Showing posts with label Non-Fiction. Show all posts
Showing posts with label Non-Fiction. Show all posts

Thursday, June 13, 2024

Every Time I Find the Meaning of Life, They Change It: Wisdom of the Great Philosophers on How to Live - Daniel Klein

ఆదర్శంగా జీవించడానికి సార్వజనీనమైన బ్లూ ప్రింట్ ఇదీ అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అది ప్రతీ మనిషికీ 'టైలర్ మేడ్' కొలతలతోనే వస్తుంది. అందుకే ఇతరుల నిర్వచనాలను మనం బట్టీపట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయంలో ఎవరి నిర్వచనాలు వాళ్ళవే. కానీ మన పూర్వీకుల నుండీ, తమ అనుభవాలను అక్షరీకరించిన తత్వవేత్తల నుండీ మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎటొచ్చీ ఒక వయసులో ఒక ఫిలాసఫీ సరైనదనిపిస్తే, మరో వయసులో మరో ఫిలోసఫీ సరైనదనిపిస్తుంది. దీనికి తోడు మారుతున్న సంస్కృతులతో బాటు సందర్భానుసారం కొత్త కొత్త ఫిలాసఫీలు పుట్టుకొస్తున్నాయి. అందుకేనేమో అమెరికన్ సోషల్ ఫిలాసఫర్, థియలోజియన్ Reinhold Niebuhr- “Every time I find the meaning of life, they change it.” అన్నారు.

Image Courtesy Google

ఏ తాత్విక మార్గాన్ని అనుసరించాలో తెలీని సందిగ్ధతల మధ్య అనేక తత్వాలను సమన్వయం చేస్తూ జీవితానికి మనదైన సొంత ఫిలాసఫీ తయారుచేసుకోవడం అవసరమని అనుకున్నారో ఏమో డేనియల్ క్లైన్ ముప్పైల వయసులో తనను ప్రభావితం చేసిన సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు కోట్స్ రూపంలో ఒక పుస్తకంగా రాసిపెట్టుకునేవారు. అలా క్లైన్ చదివిన పుస్తకాల నుండి ఒక్కో సిద్ధాంతాన్నీ తన దృక్కోణం నుండి చూస్తూ రాసిన పుస్తకమే ఈ "Every Time I Find the Meaning of Life, They Change It". డేనియల్ క్లైన్ ను ఆరేడేళ్ళుగా చదువుదామనుకున్నా ఈ పుస్తకం కనిపించగానే టైటిల్ చాలా ఆసక్తికరంగా అనిపించి వెంటనే చదివేలా చేసింది.

నేను ఇరవైలలో చదివిన ఆల్బర్ట్ కామూ, జిడ్డు కృష్ణమూర్తి, హెర్మన్ హెస్, ఆండ్రే గిడే లాంటి వాళ్ళతోబాటు తరువాతి కాలంలో చదివిన స్టాయిక్, ఈస్టర్న్ ఫిలాసఫీలు క్రమేపీ ఫిలాసఫీపై ఒకప్పటి ఆసక్తిని సడలించాయి. సత్యశోధన విషయంలో ఏ సంస్కృతికి చెందిన ఎంత గొప్ప తత్వమైనా చివరకు హ్యూమన్ మోర్టాలిటీ దగ్గరకే వచ్చి ఆగిపోయేది. తత్వవేత్తలందరూ యెటువంటి భాష వాడినా, ఏ శైలిలో చెప్పినా కర్మ సిద్ధాంతామనే ఒకే ఒక్క సత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినట్లనిపించేది. ఈ పుస్తకం మునుపు చదివిన ఆ  ఫిలాసఫీలన్నిటినీ మరోసారి పునఃశ్చరణ చేసుకునే అవకాశం ఇచ్చింది.

క్లైన్ ఈ పుస్తకాన్ని స్టాయిక్స్ మొదలు పలువురు ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తల సిద్ధాంతాలకు తన జీవితానుభవాలతో కూడిన ఆసక్తికరమైన విశ్లేషణల్ని జతచేస్తూ పిచ్చాపాటీ కబుర్లు చెబుతున్నట్లు రాశారు. అందువల్ల లోతైన తాత్విక చర్చలే అయినప్పటికీ ఈ పుస్తకంలోని అంశాలన్నీ సరళంగానూ, అదే సమయంలో ఆహ్లాదంగానూ అనిపిస్తాయి. క్లైన్ క్లిష్టమైన సమయాల్లో నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడు ఈ తత్వాలని తన జీవితానికి అన్వయించుకున్న తీరు నాకు బాగా నచ్చింది. ఎంతగా అంటే నాక్కుడా ఇటువంటి జర్నల్ ఒకటి రాసుకోవాలనుకునేంతగా.

హెడోనిస్ట్ అయిన గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్- “Do not spoil what you have by desiring what you have not; remember that what you now have was once among the things you only hoped for.” అంటారు. దాన్నే మరో విధంగా చెప్పారు ఎమెర్సన్- “We are always getting ready to live, but never living.”

ఎపిక్యూరస్ లాంటి స్టాయిక్లు ఆదర్శ జీవన మార్గానికి శాస్త్రీయంగానూ, నైతికంగానూ కూడా ఆమోదయోగ్యమైన ఆరోగ్యకర విధానాలను మనముందుంచినా, వాటిని కాలంచెల్లిన తత్వాలుగా తీసిపారేసి ఆధునికత పేరిట వెర్రితలలు వేస్తున్న నేటి తాత్విక (?) ప్రమాణాల గురించి ఇందులో విస్తృతంగా చర్చించారు క్లైన్. ఆధునిక మానవుడికి జరామరణాలు లేని మనుష్య జన్మ కావాలి. మరో భావోద్వేగానికి తావులేని శాశ్వతానందం కావాలి. ఎపిక్యూరస్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను అదే హెడోనిస్ట్ వర్గానికి చెందిన బ్రిటిష్ ఫిలాసఫర్ డేవిడ్ పియర్స్ లాంటివాళ్ళు పురోగతి పేరిట ఎలా వక్రీకరించారో క్లైన్ విశ్లేషణలు చదివితే అర్థమవుతుంది.

“Genetic engineering and nanotechnology will abolish suffering in all sentient life. This project is ambitious but technically feasible. It is also instrumentally rational and ethically mandatory.” — David Pearce, British Philosopher (1960– ), Hedonist.

డేవిడ్ పియర్స్ "ఫీల్ గుడ్ ఉటోపియా" ప్రకారం మనిషి నిరంతరం ఆనందంగా మాత్రమే ఉండడానికి "సింథెటిక్ మూడ్స్" సృష్టించడంలో తప్పులేదు.  నిజానికి యాంటీ డిప్రెషన్ పిల్స్ లాంటివి చేసే పని కూడా అదే. మనిషికి మోర్టాలిటీ చేధించలేని పజిల్ అయితే, "శాశ్వతానందం" (అత్యాశ / విపరీతం?) అందని ద్రాక్షలాగా ఊరిస్తున్న లక్ష్యం. నిజానికి ఆదర్శ జీవితానికి అర్థాన్నిచ్చే అన్ని నిర్వచనాలూ ఆ "ఆనందం" అనే సో కాల్డ్ బ్రహ్మపదార్థం దగ్గరకే వచ్చి ఆగుతాయి. కానీ ఆధునిక తరం ఆ ఆనందం శాశ్వతం కావాలనుకుంటోంది. ఒకసారి క్లౌడ్ 9 అనుభవం చవిచూశాక మరో అనుభవం దానికంటే ఖచ్చితంగా గొప్పదై ఉండాలి. నిరంతరం డోపమైన్ హిట్స్ దొరకడం, ఆనందడోలికల్లో తేలియాడడం కుదిరేపని కాదు కాబట్టి సమస్త సౌకర్యాలూ ఉన్నా, దేనికీ లోటు  లేకపోయినా నేటి తరం డిప్రెషన్తో బాటు పలు మానసిక వైకల్యాలతో సతమతమవుతోంది. ఎంత నింపినా నిండని చిల్లు కుండలాంటి మనిషి కోర్కెల్ని భర్తీ చెయ్యడానికి అనేక వినోదప్రధానమైన అంశాలు తెరమీదకొచ్చాయి. ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉండే తీరాలని నమ్మే సైన్సు జెనెటిక్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ మనిషికి అన్ని బాధలనుంచీ విముక్తి కలిగించి శాశ్వతానందాన్నిస్తాయని నమ్మబలుకుతోంది. ఇది అత్యాశే అయినా అసంభవం కాదంటూ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు.

డేవిడ్ పియర్స్ వాదనను సవాలుచేసే కథ “Escape from Spiderhead” గురించి రచయిత ప్రస్తావించగా ఆ కథ వెతికి చదివాను. "Lincoln in the Bardo" రచయిత జార్జ్ సాండర్స్ రాసిన ఆ కథనే నెట్ఫ్లిక్స్ మూవీగా కూడా తీశారట (క్రిస్ హెమ్స్వర్త్ హీరో). నేనా సినిమా ఇంకా చూడలేదు. ఈ కథలో ప్రధాన పాత్రధారిపై "మైండ్ అండ్ ఎమోషన్ ఆల్టరింగ్ డ్రగ్స్"ని ప్రయోగిస్తారు. 'మోబి ప్యాక్' అనే ఒక పరికరాన్ని సర్జరీతో శరీరానికి అమర్చి పరిశోధనలు చేస్తారు. ఆ ప్రయోగంలో భాగంగా అతడిని హెథర్ అనే స్త్రీతో కలిపి ఒక గదిలో ఉంచుతారు. ప్రొటగోనిస్ట్ కి మునుపు ఎంతమాత్రమూ ఆకర్షణ లేని హెదర్ తో లవ్ డ్రగ్ ఇచ్చిన తరువాత విపరీతమైన వ్యామోహంలో పడిపోతాడు. హెదర్ కు కూడా ఆ డ్రగ్ ఇస్తారు. ఆ గదిలో ఇద్దరూ చాలా ప్యాషనేట్ గా ఒకటవుతారు. ఈ లవ్ డ్రగ్ గురించి చదువుతున్నప్పుడు షేక్స్పియర్ "A Midsummer Night's Dream"లో 'లవ్ పోషన్' గుర్తొచ్చింది. విచిత్రమేమిటంటే, హెథర్ తనకు సరైన జోడు అనుకున్నప్పటికీ, ఆ రసాయనాల ప్రభావం తగ్గగానే ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాడు. రేచల్ అనే మరో అమ్మాయితో ఇదే ప్రయోగాన్ని మళ్ళీ చేస్తారు. అప్పుడు కూడా అతడికి రేచల్ తన "వన్ ట్రూ లవ్" అనే  అనిపిస్తుంది.

Says the protagonist: “Soon my memory of the perfect taste of Heather’s mouth was being overwritten by the current taste of Rachel’s mouth, so much more the taste I now desired. I was feeling unprecedented emotions, even though those unprecedented emotions were (I discerned somewhere in my consciousness) exactly the same emotions I had felt earlier, for that now unworthy-seeming vessel Heather. Rachel was, I mean to say, it.”

Sublime love, total delight in finding one’s long-desired soul mate, is thus reduced to drops of a drug. And once the experimental subject knows that, strong as his current feelings are, he realizes that ultimately his love is meaningless. (Of course, some readers may see Saunders’s tale as wicked commentary on the undrugged, but nonetheless fickle, human heart.)

“Neuromodulation of mood”తో భావోద్వేగాలను నియంత్రించి మనిషికి ఆనందం తప్ప చిన్న బాధ కూడా కలగకుండా చూడడం సాధ్యమే గానీ, "ఇది సరైనా మార్గమేనా?" అన్నది అసలు ప్రశ్న. వీటివల్ల మిగిలేది కష్టం, కన్నీరు తెలీని డొల్లజీవితాలేగా! మరో హెడోనిస్ట్ గ్రీకు తత్వవేత్త అరిస్టిపస్ కూడా పియర్స్ వాదనలకు తీసిపోకుండా, సంతోషాన్ని సాధించడానికి నైతిక విలువల్ని పట్టించుకోనవసరంలేదని అంటారు. 

“The art of life lies in taking pleasures as they pass, and the keenest pleasures are not intellectual, nor are they always moral.” - Aristippus, Greek/Libyan Philosopher (435–356 BC).
ఇకపోతే ఫిలాసఫీలన్నీ మంచివే కాదు కదా! మంచి-చెడుల బేరీజు వేసుకుని చదివిన ప్రతీ తత్వం మనపై ప్రభావం చూపించకుండా జాగ్రత్తపడడం కూడా అవసరం. ఒకప్పుడు టాల్స్టాయ్ ని చదువుతున్నప్పుడు జీవితపు చివరి దశలో జర్మన్ తత్వవేత్త ఆర్థర్ షోపెన్హార్ ప్రభావం టాల్స్టాయ్ పై తీవ్రంగా ఉండేదని తెలిసింది. షోపెన్హార్ నిరాశావాదం నుండి సాక్షాత్తూ టాల్స్టాయే తప్పించుకోలేకపోయారు. 20వ శతాబ్దపు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ ఈ పుస్తకంలో షోపెన్హార్ పై చేసిన విమర్శల గురించిన ప్రస్తావన చదివినప్పుడు టాల్స్టాయ్ గుర్తొచ్చారు. షోపెన్హార్ తన జీవితంలో కడు దుర్భర పరిస్థితుల్లో రాసిన రాతలకీ, ఆ రాతల ద్వారా వచ్చిన డబ్బు, కీర్తితో తరువాత కాలంలో గడిపిన విలాసవంతమైన జీవితానికీ అస్సలు సంబంధమేలేదంటారు రస్సెల్.

The twentieth-century philosopher Bertrand Russell, by all accounts a generally charitable man, thought that Schopenhauer was a consummate hypocrite. Wrote Russell: “He habitually dined well, at a good restaurant; he had many trivial love-affairs, which were sensual but not passionate; he was exceedingly quarrelsome and unusually avaricious. . . . It is difficult to believe that a man who was profoundly convinced of the virtue of asceticism and resignation would never have made any attempt to embody his convictions in his practice.”

ఇలా చెప్పుకుంటూపోతే అనేక తత్వాలను లోతుగా చర్చిస్తూ క్లైన్ రాసిన ఈ పుస్తకం పాఠకులకు ఒక పూర్తి స్థాయి "ఫిలాసఫీ బఫే"లా ఉంటుంది. హ్యాపీ రీడింగ్ :)

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

In the 1960s and 1970s, the idea of finding one’s true self and giving it full expression was very much in the air. In pursuit of this goal, many of us went into psychoanalysis or group therapy, practiced Transcendental Meditation, imbibed mind-expanding drugs, and engaged in talk marathons during which we tried to strip away all artifice, all delusion, all the bullshit we habitually told one another. I remember that many a romance and friendship was wrecked along the way.

Wrote Leopardi, “If all you seek from something is pleasure, you’ll never find it.

To feel pleasure in any act or activity, you have to pursue some end other than pleasure. To put it another way, the pursuit of happiness is a guaranteed dead end,

Woody Allen: “My one regret in life is that I am not someone else.”

Albert Einstein expressed this late-in-life phenomenon beautifully when he wrote, “I live in that solitude which is painful in youth, but delicious in the years of maturity.”

One thing about living in a psychological era is that few people give credence or value to a philosophical perspective. In our period, despairing of finding any meaning in life is rarely considered a sincerely held worldview; no, it is a sickness that needs to be cured.

“Estragon: We always find something, eh Didi, to give us the impression we exist? “Vladimir: Yes, yes, we’re magicians.”—SAMUEL BECKETT, IRISH NOVELIST AND PLAYWRIGHT (1906–1989), ABSURDIST

But the ultimate absurdist gag is the one about the human being looking for life’s meaning when there isn’t any to be found.

So off Horner goes to the doctor’s clinic, Remobilization Farm, for therapy that includes reading both the works of Sartre and the World Almanac. Until Horner gets a hold on his life, the doctor prescribes a method for making his daily choices: “[D]on’t let yourself get stuck between alternatives, or you’re lost. You’re not that strong. If the alternatives are side by side, choose the one on the left; if they’re consecutive in time, choose the earlier. If neither of these applies, choose the alternative whose name begins with the earlier letter of the alphabet. These are the principles of Sinistrality, Antecedence, and Alphabetical Priority—there are others, and they’re arbitrary, but useful.”

The doctor’s treatment for overcoming choice-making paralysis then goes on to “mythotherapy,” adopting “masks” to abolish the ego by acting out symbolic roles. This is Existentialism gone wacky.

Like many people I know, I sometimes feel guilty for living in a fortunate bubble, one where too often I am oblivious to the evil running like a mad dog through the bigger world. Being a hedonist with a conscience can be demoralizing. It turns out that this business of feeling good often comes at the price of somebody else’s deprivation, and then I have to consider which is more important to me: feeling good or being good?

“People deserve much less punishment, or even perhaps no punishment, for what they did many years ago as compared to with what they did very recently. - Derek Parfit, British Philosopher (1942– )

When Wittgenstein says that “eternal life belongs to those who live in the present,” he is suggesting that this kind of eternal life is available only to certain people and not to others.

“The unexamined life is surely worth living, but is the unlived life worth examining?” —Adam Phillips. (British Psychoanalyst and Philosopher (1954– )

Often, Niebuhr displayed a sense of humor about what he saw as man’s predicament. He concluded one sermon by saying, “What a contradiction—to be the judge of all things and yet to be a worm of the earth.” Not exactly a thigh-slapper, but not bad for a sermon.

Like political creeds and advertising slogans, philosophies of life arise and fall in a culture.

Thursday, February 8, 2024

Create Dangerously: The Power and Responsibility of the Artist - Albert Camus

సుమారు 150 ఏళ్ళ పాటు అతి కొద్ది మినహాయింపులతో ఈ వినియోగదారీ సమాజంలోని రచయితలు బాధ్యతారహితంగా జీవించవచ్చునని నమ్ముతూ వచ్చారు. ఏకాంతాన్ని అనుభవిస్తూ యథేచ్ఛగా జీవించారు, ఎలా జీవించారో అలాగే మరణించారు. 1900 కి ముందూ, తరువాత కాలానికి చెందిన యురోపియన్ కళాకారుల్ని "The manufacturers of bourgeois European art" అని సంబోధిస్తారు కామూ. ఆ కాలపు ఆర్టిస్టులు కళపట్ల తమ బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకున్నట్లేనని అభిప్రాయపడుతూ వాళ్ళని "కళాకారులు" అని పిలవడానికి కూడా ఆయన ఇష్టపడరు. నిజానికి కళాకారులు బాధ్యత తీసుకోవడం అంటే నిరంతరం సమాజంతో ఘర్షణకు దిగుతూ ఏటికి ఎదురీదడమే. ఆ పని చేసిన రింబో, నీచ, స్ట్రిండ్బర్గ్ లాంటి వాళ్ళు చెల్లించిన మూల్యమేమిటో మనకందరికీ తెలిసిందే. బహుశా ఈ కారణంగానే ఆ శకం నుండే "కళ కళ కోసమే" అన్న భావన జీవం పోసుకుంది.

కానీ ఈ ఇరవయ్యో శతాబ్దపు రచయితలకి "కళ కళ కోసమే" అనుకునే అవకాశం, అదృష్టం- ఈ రెండూ లేవు. పతనమవుతున్న రాజకీయ, సామాజిక నైతిక విలువలు, దీనికి ఊతమిస్తూ వాటి చేతిలో ఆయుధాలుగా మారిన భాష, మీడియా, సాంకేతిక పరిజ్ఞానపు కనికట్లు- వీటన్నిటి మధ్యా ఏది వాస్తవమో ఏది భ్రమో సమాజానికి దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యతను కళాకారులే నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Image Courtesy Google

ఇప్పటివరకూ ఆర్టిస్టులు 'సైడ్ లైన్స్'లోనే ఉండిపోయారు. కానీ మన ప్రతీ చిన్న కదలికా సర్వేలెన్స్ క్రింద ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కళను కేవలం ఒక విలాసంగా భావించడం కళాకారులకు పెనుసవాలుగా మారింది. ఒకప్పుడు ఎటువంటి అవసరమూ, ఏ కారణమూ లేకుండా కూనిరాగాలు తీసేవారు. తమ ఆనందం కోసం మైమరచి గానం చేసేవారు. బాధితుల్లోనో, బాధాతప్తహృదయుల్లోనో స్ఫూర్తిని నింపడానికో లేక సింహం దృష్టిని తన వేటనుండి మళ్ళించడానికో మాత్రమే తమ కళను ఉపయోగించేవారు. కానీ నేటి ఆర్టిస్టులు ఒక బహిరంగ ప్రదర్శనశాలలో చిక్కుకుపోయారు. ఈ కారణంగా సహజంగానే వాళ్ళ సృజనలోనూ, స్వరంలోనూ మునుపటి ఆత్మవిశ్వాసం ధ్వనించడంలేదన్నది వాస్తవం.

సాహిత్యం విషయంలో నిజానికి ప్రతీ ఒక్క ప్రచురణా ఒక స్వచ్ఛందమైన అడుగే. కానీ ఆ స్వేచ్ఛను  క్షమించలేని అసహనపు ఆధునిక యుగంలో తెగించి ముందుకు అడుగువెయ్యడం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడంతో సమానం. ఇటువంటి పరిస్థితుల్లో కళాకారులకు స్వేచ్ఛాయుతంగా రచనలు చేసి క్లిష్టతరమైన జీవితాన్ని గడపడమో లేదా అస్త్ర సన్యాసం చేసి ఊరుకోవడమో తప్ప మధ్యే మార్గం మృగ్యంగా కనిపిస్తోంది. ఏదేమైనా కళకు ఆస్కారంలేని జీవితమూ ఒక జీవితమేనా అనుకునే ఆర్టిస్టుకి పలు భావజాలాల తాలూకూ ఆధిపత్య ధోరణుల నియంత్రణల మధ్య పూర్తి స్వేచ్ఛ, ఏకాంతం సాధించుకునే అవకాశాలు ఈ కాలంలో మిగిలున్నాయా అన్నది ప్రస్తుతం మనముందున్న ప్రశ్న.

ముఖ్యంగా నేటి సామాజిక తత్వాన్ని నిర్వచించే అంశాల్లో ప్రధానమైన సంఘర్షణ సమకాలీన మనోభావాల సున్నితత్వాల మధ్యా, అణగారిన వర్గాల ఎదుగుదల మధ్యా జరుగుతోంది. ఈ ఘర్షణ గతంలో కూడా ఉంది కానీ  ఒప్పటిలా నేడు దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. ఈ గొప్పదనమంతా నేటి అభ్యుదయ ఉన్నత వర్గాలదో లేదా ఎలీటిస్టు ఆర్టిస్టులదో అనుకుంటే పొరబాటే. దీనికి కారణం ఒకప్పుడు అణచివేతకు గురైన వర్గాలు ఇప్పుడు మునుపటికంటే బలం పుంజుకుని శక్తిమంతంగా తయారవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పెగులుతున్న వారి గళాలను వినీవినపడనట్లు విస్మరించే అవకాశం ఇకపై లేదు. ఈ పరిణామాల దృష్ట్యా చూస్తే ఎమెర్సన్ అన్నట్లు "నమ్మకానికి(ఫెయిత్) అసలైన నిర్వచనం మనిషి తన మేధ పట్ల విధేయుడిగా ఉండడమే" అన్న మాటల్ని ఆచరించడం ఒక కళాకారుడి విషయంలో ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

మరో 19వ శతాబ్దపు అమెరికన్ రచయిత- "మనిషి తనకు తాను విధేయుడై ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం అతడికి అనుకూలంగా వర్తిస్తుంది" అంటారు. కానీ ఈ రోజుల్లో కళాకారుల్లో అంతటి ఆశావాదం ఉందా అన్నది అనుమానమే ! కళ ఒక 'ఎలీటిస్టు లగ్జరీ'గా రూపాంతరం చెందుతున్న ఈ కాలంలో కళాకారులు తమవైన ప్రత్యేకతలనూ, సౌకర్యాలనూ చూసి సిగ్గుపడే స్థితిలో ఉన్నారు. అన్నిటినీ మించి తమ కళాభిరుచి ఎందుకూ పనికిరాని ఒక సౌకర్యమేమో అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నారు. నిజానికి నేటి ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా కన్ఫర్మిటీ పేరిట బానిసత్వం పెరిగింది, తత్పరిణామంగా బాధితులూ పెరిగారు. ఇటువంటి పరిణామాల దృష్ట్యా ఆర్ట్ ఒక లగ్జరీగా మాత్రమే మిగలాలనుకుంటే ఆర్టిస్టులు తాము చేసేది పచ్చి మోసమని కూడా ఒప్పుకోగలగాలని అభిప్రాయపడతారు కామూ. వారికి మరో మార్గంలేదు. ఏదేమైనా ఈ వాదన కూడా పైకి కనిపించినంత బ్లాక్ అండ్ వైట్ కాదు.

"మైథాలజీస్" అనే రచనలో రోలన్ బార్త్ అన్నట్లు నేటి వినియోగదారీ వ్యవస్థలో వస్తువులు క్రమేపీ అదృశ్యమైపోయి వాటికి ప్రాతినిధ్యం వహించే చిహ్నాలు వాటి స్థానాన్ని తీసుకుంటున్నాయి. ఉన్నత వర్గాలు సైతం భూమికో, బంగారానికో బదులు సంబంధిత గణాంకాల్లోని సంఖ్యలో ఎన్ని డిజిట్లు ఉన్నాయన్నదాని మీదే ఆర్ధిక లావాదేవీలు నెఱపుతున్నాయి. ఇటువంటి సమాజంలోని ప్రాపంచిక అనుభవం పూర్తిగా భ్రమతోనూ, వంచనతోనూ కూడుకున్నది. వాస్తవం కంటే వాటి తాలూకు చిహ్నాల మీద ఆధారపడిన కృత్రిమ సమాజంలోని స్వాభావికమైన సత్యం నకిలీగా మిగిలిపోతోంది. అటువంటి సమాజం తన నైతిక విలువల్ని సహజంగానే జనామోదం పొందిన సంప్రదాయాల ద్వారా- తద్వారా కులమతాల ప్రాతిపదికన రూపొందించుకోవడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ కారణంగా మెజారిటీ సమాజపు భావజాలాలకు కట్టుబడి ఉండే కళ కేవలం ఒక సారహీనమైన వినోదంగా మిగిలిపోతుంది. అలా కాకుండా ఆర్టిస్టులు గుడ్డిగా సమాజాన్ని తిరస్కరించి దూరం జరిగితే వారి కళలో కేవలం నెగెటివిటీ తప్ప వేరొకటి ఉండే అవకాశం లేదు. ఈ క్రమంలో మనకు మిగిలే కళ రెండే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తి వినోదప్రధానమైనదైతే, రెండవది ఆచరణాత్మకతకు అనుకూలంగాలేని వాస్తవదూరమైన సిద్ధాంత స్వరూపం. ఈ రెండు పద్ధతుల్లోనూ కళ వాస్తవంనుండి పూర్తిగా విడిపోతుంది.

"Art develops between two chasms: frivolity and propaganda." అంటారు కామూ. గొప్ప రచయితలు  ప్రయాణించే మార్గం అనేక సంక్లిష్ఠతలతో ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ఆ దారిలో మాత్రమే కళాకారులకు నిజమైన 'ఆర్టిస్టిక్ ఫ్రీడమ్' దొరుకుతుంది. ఏ ప్రతిఫలాపేక్షా లేని స్వేచ్ఛ నుండి పుట్టిన అటువంటి కళను  నిరాకరించే ఆర్టిస్టులు ఎవరూ ఉండరు, నిరాకరించేవారు అసలు ఆర్టిస్టులు అనిపించుకోరు. కానీ దాని కోసం ఎన్నో త్యాగాలు చెయ్యవలసి ఉంటుంది. మానసిక ప్రశాంతతతో బాటుగా వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో కోల్పోవలసి వస్తుంది. అన్ని రకాల స్వేచ్చల్లాగే దీనికి కూడా భారీ మూల్యమే చెల్లించాల్సొస్తుంది. అందుకే సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి ఈ సంఘర్షణను తలకెత్తుకోవడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. ఫలితం స్వేచ్ఛకు దూరం జరుగుతూ బానిసత్వానికి దగ్గరగా జరుగుతున్నాం.

ఈ కాలంలో ప్రజల్లో వివేకం క్షీణించిపోతోందన్న వాదనను వ్యతిరేకిస్తారు కామూ. నిజమే, కాలంతో బాటుగా వివేకం నశిస్తోంది. కానీ కళ కళకోసమే అన్నట్లు, కళను ఒక విలాసంగా  మాత్రమే భావిస్తూ, బాధ్యతారాహిత్యంతో పుస్తకాల్లో మొహం దాచుకునేవారు అధికంగా ఉండే ఒకప్పటి కాలం కంటే ఈరోజు ఎన్నోరెట్లు పరిస్థితి నయంగానే ఉందంటారు కామూ. కానీ ఈ మాటలు ఆయన మరో సందర్భంలో చేసిన ఈ వాదనను కొంతవరకూ సవాలుచేసే విధంగా ఉన్నాయనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఈ రచయితల్నీ, తత్వవేత్తల్నీ నమ్మడం గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ పట్టుకుని డ్రైవ్ చేసి డెడ్ ఎండ్ లో తెల్లమొహంతో నిలబడడమే అనిపిస్తుంది.

"In such a world of conflict, a world of victims and executioners, it is the job of thinking people, not to be on the side of the executioners."

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :

But due to their rejection of everything, including the traditions of their own art, contemporary artists give themselves the illusion of creating their own rules, so they end up believing they are God. At the same time, they believe they can create their own reality. However, if distanced from their own society, they will only create formal or abstract works, works that might be poignant as experiences, but that lack the fecundity that is characteristic of true art, whose mission is to unite.

But to speak to everyone about everyone, it is necessary to speak of what everyone knows and the reality that is common to us all. The sea, the rain, our needs and desires, the struggle against death—these are the things that unite us. We resemble each other through what we see together, the things we suffer through together. Dreams change according to the person, but the reality of the world is our common ground.

The goal of realism is thus legitimate, for it is inextricably linked to the artistic experience.

So let us be realistic. Or rather, let us try to be, if that is at all possible. For it is not certain that realism has a meaning, not certain it is possible, even if it is desired. Let us first ask ourselves if pure realism is possible in art. If we are to believe the assertions of the nineteenth-century naturalists, realism is the exact reproduction of reality. In that way, realism would be to art what photography is to painting: naturalism reproduces while painting makes choices.

Such an aesthetic, which aimed to be realistic, would then become a new form of idealism, just as sterile, to a true artist, as bourgeois idealism. Reality is only ostensibly placed in a sovereign position so it can be more easily eliminated. Art then finds itself reduced to nothing. It serves, and by serving, becomes subjugated. Only those who deliberately prevent themselves from describing reality will be called realists, and praised as such. The others will be censured, to the delight of the realists. Fame in a bourgeois society, which consists of either being misread or not read at all, will, in a totalitarian society, prevent others from being read. Here again, true art will become disfigured, or gagged, and global communication will be made impossible by the very people who most passionately desire it.

Yes, social realism should admit its roots and that it is the twin brother of political realism. It sacrifices art for a purpose that is alien to art but that, on the scale of values, might appear a superior goal. In sum, it temporarily suppresses art so it may first support justice. When justice exists, in a future that is still unknown, art will be reborn. Where art is concerned, therefore, we apply that golden rule of contemporary intelligence that states that it is impossible to make an omelet without breaking a few eggs.

So what is art? Nothing simple, that is certain. And it is even more difficult to understand that idea amid the cries of so many people who are fiercely determined to simplify everything. On the one hand, we desire that genius be grand and solitary; on the other hand, we call upon it to resemble everyone. Alas! Reality is more complex. And Balzac sums it up perfectly in one sentence: “Genius resembles everyone but no one resembles genius.” It is the same for art, which is nothing without reality and without which reality has little meaning.

Art is neither total rejection nor total acceptance of what is. It is both rejection and acceptance, at one and the same time, and that is why it can be continually and perpetually torn apart. Artists always find themselves dealing with this ambiguity, incapable of rejecting what is real, yet still devoted to challenging the ever-unfinished aspects of reality

Judging contemporary people in the name of those who do not yet exist is the role of prophecy. True artists can only value the dreams proposed to them in relation to their effects on the living. A prophet, priest, or politician can judge absolutely, and moreover, as we well know, they do not refrain from doing so. But artists cannot. If they judged absolutely, they would classify the nuances of reality as either good or evil, with nothing in between, thus creating melodrama.

Flannery O’Connor ఒక సందర్భంలో తన కాలంలో ప్రచురింపబడిన ఒక నవల గురించి ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం చాలా ఆసక్తికరంగా అనిపించింది :  She said of a popular novel of her time, the premise of which offended her own sense of artistic freedom, the book “is just propaganda and its being propaganda for the side of the angels only makes it worse. The novel is an art form and when you use it for anything other than art, you pervert it.”

Tuesday, January 2, 2024

స్త్రీవాద సాహిత్య విమర్శ

పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. కనీసం 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు ఈ లింగవివక్షల వల్ల తీవ్రంగా ప్రభావితమైనవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతికపరమైన ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ విద్యావంతులైన మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. కానీ ఈ మగవారికి సంబంధీకులైన స్త్రీలు మాత్రం జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.

Image Courtesy Google

గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరంగా, వాస్తవ ప్రపంచంతో  ఎంతమాత్రం సంబంధం లేకుండా స్త్రీలు తమ జీవితకాలమంతా పూర్తి ఒంటరితనంతో కేవలం సమీక్షలోనే గడిపేశారు. అనేక ఏళ్ళపాటు స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, చలనంలేని లాంతరు నుండి వచ్చే వెలుగులా ఆమె చీకటి ప్రపంచంలో తమ కథలను చెప్పుకునే ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తుంది. వారి సృజనాత్మకతకు ప్రేరణ కోసం ఆమెవైపు చూస్తే వారిని ఊరడించి సలహా ఇస్తుంది. తనకంటూ ఒక కథ లేని ఆమె ఇతరులు చెప్పే కథలను సంతోషంగా వింటుంది, దయ చూపిస్తుంది : ఆమె సహజత్వానికి దూరంగా సాహిత్యంలో పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన ఒక ఆదర్శ స్త్రీమూర్తి. జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు, ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది. 

ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది. స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి' గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి,మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా  కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ,రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు, అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవారు. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన 'దేవత లాంటి ఇల్లాలి' వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.

ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదనీ, పూర్తి నిరుపయోగమైనదనీ నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా సందర్భానుసారం తీసుకుంటారని అంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చెయ్యడానికి పరిమితం చేస్తూ ఆమె ధర్మాన్ని వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. ఆ విధంగా కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ, హేతువునూ,తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను తెరచాటుగా ఉంటూ మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా అడుగులు వెయ్యడంలో ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు. ఈ నియమాలననుసరించి మానవ సంస్కృతి, నాగరికతా వృద్ధి చెందుతాయని కాంట్ అభిప్రాయపడతారు. ఏదేమైనా కాంటియన్ నైతిక సిద్ధాంతం బట్టి చూస్తే స్త్రీ ఆలోచనలకు విలువలేదు. కాంటియన్ వాదం సంప్రదాయ పితృస్వామ్య గుణాలుగా పరిగణించే నిర్లిప్తమైన హేతువాదాన్ని మాత్రమే గౌరవించి కరుణ, భావోద్వేగాలు వంటి స్త్రీ తత్వాన్ని నిర్వచించే అంశాలను తోసిపారేస్తుంది.

ఈ కారణాల దృష్ట్యా పురుషాధిక్య భావజాలం వ్రేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో తన అస్తిత్వం గుర్తెఱిగి అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలు పెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి' లాంటి కావ్యాలూ,గ్రంథాలూ స్త్రీవాద రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీవాదులు తమ రచనల ద్వారా పితృస్వామ్యపు సాహితీ సృజనలో భాగంగా రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అనేక ఏళ్ళుగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో రచయితలకు రాయడం విషయంలో పూర్వపు చరిత్ర, జ్ఞానం కొంతవరకూ దిశానిర్దేశం చేసేవి. మధ్యయుగం చివరి వరకూ స్త్రీలకు రచనలు చేసే అవకాశమే లేకపోగా 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. అందువల్ల తాను రాయడంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఏదో అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే, అనేకసార్లు అది పురుషుడి స్వరంలో ఉన్న ఒక అదృశ్యశక్తిగా అనిపించేదంటారు. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో  పెద్దవాడో నాకు తెలియదు, బహుశా కాస్త వృద్ధుడై ఉంటాడు. అందువల్ల నేను  రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీ గానూ కూడా ఆలోచించాలి." అంటారామె.

1980ల తరువాత స్త్రీవాద తత్వవేత్తలు భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్య వ్యవస్థ సృష్టనీ అంటారు. అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ అవన్నీ పితృస్వామ్యపు అభూత కల్పనలని కొట్టిపారేస్తారు. ఇదిలా ఉండగా,మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.

అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties” గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీలను కేవలం ఒక పిల్లల్ని కనే యంత్రంగా, మగవాడికి ఆనందాన్నిచ్చే వస్తువుగానే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవీ టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం. ఇవన్నీ ఆ కాలంలో యువ కవయిత్రులు ఎదుర్కున్న పలురకాల వివక్షలకు సాక్ష్యాలు. ఏదేమైనా భార్యగా, మాతృమూర్తిగా ప్లాత్ గానీ ; వివాహవ్యవస్థనూ,సంతానాన్నీ వద్దనుకుని ఆధునిక కవులుగా సుప్రసిద్ధులైన పౌండ్, విల్లియమ్స్, ఇలియట్ లాంటివాళ్ళ సరసన నిలబడ్డ మూర్ గానీ ఇద్దరూ ఫ్రాయిడ్ స్త్రీకి ఆపాదించిన 'సహజత్వపు' నిర్వచనాన్ని తమదైన శైలిలో సవాలు చేసినవాళ్ళే.

ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఈ కారణంగా చాలామంది స్త్రీవాద సాహిత్య  విమర్శకులకు ఆయన రాతలు చాలా అభ్యంతరకరంగా తోచేవి, బహుశా ఇక ముందు కూడా తోస్తాయి. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో వెంటనే  ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, "కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడ ?" ఆమె ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.

నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. అతడి కలంలోనుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. తన సృజనాత్మకతను కవిత్వంలో వాడడానికి ప్రయత్నించే ఆమె యొక్క మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్ది పాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.

స్త్రీలను ప్రాచీన కాలంనుండీ కళలకూ,సృజనాత్మకతకు దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారించారు. సాహితీసృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన  బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేది. కానీ ఇది రచయిత్రుల విషయంలో వాస్తవదూరమైన విషయం. స్త్రీల విషయంలో సంసారం,పిల్లల పెంపకం వంటి కుటుంబ బాధ్యతల ప్రాధాన్యతల కారణంగా సాహితీ సృజన సహజంగానే మూలకు నెట్టివేయబడింది. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్ వంటి కవయిత్రులూ, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. జేన్ ఆస్టన్ 'పెర్సుయేషన్' కథానాయిక అన్నే ఎలియట్ ఈ విధంగా అంటుంది : "మగవారికి విద్య వంశపారంపర్య హక్కుగా సంక్రమించింది గనుక వారు స్త్రీల కథలను వారి దృష్టికోణం నుండి చెప్పడం చాలా సులభం. ఎందుకంటే కలం వారి చేతిలో ఉంది." దీనికి విరుద్ధంగా కలాన్ని తన చేతిలోకి తీసుకున్న స్త్రీని  ప్రకృతి విరుద్ధమైన నేరం చేసిన అహంకారిగా పరిగణిస్తూ ఆమెకు విమోచనకు ఆస్కారంలేదని భావించేవారు.

ప్రముఖ సాహితీ విమర్శకులైన హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వపు ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ కారణంగా పాశ్చాత్య సంస్కృతిలో ఏ రచనకైనా రచయిత ఒక తండ్రితో సమానం, ఆ విధంగా పాశ్చాత్య సాహిత్య సంస్కృతి ఒక పితృస్వామ్యంగా రూపుదిద్దికుంది. ఇకపోతే 'రచనకు సొంతదారు',  'సాహిత్యం రచయితకు ఒక ఆస్తి', లేదా 'రచనకు తండ్రి' వంటి వివిధ మెటాఫోరికల్ కోణాల్లో ఆలోచిస్తే రచయిత అనేవాడు తన రచనలో పాత్రలకూ, వాటి గుణగణాలకూ, సన్నివేశాలకూ అన్నిటికీ అధిపతిగా కనిపిస్తాడు. రచయిత తన అదుపాజ్ఞల్లో ఇష్టానుసారంగా మలచుకున్న పాత్రలు అతడి చేతిలో కీలుబొమ్మలతో సమానం. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా  “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. 

ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ  కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. కథలన్నీ కాలగతిలో అనేక పరిణామాలకు లోనయ్యే అవకాశం ఉండగా, ఒకసారి బయల్పడిన రచనను పిడికిట్లో బంధించి ఎప్పటికీ శాసించడం వీలుపడదు. ఏ ఒక్క రచన ద్వారానో లేదా ఒక చిత్రం ద్వారానో ఏ మనిషి గళాన్నీ శాశ్వతంగా నొక్కిపెట్టడం అసంభవం. ఈ క్రమంలో స్త్రీవాద తత్వశాస్త్రంలో చారిత్రక నిఘంటువును సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకతను స్త్రీవాదులు గ్రహించారు. నేటి తరం స్త్రీవాదులూ, విమర్శకులూ కాంట్ సిద్ధాంతాలను లోతుగా పరిశోధించకపోయినా ప్రత్యేకం  కాంటియన్ నైతిక సూత్రాలూ,హేతువాదాలపై దృష్టి సారించారు. ఈ రెండిటిలో కూడా ప్రత్యేకించి కాంటియన్ నైతిక సూత్రాలు స్త్రీవాదుల చర్చల్లో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి.

స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ వీలుకాని పని. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. వేల ఏళ్ళ పాశ్చాత్య సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చరిత్ర నుండి తీసిపారవేసే విషయాలేమీ పెద్దగా లేవు. ఎటొచ్చీ అందులో కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేశారు. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగం మంది మనుషుల అంటే స్త్రీల జీవితాలు. అందువల్ల చరిత్రను పునరావృతం చెయ్యవలసిన అవసరముందని స్త్రీవాదులు అంటే దానర్థం జరిగిన సంఘటనల్నీ, వాటిని చరిత్రీకరించిన ప్రతుల్నీ, గ్రంథాల్నీ మళ్ళీ విమర్శకు పెట్టవలసిన అవసరం ఉందని. ఆవిధంగా సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా పాశ్చాత్య సాహిత్యంలో మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి. వర్జీనియా వూల్ఫ్ చరిత్రను తిరగరాయాలంటారు, అడ్రియన్ రిచ్ స్త్రీల రచనలు గతాన్ని పునర్విమర్శ చెయ్యడంతో మొదలవ్వాలంటారు. ఆవిధంగా వేల ఏళ్ళ సాహితీ సంస్కృతిని స్త్రీవాదులూ, సాహిత్య విమర్శకులూ కలిసి విశ్లేషించి స్త్రీతత్వాన్ని పునఃనిర్వచించాలి. 

లింగవివక్ష గాలిలా కంటికి కనిపించదు. ఆ కారణంగా వివక్ష ఉందని నిరూపణ చెయ్యడం కష్టం, అలాగే దాన్నుండి తప్పించుకోవడమూ అసంభవం. స్త్రీలపై కంటికి కనిపించని భారంగా మారిన ఈ వివక్ష వారి జీవితపు పరిమాణాన్నీ, ప్రమాణాల్నీ, కదలికల్నీ నిర్దేశిస్తోంది. కానీ ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు తమపై మోపబడిన ఆ భారాన్ని ప్రక్కకు తోసేస్తూ, మౌనాన్ని ఛేదిస్తూ అనేక రచనలు చేశారు. అందువల్ల పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష రచయితలిద్దరి అస్తిత్వవాద రచనల్లోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు. 

ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ద్వంద్వ ప్రవృత్తి కారణంగా తరతరాలుగా 'Anxieties of authorship' ద్వారా కష్టపడుతున్న రచయిత్రులు 18వ శతాబ్దం చివరకు వచ్చేసరికి పితృస్వామ్యపు సంకెళ్ళను ఛేదిస్తూ, తమపై మోపిన  ఆంక్షల్ని ప్రశ్నిస్తూ తమ ఉనికిని కొత్త కొత్త కాల్పనిక ప్రపంచాలను సృష్టించడం ద్వారా పునర్నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.  స్త్రీలు  రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన 'ఆమెలోని ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. మరోవిధంగా చెప్పాలంటే స్త్రీల ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్' ను నాశనం చెయ్యాలని అంటారు. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలంటారు. కానీ పితృస్వామ్యపు సంస్కృతి సృష్టించిన స్త్రీ ఉనికిని నిర్వచించే ఈ రెండు మూర్తులనూ నాశనం చెయ్యాలంటే ముందుగా వాటి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని, వాటి పుట్టుపూర్వోత్తరాలూ, పూర్వాపరాలూ అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు స్త్రీలు రాసిన రచనల్ని చదవాలి, వాటిలో స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. అయితే స్త్రీని దేవతగానో లేదా రాక్షసిగానో చిత్రించిన స్థితి ఆ కాలంలో రచయిత్రులను ఏదో ఒక ఇమేజిని తప్పనిసరిగా చంపే దిశగా ప్రభావితం చేసింది.

పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్ ఒక సందర్భంలో "ఒక వృద్ధ ప్రొఫెసర్ డెబ్బయ్యో సారి కీట్స్ ని శోధించడమో,  నూట యాభయ్యో సారి డాంటే ,మిల్టన్ ల గ్రంథాలను తిరగరాయించడమో చేసేలోగా మా రచయిత్రులం ఒక దుకాణంలో పనిచేసే సాధారణమైన అమ్మాయి వాస్తవ చరిత్ర పూర్తిగా రాయగలం" అంటారు. పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందని వూల్ఫ్ ఉద్దేశ్యం కావచ్చు. ఏదేమైనా స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ' కు కారణాలేమై ఉండచ్చు ? ఆమె యొక్క మౌనమా ? స్త్రీకి పరిధులు నిర్దేశించడమా ? లేదా ఆమెను ద్వితీయ స్థానానికి పరిమితం చేయడమా ? అనే దిశగా స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనికి తోడు పితృస్వామ్యపు సాహితీ సంస్కృతిలో ఒక రచయిత్రి స్థానం ఏమిటన్న దిశగా ఆలోచిస్తే సాహితీ విమర్శలో ప్రధానంగా చర్చించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి: ఇక్కడ ప్రధానంగా వినిపించే స్వరం పురుషుడిది కాబట్టి ఆమె స్వరం అతణ్ణి అనుకరించాలా ? లేదా ఎదిరించాలా ? అతడితో తనదైన సాధికారిక స్వరంలో, తన సొంతమైన వాక్య నిర్మాణంతో, తనదైన  భాషలో తన అభిప్రాయాన్ని చర్చించాలా ? ఇటువంటి అంశాలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోకుండా ఇటు సిద్ధాంతపరంగానూ, అటు ఆచరణలోనూ రెండు విధాలుగానూ మార్పు తీసుకురావాలి.

ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి కొందరు ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే  అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. ఇటువంటి రచయిత్రుల 'పాపులర్' రచనలు నేటి స్త్రీవాదానికి చిహ్నంగా ప్రతీ ఇంటా కాఫీ టేబుల్ మీదో , యువతుల చేతుల్లో కాఫీ కప్పులతోనో, లేదా బీచుల్లోనో ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు  'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick , Simone de Beauvoir,  Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. నిజానికి పాత పాటే మళ్ళీ పాడుతూ స్త్రీ గళాన్ని వినిపించకుండా శతాబ్దాలుగా అణిచివేశారని తన రచనల్లో రాసే  సోల్నిట్ లాంటి స్త్రీవాదులు తమ రచనల ద్వారా స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. నేటి స్త్రీవాద రచనల్లో తరచూ పాత విషయాలే పునరావృతమవుతుండడం చూస్తుంటాం. కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా రచయిత్రుల విషయంలో చెప్పినదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది. బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరడం లేదేమో ! అందువల్ల నేటి స్త్రీవాద రచనలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నట్లు అనిపించినా అదృష్టవశాత్తూ అవి మునుపటిలా మౌనాన్నైతే ఆశ్రయించడంలేదు. ఇక మన అదృష్టమో దురదృష్టమో మనం సోల్నిట్ లాంటి రచయిత్రుల పుస్తకాలు కూడా వదిలిపెట్టకుండా చదువుతున్నాం.

ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా స్త్రీవాదులకూ, విమర్శకులకూ సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి సాహితీ విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది మగవారు (రచయితలు) స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీ రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో భాగంగా పండితులూ, ఉపాధ్యాయినులూ, రచయిత్రులుగా స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. అసలందులో వారి భాగస్వామ్యాన్ని పూర్తిగా నిరాకరిస్తారు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. వీరు కాలక్షేపానికి ఏదో సూపర్ మార్కెట్ కో, సినిమాకో  వెళ్ళి ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయే బాపతు, వీళ్ళ విషయంలో పఠనం ఏ న్యూస్ పేపరుకో, లేదా సోషల్ మిడియా పోస్టులకో పరిమితమవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు.

ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ ఎటువంటి వివక్షా లేదని విపరీతమైన ఆశావహదృక్పథాన్ని (“apparently supportive tokenism") అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారనుకునే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఏవైనా సంకలనాలను ప్రచురించేటప్పుడు అందులో కనీసం ఒకరిద్దరు స్త్రీలయినా లేకపోతే బావుండదని ఎవరో ఒక 18వ శతాబ్దపు స్త్రీ కవయిత్రికి చెందిన కొన్ని కవితల్ని ఏరుకొచ్చి కంటితుడుపు చర్యగా అందులో కలిపేవారు. ఏదో విధంగా ప్రసిద్ధికెక్కినవారినో, లేదా ఆ సమయానికి తాజావార్తల్లో ఉన్న ఒకరిద్దరు రచయిత్రుల్నో తప్ప మిగతా అందర్నీ పూర్తిగా విస్మరించేవారు. అదేమంటే వీరి సమాధానం : "ఆమె స్త్రీయే కదా, ఆమె రచనల్ని సంకలనంలో కలిపాం కదా !". వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం.  

ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక కంటికి కనిపించని గాలిలా పితృస్వామ్య మూలాలుంటాయి. ఏదేమైనా ఈ తిరస్కారాలన్నీ అధిగమించి స్త్రీవాద విమర్శకులు స్త్రీవాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అనేక రచనల్ని ప్రచురించారు. ఏదేమైనా స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత సంతతికి చెందిన అమెరికన్ సాహితీవేత్త గాయత్రి చక్రవర్తి స్పివాక్ ని చదువుతున్నప్పుడు ఆమె అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్' ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపచెయ్యాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఈ వ్యాసం రాయడానికి సహాయపడిన రచనలు : 

Rereading Women By Sandra M. Gilbert
Still Mad By Sanda M Gilbert
The Madwoman in the Attic By Sandra M. Gilbert, Susan Gubar
In the Margins. On the Pleasures of Reading and Writing By Elena Ferrante 
A Room of One's Own By Virginia Woolf
In other worlds By Gayatri Chakravorty Spivak

Tuesday, September 19, 2023

How To Be a Stoic (Penguin Great Ideas) - Epictetus, Seneca, Marcus Aurelius

'స్టోయిసిజం' అంటే స్వార్థంతో కూడిన తత్వమనీ, మనిషితనం లోపించిన ఫిలాసఫీ అనీ కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాగుల్లో నార్సిసిస్టిక్ లక్షణాలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. విరాగులు మనుషుల్ని భావోద్వేగాల నుండి పూర్తిగా వేరుపడి హేతుబద్ధతతో ఆలోచించమంటారు. తనకుమాలిన ధర్మం చెయ్యవద్దంటారు. వ్యక్తిత్వ నిర్మాణంపై, మానసిక అభివృద్ధిపై శ్రద్ధపెట్టమంటారు. వ్యక్తిగత సమయానికీ, ఏకాంతానికీ విలువిమ్మంటారు. సంఘజీవిగా ఉంటూనే తామరాకుపై నీటిబొట్టులా ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇక కొందరు విరాగులైతే అన్ని శాస్త్రాల్లోకీ తాత్వికత మాత్రమే అధ్యయనం చెయ్యవలసిన శాస్త్రమని బలంగా నమ్ముతారు. అందువల్ల స్టోయిక్ తత్వమంతా వ్యవస్థకు దూరంగా వ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది.

నిజానికి మార్కస్ ఆరీలియస్ వంటివారు ఒక సాధారణ జర్నల్ లా రాసుకున్న అంశాలే తదుపరి కాలంలో "మెడిటేషన్స్" పేరిట ఒక గొప్ప ఫిలాసఫీ పుస్తకంగా అవతరించాయి. సెనెకా రాసిన ఉత్తరాలే స్టోయిక్ ఫిలాసఫీలో కీలక భాగంగా మారాయి. ఎపిక్టెటస్ చేసిన ప్రసంగాలు కాలాలు మారి తాత్విక బోధనల రూపు దాల్చాయి. వీళ్ళ తత్వం చదువుతుంటే ఈ ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వవేత్తలు ఆధునిక మానవుడికంటే ఎన్నో రెట్లు వివేకవంతులనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక తరానికి భిన్నంగా వీరికి మొక్కకు పురుగు పట్టి కుళ్ళిపోవడం మొదలుపెడితే వైద్యం వేర్లకు చెయ్యాలని తెలుసు. వీళ్ళు నేటి తరంలోలా ఆకులకూ, కొమ్మలకూ మాత్రమే వైద్యం చేస్తూ కూర్చోకుండా మొక్క మూలాల దగ్గర మట్టిని మారిస్తేనో లేదా శుభ్రం చేస్తేనో మాత్రమే దానికి జీవం వస్తుందనే కనీస గ్రహింపు ఉన్నవాళ్ళు. అందువల్ల వ్యక్తి బాగుంటేనే వ్యవస్థ బావుంటుందని నమ్మే వీరి తత్వమంతా మనిషిని మంచి విలువలతో ఉన్నతుడిగా మార్చే  దిశగానే సాగుతుంది.

ఇక "Those who lack the courage will always find a philosophy to justify it." అని ఆల్బర్ట్ కామూ అన్నట్లు స్టోయిక్ ఫిలాసఫీని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులోని భావోద్వేగాలను జయించడం, స్వీయ స్పృహ కలిగి ఉండడం వంటి అంశాల్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలాంటివి ఏ ఫిలాసఫీ విషయంలోనైనా సహజంగా జరిగేదే. నేడు సూడో ఇంటెలెక్చువల్స్ రాస్తున్న బెస్ట్ సెల్లింగ్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఎదుటి మనిషిని ఎలా ఏమార్చాలి ? మన మాట ఎలా నెగ్గించుకోవాలి ? మనదే పైచెయ్యిగా ఆధిపత్యం ఎలా సాధించుకోవాలి ? మన స్వార్థానికి ఎదుటి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి ? వంటి అంశాలు  తరచూ కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా స్టోయిక్ ఫిలాసఫీ ఇతరులకు కీడు తలపెట్టకుండా ఆరోగ్యకరమైన / ఆమోదయోగ్యమైన 'ఆత్మరక్షణ' ఎలా చేసుకోవాలో నేర్పుతుంది.

ఏ మానవ మేధస్సు మనిషి ఉనికిని అర్థవంతంగా చేసిందో, నేడు అదే మేధస్సు కృత్రిమత్వంతో అదుపు తప్పి మనిషిని వినాశనంవైపు నడిపిస్తోంది. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లు ఆధునిక ప్రపంచంలో ప్రతీ స్వల్ప విషయాన్నీ సమస్యగా మార్చుకునే మానవ మేధను నియంత్రణలో ఉంచాల్సిన తరుణంలో కులమత జాతి విద్వేషాలు,  భిన్నవాదాలూ, గందరగోళాల మధ్య మనిషికి స్థితప్రజ్ఞత సాధించడానికి విరాగులు బోధించిన తత్వం యొక్క అవసరం మునుపటి కంటే నేడు మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.

పెంగ్విన్ వారు 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా గ్రీకు, రోమన్ తత్వవేత్తలైన మార్కస్ ఆరీలియస్, సెనెకా, ఎపిక్టెటస్ రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని ఎంపిక చేసి ఆ సారాన్ని 'How to be a stoic' పేరిట ప్రచురించారు. ఇందులో, ఎపిక్టెటస్ 'Enchiridion', సెనెకా 'On the shortness of life' మరియు మార్కస్ ఆరీలియస్ 'Meditations' నుండి సంగ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మునుపు 'ఎన్చిరిడియన్' తప్ప మిగతా రెండిటి గురించీ విడివిడిగా రాశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావించడం లేదు. 'ఎన్చిరిడియన్' లో కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం.

* మనిషి 'స్వేచ్ఛ' అంటే సకల సౌకర్యాల మధ్యా భౌతికంగా  స్వతంత్రంగా బ్రతకడం మాత్రమే అనుకుంటాడు. కానీ ఎదుటివాళ్ళ అభిప్రాయాలకు అవసరం లేనప్పుడు కూడా విలువిస్తూ, ఎవరేమనుకుంటారో అని నిత్యం భయంతో బ్రతుకుతూ, ఒక చట్రంలో ఇమిడే క్రమంలో మానసికంగా తన ఆలోచనల్లో బానిసగా మిగిలిపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేక తన అధీనంలో లేని విషయాలను గూర్చి తలపోస్తూ నిత్యం చింతలో, ఆందోళనలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.

* మన గురించి ఎదుటివారి అభిప్రాయాలు వారి మనసులో మనపట్ల కలిగే భావాలు, తలంపుల ఫలితం మాత్రమే. మనల్ని నిర్వచించేవి వారి భావాలు కాదు గనుక మన అధీనంలో ఎంతమాత్రమూ లేని ఆ అభిప్రాయాలతో మనకు నిమిత్తం లేదు.

* అజ్ఞాని తన దురదృష్టానికి ఎదుటివారిని నిందిస్తాడు. తనని తాను నిందించుకునేవాడు అభివృద్ధి మార్గం వైపు నడుస్తాడు. వివేకవంతుడు  తననూ నిందించుకోడు, ఇతరులనూ నిందించడు.

* జీవితంలో అన్ని సంఘటనలూ మనకు అనుకూలంగానే జరుగుతాయనుకోకూడదు. జరిగే సంఘటనలను యథావిధిగా అంగీకరించడమే శాంతికి మార్గం.

* ఎటువంటి సందర్భంలోనూ "నేనిది కోల్పోయాను" అనుకోకు. "నేనిది తిరిగిచ్చాను" అనుకో. ఒక యాత్రికుడు తాను తాత్కాలికంగా బస చేసిన  సత్రాన్ని ఎలా భావిస్తాడో అలా ఆ క్షణంలో నీకు దక్కినదానిని ఆనందించడం నేర్చుకో.

* నీ శరీరం ఎవరు పడితే వారి నియంత్రణలోకి వెళ్ళడాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. కానీ నీ మెదడుని మాత్రం నిన్ను విమర్శించిన ఎవరి నియంత్రణలోకైనా వెళ్ళడానికెందుకు అనుమతిస్తావు ? 

* నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండు, సమూహంలోనైనా, ఒంటరిగానైనా సరే.

* అధికభాగం మౌనాన్ని అలవరుచుకో. అవసరమైనంతే క్లుప్తంగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడమని కోరితే సామాన్యమైన, వ్యర్థమైన విషయాలను గూర్చి మాట్లాడకు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను గూర్చి పుకార్లు, ఫిర్యాదులు, పొగడ్తలు, నిందించడం, పోల్చుకోవడం లాంటివి చెయ్యకు.

* ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే సంజాయిషీ ఇస్తూ నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. దానికి బదులు- "వారికి విషయం సగం కూడా తెలియదు. తెలిస్తే మరికాస్త ఎక్కువ చెప్పి ఉండేవారు" అను.

* ఎవరైనా నిన్ను సత్యదూరంగా విమర్శిస్తుంటే, అది వారు సరైనదని నమ్ముతూ, తమ దృష్టి కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రహించు. వారి అభిప్రాయాలు తప్పైతే వారే మున్ముందు తమ అజ్ఞానంతో కూడిన స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం నీ విమర్శకుల పట్ల దయతో వ్యవహరించినవాడివవుతావు.

Friday, April 21, 2023

Seduced by Story: The Use and Abuse of Narrative - Peter Brooks

ప్రముఖ అమెరికన్ సాహితీవేత్త, విమర్శకులూ అయిన పీటర్ బ్రూక్స్ రాసిన "Reading for the Plot"(1984) చదువుదామని చాలా కాలంగా అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఈలోగా ఇటీవలే ఆయన కొత్త పుస్తకాన్ని "Seduced by Story: The Use and Abuse of Narrative" పేరుతో న్యూయార్క్ రివ్యూ బుక్స్ వారు ప్రచురించారని తెలిసింది. ఈ పుస్తకం 2022 సంవత్సరానికి గాను న్యూయార్క్ మ్యాగజైన్ / వల్చర్ బెస్ట్ బుక్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. పుస్తకం పేరు  కుతూహలాన్ని రేకెత్తించగా, పాత పుస్తకం సంగతి వదిలేసి ఇది చదవడం మొదలుపెట్టాను. నిజానికి బ్రూక్స్ రాసిన ఈ రెండు పుస్తకాల మధ్య కాలంలో మన సంస్కృతిలో "కథనానికి" ఉన్న నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కళారంగానికి మాత్రమే పరిమితమైన "కథనాలు" (నేరేటివ్స్) నేడు వాస్తవంపై పూర్తిగా కమ్ముకున్న చీకటి నీడల్లా రాజకీయ సామజిక అంశాలపై సైతం తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. (Public civic discourse supposedly dedicated to reasoned analysis).

Image Courtesy Google

"గేమ్ ఆఫ్ థ్రోన్స్" సిరీస్లో నాకు ఇష్టమైన టిరియన్ పాత్రధారి “There’s nothing in the world more powerful than a good story. Nothing can stop it. No enemy can defeat it.” అన్న మాటల్ని ప్రారంభ వాక్యాలుగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకం మొదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కథలూ, కథనాలూ మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న అంశంపై రాసిన పుస్తకం ఇది. "ప్రపంచంలోని కథనాలు అసంఖ్యాకమైనవి" అంటారు రోలన్ బార్త్. ఎక్కడైనా, ఎప్పుడైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన కథ లేని మనిషంటూ ఉండడు. అంతర్జాతీయ, సాంస్కృతిక, చారిత్రక వైరుధ్యాలు ఎన్నున్నప్పటికీ జీవితమున్న ప్రతీ చోటా ఒక కథనం (నేరేటివ్) కూడా ఉంటుంది.

ఈ పుస్తకంలో సాహిత్యంలోని వివిధ నేరేటివ్స్ మనపై ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయో అంచనావేసే క్రమంలో రచయిత ప్రూస్ట్, సాకీ, బోర్హెస్, పౌలా హాకిన్స్, బల్జాక్, మొపాసా, హెన్రీ జేమ్స్ వంటి పలువురి రచనల్లోని కథనాల్ని విస్తృతంగా విశ్లేషించారు. సాహిత్యం చదివేటప్పుడు మనం వాస్తవం కాదని తెలిసి కూడా కాల్పనిక వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకుంటాం, మన భావోద్వేగాల్ని వెచ్చిస్తాం. ఎమ్మా బావరీ, అన్నా కరెనిన వంటి కల్పిత పాత్రల ఆశయాలూ, పొరబాట్లూ, అంతఃసంఘర్షణలూ మనకెంతో ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. పేజీలు తెరుస్తూనే ఆ పుస్తకంలోని పాత్రలు నిజం కాదని తెలిసినప్పటికీ వాళ్ళతో పరిచయం పెంచుకోడానికి తహతహలాడతాం, వాళ్ళను ఆరాధిస్తాం, ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, విమర్శిస్తాం. వాళ్ళ ఓటమి మనదైనంతగా బాధపడతాం, వాళ్ళ గెలుపుకి చప్పట్లు కొడతాం. Those unreal people and their dilemmas are deeply important to us. The psychologist Paul Harris confirms what we already know: fictions arouse emotions even when recognized to be fictional.

ఇక వాస్తవ ప్రపంచానికొస్తే, రోజువారీ జీవితంలో మనం అనేక కథనాలు వింటూ ఉంటాం. అనేక వివరాలతో కూడిన ప్రతీ కథనమూ కథకుడు (కథకుడంటే రచయితే కానఖ్ఖర్లేదు, ఎవరైనా కావచ్చు, కథకుడు అంటే ఇక్కడ కథగా విషయాన్ని చెప్పేవాడు) కథను చెప్పే విధానాన్ని బట్టి వాస్తవంగానే ధ్వనిస్తుంది. We know from literature as well as life that unreliable narrators can at times be charming and seductive, even that the non-truth they tell can have a certain value.  ఈ నేరేటివ్స్ లో వాస్తవమెంతో అభూత కల్పనెంతో  తెలియాలంటే ఇటువంటి పుస్తకాలు చదవడం అవసరం. ముఖ్యంగా ఈ కృత్రిమ మేథ కాలంలో మన జీవితాలను సామజిక మాధ్యమాలూ, మీడియా, రాజకీయాలూ, కార్పొరేట్ కంపెనీలూ తమ స్వార్ధప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా మానిప్యులేట్ చేస్తున్న తరుణంలో వారి కథనాల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్య గీతలు గీసుకోవడం గురించి విస్తృతంగా చర్చిస్తుందీ పుస్తకం. ఇందులో అనేక విశ్లేషణలు Ontological నేరేటివ్ కీ epistemological నేరేటివ్ కీ మధ్య భేదాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. రాజకీయ పార్టీలూ, పాలక వ్యవస్థలూ భాషను తమకనుగుణంగా మలుచుకుని సమర్ధవంతమైన  కథనాల్ని తయారుచేసి ప్రజల్ని మభ్యపెడుతున్న ఈ కాలంలో మనం ఏ కథను నమ్మాలో, ఏ కథను నమ్మకూడదో ఈ పుస్తకం చదివితే ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది. 

What seems more important than choosing between ontology and epistemology is recognizing that telling and living are not the same thing. We may live the world as an unfurling narrative, but when we tell of it, whether anecdotally or analytically, that’s a different operation.

"చెప్పేవాడు వినేవాడికి లోకువ" అనే ఒకప్పటి నానుడి ఇప్పుడు పాతబడిపోయింది. ఇప్పటి పరిస్థితి "వినేవాడు చెప్పేవాడికి లోకువ" అన్న తీరుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడి కథలో ఎంతోకొంత ప్రామాణికత ఉండేది, కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అనేక అజెండాల ప్రాతిపదికన కులమతవర్గ వైషమ్యాలను రెచ్చగొడుతూ, రాజకీయలబ్ది కోసం ప్రామాణికతకు తిలోదికాలిచ్చే సత్యదూరమైన కథనాలే నేడు అధికంగా ప్రాచుర్యంలో ఉంటున్నాయి. వాటిల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చుకోవాలంటే మనకు భిన్న కథనాల తీరుతెన్నులు తెలియాలి. ఈ రచన సాహిత్యం మొదలు మీడియా, రాజకీయాలూ, ఫిలాసఫీ, సైకాలజీ వంటి అనేక అంశాల ఆధారంగా కథనాలు (నేరేటివ్స్) మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒక అవగాహన కలిగిస్తుంది.   

ఈ రోజుల్లో మీడియాలో ప్రతీ ఒక్క వార్తా ఒక కథనమే. అందులోనూ వీటిల్లో ఏ విధమైన ప్రామాణికతా లేని కథనాలే అధికం. ఏ వార్త గురించైనా చెప్పాలన్నా ఈ మధ్య "మీడియా కథనాలను అనుసరించి", "రాజకీయ కథనాల్ని బట్టి" వంటి వాక్యాలు తరచూ వింటున్నాం. "ఆవిడ కథ ఏమిటంటే", "అతడి కథ మనకి తెలియాలంటే", "ఫలానా కంపెనీ కథని చూస్తే", "దీని వెనుక ఉన్న కథేమిటంటే" అంటూ న్యూయార్క్ టైమ్స్  మొదలు గార్డియన్, బీబీసీ, టైమ్స్ వంటి అనేక ప్రముఖ పత్రికల వరకూ అనేక వ్యాసాలు ప్రచురింపబడుతున్నాయి. 

That continues, in more and more virulent form, as rulers judge that controlling the media narrative is what governing is all about. “The nation needs a better story about the drivers of economic growth,” I read in The New York Times. Writing to the corporate world in Whoever Tells the Best Story Wins, Annette Simmons claims: “The really important issues of this world are ultimately decided by the story that grabs the most attention and is repeated most often.”

Every person has a story to tell, and the corporate person has understood, with a vengeance, that it must stake its identity, persuasion, and profits on telling a story, however bizarre or banal. Corporate reports have turned from the statistical to the narrative mode. And in the wake of the corporation are political candidates and parties, the military, the tourism industry, universities, hospitals, bakeries—even accounting firms. Salmon, the sociologist, has identified what he calls a “nouvel ordre narratif,” or NON: a new narrative order that dominates in business and politics.

ఈ కారణంగా పాఠకులపైనా లేదా విన్నవారిపైనా సదరు కథనాలను గుడ్డిగా నమ్మడం కంటే తమకు తాముగా విశ్లేషించుకోవలసిన (French Structuralists dubbed “narratology.”) బాధ్యత మునుపెన్నడూ లేనంతగా ఉందని గ్రహించడం అందరికీ అవసరం.

Recall the claim of Annette Simmons: “Every problem in the world can be addressed—solved, made bearable, even eliminated—with better storytelling.” Do we really want to subscribe to that belief ? Doesn’t it mystify more than it solves? 

భవిష్యత్తులో "నేరేటివ్ పవర్" మనల్ని శాసించకుండా దాన్ని మనం అదుపు చెయ్యవలసిన అవసరాన్ని గుర్తుచేస్తూ పీటర్ బ్రూక్స్ ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు అనే కంటే, ఈ రచనలో అనేక ఉదాహరణల సహితంగా పలు కథనాల్లోని ప్రామాణికతను అంచనా వేసే మార్గాలను సూచించారనడం సబబు. రోలన్ బార్త్ "మైథాలజీస్" తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత కలిగిన పుస్తకం ఇది. సాహితీప్రియులే కాకుండా ప్రతీ ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. హాప్పీ రీడింగ్. :) 

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు : 

Mortality can perhaps best be dealt with in story form. Whatever meanings life may have, or fail to have, develop through time.

Stories are regarded by law as suspiciously emotional, as making a kind of appeal to empathy—or prejudice—that legal rules must cabin and confine.

Story may be a necessary part of our cognitive interaction with the world because its mode of explaining takes place within time, and humans are time-bound in a way that they are not place-bound.

It’s quite true that we can’t ever find the proper repose, as Kierkegaard puts it, to see our lives in full retrospect. That view is denied to us. According to Walter Benjamin, this explains why we read fiction: we seek in the death of the fictional character the meaning of life that comes only with death. Death in fiction is the “flame” at which we warm “our shivering lives.”

Plato notes in his Phaedrus that the problem with written texts is that they roam around everywhere, promiscuously, and it’s impossible to know how they will be received, interpreted, acted upon. The oral storyteller, on the other hand, can gauge audience reaction, respond to questions or skeptical looks or bored body language. Many writers in the age of writing and print appear to look back upon the era of oral storytelling with nostalgia, as a less fallen age of communication and fellowship.

నేరేటివ్ పవర్ గురించి గై డి మొపాసా కథ " A Ruse" ను ఆధారంగా చేసుకుని  బ్రూక్స్ చేసిన విశ్లేషణ అద్భుతం. మీరు ఇప్పటికే ఈ కథ చదివున్నట్లైతే ఈ క్రింది విశ్లేషణ మరింత బాగా అర్థమవుతుంది. చదవని వాళ్ళు వీలైతే ఆ కథ చదివిన తరువాత ఈ వాక్యాలు చదవండి.  

This cynical, mocking—almost sneering—reply that ends the tale reverberates after we have closed the book. What has the doctor done to the young woman? The tale reads as a kind of verbal violation, really a kind of rape, destroying the young woman’s faith in marital fidelity, contaminating her mind with ideas it does not want, creating an unwholesome bond between her and her doctor. She has been changed by the story she has unwittingly and unwillingly listened to. She has gained a knowledge of good and evil of which she was innocent. She doesn’t want the story, its content, its lesson. But now she cannot get rid of them. They remain with her as a kind of poisonous residue. Maupassant’s story is trivial and bleak. But it demonstrates with a kind of fierceness the result of listening, of having to listen to, a story. In the words of T. S. Eliot: “After such knowledge, what forgiveness?” Some things we learn cannot be undone. We are forever changed by them.

Benjamin claims: “The flame that consumes this stranger’s fate warms us as our own fates cannot. What draws the reader to a novel is the hope of warming his shivering life at the flame of a life he reads about.”

As Freud said, much too simplistically but with much truth, fiction is all about “His Majesty, the ego.”

So what we think of as the teller’s tale can’t exist without it being the listener’s tale as well.

Language is an imperfect instrument of communication: “a cracked cauldron on which we beat out tunes for bears to dance to, while we would wish to move the stars to pity,” Flaubert claims in Madame Bovary.

But it’s what we have to hand to communicate with others, in the hope of hearing a response, of establishing a dialogue. When we fail to get a reponse, we try again, telling another story. We’re back to Scheherazade, telling one story after another to keep alive, knowing that in the long run we are condemned but believing that in the meanwhile we need to make others hear us out.

The Borges tale I mentioned earlier, “Tlön, Uqbar, Orbis Tertius,” offers a kind of parable: if you cease to recognize that fictions are the “discipline of men, not of angels,” if you start believing in them literally, they cease to be fictions and devolve into myth, which claims explanatory status and demands belief, whether it be in the “master race” or in the resurrection of the body. Fiction is playful precisely in its refusal to accept belief systems, its insistence on the “as if.”

“Let’s pretend” seems to be a statement and a state of mind that distinguishes humans from the so-called “higher apes.”

We live at a time when knowledge generated by the humanities in general and literary study in particular is often publicly devalued, or even derided. The only knowledge worth having is thought to be instrumental: that which gives you direct leverage on the world.

Tuesday, March 28, 2023

The Art of Seduction - Robert Greene

అబిడ్స్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే రచనల్లో రాబర్ట్ గ్రీన్  పుస్తకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా "48 లాస్ ఆఫ్ పవర్" బావుందని కొందరు మిత్రులతో సహా మా పిల్లవాడు కూడా చెప్పడంతో (పిల్లల బుక్ క్లబ్ లో భాగంగా స్నేహితులు అందరూ చదివారని అన్నాడు), సరదాగా గ్రీన్ పాపులారిటీ ఏమిటో చూద్దామని ఈ పుస్తకం చదివాను. కరెంట్ ట్రెండ్స్ విషయంలో నా అజ్ఞానాన్ని నాకు మరోసారి గుర్తుచేసిందీ పుస్తకం. :)  

"నాలెడ్జ్ ఈజ్ పవర్" అంటారు. కానీ ఒక సూపర్ హీరో సినిమాలో అన్నట్లు "విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ". జ్ఞానాన్ని సంపాదించడంలో ఉండే జిజ్ఞాస మంచిదే గానీ దాన్ని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే లేదా వినియోగించే విధానంలో జాగ్రత్త, జాగరూకత లాంటివి అవసరమవుతాయి. కొన్నిసార్లు ఆ జ్ఞానాన్ని వినియోగించవచ్చా లేదా అనే విచక్షణకు ఖచ్చితమైన ఒక 'మోరల్ కంపాస్' మరింత అవసరమవుతుంది.

Image Courtesy Google

పుస్తకాల విషయంలో మంచి పుస్తకాలూ, చెడ్డ పుస్తకాలూ లాంటివేవీ ఉండవంటారు వైల్డ్, ఏ పుస్తకమైనా బాగా రాసినదైనా అయి ఉండాలి,లేదా చెత్తగా రాసినదైనా అయి ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. మానవ సమాజంలో పరమ అనైతికమైన (?) విషయాలుగా భావించే అంశాలను సైతం అద్భుతమైన భాషా సౌందర్యాన్ని ఉపయోగించి వినసొంపుగా చెప్పి ఒప్పించగలిగే నేర్పు కొందరు రచయితలకు ఉంటుంది. నేను చదివిన కొన్నిట్లో నబకోవ్ 'లోలిటా', ఆండ్రే గిడే 'ఇమ్మోరలిస్ట్', హెర్మన్ హెస్సే 'స్టెప్పెన్ వుల్ఫ్' లాంటివి ఈ కోవలోకి వస్తాయనుకుంటాను. ఏ పుస్తకమైనా నైతికానైతికమైన అనేక విషయాలను చెబుతుంది. అది ఏం చెబుతుంది అనేది ప్రక్కన పెడితే అందులోంచి ఏం తీసుకోవాలనేది పూర్తిగా పాఠకుల మానసిక పరిపక్వతా, విచక్షణల మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ తెలిసి ఉండడం ఎంత అవసరమో, దాన్ని అన్ని మానవసంబంధాల్లోనూ అమలుచెయ్యాలనుకోవడం అంతే అసంబద్ధం. ప్రతీ  మనిషీ ప్రత్యేకం, అన్నిటికీ ఒకే మూసలో పనిచేసే మంత్రం ఉపయోగించడం చాలా బ్యాడ్ ఐడియా.  

ఆ మధ్య చూసిన ఏదో తెలుగు సినిమాలో పెళ్ళిలో 'రొమాన్స్' అవసరం అని ఒక ముక్తాయింపునిచ్చారు. కానీ ఆ 'రొమాన్స్' అనే బ్రహ్మ పదార్థం ఏమిటనేది చాలామందికి తెలీదు. (పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకున్న ఓల్డ్ స్కూల్ పీసెస్ అయిన మాతో సహా :) ) రాబర్ట్ గ్రీన్ రాసిన నాన్ ఫిక్షన్ రచన 'ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్' లాంటి పుస్తకాలు ఆ సో కాల్డ్ 'రొమాన్స్' అంటే ఏమిటో కొంత వరకూ చెబుతాయి అనుకుంటాను. దాదాపు 500 పేజీల ఈ పుస్తకం ఇప్పటి  "కంట్రోల్" ప్రాతిపదికగా నడిచే మానవ సంబంధాలకు అద్దం పడుతుంది. అడ్రినలిన్ రష్, excitement ఇచ్చేది మాత్రమే ప్రేమని అనుకునే నేటి తరానికి గ్రీన్ చెప్పే చిట్కాలు సరిగ్గా సరిపోతాయి.

ఇవన్నీ తెలిసి ఉండడం మానసిక పరిపక్వతకు అవసరమే కానీ మానవ సంబంధాల్లో ఈ చాణక్య సూత్రాల ఎత్తుకు పై ఎత్తుల కంటే 'ప్యూరిటీ ఆఫ్ కన్సైన్స్' అత్యంత అవసరమని నమ్మే పాత తరం వ్యక్తులుగా చెప్పేదేమంటే ఈ పుస్తకాన్ని చదవండి కానీ ఇందులో ఉన్నవేవీ పాటించకండి. ఒక మనిషితో వ్యవహరించేటప్పుడు మీ జ్ఞానాన్నీ, తెలివితేటల్నీ వారి మీద ప్రయోగించకుండా మరో మనిషిగా ప్రేమతో, దయతో వ్యవహరిస్తే చాలు. మనకి నచ్చిన మనిషిని "విక్టిమ్" అనీ "టార్గెట్" అనీ అంటున్నప్పుడే రచయిత స్టాండ్ ఏంటో మనకి స్పష్టంగా తెలిసిపోతోంది. 

శాంపిల్ కి మోడరన్ చాణక్యుడు చెప్పిన కొన్ని మనిషిని టార్చర్ చేసే, సారీ.... సెడక్షన్ పద్ధతులు. కొన్ని చదువుతుంటే ఎంత షాకింగ్ గా అనిపించిందో చెప్పలేను.

1.Choose the Right Victim

2.Create a False Sense of Security—Approach Indirectly

3. Send Mixed Signals

4. Appear to Be an Object of Desire—Create Triangles

5. Create a Need—Stir Anxiety and Discontent

6. Master the Art of Insinuation

7. Enter Their Spirit

8. Create Temptation

9. Keep Them in Suspense—What Comes Next?

10. Use the Demonic Power of Words to Sow Confusion

11. Pay Attention to Detail

12. Poeticize Your Presence

13. Disarm Through Strategic Weakness and Vulnerability

15. Isolate the Victim 

17. Effect a Regression

18. Stir Up the Transgressive and Taboo

19. Use Spiritual Lures

20. Mix Pleasure with Pain

Monday, February 27, 2023

The Carrier Bag Theory of Fiction - Ursula K. Le Guin

నాటి నుండీ నేటి వరకూ సాంస్కృతిక ఆధిపత్యం అంతా పితృస్వామ్య వ్యవస్థ  చెప్పుచేతల్లోనే ఉంది. చరిత్ర లిఖించడం మొదలుపెట్టిన తొలినాళ్ళనుండీ దాన్ని ఒక తరంనుండి మరో తరానికి వంశపారంపర్య ఆస్తిగా బంగారు పళ్ళెంలో పెట్టి ముట్టచెబుతూనే ఉన్నారు. ఈ విధానాన్ని సాంస్కృతిక వారసత్వం పేరిట శిలాశాసనంగా భావించి తలొగ్గేవారి సంగతి ప్రక్కన పెడితే, ఎప్పుడూ "బిగ్ పిక్చర్" చూస్తూ తమకంటూ స్వంత ఆలోచనా, అభిప్రాయాలూ ఉన్నవాళ్ళు ఈ హెచ్చుతగ్గుల్నీ, వివక్షనూ తమ రచనల ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Image Courtesy Google

పితృస్వామ్యం నిర్దేశించిన చట్రం నుండి బయటపడి తమ రచనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో అమెరికన్ రచయిత్రి ఉర్సులా కె లెగైన్ కూడా ఒకరు. సాహిత్యంలో వివక్షలపై దృష్టి సారిస్తూ "The Carrier Bag Theory of Fiction" పేరిట ఆమె రాసిన ఈ  వ్యాసాన్ని ఆమె వ్యాసాల సంపుటి నుండి వేరు చేసి మరీ ప్రత్యేకమైన పుస్తకంగా పునర్ముద్రించారంటేనే ఆధునిక సాహిత్యంలో దీని ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది.

మనిషికి ఆహారంగా తొలుత అందుబాటులో ఉండేవి కందమూలాలు. నిజానికి ఆకులూ, దుంపలూ, పళ్ళూ వంటివి మాత్రమే మనిషికి ప్రకృతిలో ఆహారంగా కేటాయింపబడినవి. కానీ మనిషి స్వేచ్ఛాజీవే కాదు స్వార్థ జీవి కూడా. అతడికి ఉన్నదెప్పుడూ చాలదు, ఇంకా ఏదో కావాలి. ఒక సినీ కవి అన్నట్లు, అప్పటికీ, ఇప్పటికీ "మనిషి మారలేదూ, ఆతడి కాంక్ష తీరలేదు".

కానీ మనిషికి కందమూలాలు తిని బ్రతికేస్తే పనివేళలు తగ్గిపోతాయి. తోచింది చేసుకోడానికి చేతినిండా కావాల్సినంత సమయం మిగులుతుంది. కానీ అబ్బే, మనకది నచ్చదు. మనిషికి రుచులు అధికం, అందునా "జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ" అన్నారు. గొడ్డులా చాకిరీ చెయ్యాలి, మనిషన్నాకా ఏదో ఒకటి సాధించే తీరాలి. అందుకే మనిషికి నిరంతరం కొత్త కొత్త రుచులు కావాలి. అందుకే ఆదిమ మానవుడు గుహల్లోంచి బయటకొచ్చి తన జిహ్వను సంతృప్తి పరుచుకోడానికి వ్యవసాయం చేశాడు. అలా ఒకరోజు ఆహార సముపార్జన కోసం అరణ్యంలో సాగుచేసిన పొలాల్లో కాయకష్టం చేస్తుండగా ఉన్నట్లుండి ఒక పెద్ద సింహం కనబడింది. మనిషి దానితో వీరోచితంగా పోరాడి, తన బల్లెంతో దాన్ని మట్టుబెట్టి, చేత రక్తమోడుతున్న అదే ఆయుధం ధరించి, ఆహారంతో బాటు విజయగర్వంతో తన సమూహం వద్దకు తిరిగి వచ్చాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు తెచ్చిన ఆహరం అనుకుంటే పొరపాటే, ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు ఆహారంతో బాటుగా వెంటబెట్టుకుని తెచ్చిన "కథ". 

యుద్ధం, సాహసం, రక్తపాతం, హింస లాంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఆ కథను విని అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆ కథ ఒక చెవి నుంచి మరో చెవికి చేరింది, తీరాలు దాటింది. అతడు కథానాయకుడయ్యాడు. ఇక కథను విన్నవాళ్ళూ, చూసిన వాళ్ళూ, చిలవలు పలవలల్లి చెప్పిన మిగతా వాళ్ళంతా సహాయపాత్రల్లా ప్రాముఖ్యత లేకుండా మిగిలిపోయారు. కానీ ఈ వీరోచిత గాథనే ఏళ్ళ తరబడి అటు తిప్పి, ఇటు తిప్పి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఈ కథలో కథానాయకుడు ఒక్కడే. తరాలు మారే కొద్దీ ఒక కథానాయకుడి పీఠంలో మరొకరొచ్చి కూర్చుంటారు. ఇది సాంస్కృతిక వారసత్వంగా, పురుషుడి హక్కుగా మారింది.

నిజానికి అతడి కథలో అసలు కథానాయకి పాత్ర చాలా కాలం వరకూ లేనే లేదు. తరువాత మెల్లిగా తమ సౌకర్యార్థం ఆ పాత్రను కథ మధ్యలో ఇరికించారు. ఆ పాత్రకు కూడా వాళ్ళే పరిమితమైన సంభాషణలు రాశారు. కథానాయకి వాళ్ళు చెప్పిందే చిలక పలుకుల్లా చెప్పాలి. అంటే హీరో కథని "ప్రాపగాండా" చెయ్యడానికే హీరోయిన్ ఉనికి పరిమితం. ఇదే మౌల్డ్ లో పోతపోసినట్లున్న కథనే వినీ వినీ మనకి విసుగొచ్చింది. కొత్తగా చెప్పుకోడానికి ఇక కథలేమీ మిగలని పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఆ సమయంలో మరో కథా నాయకుడు / నాయకురాలు ? కోణం నుంచి కథలు చెప్పడం ఆరంభమైంది.

నిజానికి హీరో ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ఆమె కథ అతడి కథంత అడ్రినలిన్ రష్ ఇచ్చే కథ కాదు. ఆమె కథ సాదాసీదాగా ప్రేమ, దయ,  ఆదరణ, సేవ, సంతానోత్పత్తి, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి అతి సామాన్యమైన అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎటువంటి హింసా, రక్తపాతం, సంఘర్షణా లేని, సాహసగాథలు కాని, చెప్పకుండా వదిలేసినా ఇటువంటి కథలు మనకు మరిన్ని అవసరం. నిజానికి ఉర్సులా కథల్లో లింగవివక్ష  కనపడదు. నాకు తెలిసి స్త్రీ పురుష భేదాన్ని సమూలంగా చెరిపేస్తూ తన పాత్రలకి ఏ ఒక్క జెండర్ నూ ఆపాదించకుండా "The Left Hand of Darkness" వంటి రచనలు చేసిన సాహసం చేసిన ఒకే ఒక్క రచయిత్రి ఆమె. అందుకే అటు స్త్రీవాదం వైపు కూడా పూర్తిగా మొగ్గు చూపని ఆమె రచనలు ఇంతవరకూ పెద్దగా ప్రాముఖ్యతను నోచుకోలేదు.

ఇటువంటి వ్యాసాలు చదివాక ఎంతో మంది ఫెమినిస్టు రచయిత్రులు  ప్రముఖులుగా వెలుగొందగా, ఆవిడ పేరు ఆవిడ జీవించి ఉన్నకాలంలో పెద్దగా వినపడకపోవడానికి కారణం కూడా ఆవిడలో "పితృస్వామ్యానికి ప్రమాదికారిగా మారే భావజాలం" ప్రధాన కారణం అని అర్థమవుతుంది. ఈ డిస్కోర్స్ ఆధునిక సాహిత్యపు తీరుతెన్నుల్ని సమూలంగా మార్చగల అవకాశాలు మున్ముందు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

Monday, February 20, 2023

Novelist as a Vocation - Haruki Murakami

కొత్త రచయితలకు మాత్రమే ఇచ్చే అకుతాగవా ప్రైజుకు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి "used goods" అని ముద్ర వేయించుకున్నా, స్వదేశంలోనే సాహితీ ప్రపంచం మొత్తం ఏకమై ఆయన రచనలు సాహితీ విలువలకు సుదూరమైనవంటూ తూర్పారబట్టినా, "ఆకుతాగవా ప్రైజు గెలుచుకోడంలో మురాకమీ వైఫల్యానికి కారణాలు" వంటి ఛీసీ పేర్లతో కొందరు విమర్శకులు పుస్తకాలు రాసి పరిహసించినా ప్రఖ్యాత జపాన్ రచయిత హరుకి మురాకమీ మాత్రం తాను చెయ్యాలనుకున్నదే చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన పంథాలోనే రచనావ్యాసంగాన్ని కొనసాగించి బెస్ట్ సెల్లర్స్ రాసే నవలాకారుడిగా సొంత గడ్డైన జపాన్లోనే కాక అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించారు. ప్రతీ తరంలోనూ సాహితీ విలువల కొలమానాల్లో తూగగలిగిన రచనలు కొన్నైతే, ఆ నిర్ణీత కొలమానాలకు దూరంగా జనాదరణ పొందిన సాహిత్యంగా పాఠకుల అభిమానాన్ని చూరగొనేవి మరికొన్ని. తెలుగులో యద్దనపూడీ, ఆంగ్లంలో జేన్ ఆస్టెన్ వంటివారు అటువంటి రచనలే చేసి పాఠకుల మనసుల్లో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. మురాకమీ రచనలు కూడా అటువంటి కోవకే చెందుతాయి.  

Image Courtesy Google

మురాకమీ జపాన్ లోని క్యోటోలో మొదలై న్యూయార్క్ టైమ్స్ వరకూ సాగిన తన సాహితీ ప్రయాణాన్ని గురించి "Novelist as a Vocation" పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. కానీ ఒక స్థాయికి చేరుకున్నాకా వర్ధమాన రచయితలకు రాయడం విషయంలో సూచనలిచ్చే చాలామంది రచయితల్లా మురాకమీ ఈ పుస్తకంలో నవలలు ఎలా రాయాలో, ఎలా రాయకూడదో చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఒక నవలాకారునిగా ఆయన వ్యక్తిగత అనుభవాల సమాహారంగా రాసిన ఈ వ్యాసాలు యువ రచయితలకు దిశానిర్దేశం చేసే గైడ్ లా కంటే ఆయన రచయితగా ఎదిగే క్రమంలో ఎదుర్కున్న ఆటుపోట్లనూ, అనుభవాలను గురించే ఎక్కువ చెబుతాయి.

ఏ రంగంలో నైనా ఒక పోతపోసినట్లుండే శైలికి భిన్నంగా ఏది కనిపించినా ముందు తిరస్కారంతో కూడిన విమర్శలు వెల్లువెత్తడం సహజమే. సాహిత్యం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నిజానికి ఈ పోకడలూ ఈనాటివి కాదు. చిత్రకళా రంగంలో విన్సెన్ట్ వాన్ గో, క్యూబిజం శైలికి ఆద్యుడైన పాబ్లో పికాసో వంటి దిగ్గజాల పెయింటింగ్స్ ని తొలిసారిగా చూసిన కళాప్రియులు కూడా అప్పట్లో విస్తుపోయి పెదవి విరిచారంటారు. అదే విధంగా ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, Natsume Sōseki వంటివారి రచనలు నేడు నీరాజనాలందుకుంటున్నప్పటికీ, వారు కూడా తమ సమకాలీనులనుండి నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కున్నారు. అలనాటి సాంస్కృతిక మేథోవర్గం తీవ్రంగా విమర్శించిన వారి రచనలు నేడు ప్రామాణికమైనవిగా నిలబడడంలో ఎంతమాత్రమూ ఆశ్చర్యం లేదు. మురాకమీ కూడా తన రచనలు కాలగతికి ఎదురీది నిలబడతాయో లేదో భవిష్యత్తులో తన పాఠకులే చెప్పాలంటారు.

మురాకమీ రచయితగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్ళలో సాహితీ వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. "దీన్ని నవల అనలేం" అని కొందరూ, "ఇది సాహిత్యం కాదని" మరికొందరూ ఆయన రచనల్ని తరచూ  విమర్శించేవారు. కథలూ, నవలికలూ రాయడంలో కూడా తనదైన ప్రత్యేకమైన ముద్రను వేసినప్పటికీ ఎక్కువ నిడివి ఉన్న పెద్ద నవలలు రాయడాన్ని తన ప్రత్యేకతగా చెప్పుకుంటూనే, ఏ రచయితకైనా తానొక కళాకారుణ్ణని చెప్పుకోకపోవడం మనసుమీద నుండి పెద్ద గుదిబండ దింపుకోవడంతో సమానమంటారు. నిజానికి తానొక "ఆర్టిస్టుని" అనుకోకపోవడం వల్ల రచయితలపై వత్తిడి ఉండదు. ముఖ్యంగా రచయితలు తాము రచయితలని భావించుకోకపోవడంలో ఒకవిధమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచం వాళ్ళనెలా చూస్తుందనే దానితో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా కావాలంటే అలా చేసే స్వాతంత్య్రం ఉంటుంది. ఇటువంటి స్వేచ్ఛ సృజనాత్మకతలో కీలక పాత్ర పోషిస్తుంది. "వ్యవస్థ తన మార్గంలో తాను వెళ్తుంది, నేను నా మార్గంలో నా పని చేసుకుంటాను." అని ఆత్మవిశ్వాసంతో అనగలిగే మురాకమీ, ఎవరికీ జవాబుదారీ లేని విధంగా తనకు వీలైన షెడ్యూల్స్ ని బట్టి నచ్చినట్లు రాసుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండడం ఒక రచయితకు మిక్కిలి అవసరమంటారు.

"నవలలు రాయడమంటే నిజానికి నీ గురించి నీవు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పుకోవడం లాంటిదే. అందువల్ల ఒక రచయితగా రాయడం గురించి మాట్లాడడమంటే, నీ గురించి నువ్వు మాట్లాడడమే." అంటూ మురాకమీ ఒకవేళ తానొక రచయిత గనక కాకపోయుంటే తన ఉనికిని గుర్తించే ప్రత్యేకతలు తనలో ఏమీ లేవని అంటారు. భాష మీద పట్టూ, సృజనాత్మకత మినహా నవలాకారులవ్వడానికి ఎవరికైనా ప్రత్యేకార్హతలేవీ అవసరం లేదు కానీ మురాకమీ పరిశీలనలో బాగా తెలివైనవాళ్ళు నవలాకారులు కాలేరు. కొంత విద్య, కాసిన్ని తెలివితేటలూ, విభిన్న విషయాలపై అంతో ఇంతో జ్ఞానం రచయిత కావడానికి అవసరమే అయినా "నువ్వు తెలివైన వాడిననుకుంటున్నావా ?" అని ఎవరైనా అడిగితే, అవునని ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడానికి కష్టపడతానంటారాయన. "మీరొక ఊరిలో నడుస్తూ వెళ్తుంటే, నాలాంటి సాధారణ వ్యక్తులు మీకు అడుగడుక్కీ తారసపడతారు. వీళ్ళు నలుగురిలో ప్రత్యేకంగా నిలబడే వ్యక్తులు కాదు, తెలవారుతుండగా కాకా హోటళ్ళలో పరమ అశుభ్రంగా ఉండే టేబుల్స్ దగ్గర టీ తాగుతూ కూర్చునే మామూలు మనుషులు. ఒకవేళ నేను నవలలు రాయకపోయి ఉంటే బహుశా నా ఉనికిని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు." అనడం ఆయనలో ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే తత్వానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

కొంతమంది నవలాకారులు పత్రికల వాళ్ళో, ప్రచురణ సంస్థలో రాయమని కోరితే రాస్తారు. ఇది చాలామంది ప్రొఫెషనల్ రైటర్స్ సహజంగా చేసేదే. కానీ మురాకమీ ఒక పూర్తి స్థాయి రచయితగా నిలదొక్కుకునే వరకూ ఆ విధంగా రాయలేదని అంటారు. బహుశా ఆయనలాంటి వాళ్ళు ఈ  కాలంలో అరుదు కావచ్చు. బాల్యంలో అన్ని రకాల పుస్తకాలూ చదివినప్పటికీ ప్రత్యేకం రష్యన్ అనువాదాలంటే ప్రీతిగా ఉండేదని చెప్పుకునే మురాకమీ, తనకు ఆధునిక జాపనీస్ సాహిత్యం (సీరియస్ వెరైటీ) పట్ల ఎటువంటి అవగాహనా లేదని చెప్పడం గమనార్హం. నిజానికి మురాకమీ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో జాపనీస్ సాహిత్యం అంటే కావబాతా, తనిజాకి, మిషిమా వంటి వారి పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఈ రచనలు కూడా నిర్ణీత మేథోవర్గానికి చెందినవి కావడంతో వాటిని చదివే పాఠకవర్గం కూడా మితంగానే ఉండేది. అటువంటి సమయంలో సాధారణ పాఠకులు సైతం తమను తాము సులభంగా గుర్తుపట్టుకోగల పాత్రల రూపకల్పన చేసిన మురాకమీ వినూత్నమైన శైలి జపాన్ సాహిత్యంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

సమకాలీన జాపనీస్ సాహిత్యం చదవనందువల్ల తాను నవలలు రాయడం మొదలుపెట్టే సమయానికి జపాన్లో ఎటువంటి పుస్తకాలు రాసేవారో, ఎటువంటి సాహిత్యాన్ని జనం ఎక్కువగా ఆదరించేవారో తనకు తెలీదంటారు మురాకమీ. బహుశా ఈ అవగాహనాలేమే పొంతనలూ, పోటీతత్వాలకు దూరంగా నవలాకారుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన శైలిని తయారుచేసుకోవడంలో మార్గం సుగమం చేసిందనిపిస్తుంది. అందుకే, "నా వరకూ నేను ఇలా మాత్రమే రాయగలను, అందుకే అదే చేస్తాను." అంటారాయన. ప్రశంసలూ, విమర్శలకతీతంగా, వాస్తవానికి ఏ రచయితకైనా అనుకరణలకు దూరంగా తనదైన ప్రత్యేకమైన శైలీ ఉండడం ఎంతో అవసరమని ఒడిదుడుకుల మురాకమీ సాహితీ ప్రయాణం నిరూపిస్తుంది. ఈ విషయాలన్నీ పంచుకుంటున్నా మురాకమీ "నవలలు అంటే ఇలాగే రాయాలి" అని ఎక్కడా చెప్పిన దాఖలాల్లేవు. నిజమే కదా ! మనమో వందమంది నవలాకారుల్ని తీసుకుంటే, వందమంది వంద రకాలుగా రాయడం గమనిస్తాం.

ఫిక్షన్ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో మురాకమీ శైలిపై విమర్శలు ఏ స్థాయిలో వెల్లువెత్తేవంటే, చివరకు ఒక ప్రఖ్యాత విమర్శకుడు ఆయన్ని "కాన్ మాన్" అని అవమానించారట. అయినప్పటికీ దాన్ని కూడా మెచ్చుకోలుగానే తీసుకుంటానంటారు మురాకమీ. ఒక నవలాకారుడిగా పాఠకులకు కట్టు కథలు చెప్పి మభ్యపెట్టడాన్ని మించిన బాధ్యత మరొకటుంటుందా అన్నది ఆయన వాదన. అదే సమయంలో ఎంత సానుకూల ధోరణి అవలంబించినా ఇటువంటి  విమర్శలు చేదు మాత్రల్లా నిరుత్సాహపరుస్తాయి. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే పోలిష్ రచయిత హెర్బర్ట్ అన్నట్లు, "నీ లక్ష్యాన్ని చేరాలంటే ప్రవాహానికి ఎదురీదాలి. కేవలం చెత్త మాత్రమే ప్రవాహంతో బాటు వెళ్తుంది" అన్న మాటలు నిరాశ అలుముకున్న సందర్భాల్లో తన మీద ఎంతో ప్రభావం చూపించాయని చెప్పే మురాకమీ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక  నవలలు రాయడానికి విదేశాల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సంప్రదాయతకు పెద్ద పీట వేసే అనేక ఆసియా దేశాల్లాగానే జపాన్ లో కూడా అధిక శాతం జనాభాకు ప్రవాహానికి ఎదురీదే వాళ్ళంటే ద్వేషం ఉంటుందంటారు. ఈ కారణంగా జపాన్ లాంటి దేశాల్లో సాంస్కృతికపరమైన భారాన్ని మోస్తూ ముందుకు అడుగు వెయ్యడం కళాకారులకు పెనుసవాలుగా ఉండేది.

ఫిక్షన్ విషయంలోనే కాక నాన్ ఫిక్షన్ రాయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మురాకమీకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తన రచనలకు భిన్నంగా "టోక్యో సబ్వే గ్యాస్ ఎటాక్" నేపథ్యంలో "అండర్ గ్రౌండ్" ని ప్రచురించినప్పుడు ప్రొఫెషనల్ నాన్ ఫిక్షన్ రచయితల తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారాయన : “a display of ignorance of the basic rules of nonfiction”; “a tearjerker of the first order”; “the work of a dilettante.” లాంటి విమర్శనాస్త్రాలెన్నో.  "నిజానికి నాకు నాన్ ఫిక్షన్ రాసే ఉద్దేశ్యం లేదు. ఏ జానర్ నియమాలకూ లోబడని రచన చేద్దామని ప్రయత్నించాను. కానీ ఈ క్రమంలో 'నాన్ ఫిక్షన్ పవిత్ర స్థలాన్ని' పరిరక్షించే పులుల తోకల మీద తెలీకుండానే కాలేసి వాళ్ళకి కోపం తెప్పించానని" చిరునవ్వు నవ్వుతారాయన. కారణాలేవైనా ఒక రంగంలో నిష్ణాతులు ఆ రంగంలో కొత్తగా వచ్చినవారి పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సహజమే. ఆ అథారిటీ ఎంత శక్తిమంతంగా ఉంటే కొత్తవారిపై వ్యతిరేకత కూడా అంతే తీవ్రంగా ఉంటుంది.

కొన్ని వ్యాసాల్లో మనుషుల్నీ, మనస్తత్వాల్నీ చదవడంలో మురాకమీకి సహజంగా అబ్బిన నైపుణ్యం ఆయనపై వచ్చే విమర్శలకు సహేతుకమైన కారణాలు విశ్లేషించడంలోనూ కనిపిస్తుంది. ఆయన రచనలపై సదభిప్రాయం లేని వారి గురించి రాస్తూ, "నిజానికి చాలామంది విమర్శకులు రచనల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు, ఒకవేళ ఏదైనా నవలో, కథో అర్థమైనా దాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించడం వారికి చేత కాదు. సాధారణంగా ఇటువంటి విమర్శకుడు నవలాకారుడి కంటే చాలా తెలివైన వాడు, అతి వేగంగా పనిచేసే అతడి మెదడు మెల్లగా నడిచే వాహనమైన నవల వేగానికి సర్దుకోలేదు. ఈ కారణంగా వారు ఆ నవల మొత్తం వచనాన్ని తమ వేగానికి తగ్గట్లు చిన్న సారాంశంగా కుదించి అనువదించుకుని, దాన్ని బట్టే విమర్శను చేస్తారు. ఈ క్రమంలో నవలకు ప్రాణంపోసే ప్రాముఖ్యత కలిగిన వివరాలనూ, చిన్న చిన్న సంగతులనూ వదిలేస్తారు." అని చెప్పడంలో విమర్శకులే కాదు, పాఠకులు కూడా ఒక నవలను ఓపిగ్గా ఎలా చదవాలో, ఎలా చదవకూడదో చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. అందులోనూ నవలా ప్రక్రియ మెల్లిగా అంతరించిపోతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఆధునిక తరానికి ఈ సలహా అనుభూతి చెందడంలో వేగాన్ని తగ్గించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

మురాకమీ ఒక సందర్భంలో నవల రాయడాన్ని ఒంటరి ప్రయాణంతో పోలిస్తే మరోచోట  నవలాకారుడిగా మారే విధానాన్ని రెజ్లింగ్ రింగ్ లోకి ప్రవేశించడంతో పోలుస్తారు. ఆయన ఉద్దేశ్యంలో : "నవలదేముంది !! ఎవరైనా రాయగలరు." ఇలా అనడంలో ఆయనకు నవల రాయడాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపించదు. ఆయన దృష్టిలో అదొక పొగడ్త. తీవ్రమైన కృషీ, సాధనా అవసరమైన అనేక కళారూపాల కంటే ఇది సులభమని ఆయన భావన. అర్హతలూ, సర్టిఫికెట్లతో సంబంధం లేని నవలాకారుల ప్రపంచం ధైర్యంగా బరిలోకి దిగి కుస్తీకి సిద్ధపడ్డ ఎవరినైనా స్వాగతించే ప్రొఫెషనల్ రెజ్లింగ్ రింగ్ లాంటిది. ఆ రెస్లింగ్ రింగ్ చుట్టూ ఉండే తాళ్ళ మధ్య అంతరం ఎవరైనా అందులో ప్రవేశించడానికి అనువైనంత వెడల్పుగా ఉంటుంది. ఆ రింగ్ లోపలి వైశాల్యం కూడా ఎక్కువే. ఇక ఎవరినైనా అందులో ప్రవేశించకుండా ఆపడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉండరు, లోపల రిఫరీ బయటకి పొమ్మని మీ మీద అరవడు. అప్పటికే రింగ్ లోపల ఉన్న రెజ్లర్స్, అంటే ప్రసిద్ధ నవలాకారులు, "రావోయ్, సరదాగా ఒక పట్టు పడదాం"  అని మిమ్మల్ని కూడా రింగ్ లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. The ring is—how shall I put this?—an airy, easy, accommodating, altogether laid-back environment." అంటారు మురాకమీ. కానీ కంటికి కనిపించిన ఏ విషయంపైనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసేవాళ్ళు నవలాకారులుగా రాణించే అవకాశం తక్కువన్నది మురాకమీ భావన. అటువంటి వాళ్ళు రచయితలుగా కంటే పాత్రికేయులుగా, విమర్శకులుగా బాగా పనికొస్తారంటారు.

మురాకమీ తన వ్యాసాల్లో అనేక అంశాలను చర్చించగా, ముఖ్యంగా సాహితీ పురస్కారాల గురించీ, రచయితల శారీరక, మానసిక ఆరోగ్యం గురించీ విశ్లేషించిన అంశాలు పాఠకుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆయన అవార్డుల గురించి రాసిన వ్యాసంలో, ఎన్ని బెస్ట్ సెల్లర్స్ రాసినప్పటికీ సాహితీ విలువలు లేవంటూ మేథోవర్గం చేసిన విమర్శల కారణంగా తన రచనల్ని సాహితీ పురస్కారాలు వరించకపోవటం పట్ల మురాకమీలో కాస్త నిరాశతో కూడిన కోపం ఉన్నట్లు కనిపిస్తుంది. మురాకమీ కోవలోనే పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న పలు రచనలు చేసిన అమెరికన్-బ్రిటిష్ రచయిత రేమండ్ చాండ్లెర్ సైతం ఒక సందర్భంలో తనకు నోబెల్ బహుమతి రావకపోవడం పట్ల స్పందిస్తూ అప్పటికే నోబెల్ ను అనేకమంది సెకండ్ రేట్ రచయితలకి ఇచ్చిన కారణంగా దానికి వెలువ లేదనీ, అయినా ఆ ప్రైజు తీసుకోడానికి హుందాగా డ్రెస్ చేసుకుని, ప్రసంగం తయారుచేసుకుని మరీ స్వీడన్ వరకూ వెళ్ళేంత విలువ నోబెల్ కి లేదనీ వ్యంగ్యాస్త్రాలు విసిరారంటారు.

సాహితీ రంగంలో తన వ్యక్తిగతానుభవాల్ని ఒక్కొక్కటిగా విప్పి చెబుతూ "ఆర్టిస్టు" ల చుట్టూ ఉండే అనేక భ్రమల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు మురాకమీ. రచయితల్ని అందర్నీ ఒకే గాటన కట్టెయ్యకపోయినా, చాలా మంది నవలాకారులు నిజాయితీ, స్నేహపూర్వక స్వభావం కలిగిన వాళ్ళు కాదనీ, అందరూ అనుకున్నట్లు మంచి స్ఫూర్తినిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే వాళ్ళూ అంతకంటే కాదనీ అంటారు. మురాకమీ మాటల్లోనే చూస్తే  రచయితలు సహజంగా విపరీత స్వభావాలతో, విచిత్రమైన జీవన విధానాలతో, భిన్నమైన ప్రవర్తనలతో ఉంటారన్నది నిజమే అయినప్పటికే, "నా లెక్క ప్రకారం నాతో కలిపి 92% మంది రచయితలు మిగతా రచయితలందరూ తప్పు, నా దారే సరైన దారనే అప్రకటితమైన ఊహతో ఉంటారని" ఈ విమర్శలో సైతం తనను మినహాయించుకోకపోవడమే ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది.

మురాకమీ నవలలు ఎలా రాయాలో చెప్పకపోయినా, రచయితలు దీర్ఘకాలం పాటు రచనావ్యాసంగంలో కొనసాగడానికి మాత్రం వారి శారీరక,మానసికారోగ్యాల పై దృష్టి పెట్టడం చాలా అవసరమని పదేపదే సూచిస్తారు. రచయితలు  గంటల తరబడి కదలకుండా రాయడంలో నిమగ్నమైనప్పుడు క్రమేపీ వయసు పెరిగే కొద్దీ వారి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలుపెడుతుంది. దీనికి తోడు ఆర్టిస్టులందరూ క్రమశిక్షణ లేని జీవితాలు మాత్రమే గడుపుతారని వారి జీవన విధానాన్ని రొమాంటిసైజ్ చేస్తూ కనిపించే అనేక సాక్ష్యాలూ, ఊహాగానాలను సవాలు చేస్తూ తన దైనందిన జీవన విధానం గురించి కొన్ని విషయాలను పంచుకుంటారు. ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ, క్రమం తప్పకుండా రోజూ జాగింగ్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, ఖచ్చితమైన వేళలకు నిద్రపోయే తన జీవన విధానాన్ని గురించి పాఠకులకు తెలిస్తే ఒక రైటర్ గా తనను రొమాంటిసైజ్ చెయ్యడం మానేస్తారేమో అని హాస్యమాడతారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత ఆంథోనీ ట్రోల్లోప్ విషయంలో ఇటువంటిదే జరిగింది. మరణానంతరం ట్రోల్లోప్ క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి అంతవరకూ తెలియని వివరాలు తెలుసుకున్న యావత్ పాఠకలోకం నివ్వెరపోయిందట. మొజార్ట్, షూబర్ట్, పుష్కిన్, రిమ్బాడ్ , వాన్ గో వంటి ప్రాడిజీల మార్గంలో తక్కువకాలంలో ఒక వెలుగు వెలిగి నిష్క్రమించే ఉద్దేశ్యం ఉంటే తప్ప నవలాకారుడిగా సుదీర్ఘకాలంపాటు కొనసాగే ఉద్దేశ్యం ఉంటే మాత్రం పైన చెప్పిన సూచనలు పాటించడం తప్పనిసరంటారు మురాకమీ. నిజానికి ఒకటో రెండో నవలలు రాయడం కష్టమేమీ కాదు. కానీ అలా రాస్తూనే ఉండడం, రాయడాన్ని జీవనోపాధిగా మార్చుకోవడమే తన అనుభవంలో అత్యంత కష్టంతో కూడుకున్నపని అంటారు మురాకమీ. నలభై ఏళ్ళుగా ప్రొఫెషనల్ రచయితగా అనేక రచనలు చేసిన మురాకమీ ఈ హెర్క్యూలియన్ టాస్క్ ని సమర్ధవంతంగా పూర్తి చేసి యువ రచయితలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' 20 ఫిబ్రవరి 2023. 

https://www.andhrajyothy.com/2023/editorial/extremely-professional-1014523.html?fbclid=IwAR0igKR6Pk60WCgAzQrKdY0vVd_PodxrxOM-kUI4fHalVzOITE6FWriUi_c

విత్ లాగిన్ : https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=20/02/2023&pgid=365447

Monday, January 30, 2023

One-way street - Walter Benjamin

సహజంగా ప్రోజ్ పీసెస్ లాంటివి రాసినప్పుడు కూడా రచయితలు వచనంలో ఒక ఏదో ఒక ఉమ్మడి అంశాన్ని ప్రధానంగా చేసుకుని రాయడం చూస్తుంటాం. రాసినవి చిన్న చిన్న పేరాగ్రాఫులైనా కూడా వాటిక్కూడా ఎంతోకొంత ఆకార స్వరూపాలుంటాయి. అవి ఒక ప్రాంతమో, భావోద్వేగమో, తత్వమో, హేతువో, శాస్త్రమో ఇలా ఏదైనా  కావచ్చు. కానీ మల్లెచెండులో పువ్వుల్ని తెంపేసి ఇష్టం వచ్చినట్లు వెదజల్లేసినట్లుండే వచనం రాయడంలో సిద్ధహస్తులు జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకులు వాల్టర్ బెంజమిన్. మునుపు కూడా ఆయన రచనలతో పరిచయం ఉంది కాబట్టి ఇదేదో అనువాద సమస్య మాత్రమే కావచ్చనిపించలేదు.

Image Courtesy Google

ఈ విషయంలో వాల్టర్ బెంజమిన్ అభిమాని సుసాన్ సోంటాగ్ వచనం కూడా పొందిగ్గా రాసిన ఉత్తరాన్ని చింపి పీలికలు చేసిపారేసి తిరిగి అతికించినట్లు ఉండటంలో వింతేమీ లేదు. కాల్పనిక ప్రపంచపు దారితెన్నులు అంత సుస్పష్టంగా తెల్సిన ఇలాంటివాళ్ళు సృజన విషయంలో మాత్రం ఎందుకు విఫలమవుతారా అనిపించేది. దానికి కారణం వారి తీక్షణమైన హేతువాద తాత్విక దృక్కోణమేననిపిస్తుంది. ఆ హేతువాదపు తీవ్రత "వన్ వే స్ట్రీట్" లాంటి రచనల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, వాక్యాలకు దిశానిర్దేశం చెయ్యడంలో, వాక్యనిర్మాణాన్ని క్రమబద్దీకరించడంలో బెంజమిన్ వైఫల్యం పలు వ్యాసాల్లో సుస్పష్టం. ఎటొచ్చీ ఈ పుస్తకంలో ఆ వైఫల్యం పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయనిపించింది. ఈ పుస్తకంలో వచనానికి బెకెట్ ఫిక్షన్ కూ "form" విషయంలో అనేక సారూప్యతలున్నాయి. ఇందులో వచనం కూడా నిరాకారమైనది (Formless). ఒక దారివెంట ప్రయాణించే వ్యక్తి ఆ దారిలో కంటికి కనిపించిన విషయాలకు తన వ్యక్తిగత దృక్కోణంతో బాటు హేతువాద, రాజకీయ, సామజిక, సాంస్కృతిక అధ్యయనాలను జోడించి విశ్లేషణలు చేసి రాస్తే ఇటువంటి ఒక పుస్తకం తయారవుతుంది. ఇందులో ప్రస్తావించిన అనేక రాజకీయ సాంస్కృతిక అంశాల్లో పాఠకులు ఐడెంటిఫై చేసుకోగల విశ్వజనీనత లోపించడం వల్ల ఈ రచనను పాఠకులు "own" చేసుకోవడం ఒకింత కష్టం.

కానీ ఈ పుస్తకం కూడా మునుపు చదివిన బెంజమిన్ పుస్తకాలూ, వ్యాసాలూ చదివినట్లే ఆసక్తికరంగా ఉంటుందని అపోహపడ్డ నాకు తీవ్ర నిరాశే ఎదురైంది. మునుపు చదివిన NYRB ప్రచురణ "ది స్టోరీ టెల్లర్ ఎస్సేస్" లో సాహితీ వ్యాసాలు సింహభాగం కావడం వల్ల అది ఎంతో నచ్చింది. ఈ రచనలో  కలగూరగంపలా విభిన్న అంశాలను కలిపి రాశారు. ఏదేమైనా, రాసేది చిన్న వ్యాసమైనా కూడా పాఠకుల చేత చదివించే గుణం ఉండాలి. అది ఇందులో పూర్తిగా శూన్యం. బెంజమిన్ తన ఆలోచనలకు అక్షర రూపమిచ్చే క్రమంలో అర్భక పాఠకులను ఏమాత్రం దృష్టిలో పెట్టుకున్నట్లు అనిపించదు. నిజానికి పాఠకులపై కొద్దిపాటి గౌరవం కూడా ఉన్నట్లనిపించదు. ఇక చదివేవాళ్ళ సంగతి అటుంచితే, కొన్ని కొన్ని చోట్ల "మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా సారూ ? " అని నిలబెట్టి అడిగి కడిగెయ్యాలనిపిస్తుంది. :) ఈ రచన ఆయన సాహితీ ప్రతిభకు (Literary Virtuoso) మచ్చు తునక అనేవాళ్ళ పట్ల కూడా కాస్త అపనమ్మకం కలుగుతుంది. "మీ 'లిటరరీ మెరిట్' తూనిక రాళ్ళేవో మాలాంటి అజ్ఞానులకి ఓసారి చూపించరూ ?" అని ప్రాథేయపడాలనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం బెకెట్ "వెయిటింగ్ ఫర్ గోడోట్" చదివి బుర్రగోక్కున్న చందంగానే ఉంది ఈ రచన కూడా. మళ్ళీ ఏమన్నా అంటే ఈ రచయితలందరూ, "రసపట్టులో తర్కం కూడదంటారు." పుస్తకం మొదట్నుంచీ చివరి వరకూ పొల్లుపోకుండా ఓపిగ్గా చదవడం పూర్తి చేశాక కూడా, ఇంతకూ ఏం చదివాను అనుకుంటే, చెల్లాచెదురుగా విసిరిపడేసిన భావాలను ఏరుకోవడంతోనే సరిపోయింది. వాటిని మాలగా గుదిగుచ్చడం కూడా వృథా ప్రయత్నమే. 

నిజానికి ఆయన ఈ పుస్తకం మధ్యలో పాఠకులకు చెప్పీ చెప్పనట్లు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. అదేమిటంటే,

"A witty Frenchman has said: “A German seldom understands himself. If he has once understood himself, he will not say so. If he says so, he will not make himself understood.”

పుస్తకం చదవడం పూర్తి చేశాక, ఆ ఫ్రెంచ్ మాన్ ఎవరో గానీ నిజంగా దేవుడు అనుకోకుండా ఉండలేం. :) 

నాకు అర్థంకాని ప్రతీదాన్నీ ద్వేషించే అలవాటు నాకు లేదు కాబట్టి, బెకెట్ శైలి కూడా కొంతకాలానికి అర్థమైనట్లే ఈ బెంజమిన్ రచనలో కూడా నా అవగాహనకు మించిన కొన్ని అంశాలను మరికొంతకాలం తరువాత మరోసారి చదవవలసిన అవసరం ఉందని అనుకుంటూ, హ్యాపీ రీడింగ్. :) 

పుస్తకం నుండి ఏరుకున్న బెంజమిన్ మార్కు తర్కంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు,

Construction Site :

It is folly to brood pedantically over the production of objects—visual aids, toys, or books—that are supposed to be suitable for children. Since the Enlightenment, this has been one of the mustiest speculations of the pedagogues. Their infatuation with psychology keeps them from perceiving that the world is full of the most unrivaled objects for children’s attention and use. And the most specific. For children are particularly fond of haunting any site where things are being visibly worked on. They are irresistibly drawn by the detritus generated by building, gardening, housework, tailoring, or carpentry. In waste products they recognize the face that the world of things turns directly and solely to them. In using these things, they do not so much imitate the works of adults as bring together, in the artifact produced in play, materials of widely differing kinds in a new, intuitive relationship. Children thus produce their own small world of things within the greater one. The norms of this small world must be kept in mind if one wishes to create things specially for children, rather than let one’s adult activity, through its requisites and instruments, find its own way to them.

Ministry of the Interior :

The more antagonistic a person is toward the traditional order, the more inexorably he will subject his private life to the norms that he wishes to elevate as legislators of a future society. It is as if these laws, nowhere yet realized, placed him under obligation to enact them in advance, at least in the confines of his own existence. In contrast, the man who knows himself to be in accord with the most ancient heritage of his class or nation will sometimes bring his private life into ostentatious contrast to the maxims that he unrelentingly asserts in public, secretly approving his own behavior, without the slightest qualms, as the most conclusive proof of the unshakable authority of the principles he puts on display. Thus are distinguished the types of the anarcho-socialist and the conservative politician.

Flag …How much more easily the leave-taker is loved! For the flame burns more purely for those vanishing in the distance, fueled by the fleeting scrap of material waving from the ship or railway window. Separation penetrates the disappearing person like a pigment and steeps him in gentle radiance.

Noble indifference to the spheres of wealth and poverty has quite forsaken manufactured things. Each thing stamps its owner, leaving him only the choice of appearing a starveling or a racketeer. For although even true luxury can be permeated by intellect and conviviality and so forgotten, the luxury goods swaggering before us now parade such brazen solidity that all the mind’s shafts break harmlessly on their surface.

Caution: Steps :

Work on good prose has three steps: a musical stage when it is composed, an architectonic one when it is built, and a textile one when it is woven.

అయినా పుస్తకాలను కేటలాగ్ లాగా రాయడమేంటి స్వామీ !!! సాహిత్యంలో మనం హిస్టారికల్ రికార్డు రాయడం లేదేమో కదా !!! ఆ పని "చరిత్రకారులకు" వదిలేద్దాం.

The typical work of modern scholarship is intended to be read like a catalogue. But when shall we actually write books like catalogues? If the deficient content were thus to determine the outward form, an excellent piece of writing would result, in which the value of opinions would be marked without their being thereby put on sale.

రచయితల టెక్నిక్ కు 13 ప్రతిపాదనలు : 

I.  Anyone intending to embark on a major work should be lenient with himself and, having completed a stint, deny himself nothing that will not prejudice the next.

II.  Talk about what you have written, by all means, but do not read from it while the work is in progress. Every gratification procured in this way will slacken your tempo. If this regime is followed, the growing desire to communicate will become in the end a motor for completion.

III.  In your working conditions, avoid everyday mediocrity. Semi-relaxation, to a background of insipid sounds, is degrading. On the other hand, accompaniment by an étude or a cacophony of voices can become as significant for work as the perceptible silence of the night. If the latter sharpens the inner ear, the former acts as touchstone for a diction ample enough to bury even the most wayward sounds.

IV.  Avoid haphazard writing materials. A pedantic adherence to certain papers, pens, inks is beneficial. No luxury, but an abundance of these utensils is indispensable.

V.  Let no thought pass incognito, and keep your notebook as strictly as the authorities keep their register of aliens.

VI.  Keep your pen aloof from inspiration, which it will then attract with magnetic power. The more circumspectly you delay writing down an idea, the more maturely developed it will be on surrendering itself. Speech conquers thought, but writing commands it.

VII.  Never stop writing because you have run out of ideas. Literary honor requires that one break off only at an appointed moment (a mealtime, a meeting) or at the end of the work.

VIII.  Fill the lacunae in your inspiration by tidily copying out what you have already written. Intuition will awaken in the process.

IX.  Nulla dies sine linea7—but there may well be weeks.

X.  Consider no work perfect over which you have not once sat from evening to broad daylight.

XI.  Do not write the conclusion of a work in your familiar study. You would not find the necessary courage there.

XII.  Stages of composition: idea—style—writing. The value of the fair copy is that in producing it you confine attention to calligraphy. The idea kills inspiration; style fetters the idea; writing pays off style.

XIII.  The work is the death mask of its conception.

విమర్శకుల టెక్నిక్ కు 13 ప్రతిపాదనలు :

THE CRITIC’S TECHNIQUE IN THIRTEEN THESES

I.  The critic is the strategist in the literary struggle.

II.  He who cannot take sides must keep silent.

III.  The critic has nothing in common with the interpreter of past cultural epochs.

IV.  Criticism must speak the language of artists. For the concepts of the cénacle are slogans. And only in slogans is the battle-cry heard.

V.  “Objectivity” must always be sacrificed to partisanship, if the cause fought for merits this.

VI.  Criticism is a moral question. If Goethe misjudged Hölderlin and Kleist, Beethoven and Jean Paul,8 his morality and not his artistic discernment was at fault.

VII.  For the critic, his colleagues are the higher authority. Not the public. Still less, posterity.

VIII.  Posterity forgets or acclaims. Only the critic judges in the presence of the author.

IX.  Polemics mean to destroy a book using a few of its sentences. The less it has been studied, the better. Only he who can destroy can criticize.

X.  Genuine polemics approach a book as lovingly as a cannibal spices a baby.

XI.  Artistic enthusiasm is alien to the critic. In his hand, the artwork is the shining sword in the battle of minds.

XII.  The art of the critic in a nutshell: to coin slogans without betraying ideas. The slogans of an inadequate criticism peddle ideas to fashion.

XIII.  The public must always be proved wrong, yet always feel represented by the critic.

[The tight-folded book, virginal still, awaiting the sacrifice that bloodied the red edges of earlier volumes; the insertion of a weapon, or paper-knife, to effect the taking of possession.]

—Stéphane Mallarmé

 పుస్తకాల గురించి ఇటువంటి పోలిక మునుపు ముందూ వినలేదు. :)

Books and harlots: both have their type of man, who lives off them as well as harasses them. In the case of books, critics.

Books and harlots: “Old hypocrites—young whores.” How many books that were once notorious now serve as instruction for youth!

ప్రేమ గురించి అవీ, ఇవీ :

Pocket diary.—Few things are more characteristic of the Nordic man than that, when in love, he must above all and at all costs be alone with himself—must first contemplate, enjoy his feeling in solitude—before going to the woman to declare it.

To be happy is to be able to become aware of oneself without fright.

Relief.—One is with the woman one loves, speaks with her. Then, weeks or months later, separated from her, one thinks again of what was talked of then. And now the motif seems banal, tawdry, shallow, and one realizes that it was she alone, bending low over it with love, who shaded and sheltered it before us, so that the thought was alive in all its folds and crevices like a relief. Alone, as now, we see it lie flat, bereft of comfort and shadow, in the light of our knowledge.

Nothing is poorer than a truth expressed as it was thought.

The killing of a criminal can be moral—but never its legitimation.

The only way of knowing a person is to love that person without hope.

Geranium.—Two people who are in love are attached above all else to their names.

Carthusian carnation.—To the lover, the loved one appears always as solitary.

Cactus bloom.—The truly loving person delights in finding the beloved, arguing, in the wrong.

కళారంగంలో "ప్రకటన" (అడ్వర్టైజ్మెమెంట్) ప్రాతిపదికన జరుగుతున్న  వ్యాపారంలో "విమర్శ" స్థానాన్ని వివరిస్తూ,

Fools lament the decay of criticism. For its day is long past. Criticism is a matter of correct distancing. It was at home in a world where perspectives and prospects counted and where it was still possible to adopt a standpoint.

Now things press too urgently on human society. The “unclouded,” “innocent” eye has become a lie, perhaps the whole naive mode of expression sheer incompetence. Today the most real, mercantile gaze into the heart of things is the advertisement. It tears down the stage upon which contemplation moved, and all but hits us between the eyes with things as a car, growing to gigantic proportions, careens at us out of a film screen.

And just as the film does not present furniture and façades in completed forms for critical inspection, their insistent, jerky nearness alone being sensational, the genuine advertisement hurls things at us with the tempo of a good film. Thereby “matter-of-factness” is finally dispatched, and in the face of the huge images spread across the walls of houses, where toothpaste and cosmetics lie handy for giants, sentimentality is restored to health and liberated in American style, just as people whom nothing moves or touches any longer are taught to cry again by films. For the man in the street, however, it is money that affects him in this way, brings him into perceived contact with things. And the paid reviewer, manipulating paintings in the dealer’s exhibition room, knows more important if not better things about them than the art lover viewing them in the gallery window.

What, in the end, makes advertisements so superior to criticism? Not what the moving red neon sign says—but the fiery pool reflecting it in the asphalt.

ఈ పుస్తకంలో ప్రచురణకర్తకూ, రచయితకూ మధ్య జరిగే ఈ సంభాషణ 'కళ' పట్ల బెంజమిన్ భావాలను వెల్లడి చేస్తాయి.

Publisher: My expectations have been most rudely disappointed. Your work makes no impression on the public; you do not have the slightest drawing power. And I have spared no expense. I have incurred advertising costs.—You know how highly I think of you, despite all this. But you cannot hold it against me if even I now have to listen to my commercial conscience. If there is anyone who does what he can for authors, I am he. But, after all, I also have a wife and children to look after. I do not mean, of course, that I hold you accountable for the losses of the past years. But a bitter feeling of disappointment will remain. I regret that I am at present absolutely unable to support you further.

Author: Sir, why did you become a publisher? We shall have the answer by return mail. But permit me to say one thing in advance. I figure in your records as number 27. You have published five of my books; in other words, you have put your money five times on number 27. I am sorry that number 27 did not prove a winner. Incidentally, you took only coupled bets. Only because I come next to your lucky number 28.—Now you know why you became a publisher. You might just as well have entered an honest profession, like your esteemed father. But never a thought for the morrow—such is youth. Continue to indulge your habits. But avoid posing as an honest businessman. Don’t feign innocence when you’ve gambled everything away; don’t talk about your eight-hour workday, or your nights, when you hardly get any rest. “Truth and fidelity before all else, my child.” And don’t start making scenes with your numbers! Otherwise you’ll be thrown out.