"Each generation must translate for itself" అంటారు T. S. Eliot. ఆయన మాటలు బ్రిటిష్ రచయిత్రి ఎమిలీ విల్సన్ ఇటీవలే అనువదించిన హోమర్ 'ఒడిస్సీ'కి సరిగ్గా సరిపోతాయి. నేను కొంతకాలం క్రితం చదివిన మార్గరెట్ ఆట్వుడ్ 'పెనెలోపియాడ్', మాడెలైన్ మిల్లర్ 'కిర్కె' (Circe)- ఈ రెండు రచనలూ ఎప్పటికైనా హోమర్ 'ఒడిస్సీ' మూలాన్ని చదవాలనే ఆసక్తి కలిగించాయి. ఎమిలీ పుణ్యమాని ఆ కోరిక ఇన్నాళ్ళకు తీరింది. రెండు ప్రఖ్యాత గ్రీకు కావ్యాల్లో ఒకటైన ఈ 'ఒడిస్సీ'కి 1614 లో తొలి ఆంగ్లానువాదం వెలువడిందట. ఆధునికాంగ్లంలో మూలానికి అతి దగ్గరగా చేసిన అనువాదమంటూ ఈ రచనకు న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన రివ్యూలు చూసాక ఇక పుస్తకం చదవాల్సిందే అని మొదలుపెట్టాను.
Image Courtesy Google |
ఈ 'ఒడిస్సీ' కథ ట్రోజన్ యుద్ధం ముగిసిన పదేళ్ళ తరువాత మొదలవుతుంది. పదేళ్ళపాటు జరిగిన ట్రోజన్ యుద్ధంలో ప్రియమ్ పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత ఒడిస్సియస్ 'ఇథాకా'కి తిరుగుప్రయాణమవుతాడు. దారిలో ఒక ద్వీపంలో మనుషుల్ని తినేసే ఒక కాలిప్సో (సముద్రపు దేవుడు పొసెడన్ కొడుకు, పోలిఫెమస్) గుహలో (ల్యాండ్ ఆఫ్ లోటస్ ఈటర్స్) తన సహచరులతో సహా చిక్కుకుపోతాడు. తన కొడుకుని గుడ్డివాడిగా మార్చాడన్న కోపంతో ఒడిస్సియస్ ని పొసెడన్ నానా కష్టాలపాలు చేస్తాడు. ఆ క్రమంలో ఒడిస్సియస్ మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె దగ్గర ఏడాదిపాటు, వనదేవత కాలిప్సో దగ్గర ఏడేళ్ళపాటు చిక్కుకుపోతాడు. యుద్ధం తర్వాత 20 ఏళ్ళపాటు అసలు జీవించి ఉన్నాడోలేడో తెలియని ఒడిస్సియస్ కోసం భార్య పెనెలొపె, కొడుకు టెలేమకస్ ఇథాకాలో వేచిచూస్తూ ఉంటారు. ఈలోగా ఒడిస్సియస్ మరణించి ఉంటాడని అనుకుని ఇథాకాలో పురుషులందరూ (suitors) పెనెలొపె ని తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వత్తిడితెస్తూ ఒడిస్సియస్ అంతఃపురంలో అతడి సంపదని తింటూ బైఠాయిస్తారు. ఈలోగా టెలేమకస్ తండ్రి జాడ వెతుక్కుంటూ పైలోస్, స్పార్టా లకు ప్రయాణమవుతాడు. ఒడిస్సియస్ సముద్రప్రయాణంలో Scylla and Charybdis వంటి రాక్షసులను తప్పించుకుంటూ గమ్యం చేరడం, భార్యను అవమానించిన వాళ్ళందర్నీ చంపడంతో కథ ముగుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథ ఇంతే.
గ్రీకు గాథల్తో పరిచయం ఉన్న వాళ్ళకి ఇదంతా తెలిసిందే. కానీ ఈ కథనల్లుకుని మనకు తెలియని ఆసక్తికరమైన అనేక చిన్న చిన్న కథలుంటాయి. మూలకథ విషయంలో మన రామాయణానికీ దీనికీ అనేక పోలికలు కూడా కనిపిస్తాయి. భర్త కోసం ఎదురుచూసే పెనెలొపె కొన్నిచోట్ల సీత పాత్రని తలపిస్తుంది. తనని పెళ్ళిచేసుకోవాలంటే ఒడిస్సియస్ విల్లును ఎక్కుపెట్టాలని (string it and shoot an arrow through 12 axes) Suitors కి పరీక్షపెట్టడం సీతా స్వయంవరాన్ని తలపిస్తుంది. ఒడిస్సియస్ తన ఇంట్లో ముష్టివాడిలా మారువేషంలో తిరగడం మన విరాటపర్వాన్ని జ్ఞప్తికి తెస్తుంది.
గ్రీకు పురాణాల్లో దేవుళ్ళ పాత్ర కీలకం. ఎటొచ్చీ ఆ దేవుళ్ళు కూడా మనుషుల్లాగే పగాప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు, వాళ్ళని శాంతపరచకపోతే ఆగ్రహిస్తారు. మనుషులు కీలుబొమ్మల్లా వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతుంటారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోడానికి జంతుబలులు ఇస్తుంటారు. జ్యూస్, పోసెడన్, ఎథేనా, కిర్కె, కాలిప్సో వంటి దేవతలు మౌంట్ ఒలింపస్ సభలో మనుష్యజాతికి దిశానిర్దేశం చేస్తుంటారు. ఒడిస్సియస్ ప్రయాణంలో జ్యూస్ కూతురు ఎథేనా అతడి వెన్నంటి ఉండి అడుగడుగునా సాయపడుతుంది.
నాకు సమకాలీన రచనల్లో ఉపయోగించే భాషతో చాలా పేచీలున్నాయి. ఆ మధ్య ఆహా-ఓహో అంటుంటే Chuck Palahniuk రచన ఒకటి మొదలుపెట్టి పట్టుమని పాతిక పేజీలు కూడా చదవలేక ప్రక్కన పెట్టాను. ఇక క్లాసిక్స్ అనువాదాల విషయంలో అయితే సమకాలీనానికి పూర్తిగా దూరం. కానీ ఈ తరం రచయితల్లో సారా హాల్, క్లైర్ కీగన్ వంటి కొందరు తమ రచనలతో నాలో ఆ చికాకుని పోగొట్టారు. 'ఒడిస్సీ'కి ఇన్ని అనువాదాలుండగా ఎమిలీ అనువాదమే ఎందుకు చదవాలి అంటే, ఆమె భాష కోసం, సొగసైన శైలి కోసం అంటాన్నేను. ఇంత చక్కని భాష ఈరోజుల్లో అరుదు.
రోజుకో యాభై పేజీలు అనుకున్నప్పటికీ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చదివితే సుమారు ఆరువందల పేజీల పుస్తకాన్ని రిఫెరెన్సులతో సహా చదివి పూర్తి చెయ్యడానికి నాకు ఇరవై రోజులు పట్టింది. ఎప్పుడూ చదివేటప్పుడు ఈబుక్ లో నోట్స్ మార్క్ చేసుకోవడం అలవాటు. అలాంటిది ఈసారి ఒక రీడింగ్ నోట్స్ పెట్టుకుని నోట్స్ చేత్తో రాసుకున్నాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. 'ఒడిస్సీ'లో అనేక పాత్రలు, వాటి గ్రీకు పేర్లన్నీ చాలా దగ్గరగా, ఒకేలా అనిపిస్తాయి. ఇక బంధుత్వాలు గుర్తుపెట్టుకోవడం సరేసరి. అలా నోట్స్ రాసుకుంటూ వెళ్తే ఆ పేర్లు గుర్తుండడమే కాకుండా అవి పునరావృతం అయినప్పుడు వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకోవడం కూడా సులభం. ఇలాంటి రచనలు చదివేటప్పుడు సమ్మరీ రాసుకుంటూ బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవడం బావుంటుంది.
ఇక హోమర్ 'ఒడిస్సీ' మూలానికీ, మనకు సినిమాల ద్వారానో, కథలుగానో తెలిసిన కథకూ కొన్ని తేడాలు గమనించాను.
* హెలెన్ భర్త మెనెలాస్ ను ప్రిన్స్ హెక్టర్ చంపేసినట్లు 'ట్రాయ్' లో చూపిస్తాడు. కానీ మెనెలాస్ ఈ మూలకథలో స్పార్టాకి తిరిగి వెళ్ళి భార్య హెలెన్ తో కలిసి సంతోషంగా రాజ్యమేలుతుంటాడు. తండ్రి ఆచూకీ కోసం వచ్చిన టెలేమకస్ ను ఆదరించి ఒడిస్సియస్ ని వెతికే క్రమంలో సాయంచేస్తాడు. ఇందులో హెలెన్ పారిస్ తో సంబంధం పెట్టుకోవడం కూడా కేవలం దైవేచ్ఛని అంటారు.
* మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె ఒడిస్సియస్ తన బృందంతో వచ్చినప్పుడు అతడి సహచరులందర్నీ ఉత్తిపుణ్యానికి పందులుగా మార్చేస్తుంది. మూల కథలో ఆమెను ఒక మంత్రగత్తెగా (wicked) చూపిస్తారు. కానీ మాడెలైన్ మిల్లర్ 'కిర్కె'లో ఇదే కథను మరో కోణంలో చూపిస్తారు. ఒడిస్సియస్ బృందం కిర్కె ఇంట్లో బస చెయ్యడానికి సహాయం కోసం వచ్చి, అతిథి మర్యాదలు అందుకుంటూ, తోడు లేని ఒంటరి స్త్రీ అని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోతే అప్పుడు ఆమె వాళ్ళను పందులుగా మార్చివేసిందని రాస్తారు.
* 'పెనెలోపియాడ్'లో ఈ కథను పూర్తిగా పెనెలొపె, ఆమె చెలికత్తెల దృష్టి కోణం నుండి చెప్పుకొస్తారు ఆట్వుడ్. అందులో ఒడిస్సియస్ suitorsతో బాటుగా పన్నెండుమంది చెలికత్తెలను కూడా పెనెలొపె ఎంత వారించినా వినకుండా ఊచకోత కోస్తాడని రాశారు. కానీ 'ఒడిస్సీ' మూలంలో మొత్తం యాభై మంది చెలికత్తెలుంటే అందులో పన్నెండు మందిని మాత్రమే (విధేయతలేకుండా suitors తో కలిసిపోయిన కారణంగా) ఒడిస్సియస్ హతమారుస్తాడు.
నావరకూ ఈ పుస్తకం 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' ని మరోసారి పూర్తిగా అనుభవంలోకి తెచ్చింది. హోమర్ 'ఒడిస్సీ' చదవాలనుకునే ఈ తరానికి ఇది చక్కని అనువాదం. హ్యాపీ రీడింగ్ :)
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :
Suitors అందర్నీ చంపి ఇంటి ఆవరణలో ఉగ్రరూపంలో నిలబడిన ఒడిస్సియస్ వర్ణన :
"After a lion eats a grazing ox,
its chest and jowls are thick with blood all over;
a dreadful sight. Just so, Odysseus
had blood
all over him—from hands to feet."
ఒడిస్సియస్ పేరు వెనుక కథ :
“Name him this. I am
disliked by many, all across the world,
and I dislike them back. So name the child
‘Odysseus.’
హెలెన్ పశ్చాత్తాపంతో కూడిన మాటలు :
I wished that Aphrodite had not made me
go crazy, when she took me from my country,
and made me leave my daughter and the bed
I shared with my fine, handsome, clever husband.”
ఒడిస్సియస్ ని వివాహమాడాలని నిర్ణయించుకుని అతణ్ణి చెరబట్టిన వనదేవత కాలిప్సో ఆగ్రహం :
Calypso shuddered and let fly at him.
“You cruel, jealous gods! You bear a grudge
whenever any goddess takes a man
to sleep with as a lover in her bed.
'లోటస్ ఈటర్స్' గురించి రాస్తూ :
With heavy hearts we sailed along and reached
the country of high-minded Cyclopes,
the mavericks. They put their trust in gods,
and do not plant their food from seed, nor plow,
and yet the barley, grain, and clustering wine-grapes 110
all flourish there, increased by rain from Zeus.
They hold no councils, have no common laws,
but live in caves on lofty mountaintops,
and each makes laws for his own wife and children,
without concern for what the others think.
పద్యానికీ, వచనానికీ మధ్య పరిధులు చెరిపేస్తూ ఎమిలీ వర్ణనలు :
"fair wind
befriending us behind the dark blue prow."
"The sun set. It was dark in all directions.
We reached the limits of deep-flowing Ocean,
where the Cimmerians live and have their city.
Their land is covered up in mist and cloud;
the shining Sun God never looks on them
with his bright beams—not when he rises up
into the starry sky, nor when he turns
back from the heavens to earth."
భార్య నమ్మకద్రోహం కారణంగా మరణించిన ఆగమేమ్నోన్ ఆత్మ ఒడిస్సియస్ తో అన్న మాటలు :
"So you must never treat your wife too well.
Do not let her know everything you know.
Tell her some things, hide others. But your wife
will not kill you, Odysseus. The wise
Penelope is much too sensible
to do such things."
మరి కొన్ని వాక్యాలు :
* I disapprove of too much friendliness
and of too much standoffishness. A balance
is best.
* Shame is not a friend to those in need
* Of all the creatures
that live and breathe and creep on earth, we humans are weakest. When the gods bestow on us
good fortune, and our legs are spry and limber,
we think that nothing can ever can go wrong;
but when the gods bring misery and pain,
We have to bear our suffering with calm.
ఆహా! ఓహో!!!
ReplyDeleteనిజంగా. ఎన్ని చదివారు మీరు!!!!
చాలా బావుంటాయి పోలికలు. నేను తెలుగులో చదివాను.
థాంక్ యూ సుజాత గారూ 💞
DeleteNow you have to read the Mahabharata in its entirety and write a comparative review. Very good review. Enjoyed reading it. Thanks.
ReplyDeleteThat's a wonderful idea.😀 Thank you so much Veluri garu.☺️🙏
Delete