Friday, June 14, 2019

There Once Lived a Woman Who Tried to Kill Her Neighbor's Baby: Scary Fairy Tales - Ludmilla Petrushevskaya

రచయితల్లో ఈ రష్యన్ రచయితల దారే వేరు..వీళ్ళ పేర్లు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో వీళ్ళ కథలు కూడా అంతే వైవిధ్యతను కలిగి ఉంటాయి..అసలు ఈ రష్యన్ సాహిత్యమే ఒక అక్షయపాత్రలాంటిది,ఎంత తవ్వితీసినా ఇంకా అట్టడుగున మన కంటబడని నిధులేవో మిగిలిపోతూనే ఉంటాయి..అలా దృష్టికి వచ్చిన ఈ కొత్త నిధే 'లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా'..అరే ఈవిడ గురించి ఎప్పుడూ వినలేదే అనుకునేలోపు ఆవిడ జానర్ భయానక రసమని (macabre) తెలిసింది..మనుషుల్లో మనిషిని,నాకు తెలియని భయానక రసమా అనుకుని ఇంతకాలం ఈ జానర్ చదవకుండా మడికట్టుకుని కూర్చున్నాను..సర్లెమ్మని,రచయితల్ని కూడా సరిసమానంగా ప్రేమించాలనే సమన్యాయం గుర్తుకు వచ్చి ,ఎందుకీ వివక్ష ? ఏమిటీ పక్షపాతం అని మరోసారి ఘాటైన ఆత్మ విమర్శ చేసుకుని ఈ కథలు చదవడం మొదలు పెట్టాను..ఈ మధ్య కాలంలో నాన్ ఫిక్షన్ అతిగా చదివి,రియాలిటీలో ఎక్కువ కాలం బ్రతికేసిన నైరాశ్యం నుండి బయటపడడానికినిన్నూ,మరికాస్త 'కలం' మార్పు కోసమునున్నూ అన్నమాట..కానీ 'You'll find beauty in the most unexpected places' అని ఎవరో అన్నట్లు ఈ పుస్తకం నాకో మంచి రచన చదివానన్న అనుభూతిని మిగిల్చింది.


సైన్స్ ఫిక్షన్,macabre లాంటి జానర్స్ లో 'ఫిలసాఫికల్ డెప్త్' ఉన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి..గత సంవత్సరం ఇదే జానర్ లో అర్జెంటీనా రచయిత్రి సిల్వినా ఒకేంపో రాసిన NYRB క్లాస్సిక్ 'Thus Were Their Faces' లో ఒక ముప్పై కథల వరకూ చదివి మిగిలిన వంద పేజీలు పూర్తి చేసే ఓపిక లేక ప్రక్కన పడేశాను,ఆ కథలు చాలా మొనోటోనస్ గా,ఒకటీరెండు కథల మినహా చాలా అర్ధరహితంగా ఉన్నాయి..పెట్రోషెఫ్స్కియా రాసిన ఈ ఫెంటాస్టిక్ ఫిక్షన్ కథలు వాటికంటే వెయ్యి రెట్లు బావున్నాయి..కానీ పెట్రోషెఫ్స్కియా కథలు చదివిన వారికెవరికైనా వాటినిలా ఒక జానర్ పేరుతో ఒకే గాటికి కట్టెయ్యడం అమానుషం అనిపించక మానదు..ఎందుకంటే వీటిలో 'macabre' ని మించిన అంశాలెన్నో ఉన్నాయి.

సోవియెట్ సమాజపు వాస్తవాన్నీ,కాఠిన్యాన్నీ తేటతెల్లం చేసిన పెట్రోషెఫ్స్కియా రచనలు చాలా కాలం నిషేధానికి గురై ,గోర్బచెవ్ అధికారంలోకి వచ్చిన తరువాత గానీ వెలుగుచూడలేదట..ఆ తరువాత ఆమెకు వచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు..The Pushkin Prize in Russian literature (2003) ,The Russian State Prize for arts (2004), The Stanislavsky Award (2005),World Fantasy Award (2010)  లతో పాటు రష్యా లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అయిన The Triumph Prize (2006) ను కూడా సొంతం చేసుకున్న ఈ రచయిత్రిని ప్రస్తుతం జీవించి ఉన్న సమకాలీన రష్యన్ సాహితీ దిగ్గజాల్లో ఒకరిగా పరిగణిస్తారు.

ఇందులో మొత్తం పంతొమ్మిది కథలుండగా వాటిని నాలుగు భాగాలుగా విభజించారు..'సాంగ్స్ ఆఫ్ ఈస్టర్న్ సావ్స్'  మరియు 'ఫెయిరీ టేల్స్' విభాగాల్లో కథలన్నీ బావున్నాయి..కానీ Allegories,Requiems లో ఫాంటసీ శైలి కథల గురించి ఇక్కడ ప్రత్యేకం చెప్పుకోవాలి..పెట్రోషెఫ్స్కియా కలంలోని  వాడీ,వేడీ ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

Songs of the Eastern Slavs : ఈ విభాగంలో కథలు అధివాస్తవిక ధోరణిలో సోవియెట్ సమాజంలోని చీకటి కోణాల్ని చూపిస్తాయి.

Allegories : ఈ  విభాగంలో నాలుగు కథలూ రూపకాలు..పెట్రోషెఫ్స్కియా కథల్లో ఆణిముత్యాలని చెప్పే  రెండు కథలు ఇందులోనే ఉన్నాయి...'Hygiene','The New Robinson Crusoe' అనే కథలు రాజకీయ సామజిక అస్థిరతను ప్రతిబింబించే కథలు..

Hygiene కథలో R. కుటుంబం ఇంట్లో డోర్ బెల్ రింగ్ అయినప్పుడు చిన్న పాప తలుపు తీస్తుంది..ఎదురుగా లేత ఎరుపు రంగులో ఉన్న ఒక యువకుడు మూడు రోజులో మనుషుల్ని చంపే అంటువ్యాధి ప్రబలిందని 'R' కుటుంబాన్ని(నికొలాయి,అతని భార్య ఎలెనా,వాళ్ళ చిన్ని పాప,ఎలెనా తల్లితండ్రులు) హెచ్చరిస్తాడు..పరిశుభ్రత పాటిస్తూ,ఇల్లువదిలి బయటకు వెళ్ళవద్దనీ,ఆ వ్యాధి సంక్రమించినా ఎలాగో తాను బ్రతికిబయటపడ్డాననీ,అందుకే ఇంటింటికీ తిరిగి అవసరమైనవారికి తినడానికి బ్రెడ్,అవసరమైన సామాను లాంటివి అందజేస్తున్నాననీ,డబ్బిస్తే కావాల్సిన సరుకులు తెచ్చిపెడతానని అంటాడు..కానీ అతనిపై నమ్మకంలేక నికొలాయ్ తనే బేకరీకి స్వయంగా వెళ్ళి అవసరమైన ఆహారం తెస్తూ ఉంటాడు..తిరిగి వచ్చాకా కట్టుకున్న వస్త్రాలను బయటే వదిలేసి,కొలోన్ తో ఒంటిని శుభ్రం చేసుకున్నాకే ఇంట్లోకి అడుగుపెడుతుంటాడు..నికొలాయ్ తిండిపోతు,ఈ కారణంగా ఆహారాన్ని భాగాలు పంచుతారు..కానీ మొదట్లో 'అవసరం' కాస్తా క్రమేణా 'స్వార్ధం'గా పరిణమించగా నికొలాయ్ బేకరీ కి వెళ్ళి ఆహారం కోసం హత్యలు కూడా చేస్తాడు..ఇలా ఉండగా ఆ ఇంటి బాల్కనీలో ఉండిపోయిన పిల్లికి ఆహరం పెట్టడానికి ఇంట్లోకి తెస్తారు..ఎలుకను చంపి తిన్న ఆ పిల్లి నోటిఫై ఆ చిన్ని పాప ముద్దాడుతుంది..అది చూసిన ఆమె అమ్మమ్మ,తాతలు అంటువ్యాధి సోకుతుందని భయపడి పాపను పిల్లితో సహా గదిలో నిర్బంధిస్తారు..పాప తల్లి ఎలెనా అడ్డుపడితే తాత్కాలికంగా ఆమెను బాత్రూమ్లో బంధిస్తారు..ఇంకా స్వయంగా తన పనులు చేసుకోవడం తెలీని ఆ పాప ఎంత అరిచి గోల చేసినా తలుపులు తియ్యరు..బాత్రూం కూడా లేని ఆ చిన్నపాప గది కాస్తా ఉన్నట్లుండి Quarantine ఛాంబర్ గా మారిపోతుంది..నికోలాయ్ గదితలుపుకి పై భాగంలో చిన్న రంధ్రం చేసి దాని ద్వారా పై ఆ పాపకి ఆహారం మాత్రం అందిస్తుంటాడు..పాపకు ఆ గదిలో పరిశుభ్రత నేర్పించడానికి ఎలెనా తో సహా అందరూ అనేక పాట్లు పడతారు..మూడోరోజుకి ఆ పాప గదిలోనుంచి ఎటువంటి శబ్దమూ రాకపోయేసరికి అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు.

తెల్లారి నిద్ర లేచిన అమ్మమ్మ,తాత తమ మంచం క్రింద ఉన్న పిల్లిని చూస్తారు..అది makeshift విండో నుండి ఎలాగో తప్పించుకుని ఇవతలకు వస్తుంది..రక్తం అంటిన దాని మూతిని చూసి పిల్లి పాపను తినడం మొదలుపెట్టిందని భావిస్తారు..ఇదంతా విన్న నికోలాయ్ మెల్లిగా వారిద్దరూ ఉన్న గదిని మూసేసి దానికి కుర్చీని అడ్డుగా పెడతాడు..తలుపుపైన రంధ్రం చేసే ఉద్దేశ్యాన్ని కూడా విరమించుకుంటాడు..అదేమిటని అడ్డువచ్చిన ఎలెనాను మళ్ళీ బాత్రూం లో బంధిస్తాడు..ఈలోగా నికోలాయ్ శరీరంపై అంటువ్యాధి తాలూకా బొబ్బలు వస్తాయి..ఆలోచించగా ఆ రోజు బేకరీకి వెళ్ళి,అక్కడ ఒక స్త్రీని ఆహారంకోసం హత్య చేసి,ఇంటికి వచ్చేదాకా ఆగలేక,అందులో కొంత భాగాన్ని అక్కడే తిన్నానని అతనికి గుర్తొస్తుంది..ఆ కారణంగా నికోలాయ్ కి కూడా ఆ వ్యాధి సోకి,కళ్ళలోంచి రక్తం కారుతూ మరణిస్తాడు..ఈ విధంగా ఒక్కొక్కరుగా అందరూ ఆ వ్యాధి సోకి మరణిస్తారు.

మొదట వచ్చిన యువకుడు మళ్ళీ ఆరో రోజుకి వచ్చి ఆ ఇంటి తలుపు కొడతాడు..మ్యావ్ మ్యావ్ మంటున్న పిల్లి శబ్దం తప్ప ఇతరత్రా అలికిడి లేకపోయేసరికి ఆ జీవినైనా రక్షిద్దామనే సంకల్పంతో లోపలకి అడుగుపెట్టిన అతనికి లివింగ్ రూంలో,కుర్చీ అడ్డుపెట్టిన గదిలో,బాత్రూం లో అతనికి సుపరిచయమైన నల్లటి గుట్టలు కనిపిస్తాయి..ఒక గదికి makeshift విండో లోంచి పిల్లి వెళ్ళడం చూసి తలుపు గొళ్ళెం తీసి ఆ గదిలోకి అడుగు పెట్టిన అతనికి విరిగిన గాజు పెంకులు,మలమూత్రాదులూ,తలతెగిన ఎలుకలూ,చింపిన పుస్తకాల పేజీల మధ్య తనలాగే తలమీద లేత గులాబీరంగు చర్మంతో కూర్చున్న పసిపాప కనిపిస్తుంది,ఆ పాప ప్రక్కన పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళతో చూస్తూ పిల్లి కూర్చుని ఉంటుంది...పెట్రోషెఫ్స్కియా ఈ కథలో పరిశుభ్రతను నిర్వచించే ప్రయత్నం చేశారు..'పరిశుభ్రత' భౌతికమైనదే కాదంటూ మానసికమైన స్వచ్చత యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పే కథ ఇది..తనను తాను రక్షించుకునే క్రమంలో నైతికతకు తిలోదకాలిచ్చే మనిషిలోని స్వార్ధపూరిత మనుగడ స్వభావాన్ని లోడ్మిల్లా పట్టుకున్న విధానం చాలా బావుంది.

'మిరాకిల్' అనే మరో కథలో కొడుకుపై ధృతరాష్ట్ర ప్రేమను చంపుకోలేక,దారితప్పిన కొడుకును సరైన దారిలో పెట్టాలనే ఆశతో ఒక దేశదిమ్మరి అయిన తాగుబోతు ప్రవక్తను కలిసిన మహిళ,తుదకు కోరికలకు అంతం లేదనే విషయాన్ని గ్రహించి తన మనోవేదన నుండి విముక్తురాలై,జీవితాన్ని యధాతథంగా అంగీకరించాలనే విలువైన పాఠాన్ని నేర్చుకుని వెనుదిరుగుతుంది..చూడ్డానికి చాలా పేలవంగా కనిపించే ఈ స్కెలిటన్ లాంటి కథలకు పెట్రోషెఫ్స్కియా కూర్చిన కథనం 'Craft is everything' అనుకునేలా చేస్తుంది.

Requiems (An act or token of remembrance) : 
మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపించే మృత్యువు నీడల్ని చూపే కథలివి..ఈ కథల్లో 'కాలం' వేరుగా పని చేస్తుంది..పాత్రలు భౌతికవాస్తవికతని దాటి సమాంతరంగా భూతభవిష్యత్ వర్తమానాల్లోకి ఏకకాలంలో ప్రయాణిస్తూ ఉంటాయి.

Fairy Tales : 
ఇవి అచ్చంగా ఫెయిరీ టేల్సే.. 'Marilena's secret' అనే కథలో మారియా,లెనా అనే ఇద్దరు కవలలు నర్తకీమణులు ఒక మాంత్రికుని శాపం వల్ల ఏకమై 'మారేలినా' అనే ఊబకాయురాలిగా మారిపోతారు..'The Cabbage-patch mother' అనే మరో కథలో ఒక అమ్మకి నీటిబొట్టు అంతే ఉన్న Droplet అనే కూతురు ఉంటుంది..ఈ కథలన్నీ పాఠకులను ఖచ్చితంగా బాల్యంలోకి లాక్కుపోతాయి..

ఈ కథలు మొదలవ్వడం కూడా విచిత్రంగా జరుగుతుంది..'ఒకానొకప్పుడు ఒక స్త్రీ ఉండేది,ఆమె తన పొరుగింటి స్త్రీని ద్వేషిస్తుంది' అంటూనో,లేదా 'ఒకానొకప్పుడు ఒకమ్మాయి ఉండేది,ఆమె మరణించి పునర్జీవితురాలైంది' అంటూనో పాఠకులను ఏదో సరళమైన చందమామ కథ చెప్తున్నట్లు భ్రమింపజేస్తూ కథ మధ్యలోకి చేరేసరికి అలవోకగా సంక్లిష్టతను తెరపైకి తీసుకువస్తారు..ఇందులో కొన్ని కథల్లో దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కునే సగటు మనుషులు తారసపడతారు..ఈ కోవకి చెందిన 'There’s Someone in the House' కథలో ఇంట్లో 'కనిపించని శత్రువు' కి భయపడిన ఒక స్త్రీ,జరగబోయే దారుణాన్ని తిప్పికొట్టే క్రమంలో ఇంట్లో సామానంతా ఒకొక్కటిగా తానే ధ్వంసం చేసి,చివరకి రోడ్ మీదకు వచ్చేస్తుంది..చివర్లో ఆమెవైపు భయంగా,రక్షించమన్నట్లు చూస్తున్న పెంపుడు పిల్లిని చూసి,చేసిన పనికి పశ్చాత్తాపపడి 'This is life' అని నిట్టూరుస్తూ ఇంట్లోకి వెనుదిరుగుతుంది...ఈ కథలన్నిటిలో సాధారణంగా కనిపించే మరో అంశం ఏంటంటే,ఇందులో చాలా మంది తల్లితండ్రులు పిల్లలపై హద్దుల్లేని ప్రేమను కలిగి ఉంటారు..యుద్ధం నిర్వీర్యం చేసిన భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలనే తపన కలిగిన సగటు సోవియెట్ యువకులూ,వారి తల్లిదండ్రులూ ఈ కథల్లో తారసపడతారు..'ది న్యూయార్కర్' లో ప్రచురితమైన 'The Fountain House' అనే కథలో బస్సు ప్రమాదంలో పదిహేనేళ్ళ కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి ఆమె శవాన్ని అటాప్సీ జరగకుండా తీసుకెళ్ళిపోతాడు..డబ్బు కోసం ఏదైనా చేసే ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి కూతురి శవానికి వైద్యం చేయిస్తూ షాక్ కు గురైన ఉన్మాదంలో స్వప్నంలో కూతురు తినడానికి తెచ్చిన శాండ్విచ్ మధ్యలో ఉన్న మనిషి హృదయాన్ని తినేస్తాడు..నిద్రపోయి లేచిన తర్వాత,కూతురు కోలుకుని లేచి తన చెయ్యి పట్టుకుని నడుస్తోంది అంటాడు..ఏం జరుగుతోందో ఒక్క క్షణం అర్ధం కాని స్థితిలోకి పాఠకులను నెట్టేసి,మనం 'కూతురు బ్రతికే ఉందా' అని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ బుర్రకు పదును పెట్టేలోపు,తండ్రి తాను మనిషి హృదయాన్ని తిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ 'అయినా కలలు నిజం కాదుగా' అని మనసులో అనుకునే వాక్యంతో కథను ముగిస్తారు..ఈ ముగింపు వాక్యం నిజంగా అద్భుతం..ఈ ఒక్క వాక్యంతో సృజనాత్మకత పరిధుల్ని చెరిపేస్తూ పాఠకుల్లో జరుగుతున్నది వాస్తవమో లేక స్వప్నమో అర్ధం కాని సందిగ్ధతను సృష్టిస్తారు.

స్టాలిన్ శకంలో పుట్టి (1938),రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి రష్యాలో కడుపునిండా తిండికి కూడా నోచుకోలేక, పదేళ్ళ వయసు లోపే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన పెట్రోషెఫ్స్కియా కథల్లో యుద్ధం పట్ల ఏహ్యభావం,అసహనం,కోపం అంతర్లీనంగా కనిపిస్తాయి..అందుకేనేమో కాఠిన్యం ఎరుగని పసితనం యుద్ధ కాంక్షకు బలైన వైనం ఈ కథల్లో అనేకచోట్ల ప్రస్తావనకు వస్తుంది..ఉదాహరణకు ఒక కథలో మరణించిన స్త్రీ తన తోటి ప్రయాణీకుల్లో యుక్తవయసులో ఉన్న ఒకే రకం యూనిఫామ్ ధరించిన అనేకమంది సైనికులను నోళ్ళు తెరచుకుని నిద్రిస్తుండగా చూశానంటుంది ,మరో కథలో యుద్ధ సమయంలో ఒక కల్నల్ మరణానికి చేరువలో ఉన్న భార్య ఉత్తరం అందుకుని ఇంటికి వెళ్ళే లోపే ఆమె మరణిస్తుంది..పెట్రోషెఫ్స్కియా నిస్సంకోచంగా యుద్ధంలో మరణించిన వారి శవపేటికలను తెరచి అందులో సైనికుల యొక్క శిధిలమైన స్వప్నాల గాధలు వినమంటారు..ఈ కథల్లో చిన్నచిన్న సంగతులు కూడా విస్మరించలేని విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి..ఉదాహరణకు ఒక కథలో స్త్రీ తనకు ఆవలివైపు ఉన్న దేశాన్ని చూస్తూ అక్కడ దూరంగా ఒక క్యాథెడ్రల్,నీరూ ఉన్నాయంటుంది..మతమూ,నీరూ లేకపోతే మనుగడే లేని మనిషి ఉండే భూమిని రచయిత్రి ఇలా అస్పష్టంగా వర్ణిస్తారు..లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా కథల్లో వచనం అత్యంత సరళంగా కనిపించినప్పటికీ భావం మాత్రం సంక్లిష్టమైన నిగూఢతను కలిగి ఉంటుంది.

ఈ కథల్లో ఆత్మలు స్వైర విహారం చేస్తాయి..ఒకే ఆత్మ కలిగి ఏక కాలంలో వివిధ కాలమాన పరిస్థితుల్లో సంచరించే వేర్వేరు మనుషులుంటారు,నిర్ణీత సమయంలో భూతభవిష్యద్ వర్తమానాల్లో వారు ఏ కాలంలో ఉన్నారన్న సంగతి ఇందులో పాత్రలకే కాదు,మనకు కూడా తెలీదు...మరణానంతరం కూడా మనుషులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు,జీవన్మరణాల మధ్య గీతలు మన కళ్ళముందే మసకబారిపోతుంటాయి,వీటన్నిటి మధ్యా పాఠకులకు రహస్యాలమయమైన వింతలోకాల్లో సంచరిస్తూ ఊహేదో,వాస్తవమేదో,స్వప్నమేదో తెలీని మాయాజాలంలో చిక్కుకున్నామనిపిస్తుంది..పోస్ట్ వార్ సోవియెట్ సమాజాన్నీ ఫెంటాస్టిక్ శైలిలో ప్రతిబింబించే ఈ కథలు ఒక ప్రక్క భయంగొల్పుతూనే మరో ప్రక్క రష్యా సమాజంలోని వైఫల్యాలను ఎత్తిచూపుతాయి..పెట్రోషెఫ్స్కియా కథల్లో పాత్రలు 'నాన్ కన్ఫర్మ్మిస్టులు'..నిర్దిష్టమైన వ్యక్తిత్వాలు ఆపాదించబడని కారణంగా ఈ కథల్లో పాత్రలు కథనం తాలూకు ప్రవాహాన్ని బట్టి దారిచేసుకుంటూ వాటంతటవే దిశలు మార్చుకుంటూ ఉంటాయి..కథ కంచికి చేరి అవి తమ గమ్యం చేరే క్రమంలో తమ జీవితాల్లో ఏం జరగబోతోందో తెలీని అస్పష్టతను,సందిగ్ధతను మోసుకుంటూ ముందుకు వెళ్తున్న పాత్రల్ని మనం కూడా నిస్సహాయంగా అనుసరిస్తూ వెళ్ళాల్సిందే...ఇందులో ప్రతీకథా రసాత్మకం,వైవిధ్యభరితం..Keith Gessen,Anna Summers లు చేసిన అనువాదం చాలా బావుంది..ఇందులో లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా శైలిని పట్టుకుంటూ వారు రాసిన ముందుమాటను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..దానికోసం ప్రత్యేకించి మరో పోస్టు రాస్తాను..అంత వరకూ సెలవు..Happy reading.

Monday, June 10, 2019

The Storied Life of A.J.Fikry - Gabrielle Zevin

మనుషుల్లాగే కొన్ని పుస్తకాల కవర్లు కూడా చూడ్డానికి అందంగానూ,ఆసక్తికరంగానూ ఉంటాయి..తీరా పేజీలు తిప్పిచూస్తే గానీ కవర్లకీ కంటెంట్ కీ పోలిక లేదని అర్ధం కాదు..అలాగే కొన్ని టైటిల్స్ కూడా కథ మీద expectations ను పెంచుతాయి..టైటిల్ వైవిధ్యంగా అనిపించీ,పాపులారిటీ చూసీ చదివిన ఈ పుస్తకం ఆశించిన రీతిలో లేక కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమే అయినప్పటికీ 'అస్తమానం అస్తిత్వవాదమేనా ? పుస్తక ప్రియులన్నాకా అప్పుడప్పుడూ యంగ్ అడల్ట్,చిల్డ్రన్ బుక్స్ కూడా చదువుతుండాలి' అని ఒక మహానుభావురాలు చెప్పిన కోట్ (అంటే జస్ట్ ఇప్పుడే నేనే చెప్పాను :P ) కూడా గుర్తొచ్చింది..ప్రపంచాన్ని 'రోజ్ కలర్డ్ గ్లాస్సెస్' లోంచి చూడ్డం మర్చిపోయిన పాఠకుల్ని అన్నీ మంచే,అంతా మంచే అనుకునే అమాయకపు కాలంలోకి తీసుకెళ్తుందీ నవల..ఈ 'వన్ టైం రీడ్' ని చక్కగా మీ to-read ఖాతాలో వేసేసుకోవచ్చు..అమెరికన్ రచయిత్రి Gabrielle Zevin 2013 లో రాసిన 'The Storied Life of A.J.Fikry' పుస్తక ప్రియులకు ఒక చిరుకానుక లాంటి పుస్తకం.
Image Courtesy Google
కథ విషయానికొస్తే భారత సంతతికి చెందిన వ్యక్తి A.J.Fikry (అజయ్ ఫిక్రీ) అమెరికాలోని అలిస్ ఐలాండ్ (కల్పిత ప్రదేశం) లో 'ఐలాండ్ బుక్ స్టోర్' నడుపుతుంటాడు..Fredrik Backman 'A Man Called Ove' లో ఓవ్ పాత్రని తలపించే ఫిక్రీ స్వభావ రీత్యా కోపిష్టి..సాహిత్యం విషయంలో ఖచ్చితమైన అభిరుచులు కలిగిన వ్యక్తి..కథ మొదలయ్యే సమయానికి ఫిక్రీ (43) భార్య మరణించడం,బుక్ స్టోర్ నష్టాల్లో కూరుకుపోవడంతో అతని జీవితం తలక్రిందులవుతుంది..ఆ సమయంలో 'Knightley Press' పబ్లిషింగ్ విభాగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన అమీలియా లోమన్ 'ఐలాండ్ పుస్తకాల షాపు'కు కొన్ని ప్రచురణలు తీసుకుని వస్తుంది..తొలి పరిచయంలో ఫిక్రీ దురుసు ప్రవర్తన మూలంగా వెనుదిరిగినా మెల్లిగా ఐలాండ్ నుండి పుస్తకాల ఆర్డర్ రాబట్టాలని ప్రయత్నిస్తుంటుంది..ఇదిలా ఉండగా జీవితం పట్ల ఆశ కోల్పోయి భారంగా బ్రతుకు వెళ్ళ దీస్తున్న సమయంలో ఒక్క రాత్రిలో ఫిక్రీ జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు జరుగుతాయి..ఆ సంఘటనలేంటి ? వాటి కారణంగా ఫిక్రీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ.

స్పష్టమైన సాహితీ అభిరుచులు ఉన్నవారికి ఈ పుస్తకం నచ్చడం కష్టం..అయినప్పటికీ ఈ కథలో కొన్ని లోటుపాట్లతో పాటు పుస్తక ప్రేమికులకు నచ్చే అనేక అంశాలు కూడా ఉన్నాయి..ఉదాహరణకి షార్ట్ స్టోరీస్ అమితంగా ఇష్టపడే ఫిక్రీ ఇందులో ప్రతి అధ్యాయాన్నీ Roald Dahl,Bret Harte,F.Scott Fitzgerald,Flannery O'Connor.Raymond Carver,Mark Twain,Poe మొదలైనవారు రాసిన కథల గురించి ప్రస్తావిస్తూ ప్రారంభించడం బావుంటుంది..అలాగే ఇందులో మనసుని తేలిక పరిచే సునిశిత హాస్యం కూడా ఉంది..ఒక సందర్భంలో ఫిక్రీ కస్టమర్ Mrs.Cumberbatch 'బుక్ థీఫ్' పుస్తకాన్ని నచ్చలేదని ఫిక్రీకి తిరిగిస్తూ చెప్పిన కారణాలు హాస్యపు జల్లులు కురిపిస్తాయి..ఇకపోతే కథానాయకుడి పేరు 'ఫిక్రీ' అని ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు..అతని ఐడెంటిటీకీ ఈ కథకు ఎంతమాత్రం అవసరం లేదు.

కొన్ని జానర్స్ కి  లోబడిన రచయిత్రి పుస్తక ప్రపంచం చాలా పరిమితమైనది అనిపించింది..అంతా 'ఫీల్ గుడ్' వాతావరణంలా కనిపించే అలీస్,అందులో ఊహించనలవికానంత 'మంచి మనుషులు' ఒక ఉటోపియా ప్రపంచాన్ని తలపిస్తూ ఒక్కోచోట 'యంగ్ అడల్ట్ ఫిక్షన్' చదువుతున్నామేమోననిపిస్తుంది..ఏమాత్రం పరిపక్వత లేని సాధారణమైన శైలి అయినప్పటికీ ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే పుస్తకం ఆపకుండా చదివిస్తుంది..ఒకే మూసలో ఒకే జానర్ కి పరిమితమయిపోకుండా ఏదైనా చదివే సంసిద్ధత ఉన్న వాళ్ళకు ఈ పుస్తకం ఒక మోస్తరు నచ్చుతుందనే అనుకుంటున్నాను..పెద్దగా మెదడుకు పని చెప్పక్కర్లేకుండా చక్కని కరణ్ జోహార్ సినిమా చూసినట్లూ,విక్టోరియన్ రొమాన్స్ చదువుతున్నట్లూ ఇందులో ఒక పుస్తకాన్ని చదివించడానికి అవసరమైన మెలోడ్రామాతో కూడిన అన్ని కమర్షియల్ అంశాలూ పుష్కలంగా ఉన్నాయి..అన్నిటినీ మించి పుస్తకాల కబుర్లతో పుస్తక ప్రపంచాన్నీ,పబ్లిషింగ్ వ్యవస్థనీ చక్కగా ప్రతిబింబించిన కథ ఉంది..సాహిత్యం అనేది సీరియస్ గా ఉండాలి,సాహితీ విలువలు ఉండాలి అని సాహిత్యానికి కొన్ని ఖచ్చితమైన విలువలు ఆపాదించే కథానాయకుడు ఫిక్రీ లాగానే మనం కూడా ఆలోచించకపోతే ఈ పుస్తకాన్ని చక్కగా ఏ ఎయిర్ పోర్ట్ లోనో,రైల్వే స్టేషన్లోనో కూర్చుని ఒకసారి చదివి  ప్రక్కన పెట్టెయ్యొచ్చు..ఈ వేసవిలో సీరియస్ లిటరేచర్ నుండి ప్రక్కకి జరిగి చదివిన ఈ పుస్తకం నాకో ఆటవిడుపు...ఇది గొప్ప పుస్తకం అని అననుగానీ మంచి పుస్తకమే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..

ఫిక్రీ అమీలియాకు తన సాహితీ అభిరుచుల్ని గురించి చెప్తూ,
 “How about I tell you what I don’t like? I do not like postmodernism, postapocalyptic settings, postmortem narrators, or magic realism. I rarely respond to supposedly clever formal devices, multiple fonts, pictures where they shouldn’t be—basically, gimmicks of any kind. I find literary fiction about the Holocaust or any other major world tragedy to be distasteful—nonfiction only, please. I do not like genre mash-ups à la the literary detective novel or the literary fantasy. Literary should be literary, and genre should be genre, and crossbreeding rarely results in anything satisfying. I do not like children’s books, especially ones with orphans, and I prefer not to clutter my shelves with young adult. I do not like anything over four hundred pages or under one hundred fifty pages. I am repulsed by ghostwritten novels by reality television stars, celebrity picture books, sports memoirs, movie tie-in editions, novelty items, and—I imagine this goes without saying—vampires. I rarely stock debuts, chick lit, poetry, or translations. I would prefer not to stock series, but the demands of my pocketbook require me to. For your part, you needn’t tell me about the ‘next big series’ until it is ensconced on the New York Times Best Sellers list. Above all, Ms. Loman, I find slim literary memoirs about little old men whose little old wives have died from cancer to be absolutely intolerable. No matter how well written the sales rep claims they are. No matter how many copies you promise I’ll sell on Mother’s Day.”
“Infinite Jest is an endurance contest. You manage to get through it and you have no choice but to say you like it. Otherwise, you have to deal with the fact that you just wasted weeks of your life,” A.J. had countered.“Style, no substance, my friend.”
Despite the fact that he loves books and owns a bookstore, A.J. does not particularly care for writers. He finds them to be unkempt, narcissistic, silly, and generally unpleasant people. He tries to avoid meeting the ones who’ve written books he loves for fear that they will ruin their books for him. Luckily, he does not love Daniel’s books, not even the popular first novel. As for the man? Well, he amuses A.J. to an extent. This is to say, Daniel Parish is one of A.J.’s closest friends.
“Poe’s a lousy writer, you know? And ‘Tamerlane’ is the worst. Boring Lord Byron rip-off. It’d be one thing if it were a first edition of something fucking decent. You should be glad to be rid of it. I loathe collectible books anyway. People getting all moony over particular paper carcasses. It’s the ideas that matter, man. The words,” Daniel Parish says.     A.J. finishes his beer. “You, sir, are an idiot.”
I was on my way to a PhD in American literature before I quit that to open this bookstore. My specialty was Edgar Allan Poe. ‘The Fall of the House of Usher’ is a decent primer on what not to do with children.”
The town florist tells a story about leaving a pair of sunglasses in Island Books and coming back less than one day later to find that A.J. had thrown them out. “He said his store had no room for a lost-and-found. And that’s what happens to very nice, vintage Ray-Bans!” the florist says.
“Sometimes books don’t find us until the right time.”
“No one travels without purpose. Those who are lost wish to be lost.”
We are not quite short stories.In the end, we are collected works.He has read enough to know there are no collections where each story is perfect. Some hits. Some misses. If you’re lucky, a standout. And in the end, people only really remember the standouts anyway, and they don’t remember those for very long.     No, not very long.
I know what words do, he thinks. They let us feel less.

Saturday, June 8, 2019

Fahrenheit 451 - Ray Bradbury

* "పుస్తకపఠనం వల్ల ప్రయోజనం శూన్యం,ఎక్కువ చదివితే అనవసరమైన ఆలోచనలొచ్చి బుర్ర పాడవుతుంది" ---- బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎవరు ఫైనల్స్ కి వస్తారా అని తలబద్దలుకొట్టుకుంటూ బెట్టింగ్ కట్టుకునే ఒక పెద్దాయన.
* "హాయిగా నెట్ఫ్లిక్ లో 2 గంటల్లో సినిమా/సిరీస్ చూసేసే సౌలభ్యం ఉన్నప్పుడు అంత కష్టపడి పుస్తకం చదవడమెందుకు "----ఒక టీవీ సిరీస్ పధ్నాలుగో సీసన్ లో పదిహేడో ఎపిసోడ్ ను బింజ్ వాచ్ చేస్తున్న యువత.
* "చదవొద్దని ఎవరన్నారు ! ఎటొచ్చీ ఆ సీరియస్ పుస్తకాలకు దూరంగా ఉండు,హాయిగా ఏ ఫీల్ గుడ్ (?) పుస్తకాలో చదువుకో,గులాబీలూ,చందమామలూ,ఇంద్రధనుస్సులూ,విరహాలూ అంటూ కథలూ,కవిత్వాలు ఉంటాయి కదా అవి మంచివి(!)"----అత్తగారు,ఆడపడుచూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ కొడుకు నాలుగో భార్యకి పుట్టిన మూడో కూతుర్ని హింసిస్తున్న సీరియల్ చూస్తూ కంటతడిపెట్టుకునే ఒక పెద్దావిడ.
* "అబ్బే ఆ పుస్తకాలు చదువుతూ ఓ మూలాన కూర్చోడమేగానీ నలుగురితో కలిసి నవ్వడం రాదు,బొత్తిగా Anti-Social"---- టీవీ కామెడీ షోల పేరిట చూపించే మకిలి పట్టిన వెకిలి హాస్యానికి పగలబడి నవ్వే సంఘజీవులు. 

బహుశా సంతోషంగా ఎలా బ్రతకాలో ఈ తరానికి తెలిసినంత మరే తరానికీ తెలీదేమో అనిపించేలా 'హ్యాపీనెస్' స్లోగన్ తో హ్యాపీగా(?) బ్రతికేస్తున్న అసలు సిసలు 'ఆర్ట్ అఫ్ లివింగ్ గురువుల' గురించి రే బ్రాడ్బరీ ఎప్పుడో యాభైల్లో రాసిన ఫారెన్ హైట్ 451 అనే డిస్టోపియన్ నవలలో ప్రస్తావించిన అంశాలను ఇప్పటి సమాజానికి అన్వయించుకుంటే ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే..అన్నీ కాకపోయినా పైన ఉదహరించిన అంశాల్లో ఎక్కడో ఒక చోట నేటి తరం తనను తాను రిలేట్ చేసుకుంటుంది. 
Image Courtesy Google
సంతోషానికి ఈ తరమిచ్చే నిర్వచనాలు పూర్తిగా వేరు..ఉదాహరణకు నెగెటివిటీని చూసి కళ్ళు మూసుకోవడం,స్పందించవలసిన/ముఖ్యమైన విషయాలక్కూడా మన ఇంటి సంగతి కాదు లెమ్మని ప్రక్కకి తప్పుకోవడం(Please,I'm not referring to social media wars),కోపం,బాధ లాంటి సహజమైన భావాల్ని కూడా వ్యక్తిత్వ లోపాలుగా పరిగణించడం లాంటివి అన్నమాట..తటస్థ వైఖరి పేరిట తప్పుని తప్పని ఖండించకపోగా దుర్యోధనులకు సైతం మిత్రులమని సగర్వంగా చెప్పుకు తిరిగే 'వీర శూర కర్ణులు' ఎక్కువైపోయిన నేటి సమాజానికి కావాల్సిందొక్కటే,'సంతోషం'..అసలు నీకేం కావాలని ఏ మనిషిని అడిగినా 'శాంతి/సంతోషం' అనే ఖచ్చితమైన సమాధానమే తరచూ వినిపిస్తుంది..మరి ఈ రెండూ దొరకాలంటే మనిషిలో అనవసరమైన(?) ఆలోచనలు ఉండకూడదు..మరి అలా ఉండకూడదంటే ఆలోచన రేకెత్తించేవాటినన్నిటినీ లేకుండా నాశనం చేసేస్తే సరిపోతుంది కదా! ఇలా అనుకున్నదే తడవు వెంటనే గుర్తొచ్చేవి పుస్తకాలు..నిజానికి పుస్తకాలని మించి మనిషిని ఆలోచింపజేసేవేముంటాయి ? పుస్తకాల వల్ల బూజుపట్టిన భావాలు వదిలి,ఆలోచనా పరిధి పెరిగి,మనిషిలో ధర్మాధర్మ విచక్షణ మొదలవుతుంది..సంఘర్షణకు మూల కారణం ఇదే కాబట్టి అసలు ఆ దువిధంటూ లేకపోతే ఇక మిగిలేది శాంతే...ఎప్పుడైనా రెండు పరస్పర విరుద్ధ భావాలు సంఘర్షించుకోకపోతే ఇక అంతా శాంతిమయమే కదా..ఈ మెరుపు లాంటి ఆలోచన ఎవరికొచ్చిందో ఏమో గానీ దాన్ని వెంటనే అమలులో పెట్టింది ప్రభుత్వం...ప్రతి ఇంటినీ ఫైర్ ప్రూఫ్ గా మార్చి,ఆలోచనల్ని ప్రేరేపించే సాహిత్యాన్ని అంతటినీ వెలికితీసి దగ్ధం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన ఫైర్ విభాగాన్ని నెలకొల్పింది..నిషేధించబడిన పుస్తకాలు కలిగియున్న ఇళ్ళపై నిఘా పెట్టడానికి ఒక 'మెకానికల్ వేటకుక్కల'ను కూడా తయారు చేసింది..ముఖ్యంగా ఫిలాసఫీ,సోషియాలజీ లాంటి పుస్తకాలను లక్ష్యంగా చేసుకుని ఆ సిద్ధాంతాన్ని అమలుపరిచింది..రెండు ఆప్షన్స్ లేనప్పుడు మనిషి తనకున్న ఒకే ఒక్క ఆప్షన్ తో సంతోషంగా బ్రతికేస్తాడని వారి నమ్మకం.."Happiness in intelligent people is the rarest thing I know" అని ఎర్నెస్ట్ హెమ్మింగ్వే అన్నట్లు అజ్ఞానాన్ని మించిన ఆనందమేముంటుంది ? కథానాయకుడు గై మోంటాగ్ అటువంటి ఫైర్ విభాగంలో ఆఫీసర్ బియట్టి క్రింద పని చేసే ఒక ఫైర్ మాన్.
You ask Why to a lot of things and you wind up very unhappy indeed, if you keep at it.
You can't build a house without nails and wood. If you don't want a house built, hide the nails and wood. If you don't want a man unhappy politically, don't give him two sides to a question to worry him; give him one. Better yet, give him none.

'It was a pleasure to burn' అనుకుంటూ ఒక రోజు తన వృత్తిని సగర్వంగా పూర్తిచేసి ఇంటికి తిరిగి వస్తున్న మోంటాగ్ కు క్లారీస్ అనే అమ్మాయి పరిచయమవుతుంది..అంతవరకూ ఒక యంత్రంలా బ్రతుకుతున్న మోంటాగ్ దృక్పథాన్ని క్లారిస్ పరిచయం సమూలంగా మార్చేస్తుంది...ఆ తరువాత మోంటాగ్ జీవితం ఏ మలుపు తీసుకుందనేది మిగతా కథ..కొన్ని పుస్తకాల్ని ఏకాలంలో చదివినా రచయిత అప్పుడే తాజాగా కలం విదిల్చి వర్తమాన సమాజాన్ని ఉద్దేశించి రాసినట్లు,ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చక్కగా ఒదిగిపోతాయి..రే బ్రాడ్బరీ 'ఫారెన్ హైట్ 451' కాలదోషం పట్టకుండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అటువంటి ఒక రచన..ప్రతీ మనిషి జీవితంలో చదవవలసిన వంద పుస్తకాల్లో లిస్టుల్లో ఎక్కడ చూసినా కనిపించే ఈ పుస్తకాన్ని ఇప్పటివరకూ ఎందుకో చదవడం వీలుపడలేదు..కనీసం 'ది ఇల్లస్ట్రేటెడ్ మాన్' తో బ్రాడ్బరీ మేజిక్ పరిచయమయ్యాక కూడా వెంటనే ఈ పుస్తకం చదవలేదు..మొత్తనికి ఈ ఏడాది నిడివి తక్కువా-నాణ్యత ఎక్కువా ఉన్న ఈ పుస్తకాన్ని చదివే అదృష్టం దక్కింది..పుస్తకం పేరు విషయానికొస్తే,451 డిగ్రీల ఫారెన్ హైట్ ఉష్ణోగ్రత వద్ద ఒక పుస్తకంలో పేజీ మంటలకు ఆహుతవుతుంది,అందుకే దీనికి ఆ పేరు పెట్టారట..1953 లో తొలిసారిగా ప్రచురితమై 60th anniversary ఎడిషన్ తో షష్టిపూర్తి కూడా పూర్తి చేసుకున్న ఈ డిస్టోపియన్ నవల నేటి సమాజాన్ని యధాతథంగా ప్రతిబింబిస్తుంది.

పుస్తకాల్లో ఏముంటాయి ? కొన్ని అక్షరాలు ? వాక్యాలు ? పంక్తులు ? అంతేనా !!! కాదేమో..వాటి వెనుక నిజమైన   మనుషులుంటారు..వారి జీవితాలుంటాయి...ఆలోచనలుంటాయి...సంఘర్షణలుంటాయి..తరాల సంస్కృతి ఉంటుంది..చరిత్ర ఉంటుంది..కానీ శాంతి/సంతోషమే ప్రధానమని భావించే నాగరిక సమాజానికి ఇవేవీ అవసరం లేదని నమ్మే ప్రభుత్వం వాటిని కాల్చి బూడిద చెయ్యడానికి పూనుకుంటుంది..ఈ నవలలో ఆధునిక సమాజపు పోకడలకు అద్దం పట్టే పలు అంశాలుంటాయి..ఉదాహరణకు మోంటాగ్ ఇంట్లో పార్లర్ లో గోడలకి టీవీలుంటాయి..మోంటాగ్ భార్య మిల్డ్రెడ్ ఆ టీవీ ప్రసారాల్లో స్క్రీన్ మీద కనిపించే మనుషుల్ని 'బంధువులు' అంటుంటుంది..మిల్డ్రెడ్ తో పాటు మరి కొన్ని స్త్రీ పాత్రలు టెక్నాలజీకి బానిసలై,టీవీ,కంప్యూటర్ స్క్రీన్ ల ముందు కాలం గడుపుతూ,మాస్ మీడియా,సోషల్ మీడియా ప్రభావానికి లోనై,అదే యదార్థమని గుడ్డిగా నమ్ముతూ జీవిస్తున్న నేటి తరానికి ప్రతీకలుగా కనిపిస్తాయి...అలాగే "Peace, Montag." అంటూ బియట్టీ మోంటాగ్ ని ఉద్దేశించి చేసే దీర్ఘమైన ప్రసంగం ఈ పుస్తకానికంతటికీ హైలైట్..అది చదువుతున్నప్పుడు బియట్టీ మాటల్లో భవిష్యవాణిని సమర్ధవంతంగా వినిపించిన రే బ్రాడ్బరీ ప్రతిభకు నమస్కరించకుండా ఉండలేము..ప్రతి సమాజంలోనూ మైనారిటీల పేరిట పొంచి ఉన్న పెను ప్రమాదాన్నీ,లిబరల్ సొసైటీ చేసే హానినీ,'మెజారిటీ' చిమ్ముతున్న విషాన్నీ ఆనాడే హెచ్చరించారు..ఊహాత్మక శక్తిని నాశనం చేసే విధంగా పుస్తకాల అవసరం లేకుండా క్లాసిక్స్ ని కూడా 15 నిముషాల టీవీ షో గా కుదిస్తున్నారు అంటూ బియట్టీ ఒక సందర్భంలో అనడం చూస్తే,నేటి నెట్ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ రోజుల్ని రచయిత ముందుగానే ఊహించారా అనిపిస్తుంది..బియట్టి ఒక సందర్భంలో అంటాడు,"ప్రజలకి వాళ్ళకి తెలిసిన ప్రముఖమైన పాటల్లో పదాల్ని గుర్తుకు తెచ్చుకుని సులభంగా నెగ్గే పోటీలు పెట్టాలి..లేదా రాష్ట్రాలకి రాజధానులేంటో,గత ఏడాది ఒక రాష్ట్రం ఎంత జొన్నల్ని పండించిందో అడిగే పోటీలు పెట్టాలి..ఆలోచలనలకు ఆస్కారం లేని 'ఫాక్ట్స్' ని దట్టించాలి..అప్పుడు వారి మెదళ్ళు ఆ సమాచారంతో నిండిపోయి వాళ్ళు తాము గొప్పగా ఆలోచిస్తున్నామనే భ్రమలో ఉంటారు..తాము మేధావులమనుకుంటారు..కదలిక లేని స్థాన చలనాన్ని అనుభవిస్తారు..కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు,ఎందుకంటే 'ఫాక్ట్స్' ఎప్పటికీ మారవు." అని..ఇలా ఒక్కో వాక్యం నేటి సమాజానికి చెంపపెట్టులా ఉంటుంది..కథనంలో నిగూఢంగా నిక్షిప్తమైయున్న అనేకార్ధాలు నలు దిశలకూ చోటు చేసుకుంటూ మల్టీ డిమెన్షన్స్ లో ప్రయణిస్తూ మానవాళి ప్రగతిని పునః పరిశీలించుకోమంటాయి.

పేజీలకు పేజీల ఉపోద్ఘాతలూ,అనవసర నీతి బోధలూ లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా,పొదుపైన పదాల్లో చెప్పడం తెలిసిన అతి కొద్ది మంది రచయితల్లో బ్రాడ్బరీ కూడా ఒకరు..ఈ నవల డిస్టోపియన్ రచయితల్లో నాకు బాగా నచ్చే ఆర్వెల్,వన్నెఘాట్,లూయిస్ లౌరీ వంటి వారి రచనల్ని గుర్తుకు తెచ్చింది..ప్రతీ పేజీలోనూ బ్రాడ్బరీ కలంనుండి జారిపడిన అక్షరాలు ఆజ్యంగా మారి ఉవ్వెత్తున మంటలు ఎగసి పడినట్లనిపిస్తుంది..కథలో అబ్బురపరిచే అనేక సందర్భాలున్నా,ఒక సందర్భం గురించి మాత్రం ప్రత్యేకం చెప్పుకోవాలి..మోంటాగ్ ఒక వాక్యూమ్ అండర్గ్రౌండ్ లో రైల్లో ప్రయాణిస్తూ తాను రహస్యంగా దాచుకున్న ఒక పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేస్తుంటాడు..అతను రెండు వాక్యాలు చదివేలోపు ట్రైన్ రేడియోలో బిగ్గరగా "Denham's Dentifrice" అని ఒక టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది..అక్కడ కూర్చున్న జనాలు ఆ అడ్వర్టైజ్మెంట్ లోని పదాలకు లయబద్ధంగా పాదాలు కదుపుతుంటారు..
The people who had been sitting a moment before, tapping their feet to the rhythm of Denham's Dentifrice, Denham's Dandy Dental Detergent, Denham's Dentifrice Dentifrice Dentifrice, one two, one two three, one two, one two three. The people whose mouths had been faintly twitching the words Dentifrice Dentifrice Dentifrice. The train radio vomited upon Montag, in retaliation, a great ton-load of music made of tin, copper, silver, chromium, and brass. The people were pounded into submission; they did not run, there was no place to run; the great air-train fell down its shaft in the earth.
అవసరమైన/మంచి విషయం నుండి దృష్టిని మళ్ళిస్తూ అనవసరమైన చెత్తనంతా మనుషుల మెదళ్ళలో నింపుతున్న నేటి వాట్సాప్ మెసేజెస్,రియాలిటీ షోస్,సోషల్ మీడియా,కన్స్యూమర్ వెర్రి అన్నీ కలిపి ఈ రెండు పేరాగ్రాఫుల్లో మన సమాజం మన కళ్ళముందుకొచ్చేస్తుంది..ట్రైన్ రేడియో లోహపు ధ్వనులతో కూడిన సంగీతాన్ని (?) కక్కింది అన్నప్పుడు మానవ జాతి కృత్రిమత్వంతో విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిందన్న బాధ రచయితలో అంతర్లీనంగా వ్యక్తమవుతుంది...'ఫారెన్ హైట్ 451' నేటి సమాజంలో ఆధునికత పేరిట అమలులో ఉన్న అనేక సాంఘిక వైకల్యాలను సూటిగా వేలెత్తి చూపిస్తుంది..జీవ పరిణామ క్రమంలో మనిషి గర్వపడే మానవాళి ప్రస్థానాన్ని పునః సమీక్షించి చూసుకోమంటుంది...వస్తువుల్నే కాదు మనుషుల్ని కూడా 'use and throw' అనే సింపుల్ ఫార్ములాతో విసిరిపడేసి,'Being practical' అని గర్వంగా చెప్పుకుంటున్న నేటి సమాజానికి సంస్కృతి,చరిత్ర,నైతిక విలువల ఆవశ్యకతను తెలియజేస్తుంది..మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తే, 'నిజమే! ఈ పుస్తకాలు చదివి ఏం చెయ్యాలి ? లెక్చర్లు ఇవ్వాలా ? లిటరరీ కాన్ఫరెన్సుల్లో స్పీచ్ లు చెప్పాలా ? సాహితీ సృష్టి చెయ్యాలా ? మరి ఎందుకు ? ప్రయోజం అంటూ ఉండాలి కదా ! అసలు సాహితీ ప్రయోజనం ఏమిటి ? '..'ఇంటెలెక్చువల్' అనే పదం సైతం వ్యంగ్యార్థంలో,ఒక తిట్టులా ఉపయోగిస్తున్న నేటి తరంలో రే బ్రాడ్బరీ 'ఫారెన్ హైట్ 451' ఈ ప్రశ్నలన్నిటికీ సూటైన,ధీటైన సమాధానం.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
“Now let's take up the minorities in our civilization, shall we? Bigger the population, the more minorities. Don't step on the toes of the dog-lovers, the cat-lovers, doctors, lawyers, merchants, chiefs, Mormons, Baptists, Unitarians, second-generation Chinese, Swedes, Italians, Germans, Texans, Brooklynites, Irishmen, people from Oregon or Mexico. The people in this book, this play, this TV serial are not meant to represent any actual painters, cartographers, mechanics anywhere. The bigger your market, Montag, the less you handle controversy, remember that! All the minor minor minorities with their navels to be kept clean. Authors, full of evil thoughts, lock up your typewriters. They did. Magazines became a nice blend of vanilla tapioca. Books, so the damned snobbish critics said, were dishwater. No wonder books stopped selling, the critics said. But the public, knowing what it wanted, spinning happily, let the comic books survive. And the three-dimensional sex-magazines, of course. There you have it, Montag. It didn't come from the Government down. There was no dictum, no declaration, no censorship, to start with, no! Technology, mass exploitation, and minority pressure carried the trick, thank God. Today, thanks to them, you can stay happy all the time, you are allowed to read comics, the good old confessions, or trade journals.”
“Well, after all, this is the age of the disposable tissue. Blow your nose on a person, wad them, flush them away, reach for another, blow, wad, flush. Everyone using everyone else's coattails.
Technology, mass exploitation, and minority pressure carried the trick, thank God.
Books were only one type of receptacle where we stored a lot of things we were afraid we might forget. There is nothing magical in them at all. The magic is only in what books say, how they stitched the patches of the universe together into one garment for us.
With school turning out more runners, jumpers, racers, tinkerers, grabbers, snatchers, fliers, and swimmers instead of examiners, critics, knowers, and imaginative creators, the word 'intellectual,' of course, became the swear word it deserved to be. You always dread the unfamiliar. Surely you remember the boy in your own school class who was exceptionally 'bright,' did most of the reciting and answering while the others sat like so many leaden idols, hating him. And wasn't it this bright boy you selected for beatings and tortures after hours? Of course it was. We must all be alike.
Not everyone born free and equal, as the Constitution says, but everyone made equal. Each man the image of every other; then all are happy, for there are no mountains to make them cower, to judge themselves against. So! A book is a loaded gun in the house next door. Burn it. Take the shot from the weapon. Breach man's mind. Who knows who might be the target of the well-read man?
But remember that the Captain belongs to the most dangerous enemy of truth and freedom, the solid unmoving cattle of the majority. Oh, God, the terrible tyranny of the majority.
The books leapt and danced like roasted birds, their wings ablaze with red and yellow feathers.
“Everyone must leave something behind when he dies, my grandfather said. A child or a book or a painting or a house or a wall built or a pair of shoes made. Or a garden planted. Something your hand touched some way so your soul has somewhere to go when you die, and when people look at that tree or that flower you planted, you're there. It doesn't matter what you do, he said, so long as you change something from the way it was before you touched it into something that's like you after you take your hands away.
'I hate a Roman named Status Quo!' he said to me. 'Stuff your eyes with wonder,' he said, 'live as if you'd drop dead in ten seconds. See the world. It's more fantastic than any dream made or paid for in factories. Ask no guarantees, ask for no security, there never was such an animal. And if there were, it would be related to the great sloth which hangs upside down in a tree all day every day, sleeping its life away. To hell with that,' he said, 'shake the tree and knock the great sloth down on his ass.'”
But even when we had the books on hand, a long time ago, we didn't use what we got out of them. We went right on insulting the dead. We went right on spitting in the graves of all the poor ones who died before us.

Friday, June 7, 2019

Machines Like Me - Ian McEwan

మొహబ్బతే సినిమాలో ఒక సందర్భంలో బచ్చన్ గంభీరమైన స్వరంలో 'I don't like changes' అంటాడు..బిగ్ బీ వీరాభిమానిగా ఎంత బాగా చెప్పారో అని చప్పట్లు కొట్టినా మనకు నచ్చదని 'మార్పు' ఆగిపోదనేది మాత్రం సత్యం ..మనిషి చేతిలో ఉన్నదల్లా పాతను బంగారంలా భద్రంగా దాచుకుని,కొత్తను మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే..నేటి శాస్త్రసాంకేతికరంగం మానవసమాజాన్ని సమూలంగా మార్చేస్తూ అభివృద్ధి దిశగా(?) పరుగులుతీస్తోంది..Mark O'Connell రచన 'To Be a Machine' (నాన్ ఫిక్షన్) చదివినప్పుడు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషుల్ని పోలిన యంత్రాలను తయారు చెయ్యడంలో సఫలీకృతమైన శాస్త్ర సాంకేతిక రంగం హ్యూమన్ consciousness కోడ్ ని కూడా బ్రేక్ చేసే దిశగా చేస్తున్న పరిశోధనల గురించి రాశారు..ఆ చివరి ప్రయత్నం కూడా ఫలిస్తే తరువాత ఏం జరుగుతుంది ? మనుషులతో సరిసమానమైన భావోద్వేగాలు,consciousness కలిగి ఉండే రోబోట్స్ మానవ సమాజంలో సులభంగా ఇమిడిపోతాయా ? నిత్యజీవితంలో మనుషులతో వాటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతాయి ? హ్యూమనోయిడ్ రోబోట్స్ తో కలిసిమెలసి జీవించే మానవ సమాజాల  భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ? ఇటువంటి అంశాలను విశ్లేషిస్తూ బ్రిటీషు రచయిత Ian McEwan రాసిన నవలే ఈ 'Machines like me'.
Image Courtesy Google
అనగనగా 1980ల కాలంనాటి లండన్ లో ఛార్లీ ఫ్రెండ్(32) అనే ఒక యువకుడు..ఆంథ్రోపాలజీ చదివి వివిధ వృత్తులు చేసి చివరకు స్టాక్ బ్రోకర్ గా అస్థిరమైన జీవితం గడుపుతున్న ఛార్లీకి టెక్నాలజీ అంటే విపరీతమైన పిచ్చి..సాంకేతిక పురోగతికి స్వర్ణయుగంలాంటి ఎనభయ్ ల కాలంలో శాస్త్రజ్ఞులు ఆడమ్(12),ఈవ్(13) అనే 25 రోబోట్లను తయారు చేయగా అందులో ఒక ఆడమ్ ను ఛార్లీ కొనుగోలు చేస్తాడు..ఛార్లీ తల్లి వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మి,ఉన్న సొమ్మంతా వెచ్చించి కొన్న ఆడమ్ ప్రత్యేకత ఏంటంటే అతడు నీలికళ్ళతో అచ్చం మనిషిని పోలి ఉంటాడు..ఆడమ్ లో అన్ని మానవ సహజమైన భావోద్వేగాలూ ఉంటాయి..పసిబిడ్డలా ఆడమ్ కళ్ళు తెరచిన దగ్గర నుండీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వాటికనుగుణంగా తన వ్యక్తిత్వం రూపొందించుకుంటూ ఉంటాడు..ఎలక్ట్రానిక్స్,ఆంథ్రోపాలజీ లను దూరపు బంధువులనుకుంటే,నేటి ఆధునిక సమాజం వారిద్దరినీ వివాహ బంధంతో ముడివేసింది..వారి కలయికకు ప్రతిఫలమే ఈ 'ఆడమ్'.

ఇక ప్రొటొగోనిస్ట్ ఛార్లీ తన ప్రేమికురాలు మిరాండాతో సహజీవనం చేస్తూ ఉంటాడు..ఆడమ్ కు సంబంధించిన పాస్వర్డ్ వివరాలను మిరాండాకు ఇచ్చి అతడి వ్యక్తిత్వ నిర్మాణంలో ఆమెకు కూడా సరిసమానమైన భాగస్వామ్యం ఇస్తాడు ఛార్లీ..ఈ విధంగా వారు ముగ్గురూ కలిసి ఒకే అపార్టుమెంటులో జీవిస్తూ ఉంటారు..అన్ని మానవ సహజమైన భావోద్వేగాలూ ఉన్న ఆడమ్ కూడా మిరండాతో ప్రేమలో పడతాడు,ఆమె మీద తన ప్రేమను వర్ణిస్తూ హైకూలూ కూడా రాస్తుంటాడు..ఈ ప్రేమ వ్యవహారం ఛార్లీకి ఇబ్బందికరంగా ఉన్నాఆడమ్ ఒక రోబోట్ అని తన మనసుకు నచ్చజెప్పుకుంటుంటాడు..ఛార్లీ ఇచ్చిన పాత కంప్యూటర్లో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తాడు ఆడమ్..ఆ డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుని జీవితంలో స్థిర పడదామనుకుంటారు ఛార్లీ,మిరాండాలు..ఈ లోగా మిరాండా ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ఉదంతంతో కథ మలుపు తిరుగుతుంది..మిరాండాను అమితంగా ప్రేమించిన ఆడమ్(రోబోట్),ఛార్లీ ఇద్దరూ ఆమెను ఆ కేసు నుండి బయటపడెయ్యడానికి ఏం చేశారన్నది మిగతా కథ.

అటోన్మెంట్,చిల్డ్రన్ ఆక్ట్ వంటి ప్రసిద్ధి చెందిన నవలల్ని రాసిన Ian McEwan సరికొత్త నవల 'మెషీన్స్ లైక్ మీ' మానవీయ విలువలకీ,యాంత్రికతకీ మధ్య సంఘర్షణను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది..శాస్త్ర సాంకేతికాభివృద్ధి తారాస్థాయికి చేరిన ఈ కాలంలో నాన్ ఫిక్షన్ లోనే కాదు ఫిక్షన్ లో కూడా ఈ తరహా రచనలు విరివిగా ప్రచురితమవుతున్నాయి..ఈ కాల్పనిక కథలో ప్రపంచ యుద్ధ వీరుడుగా కొనియాడబడే సర్ అలాన్ ట్యూరింగ్ డెబ్భై ఏళ్ళ వృద్ధునిగా దర్శనమిస్తారు..టెక్నాలజీ పురోగతిని గురించి అలాన్ ట్యూరింగ్ బ్రతికుంటే ఎటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చారో ఇందులో చూడవచ్చు...ఆడమ్ కథ బదులు తోచని అనేక ప్రశ్నలకు తెరతీస్తుంది..మనిషికీ యంత్రానికీ మధ్య ఉన్న భేదం కేవలం భావోద్వేగాలేనా ? లేక మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసే యోచించే గుణం,భావాలను నియంత్రించుకునే వివేకం లాంటి అంశాలతో పాటు మరింకేమైనా ఉన్నాయా ? మానవ సమాజంలో అధర్మం కూడా ఒక్కోసారి నైతిక కోణం నుంచి చూస్తే ధర్మంగా అనిపిస్తుంది..మన సమాజంలో ఒక మనిషిని హత్య చెయ్యడం నేరం..కానీ ఒక మృగాన్ని తలపించే క్రూరమైన నేరం చేసిన మనిషిని చట్టబద్ధంగా హత్య చేసి శిక్షిస్తాం..మాములు మనిషి చేస్తే హత్య చట్టం చేతిలోకి చేరేసరికి ధర్మంగా రూపాంతరం చెందుతుంది..అలాగే దైనందిన వ్యవహారాల్లో,మానవ సంబంధాల్లో అసత్యాలు నిత్యావసరాలు..మోర్టాలిటీని అంగీకరించని మనిషి జీవితం,దాని చుట్టూ పెనవేసుకునే మానవ సంబంధాలు సైతం అనేకమైన అసత్యపు పునాదుల మీదే నిలబడతాయనడం అతిశయోక్తి కాదేమో..ఎంత ధర్మబద్ధుడైనా ఒక మనిషి ఒక నిర్ణీత సమయంలో ఎలా వ్యవహరిస్తాడనేది ఊహించడం సాటి మనుషులకే కష్టం..అటువంటిది మనుషులకే  అర్ధం కాని మనిషి మెదడుని మనిషి తయారు చేసిన మరో యంత్రం అర్ధం చేసుకోగలదా !! నైతికత ముసుగులో నిత్యం ఒకర్నొకరు మోసం చేసుకుంటూ బ్రతికే మానవ సమాజంలో పేరుకున్న ఈ హిపోక్రసీ ఆడమ్ లాంటి యంత్రాలకు అర్ధం కాదు..అందువల్ల శాస్త్రజ్ఞులు తయారుచేసిన మొత్తం 25 రోబోట్స్ లో కొన్ని రోబోట్స్ మానవ సమాజాన్ని అర్ధం చేసుకోలేక ఒంటరితనంతో తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనై తమ టెక్నాలజీని తామే నిర్వీర్యం చేసుకుని ఆత్మహత్యలకు పాల్పడతాయి..మిరండా కేసును పరిశీలించిన దృష్ట్యా ఆమెకు శిక్షపడాలని ఆడమ్ భావిస్తాడు..కానీ తమ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుందన్న భయంతో ఆడమ్ తల మీద దాడి చేసి అతన్ని నిర్వీర్యుణ్ణి చేస్తాడు ఛార్లీ...చివరకు మనిషి మేథస్సు వల్ల జన్మించిన యంత్రం,మనిషి నైతికత వైఫల్యం వల్ల అతని చేతిలోనే హతమవుతుంది..ఈ కథలో తమకు అనుగుణంగా ధర్మాన్ని మార్చుకునే మనుషుల నైతికవైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది..ఈ విషయంపై అలాన్ ట్యూరింగ్ వ్యక్తపరిచే అభిప్రాయాలు చదివి తీరాల్సిందే..భావోద్వేగాలను అద్భుతంగా చిత్రించగల నేర్పున్న రచయిత ఇయాన్ మాకివాన్..అయినా నా వరకూ ఈ నవలలో నచ్చని అంశాలు కూడా చాలానే ఉన్నాయి..వర్తమానంతో ముడిపెట్టి రాసినా సరిపోయే ఈ నవలను ఎనభైల దశకానికి చెందిన లండన్ రాజకీయాలకు ముడిపెట్టి రాయవలసిన అవసరం నాకైతే ఎంత మాత్రం కనిపించలేదు..కథకు సమాంతరంగా,సంబంధం లేకుండా సాగే 1980 ల నాటి లండన్ రాజకీయ స్థితిగతుల సుదీర్ఘమైన వివరణలు విసుగు తెప్పిస్తాయి..అర్జెంటీనాకూ,యునైటెడ్ కింగ్డమ్ కూ మధ్య జరిగిన Falklands War లో మార్గరెట్ థాచర్ పాత్రను గురించీ రచయిత చేసిన లోతైన విశ్లేషణలు మెచ్చుకోదగినవైనా కథకు సంబంధించి చాలా అసందర్భంగా అనిపించాయి..

'మొరాలిటీ' మనిషికి అన్నివేళలా ఎండమావిలాగే మిగిలిపోయింది..నైతికత మనిషి ఏనాటికీ సాధించలేనిదీ,మనిషికి జీవితంలో అన్వయించుకోడానికి సాధ్యం కానిదీను..మన పురాణేతిహాసాలే దీనికి సాక్ష్యం..మనిషి రూపొందించుకున్న నియమావళిలో అసత్యాలు,అధర్మాలు కూడా ఒక్కోసారి నిత్యావసరాలు..పూర్తి స్థాయి నైతిక విలువలతో బ్రతికిన మనిషి లేడు..ఇక ముందు ఉండబోడు..ఈ విషయాన్ని ఆడమ్ స్పష్టం చేస్తాడు..అతని దృష్టిలో నేరం ఎవరు చేసినా నేరమే..అది ఆడమ్ ప్రేమించిన మిరాండా చేసినా సరే(Adam’s symmetrical notion of justice)..మనిషైన ఛార్లీకీ ,యంత్రమైన ఆడమ్ కీ ఉన్న భేదం ఇక్కడే కనిపిస్తుంది..మనుషుల్ని భావోద్వేగాలే నడిపిస్తాయి..అన్నిటినీ మించి గట్ ఫీలింగ్ అనే ఒక రకమైన conscience నడిపిస్తుంది..ఈ consciousness ని ఒక యంత్రానికి ఆపాదించడం సాధ్యమేనా అంటే,సాధ్యం కాదని ఈ నవల ఋజువు చేస్తుంది..యాంత్రికత ముందు తలదించుకున్న మనిషి నైతికతకు ఈ నవల ఒక మంచి ఉదాహరణ.
సార్లు
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
I’d been expecting a friend. I was ready to treat Adam as a guest in my home, as an unknown I would come to know. I’d thought he would arrive optimally adjusted. Factory settings – a contemporary synonym for fate. My friends, family and acquaintance, all had appeared in my life with fixed settings, with unalterable histories of genes and environment. I wanted my expensive new friend to do the same. Why leave it to me? But of course, I knew the answer. Not many of us are optimally adjusted. Gentle Jesus? Humble Darwin? One every 1,800 years. Even if it knew the best, the least harmful, parameters of personality, which it couldn’t, a worldwide corporation with a precious reputation couldn’t risk a mishap. Caveat emptor.
Before us sat the ultimate plaything, the dream of ages, the triumph of humanism – or its angel of death.
Only anthropologists, who studied other cultures in depth, who knew the beautiful extent of human variety, fully grasped the absurdity of human universals. People who stayed behind at home in comfort understood nothing, not even of their own cultures. One of my teachers liked to quote Kipling – ‘And what should they know of England who only England know?'
He stood before me, perfectly still in the gloom of the winter’s afternoon. The debris of the packaging that had protected him was still piled around his feet.He emerged from it like Botticelli’s Venus rising from her shell.
I had a sense then of his loneliness, settling like a weight around his muscular shoulders. He had woken to find himself in a dingy kitchen, in London SW9 in the late twentieth century, without friends, without a past or any sense of his future. He truly was alone.
We could become slaves of time without purpose. Then what? A general renaissance, a liberation into love, friendship and philosophy, art and science, nature worship, sports and hobbies, invention and the pursuit of meaning? But genteel recreations wouldn’t be for everyone.Violent crime had its attractions too, so did bare-knuckle cage-fighting, VR pornography, gambling, drink and drugs, even boredom and depression. We wouldn’t be in control of our choices. I was proof of that.
Today, I welcomed and forgave everyone. We would all turn out well. We were all bound together in our own overlapping but distinct forms of comedy. Others might also have a lover living with a death threat. But no one else with an arm in a cast had a machine for a love rival.
‘We don’t see everywhere. We can’t see behind our heads. We can’t even see our chins. Let’s say our field of vision is almost 180 degrees, counting in peripheral awareness. The odd thing is, there’s no boundary, no edge. There isn’t vision and then blackness, like you get when you look through binoculars. There isn’t something, then nothing. What we have is the field of vision, and then beyond it, less than nothing.’‘So?’‘So this is what death is like. Less than nothing. Less than blackness. The edge of vision is a good representation of the edge of consciousness. Life then death. It’s a foretaste, Charlie, and it’s there all day
Transcribing human experience into words, and the words into aesthetic structures isn’t possible for a machine.
The collar of his suit jacket became snared on a chrome plate that housed a seat-belt reel. When I unhooked him, he seemed to think his dignity was compromised. As we began the long crawl through Wandsworth he was moody, our reluctant back-seat teenage son on a family outing.
ఆడమ్ లో పేరుకున్న నిరాశ, 
‘A self, created out of mathematics, engineering, material science and all the rest. Out of nowhere. No history – not that I’d want a false one. Nothing before me. Self-aware existence. I’m lucky to have it, but there are times when I think that I ought to know better what to do with it. What it’s for. Sometimes it seems entirely pointless'
I couldn’t quite say why, but it was both comic and sad that he was wearing a seat belt.

Thursday, April 4, 2019

Tao Te Ching : A Book about the Way and the Power of the Way - Lao Tzu

జీవితంలో ఏ దశలో చదివినా అందులోనుండి ఎంతో కొంత సారం గ్రహించి జీవితానికి అన్వయించుకోడానికి దోహదపడే పుస్తకాలు కొన్నుంటాయి..టావోయిజానికి మూలగ్రంధమైన 'Tao Te Ching' అటువంటిదే..క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చైనా తత్వవేత్త లావో త్జు  రాసిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ పాఠకులు హృదయానికి హత్తుకుంటున్నారు.కన్ఫ్యూషనిజం,చైనాలో బుద్ధిజం వంటి ఇతర తత్వాలపై ఈ రచన బలమైన ప్రభావాన్ని చూపించింది..దీనిని అనువదించిన ఉర్సులా లెగైన్ తన బాల్యంలో 'లావో త్జు' ను చదువుతూ పెరిగానంటూ,ఈ కవితలు తన జీవితంలో ఎదురైన అనేక చిక్కుముడుల్ని సునాయాసంగా విప్పి చూపించాయంటారు..'Tao Te Ching' కు ఇంతకు మునుపు అనేక అనువాదాలు వెలువడ్డా,ఉర్సులా లెగైన్ అనువాదంలో ఒక ప్రత్యేకత ఉంది..అదేమిటంటే కవితల్ని అనువాదం చేసి  వదిలెయ్యకుండా,దాని క్రింద ఆమె తనదైన శైలిలో చేసిన విశ్లేషణ,ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.
Image Courtesy Google
సాధారణ అంశానికి కూడా సంక్లిష్టతను ఆపాదించి తప్ప సహజంగా చూడడం మర్చిపోయిన నేటి తరానికి సరళత్వం విలువను తెలియజేస్తుందీ పుస్తకం..సంక్లిష్టమైనదాన్నే ఉత్తమమైనదనుకునే భ్రమ బలంగా నాటుకున్న తరుణంలో సహజంగా,నిరాడంబరంగా ఉండడంలో గొప్పదనాన్ని గుర్తుచేస్తుందీ తత్వం..ఇది చదువుతుంటే సంఘర్షణల జీవన వాహినిలో కొట్టుకుపోతున్నవారికి చల్లని చెట్టు క్రింద సేద తీరినట్లు ఉంటుంది..ఇందులో వాక్య నిర్మాణం గద్యాన్నీ,పద్యాన్నీ ఏకకాలంలో తలపిస్తుంది..చైనా సంస్కృతిలో ఏ విషయ సంబంధిత అస్తిత్వాన్నైనా పరస్పర విభిన్నమైన 'ఇన్ అండ్ యాంగ్' (Yin and Yang) లుగా అభివర్ణిస్తారు..టావో అర్ధం కూడా ఇదే..ఇందులో అన్ని పద్యాలూ 'ఇన్-యాంగ్' రూపంలో ఉంటాయి..అంటే మంచి-చెడు,సంతోషం-దుఃఖం,నింగీ-నేల,చావు-బ్రతుకు,కష్టం-సుఖం,ఎత్తు-పల్లం,ముందు-వెనుక మొదలైన పరస్పర భిన్నమైన అంశాలను ఉపయోగించి ఈ పద్యాలను కూర్చారు..లావో దృష్టిలో ఈ వైరుధ్యమే ప్రపంచంలో సంతులనాన్ని నిలబెడుతుంది.

"కోర్కెలను త్యజించినవాడు అంతరాంతరాల్లో దాగి ఉన్న దాన్ని కూడా చూస్తాడు
నిత్యం కోర్కెలతో సతమతమయ్యేవాడు తాను కోరుకున్నది మాత్రమే చూస్తాడు"

అన్నప్పుడు మన దృష్టికోణాన్ని వ్యామోహాలతో మసకబారనీకుండా స్పష్టంగా ఉంచుకుంటే,సృష్టి రహస్యం దానంతట అదే తేటతెల్లమవుతుందని బోధిస్తారు.

(స్వయం) ప్రకాశాన్ని మసకబరుచుకోమని చెప్పే మరో పద్యంలో,

"స్వర్గం ఎప్పటికీ ఉంటుంది,
భూమి తుదకంటా భరిస్తుంది,
ఎందువల్ల ?
వాటి ఉనికి తమకోసం కాదు..
అందుకే వివేకవంతులు తమ ఉనికిని వీడి ముందుకు సాగుతారు.."

మరో పద్యంలో స్వభావంలో సరళత ఆవశ్యకతను గురించి ఈ విధంగా వ్రాస్తారు..

"నిజమైన మంచితనం నీరు వంటిది
నీరు అన్నిటికీ మంచిది
అది దేనితోనూ పోటీ పడదు..

అది తిన్నగా లోతట్టు ప్రాంతంలోని కలుషితమైన నీటి గుండా కూడా
దారి చేసుకుంటూ ముందుకు ప్రయాణిస్తుంది..

ఇల్లు భూమి మీద సమమైన ఎత్తులో ఉంటే మంచిది
ఆలోచన లోతుగా ఉంటే మంచిది
ఇవ్వడంలో ఔదార్యం మంచిది
మాట్లాడడంలో నిజాయితీ మంచిది
ప్రభుత్వానికి చట్టము మంచిది
పనికి నైపుణ్యము మంచిది
కర్మకు తగిన సమయము మంచిది
పోటీతత్వం లేకపోతే నిందన్నదే లేదు.."

అన్నప్పుడు ఈ పుస్తకంలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఒక పద్యం నుండి మరొక పద్యానికి ప్రవహిస్తోందా అనిపిస్తుంది అంటారు ఉర్సులా.

మానసిక శక్తి రహస్యాలను ఛేదించే మార్గాల మీద దృష్టి సారిస్తూ చెప్పిన ఈ పద్యం అన్నిటికంటే నచ్చిన పద్యం.

"తెలిసినవాళ్ళు మాట్లాడరు
మాట్లాడేవారికి తెలియదు

తెరుచుకున్నవాటిని మూసివేయడం,
తలుపులు వేసేయడం,
అంచుల పదును తగ్గించుకోవడం,
బంధాలను కోల్పోవడం,
ప్రకాశాన్ని మసకబరుచుకోవడం ,
మార్గంలోని ధూళిగా మారడం వలన లోతైన సారూప్యతను పొందుతావు

అప్పుడు ప్రేమ-తిరస్కారం నిన్ను నియంత్రించలేవు ..
లాభం-నష్టం నిన్ను నియంత్రించలేవు..
పొగడ్త-అవమానం నిన్ను నియంత్రించలేవు..
నీ కీర్తి ఆకాశం క్రిందంతా వ్యాపించి ఉంటుంది."

అధికశాతం తత్వశాస్త్రాల్లా కాకుండా టావో మార్గం బహు సరళం..ఉర్సులా లెగైన్ టావో సూచించిన మార్గాన్ని తన అనువాదంలో 'way' అని అంటారు..ఇది లావో త్జు దృష్టిలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన దారి..కానీ లావో మార్గంలో మార్పును స్వాగతించని కాఠిన్యం కూడా కొన్ని కవితల్లో ద్యోతకమవుతుంది..మార్పు వినాశనానికి దారి తీస్తుందని ఆయన భావిస్తారు..కానీ స్పష్టత బొత్తిగా ఆపాదించని ఆ పదాలను మరోసారి అవలోకనం చేస్తే బహుశా ఆరోగ్యకరమైన మార్పును కాక 'అతి/తీవ్రమైన' మార్పులను ఉద్దేశించి ఆ విధంగా అన్నారేమో అనిపిస్తుంది..ఈ కవితల్లో ఆదర్శవంతమైన టావో మార్గంలో (Way) లో ప్రయాణించే వ్యక్తిని పలుచోట్ల 'Wise soul' అని సంబోధిస్తారు..సాధారణంగా ఒక జ్ఞానినో,గొప్ప వ్యక్తినో,ఉత్తముడినో,ఋషులనో 'wise soul' అని మనం సంబోధిస్తాము..కానీ టావో చెప్పే 'wise soul' ఒక అజ్ఞాని,నిరక్షరాస్యుడు,అనాగరికుడు ఇలా ఎవరైనా కావచ్చు..అంటే 'ఏ ప్రత్యేకతా లేనివాడు' కూడా లావో సూచించిన మార్గంలో 'వివేకవంతుడు' గా కనబడతాడు.
సరళత/నిరాడంబరత లావో తత్వంలో ప్రధాన వస్తువులు..పుస్తకం చివర్లో ఉర్సులా లెగైన్ ఒక్కో అధ్యాయానికీ చేసిన విశ్లేషణ టావోను మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి దోహదపడుతుంది.

Thursday, March 14, 2019

Zucked : Waking Up to the Facebook Catastrophe - Roger McNamee

రెండేళ్ళ క్రితం అనుకుంటా జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 చదివాను..అందులో Oceania అనే కల్పిత దేశాన్ని పాలించే పార్టీ అధినేత 'బిగ్ బ్రదర్' (మనకు కనిపించడు) 'Thought policing' ద్వారా జనాల ఆలోచనలపై సైతం నిఘా పెడతాడు..అలాగే తమ పార్టీ భావాలకు అనుకూలంగా ఆలోచనతో నిమిత్తం లేని,భావాలను స్వేచ్ఛగా ప్రకటించడానికి సాధ్యం కాని 'Newspeak' అనే కొత్త భాషను ప్రవేశపెడతాడు..వ్యవస్థను అభివృద్ధి దిశగా ప్రభావితం చెయ్యవలసిన శక్తిమంతమైన మీడియా ప్రభుత్వం చేతిలో ఆయుధంగా మారితే సామాన్య ప్రజానీకానికి కలిగే నష్టాలేమిటో ఈ రచనలో అద్భుతంగా చూపించారు ఆర్వెల్..ఈ నవలలో మనిషి స్వేచ్ఛను మొదలంటా హరించివేసిన ఆర్వెల్ సృష్టించిన అథారిటేరియన్ సమాజాన్ని ఫిక్షన్ అని భ్రమపడి ఏమంత సమయం  కాలేదు..మన ఇళ్ళల్లో చాలా మంది 'బిగ్ బ్రదర్లు' మనకు కనిపించకుండా రహస్యంగా మన కార్యకలాపాలను గమనిస్తున్నారు..వాళ్ళకి మనకి కోపం ఎప్పుడొస్తుందో తెలుసు..మనం ఎప్పుడు ఏడుస్తామో తెలుసు,ఎప్పుడు నవ్వుతామో తెలుసు...మన గురించి మనక్కూడా తెలీని అనేక విషయాలు ఈ బిగ్ బ్రదర్లకి తెలుసు..Roger McNamee రాసిన 'Zucked' చదవడం పూర్తి చేశాక,మనం అందరం ప్రస్తుతం 1949 సంవత్సరంలో జార్జ్ ఆర్వెల్ హెచ్చరించిన 1984 డిస్టోపియన్ సొసైటీలోనే బ్రతుకుతున్నామని తెలియడం నా వరకూ ఒక పెద్ద షాక్.
Image Courtesy Google
'ఫిల్టర్ బబుల్స్' లో మనిషి మేథను ఖైదు చేసి,అల్గోరిథమ్స్ ను తమ సంస్థ ఆర్ధికాభివృద్ధికి అనువుగా మార్చుకుంటూ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి మెదడుని క్రమంగా తమ నియంత్రణలోకి తీసుకుంటూ,  ప్రపంచంలో శక్తిమంతమైన సోషల్ నెట్వర్కింగ్ సంస్థగా ఎదిగిన ఫేస్బుక్ వలన సమాజానికి జరుగుతున్న  నష్టాలనూ,భవిష్యత్తు తరాలకు పొంచి ఉన్న పెను ప్రమాదాలనూ రోజర్ ఈ పుస్తకంలో విస్తృతంగా చర్చించారు..మార్క్ జుకెర్బెర్గ్ కు ఒకప్పుడు ముఖ్య సలహాదారుగా వ్యవహరించడంతో పాటు,ఫేస్బుక్ CEO షెరిల్ సాండ్బర్గ్ నియామకం వరకూ,రోజర్ మెక్నమీ ఫేస్బుక్ ప్రస్థానంలో కీలకపాత్ర పోషించారు..ఈవిధంగా ఆయన మొదట్నుంచీ సిలికాన్ వాలీ అంతర్భాగంగా ఉంటూ వచ్చారు..అందువల్ల ఈ పుస్తకంలో రోజర్ చర్చించిన అంశాలన్నీ ఫేస్బుక్ పనితీరుకి ఒక ప్రత్యక్ష సాక్షి చేసిన పరిశీలనలుగా పరిగణించాలి.

ఇందులో టెక్నాలజీ రంగంతో ప్రత్యక్ష సంబంధం లేని సామాన్యులకు సైతం విభ్రాంతిని కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి..ఉదాహరణకు 2016 ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక..రష్యన్లు ఫేస్బుక్ లొసుగుల్ని సమర్ధవంతంగా స్వప్రయోజనార్ధం వాడుకుని 2016 అమెరికా ఎన్నికల్లో పరోక్షంగా పావులు కదిపారు..దీనితో పాటు వినియోగదారుల అనుమతి లేకుండా కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ 87 మిలియన్ల ఫేస్బుక్ ప్రొఫైళ్లను హ్యాక్ చేసింది,ఇది Brexit మీద ఎటువంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే..ఇవే కాకుండా ఫేస్బుక్ పోస్టుల ద్వారా మియన్మార్ లో ద్వేషాన్ని రగిలించిన రోహింగ్యా సంక్షోభం మరో వైపు..ఇలా అడుగడుగునా 'గోప్యత' విషయంలో ఫేస్బుక్ తమ అసమర్ధతను చాటుకుంటూనే ఉంది..ప్రజాస్వామ్యానికి శరాఘాతంలా ఇన్ని ఉదంతాలు జరిగినా ఫేస్బుక్ వ్యవహారంలో పెనుమార్పులేవీ చోటు చేసుకోలేదంటారు రోజర్..'యూజర్ డేటా ప్రైవసీ' విషయంలో ఫేస్బుక్ ఇప్పటికీ అదే నిర్లక్ష్యధోరణి చూపిస్తోంది..థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కు తలుపులు తెరవడం ద్వారా మనిషి ఆన్లైన్ ఆక్టివిటీస్ పై నిరంతరం నిఘా పెడుతోంది..ఈ నిఘా ఫేస్బుక్ కి మాత్రమే పరిమితమైందనుకుంటే పొరపాటే,గూగుల్,అమెజాన్ లాంటి టెక్నాలజీ జెయింట్స్ కూడా ఇదే కోవలో పని చేస్తున్నాయి..ఉదాహరణకు అమెజాన్ అలెక్సాను మన దైనందిన కార్యకలాపాలపై కన్ను వేసి ఉంచే గూఢచారిగా అభివర్ణిస్తారు రోజర్..మనిషి మనస్తత్వాన్ని అల్గోరిథమ్స్ తో అంచనా వేస్తూ,దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు మేతగా వేస్తూ,మనుషుల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న టెక్నాలజీ రంగం రానున్న కాలంలో మేథను పూర్తిగా నాశనం చేసి మనుషుల్ని పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు రోజర్..నేటి తరానికి సోషల్ నెట్వర్కింగ్ ఒక వ్యసనంగా మారిన తరుణంలో దాని వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకునేలా చేస్తుంది ఈ పుస్తకం.

కేవలం టెక్నాలజీ వల్ల కలిగే నష్టాల్ని ఏకరువు పెట్టడం కాకుండా ఈ పుస్తకంలో కంప్యూటర్స్ ఆవిర్భావం,టెక్నాలజీ,సోషల్ నెట్వర్కింగ్,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మొదలు నేటి సెల్ ఫోన్స్ వరకూ సిలికాన్ వాలీ పురోగతికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్నీ పొందుపరిచారు..టెక్నాలజీ రంగంలో ఫేస్బుక్ తొలి అడుగులు వేస్తున్న సమయం నుండీ మొదలుపెట్టి మార్క్ జుకెర్బెర్గ్ వ్యూహాన్ని వివరంగా రాశారు..జుకెర్బెర్గ్ ఫేస్బుక్ మొదలుపెట్టినప్పుడు ప్రజలందర్నీ ఒకే చోటికి చేర్చాలనే మంచి ఆదర్శంతో మొదలుపెట్టినా,టెక్నాలజీ రంగంలో ఎదురులేని జైంట్ గా ఎదిగే క్రమంలో ఫేస్బుక్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చింది..ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుని తన విజయానికి సోపానాలు వేసుకుంది..ప్రస్తుతం ఫేస్బుక్ కు అనుబంధంగా ఉన్న ఇంస్టాగ్రామ్,వాట్సాప్,Oculus లాంటి వాటి కొనుగోలు ద్వారా స్టార్ట్ అప్స్ కు అవకాశాలు ఇవ్వకుండా,మర్రి చెట్టులా మారి టెక్నాలజీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది..కేవలం 33 ఏళ్ళ వయసులో అసంభవాన్ని సంభవం చేసిన మార్క్ బిజినెస్ స్ట్రాటజీని ఒక వ్యాపారాత్మక కోణం నుంచి చూస్తే మెచ్చుకోవచ్చు..కానీ మైక్రోసాఫ్ట్,ఆపిల్ లాంటి సంస్థల్లా ఫేస్బుక్ వ్యాపారంలో మానవీయ విలువలకు తావులేదు..“move fast and break things” సిద్ధాంతాన్ని పాటించే ఫేస్బుక్ తన దృష్టంతా విజయంవైపే పెడుతుంది తప్ప 'ప్రజాప్రయోజనం' గురించి ఇసుమంతైనా ఆలోచించదు..స్టీవ్ జాబ్స్ టెక్నాలజీని 'Bicycle for the mind' లా ఉండాలని అంటారు..టెక్నాలజీ మేథకు పదునుపెట్టి,అభివృద్ధి దిశగా నడిపించేదై ఉండాలి గానీ,నేటి సోషల్ మీడియాలా ప్రజల్ని అసమర్థుల్లా,వ్యసనపరులుగా మార్చేదిగా ఉండకూడదంటారు స్టీవ్.

ఈ పుస్తకంలో రోజర్ కేవలం సమస్యని చూపించి వదిలెయ్యకుండా దీనికి కొన్ని పరిష్కారాలు కూడా సూచించారు ..'human driven technology' ని ఈ సమస్యకు ప్రధాన పరిష్కారంగా చూపిస్తూ,ఫేస్బుక్ కి  చెక్ పెట్టాలంటే అది వినియోగదారునితోనే మొదలవ్వాలంటారు..వినియోగదారుడికి తన డేటా మీద సర్వ హక్కులూ ఉండేలా కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలని ప్రతిపాదిస్తారు..

There should be a version of social media that is human-driven. Facebook and Google seem to have discarded the bicycle for the mind metaphor. They advocate AI as a replacement for human activity, as described in a recent television ad for Google Home: “Make Google do it.

ఇప్పటికీ రోజర్ ఫేస్బుక్ వాడతారట,కానీ తన కంట్రోల్ ఫేస్బుక్ చేతికి ఇవ్వలేదంటారు..కుల మత రాజకీయ విషయాలపై వాదనలు,చర్చలు చెయ్యడం,అటువంటి పోస్ట్స్ రాసే 'Bad actors' ను ప్రోత్సహించడం,తమ ఐడియాలజీని సమర్ధించుకునే దిశగా 'hate speech', 'free speech' వంటివి కూడదంటారు..దానితో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం,మొబైల్ నోటిఫికెషన్స్ ను అస్తమానం చెక్ చేసుకోకపోవడం లాంటివి మంచి ఫలితాలనిస్తాయంటూ,పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు..సోషల్ మీడియా కు బయట మానవసంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరమంటారు..

There is a sufficiency in the world for man's need but not for man's greed. అంటారు మహాత్ముడు..
అటు వ్యాపారవేత్తలకే కాదు,ఇటు వినియోగదారులకి కూడా ఈ సూత్రం ఇంతవరకూ వంటబట్టినట్లు లేదు..హార్వార్డ్ యూనివర్సిటీ నుండీ మొదలుపెట్టి ఈరోజు వరకూ తన నిర్లక్ష్య ప్రవర్తనకు నిత్యం క్షమాపణలు చెప్పడం అలవాటైన మేధావి జుకెర్బెర్గ్ ఆసక్తికరమైన ప్రస్థానం ప్రక్కన పెడితే ఈ మొత్తం సమస్యకు అతణ్ణి మాత్రమే బాధ్యుణ్ణి చెయ్యడం సమంజసమేనా అని ఒక్క క్షణం నన్ను నేను ప్రశ్నించుకున్నాను..మరి బాధ్యత ఎవరిది ?? బహుశా సెల్ ఫోన్ కనిపెట్టినవాడు కూడా ఒక మంచి ఉద్దేశ్యంతోనే కనిపెట్టాడు..కానీ ఇక్కడ గంటలు గంటలు ఫోన్ సెన్స్ లేకుండా ఉపయోగిస్తూ,దానికి ఒక బానిసగా మారిన వినియోగదారుడి తప్పా ? లేక జీవంలేని సెల్ ఫోన్ తప్పా ? గ్లోబ్ మొత్తంలో వివిధ సంస్కృతులకు సంబంధించిన మనుషులందరూ కలిసి ఒక చోటికి చేరే అవకాశం వస్తే దాన్ని పండగలా మార్చుకోవడం చేతకాని మానవజాతి మనది..కుల,మత,భాష,జాతి వైషమ్యాలతో ఒకర్నొకరు నిరంతరం ద్వేషించుకుంటూ,ఏ పనీలేక కాలక్షేపానికి ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో యుద్దాలు చేస్తున్న ఉత్తరకుమారులం మనం..ఫ్రీ స్పీచ్,లిబరల్ సొసైటీ ముసుగులో జనాల్ని రెచ్చగొట్టే రాతలు రాస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్న తీవ్రవాదులం మనం..కానీ మన తప్పులకు బాధ్యత తీసుకోవడం మానవ నైజం అస్సలు కాదు కాబట్టి మార్క్ జుకెర్బెర్గ్ నో ,పీటర్ థీల్ నో, ఎలోన్ మస్క్ నో, మరో అంబానీనో వేలెత్తి చూపిద్దాం..మన బలహీన మనస్తత్వాలపై మనకే అదుపాజ్ఞలు లేని మనం,వాటిని పెట్టుబడిగా పెట్టి సమర్ధవంతంగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారవేత్తలను బాధ్యుల్ని చేద్దాం..ఇది చదివాకా నేను ఫేస్బుక్ ను బహుశా మునుపటిలా వాడలేను..ఎందుకంటే నా ఎమోషన్స్ ని కాష్ చేసుకునే వారంటే నాకు అసహ్యం.. :) ఇంత మంచి పుస్తకాన్ని రికమెండ్  చేసిన నాగరాజు పప్పు గారికి కృతజ్ఞతలు.

పుస్తకం నుండి కొన్ని,
He asserted that Facebook was technically a platform, not a media company, which meant it was not responsible for the actions of third parties.

It never occurred to me that success would lead to anything but happiness.

Unfortunately, the pioneers of the internet made omissions that would later haunt us all. The one that mattered most was the choice not to require real identity. They never imagined that anonymity would lead to problems as the web grew.

You can imagine how attractive a philosophy that absolves practitioners of responsibility for the impact of their actions on others would be to entrepreneurs and investors in Silicon Valley. They embraced it. You could be a hacker, a rebel against authority, and people would reward you for it. Unstated was the leverage the philosophy conferred on those who started with advantages. The well-born and lucky could attribute their success to hard work and talent, while blaming the less advantaged for not working hard enough or being untalented. Many libertarian entrepreneurs brag about the “meritocracy” inside their companies.

Peter Thiel, Elon Musk, Reid Hoffman, Max Levchin, Jeremy Stoppleman, and their colleagues were collectively known as the PayPal Mafia, and their impact transformed Silicon Valley.Not only did they launch Tesla, Space-X, LinkedIn, and Yelp, they provided early funding to Facebook and many other successful players.

Too many in Silicon Valley missed the lesson that treating others as equals is what good people do.

Zuck and his executive team did not anticipate that people would use Facebook differently than Zuck had envisioned, that putting more than two billion people on the same network would lead to tribalism, that Facebook Groups would amplify that tribalism, that bad actors would take advantage to harm innocent people. They failed to imagine unintended consequences from an advertising business based on behavior modification. They ignored critics. They missed the opportunity to take responsibility when the reputational cost would have been low.

Like most successful entrepreneurs and executives, Zuck is brilliant (and ruthless) about upgrading his closest advisors as he goes along. In the earliest days of Facebook, Sean Parker played an essential role as president,but his skills stopped matching the company’s needs, so Zuck moved on from him. He also dropped the chief operating officer who followed Parker and replaced him with Sheryl. The process is Darwinian in every sense. It is natural and necessary.

What I did not grasp was that Zuck’s ambition had no limit. I did not appreciate that his focus on code as the solution to every problem would blind him to the human cost of Facebook’s outsized success. And I never imagined that Zuck would craft a culture in which criticism and disagreement apparently had no place.

Algorithms would not act in a socially responsible way on their own. Users would think they were seeing a balance of content when in fact they were trapped in what Eli called a “filter bubble” created and enforced by algorithms. He hypothesized that giving algorithms gatekeeping power without also requiring civic responsibility would lead to unexpected, negative consequences. Other publishers were jumping on board the personalization bandwagon. There might be no way for users to escape from filter bubbles. Eli’s conclusion? If platforms are going to be gatekeepers, they need to program a sense of civic responsibility into their algorithms. They need to be transparent about the rules that determine what gets through the filter. And they need to give users control of their bubble.

Google realized that its data set of purchase intent would have greater value if it could be tied to customer identity. I call this McNamee’s 7th Law: data sets become geometrically more valuable when you combine them.

It's not because anyone is evil or has bad intentions. It’s because the game is getting attention at all costs. —TRISTAN HARRIS

Adults get locked into filter bubbles, which Wikipedia defines as “a state of intellectual isolation that can result from personalized searches when a website algorithm selectively guesses what information a user would like to see based on information about the user, such as location, past click-behavior and search history.” Filter bubbles promote engagement, which makes them central to the business models of Facebook and Google.

It turns out that connecting 2.2 billion people on a single network does not naturally produce happiness for all. It puts pressure on users, first to present a desirable image, then to command attention in the form of Likes or shares from others. In such an environment, the loudest voices dominate,which can be intimidating. As a result, we follow the human instinct to organize ourselves into clusters or tribes. This starts with people who share our beliefs, most often family, friends, and Facebook Groups to which we belong. Facebook’s News Feed enables every user to surround him- or herself with like-minded people. While Facebook notionally allows us to extend our friend network to include a highly diverse community, in practice, many users stop following people with whom they disagree. When someone provokes us, it feels
good to cut them off, so lots of people do that. The result is that friends lists become more homogeneous over time, an effect that Facebook amplifies with its approach to curating News Feed. When content is coming from like-minded family, friends, or Groups, we tend to relax our vigilance, which is one of the reasons why disinformation spreads so effectively on Facebook.

Facebook’s terms of service have one goal and one goal only: to protect the company from legal liability. By using the platform, we give Facebook permission to do just about anything it wants.

At a time when technology could do practically anything, entrepreneurs chose to exploit weaknesses in human psychology. We’re just beginning to understand the implications of that.

ఒకే రకమైన నమ్మకాలను కలిగి ఉన్న గ్రూపుల్లో (ఫిల్టర్ బబుల్స్) ఉండడం 'intellectual isolation' కు దారితీస్తుందంటారు.
What differentiates filter bubbles from normal group activity is intellectual isolation. Filter bubbles exist wherever people are surrounded by people who share the same beliefs and where there is a way to keep out ideas that are inconsistent with those beliefs. They prey on trust and amplify it.

Thanks to Facebook’s extraordinary success, Zuck’s brand combines elements of rock star and cult leader.

ఫేస్బుక్ నిర్ణయాల విషయంలో జుక్,షెరిల్ ల తిరుగులేని ఆధిపత్య ధోరణిని వర్ణిస్తూ,
If you wanted to draw a Facebook organizational chart to scale, it would look like a large loaf of bread with a giant antenna pointing straight up. Zuck and Sheryl are at the top of the antenna, supported by Schrage until he departed, the company’s chief financial officer David Wehner, product boss Chris Cox, and a handful of others. Everyone else is down in the loaf of bread. It is the most centralized decision-making structure I have ever encountered in a large company, and it is possible only because the business itself is not complicated.

Instead, Facebook defied its critics without even acknowledging their existence. The company’s message to the world—“nothing to see here, move along”

Everybody gets so much information all day long that they lose their common sense. —GERTRUDE STEIN.

Monday, March 4, 2019

Here - Wisława Szymborska

బడుగు జీవితాలకు అద్దం పట్టలేని సాహిత్యానికి ప్రయోజం శూన్యమని రియలిస్టులు అంటే,సాహిత్యమంటే కష్టజీవుల స్వేదమే కాదోయ్,గులాబీ పరిమళాలు కూడానోయ్ అని  కాల్పనికవాదులంటారు..సాహిత్యంలో హేతువాదులకీ,భావుకులకీ ఎప్పుడూ చుక్కెదురే..అసలు సాహితీ ప్రపంచంలోజరిగిన/జరుగుతున్న యుద్ధాలన్నిటికీ ఇదే ప్రధాన కారణమని చరిత్ర చెబుతోంది :)
Image Courtesy Google

సాహిత్యమంటే ఏమిటనే తార్కికవాదాన్ని తర్కానికొదిలేస్తే,కొందరు కవులు తమ చుట్టూ,తమ ఉనికిని నిరంతరం ప్రభావితం చేసే రాజకీయ,సామజికాంశాలను కవితా వస్తువుగా చేసుకుంటే,వాటికి సుదూరమైన రచనలు చేసి లోకాన్ని మెప్పించినవాళ్ళూ ఉన్నారు..కవిత్వానికి మూల వస్తువు ఏమిటన్నది,కవి అనుభూతి చెందే విషయాలను బట్టి ఉంటుంది,ఆ అనుభూతి వ్యక్తిగతమైనది కావచ్చు లేదా సామాజికపరమైనదీ కావచ్చు..నిజానికి బాహ్య ప్రపంచపు ప్రభావాలకు లోనుకాకపోవడమే మనిషికి అసలు సిసలైన వ్యక్తిగత విజయమని అన్ని ఫిలాసఫీలూ ఏక కంఠంతో తీర్మానిస్తాయి..ఇదే నిజమైతే నోబెల్ గ్రహీత అయిన పోలిష్ రచయిత్రి, Wisława Szymborska కవిత్వాన్ని ఒక కవయిత్రిగా ఆమె సాధించిన విజయంగా చూడవచ్చేమో !! ఎందుకంటే ఆమె కవిత్వం పూర్తి వ్యక్తిగతమైనదీ,అంతః ప్రపంచపు అనుభూతులతో నిండి ఉన్నదీను..

ఒకప్పుడు కవిత్వం అంటే అదేదో దేవభాష అనుకునే నాలాంటి వాళ్ళకి కవిత్వాన్ని అనుభూతి చెంది,ఆనందించేలా చేసిన వారిలో గుల్జార్ ప్రప్రథములు..ఆ తరువాత జావేద్ అఖ్తర్,సాహిర్ లుధియాన్వీ లాంటివారు ఆ అనుభూతిని మరింత చేరువ చేస్తే ఠాగోర్,రూమీ,హఫీజ్ లాంటివారు తమ కవితాపథాల్లో తడబడకుండా నా చేయి పట్టుకు నడిపించారు..కొన్నేళ్ళ క్రిందట రూపీ కౌర్ లాంటి వారిని చదివి,కవిత్వమంటే ఇదేననుకున్న నా భ్రమల్ని దూరం చేస్తూ,తుఫానులా చుట్టుముట్టిన పెస్సోవా కవిత,అంతవరకూ అందని చందమామను తెచ్చి నా అరచేతిలో పెట్టింది..తొలిసారి పాశ్చాత్య కవిత్వం చేరువదనాన్ని చవిచూపించింది..మళ్ళీ ఇప్పుడు Wisława Szymborska ను చదువుతున్నప్పుడు అదే చేరువతనం అనుభవించాను..అంతకుమునుపు చదివిన కవుల సంగతి చూస్తే,దురదృష్టవశాత్తూ నెరుడా ప్రేమను ఆస్వాదించలేక,తిరస్కరించిన నా హేతువాదపు తత్వం,మేరీ అలీవర్ కవితలోని ఆకుపచ్చని జీవధారకు మాత్రం ఆత్మీయంగా తలవంచింది..పెస్సోవా తన కవిత్వం మాటున దాక్కుని దోబూచులాడే పసివాణ్ణి తలపిస్తే,మేరీ ఆలీవర్ తన కవితల్లోని సమస్త జీవజాలంలో,ఆకుపచ్చని ప్రకృతిలో తనను వెతుక్కోమంటారు.

పాశ్చాత్య కవితతో అంతగా సాన్నిహిత్యంలేని నా లాంటి పామరుల్ని కూడా తొలి పరిచయంలో దగ్గర చేసుకున్న వీరికీ మిగతా కవులకీ ఉన్న తేడా ఏంటా అని ఆలోచించగా,వీళ్ళెవరూ నిర్వచనాల దరిదాపుల్లోకి కూడా పోరనీ,సౌకర్యవంతమైన సంప్రదాయ చట్రాల్లో ఇమిడే వర్గం కాదని అర్ధం అయ్యింది..వీరి వచనానికి దేశపు సరిహద్దులు అడ్డం రావు..వీరి కవిత్వానికి కుల,మత,వర్గ,జాతి,లింగ వైరుధ్యపు జాడ్యాల జాడలతో కూడిన సిరా మరకలంటవు..'ఈ విశ్వంలో నాదొక  పరమాణువంత ఉనికి' అని తప్ప వీరి కవిత్వానికి మరో స్పృహ ఉండదు..ఈ కారణాల వల్ల సింబోర్స్కా ను చదువుతున్నప్పుడు అది పాశ్చాత్య కవిత్వమనే భావన పాఠకులకు కలగదు.

సింబోర్స్కా కవితా నేపథ్యం సార్వత్రికమూ,సార్వజనీనమైనదీనూ..మనిషిలో సమస్త విశ్వమంతా నిబిడీకృతమై ఉంటుందంటే ఏమో అనుకున్నాను..కానీ ఈ కవిత్వం చదువుతుంటే బాహ్య ప్రపంచంలోకి తెరుచుకునే ద్వారాలన్నిటికీ మూలాలు మన అంతరంగిక స్మృతిపథాల గుండానే పయనిస్తాయి అనిపిస్తుంది.."To be yourself in a world that is constantly trying to make you something else is the greatest accomplishment." అని ఎమెర్సన్ మహాశయుడన్న జీవిత పరమార్ధాన్ని నిరూపించడానికి ఈ కవిత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది..సింబోర్స్కా తన ఆంతరంగిక కవితా ప్రపంచం చుట్టూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు దూరంగా అభేద్యమైన కోటగోడను నిర్మించుకున్నారనిపిస్తుంది,

ఆమె కవిత్వం,మన ఇష్ట సఖితో మాత్రమే చెప్పుకునే రహస్యం..
జ్ఞాపకాల తీరాల్ని సున్నితంగా తాకి వచ్చే కెరటం..
అద్భుతాలు చూడాలంటే మన ఆంతరంగిక ప్రపంచాన్నితరచిచూసుకోమని చేతికందించిన అద్దం..
నిర్వచనాల్నొద్దు పొమ్మన్న స్వచ్ఛమైన అస్తిత్వం..

'Here' కవిత ఈ భూమి మీద పరమాణువంత మన ఉనికికి సెలెబ్రేషన్ లాంటిది..
'భూమి మీద జీవితం మంచి చవక బేరం,కొసరుగా,ఈ భూగ్రహమనే రంగులరాట్నంలో పైసా ఖర్చు లేకుండానక్షత్ర మండలపు మంచుతుఫానులో షికారు కెళ్ళొచ్చు'
అంటూ ఈ కవితలో పాఠకులకు టెలీస్కోప్ చేతికిచ్చి కుతూహలంగా నక్షత్రాలను వెతికే పసివాళ్ళను చేస్తారు..సింబోర్స్కా కవిత్వం వర్తమానాన్ని కేంద్రంగా చేసుకుని భూత భవిష్యద్ వర్తమానాల నడుమ ఊగిసలాడుతుంది,కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆ క్షణాన్ని మాత్రం దాటి వెళ్ళదు..
"నేను వేరే చోటునుండి మాట్లాడలేను..అన్నీ సమృద్ధిగా ఉన్న ఇక్కడ నుండే మాట్లాడతాను"మనకు తెలీని సుదూర తీరాలు అందమైనవే కావచ్చు గానీ..ఎందుకో తెలీదు అక్కడపెయింటింగ్స్ ఉండవు,కన్నీళ్ళు,హ్యాండ్ కర్చీఫులు అసలే ఉండవు"
అంటూ ఈ కవితలో ఈ భూమ్మీద అందమైన జీవితపు వైరుధ్యాన్నీ,అవకాశాల వైశాల్యాన్నీ చూపిస్తారు.
The Day After-Without Us అనే మరో కవితలో ఒక పొగమంచు నిండిన వర్షాకాలపు ఉదయాన్నీ,రాత్రినీ వరుసగా వర్ణించి చివర్లో
"రేపు ఎండకాసే అవకాశం ఉండొచ్చట,ఇంకా జీవించి ఉన్నవాళ్ళు మాత్రం బహుశా గొడుగులు తీసుకెళ్ళాలేమో"
అంటారు..అంతవరకూ వర్షపు చినుకుల ఆహ్లాదంలో తడిసి ముద్దైపోతున్న పాఠకుల్ని,ఒక్క కుదుపుతో స్వప్నావస్థనుండి బయటకు లాగి,చిన్న వాక్యంతో అలవోకగా గుండెను మెలిపెట్టి తిప్పుతారు..జీవితపు సౌందర్యాన్నీ,అస్థిరత్వాన్నీ ఏకకాలంలో పట్టిచ్చిన కవిత ఇది.ఇదే కోవకు చెందిన మరో కవిత 'Highway Accident',
ఎవరో మాకరోనీని వడగడుతున్నారు..
ఎవరో రాలిన చెట్ల ఆకుల్ని చీపురుతో తుడుస్తున్నారు..
చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ టేబుల్ చుట్టూ తిరుగుతున్నారు..
ఎవరింట్లోనో టెలిమార్కెటింగ్ ఫోన్ రింగ్ అవుతోంది..
అంటూ ఆక్సిడెంట్ అయిన స్థలంలో దైనందిన జీవన చిత్రాన్ని వర్ణిస్తూ,
ఆ క్షణంలో కిటికీ దగ్గర ఎవరైనా నిలబడి చూస్తే,వారికి తునాతునకలైపోయిన దేహం పైన ఆకాశంలో కమ్ముకున్న నీలి మేఘాలు కనబడతాయేమో,కానీ వారికది దైనందిన వ్యవహారమే..
అన్నప్పుడు జీవితపు కర్కశత్వాన్ని నిర్లిప్తంగా గమనించిన నిస్సహాయ క్షణాలు పరిచయంలేని పాఠకులుండరు.

'The Milkmaid' by Vermeer 
Rijks museum లోని వెర్మీర్ పెయింటింగ్  'ది మిల్క్ మెయిడ్' పై సింబోర్స్కా ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు..  "ఈ చిత్రపటంలోని  స్త్రీ 
చెంబులో నుండి పాలను నిశ్శబ్దంగా,తదేకమైన ఏకాగ్రతతో గిన్నెలోకి వంపుతున్నంత వరకూ 
ఈ ప్రపంచం తన ముగింపుని ఆర్జించలేదంటారు." 
ఇది చదివినప్పుడు ఆ పెయింటింగ్ ని సింబోర్స్కా దృష్టితో మళ్ళీ చూశాను..ఇందులో 'దైనందిన జీవితంలో తన పాత్రను ప్రశాంతంగా,అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వర్తిస్తున్న మిల్క్ మైడ్' ని నిత్యజీవితంలో తన పాత్రను అంతే బాధ్యతాయుతంగా,శాంతిగా  నిర్వర్తించాల్సిన మనిషికి ప్రతీకగా చూపించారామె..ఈ కవితలో అతి సాధారణమైన పదాలతో అసాధారణమైన విషయాన్ని చెప్పిన విధానం అబ్బురపరిచింది.

మరో కవితలో తన బాల్యానికి మరో రూపునిచ్చి,రెండు రూపాల్ని ప్రక్క ప్రక్కనే నిల్చోబెట్టి,ఒకరినొకరితో పోల్చి చూస్తే,మరో కవితలో గతకాలపు జ్ఞాపకాల శిథిలాల్లో ఎక్కడో ఒక చోట తనను వీడిపోయిన నీడల్ని అన్వేషిస్తారు..జ్ఞాపకాలూ,స్వప్నాలూ సింబోర్స్కా తన కవితల్లో పదే పదే  ప్రస్తావించే అంశాలు..'Hard life with memory' అనే కవితలో జ్ఞాపకాల భారాన్ని తూచే ప్రయత్నం చేస్తూ,జ్ఞాపకానికి ఒక రూపమిచ్చి ఆమెను గురించి ఈ విధంగా రాస్తారు..
ఒక్కోసారి నేను ఆమె వ్యవహారంతో విసిగిపోతాను..
మనం శాశ్వతంగా విడిపోదామని ప్రతిపాదిస్తాను..
తను నన్ను చూసి జాలిగా నవ్వుతుంది..
ఎందుకంటే తనకి తెలుసు,అది నా అంతం కూడానని..
ఇది ఒక్కసారి చదివి ప్రక్కన పెట్టేసే పుస్తకం కాదు..ఇందులో కవితలు,చదివిన ప్రతిసారీ కొత్త కొత్త అర్ధాలను స్ఫూరింపజేస్తాయి..సింబోర్స్కా ప్రపంచాన్ని నాకు తొలిసారిగా పరిచయం చేసిన రోహిత్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.

Friday, March 1, 2019

The Death of the Author - Roland Barthes

Everything is already said...
And everything is already done..
We all are mere translators..
We all are mere followers..

నిశ్చలంగా ఉన్న మనసులో ఉన్నట్లుండి మెరుపులా ఏదో ఆలోచన వస్తే దాన్ని పేపర్ మీద పెట్టబోయాను..ఉహూ,అక్షరాలు అల్లరిగా అటూ ఇటూ పరుగులుపెడుతూ చేతికందలేదు,ప్రాధేయపడినా నా మాట విననూలేదు..వాటి వెనుక పరుగు పెట్టలేక అలసిపోయిన మనసుతో ఉసూరంటూ పెన్ను ప్రక్కన పడేసి,'అయినా కొత్తగా రాయడానికేముందీ ! అన్నీ ఎప్పుడో ఒకప్పుడు,ఎవరో ఒకరు రాసేసినవే కదా' అనిపించింది..వెంటనే పెదాల మీదకు పిలవకుండానే చిరునవ్వు వచ్చి కూర్చుంది..ఇదే మాట మిత్రులతో అంటే నాకు వేదాంతం వంటబట్టిందంటూ ముసిముసిగా నవ్వారు.
Image Courtesy Google
ఇంతకూ ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే,రోలన్ బార్త్  రాసిన 'The Death of the Author' అనే వ్యాసం చదివాను..రచయితకు తన రచన మీద అన్ని హక్కులూ ఉంటాయంటారు..కానీ బార్త్ ఈ వ్యాసంలో దీనికి పూర్తి విరుద్ధమైన ప్రతిపాదన చేశారు..ఇందులో రచయిత బల్జాక్ రాసిన Sarrasine అనే కథలో ఒక స్త్రీ వర్ణన గురించిన వాక్యాలు ప్రస్తావిస్తారు.."This was woman herself, with her sudden fears, her irrational whims,her instinctive worries, her impetuou s boldness, her fussings and her delicious sensibility.'

అసలీ వాక్యాల్ని ఎవరు అంటున్నారు ? రచయిత బల్జాక్ స్త్రీవాదాన్ని సాహితీ విలువలతో వర్ణిస్తున్నారా ? లేక బల్జాక్ అనే వ్యక్తి,స్త్రీ గురించి తన వ్యక్తిగత అనుభవాల సారాంశం వెల్లడించారా ? లేక ఆ వేషధారణ మాటున ఏముందో తెలీని బాల్జాక్ సృష్టించిన పాత్ర అజ్ఞానమా ? లేదా సార్వత్రిక వివేకమా ? లేక రొమాంటిక్ సైకాలజీనా ? అని ప్రశ్నిస్తూ ,We shall never know, for the good reason that writing is the destruction of every voice, of every point of origin. Writing is that neutral, composite,oblique space where our subject slips away, the negative where all identity is lost, starting with the very identity of the body writing. అంటారు.

బార్త్ అభిప్రాయం ప్రకారం,ఏదైనా విషయాన్ని అక్షరాల్లో పెట్టగానే అంతవరకూ రచయిత మనసులో ఉన్న ఆ భావన అతని స్పృహను వీడి బయటకి వచ్చేస్తుంది..ఇక్కడ రచయితను కర్తగా చూస్తే,అతని కలం నుండి జాలువారిన పదాలు క్రియాత్మక మండలానికి దూరంగా జరిగి రచయిత నుండి వేరుపడతాయి..వెనువెంటనే వెల్లడైన ఆ అభిప్రాయం తాలూకూ రచయిత గళం దాని మూలాన్ని కోల్పోతుంది..సరిగ్గా రచయిత తన మరణాన్ని చేరుకునే ఆ బిందువు వద్ద 'రచన' మొదలవుతుందని బార్త్ వాదన...ఇదంతా కొత్త విషయమేమీ కాదంటూ Ethnographic సమాజాలను ఉదహరిస్తారు బార్త్..ఈ సమాజాల్లో 'కథనానికి' ప్రత్యేకం ఒక వ్యక్తిని బాధ్యుడుగా చెసేవారు కాదట..ఒక ఆలోచనను ఒకరినుండి మరొకరికి అందచేసే వారిని మధ్యవర్తిగానో,షమన్ గానో మాత్రమే వ్యవహరించేవారు..ఈ కారణంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచన పట్ల ఉండే ఆరాధనా భావం ఆ వ్యక్తి 'మేథ' మీద ఉండేది కాదు..కానీ మధ్య యుగంలోని ఇంగ్లీషు అనుభవవాదానికీ,ఫ్రెంచి హేతువాదానికీ ఫలితంగా ఈ 'రచయిత' అనే వ్యక్తి ఆవిర్భవించాడంటారు..మరికాస్త ముందుకి వెళ్ళి,భాష కూడా అనునిత్యం  రూపాంతరం చెందే ప్రాచీన భావాల,అనేక భాష-యాసల,సంస్కృతుల,చిహ్నాల మేళవింపనీ,ఒక వ్యక్తిని (రచయితను) దానికి ఏకైక హక్కుదారునిగా చూడడం సరికాదంటారు

ఆలోచించగా మనిషి అస్తిత్వం లేదా స్వభావంలోని అనిశ్చితి బార్త్ వాదనకు బలం చేకూరుస్తుంది..క్షణక్షణం మారే రచయిత భావనా ప్రపంచం రచయితను సృజనకు కేవలం ఒక కారణభూతునిగా చూపిస్తుంది తప్ప,అతను తన రచనతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడని చెప్పడానికి అవరోధంగా నిలుస్తుంది...ఒక రచయితను పురిటినెప్పుల బాధనంతా ఓర్చుకుని బిడ్డకు జన్మనిచ్చే తల్లిగా చూస్తే,తల్లి ప్రేగునుండి విడివడ్డ బిడ్డ పూర్తి స్వతంత్రుడూ,స్వయంప్రతిపత్తి కలిగిన మరో జీవే కదా ! అలాగే రచయిత నుండి వేరుపడిన రచన,పాఠకుని ద్వారా తన ఉనికిని వెతుక్కుంటూ రూపాంతరం చెందుతుంది..ఈ కోణంలో చూస్తే ఆ రచనను చదివే పాఠకుని ఊహాశక్తిని బట్టి ప్రతి రచనా అసంఖ్యాకమైన కొత్త రూపాల్ని సంతరించుకుంటుంది..ఆ మధ్య పీటర్ మెండెల్సండ్ రాసిన 'What we see when we read' ను చదివినప్పుడు,అందులో రచయిత బార్త్ వాదనను ఒక పాఠకుని కోణంలో చూపించే ప్రయత్నం చేశారు.
The birth o f the reader must be at the cost of the death of the Author.

Linguistically, the author is never more than the instance writing, just as I is nothing other than the instance saying I: language knows a 'subject', not a 'person', and
this subject, empty outside of the very enunciation which defines it, suffices to make language 'hold together', suffices,that is to say, to exhaust it.

దీనితో పాటుగా ఒక టెక్స్ట్ ను కేవలం ఒక పదాల వరుసగా కాకుండా,ఒక మల్టీ డైమెన్షనల్ స్పేస్ లో అమరిన వివిధ పదాల సమ్మేళనంగా అభివర్ణిస్తారు..మళ్ళీ ఈ పదాల్లో ఒక్కటి కూడా 'ఒరిజినల్' పదం కాదంటూ,టెక్స్ట్ అనే మల్టీడైమెన్షనల్ స్పేస్ లో అనేక పదాలు ఒకదానినొకటి ఢీకొని,ఒకదానిలోనొకటి కలిసిపోయి,అంతిమంగా ఒక మిశ్రమ రూపాన్ని సంతరించుకుంటాయి అంటారు..

The text is a tissue of quotations drawn from the innumerable centres of culture. Similar to Bouvard and Pecuchet, those eternal copyists, at once sublime and comic and whose profound ridiculousness indicates precisely the truth of writing,the writer can only imitate a gesture that is always anterior, never original.His only power is to mix writings, to counter the ones with the others, in such a way as never to rest on any one of them.

చివరగా తనను తాను వ్యక్తపరుచుకోవాలనుకునే రైటర్ కు,కేవలం తానొక అనువాదకుడిననీ,తన లోపలి 'విషయం' ఒక 'రెడీమేడ్ డిక్షనరీ' లోనుండి ఏర్చి కూర్చిన అభిప్రాయమనీ స్పృహ కలిగి ఉండడం అవసరమనీ బార్త్ అంటారు..ఇదంతా చదివాకా రాయడం,చదవడం ఇవన్నీ వ్యర్థమేనా అనిపిస్తుంది..కానీ మనమంతా కూడా ఒక రకంగా కాలచక్రంలో చిక్కుకుని ఈ లైఫ్ సైకిల్ లో చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం-చెయ్యడంలో భేదం ఉండొచ్చు గాక,చూసినదే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం -వర్ణచిత్రంలో/ఇమేజ్ లో  రంగులు మారొచ్చు,విన్నదే మళ్ళీ మళ్ళీ వింటున్నాం-శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ మారుతుందేమో,అలాగే రచయిత కూడా రాసిందే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారేమో (మార్పు వ్యక్తీకరణలో మాత్రమే)..ఇదేదో బావుంది అనుకుంటున్నపుడు చివరగా అర్ధం అయ్యింది,మనం పాఠకులం కూడా చదివిందే చదువుతున్నాము,మన ఊహా ప్రపంచాలు వేరంతే :)

Wednesday, February 27, 2019

To Be a Machine - Mark O'Connell

ఒకవైపు మానవ జాతి తమ స్వయంకృతమైన కుల,మత,జాతి,లింగవివక్షల్లాంటి కంటికి కనిపించని శత్రువులతో అహర్నిశలూ పోరాడుతూ ఉంటే,మరో వైపు మానవాళికి అసలుసిసలు శత్రువైన (?) మృత్యువు మాత్రం,ఈ స్వపర భేదాలు నాకు లేవంటూ అందరిపట్లా సమన్యాయం పాటిస్తూ తాపీగా తన పని తాను చేసుకుపోతోంది..మానవ మేథస్సు ఎన్నో రంగాల్లో విజయం సాధించింది,చంద్రుడి మీద కాలుమోపినా,మార్స్ మంగళయాన్ విజయవంతం చేసి,మరో గ్రహంలో కూడా విజయ బావుటా ఎగురవేసినా మనిషికి తీరని కోరిక మాత్రం ఒక్కటుండిపోయింది..అదే మృత్యువుని జయించడం..
Image Courtesy Google
“They spoil every romance by trying to make it last for ever" అంటారు ఆస్కార్ వైల్డ్..మనకి 'శాశ్వతత్వం' కావాలి,దాన్ని అందుకోవడం కోసం మానవాళి అహర్నిశలూ శ్రమిస్తోంది..'విధి లిఖితం' అని సామాన్యులు సరిపెట్టుకున్నా,శాస్త్రవిజ్ఞాన రంగాల్లో కొందరు మేధావులు మాత్రం మృత్యువును అంగీకరించడానికి సంసిద్ధత కనబరచడం లేదు..మృత్యువు ఎదుట వెలవెలబోయే విజయాలకు అర్ధం లేదని భావించిన శాస్త్రజ్ఞులు కాలగతికి ఎదురీది పోరాడాలని నిశ్చయించుకున్నారు..ఈ వర్గాన్ని 'ట్రాన్స్హ్యూమనిస్టులు' (Transhumanist) అంటారు..ఒక ప్రక్క సామాన్య ప్రపంచం అర్ధంపర్ధం లేని ఉన్మాదాలతో రగిలిపోతోంటే,మరో ప్రక్క ఈ ఫ్యూచరిస్టులు మాత్రం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు సృష్టిస్తూ 'ట్రాన్స్హ్యూమనిజం' ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు..ఐరిష్ రచయిత Mark O'Connell 'ట్రాన్స్హ్యూమనిజం' గురించి రాసిన పుస్తకం ఈ 'To Be a Machine'.

'హ్యూమన్ మోర్టాలిటీ'ని ఒప్పుకోని శాస్త్ర సాంకేతిక రంగం మానవజాతికి అమరత్వాన్ని సాధించిపెట్టే  దిశగా తీవ్రంగా పరిశ్రమిస్తోంది..మేరీ రోచ్ 2003 లో రాసిన 'స్టిఫ్' అనే పుస్తకంలో మనిషిని రెండు కాళ్ళ జంతువుగా అభివర్ణిస్తారు,ఒక్క మేథస్సు విషయంలో తప్ప జంతులక్షణాల్ని పోలిన మానవశరీరం జననమరణాల విషయంలో ఇప్పటివరకూ జీవశాస్త్రపు పరిధి నుండి బయటకు రాలేదు..ట్రాన్స్హ్యూమనిస్టులు శాస్త్ర విజ్ఞాన రంగాల ద్వారా మనిషి ఉనికిని జీవశాస్త్రపు కబంధహస్తాలనుండి వేరు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,న్యూరో సైన్సెస్,టెక్నికల్ సింగులారిటీ లాంటి విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు మనిషిని మరణంలేని ఒక మెషీన్ గా మార్చడానికి అన్ని మార్గాల్నీ వెతుకుతున్నాయి..ఈ ట్రాన్స్హ్యూమనిజం లక్ష్యాల్లో టెక్నాలజీనీ,మన రక్తమాంసాలనూ ఏకం చెయ్యడం ఒకటైతే,మెషీన్స్ లోకి హ్యూమన్ బ్రెయిన్స్ ని అప్లోడ్ చెయ్యడం (brain emulation) మరొకటి..మానవజాతికి అమరత్వాన్ని సాధించిపెట్టడమే లక్ష్యంగా చేసుకున్న ఈ ట్రాన్స్హ్యూమనిజాన్ని ఒక కోణంలో మనిషికి జీవశాస్త్రపు దాస్యం నుండి శాశ్వత విముక్తిగా చూస్తే మరో కోణంలో టెక్నాలజీకి శాశ్వత దాస్యత్వంగా కూడా పరిగణించవచ్చు.

We would no longer submit to being the products of blind evolution, but would rather “seek complete choice of bodily form and function, refining and augmenting our physical and intellectual abilities beyond those of any human in history.” And we would no longer be content to limit our physical, intellectual, and emotional capacities by remaining confined to carbon-based biological forms.

కానీ మనిషి మాత్రమే చెయ్యగలిగేవీ,మెషీన్లు చెయ్యలేనివీ కొన్ని పనులుంటాయి,ఉదాహరణకు సృజనాత్మకత,ఆలోచించడం,కీలకసమయాల్లో విచక్షణతో తగు నిర్ణయం తీసుకోవడం లాంటివి..'బ్రెయిన్ అప్లోడింగ్' ద్వారా మెదడులోని సమాచారాన్ని అంతటినీ సేకరించి మరణం లేని మరో మెషీన్ లో పెట్టగలిగినా అది కూడా మరో రోబోట్ అవుతుందే తప్ప ఆ వ్యక్తి కాలేదు..ఎందుకంటే మనల్ని ఈ యంత్రాలనుండి వేరు చేసేది మనిషిలో కీలకమైన Consciousness(ఆత్మ) ఒక్కటే..ఈ అంశమే ట్రాన్స్హ్యూమనిస్టుల స్వప్నానికి అతి పెద్ద అవరోధంగా మారింది..కంప్యూటర్ ని అర్ధం చేసుకోవాలంటే దాని wiring తెలిస్తే చాలదు, డైనమిక్స్ కూడా తెలియాలి అలాగే న్యూరో సైంటిస్ట్ ల లక్ష్యం ఈ 'consciousness' కోడ్ ని పరిష్కరించడం...ఏదేమైనా మరో ఇరవయ్యేళ్లలో న్యూరో సైన్సెస్,ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వర్గాలు ఈ మానవ మస్తిష్కపు పద్మవ్యూహాన్ని ఛేదించగలమని నమ్మకంగా చెబుతున్నాయి..ఉదాహరణగా ఇందులో కంప్యూటర్ రైటర్స్ రాసిన ప్రోస్ ఫిక్షన్ గురించి రాశారు..మనిషి రచనంత గొప్పగా లేకపోయినప్పటికీ కంప్యూటర్స్ నిరంతరం తమను తాము మెరుగుపరుచుకునే దిశగా evolve అవుతుంటాయి కాబట్టి త్వరలో రోబోట్స్ లో మానవులతో ధీటైన సృజనాత్మకత కూడా సాధ్యమేనంటారు.

ఈ పుస్తకం 'ట్రాన్స్హ్యూమనిజాన్ని' ముందుండి నడిపిస్తున్న ప్రఖ్యాత ఫ్యూచరిస్టుల్ని పరిచయం చేస్తుంది,వారు ఆయా రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయవిశేషాల్నీ వివరిస్తుంది...ఈ జీవన ప్రమాణాన్ని పెంచే ప్రాజెక్టుల్లో SENS Research Foundation (Strategies for Engineered Negligible Senescence Research Foundation) అధినేత Aubrey de Grey’s పరిశోధనను గురించి రాశారు..ఈ సంస్థ వృద్ధాప్యాన్ని ఒక వ్యాధిగా పరిగణించడమే కాకుండా,దాన్ని ఖచ్చితంగా నయం చెయ్యవచ్చని అంటుంది..'Technological Singularity' పై పరిశోధనలు చేస్తున్న గూగుల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ Ray Kurzweil మనుషుల్నీ,యంత్రాల్నీ ఒకదానిలో మరొకటి విలీనం చెయ్యడమే మనిషికి అమరత్వాన్ని సాధించి పెట్టగలదని అంటారు..ఈ దిశగా ఈయన అనేక పరిశోధనలు చెయ్యడంతో పాటు,పలు పుస్తకాలు కూడా రాశారు..

ఇదంతా నాణానికి ఒక కోణమే,అసలు మనిషికి మెషిన్ గా మారడానికి అవసరమైన సంసిద్ధత ఉందా లేదా అని మనం ఆలోచనలో పడినప్పుడు,Oxford’s Future of Humanity Institute లో రీసెర్చ్ చేస్తున్న Anders Sandberg అంటారు “I also want to become a machine. But I want to be an emotional machine.” అని..మరి భావోద్వేగాలు మాత్రమే మనిషిని మిగతా జీవులనుండి వేరుగా నిలబెడతాయి.

ఇది చదువుతున్నప్పుడు Cryonics గురించి తొలిసారి విన్నాను..ఈ పద్ధతిలో క్లినికల్ డెత్ తరువాత మానవ శరీరాన్ని దాని మెదడులోని సమాచారం పాడవ్వకుండా సంవత్సరాల తరబడి ఫ్రీజ్ చేసి, సిలెండర్లలో భద్రపరుస్తారు..ఈ తరహా సంస్థలు USA లో నాలుగూ,రష్యాలో ఒకటీ ఉండగా అమెరికాలో Phoenix లో ఉన్న Alcor అన్నిటికంటే పెద్దది..Alcor Life Extension Foundation ప్రెసిడెంట్ మాక్స్ మోర్ మనకి Cryonics గురించిన ఆసక్తికరమైన వివరాలు అందజేస్తారు...ట్రాన్స్హ్యూమనిస్టుల కల సాకారం అయ్యాకా 'brain emulation' ద్వారా ఆ మృతదేహాల (?) మెదడులోని డాటాను అంతటినీ మరో AI మెషీన్ లోకి కాపీ చేసి మరణించినవారిని మెషీన్ రూపంలో తిరిగి పునర్జీవింపజేస్తారు(ట)..వినడానికి ఇదంతా మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు కట్టుకథలా అనిపించినా,ఇదంతా నిజం..ఇక్కడ Alcor foundation భద్రపరిచిన మృతదేహాల్ని భౌతికకాయాలు అనకుండా 'పేషెంట్స్' అనడం గమనార్హం...ఈ ట్రాన్స్హ్యూమనిజం గురించి మరింత లోతుగా తెలియాలంటే,పేజీ తిప్పుతున్నప్పుడల్లా గూగుల్ చెయ్యడం,యూ ట్యూబ్,TED టాక్స్ లో వాటి ఆధారిత వీడియోస్ చూడడం అవసరం..2006 లో ట్రాన్స్హ్యూమనిజం గురించి Frank Theys అనే Belgian filmmaker తీసిన 'Technocalyps' అని ఒక డాక్యుమెంటరీ యూట్యూబ్లో ఉంది.

For $200,000, Alcor would keep your entire body suspended until such time as it might once more be of some use to you; for $80,000, you could become what was known as a “neuro-patient,” whereby your head alone—detached, petrified,chambered in steel—would be cryopreserved, with a view to the later uploading of your brain, or your mind, into some kind of artificial body.

ఇదిలా ఉండగా ఈ Cryonics వ్యవహారమంతా మతిలేని ఊహనీ,చీకట్లో గుడ్డిగా రాయి వెయ్యడం లాంటిదనీ మరికొందరి వాదన..ట్రాన్స్హ్యూమనిజాన్ని దగ్గరగా చూసిన రచయిత ఒక దశలో దీన్ని 'సైన్స్ ఫిక్షన్ సెట్ వేసి తీసేసిన అమెరికన్ డ్రామా స్టేజి'గా అభివర్ణిస్తారు.

ఈ ట్రాన్స్హ్యూమనిస్టుల్లో మరో ముఖ్యమైన వ్యక్తి Zoltan Istvan,ఈయన అమెరికాలో ట్రాన్స్హ్యూమనిజం ఫై అవగాహన పెంపొందించడానికి  43 అడుగుల శవపేటిక ఆకారంలో ఉండే 'Immortality Bus' యాత్రను చేశారు,కాగా ఈయన రాసిన 'The Transhumanist Wager' అనే పుస్తకం ఇంటర్నేషనల్ బుక్ అవార్డుని గెలుచుకుంది..ఇదిలా ఉండగా శాస్త్ర విజ్ఞాన రంగం అభివృద్ధికి అవరోధాలు అన్ని సమయాల్లోనూ ఉన్నట్లే ఈకాలంలో కూడా ఉన్నాయి..సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ మానవ జాతి వినాశనానికేనని నమ్మేవాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారు..ప్రాచీనకాలంలో వైద్యరంగంలో అనాటమీ రహస్యాల్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు మృతదేహాల్ని సమాధుల్లోనుంచి దొంగిలించి రహస్యంగా ఎత్తుకెళ్ళేవారట,అలాగే ఈకాలంలొ సైంటిఫిక్ కమ్యూనిటీస్ కి భయపడి ఫ్యూచరిస్టులు 'Brain uploading' మీద పరిశోధనల్ని రహస్యంగా ఉంచుతున్నారట.

Those who did comment on it tended to do so with outright contempt. Writing in the MIT Technology Review, for instance, the McGill University neurobiologist Michael Hendricks insisted that “reanimation or simulation is an abjectly false hope that is beyond the promise of technology,” and that “those who profit from this hope deserve our anger and contempt."

భూమి 'sixth mass extinction' కి సిద్ధపడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్న దశలో,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి Elon Musk,బిల్ గేట్స్,స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి హెచ్చరికల్ని నిజం చేస్తూ ఈ ట్రాన్స్హ్యూమనిస్టుల కల నిజమవుతుందా అని మనక్కూడా ఒక దశలో అనుమానమొస్తుంది..

I saw the imprint of transhumanism in claims like that of Google CEO Eric Schmidt,who suggested that “Eventually, you’ll have an implant, where if you just think about a fact, it will tell you the answer.”

ఈ ట్రాన్స్హ్యూమనిస్టుల సున్నాలు,ఒకట్ల ప్రపంచాన్ని దగ్గరగా చూస్తున్నప్పుడు  రచయిత అన్నట్లు,మనం ఈ ప్రపంచానికి చెందమనిపిస్తుంది,మన చుట్టూ ఉన్న మనుషులు మనవాళ్ళు కాదనిపిస్తుంది.."All utopian futures are, in one way or another, revisionist readings of a mythical past" అంటారు రచయిత..నిజానికి ఒక కాల్పనిక జగత్తుని తలపించే ఈ ట్రాన్స్హ్యూమనిజానికి మూలాలన్నీ సాహిత్యంలో దొరుకుతాయి.

Around this time, he read Arthur C. Clarke’s The City and the Stars, a novel set in a future a billion years from now, in which the enclosed city of Diaspar is ruled by a superintelligent Central Computer, which creates bodies for the city’s posthuman citizens, and stores their minds in its memory banks at the end of their lives, for purposes of future reincarnation.

I found myself thinking often of W. B. Yeats’s “Sailing to Byzantium,” in which the aging poet writes of his burning to be free of the weakening body, the sickening heart—to abandon the “dying animal” for the man-made and immortal form of a mechanical bird. “Once out of nature,"
“I shall never take/My bodily form from any natural thing/But such a form as Grecian goldsmiths make"

'Technological Singularity' ని తొలిసారి సైన్స్ ఫిక్షన్ రచయిత Vernor Vinge ప్రతిపాదించారట,
The first substantial statement of the concept of a Technological Singularity is usually attributed to the mathematician and science fiction writer Vernor Vinge. In an essay called “The Coming Technological Singularity: How to Survive in the Post-human Era,” first delivered as a paper at a 1993 conference organized by NASA, Vinge claimed that “within thirty years, we will have the technological means to create superhuman intelligence.

ఈ పుస్తకం చదువుతుంటే సైన్స్ ఫిక్షన్,ఫాంటసీ సినిమాలు గుర్తొస్తాయి..ఇస్సాక్ అసిమోవ్ నవల ఆధారంగా తీసిన I-Robot సినిమాలోలా ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంతిమంగా మానవాళి వినాశానికే దారితీస్తుందా అనే అనుమానాలు రచయితకొచ్చినప్పుడు AI  గురించి పుస్తకం రాసిన స్టువర్ట్ అనే ఒక సైంటిస్ట్ కింగ్ మిడాస్ కథను గుర్తు చేసుకుంటారు.

"I get a lot of mileage,” he said, “out of the King Midas myth.” What King Midas wanted, presumably, was the selective ability to turn things into gold by touching them, but what he asked for (and what Dionysus famously granted him) was the inability to avoid turning things into gold by touching them. You could argue that his root problem was greed, but the proximate cause of his grief—which included, let’s remember, the unwanted alchemical transmutations of not just all foodstuffs and beverages, but ultimately his own daughter—was that he was insufficiently clear in communicating his wishes.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో 'నిర్ణయం తీసుకోవడం' అనేది కీలకాంశంగా పరిగణిస్తారు..
That hierarchical decision making is a key component of human intelligence, and it’s one we have yet to figure out how to implement in computers. But it’s by no means unachievable, and once we do, we’ll have made another major advance toward human-level AI.

ఇందులో పెంటగాన్ అనుబంధ సంస్థ DARPA (the Defense Advanced Research Projects Agency) గురించి తెలిసింది..DARPA మాజీ ఛీఫ్ ఆరతి ప్రభాకర్ ఒక భారతీయురాలు కావడం విశేషం..మిలటరీకి ఉపయోగపడే అత్యవసర టెక్నాలజీ గురించి ఆవిడ TED టాక్ చూశాను..ఈ పుస్తకం హ్యూమన్ మోర్టాలిటీకి ఆవలివైపు ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది..మరి రాబోయే కాలంలో ట్రాన్స్హ్యూమనిస్టుల కల సాకారమవుతుందో లేదో భవిష్యత్తే నిర్ణయించాలి.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు,
Beneath the talk of future technologies, I could hear the murmur of ancient ideas. We were talking about the transmigration of souls, eternal return, reincarnation. Nothing is ever new. Nothing ever truly dies, but is reborn in a new form, a new language, a new substrate.

“You can be anything you like,” as an article about uploading in Extropy magazine put it in the mid-1990s. “You can be big or small; you can be lighter than air, and fly; you can teleport and walk through walls. You can be a lion or an antelope, a frog or a fly, a tree, a pool, the coat of paint on a ceiling.”

Perhaps the reason for our being insane animals is precisely our inability to accept ourselves as animals, to accept the fact that we will die animal deaths. And why should we accept it? It’s a fact not to be borne, an inadmissible reality. You would think that we’d be beyond this; you would think that, by now, we’d do better than just succumbing to nature’s final dumb imperative. Our existence, and its attendant neurosis, is defined by a seemingly irresolvable contradiction: that we are outside of nature, beyond it and above it like minor deities, and yet always helplessly within it, forever defined and circumscribed by its blind and implacable authority.

The picture Kurzweil paints of the future is one in which technology continues to get smaller and more powerful, until such time as its accelerating evolution becomes the primary agent of our own evolution as a species. We will no longer carry computers around with us, he reveals, but rather take them into our bodies—into our brains and our bloodstreams—changing thereby the nature of the human experience.