Thursday, July 22, 2021

The Meditations : An Emperor's Guide to Mastery - Marcus Aurelius and Sam Torode

బయట మారణహొమం జరుగుతోంది. రావణకాష్టంలా చితులు ఎడతెరిపి లేకుండా మండుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు పరిచయస్తుల మరణ వార్తలు వినని రోజు లేదు. నిస్సహాయతా,అస్థిమితం. చుట్టూ జరుగుతున్న ఘోరాల్ని చూసి కళ్ళలో నీరు ఉబికి రాలేదు కానీ ఒకవిధమైన స్తబ్దత నెలకొంది. ఏ పని చెయ్యాలని పూనుకున్నా మనసూ,శరీరం మాట విననంటున్నాయి. ఏమీ చెయ్యాలనిపించని నిరాసక్తత (ఇది నా విషయంలో చాలా అరుదు) . జీవితంలో మునుపెన్నడూ మోటివేషన్ ని ఇంతగా వెతుక్కున్నది లేదు. భారతంలో కోవిడ్ సెకండ్ వేవ్ కళ్ళు మూసుకున్నా విస్మరించగలిగే విపత్తు కాదు. నన్ను మించిన వాడులేడని అహంకారంతో అంతా 'నేనే' అని విర్రవీగిన మనిషికి జాతి,మత,కుల,వర్గ తారతమ్యాలు లేకుండా నువ్వేమిటో,ఈ సమస్త విశ్వంలో నీ ఉనికేమిటో మరోసారి కౄరంగా గుర్తుచేసింది ప్రకృతి. 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అంటూ మానవాళిని రక్షించు దేవా అంటూ కనిపించని దేవునికి మనసులోనే ప్రార్థిస్తూ,మెకానికల్ గా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మౌనంగా గడుపుతున్న రోజులు. వారం నుండీ రెండు పేజీలు కూడా కుదురుగా చదవడానికి ఏకాగ్రత కుదరలేదు. అటువంటి సమయంలో చాలా కాలంగా చదువుదామనుకుని వాయిదా వేస్తూ వచ్చిన మార్కస్ ఔరీలియస్ 'మెడిటేషన్స్' జ్ఞాపకం వచ్చింది. కానీ సుదీర్ఘమైన ఒరిజినల్ వెర్షన్ చదివే ఏకాగ్రతలేక సామ్ టోరోడ్ రాసిన ఈ అబ్రిడ్జ్డ్ వెర్షన్ ముందుగా చదివాను. ఎప్పటిలా నేను ఈ పుస్తకాన్ని 'చదవడంలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి' చదవలేదు. పేరుకి తగ్గట్టుగా నిజంగానే ఒక ధ్యానంలా చదివాను. ఇటువంటి చీకటిరోజుల్లో చదవడం వల్ల కావచ్చు,మనసుకి బాగా హత్తుకుంది,ఆస్తికులు గీతాపారాయణ లాంటివి క్రమం తప్పకుండా ఎందుకు చేస్తారో అనుభవపూర్వకంగా అర్ధమైంది. ఈ చీకటి కాలంలో తన జ్ఞానాన్నీ,వివేకాన్నీ అందించి మనసుకు సాంత్వన చేకూర్చిన ఔరీలియస్ కు కృతజ్ఞతాంజలులు.

Image Courtesy Google

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం :

మనుషులు వాస్తవిక జీవితంలోని సంక్లిష్టతలనుండి సేద తీరడానికి విహార యాత్రలకూ, ప్రాకృతిక ప్రదేశాలకూ వెళ్తుంటారు. కానీ ప్రశాంతతను బయట వెతుక్కోవడం కంటే నీలోకి నువ్వు ప్రయాణించి చూడు. నీ ఆలోచనలు సన్మార్గంలో ఒక క్రమపద్ధతిలో ఉన్నంతసేపూ నీ మనసుని మించిన శాంతిధామం మరొకటిలేదు. అక్కడ నీవు సర్వస్వతంత్రుడివి.

మనుషుల చెడు ప్రవర్తన నిన్ను కష్టపెడుతోందా ? అయితే ఇది గుర్తుపెట్టుకో : మనుషులు ఒక సమూహంగా బ్రతుకుతారు. వారిలో కొందరు తెలిసీ తెలియని అజ్ఞానం వల్ల చెడుగా ప్రవర్తిస్తారు. గతంలో ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఎందరో మరణించారు. నీతో సహా నిన్ను బాధపెడుతున్న వాళ్ళు కూడా ఏదో ఒకనాడు పిడికెడు బూడిదగా మారతారు.
నీలో కీర్తికాంక్ష రగులుతోందా ? వర్తమానానికి ఇరువైపులా కొలవవీలులేని అనంతమైన కాలాన్నీ, ప్రశంసల్లోని డొల్లతనాన్నీ, విధివిధానాల్లోని అస్థిరత్వాన్నీ పరిశీలించు, అన్నీ ఎంత త్వరగా జ్ఞాపకాల నుండి అదృశ్యమైపోతాయో కదా ! అటువంటి పక్షంలో ఈ కీర్తినేం చేసుకుంటావు ? నీ అంతఃప్రపంచంలోకి చూడు. ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాని,మలినాలంటని నీ ఆత్మతో ప్రపంచాన్ని నిష్పక్షపాతంగా చూడగలుగుతావు. నువ్వు చింతాగ్రస్తుడవై ఉండడానికి  నీ భావాలే  కారణం. నీ జీవితానుభవాన్ని ప్రపంచంపట్ల నీ దృక్పథం మాత్రమే నిర్ణయిస్తుంది.

ఆ పై వాక్యాలు చదివినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి. మనం తదనంతరం కూడా కీర్తింపబడడడంలో బహుశా తప్పేమీ లేదు. మన జీవిత లక్ష్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా వాటిపట్ల ఉండే ఆసక్తితో,ప్యాషన్ తో సాధించినప్పుడు వచ్చే కీర్తి తరాలపాటు నిలిచి ఉంటుంది.కానీ కేవలం ఫలాపేక్షతో ఎంచుకున్న జీవితాలక్ష్యాల వెన్నంటి వచ్చే కీర్తి ఎక్కువకాలం నిలబడదు.అది తాత్కాలికం.

మన గురించి ఇతరులేమాలోచిస్తున్నారు ? వాళ్ళేమంటున్నారు ? ఏం చేస్తున్నారు ? అనే ఆలోచనలే అనేక సమస్యలకు మూలకారణం. నీ దృష్టిని నీ ఆలోచనలూ ,వాక్కూ,కర్మల పై పెట్టి నీ జీవితమార్గంలో ముందుకు నడువు. ఇతరుల తప్పటడుగులను ప్రక్క చూపులు చూడకు. 

అందమైనవన్నీ స్వతఃసిద్ధంగా అందమైనవి. వాటికి ఆ అందం ఒకరు ఆరాధించడం వల్ల రాదు. పొగడ్తలూ,మెచ్చుకోళ్ళూ అందానికి కొత్తగా ఏ చేర్పులూ చెయ్యవు. అలాగే ఒకరు హీనంగా చూడడం వల్ల ఆ అందం తరగదు. నీచులు అందమైనవని తలపోసే విషయాలను చూడు. అందానికి ఎటువంటి ఆధారం అవసరం లేదు. అదేవిధంగా సత్యానికీ, న్యాయానికీ , మంచితనానికీ కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇవన్నీ పాపులారిటీ కాంటెస్ట్స్ మీద ఆధారపడతాయా ? లేదా అవమానాల వల్ల అపఖ్యాతిని మూటగట్టుకుంటాయా ? వజ్రం తనను కీర్తించలేదని తన మెరుపును కోల్పోతుందా ?

జీవనప్రవాహంలో చలనం లేకుండా స్థిరంగా ఉండేవేవీ ఉండవు. అన్నీ ఎంత త్వరగా వెలుగుచూస్తాయో,అంత త్వరగానూ ప్రసరించి అదృశ్యమైపోతాయి. ఈలోగా నేననే అహం, ఆత్మన్యూనత,చింత ఇవన్నీ ఎంత వ్యర్థమైనవి. అనంతమైన గతాన్నీ భవిష్యత్తునీ చూడు. నీ విజయాలెంత అల్పమైనవో,నీ కష్టాలెంత స్వల్పమైనవో గ్రహించు. ప్రగల్భాలు పలకడం, నిందించడం బదులు ఈ విశ్వంలో నీ అల్పమైన ఉనికిని గుర్తుంచుకుని నీకు దొరికిన జీవితాన్ని ఆనందించడం నేర్చుకో. 

ఎవరైనా నాకు అపకారం చేశారా ? అయితే అది వారి సమస్య. వారు తమ సొంత వ్యక్తిత్వానికి హాని తలపెట్టుకున్నారు, నీకు కాదు. వారి కర్మలను సృష్టికర్తకు వదిలేసి నీవు నీ ఆలోచనలపట్లా,కర్మల పట్లా మాత్రమే దృష్టి సారించు.

జీవితంలో విలువైనది ఏమిటి ? చప్పట్లు కొట్టించుకోవడం,పొగిడించుకోవడమా ? అది కేవలం రెండు చేతులు కలిసిన శబ్దం, నాలుకల కదలిక మాత్రమే. కీర్తి కాంక్షను నువ్వు త్యజించినప్పుడు మిగిలేదేమిటో తెలుసా ? నువ్వు నీ స్వభావరీత్యా జీవించడం నేర్చుకుంటావు. సమస్త కళల,వృత్తుల అంతిమ లక్ష్యం ఇదే.

నువ్వు మరణాంతరం కూడా తరతరాలు కీర్తింపబడాలని కోరుకోవడం ఎంత హాస్యాస్పదం ! నువ్వు ఎప్పుడూ చూసే అవకాశంలేని మనుషుల మాటల్ని ఆశించడం ఎందుకు ?

కీర్తికోసం వెంపర్లాడేవారిని చూడు, వారు ఇసుక రేణువుల్ని ప్రోగుచేసుకోడానికి పోటీపడుతున్నారు. రేపెప్పుడైనా గాలివీయగానే ఆ ఇసుక రేణువులు క్రమంగా దానితో పాటు కొట్టుకుపోతాయి. 

అమానవీయులు ఇతరుల పట్ల వ్యవహరించినట్లు నీవు వారి పట్ల వ్యవహరించకు, లేదా నీవు కూడా అమానవీయుడవవుతావు. 

ఋషులైనవారందరూ పేరుప్రఖ్యాతులార్జించి ప్రముఖులు కాలేకపోవచ్చు. నీకు బహుశా వక్తృత్వపు నైపుణ్యం,విద్యా పాండిత్యం ఉండకపోవచ్చు, కానీ అది  తాత్వికుడిగా మారడానికి నీకు అవరోధం కానివ్వకు. పాండిత్యాలూ,నైపుణ్యాలూ మేచ్చుకోలు,గౌరవం ఇస్తాయి గానీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వవు. ఒక మనిషి నిజమైన విలువ/ప్రామాణికత అంతర్గతమైనది. ఎవరి కంటికీ కనిపించనిది.

నీలో లోపాలను విస్మరించి ఎదుటివారి లోపాలను మాత్రం ఎంచి వారిని తిరస్కారభావంతో చూడడం ఎంత హేయం ! 

చేతులూ, కాళ్ళూ శరీరము నుండి విడివడి సజీవంగా ఉండడం ఎప్పుడైనా చూశావా ? సమాజం నుండి విడివడి బ్రతికే మనిషి కూడా మానవజాతినుండి అలా తనను తాను వేరు చేసుకుంటాడు.

ఈ కీరా చేదుగా ఉంది .పడేస్తే పోతుంది. నా దారిలో ముళ్ళున్నాయి. వాటి చుట్టూ మరో దారిలో వెళ్తే సరిపోతుంది. అంతేగానీ నాకే ఎందుకిలా జరుగుతోంది ? ఈ  ప్రపంచం ఎంతటి కౄరమయినది ? అందరూ నన్ను బాధపెట్టడానికే కంకణం కట్టుకున్నారు అని అజ్ఞానంతో కూడిన ఆలోచనలు చెయ్యకు. 

ఆరోగ్యకరమైన కళ్ళు అన్ని వర్ణాల్నీ చూడగలవు. ఆరోగ్యకరమైన చెవులు అన్ని ధ్వనులనీ వినగలవు. ఆరోగ్యకరమైన ముక్కు అన్ని వాసనలనూ గ్రహిస్తుంది. పచ్చదనాన్ని తప్ప ఏమీ చూడలేకపోవడం, వీణానాదాలు తప్ప ఏమీ వినలేకపోవడం, గులాబీల పరిమళాన్ని తప్ప దేన్నీ ఆఘ్రాణించలేకపోవడం ఒక ప్రమాదకరమైన జబ్బు.

నీవెంత మంచి జీవితాన్ని జీవించినా అందరినీ సంతోషపెట్టలేవు. కొంతమందికి నీ ఉనికి గిట్టకపోవచ్చు. చివరకి సోక్రటీస్ చనిపోయినప్పుడు కూడా "హమ్మయ్య,నేనిప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు,అతడు నన్ను ప్రత్యక్షంగా ఏమీ విమర్శించలేదు గానీ అతడి సమక్షంలో నేను పనికిరానివాడిగా ఆత్మన్యూనతను అనుభవించాను" అనుకున్న వారు ఉన్నారు. అందువల్ల అందరి మెప్పూ పొందాలన్న వ్యర్థ ప్రయత్నం మానుకో. నీ సిద్ధాంతాల ప్రకారం నువ్వు జీవించు. సమయం వచ్చినప్పుడు ఈలోకంనుండి శాంతితో,తృప్తితో నిష్క్రమించగలవు. 

మనుషుల వ్యక్తిత్వం వారి కళ్ళలోనూ,ముఖ కవళికల్లోనూ ప్రతిబింబిస్తుందంటారు. ఒక కౄరమైన వ్యక్తి తాత్కలికంగా కారుణ్యమూర్తిలా అందమైన చిరునవ్వుతో ప్రపంచాన్ని మోసం చెయ్యాలనుకున్నప్పటికీ, ఏదో ఒక సమయంలో ఆ ముసుగు జారిపోయి వారి వికృత రూపం బహిర్గతమవుతుంది.

నీ ఊహల్లో అనంతమైన సమస్యలనూ,దుర్ఘటనలనూ ఊహించుకుని చాలా చింతపడ్డావు. ఇక చాలు. 

ఈరోజు నేను నా సమస్యలనుండి విముక్తుణ్ణయ్యాను. లేదా వాటిని సమూలంగా చెరిపేశాను. నా సమస్యలన్నీ నా ఆలోచనల పర్యవసానంగా జనించినవే. అందుచేత ఇంతకాలం నాకు నేను చెప్పుకుంటున్న కథను మార్చుకున్నాను.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు యధాతథంగా , 

“It is noble to do good and be insulted for it.”   —Antisthenes.

Far better to have an honest opponent than a false friend. 

“Why be angry at the world?   As if the world cares!”   —Euripides.

Celebrities, fashions, plays, spectacles, gladiatorial fights . . . how often people remind me of flocks of sheep, herds of cattle, dogs fighting over bones, and puppets pulled by strings.    Even so, keep a sense of humor about these things, not an air of superiority.

Words spoken in centuries past, eloquent and inspiring in their time, now seem antiquated. The names of great leaders—Camillus, Caeso, Volesus, and the rest—have likewise lost their power.   All things pass away into the realm of memory, story, and finally into oblivion. (I’m speaking of those whose lives shine brightly. The majority of people aren’t celebrated in stories and legends—they’re forgotten as soon as they are buried.)  Even if it were possible for you to be remembered eternally, what is remembrance worth to you? Nothing.

Don’t be discouraged if you fail to live up to your principles all the time. When you stumble, get up and keep going.   Return to philosophy gladly, out of love for wisdom; not with your head hung low, like a servant returning in fear to a harsh master. Philosophy seeks your highest good and asks only that you live according to your nature.   Unnatural pleasures lure you from the path of reason. But what is more pleasurable than wisdom? Peace and happiness flow from the understanding and practice of philosophy.

Others may insult you, injure you—even kill you and cut you to pieces—yet they are powerless to harm your character. Nothing can defile your mind or force you to be unjust, outside of your own will.    A person can stand by a mountain stream and insult it all day long—the stream remains pure. Even if they throw dirt into it, the dirt is quickly dispersed and carried away.   Let your soul be like that stream—flowing freely, simplly, and contentedly.

When others try to hurt you, they hurt themselves. When they cheat or steal from you, they impoverish their own character.   Leave wicked deeds where they happen. Don’t pick them up and carry them forward in the form of resentments.

Rationality is the quality of seeing past appearances to discern the true nature of things. We call a person rational who is evenhanded and unprejudiced.   Equanimity means the calm acceptance of all that exists and all that happens.   Magnanimity means greatness of spirit, unmoved by the lure of pleasure, the lust for fame, and the fear of death.   If you strive to be rational, equanimous, and magnanimous— not merely to be publicly called by these adjectives—you will completely transform your life

Ponder the leaves—brought forth in spring, fallen and scattered in fall, replaced by new ones next season.   Hold everything lightly. Don’t cling to some things and run from others as if they—or you—were everlasting.

Saturday, July 17, 2021

The Good Story : Exchanges on Truth, Fiction and Psychotherapy - John Maxwell Coetzee and Arabella Kurtz

"We have art in order not to die of the truth." అంటారు ఫ్రెడ్రిక్ నీచ. సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే శక్తి అందరికీ ఉండదు. అందుకే, మనం భరించలేని గత జీవితపు అనుభవాల చేదు జ్ఞాపకాల్ని ధైర్యంగా ఎదుర్కోకుండా వాటిని వెనక్కి నెట్టేసి, వీలైతే సమాధి చేసి, మెల్లిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. కాని, జ్ఞాపకాలను సమూలంగా చెరిపెయ్యడం సాధ్యం కాదు. అవి కేవలం అణగదొక్కబడతాయి. మస్తిష్కపు చీకటి మూలల్లో ఎక్కడో ఒకచోట నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి పైకి తేలుతాయి. అలజడి కలిగిస్తాయి. అప్పుడు వాటిని ఎదురుకోవడం కోసం, నీచ చెప్పినట్లు, ఒక కళనో మరో భ్రమనో తెరచాటు చేసుకుంటాం. ఆ సహాయంతో ఆ జ్ఞాపకాలకు ఒక కొత్త రూపం ఇస్తాం. లేదూ వాటిని తట్టుకోవడానికి అనువైన ఒక సందర్బాన్ని నిర్మించుకుంటాం. అలా వాటితో ఎలానో ఒకలా రాజీపడతాం.

Image Courtesy Google

ఏదేమైనా, బాధపెట్టే జ్ఞాపకాల రూపును కల్పితకథనాలతో మార్చుకొనే స్వేచ్ఛ మనిషికి ఉందా? ఏది నిజం? ఏది కల్పితం? కాలంతో పాటూ మన జ్ఞాపకాలూ మారుతాయి. అప్పటి సంఘటనలు కొత్త సత్యాలతో, కొత్త అర్థాలతో కనిపిస్తాయి. మన ఆలోచనలు మారేకొద్దీ, అనుభవాలు పెరిగేకొద్దీ గతం పట్ల దృక్పథమూ మారిపోతుంటుంది. గతం ఎప్పుడూ అలా కొత్తగానే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు, ఒక రచయిత తన ఆత్మకథను రాసుకుంటున్నప్పుడు అతను కేవలం అనుభవాలని ఏకరువు పెడుతున్నాడా లేక వాటికి ఒక సందర్భాన్నిచ్చి ఒక కొత్త రూపాన్ని తొడుగుతున్నాడా? మన జీవితాలనుంచి మనం చెప్పుకునే కథలలో సత్యశోధన ఎంతవరకూ అవసరం? మన కల్పనలో ఎంతవరకూ మన జీవితం నిజం? తమ అనుభవాలకు కొత్త సందర్భాన్ని, దృక్పథాన్ని ఇచ్చుకుంటూ తమ గతాన్ని ఎంతోకొంతయినా కాల్పనికం చేసుకోవడం నైతికమేనా? అటువంటి స్వేచ్ఛ రచయితకు ఉందా? ఒక రచనలో రచయిత ప్రమేయం ఎంత? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా సైకోథెరపిస్టు అరాబెలా కర్ట్స్ (Arabella Kurtz), సౌత్ ఆఫ్రికా రచయిత, సాహిత్యంలో నోబెల్ గ్రహీత (2003) జె. ఎమ్. కూట్సీ (John Maxwell Coetzee) మధ్య జరిగిన సంభాషణలను ది గుడ్ స్టోరీ (The Good Story: Exchanges on Truth, Fiction and Psychotherapy) పేరిట పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.

‘మన గురించి మనం చెప్పుకునే కథల్లో నిజానిజాలు మనకు పూర్తిగా తెలియకపోయినా మనకంటూ మిగిలేవి అవే కాబట్టి ఆ కథలతో మనకున్న సంబంధాలంటే నాకు ఆసక్తి’ అని చెప్తూ, కూట్సీ మన కథల్ని మూడు విధాలుగా వర్గీకరిస్తారు. నా గురించి నేను నిజాయితీగా వాస్తవమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాకు అస్సలు సంబంధం లేని ఆదర్శవంతుడు, సర్వజ్ఞుడు, దైవజ్ఞుడూ అయిన మరో వ్యక్తి అది నిజం కాదని భావించవచ్చు. నా కథ అబద్ధమని కాకపోయినా కనీసం పూర్తి నిజం కాదని అనుకోవచ్చు. రెండోది సర్వసాధారణంగా జరిగే విషయం. నా గురించి నేను నిజమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాగురించి బాగా తెలిసిన నా జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలూ ఆ కథ నాకు అనుకూలంగా అల్లుకున్న కథ అని, భ్రమలతో కూడిన కథనీ కూడా అనుకోవచ్చు. ఇక మూడవది. అందరికీ ఎవరి కథ వారికున్నట్లే నాకు కూడా ఒక కథ ఉంటుంది. ఇది పైరెండు కథలకూ భిన్నమైనది, అసలు ఏమాత్రమూ నిజం కానిదీ అయినా సరే, అది ‘నా కథ’. నాకున్న ఒకే ఒక్క కథ. అందువల్ల నేను దానికి పూర్తి విధేయుడనై ఉంటాను. ‘నిజం’ నిరాకారమైనది. నీ నిజం వేరు, నా నిజం వేరూ కావచ్చు. సౌందర్యమయంగా కనిపించేదంతా సత్యమని, వికారంగా ఉండేదంతా అసత్యమనీ అనుకోవడం మానవ నైజం. నిజానికి ప్లేటో సిద్ధాంతం ఈ పునాదుల మీద నిలబెట్టినదే. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తప్పనిసరైనప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. (The heart of the poets’ case is that beauty is its own truth.) ప్లేటో తన వాదనలో ప్రధానంగా కవిని వేలెత్తి చూపించినా ఇది ప్రతి మనిషికీ వర్తించే విషయమే. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు, గతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తి, దుర్మార్గాలతో కూడిన గతంతో సహజీవనం చెయ్యడం వర్తమానంలో నరకప్రాయం కాబట్టి, తన ‘సత్యాన్ని’ అప్పటి కాలమానస్థితులకు తగ్గట్లు తనకు వీలుగా పునఃనిర్మించుకుంటాడు. గతంలో తన దుష్ప్రవర్తనకు సమర్థింపుగా కారణాలను వెతుక్కుంటాడు. అది వీలుకాని పక్షంలో ఆ వాస్తవాన్ని పూర్తిగా తన అస్తిత్వంలోనుండి చెరిపివేసుకుని తనకు మరో కొత్త వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్నీ ఆపాదించుకుంటాడు. ఈ కారణంగా కాలం గడిచే కొద్దీ, గతం నిర్దిష్టమైన సత్యానికి దూరం జరుగుతూ ఒక కాల్పనిక రూపాన్ని సంతరించుకోవడం అనివార్యమవుతుంది. ఈ కారణంగా ఎంతో కొంత కాల్పనికత లేని సత్యం అంటూ ఉండడం దాదాపు అసాధ్యం. ఈ విషయాన్ని నిరూపించడానికి నథానియల్ హాథోర్న్ (Nathaniel Hawthorne) రచన ది స్కార్లెట్ లెటర్‌ను (The Scarlet Letter) ఉదాహరణగా తీసుకుంటాడు కూట్సీ. 17వ శతాబ్దపు ఉత్తర అమెరికాలో పరిశుద్ధ క్రైస్తవ (Puritan) వ్యవస్థకు చెందిన నవలా నాయిక హెస్టర్ ప్రిన్, ఇంటికి దూరమైన భర్త తిరిగివచ్చేలోగా వివాహేతర సంబంధం కారణంగా సంతానాన్ని కంటుంది. ఈ విషయం తెలిసిన కులపెద్దలు అడల్టరీకి గుర్తుగా ఎర్రటి A అనే ఇనుప అక్షరాన్ని మెడలో ఒక గొలుసులా జీవితాంతం వేసుకొని ఉండాలని ఆమెకు శిక్ష విధిస్తారు. కానీ హెస్టర్ దాని చుట్టూ రిబ్బన్‌లతోనూ, లేసులతోనూ ఎంబ్రాయిడరీ చేసుకుని అలంకరించుకోవడం మొదలుపెడుతుంది. హెస్టర్ తన అవమానానికి గుర్తుగా ధరించే అక్షరంతో ఎంత మమేకమైపోతుందంటే చివర్లో ఆమెను ఆ శిక్షనుండి విముక్తురాలిని చేసినా దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. ఈ కథలో హెస్టర్ తన అవమానాన్ని ఇలా మరో రూపంలోకి ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఆమె ఒక ప్రక్క సామాజిక నియమాలకు తలొగ్గుతూనే, మరో ప్రక్క ప్యూరిటన్ వ్యవస్థలో నిషిద్ధమైన అలంకరణను ఆసరా చేసుకోవడం ద్వారా సాంఘిక కట్టుబాట్లను ధిక్కరిస్తుంది. ఈ విధంగా ది స్కార్లెట్ లెటర్ కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా సామాజిక స్థాయిలో కూడా మన తప్పులను, మనం సిగ్గుపడే వ్యక్తిత్వ లోపాలనూ అంగీకరించే ప్రయత్నం చెయ్యమని పరోక్షంగా చెబుతుంది. ఇలా చెయ్యడం వల్ల మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికిని సరికొత్తగా ఆవిష్కరించుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. గాన్ విత్ ది విండ్ నవలలో కూడా రెట్ బట్లర్ కూతురు పుట్టాక అలవాటైన తన పాత జీవితానికి స్వస్తి చెప్తాడు. ఎవరినీ లెక్కచెయ్యని స్వార్థపరుడు కాస్తా, సమాజంలో తన బిడ్డకు మంచి స్థానాన్ని ఇవ్వడం కోసం అందరితో మర్యాదగా మసులుకుంటూ గతాన్ని పునఃనిర్మించుకునే ప్రయత్నం చేస్తాడు. మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. గతాన్ని మనకు వీలుగా ఇలా మార్చుకోవడానికి సాహిత్యం అనంతమైన అవకాశాలిస్తుంది. సహజంగా ‘కథ’ అనగానే సత్యదూరమైనది, కాల్పనికమైనదీ అనే స్థిరాభిప్రాయం ఉంటుంది. కానీ ఫిక్షన్ అనేది పూర్తి నిజమూ కాదు, అబద్ధమూ కాదు. అది సమీకరణాల్లో చరాంశంలా సాపేక్షమైనది, అస్థిరమైనదీనూ. హెస్టర్ కథను పరిశీలిస్తే ఆమె ఫలానా నేరం చేసిందని తీర్పునిచ్చిన మెజిస్ట్రేట్‌కు ఆమె గురించి తెలిసిన కథ పూర్తి యథార్థం కాకపోవచ్చు. అలాగే బ్రూక్ ఫార్మ్ హెస్టర్ ఒక ‘అనుభవం కోసం’ చేశానని నమ్మే కథ కూడా పూర్తి నిజం కాకపోవచ్చు. ఈ రెండు కథల్లో తోచిన సత్యాన్ని తూకం వేసి నిర్ణయించుకునే అవకాశం పాఠకులకు ఉంటుంది. అది కూడా ఖచ్చితమైన సత్యం కానక్కర్లేదు. హెస్టర్ కథలో సత్యం చివరకు ప్రశ్నార్థకంగా మిగులుతుంది కాబట్టే ది స్కార్లెట్ లెటర్ ఒక మంచి కథ అని అంటాడు కూట్సీ. మానసికచికిత్సను కూట్సీ క్యాథలిక్ క్రిస్టియనుల కన్ఫెషన్ ప్రక్రియతో పోలుస్తాడు. బైబుల్‌లో You shall know the truth, and the truth shall set you free అనే వాక్యం ఉంటుంది. సైకాలజిస్టుల వద్దకు మానసిక వైద్యం నిమిత్తం వెళ్ళే రోగులను నయం చేసే క్రమంలో వారిలో అంతర్గత భయాలను పోగొట్టి వారి సత్యాన్ని పూర్తి వెలుగులో చూపగలిగే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. మానసిక రోగులకు చేసే థెరపీ లక్ష్యం వాళ్ళను గతం నుండి విముక్తుల్ని చేసి స్వేచ్ఛను ప్రసాదించగలగడం మాత్రమే అయితే దానికి ‘సత్యం’ మాత్రమే ఏకైక మార్గమా అన్నది ప్రశ్న! మన జీవితాల గురించి మనం చెప్పుకునే కథలు వాస్తవంగా జరిగినదాన్ని ప్రతిబింబించడంలో చాలాసార్లు విఫలమవుతాయి. వాటిల్లో వాస్తవికత లోపభూయిష్టమైనది. అలాగని అవి పూర్తిగా అబద్ధాలనీ కొట్టిపారెయ్యలేం. నిజానికి మనుషులు తమ దుర్బలత్వానికి సిగ్గుపడో, తమలో చీకటి కోణాలను దాచుకోవడానికో అబద్ధాలు చెప్తారు. ఇటువంటి అబద్ధాలను కట్టుకథలుగా మలచుకుంటే తప్ప మనకు ఆ కథలు చెప్పడానికి మరో మార్గం లేదు. మన దగ్గరున్న ముడిసరుకునే సత్యమని భావించినప్పుడు దానినుంచి సాపేక్షిక సత్యాలెన్నిటినో అంశాలుగా తీసుకుని వేరు వేరు కథలల్లే అవకాశం ఉంది. ఉదాహరణకు సెర్బాంతేస్ (Servantes) రాసిన డాన్ కిహోటేను (Don Quixote) తీసుకున్నా అందులో మనం సృష్టించుకునే ఆదర్శవంత సత్యం (ideal truth) వాస్తవిక సత్యం (real truth) కంటే మెరుగైనదేమో అనిపిస్తుంది. నవల రెండో భాగంలో ఒక సందర్భంలో కిహోటే తాను అశ్వారూఢుడయిన మహా వీరుడిని అన్న భ్రమ నుండి విడివడి ఇలా అంటాడు: ‘నాకు ఒక శూరుడి ధర్మం పట్ల నమ్మకముంది, నేను నా నమ్మకాలకనుగుణంగా మసలుకునే వ్యక్తిని. అలా చెయ్యడం ద్వారా మనిషిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నేను మునుపటిలా స్పానిష్ సమాజంలో శిథిలమైపోతున్న నా భవంతిలో మరణం కోసం ఎదురుచూస్తూ దుర్భరమైన స్థితిలో ఉండడం మీకు ఇష్టమా? లేదా ఇప్పటిలా పేదలకు, అణగారిన వర్గాలకు, బాధితులైన స్త్రీలకూ రక్షకుడుగా ఉండడం ఇష్టమా? అయినా నా నమ్మకాలు మనిషిగా నా ఎదుగుదలకు తోడ్పడుతున్నప్పుడు మీరు వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారెందుకు?’ కిహోటే మాటల్ని పరిశీలిస్తే మనిషి శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు కొన్ని భ్రమలని కూడా వాస్తవాల్లా నమ్మడంలో కోల్పోయేదేముంటుంది అనిపిస్తుంది. మనిషి మానసికారోగ్యానికి అవసరమైన మోతాదులో కాల్పనికత చేసే మేలుని గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ నాకైతే కనపడలేదు. నేటి సమాజంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి కారణంగా సృజనాత్మకతకు తావివ్వని మితిమీరిన స్పష్టత, తార్కికత లాంటివి మనిషి మానసికాభివృద్ధిని అనేక విధాలుగా నిర్వీర్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. కిహోటే ఆదర్శవాదాన్ని అతడి అనుచరులందరూ ఆచరించకపోయినా అతడి ఆదర్శాల వల్ల ప్రపంచానికొరిగే నష్టమైతే లేదని ముక్తకంఠంతో తీర్మానిస్తారు. ఇటువంటి భ్రమల వల్ల ప్రపంచం మరికొంచెం సజీవంగా, వినోదాత్మకంగా మారుతుందని అభిప్రాయపడతారు. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడం అందరికీ సాధ్యం కాదు, కానీ కొందరు జీవిస్తుంటే చూసి తృప్తి పడేవాళ్ళు కూడా మరికొందరు ఉంటారు. ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం నేను చదివిన యూత్, డిస్గ్రేస్ నవలల నాటి కూట్సీకి భిన్నమైన దృక్పథం ఈ కూట్సీలో కనిపిస్తుంది. ఒక అసాధారణమైన జ్వర తీవ్రతతో సృజనకు పూనుకునే కళాకారుల్లో నైతికతను ఆశించకూడదని, ఆ మాటకొస్తే నైతికపరిథిలో ప్రాణంపోసుకునే ఏ కళారూపమైనా ఉత్తమమైనది కాదనే ఆనాటి తన వాదనకు భిన్నంగా, ఇక్కడ ప్రామాణికతకు (authenticity) నైతికతకు భేదాన్ని గుర్తించిన తీరులో కూట్సీలో ఒక పరిణతి చెందిన రచయిత కనిపిస్తాడు. ఒక మనిషి అబద్ధమాడినా, మోసం చేసినా, దొంగతనం చేసినా కూడా తనను తాను సత్యవంతుడని, మోసగాడు, దొంగ కాదనీ అనుకోనంతవరకూ ఆ వ్యక్తి ప్రామాణికమైన వ్యక్తిగానే లెక్క. కానీ ఎందుకో సమాజం ప్రామాణికతకు అవసరం లేని గొప్పతనాన్ని ఆపాదిస్తుంది. ఉదాహరణకు డికెన్స్ లాంటి రచయితలు తమ రచనల్లో ప్రామాణికతకు పెద్దపీట వేస్తారు, హిపోక్రసీని సహించరు, కానీ అనైతికతపట్ల మాత్రం ఉదారంగా వ్యవహరిస్తారెందుకో అంటాడు కూట్సీ. కళాసృజన విషయంలో గాని, సత్యశోధనలో గానీ పూర్తి స్పష్టతను ఆశించడం సరికాదనే వాదనను నిరూపించే క్రమంలో సెబాల్డ్ (W. G. Sebald) నవల ఔస్టలిట్స్‌లో (Austerlitz) సూత్రధారుడు ఆపెరా గాయకుల గురించి రాసిన ఒక వివరాన్ని కూట్సీ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు ఈ గాయనులు స్టేజ్ మీద ఉన్నప్పుడు తమ కనుపాపలు పెద్దవిగా చేసుకోవడం కోసం కళ్ళలో బెలడోనా డ్రాప్స్ వేసుకునేవారట. కంట్లో బెలడోనా కారణంగా వాళ్ళేమీ స్పష్టంగా చూడగలిగేవారు కాదు కాని, వాళ్ళ కళ్ళు స్పష్టంగా కాంతులీనుతూ కనపడి ప్రేక్షకులకు వారు మరింత సౌందర్యవతుల్లా కనిపించేవారు. ఇలా చేయడం వల్ల వారి గాయకప్రతిభలో వచ్చిన మార్పేమీ లేదు. కాని, అది వారి ప్రదర్శనను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ఇలా, ఒక విషయంలో నైపుణ్యాన్ని సాధించే క్రమంలో సృజనకు కాస్త పట్టువిడుపులు ఉండడం అవసరం. ఈ పట్టువిడుపుల వల్లనే సృజనాత్మకతతో కూడిన కళారంగంలోనూ, భావోద్వేగాలతో నిండిన మనోప్రపంచంలోనూ వివిధ రకాలైన నూతనోత్తేజాలకు ఆస్కారం ఉంటుంది. మానసిక చికిత్స, సృజనాత్మకత అనే రెండు దారులూ సరిగ్గా ఇటువంటి సందర్భాల్లోనే కలుస్తాయి. కథలన్నీ అన్యాయంపై న్యాయం సాధించే విజయంగా ఉంటే పాఠకులకు రుచిస్తుంది. తప్పు చేసినవాడికి శిక్ష పడి తీరాలనుకుంటారు పాఠకులు. అలా కాని పక్షంలో ‘అంత ఘోరమైన పాపాలకు పాల్పడి అలా ఎలా తప్పించుకుని సుఖంగా ఉంటాడు!’ అనుకుంటాడు సగటు పాఠకుడు. సినిమాలలో హీరో విలన్‌ని కొడితే మనం ఉత్సాహంగా చప్పట్లు కొడతాం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలిచాయని సంతోషపడతాం. ది స్కార్లెట్ లెటర్, డాన్ కిహోటే, గాన్ విత్ ది విండ్ లాంటి కథల్ని మంచి కథలుగా నిలబెట్టేది ఈ న్యాయభావన (notion of justice) మాత్రమే అంటాడు కూట్సీ. ఉదాహరణకు కథానాయకుడు తన అనైతికమైన గతాన్ని తిరగరాయాలని ప్రయత్నించి విఫలమవ్వడం జగద్ధర్మం గురించి చెబుతుంది. అదే అతడు తన గతాన్ని సులభంగా దాచిపెట్టి సుఖసంతోషాలతో కడదాకా జీవించాడని చెప్పే కథ పాఠకులకు రుచించదు. ఎందుకంటే అందులో న్యాయాన్యాయాల ప్రసక్తి లోపిస్తుంది కనుక. సంగీతకారులు, చిత్రకారులు, రచయితల వంటి కళాకారులందరూ మనకు మనం విధేయులుగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. మన అనుభవాల సాపేక్షకతత్వం కారణంగా లోపాలతో సహా మన ప్రామాణికతను అంగీకరించడం తప్ప మనకు మరో దారి లేదని రుజువు చేస్తారు. ఒకనాటి ప్యూరిటన్ వ్యవస్థలో కన్ఫెషన్ తీసుకునే చర్చ్ ఫాదర్ స్థానాన్ని, ఈనాటి మతాతీత సంప్రదాయంలో కళాకారులు భర్తీ చేస్తున్నారు. The art I love seems to say this to me: ‘Look at what is going on around you – in all its richness and detail and colour, its beauty and its ugliness; don’t stop looking and thinking about what you see; but also don’t forget that it is you who are looking, that you have a position and a place from where you look – and so do other people. Inhabit that place fully.’ మనసులో భారం దింపుకోడానికి పుస్తకపఠనం ఒక మంచి చికిత్స అయితే రాయడం ఒక మంచి ఆత్మచికిత్స అవుతుంది. రాయడం అనే సెల్ప్ థెరపీ వల్ల మంచి చెడులు విశ్లేషించుకునే అవకాశం వస్తుంది. మనం చేసిన తప్పులకు అక్షరరూపం ఇవ్వడానికి, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోడానికీ ఉపయోగపడుతుంది. మనం నిద్ర పోతున్నప్పుడు కూడా మనలో కళాకారుడు మెలకువగానే ఉంటాడు. కాల్పనికవాదం సృష్టించిన కథలలో కళాకారుడి లోపలి గాయం కీలకాంశం. అతణ్ణి మెలకువగా ఉంచేది ఆ గాయమే, దాని తాలూకు వేదనే. తన గాయాన్ని మాన్పుకోడానికి కళాకారుడు కళను సృష్టిస్తాడు. సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే సాహసం లేకనే తన లోపలి భయాలకు, అంతఃసంఘర్షణలకూ సృజనను సాధనంగా చేసుకుని కాల్పనిక లోకాలకు రూపకల్పన చేస్తాడు. తద్వారా తన గాయాలనుండి ఉపశమనం పొందుతాడు. కథకుడికీ, మామూలు మనుషులకూ తేడా ఏమిటంటే, కథకుడు పూర్తి స్పృహతో తనలో అన్ని భావోద్వేగాలనూ జడ్జిమెంట్ లేకుండా అనుభవిస్తాడు. నైతికానైతికతలకు అతీతంగా తనలో చెలరేగే భావాలకు నిజాయితీగా అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనికి భిన్నంగా సాధారణ వ్యక్తులు తమలో లోపాల్ని అణచివేసే/ అధిగమించే ప్రయత్నం చేస్తారు. సంఘానికి భయపడో, సిగ్గుపడో తమలో చెడుని దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సంఘర్షణ కొన్నిసార్లు వారి జీవితాన్ని కబళిస్తుంది కూడా. రచయితే లేకపోతే మామూలు మనుషులకి మనలో లోపాలను గురించి మాట్లాడటానికి సరిపడే భాష ఉండేది కాదని కొందరి భావన. రచయిత కథలను చెప్పడం ద్వారా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోగలమో, కలవరపరిచే గతం నుండి విముక్తి ఎలా సాధించగలమో నేర్పిస్తాడు. అలా నేర్పించేది ఒక మంచి కథ. ఎ గుడ్ స్టోరీ.

తొలి ప్రచురణ మే 2021 ఈమాట : https://eemaata.com/em/issues/202105/25963.html

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు :

JMC – I feel I must press further on the question I raised last time: Is the goal of the therapist (deliberately I don’t write, the goal of therapy) to bring the patient face to face with the true story of their life or to provide them with a story of their life that will enable them to live more adequately (more happily, which in the minimal Freudian prescription amounts to being able to love and work again)? How flexible can therapy afford to be in actual practice? Of course the therapist always desires the ideal outcome, the whole truth and the embracing of the whole truth by the patient; but given the constraints of time and money, doesn’t the therapist more often than not have to settle for a good-enough outcome, a truth that is not the whole truth but is good enough to get the patient back in working order?

The obvious answer is: I am prevented by my allegiance to the truth. But in practice can the truth – the whole truth – be attained without interminable analysis? And if interminable analysis is not practical, why not settle for a version of the truth that, in some sense, works?

He looked everywhere for love and validation, but was unable to find what he was looking for because the feelings of abandonment and neglect from childhood could not be consciously admitted. In short, he did not really know what he was looking for. This is not freedom – the freedom to pick a preferred version of one’s life from the trees, as it were – but the opposite.

I am rowing against a certain tide here, and I am aware of that. Let me note two currents in the tide. The first is the claim (by certain critics) that there is such a thing as the dialogical novel. The second is the claim (by many writers) that writing, at its most intense moments, is a matter of being dictated to rather than of dictating – that there have to be two persons or two souls in the room for a poem (in the widest sense) to get composed.

Perhaps it is always a mistake to try to transfer features of individual psychology to the psychology of the collective.

You suggest that a strongly felt membership of a group, a sense of belonging, need not be accompanied by regression in a psychological sense. I would put the emphasis elsewhere. I would say that involuntary group membership often results in regressive behaviour, as a way of blocking out an unhappy sense of not belonging yet not being able to get out. Such regression is like deliberately getting drunk to anaesthetise intolerable feelings.

Out of membership of great involuntary groups, like religion or caste or nation, one can, I have no doubt, get an enormous sense of security and validation and even pride. But belonging to an inescapable group can also be the root of a debilitating lifelong quarrel.

I don’t want to stray too far from the topic, but reading seems to demand a phenomenological analysis of its own. There is a dead reading and a living reading. Dead reading, in which the words never come alive on the page, is the experience of many children, those children who never, as they say, learn to love reading. It is not impossible to learn by means of dead reading, in a rote kind of way; but in itself it is a barren, unappealing experience. Living reading, on the other hand, strikes me as a mysterious affair. It involves finding one’s way into the voice that speaks from the page, the voice of the Other, and inhabiting that voice, so that you speak to yourself (your self) from outside yourself. The process is thus a dialogue of sorts, though an interior one. The art of the writer, an art that is nowhere to be studied though it can be picked up, lies in creating a shape (a phantasm capable of speech), and an entry point that will allow the reader to inhabit the phantasm.

Thursday, July 8, 2021

A Search in Secret India ( రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ) - Paul Brunton

కొన్ని పుస్తకాలు ఒక నిర్ణీత సమయంలో మాత్రమే మన దృష్టినాకర్షిస్తాయి, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు చదవడం సాధ్యపడదు. 2013 లో మిత్రులు సురేష్ పెద్దరాజు గారు బహూకరించిన పాల్ బ్రంటన్ రచన 'రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ' అలా ఒక సరైన సమయంలో చదవడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రిందట నన్ను చేరిన ఈ పుస్తకం ఇంతకాలంగా నా బుక్ షెల్ఫ్లో ఉన్నా ఇంతవరకూ ఎందుకు చదవలేదు అంటే సహేతుకమైన కారణాలు చెప్పలేను. బహుశా కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల  ఏర్పడిన నిరాసక్తత, వైరాగ్యం, స్తబ్దత ఆధ్యాత్మికత వైపు తాత్కాలికంగా నా దృష్టిని మళ్ళించి ఉండవచ్చు. అదలా ఉంచితే ఫిలాసఫీ అంటే మొదట్నుంచీ వల్లమాలిన ఇష్టం కావడంతో కొన్నేళ్ళ క్రితం జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద, రస్సెల్ ,హెస్సే ,గిడే, కామూ వంటి వారి తత్వాలను మైకం కమ్మినట్లు వరుసపెట్టి చదివినా,తరువాతి కాలంలో పరస్పర వైరుధ్య వాదనలతో భౌతిక ప్రపంచం నుండి దూరంగా మనిషిని వేరే ప్లేన్ లోకి తీసుకుని వెళ్ళి వదిలేసే అటువంటి రచనల నుండి ఉద్దేశ్యపూర్వకంగా దూరం జరిగే ప్రయత్నం చేశాను. కానీ ఆధ్యాత్మిక,తాత్విక విషయాలపై స్వతహాగా ఉన్న ఆసక్తి నాస్తికత్వపు (?) ముసుగుల మాటున మిగిలిపోయేది కాదేమో.

Image Courtesy Google

సత్యాన్వేషణలో భాగంగా భారత దేశం వచ్చి మెహెర్ బాబా, అడయారు యోగి బ్రమ,హజరత్ బాబాజాన్, రమణ మహర్షి, శ్రీ శంకరులు,విశుద్ధానంద మొదలగు అనేకమంది యోగుల్ని కలిసి,  వారి సాన్నిహిత్యంతో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలను పలు ఆధ్యాత్మిక రచనల్లో పొందుపరచిన బ్రిటిష్ రచయిత పాల్ బ్రంటన్ ఈ రచన ద్వారా పాఠకులకు దాదాపు కనుమరుగైపోయిన భారతీయ ఆధ్యాత్మిక  ప్రపంచాన్ని పునఃదర్శనం చేయిస్తారు. ఈ పుస్తకంలో భారతీయ యోగతత్వాన్ని గురించి చదువుతున్నంతసేపూ చాలామందికి వచ్చే సందేహమే నాకూ వచ్చింది. ఈ ఆధునిక యుగంలో భారతీయ యోగశాస్త్రం యొక్క ఉపయోగం ఎంత ? కానీ బ్రంటన్ తో ప్రయాణంలో నా ప్రశ్నకు కొన్ని సరైన సమాధానాలు దొరికినట్లనిపించింది.

ఆదర్శ జీవన శైలికి పాశ్చాత్యుల నిర్వచనమైన 'కార్యాచరణ' కు సుదూరంగా ముక్కుమూసుకుని ఎక్కడో అరణ్యాల్లో,హిమాలయాల్లో మారుమూల గుహల్లో,ఆశ్రమాల్లో తపస్సు చేసుకునే యోగుల వల్ల ఈ ఆధునిక సమాజానికి ఉపయోగం ఏమిటి ? అనేది బ్రంటన్ ను కూడా తుదికంటా వేధించిన ప్రశ్న. కానీ కనిపించినదాన్నల్లా గుడ్డిగా నమ్మకుండా తర్కం ప్రధానంగా భారత దేశంలో తన యాత్రలు కొనసాగించారాయన. వేల సంవత్సరాల క్రితం భారత దేశంలో ఋషులు ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల గురించీ, మానవజాతి ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల గురించీ మేధోమథనం చేసే సమయంలో పాశ్చాత్య దేశాలకు అటువంటి విషయాల్లో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదనే విషయాన్ని నేటి ఆధునిక భారతం అవహేళన చేస్తూ ప్రస్తావించే పరిస్థితులున్నా ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించే దిశగా ఈ పుస్తకంలో అనేక విశ్లేషణలు ఉంటాయి.

"బర్నాఫ్, కోల్బ్రూక్ , మాక్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారత దేశంలోని విలువైన సాహిత్య సంపదను పరిచయం చేసే వరకూ, యూరప్ లోని జ్ఞాన రక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశ ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు. ఆ రకంగా ప్రాచ్యదేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రచారం చేస్తూ, వారి సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి ఈ యురోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు."  అంటారు బ్రంటన్.

'మంచి వారి మౌనం సమాజానికి ప్రమాదకరమైనది' అనడం తరచూ వింటూ ఉంటాం. నిజానికి భారతీయ యోగ శాస్త్ర రహస్యాలను ఔపాసన పట్టిన ఋషులు సామజిక జీవనాన్నుంచి నిష్క్రమించడంతోనే భారతీయ సమాజం పతనం ప్రారంభమైంది అని పలువులు యోగులు అభిప్రాయపడతారు. 

"నిజానికి ఈ విశ్వ రహస్యాలన్నిటినీ విప్పి చెప్పగలమనే విజ్ఞాన శాస్త్ర రచయితలకి తెసింది సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం మాత్రమే ! వారెవరూ ఒక వృద్ధ ఫకీరు వనితతో కొన్ని నిముషాల సాన్నిహిత్యం నా ధృడమైన మానసిక మూలాలను కదిలించడం ఎలా సాధ్యపడిందో వివరించి చెప్పగలరని నేననుకోను. నిజానికి ఆ విషయం నాకూ అర్ధం కాలేదు." అంటారు బ్రంటన్. 
తన యాత్రలో బ్రంటన్ కలిసిన ఒక మౌన యోగి "ఈ ప్రపంచంలో ఆలోచనలను అంతర్ముఖం చేయడమే అన్నిటికంటే ఉన్నతమైన యోగం" అంటారు. కానీ క్షణకాలం పాటు కుదురునీ, మౌనాన్నీ,ఏకాంతాన్నీ భరించలేని నేటి 'డిస్ట్రాక్షన్' సమాజంలో నిజమైన అజ్ఞానులు అటువంటి యోగులను పిచ్చివాళ్ళుగా, సోమరులుగా, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా పరిగణించి నిందిస్తున్నారు. తర్కాతర్కాలను ప్రక్కన పెట్టి ఆలోచించి చూస్తే ఒక శాస్త్ర సాకేంతిక నిపుణుడు అభివృద్ధి పేరిట చేసే సామజిక వినాశనం కంటే తమ ప్రపంచంలో మౌనంగా ధ్యానం చేసుకునే ఈ యోగులు చేసే చేటు ఎక్కువేమీ కాదనిపించింది. నేటి సమాజంలో ప్రపంచాన్నిమార్చడం కంటే ఎవరికీ చేటు చెయ్యకుండా మనల్ని మనం మార్చుకోవడం మిక్కిలి అవసరం.
"పాశ్చాత్యులలో కొంతమందికి మహర్షి ఈ విధంగా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అనిపించవచ్చు. కానీ కొంతమందైనా ఈ విధంగా విడిగా కూర్చుని నిరంతర వ్యాపకాలతో సతమతమయ్యే మన ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించడమే మంచిదనిపిస్తుంది. అలా దూరంగా ఉండి చూసేవారికే లోక వ్యవహారం బాగా అర్ధమై సత్యం బోధపడుతుంది. మరో విధంగా ఆలోచిస్తే, ఈ లోకంలో అల్ప విషయాలకే తలకిందులయ్యే మూఢుల కంటే,ఈ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకుని అరణ్యంలో ధ్యానం చేసుకుంటూ కాలం గడిపే యోగి అన్ని విధాలా అధికుడనే చెప్పాలి. అంటారు బ్రంటన్ . 

రమణ మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు పొందిన అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ,

"ప్రశాంతత ఒక నదీరూపంలో నా దగ్గరగా ప్రవహిస్తున్నదనీ, ఒక గొప్ప ఆనందం నా అంతరాంతరాలని తాకుతున్నదనీ, ఆలోచనలతో సతమతమవుతున్న నా మనసుకి విశ్రాంతిగా ఉన్నదనీ మాత్రమే నాకు తెలుస్తున్నది. ఇప్పుడు చూస్తే నిరంతరం నన్ను వేధించే ప్రశ్నలు చాలా అల్పమైనవనిపిస్తోంది. గతాన్ని అవలోకిస్తే ఆ సమయమంతా ఎంత నిస్తేజంగా గడిపానా ? అని నాకే ఆశ్చర్యం వేస్తున్నది. ఒక విధంగా చూస్తే మన మేథే సమస్యలని సృష్టించుకుని ,వాటిని పరిష్కరించడానికి నానా యాతనా పడుతూ ఉంటుందనే అభిప్రాయం బలపడుతున్నది. ఇప్పటి దాకా మేథని ఒక గొప్ప వరంగా భావిస్తూ వచ్చిన నాకు ఈ రకమైన ఆలోచన రావడం విచిత్రమే." అంటారు బ్రంటన్. 

యుక్తవయస్సులో నాస్తికుడైన టాల్స్టాయ్ తన చివరి కాలంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ రచించిన 'కన్ఫెషన్స్'  అనే పుస్తకంలో నిరక్షరాస్యులైన క్రైస్తవులకు దైవం పట్ల ఉన్న అపారమైన నమ్మకాన్ని గురించిన అభిప్రాయాన్నే బ్రంటన్ కూడా వెలిబుచ్చడం విశేషం. దైవం విషయంలో తర్కానికి ఆస్కారం లేని 'నమ్మకం', 'లొంగుబాటు' ఎంత అవసరమో ఈ మాటలు చెబుతాయి. 

ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నానో, అక్కడ చేరిన శ్రోతల నమ్మకం చూసి అంత ఈర్ష్య పడ్డాను. వారి జీవితంలో సందేహానికి తావులేదు. "దేవుడున్నాడు" అంటే "అవును. ఉన్నాడు" అనే నమ్మకం తప్ప, జీవితమంటే, విశ్వంలోని భూమి అనే సూక్ష్మ రేణువుపై మానవుడు చేసే యాత్ర అనీ, అక్కడ భగవంతుడనే వాడికి చోటు ఉండదనీ ఆలోచిస్తూ చీకటి రాత్రులు గడపడం వారికి తెలియదు. 

'సిద్ధార్థ' లో హెర్మాన్ హెస్సే రాసినట్లుగానే సత్యాన్వేషణకు మార్గాన్ని,సాధనాల్నీ గురువు సూచించినా స్వీయానుభవంతో మాత్రమే ఎవరైనా అంతర్గతమైన "నేను" ని దర్శించగలరని రమణ మహర్షి కూడా బ్రంటన్ కు ఉపదేశిస్తారు.

మానవ సమాజంలో సాన్నిహిత్యానికి నిర్వచనాలు విచిత్రంగా అనిపిస్తాయి. మనుషులతో సాన్నిహిత్యం ఏర్పడాలంటే వారి సంతోషంలోనో,దుఖ్ఖములోనో నువ్వు పాలుపంచుకోగలగాలి. అటువంటి మానవ సంబంధాల్లో పరస్పరం మార్పులకి సిద్ధం కాగలగాలి. కానీ భావోద్వేగాలకు అతీతమైన వారిని నువ్వు దూరంనుండి పరిశీలించగలవు గానీ వారితో స్నేహాన్ని చెయ్యడం అసాధ్యం. యోగుల చుట్టూ ప్రశాంతమైన అటువంటి అభేధ్యమైన కోటను దాటి వారి ఆత్మను దర్శించడం సాధారణ మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. రమణ మహర్షిని తదేక ధ్యానంలో చూసిన బ్రంటన్ ఈ విధంగా అంటారు.

తరువాత కొన్ని రోజులు మహర్షితో సాన్నిహిత్యం పెంచుకుందామని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. దానికి మూడు కారణాలున్నాయి.ఒకటి ఆయనలో సహజంగానే ఉన్న గాంభీర్యం . వాదప్రతివాదాల పట్లా, చర్చల పట్లా అయన అయిష్టతా, ఇతరుల నమ్మకాలూ, అభిప్రాయాల పట్ల ఆయన నిర్లిప్తతా అందరికీ తెలుసు. ఎవరినీ తన అభిమతానికి అనుగుణంగా మార్చాలనే కోరిక ఆయనకి ఏ కోశానా లేదు. తన అనుచరగణానికి మరొక్కరినైనా కలుపుకోవాలనే ఆరాటమూ ఆయనకి లేదు.

ప్రాచ్య దేశాలతో పోలిస్తే పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక లేమిని ఎత్తి చూపించడానికి బ్రంటన్ వెనుకాడకపోవడం విస్మయపరిచింది.

"పాశ్చాత్య దేశాల్లో చాలామందికి ఇటువంటి సత్యాన్వేషణకి అసలు సమయమే ఉండదు. యథాతథ స్థితిని ఏ ప్రశ్నలూ లేకుండా ఆమోదించే పొరపాటు చేయటానికి వారు చెప్పే కారణం " ఇది నా ఖండంలో ప్రజలందరూ చేస్తున్న పొరపాటే"  అంటారాయన .

ఒక ప్రక్క ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తూనే మరో ప్రక్క మతం పేరిట ప్రజలను మోసం చేసే దొంగ సాధువుల గురించీ ఫకీరుల గురించీ కూడా రాశారు. మానవ ప్రయత్నం ఏమీ లేకుండా అన్నీ దైవం చేసిపెట్టాలని ఎదురు చూసే మూఢ భక్తినీ, కర్మ చెయ్యకుండా అన్నిటినీ దైవం మీదకు తోసేసి కులాసాగా బ్రతికే భారతీయ నిష్క్రియాపరత్వాన్నీ దుయ్యబట్టారు. నిజానికి మతంతో సంబంధం లేని ఎన్నో విషయాలను కప్పిపెట్టడానికి మతాన్ని అడ్డుపెట్టుకోవడం భారతీయ సమాజంలో ఉన్న లోపం. మతాన్ని అనుసరించకుండా,జీవితానికి అన్వయించుకోకుండా,ఎటువంటి కార్యాచరణా లేకుండా మతోద్ధారకుల్లా మతం గురించి మాట్లాడడం వరకే నేటి భారతీయుల ఆదర్శాలు పరిమితమైపోయాయి. ఇటువంటి సందర్భాల్లోనే కపట గురువులు పుట్టుకొచ్చి మతమంటే వంచన అనే స్థాయికి పడిపోయింది. ఉదాహరణకు ఈ రచనలో మెహెర్ బాబా గురించి బ్రంటన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా పాల్ బ్రంటన్ సత్యాన్వేషణ రమణ మహర్షి ఆశ్రమంలో పూర్తికాగా ప్రాచీన యోగశాస్త్రాన్ని ఆధునిక పద్ధతులలో ఉపయోగించే దిశగా రెండిటినీ సమన్వయము చేసే వ్యవస్థలూ,వ్యక్తుల అవసరం భారతీయ సమాజానికి ఎంతైనా ఉంది అని ఆయన అభిప్రాయపడతారు.

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :

ఆనందమే మనిషి సహజ స్థితి.ఈ ఆనందం నిజమైన "నేను" లో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా ఈ సహజ స్థితిని కనుక్కోడానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే! ఈ సహజ స్థితికి నాశనం లేదు.

భావోద్రేకాల నుంచి హేతువాదాన్నీ, అభూత కల్పనల నుంచి చరిత్రనీ, ఊహ నుంచి సత్యాన్నీ వేరు చేసే శాస్త్రీయ శిక్షణా, ఆలోచనలూ గుడ్డిగా అనుసరించేవారికి తెలియవు. అందుకని నిజాయితీ లేనివారూ, అనుభవంలేని మూఢులూ, గొప్పవారిని అనుకరిద్దామనే అభిలాష గలవారూ, ఈ రకమైన వారితో గూడిన అనుచరణగణాన్ని పోగుచేసుకోవడం ఈ దేశంలో చాలా తేలిక.

Monday, July 5, 2021

ఎగిరే కోతులూ - వాటి యజమానులూ : నార్సిసిజం (Narcissism)

గత రెండేళ్ళుగా నా చదువు ఫిక్షన్ కంటే సాహితీ విమర్శ, ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ చుట్టూనే ఎక్కువ  తిరిగింది. ముఖ్యంగా లిటరరీ క్రిటిసిజం విపరీతంగా చదివితే ఫిక్షన్ చదవడంలో కిక్ పోతుందని మరోసారి అనుభవంలోకి వచ్చింది. ఒక పాఠకురాలిగా ఫిక్షన్ చదివితే ఉండే ఆనందం క్రిటిక్ లా చదివితే నిస్సందేహంగా ఉండదు. క్రిటిక్ కళ్ళు క్రాఫ్ట్ పై నుండి మరల్చడం కష్టం. కానీ ఫిక్షన్ చదవడంలో ఉండే ఆనందం ఎరుకలో ఉంది గనుక కాస్త విరామం తీసుకుంటే మళ్ళీ హ్యాపీగా చదువుకోవచ్చని మొనాటనీ బ్రేక్ చేస్తూ ఈసారి జానర్స్ మార్చాను. దీనికి తోడు ఈ మధ్య చదివిన జె.ఎమ్. కోట్జీ 'ది గుడ్ స్టోరీ' చాలా కాలంగా ముట్టని సైకాలజీని వెలికి తీయించింది. అందులో రాసిన కొన్ని అంశాలు నార్సిసిజం గురించి కావడంతో ఆ సబ్జెక్ట్ గురించిన పుస్తకాలు ఆన్లైన్ లో వెతికాను. దానికంటే ముందు ఈ అంశాన్ని గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా సమయం కోరా లో,యూట్యూబ్ లో గడిపాను.

జూన్ ఒకటిని World Narcissistic Abuse Awareness Day గా జరుపుకుంటారు. యాదృచ్చికంగా ఈ నెలలో నార్సిసిజం గురించి అవగాహన కోసం ఏదో ఒక పుస్తకం చదువుదామని మొదలుపెట్టి నాకు తెలీకుండానే ఆసక్తితో ఒకదాని వెంబడి ఒకటి వరుసగా చాలా పుస్తకాలు చదివాను.

[ World Narcissistic Abuse Awareness Day on June 1 dedicates the day to education, support and effective change. Unlike physical abuse, narcissistic abuse leaves no physical marks. A form of Psychological and emotional abuse, it is invisible and difficult to prove.]

Image Courtesy Google 

'నార్సిసిజం'. ఈ రోజుల్లో ఈ మాటను చాలా క్యాజువల్ టోన్ లో వాడేస్తున్నాం. ఎవర్ని పడితే వాళ్ళని నార్సిసిస్టు అని బ్రాండ్ చేసేస్తున్నాం. కానీ 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' బాధితులకు ఈ మాట వింటే వెన్నులోనుంచి చలి పుట్టుకొస్తుంది. NPD గురించి క్షుణ్ణంగా తెలిసినవాళ్ళెవరూ ఆ పదాన్ని తేలిక దృష్టితో వాడరు. ఎవరికైనా అనుభవంలోకి వస్తేనే గానీ అర్ధమయ్యే విషయం ఇది ఎంత మాత్రమూ కాదు. నార్సిసిజం గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక గొప్ప (?) నార్సిసిస్ట్ హెచ్.జి.ట్యూడర్ గురించి తెలిసింది. ఆయన తన క్లినికల్ థెరపీ స్టోరీలనూ, అనుభవాలనూ, నార్సిసిస్టిక్ వ్యూహాన్నీ,ప్రవర్తనా సరళినీ అనేక పుస్తకాలుగా ప్రచురించారు. ఇవి కాకుండా సైకోథెరపిస్టులూ,ప్రొఫెషనల్స్ రాసిన మరికొన్ని పుస్తకాలు ఆన్లైన్ లో లభించాయి. ఈ వ్యాథిని గురించి ఈ పుస్తకాల్లో చదివిన కొన్ని  ఉమ్మడి అంశాలను మాత్రం ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. నార్సిసిజం గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించని అంశాలు చాలా ఉన్నాయి,ఇది కొండను అద్దంలో చూపించే ప్రయత్నం మాత్రమే. 

నార్సిసిజంలో చాలా రకాలున్నప్పటికీ దాన్ని ప్రధానంగా ఓవర్ట్ నార్సిసిజం (ఎక్స్ట్రావర్ట్)  ,కోవర్టు నార్సిసిజం (ఇంట్రావర్ట్) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ పుస్తకాల్లో రాసిన సింహభాగం అంశాలు లవ్ పార్టనర్స్ గురించీ,జీవిత భాగస్వాముల్ని గురించీ రాసినప్పటికీ నార్సిసిస్టులు అన్ని 'షేప్స్ & సైజెస్' లోనూ ఉంటారు. అంటే తల్లిదండ్రులూ ,తోడబుట్టినవాళ్ళూ,స్నేహితులూ, ప్రియుడూ,ప్రియురాలూ, బాస్ ,కలీగ్స్ ఇలా ఎవరైనా నార్సిసిస్టులు అయ్యే అవకాశం ఉంది. ఈ పుస్తకాల్లో నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్ లో కొనసాగుతున్న యువత గురించి ఎక్కువ రాశారు కాబట్టి వాటి గురించే నేను కూడా ప్రస్తావిస్తాను. సహజంగా నార్సిసిస్టులు అనగానే జబ్బు చేసిన మనుషుల్లా దీనంగా ఉండరు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నట్లు ,పైకి చాలా ఛరిష్మాటిక్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీళ్ళు ఓటమినెరుగని విజేతలు,పలు రంగాల్లో నిష్ణాతులూ, అన్ని విధాలా జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళూను. కానీ వీళ్ళు లోపల మాత్రం చాలా ఇన్సెక్యూర్డ్ గా, సాధారణ వ్యక్తులకంటే తీవ్రమైన ఆత్మన్యూనతతో ఉంటారు.

They will look you in the eyes, making you feel special and heard, make sounds and give looks that tell you they care, but they really don’t. They mirror your emotions, so it seems like they have empathy. They have observed and learned how to appear to care. They thrive off the attention of others. People that think or act as if they are amazing are their energy supply. They have people around them that adore them, respect them, revere them, see them as special and almost perfect, and in some cases seem to worship them.

 I spoke with one woman who would watch her narcissistic mom observe other people’s insecurities and shower them with compliments and praise in those areas. The “targets” felt loved, seen, heard. Her mom didn’t care about these people. She only wanted to look good and be impressive. She was using them for the attention and admiration she received from them. They were her energy supply.

అహంకారం,అగ్గ్రెస్సివ్నెస్ లు ప్రధాన లక్షణాలుగా గల 'ఓవర్ట్ నార్సిసిజం' పైకి కనపడుతుంది కాబట్టి బాధితులు దానిని సులభంగా గుర్తించి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రమాదకరమైన 'కోవర్ట్ నార్సిసిజం' దారి వేరు,వీళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే బాధితులకి తప్ప వాళ్ళు నార్సిసిస్టులని వేరొకరికి తెలిసే అవకాశం లేదు. చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే కోవర్టు నార్సిసిస్టులు చాలా దయగలవారుగా,ఉత్తములుగా పబ్లిక్ లో ఒక ప్రత్యేకమైన 'ఫేక్ ఇమేజ్' ని మైంటైన్ చేస్తారు. They are usually pathological liars and con artists. వీళ్ళతో ఏ సన్నిహిత సంబంధమైనా బాధితులకు నిరంతరం నిప్పులపై నడకలా ఉంటుంది (walking on eggshells). మైండ్ గేమ్స్ ఆడడంలో వీళ్ళు నిష్ణాతులు. పబ్లిక్ లో ఫేక్ పర్సనాలిటీస్ తో చీమకు కూడా హాని తలపెట్టని ఉదారమైన వ్యక్తుల్లా చెలామణీ అయ్యే వీళ్ళు కోవిడ్ వైరస్ లా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ వరకూ రావడానికి ఏదో ఒకదారి వెతుక్కుంటారు. ఏం జరుగుతోందో మీకు అర్ధమయ్యేలోగా మీరు హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ తో కొన ఊపిరితో ఉంటారు. శరీరానికి తగిలే దెబ్బలు పైకి కనిపిస్తాయి,సులభంగా మానిపోతాయి. కానీ కోవర్ట్ నార్సిసిస్టులు చేసే 'ఎమోషనల్ డామేజ్' పైకి కనిపించదు. చివరకు చాలా subtle గా నడిచే ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు సాటి మనుషులకు చేసే హాని గురించి కొంచెం కూడా బాధ్యత తీసుకోకుండా తప్పించుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ మానసిక వ్యాథిగ్రస్తులకు వాళ్ళు చేసే నేరాలకు థెరపీలు తప్ప శిక్షలు లేవు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే నార్సిసిజం అనే ఈ జబ్బుకి పూర్తి స్థాయిలో క్యూర్ చాలా కష్టమని స్వయంగా థెరపిస్టులు చెప్పడం.

నార్సిసిస్టులు టార్గెట్స్ గా ఎంచుకునే వ్యక్తులు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారంటారు. నలుగురిలో నారాయణా అని ఉండే వ్యక్తులు వీరి 'స్టాండర్డ్స్' కు తగరు. వీళ్ళ టార్గెట్స్ ఇంటెలిజెంట్,స్మార్ట్,లవింగ్,కేరింగ్,ఎంపతీ ఉన్న మనుషులై ఉంటారనేది చాలా సర్వేల్లో వెల్లడైంది. ఎన్ని ప్రత్యేక లక్షణాలున్నా కోవర్ట్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ ని తప్పించుకోవడం చాలా కష్టమనేది పలు మానసిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. నిజానికి బాధితుల్లో ఈ ప్రత్యేకమైన లక్షణాలే వారిని నార్సిసిస్టులకు లక్ష్యాలుగా మారుస్తాయంటారు సైకాలజిస్టులు. దురదృష్టవశాత్తూ నూటికి 90 %  బాధితులకు NPD విషయంపై కనీస అవగాహన ఉండదు. ఇంకా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే,చివరకు సైకో థెరపిస్టులకు కూడా కోవర్ట్ నార్సిసిజం గురించి ఉండాల్సినంత అవగాహన లేదని ఈ పుస్తకాల్లో రాశారు.

I’ve come to believe that in order to really understand the nature of the covert narcissist, you have to have lived it. Whether it’s a spouse, significant other, friendship, boss, co-worker, neighbor or family member, the patterns are nearly identical and only someone who has been inside that nightmare can really know what the experience is like. Even then it’s hard to describe.

Many people who go to therapy to get help because they are depressed, low on energy, experiencing low self-esteem, feeling a lot of anxiety, and confusion usually have no idea that the cause of their issue is an abusive relationship, whether that is with a romantic partner, a parent, or a boss at work.   Some victims become re-traumatized by a therapist or friend that doesn’t understand. Most therapists are not educated on the covert type of narcissism. Only the overt type is taught in higher education, so most understandably don’t recognize the signs and traits.

అసలు నార్సిసిస్టులకు ఏం కావాలి ? 

నార్సిసిస్టులకు స్పష్టమైన 'సెల్ఫ్' అంటూ ఉండదు. సరళంగా చెప్పాలంటే వారొక ఖాళీ షెల్ లాంటివాళ్ళు. NPD ఉన్న వ్యక్తులకు అటెన్షన్ ఆక్సిజన్ తో సమానం. వాళ్ళకు తమలో ఉన్నాయనుకునే లోపాల్ని అధిగమించడానికీ, సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకుని మనసులో ఖాళీని పూరించుకోవడానికీ 'ఇగో బూస్ట్' అవసరమవుతుంది. దానిని వాళ్ళు ఎప్పటికప్పుడు తమ 'నార్సిసిస్టిక్ 'సప్లై' / 'ఫ్యూయల్' ద్వారా పూరించుకుంటారు. అది లేకపోతే వాళ్ళు ఇంధనంలేని వాహనంతో సమానం. ఇక్కడ 'సప్లై' అంటే ఏదో వస్తువనుకునేరు,మనుషులు. నిజానికి 'బాధితులు' అనడం సబబు. వాళ్ళు తమ టార్గెట్ ను ఎంచుకునే విషయంలో చాలా శ్రద్ధగా (picky) ఉంటారు. ఏదైనా రంగంలో నైపుణ్యం ఉన్నవాళ్ళో,ఛరిష్మాటిక్ మనుషులో, జాలీ,దయ, భావోద్వేగాలు, పాపులారిటీ ,అందచందాలు ఉన్నవాళ్ళో వీళ్ళని ఎక్కువ ఆకర్షిస్తారు.

Covert narcissists seek out certain types of people. They look for people who are kind, authentic, self-reflective, nurturing, loving, and caring people with a conscience. They look for energy supplies. Without these attributes, the narcissist has no use for you, and their manipulative tactics wouldn’t work on you.

తమ 'టార్గెట్స్' ని తమ వైపు తిప్పుకోవడం మొదలు వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి,'ఎనర్జీ వాంపైర్స్' లా మారి spirit & soul ని క్రష్ చేసి,చెఱకు గడను పీల్చిపిప్పి చేసినట్లు వారిలో జీవితానందాన్ని,శాంతినీ,ఆత్మ విశ్వాసాన్నీ పూర్తిగా హరించేసే వరకూ నార్సిసిస్ట్టిక్ స్ట్రాటజీ మూడు దశల్లో జరుగుతుంది. ఇదంతా కేవలం మెదడుని బేస్ చేసుకుని భావోద్వేగాలతో ఆడుకునే ఆసక్తికరమైన ఆట.

1. ఐడియలైజేషన్ ఫేజ్ లేదా లవ్ బాంబింగ్ :

ఈ దశను సైకోథెరపిస్టులు నార్సిసిస్టిక్ రిలేషన్షిప్ లో 'గోల్డెన్ పీరియడ్' గా అభివర్ణిస్తారు. ఈ సమయంలో నార్సిసిస్ట్లు  మిమ్మల్ని లిటరల్ గా ఒక దేవత/దేవుడి గా ఆరాధిస్తారు. విపరీతమైన అటెన్షన్,అఫెక్షన్ ఇస్తూ మీరు దివినుండి భువికి దిగి వచ్చిన వ్యక్తి ఏమో అనిపించేలా మీపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. మీమాటలో మాట కలుపుతూ, మీరిద్దరూ ఒకే ప్రపంచానికి చెందినవాళ్ళన్న భ్రమను కలుగజేస్తారు. మీకు క్లౌడ్ నైన్ లో ఉన్నట్లుంటుంది. నిజానికి నిజాయితీగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కూడా ఎప్పుడూ అంత ప్రేమ కురిపించి ఉండరు. మీ పట్ల వారి అబ్సెషన్ ను తప్పించుకోవడం అసాధ్యం. మునుపూ ముందూ ఎవరూ మిమ్మల్ని ఇంతలా ప్రేమించి ఉండరు. నార్సిసిస్టులు ఊసరవెల్లిలా ఎవరి సమక్షంలో ఉంటే వాళ్ళ అలవాట్లనూ,వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబిస్తూ మీరూ,వాళ్ళూ ఒకే తత్వం కలిగిన వ్యక్తులని మీరు భ్రమపడేలా చేస్తారు. నిజానికి మీ భావోద్వేగాలతో సహా వాళ్ళు మిమ్మల్ని మిర్రర్ చేస్తూ ఉంటారు. చాలా మంది బాధితులు అబ్యూజ్ తరువాత థెరపీ సెషన్స్ లో,ఈ దశలో నార్సిసిస్టును తమ 'సౌల్ మేట్' అనుకున్నామని చెప్పారంటారు సైకాలజిస్టులు. ఈ దశ చివరకి వచ్చేసరికి నార్సిసిస్టుకు మీరు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చారన్న నమ్మకం కలుగుతుంది.

It is very common for targets to say,  “We seemed so much alike.”  This is because the covert narcissist mirrors you in the beginning, in a sense becomes you.

Covert Narcissists are often chameleons that become whoever they are around. They don’t have a strong sense of self. They pick up what a person wants, and they become that. Because of this, people are impressed with how well they can seem to relate to all types of people.

2. డీ వేల్యూ ఫేజ్: మీరు నార్సిసిస్టుతో ఒక కంఫర్టబుల్ దశకు చేరుకోగానే అసలు కథ మొదలవుతుంది. వాళ్ళకి ఇంటిమసీ ఇష్యూస్ ఉంటాయి. They are incapable of love. వాళ్ళు మిమ్మల్ని 'ఛేజ్' చెయ్యడంలో ఉన్న ఛాలెంజ్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు. నార్సిసిస్టులకి కావాల్సింది మీపై కంట్రోల్ మాత్రమే,మీరూ,మీ ప్రేమా కాదు. మహా అయితే (మినిమం) రెండు నుండి (మాగ్జిమమ్) ఆరు నెలల్లో నావెల్టీ తగ్గగానే వాళ్ళకి మీరు బోర్ కొట్టేస్తారు, లేదా వారికి 'మెంటల్ స్టిమ్యులేషన్' ఇచ్చే మరో కొత్త 'సప్లై/విక్టిమ్' దొరుకుతుంది. లేదా అప్పటికే మీతో సంబంధం తెంచుకోక మునుపే వాళ్ళు కొత్త సప్లై తో 'ఐడియలైజేషన్ ఫేజ్' ని మళ్ళీ మొదలుపెట్టి ఉంటారు. ఈ ఆటను వాళ్ళు చాలా కాలంగా ఆడుతుంటారు కాబట్టి అందులో నిష్ణాతులు. తమ అమ్ముల పొదిలో 'రెడీమేడ్' అస్త్రాలైన మాటలూ,కథలూ,ప్రేమ లేఖలూ,మెసేజ్ లూ కాపీ పేస్ట్ లుగా వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి. ఈ పాటర్న్ రిపీట్ అవుతుంటుంది. విచిత్రమేంటంటే ఏకకాలంలో వాళ్ళు ఇలా కనీసం నాలుగైదు లేదా అంతకుమించి సంబంధాలు కూడా కలిగి ఉంటారంటారు సైకాలజిస్టులు. వాళ్ళకి 'ఇగో బూస్ట్' అవసరమైనప్పుడల్లా ఒక సప్లై నుంచి మరొక సప్లై కి అప్పటి మూడ్ ని బట్టి షిఫ్ట్ అవుతుంటారు.

They are generally successful and charming. Everyone loves them on a surface level. They tend to not have long-lasting friendships with people that really know them deeply. They may have friends that have known them for years but don’t really know them. Yet they are rarely without a partner. After they discard you, they usually move on quickly to another source, another target that will think they are so lucky to have found such a “nice guy” just like you did in the beginning.

Covert narcissists are likable to the outside world; they appear to be giving, humble, and kind. Image is the most important thing to them. These people are law-abiding citizens. They usually have well paying steady careers. They are not outwardly aggressive. You could know them for years and never see this side of them. This can change during the discard phase, which I’ll discuss in a later chapter. It is usually only the person that gets to know them intimately that sees the destructive traits. The rest of the world sees the façade, the “nice guy.” Many therapists don’t see through the mask and indeed are often impressed with how kind and aware they are.

ఇక నార్సిసిస్టుతో మీ హనీమూన్ పీరియడ్ పూర్తవుతుంది.  'లవ్ బాంబింగ్' ఫేజ్ తరువాత నార్సిసిస్టులు మునుపటిలా మీతో వ్యవహరించరు. వారు ప్రేమను సడన్ గా విత్డ్రా చేసుకుంటారు. మీరు నార్సిసిస్ట్ తో సంబంధంలో మీ ఎమోషన్స్ ని ఇన్వెస్ట్ చేసి ఉండడంతో హై డ్రగ్ అడిక్షన్ ఉన్న పేషెంట్ కి డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ పరిస్థితి. వాళ్ళు హఠాత్తుగా ప్రేమ,అటెన్షన్ ఇవ్వడం మానేస్తారు. మీకు వచ్చే మెస్సేజెస్,కాల్స్ గణనీయంగా తగ్గిపోతాయి లేదా ఆగిపోతాయి. ఏం జరుగుతుందో అర్థంకాక మీరు గందరగోళానికి గురవుతారు,మీరేదో తప్పు చేశారేమో అని అనుకుంటారు, సమాధానాల కోసం వారిని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సాకులు చెప్పి తప్పించుకుంటారు. కానీ మధ్య మధ్య లో మీపై కంట్రోల్ పోకుండా కొద్ది మోతాదుల్లో 'లవ్ బాంబింగ్' దశను రిపీట్ చేస్తారు. కానీ మీ మీద చాలా subtle గా విమర్శలు,ఇన్సల్ట్స్ చేస్తూ ఉంటారు. ఈ దశ ఐడియలైజేషన్ కూ,డీవేల్యూ ల మేళవింపుగా ఉంటుందంటారు థెరపిస్టులు. మార్చి మార్చి ఒకసారి ప్రేమగా,మరోసారి క్రూరంగా మీతో వ్యవహరిస్తారు. మెదడు ఈ రెండు 'ఆపోజిట్ రియాలిటీల' ను ప్రక్కప్రక్కనే గ్రహించలేక విక్టిమ్ లో విపరీతమైన స్ట్రెస్,ట్రామా ఏర్పడుతుంది. దాన్నే సైకోథెరపిస్టులు 'కాగ్నిటివ్ డిసొనన్స్' అంటారు. (Cognitive dissonance is a catastrophic breakdown of steadfast beliefs and self-knowledge. It is the sense of complete confusion — an entire dissolution of clarity. It feels like mental torture. If you have been in a relationship of any kind with a narcissist, you will know this feeling well. ) ఈ దశలో  నార్సిసిస్టులు మీలో సృష్టించిన 'Cognitive dissonance' తీవ్రమైన 'ఎమోషనల్ డేమేజ్' కు కారణమవుతుంది. నార్సిసిస్ట్లు  'కాగ్నిటివ్ డిసోనెన్స్' ని తమ ఆయుధంగా ఎలా ఉపయోగించుకుంటారో తరువాత ఓపికుంటే ఈ క్రింది లింక్ లో చదవండి.

https://medium.com/invisible-illness/on-cognitive-dissonance-61821269204

మీకు వారి వ్యక్తిత్వంపై అనుమానమొచ్చినా మీ ఇంస్టిక్స్ ని నమ్మలేరు. ఈపాటికే నార్సిసిస్టిక్ మానిప్యులేషన్ తో మీరు మీ 'సెన్స్ ఆఫ్ సెల్ఫ్' ని కోల్పోవడం మొదలవుతుంది. ఈ దశలో మీరు నార్సిసిస్టుల అబద్దాలనూ,మైండ్ గేమ్స్ నీ నమ్మి ఊరుకునే తెలివితక్కువ మనుషులైతే సరి, లేకపోతే మిమ్మల్ని దారికి తీసుకురావడానికి వారు చాలా శక్తిమంతమైన ఆయుధం అయిన 'సైలెంట్ ట్రీట్మెంట్' ను మీ మీద ప్రయోగిస్తారు. కానీ వాళ్ళతో 'గోల్డెన్ పీరియడ్' అనుభవించిన మీ మనసు మీ మాట వినదు. మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ ని 'ఫిక్స్' చెయ్యడానికి పదేపదే ప్రయత్నిస్తారు. ఉపయోగం ఉండదు. మీరు విసిగిపోయి 'విత్ డ్రా' అయిపోయే ఆలోచనలో ఉంటే 'ఔట్ ఆఫ్ బ్లూ' మళ్ళీ ప్రత్యక్షమై నార్సిసిస్టులు మళ్ళీ మీమీద కొద్ది కొద్దిగా ప్రేమను ఒలికిస్తారు. దీన్ని 'బ్రెడ్ క్రంబింగ్' అంటారట. బిజీ అనో మరొకటనో అబద్ధాలు చెబుతారు, వాళ్ళని అర్ధం చేసుకోనందుకూ,అపార్థం చేసుకున్నందుకూ మిమ్మల్ని గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తారు. మీరు నిజమనుకుంటారు. అదే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని  దెబ్బతీసే దిశగా చాలా 'subtle' గా మీ మీద విమర్శలు చేస్తారు. మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మళ్ళీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావంటారు. అప్పటికే మనసు పాడై ఏం జరుగుతోందో అర్థంకాని గందరగోళంలో మీరు ఆవేశంలో ఏమైనా అంటే ఎదురుతిరిగి వాళ్ళే విక్టిమ్ లా వ్యవహరిస్తారు. చివరకి మీమీద మీకే అపనమ్మకం కలుగుతుంది. శక్తివంతమైన 'నార్సిసిస్టిక్ మానిప్యులేషన్' సాలెగూడులో చిక్కుకుని Cognitive dissonance తో,సెల్ఫ్ డౌట్ తో మీ వాస్తవాన్ని మీరే ప్రశ్నించుకునే స్థితికి మిమ్మల్ని తీసుకువస్తారు. స్లో పోయిజన్ లా మిమ్మల్ని మానసికంగా నాశనం చేస్తారు.

You may be aware of the phrase ‘misery loves company’, and this couldn't be truer for a covert narcissist. They will, either consciously or unconsciously, spread their misery and unhappiness to those closest to them.

నార్సిసిజానికి సంబంధించి 'గ్యాస్ లైటింగ్' అనే ఒక పద్ధతి ఉంటుందట. [Gaslighting is a form of manipulation that attempts to grow seeds of doubt in a target. It is used to make you question your memory, your perception, and your own sanity. It makes you think something is wrong with you when it is not. Psychology Today defines gaslighting as  “A tactic in which a person or entity, in order to gain more power, makes a victim question their reality.”] అంటే వాళ్ళు మీతో  అన్నమాటల్ని అనలేదని బుకాయిస్తారు. వాస్తవాన్ని తిరగ రాస్తారు. చేసిన పనులు చెయ్యలేదని దారుణంగా మీ మొహం మీదే అబద్దాలు చెబుతారు. మీ మధ్య జరిగిన రియాలిటీని,సంభాషణాల్నీ ఎప్పటికప్పుడు తమకు అనుగుణంగా మార్చుకుంటూ 'హిస్టరీని రీ-రైట్' చేసుకోవడం నార్సిసిస్టుకి వెన్నతో పెట్టిన విద్య. 

This gaslighting behavior can often make you think you're losing your mind, and make you question your perception of reality. This is known as ‘percepticide’. 

*PERCEPTICIDE DEFINITION: a type of emotional abuse within a relationship, when one partner is so controlling over the other, that the victim loses their grasp on the truth and their sense of self.

ముఖ్యంగా కోవర్ట్ నార్సిసిస్టులు మ్యానిపులేషన్ టాక్టిక్ట్స్లో భాగంగా ఈ రకమైన వాక్యాలను విరివిగా ఉపయోగిస్తారట. తమ మాటలకీ చేతలకీ అకౌంటబిలిటీ తీసుకోకపోవడం,తమ ప్రవర్తనను బాధితుల మీద ప్రొజెక్ట్ చెయ్యడం నార్సిసిస్టుల ప్రధాన లక్షణం. ఈ పుస్తకాల్లో రాసిన వారి టెర్మినాలజీ చూద్దాం.

"అరే నీకలా అనిపించిందా ? నేనా ఉద్దేశ్యంతో అనలేదు". 

"I'm sorry you feel that way."

"I never said that"

"She/ He is just a friend."

"You are so jealous, possessive and insecure."

"I was just joking."

"You are oversensitive / overreacting."

"You take everything very seriously."

3. డిస్కార్డ్ ఫేజ్

ఈ దశలో మీరు చూస్తున్న వ్యక్తికీ, మీకు ఐడియలైజేషన్ దశలో తెలిసిన వ్యక్తికీ ఎంతమాత్రం సంబంధం ఉండదు. నార్సిసిస్టు మాస్క్ పూర్తిగా జారిపోయి అసలు రూపం మీకు స్పష్టంగా కనిపించే దశ ఇది. ఈ సమయంలో ఏం జరుగుతోందో మీకు స్పష్టంగా అర్ధంకాకపోయినా ఏదో తేడా ఉందని మీ కామన్ సెన్స్ మీకు చెబుతుంది. నార్సిసిస్టుల మానిప్యులేషన్ కారణంగా ఇంతవరకూ మీరు మీ ఇన్స్టింక్ట్స్ నీ, గట్ ఫీలింగ్ నీ కూడా త్రోసిపుచ్చారు మరి. కానీ ఈ దశలో మీరు రెడ్ ఫ్లాగ్స్ ని గుర్తించడం మొదలవుతుంది. ఎందుకంటే మీ మానసిక/శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మీరు నార్సిసిస్టుకి మునుపటిలా ఫ్యూయల్(మెంటల్ స్టిమ్యులేషన్/ఇగో బూస్ట్) ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు. వారికి కావాల్సిన ఎమోషనల్/ఇగో బూస్ట్ మీరు ఇవ్వలేనప్పుడు మీ అవసరం వారికి లేదు, అంటే వాళ్ళకి మీరు తాత్కాలికంగా పనికిరారు..ఎందుకంటే ఎప్పుడూ లేనిది మీలో ఏంగ్జైటీ,రెస్ట్లెస్నెస్,గుండె వేగంగా కొట్టుకోవడం,డిప్రెషన్,fatigue ,స్కిన్ అలర్జీస్,స్ట్రెస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరున్నది టాక్సిక్ రిలేషన్శిప్లోనని మీరు గ్రహించకపోయినా మీ శరీరం గ్రహిస్తుంది.

మీరు వాళ్ళ ప్రవర్తన,మాటల వల్ల హర్ట్ అవుతున్నారని వాళ్ళకు ఎన్నిసార్లు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నించినా వారి తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయి మీరు సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటారు. నార్సిసిస్టుకి ఇది సుతరామూ ఇష్టం ఉండదు. ప్రేమికుల్లా కాకపోతే కనీసం స్నేహితుల్లా ఉందామంటారు (స్నేహం ముసుగులో మునుపటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఆశిస్తారు) మీపై వారి 'కంట్రోల్' వారికి ఇంధనం లాంటిది. అది వాళ్ళు వదులుకోడానికి ఇష్టపడరు. వారు అనుకున్నట్లు జరగకపోతే మీకు వారిపై ప్రేమ లేదంటారు,మీ సంతోషం మీరు చూసుకునే స్వార్థపరులని మిమ్మల్ని నిందిస్తారు. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టంలేదంటారు. ఇదంతా మీపై ఉన్న ప్రేమని అనుకుంటే పొరబాటే. (వాళ్ళ కొత్త 'సప్లై' బోర్ కొడితే 'ఆల్టెర్నేటివ్ సప్లై' గా మీరు పనికొచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు మరో సప్లై దొరకడం కష్టం కాబట్టి వాళ్ళకి ఆ బ్యాక్ అప్ చాలా అవసరం. ఈ అంశంపై డాక్టర్ థెరెసా జె.కోవర్ట్ రాసిన పుస్తకంలో 'The Narcissist's Harem' అని ఒక చాఫ్టర్ చదివి తీరాల్సిందే. ఇందులో నార్సిసిస్టులు తమ పాత 'సప్లై' లను స్టోర్ చేసుకుని ఏ విధంగా రీసైకిల్ చేసుకుంటారో రాశారు) .వారి మాటలకీ చేతలకీ పొంతన లేకపోవడంతో మీరు తెగించి సంబంధాన్ని తెంచుకుంటే నార్సిసిస్టు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మీకెంత ధైర్యం వాళ్ళని మీ జీవితంలోనుంచి బయటకు పంపించడానికి ? ఓవర్ట్ నార్సిసిస్టు ఆగ్రహం హింస,అబ్యూజ్ రూపంలో పైకి వ్యక్తమవుతుంది. కానీ కోవర్ట్ నార్సిసిస్టులు పైకి శాంతంగా ఉన్నా మిమ్మల్ని ఎలా నాశనం చెయ్యాలా అని మనసులోనే మైండ్ మ్యాప్ వేసుకోవడం మొదలుపెడతారు. నార్సిసిస్టులు ఈ సమయంలో మీతో సంబంధం వారికి ప్రయోజనకారి కాదనుకుని మిమ్మల్ని డిస్కార్డ్ చేసిన పక్షంలో మీరు నిజంగా అదృష్టవంతులే. మీకు చావుతప్పి కన్ను లొట్టపోయినా కొంత కాలానికి కోలుకుంటారు. కథ సుఖాంతమవుతుంది. మీరు టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడిన స్వేచ్ఛా జీవులు. కానీ మీరు వారితో సంబంధం కలిగి ఉన్న సమయంలో 'నార్సిసిస్టిక్ ఇంజ్యూరీ' కి కారణమైనా,వాళ్ళ ఇగోని మరే విధంగా దెబ్బ తీసినా నరకానికి మీకు పునః స్వాగతం పలుకుతారు వాళ్ళు. మీకు వ్యతిరేకంగా 'Smear campaign' నిర్వహిస్తారు. అంటే మీ గురించి గాసిప్స్,రూమర్స్ రూపంలో దుష్ప్రచారాలు చేస్తారు. లేదా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు అగ్రెషన్ లో అన్న మాటలనో,సన్నిహితంగా ఉన్నప్పుడు మీరు పంచుకున్న రహస్యాలనో తమకు అనుకూలంగా వాడుకోడానికి కూడా వెనుకాడరు. ముఖ్యంగా కోవర్ట్ నార్సిసిస్టులు ఇదంతా తమంతట తాముగా చెయ్యరు. తెరవెనుక మీ గురించి అబద్ధపు ప్రచారాలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. నిజానికి వాళ్ళు అత్యంత 'ప్రమాదకరమైన పిరికివాళ్ళు' . అందువల్ల నార్సిసిస్టిక్ అబ్యూజ్ లో చివరి దశ అయిన 'డిస్కార్డ్' ని  మీకు విముక్తిగా భావించి సెలెబ్రేట్ చేసుకోమంటారు థెరపిస్టులు. నిజానికి రిలేషన్షిప్స్ లో కష్టనష్టాలూ,బ్రేకప్స్ సహజమే,సాధారణ సంబంధాల్లో వాటిని తీపి జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ నార్సిసిస్టుతో డీ-వేల్యూ,డిస్కార్డ్ ఈ రెండు దశలూ ట్రామాతో కూడిన పీడకలను తలపిస్తాయంటారు సైకాలజిస్టులు. నార్సిసిస్టులు ఈ రెండు దశల్లో చాకచక్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని సమూలంగా నాశనం చేస్తూ చేసే అవమానాలు మర్చిపోయి మీ 'సెన్స్ ఆఫ్ సెల్ఫ్' ని తిరిగి పొందడానికి ఎన్నో థెరపీ సెషన్స్ అవసరపడతాయంటారు.

As Jackson Mackenzie, bestselling author of Psychopath Free once said, from the moment you left, or were left, by the narcissist, you were given the first true compliment by the narcissist. You are now the narcissist's nightmare, the type of person he no longer wants and will want to avoid at all costs. And that is exactly who you will remain and strive to be, because rejection never felt so good - Becoming the Narcissist’s Nightmare: How to Devalue and Discard the Narcissist While Supplying Yourself - Shahida Arabi. 

Image Courtesy Google 

మరి 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' ని ఎదుర్కోవడం ఎలా ?

ఈ పుస్తకాలన్నిటిలోనూ నార్సిసిస్టులని సమర్ధవంతంగా ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం 'నో కాంటాక్ట్' అని రాశారు. సరళంగా చెప్పాలంటే "పారిపోండి". వారి మానసిక వ్యాధికి మందు లేదు.  మీరు వాళ్ళ విషయంలో రేషనల్ గా ఆలోచించడానికీ, నిజాయితీగా ముఖాముఖీ తలపడడానికి వాళ్ళు 'అప్ ఫ్రంట్' / 'ఫెయిర్' ఎనిమీస్ కాదు. అందువల్ల సోషల్ మీడియాలో అయితే అన్ని అప్లికేషన్స్ లోనూ కూడా వాళ్ళని బ్లాక్ చెయ్యడం కూడా చాలా ముఖ్యమంటారు. జీవిత భాగస్వామి నార్సిసిస్టు అయినా,మీరు పిల్లలతో ఉన్నా దురదృష్టవశాత్తూ మీకీ అవకాశం లేదు, నార్సిసిస్టులు లీగల్ గా,ఫైనాన్సియల్ గా మీకు చాలా సమస్యలు సృష్టిస్తారు. If they are not done with you yet,నార్సిసిస్టులు మిమ్మల్ని తిరిగి తమ కంట్రోల్లోకి తీసుకునే దిశగా 'డిస్కార్డ్' తరువాత 'హోవరింగ్' చేస్తారు. మిమ్మల్ని తిరిగి గెలుచుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తారు. ఒకవేళ మీరు స్పందించకపోతే 'ఫ్లైయింగ్ మంకీస్' ని ఉపయోగించుకుంటారు.

'ఫ్లైయింగ్ మంకీస్' అంటే నార్సిసిస్టు కోటరీకి చెందిన మీ ఇద్దరి ఉమ్మడి స్నేహితులూ,బంధువులూ,కలీగ్స్,చివరకు మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఫ్లైయింగ్ మంకీస్ నార్సిసిస్టులను ఆరాధించే,ప్రేమించే నమ్మిన బంటులు. మిమ్మల్ని నిందిస్తూ,మీవల్ల తాము బాధపడినట్లు ఒక విక్టిమ్ గా వీళ్ళ దృష్టిలో కోవర్ట్ నార్సిసిస్టులు సానుభూతి సంపాదించుకుంటారు. విచిత్రమేమిటంటే 'ఫ్లైయింగ్ మంకీస్' కి తాము ఫ్లైయింగ్ మంకీస్ అనే స్పృహ ఉండదు. నార్సిసిస్టు ఆడుతున్న చదరంగంలో పావులమని తెలీక నార్సిసిస్టును రక్షిస్తున్నామనుకుంటూ 'విక్టిమ్ బ్లేమింగ్' చేస్తూ వీళ్ళు మీపై ప్రత్యక్ష,పరోక్ష యుద్ధానికి దిగుతారు.

మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు : 

* నార్సిసిస్టుకి కావాల్సిన అటెన్షన్/ఇగో బూస్టింగ్ కేవలం పాజిటివ్ మాత్రమే కానక్కర్లేదు అంటారు ట్యూడర్. మిమ్మల్ని రెచ్చగొట్టాక మీవైపు నుండి నెగటివ్ రియాక్షన్ వచ్చినా కూడా అది వాళ్ళకి ఫ్యూయల్ గానే ఉపయోగపడుతుందట. ఎందుకంటే they feel they can still control you / manipulate you. ఆ ఫీలింగ్ ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.

* ఒకసారి 'నో కాంటాక్ట్' కు వెళ్ళాక మళ్ళీ నార్సిసిస్టు 'హోవరింగ్' కి ప్రభావితమై వెనక్కి వెళ్ళారో ఈసారి పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా మారినట్లు నటించినా మళ్ళీ త్వరలోనే తమ నిజస్వరూపం చూపిస్తారు. ఈసారి 'డిస్కార్డ్' రూపంలో మీకు పడే శిక్ష చాలా కఠినంగా,కౄరంగా ఉంటుంది. మీరు 'నో కాంటాక్ట్' తో వాళ్ళని వదిలేసి వెళ్ళి వాళ్ళని ఇగ్నోర్ చేసే ధైర్యం చేశారు,అందుకే వాళ్ళు మిమ్మల్ని శిక్షించాలనుకుంటారు.

* మీరు ఎపుడైనా ఒక నార్సిసిస్టుతో 'ట్రామా బాండ్' లో మాత్రమే ఉంటారు. నిజానికి నార్సిసిస్ట్లు  మీతో రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో కూడా మీలా (అంటే సాధారణ వ్యక్తుల్లా) తమ ఎమోషన్స్ ని ఇన్వెస్ట్ చెయ్యరు. కొత్త సప్లై దొరికి,మీతో అవసరం తీరగానే మిమ్మల్ని ట్రాష్ క్యాన్ లోకి విసిరికొట్టడం వాళ్ళకి చిటికెలో పని.

* ఓవర్ట్ నార్సిసిస్టులకు భిన్నంగా ఉండే కోవర్ట్ నార్సిసిస్టులు సమాజంలో చాలా మంచి/గొప్ప వ్యక్తులుగా ఒక ఫేక్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఈ మాస్క్ వారికి కర్ణుడికి కవచకుండలాలంత ముఖ్యం. ఆ ఇమేజ్ ను కాపాడుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఆ ఫేక్ ఇమేజ్ ని మోసుకుంటూ తిరగడం వల్ల త్వరగా సోషల్ రిలేషన్షిప్స్ లో exhaust అయిపోయి అలసిపోతుంటారు. అందుకే వారికి సర్ఫేస్ లెవెల్ లో ప్రపంచమంతటితో సంబంధాలున్నా ఎవరితోనూ లోతైన సంబంధాలు మాత్రం ఉండవు. చాలామందికి వారు తెలుసు,కానీ వాళ్ళేమిటో ఎవరికీ తెలీదు.

* నార్సిసిస్టులతో ఎలా వ్యవహరించాలి అని చాలా చోట్ల అడిగిన ప్రశ్నకు చాలామంది చెప్పిన ఒకే సమాధానం. "అసలు వ్యవహరించకండి." బ్రతుకుజీవుడా అనుకుంటూ బ్యాగ్ సర్దుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. ఈ మాట రమణి దుర్వాసుల,డెబ్బీ మీర్జా,జార్జ్ కె.సైమన్ లాంటి పలు మానసిక నిపుణులు పదే పదే చెబుతున్నారు. నార్సిసిస్టులు సహానుభూతికీ,ప్రేమకూ అర్ధం తెలీని మనుషులు. 'ఫేక్ మాస్క్' జారిపోయి తమ వికృతమైన రూపం ఎక్కడ బయటపడుతుందో అని అనుక్షణం ఛస్తూ, ఎత్తులపైయెత్తులు వేసుకుంటూ బ్రతికే వారి ఖర్మకు వారిని వదిలెయ్యండి. ఇంటెగ్రిటీ,కన్సైన్స్,శాంతీ,స్థిరత్వం,స్వచ్ఛత,సంతోషం ఎరుగని వారి మానసిక వ్యాథే వారికి ఒక జీవితానికి సరిపడే శిక్ష. వాళ్ళు జీవితాంతం ఎలాగూ బ్రతికేది ఆ నరకంలోనే. వాళ్ళని ప్రత్యేకం శిక్షించే పని లేదు అంటారు సైకాలజిస్టులు.

* "మీరు నార్సిసిస్టిక్ అబ్యూజ్ బాధితులైతే ముందుగా పగిలిన ముక్కల్ని ఏరుకుని,వాళ్ళు నాశనం చేసి వదిలేసిన మీ మానసిక ఆరోగ్యం సంగతి చూసుకోండి. మానవత్వమున్న సగటు మనిషిగా వ్యవహరించినందుకు గిల్టీ ఫీల్ అవ్వకండి. తాత్కాలికంగా బాధపడినా మీరు ఇలాంటి అనుభవాలతో మరింత బలమైన వ్యక్తిగా,వివేకవంతులుగా పరిణామం చెందారు,మరో జీవిత పాఠం నేర్చుకుని మరో మెట్టు పైకెక్కారు." అని అంటారు సైకో థెరపిస్టులు. నార్సిసిస్టిక్ రిలేషన్షిప్ నుండి బయటపడడం ఒక కల్ట్ నుండి బయటకు రావడంలా,డ్రగ్ అడిక్షన్ మానెయ్యడంలా ఉంటుందని సైకోథెరపిస్టులు అనడం ఈ సమస్య తీవ్రతను చెబుతుంది.

ఈ రోజుల్లో 'స్వేచ్ఛ' కు ఉన్న నిర్వచనాలు మారిపోయాయి. డేటింగ్,లివ్ ఇన్ రిలేషన్షిప్స్,కోర్టింగ్,ఫ్లర్టింగ్ లాంటివి సర్వసాధారణమైపోయాయి. మనం మార్పుని ఆపలేం. ఆపవలసి అవసరం కూడా లేదు. కాలం మారింది. కాలంతో పాటు మనమూ మారాలి. కానీ మన ముందు తరాల్ని ఆ మార్పులను తట్టుకునేలా సిద్ధం చెయ్యవలసిన అవసరం కూడా ఉంది. లేకపోతే ముక్కుపచ్చలారని టీనేజీలోనే సెక్సువల్,ఎమోషనల్ అబ్యూజ్ లాంటివాటికి గురైతే వారు ఆ పీడకలలతో జీవితాంతం జీవించాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలో సెక్సువల్ అబ్యూజ్ పట్ల ఉన్న అవగాహన ఎమోషనల్ అబ్యూజ్ పట్ల లేదు. ఈ పుస్తకాలు చదివితే రెండూ సరిసమానంగా హేయమైనవని అర్థమవుతుంది. మీ పిల్లలు యుక్త వయస్సులో వారైతే ఈ పుస్తకాలు మీరు చదివి,వాళ్ళతో కూడా తప్పకుండా చదివించండి.

Most people I talked to struggled to describe the relationship. This is common. There was a perpetual confused look on each face. It can be difficult to explain because the abuse is so hidden and subtle. They weren’t yelled at or physically abused. There are no visible scars. Yet the impact it makes on the psyche is profound.

చివరగా,ఇటువంటి అనుభవాలు మనిషిలో సాటి మనిషిపట్ల నమ్మకాన్ని సమూలంగా నాశనం చేసేస్తాయి. కొందరు వ్యక్తుల కారణంగా ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ సహజసిద్ధమైన 'సెల్ఫ్' ని కోల్పోకండి. ఈ లోకంలో మంచి-చెడు సరిసమానంగా ఉంటాయని గుర్తెరిగి మసలుకుంటే చాలు.

డిస్క్లైమర్ : ఎగిరే కోతుల్లోనో ,యజమానుల్లోనో ,బాధితుల్లోనో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నారా ? అయితే అది ఖచ్చితంగా మీ గురించే. ఈ సంకెళ్ళనుండి మిమ్మల్ని ఎవరైనా కాపాడగలిగితే అది మీరు మాత్రమే. 

ఈ క్రమంలో నేను చదివిన కొన్ని పుస్తకాలు : 

* The Covert Passive Aggressive Narcissist : Recognizing the Traits and Finding Healing After Hidden Emotional and Psychological Abuse - Debbie Mirza

* No Contact: How to Beat the Narcissist - H G Tudor

* Covert Narcissism - Louisa Cox

* The Covert Narcissist: Recognizing the Most Dangerous Subtle Form of Narcissism and Recovering from Emotionally Abusive Relationships - Dr.Theresa J. Covert 

* Should I Stay or Should I Go?: Surviving a Relationship with a Narcissist - Ramani Durvasula

* In Sheep's Clothing: Understanding and Dealing With Manipulative People - Simon, George K., Jr.

* Becoming the Narcissist’s Nightmare: How to Devalue and Discard the Narcissist While Supplying Yourself - Shahida Arabi.

పుస్తకాల నుండి కొన్ని వాక్యాలు : 

What you have been through is not a small thing. There are several types of narcissists. The covert type is one of the most destructive to your heart, psyche, and physical body because it is so hidden, unrecognizable, and you are usually the only one that sees it. People who know the narcissist in your life probably think they are one of the nicest people they’ve ever met and often wish they could be as lucky as you to have a mom, husband, dad, wife, boyfriend, boss, or friend like you do. They feel the same way you did, maybe for a long time, about the covert narcissist in your life. They have experienced the same illusion, just not identified the truth.

Here is the truth. If you have lived with a covert narcissist, you have been held down for a long time. You have experienced the illusion of love, not the real thing. You have been lied to, manipulated, and controlled. You have not been heard or valued. You were devalued and brutally discarded by someone who said they cared about you, but in fact only cared about themselves. You have experienced a crazy-making relationship that is difficult to describe. Your self-confidence, your zest for life, your adventurous spirit, the light inside you has slowly dimmed; there is part of you that may not want to be here anymore but is scared to say that out loud or to anyone else. I understand. I’ve been there. This is incredibly common among survivors.

Empathy is what will change this world. Empathy is what heals. Empathy is what enables us to experience real connection with each other. Empathy is what allows us to see the things that really matter.   When someone doesn’t have empathy, it is almost like they have a black hole inside of them. They don’t have that warm core spark of life within them. As a result, they cannot ever fully feel the magic of a sunset, the feeling of real connection, or the transcendent experience of real love. Someone without empathy is in survival  mode. They end up feeding off other people’s energy since they are devoid of it. They find people who have life, who have connection, who have empathy and real love, then drain them of their own supply of energy. This is why the CN in your life chose you, and this is why he or she moved on to someone else so quickly.