Only that which is human can be truly alien.The rest is all mixed forests, the burrowing of moles, and wind. - Wisława Szymborska.
ఆధునిక సాహిత్యంలో పాఠకుల ఊహాత్మకతకు రెక్కలు కత్తిరించెయ్యడం రచయితలకు అత్యంత ఇష్టమైన హాబీ అయిపోయింది. ఏం చెప్పినా కొంచెం కూడా అనిశ్చితికి తావివ్వకుండా అన్నిటికీ స్పష్టమైన నిర్వచనాలిచ్చెయ్యాలన్న తపనే నేటి రచనల్లో ఎక్కువ కనిపిస్తోంది. ఈ మధ్య చూసిన కొన్ని సినిమాల్లో సైతం హింసను భయంగొల్పేలా కంటే ఏవగింపు కలిగే విధంగానే ఎక్కువ చూపిన విధానం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ మధ్య ఒక రీడర్స్ వెబ్సైటులో సాహిత్యాన్ని పలు విభాగాలుగా చేస్తూ నేటి ఆధునిక యువతకు వీలుగా అనేక ఆప్షన్స్ పెట్టారు. జాగ్రత్తగా గమనిస్తే అందులో లేని విభాగం ఒక్కటే, "ఎస్తెటిక్స్".
Image Courtesy Google |
ఇదీ కాకపోతే పాఠకుణ్ణి బలవంతంగా ఏదో ఒక చట్రంలో ఇమిడ్చే ప్రయత్నంతోనో, అనేక ఫర్మానాలూ, తీర్మానాలతోనో కూడిన రచనలే ఎక్కువ. వైల్డ్ లాంటి అనేకమంది కళాకారులు అభిప్రాయపడ్డట్లు కళ యొక్క పారమార్థికతే "మనిషి స్వేచ్ఛ" అనుకుంటే, ప్రస్తుతం సాహిత్యం మొదలు అన్ని కళలూ దానికి దూరంగానే జరుగుతున్నాయి. నిజానికి ఏ వాదానికీ, సిద్ధాంతానికీ లొంగనీ, కట్టుబడనీ కళకు ముడిసరుకంటూ దొరకని (?) ఆధునిక సమాజంలోని మనిషి నుండి అంతకంటే గొప్ప కళను ఆశించడం గొంతెమ్మ కోరికే కావచ్చు. కానీ ఠాగోర్, రూమీ, మేరీ ఆలివర్, విస్లవా వంటి కొందరు విశ్వకవులు అవి గొంతెమ్మ కోరికలు కావని పదే పదే నిరూపిస్తునే ఉంటారు.
ఏదేమైనా ఉన్నదాన్ని ఉన్నట్లు నిజాల్ని కుప్పపోసి డాక్యుమెంట్ / జర్నల్ చేస్తూ హేతువాదపు చర్నాకోల ఝుళిపించే రచనలో, లేదా ఆధునిక మానవుడిలో ఒక చిన్న భావోద్వేగాన్నీ, ప్రతిస్పందననూ కలిగించలేని అంతరించిపోయిన భావజాలాలను దట్టించిన రచనలో తప్ప, ఈకాలంలో ఏ ఇరుకిరుకు 'ఇజాల' చిక్కుముడుల మధ్యా చిక్కుకోని రచనలు బహు అరుదనే చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో పోలిష్ రచయిత్రీ, నోబెల్ గ్రహీతా విస్లవా సిమ్బోర్స్కా రచనలు ఆ లోటును పూర్తిగా తీర్చేస్తాయి. "Sounds, Feelings, Thoughts" పేరిట పోలిష్ నుండి ఆంగ్లంలోకి అనువదించిన విస్లవా డెబ్భై కవితల్ని చదువుతుంటే మునుపటిలాగే ఆవిడ మన ఉనికి ఈ విశ్వంలో ఒక చిన్న పరమాణువంత మాత్రమే అనే నిజం గుర్తుచేస్తున్నట్లు అనిపించింది. ఏ ఒక్క జాతికీ, సమూహానికీ, వర్గానికీ, వాదానికీ కట్టుబడని మనిషి అనుభవించేది మాత్రమే నిజమైన స్వేచ్ఛ అని ఇందులో విస్లవా ప్రతీ కవితా మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది.
After so many eras of not being here ?For all times and tides, for all vegetations ?For all the crustaceans, for all constellations ?Just at this moment ? Right down to the marrow ?Alone at my place with myself ?
సమస్త జంతుజాలంతో కూడిన ప్రకృతి మొదలు మనిషి వరకూ మనమంతా ఒకే తానులో ముక్కలమనీ, జీవావరణ, పర్యావరణ వ్యవస్థల్ని అన్నిటినీ ఒక్కటిగా చూడడం అవసరమని నమ్మే కవులూ, రచయితలూ ఇప్పుడెక్కడ ? నేటి రచయితల కలాలు వర్గీకరణల గీతలు గీయడంలో కనబరిచే నైపుణ్యం మనిషినీ,మనిషినీ కట్టి ఉంచే స్నేహం, సౌభ్రాతృత్వం, సహనం వంటి అంశాలను అక్షరాల్లో పొందుపరచడం విస్మరిస్తున్నారేమోననిపిస్తుంది ! బహుశా అందుకే కావచ్చు, కాల్పనిక ప్రపంచాలకు ఆనాటి జాతివైషమ్యాల మొదలు నేటి అస్తిత్వవాదాల వరకూ అన్నీ ప్లేగు వ్యాధిలా పట్టుకోగా కళ యొక్క పారమార్థికతను పూర్తిగా బుట్టదాఖలు చేసిన పుంఖానుపుంఖాల రచనల మధ్య విస్లవా వంటి కవయిత్రులులను చదవడం ఎంతో హాయిగా అనిపించింది.
I apologize to everything that I cannot be everywhere.I apologize to everyone that I cannot be every man and woman.I know that as long as I live nothing can justify me,because I myself am an obstacle to myself.
ఇందులో డెబ్భై కవితల మధ్యా మునుపు చదివిన కొన్ని కవితలు మళ్ళీ కనిపించాయి కానీ అనువాదకులు వేరవ్వడంతో నాకు పాత అనువాదాల్లోనే పదాల అమరిక బాగున్నట్లు అనిపించింది. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన 'ట్రూ లవ్', "థాంక్యూ నోట్" లాంటి కవితల్ని ఇందులో 'ఎ హ్యాపీ లవ్', 'గ్రాటిట్యూడ్' పేరిట చేసిన అనువాదాలు అంతగా రుచించలేదు. ప్రత్యేకం విస్లవా రచనల అనువాదాల విషయంలో Stanislaw Baranczak, Clare Cavanagh చేసిన అనువాదాలు బావుంటాయి. ఇది ప్రక్కన పెడితే ఎప్పుడైనా అనువాదాల విషయంలో భాష పట్ల ఎక్కువ పట్టున్న పాతతరం అనువాదకుల వైపు మొగ్గుచూపడం నాకు అలవాటు.
విశ్వ ప్రేమ అన్నాను కదాని విస్లవా రచనల్లో వర్గీకరణలుండవనుకుంటే పొరపాటే. ఎటొచ్చీ విస్లవా కవితల్లో కనిపించే గీతలు నేటి మానవ సమాజపు వర్గీకరణల కంటే భిన్నమైనవి. అవి ప్రాపంచిక దృక్పథానికి పెద్దపీట వేస్తూ మనిషికీ-సమాజానికీ, మనిషికీ-ప్రకృతికీ, మనిషికీ- మనిషికీ మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తూ, ఆ సంబంధాలను విచ్ఛిన్నం చేసే దిశగా కాకుండా, పటిష్టంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి. ఈ పుస్తకంలో Portrait of a Woman, Utopia, In Praise of My Sister, Experiment, The Museum లాంటి కొన్ని జెమ్స్ ఒకదాన్ని మించి మరొకటిగా అనిపిస్తాయి. వీటిల్లో ఫలానా కవిత ఇష్టమని చెప్పడమంత కష్టం మరొకటి లేదు. :)
ఏదేమైనా అన్నిటినీ తర్కానికి పెట్టరాదు, ఎన్టీరామారావ్, సారీ మాయాబజార్లో శ్రీకృష్ణుడు కూడా "రసపట్టులో తర్కం కూడదన్నాడు" మరి. కొన్నిటిని ఆస్వాదించి వదిలెయ్యాలి, మరి ముఖ్యంగా ఇటువంటి కవిత్వాన్ని. ప్రతీదాన్నీ తర్కానికి పెడితే ఎంత అద్భుతమైన కావ్యమైనా కూడా రసవిహీనం అయిపోతుంది. ఇక విస్లవా కవిత్వం గురించి మునుపు కొన్ని వ్యాసాల్లో రాశాను కాబట్టి ఈ పోస్ట్ లో నాకు నచ్చిన కొన్ని కవితల గురించి మాత్రం ప్రస్తావిస్తాను.
"Advertisement" అనే కవిత నిలకడలేని కోతిలా నిరంతరం భోగవిలాసాల్లోనో, మత్తులోనో మునిగితేలే నేటి ఆధునిక మానవుడి దుస్థితిని అచ్చంగా ప్రతిబింబిస్తుంది. ఆధునిక మానవుడిలో నేను నేననే అహంభావంతో దేవుడి పట్ల లోపించిన నమ్మకాన్నీ (లాస్ ఆఫ్ ఫెయిత్), తత్పరిణామంగా అతడు ఎదుర్కునే సోషల్ ఏంగ్జైటీనీ ప్రతిబింబిస్తుందీ కవిత. తనను తాను క్షణమైనా భరించలేని ఆత్మలేని దేహాల డొల్లతనాన్ని బయటపెడుతుంది.
Advertisement :
I am a tranquilizer.
I am effective at home,
I work well at the office,
I take exams,
I appear in court,
I carefully mend broken crockery—
all you need do is take me,
dissolve me under the tongue,
all you need do is swallow me,
just wash me down with water.
I know how to cope with misfortune,
how to endure bad news,
take the edge off injustice,
make up for the absence of God,
help pick out your widow’s weeds.
What are you waiting for—
have faith in chemistry’s compassion.
You’re still a young man/woman,
you really should settle down somehow.
Who said
life must be lived courageously?
Hand your abyss over to me—
I will line it with soft sleep,
you’ll be grateful for
the four-footed landing.
Sell me your soul.
There’s no other buyer likely to turn up.
There’s no other devil left.
కొన్నిసార్లు అది ప్రేమైనా, వైరమైనా మనిషికి తోటి మనిషి తోడు ఎంత అవసరమో చెబుతున్నట్లున్న ఈ వాక్యాలు చూస్తే,
Did someone have someone to love?
Did someone have someone to fight with?
Did everything happen or nothing
there or not there ? అని తనకేమీ తెలీనట్లు చాలా అమాయకంగా అడగడం ఆవిడకే చెల్లుతుంది.
ఇక ఈ క్రింది కవిత భలే చిత్రంగా అనిపించింది. పైకి గతిలేక నటిస్తూ లోలోపలే కపటత్వాన్ని దాచుకుంటూ తోటి మనిషితో సత్సంబంధాలు నెఱపలేని మనిషి అంతఃసంఘర్షణని ఇందులో ఎంత అద్భుతంగా ఒడిసిపట్టుకున్నారో కదా !
We are very polite to each other,
insist it’s nice meeting after all these years.
Our tigers drink milk.
Our hawks walk on the ground.
Our sharks drown in water.
Our wolves yawn in front of the open cage.
Our serpents have shaken off lightning,
monkeys—inspiration, peacocks—feathers.
The bats—long ago now—have flown out of our hair.
We fall silent in mid-phrase,
smiling beyond salvation.
Our people
have nothing to say.
యాత్రల్లో ప్రోగు చేసుకున్న జ్ఞాపకాల్ని 'ట్రావెల్ ఎలిజీ' గా మలుస్తూ,
"డిస్కవరీ" పేరిట రాసిన మరో కవిత : నమ్మకానికున్న బలాన్ని గురించి ఇంత సరళంగా చెప్పిన వాక్యాలు మునుపు చదివింది లేదు.
No comments:
Post a Comment