Tuesday, June 13, 2017

Broken April - Ismail Kadare

Image courtesy Google
అవి 17 వ శతాబ్దపు అల్బేనియా higher plateau కి చెందిన కొండప్రాంతాలు,ఆ కొండల్లో Brezftoht అనే ఒక చిన్న ఊరు,ఆ ఊర్లో Gjorg Berisha అనే 26 ఏళ్ళ యువకుడు Zef Kryeqyqe అనే మరో వ్యక్తిని దారికాసి చంపుతాడు..సరే,రోజూ పేపర్లలో చూసే చంపుకోడాలు,నరుక్కోడాలే కదా ఇందులో విశేషం ఏముంది అని పెదవి విరిచి లేచి వెళ్లిపోయేలోపు రచయిత 'ఆగండాగండి,ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది" అంటూ కూర్చోపెడతారు..2009 లో తొలి Man Booker International Prize గెలుచుకున్న అల్బేనియా కు చెందిన ప్రముఖ సాహితీవేత్త Ismail Kadare రాసిన ఈ 'Broken April' 17 వ శతాబ్దపు అల్బేనియాలోని higher plateau లోని జ్ఞాతి వైరాలకు సాక్షిగా నిలుస్తుంది..
“In no other country in the world can one see people on the road who bear the mark of death, like trees marked for felling.”
జ్ఞాతివైరాన్ని గౌరవిస్తూ ఒక మనిషిని హత్య చెయ్యాల్సిరావడంతో పాటు,నీడలా వెంటాడే మృత్యువు చిహ్నాన్ని కూడా వెంట తీసుకుని నడవడం అల్బేనియన్ కొండప్రాంతపు వారి ఆచారం..ఇక్కడ Gjorg,Zef ను చంపడానికి వారిద్దరి మధ్యా వ్యక్తిగత విద్వేషాలేవీ కారణం కాదు..ఆ కొండప్రాంతం వారందరూ వారి సమాజాన్ని శాసించే 'Kanun' (చట్టం) చేతుల్లో కీలుబొమ్మలు..ఏళ్ళ తరబడి వారి సమాజంలో పాతుకుపోయిన జ్ఞాతి వైరాలను పెంచి పోషిస్తూ,ప్రాణాలు తీస్తూ,ప్రతిగా 'కన్నుకి కన్ను' పద్ధతిలో ప్రాణాలర్పిస్తూ ఉంటారు..ఆ సమాజంలో 'అతిథి','మృత్యువు' ఈ రెండిటినీ చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు.. ఇంటికి వచ్చిన అతిథిని పొరపాటున ఎవరైనా చంపితే 'Kanun' ప్రకారం ఆతిధ్యం ఇచ్చినవారు ఆ చావుకి ప్రతీకారం చెయ్యాలి..సుమారు డెబ్భై ఏళ్ళ క్రితం ఒక అర్ధరాత్రి నాడు ఒక అపరిచితుడు అతిథిగా Gjorg పూర్వీకుల తలుపు తట్టకపోయి ఉంటే తమ కుటుంబంలో ఈ మారణహోమం జరిగేది కాదని Gjorg అనుకుంటూ ఉంటాడు..'Kanun' ప్రకారం చంపినవాణ్ణి తిరిగి చంపేస్తే పగ పూర్తి కాదు..Gjorg కు 'Bessa' (క్షమాభిక్ష పరిమితి నెలరోజులు) ఇవ్వబడుతుంది..ఆ నెల రోజుల తరువాత ఆ మరణించిన వారి కుటుంబం నుండి ఎవరో ఒకరు మళ్ళీ Gjorg ను చంపొచ్చు..ఇలా చాలా కుటుంబాల్లో ఈ వైరం ఇలా కొనసాగుతూనే ఉంటుంది..అలాగే చంపినవారు భుజానికి నల్ల రిబ్బన్ కట్టుకోవడం,'బ్లడ్ టాక్స్' కట్టడం,Tower of Refuge లో తలదాచుకోవడం లాంటి అనేక 'Kanun' నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి..

Gjorg కథకు సమాంతరంగా మరో కొత్తగా పెళ్ళైన యువజంట Bessian,Diana లు Tirana నుండి హనీమూన్ కి Higher plateau కి రావడం గురించి చెప్తారు..రచయిత అయిన Bessian Vorpsi ఈ 'The Accursed Mountains' గురించి తన రచనల్లోని కాల్పనికతకు మూలాలను వెతికే క్రమంలో భార్యాసమేతంగా ఒక గుర్రబ్బగ్గీలో Northern Plateau (Rrafsh) కి బయలుదేరతాడు..Gjorg-Bessian కథలు అనుకోకుండా ఒక చోట కలుస్తాయి..ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ..

Bessa ను అనుసరించి 17th మార్చ్ నుండి 17th ఏప్రిల్ వరకు దొరికిన గడువులో Gjorg ఆలోచనలు ఏ విధంగా సాగాయో మనకు వివరిస్తారు..Blood Tax కట్టడానికి Kulla of Orosh కి వెళ్తూ,ఆ ప్రయాణంలో మరణం తధ్యమని తెలిసిన Gjorg మ్యూజింగ్స్ మనల్ని కూడా ఆలోచనలో పడేస్తాయి..
He consoled himself with the notion that perhaps it had to happen this way, and that if life outside the whirlpool of blood might perhaps be more peaceful, by the same token it would be even more dull and meaningless.He tried to call to mind families that were not involved in the blood feud, and he found no special signs of happiness in them. It even seemed to him that, sheltered from that danger, they hardly knew the value of life.
Gjorg sat numbly in a corner of the stone house. He could look forward to thirty days of safety. After that, death would lurk all around him. He would go about only in the dark like a bat, hiding from the sun, the moonlight, and the flicker of torches.
Then April would come, or rather just the first half of it. Gjorg felt an emptiness in the left side of his chest. From now on, April would be tinged with a bluish pain. . . . Yes, that was how April had always seemed to him—a month with something incomplete about it. April love, as the songs said. His own unfinished April.
'Ismail Kadare'...అనేక సార్లు నోబెల్ బరిలో నిలిచినప్పటికీ ఇంకా ఆ గౌరవం దక్కని అల్బేనియన్ రచయిత..
Reading Kadare in English, and particularly in the United States, means reading him through a glass darkly. అని The Newyork Sun పత్రికలో ఒక వ్యాసంలో చదివి ఆయన రచనల పట్ల ఆసక్తి కలిగి Broken April చదవడం తటస్థించింది..ఈయన శైలి స్టీరియోటైప్ రచనలకు విరుద్ధంగా ఉంది..విభిన్నమైన సంస్కృతుల సమాహారమైన ప్రపంచంలో యూరోప్ దేశమైన అల్బేనియాది చాలా వైవిధ్యమైన సంస్కృతి అంటారు..ఇందులో కనిపించే అల్బేనియా మనకు part-imaginary, part-epic world లా అనిపిస్తుంది..ఇందులో కథ,కథనం చదువుతున్నంతసేపూ ఏదో ఉటోపియా దేశంలో సంచరిస్తున్నట్లో,లేదా ఏదో dystopian నవల చదువుతున్నట్లో ఉంటుంది..'Kanun' నియమాలు మనకి మూఢత్వంగా,వాస్తవానికి విరుద్ధంగా,అనాగరికంగా అనిపిస్తాయి..
The funeral took place the next day around noon. The professional mourners came from afar, clawing their faces and tearing their hair according to the custom.
“A wedding party sets out even if there is a death in the house. When the bride enters the house, the dead person leaves. Tears on one side, song on the other.”
ఈ హత్యలు,మరణాలు ఆ సమాజపు అస్థిత్వంలో భాగంగానే కాక,ఒక దశలో వ్యాపారంగా అనిపిస్తుంది..ఇందులో మరో ముఖ్య పాత్ర Mark Ukacierra ది..ఈ చావుల పద్దులు లెక్క చూసే 'The Steward of the blood' పాత్రలో అతని ఆలోచనలు నాణానికి మరోవైపును చూపిస్తాయి..Kadare రచనా శైలి చాలా సరళం..కథంతా 3rd పర్సన్ నేరేషన్ లో నడుస్తుంది..ప్రవాహంలా సాగే కథనంతో పాటు కథలోని remoteness,mysteriousness లాంటివి ఆపకుండా చదివిస్తాయి..ఇందులో కథ గురించి గొప్పగా చెప్పుకోడానికేమీ లేనప్పటికీ కథనం మాత్రం అద్భుతం అని చెప్పచ్చు.. అల్బేనియా పర్వతాల్లో రాళ్ళతో కట్టిన Kulla(ఇళ్ళు) లూ,రాత్రివేళల్లో ఆ కిటికీల్లోంచి బయటకి పాకే సన్నని వెలుతురులూ,జనసంచారం పెద్దగా లేని వీధులూ,ఆ వీధుల్లోంచి అక్కడక్కడా కనిపించే కొండప్రాతపు బాటసారులూ,దట్టంగా కమ్ముకున్న పొగమంచు దారులూ,సందడిగా ఉండే Inn లూ ఇవన్నీ పుస్తకం పూర్తి చేశాక కూడా అల్బేనియా సంస్కృతి చిహ్నాలుగా మన మనోఫలకంపై నిలిచిపోతాయి..వీటితో పాటు అక్కడక్కడా 
'In the depressing darkness of the room, that shred of dawn was like a message of salvation'..లాంటి వర్ణనలు అలా తళుక్కున మెరిసి మాయమవుతూ ఉంటాయి..చివరగా,పుస్తకమంతా పగలు,హత్యలు లాంటి బరువైన అంశాలే అయినప్పటికీ వాటిని Kadare కలం ఆవిష్కరించిన తీరు,ఈ పుస్తకం చదివిన వారికి ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది..

మరో చోట తమ సంస్కృతి చేసిన కట్టుబాట్ల మధ్య సతమతమవుతూ Gjorg ఆలోచనలు..
“A road is for the use of men and livestock, for the passage of the living and the passage of the dead.” He smiled. Whatever he did, he could not escape its definitions. It was no use deceiving himself. The Kanun was stronger than it seemed. Its power reached everywhere, covering lands, the boundaries of fields. It made its way into the foundations of houses, into tombs, to churches, to roads, to markets, to weddings.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Perhaps it took years to get used to peace, just as it had taken so many years to get used to its absence. The mechanism of the blood feud was such that even as it freed you, it kept you bound to it in spirit for a long time.
Beyond that stretched the world whitened by the snow, a world to which nothing bound him anymore. For a long time he had felt himself a stranger in that world, absolutely superfluous, and if outside his window people sill expected anything of him, it was only in terms of the murder he was to do.
When all was said and done, the aspect of death conferred on the lives of these men something of the eternal, because its very grandeur raised them above paltry things and the petty meanness of life.“To measure one’s days by the yardstick of death, isn’t that a very special gift?
“It’s like a last authorization to go on leave in this world. The well-known saying that the living are only the dead on leave has a very real significance in our mountain country."

Thursday, June 1, 2017

Twenty Love Poems and a Song of Despair - Pablo Neruda

Image courtesy Google
ఈ ఏడాది నా పుస్తక పఠనం తాలూకూ గ్రహస్థితి ఏమంత బావున్నట్లు లేదు..ఆ మధ్య టైటిల్ చూసి 'భలే' అనుకుంటూ చదవడం మొదలు పెట్టిన 'The Success and Failure of Picasso' పూర్తి చేసేసరికి ఒక పూర్తి స్థాయి రీసెర్చ్ చేసినట్లు తలప్రాణం తోక్కొచ్చింది..అందులోనూ పుస్తకమంతా నాకు చాలా చికాకేసే అబ్స్ట్రాక్ట్ వ్యవహారం..ఆ పుస్తకం పూర్తయ్యాక బ్రతుకు జీవుడా అనుకుని నెలైనా కాలేదు,పాబ్లో నెరుడా చేతికి చిక్కాను..నేను పెయింటింగ్ లోనే అబ్స్ట్రాక్ట్  అంటే బుర్ర గోక్కునే టైపు..ఇక పోయెట్రీ లో అబ్స్ట్రాక్ట్ అంటే ! హ్మ్ ...

ఒక చోట,
and in the skin of the grapes
I thought I touched you. అని చదవగానే ఆహా అద్భుతం అనుకున్నాను..

అలాగే మరో చోట,
If suddenly         
you forget me         
do not look for me
for I shall already have forgotten you. అని చదివినప్పుడు నాలో narcissist వాహ్ అనుకుంది..

we begin again,
we end again
death and life.
And here we survive,
pure,with the purity that we created,
broader than the earth that could not lead us 
astray
eternal as the fire that will burn
as long as life endures....ఆ తరువాత భూమ్యాకాశాలు,నక్షత్రాలుమండలాలు,పాలపుంతలు,సమస్త ప్రాణికోటి అంతా చుట్టేసిన ఆ ప్రేమ నా స్థాయిని మించి చాలా దూరం వెళ్లిపోయింది..

సహజంగా కవిత్వం అంటే నాకు సంబంధించింది కాదులే అని సర్దిచెప్పుకుంటున్న సమయంలో,క్రిందటి సంవత్సరం రూమి,గిబ్రయిన్ లాంటి వారు చెరోవైపు భుజం తట్టి 'పరవాలేదమ్మాయి మేమున్నాం కదా '! అని ప్రోత్సహించగానే ఆనందపడిపోయి అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి అన్నట్లు నెరుడా ను చదవాలనుకోవడం సాహసమే..అసలు టైటిల్ చూసి ప్రేమ కనబడగానే పరిగెత్తి పారిపోకుండా పుస్తకం చదవడానికి పూనుకోవడం ఒక తప్పైతే,చదివాకా లెంపలేసుకుని,కాస్త చన్నీళ్లతో మొహం కడుక్కుని బుద్ధిగా వేరే కథలో కాకరకాయలో ఉన్న పుస్తకం చదువుకోకుండా ఇలా ఒక బ్లాగ్ పోస్టు రాసి గోడు వెళ్ళ బోసుకోవడం ఇంకో తప్పు..అక్కడక్కడా ఒకటీ అరా వాక్యాలు మినహా ఈ పుస్తకం చాలా నిరాశపరిచింది..ఇందులో కవిత్వం అర్ధంకాలేదనడంకంటే నాకు ఎందుకో రుచించలేదు అనడం సబబుగా ఉంటుంది..మరి అర్ధమైతే అంత గొప్ప కవి రాసిన కవిత్వం నాకెందుకు నచ్చలేదు అంటే,Perhaps Love and Poetry are not for me..

ఒక్కోసారి కొన్నిటి గొప్పదనం అర్ధం కావాలంటే కాస్త కాలానికి వదిలేసి మళ్ళీ ప్రయత్నించాలి...బహుశా పాబ్లో నెరుడాను మళ్ళీ చదివితే అప్పుడైనా ఆయన నాకు నచ్చుతారేమో చూడాలి ! బెటర్ లక్ నెక్స్ట్ టైం !!!

పుస్తకం నుండి మరికొన్ని,
EPITHALAMIUM నుండి,

At first I did not see you: I did not know
         that you were walking with me,
         until your roots
         pierced my chest,
         joined the threads of my blood,
         spoke through my mouth,
         flourished with me

Our love was born
         outside the walls,
         in the wind,
         in the night,
         in the earth,
         and that’s why the clay and the flower,
         the mud and the roots
         know your name,
         and know that my mouth
         joined yours
         because we were sown together in the earth