మేరీ ఆలివర్ సాహచర్యం లేకపోతే ఈ క్వారన్టైన్ సమయంలో ఏమైపోయి ఉండేదాన్నో అనిపిస్తుంది..ఈ 'ఫెలిసిటీ' అనే కవితా సంపుటి పేరుకి తగ్గట్టే 'ఆనందం'..'సంపూర్ణానందం'.నాలుగైదు పుస్తకాలు సమాంతరంగా చదువుతూ అక్కడో వాక్యం ఇక్కడో వాక్యం నెమరువేసుకుంటూ,భౌతిక ప్రపంచపు నీడలు విస్తరించని నాది మాత్రమే అయిన చోటులో ఏదో ఒక మూలన,చేతిలో పుస్తకంతో ఏ నూతన ప్రపంచపు నీడలో సేదతీరాలా అనే కాసేపు వెతుకులాటకి స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశిస్తూ,అస్తవ్యస్తంగా గడిచిపోతున్న రోజుల్లో కూడా తన అందమైన ప్రపంచంలోకి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయారు అమెరికన్ కవయిత్రి మేరీ ఆలివర్..నాకు బ్రెయిన్ పికింగ్స్ పరిచయం చేసిన కొందరు ఆణిముత్యాల్లాంటి రచయిల్లో ఆలివర్ ఒకరు..కానీ నేను మొదట ఆవిడ 'Upstream' పేరిట రాసిన వ్యాసాలు చదివాను,తరువాత మెల్లిగా ఆవిడ కవితలతో కూడా ప్రేమలో పడ్డాను.
ఆలివర్ రెండు కవితలు Moments,Storage లకు నా స్వేఛ్ఛానువాదం :
క్షణాలు :
కొన్ని క్షణాలు వాటిని పూరించమని ఆజ్ఞాపిస్తాయి,
ఎవరినైనా ప్రేమించామని వారికి చెప్పడం,
లేదా,నీ సంపద మొత్తాన్నీ వదులుకోవడం.
నీ హృదయం స్పందిస్తోంది కదా ?
నీవు సంకెళ్ళచే బందీవి కాదు కదా ?
జాగ్రత్తను మించిన విషాదం మరొకటి లేదు,
అనాలోచితంగా వేసే అడుగు ఒక ప్రాణాన్ని రక్షించగలిగినప్పుడు,
బహుశా,అది నీ ప్రాణమే అయినా కావచ్చు.
గిడ్డంగి :
నేను ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినప్పుడు
నాకు ఆ ఇంట్లో పెట్టడానికి చోటు సరిపోని వస్తువులు చాలా ఉండేవి.
ఎవరైనా ఏం చేస్తారు ? నేనొక స్టోరేజీని అద్దెకు తీసుకున్నాను.
దాన్ని సామానుతో నింపాను.సంవత్సరాలు గడిచాయి.
అప్పుడప్పుడూ నేను అక్కడకు వెళ్ళి ఆ స్టోరేజ్ లోపల వస్తువుల్ని చూసుకునేదాన్ని.
కానీ ఏమీ జరగలేదు,చివరకు నా హృదయంలో చిన్నపాటి నెప్పి కూడా కలుగలేదు.
నేను వృద్ధాప్యం దరిచేరుతున్న కొద్దీ,
చాలా ముఖ్యమైనవి తప్ప,నేను ఆశించే వస్తువుల సంఖ్య
తగ్గుతూ వచ్చింది.
అందువల్ల ఒకరోజు నేను నా స్టోరేజ్ తాళం తీశాను,
చెత్త ప్రోగుచేసేవాణ్ణి పిలిచాను.
అతడు అంతా తీసుకెళ్ళిపోయాడు.
చివరకు బరువు దింపితే ఊపిరిపీల్చుకున్న
అల్పమైన గాడిదలా అనిపించింది.వస్తువులు !
వాటిని తగలబెట్టండి,తగలబెట్టండి !
ఒక అందమైన చలిమంట వేసుకోండి !
మీ మనసులో మరికాస్త ఎక్కువ చోటు,ప్రేమకూ,
చెట్టుచేమలకూ ! పక్షులకు సొంతమైనదంటూ ఏదీ లేదు,
బహుశా అవి స్వేచ్ఛగా ఎగరడానికి కారణం అదే.
Image Courtesy Google |

No comments:
Post a Comment