Thursday, January 28, 2021

Pity the Reader : On Writing with Style - Kurt Vonnegut and Suzanne McConnell

రైటర్స్ లో సెటైర్ రాసేవాళ్ళంటే నాకు ప్రత్యేకమైన అభిమానం..అందులోనూ సెటైరికల్ నేరేటివ్ తో పాఠకుల పెదవులపై చిరునవ్వులు పూయించగల సమర్ధులంటే మరికాస్త ఎక్కువ అభిమానం..ఈ  విషయంలో జార్జి ఆర్వెల్,మార్క్ ట్వైన్ తరువాత నాకు వెంటనే గుర్తొచ్చే పేరు అమెరికన్ రైటర్ కర్ట్ వన్నెగట్ ది..నాకైతే మంచి సెటైర్ రాయడంలో నేర్పు రచయిత ఇంటలిజెన్స్ కి కొలమానంగా అనిపిస్తుంది..స్పష్టమైన గణాంకాలతో కూడిన ఫాక్ట్స్ మరియు ఫిక్షన్ ని కలిపే ఆర్వెల్ సెటైర్ పాఠకుల కళ్ళను కప్పేసిన పొరల్ని సున్నితంగా తొలగిస్తే,ట్వైన్ సెటైర్ లో అథారిటేటివ్ టోన్ 'నేను చెప్పాను కాబట్టి ఇది నమ్మడం తప్ప మీకు మరో మార్గం లేదన్నట్లు' జులుం చేస్తుంది..ఈ ఇద్దరికీ భిన్నంగా ఆంథ్రోపాలజీ,బయో కెమిస్ట్రీలలో మేజర్ అయిన వన్నెగట్ మనతో పక్కా "ఇండియానాపోలిస్ లోకల్" భాషలో పిచ్చాపాటీ కాలక్షేపం కబుర్లు చెప్తున్నట్లు కథ మొదలుపెడతారు..ఆయన నేరేషన్ లో తీర్పులూ,డిక్లరేషన్లూ,జడ్జిమెంట్స్ లాంటివి మచ్చుకైనా ఉండవు..కానీ కథ పూర్తయ్యేసరికి పాఠకుల మదిలో మెదిలే ఒకే ఒక్క భావం, "జస్ట్ బ్రిలియంట్"!!!! పిచ్చాపాటీ కబుర్లలోకి దించి అంతర్లీనంగా ఎన్నో విలువైన విషయాలు చెప్పారనిపిస్తుంది..ఆనిమల్ ఫార్మ్ చదివినప్పుడు చివర్లో ఉత్సాహంతో ఎలా చప్పట్లు కొట్టానో, వన్నెగట్ ని తొలిసారిగా పరిచయం చేసుకోడానికి చదివిన కథ 2 B R 0 2 B చదివినప్పుడు కూడా అచ్చంగా అదే భావోద్వేగానికి లోనయ్యాను..ఇటువంటి కథలు చదివినప్పుడు కలిగే ఫీలింగ్ ఒక పజిల్ సాల్వ్ చేసినప్పుడు కలిగే సంతోషంలా ఉంటుంది..ఒక ఆల్జీబ్రానో ,ట్రిగొనోమెట్రీనో , మరో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోనో ఉండే రెండు మూడు పేజీల సమ్ ని సాల్వ్ చేసినప్పుడు కలిగే తృప్తిలా ఉంటుంది..అప్పుడు అనిపించింది,ఈ వన్నెగట్ అసాధ్యుడు బాబోయ్ అని :) 

Image Courtesy Google

ఈ పుస్తకం రచయిత్రి సుజానే మాక్ కొన్నెల్ అయోవా రైటర్స్ వర్క్ షాప్ లో కర్ట్ వన్నెగట్ దగ్గర 1965-67 మధ్యలో రైటింగ్ లో మెలకువలు నేర్చుకున్న విద్యార్థిని..సుజానే ఈ అమెరికన్ రైటర్ ని ఒక టీచర్ గా,రైటర్ గా,భర్తగా,తండ్రిగా,సెకండ్ వరల్డ్ వార్ వెటరన్ గా విభిన్న కోణాల్లో పరిచయం చేశారు..2019 లో ప్రచురించబడిన 'పిటీ ది రీడర్' వన్నెగట్ అభిమానులకు ఒక పంచభక్ష్య పరమాన్నాల తో కూడిన విందుతో సమానం..పుస్తకం కవర్ చూడగానే ఇందులో చర్చకు వచ్చిన అంశాలేమిటో సులభంగానే ఊహించొచ్చు..ఇందులో వన్నెగట్ వ్యక్తిగత జీవితంలో ప్రేమ,వృత్తి,వివాహం,బంధువులు,విద్యార్థులు,మెంటర్లకు సంబంధించిన అనేక విషయవిశేషాలతోపాటు 'On writing with style' అనే అంశం ప్రధానంగా వన్నెగట్ పలు రచనల్లో ఉపయోగించిన థీమ్స్,నేరేటివ్ స్టైల్స్, క్యారెక్టర్స్ ని విస్తృతంగా చర్చిస్తూ రచయితలు కావాలనుకునేవారికి అవసరమైన సూచనలుంటాయి..అడపాదడపా చదివిన వన్నెగట్ కొన్ని కథలతో పాటు నేను చదివినవి మరో మూడు పుస్తకాలే అయినప్పటికీ ఈ రచనలో Player Piano, The Sirens of Titan , Mother Night , Cat's Cradle ,God Bless You, Mr. Rosewater , Breakfast of Champions లాంటి మిగతా కొన్ని రచనల్ని పాత్రలు,కథలు,కథ వెనుక కథలు,సంభాషణల సహితంగా విస్తృతంగా చర్చించడం రచయితగా వన్నెగట్ పై మరింత అవగాహనను పెంచడంలో తోడ్పడింది..ఇందులో అంశాలన్నీ చిన్న చిన్న వ్యాసాల్లా,పిట్టకథల్లా,ప్రోస్ పీసెస్ తరహాలో ఉండడం వల్ల చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పటికీ, ఏకబిగిన చదవాల్సిన అవసరం లేకుండా,ఏ పేజీ వద్ద ఆపామో తిరిగి అక్కడనుండి మొదలుపెట్టవచ్చు.

ఇందులో నచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి..వీలైతే ఇది మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన పుస్తకం అంటాను..నాకైతే ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఇందులో చర్చకు వచ్చిన అనేక అంశాలను విడివిడిగా ఒక్కో పోస్ట్ లా వివరంగా రాయాలనిపించింది..ఈ వ్యాసం రాసేటప్పుడు ఏ ఒక్క అంశం కూడా మినహాయించడానికి మనసొప్పకపోయినప్పటికీ వ్యాసం నిడివిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను. [ చాంతాడంత వ్యాసం చదివే ఓపికే ఉంటే ఏకంగా పుస్తకమే చదువుకోవచ్చు కదా అని అనుకునే నాలాంటి బద్ధకిష్టులకోసం అన్నమాట :) ]

వన్నెగట్ రచనల్లో వైవిధ్యం ఏదైనా ఉందీ అంటే అది ఆయన విలక్షణమైన శైలి..ఆయన నేరేటివ్ స్టైల్ విషయంలో రచయితలకు చేసిన 7 సూచనలు : ఈ ఏడు సూత్రాలనూ పుస్తకంలో విడివిడిగా పలు వన్నెగట్ రచనల్ని ఉదహరిస్తూ చర్చించారు.

1. It is this genuine caring, and not your games with language, which will be the most compelling and seductive element in your style.

Follow suit: Write according to your purpose

2. The second suggestion Vonnegut makes in “How to Write with Style” is “Do not ramble.” I won’t, as he said he wouldn’t, “ramble on about that.” 

3. The third is “Keep it simple.” Some of the most profound lines in all of literature, he points out, are the simplest: “‘To be or not to be?’ asks Shakespeare’s Hamlet.”

4. How do you keep from rambling? How do you “keep it simple”? Take Vonnegut’s fourth piece of advice: “Have the guts to cut.”

5. Vonnegut’s fifth item of advice is “Sound like yourself.”

6. All… varieties of speech are beautiful, just as the varieties of butterflies are beautiful. No matter what your first language, you should treasure it all your life. If it happens to not be standard English, and if it shows itself when you write standard English, the result is usually delightful, like a very pretty girl with one eye that is green and one that is blue.

Kurt explains under his sixth piece of advice: “Say what you mean to say.”

7. Vonnegut’s seventh rule: “Pity the readers”: Our audience requires us to be sympathetic and patient teachers, ever willing to simplify and clarify. Those “marks on paper” are symbols. They are not the experience itself. They represent sound, and sounds in combination. They require deciphering. They are a system of notation for the silent music of reading.

నేను కొన్నేళ్ళ క్రితం వరకూ సంక్లిష్టమైన రచనలే ఉత్తమమైన సాహిత్యం అనే అపోహలో ఉండేదాన్ని,టెక్స్ట్ ఎంత గ్రాంథికంగా/కఠినంగా/మెటఫోరిక్ గా ఉంటే ఆ రచన అంత గొప్పదని భ్రమపడేదాన్ని..ఆ భావజాలం నుండి బయటపడడానికి చాలా సమయం పట్టింది..ప్రవాహంలా సాగే నెరేషన్తో పాఠకుల్ని కట్టిపడేసే వన్నెగట్ రచనల్ని కొంతమంది విమర్శకులు చాలా సింపుల్ రచనలని కొట్టిపారేశారట..అప్పుడు జాన్ ఇర్వింగ్ వాళ్ళకి జవాబిస్తూ, “if the work is tortured and a ghastly effort to read, it must be serious,” whereas “if the work is lucid and sharp and the narrative flows like water, we should suspect the work of being simplistic, and as light and as lacking in seriousness as fluff. This is simplistic criticism, of course; it is easy criticism too. “Why is ‘readable’ such a bad thing to be these days?” Some people “are gratified by the struggle to make sense of what they read… I am more often gratified by a writer who has accepted the enormous effort necessary to make writing clear.” అన్నారట..పాఠకుల్ని కాలంచెల్లిన పదాడంబరాలతో హింసించే కంటే పఠనానుభవాన్ని సరళం చేసే వన్నెగట్ లాంటి రచయితలు మెరుగని ఇర్వింగ్ ఉద్దేశ్యం..వన్నెగట్ కూడా తక్కువేం తినలేదు,ఆయన తన క్రిటిక్స్ ని "They wrote “rococo argle-bargle,” అని తన సిగ్నేచర్  స్టైల్ లో క్రిటిసైజ్ చేశారు.

భాష విషయంలో నాకు తరచూ ఉండే మరో కంప్లైంట్ గురించి వన్నెగట్ అభిప్రాయం కూడా అదే అని తెలిసి మహా ఆనందం కలిగింది..ఆయన Don’t you yourself like or dislike writers mainly for what they choose to show you or make you think about ? Did you ever admire an empty-headed writer for his or her mastery of the language ? అని అడిగి ,వెంటనే 'No' అని కూడా ఆయనే సమాధానం ఇచ్చేస్తారు..పాఠకులు రచయితల్ని ఇష్టపడేది ముఖ్యంగా వాళ్ళకున్న భాషా ప్రావీణ్యం చూసి కాదు..సాధారణ పాఠకులకు తెలియని ఎక్కడో క్రీస్తు పూర్వం భాషనో,వ్యావహారిక భాషకాని  దాన్నో(ఉదాహరణకు లాటిన్) పట్టుకుని లాగీ పీకీ,చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెపుతూ పది పేరాగ్రాఫులు రాసినా,పేలవమైన భావప్రకటనతో పాఠకుల సమయం వృథా చేసే రచయితల ఆలోచనల్లో ఉండే డొల్లతనం సుస్పష్టం అంటారు వన్నెగట్.

Kurt Vonnegut introduces his piece by saying that reporters and technical writers are trained not to reveal themselves, but all other writers “reveal a lot…to readers."

And fiction is melody, and journalism, new or old, is noise.

రచయిత అంటే ఎవరు అనే ప్రశ్నకు 'ప్లేయర్ పియానో' లో ఒక రచయిత భార్య పాత్ర ద్వారా వన్నెగట్ నిర్వచనం :

So a writer is someone who is willing to be uncomfortable enough—or is uncomfortable enough by nature—to wonder where people are, where they’re going, and why they’re going there. A writer is willing to take risks for that wondering. A writer cares that much about his or her subject.

చదివేవాడికి రాసేవాడు లోకువ అన్నట్లు రచయితల నుండి ఎప్పుడూ గొప్ప సాహిత్యమే ఆశించడం సరి కాదంటారు వన్నెగట్..రైటింగ్ విషయంలో కూడా పెర్ఫెక్షనిజం అన్ని సమయాల్లో సాధ్యం కాదు అంటారు..Writers can’t write great things all the time. You do the best you can, then you have to move on. Otherwise you’ll end up writing the same book your whole life.

టోల్కీన్ లాగే వన్నెగట్ లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండేది..'డిప్రెషన్' సమయంలో వన్నెగట్ తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం ఇబ్బందుల పాలవ్వడంతో పాటు GE లో పబ్లిక్ రిలేషన్స్ లో పనిచేసిన వన్నెగట్ అనుభవాల్ని కూడా ఈ విముఖతకు ఒక కారణంగా చెప్తారు..యంత్రాల వాడకం పెరిగి మనుషులకు ఉపాథి అవకాశాలు లేకుండాపోవడం వల్ల శ్రమజీవి అయిన మనిషి స్వాభిమానం దెబ్బతిందన్నది వన్నెగట్ వాదన..నిజానికి ఆయన రచన ప్లేయర్ పియానో ని GE మీద సెటైర్ లా రాశానంటారాయన.

In Player Piano, Vonnegut’s interest in cultures in flux lands on our own society. What did he care about that he thought others should care about? He was outraged at the tough trade-off when machines increasingly do our work: the incalculable cost/loss in terms of people’s sense of “being needed and useful, the foundation of self-respect.”

Listen to what he said to his former Iowa workshop student, John Casey, in an interview: Machinery is important. We must write about it. But I don’t care if you don’t; I’m not urging you, am I? To hell with machinery.

తన ట్రేడ్ మీద తనే జోకులు వేసుకోవడానికి చాలా గట్స్ కావాలి..రైటింగ్ ని గురించి వన్నెగట్ సెటైర్ చదివి నవ్వుకోకుండా ఉండలేం :

Novelists are not only unusually depressed, by and large, but have, on the average, about the same IQs as the cosmetics consultants at Bloomingdale’s department store. Our power is patience. We have discovered that writing allows even a stupid person to seem halfway intelligent, if only that person will write the same thought over and over again, improving it just a little bit each time. It is a lot like inflating a blimp with a bicycle pump. Anybody can do it. All it takes is time.

రైటింగ్ విషయంలో పాపులర్ ఒపీనియన్ కి భిన్నంగా,రచయితకు టాలెంట్,భాష మీద పట్టు,ఇమాజినేషన్ వీటన్నిటికంటే సహనం ప్రధానమని అంటారు వన్నెగట్. 

What if you love to write, you want to be a writer, but you don’t feel that something sufficiently monumental has happened to you? That is, sufficiently monumental about which it is worthwhile to write? Vonnegut has some things to say about that.

Patience :

A young woman to whom I was

teaching Creative Writing at CCNY

years ago, confessed to me,

half-ashamed, as though

this was keeping her

from being a truly creative writer,

that she had never seen

a dead person.

I put my hand on her shoulder,

and I said,

“One must be patient.”

వన్నెగట్ విషయంలో వ్యక్తిగతం,రాజకీయం అనేవి ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన అంశాలుగా కనిపిస్తాయి..రెండవ ప్రపంచ యుద్ధంలో తన అనుభవాల ఆధారంగా రాసిన ఆంటీ వార్ స్టోరీ స్లాటర్ హౌస్ 5 లో బిల్లీ పిల్గ్రిమ్ ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు..ఆ మాటకొస్తే ఎవరు మర్చిపోగలరు ! రచయితలను నిరంతరం తమ గతిని మార్చుకునే (evolutionary) 'సోషల్ ఆర్గానిజంలో స్పెషలైజ్డ్ సెల్స్' గా అభివర్ణిస్తారు వన్నెగట్..మనం నిరంతరం కొత్తదనం,మార్పు కోరుకుంటాం,కొత్త కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేస్తుంటాం..సరిగ్గా ఇక్కడే రచయిత కీలకమైన పాత్ర పోషిస్తాడు అంటారు, Writers are a means of introducing new ideas into the society, and also a means of responding symbolically to life. We’re expressions of the entire society. And when a society is in great danger, we’re likely to sound the alarms.

ఈ పుస్తకంలో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో వన్నెగట్ ఆంథ్రోపోలోజిస్ట్ ప్రొఫెసర్/మెంటర్ జేమ్స్ స్లోట్కిన్ ఆలోచనలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి..ఏ నూతన దృక్పథాన్నైనా గొంగళిపురుగును చూసినట్లు చూస్తూ,కొత్త ఆలోచనలను స్వాగతించలేని ఏ సమాజానికైనా ఒక 'మైండ్ ఓపెనింగ్ టీమ్' ఉండాలని వన్నెగట్ మెంటర్ Slotkin అభిప్రాయపడతారు : ఆయన థియరీని 'బ్లూ బర్డ్' అనే నవలలో స్లాజింగర్ అనే పాత్ర మాటల్లో చెప్పిస్తారు వన్నెగట్.   

The team must consist of three sorts of specialists, he says. Otherwise, the revolution, whether in politics or the arts or the sciences or whatever, is sure to fail. The rarest of these specialists, he says, is an authentic genius—a person capable of having seemingly good ideas not in general circulation. “A genius working alone,” he says, “is invariably ignored as a lunatic.” The second sort of specialist is a lot easier to find: a highly intelligent citizen in good standing in his or her community, who understands and admires the fresh ideas of the genius, and who testifies that the genius is far from mad. “A person like that working alone,” says Slazinger, “can only yearn out loud for changes, but fail to say what their shapes should be.” The third sort of specialist is a person who can explain anything, no matter how complicated, to the satisfaction of most people, no matter how stupid or pigheaded they may be..Who has the third talent? A good writer. A good writer certainly can explain anything to anybody.

పైన Slotkin ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆయన ఆంథ్రోపాలజీ పుస్తకాల కంటే కర్ట్ వన్నెగట్ తన ఫిక్షన్ కథల ద్వారా ఎక్కువ పాపులర్ చేశారని వన్నెగట్ ని చదివిన వారికెవరికైనా అర్థం అవుతుంది..వన్నెగట్ ఫిక్షన్ కోడ్ స్లోట్కిన్ ఆంథ్రోపాలజీ పేజీల్లో దాగి ఉందని ఈ రచన చదివినప్పుడు తెలిసింది.

That was the fictional writer Kilgore Trout’s answer, and Kilgore Trout was admittedly Kurt Vonnegut’s alter ego. The creator, it seems, doesn’t have eyes, ears, or a conscience. The creator, another one of Kurt’s characters says, is “the laziest man in town.” So it’s up to us, in Vonnegut’s view, to be that conscience. Especially us writers.

ఇన్ని పుస్తకాలు చదివి ఏం ఉపయోగం ? జీవితమంతా చదువుకుంటూ ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం లాంటి ప్రశ్నల్ని చాలా సార్లు విన్నాను..ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలో అర్థంకాక వాళ్ళ ఉచిత సలహాలను ఓపిగ్గా వింటూ ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేదాన్ని..కానీ వన్నెగట్ అందరూ  'రాయలేకపోవడానికి' గల కారణాలను గురించి చెప్పిన విషయాలను చదివినప్పుడు హమ్మయ్య మనల్ని అర్ధం చేసుకునేవారు ఉన్నారు అనిపించింది..నాకు ఎవరైనా "చదివేవాళ్ళు అందరూ రాస్తారు,రాసేవాళ్ళు అందరూ చదువుతారు" అనే డంబ్ థియరీ చెప్పినప్పుడు నవ్వొస్తుంది..ఆ థియరీ ఎలా ఉంటుందంటే "సినిమా చూసేవాళ్ళందరూ సినిమా తీస్తారు" , "క్రికెట్ చూసేవాళ్ళంతా క్రికెటర్స్ అవుతారు" అన్నంత పేలవంగా ఉంటుంది :) Pitfalls అనే చాప్టర్ లో రాయలేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ, “Good Taste will put you out of business,” [Vonnegut] declared.… “For some reason almost all good writers are drop-outs,” he said. “English departments have never produced a (good) writer.” He suggested that this is because people learn what is considered “good taste” at a stage “when they themselves aren’t capable of doing very good work. So what they learn makes them hate what they write. And they stop before they ever get started.” అంటారు వన్నెగట్.

రాయడం ఎవరికోసం అనే ప్రశ్న వచ్చినప్పుడు వన్నెగట్ క్రియేటివ్ రైటింగ్ 101 రూల్స్ లో షార్ట్ స్టోరీ రాయడానికి "Write to please just one person. If you open a window and make love to the world, so to speak, your story will get pneumonia." అని చమత్కరిస్తారు..వన్నెగట్ తన రచనల్ని చాలా కాలం సోదరి ఆలిస్ ని ఉద్దేశించి రాసేవారట.

వంట బాగా వచ్చిన వాళ్ళు అందరూ ప్రఖ్యాత ఛెఫ్ లు అయిపోనక్కరలేదు..టాలెంట్ ఉన్నంతమాత్రాన అందరూ రేట్ రేస్ లో నిలబడి కాంపిటీటివ్ గా ఉండాల్సిన అవసరం లేదని అంటూ ఈ విషయంలో తన సోదరి ఆలిస్ గురించి ప్యారిస్ రివ్యూ ఇంటర్వ్యూ లో వన్నెగట్ చెప్పిన విషయాలు ఎవరో ఒకరితో పోటీపడి పరిగెత్తడం తప్ప ఆగి ఆలోచించలేని నేటి తరాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి..ఒక రైటర్ గా తానేం సాధించారో వెనక్కి తిరిగి చూసుకుంటే తాను గెలిచే క్రమంలో కోల్పోయినవి కూడా ఎక్కువేనంటారు..ఫెమినిస్ట్ విస్డం గురించి వన్నెగట్ అభిప్రాయాలు నా ఆలోచనలకు దగ్గరగా అనిపించాయి :

In the Paris Review interview, Vonnegut reveals a revolutionary realization he had once in conversation with his sister Alice:

[Alice] could have been a remarkable sculptor.… I bawled her out one time for not doing more with the talents she had. She replied that having talent doesn’t carry with it the obligation that something has to be done with it. This was startling news to me. I thought people were supposed to grab their talents and run as far and fast as they could.

“What do you think now?” the interviewer inquired.

Well—what my sister said now seems a peculiarly feminine sort of wisdom. I have two daughters who are as talented as she was, and both of them are damned if they are going to lose their poise and senses of humor by snatching up their talents and desperately running as far and as fast as they can. They saw me run as far and as fast as I could—and it must have looked like quite a crazy performance to them. And this is the worst possible metaphor, for what they actually saw was a man sitting still for decades.

“At a typewriter,” the interviewer says.

“Yes, and smoking his fool head off.”

Although he felt compelled, he concludes here, in actuality, as Alice points out, he had a choice. You don’t have to make something of your talent. You don’t have to run with it. Any more than you must strive to be an Olympic swimmer if you’re a talented swimmer, or a zoologist if you love animals, and so on.

Vonnegut mentions this revelatory exchange with his sister several times. He toys with the idea of purposefulness throughout his fiction.

వన్నెగట్ సక్సెస్ గురించి 'హోకస్-పోకస్' అనే రచనలో ప్రొటొగోనిస్ట్ ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయలు చదివి నవ్వుకున్నాను.

This library is full of stories of supposed triumphs, which makes me very suspicious of it. It’s misleading for people to read about great successes, since even for middle-class and upper-class white people, in my experience, failure is the norm. It is unfair to youngsters particularly to leave them wholly unprepared for monster screw-ups and starring roles in Keystone Kop comedies and much, much worse.

ఈ రచనలో నచ్చిన మరొక అంశం : ఆర్టిస్టుల మానసిక వ్యాథులను గ్లోరిఫై చెయ్యడం గురించి వన్నెగట్ అభిప్రాయాలు..సాధారణ వ్యక్తుల కంటే సృజనాత్మకత కలిగిన ఆర్టిస్టులు వాళ్ళు చేసే పనిని ప్రేమిస్తారు కాబట్టి ఎక్కువ కష్టపడి పని చేస్తారు..కానీ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు అందరూ  మెంటల్ ఇల్నెస్,డిప్రెషన్ ల బారినపడడాన్ని సహజం అనడాన్ని వన్నెగట్ ఒప్పుకోలేనంటారు..వినడానికి పారడాక్స్ లా అనిపించినప్పటికీ ఆర్టిస్టులు మూడ్ స్వింగ్స్,Anxiety డిసార్డర్స్ ఉన్నప్పటికీ, తమ పనివల్ల ఎంతో ఆనందం,సంతృప్తి కూడా పొందుతారనేది నిర్వివాదాంశం..వన్నెగట్ క్రియేటివిటీ ని మానసిక రోగాలతో ముడిపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ , It behooves us to be well. Disease is dis-ease—neither fruitful nor romantic. As Vonnegut counseled in Mother Night : We are what we pretend to be, so we must be careful about what we pretend to be. అని హెచ్చరిస్తారు.

భార్యా భర్తల సంబంధాల్లో,ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో ఉండాల్సింది 'ప్రేమ' అని సినిమాల్లోనూ,సాహిత్యంలోనూ ప్రేమను గ్లోరిఫై చేస్తారు గానీ నిజానికి ఎటువంటి సంబంధంలోనైనా ఉండాల్సినది ఒకరిపట్ల ఒకరికి గౌరవం అంటారు వన్నెగట్..వన్నెగట్ డివోర్స్ గురించి చెప్పిన విషయాలు చదివినప్పుడు నాకు శరత్ 'దేవదాస్' గుర్తొచ్చాడు..దేవదాస్ కి పార్వతి పట్ల ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్నా గౌరవం లేదు..అతణ్ణి పెళ్ళిచేసుకోమని అడగడానికి సిగ్గు విడిచి వచ్చిన ఆమెను నిర్లక్ష్యం చేస్తాడు,ఎన్నో సందర్భాల్లో ఆమెను అవమానిస్తాడు..నమ్మకం,గౌరవం లేకుండా కేవలం ప్రేమ ప్రాతిపదికగా ఉండే ఏ సంబంధం నిలబడదని ఈ క్రింది పేరాలో వన్నెగట్ ఘంటాపథంగా చెప్తారు.

My wife [Jill] said to me the other day, after a knock-down-drag-out fight about interior decoration, “I don’t love you anymore.” And I said to her, “So what else is new?” She really didn’t love me then, which was perfectly normal. She will love me some other time—I think, I hope. It’s possible. If she had wanted to terminate the marriage, to carry it past the point of no return, she would have had to say, “I don’t respect you anymore.” Now—that would be terminal.

ఎవరూ సృష్టించకపోతే కొత్త పదాలు ఎలా పుడతాయి !! వన్నెగట్ 'కాట్స్ క్రెడిల్' లో 'Karass' అనే ఒక సమూహాన్ని సృష్టిస్తారు. [ Karass : "A team, one of many that humanity is organized into in order to do God's will (without ever discovering what they are doing) ] తాము ఆ సమూహంలో భాగంగా ఉన్నామనే స్పృహకూడా లేని Karass కు వ్యతిరేకమైన మరో సమూహం Granfalloon.. ఈ సమూహాన్ని సూచించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ,General Electric లాంటి వాటిని ఉదాహరిస్తారు..ఈ రెండు పదాల్నీ గూగుల్ చేస్తే చాలా ఆసక్తికరమైన వివరాలు కనిపించాయి.

They are acting out God’s mysterious, unfathomable will. Not their own. Here’s what the fictional guru and karass-creator Bokonon says about it: “If you find your life tangled up with somebody else’s life for no very logical reasons,” writes Bokonon, “that person may be a member of your karass.” … “Man created the checkerboard; God created the karass.”… A karass ignores national, institutional, occupational, familial, and class boundaries. It is as free-form as an amoeba.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు : 

A character says in Slapstick: We could have raised chickens. We could have had a little vegetable garden. And we could have amused ourselves with our ever-increasing wisdom, caring nothing for its possible usefulness.

Much has been written about the green-eyed monster. “Sulfuric acid” it is. It shrink-wraps your soul. It feels like shit. It’s ungenerous. It invites you to shirk responsibility for your choices, to look askance rather than keeping your eyes on your own prize. It assumes that you know the state of another’s soul and fate. It negates your own.

I agree with the great Socialist writer George Orwell, who felt that rich people were poor people with money.

What is it the slightly older people want from the slightly younger people? They want credit for having survived so long, and often imaginatively, under difficult conditions. Slightly younger people are intolerably stingy about giving them credit for that. What is it the slightly younger people want from the slightly older people? More than anything, I think, they want acknowledgement and without further ado that they are without question women and men now. Slightly older people are intolerably stingy about making any such acknowledgement.

The museums in children’s minds, I think, automatically empty themselves in times of utmost horror—to protect the children from eternal grief.

However, he discovered, as he said much later, in a piece in Harper’s, or a letter I wrote to Harper’s, about “the death of the novel”: People will continue to write novels, or maybe short stories, because they discover that they are treating their own neuroses.

Craziness makes for some beautiful accidents in art.

At the end of Breakfast, I give characters I’ve used over and over again their freedom. I tell them I won’t be needing them anymore. They can pursue their own destinies. I guess that means I’m free to pursue my destiny, too. I don’t have to take care of them anymore.

Here’s a third definition for “soul,” according to Webster’s: “emotional or intellectual energy or intensity, especially as revealed in a work of art or an artistic performance.” What makes a work of art great? Soul.

Writers get a nice break in one way, at least: They can treat their mental illnesses every day. If I’m lucky, the books have amounted to more than that. I’d like to be a useful citizen, a specialized cell in the body politic.

Every successful creative person creates with an audience of one in mind. That’s the secret of artistic unity.

Vonnegut calls the reader “my indispensable collaborator.” His rules for “Creative Writing 101” in Bagombo Snuff Box, adapted from his classroom admonishments, begin with courtesy toward them. Rule #1 : Use the time of a total stranger in such a way that he or she will not feel the time was wasted. In other words, “You’re in the entertainment business.” 

In fact, it’s an editor’s job to weed out the chaff from the wheat.

To put it academically: plot consists of exposition, complications or rising action, climax, and denouement.

All he needed was the thesis. So he wrote another: “Fluctuations Between Good and Ill Fortune in Simple Tales.” Its theme is the same as his first, but this time he argues that the shapes of all stories can be considered cultural artifacts. It opens with this assertion: The tales man tells are among the most intricate and charming and revealing of all his artifacts.

What makes it a cultural treasure is precisely what has been neglected by anthropologists: how the tale is told.

The writer William Harrison, my first creative writing teacher, offered an insight that stayed with me my entire fiction-writing life: “What a character wants and what a character is afraid of are often the same thing.”

రైటర్ థర్డ్ పార్టీ క్రిటిసిజాన్ని ఎంతవరకూ తీసుకోవాలో చెబుతూ,

If you adhere to every voice offering suggestions, pandering to one and then the other, you may find yourself so far off course that you’re out at sea. Especially beware of a hidden promise of fame or success (“If you change this so it’s more like the best seller so-and-so”). You may realize one day that you are no longer writing the book that you yourself wanted to write. You may no longer even be enjoying the process of writing. So be careful. You have to listen to the third parties. You also must listen, most closely, to yourself.

When things are going sweetly and peacefully, please pause a moment, and then say out loud, “If this isn’t nice, what is?”

వివాహం గురించి,ప్రేమ గురించీ,జీవిత భాగస్వామి గురించి వన్నెగట్ ఆలోచనలు :

One of my own theories about marriage is a roommate idea: a huge part of marriage entails working out the same kinds of things you’d work out with a roommate. Your spouse is your roommate. It’s useful to separate “roommate” problems from other issues. That’s what Kurt’s doing in his contract epistle to Jane.

“I have had some experiences with love, or think I have, anyway,” Vonnegut writes in his 1976 introduction to Slapstick, although the ones I have liked best could easily be described as “common decency.” I treated somebody well for a little while,or maybe even for a tremendously long time, and that person treated me well in turn. Love need not have had anything to do with it. Also: I cannot distinguish between the love I have for people and the love I have for dogs. Love is where you find it. I think it is foolish to go looking for it, and I think it can often be poisonous. I wish that people who are conventionally supposed to love each other would say to each other, when they fight, “Please—a little less love, and a little more common decency.

Parenting is life changing. It’s as demanding as anything can possibly be. Artists and writers are often notoriously poor parents. If you decide to parent, do so with your eyes wide open. Parenting, too, is an art.

Communities by definition are exclusive. Somebody or some class of person belongs, and somebody else doesn’t. Taken to extremes, Vonnegut says through his fictional narrator in Breakfast of Champions, that can be lethal. The Vietnam War couldn’t have gone on as long as it did, certainly, if it hadn’t been human nature to regard persons I didn’t know and didn’t care to know, even if they were in agony, as insignificant. A few human beings have struggled against this most natural of tendencies, and have expressed pity for unhappy strangers. But, as History shows, as History yells: “They have never been numerous!”

ఆంథ్రోపోలజిస్టులు క్లోజ్డ్ సర్కిల్స్ లో , చిన్న చిన్న తెగల్లో ,కొన్ని సమూహాలలో భాగంగా ఉండడం అభివృద్ధికి అవరోధంగా పరిగణిస్తారు ,

Vonnegut’s anthropology professors pointed out adverse aspects of the tight-knit societies they studied. First of all, a Folk Society was isolated, and in an area it considered organically its own. It grew from that soil and no other.… There was such general agreement as to what life was all about and how people should behave in every conceivable situation that very little was debatable.

Kurt told us once in class a definition of heaven and hell he’d heard somewhere that had charmed him: In hell everyone is chained to a dining table laden with food, each trying but unable to eat. In heaven, it’s exactly the same. Except in heaven, the people are feeding each other.

Saturday, January 23, 2021

Who is an intellectual ?

An intellectual is a person who engages in critical thinking, research, and reflection about the reality of society, who may also propose solutions for the normative problems of society, and thus gains authority as a public intellectual. - Wikipedia

జ్ఞానానికీ,వివేకానికీ భూమ్యాకాశాల అంతరం ఉంటుందని ఇన్నేళ్ళ చదువు నేర్పించింది..ఈ విషయంలో Knowledge is knowing that a tomato is a fruit; wisdom is not putting it in a fruit salad అని Miles Kington కొటేషన్ తరచూ వింటుంటాం..కెమిస్ట్రీ లాబ్ లో వాడే సాల్ట్స్ ని తెల్లగానే ఉంది కదాని కూరలో కలిపెయ్యలేం కదా ! వంటకు వాడే సాల్ట్ వేరు అనే స్పృహే 'వివేకం'..నేర్చుకున్న  జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవడం లో మనిషి విచక్షణ,విజ్ఞత,వివేకం లాంటివి తోడ్పడతాయి.

Image Courtesy Google

నిజానికి జ్ఞానం సంపాదించడం చిటికెలో పని..ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలంలో ఎక్కడ చూసినా ఫాక్ట్స్ ఫాక్ట్స్ ఫాక్ట్స్..మనం వద్దన్నా ప్రపంచం నలుమూలాలనుంచీ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో ఒకరకంగా మన చెవుల్లో పడుతూనే ఉంటుంది..ఆ ఇన్ఫర్మేషన్ ని అటుతిప్పి ఇటు తిప్పి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడో,లేదా సభల్లోనో,ఇక అన్నిటికంటే సులువైన మార్గం సోషల్ మీడియాలోనో రిపీట్ చేస్తూ మేథావుల్లా చెలామణి అయ్యేవాళ్ళకీ  చిన్నప్పుడు ఎక్కాలు బట్టీపట్టి క్లాసులో మిగతా పిల్లల ముందు నాకన్నీ తెలుసని గర్వంగా వల్లించే రెండో క్లాసు స్కూల్ పిల్లాడికీ పెద్ద తేడా లేదు..జ్ఞాపకశక్తి ఉండి మెదడు సరిగ్గా పనిచేసే ప్రతి ఒక్కరూ చెయ్యగలిగిన అతి మామూలు పని ఇది..ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనో,అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అనో,అమలాపురం ఆంధ్రాలో ఉందనో చెప్పడంలో మేథావితనం ఏమీ ఉండదు..అది ఒక సింపుల్ ఫాక్ట్..నీ బుర్రని ఎక్కువ స్ట్రైన్ చెయ్యకుండా చెప్పగలిగిన ఫాక్ట్..ఇప్పుడు అసలు విషయనికొద్దాం : మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితానికి అప్లై చెయ్యడం..ఇక్కడ జ్ఞానం సరిపోదు వివేకం కావాలి..ముఖ్యంగా సాహిత్యం చదివేటప్పుడు ఫ్యాక్స్ తెలుసుకోవడం కంటే ఇంప్లిమెంటేషన్ లో చాలా జగరూకత అవసరం..అన్నా కరేనిన చదివి అన్నా ను ఆదర్శంగా తీసుకోవాలో, కొంస్టాంటైన్ లెవిన్ ని ఆదర్శంగా తీసుకోవాలో తెలియాలంటే మనకు ఉండాల్సింది జ్ఞానం కాదు..వివేకం.

గత ఏడాది చదివిన ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్ ఆలివర్ సాక్స్ రచన 'The man who mistook his wife for a hat ' లో సాక్స్ అంటారు..ఇంటెలిజెంట్ / హెల్తీ మైండ్ ని సూచించే కీలకమైన అంశం 'జడ్జిమెంట్' మాత్రమే అని..అది కుప్పలుతెప్పలుగా వచ్చిపడిపోయే ఫాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాదు..నాలెడ్జి అంతకంటే కాదు..వివేకంతో కూడిన జడ్జిమెంట్.

చెన్నైలో స్టూడియోలు ఇంటికి దగ్గరగా ఉన్న కారణంగా సినిమా షూటింగ్స్ నీ,ఆర్టిస్టులనీ  చాలా దగ్గరనుండి ఆసక్తిగా చూసేదాన్ని..సినిమా ఎంత ఇష్టమో షూటింగ్స్,ఫంక్షన్స్ అంత వెగటు అనిపించేవి..లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ ఎంటర్టైన్ చేసే 'తెచ్చిపెట్టుకున్న సూపర్ఫీషియల్ ప్రపంచం' అది...నేను చదివిన కొందరు ఫిలాసఫర్లు గుర్తొస్తే వారి తార్కికవాదం (intellect ?!) కూడా ఒక సినిమా సెట్టింగ్ లాంటిదే అనిపిస్తుంది..ఆ ప్రపంచంలో పునాదులు లేని ఇళ్ళు కట్టచ్చు..సువాసనలేని పువ్వుల్ని అమర్చచ్చు..వేషభాషలు మార్చుకుని పరకాయ ప్రవేశం చెయ్యచ్చు..లేని గుణగణాలతో కూడిన వ్యక్తిత్వాలను అప్పు తెచ్చుకోవచ్చు..షూటింగ్ అయిపోగానే ఆ తొడుక్కున్న డిమీనర్ అంతా తీసేసి ప్రక్కన పడేసి ఆ షూటింగ్ మెస్ అంతా క్లియర్ చేసే పని పనివాళ్ళకొదిలేసి ఏ బాధ్యతా లేకుండా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు..మనం జీవించలేని,జీవించడం చేతకానీ, జీవించడానికి ఎంత మాత్రం  ఆస్కారంలేని ఎన్ని జీవితాలనో అక్కడ పాత్రల్లో ఇమిడిపోయి జీవించవచ్చు...పైసా ఖర్చు లేని సౌకర్యం లా ఉంది కదా..పైగా నటించేవాళ్ళకి సంపాదనతో పాటు 'అనుభవం' ఎక్స్ట్రా బోనస్..ఇప్పుడు ఇదే థియరీని ఇంటలెక్చువల్ ప్రపంచానికి అప్లై చేద్దాం.

ఇంటలెక్చువల్ ప్రపంచంలో కళ్ళేలు లేని గుర్రాల రీతిలో మనిషి ఆలోచనల్ని మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఎటువంటి దిశానిర్దేశం లేకుండా పరుగులు తీయించవచ్చు..ముఖ్యంగా ఇక్కడ వాదనలకు పునాదులు ఉండాల్సిన అవసరం లేదు..ఆలోచనలకు,అభిప్రాయాలకు,ఆచరణకు  బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు..న్యూరాన్ల ప్రవాహంతో నిరంతరం తన గతిని మార్చుకునే హ్యూమన్ కాన్షియస్ లో సెంటిమెంటాలిటీకి,ఫీలింగ్స్ కీ స్థానం లేదు..అయినా సెంటిమెంట్స్, ఫీలింగ్స్ అవేంటబ్బా !! ఆర్వెల్ టైమ్స్ లో obsolete లాన్గ్వేజ్ వాడడం నేరం..Grow up man !! మంచైనా చెడైనా మన సిద్ధాంతాలను సమర్ధించుకోడానికి ఎక్స్క్యూజెస్ మీద ఎక్స్క్యూజెస్ చేసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక్క సేఫ్ జోన్ ఈ ఇంటల్లెక్చువల్ ప్రపంచం..Those who lack the courage will always find a philosophy to justify it అంటారు కామూ..అందులోనూ 'నేను ఇంపెర్ఫెక్ట్' అని స్వాభావిక లోపాలను గ్లోరిఫై చేసుకోవడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది..లోపాలున్నాయని స్పృహ ఉన్నప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యాలన్న సంకల్పం కూడా ఉండాలి.. అంతేగానీ 'నేనింతే' అని మనకు అనుకూలమైన  ఫిలాసఫీని జస్టిఫై చేసుకుంటూ రవితేజ డైలాగ్స్ చెప్పడం ఇంటెలెక్చువల్ ఇంటెగ్రిటీ క్రిందకి రాదు..ఆ మధ్య రాసిన మరో వ్యాసంలో చెప్పినట్లు ఇంటలెక్చువల్ అనిపించుకోవాలంటే బహుశా సామజిక బాధ్యత కూడా కలిగి ఉండాలి అనుకుంటా..ఒకసారి ఒక స్కాలర్  మాటల మధ్యలో అన్నారు, నేను  ఇంటెలెక్చువల్స్ సాంగత్యం కంటే వారణాసి ఘాట్లో సాధారణ బార్బర్ కంపెనీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అని.

మరి ఈ ఇంటలెక్ట్ ఉపయోగం ఏమిటి ! కళలకు, కళాకారులకూ ,పుస్తకాలు రాసుకోడానికీ,పుస్తకాలు బాగా చదివి ఇంటలెక్చువల్ లెక్చర్లు దంచడానికీ ,ఇలా వ్యాసాలు రాయడానికీ  (ఇంకేమన్నా ఉన్నాయా ?!!!! ) బాగా పనికి వస్తుందనుకుంటా !! ఈ సందర్భంలో ఆ మధ్య చదివిన మార్సెల్ ఐమీ సైన్స్ ఫిక్షన్ కథ ఒకటి  గుర్తొస్తోంది.. సహజ వనరులు కొరత పెరిగిపోయి బొత్తిగా ప్రొడక్టివిటీ లేని మనుషుల్ని భూమ్మీద లేకుండా చేసేయ్యమని ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తుంది..మన ఇంటెలెక్చువల్ ప్రోటగోనిస్టు ఎదురింట్లో ఒక అరవై దాటి రిటైర్ అయిన ఆయన పేపర్ లో ఈ విషయం చదివి గగ్గోలు పెడుతుంటే,వీడికి రోగం కుదిరింది అని నవ్వుకున్న హీరో , మరుసటి రోజు జీవో  సవరణలో అటెన్షన్ సీకింగ్ కి తప్ప ఎందుకూ పనికిరాని ఇంటలెక్చువల్స్ ని కూడా ఆ లిస్టులో కలిపాము అని చదివి దిగ్భ్రాంతి చెందుతాడు.

Monday, January 11, 2021

An Education in Happiness : The Lessons of Hesse and Tagore - Flavia Arzeni

టాల్స్టాయ్ అన్నా కరెనిన లో “All happy families resemble one another, every unhappy family is unhappy in its own way.” అంటూ దుఃక్ఖానికి ప్రత్యేకతను ఆపాదిస్తారు, ఆండ్రే గిడే 'ది ఇమ్మోరలిస్ట్' లో  “What would there be in a story of happiness ?" అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు..పరిశీలిస్తే సాహిత్యంతో పాటు చిత్రలేఖనం,సంగీతం వంటి కళకు సంబంధించిన ఏ మాధ్యమాన్ని చూసినా వాటిలో దుఃక్ఖానికి ఇచ్చినంత  ప్రాధాన్యత సంతోషానికి ఇచ్చినట్లు కనబడదు..నెగెటివ్ భావోద్వేగాలకు మల్లే శాంతి,ఆనందం లాంటి పాజిటివ్ భావాలు గ్లోరిఫై చెయ్యబడలేదు..ఎందుకంటే పోజిటివిటీ కంటే నెగెటివిటీ మనిషి మెదడు మీద చూపించే ప్రభావం అధికం..సినిమాల్లో చూసి, సాహిత్యంలో చదివి కన్నీళ్ళు పెట్టుకోడానికీ బాగానే ఉంటుంది గానీ చివరకు అందరికీ కావాల్సింది ఆనందమే..మరి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే మార్గాలేమిటి అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.

ఒక్కోసారి ప్రశంసలూ,విమర్శలూ,అవార్డులూ,రివార్డులకతీతంగా కొన్ని మంచిముత్యాల్లాంటి పుస్తకాలు మన కంటబడుతుంటాయి..వెలుగులు విరజిమ్మడానికి తమ కాంతిని బయటనుండి గ్రహించే అవసరం ఎంతమాత్రం లేని స్వయంప్రకాశకాల్లాంటి రచనలన్నమాట..పుష్కిన్ ప్రెస్ వారు ప్రచురించిన An Education in Happiness : The Lessons of Hesse and Tagore ఆ కోవకి చెందిన పుస్తకం..నేను జర్మన్ రచయిత్రి ఫ్లావియా అర్జేని పేరు వినడం అయితే ఇదే ప్రథమం.

Image Courtesy Google

ఆనందానికి దారులు కూడా అనేకం..కొందరు గ్రీకు తత్వవేత్తలు ధర్మబద్ధత సంతోషకరమైన జీవితానికి పునాది అంటారు కానీ మన పురాణేతిహాసాలూ ,చరిత్రా చూస్తే ఈ విషయం అనుమానాస్పదమనిపిస్తుంది :) . అరిస్టాటిల్ శారీరక,మానసిక ప్రయోజనాలను సమన్వయం చేస్తూ జీవించడంలో ఆనందం ఉంటుందంటారు..ఇకపోతే విరాగులు (stoic) భోగలాలసత్వాన్ని త్యజించడం ద్వారా సంతోషం  సాధ్యపడుతుందంటారు..కొందరు జ్ఞాన సముపార్జన ద్వారా అంటే, మరికొందరు వివేకం ద్వారా అంటారు..దేవునికి దగ్గరగా ఆధ్యాత్మికచింతనలో జీవించడంలో ఆనందం ఉందని మరికొందరి ఉవాచ..ఇలా సంతోషాన్ని గురించి భిన్నమైన దృక్పథాలు వినిపిస్తూ ఉంటాయి..నిజానికి నేను ఈ పుస్తకం చదవడానికి కారణమైన టైటిల్ ని చూస్తే, సంతోషకరమైన జీవితం గడపడం అనేది నేర్చుకుంటే అబ్బే విద్యా ? అనే అనుమానం వస్తుంది..ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలు కథలూ,కబుర్ల రూపంలో తమ అనుభవసారాన్నిముందుతరాలకు పంచిపెట్టేవారు..కానీ న్యూక్లియర్ ఫ్యామిలీల నుండి కూడా విడిపోయి ఈరోజు వ్యక్తిప్రధానంగా మారిపోయిన వ్యవస్థలో ఇది మంచి,ఇది చెడు అని చెప్పేవాళ్ళ కొరత పెరిగింది,దురదృష్టవశాత్తూ చెప్పేవాళ్ళున్నా వినేవాళ్ళు లేరు..అందులోనూ ఈ తరానికి ప్రతీదీ సమస్యే..సర్దుబాటు తెలీదు,గెలవడం తప్ప ఓటమిని అంగీకరించడం రాదు,రిజెక్షన్ తీసుకోవడం చేతకాదు..'నేను','నాదీ' తప్ప ఎదుటి మనిషి భావాల పట్ల సున్నితత్వం లేదు..సమస్య వస్తే పిరికితనంతో పారిపోవడం తప్ప పరిష్కార మార్గాలు వెతకడం అంతకంటే తెలీదు..ఈ పుస్తకం నేటితరం ఎదుర్కునే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది.

నిజానికి సంతోషం విలువ విషాదాన్ని అనుభవించినవాడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు..అందుకేనేమో హ్యాపీనెస్ గురించి పాఠాలు చెప్పడానికి హెస్సే,ఠాగోర్ ల జీవితాలను పాఠాలుగా ఎన్నుకున్నారు రచయిత్రి..రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు నోబుల్ గ్రహీతలు హెర్మన్ హెస్సే ,రవీంద్రనాథ్ ఠాగోర్ ల జీవితాలను పరిశీలిస్తే హెస్సే చిన్నప్పటినుండీ డిప్రెషన్ తో పలు మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు,ఒక స్థాయిలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేశారు..అయినా అన్ని అవరోధాలనూ ఎదుర్కుని 85 ఏళ్ళ పరిపూర్ణమైన జీవితం గడిపారు..ఇక విశ్వకవి 'జోరాశంకో' లో ఆఖరి సంతానంగా సకల సౌకర్యాల మధ్య జీవించినప్పటికీ ఆత్మీయుల్ని ఒక్కొక్కర్నీ కోల్పోయిన నిరాశానిస్పృహలను అధిగమించి 'గీతాంజలి'ని సృష్టించారు..19 వ శతాబ్దం చివర్లో,20వ శతాబ్దం మొదట్లోనూ ఇద్దరు వ్యక్తులూ క్రైసిస్ తో కూడిన యుద్ధకాలాన్నీ,సాంఘిక,రాజకీయ అస్థిరతను కళ్ళారా చూసినవాళ్ళు...అందరిలాగే నాక్కూడా ఠాగోర్ రచనలు చాలా వరకూ సుపరిచితమే అయినప్పటికీ , సిద్ధార్థ, Steppenwolf , The Seasons of the Soul మినహా ఇతరత్రా హెస్సే రచనలు చదివింది లేదు.

రచయిత్రి జర్మన్ కావడంతో సహజంగానే ఈ పుస్తకంలో సింహభాగం హెస్సే కి కేటాయించారు..మొదటి సగం హెస్సే గురించి నాకు తెలియని అనేక ఆసక్తికరమైన వ్యక్తిగతాంశాలు ఆయన రచనల్ని దాటి ఒక సాధారణ వ్యక్తిగా హెస్సేని తెలుసుకోడానికి దోహదపడడమే కాకుండా ఆయన రచనల్లో తరచూ కనిపించే నిజాయితీతో కూడిన దృక్పథాన్ని మరింత చేరువ చేశాయి..ఆనాటినుండీ ఈనాటి వరకూ సత్యాన్వేషణ దిశగా అడుగులు వేసే యువతకు ఆదర్శంగా నిలిచి కల్ట్ క్లాసిక్ స్టేటస్ లో కొనసాగుతున్న హెస్సే 'సిద్ధార్థ' ,ఒక రచయితగా పాఠకులపై హెస్సే ప్రభావాన్ని చెప్పకనే చెబుతుంది..ఇక భారతీయులుగా ఠాగోర్ గురించి చిన్నప్పటినుంచీ తెలిసిన సంగతులే కాబట్టి రెండో సగం చదివిన పుస్తకమే మళ్ళీ చదువుతున్న భావన కలిగించింది.

They sought happiness in similar ways—not by dominating nature but by being in tune with it; not by desiring to possess what is large but by growing closer to what is small; not with great feats but with patient practice and constant work; not through the mechanical observance of a religion or a tradition but by trying to find the truth in different cultures.

ఠాగోర్,హెస్సే లకు ఇద్దరికీ స్కూల్ అంటే సరిపడదు..నాలుగు గోడల మధ్య నిర్బంధ విద్యావ్యవస్థకు వీరిద్దరూ వ్యతిరేకులే..అందుకే స్కూల్లో ఒక్క రోజు కూడా కుదురుగా పాఠాలు నేర్చుకోడానికి ఇష్టపడకుండా పారిపోయిన హెస్సే జీవితకాలమంతా పుస్తకపఠనాన్ని ఒక ధ్యానంలా కొనసాగించారు..Montagnola లో పెద్ద లైబ్రరీతో కూడిన ఆయన నివాసాన్ని చూడడానికి ఇప్పటికీ వెల్లువెత్తే జనాలకు కొదవలేదు..ఇక ఠాగోర్ శాంతినికేతన్,విశ్వ భారతి గురించి నేను ప్రత్యేకం చెప్పవలసిన అవసరం లేదు.

హెస్సే ప్రపంచంలో అస్పష్టమైన సింబాలిక్ ఇమేజెస్ తో పాటు, oneiric and esoteric ఎలిమెంట్స్ తో కూడిన ancient myths కనిపిస్తూ ఉంటాయి..ఆయన రచనలు చదివినవాళ్ళెవరికైనా అందులో పాత్రల అంతః సంఘర్షణ సుస్పష్టం..బాల్యంనుండీ వృద్ధాప్యం వరకూ పలు మానసిక సమస్యలతో సతమతమయినప్పటికీ హెస్సే చదవడం,రాయడంలో తన సంతోషాన్ని వెతుక్కున్నారు..ఆయన గురించి రాస్తూ ఒక సందర్భంలో తన రచనల ద్వారా ఆయన పొందిన ఆనందం కంటే పాఠకులకు పంచిన ఆనందం పాళ్ళు ఎక్కువంటారు రచయిత్రి.

తన సంతోషాన్ని నిర్వచించడానికి తన బాల్యంవైపు దృష్టిసారిస్తూ : “One morning I woke up, a lively child of about ten, with a totally strange but delightful feeling of joy and well-being, which like an inner sun went through me with its rays, as if at that moment, in that instant of awakening from a child’s sound sleep, something new and wonderful had happened … I knew nothing of yesterday or tomorrow,but was enveloped and softly lapped by a happy today.” అంటారు హెస్సే.

ఇక ఈ రచన చదువుతునప్పుడు దీనికి సంబంధంలేని మరెన్నో విషయాలు దృష్టికి వచ్చాయి..మనకి తెలియని,అర్ధంకాని ప్రతీదాన్ని వైరి భావంతో చూడడం పిరికివాడి లక్షణం..మన భాష మన యాస తప్ప పక్క రాష్ట్రం వాడితో సహా మనకు తెలియని ప్రతిదాన్నీ వెలివేసినట్లు చూసే నేటి తరం సాహతీవేత్తలూ ,పాఠకులూ నేర్చుకోడానికి ఇందులో అనేక అంశాలు ఉన్నాయి..ఇందులో ఇద్దరు మహామహుల రచనా వ్యాసంగం గురించి చదివినప్పుడు రచయితకు కేవలం భాష,వ్యాకరణం, క్రాఫ్ట్ మీద పట్టు ఉంటేనో, తన సంస్కృతి సంప్రదాయాలను గురించిన జ్ఞానం మాత్రం ఉంటేనో సరిపోతుందా అనిపించింది..జీవితాలను కథలుగా మలిచేవాళ్ళకి Yin and Yang గురించి ఖచ్చితంగా తెలిసుండాలి కదా !! నీ కథలో పాత్రకు పోలిక తేవాలంటే ప్రపంచంలో మరోమూల మరో మనిషి కథేదో నీకు తెలిసుండాలి కదా ! అన్నిటినీ మించి కథకు ముడిసరుకు కావాలంటే రచయితలకు వివిధ అంశాలపై ఉండవలసిన విస్తృతమైన అవగాహన ఆవశ్యకతను గుర్తు చేస్తుందీ రచన..ఉదాహరణకు, 

* హెస్సే నే మనకి ఎన్నోతరాల ముందు మనిషి అనుకుంటే ఆయన తాతగారు ఈస్టర్న్ వెస్టర్న్ ఫిలాసఫీ లను అధ్యయనం చేసినవారు కావడంతో హెస్సే పై వివిధ సంస్కృతులతో పాటుగా బుద్ధిజం,హిందూయిజం ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది..ఈయనతో పాటు నేను చదివిన (నాకు ఇప్పుడు ఇది రాస్తుంటే గుర్తుకువస్తున్న ) కొందరు ఉర్సులా లెగైన్,సిగిస్మన్డ్,వైల్డ్,గిన్స్బర్గ్ ,కాల్వినో,బోర్హెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో రచయితలు విదేశీ  పురాణేతిహాసాలనూ,సంస్కృతీసంప్రదాయాలనూ విస్తృతంగా అధ్యయనం చేశారు. 

* ఠాగోర్ ఇల్లు కూడా భిన్నసంస్కృతుల కళలకు నెలవుగా ఉండేది..దానికితోడు ఆయన దేశ,విదేశీ పర్యటనలు ఆయన ఆలోచనా విధానాన్ని విస్తృతం చేశాయి.

* మనకి వాళ్ళలా దేశదేశాలు పట్టుకుని తిరగడం ఎలా సాధ్యపడుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి చాలా సరళమైన సమాధానం, ఆయా దేశాల సాహిత్యం ఉన్నది అందుకే.

పుస్తకంనుండి మరి కొన్ని నచ్చిన అంశాలు : 

In the immediate aftermath of the Second World War, however, there were those who, in a Germany where it seemed impossible to separate literature from politics, distanced themselves from an author they considered an apostle of the inner life and the prophet of an outdated individualism. But his fame grew again to extraordinary heights in the 1960s and 1970s, first in America and then throughout the world, thanks to two books in particular; two books that can still be considered central to his output—Siddhartha and Steppenwolf.

సంతోషాన్ని సాహిత్యం ద్వారా నిర్వచించడం సులభం అంటూ క్యాథెరిన్ మాన్స్ఫీల్డ్ రాసిన Bliss and Other Stories లో ఒక అందమైన పాపులర్ పేరాగ్రాఫ్ ని ప్రస్తావిస్తారు..

“What can you do if you are thirty and, turning the corner of your own street, you are overcome suddenly by a feeling of bliss—absolute bliss!—as though you’d suddenly swallowed a bright piece of that late afternoon sun and it burned in your bosom, sending out a little shower of sparks into every particle, into every finger and toe? …”

The whole of Hesse’s life and work can be read in two ways—on the one hand as a reaction to an individual crisis, and on the other as a response to the social crisis of his time.

Hesse never belonged to any literary coterie or intellectual movement, and never hid his indifference to such labels: “What do I care if such and such a writer is a symbolist, a naturalist, a pupil of Maeterlinck or a friend of [Stefan] George?” he wrote when he was not yet thirty. “

The idea of escaping an outworn Western civilisation in search of the East and rediscovering oneself was fashionable at the time among European intellectuals, as evidenced by the great novels of Joseph Conrad published in those years, such as Lord Jim and The Nigger of the Narcissus.

“An enlightened man had but one duty—to seek the way to himself, to reach inner certainty, to grope his way forwards, no matter where it led.”

“I am against all attempts to change the world by force and so I do not support them, even if they are Socialist, even if they appear obviously just or desirable.”

As the years passed, Hesse broadened the horizons of his reading, embracing not only Western thought and literature, but also the philosophical and religious heritage of India and, above all, the masters of Chinese wisdom, from Lao-Tzu to Chuang-Tzu, and finally succeeded in formulating his idea of happiness which he expressed in this way: “By happiness today I mean something totally objective, in other words totality itself, being without time, the eternal music of the world, what others have called the harmony of the spheres or the smile of God.” Something, in other words, that “does not know time, history, before and after”.

“I also wanted to teach men to find in a fraternal love for nature a source of joy, a current of life; I wanted to ‘preach’ the art of seeing, of exploring, of enjoying.” What upsets him is that men’s thoughts are turning increasingly to current fashions and the mirage of novelty; that their minds are suffocated by scientific progress and their ears deafened by the noise of trains and cars. Throughout his life, through all his changing moods and tormented creative processes, nature, for Hesse, was a constant source of inspiration and a fundamental metaphor.

Hesse loved the metaphysical quality of air and water. When it came to the most physical of the elements, the earth, what he felt was gratitude, because the plants take their sustenance and stability from it. Of all plants, he most loved trees, and, of all trees, the isolated ones, in which he felt a connection to his own destiny and that of man, and which recur frequently in his writings. Solitary trees are warriors who fight their battles alone: “The world rustles in their branches, their roots sink into the infinite and yet are not lost in it, but pursue with all their strength a single aim—to realise the law that is innate in them; to bring their form to perfection; to represent themselves.”

To a confused young man who, like so many others, had written to him asking for help, he wrote back that one should “say yes to one’s self, one’s own isolation, one’s own feelings, one’s own destiny.”

Together with the wisdom he derived from the classics, Hesse’s position, his vision of the world, also included the Taoist wu wei, the desire not to hinder the course of things, to let things happen without interfering, to accept that what occurs happens without claiming to improve or teach anything. This is how he expresses it :

Every great intellectual is asked, sooner or later, which, in his judgement, are the ten or fifty or hundred greatest books ever written. Hesse answered this question in a short essay from 1929, entitled A Library of World Literature. His choice is highly personal and not at all objective, it makes no claim to exhaustiveness, neglects some great names, and almost completely ignores modern and contemporary writers. What Hesse looks for in books is not emotion but wisdom, he does not read to pass the time but to find the keys to time. His selection reflects a vision of what, according to him, the true aim of culture should be—to lead to a “broadening of our consciousness, an enrichment of our potential for life and joy.”

“Happy is he who knows how to love,” writes Hesse, and it is a theme to which he returned more or less consciously throughout his life—that love is the condition necessary for happiness; that loving is more important and necessary than being loved.

ఆనందమయమైన జీవితానికి ఠాగోర్ సూచించిన మార్గాలు : 

The idea he expounded in Sadhana was that the divine can be recognised in all living things. He also warned against a danger which, he felt, hung over the West—the danger of believing that the future depended on constant progress in technology and science and that this might indeed be the ultimate meaning of existence.

To conclude this look at Tagore’s reflections on nature here is a passage that restates his vision of an overall harmony where all things, large and small, have their place. “The grass has to put forth all its energy to draw sustenance from the uttermost tips of its rootlets simply to grow where it is as grass; it does not vainly strive to become a tree; and so the earth gains a lovely carpet of green. And, indeed, what little of beauty and peace is to be found in the societies of men is owing to the daily performance of small duties, not to big doings and fine talk.”

అర్జెంటీనా రచయిత్రి విక్టోరియా ఒకాంపోకు ఠాగోర్ తో గల సన్నిహిత సంబంధాన్ని గురించి రాసిన కొన్ని విషయాలు నేను మునుపెన్నడూ వినలేదు.ఆయన ఆమెకు రాసిన ఉత్తరంలో వారి బంధాన్ని గురించి ఇలా రాశారు : “Whenever there is the least sign of the nest becoming a jealous rival of the sky, my mind, like a migrant bird, tries to take its flight to a distant shore” … I tell you all this because I know you love me.”

We cannot love what we do not know, and we cannot be happy if we do not love—that is Tagore’s message—a message that goes beyond the individual and can be adopted by the whole of society, because love must also be the essential element in the conduct of nations and those who govern them.

However different in scale and content, their works share a single great basic message—happiness is neither a right nor a gift, but something that can be attained through a process of learning and achievement.

Gardening is an exercise in awareness. We have to get to know the plants and to understand their needs, to know how much time they will take to grow and how big they will be. We have to wait without becoming impatient and learn that nothing is permanent, that all things change, die and are reborn. Basically, gardening is an apprenticeship in love.

The joy of little things and humble work well done can help us to forget ourselves, to drive away an obsession with our own image and the constant affirmation of the ego. If it then takes the form of creative activity, of whatever kind, it helps even more directly to liberate what is inside us. We do not need to be artists to be creative, nor do we need the praise or admiration of other people.

Tuesday, January 5, 2021

The Cynical Idealist : A Spiritual Biography of John Lennon - Gary Tillery

He's a real nowhere man
Sitting in his nowhere land
Making all his nowhere plans for nobody..

Doesn't have a point of view
Knows not where he's going to
Isn't he a bit like you and me?

Nowhere man please listen
You don't know what you're missing ..
అంటూ బీటిల్స్ పాట స్పీకర్స్ లోనుండి వినిపిస్తోంది..

బ్రతుకుబాటలో ఒక్కో మనిషిదీ ఒక్కో మార్గం,ఒక్కో గమ్యం..ప్రతీ మనిషికీ ఎదురయ్యే ప్రశ్న వేరు, దానికి వారికి దొరికే సమాధానం కూడా వేరు..సత్యాన్వేషణకు దారులెన్నైనా ఆధ్యాత్మికతను అన్ని దారులకూ అనువైన సాధనంగా చెబుతుంటారు..కానీ భాషను కేవలం పైపై అర్థంలో తీసుకోవడం తప్ప దాని తాలూకూ నిగూడార్ధాన్ని గ్రహించలేని నేటి తరంలో ఆధ్యాత్మికతకు నిర్వచనాలు చాలా ఇరుకైపోయాయి..ఆధ్యాత్మికత ఏ ఒక్క మతానికో సంస్కృతికో సంబంధించిన విషయం కాదు,అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం..అమెరికన్ రచయిత గ్యారీ టిల్లెరీ రాసిన బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ జాన్ విన్స్టన్ లెనన్ స్పిరిట్యుయల్ బయోగ్రఫీ 'The Cynical Idealist ' లో ఆధ్యాత్మికతను కేవలం ఒక మతసంబంధమైన విషయంగా కాకుండా, కళను సాధనంగా చేసుకుని ఆత్మసాక్షాత్కారం (సత్యశోధన ) దిశగా ప్రయాణించడంగా చూస్తాము.
  
Image Courtesy Google

ప్రతి మనిషీ తనకు ప్రత్యేకం నిర్దేశింపబడిన లక్ష్యం దిశగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఏదో ఒక దశలో చివరి మెట్టుకు చేరుకుంటాడు..ఈ గమ్యం చేరడానికి చాలామందికి  ఒక జీవితకాలం పడితే, అతి కొద్ది మంది అదృష్టవంతులు (?) మాత్రం జీవితపు తొలిదశల్లోనే చివరి మెట్టు చేరుకుంటారు..సంగీతమంటే ప్రేమ,తద్వారా వచ్చిన బీటిల్స్ పాపులారిటీ లెనన్ కు పాతికేళ్ళ ప్రాయంలోనే ఒక జీవితకాలానికి సరిపడా అనుభవాలన్నీ సొంతం చేసింది..ఇక ఎక్కడానికి మెట్లు లేవని గ్రహింపుకొచ్చిన సమయంలో లెనన్ లో సహజంగానే ఒక ఖాళీ,స్తబ్దత చోటు చేసుకున్నాయి..సరిగ్గా ఇలాంటి సమయంలోనే జీవితేఛ్ఛ సన్నగిల్లి అస్తిత్వవాదం తెరపైకి వస్తుంది..జీవితం అంటే ఇంతేనా ? ఇంకేమీ లేదా ? నా ఉనికికి అర్థం ఏమిటి ? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి..ఇంకేదో లేదనుకోవడం,కావాలనుకోవడం మనిషి సహజ స్వభావం..ఒక సినీకవి అన్నట్లు 'మనిషి మారడు,ఆతని కాంక్ష తీరదు'..కానీ ఈ స్పిరిట్యుయల్ కాలింగ్ కొందరికి జీవితపు తొలి దశలోనే ఎదురైతే మరికొందరికి తుది దశకి చేరే వరకూ అనుభవంలోకి రాదు,ఇక పొట్టకూటికి కర్మసిద్ధాంతాన్ని అనుసరించి కులాసాగా బ్రతికే అధికశాతం సాధారణ ప్రజానీకానికి ఇటువంటి స్పిరిట్యుయల్ కాలింగ్ అనేదొకటుంటుందనేదే తెలియదు..ఒక్కోసారి ఈ స్పిరిట్యుయల్ క్వెస్ట్ అంతా ఒక కడుపు నిండిన వ్యవహారం ఏమో అనిపిస్తుంది.

బీటిల్స్ బిజీ షెడ్యూల్స్ తో,ప్రపంచ పర్యటనలతో పట్టిందల్లా బంగారంగా మారిన  దశలో సృజనాత్మకతను పెంపొందించుకోడానికి LSD వినియోగానికీ ,ఇతరత్రా డ్రగ్స్ కి  అలవాటుపడిన లెనన్ ఒక స్థాయిలో బ్రేకింగ్ పాయింట్ కు చేరుకున్నారు..జీవితపు అర్థరాహిత్యాన్ని భరించలేక  "But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret; and thy Father which seeth in secret shall reward thee openly." అన్న జీసస్ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుని, ఒక శీతాకాలపు రాత్రి వేళ వేబ్రిడ్జి లోని తన ఇంట్లో బాత్రూమ్ తలుపు గడియ వేసుకుని మోకాళ్ళపై కూర్చుని దేవుణ్ణి ఒక చిన్న చిహ్నాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డారు ,అయినా ఆయనకు ఏ విధమైన సమాధానం దొరకలేదు..కానీ లెనన్ జీవితంలో ఆ క్షణంలో మొదలైన సత్యాన్వేషణ మరో దశాబ్దంపాటు నిర్విరామంగా కొనసాగింది..అంతవరకూ జీవిత పరమార్ధాన్ని బాహ్య ప్రపంచంలో వెతికిన లెనన్ ఆలోచనలు మహర్షి మహేష్ యోగి పరిచయంతో అంతఃప్రపంచం దిశగా ప్రయాణించాయి..యోగితో మనస్పర్థల కారణంగా విడిపోయినప్పటికీ ఆయన ఆధ్వర్యంలో నేర్చుకున్న ధ్యానం చివరి వరకూ కొనసాగించారు లెనన్..భార్య సింథియానూ,కుమారుణ్ణీ వదిలేసి యోకో ఓనోని వివాహమాడిన తరువాత నుండీ లెనన్ జీవితం ఇంకా సంక్లిష్టంగా మారింది..ఈ దశలో ఓనో తో కలిసి దేశదేశాలూ తిరుగుతూ శాంతిమంత్రం జపిస్తూ అటు బ్రిటన్,ఇటు అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ 'సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ' దిశగా అడుగులు వేశారు లెనన్.

ఈ రచనలో బీటిల్స్ ప్రస్థానం గురించీ,జాన్ లెనన్ వ్యక్తిగత జీవితం గురించీ ఆసక్తికరమైన విషయవిశేషాలుంటాయి..జాన్ లెనన్ లో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ను వివిధ దశల్లో వివరిస్తూ రాసిన అధ్యాయాలను చివర్లో 'Suggested Listening' పేరిట ఆయన ఆయా సమయాల్లో కంపోజ్ చేసిన బీటిల్స్ పాటల్ని రిఫర్ చేస్తూ ముగించడం బావుంది..ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదవగలిగినప్పటికీ నేనలా చదవలేదు,నిజానికి బీటిల్స్ ఫాన్స్ ఎవరూ అలా చదవలేరు..పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అందులో ప్రస్తావించిన బీటిల్స్ పాటల్ని వింటూ ప్రతీ వాక్యాన్నీ లెనన్ ఆలోచనలతో రిలేట్ చేసుకుంటూ చదవడం వల్ల వివిధ దశల్లో లెనన్ లో మానసిక పరిపక్వతా,పరిణితీ స్పష్టంగా తెలుస్తాయి..“I think, therefore I am ” అనే Descartes సిద్ధాంతానికి భిన్నంగా లెనన్ వెర్షన్ ను “I don’t believe, therefore I am.” అనవచ్చు అంటారు రచయిత.

ఆధ్యాత్మిక మార్గంలో తొలి అడుగు (స్పిరిట్యువల్ అవేకెనింగ్ ) అందరికీ ఒక్కలా అనుభవమయ్యే విషయం కాదు..నలుగురూ నడిచే సౌకర్యవంతమైన దారుల్లో,గుంపులో ఒకడిగా 'గోయింగ్ విత్ ది ఫ్లో' తో నడిచి మూకుమ్మడిగా సాధించే లక్ష్యం అంతకంటే కాదు..ఆధ్యాత్మికత దిశగా ప్రయాణంలో ఎవరి 'కాలింగ్' వారిదే,ఎవరి మార్గం,మజిలీ,గమ్యం వారిదే..మనిషిలో తన జీవిత పరమార్ధం ఏమిటనే ప్రశ్న తలెత్తినప్పుడు, సమాధానం ఇదీ అంటూ ఏ మతగ్రంథాలూ ఉద్బోధించలేవు ,ఏ గురువులూ  స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేరు..ఇవన్నీ సత్యాన్వేషణ దిశగా ప్రయాణించే మనిషికి తాత్కాలికంగా సంశయనివృత్తి చేసే ఉత్ప్రేరకాలుగా ఉండవచ్చు..'జీవిత పరమార్ధం'(పర్పస్ ఆఫ్ లైఫ్ ) మనిషి మనిషికీ ప్రత్యేకమైనది..సమస్త భారత జాతినీ ఒకే తాటిపై నడిపించిన  స్వాతంత్య్ర సమరం మహాత్ముడి కాలింగ్ అయితే,పిన్న వయసులోనే అన్నీ పరిత్యజించి సన్యసించడం వివేకానందుడి కాలింగ్..అలాగే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి,సచిన్,కలాం ఇలా అందరూ తమవైన రంగాల్లో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినవారే..ఇదంతా చెప్పడంలో ఉద్దేశ్యం ఆధ్యాత్మికత ఒక మతానికో,వ్యవస్థకో,సంస్కృతికో సంబంధించిన విషయం కాదని చెప్పడమే..ఇది పూర్తిగా వ్యక్తిగతం,బహుశా వ్యక్తిగత కర్మఫలానుసారం జరిగే ప్రక్రియ కావచ్చును..మనిషికి తనదైన సత్యాన్వేషణలో తలెత్తే సంశయాలకు సమాధానాలు మనిషి బయట దొరికే అవకాశం లేదు..వాటిని వెతకాలంటే మనిషి తన అంతః ప్రపంచంలోకి దృష్టి సారించాలి.

Lennon thought that we ourselves have the power to reshape culture and world events if we will only recognize the fact and act individually and in concert. The  first key to achieving this power is self-transformation. When considering how to improve the world, people almost always focus their attention outside themselves, which too often leads to resistance, confrontation, frustration, and defeat. Actually, the only thing over which we have control is our own attitudes and behavior. If we first focus on changing ourselves, internalizing love instead of possessiveness and violence, we take a small but significant step toward positive change.

ప్రేమ, శాంతి : ఈ రెండూ ముఖ్యంగా జాన్ లెనన్ ప్రొమోట్ చేసిన అంశాలైనప్పటికీ , వాటిని సాధించే దిశగా ఆయన ప్రతిపాదించిన మార్గాలు వాస్తవదూరమనీ, ఆచరణయోగ్యం కావనీ, ఆయన 'సినికల్'  ధోరణి కామూ తరహా నిహిలిస్టిక్,పెస్సిమిస్టిక్ అప్రోచ్ అనీ అధికశాతంమంది విమర్శించారు..లెనన్ కలలుగన్న 'NUTOPIA' ను చూడడానికి ఆయన జీవించి లేకపోయినప్పటికీ తన జీవితకాలంలో మనసావాచాకర్మణా నమ్మి ఆచరించి,ప్రతిపాదించినవి ముఖ్యంగా మూడు సూత్రాలు :

1.We owe it to ourselves to question the “truths” our culture passes on to us and to be cynical about the motives of experts and those in authority.

అథారిటీ ని ప్రశ్నించడం లెనన్ కు చిన్నతనంలోనే అలవడింది..లివర్పూల్ లో ఇంగ్లీషు ఇంపీరియలిస్ట్ సొసైటీలో వర్కింగ్ క్లాస్ కుటుంబంలో పెరిగిన లెనన్ మొదట్నుంచీ సామజిక కట్టుబాట్లను ధిక్కరించారు.   

2.We owe it to ourselves to live our lives as though creating works of art, using the resources fate has dealt us.

సంఘంలో తన స్థానం ఏదైనా మనిషి నిర్భీతిగా తన జీవితాన్ని ఒక కళగా మలుచుకోగల సమర్థుడని తన జీవితం ద్వారా చాటిచెప్పారు లెనన్.

3. We owe it to ourselves and our posterity to aim at self-transformation, being aware of the “ripple” influence of our words and actions.

మనిషిని సమాజంలో భాగంగా కాకుండా ఒక ఇండివిడ్యువల్ (A free-thinking, self-directing individual ) గా చూస్తారు లెనన్..సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యక్తిగత అంశమే గానీ సామజికాంశం కాదనేది నిర్వివాదం..యుద్ధాలు,మతవిద్వేషాలు,ఆర్ధిక/సామాజిక అసమానతలూ లేని శాంతియుతమైన సమాజం కోసం వ్యక్తి తనలో మార్పు దిశగా కృషి చెయ్యాలనేది ఆయన సిద్ధాంతం.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు : 

He had eluded the “system” that molded young minds into useful parts of the socioeconomic machine, only to realize that rebellion against it had given him meaning while freedom from it left him directionless.

He confided to his close friend Pete Shotton: “The more I have, the more I see, and the more experience I get, the more confused I become as to who I am, and what the hell life is all about.”

లెనన్ క్రమశిక్షణారాహిత్యం కారణంగా రిపోర్ట్ కార్డు మీద స్కూల్ వారి రిపోర్ట్ : The headmaster of Quarry Bank wrote a dismissive note at the bottom of his final report card: “This boy is bound to fail.”

సోషల్ కండిషనింగ్ కి లొంగని లెనన్ బలమైన వ్యక్తిత్వానికి కారణమైన పుస్తక పఠనం గురించి : The problem was not with his initiative or intelligence. His Aunt Mimi owned a twenty-volume set of the world’s best short stories, and by the time Lennon was ten he had read and reread most of them, being particularly enthralled by Balzac. At twelve he ploughed through her encyclopedia. By sixteen he had read the complete works of Winston Churchill. He also enjoyed Edgar Allan Poe, James Thurber, Edward Lear, and Richmal Crompton, and his favorite books were Treasure Island, Alice in Wonderland, and Through the Looking Glass.

“The more I have, the more I see, and the more experience I get, the more confused I become as to who I am,and what the hell life is all about.” Seeking some direction, or at least a compass, Lennon began to study the works of Sigmund Freud, C. G. Jung, and Wilhelm Reich.

Lennon’s academic problem was with academia itself. He felt stifled by the regimentation. He resented the assumptions that were inherent in the educational system—that those in charge had a right to direct his life, to tell him where to go and when to be there, to judge his work and his behavior by their own standards, and to expect him to study and master information "they" considered important.

Curiously for a man envied by millions of fans around the world, he wrote a song called “I’m a Loser.” He characterized himself as wearing a mask (“I’m not what I appear to be”) and punctuated self-pitying lyrics with Dylanesque harmonica riffs.

క్రిస్టియానిటీపై లెనన్ విమర్శలు బ్రిటన్ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి :  “Christianity will go. It will vanish and shrink. I needn’t argue with that; I’m right and I will be proved right. We’re more popular than Jesus now; I don’t know which will go first—rock ’n’ roll or Christianity. Jesus was all right but his disciples were thick and ordinary. It’s them twisting it that ruins it for me.

Lennon came to hold the view that a personified God was a defense mechanism of the human brain confronted by the stresses of life. In his song “God,” he concisely expresses this point of view with an aphorism: “God is a concept by which we measure our pain."

The song, written when he was turning thirty, could be considered Lennon’s declaration of independence. After beginning with the aphorism, he offers a litany of subjects in which he declares he does not believe, among them Jesus, Buddha, the Bible, and the Bhagavad Gita. He also includes Kennedy, Elvis, and Zimmerman (Bob Dylan) in the list, and culminates with the Beatles. His objective is quite straightforward: to stand alone intellectually—rejecting all belief systems and all idols, even the idol he had helped to create and to which he owed his power and influence.

His message is blunt: stop accepting what you’ve been told; assert your independence and individuality; don’t be mentally shackled by rules that someone else devised.

Through engagement with the world you risked entanglement and defeat, and even if successful you achieved nothing that someone else couldn’t achieve. The one thing you could do that absolutely no one else could do was to change yourself—to “learn how to be you in time.”

History’s most famous Cynic and John Lennon have fascinating similarities. Diogenes had a strong predisposition to speak the truth, to “say it all,” no matter what the consequences. He was committed to moral freedom and contemptuous of traditional ideals. He insisted on mental independence and enjoyed defying social norms. In the words of Professor Luis E. Navia, he had “an unusual degree of intellectual lucidity, and, above all, a tremendous courage to live in accord with his convictions.”

He had nowhere to turn for help; the coterie of aides and hangers-on who surrounded him had a stake in his persona as Beatle John and facilitated his captivity. “The king is always killed by his courtiers, not by his enemies. The king is overfed, overdrugged, overindulged, anything to keep the king tied to his throne. Most people in that position never wake up. They either die mentally or physically or both. And what Yoko did for me, apart from liberating me to be a feminist, was to liberate me from that situation.”

Along with Mahatma Gandhi and Martin Luther King, Jr., John Lennon stands out prominently as one of the twentieth century’s three icons of peace. All three would die by gunfire.

ఇంగ్లీష్ వ్యవస్థలో వేళ్ళూనుకున్న పురుషాధిక్యతకు లెనన్ కూడా మినహాయింపు కాదు అనడానికి లెనన్ ఒక సందర్భంలో అన్నమాటల్ని గుర్తు చేస్తారు As a cocky young man he had summed up his view with a one-liner: “Women should be obscene and not heard.” 

యోకో ఓనో తన పురుషాధిక్య ధోరణిని మార్చి స్త్రీల పట్ల గౌరవాన్ని  కలిగించింది అంటూ ..Now, in his thirties, he was finally opening his eyes to the pain he had caused in his blindness. “I was a working-class macho guy that didn’t know any better. … I was used to being served, like Elvis and a lot of the stars were. And Yoko didn’t buy that. … From the day I met her, she demanded equal time, equal space, equal rights. I didn’t know what she was talking about. … Well, I found out. And I’m thankful to her for the education.”

నిద్రలేచిన ప్రతి క్షణం నుండీ లెనన్ తన బీటిల్స్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి ఏం కోల్పోయారో గ్రహించిన వెంటనే ఆ చట్రంనుండి బయటపడడానికి ప్రయత్నించారు : From his early twenties, Lennon had been living at a furious pace. He was a gifted person and he accomplished extraordinary things, but he finally came to understand that he had climbed onto a merry-go-round of illusion and that every day he focused on trying to be “John Lennon” he  sacrificed another part of himself. In time he realized he was caught up in a hopeless quest. He had only one choice—to let it all go.

లెనన్ ఇమేజ్ నుండి బయటపడిన క్రమం : The first key to his escape had been linking up with Yoko Ono, who related to him not as a legend but as a person. Another had been Primal Scream therapy, which pried the lid off his deepest insecurities and engendered raw honesty. The final key had been the lost weekend, which tantalized him with freedom, then coldly drove home the point that the price of remaining “John Lennon” would be Faustian.

“If I can’t deal with a child, I can’t deal with anything. No matter what artistic gains I get, or how many gold records, if I can’t make a success out of my relationship with the people I supposedly love, then everything else is bullshit".

“Life is what happens to you while you’re busy making other plans".

ఐదేళ్ల పాటు లైమ్ లైట్ కి దూరంగా 'హౌస్ వైఫ్' బాధ్యతలు స్వీకరించిన లెనన్ ఆలోచనలు :

His househusband experiences gave him a firsthand education about the daily life of housewives. "I’ll say to all housewives, I now understand what they’re screaming about. Because . . . what I’m describing is most women’s lives. . . . I was being just like a million, a hundred  million people who are mainly female, I just went from meal to meal. Is he well? Has he brushed his teeth? Has he eaten enough vegetables? Is he overeating? Am I limiting his diet too much? Did he get some goodies? What condition is the child in? How is she when she comes back from the office? Is she going to talk to me or is she just going to talk about business ? "

His last five years were spent as a mentally liberated, mature man. Not a man who had fully overcome his demons and his weaknesses, but a man who drew strength from his family relationships. Not a man who no longer had aspirations, but a man who knew the importance of pausing to savor the simple pleasures of life.

Why? Because with Lennon they knew they were going to hear a genuine iconoclast with the courage to speak from the heart. “I’ve never claimed divinity. I’ve never claimed purity of soul. I’ve never claimed to have the answer to life. I only put out songs and answer questions as honestly as I can, but only as honestly as I can—no more, no less.”

మీరు బీటిల్స్ ఫ్యాన్ అయితే ఇది తప్పకుండా చదవవలసిన రచన. హ్యాపీ రీడింగ్ :)