Sunday, January 27, 2019

Six Memos for the Next Millennium - Italo Calvino

1985 లో నూతన సహస్రాబ్దికి కేవలం 15 ఏళ్ళ దూరంలో ఉన్న తరుణంలో నోబెల్ గ్రహీత ఇటాలో కాల్వినో,రాబోయే కాలంలో సాహిత్య రంగంలో చోటు చేసుకోబోయే అనూహ్యమైన మార్పుల్ని అంచనావేస్తూ,సాహిత్యంలో ఉరకలేస్తున్న కొత్తనీరు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ప్రవహించడానికి వీలుగా ఏర్పాటు చేసిన పాయలు ఈ 'Six Memos for the Next Millennium' లో ముందు తరాల రచయితలకు తన అనుభవసారాన్నంతా రంగరించి విలువైన సూచనలిచ్చారు..1985లో హార్వర్డులో 'చార్లెస్ ఇలియట్ నోర్టన్ లెక్చర్స్' కోసమని ఇటాలో కాల్వినో రాసుకున్న ఈ వ్యాసాల్ని పూర్తి చెయ్యకుండానే పరమపదించారు..ఈ లెక్చర్లను Lightness,Quickness,Exactitude,Visibility ,Multiplicity,Consistency అంటూ ఆరు భాగాలుగా విభజించినప్పటికీ,ఆరో భాగం (Consistency) రాయకుండానే కాల్వినో స్వర్గస్తులయ్యారట.
Image Courtesy Google 

ఇటాలో కాల్వినోని చదివిన వారెవరికైనా ఆయన కథనం పక్షి ఈకంత తేలిగ్గా ఉంటుని తెలిసిన విషయమే..సంక్లిష్టమైన కథా వస్తువుని కూడా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పగల సరళమైన శైలి కాల్వినోది..అలా అని తన శైలికి పూర్తి భిన్నమైన భారమైన కథనాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదంటూనే కథ చెప్పడంలో తాననుసరించే సరళమైన శైలిని 'Lightness' విభాగంలో వివరిస్తారు..సో కాల్డ్ 'పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా ఆఫ్ టెక్నాలజీ' నూతన సహస్రాబ్దిలో సాహిత్యంపై ఎటువంటి ప్రభావం చూపించబోతోందో అని అంచనాలు వేసే ఆసక్తి తనకి లేదని చెప్తూ,సాహిత్యం మాత్రమే అందించగలిగే చైతన్యం ఒకటుంటుందనీ,తాను నమ్మిన కొన్ని సాహితీ విలువల్నీ,లక్షణాల్నీ ఈ లెక్చర్ల ద్వారా నూతన సహస్రాబ్దికి అన్వయించి చూసే ప్రయత్నం చేస్తున్నానంటారు.

తన శైలిలో ప్రధానాంశమైన 'Lightness' ను గురించి రాస్తూ గ్రీకు పురాణాల్లోని Perseus మరియు Medusa కథను ఉదహస్తారు..కాలక్రమేణా సృజనాత్మకత లోపిస్తున్న ప్రపంచం మెడూసా దృష్టి సోకినట్లు శిలారూపాన్ని పొందుతోందన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ,పెర్సియస్ మెడూసాను ఎలా హతమార్చాడో వివరిస్తారు..మెడూసాను చూసిన వారెవరైనా మరుక్షణంలో శిలలా మారిపోతారు గనుక ఆమెను చంపడానికి పెర్సియస్ ఆమె ముఖాన్ని ప్రత్యక్షంగా చూడకుండా,తన కాంస్య లోహపు డాలులో ఆమె ప్రతిబింబాన్ని చూసి ఆమె తల నరుకుతాడు..ఇక్కడ భయంకరమైన రాక్షసి మెడూసాను హతమార్చినప్పుడు పెర్సియస్ చాలా తేలికపాటి మాధ్యమాలైన వాయుమేఘాల్ని ఉపయోగించుకుంటాడు,తన దృష్టిని అద్దంలో చిక్కుకున్న ఆమె ప్రతిబింబంపై కేంద్రీకరిస్తాడు..ఈ కథని ఒక కవికి ప్రపంచంతో ఉన్న సంబంధంగా చూస్తారు కాల్వినో..
రచయితలు ఈ కథలో గమనించవలసిన విషయాలు :
* మెడూసా ఒక వాస్తవమనుకుంటే కవి వాస్తవంనుండి ముఖం తిప్పుకోకుండా దాన్ని పెర్సియస్ లా పరోక్షంగా చూడాలి(ప్రతిబింబాన్ని చూసినట్లు).
* మరో విషయం ఏంటంటే మెడూసా రక్తం లోనుండి,ఒక రెక్కల గుఱ్ఱం పెగాసస్ జన్మిస్తుంది (the heaviness of stone is transformed into its opposite.). దాన్ని పెర్సియస్ సొంతం చేసుకుంటాడు..గ్రీకు పురాణాల్లో 'పెగాసస్' ప్రత్యేకత ఏంటంటే అది భూమ్మీద ఎక్కడ తన డెక్కను మోపుతుందో అక్కడ ఉద్భవించే నీటిబుగ్గలనుండి ఆర్టిస్టులకు ప్రేరణనిచ్చే 'మ్యూజ్' పుడుతుంది.
* పెర్సియస్ మెడూసా తలను తనతో పాటే ఒక సంచిలో ఉంచుకుని శత్రువులతో పోరాడుతున్నప్పుడు అత్యవసర సమయంలో ఆయుధంగా ఉపయోగిస్తాడు..
Perseus's strength always lies in a refusal to look directly, but not in a refusal of the reality in which he is fated to live; he carries the reality with him and accepts it as his particular burden.

పెర్సియస్ భయంకరమైన మెడూసాను అధీనంలో ఉంచుకున్నట్లు కవి కూడా భారమైన భౌతిక ప్రపంచపు ప్రభావానికి లోనై సృజనాత్మకత కోల్పోకుండా (శిలగా మారకుండా),దాన్ని నిరంతరం అదుపులో ఉంచుకోవాలని కాల్వినో అంటారు..
Were I to choose an auspicious image for the new millennium, I would choose that one: the sudden agile leap of the poet-philosopher who raises himself above the weight of the world, showing that with all his gravity he has the secret of lightness, and that what many consider to be the vitality of the times— noisy, aggressive, revving and roaring—belongs to the realm of death, like a cemetery for rusty old cars.

మరో అంశం 'Quickness' విషయానికొస్తే,కాల్వినో తన కథల్లో స్పష్టత ప్రధానంగా పదాలను చాలా పొదుపుగా వాడతారు..ఒక్క అనవసరమైన సన్నివేశం గానీ,సందర్భం గానీ ఆయన కథల్లో కనపడవు..పేజీలు పేజీలు నింపే వివరణాత్మక రచనల్ని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదంటూనే పదాల నిడివి తక్కువ ఉండటంలో ఆవశ్యకతని వివరిస్తారు..హేతువాద దృష్టితో చూడని జానపద కథల్లో ఈ పదాలు పొదుపు గురించి వ్రాస్తారు..కార్ల్ జంగ్ 'Alchemical symbolism' స్టడీస్ లోని  గ్రహస్థితుల్ని ఆధారంగా చేసుకుని రచయితల మనస్తత్వాల్నీ/శైలుల్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు..ఆర్టిస్టులకు సరిపడే మెర్క్యూరీ,శాటర్న్ లక్షణాల్ని గురించి చెప్తూ, స్వేచ్ఛ,చురుకుతనం,సూక్ష్మ బుద్ధి,అనువర్తన యోగ్యమైన (adaptable) లక్షణాలు కలిగిన మెర్క్యూరీనీ ఒంటరితనం,విచారం,ఆలోచనాత్మకతలు కలబోసుకున్న 'శాటర్న్' నూ పోల్చుతూ చేసిన విశ్లేషణ అద్భుతంగా ఉంది.

Certainly my own character corresponds to the traditional features of the guild to which I belong. I too have always been saturnine, whatever other masks I have attempted to wear. My cult of Mercury is perhaps merely an aspiration, what I would like to be. I am a Saturn who dreams of being a Mercury, and everything I write reflects these two impulses.

Since in each of my lectures I have set myself the task of recommending to the next millennium a particular value close to my heart, the value I want to recommend today is precisely this: In an age when other fantastically speedy, widespread media are triumphing, and running the risk of flattening all communication onto a single, homogeneous surface, the function of literature is communication between things that are different simply because they are different, not blunting but even sharpening the differences between them, following the true bent of written language.

సాహిత్యంలో అశ్వాన్ని వేగానికి చిహ్నంగా భావిస్తారు..దీని ఆధారంగా కాల్వినో,నవలను ఒక అశ్వంతో పోలుస్తారు..కథ నడిచే 'పేస్' కథనాన్ని రక్తికట్టించాడనికి చాలా ముఖ్యమైన అంశమని అంటారు..చిన్న కథల్ని రాయడంలో బోర్హెస్ శైలిని కొనియాడడంతో పాటు పాల్ వలెరీ,Francis Ponge లాంటి వారి రచనల్ని ఉదహరించారు.
In any case, a story is an operation carried out on the length of time involved, an enchantment that acts on the passing of time, either contracting or dilating it. Sicilian storytellers use the formula “lu cuntu nun metti tempu” (time takes no time in a story) when they want to leave out links or indicate gaps of months or even years. The technique of oral narration in the popular tradition follows functional criteria. It leaves out unnecessary details but stresses repetition:

In my last talk, on lightness, I quoted Lucretius, who in the combinatoria of the alphabet saw a model of the impalpable atomic structure of matter. Now I quote Galileo who, in the combinatoria of the alphabet (“the various arrangements of twenty little characters on a page”), saw the ultimate instrument of communication.

మూడో అంశం Exactitude :
ఇందులో రచయిత చెప్పాలనుకున్న అంశంపై స్పష్టత అవసరమనీ,వ్యక్తీకరణలో భాష మీద పట్టు చాలా అవసరమనీ అంటారు..రచయితలు భాషను అతి సాధారణంగా,నిర్లక్ష్యంగా,ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారని అంటూ,ఈ విషయంలో రచయితల వైఫల్యాలను ఎత్తిచూపారు..
Why do I feel the need to defend values that many people might take to be perfectly obvious? I think that my first impulse arises from a hypersensitivity or allergy. It seems to me that language is always used in a random, approximate, careless manner, and this distresses me unbearably. Please don't think that my reaction is the result of intolerance toward my neighbor: the worst discomfort of all comes from hearing myself speak. That's why I try to talk as little as possible. If I prefer writing, it is because I can revise each sentence until I reach the point where—if not exactly satisfied with my wordswords—I am able at least to eliminate those reasons for dissatisfaction that I can put a finger on. Literature—and I mean the literature that matches up to these requirements—is the Promised Land in which language becomes what it really ought to be.

భాషతో పాటు మాస్ మీడియా కూడా నిరంతరం వెదజల్లే విజువల్ ఇమేజెస్ మెదడులో ఒకదానిపై ఒకటి పేరుకుపోయి,తుదకు అసౌకర్యం తప్ప ఏ చిన్న అనుభూతీ మిగల్చుకుండానే అదృశ్యమైపోతాయి అంటారు..
Italian is the only language in which the word vago (vague) also means “lovely, attractive.” Starting out from the original meaning of “wandering,” the word vago still carries an idea of movement and mutability, which in Italian is associated both with uncertainty and indefi-niteness and with gracefulness and pleasure.

స్ఫటికాన్నీ,అగ్నినీ రచయితల శైలికి చిహ్నాలుగా చూస్తూ అగ్నిలా ఎగిసిపడుతూ మండటం ఎంత అవసరమో,స్ఫటికపు పదునూ,పరిధుల్ని గమనిస్తూ రాయడంలో స్పష్టత (exactitude) కలిగివుండటం కూడా అంతే అవసరమంటారు..
The emblem of the crystal might be used to distinguish a whole constellation of poets and writers, very different from one another, such as Paul Valery in France, Wallace Stevens in the United States, Gottfried Benn in Germany, Fernando Pessoa in Portugal, Ramon Gomez de la Serna in Spain, Massimo Bontempelli in Italy, and Jorge Luis Borges in Argentina.

పదాలను కొంతమంది నైరూప్యమైన సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి ఒక మాధ్యమంగా మాత్రమే చూస్తారు..అంటే పదాల వెంబడి ప్రయాణిస్తూ ఒక నిర్దిష్టమైన గమ్యం చేరాలనుకుంటారు..కానీ పదాలు ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు ప్రతిబింబిస్తాయి గానీ గమ్యాన్ని చేర్చలేవు..
Hoff-mannsthal ఒక చోట అంటారట “Depth is hidden. Where? On the surface.” అని.
Wittgenstein మరికాస్త ముందుకెళ్ళి అన్నారటా,“For what is hidden … is of no interest to us. అని :) :)

Visibility :
టెక్నాలజీ,మీడియా సాహిత్యానికి చేస్తున్న కీడుని ప్రత్యేకించి ఇందులో ప్రస్తావించారు కాల్వినో ..విజువల్ మీడియా లేని కాలంలో జన్మించడం తనలాంటి వారికి వరంగా పరిణమించిందని అంటూ,3 నుండి 13 ఏళ్ళ లోపే ఆర్టిస్టుకు అవసరమైన ఊహాత్మకత ప్రాణం పోసుకుంటుందంటారు..కాల్వినో తల్లి ఆయన కోసం కొని బైండ్ చేసి ఉంచిన కామిక్స్ ను 3 నుండి 6 ఏళ్ళ లోపు వయసులో తాను చదవడం,పదాలు లేని చిత్రాలను చూస్తూ కథను ఊహించుకునే దిశగా 'స్కూలింగ్' లాంటిదంటారు.
నిత్యం టీవీలూ,కంప్యూటర్లూ, సినిమాలూ వెదజల్లే 'prefabricated images' మెదడులో ఒకదానిపై ఒకటి పేరుకుపోయి ఆలోచననూ,సృజనాత్మకతను నాశనం చేస్తున్నాయి..విజువల్ మీడియా బారినపడి సృజనాత్మకత అంతరించిపోతున్న నేటి తరంలో,సాహిత్యంలో మెదడుకి మేత లాంటి 'ఫెంటాస్టిక్' శైలి 21 వ శతాబ్దంలో సాధ్యమా అని ప్రశ్నిస్తారు.

Multiplicity :
రెండేళ్ళ క్రితం ఎప్పుడో కార్లో ఎమిలియో గడ్డా ను చదవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ను అర్ధం చేసుకోవడం నా వల్ల కాలేదు..ఆ స్థాయి సాహిత్యం అర్ధం కావడానికి మరికాస్త సమయం పడుతుందేమో అని నిరాశగానే పుస్తకం ప్రక్కన పెట్టేశాను..కానీ ఈ పుస్తకంలో కాల్వినో గడ్డా శైలిని గూర్చి చెప్పిన విషయాలు విన్నాకా హమ్మయ్య అనుకున్నాను..ఆయన శైలి అతి సంక్లిష్టం అట,ఇటాలియన్ లో చదివినా కూడా అంత సులువుగా కొరుకుడు పడేది కాదని అంటారు కాల్వినో.
'Multiplicity' అనే అంశం గురించి చర్చిస్తూ రాబర్ట్ ముసిల్ నూ,గడ్డా నూ పోల్చిన విధానం బావుంటుంది..విచారగ్రస్తుడైన గడ్డా శైలి సంక్లిష్టతల మధ్య చిక్కుకుని అంతంలేని వివరణాత్మక విశ్లేషణల్లో కొట్టుకుపోవడం అయితే,ముసిల్ శైలి ఏ విషయంతోను సంబంధం లేకుండా ఉంటూ,అన్ని అంశాల్లోనూ స్పష్టత ఉన్నట్లు ఉంటుందని అంటారు..కానీ ఈ ఇద్దరి విషయంలో ఉమ్మడిగా కనిపించే విషయమేంటంటే 'అంతాన్ని చేరుకోవడంలో వైఫల్యం'...అలాగే ప్రౌస్ట్ గురించి రాస్తూ మనం అందుకోలేని విధంగా ప్రపంచం మన అంచనాల్ని దాటి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది,and knowledge, for Proust, is attained by suffering this intangibility అంటారు..

Another very wrong idea that is also going the rounds at the moment is the equivalence that has been established between inspiration, exploration of the subconscious, and liberation, between chance, automatism, and freedom. Now this sort of inspiration, which consists in blindly obeying every impulse, is in fact slavery. The classical author who wrote his tragedy observing a certain number of known rules is freer than the poet who writes down whatever comes into his head and is slave to other rules of which he knows nothing.- Raymond Quineau.

మనసులోకి వచ్చింది వచ్చినట్లు రాయడం గురించి రాస్తూ,రచయిత మనసులో చెలరేగే ప్రతి అలజడికీ బానిసలా వ్యవహరించడం సరికాదంటారు..మరో చోట ప్రేరణ కలిగించే భావాల్ని ఒకదానితోనొకటి గుణిస్తూ పోతుంటే ఒక దశలో ఆ చిక్కుముడుల్లో రచయిత తన సహజసిద్ధమైన 'సెల్ఫ్' ని కోల్పోతాడేమో అని అనేవారికి సమాధానమిస్తూ,
But I would answer: Who are we, who is each one of us, if not a combinatoria of experiences, information, books we have read, things imagined? Each life is an encyclopedia, a library, an inventory of objects, a series of styles, and everything can be constantly shuffled and reordered in every way conceivable. అంటారు..

చివరగా ఒక చిన్న విషయం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను..ఒకానొకప్పుడు వంట నేర్చుకోవాలంటే వండడం తెలిసిన వారి దగ్గరో,లేదా వంటల పుస్తకాలు చదివో,గూగుల్ ని ఆశ్రయించో నేర్చుకునేవారు..ఉప్పూ,కారం,పులుపూ లాంటివి ముందుగా ఆ రంగంలో నిపుణుల్ని అనుసరించి కాస్త అటుఇటుగా అంచనాతో వేసినా చివర్లో తన రుచిమేరకు మరో పదార్ధమేదో కలిపితే మంచి వంటకం తయారవుతుంది..అలా చెయ్యగా చెయ్యగా కొంత కాలానికి వంట చెయ్యడంలో తన స్వంత మార్కు ఏర్పడుతుంది..ఏదైనా విషయంలో నైపుణ్యం సాధించాలనుకుంటే ఉన్న అవకాశాల్ని explore చెయ్యడం అవసరం..అలా కాదు,ఏ కళైనా ఒకరు నేర్పితే అబ్బేది కాదు మేము 'ప్రాడిజీలం',ఇవన్నీ పాతచింతకాయ వ్యవహారం అంటారా! అయితే మ్యాగీ,శాండ్విచ్ లాంటివి చాలా సులభంగా తయారవుతాయి. :) 

Friday, January 18, 2019

Cosmicomics - Italo Calvino

మనం కొత్తగా ఏదైనా చదివినప్పుడో,కొన్ని రచనల్ని గురించి చెప్పేటప్పుడో అసలిటువంటి రచన మునుపూ ముందూ చదివింది లేదని సులభంగా అనేస్తుంటాం..నూటికి తొంభై శాతం అతిశయోక్తి తప్ప అటువంటి ప్రకటనలో నిజాయితీ పాళ్ళు చాలా తక్కువ..కానీ ఇక్కడ 'ఇటాలో కాల్వినో' గురించి మాట్లాడుతున్నాం గనుక ఈ మాటలు తొణుకూ బెణుకూ లేకుండా ధైర్యంగా అనవచ్చు..'ఇటాలో కాల్వినో' బొత్తిగా పరిచయం అఖ్ఖర్లేని రచయిత,ఈ మధ్యే ఆయన కథలు 'కాస్మికామిక్స్' చదివాను..ఈ కథలు చదువుతుంటే,చిన్నప్పుడెప్పుడో గోరుముద్దలు తింటున్నప్పుడు విన్న చందమామ కథలేవో మళ్ళీ వింటున్నట్లు అనిపించింది,అమ్మ వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నడుస్తున్నప్పుడు ఇంతలేసి కళ్ళు విప్పార్చుకుని చూసిన ప్రపంచమేదో కలియతిరిగి మళ్ళీ చూసొచ్చిన భావన కలిగింది..'కాస్మి కామిక్స్' లాంటి కథల్ని నేనైతే మునుపూ ముందూ చదివింది లేదు.
Image Courtesy Google
ఈ పన్నెండు కథల్ని మిగతా కథల నుండి వేరుగా నిలబెట్టేవి కాల్వినో ఈ కథలకు ఎంచుకున్న కథావస్తువులు..ఏ కథనైనా సహజంగా అనగనగా ఒక రోజు అనో,అనగనగా ఒక దేశంలో అంటూనో,ఫలానా ఊరిలో ఫలానా వ్యక్తి అనో అప్పటి కాలమాన పరిస్థితుల్ని వివరిస్తూ ఆరంభిస్తారు..ఇటువంటి సంప్రదాయ శైలికి భిన్నంగా ఈ కథలన్నీ విశ్వంలో ఎక్కడో శూన్యంలో చిన్న బిందువు వద్ద మొదలవుతాయి..భూమి ఏర్పడ్డాక,జీవ పరిణామ సిద్ధాంతాల అనంతరం నాగరికత అంటూ మొదలైన తరువాత కథలు రాయడం వింత  కాదు..కానీ సంస్కృతి,నాగరికత,భాష,కాలం ఇటువంటి విషయాలేవీ లేకుండా భూమి,మానవాళి పుట్టక ముందు కథలెలా ఉంటాయో ఊహించడం కష్టం..ఇందులో కాల్వినో రాసిన కథలన్నీ ఈ ఊహకు రూపకల్పన చేసే దిశగా ఉంటాయి..చిహ్నాలు,భాష,సంఖ్యలు,కాలము,రూపు రేఖలు,అస్తిత్వం ఇలా ఏ మాధ్యమమూ లేని జీవుల ఉనికిని గూర్చిన కథలు ఇవి..అంటే ఏ ఆబ్జెక్ట్ లేకుండా స్పేస్ లో అల్లిన కథలన్నమాట..అన్ని కథలకూ backdrop ఒక 'శూన్యం'..ఒక ఖాళీ ఉపరితలాన్ని వేదికగా చేసుకుని,కథ చెప్తున్న వాళ్ళు మనుషులో,మరో గ్రహాంతర వాసులో లేక జంతువులో కూడా స్పష్టత ఇవ్వకుండా కథను చెప్పి మెప్పించడం అనే అసంభవమనిపించే విషయాన్ని ఇక్కడ సంభవం చేసి చూపించారు కాల్వినో.

ఇందులో అన్ని కథల్లోనూ ముఖ్య పాత్ర దాదాపు ఒక్కటే..ఆ పాత్ర పేరు కూడా విచిత్రం గా ఉంటుంది 'Qfwfq' ..మిగతా పాత్రలపేర్లు కూడా ఇలాగే ఉంటాయి..వందల వేల సంవత్సరాలు వయో పరిమితిగా కలిగిన ఈ పాత్రలు కొన్ని కథల్లో మనుషులైతే,కొన్నిట్లో నాలుగు కాళ్ళ జంతువులు,కొన్నిట్లో డైనోసార్లు,కొన్నిట్లో చేపలు,కప్పలు ఇలా రకరకాల జీవరాసులూను..ఈ కథల్లో గురుత్వాకర్షణ కూడా లేని చోట చరించే మనుషులూ (?),హైడ్రోజన్ పరమాణువుల్ని స్పేస్ లోకి విసిరేసే సరదా ఆటలు,నక్షత్రమండలాల్లో పోటీపడి ప్రదక్షిణలు చేసే జీవులూ,బూడిద రంగులో ఉండి గుర్తుపట్టడానికి సాధ్యం కాని ప్రపంచంలో చరించే జీవులూ లాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి..

మొదటి కథ 'The Distance of the Moon'..ఈ కథలో భూమ్మీద మనుషులకు చేతికందేంత దూరంలో తిరుగుతున్న చందమామ..కొందరు ఆ చందమామ మీద పెరుగు మీగడ లాంటి పదార్ధాన్ని సముద్రంలో అలలతో పోటీ పడుతూ చిన్న చిన్న పడవల మీద చందమామ మీదకు నిచ్చెనలేసుకుని వెళ్ళి తెస్తుంటారు.
I thought only of the Earth. It was the Earth that caused each of us to be that someone he was rather than someone else; up there, wrested from the Earth, it was as if I were no longer that I, nor she that She, for me. I was eager to return to the Earth, and I trembled at the fear of having lost it. The fulfillment of my dream of love had lasted only that instant when we had been united, spinning between Earth and Moon; torn from its earthly soil, my love now knew only the heart-rending nostalgia for what it lacked: a where, a surrounding, a before, an after.

మరో కథ 'At day break', లో వాతావరణం ఏర్పడక ముందు మనుషులు నెబ్యులా లోని ద్రవ పదార్ధపు పొరలక్రింద నివసిస్తూ ఉంటారు..నెబ్యులా కండెన్సేషన్ కారణంగా భూమీ మిగతా గ్రహాలూ ఆవిర్భవించడం వల్ల అక్కడ జీవరాశులు పడే ఇబ్బందుల్ని హాస్యం మేళవించి వర్ణిస్తారు.

There was no way of telling time; whenever we started counting the nebula’s turns there were disagreements, because we didn’t have any reference points in the darkness, and we ended up arguing. So we preferred to let the centuries flow by as if they were minutes.

‘We’re hitting something!’, a meaningless expression (since before then nothing had ever hit anything, you can be sure),

We never really understood which uncle was the husband and which the brother, or exactly how they were related to us: in those days there were many things that were left vague

'A sign in space' లో గుర్తులూ,సంజ్ఞలు,భాష ఇవేమీ లేని సమయంలో విశ్వంలో ఒక చిహ్నాన్ని ఏర్పాటు చెయ్యడానికి కథానాయకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు..
I couldn’t say I’ll make it the same or I’ll make it different, there were no things to copy, nobody knew what a line was, straight or curved, or even a dot, or a protuberance or a cavity.

All at one point: జీవరాశులన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకృతమైతే ? 'We all are packed 'like sardines' అంటాడు Qfwfq..
This was mere unfounded prejudice – that seems obvious to me – because neither before nor after existed, nor any place to immigrate from, but there were those who insisted that the concept of ‘immigrant’ could be understood in the abstract, outside of space and time.

‘Boys, the tagliatelle I would make for you!’, a true outburst of general love, initiating at the same moment the concept of space and, properly speaking,

Without colours: విశ్వం అంతా బూడిద రంగు తప్ప మరే రంగులూ లేని ప్రపంచం ఎలా ఉంటుందీ ? ఈ కథలో ఆ విచిత్రమైన ఊహకు ప్రాణం పోస్తారు కాల్వినో.
How could we understand each other? Nothing in the world that lay before our eyes was sufficient to express what we felt for each other, but while I was in a fury to wrest unknown vibrations from things, she wanted to reduce everything to the colourless beyond of their ultimate substance.

An aquatic uncle: ఈ కథలో జలచరాల్నీ,భూచరాలనీ వర్గీకరిస్తూ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని విశ్లేషించారు..ఈ కథలో మానవాళి జీవించడంలో ఆనందాన్ని పొందుతోందా లేక కేవలం ప్రాణరక్షణార్థం జీవిస్తోందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తుంది..కడుపుబ్బ నవ్విస్తూనే మార్పును స్వీకరించడం ఎంత అవసరమో హితవు చెప్తుంది.
According to my great-uncle, the lands that had emerged were a limited phenomenon: they were going to disappear just as they had cropped up or, in any event, they would be subject to constant changes: volcanoes, glaciations, earthquakes, upheavals, changes of climate and of vegetation. And our life in the midst of all this would have to face constant transformations, in the course of which whole races would disappear, and the only survivors would be those who were prepared to change the bases of their existence so radically that the reasons why living was beautiful would be completely overwhelmed and forgotten.

How much shall we bet ? : విశ్వంలో భూమీ,గ్రహాలూ ఇవేమీ ఏర్పడని సమయంలో అంతరిక్షంలో ఉన్న ఇద్దరు మిత్రులు భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతోందా అని అంచనాలు వెయ్యడం అనే అంశంపై నడిచే కథ.
‘Hurry, look at the way the planets are condensing: now tell me, which is the one where an atmosphere is going to be formed? Mercury? Venus? Earth? Mars? Come on: make up your mind! And while you’re about it, calculate for me the index of demographic increase on the Indian subcontinent during the British raj. What are you puzzling over?

And I think how beautiful it was then, through that void, to draw lines and parabolas, pick out the precise point, the intersection between space and time where the event would spring forth, undeniable in the prominence of its glow; whereas now events come flowing down without interruption, like cement being poured, one column next to the other, one within the other, separated by black and incongruous headlines, legible in many ways but intrinsically illegible, a doughy mass of events without form or direction, which surrounds, submerges, crushes all reasoning.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథా ఒక ఆణిముత్యమే..ఇక కాల్వినో శైలిని గురించి కాస్తైనా పొగడకపోతే ఈ వ్యాసం రాసిన తృప్తి నాకు మిగలదు :) కాల్వినో సిద్ధాంతం ఏంటంటే 'కాదేదీ కథకనర్హం'..ఆయన ఊహా ప్రపంచంలో కథావస్తువుల భాండాగారం ఏదో ఉన్నట్లుంది..ఆయన కథ రాయాలనుకున్నప్పుడు,ఒక చేత్తో ఆ భాండాగారంలో చెయ్యిపెట్టి చేతికందిన ఏదో ఒక వస్తువుని తీసుకుని,మరో చేత్తో కలాన్ని మంత్రదండంలా చేసి మంత్రిస్తే చాలు అక్షరాలు అద్భుతమైన కథనాలుగా రూపాంతరం చెంది,అలవోకగా గమ్యం దిశగా పరుగులు తీస్తాయి..అంతే,ఒక అద్భుతమైన కథ సిద్ధం అయిపోతుంది..ఎంత చెయ్యి తిరిగిన రచయితలైనా,ఒక సందర్భాన్ని వర్ణించడానికో,మరో సన్నివేశానికి జీవం పొయ్యడానికో సాధారణంగా పడే ప్రయాస,వారి వాక్యాల్లో అప్పుడప్పుడూ విసుగ్గా తొంగి చూస్తుంటుంది,కానీ కాల్వినో కథల్లో ఆ తెచ్చిపెట్టుకున్న ప్రయాస ఇసుమంతైనా కనిపించలేదు..తెచ్చిపెట్టుకున్న భావాలూ,కోరితెచ్చుకున్న పాత్రలూ,పదగాంభీర్యాలూ ఎంతమాత్రం ఉండవు..కథలు రాయడంలో కాల్వినో కనపరిచే 'ease' చాలా ప్రత్యేకం.

1963 నుండీ 1968 మధ్యలో రాసిన ఈ కథలు అమెరికా,రష్యా ల మధ్య 'స్పేస్ రేస్' జరుగుతున్న సమయంలో రాశారట..రియలిస్టిక్ ఫిక్షన్ అవసాన దశకి వచ్చిందని గ్రహించి ఊహాత్మకత పరిధులు పెంచే దిశగా ఈ నూతన శైలికి శ్రీకారం చుట్టారట కాల్వినో..ఇన్ని కథల్లో ఇష్టమైన కథేంటంటే చెప్పడం కష్టం..కానీ 'The Distance of the Moon','Dinosaurs' నాకు బాగా నచ్చాయి..ఈ కాస్మి కామిక్స్ లో కథలన్నీ అంతరిక్షం చుట్టూ తిరిగినా ప్రతి కథలోనూ ఒక మానవీయ కోణం కనిపిస్తుంది,విశ్వంలోని సమస్త జీవరాశుల గళం వినిపిస్తుంది..కాల్పనిక జగత్తులో అస్తిత్వవాదం కాస్త భారమైన వ్యవహారం,అటువంటి రచనలు చదవాలంటే కాస్త 'ఇన్సానిటీ' తో కూడిన మానసిక సంసిద్ధత అవసరం..కానీ వాటికి భిన్నంగా కాల్విన్ అండ్ హాబ్స్ కామిక్స్ లో కనిపించే సరళమైన హాస్యం ఈ కథల్లో కూడా కనిపిస్తుంది..గంభీరమైన విషయాల్ని సైతం సున్నితంగా చెప్తూ,కడుపుబ్బ నవ్విస్తూనే ఆలోచనలో పడేసే కథలు ఈ 'కాస్మి కామిక్స్'..మనసుకి ఆహ్లాదం,మెదడుకి ఆలోచన ఈ రెండూ ఒకేసారి అనుభవమవ్వాలంటే  ఈ కథలు చదవండి..DON'T miss them. 

Tuesday, January 8, 2019

Earth's Holocaust - Nathaniel Hawthorne

బోర్హెస్ 'బుక్ ఆఫ్ ఫాంటసీ' ఎట్టకేలకు ఆరంభించాను..అతి అనుకోకపోతే భారత,భాగవతాలను ఒకే పోస్టులో కుదించడం ఎంత అసాధ్యమో,ఈ బుక్ ఆఫ్ ఫాంటసీ గురించి ఒక్క పోస్టులో రాయాలనుకోవడం కూడా అంతే దుస్సాహసం..ఈ పుస్తకంలో ఫెంటాస్టిక్ శైలిలో మహామహులు రాసిన కథల్ని జార్జ్ లూయి బోర్హెస్,సెసారెస్,సిల్వినా ఒకేంపో వంటి సాహితీ దిగ్గజాలు జాగ్రత్తగా ఎంపిక చేసి ఒకచోట చేర్చారు మరి..దీనికి ఉర్సులా కే లెగైన్ ముందు మాట రాశారు..పోయిన సంవత్సరం రే బ్రాడ్బరీ,బోర్హెస్,ఉర్సులా కే లెగైన్,Krzhizhanovsky లాంటి కొందరు 'ఫెంటాస్టిక్' రచయితల్ని చదవడం తటస్థించింది..అదే  సమయంలో నాగరాజు పప్పు గారు చెప్పగా ఈ పుస్తకం గురించి తెలిసింది..ఈ పోస్టులో Nathaniel Hawthorne రాసిన 'Earth's Holocaust' అనే కథ గురించి చెప్పుకుందాం.
Image Courtesy Google
ఒకానొకప్పుడు మానవాళి తరతరాలుగా భద్రపరుచుకున్న విలువైన వస్తుసామాగ్రి భూమికి భారమైపోతోందని గ్రహించిన కొందరు,వ్యర్ధమైన ప్రతి వస్తువునీ నాశనం చెయ్యాలనే  నిర్ణయానికొస్తారు..ఇన్సూరెన్సు కంపెనీల ప్రాతినిథ్యంలో,ఎవరికీ హాని కలగని విధంగా, పశ్చిమ దిశగా భూమికి సరిగ్గా మధ్యలో ఉన్న సువిశాలమైన గడ్డిమైదానంలో ఒక మంటను ఏర్పాటు చేసి నిరుపయోగమైన వస్తువులన్నీ  అందులో తగలబెట్టాలని నిర్ణయిస్తారు..ఆ వేడుకలో భాగం పంచుకోడానికి భూమికి నలుమూలల నుండీ జనం పెద్ద ఎత్తున తరలివస్తారు..కాగా మరికొందరు కేవలం ఆ వేడుక తిలకించడానికే వస్తారు.. ఈ సన్నివేశానికంతటికీ ప్రత్యక్షసాక్షిగా ఉన్న పేరు తెలీని కథకుడు మనకు చిన్న చిన్న వివరాలతో సహా ఆ సంఘటనను వర్ణిస్తూ ఉంటాడు.

ఇక అగ్నికి ఆహుతి ఇవ్వడం ప్రారంభమవుతుంది..ముందుగా స్త్రీల విలువైన దుస్తులు,ఆభరణాలు మొదలు ఇంగ్లాండు రాణుల విలువైన వజ్రాల వరకూ,ఇండియా నుండి ఆంగ్లేయులు తీసుకెళ్ళిన అమూల్య ఆభరణాలు,వస్తువులు మొదలు ప్రాచీన మద్యం వరకూ పురాతన వస్తువులన్నిటినీ ఆ మంటల్లో వేస్తారు..తదుపరి యుద్ధరంగంలో విజయకేతనాలు ఎగురవేసిన వీరుల గుర్తుగా పదిలపరిచిన ఆయుధాలన్నింటితో పాటుగా భవిష్యత్తులో యుద్ధాలకు అవసరమైన ఆయుధాలన్నిటినీ కూడా ఆకాశానికి ఎగసిపడుతున్న అగ్నిశిఖల్లో వేస్తారు..ఆ విధంగా యూరోపు సార్వభౌమత్వపు చిహ్నాలు మొదలు,నెపోలియన్ 'లెజియన్ ఆఫ్ ఆనర్' వరకూ అన్నీ అగ్నికి ఆహుతవుతాయి..ఈ ఆయుధాలను మంటల్లో వేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక మాజీ కమాండర్ పెదాలపై చిరునవ్వు చూసిన ప్రొటొగోనిస్ట్ ఎందుకు నవ్వుతున్నారని అడిగితే
'When Cain wished to slay his brother,he was at no loss for a weapon' అంటాడతను..కేవలం ఆయుధాలను మంటల పాలు చేస్తే యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొంటుందా అనేది అతని ప్రశ్న !!

ఇక తరువాతి వంతు సాహిత్యానిది..ఈ కథలో ఈ భాగం చదివి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను..ముద్రణలో ఉన్న ప్రతి కాగితాన్నీ,వోలటైర్ గ్రంధాలు మొదలు బైబిల్ వరకూ,షెల్లీ కవిత్వం మొదలు ఆనాటి వరకూ ముద్రితమైన సమకాలీన సాహిత్యం వరకూ ఏమీ మిగలకుండా అగ్నికి ఆహుతి చేస్తారు..ఇక్కడ పుస్తక ప్రేమికుల వ్యధ హాస్యం పండిస్తుంది..పుస్తకాల పురుగులపై రచయిత సంధించిన వ్యంగ్యాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు :)
‘Alas! and woe is me! thus bemoaned himself a heavy-looking gentleman in green spectacles. ‘The world is utterly ruined, and there is nothing to live for any longer. The business of my life is snatched from me. Not a volume to be had for love or money!’    ‘This,’ remarked the sedate observer beside me, ‘is a bookworm—one of those men who are born to gnaw dead thoughts.His clothes, you see, are covered with the dust of libraries. He has no inward fountain of ideas; and, in good earnest, now that the old stock is abolished, I do not see what is to become of the poor fellow. Have you no word of comfort for him?’

‘My dear sir,’ said I to the desperate bookworm, ‘is not Nature better than a book? Is not the human heart deeper than any system of philosophy? Is not life replete with more instruction than past observers have found it possible to write down in maxims? Be of good cheer. The great book of Time is still spread wide open before us; and, if we read it aright, it will be to us a volume of eternal truth.’

‘Oh, my books, my books, my precious printed books!’ reiterated the forlorn bookworm. ‘My only reality was a bound volume; and now they will not leave me even a shadowy pamphlet!’    In fact, the last remnant of the literature of all the ages was now descending upon the blazing heap in the shape of a cloud of pamphlets from the press of the New World. These likewise were consumed in the twinkling of an eye, leaving the earth, for the first time since the days of Cadmus, free from the plague of letters- an enviable field for the authors of the next generation.

కొన్ని చోట్ల కవులూ,రచయితలూ కూడా భుజాలు తడుముకోవలసివస్తుంది..
‘Could a poet but light a lamp at that glorious flame,’ remarked I, ‘he might then consume the midnight oil to some good purpose.’
‘That is the very thing which modern poets have been too apt to do, or at least to attempt, answered a critic. ‘The chief benefit to be expected from this conflagration of past literature undoubtedly is, that writers will henceforth be compelled to light their lamps at the sun or stars.

The truth was, that the human race had now reached a stage of progress so far beyond what the wisest and wittiest men of former ages had ever dreamed of that it would have been a manifest absurdity to allow the earth to be any longer encumbered with their poor achievements in the literary line.

రచయిత ప్రజాదరణ పొందినదంతా సాహిత్యం కాదని అంటున్నట్లున్నారు :)
It was not invariably the writer most frequent in the public mouth that made the most splendid appearance in the bonfire

పనిలో పనిగా ఈ భాగంలో సాహిత్యానికి కూడా అగ్నిపరీక్ష పెడతారు రచయిత..మంటల్లో పుస్తకాలు కాలిన విధాన్ని బట్టి రచనల నాణ్యతను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు..ఆ క్రమంలో షెల్లీ రచనలు అన్నిటికంటే స్వచ్ఛమైన ప్రకాశవంతమైన మంటలుగా ఎగసిపడ్డాయంటారు..లార్డ్ బైరన్ రచనలు సంచలనాత్మకంగా,చంచలత్వంతో నల్లటి పొగలుగా ప్రకాశించాయంటారు..ఆంగ్ల సాహిత్యం మంచి ఇంధనంగా మారగా,షేక్స్పియర్ రచనలు ఆ అగ్నిలో సూర్యకాంతిని తలదన్నేలా అగుపించాయంటారు..అన్నిటికంటే ముఖ్యంగా జర్మన్ కథలు కాలుతుంటే 'brimstone scent' వాసనొచ్చాయనడం అద్భుతం (హీబ్రు బైబిల్ లో 'fire & brimstone' దేవుని ఆగ్రహాన్ని సూచిస్తుందట)..ఇదంతా చెప్పి ఎన్ని ఉద్గ్రంధాలైనా Mother Goose 's మెలోడీస్ కి సరిసాటి రాలేదంటారు.

The small, richly gilt French tomes of the last age, with the hundred volumes of Voltaire among them, went off in a brilliant shower of sparkles and little jets of flame; while the current literature of the same nation burned red and blue, and threw an infernal light over the visages of the spectators. converting them all to the aspect of party-coloured fiends.

కానీ ఆ వేడుకను తిలకిస్తున్నవారిలో తీవ్ర నిరసన గళాలు కూడా వినిపిస్తాయి..అంతా ముగిశాక
నిర్వాహకులు ఆనాటినుండి భూమిపై అందరికీ సమాన హక్కు ఉంటుందనీ,అసమానత్వాలకూ,తత్ఫలితంగా రక్తపాతానికీ తావీయని శాంతిని నెలకొల్పామనీ  సంబరాలు చేసుకుంటారు..కానీ మతగ్రంధాల్ని మంటల పాలు చేసినంత మాత్రాన మతం అంతరించిపోతుందా ? ఆయుధాల్ని ఆహుతి చేస్తే యుద్ధం ఆగిపోతుందా ? రాతప్రతుల్ని దహనం చేస్తే భావాలు నశించిపోతాయా ? ఇలా పాఠకుల్లో పలు ప్రశ్నలు తెలెత్తుతాయి..చివరికొచ్చేసరికి కొందరు వ్యక్తుల సంభాషణ మన కథకుణ్ణి ఆలోచనలో పడేస్తుంది..ఈ తంతు అంతా వ్యర్థం అనీ,ఇది పాత ప్రపంచానికి కేవలం ముగింపు అనీ,మనిషి 'మనసు' ఉన్నంతవరకూ ఇలాంటివి ఎన్ని చేసినా నిరుపయోగమనీ అక్కడున్న వ్యక్తుల్లో ఒకరు అంటారు..శుద్ధి చేసుకోవాల్సినది మానవ మస్తిష్కమనీ,ప్రక్షాళన చేసుకోవలసినది మానవ హృదయమే గానీ మరొకటి కాదనీ కథకుడు తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
So long as you possess a living soul, all may be restored to its first freshness. These things of matter and creation of human fantasy are fit for nothing but to be burned when once they have had their day; but your day is eternity!’

ఏదైనా కథ చదివాకా కేవలం అందులో పాత్రలూ,సన్నివేశాలూ మాత్రమే గుర్తు రాకూడదు..చదివిన  చాలాసేపటి వరకూ కూడా కథ తాలూకు ఆలోచనలు వెల్లువెత్తి పాఠకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి..కథ ముగిశాక కూడా పాఠకుణ్ణి తన కాల్పనిక ప్రపంచంలో ఎక్కువసేపు కట్టి పడెయ్యగలిగే ప్రతిభ  గొప్ప రచయితలకు మాత్రమే ఉంటుంది..పుస్తకం ప్రక్కన పెట్టిన తరువాత పాఠకులు తమ  ఊహలకు రెక్కలిస్తూ,ఆ ఆలోచనల చిక్కు ముడుల్ని ఒక్కొక్కటీ జాగ్రత్తగా విడదీసి చూసినప్పుడు సారాంశం తేటతెల్లమవ్వాలి..అప్పుడు ఒక మంచి కథ చదివామనే సంతృప్తి పాఠకులకు మిగులుతుంది..నిస్సందేహంగా అటువంటి సంతృప్తిని మిగిల్చే కథ ఈ 'Earth's Holocaust'.

Friday, January 4, 2019

The Toughest Indian in the World - Sherman Alexie

ఒకవైపు మూలాల్ని భద్రంగా పొదివిపట్టుకుంటూ మరోవైపు ఆధునీకరణను అందిపుచ్చుకునే ఏ  సమాజానికైనా,ఏ జాతికైనా ఆ పరిణామక్రమంలోని సంధికాలం చాలా కీలకమైనది..ప్రపంచీకరణ అన్ని జాతుల్నీ,మనుషుల్నీ ఒకే చూరు క్రిందకి తెస్తూ తన పని తాను చేసుకుపోతున్నా కూడా,కాలగతికి ఎదురీదైనా సరే తమ సంస్కృతిని అంతరించిపోకుండా కాపాడుకోవాలనే వెఱ్ఱి తపన,మూలాలతో పెనవేసుకుని జీవిస్తూ,మట్టి వాసనతో కూడా తన అనుబంధాన్ని నెమరువేసుకునే ప్రతి సగటు మనిషిలోనూ కనిపిస్తుంది..అటువంటి ఒక సంస్కృతి నేటివ్ అమెరికన్లది..వీరిని అమెరికన్ ఇండియన్లు అని కూడా అంటారు..మళ్ళీ ఇందులో కూడా స్పోకేన్,అపాచీ వంటి పలు తెగలుంటాయి..ఈ తెగలు 'రిజర్వేషన్స్' లో సమూహాలుగా నివసిస్తారు..Spokane-Coeur d'Alene తెగకు చెందిన అమెరికన్ రచయిత షెర్మాన్ అలెక్సీ రాసిన 'The Toughest Indian In The World' 2000 వ సంవత్సరంలో ప్రచురించబడింది.
Image Courtesy Google
షెర్మాన్ అలెక్సీ కథలు స్పోకేన్ (Spokane) ఇండియన్ తెగకు చెందిన నేటివ్ అమెరికన్ల జీవన విధానాలకూ,అంతఃసంఘర్షణలకూ అద్దం పట్టేవిగా ఉంటాయి..ఆయన రాసిన The Absolutely True Diary of a Part-Time Indian ని చదివి ఆరేళ్ళు పైగానే అయ్యింది..అయినా
"Well, life is a constant struggle between being an individual and being a member of the community." అని అందులో గోర్డీ అన్నమాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి..ఇందులో కూడా అలెక్సీ కథలన్నీ గోర్డీ అన్న ఆ మాటల పునాదుల మీద నిలబెట్టినవే..ఈ కథలన్నీ రిజర్వేషన్ లలో నేటివ్ అమెరికన్ వ్యవస్థలో నుండి వచ్చి,ఆధునికీకరణలో భాగంగా కొత్త ప్రపంచంలో తమ ఉనికిని చాటుకునే క్రమంలో ఎదురైన సంఘర్షణల నేపథ్యం నుండి పుట్టుకొచ్చాయి..ఇందులో ఇండియన్ల పాత్రల్లో తెల్లజాతీయుల చేతిలో జాతి వివక్షకు గురై,దుర్భరమైన జీవితాల్లోంచి వచ్చినా కూడా,దొరికిన చిన్న చిన్న అవకాశాల్ని అందిపుచ్చుకుని సమాజంలో తమ ఉనికిని చాటుకోవాలనే తపన కనిపిస్తుంది..ఇందులో మొత్తం తొమ్మిది కథలున్నాయి.

మొదటి కథ Assimilation జాత్యాంతర వివాహాల నేపథ్యంలో నేటివ్ అమెరికన్ల,తెల్లజాతీయుల వ్యవస్థల్లో మారిన సమీకరణాలపై దృష్టిసారిస్తుంది..

Jeremiah’s virtue was reasonably intact, though he’d recently been involved in a flirtatious near-affair with a coworker. At the crucial moment, when the last button was about to be unbuttoned, when consummation was just a fingertip away, Jeremiah had pushed his potential lover away and said I can’t, I just can’t, I love my marriage. He didn’t admit to love for his spouse, partner, wife. No, he confessed his love for marriage, for the blessed union, for the legal document, for the shared mortgage payments, and for their four children.

Lynn and Jeremiah had often discussed race as a concept, as a foreign country they occasionally visited, or as an enemy that existed outside their house, as a destructive force they could fight against as a couple, as a family. But race was also a constant presence, a house-guest and permanent tenant who crept around all the rooms in their shared lives, opening drawers, stealing utensils and small articles of clothing, changing the temperature.

పుస్తకం టైటిల్ అయిన రెండో కథ 'The toughest Indian in the world' ,ఒక న్యూస్ పేపర్  జర్నలిస్టుగా పనిచేసే ప్రొటొగోనిస్ట్ తమ రిజర్వేషన్స్ కి తిరిగి వెళ్ళే ఇండియన్లకు తరచూ లిఫ్ట్ (హిచ్ హైకింగ్) ఇస్తుంటాడు..ఆ క్రమంలో ఒక వృద్ధుడైన ఇండియన్ స్ట్రీట్ ఫైటర్ ని మార్గమధ్యంలో కలిసిన నేపథ్యంలో వారిద్దరి మధ్యా జరిగే సంభాషణలూ,సంఘటనలూ పాత-కొత్త తరాల అంతరాల్ని ఎత్తి చూపుతూనే,ఆ రెండిటినీ పరోక్షంగా ముడివేసి ఉంచే సంస్కృతి మూలాల్ని గుర్తుచేస్తాయి..ఈ కథలో ఒక ఇండియన్ ని కారు ఎక్కించుకున్న తరువాత అతనితో మాట కలుపుతూ “You’re a fighter, enit?” అని రిజర్వేషన్ colloquialism ని వాడుతూ తానూ కూడా జన్మతః ఇండియన్ అనీ,రిజర్వేషన్ లో  పుట్టిపెరిగానని చెప్పడానికి ప్రయత్నించే సందర్భంలో 'belongingness' కోసం మనిషి పడే తపన కనిపిస్తుంది..ఆ ఫైటర్ తో మనసువిప్పి తన భావాలన్నీ చెప్పాలనుంది అనడంలో మనిషి ఎన్ని శిఖరాలు అధిరోహించినా,ఎక్కడ ఉన్నా తన అస్తిత్వాన్ని మాత్రం మర్చిపోలేడని అనిపిస్తుంది..ఫైటర్ తన దారిన తాను వెళ్ళిపోయాక  "At that moment,if you had broken open my heart you could have looked inside and seen the thin white skeletons of one thousand salmon." అంటాడు..(Spokane Indian tribe also called Salmon people)..అలెక్సీ కథల్లో ముఖ్య పాత్రలన్నీ మూలలను పట్టుకువెళ్ళాడే సగటు సెంటిమెంటలిస్టులే.

That was how I learned to be silent in the presence of white people. The silence is not about hate or pain or fear. Indians just like to believe that white people will vanish, perhaps explode into smoke, if they are ignored enough times. Perhaps a thousand white families are still waiting for their sons and daughters to return home, and can’t recognize them when they float back as morning fog.

He hugged his backpack more tightly, using it as a barrier between his chest and the dashboard. An Indian hitchhiker’s version of a passenger-side air bag.

“Thanks for the ride, cousin,” he said as he climbed out. Indians always call each other cousin, especially if they’re strangers.

మూడో కథ Class లో తెల్లజాతీయురాలు సుసాన్ ని పెళ్ళి చేసుకున్న ప్రొటొగోనిస్ట్ జెరోనిమో(ఇండియన్) ,భార్య వివాహేతర సంబంధం మరియు బిడ్డను పోగొట్టుకున్న విరక్తి కారణంగా  ఒక రాత్రి ఒంటరితనంతో chunk అనే కేఫ్ కి వస్తాడు,అక్కడ జూనియర్ అనే స్ట్రీట్ ఫైటర్ తో కావాలనే గొడవకు దిగుతాడు..చివరకు తనకున్నదేమిటో,తన సాటి ఇండియన్లకు లేనిదేమిటో తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు..తన సమాజంనుండి బయటపడి తాను పొందినదేంటో,అక్కడే జీవిస్తున్నవారు ఎటువంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుని తన జీవితానికి కృతజ్ఞత చెప్పుకునే కథ ఇది..స్ట్రీట్ ఫైటర్ జూనియర్ తో ఎందుకు గొడవపడ్డావు అని జెరోనిమోని అడిగితే "I wanted to be with my people" అంటాడు..ఏ జాతి వాడైనా తన సమూహం లో ఒకడిగా మసలాలని కోరుకుంటాడు,ఫెలోషిప్ కోసం తపన పడతాడు..ఈ కథలో ప్రొటొగోనిస్ట్ లో కనిపించే వేదన కూడా అదే.

Personally, I like bottled water, with gas, as the Europeans like to say. If I drink enough of that bubbly water in the right environment, I can get drunk. After a long night of Perrier or Pellegrino, I can still wake up with a vicious hangover. Obviously, I place entirely too much faith in the power of metaphor.

I decided that her face resembled most of the furniture in the bar: dark, stained by unknown insults, and in a continual state of repair.

మరో కథ The Sin Eaters లో జోనా అనే బాలుణ్ణి నేటివ్ అమెరికన్ల తెగను కొనసాగించడానికి సాధనంగా వాడుకోవడం అనే అంశం పై డిస్టోపియన్ శైలిలో నడుస్తుంది..ఇది అలెక్సీ స్థాయికి దరిదాపుల్లో లేని కథ అనిపించింది..అన్నిటిలోనూ అస్సలు నచ్చని కథ ఇదే.

Indian Country అనే ఇంకో కథలో సారా(ఇండియన్) ,ట్రేసీ (తెల్లజాతీయురాలు) అనే ఇద్దరు లెస్బియన్లు వివాహం చేసుకోవాలనుకుంటారు..సారా తల్లిదండ్రులు Sid,Estelle తమ సంప్రదాయాల్ని కాదంటున్న సారా మనసు మార్చడానికి విఫలయత్నం చేస్తారు..అంతరించిపోతున్న తమ సంస్కృతిని పరిరక్షించుకోలేని ఒక జాతి నిస్సహాయతనూ,వైఫల్యాన్ని చూపించడంతో పాటు,కాలానికి అనుగుణంగా మార్పును కోరుకుంటూ మరో ప్రపంచంలోకి స్వేచ్ఛగా రెక్కలు విప్పుకుంటున్న ఆధునిక తరాన్ని కూడా పరిచయం చేస్తుంది.

ఈ పుస్తకం నేటివ్ అమెరికన్ సంస్కృతితో లోతుగా పెనవేసుకుని పోయిన జీవితాలకు అద్దం పడుతుంది..కాల్పనిక జగత్తులో రిజర్వేషన్స్ లో పుట్టి పెరిగిన నేటివ్ అమెరికన్ల జీవితాలను షెర్మాన్ అలెక్సీ అంత చక్కగా పట్టుకున్న రచయిత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు..జాతి విద్వేషాలు మనుషుల్లో రెకెత్తించే భయాలూ,భ్రమలూ,అభద్రతా భావాలూ,అంతఃసంఘర్షణలూ తెలియాలంటే షెర్మాన్ అలెక్సి లాంటి వారిని చదవాలి..ఈ కథలు దళితవాదాన్నీ,స్త్రీవాదాన్నీ,నల్లజాతీయుల కథల్నీ జ్ఞప్తికి తెస్తాయి..విశ్వాన్ని సమూహాలకు కుదించి వేసిన కారణాలు ఇలాంటి కథల్లో దొరుకుతాయి..ఇందులో కథలు చాలా కాలం క్రితం చదివిన జె.డి వాన్స్ రాసిన Hillbilly Elegy ,Viet Thanh Nguyen 'The Sympathizer' లాంటి రచనల్ని తలపించాయి.

ఈ పుస్తకంలో జాతి దురహంకారానికి బలైన వ్యవస్థలోని జీవితాలు కొన్ని కథల్లో కనిపిస్తే,ఆ వైషమ్యాలు కాలగతిలో కనుమరుగైపోతున్నాయన్న స్పృహ కలిగిన ఆధునిక తరానికి చెందిన వ్యక్తులు మరికొన్ని పాత్రల్లో కనిపిస్తారు..తమ చరిత్రనూ,సంస్కృతినీ అందమైన ఆల్బంలా భద్రపరుచుకుని,జ్ఞాపకాల పుటలు తిరగవేసేవారు మరికొన్ని కథల్లో కనిపిస్తారు..స్పోకేన్ ఇండియన్లకు ఇష్టమైన తాతమ్మలూ,అమ్మమ్మల నాటి నుండీ ప్రియమైన 'సాల్మన్ మష్' వంటకం గురించీ,వారి సంస్కృతిలో భాగమైన Powwow సమావేశాల గురించీ,హిచ్ హైకర్లు (hitchhikers),'49s' సంగీతం గురించీ ఇలా ఇండియన్ల సంస్కృతిని ప్రతిబింబించే సంగతులెన్నో ఈ కథల్లో ఉంటాయి..అక్కడక్కడా ఒకే అంశాన్ని తిప్పి తిప్పి చెప్పడం విసుగనిపించినా అలెక్సీ మార్కు వ్యంగ్యాస్త్రాలు,హాస్యం అలవోకగా పండించే శైలీ కథలకు జీవం పోస్తాయి.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు..

South by Southwest కథ నుండి..
Indians will love anything if given the chance. I loved our house. I cried whenever I left it. I never wanted to leave it. I wanted to grow old in that house. I wanted to become the crazy elder who’d lived in the same house for all of his life. When I died there, I wanted to have ninety years of stories hanging in the closets.

He leaned in close to me. I could smell him. He smelled like the water and trees of home.

“Yes, you are, you’re a worm. You’re less than a worm to them. You’re an exile, you’re a leper, you’re a pariah, you’re a peon, you’re nothing to them. Nothing."

భారతీయుల్ని,నేటివ్ అమెరికన్ ఇండియన్లనీ అలెక్సీ వర్గీకరించిన తీరు :)
“Indian dot-in-the-head or Indian arrow-in-the-heart?”

Grandmother and grandson sat in the small kitchen of her home—their home!—and found no need to speak to each other. Because they were Indians, they gave each other room to think, to invent the next lie, joke, story, compliment, or insult. He ate; she watched.

You’ve colonized Indian land but I am not about to let you colonize my heart and mind