art that we had to assume he couldn’t continue in that state for very long and would soon die returning to Canada from Salzburg, destroy himself with his music obsession, with his piano radicalism. అంటాడు. అతడన్నట్లుగానే గ్లెన్ తనకున్న ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోడు, నలభై ఏళ్ళు తన కళను దైవసమానంగా సాధన చేస్తూ, ఆ కళారాధనలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడుస్తాడు. 

We never attained the inhuman state that Glenn attained, who by the way never escaped this inhuman state, who didn’t even want to escape this inhuman state.

From the first moment ours was a spiritual friendship. The majority of even the most famous piano players haven’t a clue about their art, he said. But it’s like that in all the arts, I said, just like that in painting, in literature, I said, even philosophers are ignorant of philosophy. Most artists are ignorant of their art. They have a dilettante’s notion of art, remain stuck all their lives in dilettantism, even the most famous artists in the world.

ప్రపంచాన్ని అందరూ ఒకే కోణంలో చూడాలని కొన్ని నియమాలుంటాయి. అందరూ అలాగే చూడాలని సమాజాలూ, ప్రభుత్వాలూ, యజమాన్యాలూ నిర్ణయిస్తాయి. దానికి భిన్నంగా చూసేవాళ్ళు ఆ సమూహానికి చెందరు. అటువంటి "అవుట్ సైడర్" ఇమేజ్ థామస్ బెర్నార్డ్ సొంతం. "జర్మన్ తలబిరుసుతనం" ప్రపంచానికి కొత్తేమీ కాదు కానీ అదే జర్మన్ తలబిరుసుతనం ఆ దేశానికే తలనెప్పిగా మారితే ఎలా ఉంటుందో తెలియాలంటే థామస్ బెర్నార్డ్ రచనలు చదవాలి.

ప్రపంచమంతా తీవ్రమైన కన్ఫర్మిటీ రాజ్యమేలుతున్న ఈ కాలంలో విప్లవాత్మకమైన థామస్ బెర్న్హార్డ్ గళం పాఠకులకు సహజంగానే వైవిధ్యంగానూ, వినసొంపుగానూ అనిపిస్తుంది. ఇక ప్రపంచంలో ఏ మనిషి పట్లా, ఏ ప్రాంతం పట్లా కూడా కనీసమైన సహానుభూతీ, గౌరవం లేకుండా  పుస్తకం మొదలుపెట్టిన దగ్గర్నుండి ముగింపు వరకూ నిరంతరం సాగే రచయిత విమర్శనాత్మకమైన విశ్లేషణలు చదువుతుంటే అసలు ఈ భూప్రపంచంలో బెర్న్హార్డ్ కి నచ్చే, అతడు మెచ్చుకునే అంశమంటూ ఏదైనా ఉండే అవకాశం ఉందా అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ "యాంటీ ఆస్ట్రియన్", "డెత్ అబ్సెస్డ్" రచనలో కథానాయకుడికి ఆస్ట్రియన్ ప్రభుత్వం నచ్చదు, అక్కడి ట్రైన్స్ నచ్చవు, హోటళ్ళు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న చిన్న చిన్న పట్టణాలూ కూడా నచ్చవు.  అతడి ఫిర్యాదులు చాలా చోట్ల జర్మన్ తత్వవేత్త Arthur Schopenhauer సినిసిజాన్ని గుర్తుచేస్తున్నాయి అని నేను అనుకునేలోగా, ఈ ముగ్గురు స్నేహితులూ Schopenhauer, Kant, Spinoza ల రచనల్ని చదువుతున్నారని రాస్తారు రచయిత. అయితే ఇకనేం !! అస్సలు ఆశ్చర్యం లేదు అనుకున్నాను. "To exist means nothing other than we despair" అనే Wertheimer ఫిర్యాదులు కొన్ని చోట్ల అదుపు తప్పి అసలు మనిషి పుట్టడమే తప్పన్నట్లు మొత్తం మనవాళిపై వెళ్ళగక్కే విద్వేషంలా అనిపిస్తాయి.

“Battle not with monsters, lest ye become a monster, and if you gaze into the abyss, the abyss gazes also into you.” అని Nietzsche అన్నట్లు హేతువాదపు పరిధుల్ని సవాలు చేసే ప్రయత్నంలో Wertheimer తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి తనకు తెలీకుండానే తన జీవితంపై పట్టు కోల్పోయి ఒక ఉన్మాదిగా మారతాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మొదలు, నలభై ఏళ్ళపాటు తనకు చేదోడువాదోడుగా ఉన్న చెల్లెల్ని సైతం ప్రేమించలేని Wertheimer, చివరకు ప్రపంచంపై తీవ్రమైన విరక్తితో, ద్వేషభావంతో తన చెల్లెలి ఇంటిముందే ఉరిపోసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటాడు.

హేతువాదం పులి మీద స్వారీ లాంటిది. దాన్ని మన అధీనంలో ఉంచుకున్నామని మనం విర్రవీగేలోగా దానికెప్పుడు ఆహారంగా మారిపోతామో  కనీసం మనక్కూడా తెలీదు. హేతువాదానికీ, ఉన్మాదానికీ మధ్య ఉండేది అతి సన్నని గీత మాత్రమే. అది అలికినట్లైపోయి స్పష్టంగా కనిపించని ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ ఆ గీతను స్పష్టంగా పునఃచిత్రించుకుంటూనే ఉండాలి. "ది లూజర్" చదివినప్పుడు Wertheimer జీవితం ద్వారా థామస్ బెర్న్హార్డ్ చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే, అది ఇదొక్కటే. థామస్ బెర్న్హార్డ్ భావజాలం కంటే ఆయన భావవ్యక్తీకరణ నాకు అమితంగా నచ్చింది. ఈ రచన ఆయన మరికొన్ని రచనలు చదవాలనిపించేలా చేసింది. హ్యాపీ రీడింగ్ :)

చివరగా, ఈ పుస్తకానికి తుదిపలుకు రాసిన మార్క్ ఎమ్. ఆండర్సన్ ఒక రచయితగా బెర్న్హార్డ్ జీవితం గురించి రాసిన అనేక విషయాలు ఈ రచన కంటే మరింత ఆసక్తికరంగా అనిపించాయి : 

During his lifetime Thomas Bernhard’s texts provoked more than the ordinary share of scandals. But perhaps the most enduring scandal will turn out to be his very last text, his will: “Whatever I have written, whether published by me during my lifetime or as part of my literary papers still existing after my death, shall not be performed, printed or even recited for the duration of legal copyright within the borders of Austria, however this state identifies itself.” Bernhard had taken care not to reveal the contents of this will before he died; in fact, he even stipulated that news of his death not be announced until he was buried. This parting slap in the face of his native country thus came not only as a surprise; it came from the hand of a dead man, whose laughter rang out from the grave.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు ,

He had barricaded himself in his house. For life. All our lives the three of us have shared the desire to barricade ourselves from the world. All three of us were born barricade fanatics. But Glenn had carried his barricade fanaticism furthest.

Glenn confirmed what we sensed: New York is the only city in the world where a thinking person can breathe freely the minute he sets foot in it.

Immediately I quashed that idea, for I detested virtuosity and its attendant features from the very beginning, I detested above all appearing before the populace, I absolutely detested the applause, I couldn’t stand it, for years I didn’t know, is it the bad air in concert halls or the applause I can’t stand, or both, until I realized that I couldn’t stand virtuosity per se and especially not piano virtuosity. For I absolutely detested the public and everything that had to do with this public and therefore I detested the virtuoso (and virtuosos) personally as well.

Our loser is a fanatic, Glenn once said, he’s practically choking on self-pity all the time. 

I had nothing to prove, only everything to lose, he said, I thought. Our wealth was probably our undoing, he said, but then immediately: Glenn’s wealth didn’t kill him, it allowed him to exploit his genius.

For fifty years are absolutely enough, I thought. We become contemptible when we go past fifty and are still living, continue our existence. We’re border-crossing weaklings, I thought, who have made ourselves twice as pitiful by putting fifty years behind us. Now I’m the shameless one, I thought. I envied the dead. For a moment I hated them for their superiority.

But we don’t always have to be studying something, I thought, it’s perfectly enough merely to think, to do nothing but think and give our thoughts free rein. To give in to our philosophical worldview, simply submit to our philosophical worldview, but that’s the hardest thing, I thought.

But simple people don’t understand complicated ones and thrust the latter back on themselves, more ruthlessly than any others, I thought. The biggest mistake is to think that one can be rescued by so-called simple people. A person goes to them in an extremely needy condition and begs desperately to be rescued and they thrust this person even more deeply into his own despair. And how are they supposed to save the extravagant one in his extravagance, I thought.

If a friend dies we nail him to his own sayings, his comments, kill him with his own weapons. On the one hand he lives on in what he said to us (and to others) all his life, on the other we kill him with it. We’re the most ruthless (toward him!) as far as his comments, his writings, are concerned, I thought, if we don’t have any more of his writings, because he prudently destroyed them, we go after his comments in order to destroy him, I thought. We exploit his unpublished papers in order to destroy even more the one who left them to us, to make the dead man even deader, and if he hasn’t left us the appropriate instructions to destroy his papers, we invent them, simply invent declarations against him, etc., I thought. Heirs are cruel, the survivors don’t have the slightest consideration, I thought. We’re searching for testimony against him, for us, I thought. We plunder everything that can be used against him in order to improve our situation, I thought, that’s the truth.

The so-called intellectual consumes himself in what he considers pathbreaking work and in the end has only succeeded in making himself ridiculous, whether he’s called Schopenhauer or Nietzsche, it doesn’t matter, even if he was Kleist or Voltaire we still see a pitiful being who has misused his head and finally driven himself into nonsense. Who’s been rolled over and passed over by history. We’ve locked up the great thinkers in our bookcases, from which they keep staring at us, sentenced to eternal ridicule, he said, I thought.

How good it is that none of these imperfect, incomplete works has ever appeared, I thought, had I published them, which would have posed no difficulty whatsoever, today I would be the unhappiest person imaginable, confronted daily with disastrous works crying out with errors, imprecision, carelessness, amateurishness. I avoided this punishment by destroying them, I thought, and suddenly I took great pleasure in the word destroying.

Everything about Wertheimer was always taken from somebody else, copied, he took everything from me, he copied me in everything, and so he even took my failure from me and copied it. Only his suicide was his own decision and came completely from him, I thought, and so he may have experienced, as they say, a sense of triumph in the end.

The lower classes are just as much a public menace as the upper classes, he said, they commit the same hideous acts, should be rejected just as categorically as the others, they’re different but they’re equally hideous, he said, I thought.

Wertheimer was an unrelieved emulator, he emulated anybody he thought was better off than he was, although he didn’t have the capacity for that, as I now see, I thought, he’d absolutely wanted to be an artist and thus walked into the mouth of disaster.

We say a word and destroy a person, although the person we’ve destroyed, at the moment we say out loud the word that destroys him, doesn’t take notice of this deadly fact, I thought.

Friday, November 18, 2022

An Evening with Susan Sontag

 An Evening with Susan : 

శుక్రవారం సాయంత్రం అవగానే లేజీ మూడ్ వచ్చేస్తుంది. వారం అంతా ఉరుకుల-పరుగుల రొటీన్ నుండి చిన్న బ్రేక్ అనే తప్ప పెద్దగా ఏమీ మారదనుకోండి. హైదరాబాద్ లో పుస్తకాల మార్కెట్లతో పాటు నన్ను బాగా  ఆకర్షించినవి ఇక్కడ కేఫ్ లు. కొండాకోనల్లో నిశ్శబ్దానికి అలవాటుపడి ఉండడంతో ఇంకా జనారణ్యపు శబ్ద కాలుష్యానికి చెవులు పూర్తిగా అలవాటుపడలేదు. లైఫ్ లో పెద్దగా అడ్రినలీన్ రష్ అక్కర్లేని quiet & comfortable స్టేజిలో పెద్దగా సందడి లేని చోట్లు నచ్చే మాలాంటి వాళ్ళకి వీకెండ్ రాగానే "దో దీవానే ఇస్ షెహర్ మే" అని పాడుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న కేఫ్ వెతుక్కుని వెళ్ళి ఓ పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడం ఈ మెట్రో జీవితంలో ఒక అదనపు సౌకర్యం. ఎటొచ్చీ ఆయనకు రుచికరమైన సూపు, నాకొక చిక్కని కాఫీ దొరికితే చాలు.

Copyright A Homemaker's Utopia

కూర్చుని కాసేపు సెటిల్ అయ్యాక కొన్ని క్షణాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు కళ్ళతో కాప్చర్ చెయ్యడంతో సరిపోతుంది. ఈరోజు ఇక్కడ మూడు విడివిడి టేబుల్స్ లో లాప్టాప్స్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుని పనిచేసుకుంటున్నవాళ్ళు (ఒక స్త్రీ, ఇద్దరు మగవారు) ముగ్గురు కనిపించారు. ముగ్గుర్లో ఒక మేల్ అండ్ ఫిమేల్ పనిచేసుకుంటున్నంతసేపూ చాలా సీరియస్ గా సిగార్స్ ఊదుతూనే ఉన్నారు. మరో టేబుల్ దగ్గర సుమారు ఐదేళ్ళున్న పాపాయిని ఎంగేజ్ చేస్తూ కూర్చున్న ఒక టీనేజ్ కేర్ టేకర్ కనిపించింది. ఆ పాపాయి అమ్మగారు జాబ్ అనుకుంటా, ఆవిడొచ్చేవరకూ పాపాయిని ఆడిస్తూ అక్కడ వెయిట్ చేసింది. మరో టేబుల్ లో నలుగురు, కాలేజీ పిల్లలనుకుంటా, ముగ్గురబ్బాయిలూ, ఒకమ్మాయీ హుషారుగా కబుర్లలో మునిగిపోయి ఉన్నారు. "ఏం పుస్తకం చదువుతున్నారూ ?" అని డిస్టర్బ్ చేస్తూ అడగడానికి దురదృష్టవశాత్తూ ఈరోజు ఎవరూ కనబడలేదు. నలుగురిలో ఏకాంతాన్ని అనుభవిస్తూ నేను ఈ మధ్యే ఆర్డర్ చేసుకున్న సుసాన్ సొంటాగ్ జర్నల్స్ తిరగెయ్యడం మొదలుపెట్టాను. రేపు ఎప్పుడైనా హైదరాబాద్ విడిచి వెళ్ళేటప్పుడు గుర్తుగా నాతో వెంట తీసుకెళ్ళడానికి కొన్ని చలిగాలుల సాయంత్రపు జ్ఞాపకాల్ని పోగుచేసుకోవాలి కదా !! 

ఈ సాయంత్రానికి సొంటాగ్ డార్క్ హ్యూమర్ జతకలిసి మరింత అందమైన అనుభవాన్నిచ్చింది.

* Not only must I summon the courage to be a bad writer - I must dare to be truly unhappy. Desperate. And not save myself, short-circuit the despair.

By refusing to be as unhappy as I truly am, I deprive myself of subjects. I’ve nothing to write about. Every topic burns. (6/19/76,NY) ( Is she trying to prove that all writers are unhappy ? )

* TB : Consumed (dissolved) by passion - passion leads to dissolution of the body. It was tuberculosis but they called it 'Love'. (Sigh !) 

* Beckett found a new subject for the drama :- What am I going to do in the next second ? Weep, take out of my comb, sigh , sit, be silent, tell a joke, die. (He he he)

*Poets self-limited by some actual or mental regionalism, deliberately cultivated - so he / she will be seen to have [created ] his / her "universe". 

Weakness of American poetry- It's anti-intellectual. Great poetry has ideas. ( You are hurting the egos of Eliot clan Susan )

Friday, October 21, 2022

Reflections in a Golden Eye - Carson McCullers

చాలాకాలంగా వాయిదా వేస్తూ ఎట్టకేలకు అమెరికన్ రచయిత్రి కార్సన్ మాక్ కుల్లర్స్ ని చదివాను. సహజంగా ప్రతీ రచయితనూ ఏదో ఒక చట్రంలో ఇమిడ్చేసినట్లే 'సదరన్ గోథిక్ ఫిక్షన్' రచయిత్రిగా ఆమెకు తగిలించిన ట్యాగ్ వలన ఆ జానర్ అంటే మొదట్నుంచీ పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆమెను చదవకుండా చాలా కాలమే తాత్సారం చేశాను. కానీ ఈ మధ్యనే ఆమె గురించి ప్రచురించిన ఒక వ్యాసం చదివిన్నప్పుడు ఆమెను చదవాలనే కుతూహలం కలిగింది. ఉర్సులా లెగైన్ విషయంలో కూడా ఆమె రచనల్ని చాలా కాలంపాటు చదవకపోవడానికి ఆమెకున్న 'సైన్స్ ఫిక్షన్' రచయిత్రి ట్యాగే కారణం. కానీ కొందరు రచయితలను చదివిన తరువాత గానీ అర్థంకాని విషయం ఏమిటంటే, వాళ్ళ శైలి ఏ ఒక్క చట్రంలోనూ ఇమిడేది కాదు. మాక్ కుల్లర్స్ కూడా అటువంటి కోవకు చెందిన రచయిత్రే.

Image Courtesy Google

"Reflections in a Golden Eye" కథ విషయానికొస్తే, ఇది చాలా సాధారణమైన కథే. రచయిత్రి శైలి చూస్తే గంభీరపదజాలాలూ, మెటఫోర్ల వాడకాలూ ఇవేమీ లేని సరళమైన నేరేషన్. మరి కుల్లర్స్ ని ఎందుకు చదవాలీ అంటే, అసలు కథెలా చెప్పాలో తెలుసుకోవడం కోసం చదవాలంటాను. అడ్రినలిన్ రష్ ఇచ్చే షాక్ ఎలిమెంట్స్ గానీ, బర్నింగ్ ఇష్యూస్ గానీ ఇవేమీ లేకుండా పాఠకులను కేవలం తన నేరేషన్ తో కట్టి పడేసే కుల్లర్స్ అందమైన ప్రోజ్ కోసం చదవచ్చు. రచయిత్రి తన దృష్టిని దాటిపోనివ్వకుండా చిన్న చిన్న సంగతులను సైతం ఒక్కొక్కటిగా అందిపుచ్చుకుంటూ వాటిని సాధారణమైన కథలో చేర్చి కథనాన్ని రక్తికట్టించిన విధానం కోసం చదవచ్చు.

ముఖ్యంగా మానవ ప్రవృత్తిలో కుల్లర్స్ దృష్టిని దాటిపోయే అంశాలంటూ ఉండవు. ఆమె ఈ కథను రాసినప్పుడు, "I am so immersed in my characters that their motives are my own. When I write about a thief, I become one; when I write about Captain Penderton, I become a homosexual man. I become the characters I write about and I bless the Latin poet Terence who said 'Nothing human is alien to me." అన్నారట. మానవ స్వభావాలను సునాయాసంగా అంచనావెయ్యగలిగే నేర్పు కుల్లర్స్ ప్రత్యేకతల్లో ఒకటి.

యుద్ధకాలం కాని సమయంలో దక్షిణ అమెరికాలోని జార్జియాలో ఒక ఆర్మీ బేస్ లోని నిరాసక్త జీవితపు నేపథ్యంలో అల్లిన ఈ కథ ప్రధానంగా కెప్టెన్ పెండెర్టన్ - లియోనారా, మేజర్ లాంగ్డన్ - అలిసన్ అనే రెండు జంటల మధ్య నడుస్తుంది. వీళ్ళు కాకుండా కథలో ప్రత్యేకంగా  చెప్పుకోవలసిన మరో పాత్ర సైనికుడు 'ప్రైవేట్ విలియమ్స్' ది. కథంతా ప్రధానంగా వీళ్ళమధ్యే నడుస్తుంది. ఈ పాత్రల చిత్రీకరణలో కుల్లర్స్ 'సదరన్ రూట్స్' సుస్పష్టంగా కనిపిస్తాయి. హోమోసెక్సువల్ అయిన కెప్టెన్ పెండెర్టన్ కి భార్య ప్రేమికులంటే ఎవరికీ చెప్పుకోలేని ఒకరకమైన వ్యామోహం ఉంటుంది. 'గే' సంస్కృతి ఇంకా ఆమోదయోగ్యం కాని సమాజంలో ఇటువంటి కథ రాయడానికి పూనుకోవడం నిజంగా సాహసమనుకోవాలి. మేజర్ తో వివాహేతర సంబంధం కలిగి ఉండడమే కాకుండా తనను ఎగతాళి చేసే భార్య పట్ల పెండెర్టన్ లోలోపల తీవ్రమైన అసూయా ద్వేషాలతో రగిలిపోతుంటాడు. అయినప్పటికీ సామజిక చట్రంలో ఇమిడే క్రమంలో, "He carried his cuckoldry with a cynical good grace that was respected on the post." అని పెండెర్టన్ గురించి రాస్తారు. అదే సమయంలో లియోనారాను మనకు పరిచయం చేస్తూ క్లుప్తంగా రెండే వాక్యాల్లో, "Leonora Penderton feared neither man, beast, nor the devil; God she had never known." అంటారు కుల్లర్స్.

When she married the Captain she had been a virgin. Four nights after her wedding she was still a virgin, and on the fifth night her status was changed only enough to leave her somewhat puzzled. As for the rest it would be hard to say. She herself would probably have reckoned her affairs according to a system of her own giving the old Colonel at Leavenworth only half a count and the young Lieutenant in Hawaii several units in her calculations. But now for the past two years there had been only Major Morris Langdon and no one else. With him she was content.

లియోనారా, మేజర్ ల మధ్య ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసిన మేజర్ భార్య అలిసన్ తీవ్రమైన మానసిక, శారీరక అనారోగ్యాల బారినపడి సతమవుతూ ఉంటుంది. విశేషమేమిటంటే, ఈ నలుగురికీ వాస్తవం తెలుసు, కానీ ఎవరికీ దాన్ని ఎదుర్కునే ధైర్యం మాత్రం ఉండదు. ఈ కారణంగా నిజాన్ని ఉపేక్షిస్తూ బోనులో పడ్డ ఎలకల్లా కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఈ కథలో ఆర్మీ బేస్లో 'మానసిక వ్యాథిగ్రస్తురాలిగా' ముద్రవెయ్యడబడిన అలిసన్, 'తెలివితక్కువవాడంటూ' అందరూ అపహాస్యం చేసే ఆమె సేవకుడు అనక్లెటో మాత్రమే కాస్తో కూస్తో మిగతా అందరికంటే ఆరోగ్యకరమైన మనుషులనిపిస్తారు. మిగతా అందరూ తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎదుటివాళ్ళ మీద నెపం నెట్టేసే స్వార్థపరులుగానే కనిపిస్తారు. ఇక సామజిక చట్రంలో అస్సలు ఇమడని తీవ్రమైన నిర్లిప్తత, నిర్లక్ష్యం కలగలసిన 'ప్రైవేట్ విలియమ్స్' మనస్తత్వం మిగతా పాత్రలన్నిటికంటే మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది.ఈ రెండు జంటల  కథా అనేక మలుపులు తీసుకోడానికి 'ప్రైవేట్ విలియమ్స్' ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా కారణమవుతాడు. అదేమిటన్నది మిగతా కథ.

మానవ ప్రవృత్తిని కుల్లర్స్ దృష్టికోణం నుండి చదువుతున్నప్పుడు, సాధారణ  దృష్టిని దాటిపోయే అంశాలెన్నో అనిపించకమానదు. ప్రైవేట్ విలియమ్స్ కి లియోనారా పట్ల కలిగే అబ్సెషన్ గురించి ఆమె రాస్తున్నప్పుడు, మానవ సంబంధాల్లోని అబ్సర్డిటీనీ , నలుపు-తెలుపుల మధ్య ఒదగని అనంతమైన భావోద్వేగాలనూ, ప్రవర్తనలనూ ఒక్కొక్కటిగా మైక్రోస్కోప్ లో పెట్టి మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది !

He never thought of her in connection with the stables or the open air. To him she was always in the room where he had watched her in the night with such absorption. His memory of these times was wholly sensual. There was the thick rug beneath his feet, the silk spread, the faint scent of perfume. There was the soft luxurious warmth of woman flesh, the quiet darkness the alien sweetness in his heart and the tense power in his body as he crouched there near to her. Once having known this he could not let it go; in him was engendered a dark, drugged craving as certain of fulfillment as death.

కొందరు మనుషులుంటారు, వీరి ఆలోచనలు వీళ్ళు జీవించిన కాలంకంటే చాలా ఆధునికంగా ఉంటాయి. మాక్ కుల్లర్స్ రచనల్ని పరిశీలిస్తే అవన్నీ కనీసం ఒక అర్థ శతాబ్దం తరువాత వెలుగు చూడవలసిన రచనలుగా తోస్తాయంటారు ఆవిడ విమర్శకులు. సోక్రటీస్, అలాన్ ట్యూరింగ్, ఆస్కార్ వైల్డ్ వంటి మేథావుల విషయంలో వారి మేథను ఎదుర్కోలేని సమాజం వాళ్ళ బలహీనతల్ని లక్ష్యంగా చేసుకుని వారిని తమ స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఎన్ని హింసలపాలు చేసిందో తెలియాలంటే చరిత్రే సాక్ష్యం. "It is no measure of health to be well adjusted to a profoundly sick society" అని జిడ్డు కృష్ణ మూర్తి అన్నట్లు, కుల్లర్స్ తన జీవిత కాలమంతా సాంఘిక నియమాలకు తలవంచని తెగింపుతో, తన జెండర్ పరిమితులను సవాలు చేస్తూ  బ్రతికారంటారు. 

తీరా పుస్తకం చదివాక దీన్ని సినిమాగా కూడా తీశారని తెలిసింది. సాధారణంగా పుస్తకం చదివేస్తే మళ్ళీ సినిమా చూసే సాహసం చెయ్యను. ఆ చదివిన అనుభూతి ఖచ్చితంగా పాడవుతుందని గట్టి నమ్మకం. కానీ హీరో, హీరోయిన్లు మార్లన్ బ్రాండో, ఎలిజబెత్ టేలర్ అని తెలియగానే ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి కలిగింది. మ్యాన్లీనెస్ కి నిర్వచనంలా ఉండే బ్రాండోని 'కెప్టెన్ పెండెర్టన్' పాత్రలో ఊహించుకోవడం చాలా కష్టం. బ్రాండో ఈ పాత్రలో ఎలా ఉన్నాడో చూడ్డానికైనా సినిమా చూద్దామనిపించింది. కానీ ఒకసారి చూశాక సినిమా ప్రభావం పఠనానుభవాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసేస్తుంది కాబట్టి ఈ వ్యాసం రాయడం పూర్తయ్యాకే సినిమా కూడా చూద్దామని నిర్ణయించుకున్నాను.

'గే' అయిన కెప్టెన్ పెండెర్టన్ వ్యక్తిత్వాన్ని గురించి వర్ణిస్తూ, 

He spoke and wrote three languages gracefully. He knew something of astronomy and had read much poetry. But in spite of his knowledge of many separate facts, the Captain never in his life had had an idea in his head. For the formation of an idea involves the fusion of two or more known facts. And this the Captain had not the courage to do.

దైవ భక్తీ, పాపభీతీ ఇవేమీ లేకుండా భోగవిలాసాలతో అనుభవ ప్రధానంగా జీవించడమే ధ్యేయంగా ఉండే లియోనారా, కళాభిరుచి కలిగిన సున్నితమనస్కురాలైన అలిసన్ కు పూర్తి భిన్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. లియోనారా వ్యక్తిత్వం గురించి కుల్లర్స్ ఈ విధంగా రాస్తారు. స్త్రీ వ్యక్తిత్వంలో ఉల్లిపొరల్లాంటి సంక్లిష్టతల్ని గురించి ఇంత సరళమైన వర్ణనలు చదవడం బహు అరుదు.

On the post Leonora Penderton enjoyed a reputation as a good hostess, an excellent sportswoman, and even as a great lady. However, there was something about her that puzzled her friends and acquaintances. They sensed an element in her personality that they could not quite put their fingers on. The truth of the matter was that she was a little feebleminded.

This sad fact did not reveal itself at parties, or in the stables, or at her dinner table. There were only three persons who understood this: her old father, the General, who had worried no little about it until she was safely married; her husband, who looked on it as a condition natural to all women under forty; and Major Morris Langdon, who loved her for it all the more.

భార్య అలిసన్ గురించి మేజర్ ఆలోచనలు "స్తీ ఉనికి మగవాణ్ణి సంతోషపెట్టడం వరకే పరిమితం" అనుకునే ఆనాటి సామజిక స్థితిగతులకు అద్దంపడతాయి, స్త్రీ సహజమైన ప్రవృత్తినీ, అది తనకు సంబంధంలేని విషయంగా నిర్లిప్తంగా ఉంటూ దాన్ని నిర్లక్ష్యం చేసే మగవాడి నైజాన్నీ కుల్లర్స్ ఈ విధంగా వర్ణిస్తారు.

He tried, and succeeded, in looking on her obvious unhappiness as something morbid and female, altogether outside his control.

Then she had burst into tears. That was the sort of thing the Major meant by 'female' and 'morbid'; and it did a man no good to try to figure it all out.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

And Lord! when they were scrambling around those bushes together filling his hat with berries, it had first happened. At nine in the morning and two hours after they met! Even now he could hardly believe it. But what had it seemed like to him at the time? Oh, yes it was like being out on maneuvers, shivering all through a cold rainy night in a tent that leaked. And then to get up at dawn and see that the rain was over and the sun was out again. And to watch the fine looking soldiers making coffee over camp fires and see the sparks rise up into a clear white sky. A wonderful feeling the best in the world!

There are times when a man's greatest need is to have someone to love, some focal point for his diffused emotions. Also there are times when the irritations, disappointments, and fears of life, restless as spermatozoids, must be released in hate. The unhappy Captain had no one to hate and for the past months he had been miserable.

The mind is like a richly woven tapestry in which the colors are distilled from the experiences of the senses, and the design drawn from the convolutions of the intellect The mind of Private Williams was imbued with various colors of strange tones, but it was without delineation, void of form.

He thought of the soldier in terms neither of love nor hate; he was conscious only of the irresistible yearning to break down the barrier between them. When from a distance he saw the soldier resting before the barracks, he wanted to shout to him, or to strike him with his fist, to make him respond in some way to violence.

Wednesday, October 19, 2022

సాహితీ పురస్కారాలు ప్రతిభకి కొలమానాలా ???

[ మార్గరెట్ ఆట్వుడ్ కి నోబెల్ ఇవ్వలేదన్న అక్కసుతో చాలా బయాస్డ్ గా రాసిన వ్యాసం. "సాహితీ విలువల" విషయంలో చూసీ చూడనట్లు పోవాలి అనుకునేవాళ్ళ కోసమూ, ఉదారత , నిష్పక్షపాతం, సహానుభూతి etc etc లాంటివి ఆశించేవారి కోసమూ కాదు.]

Image Courtesy Google

జనాదరణ పొందిన సాహిత్యానికీ ,కొన్ని నిర్ధిష్టమైన సాహితీ కొలమానాలకు లోబడిన సాహిత్యానికీ అనేక అంతరాలుంటాయి. ఒకప్పుడు ఏదైనా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చిన రచన అంటే, ఆ రచనను ఎంపిక చేసే విషయంలో న్యాయనిర్ణేతలు కూడా ఎటువంటి సామాజిక,రాజకీయ వత్తిడులకు లోబడకుండా, ఆ రంగంలో పూర్తి సాధికారత కలిగినవాళ్ళై ఉండేవారు. నేడు ఆ డైనమిక్స్ మారాయి. 

సాహిత్యంతో ఎంత మాత్రమూ సంబంధంలేని పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లో మెలుగుతూ నేటి "సాహితీ విలువలు" రూపురేఖలు మార్చుకుంటున్నాయి. సాహిత్యంలో అభిరుచి లేని వాళ్ళు పుస్తకాల షాపు పెట్టడం అంత మంచి ఆలోచన కాదు, ఇంకాస్త సరళంగా చెప్పాలంటే, వండేవాడికి తినడం ఇష్టం అయితే వంట వేరే విధంగా కుదురుతుందన్నమాట. ఇదే రూలు పెట్టుబడిదారీ వ్యవస్థకు "కళాపోషణ" విషయంలో కూడా వర్తిస్తుంది, వర్తించాలి. కళాపోషణకు ఉండాల్సిన అర్హతలు కళల పట్ల ఇష్టమూ, అంతకుమించి గౌరవమూను. కానీ ఇప్పటి పెట్టుబడిదారీ విధానం పాపులారిటీకీ, మార్కెటింగ్ విలువలకూ, అమ్మకాలకూ ఇచ్చే ప్రాధాన్యత "జనాదరణ" పరిథులకు లోబడని మంచి సాహిత్యానికి ఇవ్వడం లేదనిపిస్తుంది. నేటి సాహితీ పురస్కారాలు అనేక పైరవీలను దాటుకుని, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రశ్నించకుండా, వారు ఆడిస్తున్నట్లల్లా ఆడే లేదా వారికి కొమ్ముకాసే రచనలకూ, రచయితలకూ మాత్రమే పరిమితమవుతున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను సవాలు చేసేదేదైనా ఈ కాలంలో మంచి సాహిత్యం కాదు. అటువంటి సాహిత్యాన్ని విస్మరించడం వాళ్ళ మనుగడకు అవసరం. నిజానికి ఇది కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ రోజుల్లో "పాపులర్ ఒపీనియన్" ని ప్రశ్నించే ఏ సాహిత్యానికైనా  ఉనికి లేకుండా చెయ్యడమనేది తన ఉనికిని కాపాడుకోడానికి "మెయిన్ స్ట్రీమ్" సమాజానికీ, సాహిత్యానికీ, సంస్కృతికీ కూడా చాలా అవసరమైన విషయం. ఒకప్పుడు సాహితీ పురస్కారాలు కొంతవరకూ వీటన్నిటికీ అతీతంగా ఉండేవి (????) . నేటి తీరు పూర్తిగా వేరు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కారణంగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న కళారంగానికి పరోక్షంగానైనా పెట్టుబడిదారీ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నిర్వివాదాంశం అనే  విషయాన్ని ప్రక్కన పెడితే, కళారంగంలో క్రియాశీలకంగా వ్యవహరించే విషయాల్లో సైతం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రత్యక్షంగా వేలుపెట్టడం హర్షణీయం కాదు. మోనోపొలీ రాజ్యమేలుతున్న అన్ని రంగాల్లోనూ, కనీసం మనిషిని మిగతా జీవులతో వేరుచేసే కళారంగాన్ని మినహాయిస్తే బాగుండునని అనుకోని సందర్భమూ లేదు. 

ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత అన్నే ఎర్నాక్స్ పుస్తకాలు  రెండేళ్ళ క్రితం చదివాను, వాటిల్లో "The Years", "I Remain in Darkness" రెండూ తీవ్రంగా నిరాశచెంది సగంలో వదిలేసినవే. జాడీ స్మిత్ , అడిచే , మోష్ఫెగ్ లాంటి వాళ్ళను తలపించే ఎర్నాక్స్  శైలి చాలా సాధారణమైనదిగా ( flat narration ) అంతకుమించి ఎటువంటి ప్రత్యేకతా లేనిదిగా అనిపించింది. వాస్తవికతతో కూడిన ఒక మెమోయర్ గానీ, జర్నల్ గానీ రాయడానికీ, సృజనాత్మకతతో మెదడుకు పదును పెడుతూ కథ చెప్పడానికీ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎర్నాక్స్ నైపుణ్యం మొదటి దానిలో కనబడుతుంది (నిజానికి దానికి మాత్రమే పరిమితమవుతుంది ). ఇటువంటి సాధారణ రచనలు చెయ్యడం కంటే సైన్స్ ఫిక్షన్ వంటి క్లిష్టమైన జానర్స్లో రచనలు చెయ్యడం కత్తిమీద సాములాంటిది. కానీ నోబెల్ పానెల్ సో కాల్డ్ "సాహితీ విలువల" కొలమానాల్లో అటువంటి సైన్స్ ఫిక్షన్ ను ఇన్నేళ్ళుగా విస్మరిస్తూ వస్తుండడం చాలా నిరాశ కలిగించే విషయం. ఉర్సులా లెగైన్ వంటి రచయిత్రులు మరణానంతరమే ఈ మాత్రం గుర్తింపుకైనా (?) నోచుకున్నారు. ఇక ప్రస్తుతం జీవించి లేని వాళ్ళను గురించి వదిలేస్తే సమకాలీన రచయిత్రులలో కెనెడియన్ రచయిత్రి మార్గరెట్ ఆట్వుడ్ వంటి వారిని ప్రక్కన పెట్టి ఎర్నాక్స్ కు పట్టంకట్టడం మాత్రం అస్సలు జీర్ణించుకోలేని విషయం.

ఎర్నాక్స్ ప్రతిభను తక్కువ చెయ్యడమో, లేదా పూర్తిగా తీసిపారెయ్యడమో ఈ వ్యాసం ఉద్దేశ్యం కానప్పటికీ, ఆవిడ నోబెల్ పురస్కారానికి అర్హురాలేనా అన్నది మాత్రం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ మంచి రచయితా, లేదా చెడ్డ రచయితా అనే ప్రశ్న కంటే ఎర్నాక్స్ వంటి జనాదరణ పొందిన ఒక సాధారణ రచయిత్రికి నోబెల్ పురస్కారం కట్టబెట్టడం పట్ల ఆశ్చర్యంగానే అనిపించింది. నిజానికి ఇలా ఆశ్చర్యపోవడమూ కొత్తేమీ కాదు. పాల్ బియట్టి "ది సెల్ ఔట్ " కి బుకర్ ప్రైజు వచ్చినప్పుడూ , ఆండ్రూ సీన్ గ్రీర్ "లెస్" కి పులిట్జర్ వచ్చినప్పుడూ, చాలా ఓవర్ రేటెడ్ రచయిత హరుకి మురాకమీకి ఫ్రాంజ్ కాఫ్కా ప్రైజ్ వచ్చినప్పుడూ, పాట్రిక్ మొదియానోకి నోబెల్ వచ్చినప్పుడూ, సిల్వినా ఒకంపో, మాక్సిమ్ ఒసిపోవ్ వంటివారి కథల్ని ఆకాశానికెత్తుతూ NYRB క్లాసిక్స్ లో చేర్చడం చూసినప్పుడూ (సిల్వినా ఒకంపో కేవలం బోర్హెస్ కు ఆప్తురాలూ, Adolfo Bioy Casares కు సతీమణీ కావడం వల్లే ఆమెకా పేరు వచ్చిందన్నది ఆవిడ ఓవర్ రేటెడ్ కథలు చదివిన వాళ్ళెవరైనా మారుమాట్లాడకుండా ఒప్పుకునే విషయం) ....  ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటా బయటా కూడా సాహితీ పురస్కారాల విషయంలో నోరు వెళ్ళబెట్టిన సందర్భాలు కోకొల్లలు.

ఏదేమైనా ఇటువంటి పురస్కారాలూ, సన్మానాలూ, సత్కారాలూ తాత్కాలికంగా రచయితలను లైమ్ లైట్ లోకి బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టినా, వీటన్నిటికీ అతీతంగా కేవలం తమ టాలెంట్ తో పాఠకుల మనసుల్లో శాశ్వతంగా తిష్ఠవేసుకుని కూర్చునే రచయితలు కొందరుంటారు. ఆ కుర్చీలు కదిలించడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. అన్నట్లు హరుకీ మురాకమీ రచనల్ని అబిడ్స్ లో కేజీల లెక్కన అమ్మేస్తున్నారు. ఎప్పుడో ఒకటీ రెండూ ఆయన పరమ డిప్రెస్సింగ్ నవలలు తప్ప మిగిలినవి చదవలేదు గనుక చాలా చవగ్గా వస్తున్నాయని నేను కూడా ఒక కిలో కొని తెచ్చుకున్నాను. బహుశా మరో ఏడాదికల్లా ఎర్నాక్స్ పుస్తకాలు కూడా అదే చోట దొరుకుతాయి. అప్పుడు కొనుక్కుని చదువుదామనుకుంటున్నాను.

Friday, October 7, 2022

Fragments of an Infinite Memory: My Life with the Internet - Maël Renouard

టెక్నాలజీకి దూరంగా మా బాల్యం గడిచిందని చెప్పుకునే ఆఖరి తరం బహుశా మనదే. సాంకేతికపరిజ్ఞానం విస్తృత రూపం దాల్చక మునుపు ,కనీసం సగం జీవితం ఇంటర్నెట్ లేకుండా బ్రతికిన తరం మనది. సాంకేతిక పరిజ్ఞానపు  ఛాయలు లేని బాల్యం ఒక వరం. నేటి తరానికి ఆ అదృష్టం లేదు, పసిపిల్లలు సైతం మారాం చెయ్యకుండా పాలు తాగాలంటే ఆకాశంలో చందమామ సంగతెలా ఉన్నా చేతిలో గాడ్జెట్ లేకపోతే గడవని రోజులివి. సాంకేతిక పురోభివృద్ధిని Bruce Benderson "the end of imagination achieved by the victory of imagination" గా అభివర్ణించినట్లు దీనివల్ల మానవజాతి కోల్పోయిందే ఎక్కువనిపిస్తుంది. ఈ పుస్తకంలో విశ్లేషణలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతాయి. నేటి తరం సాధించినదేమిటో, కోల్పోయినదేమిటో ఇంటర్నెట్ కు ముందూ, తరువాతా తన గత జ్ఞాపకాల తెరలను తొలగిస్తూ వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు ఫ్రెంచ్ రచయితా, అనువాదకులూ Maël Renouard.

ఎంతటి పరిపూర్ణ జీవనమైనా చివరకు మనకు మిగిలేవల్లా జ్ఞాపకాలే. కానీ మార్సెల్ ప్రూస్ట్ లా నేటి తరం తమ జ్ఞాపకాలని వెతుక్కునే చోటు మానవ మస్తిష్కం మాత్రం కాదు, ఇంటర్నెట్. 

Who hasn’t gone on the internet looking for past loves and friends not seen for years? Time lost in search of lost time.

We will do a Google search exactly as we go looking through our memories, by a simple act of the mind which, like memory, will require neither the hand nor the eye as intermediary. We will use this inner Google to look up words and phrases in a foreign language. We will know the name of the tree, the history of the public monument, the biography of Casimir Delavigne, as soon as our sight data is recorded and processed. And this is not all, by any means. Each thing will deploy itself beneath our gaze in its monadic singularity, that is, in the infinity of its nature, its history, its relations to the entire world. The memory of which our brain is the organ will no longer be an individual memory.
Image Courtesy Google

రచనలో ఇంటర్నెట్ కి ముందూ, తరువాతా తన జీవితానుభవాల మధ్య వైరుధ్యాన్ని ఉదాహరణాలతో సహా మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు రెనౌర్డ్. వాస్తవాన్ని ఇంటర్నెట్ ఎంత వక్రీకరిస్తోందో చెబుతూ అనేక విషయాలు చర్చకు పెట్టారు. వర్చ్యువల్ ప్రపంచానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ  అందరిపట్లా కలుపుగోలుతనం, ప్రేమ చూపించేవాళ్ళు 90 % సమయం మొబైల్లోనే గడుపుతూ తన కుటుంబాన్నీ, తమ ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చెయ్యచ్చు. 24 గంటలూ  స్క్రీన్ల ముందు కూర్చుని ఆదర్శ జీవితాన్ని గురించి బోధించేవారు స్క్రీన్ వెనుక మానసిక వ్యాధులతోనో, ఒబెసిటీతోనో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, పైకి నవ్వుతూ సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేసేవాళ్ళు వాస్తవంలో డిప్రెషన్ తో బాధపడుతూ ఉండవచ్చు, తమవి కాని రాతల్ని తమవిగా చెప్పుకోవచ్చు, తమది కానీ భావజాలాల్నీ, వ్యక్తిత్వాల్నీ మొహానికి మాస్కుల్లా తొడుక్కోవచ్చు, వాస్తవంలో పొసగపోయినా తమది అన్యోన్య దాంపత్యం అని బహిరంగ ప్రేమలు ప్రదర్శించి ప్రపంచాన్ని నమ్మించవచ్చు. ఇలాంటివెన్నో. ఇక్కడ కోరుకున్న మాస్కు తక్షణం సిద్ధం. 

We can live in many worlds, in many languages. There is an internet Pentecost that makes us speak in tongues and will soon cast aside, among other terrors of the past, the dystopia of a world dominated by Anglophone monolingualism.

“Basically, if I had to sum up my Facebook experience, I’d say it’s the continuous revelation of the idiocy of intelligent people. For a long time, I found it hard to believe what I took to be a nasty myth. But the scales have fallen from my eyes. All I have to do is log in, and the horrific certainty forces itself upon me again, with ever more crushing strength. This spectacle fascinates and terrifies me at the same time; I can watch it for hours, silently and invisibly; by the end, I find myself plunged into an emptiness from which I can hardly rise.”

గాంధీ కొటేషన్స్ పోస్ట్ చేస్తే సత్యవంతులనీ, దేవుడి ఫోటోలు పెడితే నిష్ఠాగరిష్టులనీ ఇలా వాస్తవానికి భిన్నమైన అనేక ప్రొజెక్షన్స్ కి నిలయం నేటి ఇంటర్నెట్ అంటారు రచయిత. ఇంటర్నెట్ వాడకం వల్ల కొత్తగా నిర్వచనాలు మార్చుకుంటున్న మన నైతిక విలువలు కపట సమాజాలకి అనుకూలంగా రూపొందినవి. ఇక్కడ మన ఆలోచనలేమిటనేదాని కంటే ,మనం ఏం మాట్లాడుతున్నామన్నదే ప్రధానం. లోపల ఎంత విషపూరితమైన అలోచలున్నా పైకి గొప్పగా  మాట్లాడుతూ తమను తాము ఉత్తముల్లా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది వర్చ్యువల్ ప్రపంచంలోనే. వ్యక్తిగతంగా మనమేమిటి అనేదానికంటే మనం ప్రపంచానికి ఏం చూపిస్తామనేదే ఇక్కడ ముఖ్యం. నిజానికి ఇది మన విలువను నిర్ణయించే కొలమానం కాదు. ప్రపంచానికి మనం అందించే ఒక కపటమైన చారిత్రాత్మక వర్ణన అంతే. 

This way of doing things would be too contrary to the material’s inner tendency: the internet abhors a nonentity and hungers for exhibition; exhibition is the element in which the internet burns the victims upon which it feeds each day. The simplest thing to do is to follow this tendency by leaving one’s prey a prisoner to the web; for the difficult thing today isn’t to become known but rather to be forgotten.

స్టాలిన్ శకంలో ఒక మనిషిని వదిలించుకోవాలంటే అతడి ఉనికికి సంబంధించిన ప్రతీ చిహ్నాన్నీ సమూలంగా చెరిపేసేవారట. ఈరోజు అదే పని  అతడి ఉనికిని ఒక్కంగుళం కూడా వదలకుండా పబ్లిక్లో పూర్తిగా ప్రదర్శనకు పెట్టడం ద్వారా జరుగుతోందంటారు రెనౌర్డ్.

ప్రతీ తరమూ కాలగతిలో కలిసిపోతున్న తమ గతాన్ని తలుచుకున్నట్లే రెనౌర్డ్ కూడా అదృశ్యమైపోతున్న సంస్కృతిని గుర్తుచేసుకుంటారు. వాస్తవాన్ని ఏమార్చే వర్చ్యువల్ డిస్టోర్షన్స్ ప్రక్కన పెడితే , సాంకేతికవిప్లవం కారణంగా నేటి తరానికి పూర్వపు తరం అపురూపంగా భావించే కొన్ని జ్ఞాపకాలు పూర్తిగా తెరమరుగైపోతున్నాయి. మొబైల్లో టైమ్ చూడడం అలవాటై చేతికి గడియారాలు మాయమైపోతున్నాయి. పేజీలను అపురూపంగా చేత్తో తడుముతూ పుస్తకం చదవడం, ఆత్రంగా ఎదురుచూస్తూ అందుకున్న ఉత్తరాన్ని ఇంకు వాసన గుభాళిస్తుండగా చదువుకోవడం, చేత్తో ఉత్తరాలూ, పద్దులూ రాయడం లాంటి జ్ఞాపకాలు మున్ముందు తరాలకి ఉండే అవకాశం లేదు. ఫోటోని స్టూడియోలో కడిగించి భద్రంగా ఆల్బమ్ లో దాచుకుని ఒక అపురూప జ్ఞాపకంగా మిగుల్చుకునే అవకాశం వీళ్ళకి లేదు. కుప్పలుతెప్పలుగా ఇంటర్నెట్లో క్షణానికోసారి కనిపించే ఫోటోలు చూసినప్పుడు మునుపటి తరానికి కలిగిన నోస్టాల్జియా భావన కలగకపోవచ్చు. 

Too often, I’ve resorted to Proust’s lovely excuse in his letter to Madame de Caillavet, whose husband had fallen in battle: ‘I’ve thought so much about that daughter of whom he was so proud, your dear Mademoiselle Simone, that I don’t even know anymore if I actually wrote to her, so many times have I written her in thought.’ The time has come for the inner, post-digital internet to deliver us from this gap between thought and act, mind and hand—one of the last vestigial features that still bind us to the tragedy of our original condition. The time has come for us to be able to write and send messages within our mind, without having to write them down on a physical device, with the help of our fingers.”

ల్యాండ్ లైన్ లో ఫోన్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న కాగితాలపై గీసే గీతలూ,రాతలూ (టెలిఫోన్ డూడుల్స్) వాళ్ళకి ఉండవు, ఇప్పుడు కాగితం కనిపించడమే గగనం. కాగితంపై ఏదైనా రాసి పోస్ట్ చెయ్యాలంటే మనకి అదొక గందరగోళంతో కూడిన వ్యవహారం. ఎవరి జేబులోనూ పెన్ను ఉండదు, అందుబాటులో కాగితం దొరకదు. పోస్ట్ అందుతుందో లేదో అనే భయం ఒక్క క్లిక్ తో అవసరమైన సాప్ట్ కాపీస్ అటాచ్ చేసి పంపగలిగే ఈమెయిల్ సౌకర్యాన్ని అందిపుచ్చుకునేలా చేసింది. ఇవన్నీ మెల్లిగా దైనందిన జీవితంలో నుంచి మనకు తెలీకుండానే ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతున్నాయి. డెఱిడా ముందే ఊహించి చెప్పినట్లు ప్రస్తుత తరానికి ఉన్న 'రియాలిటీ' వర్చ్యువల్ రియాలిటీ మాత్రమే. మనమందరం ఇంటర్నెట్ సాలెగూడులో భ్రమలను వాస్తవాలనుకుని బ్రతుకుతున్నాం. ఇంటర్నెట్ వినియోగం వల్ల ఎదుర్కుంటున్న ఇటువంటి పరిణామాలన్నీ ఈ రచనలో చిన్న చిన్న కథల్లానూ, ప్రోజ్ పీసేస్లానూ చెప్పుకొస్తారు రచయిత.

Before, I used to know in the blink of an eye where to find any one of my innumerable books; now it’s much more difficult, just as my relation to all things I’m not connected to on the internet has become more difficult. On Google, I can’t ask where I put my keys; I can’t act upon them. I can’t summon my books to my side. More and more actions are accomplished entirely on the internet; those that still require physical action have become strange and nearly impossible. If someone asks me to fill out forms and send them by mail, I become disoriented. It isn’t familiar to me anymore.

ఇక ఇంటర్నెట్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల్లో మన దృష్టిని దాటిపోయే అనేక విషయాలను రచయిత ఏకరువు పెడుతుంటే ఆశ్చర్యంతోపాటు ఒకింత భయం కూడా కలగక మానదు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రదర్శనలు మనుషుల మధ్య భావజాలాల సంఘర్షణలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ప్లేటో భయపడినట్లుగానే  "మున్ముందు కాలంలో రచనలు తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడతాయి, అవి రాసిన రచయితలు అవి తమవని కనీసం డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు" అన్నమాటల్ని ఇంటర్నెట్ ప్రతి క్షణం రుజువు చేస్తూనే ఉంది. ప్రతీదీ ఆన్లైన్ లో లభ్యమవ్వడం వల్ల ప్లాగియారిజం పెచ్చుమీరింది. పాపులారిటీ కోసం ఏది ఎక్కడ బాగా అమ్ముడుపోతుందో గమనించి తమవి కాని రచనల్ని తమవని చెప్పుకోవడమే కాక, భావ చౌర్యంతోబాటు చివరకు తమవి కాని గుణగణాల్నీ, వ్యక్తిత్వాన్నీ కూడా తమవని మోసం చేసే స్థాయికి దిగజారింది నేటి సమాజం. 

“I believe,” says Jacques Derrida in Ghost Dance, “that the future belongs to ghosts, and that modern technologies, of images, cinematography, telecommunications, etc., augment the power of ghosts.”

ప్రతీ చిన్న విషయాన్నీ ఇంటర్నెట్లో పెట్టడం ద్వారా బహుశా మన తర్వాతి తరం మనకంటే ఎక్కువ జ్ఞాపకాలే మూటగట్టుకోవచ్చు. ఏదేమైనా మన మస్తిష్కం లోపలి పొరల్లోని జ్ఞాపకాలు మన తదనంతరం శూన్యంలోకి అదృశ్యమైపోయినట్లు వారి జ్ఞాపకాలు అనంతంలోకి శిధిలమైపోతాయి.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు, 

Lodge’s world is still an exhausting world. A world in which it is possible to run in vain. A world in which a person can disappear forever. A world in which you always have to hope for the grace of coincidences. Lodge multiplies such coincidences wittingly and abundantly. They are part of a network of allusions that link his novel to traditional narrative forms, at times picaresque, at times Arthurian. The world of literature itself turns out to be a small world, a world of winks between old friends.

Deleuze was struck by how Bergson said in Matter and Memory that we plunge into the virtual past in order to find our memories there and bring them to the surface of consciousness, as upon the surface of the ocean. The internet has given an outward form to this process. One day, it will return to the inwardness from which it came.

Proust established a clear distinction between voluntary and involuntary memory, a distinction which is partly demolished by our wanderings on the internet, the way they unfold in the recollection machine. On the internet, acts of voluntary memory often reach further than their initial goal, and it isn’t unusual for them to confront us by chance, unexpectedly, with buried swaths of our past existence; epiphanies of involuntary memory draw the digital wanderer into new searches, where he seeks—voluntarily, now—to get his hands on another dose of the ecstatic recollection that so intensely transported him the first time.

Each of our five senses opens onto a realm as vast as the world; its limits are the limits of the world. The internet is the world, but it is not only the world (just as the world is not only images, smells, or sounds). The internet becoming an organ of sense is inscribed in its idea.

ఏకాంతానికి ఒకప్పుడు ఉండే అర్థాలు వేరు, ఇప్పుడు ఏకాంతం ఒక 'కాన్షియస్ ఛాయిస్' అయ్యిందనే విషయాన్ని రచయిత చెప్పిన తీరు :  

Interiority is no longer master in its own house. The world has broken in and crowded it out. In the past, I only used to be able to concentrate at home, in silence and solitude. That’s exactly what I have to get away from now if I want to have any hope of putting the hours of a day to good use; otherwise, I look up everything that crosses my mind on the internet; the brief distractions that normally punctuate a sustained effort take on outsize proportions; time slips through my fingers, and I watch myself waste the hours as I take long puffs of this opium. Physical space—definitely less teeming—is where I take refuge to regain my faculty for concentration. On a café terrace, the sound of motors, the merry-go-round of passersby, and even the neighboring conversations and the background music that used to irritate me, all these simple monotonous, regular, predictable things have become far more solid anchors for my attention than the solitude of an office or a room in which I know the infinite lies in reach of my laziness, musings, or lack of willpower.

ఆధ్యాత్మికతకు మున్ముందు మారబోయే నిర్వచనాలు గురించి ఈ పుస్తకంలో  రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Spiritualism: I believe that matter is an aspect of mind; that mind is the future of matter; that matter will not hold out against its complete manipulation by mind. Or to put it otherwise: matter and mind are one and the same, but this unity realizes and reveals itself through time.

Techno-spiritualism: Mind is not ethereal; it does not move upon the waters. It exists only in those devices that trace at once the actuality of its limits and the potential of its unlimited expansion. The internet is not the mind, but it is “of” the mind. This spiritualism is not a humanism propped upon the current state of our biological being.

Google Earth and Facebook have rung in the revenge of simple hearts who believe in real presence. The internet has vindicated the faith of the ignorant who imagine that knowledge is integral—that to know, is to know everything

The quantitative evaluation of academic talent, become obsessive, encourages publications that merely serve to add a line to a résumé and that no one reads. Who, for that matter, could read them without wasting a life? Textual inflation is now close to exceeding the cognitive capacities of a human life span.

Jacques Derrida, 1967 లో గ్రమటాలజీ అనే రచనలో “the end of the book” గురించి మాట్లాడినప్పుడు మున్ముందు జరగబోయే ఇంటర్నెట్ ఆవిర్భావం గురించి ఆయనకు తెలియదు. 

The comparison also suggests that books will never completely vanish, just as horses are still around, in equestrian clubs, where they are objects of aesthetic worship and enjoy a level of care whose technical precision verges upon a science. Books will undoubtedly meet with a similar fate, their sphere of existence limited and reserved—with all the advantages this entails—to leisure and art. They will also find themselves in the company of sailboats.

Debord spoke of the diffuse spectacle (liberal democratic) and the concentrated spectacle (Soviet). Perhaps we should invent the category of the esoteric spectacle (digital) in which life hands itself the mirror of a false reconciliation.

I had the feeling of truly understanding what it means to be able to immediately “share” with “friends” the photographs of the places in which we find ourselves. The contradiction between solitude, as a condition of aesthetic experience, and communication, as the intimate aim of this experience, was suddenly resolved with an efficacy that, a few years earlier, would have seemed unimaginable. I looked at my camera; I nearly pushed the “share” button, as if this had become an obvious, natural, even necessary gesture; and I held back my finger.

Saturday, October 1, 2022

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్

శరన్నవరాత్రుల కుంకుమ పూజల హడావుడి మధ్య శుక్రవారం రానే వచ్చేసింది. చిరుజల్లులు కురుస్తున్న సాయంత్రాల్లో వేడి వేడి కాఫీతో బాలగోపాల్ సాహితీ వ్యాసాలు మరింత రుచిగా ఉన్నాయి.☕📖 కేఫ్ లో కొందరు హుషారుగా కబుర్లలో మునిగిపోయి కనిపిస్తే, కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు, ఒక కుర్రాడు మాత్రం ఒక మూలన ప్రపంచానికి దూరంగా పుస్తకంలో లీనమైపోయి చదువుకుంటూ కనిపించాడు,కేరళ ప్రకృతి సౌందర్యమంత అందమైన దృశ్యం చూసినట్లనిపించింది. అలా ఎవర్నైనా, ఎక్కడైనా చూసినప్పుడు వాళ్ళని పనిగట్టుకుని డిస్టర్బ్ చేసి, "ఏం చదువుతున్నారు ? " అని అడగడం అలవాటు. 🫣😁

Copyright A Homemaker's Utopia

కొన్ని రోజులుగా కె.బాలగోపాల్ సాహితీ ప్రపంచంలో ఉన్నాను. ఈ మధ్య ఎప్పుడూ బ్యాగ్ లో ఉండే రెండు,మూడు పుస్తకాల్లో ఆయన పుస్తకం కూడా  ఒకటి. బాలగోపాల్ నాకు ఒక సోషల్ ఆక్టివిస్ట్ అని మాత్రమే తెలుసు. కొన్నినెలల క్రితం ఒక పాత పుస్తకాల షాపులో అనేక పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ప్రత్యేకంగా షెల్ఫ్ లోంచి పలకరించింది. (పుస్తకాల మీద కవర్ డిజైన్ ఎంత ముఖ్యమో కదా ! కవర్ నచ్చకపోతే దృష్టిని దాటిపోయే మంచి పుస్తకాలెన్నో .) అట్టమీద ఎంతో సాదాసీదాగా చేతులు కట్టుకుని కళ్ళజోడు పెట్టుకున్న మొహంలోంచి చిరునవ్వు నవ్వుతున్న ఆయన ఫోటో ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇక అసలు విషయం, "సాహిత్యంపై బాలగోపాల్" అన్న టైటిల్ నన్ను మరింతగా ఆకర్షించింది. ఒక సామాజిక కార్యకర్త సాహిత్యం గురించి ఏమని ఉంటారో తెలుసుకోవాలనే కుతూహలంకొద్దీ ఈ పుస్తకం కొన్నాను. ఒక పూర్తిస్థాయి సాహిత్యకారుడు కూడా ఇంత లోతైన వ్యాసాలు రాయలేరేమో అన్నంతగా దేశవిదేశీ సాహిత్యంపై ఆయనకున్న పట్టు అబ్బురపరిచింది. ఇది ఒక్కసారిగా చదివేసి ఆకళింపు చేసుకునే రచన అస్సలు కాదు. ఆయన వ్యాసాలు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకునేలా ఉన్నాయి. ఈ ఏడాది కొన్న అనేక పుస్తకాల్లో జీరో ఎక్స్పెక్టేషన్స్ / బ్లాంక్ ఇంప్రెషన్ తో రచయిత పూర్వాపరాలు ఏమాత్రం తెలీకుండా మొదలుపెట్టిన ఈ రచన రూపాయికి పదింతలు విలువైనదని కొన్ని పేజీల్లోనే అర్థమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ రచన ఒక నిధి.📖📚

"గాలివస్తే కదిలిపోయేటట్లుండే ఆయన తెలుగుదేశంలో తీవ్ర నిర్బంధపు తుఫానును సైతం తట్టుకుని ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా ఉన్న పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించారు. లెక్చరర్ గా కాకతీయ యూనివర్సిటీలో గణితం బోధించినా ఆర్థిక, సామజికశాస్త్ర, సాహిత్య విమర్శనాది ఉపరితల రంగాల్లో డాక్టర్ కె. బాలగోపాల్ స్పృశించని అంశం లేదు. ఎటు నడిచినా రెండడుగులు వేయలేని రేకుల షెడ్డులో ఆయన ( హైదరాబాద్) నివాసం."

ఇవన్నీ చదివి అసలు ఎవరీయన అని ఆతృతగా వికీ చూస్తే తెలిసిన మరో విషయం ,ఆయన పూర్తిపేరు కందాళ బాలగోపాల్ అని.

పుస్తకంలో పేలిన అనేక డైనమైట్లలో మచ్చుకి ఇదొకటి : ❤️💥🔥

"1930 దశకంలో శ్రీశ్రీ వరుసపెట్టి ఎన్నో శక్తిమంతమైన కవితలు రచించాడు. కుళ్ళు కంపుకొడుతున్న ఫ్యూడల్ సంస్కృతిని చీల్చి చెండాడే పదజాలంతో యువతను కేవలం మేల్కొలిపే విధంగానే కాక, వారిని ప్రేరేపించేలా ఎన్నో కవితలు రాశాడు. శ్రీశ్రీ తొలి రోజుల్లో రాసిన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించడం మన దేశస్తులకు అసాధ్యం. వలస పాలకులు మనకు నేర్పిన ఇంగ్లీష్ కేవలం విజ్ఞాపన పత్రాలను తయారుచెయ్యడానికి పనికొచ్చేదే కానీ, డైనమైట్ ధ్వనిని అనువదించడానికి పనికి వచ్చేది కాదు. స్వయంగా శ్రీశ్రీయే భారతదేశంలోని తెలుగేతరుల కోసం తన కవిత్వాన్ని అనువదించడానికి ప్రయత్నించి, విఫలమయ్యాడు. శ్రీశ్రీ కవిత్వం అనువాదానికి లొంగకపోవడానికి ముఖ్య కారణం ఆయన విరివిగా వాడే హిందూ పురాణ ప్రతీకలు. దీని కారణంగా వామపక్ష విమర్శకులకూ ఆయనకూ మధ్య తరచూ సంవాదాలు సాగుతూండేవి కూడా. "పుడమితల్లికి పురిటినెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి, యముని మహిషపు లోహ ఘంటలు, నరకలోకపు జాగిలమ్ములు, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది ,ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరించింది" , మొదలైనవన్నీ ఇలాంటివే. ఆయన సుప్రసిద్ధ కవితా సంకలనం 'మహాప్రస్థానం' శీర్షిక కూడా మహాభారతం చివర్లో పాండవులు స్వర్గానికి చేసిన ప్రయాణాన్ని సూచించేదే."

Tuesday, September 27, 2022

In the Margins: On the Pleasures of Reading and Writing - Elena Ferrante

ఎవరైనా రచయితల్ని రచనా వ్యాసంగం గురించి కదిపినప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చెయ్యడం చూస్తూ ఉంటాం. వారెంత బాగా  రాసినా రచనలో ఇంకా ఏదో లోపం ఉన్నట్లూ, పూర్తిగా తన ఆధీనంలో లేని పద్ధతిలో రచన రూపొందినట్లూ భావిస్తూ ఉంటారు.

"ఆ కథ తనకు తానే చెప్పుకుంది."

"ఆ పదాలు అలా అలవోకగా ఆ వాక్యాల్లో ఇమిడిపోయాయి."

"ఆ పాత్ర తనకు తానుగా రూపొందింది."

ఇలా ఆ కథ తాను రాయనట్లూ, తనలో ఉన్న మరో మనిషెవరో రాసినట్లూ అనడం తరచూ వింటూ ఉంటాం. ఒక రచన ప్రాణంపోసుకునే క్రమంలో తనకు ఎదురైన అనుభవాల్నీ, సంక్లిష్టతల్నీ 'In the Margins' అనే రచనలో చెప్పుకొచ్చారు 'ది మిస్టీరియస్' ఎలెనా ఫెరాంటే. ఈ రచనను ఆన్ గోల్డ్స్టయిన్ ఆంగ్లంలోకి అనువదించారు. 

Image Courtesy Google

"ఓనమాలు నేర్చుకునే తొలినాళ్ళలో ఎలిమెంటరీ పాఠశాలల్లో రాయడం నేర్పించేటప్పుడు నోటు పుస్తకాల్లో తెల్లకాగితాన్ని నిర్వచిస్తూ నల్లని అడ్డగీతలతోబాటుగా కుడివైపూ, ఎడమవైపూ రెండు ఎర్రని మార్జిన్స్ కూడా ఉండడం గుర్తుండే ఉంటుంది. ఆ గీతల్లో ఎరుపు రంగు వాటి పరిధిని దాటి రాస్తే శిక్షపడుతుందని విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లుంటుంది. ఒక స్థాయి వరకూ ఆ పరిధుల్ని గౌరవించినా రచనలో మెళకువలు నేర్చుకునే కొద్దీ ఆ ఎర్రని సరిహద్దుల్ని దాటకుండా రాయడం వీలవుతుందా ? " 

అని పాఠకుల్ని ప్రశ్నిస్తారు రచయిత్రి ఎలెనా ఫెరాంటే. ఇక్కడ ఆ ఎర్రని గీతల్ని రచయిత్రి మెటఫోర్లుగా వాడారని ప్రత్యేకం చెప్పనక్కర్లేదనుకుంటా ! ఈ ప్రశ్నకు సమాధానం కూడా పుస్తకంలో మరికొన్ని పేజీల తరువాత మెక్సికన్ కవి María Guerra  కవితను ఉదహరిస్తూ ఆమే చెబుతారు.

I lost a poem.
Already written
And ready on the page
To put in the form of a book
I looked in vain.
It was a poem
With a vocation for wind.

This is precisely what happens to our efforts to write: the words are ready para formar el libro, says María Guerra, and yet they won’t stay in the form, they overflow the margins, get lost in the wind.

ఇటాలో స్వెవో గొప్ప రచనల్లో ఒకటిగా పరిగణించే Zeno’s Conscience లో కథానాయకుడు 'జీనో కోసినీ' రాయడం గురించి ఇలా రాస్తారు.

"తినడం పూర్తయ్యాకా సౌకర్యవంతంగా నా మెత్తని కుర్చీలో కూర్చుని నా చేత్తో  పెన్సిలూ,చిన్న పేపరూ పట్టుకున్నాను. ఏ అక్కరకూ ఆస్కారంలేని మనసుతో నా కనుబొమ్మలు ముడివీడిపోయాయి. 'నా' నుండి వేరుపడుతూ పైకీ క్రిందకీ ఎగసిపడుతున్న నా ఆలోచనలకు నేను ప్రత్యక్ష సాక్షిగా మారాను. ఇటువంటి ఒక స్వతఃసిద్ధమైన చర్యను చూస్తున్నప్పుడు, ఆ ఆలోచనలన్నీ కూడా నావేననీ, వాటిని గుర్తుపట్టి చేజారిపోకుండా పట్టుకుని కాగితం మీద పెట్టాలనీ నాకు నేను గుర్తుచేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మెల్లగా నా భృకుటి ముడిపడుతోంది, ఈ క్షణంలో అనేక అక్షరాలను కలుపుకుంటూ పుట్టే ప్రతీ పదమూ గతాన్ని తుడిచేస్తూ వర్తమానాన్ని పూర్తి వెలుగులో స్పష్టంగా చూపిస్తుంది."

రచయిత రాసిన విషయాల్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోవడం పాఠకులకు అసాధ్యం అనే విషయం సుస్పష్టం. కాగా రచయితకైనా తనలో పెల్లుబికే ఆలోచనలను యధాతథంగా వ్యక్తీకరించడం సాధ్యమవుతుందా అనే కోణంలో విశ్లేషిస్తూ, రాయడంలో తనకున్న సంకోచాలను పటాపంచలు చేసిన Denis Diderot రచన Jacques the Fatalist and His Master లో ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటారు ఫెరాంటే : 

"ఉన్నదున్నట్లు విషయాన్ని చెప్పు", అని యజమాని జాక్వెస్ ని ఆజ్ఞాపిస్తాడు. దానికి జాక్వెస్ ఇలా సమాధానమిస్తాడు : "అది సులభం కాదు. మనిషంటే అతడికి మాత్రమే ప్రత్యేకమైన వ్యక్తిత్వం, అభిరుచులూ,ఆసక్తులూ,ఉద్వేగాలూ అన్నీ కలిసి ఉంటాయి కదా ? వాటిని అనుసరించి అతను వాస్తవాన్ని కాస్తో కూస్తో ఏమార్చి, దాన్నొక అతిశయోక్తిగానో, లేదా తక్కువ చేసో చెప్పే అవకాశం ఉంటుంది. కానీ మీరు "ఉన్నదున్నట్లు చెప్పు" అంటున్నారు ! ఇంత పెద్ద నగరంలో అది రోజుకి కనీసం రెండుసార్లు కూడా జరిగే అవకాశం ఉండదేమో !  ఇకపోతే శ్రోత చెప్పేవాడికంటే గొప్ప అర్హతలున్నవాడా ? కాదు కదా ! అందుకే ఇంత పెద్ద నగరంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటల్ని వినేవాడు ఉన్నదున్నట్లుగా అర్థంచేసుకునే అవకాశం హీనపక్షం రోజుకి రెండు సార్లు కూడా జరగదు అంటున్నాను." అంటాడు.

జాక్వెస్ మాటలు విన్న యజమాని చిరాగ్గా “నువ్వొకడివి జాక్వెస్ !! ఈ సిద్ధాంతాలు అన్నీ పట్టుకుని వేళ్ళాడితే అందరూ మాట్లాడడం, వినడం ఇవన్నీ మొత్తంగా మానెయ్యాల్సొస్తుంది. అప్పుడు పరిస్థితి "ఏమీ మాట్లాడవద్దు, ఏమీ వినవద్దు, ఏమీ నమ్మవద్దు" అన్నట్లు తయారవుతుంది. నీకు తోచింది నువ్వు చెప్పు, నేను నాకు చేతనైన రీతిలో విని అర్థంచేసుకుంటాను." అంటాడు. 

ఈ కథ తాను రచనకు పూర్తి స్థాయి న్యాయం చెయ్యలేననే భ్రమల్ని తొలగించి పూర్తి స్థాయి రచయిత్రిగా మారడానికి ఎంతో ప్రోత్సాహకరంగా నిలిచిందంటారు ఫెరాంటే.

I had read a lot of books on these subjects, including pointlessly complex passages, and here, plainly expressed, I found some consolation. If every novel I wrote, hefty or slim, turned out to be far from my aspirations—I had boundless ambitions—maybe the reason was not only my incapacity. Telling the real, Jacques emphasized, is constitutionally difficult; you have to deal with the fact that the teller is always a distorting mirror. So? Better to give up? No, the master answers, you don’t have to throw everything away: it’s arduous to speak truthfully, but you do your best.

ఈ పుస్తకంలో రాసే వాళ్ళందరూ చదవడం ఎంత ముఖ్యమో చెబుతూ, చదువరిగా ఏదో పైపైన చదివెయ్యకుండా ఆమె తన రచనల్లో తాను చదివిన విషయాలను ఎలా అన్వయించుకున్నారో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. జాక్వెస్ కథ ప్రేరణగా, రాయడం విషయంలో ఎటువంటి  దిశానిర్దేశమూ లేకుండా ఒక రచయిత్రిగా తాను ఏర్పరుచుకున్న శైలిని తాను సృష్టించిన ముగ్గురు నాయికల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారు ఫెరాంటే.

మొదటి తరహా రచన Troubling Love లో ప్రధాన పాత్ర డెలియా తన భావావేశాలపై పూర్తిగా అదుపు కలిగిన వ్యక్తి. నాగరిక స్త్రీగా, పట్టుదల కలిగిన మనిషిగా కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి తన కథ పరిథిలో సాధికారికంగా వ్యవహరిస్తుంది. కానీ ఆ నియమాలన్నీ ఆ కథ తాలూకు జానర్ తో క్రమేపీ పటాపంచలైపోగా పుట్టిందే ఆమె రెండో నవల 'The Days of Abandonment'. ఈ కథలో ఓల్గా ఒక నాగరికమైన స్త్రీగా, తల్లిగా,భార్యగా కూలిపోతున్న సంసారాన్ని నిలబెట్టుకునే క్రమంలో అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అయినప్పటికీ ఒక దశలో తన మనసు మీద అదుపు కోల్పోతుంది. ఈ వివాహ వ్వవస్థ అనే జానర్ మెల్లిగా ఆమె కళ్ళముందే పేకమేడల్లా కూలిపోగా మరో నవల ఉద్భవిస్తుంది, అదే 'The Lost Daughter'. ఇందులో విడాకులు తీసుకున్న లెడా యుక్తవయస్సులో ఉన్న కూతుళ్ళతో మరో కథలోని  నియమాలకు లోబడి వ్యవహరిస్తుంది.

In these books I muted the idea that I had to describe an “out there” arranged in a narrative order and, without letting it show, had the duty to record it on the great scroll of realistic literature. Instead, I dipped into the warehouse of literary expression, taking out what I needed—different genres, different techniques, effects, and, why not, unpleasant effects—without indicating boundaries between high and low. I moved on not to a narrative voice—no voice, no imitation of voices—but to a female first person who is all writing and, writing, tells how, in certain circumstances, deviations, unexpected jolts, erratic leaps occurred, which had been able to upset the solidity of the chessboard on which she was castled.

డెలియా, ఓల్గా, లెడా : ఈ ముగ్గురు స్త్రీలలో ఉమ్మడిగా ఉన్న అంశం ఏమిటంటే, వాళ్ళు తమ జీవితంలో చేదు అనుభవాల దృష్ట్యా ఎవరినీ నమ్మరు, తమ శరీరంలో తాము ఖైదీలుగా ఉంటారు. వీళ్ళకి బంధువులూ, స్నేహితులు కూడా ఉండరు. గతంలో ఇతరులతో మానవ సంబంధాలు ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఘోరవైఫల్యాన్ని చవిచూస్తారు, అందుకే ఒంటరిగా మిగిలిపోతారు. వాళ్ళకి తమపట్ల కూడా నమ్మకం ఉండదు. అలాగని మానసికంగా భర్తా,ప్రేమికులూ,పిల్లలపై కూడా ఆధారపడరు. వాళ్ళ రూపురేఖలెలా ఉంటాయో కూడా పాఠకులకి తెలీదు. ఈ కారణంగా వాళ్ళ కథల్లో మూలవస్తువు వాళ్ళే. వాళ్ళను గురించి వర్ణించి చెప్పడానికి ఈ కథల్లో వేరే పాత్రలు ఉండవు. కథంతా వారి గళంలోనుండే వింటాము.

Besides, they seem to have come so close to the facts of their story that they don’t have a view of the whole, don’t truly know the meaning of what they say. I wanted them like that. Writing, I rejected conventional distancing. Where they eliminated the distance from their wounds, I eliminated the distance from their suffering. And I confused myself, the author, with the version they gave of the story, and with their isolated situation, so that even I who was writing avoided the role of the other, the external, she who witnesses what really happened.

In Troubling Love and in The Days of Abandonment this self-imprisonment was a conscious aesthetic choice.

That is, this writing is the always random result of how Delia, Olga, and Leda are recorded in the registry office of fictions, and of how I, the author—a fiction forever incomplete, molded by years and years of reading and the desire to write—invent and disrupt the writing that has recorded them. I am, I would say, their autobiography as they are mine.

ఇందులో ఆటోబయోగ్రఫీ / మెమోయిర్ వంటివి రాయడం గురించి రాస్తూ రచయిత్రిగా గెర్ట్రూడ్ స్టెయిన్ శైలిని గురించి ఫెరాంటే రాసిన కొన్ని విషయాలు చాలా ఆసక్తి కలిగించడంతోబాటు నవ్వు కూడా తెప్పిస్తాయి. అవి  చదివాకా చాలాకాలం నుండీ చదవాలనుకుంటున్న 'The Autobiography of Alice B. Toklas' పుస్తకం వెంటనే చదవాలనిపించింది. గెర్ట్రూడ్ ఆ రచనలో అలిస్ పాత్ర వెనక దాక్కుంటూ తన గురించి తాను రాసుకున్న సోత్కర్షను నిజంగా చదివి తీరాల్సిందే ! :) ఏదేమైనా రచయితలు 'బయటపడిపోవడం' ఇష్టం లేనప్పుడూ, సామజిక జడ్జిమెంట్లకు దూరంగా ఉండాలనుకున్నప్పుడూ  రచనల్లో పాత్రలను తెరచాటు చేసుకుని తమ గురించి తాము ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  చెప్పుకోవడంలో తప్పు లేదని కూడా అంటారు ఫెరాంటే. ఆమె  ఉదహరించిన ఈ వాక్యాలు స్వయంగా గెర్ట్రూడ్ కాల్పనిక సాహిత్యమని చెప్పుకున్న (పార్ట్లీ ఆటోబయోగ్రఫీ) రచనలో రాసుకున్నవి : 

A famous passage in which Alice writes about meeting Gertrude for the first time: "I was impressed by the coral brooch she wore and by her voice. I may say that only three times in my life have I met a genius and each time a bell within me rang and I was not mistaken, and I may say in each case it was before there was any general recognition of the quality of genius in them. The three geniuses of whom I wish to speak are Gertrude Stein, Pablo Picasso and Alfred Whitehead."

ఆలిస్ (అంటే గెర్ట్రూడ్) కలవాలనుకున్న ముగ్గురు జీనియస్లలో గెర్ట్రూడ్ స్టెయిన్ ఒకరన్నమాట :)) ఏదేమైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రచనలో ఒక పాఠకురాలిగా, రచయిత్రిగా ఎలెనా ఫెరాంటే మనతో పంచుకున్న అనుభవాలెన్నో. ఇది చదవడం వల్ల రాయడం ఎలా అనే అంశంతోబాటు ఒక రచనను ఎలా చదవాలో కూడా తెలుస్తుంది. రచయితలూ, పాఠకులూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. హ్యాపీ రీడింగ్ :) 

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

This is what upends the traditional relations between invented story, autobiographical truth, and biographical truth, making Stein’s book a great lesson for the “I” who wants to write, surely a more stimulating lesson, today, than what we might get from Hemingway’s books. Ernest’s mistake is to succeed by prudently respecting the rules of an old, well-known game; Gertrude’s virtue is to succeed by sticking to the old, well-known game but in order to disrupt it and bend it to her purposes.

In Notes from Underground, Dostoyevsky has his terrible protagonist say:

We’ve become so estranged that at times we feel some kind of revulsion for genuine “real life,” and therefore we can’t bear to be reminded of it. Why, we’ve reached a point where we almost regard “real life” as hard work, as a job, and we’ve all agreed in private that it’s really better in books.

Writing is, rather, entering an immense cemetery where every tomb is waiting to be profaned. Writing is getting comfortable with everything that has already been written—great literature and commercial literature, if useful, the novel-essay and the screenplay—and in turn becoming, within the limits of one’s own dizzying, crowded individuality, something written. Writing is seizing everything that has already been written and gradually learning to spend that enormous fortune.

Friday, September 23, 2022

Six Characters in Search of an Author - Luigi Pirandello

ఇటాలియన్ రచయిత, నోబెల్ గ్రహీతా లూగీ పిరాండెల్లో రాసిన అనేక నాటకాల్లో 'Six Characters in Search of an Author' అనే నాటకాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సంప్రదాయతకు సవాలు విసురుతూ ఈ నాటకంలో కనిపించే అసంబద్ధమైన శైలే దానికి కారణం. సహజంగా కథల్లో పాత్రలు రచయిత అధీనంలో ఉంటాయి, అవి రచయిత చేతిలో కీలుబొమ్మల్లా నుంచోమంటే నుంచుంటాయి, కూర్చోమంటే కూర్చుంటాయి. కానీ ఈ నాటకంలో పాత్రలు అలాంటి సాదాసీదా పాత్రలు కాదు. స్వతంత్ర భావాలు కలిగిన ఆ పాత్రలు తమకు జీవంపోయగల రచయితను వెతుక్కుంటూ వెడతాయి. ఒక రచయిత తమ కథకు ముగింపునివ్వకుండా మధ్యలోనే వదిలేశారంటూ తమ పాత్రలను తుదకంటా  పోషించే అవకాశం ఇమ్మని ఈ కథలో ఆరు పాత్రలూ ఒక నాటక సంఘానికి వెళ్తాయి. ఇక అక్కడి నుంచీ మూడు భాగాలుగా రాసిన ఈ నాటకం మొదలవుతుంది. ఆ నాటకసంఘ నిర్వాహకుడు వాళ్ళను కథ చెప్పమంటూ తన దగ్గరున్న నటులతో నాటకాన్ని రిహార్సల్ చేయించడం మొదలుపెడతాడు. ఆ ఆరుగురూ తమ కథను ఉన్నదున్నట్లుగా తాము మాత్రమే చెప్పగలమనీ, అది వాళ్ళ raison d'être అంటూ తమ పాత్రలను యధాతథంగా తామే పోషించగలమనీ నిర్వాహకుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోడు.

Image Courtesy Google

ఇక అక్కడినుండీ కథ ముదిరి పాకానపడుతుంది. వాళ్ళ వాస్తవం వేదిక మీదకొచ్చేసరికి నటుల మొహమ్మీది మేకప్ రంగుల్లో కలిసిపోయి పూర్తి సత్యాన్ని కోల్పోయి అర్థసత్యంగా మిగులుతుంది. దీనిపట్ల ఆ పాత్రలన్నీ తీవ్రమైన అసహనాన్ని వెళ్ళగక్కుతాయి. ఒకరినొకరు నిందించుకుంటూ తమ పాత్రకు న్యాయం జరగట్లేదని వాపోతాయి. ఆ నాటకసంఘ నిర్వాహకుడు కథను జనరంజకంగా మలిచి, నాటకాన్ని రక్తికట్టించే విధంగా వాళ్ళందర్నీ ఒక తాటిపైకి తేలేక తలపట్టుకుంటాడు. ఈ కథంతా మెటఫోర్ల మేళవింపుగా ఉంటుంది, మీ పఠనానుభవాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేదు కాబట్టి నేను కథ జోలికి వెళ్ళదల్చుకోలేదు. ఏకకాలంలో మనిషి వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ నిరంతరం రూపాంతరం చెందే వ్యక్తిత్వ వైరుధ్యాలనూ, అస్తిత్వవాదాన్నీ సరళమైన సంభాషణల్లో చర్చిస్తూ పిరాండెల్లో రాసిన నాటకం 'Six Characters in Search of an Author' వాస్తవానికీ-భ్రమకీ మధ్య ఉన్న అంతరాలను గుర్తించే దిశగా పాఠకుల సృజనాత్మకతకు పదునుపెడుతుంది. 

నిర్వాహకుడికీ, సవతి కూతురుకీ మధ్య జరిగిన ఒక సంభాషణలో "సత్యం" వాస్తవంలో ఉన్నంత యదార్థంగా సాహిత్యంలోనో, మరో కళలోనో ఉండే అవకాశం లేదనే విషయాన్ని 'రంగస్థలాన్ని' మెటఫోర్ గా తీసుకుని రెండే వాక్యాల్లో వర్ణించిన తీరు "ఆహా !" అనిపించకమానదు. 

సవతి కూతురు : నాకు "నిజం" కావాలి . "నిజం". 

నిర్వాహకుడు : నేను కాదనను,  నీ రంపపుకోత నాకు అర్థమవుతోంది. కానీ ఇదంతా రంగస్థలం మీద పనికిరాదు. "నిజం" అక్కడ చెల్లుబాటవ్వదు.

ఇటువంటిదే మరో సంభాషణ,

సవతి కూతురు : కానీ అది "నిజం".

నిర్వాహకుడు : అయితే ఏంటమ్మాయ్ ! నటించడం మన వ్యాపారం. ఇక్కడ "సత్యం" ఒక స్థాయి వరకే అమ్ముడుపోతుంది. 

కాస్త పరిశీలిస్తే పై సంభాషణను పాఠకులు వివిధ కోణాల్లో అన్వయించుకోవచ్చు. Oh chuck it! "Wonderful art!" Withdraw that, please ! అంటూ తమ ట్రేడ్ మీదే వ్యంగ్యోక్తులు విసురుకోడానికి ఎవరికైనా చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. అటువంటి ధైర్యం పుష్కలంగా ఉన్న రచయిత పిరాండెల్లో. ఈ రచన ద్వారా కార్యశీలతకు సుదూరమైన కళారంగంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపించడంలో ఆయన పూర్తిగా సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు. ఈ సంభాషణ దానికొక చక్కని ఉదాహరణ.

The Manager. A bit discursive this, you know!
The Son [contemptuously]. Literature! Literature!
The Father. Literature indeed! This is life, this is passion!
The Manager. It may be, but it won't act.
"అతి సర్వత్రా వర్జయేత్" అని పాఠకులకు గుర్తుచేస్తూ, హేతువాద, మేథోమథనాలు శృతిమించితే మనిషిలోని మృగాన్ని వెలుపలికి తీసుకొస్తాయని హెచ్చరిస్తాయి ఈ వాక్యాలు :
Oh, all these intellectual complications make me sick, disgust me -- all this philosophy that uncovers the beast in man, and then seeks to save him, excuse him . . . I can't stand it, sir. When a man seeks to "simplify" life bestially, throwing aside every relic of humanity, every chaste aspiration, every pure feeling, all sense of ideality, duty, modesty, shame . . . then nothing is more revolting and nauseous than a certain kind of remorse -- crocodiles' tears, that's what it is.
కథలో తండ్రి పాత్రకు అతడి అస్తిత్వపు పరిధులు గుర్తు చేస్తూ నిర్వాహకుడితో ఈ మాటలనిపిస్తారు : 

"The empty form of reason without the fullness of instinct, which is blind." -- You stand for reason, your wife is instinct. It's a mixing up of the parts, according to which you who act your own part become the puppet of yourself. Do you understand?"

Do you suppose that with all this egg-beating business you are on an ordinary stage? Get that out of your head. You represent the shell of the eggs you are beating!

అనేకమంది మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనేకానేకమైన  అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు పిరాండెల్లో. 

The Father :  But don't you see that the whole trouble lies here. In words, words. Each one of us has within him a whole world of things, each man of us his own special world. And how can we ever come to an understanding if I put in the words I utter the sense and value of things as I see them; while you who listen to me must inevitably translate them according to the conception of things each one of you has within himself. We think we understand each other, but we never really do.

చివరగా ఇదొక్కసారి చదివి ప్రక్కన పెట్టగలిగే పుస్తకం కాదు. చదివిన ప్రతిసారీ  ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ అనేక విధాలుగా కనిపించే మాయాదర్పణంలాంటిదీ నాటకం. మనకు నేడు వాస్తవంగా కనిపించే విషయం రేపు భ్రమగా తోచవచ్చు, నేడు భ్రమనుకున్నదే మరోరోజు వాస్తవంగా మారనూ వచ్చు. 'Change is only constant' అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనిషి తన వ్యక్తిత్వంలో పొరల్ని ఒక్కోటీ వలుచుకుంటూపోవడమే జీవితం అని గుర్తుచేస్తూ అస్తిత్వానికి ఒకే ఒక్క నిర్వచనం సాధ్యం కాదనీ, నిరంతరం రూపాంతరం చెందే మనిషి వ్యక్తిత్వానికి అనంతమైన నిర్వచనాలుంటాయని ఈ నాటకం ద్వారా నిరూపిస్తారు పిరాండెల్లో. ఆయన రచనల్లో అన్నిటికంటే ముందు చదవవలసిన ఈ పుస్తకాన్ని నేను చాలా ఆలస్యంగా చదివాను. పిరాండెల్లోను మీరు పరిచయం చేసుకోవాలంటే నేను మొదట ఈ రచన చదవమంటాను. హ్యాపీ రీడింగ్. :) 

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

But every man knows what unconfessable things pass within the secrecy of his own heart. One gives way to the temptation, only to rise from it again, afterwards, with a great eagerness to re-establish one's dignity, as if it were a tombstone to place on the grave of one's shame, and a monument to hide and sign the memory of our weaknesses. Everybody's in the same case. Some folks haven't the courage to say certain things, that's all!

The Father. For the drama lies all in this -- in the conscience that I have, that each one of us has. We believe this conscience to be a single thing, but it is many-sided. There is one for this person, and another for that. Diverse consciences. So we have this illusion of being one person for all, of having a personality that is unique in all our acts. But it isn't true. We perceive this when, tragically perhaps, in something we do, we are as it were, suspended, caught up in the air on a kind of hook. Then we perceive that all of us was not in that act, and that it would be an atrocious injustice to judge us by that action alone, as if all our existence were summed up in that one deed.

The Father. But only in order to know if you, as you really are now, see yourself as you once were with all the illusions that were yours then, with all the things both inside and outside of you as they seemed to you -- as they were then indeed for you. Well, sir, if you think of all those illusions that mean nothing to you now, of all those things which don't even seem to you to exist any more, while once they were for you, don't you feel that -- I won't say these boards -- but the very earth under your feet is sinking away from you when you reflect that in the same way this you as you feel it today -- all this present reality of yours -- is fated to seem a mere illusion to you tomorrow?

The Father. I don't know to what author you may be alluding, but believe me I feel what I think; and I seem to be philosophizing only for those who do not think what they feel, because they blind themselves with their own sentiment. I know that for many people this self-blinding seems much more "human"; but the contrary is really true.

For man never reasons so much and becomes so introspective as when he suffers; since he is anxious to get at the cause of his sufferings, to learn who has produced them, and whether it is just or unjust that he should have to bear them. On the other hand, when he is happy, he takes his happiness as it comes and doesn't analyze it, just as if happiness were his right. The animals suffer without reasoning about their sufferings. But take the case of a man who suffers and begins to reason about it.

Drama is action, sir, action and not confounded philosophy.