Thursday, June 28, 2018

The Devil - Leo Tolstoy

మళ్ళీ కాస్త తేలికపాటి పుస్తకం ఏదైనా చదువుదామనుకుంటున్నంతలో 'The Art of Novella' సిరీస్ లో భాగంగా ప్రచురించిన టాల్స్టాయ్ 'ది డెవిల్' కంటపడింది..నా వరకూ టాల్స్టాయ్ ని చదవడం ఒక ఉపశమనం..మనసులో ఏ చిన్న అలజడినైనా ఆయన మాటల్తో ఇట్టే మటుమాయం చేసేస్తారు..భారీ ఇంటెలెక్చువల్ స్టఫ్ ని కూడా,అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు అమ్మ ఊరడింపులా మార్చెయ్యగల నైపుణ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది,అలాంటి వారిలో టాల్స్టాయ్ ఒకరు.
Image Courtesy Google
చిన్నప్పుడు యద్దనపూడి 'సెక్రటరీ' చదివి ఆహా,ఓహో అంటుంటే మా అమ్మగారు,అత్తా కోడూరి కౌసల్యా దేవి 'శాంతి నికేతన్' ఇంకా బావుంటుంది తెలుసా అని చాలా హైప్ క్రియేట్ చేశారు..ఆ పుస్తకం అప్పట్లో నాకు వెంటనే దొరకలేదు..తరువాత చాలా కాలానికి చదివినప్పుడు,"ఏంటి ఈ నస,చదువుకున్నవారై కూడా ఆ అమ్మాయీ,అబ్బాయీ కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా ఆ బాధపడిపోవడమేంటి!" అనిపించింది..నాకు అలా అనిపించడం ఎంత సమంజసమో,మా పెద్దవాళ్ళకి ఆ కథ అంతగా ప్రాణం కావడం కూడా అంతే సమంజసం..ఏ కథైనా అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండడం సహజం,ముఖ్యంగా ఠాగూర్,శరత్ వంటివారి రచనలు కొన్ని చదివేటప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది..టాల్స్టాయ్ రచనల్ని వాటితో పోల్చలేముగానీ ఈ రచన ప్రత్యేకం అటువంటి కోవలోకి వస్తుంది..

యువకుడైన Yevgeny Irtenev తన శారీరక అవసరాల నిమిత్తం Stepanida అనే ఒక రైతు కుటుంబంలోని స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు..ఆమెను తన అవసరాలు తీర్చే సాధనంగా చూస్తాడే తప్ప ఆమెపట్ల అతనికి ఏ భావనా ఉండదు..తరువాత Liza ను ప్రేమించి,పెళ్ళిచేసుకుని సుఖమైన సంసారం జీవితం గడుపుతుంటాడు..సంవత్సరంపాటు అంతా సజావుగానే ఉన్నా,మళ్ళీ ఒక సందర్భంలో Stepanida ఎదురుపడటంతో ఆమెపై లేదనుకున్న వ్యామోహం తిరిగి అతనిలో ప్రవేశిస్తుంది..ఒక వైపు Stepanida పై వాంఛను చంపుకోలేకా,మరోవైపు ఆదర్శవంతమైన వ్యక్తిగా,మంచి భర్తగా,మంచి మనిషిగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోలేకా,Yevgeny తనలో తనే మథనపడుతూ ఉంటాడు..గతించినకాలం Stepanida రూపంలో కళ్ళెదురుగా వచ్చి అతని ఆలోచనలు పూర్తిగా అదుపు తప్పుతాయి..Stepanida ఆలోచనలను మనసులో నింపుకుని ఒక గృహస్థుగా పాపం చేస్తున్నాననే భావన Yevgeny లో రోజురోజుకీ పెరిగిపోతుంటుంది...అపరాధభావన పూర్తిగా వశపరుచుకోగా,Yevgeny చివరకు ఒక నిర్ణయం తీసుకుంటాడు..ఆ ముగింపు ఏంటనేది మిగతా కథ..మొదట ఇచ్చిన ముగింపును మారుస్తూ,ఈ కథకి కొంతకాలం తరువాత మరో ముగింపునిచ్చారు టాల్స్టాయ్.

కథలు టైమ్ ట్రావెల్ చేయిస్తాయంటారు..కానీ కొన్ని కథల విషయంలో టైమ్ ట్రావెల్ చేసే సంసిద్ధత,ముందుగా పాఠకుల్లో ఉండాలి..టాల్స్టాయ్,ఠాగోర్ లాంటి వారిని చదివినప్పుడు ఆ సంసిద్ధత మరింత అవసరం..ఈ నవలికని కేవలం ఒక మగవాడి 'సెక్సువల్ ఎమోషన్స్' దృష్టికోణం నుంచి మాత్రమే చూస్తే,టాల్స్టాయ్ ని అర్ధం చేసుకునే పరిపక్వత ఇంకా రాలేదంటాను..ఉదాహరణకి అన్నాకరీనినా లో కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ నే తీసుకున్నారు..Yevgeny కథని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో అంతర్లీనంగా అద్భుతమైన సైకోఅనాలిసిస్ కనపడుతుంది..మనిషి జీవితమంతా అదుపుతప్పే కోరికల్ని అణుచుకుని,సమాజం ఆమోదించే నియమాల మధ్య సౌకర్యవంతంగా ఇమిడిపోయే దిశగా చేసే సాధనలోనే గడిచిపోతుంది..ఇక్కడ Stepanida పాత్ర,మనిషిలో మోహానికి ఒక ప్రతినిధి మాత్రమే..Yevgeny చివరకు వచ్చేసరికి ఈ నరకయాతన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం మొదటి ముగింపైతే,రెండో ముగింపులో తనను వ్యామోహంలో ముంచేసిన Stepanida ను దోషిగా భావించి ఆమెను చంపి,శిక్షననుభవించి తిరిగివచ్చి,తాగుడుకు బానిసవ్వడం రెండో ముగింపు..

And indeed, if Yevgeny Irtenev was mentally deranged when he committed this crime, then everyone is similarly insane. The most mentally deranged people are certainly those who see in others indications of insanity they do not notice in themselves.

అంటూ ఈ రెండు ముగింపుల్లో అసలు 'డెవిల్' ఎక్కడుందనేది పాఠకుల్నే తేల్చుకోమంటారు టాల్స్టాయ్.  

Wednesday, June 27, 2018

जलने में क्या मज़ा है.. परवाने जानते है !

చాలాకాలం క్రితం,అంటే నేను కూడా conversations,డిబేట్స్ లో చాలా passionate గా,చురుగ్గా పాల్గొనే రోజుల్లో,వేడిగా ఒక చర్చ జరుగుతోంది..ఒక మంచి మిత్రులు 'మార్పుని స్వీకరించాలనీ,లోకాన్ని,మనుషుల్ని ఉన్నవారిని ఉన్నట్లు accept చెయ్యాలనీ' చెప్తూ, "It is not the strongest or the most intelligent who will survive but those who can best manage change" అనే డార్విన్ సిద్ధాంతాన్ని గుర్తుచేశారు..Arguement ని ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో నేను వెంటనే,"బట్ ఐ డోంట్ వాంట్ టు సర్వైవ్..ఐ వాంట్ టు లివ్" అన్నాను..స్పృహలో అన్నానో లేక కోపంలో అన్నానో గుర్తులేదుగానీ..ఇప్పుడు అది గుర్తొస్తే మాత్రం నవ్వొస్తుంది..

'जलने में क्या मज़ा है.. परवाने जानते है' అని ఒక హిందీ పాటలో అన్నట్లు,మనిషి తన భావోద్వేగాలను ఫుల్ potential లో అనుభవించగలిగినప్పుడు మాత్రమే ఏ మనిషిలోనైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది అనుకుంటాను..క్వాలిటీ ఆఫ్ లైఫ్ vs క్వాంటిటీ ఆఫ్ లైఫ్... :) చీకటి దారుల్లో ప్రయాణం అలవాటైనవారు,వెలుగుదారుల్లో ప్రయాణాన్ని మామూలు వారికంటే కాస్త ఎక్కువ మోతాదులో ఆస్వాదిస్తారేమో..పిరాండెల్లో ఒక సందర్భంలో అంటారు,ప్రతి మనిషి భావోద్వేగాల్లోనూ ఒక మోస్తరు insanity కలిసిపోయి ఉంటుంది అని..ఏ క్రియేటివ్ పీస్ ఆఫ్ ఆర్ట్ అయినా కూడా ఆ insanity బౌండరీస్ క్రాస్ చేయగలిగిన వాళ్ళకే సాధ్యపడుతుంది.హ్యూమన్ ఎమోషన్స్ కి చెక్ పెట్టి,మనం మనిషి జీవన ప్రమాణాన్ని పెంచగలం..పీస్ ఆఫ్ మైండ్ సొంతం చేసుకోగలం,కానీ నిస్సందేహంగా ఆ బ్యాలన్స్డ్ లైఫ్ తో ఒక సింగిల్ పీస్ ఆఫ్ ఆర్ట్ ని మాత్రం సృష్టించలేం..ఇక్కడ ఆర్ట్ అంటే ఒక చిత్రమో,మరో కళారూపమో మాత్రమే కానక్కర్లేదు..ఒక 'పరిపూర్ణమైన మనిషి'ని మించిన కళారూపం ఏముంటుంది !!! అసలే మనిషిలోనైనా పరిపూర్ణతకి మించిన 'కళ' ఏముంటుంది !!!

కానీ నా ఫ్రెండ్ ఒకరు ఎప్పుడూ అంటూ ఉండే 'Accepting change is not changing' అనే సూత్రం పూర్తిగా అర్ధం అయ్యాకా ఈ తరహా చర్చ మళ్ళీ ఎప్పుడూ చెయ్యలేదు. :)

2014 లో Coetzee ని మొదటిసారి చదివాను..ఆయన రాసిన 'Youth' లో సేవ్ చేసుకున్న నోట్స్ నుండి ఈ ఆర్ట్ గురించిన వాక్యాలు ఈరోజు ఎందుకో కంటబడ్డాయి..

From J.M.Coetzee's 'Youth' 

For he will be an artist, that has long been settled. If for the time being he must be obscure and ridiculous, that is because it is the lot of the artist to suffer obscurity and ridicule until the day when he is revealed in his true powers and the scoffers and mockers fall silent

Having mistresses is part of an artist's life: even if he steers clear of the trap of marriage, as he will certainly do, he is going to have to find a way of living with women. Art cannot be fed on deprivation alone, on longing, loneliness. There must be intimacy, passion, love as well.

Picasso, who is a great artist, perhaps the greatest of all, is a living example. Picasso falls in love with women, one after another. One after another they move in with him, share his life, model for him. Out of the passion that flares up anew with each new mistress, the Doras and Pilars whom chance brings to his doorstep are reborn into everlasting art. That is how it is done
        
Is that the fate of all women who become mixed up with artists: to have their worst or their best extracted and worked into fiction?

Women love artists because they burn with an inner flame, a flame that consumes yet paradoxically renews all that it touches.
But fortunately, artists do not have to be morally admirable people. All that matters is that they create great art. If his own art is to come out of the more contemptible side of himself, so be it. Flowers grow best on dungheaps, as Shakespeare never tires of saying. 

Normal people find it hard to be bad. Normal people, when they feel badness flare up within them, drink, swear, commit violence. Badness is to them like a fever: they want it out of their system, they want to go back to being normal. But artists have to live with their fever, whatever its nature, good or bad. The fever is what makes them artists; the fever must be kept alive. That is why artists can never be wholly present to the world: one eye has always to be turned inward. 

Tuesday, June 26, 2018

The Invention of Morel - Adolfo Bioy Casares

ఈ పుస్తకం చదవడం పూర్తి చేశాక కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను..మాములుగా అయితే ప్రోగు చేసుకున్న అనుభవాలను వెంటనే చేజారిపోకుండా,కొన్నిటినైనా పొదివి పట్టుకుని అక్షరాల్లో పెట్టడం అలవాటు,కానీ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వెంటనే బ్రెయిన్ లో చెదురుమదురుగా నిక్షిప్తమైన ఆ అద్భుతాన్ని మరోసారి అణువణువూ తడిమి చూసుకోవాలనే భావన కలుగుతుంది చూశారు,ఈ పుస్తకం చదివినప్పుడు సరిగ్గా అలాంటి భావనే కలిగింది..ఒకరకమైన Ecstasy తో కూడిన అనుభవాన్ని నిస్సందేహంగా ఒక 'మాస్టర్ పీస్' మాత్రమే ఇవ్వగలదు..

Image Courtesy Google
వాస్తవానికీ,ఊహకీ మధ్య పాఠకుల్ని ఊగిసలాడించే ఫెంటాస్టిక్ శైలి లో మరో అర్జెంటీనా రచయిత Adolfo Bioy Casares 1940 లో రాసిన 'ది ఇన్వెన్షన్ ఆఫ్ మోరెల్' (The invention of Morel) Buenos Aires prize for literature ను గెలుచుకుని,న్యూయార్క్ రివ్యూ క్లాసిక్స్ లో స్థానం సంపాదించుకుంది..బోర్హెస్ కు శిష్యుడే కాక,సన్నిహితుడూ,మిత్రుడూ కూడా అయిన కసారెస్ రచనను బోర్హెస్ 'పర్ఫెక్ట్' అని కొనియాడారట..బోర్హెస్ కూ,కసారెస్ కూ 'ఫెంటాస్టిక్' అంటే ఉన్న నిర్వచనాలు వేరు..వారి లెక్క ప్రకారం ఫెంటాస్టిక్ శైలి 19 వ శతాబ్దంలో వాడుకలో ఉన్న రియలిజం కంటే ఎన్నో మెట్లు ఉన్నత స్థానంలో ఉంటుంది..ఈ పుస్తకానికి బోర్హెస్ రాసిన ముందుమాటలో,అటువంటి సంక్లిష్టమైన genre కు ఈ 'మోరెల్' ను 'పర్ఫెక్ట్ మోడల్' అంటూ,ఈ రచన హెన్రీ జేమ్స్-'ది టర్న్ ఆఫ్ ది స్క్రూ' ,కాఫ్కా-'ది ట్రయల్' లతో సరిసమానమైనదని కొనియాడారు.

ఈ తరహా రచనల్లో ప్రత్యేకించి ప్లాట్ అంటూ ఏదీ ఉండదు..పూర్తిగా థీమ్ బేస్డ్ గా సాగే ఈ రచనలో కథ ఇదీ అంటూ చెప్పడం కష్టం..కానీ దీన్నొక కథగా చెప్పాలంటే,ఒకానొక చోట ఒక దీవి..ఆ దీవిలో తన నేరశిక్షను తప్పించుకుని పారిపోయి తలదాచుకున్న ఒక వ్యక్తి (పేరు తెలియదు)..ఆ వ్యక్తి తన అనుభవాలను మనకు వివరిస్తూ ఉంటాడు..ఒకరోజు ఉన్నట్లుండి రాళ్ళపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తున్న Faustine అనే అమ్మాయిని చూడగానే ఒంటరిగా మిగిలిపోయిన అతనిలో నిరాశా నిస్పృహల స్థానంలో జీవితం పట్ల ఆశ చిగురిస్తుంది..మానవ సంచారం లేని ఆ దీవిలో ఆ అమ్మాయిని చూడగానే మన ప్రొటొగోనిస్ట్ మనసులో అలజడి చెలరేగుతుంది..మెల్లిగా ఆ అమ్మాయితో ఎలా అయినా మాట కలపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు,కానీ రోజూ అతను ఎదురైనా,అతన్ని గమనించనట్లు,అతని ఉనికినే గుర్తించినట్లు  నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంటుంది Faustine..ఇదిలా ఉండగా ఒక సాయంత్రం రాళ్ళ దగ్గర,ఆ అమ్మాయిని మరో వ్యక్తి మోరెల్ తో (టెన్నిస్ ప్లేయర్)  కలిసి చూస్తాడు..వారి మాటలు రహస్యంగా వింటూ ఉంటాడు..వారిద్దరే కాకుండా ఆ దీవికి ఒక పర్యాటక బృందం వచ్చిందని నిర్ధారించుకుని,ఇదంతా పోలీసులు తనను పట్టుకోడానికి పన్నిన పన్నాగంలా భావించి,వారిని రహస్యంగా అనుసరిస్తూ ఉంటాడు..అంతేకాకుండా Faustine తో సన్నిహితంగా మెలిగే మోరెల్ పై అకారణ ద్వేషం పెంచుకుంటూ,వారి మధ్య సంబంధం ఏమిటో రహస్యంగా వారి కంటబడకుండా ఆరా తీస్తుంటాడు..ఆ తరువాత కథ ఒక విచిత్రమైన మలుపు తిరుగుతుంది..అది కాస్తా నేనే చెప్పేస్తే మీరిక పుస్తకం చదవక్కర్లేదు :)

And when I see a bird in flight I realize the vastness of the open spaces all around me.

Last night, for the hundredth time, I slept in this deserted place. As I looked at the buildings, I thought of what a laborious task it must have been to bring so many stones here. It would have been easy enough—and far more practical—to build an outdoor oven.

The island vegetation is abundant. Spring, summer, autumn, and winter plants, grasses, and flowers overtake each other with urgency, with more urgency to be born than to die, each one invading the time and the place of the others in a tangled mass.

చివరి వరకూ ప్రొటొగోనిస్ట్ గురించిన వివరాలేవీ చెప్పకుండా దీన్నొక డిటెక్టివ్ నవలలాగా నడిపిస్తారు రచయిత..ఆ దీవిలో ఏదో అంతుపట్టని వ్యాధి ప్రబలి ఉండడం,ప్రొటొగోనిస్ట్ వింత ప్రవర్తన,వసంతంలో ఎండలు కాయడం,ప్రొటొగోనిస్ట్ కు రెండు సూర్యుళ్లు కనిపించడం లాంటి అంశాలను నెరేషన్ కు జోడించి,అసలు ఆ దీవిలో ఏం జరుగుతోందా అనే ఆసక్తి పాఠకుల్లో రేకెత్తిస్తారు..మెదడులో రచయిత సృష్టించిన illusions,ఇమేజెస్ ఒకదాని మీద ఒకటి overlap అవుతూ,ఒక సమయంలో వాస్తవమేదో,భ్రమ ఏదో తెలీకుండా మనం కూడా ప్రొటొగోనిస్ట్ లాగే గందరగోళానికి గురవుతాము..కానీ చివరకి వచ్చే సరికి ముందు జరిగిన సంఘటనలన్నిటికీ సహేతుకమైన వివరణాలిచ్చి కథను ముగిస్తారు..కసారెస్ నేరేషన్ లో తీవ్రత,మనల్ని కూడా ప్రొటొగోనిస్ట్ ఒంటరితనం దగ్గరగా అనుభవించేలా చేస్తుంది..అసలీ తరహా రచనల్ని అనువదించడం చాలా కష్టంతో కూడుకున్న పని అనిపిస్తుంది..ఒక సందర్భంలో నాగరాజు పప్పు గారు అన్నట్లు ఈ థీమ్ బేస్డ్ రచనల్లో 'టోన్ 'ని పట్టుకోవడం చాలా కష్టం..ఆ కారణంగానే దీన్ని ఫిల్మ్ adaptations ఎన్ని ఉన్నా,అసలు రచనకు న్యాయం చెయ్యడంలో అన్నీ ఘోరంగా విఫలమయ్యాయంటారు..కాస్మిక్ ఎలిమెంట్స్ కంటే మెటాఫిజికల్ ఎలిమెంట్స్ కసారెస్ కథల్లో ఎక్కువ కావడంతో ఆయన్ని ఫెంటాస్టిక్ రైటర్ గా వర్గీకరించడం సరికాదనే ఆక్టావియో పాజ్ వాదన సరైనదే అని ఈ పుస్తకం చదివాకా,నాక్కూడా అనిపించింది..

I believe we lose immortality because we have not conquered our opposition to death; we keep insisting on the primary, rudimentary idea: that the whole body should be kept alive. We should seek to preserve only the part that has to do with consciousness.

I had nothing to hope for. That was not so horrible—and the acceptance of that fact brought me peace of mind. But now the woman has changed all that. And hope is the one thing I must fear.

ఫిజికల్ రియాలిటీని,ఇమాజినరీ ఫాంటసీని ఒకటేనని భ్రమింప జేస్తూ,రెండింటినీ సమాంతరమైన దారుల్లో నడిపించిన ఇలాంటి రచన చెయ్యడం నిజంగా కత్తిమీద సామే..బోర్హెస్,Krzhizhanovsky లలాగే కసారెస్ కూడా తన అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ను జాగ్రత్తగా పదాలమాటున దాచేసి తాళాలు వేసేస్తారు..ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఏదో డీకోడింగ్ చేసినట్లు ఉంటుంది..కసారెస్ పదాల్లో దాచిపెట్టిన చిక్కుముడుల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా విప్పుతూ వెళ్ళవలసిన బాధ్యత పాఠకులదే..మొదట్లో యేవో ప్రకృతి వర్ణనలు,సముద్రపు ఆటుపోట్లు,చిన్న చిన్న ధ్వనులు లాంటి విషయాలే కదా,వీటికి కథతో పనేముంటుందని వాటిని ఉపేక్షించడానికి వీల్లేదు..పుస్తకం పూర్తయ్యాక మనం పునఃసమీక్షించుకుంటే ఒక్క అప్రస్తుతమైన అంశం కూడా కనపడదు..బోర్హెస్ శిష్యుడు అయినప్పటికీ,సుదీర్ఘమైన నెరేషన్స్ కు భిన్నంగా కసారెస్ పదాల్ని చాలా పొదుపుగా వాడతారు..తక్కువ పదాల్లో ఎక్కువ విషయాన్ని చెప్పే రచయిత కావడంతో,పాఠకులకు రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ తెలియడం తప్పనిసరి..కసారెస్ కు మొదట్నుంచీ 'రొమాంటిక్ లవ్' అంటే ఉన్న అబ్సెషన్ కారణంగా ఆయన కథావస్తువులు ఎప్పుడూ ప్రేమ చుట్టూనే పరిభ్రమిస్తాయి..ఈ రచనకు కూడా ఆయనకు నటి Louise Brooks పట్ల ఉన్న ఆరాధనే స్ఫూర్తి అంటారు..

ఈ కథలో,కొన్ని వస్తువులను ఉపయోగించి,లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేసే ఒక మెజీషియన్ కి మాత్రమే సాధ్యమైన ప్రయోగాన్ని,కేవలం తన పదాలనుపయోగించి చేసి చూపించారు కసారెస్..ఫోటోగ్రఫీ,మోషన్ పిక్చర్స్ లో మానవ జీవితాన్ని ఇమేజెస్ లో బంధించడం సాధ్యమేనని ఋజువైంది..మరి ఆ ఇమేజెస్ కి ఆత్మ కూడా ఉండటం సాధ్యమేనా అనే దిశగా కాస్త ఫాంటసీ, మరి కాస్త డిస్టోపియాన్ ఎలిమెంట్స్ జోడించి కథను నడుపుతారు !! మోరెల్ సృష్టి  హ్యూమన్ మోర్టాలిటీని సవాలు చేస్తుంది..ఈ కథలో భౌతికతత్వాన్ని కూడా ఒక ఇమాజినరీ ఎలిమెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు కసారెస్..దురదృష్టవశాత్తూ మనమా ఊహ తాలూకా నీడనే శాశ్వతమని నమ్మి దాని ముందు మోకరిల్లుతాము..అదేవిధంగా ఈ ఫిజికల్ రియాలిటీకి అనుబంధంగా ఉండే 'ప్రేమ' కూడా మనిషి శరీరంలాగే ఒక భ్రమ అంటూ,(Consciousness) ఆత్మ మాత్రమే శాశ్వతమని తీర్మానిస్తారు..ఉహు,పాఠకులే తీర్మానించుకునేలా చేస్తారు..కథ ముగిసే సమయానికి మోరెల్ సృష్టి ప్రొటొగోనిస్ట్ దృష్టికోణం నుంచి చూస్తే అందంగా,ఒక అద్భుతంగా ఆవిర్భవించినా,మానవజీవితపు పరిధుల్ని కూడా చేదుగా గుర్తు చెయ్యడం ఒక ఐరనీ..ఈ రచన పాఠకుల్ని ఫాంటసికీ,రియాలిటీకి మధ్య పరిధుల్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తుంది.

పుస్తకం నుండి మరికొన్ని,

Now I spend my days trying to distinguish the edible roots. I have come to manage my life so well that I do all my work and still have time to rest. This makes me feel free, happy.

You have awakened me from a living death on this island.

The habits of our lives make us presume that things will happen in a certain foreseeable way, that there will be a vague coherence in the world. Now reality appears to be changed, unreal. When a man awakens, or dies, he is slow to free himself from the terrors of the dream, from the worries and manias of life. Now it will be hard for me to break the habit of being afraid of these people.

Now that I have grown accustomed to seeing a life that is repeated, I find my own irreparably haphazard. My plans to alter the situation are useless: I have no next time, each moment is unique, different from every other moment, and many are wasted by my own indolence. Of course, there is no next time for the images either—each moment follows the pattern set when the eternal week was first recorded.      Our life may be thought of as a week of these images—one that may be repeated in adjoining worlds.

The horrors of the day are written down in my diary. I have filled many pages: now it seems futile to try to find inevitable analogies with dying men who make plans for long futures or who see, at the instant of drowning, a detailed picture of their whole life before them. The final moment must be rapid, confused; we are always so far removed from death that we cannot imagine the shadows that must becloud it.

‘To be on an island inhabited by artificial ghosts was the most unbearable of nightmares—to be in love with one of those images was worse than being in love with a ghost (perhaps we always want the person we love to have the existence of a ghost).

Finally my fear of death freed me from the irrational belief that I was incompetent.

A poem by Dante Gabriel Rossetti:
      I have been here before,
      But when or how I cannot tell:
      I know the grass beyond the door,
     The sweet keen smell,
     The sighing sound, the lights around the shore

Wednesday, June 20, 2018

The Liberation of Sita - Volga

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన వోల్గా తెలుగు రచన 'విముక్త' ను 'ది లిబరేషన్ ఆఫ్ సీత' గా ఆంగ్లంలో అనువదించారు..'ప్రేమ' కి మల్లే ఫెమినిజానికి కూడా నేటితరం ఆపాదిస్తున్న నిర్వచనాల్ని చూసి స్త్రీవాదమంటే వెగటు పుట్టిన సమయంలో ఈ రచన, మూసస్త్రీవాద రచనలకంటే విభిన్నంగా అనిపించింది..

Image Courtesy Google 
మన భారతీయులకి రామాయణమంటే 'రాముడి కథే' గానీ 'సీత కథ' కాదు..హైందవ సంస్కృతిలో వేళ్ళూనుకుపోయిన ఆర్యధర్మం తాలూకా విషపుశాఖలు ఇక్కడే మొదలవుతాయి..రామునితో సమానంగా కష్టనష్టాలకోర్చిన ఆమెను అగ్నిలో దూకి శీలపరీక్ష చేసుకోమన్నా,నిండు గర్భిణిగా అడవులకు పంపినా,మానవరూపంలో సంచరించిన రాముణ్ణి దేవుడిగానే కొలిచే సంస్కృతి మనది..రామాయణానికి దైవత్వాన్ని ఆపాదించి,నరుడిగా పుట్టిన రాముడిలో కూడా లోపాలుంటాయని అంగీకరించలేని మూఢ భక్తి మనది..భారతీయ సమాజంలో పితృస్వామ్య ఆధిపత్యపు మూలాలు ఈనాటివి కాదు..ఈ వ్యవస్థలో తరతరాల నుండీ స్త్రీ అస్థిత్వం ఎప్పుడూ పురుషుడితోనే ముడిపెట్టబడి ఉంది..ఈనాటికీ ఫలానా వారి భార్య అనో,ఫలానా వారి కుమార్తె అనో,లేదా ఫలానా వారి తల్లి అనో ఆమెకు పురుషునితో ఉన్న సంబంధాల ఆధారంగానే ఆమె అస్థిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తారు..ఆనాటి నుండీ స్త్రీ కూడా అదే నిజమని నమ్ముతూ,తనని తాను మభ్యపెట్టుకుంటూ జీవిస్తోంది..ఆర్యధర్మాలు,మనుధర్మ శాస్త్రాలు ఔపాసన పట్టి మనిషి తయారు చేసుకున్న ఈ కాల్పనిక అస్థిత్వపు ముసుగులు తీసేస్తే,వీటన్నిటి మధ్యా 'ఆమె' ఎవరు అనే ప్రశ్నకు,ఈ రచన ద్వారా సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు ఓల్గా..మరి ఈ ప్రశ్నలన్నీ సాక్షాత్తూ సీతాదేవికే వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథల్లో చర్చకొచ్చిన ప్రధానాంశం.  

ఇందులో The Reunion, Music of the Earth,The Sand Pot,The Liberated, The Shackled అని మొత్తం ఐదు కథలున్నాయి..అన్ని కథలూ దేనికవే విడివిడిగా ఉన్నప్పటికీ ఇంటర్కనెక్టడ్ గా ఉంటాయి.. తొలి నాలుగు కథలూ సీత,శూర్ఫణఖ,అహల్య,రేణుకా దేవి,ఊర్మిళ దృష్టికోణాలనుంచి రాస్తే,చివరి కథ మాత్రం రాముడి దృష్టి కోణం నుంచి రాశారు..మొదటి  కథలో వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీత,శూర్ఫణఖని కలుస్తుంది..శూర్ఫణఖ అనగానే ఒక భయంకరమైన రాక్షసి అని మనలో ఉగ్గుపాలతో వేసిన ముద్రను చెరిపేస్తూ శూర్ఫణఖ పాత్రను సరికొత్తగా మలిచారు రచయిత్రి..ఆమె ద్రావిడజాతికి చెందిన స్త్రీ అనీ,ఆర్యధర్మాన్ని స్థాపించే క్రమంలో ఆర్యులు కానివారిని ఆ కాలంలో రాక్షసులుగా వ్యవహరించేవారనీ అంటారు..ఈ కథలో సీత,శూర్ఫణఖల సమాగమాన్ని,ఒకే పురుషుని ప్రేమించి అవమానాలపాలైన ఇద్దరు తోబుట్టువుల కలయికలా చిత్రించారు..సీతలాగే రాముణ్ణి ప్రేమించి అన్నీ కోల్పోయిన శూర్ఫణఖ చివరకు తనను తాను తెలుసుకునేదిశగా అడుగులు వేస్తుంది..స్త్రీకి అసలైన విజయం,ఆమెకు పురుషుడితో ఉండే సంబంధాన్ని బట్టి ఉండదనీ,అంతఃసౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదనీ శూర్ఫణఖ సీతకు వివరిస్తుంది..పితృస్వామ్యపు సమాజంలో సహబాధితులుగా ఈ ఇద్దరూ తోబుట్టువులుగా మారతారు.

Surpanakha’s coming—how beautifully she had walked in. White jasmines in her hair. Garlands of yellow ganneru around her neck. Bracelets of nilambara on her wrists. She was like a walking creeper in bloom.

"Was anguish inevitable for women who love Sri Rama ? "

'I’ve realized that the meaning of success for a woman does not lie in her relationship with a man. Only after that realization, did I find this man’s companionship.’

'ది మ్యూజిక్ ఆఫ్ ఎర్త్' అహల్య కథ..ఇందులో నాకు అన్నిటికంటే నచ్చిన కథ ఇదే..వనవాస సమయంలో అహల్యను కలిసిన సీతతో స్త్రీ శీల పరీక్ష చేయడాన్ని పురుషులు హక్కుగా భావిస్తారంటూ,బ్రాహ్మణోత్తములు,తపోధనులు కూడా ఈ విషయాలకొచ్చేసరికి గుడ్డిగా వ్యవహరిస్తారు అని తన భర్త గౌతముణ్ణి ఉద్దేశించి అంటుంది..తిరిగి మళ్ళీ వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతను కలవడానికొచ్చి 'జరిగిందంతా మంచికే,ఈ పరీక్షలన్నీ నిన్ను నువ్వు తెలుసుకోడానికి మార్గాలే,ఈ ప్రకృతినీ,మనిషి పుట్టుకనీ,జీవపరిణామాన్నీ గురించి ఆలోచిస్తే నువ్వు రాముడికి మాత్రమే చెందవు సమస్త విశ్వంలో నువ్వు కూడా ఒక భాగమని తెలుస్తుంది' అని ఓదారుస్తుంది.

His property, even if temporarily, had fallen into the hands of another. It was polluted. Pollution, cleanliness, purity, impurity, honour, dishonour—Brahmin men have invested these words with such power that there is no scope in them for truth and untruth. No distinction.’

‘But he has disowned you.’ ‘Pity, that’s his loss.’ ‘And you … they say you lived like a lifeless stone for years.’ ‘That’s what you think. I have spent all these years thinking about my identity in this universe. I have learned how the world runs—on what morals and laws, and what their roots are. I have gained a lot of wisdom.’

What does conducting an enquiry mean, Sita? Distrust, isn’t it? Wouldn’t it be better, instead, to believe in either your innocence or guilt? … All men are the same, Sita.

మరో కథ రేణుకది ..జమదగ్ని ముని భార్య అయిన ఆమె ఆర్యధర్మపాలనలో విచక్షణ కోల్పోయి కన్నతల్లైన తన తలను నరకడానికి వచ్చిన పరశురాముణ్ణి గురించి సీతకు చెప్తూ,కొడుకులు కూడా పితృస్వామ్య వ్యవస్థలో భాగమేనంటూ,లవకుశులు కూడా తుదకు తండ్రి రాముణ్ణే అనుసరిస్తారు అని సీత కళ్ళకు కమ్మిన తల్లిప్రేమ తాలూకా తెరల్ని తొలగిస్తుంది. 

Most often, women don’t realize that they are part of the wider world. They limit themselves to an individual, to a household, to a family’s honour. Conquering the ego becomes the goal of spirituality for men. For women, to nourish that ego and to burn themselves to ashes in it becomes the goal. Sita, try to understand who you are, what the goal of your life is.

'If they understand that their paativratyam and fidelity are like these sand pots, they will be able to live in peace.’

'But such is the wisdom of these spiritual seekers. No matter how much wisdom they earn through penance, they continue to have a dogmatic view on the paativratyam of their wives.'

‘Does a woman have a world other than her husband’s? Is there a higher meaning to a woman’s life than motherhood?

'ది లిబరేటెడ్' ఊర్మిళ కథ..తనను కనీసం సంప్రదించకుండా,తన ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండా లక్ష్మణుడు అన్నవెంట అడవులకు వెళ్ళడం వల్ల తీవ్రవేదనను అనుభవించిన ఊర్మిళ,పధ్నాలుగు సంవత్సరాలు ఒంటరిగా ఒకే గదిలో ఉండిపోతుంది..ఈ సమయంలో ఆమె ఆలోచనలు బంధాలన్నిటినుంచీ విముక్తి వైపు ప్రయాణించి ఆమెను ఆత్మశోధన దిశగా నడిపిస్తాయి.. 

Power is the root cause of all sorrow, Akka. Do you know another strange thing? We must 
acquire this power. And then give it up. I shall not submit to anyone’s power. Nor will I bind anyone with my power. Then I will feel I have liberated myself. I will feel only joy within myself! Great peace! Much love! Compassion for all!

‘It’s a pity how people get bogged down by structures of power. Unable to see how they can liberate themselves, they rot in unrest, sorrow and hatred.

చివరి కథ 'The Shackled' ప్రత్యేకం రాముడి కథ..ఇక్కడే ఓల్గా నాకు బాగా నచ్చారు..స్త్రీవాదమంటూ రాముణ్ణో,రావణుణ్ణో విలన్స్ ని చెయ్యకుండా రెండు వైపులనుండీ సంతులనం పాటిస్తూ కథను రాయడం చాలా నచ్చింది..రాముడు రాజుగా స్వతంత్రుడు కాదు..ఆర్యధర్మమనే కారాగారంలో బందీగా మారి,సమాజశ్రేయస్సు కోసం మనస్సాక్షికి వ్యతిరేకంగా సీతను కష్టాలపాలు చేశాననే వేదన ఆయనలో కనపడుతుంది..ఈ కథలో ఆయన ఒక దేవుడుగా కాక ప్రజాక్షేమం కాంక్షించే రాజుగా,సీతను అమితంగా ప్రేమించే భర్తగా,రెండు విధాలా నలిగిపోతూ,యాంత్రికంగా తన రాజధర్మం నిర్వర్తించే ఒక నిస్సహాయుడైన మనిషిగా మాత్రమే కనిపిస్తాడు..

Human laws change. Human beings change them. Unable to cope with the change, they get perturbed. Slowly they get used to the change. Once the change stabilizes, they desire change again. Human law becomes the law of the time, and the law of the moment becomes the law of human beings. During the period of transition, the lives of the people who are key to the change go haywire. Rama was in exactly such a situation now.

‘Mind? My mind? I who execute the Arya Dharma without a second thought, do I have a mind of my own?’

నేను వోల్గా రచనల్లో ఒక్క 'సహజ' తప్ప ఇతరత్రా రచనలేవీ చదవలేదు..కానీ మా ముందు తరానికి ఆవిడంటే ఎందుకిష్టమో ఈ పుస్తకం చదివాకా అర్ధం అయ్యింది..విజయ్ కుమార్,విజయశ్రీ గార్ల అనువాదం బావుంది..అక్కడక్కడా 'అన్న,తాత,గన్నేరు పూలు,వదిన' లాంటి తెలుగు భాషా పదాలు చాలానే దొర్లాయి..ప్రాంతీయ భాషానువాదాల్లో ఇది సహజమే,నేను చదివిన కొన్ని మలయాళ అనువాదాల్లో అయితే ఈ మూలభాషాపదాల వాడకం ఇంకా  హెచ్చు..'చరిత్రను విజేతలు రాశారు' అని చర్చిల్ అన్నమాట వాస్తవమైతే,ఆర్యధర్మ సంస్థాపన దిశగా జరిగిన చరిత్ర చూస్తే,పితృస్వామ్యపు వ్యవస్థలో పావులుగా నలిగిపోయిన స్త్రీల ఆత్మఘోష వినిపించే ప్రయత్నం ఈ రచన..సందర్భాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ రూపాంతరం చెందవలసిన నియమాలను గుడ్డిగా అనుసరిస్తూ,శాస్త్రాలూ,పురాణాలూ ఘోషిస్తున్నాయని అంటూ కాలదోషం పట్టిన కొన్ని మూఢనమ్మకాలను పట్టుకువేలాడే ప్రతి సమాజానికీ ఈ కథలు చెంపపెట్టు లాంటివి,ఆనాటి సీత నుండీ ఈతరం స్త్రీ వరకూ,ఏకాలానికైనా అన్వయించుకోతగ్గవీను..ఈ కథల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే,ఎక్కడా కూడా ఇదొక కల్పిత కథని పాఠకులకు అనిపించకుండా రాశారు ఓల్గా..ఇదే నిజమైన రామాయణమేమో,సీత ఇలాగే మథనపడిందేమో అన్నంతగా,ప్రతిఘట్టాన్నీ జాగ్రత్తగా మలిచారు..రాముడు అనుమానిస్తే,రాముడి కంటే తన మీద వ్యామోహంతో సర్వం కోల్పోయిన రావణుడే అసలైన ప్రేమికుడు అని సీత భావించి రావణుడి చితిలో దూకిందని చలం ఒక సందర్భంలో రాశారని చదివినప్పుడు,ఆ మధ్య మణిరత్నం సినిమా 'రావణ్' గుర్తుకొచ్చింది..పుస్తకం చివర్లో ఓల్గా ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి..చివరగా రామదాసు 'మముబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ! ' అని ప్రార్ధిస్తాడు,కానీ 'మనల్ని రక్షించడానికి  సీతా దేవే చాలు' అని ఇంటర్వ్యూ ముగించారు .. :)  స్త్రీవాద రచనలు పెద్దగా ఇష్టపడని నాకు చిత్ర బెనర్జీ దివాకరుని రాసిన 'ది ప్యాలస్ ఆఫ్ ఇల్యూషన్స్' తరువాత బాగా నచ్చిన పుస్తకం అంటే ఇదే. 

పుస్తకం నుండి మరికొన్ని,
Since Rama insulted Surpanakha, Ravana wanted to take revenge on Rama by abducting me. Do women exist only to be used by men to settle their scores? Rama and Lakshmana would not have done this to Surpanakha if they did not know that she was Ravana’s sister. Rama’s objective was to provoke Ravana; his mission, to find a cause to start a quarrel with Ravana, was accomplished through Surpanakha. It was all politics.

‘Why do you look down upon animals, Sita? We should love animals and nature. We should worship them. We should befriend them. That’s the duty of humans. Ignoring that basic duty, you think what is written in books is civilization. Is that right? You have come to the forest from the city. Why insist so much on the civilization of the cities? Isn’t nature the best teacher?'

Monday, June 18, 2018

A Schoolboy's Diary and Other Stories - Robert Walser

డిస్ట్రాక్షన్ డెమన్ తో పోరాడుతూ కాస్త తేలికపాటి పుస్తకాలు ఏమైనా చదువుదామనుకుంటున్న తరుణంలో రాబర్ట్ వాల్సర్ గుర్తొచ్చారు..చాలా కాలం క్రితం వాల్సర్ గురించి J.M.Coetzee రాసిన ఒక ఆర్టికల్ చదివినప్పటి నుంచీ ఈయన పుస్తకాలు చదవాలనుకున్నాను..దానికి తోడు,జర్మన్ రచయిత అయిన వాల్సర్ నేరేషన్ స్టైల్ లిటరరీ స్టాండర్డ్స్ కి దరిదాపుల్లో కూడా ఉండదని మరికొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రక్కన పెడితే ఈయన రచనలు న్యూయార్క్ రివ్యూ క్లాసిక్స్ లో చోటెలా సంపాయించుకున్నాయనే  కుతూహలం ఈయన రచనల పట్ల మరింత ఆసక్తి కలుగజేసింది..


ఈ పుస్తకంలో రాబర్ట్  వాల్సర్ 'ప్రోజ్ పీసెస్' గా అభివర్ణించే డెబ్భై పైచిలుకు చిన్న చిన్న కథలుంటాయి..ఒకటీ రెండు మినహా మిగతా కథలన్నీ ఆయనే నేరేటర్ గా చెప్తారు..అంతేకాకుండా కొన్ని కథలు మినహాయించి మిగతావన్నీ ఒకటి,రెండుపేజీలు మించని కథలే..దానివల్ల ఎక్కడ పుస్తకం ఆపేసినా మళ్ళీ అక్కడ్నుంచీ ఫ్రెష్ గా మొదలు పెట్టగలం..కార్వర్ కథల్లాగా వాల్సర్ కథలు కూడా విచిత్రంగా ముగుస్తాయి..ఎటొచ్చీ ఈ ముగింపులు కాస్త పేలవంగా ఉంటాయి..కథ పూర్తయ్యాక,'ఇంతేనా' అనీ,లేదా 'ఇది కథేంటి!' అనీ నిట్టూర్చడం పాఠకులకు తప్పనిసరి..జీవితంలో మంచి-చెడు,కష్టం-సుఖం రెండూ ఉంటాయి,వాటిని  సమానంగా చూడాలనే వాల్సర్ కరడుగట్టిన సంప్రదాయవాది,కన్ఫర్మిస్ట్..తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఏ చిన్న మార్పూ లేకుండా ఉన్నదున్నట్లు గా ప్రేమించమంటారు/అంగీకరించమంటారు వాల్సర్.. నిరంతరం తన వ్యక్తిత్వానికి మెరుగుపెట్టుకుంటూ,అందనిదాని కోసం అర్రులు చాస్తూ ఉండే మనిషి సహజతత్వానికి వ్యతిరేకంగా Why should I be what I am not, and not be what I am ? అని ప్రశ్నిస్తారు..కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే,చాలా మందిలాగా,ఎక్కడా తన outdated (?) ఫిలాసఫీని జస్టిఫై చేసుకోడానికి ప్రయత్నించకపోవడం వాల్సర్ మీద మనకు గౌరవం కలిగిస్తుంది..'ఇది నా పద్ధతి ,ఈ తత్వం వలన జీవితంలో నష్టపోతాను,కానీ నేనింతే' అని కథలో పాత్ర అనుకోవడం దీనికి ఒక ఉదాహరణ మాత్రమే.

What was important melted away, and I devoted undivided attention to the most unimportant things and was very happy doing so. అంటూ తన మనసుని మనముందుంచే ప్రయత్నం చేశారు వాల్సర్..

వాల్సర్ పాత్రలు ప్రకృతి ప్రేమికులు,దేశ భక్తులు,అభివృద్ధికి ఆమడ దూరంలో,తమలోకంలో తాము ఉండాటానికి ఇష్టపడతారు..సహజంగానే స్కూలు అంటే వీరికి పడదు..
That is the most useful thing about school: It tires you out, upsets you, gets you going, it nourishes the imagination, it is the anteroom, the waiting room as it were, of life. అని 'Fritz Kocher's essays' అనే కథలో Fritz తన డైరీలో రాసుకుంటాడు..ఈ కథలో మరణించిన స్కూల్ విద్యార్థి Fritz Kocher పాత్ర మళ్ళీ 'A Schoolboy's diary' లో ప్రస్తావనకొస్తుంది..ఈ రెండు కథలూ విద్యార్థి దశలో పిల్లల భావాలకు అద్దం పడతాయి..మరో కథ 'Hanswurst' లో  Hanswurst is happy in his own skin.He has no future,but also doesn't want any such thing.What will become of him ? అంటారు..

Grades are a stupid invention. In singing I get an A and I don’t make a single sound. How does that happen? It would be better if they gave us apples instead of grades. But then it’s true they would have to hand out way too many apples.oh !

I like school. Anything forced on me, whose necessity has been mutely insisted upon from every side, I try to approach obligingly, and like it. School is the unavoidable choker around the neck of youth, and I confess that it is a valuable piece of jewelry indeed. What a burden we would be to our parents, workers, passersby, shop owners, if we didn’t have to go to school! What would we spend our time doing, if not homework! Playing tricks ends up being pretty exhausting after all.

ఆధునిక సమాజానికి వాల్సర్ ఫిలాసఫీ,కొన్ని చోట్ల,ఉహూ చాలా చోట్ల పాతచింతకాయ పచ్చడిలా  అనిపిస్తుంది..కానీ మరికొన్ని చోట్ల సరదాగా కొందరు ప్రముఖ రచయితల గురించీ,ప్రచురణ సంస్థల గురించీ చమత్కరించే వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో తళుక్కుమన్నాయి..ముఖ్యంగా రష్యన్ ,డేనిష్,స్వీడిష్ రచనల మీద ఆయన వేసిన వ్యంగ్యాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు..'A Devil of a Story' అనే కథ టాల్స్టాయ్ 'అన్నా కరేనిన' మీద సెటైర్ లా ఉంటుంది..టాల్స్టాయ్ వీరాభిమానినైన నాకు,సుమారు 700 పేజీల కథను రెండు పేజీల్లో చెప్పిన వాల్సర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి నవ్వొచ్చిందిగానీ,ఎందుకో కోపం అయితే రాలేదు.. అలాగే 'Caseman and Houseman' అనే కథలో తన కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడని ఒక రచయితని గురించి రాస్తూ “That Houseman is useless" అని ముగించడంలో,తనను తానే విమర్శించుకుంటున్నారా అనిపిస్తుంది..అలాగే 'The Fatherland','The Soldier' లాంటి కథల్లో తీవ్రమైన రిపబ్లిక్ భావాలు కలిగిన వ్యక్తిగా వాల్సర్ తన దేశభక్తిని చాటుకుంటారు..

'Reading' అనే మరో కథ నాలాంటి పాఠకులకు బాగా నచ్చే కథ..చదవడం వల్ల పాఠకులకు జరిగే లాభం ప్రక్కన పెడితే,కుదురుగా పుస్తకం పట్టుకుని కూర్చుంటే లోకమంతా ఏ గొడవలూ,ఆధిపత్య కలహాలూ లేకుండా ప్రశాంతంగా ఉంటుందని రచయిత అభిప్రాయపడతారు :)

The worst book in the world is not as bad as the complete indifference of never picking up a book at all. A trashy book is not nearly as dangerous as people sometimes think, and the so-called really good books are under certain conditions by no means as free of danger as people generally like to believe.

'The Italian Novella' అనే కథ మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ చదివే వాళ్లకి కాస్త జ్ఞానోదయం కలిగించే కథ..సాహిత్యాన్ని నిజజీవితంలోకి అన్వయించుకోవాలా వద్దా అనే సందిగ్ధావస్థలో ఇంకా ఎవరైనా ఉంటే ఆ అనుమానాలు ఈ కథ చదివితే తొలగిపోతాయి..'బ్యూటీ ఆఫ్ లిటరేచర్' ను ఎలా ఆస్వాదించాలో చెప్పే ఈ కథ వాల్సర్ రాసిన అన్ని కథల్లోకీ నాకు అమితంగా నచ్చింది...'Six little stories' లో ఒక కవికి తన కళతో (కవితలతో) ఉండే అనుబంధాన్ని హృద్యంగా చిత్రిస్తారు..ఈ కథ చదివితే రచనల్ని జడ్జి చేసే ముందు పాఠకులు మరోసారి ఆలోచిస్తారు..

The young man is an artist, memory his instrument, night his space, dream his time, and the melodies he gives to life are his faithful servants who speak of him into the greedy ears of the world. I am only an ear, an unutterably moved ear.

ఇకపోతే ఈయన కథల్లో ఈ 'బ్యూటిఫుల్','లవ్లీ' అనే పదాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి,అస్సలు విసుగు లేకుండా ఎన్నిసార్లు వీటిని వాడారో లెక్కేలేదు..రాబర్ట్ వాల్సర్ ప్రపంచంలో ప్రతీదీ అందమైనదే..ఒకవేళ ఆ అందం మన కళ్ళకు  కనపడలేదా,మరోసారి తన దృష్టితో చూడమంటారు..అలా అని ఏదో ఫాంటసీ ప్రపంచంలోలా కాకుండా కథలన్నీ వాస్తవాలకు దగ్గరగా,హంగూ-ఆర్భాటం లేని శైలితో పిచ్చాపాటీ కబుర్లు చెప్తున్నట్లు ఉంటాయి..
ఈ పుస్తకంలో ప్రకృతి,పల్లె వాతావరణం,ఋతువులు మొదలైనవాటి గురించిన వర్ణనలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి..ఊరికి దూరంగా ప్రకృతి కి దగ్గరగా, కొండలపై ఏకాంతపు నడక సమయాల్లో వాల్సర్ స్వరంలో పెల్లుబికే  భావావేశంలో,మంచు కురిసే కాలంలో చలికి వణికే పువ్వుల్లోని సున్నితత్వం కనిపిస్తుంది..చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్నీ,వేసవి ఉదయాలనీ,చెరువుపై నీటిలో అల్లిబిల్లిగా దోబూచులాడే సంధ్యా కిరణాల్నీ ఆస్వాదించి తరించమని చెప్పే సందర్భాలు ఇందులో కోకొల్లలు.

మనిషి మనుగడకు నియమాలు అవసరమనీ,నియమోల్లంఘన శాంతికి భగ్నమనీ వాల్సర్ నమ్మకం..ముఖ్యంగా 'ప్రతిఘటన' ఈయన కథల్లో కనిపించదు..ఈయన రాతలు కొన్ని కథలుగా కనిపిస్తే,మరి కొన్ని చిన్న చిన్న వ్యాసాల్లా ఉంటాయి.. మరికొన్ని సాయంకాలం టీ తాగుతూ చెప్పుకునే పిచ్చాపాటి కబుర్లలా ఉంటాయి..ఏ ఒక్క కథనూ ఒక గాటికి కట్టెయ్యడం అసాధ్యం..ఈ కథల్లో అంతర్లీనంగా వాల్సర్ ఒక జీవితానికి సరిపడే  ఫిలాసఫీనంతా బోధిస్తారు..వాల్సర్ ప్రపంచంలో మనిషి ఒంటరి కాడు..ప్రకృతిలో,సమాజంలో అతనొక భాగంగా ఉంటాడు..అలా ఉంటూనే అంతర్ముఖంగా ఉండటం ఆయన పాత్రల్లో కనిపించే మరో లక్షణం...

The sun shines down from the sky onto the lake which becomes completely like a sun with the sleepy shadows of the life all around it quietly rocking back and forth within it. There is nothing to disturb the scene, everything is lovely in the sharpest closeness, in the haziest distance; all the colors in the world play together and are a single charmed and charming world of morning.

Colors fill up your mind too much with all sorts of muddled stuff. Colors are too sweet a muddle, nothing more. I love things in one color, monotonous things. Snow is such a monotonous song. Why shouldn’t a color be able to make the same impression as singing? White is like a murmuring, whispering, praying. Fiery colors, like for instance Autumn colors, are a shriek. Green in midsummer is a many-voiced song with all the highest notes.

ఫెంటాస్టిక్ ఫిక్షన్ చదివిన వెంటనే వాల్సర్ ను చదవడం వండర్ ల్యాండ్ లో రోలర్ కోస్టర్ రైడ్ దిగిన వెంటనే పాపి కొండల మధ్య గోదావరి మీద పడవ ప్రయాణంలా ఉంది..ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలుండవు...కుదుపులూ,గతుకులూ అంతకంటే ఉండవు..మెదడు మీద పెద్ద భారం ఏమీ మోపకుండా ఈ పుస్తకం ఆద్యంతం,హాయిగా నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది..కొంతమంది చాలా సామాన్యంగా కనిపిస్తారు..తొలిపరిచయంలో నచ్చరు,కానీ ఓపిగ్గా వారి ప్రపంచాన్ని అర్ధం చేసుకునే కొద్దీ వారెంత లోతైన మనుషులో అర్ధం అవుతుంది.. కావాల్సిందల్లా ఓపిక..రాబర్ట్ వాల్సర్ లాంటి రచయితల్ని అర్ధంచేసుకోవాలంటే అలాంటి ఓపిక కావాలి..మొదట్లో నేరేషన్ చాలా స్లోగా అనిపించి పుస్తకం ప్రక్కన పెట్టేశాను..కానీ మళ్ళీ చదివేటప్పుడు కథలు నచ్చాయి..పుస్తకం సగం మనం పూర్తి చేస్తే,మిగతా సగం వాల్సర్ స్వయంగా పూర్తి చేయిస్తారు :) ఒక దశలో ఆయన ఆలోచనల్లోపడి కొట్టుకుపోవడం ఖాయం..భాషా సౌందర్యారాధకులూ,మితిమీరిన పాజిటివ్ వైబ్స్ అంటే ఎలర్జీ ఉన్నవారూ రాబర్ట్ వాల్సర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది :)

వాల్సర్ ధోరణిలో కన్ఫర్మిటీ..
This time, the teacher said, each of you can write whatever comes to mind. To be honest, nothing comes to mind. I don’t like this kind of freedom. I am happy to be tied to a set subject. I am too lazy to think of something myself. And what would it be? I’m equally happy to write about anything. I don’t like hunting around for a topic, I like looking for beautiful, delicate words.

In general, however intelligent I may seem to be, I possess very little thirst for knowledge. I think it’s because my nature is the opposite of curious. I am happy to let lots of things happen around me without worrying about how or why. That is no doubt something to criticize me for, and not very well suited to helping me find my path in life.

ఇందులో ఆర్ట్ కు సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలతో పాటు,రచయితలకూ,వ్యాసకర్తలకూ ఆయన తన అనుభవసారాన్నంతా రంగరించి చెప్పిన సలహాలు కూడా ఉన్నాయి..అయితే,రచయితల గురించి రాసిన ప్రతిసారీ ఆయన రచనాకాలంలో ఎదుర్కున్న వైఫల్యాలు,నిరాశ నిస్పృహలే ధ్వనిస్తాయి..

You can’t try to comprehend and appreciate any kind of art. Art wants to cuddle up to us. Its nature is so completely pure and self-sufficient that it doesn’t like it when you pursue it. It punishes whoever approaches it trying to grasp it. Artists know that. They are the ones who make art their profession, even though art absolutely does not like to be grasped. That is why I never want to be a musician. I am afraid of being punished by such a sweet creature.

పుస్తకంనుండి మరికొన్ని వాక్యాలు :

Anyone who can’t sit still but who always has to act loud and self-important to get his work done will never be able to write anything lively and beautiful.

In a certain sense he is noble. All unthinking, slovenly people are. When they do something bad it is only a game. It’s their passion, and being totally in the grip of a passion is never smart, but it is beautiful.

My imagination likes brightly colored things, like fairy tales. I don’t like dreaming about chores and homework. What’s all around you is for thinking, what’s far away is for dreaming.

Everything is happy.Even the colors on the beautiful lady’s clothes are happy. Colors must have feelings too. Colors are lovely and they go well with happiness.

But I forget that I am still a boy in grade A-2. How I long to escape from this stifling youth and enter into public life with its great demands, tempests, ideas, and actions.I lie here as though in chains. I feel like a mature, intelligent adult, and then I look in the mirror and what I see stuns me with its youth and insignificance.

If everything in the world were new and neat and clean I would not want to live, I would kill myself.

What can a young man who has barely seen anything of life himself have to communicate and impart? A person like that could only give a cold, superficial knowledge, unless he is a rare exception and knows how to be captivating with his mere presence.

The day was like a charming prince dressed in blue. Everywhere, it chirped and blossomed and bloomed and was green and fragrant. The world looked as though it could only have been created for tenderness, friendship, and love.

ONCE UPON a time there was a great talent who sat in his room all day long, looked out the window, and acted like a total do-nothing. The great talent knew he was a great talent, and this stupid, useless knowledge gave him food for thought all day.So I cry out loud to the world: Give a great talent no gifts and grant him no grants!    Our great talent here understood that he had to produce something, but he preferred to drift around on the streets and accomplished nothing.

Maybe I started writing poetry because I was poor and needed a hobby to feel richer.

I cannot deny the peace-loving part of myself, but nor can I deny that I am a true friend of the soldier’s life.

Morning and night were like wanting to and needing to. One drove you out into vast immensity, the other pulled you back into modest smallness again.

What I joyfully wrote and shooed forth was thrown into as it were solitary confinement, where it slowly shriveled up. Lines, sentences, pages died heartrending deaths in the air of the drawer, death by drying up and withering. I saw what I had so briskly brought forth turn dull, pale, and wan.

“Don’t you know that there is mighty little freedom anywhere you look? That everyone conforms damned well to everyone else? Put that in your pipe and smoke it or write it and be glad if you can get away with it.”

To be permitted to see someone made happy makes us happy ourselves, provided we are decent people.

Wednesday, June 6, 2018

The Letter Killers Club - Sigizmund Krzhizhanovsky

Sigizmund Krzhizhanovsky...పలకడానికి కూడా వీల్లేని ఈ పేరేంటి అనుకున్న పేరునే గత నెలరోజులుగా అదేపనిగా జపం చేస్తున్నాను..ఈయన రాసిన 'The Autobiography of a Corpse' కథలు చదివాకా వెంటనే అమెజాన్ లో మరో రెండు పుస్తకాలు ఆర్డర్ చేసుకున్నాను..కానీ నాలో Krzhizhanovsky ఫీవర్ క్రోనిక్ అయిపోతున్న దశలో సరిగ్గా వేసవి సెలవులు రావడంతో పుస్తకం చేతిలో ఉన్నా ఎప్పుడెప్పుడు చదువుతానా అని వేచి చూడాల్సొచ్చింది..అప్పటికీ మధ్య మధ్యలో పేజీలు తిప్పుతున్నా ఉహూ,అస్సలు పది పేజీలు కూడా సరిగ్గా చదవలేకపోయాను...బహుశా ఈయనకున్న ఇంట్రోవర్షన్ వైరల్ అనుకుంటా..ఎయిర్పోర్టుల్లోనో ,ట్రైన్లోనో,నలుగురి మధ్యా,ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుని చదివే రచయిత ఈయన కాదు..మునుపు చెప్పినట్లుగానే Krzhizhanovsky ని అర్ధం చేసుకోవాలంటే మొట్టమొదట కావాల్సింది పూర్తి స్థాయి ఏకాంతం..మెడిటేషన్లో కూర్చున్నట్లు కూర్చుని చదివితే గానీ అర్ధమయ్యే కథలు కాదు..పాఠకుడూ,ఆయనా తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేనట్లుండే ట్రాన్స్ లో ఆయన అక్షరాలు మనల్ని అద్భుతమైన ఆబ్స్ట్రాక్ట్ లోకాల్లోకి తీసుకెళ్తాయి..

Image courtesy Google
సరే పుస్తకం విషయానికొస్తే,"లెటర్ కిల్లర్స్ క్లబ్" ..ఈ టైటిల్ ఏంటి విచిత్రంగా  !జీవం లేని అక్షరాలకు రచయితలు తమ భావాలతో ప్రాణం పోస్తారని తెలుసు గానీ ,ఈ ప్రాణాలు తియ్యడమేంటో అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను..'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' అనే రహస్యమైన క్లబ్ కి ప్రెసిడెంట్ అయిన Zez నమ్మకం ప్రకారం,ఏదైనా ఒక ఆలోచన గానీ,భావన గానీ అక్షరరూపంలోకి మారినప్పుడు,అవి పుస్తకంలో ప్రింటెడ్ పేజీ మీద జూలాజికల్ స్పెసిమన్ లుగా ట్రాప్ చెయ్యబడి,జీవం కోల్పోతాయి..ఇది ఆర్టిస్టు ఇమాజినేషన్ కి అవరోధమని భావించే  Das,Tyd,Hig,Mov,Fev,Rar అనే మరి కొందర్ని కూడా కలుపుకుని శనివారం సాయంత్రాలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తాడు Zez...ఈ క్లబ్ సభ్యులు తమను తాము రీడర్స్ గానో,రైటర్స్ గానో కాక 'కన్సీవర్స్' గా చెప్పుకుంటారు.

మరి విమర్శలు,ఆటుపోట్లు లేకుండా సూర్యకాంతికి దూరంగా చీకట్లో పుట్టి,చీకట్లో కలిసి పోయే కళ (కథ) కాలపరీక్షకు తట్టుకుని నిలబడటానికి యోగ్యమైనదేనా అని  ఈ క్లబ్ లో వ్యక్తి  రార్ (Rar)  లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాలు వెతికే క్రమంలో మన నేరేటర్ ను ఎనిమిదో వ్యక్తిగా ఆ క్లబ్ కు ఆహ్వానిస్తారు..ఒక గదిలోని ఖాళీ బుక్ షెల్ఫ్ ల మధ్య,ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని,అందరికీ ప్రవేశార్హత లేని సెయింట్ ఫ్రాన్సిస్ పూలతోట లాగే ఈ సమావేశం కూడా రహస్యంగా జరుగుతుంటుంది..తమలోని ఆలోచనల్ని అక్షరీకరించకుండా , మెదడులో ప్రాణం పోసుకున్న కథల్ని అక్కడికక్కడే మిగతా ఏడుగురికీ చెప్తారు..అంటే కలమూ,కాగితమూ లేకుండా కథ,చెప్పేవారి నోటి నుండి,వినేవాళ్ళ చెవులకు ప్రయాణిస్తుంది..సమావేశం పూర్తి కాగానే ఎక్కడివారక్కడికి వెళ్ళిపోతుంటారు..

"షేక్స్ పియర్ ను ఇంగ్లీషు లిటరేచర్ ని రెండొందల ఏళ్ళుగా అణచివేసిన Wildly overgrown tree గా గోథే అభివర్ణిస్తే ,గోథే ను జర్మన్ సాహిత్యపు శరీరంలో వేళ్ళూనుకున్న monstrous కాన్సర్ గా Borne పోల్చారని" ఒక సందర్భంలో జెజ్ తన మిషన్ ను సమర్ధించుకుంటూ నేరేటర్ తో చెప్పే మాటల్లో మన రచయితకు,సాహిత్యంలోని సంప్రదాయవాదాల మీద ఉన్న తిరుగుబాటు ధోరణి వ్యక్తమవుతుంది..మరి జెజ్ తన సీక్రెట్ మిషన్ లో సఫలీకృతుడయ్యాడా లేదా అన్నది మిగతా కథ..

“Writers, in essence, are professional word tamers; if the words walking down the lines were living creatures, they would surely fear and hate the pen’s nib as tamed animals do the raised whip.”

రార్ చెప్పే తొలి కథ (నాటకం) Actus Morbi (History of illness) హేమ్లెట్ స్వభావంలోని డ్యుయాలిటీని థీమ్ గా తీసుకుని చెప్తారు..హేమ్లెట్ పాత్ర పోషించడానికి Guilden మరియు Stern అనే ఇద్దరు స్టేజి ఆర్టిస్టులు పోటీ పడగా స్టెర్న్ ను 'ల్యాండ్ ఆఫ్ రోల్స్' లోని మూడువందల ఏళ్ళనాటి తొలి హేమ్లెట్ పాత్రధారి రిచర్డ్ బర్బేజ్ పాత్ర ఆవహిస్తుంది..ఈ కథ హ్యూమన్ consciousness సామర్ధ్యాన్ని అంచనా వేసే దిశగా అక్కడక్కడా హాస్యపూరిత సంభాషణలతో సాగుతుంది..

Hamlet is,in essence,a duel between Yes and No.

It doesn't matter what's not clear to you.I stopped all the pipe's vents.All of them.The pipe player doesn't ask what happens next:he should know himself.After every gist comes the rest.On this point I agree with Hamlet:'The rest is silence .'Curtain."

రెండో శనివారం Tyd చెప్పే మూడు కథలూ 'The Feast of the Ass','The Goliard's Sack' , 'Notker the Stammerer and The Four Gospels' క్రిస్టియన్ మతంలోని నమ్మకాల ఆధారంగా నడిచే కథలు..

Since it's hard to improvise with people because they are alive (even the invented ones) and sometimes act outside the authorial design,if not contrary to it,I must fall back on enduring heroes.

My third character, the human one, belongs not to people-plots, but to people-themes: people-plots are very troublesome for a writer-their lives contain so many acts, encounters, and coincidences; put them in a story and they expand it to a novella, or even a novel; people-themes exist immanently, their plotless lives are off the main roads, they are part of an idea, reticent and passive; one of these is my hero.

ఈ పుస్తకంలో అమితంగా ఆకట్టుకున్న ఒక అంశం,Tyd ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్'..ఈ విశ్లేషణ Krzhizhanovsky రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి తోడ్పడుతుంది..ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్ , పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయట..ఈ రెంటిలో పీపుల్ ప్లాట్స్ అనేవి చాలా సాధారణమైనవి,వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే కథలన్నమాట...వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది..కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి..ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించినవి..మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్  అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం అస్సలు చెయ్యవు..పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి...విపరీతమైన అంతర్ముఖుడైన మన రచయితకు ఈ రెండో పధ్ధతి అంటే ప్రాణం..అందుకేనేమో ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాస్తారు..

మూడో శనివారం దాస్ చెప్పే Exes కథ ఒక డిస్టోపియాన్ హారర్ స్టోరీ, 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథని తలపించింది..ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది..నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఐ రోబోట్ లాంటి కాన్సెప్ట్స్ ను టెక్నాలజీ అందుబాటులోలేని ఆ రోజుల్లోనే తన కలంతో అలవోకగా రాసేశారు Krzhizhanovsky..చాలా కథల్లో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి ఫిలాసఫీలను ప్రస్తావిస్తూ సాగే నేరేషన్ ఫ్లో ని అందుకోడానికి కొన్ని చోట్ల కష్టం అనిపించినా , మరోచోట Fev చెప్పిన 'Tale of the three mouths' కథలోని Ing,Nig ,Gni లను విష్ణుశర్మ పంచతంత్రంలో ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది....ఈయన్ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో ఈ పుస్తకం చదివాకా పూర్తిగా అర్ధం అయ్యింది..తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు రచయిత..మెయిన్ స్ట్రీమ్ కు ఎదురెళ్ళడమనేదే విప్లవమైతే నాకు Krzhizhanovsky శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది ..ఈయన రచనల్లో భూతద్దం పెట్టి వెతికినా దొరకని ఒకే ఒక్క వస్తువు 'conformity' ..

ఈ టైటిల్ చూడగానే పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు Caryl Emerson ముందుమాటలో పొందుపరచిన,Krzhizhanovsky రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి.ఎప్పుడూ నాకు పుస్తకం చదివేశాక ముందు మాట చదవడం అలవాటు..ఈ ముందు మాటలో Krzhizhanovsky ని గురించిన కొన్ని విషయాలు చదివాకా మనసంతా చేదుగా అయిపోయింది..ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చూసిన Sigizmund Krzhizhanovsky ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "Do you love Pushkin ?"అని అడిగిన ప్రశ్నకు "I...I ........" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య Bovshek చెప్తూ ఆ సమయంలో 30 ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో,ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు...ఈ ఘట్టం చదివి చాలా బాధేసింది..ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అనిపిస్తుంది..'Kantian thinker'(ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న Sigizmund Krzhizhanovsky రచనలు బాగా ఇంటెలెక్చువల్ గా ఉండటం వలన అవి వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ  తీర్మానించడం గురించి చదివినప్పుడు గోర్కీ మీద విపరీతమైన కోపం వచ్చింది..దీనితో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం"  Krzhizhanovsky వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం..

When in 1939 ,he was finally voted into the Soviet Writers Union,one of his sponsors explained the embarrassing delay by noting that Comrade Krzhizhanovsky,an erudite polyglot and drama critic,was "very modest and impractical,unable to do anything for himself".More precisely,he was unwilling to revise on command,either for censors or for well-meaning collaborators and editors.He did try to do things for himself-although high mindedly,rarely in a "practical" or politically savvy way.

'Bridge over the Styx' ను తలపించే ఆఖరి కథ ఈ పుస్తకానికి చరమగీతి వంటిది..Sept మరణించిన తరువాత ఆ మృతదేహం నోట్లో సంప్రదాయం ప్రకారం,కాయిన్ (obol)పెడతారు..ఆ ఒబోల్ ను తన మృతదేహం ప్రక్కనే కాపలాగా కూర్చున్న ఒక చిన్న పాప ఫ్యాబియాకి డేట్స్ కొనుక్కోడానికి ఇచ్చేస్తాడు సెప్ట్(కార్ప్స్) ...Acheron డెత్ వాటర్స్ క్రాస్ చెయ్యడానికి సెప్ట్ కు ఆ కాయిన్ కావాలి..కానీ అది లేక అటు డెత్ కీ లైఫ్ కీ మధ్య,ఆ చిన్న పాప వస్తే తన కాయిన్ తనకిచ్చేస్తుందని వేచి చూస్తూ ఉండిపోతాడు...ఈ కథకి Krzhizhanovsky ఇచ్చిన ముగింపు చదివి తీరాల్సిందే...ఒక రచయిత సత్తా తెలిసేది ఇలాంటి కథల్లోనే అనిపించింది..తమ భావాలను నిరంతరం మృతి చెందే అక్షరాల మధ్యా,సాహిత్యం మధ్యా స్వచ్ఛంగా,సజీవంగా ఉంచుకోవడమనే సవాలును స్వీకరించిన లెటర్ కిల్లర్స్ క్లబ్ సభ్యులకు Mov చెప్పిన ఈ చివరి కథ ఒక ఆణిముత్యం..మరో మాట లేదు..ఈ కథలో రచయితలు కథలు చెప్పే క్రమంలో సంభాషణల్ని "Now then...." " Therefore .. "అంటూ ముగించడం చూస్తే కర్ట్ వొన్నేగాట్ రచన 'స్లాటర్ హౌస్ 5' గుర్తొచ్చింది.. అంతే కాకుండా Letterlessness,Booklessness,Facteaters అంటూ Krzhizhanovsky వాడే కొన్ని పదాలు కూడా భలే ఉంటాయి..

ఈ రచన పార్ట్లీ ఆటోబయోగ్రఫికల్ ఏమో అని చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించింది..అదే నిజమంటూ కార్ల్ ఎమెర్సన్ కూడా చాలా సాక్ష్యాలు చూపించారు..ఉదాహరణకు తల్లి మరణవార్త విన్న జెజ్,ఊరెళ్ళ డానికి తన లైబ్రరీలో పుస్తకాలన్నిటినీ అమ్మి బయలుదేరతాడు.. తిరిగొచ్చాక ఖాళీ గా ఉన్న తన బుక్ షెల్ఫ్ లను చూసి తన consciousness లోనే తన పుస్తకాల తాలూకా ఇమాజినరీ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు..ఆ క్షణం పునాదిగా  జెజ్ 'గేమ్ ఆఫ్ కన్సెప్షన్స్' మొదలవుతుంది..ఇవన్నీ రచయిత జీవితంలో యదార్థంగా జరిగిన సంఘటనలే..రెబెల్ అనగానే మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు గుర్తొచ్చినంతగా రోసా పార్క్స్ గుర్తురారని Quiet లో సుసాన్ కైన్ అన్నట్లు,రచనల విషయానికొచ్చేసరికి కామూ లాంటి వారు గుర్తొచ్చినంత తొందరగా బిల్ వాటర్సన్ లాంటి వాళ్ళు గుర్తురారు..మరి వారికీ వీరికీ భేదమేంటంటే ఈ రెండో రకంవారు ఇంట్రావర్ట్స్ కావడమే..ఇంట్రావర్ట్ రెబెల్స్..గట్టిగా అరిచి నిజాన్ని చెప్పడమే విప్లవం కాదని ఈ రచన ద్వారా తనదైన శైలిలో మరోసారి గుర్తు చేశారు Sigizmund Krzhizhanovsky.. ఇంతమంచి సాహిత్యాన్ని ముందుతరాలకు కానుకగా ఇచ్చిన రచయితకు శతకోటి వందనాలు..

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు,

Soon after that the youth locked away his keyboard and tried trading musical notes for letters; but he came up against an even greater obstacle; for he was- I repeat - person-theme, while our entire literature is based on plot constructions; he was unable to fragment himself and ramify ideas; he strove, as befits a person-theme, not from the one to the many, but from the many to the one. Sometimes a box of pens will contain an unsplit pen: it is just like the others, and no less sharp-but it cannot write.

Can one speak about silence without destroying it?

You cannot cross a threshold-from the inside or the outside-if the door is locked. I, of course, don't care about all those soul-like adjuncts known in the barbaric old days by such absurd names as -inner world' and so on-"

 “I must do as he does; everything as he does-it's easier that way.”

 I don't want to be an exon among inits. Why do you need me? You kill your letters, but I have none: neither conceptions nor letters. I repeat: I don't want to be an exon!”

I tried to prove that we are not conceivers but eccentrics, harmless only owing to our self-isolation. A conception without a line of text, I argued, is like a needle without thread: it pricks, but does not sew. I accused the others and myself of fearing matter. That's just what I called it: matterphobia. They attacked me, Zez worst of all. In my defense I said that I doubted our conceptions were conceptions since they hadn't been tested by the sun.-- Conceptions and plants can grow in the dark, botany and poetics can do without light,' Tyd riposted, supporting Zez.

But by the end of the week the thought of Rar had made me change my mind. From the first evening, this singularly original man had struck me as necessary and significant; his name, for all that it pretended to be a nonsense syllable, was the only one of them to suggest a meaning; nevertheless, the address bureau would not exchange it for an address.

life developments and plot developments merely cross, they do not coincide. Plotlines throw out disputes the way a plant throws out spores: into space, where they germinate. So then--I'm drifting --”

“Fooling people,” said Ing, “amuses only fools. Men's minds have become as coarse and flat as this field: it's easier to cackle than to think. Where are the syllogisms of the great Stagirite,the definitions of Averroes,Erigena's,hierarchy of ideas? People no longer know how to treat ideas: rather than look an idea in the eye, they peek under its tail.”

“Yes, the land of questions keeps expanding and multiplying its riches, the many-colored land of questions blooms ever more brightly and abundantly, while the land of answers is desolate, destitute, and dismal, like this graveyard. Therefore--”

The art of the literary endgame requires subtler and more varied denouements. To fall into a pit is easy, to climb out of it--if it's deep--is harder.

The stars are bright in the sky because of their "eternal separateness".Music,like happiness,succeeds only if it knows moments of silence or pause.And people most of the time,"are too close together to be close to one another".We perish not because of loneliness but because of entrapment and over-embracement.