Tuesday, May 30, 2017

The Return : Fathers,Sons and the Land In Between - Hisham Matar


Image Courtesy Google
I would never be part of anything. I would never really belong anywhere, and I knew it, and all my life would be the same, trying to belong, and failing.Always something would go wrong. I am a stranger and I always will be, and after all I didn’t really care.
Hisham Matar ఒక చోట గుర్తు చేసుకున్న ఈ Jean Rhys వాక్యాలు ఆయన జీవితానికి అతికినట్లు సరిపోతాయి..

చమురు నిల్వలు కలిగిన ఆఫ్రికా దేశాల్లో ఒకటైన లిబియాకు ఇటలీ వలస పాలన నుంచి విముక్తి లభించినా,1969 తరువాతి కాలంలో గడాఫీ నియంతృత్వం క్రింద మగ్గింది...గడాఫీ పాలనలో రెండు దశాబ్దాల నుండీ అదృశ్యమైన తండ్రి Jaballa Matar ను అన్వేషిస్తూ లండన్ లో రచయితగా స్థిరపడ్డ Hisham Matar రాసిన పుస్తకం ఈ 'The Return: Fathers, Sons and the Land In Between' ,2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక Pulitzer Prize for Biography or Autobiography తో పాటు Folio Prize ని కూడా గెలుచుకుంది..

లిబియాలో కింగ్ Idris పరిపాలనలో దౌత్యవేత్తగా పని చేస్తున్న సంపన్నుడు Jaballa Matar గడాఫీ నియంతృత్వానికి ఎదురెళ్ళిన కారణంగా లిబియా ను వదిలి ఈజిప్ట్ (కైరో)కు కుటుంబసమేతంగా వలస వెళ్ళిపోవల్సొస్తుంది..కానీ అణువణువునా దేశభక్తి నిండిన Jaballa,ఈజిప్ట్ నుండే గడాఫీకి వ్యతిరేకంగా లిబియాలో స్లీపింగ్ సెల్స్ ఏర్పాటు చేసి రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తారు..ఆయన ఒక ఉద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నాయకుడు,లిబియా బోర్డర్ కు దగ్గరలోని Chad లో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి,తన ధనాన్ని అందులో ధార పొయ్యడమే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న లిబియా సంపన్నుల దగ్గర నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించగల నైపుణ్యం ఉన్నవారు..Jaballa Matar కున్న ఆర్ధిక వనరులు ఆయన రాజకీయ నిబద్దతకు సరిపోలడంతో ఆయన గడాఫీ పాలనకు ప్రమాదకరంగా మారారు..కానీ తలదాచుకున్న ఈజిప్ట్ వెన్నుపోటుతో 12 మార్చ్ 1990 న వారి కైరో ఫ్లాట్ లోనే ఆయన్ని ఈజిప్ట్ సీక్రెట్ పోలీసులు కిడ్నాప్ చేసి రహస్యంగా Tripoli లోని Abu Salim జైలుకు తరలిస్తారు..

He was taken to Abu Salim prison, in Tripoli, which was known as “The Last Stop”—the place where the regime sent those it wanted to forget.

"Even today, to be Libyan is to live with questions." అంటూ ప్రశ్నలతోనే జీవితాన్ని గడిపేస్తూ,అదృశ్యంలో ఉన్న Jaballa Matar బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలియక దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన ఆచూకీ కోసం ఆ కుటుంబం చెయ్యని ప్రయత్నం లేదు..Hisham అమెరికా లో వ్యాపారస్థుడైన అన్నగారు Ziad తో కలిసి తండ్రిని వెతికే క్రమంలో ఎదుర్కున్న పరిస్థితులు కేవలం లిబియా రాజకీయ,సామాజిక పరిస్థితులను మాత్రమే కాక మానవ హక్కులను కాపాడే బాధ్యత విషయంలో ప్రపంచ దేశాల వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తాయి.

Hisham తండ్రి Jaballa Matar గురించి ఆచూకీ కోసం చేసే ప్రయత్నంలో స్వదేశమైన లిబియాకు పయనమవుతూ లిబియా లో తాను వదిలేసిన బాల్యాన్నీ,తన తండ్రిని దేశభక్తినీ,తమ కుటుంబపరిస్థితులను ఒక్కొక్కటిగా మనకు చెప్పడంతో పుస్తకం మొదలవుతుంది..
The plane was going to cross that gulf. Surely such journeys were reckless. This one could rob me of a skill that I have worked hard to cultivate: how to live away from places and people I love.
రాజ్యాధికారం కోసం పాలకుల మధ్య జరిగే ఆధిపత్యపోరులో ఎక్కువ ప్రభావితమయ్యేవి సామాన్యుల జీవితాలే..ఇందులో గడాఫీ నియంతృత్వంపై పోరాటంలో ప్రాణాలు వదిలిన Hisham కజిన్ Izzo,సుమారు ఇరవై ఏళ్లపాటు జైల్లో మగ్గిన అంకుల్ Mahmoud,Hmed,కజిన్స్ Ali,Saleh లాంటి వారి గురించిన విశేషాలతో పాటు మూడు తరాలుగా లిబియా రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులుగా మారిన వారి కుటుంబీకులను గురించిన సంగతులుంటాయి..అందరిలోకి Hisham తండ్రి Jaballa Matar వ్యక్తిత్వం మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంది..లిబియాలో ప్రముఖ వ్యక్తి/సంపన్నుడైన ఆయనలో కేవలం తన కుటుంబం గురించి ఆలోచించే కుటుంబ పెద్దతో పాటు తన దేశ సంక్షేమం కోసం తపించే దేశభక్తుడు కనిపిస్తారు..
“Don’t put yourselves in competition with Libya. You will always lose,” he had said, when once the three of us had tried to dissuade him from openly opposing Qaddafi. The silence that followed was the distance between him and us. The disagreement had a historical dimension. It placed a nation against the intimate reality of a family.
I have always associated the irrevocable and violent changes my family and my country went through in the following four decades with the image of my father—a poet turned officer turned, reluctantly, diplomat—dressed in a suit and tie, far away from home, collecting the pieces of a dead man. He was thirty-one years old. I was born later that year.
తండ్రి Jaballa బలమైన వ్యక్తిత్వానికి తోడు ఆయన అడుగులో అడుగువేస్తూ నడిచే ఆయన భార్య,Hisham కు తల్లి అయిన Fawzia Tarbah గురించి చెప్తూ,
In those days my mother operated as if the world were going to remain forever. And I suppose that is what we want from our mothers: to maintain the world and, even if it is a lie, to proceed as though the world could be maintained. Whereas my father was obsessed with the past and the future, with returning to and remaking Libya, my mother was devoted to the present. For this reason, she was the truly radical force in my adolescence.
తండ్రి నుండి ఆ ఇరవై ఏళ్లలో కేవలం రెండు ఉత్తరాలు మాత్రమే వీరికి అందుతాయి..Abu Salim జైల్లో నరకాన్ని అనుభవిస్తున్నా కూడా ఆ ఉత్తరాల్లో పట్టుసడలని Jaballa వ్యక్తిత్వం మనల్ని అబ్బురపరుస్తుంది..
The old man’s words, “I will not let disgrace stain my forehead,” were echoed thirty-six years later in Father’s first letter from prison, when he wrote, “My forehead does not know how to bow.”
తన తండ్రి ఒక సాధారణ వ్యక్తి కాదని తనకు తెలుసంటూనే ,కనీసం తన తండ్రి మరణించారో లేదో కూడా తెలీని పరిస్థితిలో రచయిత మాటలు,ఇరవై ఏళ్ళుగా ఒక కొడుకు అనుభవించిన మానసిక వేదనకి అద్దం పడతాయి..
I wished that “at least I had some happy man / as father, growing old in his own house.” But, unlike Telemachus, I continue, after twenty-five years, to endure my father’s “unknown death and silence.” I envy the finality of funerals. I covet the certainty. How it must be to wrap one’s hands around the bones, to choose how to place them, to be able to pat the patch of earth and sing a prayer
తొలుత Hisham తన కలంతో మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో,Jaballa అదృశ్యం ఇంటర్నేషనల్ 'లా' ను ఉల్లంఘించడమేననీ అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా గగ్గోలుపెట్టడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న రీతిలో లిబియా,ఈజిప్ట్,లండన్ దేశాలన్నీ రంగంలోకి దిగుతాయి..ఈ ప్రయత్నంలో గడాఫీ కొడుకు Seif el-Islam కు Hisham కు ముఖాముఖీ భేటీ కూడా జరుగుతుంది..మరి ఒక కరడుగట్టిన నియంత కొడుకు Seif ,Hisham కు సహాయం చేశాడా ! చివరకి  తండ్రీ కొడుకులు కలిశారా ? అసలు Jaballa బ్రతికే ఉన్నారా లేదా అనే విషయాలు మనకు చివర్లో తెలుస్తాయి..Hisham ఆవేదనలోంచి పుట్టిన అక్షరాలు,నియంతృత్వాన్ని విమర్శించేవారిని బహిరంగంగా ఉరి తీసి,సంగీతసాహిత్యాలను నాశనం చేసి,తీవ్రమైన మారణహోమం సృష్టించి,అనేక అకృత్యాలకు పాల్పడ్డ గడాఫీ era ను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి..మూడు దశాబ్దాలుగా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడే ప్రయత్నంలో లిబియా దేశంలో,తరాల మధ్య ఏర్పడిన పూడ్చలేని అగాధల గాధల్ని వివరిస్తాయి.

లిబియా పాలన చేతులు మారడం గురించి,
There are many other histories, of course, concerning those who, over the past three millennia, occupied Libya: the Phoenicians, the Greeks, the Romans, the Ottomans and, most recently, the Italians.
Rajab Abuhweish లిబియా struggle గురించి రాసిన కవిత,
I have no illness but the loss of 
noble folk and the foul ones who now, 
with calamitous, shameless faces, 
govern us. 
How many a child have they 
taken and whipped? 
The poor young flowers return 
confused, 
 made old without having 
lived.

బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ David Miliband,Hisham భుజం మీద చెయ్యి వేసి "నువ్వు మాలో ఒక్కడివే" అన్న మాటలపై Hisham అంతరంగం,
So tell me,’ he said, ‘Are you British now?’‘Yes.’‘Good man. Excellent. So you’re one of us.’– Perhaps it was the genuine warm confederacy of a fellow Brit. Or maybe it was the impatient, political, bullying pragmatism of power towards a person of mixed identities, a man whose preoccupations do not fit neatly inside the borders of one country
పుస్తకం నుండి మరి కొన్ని అంశాలు,
It was to figure out how on earth this mere writer was able to rustle up such “noise,” as Miliband put it.
“People can’t choose their history,"
I remembered what Sarah Hamoud, who used to run the Libya desk at Amnesty International, once told me: “There is no country where the oppressed and the oppressor are so intertwined as in Libya."
The words “frail” and “well” rumbled silently in my mouth. Hope, like water on parched earth, surged over me, heavy, drowning. It was tremendous news. Tremendous in the way a storm or a flood can be tremendous. When your father has been made to disappear for nineteen years, your desire to find him is equaled by your fear of finding him. You are the scene of a shameful private battle.
It makes me think that we all carry, from childhood, our death mask with us.

Sunday, May 28, 2017

Vanaprastham - M.T.Vasudevan Nair

Image courtesy Google
కేరళలో ఉంటూ M.T.వాసుదేవన్ నాయర్ ను చదవకపోవడం నేరం కదా ! ఆయన రచనల గురించి మునుపు చాలా విని,చదవాలి అనుకున్నప్పటికీ ఇప్పటివరకూ ఎందుకో చదవడం వీలుపడలేదు..ముందుగా ఆయన శైలిని రుచి చూపించింది 'వానప్రస్థం'..స్వప్నాలకూ,వాస్తవాలకు పొంతన కుదరని జీవితంలో వేరే వివాహం చేసుకుని గృహస్థు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించినప్పటికీ తొలి యవ్వనపుపొంగులో పుట్టిన తొలిప్రేమను మరచిపోలేని ఒక వృద్ధుడైన స్కూల్ మాష్టారు కథ ఇది..Palakkad జిల్లాలోని Ottappalam ఆ మాష్టారు స్వస్థలం..

ఇరవైల వయసులో ఆ మాష్టారు(పేరు చెప్పలేదు) తన విద్యార్థిని అయిన K.S.వినోదిని (విను) ని ఇష్టపడతాడు..మళ్ళీ ఎన్నో ఏళ్ళ తరువాత ఆమె రాసిన ఒక ఉత్తరం ద్వారా ఆమె మూకాంబిక ఆలయానికి వస్తోందని తెలిసి ఆమెతో కొంత సమయం గడపాలనే ఉద్దేశ్యంతో భగవతి ఆలయానికి వెళ్ళిన ఆ మాష్టారుకి ఎదురైన వినోదిని అప్పటిలాగానే ఉందా? మనసులో స్వప్నాలన్నీ వాస్తవ రూపంలో వినోదినిగా కళ్ళముందుకొచ్చినప్పుడు ఆయనలో కలిగిన భావాలేంటి? వారిద్దరి మధ్యా చోటు చేసుకున్న సంఘటనలేంటి అన్నది కథ..

కథను పూర్తిగా మనం మాష్టారి మాటల్లోనే  వింటాం..మూకాంబిక ఆలయంలో దర్శనం తరువాత ఇద్దరూ Kudajadri అనే కొండ మీద ఆలయానికి వెళ్తారు..ఆ ప్రయాణంలో అప్పటివరకూ కూడా పెళ్ళి కాని వినోదిని తాలూకూ ఊహలతో,వాస్తవానికి దూరంగా,యవ్వనం తాలూకూ మధురానుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలనేది మాష్టారి మనోగతమైతే,చెన్నైలో కేవలం మూడువందల రూపాయల జీతంతో స్కూల్ టీచర్ గా,ఇద్దరు వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతను మోస్తున్న వినోదిని జీవితం ఆయనకు వాస్తవాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది..దీనికి తోడు కడు పేదరికం అనుభవిస్తున్నా,మొహం మీద  చిరునవ్వు చెదరని కొండ మీది గుడి పూజారి చెప్పిన విషయాలు కూడా మాష్టార్ని కలచివేస్తాయి..ఆయన్ను ఊహాప్రపంచం లోనుంచి వాస్తవ ప్రపంచంలోకి లాక్కొచ్చి పడేస్తాయి..

వాసుదేవన్ నాయర్ వర్ణనలో ambiance కు కథలోని పాత్రలతో సరిసమాన ప్రాధాన్యత ఉంటుంది..ఒకరకంగా ఆయన కథకు నేపధ్యమే ప్రాణం అనిపించింది ..దూరంగా ఒక కొండ మీద మినుకుమినుకుమంటూ వెలిగే దీపాలు,సాయంకాలపు గాలికి మొహంమీద పరుచుకున్న నల్లని కురులు,కొండ మీద దట్టంగా కమ్ముకున్న పొగమంచు,రాళ్ళురప్పలతో నిండిన గతుకుల రోడ్డు,ఇలాంటి వర్ణనల ద్వారా ప్రకృతిని కూడా కథలో భాగం చేస్తూ,పాత్రల భావోద్వేగాలను ఆ వివరణల ద్వారా నిర్వచిస్తారు..

Thin silvers of mist had spread over the valley and obscured the tree tops.The writhing flames of the forest fire looked like a piece of red silk being fanned out to dry.

ఈ క్రింది తరహా వర్ణనలో ప్రాంపంచిక సుఖాలను కోరుకుంటూ ప్రయాణిస్తున్న వ్యక్తిని ప్రకృతి నిలువరించిన తీరు వ్యక్తమవుతుంది..

The wind had died down.It was calm and still.But the silence was not frightening.Master felt an unseen presence holding him close,chiding him,saying soundlessly,you are nothing..

అంతే కాకుండా మాష్టారూ-వినోదినిల మధ్య సంబంధాన్ని వివరించే క్రమంలో రచయిత ఖచ్చితమైన నిర్వచనాల జోలికి పోకపోవడం చాలా బావుంది..మనకు చెప్పకుండా మన ఊహకే వదిలేసిన విషయాలు చాలా ఉంటాయి..ఇలాంటి సెన్సిటివ్ కథాంశం లో ఒక్క సంఘటన గానీ,ఒక్క మాట గానీ కథ విలువను ఆసాంతం తగ్గించే ఆస్కారం ఉంది..కానీ ఒక ప్రక్క మనిషిలో మృగాన్ని కళ్ళకుకడుతూనే మరో ప్రక్క ఎక్కడా పాత్రల ఔచిత్యం తగ్గకుండా నిలకడగా కథ చెప్పిన విధానం బావుంది..

His eyes were closed but he clearly saw the tamed animal inside him step out from its cage,prowl through the wilderness of his old dreams,stalking its prey,and come back to its cage again.

ఒకప్పుడు నడిచిన జ్ఞాపకాల దారుల్లో మరోసారి నడవాలనుకోవడం అత్యాశే..ఒక వేళ కాదని నడక మొదలుపెట్టినా అంతకుముందు కాళ్ళకు తగిలిన సుతిమెత్తని గడ్డి స్థానంలో ఇప్పుడు ముళ్ళుండే అవకాశం కూడా ఉంటుంది..ఈ కథలోని సారాంశం అదే.. వారిద్దరి ప్రయాణం మొదలైనప్పుడు దూరంగా కొండలన్నీ పొగమంచుతో కప్పి ఉన్నాయని అంటారు,అలాగే కథ చివర్లో తిరుగు ప్రయాణంలో Vinodini gazed silently at the valley from which the mists had lifted..అనీ అనడంలో వారి మనసులపై ఊహాప్రపంచపు పరదాలు తొలిగిపోయాయని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది..ఇందులో మాష్టారికి,వినోదినికీ మధ్య జరిగే సంభాషణలు దాగుడుమూతలాటల్లా ఉంటాయి...నైతిక,సామాజిక విలువల్ని త్రోసిరాజనే ఈ కాలపు ప్రేమలకి దూరంగా చెప్పాలనుకున్నవి చెప్పలేక,అలా అని గతకాలపు జ్ఞాపకాలని మరచిపోలేక వారిద్దరూ పడే సంఘర్షణ అడుగడుగునా వ్యక్తమవుతూనే ఉంటుంది..ఇది గురుశిష్య సంబంధానికి ఉండే పరిధుల్ని గుర్తుచేస్తూనే కాలదోషం పట్టని అనుబంధాలు కూడా ఉంటాయని మరోసారి నిరూపిస్తుంది..ఈ కథ నాకు చాలా కాలం క్రిందట శివాజీ గణేశన్,రాధ కలిసి నటించిన 'ఆత్మబంధువు' ను గుర్తుకు తెచ్చింది..కాగా మలయాళంలో ఈ కథను జయరాం,సుహాసిని ముఖ్యపాత్రల్లో 'Teerthadanam' (2001) పేరిట సినిమాగా తీశారు.

Thursday, May 18, 2017

The Thing Around Your Neck - Chimamanda Ngozi Adichie

Image courtesy Google
విదేశీయులను అందునా నల్లజాతీయులను ప్రతినాయకులుగా చూపిస్తూ ఈ మధ్య తరచూ వస్తున్న సినిమాల ప్రభావమో ఏంటో గానీ నైజీరియా అనగానే నాకు వెంటనే గుర్తొచ్చే విషయాలు ఒకటి ఆయుధాలు చేతపట్టుకుని తిరిగే యువత లేదా డ్రగ్స్ ..అలాంటిది ఆ దేశపు సాహిత్యం అంటే హింస ప్రధానాంశంగా ఉండే కథలేమో అని కొన్ని preconceived notions తో నైజీరియన్ రచయిత్రి Chimamanda Ngozi Adichie రాసిన 'The Thing Around Your Neck' చదవడం మొదలు పెట్టాను..మొత్తం 12 కథలతో కూడిన ఈ పుస్తకాన్ని 2009 లో ప్రచురించారు..

థర్డ్ వరల్డ్ కంట్రీ గా పిలవబడే నైజీరియా దేశపు సంస్కృతీ-సంప్రదాయాలు,రాజకీయ సామాజిక పరిస్థితులు,ఆచార వ్యవహారాల చుట్టూ అల్లుకున్న ఈ కథలు,తమ ఉనికిని చాటుకునే నైజీరియన్ల మానసిక సంఘర్షణలకు అద్దం పడతాయి..కథలన్నీ నైజీరియాలోని Nsukka,Lagos లాంటి ప్రాంతాలలో రూపుదిద్దుకుంటాయి..అన్ని కథల్లోనూ నేరేటర్/ముఖ్యపాత్ర ఒక యువతిది కావడం,ఆమె స్వస్థలం నైజీరియా కావడం వల్ల ఈ కథల్ని రచయిత్రి స్వీయానుభవాల ఆధారంగా రాశారా అనిపిస్తాయి..కథల్లో పాత్రలన్నీ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పటికీ మధ్య మధ్యలో వారి వ్యావహారిక భాష 'Igbo' లోని చిన్న చిన్న పదాలను,వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటాయి..ఉదాహరణకు,ఒక చోట 'neighbors began to troop in to say ndo' అని రాస్తారు..ఈ 'ndo' ఏమిటని గూగుల్ చేస్తే  Igbo లో ndo అంటే  I'm sorry/sympathize with అట..ఇలాంటి నైజీరియా పదప్రయోగాలు దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తాయి..Igbo తో పాటు ఇతర నైజీరియా వ్యావహారిక భాషలైన Yoruba,pidgin,Hausa లాంటి భాషల గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది..

ఏ జాతి వారైనా,ఏ ప్రాంతం వారైనా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళి జీవించాల్సొచ్చినా మనుషులు అహరహం తమ అస్థిత్వం కాపాడుకునే యత్నంలోనే ఉంటారు..తమ ఉనికిలో భాగమైన తమ సంస్కృతీ,సంప్రదాయాల్ని సాధ్యమైనంత తమతో పాటే ఉంచుకుంటూ ముందుకుసాగే ప్రయత్నం చేస్తారు..ఆకలిదప్పులతో,చదువుకునేందుకు కనీసపు సదుపాయాలు కూడా లేని పేద దేశమైన నైజీరియాలో దుర్భర పరిస్థితుల్లో పుట్టి పెరిగిన ఎందరో యువతీ,యువకులు తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో సూపర్ పవర్ దేశమైన అమెరికా చేరి,అక్కడ సంస్కృతిలో ఇమడలేకా,తమ మూలాలు వదిలేసుకోలేకా పడే సంఘర్షణ ఈ కథల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది..ముఖ్యంగా అక్కడివారికి అమెరికా చేరే దారుల్ని సుగమం చేసేవి రెండు మార్గాలు ఒకటి క్రైస్తవ మిషనరీలు,రెండు వివాహాలు...

అన్ని కథల్లోకి బాగా ఆకట్టుకున్న తొలి కథ 'Cell One', Nsukka campus లో నివసించే ప్రొఫెసర్ తనయుడు Nnamabia అనే ఒక యువకుడిపై cult సంస్కృతి ప్రభావానికి అద్దం పడుతుంది..ఇందులో ప్రత్యేకత ఏంటంటే Chimamanda మనసుకి హత్తుకునే నేరేషన్ తో కథ పూర్తయ్యే సరికి మనకు తెలీకుండానే Nnamabia తో ఒక అనుబంధం ఏర్పడుతుంది..ఈ కథ ఒక్కటే కాదు,దాదాపు అన్ని కథల్లోని పాత్రలతోనూ మన ప్రమేయం లేకుండానే మనకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది..Imitation అనే మరో కథలో,Nkem అనే స్త్రీ,తన పిల్లలతో అమెరికాలో ఉండగా భర్త Obiora తమ స్వదేశం(నైజీరియా) లో Lagos లోని తన ఇంట్లో వేరే స్త్రీతో జీవిస్తున్నాడని తెలిసి మధనపడే కథ..ఇందులో తమ పిల్లలను ఇంగ్లీషు స్కూళ్ళలో అమెరికన్ సంపన్నుల మధ్య చదివిస్తూ,వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే క్రమంలో నైజీరియన్ల మానవసంబంధాలు చిన్నాభిన్నమవ్వడం చూస్తాం..

ఈ క్రింది వాక్యాలు చూస్తే Nkem అమెరికన్ సంస్కృతిని own చేసుకోడానికి పడుతున్న ఇబ్బందిని ఈ విధంగా నర్మగర్భంగా చెప్తారు రచయిత్రి..ఇలాంటి వర్ణనలు పుస్తకంలో చాలానే ఉంటాయి..
Nkem picks up the mask and presses her face to it; it is cold, heavy, lifeless. Yet when Obiora talks about it—and all the rest—he makes them seem breathing, warm.
The arrangers of marriage కూడా ఈ కోవలోకి వచ్చే కథే..ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాకు వచ్చిన నైజీరియా యువతీ అక్కడ తన భర్తకు ఆల్రెడీ వివాహమైందనీ ,అది కూడా గ్రీన్ కార్డు కోసం నామమాత్రపు వివాహమని తెలిసి కూడా పరిస్థితులతో రాజీపడే కథ..ఇందులో భర్త మనకు ఒక సినిమాలో 'లవంగం' పాత్రని గుర్తు చేస్తాడు..ఆ భర్త అమెరికన్ సంస్కృతిని సొంతం చేసుకునే క్రమంలో Lift ని elevator అనీ / Biscuit ను cookies అనీ / Jug ను pitcher అనీ అనాలని భార్యకు అమెరికన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ కరెక్ట్ చేస్తూ ఉంటాడు..
He said oyibo(Foreign) people were like that. If you did something in a different way, they would think you were abnormal, as though their way was the only possible way.
A private experience అనే కథలో నైజీరియా జీవన విధానాన్ని అమెరికన్ శైలి తో పోల్చుకుంటున్న ఒక యువతి,
Because she really belonged to this country now, this country of curiosities and crudities, this country where you could drive at night and not fear armed robbers, where restaurants served one person enough food for three. She does miss home, though, her friends, the cadence of Igbo and Yoruba and pidgin English spoken around her.
Tomorrow Is Too Far,The Headstrong Historian అనే రెండు కథలూ నైజీరియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి..వీటిల్లో ఆఫ్రికన్ తెగల్లోని మూఢనమ్మకాలు,ఆచార వ్యవహారాలను గురించిన వివరణలు ఉంటాయి..
Perhaps I should have bent down, grabbed a handful of sand, and thrown it at him, in the way my people do to make sure a person is not a ghost.
On Monday Of Last Week అనే కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది..ఇందులో ముఖ్యంగా అమెరికన్ పేరెంటింగ్ గురించి రచయిత్రి విమర్శలు ఆసక్తికరంగా ఉండటమే కాక నవ్వు తెప్పిస్తాయి..
She had come to understand that American parenting was a juggling of anxieties, and that it came with having too much food: a sated belly gave Americans time to worry that their child might have a rare disease that they had just read about, made them think they had the right to protect their child from disappointment and want and failure. A sated belly gave Americans the luxury of praising themselves for being good parents, as if caring for one’s child were the exception rather than the rule. It used to amuse Kamara, watching women on television talk about how much they loved their children, what sacrifices they made for them. Now, it annoyed her. Now that her periods insisted on coming month after month, she resented those manicured women with their effortlessly conceived babies and their breezy expressions like “healthy parenting.
Ghosts అనే మరో కథ 6th July 1967 నాటి నైజీరియా లో Biafran war పరిస్థితులకు దర్పణం పడుతుంది..Jumping monkey hill అనే మరో కథలో ఒక రైటర్స్ వర్క్ షాప్ లో భాగం పంచుకోడానికి వచ్చిన Ujunwa తమ దేశాన్ని థర్డ్ వరల్డ్ అంటూ,తనను తక్కువ చేసి చూడడాన్ని వ్యతిరేకిస్తుంది..
Ujunwa shouted at him, “This kind of attitude is why they could kill you and herd you into townships and require passes from you before you could walk on your own land!

రచయిత్రి ఎంచుకున్న అంశాలు క్లిష్టమైనవైనా వాటిని చెప్పిన తీరు మాత్రం చాలా సరళంగా ఉంటుంది..218 పేజీల పుస్తకం అయినా కథలన్నీ ఆపకుండా చదివిస్తాయి..ముఖ్యంగా రచయిత్రిలోని ఎమోషనల్ ఇంటలిజెన్స్ మనల్ని అబ్బురపరుస్తుంది..ఈ కథల్లో మనకు అస్సలు పరిచయం లేని 'నైజీరియా' చీకటి కోణాలు కనిపిస్తాయి..దాదాపూ ప్రతి కథలోనూ బాల్యం నుండీ అణచివేతకు లోనైన నైజీరియా యువత ఆక్రందనలు గళం విప్పుతాయి..కొన్ని కథలు చదివాక 'పరజాతీయులైనా వారికీ మనకీ ఎన్ని సారూప్యతలున్నాయో కదా !' అని అనిపించడం కద్దు..ముఖ్యంగా ఈ కథల్లో అమెరికన్ డ్రీమ్ విషయంలో నైజీరియన్లకీ,ఇండియన్లకీ పోలికలు చాలానే ఉన్నాయి..మధ్య మధ్యలో అమెరికన్ జీవన విధానాన్ని ఎత్తిపొడుస్తూ వేసే కొన్ని చురకలు కూడా ఉంటాయి..ఇందులో కొన్ని కథల్లో నైజీరియన్ యువత అమెరికన్ డ్రీమ్ ను సాకారం చేసుకునే క్రమంలో ఎదుర్కొనే వివక్షలు,అవమానాలను గురించి రాస్తే మరికొన్ని కథల్లో ఆ అవమానాలను అధిగమించి తమ అస్థిత్వాన్ని చాటుకునే వారి గురించి రాస్తారు..కానీ చివరగా ప్రతి కథా మనకి సూటిగా ఒక్కే ప్రశ్న సంధిస్తుంది.."అభివృద్ధా ?? నైతికతా ?? "

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు,
“I read a book that says we don’t fall in love, we climb up to love. Maybe if you gave it time—” by
The Tanzanian told her that all fiction was therapy, some sort of therapy, no matter what anybody said.
But then, my people say that a famous animal does not always fill the hunter’s basket.
You did not know that people could simply choose not to go to school, that people could dictate to life. You were used to accepting what life gave, writing down what life dictated.
He said you were wrong to call him self-righteous. You said he was wrong to call only the poor Indians in Bombay the real Indians. Did it mean he wasn’t a real American, since he was not like the poor fat people you and he had seen in Hartford?
Ghosts అనే కథ నుండి,
“The war took Zik,” I said in Igbo. Speaking of death in English has always had, for me, a disquieting finality.
We are the educated ones, taught to keep tightly rigid our boundaries of what is considered real.
There were emotions she wanted to hold in the palm of her hand that were simply no longer there.
The shivering అనే కథ నుండి,
He was always struggling to be different, even when it didn’t matter. It was as if he was performing his life instead of living his life.
Tomorrow is too far  కథ నుండి, 
Even at ten you knew that some people can take up too much space by simply being, that by existing, some people can stifle others.

The Success and Failure of Picasso - John Berger

Image courtesy Google
'పికాసో చిత్రమా' అంటూ వినిపించే సినిమా పాటల్లోనూ,'పికాసో లాంటి పెయింటర్' అంటూ మాటల్లో సహజంగా దొర్లే వాక్యాల్లోనూ వినడమే తప్ప పికాసో చిత్రాల్ని ఎప్పుడూ చూసింది లేదు,పికాసో గురించి ఏమీ చదివింది కూడా లేదు..ఇప్పటివరకూ 'పికాసో' అంటే నాకు అర్ధం కాని ఒక గొప్ప విషయం గురించి విన్న భావనతో కూడిన ఒక ఎలియన్ ఫీలింగ్ మాత్రమే..అలాంటిది 'The Success and Failure of Picasso' అన్న టైటిల్ చూడగానే ఎందుకో చదవాలనిపించింది,కారణం టైటిల్ లో ఉన్న 'సక్సెస్' కాదు,దాని వెన్నంటే ఉన్న 'ఫెయిల్యూర్'..ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా ఎనలేని కీర్తిప్రతిష్టలు గడించిన వ్యక్తిలో ఇంకా వైఫల్యాలా ! ఒక వేళ ఉంటే ఆ వైఫల్యాలు ఎలా ఉంటాయి ! అసలివి వ్యక్తిగతమా,వృత్తిగతమా తెలుసుకోవాలనే ఆసక్తితో ఈ పుస్తకం చదవడం జరిగింది..ఇంగ్లండుకు చెందిన ఆర్ట్ క్రిటిక్,రచయిత అయిన John Berger ఈ పుస్తకంలో ఒక ఆర్టిస్ట్ గా పికాసో జీవితంలో ఆటుపోట్లని రాజకీయ,చారిత్రాత్మక అంశాల ఆధారంగా వివరిస్తారు..

మరి ఏదో చిన్న కుతూహలం తప్ప వేరే పెట్టుబడేమీ లేని కారణంగా,చిత్రకళారంగానికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణలతో కూడిన ఈ పుస్తకాన్ని చదవడానికి చాలా కష్టపడవలసొచ్చింది..చాలా సార్లు గూగుల్ ను ఆశ్రయించక తప్పలేదు..కానీ కొంచెం కష్టపడ్డా పెయింటింగ్ కు సంబంధించిన చాలా విషయవిశేషాలను గూర్చి తెలిసింది..ఇక పుస్తకం విషయానికొస్తే మొదటి నలభై పేజీలు చిన్నతనం నుండీ పికాసో గురించిన విశేషాలతో ఆపకుండా చదివించాయి..తరువాత మెల్లిగా హైవే మీద వెళ్తున్నట్లున్న ప్రయాణం కాస్తా గతుకుల రోడ్ లోకి వెళ్ళిపోయినట్లు ఆయన ఆర్ట్ ను ప్రభావితం చేసిన అంశాల మీదుగా పికాసో పుట్టి పెరిగిన స్పెయిన్ దేశపు సంస్కృతి,అక్కడి ఫ్యూడల్ విధానాలు,మొదటి ప్రపంచ యుద్ధం,యూరోప్ లోని కాపిటలిస్ట్ విధానాలూ లాంటి చారిత్రాత్మక అంశాల దిశగా సాగింది..కానీ ఈ తరహా అనాలిసిస్ ను అస్సలు ఊహించని సగటు రీడర్ కి అది కాస్త కష్టమైన ప్రయాణమే..పికాసో ఆర్ట్ కీ,ఈ లోతైన సాంస్కృతిక విశ్లేషణలకీ ప్రత్యక్షంగా ఉన్న సంబంధాన్ని రచయిత పలుమార్లు సోదాహరణంగా నిరూపించినప్పటికీ,చాలా చోట్ల 'పికాసో' అనే నిర్ణీత మార్గం నుంచి చాలా దూరం వెళ్ళిపోయారనిపిస్తుంది..ముఖ్యంగా పికాసో వ్యక్తిగత జీవితాన్ని మంచి మాస్ మసాలా స్టోరీలా ఒక సాంగ్,ఒక  ఫైట్ తరహాలో కమర్షియల్ గా చెప్పేస్తారేమో అని ఊహించి ఈ పుస్తకం చదివితే ఎదురయ్యేది ఆశాభంగమే... అలా కాకుండా వ్యక్తిగత బలహీనతలను,వ్యక్తిగత జీవితాన్ని తూర్పారబడుతూ చేసే విమర్శలకు దూరంగా అసలుసిసలు Constructive criticism అంటే ఎలా ఉంటుందో చదవాలనుకుంటే ఇది తప్పక చదవాల్సిన పుస్తకం..

14 ఏళ్ళ వయసులోనే 'Child Prodigy' గా పికాసో చిత్రించిన ఒక చిత్రాన్ని చూసి Provincial art టీచర్ అయిన ఆయన తండ్రి పికాసో లోని నైపుణ్యాన్ని గుర్తించి,తాను ఇక కుంచెను ముట్టనని నిర్ణయించుకుని పికాసోకు తన స్థానాన్ని ఇచ్చేసిన సందర్భం నుండి పికాసో చిత్రకళా ప్రస్థానం మొదలవుతుంది..తండ్రి వద్ద నుండి దొరికిన ఈ అరుదైన గౌరవం ఆ పసితనంలో పికాసో వ్యక్తిత్వరూపకల్పనకు విస్మరించలేని విధంగా దోహదపడిందంటారు..
To the prodigy himself his power also seems mysterious, because initially it comes to him without effort. It is not that he has to arrive somewhere; he is visited.
ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించారు.. మొదటి భాగం (Picasso) లో ఒక వ్యక్తిగా పికాసో పై సామాజిక అంశాల ప్రభావాన్ని వివరిస్తే,రెండో భాగం (The Painter)లో ఒక ఆర్టిస్ట్ గా ఆయన చిత్రాల్నిప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్ లతో పోలుస్తారు..స్పెయిన్ ఫ్యూడల్ వ్యవస్థలో తన ఉనికి అసాధ్యమని భావించి ఒక ఆర్టిస్టుగా తన కళను అభివృద్ధి చేసుకునే క్రమంలో పారిస్ అవసరం తనకుంది గనుక ఆ సంస్కృతితో చేతులు కలుపుతూనే తన స్పెయిన్ మధ్యతరగతి మూలాల్ని వదిలిపెట్టని పికాసోను 'Vertical Invader' గా అభివర్ణిస్తారు..
Picasso was a vertical invader. He came up from Spain through the trap-door of Barcelona on to the stage of Europe.
1907 తరువాత Max Jacob,Guillaume Apollinaire,Braque లాంటి ఫ్రెంచ్ పెయింటర్స్,కవుల సాహచర్యంలో పికాసో పూర్తిగా తన నుండి తాను విడివడి పనిచేశారంటారు..ఆ క్రమంలోనే పికాసో,Braque లు చిత్రకళారంగంలో ఒక అరుదైన ప్రక్రియ అయిన క్యూబిజంకు అంకురార్పణ చేశారు..ఈ క్రమంలో Cubism పుట్టుపూర్వోత్తరాలు,ఆ ఆర్ట్ ఫామ్ లక్షణాల గురించిన వివరణాలుంటాయి..చదివేవాళ్ళకి సులభంగా అర్ధం కావడానికి ఇందులో అవసరమైన చోటల్లా పికాసో పెయింటింగ్స్,వాటికి సంబంధించిన వివరణలు ఉన్నాయి..అలాగే పికాసో ఆర్ట్ ను ప్రభావితం చేసిన వారి చిత్రాలు,అలాగే పికాసో ఆర్ట్ ను ఆయన సమకాలీనులైన చిత్రకారుల పెయింటింగ్స్ తో పోలుస్తూ వివరణలు ఇవ్వడం జరిగింది..
Bellini, Michelangelo, Titian, Tintoretto, Poussin, Rembrandt, Goya, Turner, Degas, Cézanne, Monet, Matisse, Braque, all produced some of their very-greatest works when they were over sixty-five.
Juan Gris has to travel and arrive- and believes in the intellect...Picasso is visited,denies progress-the picture does not go through stages but suffers metamorphoses – and thinks of the brain, not in terms of the intellect, but in terms of dream sequences. Gris’s paintings develop from beginning to end. Picasso’s paintings, however much they may appear to change, remain essentially what they were at their beginning.
ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పడానికి Berger ఎన్నుకున్న మార్గం సాధారణ విశ్లేషకుల మార్గానికి భిన్నంగా అనిపించింది..ఇందులో పికాసో వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా దృష్టిసారించారు..సహజంగా ఒక అంశాన్నివిశ్లేషించడానికి రచయితలు అనుసరించే విధానాలకు విరుద్ధంగా ఇందులో John Berger అనాలిసిస్ multiple dimensions లో సాగుతుంది..ఒక విషయాన్ని ఆయన చూసినన్ని కోణాల్లో చూడడం అసలు సాధ్యమా అనిపించే ఎనాలిసిస్ అది..అలాగే ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ ఆయా రంగాలపై ఎంతో పట్టు ఉన్న వ్యక్తులకు మాత్రమే సాధ్యం..John Berger ఈ పుస్తకాన్ని పికాసో ఆస్థిపాస్తులు,సోషల్ స్టేటస్ గురించిన ప్రస్తావనతో మొదలుపెట్టడంతో పాటు ఇందులో పికాసోను నిర్వచించే క్రమంలో తన అభిప్రాయాలన్నీ ఊహాజనితమైనవీ,అంచనాల ఆధారంగా నిర్మితమైనవనీ పలుమార్లు స్పష్టం చెయ్యడం గమనార్హం...ఆర్టిస్ట్ కు ఏకాంతం అత్యవసరమైనప్పటికీ  పికాసో విషయంలో ఆ ఏకాంతం క్రమేపీ ఒంటరితనంగా మారడం,దానికితోడు ప్రయాణాలంటే ఇష్టపడని పికాసో 1904లో తన ఊరైన Malaga (స్పెయిన్) నుండి పారిస్ కు వెళ్ళి స్థిరాపడ్డాక  ఫ్రాన్స్,బార్సిలోనాల మినహా ఎక్కడికీ వెళ్ళకపోవడం లాంటివి ఆయన నైపుణ్యానికి పరిమితులు విధించాయంటారు..
Some suffer loneliness in a crowd, others become lonely when there is not a soul in sight. We comfort ourselves by saying that it is also the privilege of great men to be lonely.
Picasso’s painting does not fit into this tradition. It makes no reference to the contemporary world, and ignores any development of knowledge or feelings.
ఒక successful వ్యక్తి ని విమర్శించడానికి సమాజం జంకుతుంది..ఆ ఫేమ్ తో వారికున్న అవసరం వారిని దేవుడిలా కొలిచేలా చేస్తుందంటారు Berger..కానీ ఒక కళాకారుడి విషయంలో ఈ idealism చాలా నష్టాన్ని కలుగజేస్తుంది,వారేం చేసినా అదే సరైనది అనే భావం వారి అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది...పికాసో విషయంలో అదే జరిగిందంటారు,ఆయన ఒక బ్రాండ్ గా ఎదిగిన తరువాత ఆయన్ను దేవుడిగా కొలిచే ఆయన చుట్టూ ఉన్న సమాజం ఆయన కళకు అడ్డంకిగా మారిందనీ,దాని ప్రభావం వల్ల వయసు పెరిగేకొద్దీ ఆయన కళలో 'development' లోపించిందనేది Berger వాదన..
The example of Picasso is not only relevant to artists. It is because he is an artist that we can observe his experience more easily. His experience proves that success and honour, as offered by bourgeois society, should no longer tempt anyone. It is no longer a question of refusing on principle, but of refusing for the sake of self-preservation. The time when the bourgeoisie could offer true privileges has passed. What they offer now is not worth having.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత Braque,Gris వంటి తన సహచరులకు దూరమైన పికాసోను ,'unique people' సాహచర్యం లోపించిన కారణంగా తీవ్రమైన ఒంటరితనం వేధించిందంటారు..Berger దృష్టిలో పికాసో కళకు అతి పెద్ద అడ్డంకి 'Lack of Subjects'...1945 తరువాత పికాసో కుంచె నుండి వెలువడ్డ చిత్రాలన్నీ ఒకే మూసలో ఉండటానికి ఇదొక ముఖ్య కారణంగా చెప్తారు..పికాసో కళ Cubism పుట్టిన 1907-1914 మధ్య కాలం మినహా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదంటారు..పికాసో చిత్రాలకు 'subject' కొరత కారణంగా ఆయన చిత్రాల్లో వ్యక్తీకరించిన భావాలే తిరిగి పునరావృతమయ్యేవి..ఉదాహరణకు ఆయన Marie-Thérèse ను మోడల్ గా గీసినన్ని చిత్రాలు మరెవరివీ లేవంటారు..వృద్ధాప్యంలో పికాసోకు lack of  inspiration/isolation కారణంగా ఆయన చిత్రాల్లో అసహనం చోటు చేసుకుందంటూ,ఆ సమయంలో ఆయన గీసిన చిత్రాల్లోని అనేక లోపాలను ఉదహరిస్తారు..ఇలా పాబ్లో పికాసో ఆర్ట్ ను ఆయన చిన్నతనం నుండీ వృద్ధాప్యం వరకూ పలు దశల్లో ప్రశంస/విమర్శలతో చర్చించారు Berger..ఆర్టిస్టులు,పెయింటింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది..అవ్వడానికి 240 పేజీల పుస్తకమే అయినప్పటికీ చాలా ఓపిగ్గా చదవాల్సిన పుస్తకం ఇది..John Berger శైలిలో ఆయనకు రాజకీయ,చారిత్రక,చిత్రకళ వంటి వివిధ రంగాలపై ఉన్న పట్టు ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది..నా అవగాహన స్థాయిని మించిన పుస్తకం అనిపించినప్పటికీ ఆయన మరికొన్ని పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలిగించిన రచన ఇది.

పుస్తకంనుండి మరి కొన్ని నచ్చిన అంశాలు,
మరో ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు చార్లీ చాప్లిన్ తో పికాసోను పోలుస్తూ,
In Chaplin’s case, the artist – or rather his art – has counted far more than the man. In Picasso’s case the man, the personality, has put his art in the shade. It is too early to explain why this has happened. But it is a point we shall come back to again and again.
పికాసో లోని ఆర్టిస్ట్ ఆయన వ్యక్తిత్వం ఛాయలో కనుమరుగయ్యారంటూ,
One of his friends – Manolo the Spanish sculptor – said this quite simply: ‘For Picasso, you see, painting is a side-issue''
Jean Cocteau wrote in the late 1950s:    A procession of objects follows in Picasso’s wake, obeying him as the beasts obeyed Orpheus. That is how I would like to represent him: and every time he captivates a new object he coaxes it to assume a shape which he makes unrecognizable to the eye of habit. Our shape-charmer disguises himself as the king of the rag-pickers, scavenging the streets for anything he may find to serve him.
అభివృద్ధినీ,reasoning ని ఒప్పుకోని కళాకారుడిగా పికాసో వ్యక్తిత్వం గురించి,
Picasso denies the power of reason. He denies the causal connexion between searching and finding. He denies that there is such a thing as development in art. He hates all theories and explanations. It would be understandable if he ignored all these intellectual considerations when it came to respecting and responding to the mystery of his own powers. But he goes further than this. He hates reasoning in general and despises the interchange of ideas.
He denies that there is such a thing as progress in the creation of a painting: each change, each step, each metamorphosis – as he calls it – is merely a reflection of a new state in him. For Picasso, what he is is far more important than what he does. He projects this priority on to all art.
It is as though, in principle, he is frightened of learning. (It is perhaps relevant to note in passing that he is one of the very few modern painters who has never taught.) He is prepared to learn a new skill – pottery, lithography, welding – but as soon as he has learnt the technique, he needs to overthrow and disprove its laws. From this need comes his marvellous power of improvisation and his wit, which respects nothing.
The important point for our main argument is that for one reason or another, and as a corollary of his awareness of his prodigious gifts, Picasso has remained sceptical or suspicious of reasons, explanations, learning.
పికాసో idealization స్థాయి ని చెప్తూ,ఆయన కళ్ళను బ్లాక్ డైమండ్స్ గా అభివర్ణిస్తారు..
I almost forgot to tell you – or have I told you already? – that this man, whose tastes are not extravagant, has a weakness for black diamonds. He owns two superb ones and he will never part with them. They weigh a good hundred carats each. He wears them where other people have eyes. It’s as I tell you. And I assure you that those women on whom these diamonds turn their fire are utterly bowled over.
He has an extremely powerful personality which provokes legends. Perhaps he is a little comparable in this respect with Napoleon.
One of his friends,Georges Besson about Picasso,‘Nothing’, he says, ‘is riskier than trying to define Picasso the man, more famous than Buddha or the Virgin Mary, more mercurial than a crowd.’
ఆర్ట్ ను గురించి,
‘A painting’, he said, ‘is a sum of destructions'.
We all know that Art is not truth. Art is a lie that makes us realize truth, at least the truth that is given us to understand.
I deal with painting as I deal with things, I paint a window just as I look out of a window. If an open window looks wrong in a picture, I draw the curtain and shut it, just as I would in my own room.This is a perfect example of ‘mistaking’ an ideal connexion for a real one. Or again, expressed more abstractly: ‘I don’t work after nature, but before nature and with her.’ This is a definition of magic.
క్యూబిజం శైలి గురించి రాస్తూ,
This then was the revolutionary inheritance that the nineteenth century bequeathed to the twentieth: the materialism of Courbet and the dialectic of Cézanne. The task was to combine the two.
It is an art of dynamic liberation from all static categories.All is possible [wrote Andre Salmon, a Cubist poet], everything is realizable everywhere and with everything.
We have already said that Picasso was an invader. This is what he was in relation to Europe. But within himself he was, at one and the same time, a ‘noble savage’ and a bourgeois ‘revolutionary’. And within himself the latter has idealized the former.
Before Cézanne, every painting was to some extent like a view seen through a window. Courbet had tried to open the window and climb out. Cézanne broke the glass. The room became part of the landscape, the viewer part of the view.