![]() |
Image courtesy Google |
Thursday, November 2, 2023
బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు
Friday, November 18, 2022
An Evening with Susan Sontag
An Evening with Susan :
శుక్రవారం సాయంత్రం అవగానే లేజీ మూడ్ వచ్చేస్తుంది. వారం అంతా ఉరుకుల-పరుగుల రొటీన్ నుండి చిన్న బ్రేక్ అనే తప్ప పెద్దగా ఏమీ మారదనుకోండి. హైదరాబాద్ లో పుస్తకాల మార్కెట్లతో పాటు నన్ను బాగా ఆకర్షించినవి ఇక్కడ కేఫ్ లు. కొండాకోనల్లో నిశ్శబ్దానికి అలవాటుపడి ఉండడంతో ఇంకా జనారణ్యపు శబ్ద కాలుష్యానికి చెవులు పూర్తిగా అలవాటుపడలేదు. లైఫ్ లో పెద్దగా అడ్రినలీన్ రష్ అక్కర్లేని quiet & comfortable స్టేజిలో పెద్దగా సందడి లేని చోట్లు నచ్చే మాలాంటి వాళ్ళకి వీకెండ్ రాగానే "దో దీవానే ఇస్ షెహర్ మే" అని పాడుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న కేఫ్ వెతుక్కుని వెళ్ళి ఓ పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడం ఈ మెట్రో జీవితంలో ఒక అదనపు సౌకర్యం. ఎటొచ్చీ ఆయనకు రుచికరమైన సూపు, నాకొక చిక్కని కాఫీ దొరికితే చాలు.
![]() |
Copyright A Homemaker's Utopia |
కూర్చుని కాసేపు సెటిల్ అయ్యాక కొన్ని క్షణాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు కళ్ళతో కాప్చర్ చెయ్యడంతో సరిపోతుంది. ఈరోజు ఇక్కడ మూడు విడివిడి టేబుల్స్ లో లాప్టాప్స్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుని పనిచేసుకుంటున్నవాళ్ళు (ఒక స్త్రీ, ఇద్దరు మగవారు) ముగ్గురు కనిపించారు. ముగ్గుర్లో ఒక మేల్ అండ్ ఫిమేల్ పనిచేసుకుంటున్నంతసేపూ చాలా సీరియస్ గా సిగార్స్ ఊదుతూనే ఉన్నారు. మరో టేబుల్ దగ్గర సుమారు ఐదేళ్ళున్న పాపాయిని ఎంగేజ్ చేస్తూ కూర్చున్న ఒక టీనేజ్ కేర్ టేకర్ కనిపించింది. ఆ పాపాయి అమ్మగారు జాబ్ అనుకుంటా, ఆవిడొచ్చేవరకూ పాపాయిని ఆడిస్తూ అక్కడ వెయిట్ చేసింది. మరో టేబుల్ లో నలుగురు, కాలేజీ పిల్లలనుకుంటా, ముగ్గురబ్బాయిలూ, ఒకమ్మాయీ హుషారుగా కబుర్లలో మునిగిపోయి ఉన్నారు. "ఏం పుస్తకం చదువుతున్నారూ ?" అని డిస్టర్బ్ చేస్తూ అడగడానికి దురదృష్టవశాత్తూ ఈరోజు ఎవరూ కనబడలేదు. నలుగురిలో ఏకాంతాన్ని అనుభవిస్తూ నేను ఈ మధ్యే ఆర్డర్ చేసుకున్న సుసాన్ సొంటాగ్ జర్నల్స్ తిరగెయ్యడం మొదలుపెట్టాను. రేపు ఎప్పుడైనా హైదరాబాద్ విడిచి వెళ్ళేటప్పుడు గుర్తుగా నాతో వెంట తీసుకెళ్ళడానికి కొన్ని చలిగాలుల సాయంత్రపు జ్ఞాపకాల్ని పోగుచేసుకోవాలి కదా !!
ఈ సాయంత్రానికి సొంటాగ్ డార్క్ హ్యూమర్ జతకలిసి మరింత అందమైన అనుభవాన్నిచ్చింది.
* Not only must I summon the courage to be a bad writer - I must dare to be truly unhappy. Desperate. And not save myself, short-circuit the despair.
By refusing to be as unhappy as I truly am, I deprive myself of subjects. I’ve nothing to write about. Every topic burns. (6/19/76,NY) ( Is she trying to prove that all writers are unhappy ? )
* TB : Consumed (dissolved) by passion - passion leads to dissolution of the body. It was tuberculosis but they called it 'Love'. (Sigh !)
* Beckett found a new subject for the drama :- What am I going to do in the next second ? Weep, take out of my comb, sigh , sit, be silent, tell a joke, die. (He he he)
*Poets self-limited by some actual or mental regionalism, deliberately cultivated - so he / she will be seen to have [created ] his / her "universe".
Weakness of American poetry- It's anti-intellectual. Great poetry has ideas. ( You are hurting the egos of Eliot clan Susan )
Saturday, February 12, 2022
Time Lived, Without Its Flow - Denise Riley
కొన్ని పుస్తకాలు అమెజాన్ టాప్ 100, టైమ్ మ్యాగజైన్ బుక్స్, ఓప్రా బుక్ క్లబ్ పిక్స్ లాంటి బెస్ట్ సెల్లర్ క్యాటగిరీల్లో కనపడవు. అవి "ఒక పాఠకుడి నుంచి మరో పాఠకుడికి ఒక విలువైన రహస్యాన్ని అందించినట్లు చేతులు మారతాయి" అంటారు 'Time Lived, Without Its Flow' అనే ఈ పుస్తకానికి అద్భుతమైన ముందుమాట రాసిన మాక్స్ పోర్టర్. నాకు 'Grief is the Thing with Feathers' పుస్తకం ద్వారా మాక్స్ పోర్టర్ ను ఏడెనిమిదేళ్ళ క్రిందట పరిచయం చేసిన నాగరాజు పప్పు గారే ఈ పుస్తకాన్ని కూడా 'ఒక విలువైన రహస్యంలా' చదవమని రికమెండ్ చేశారు. అమ్మతో సహా,అనేకమంది ఆత్మీయుల్నీ వరుసగా పోగొట్టుకున్న ఆ మూడు నాలుగేళ్ళ సమయంలో గ్రీఫ్ గురించి అనేక రచనలు చదివినా, చక్కని వర్ణనలతో పద్యానికీ,గద్యానికీ పరిథుల్ని చెరిపేసిన పోర్టర్ రచన నాకు ఇప్పటికీ ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.
Image Courtesy Google |
2008 లో లండన్ కు చెందిన కవయిత్రి డెనిస్ రిలే కుమారుడు జాకబ్ రోగనిర్ధారణకు లొంగని ఒక అంతుబట్టని హృదయసంబంధిత వ్యాథితో హఠాత్తుగా మరణించాడు. చేతికందొచ్చిన వయసులో కొడుకు హఠాన్మరణం తాలూకా షాక్ నుండి తేరుకునే సమయంలో ఆమె తన అనుభవాలకు వివిధ దశల్లో అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులకు విడో/ విడోవర్ అని పేర్లున్నట్లు బిడ్డను కోల్పోయిన తల్లికి ప్రత్యేకమైన పదమేదీ లేదని నిష్టూరపడతారు రచయిత్రి.
సంతాప సమయంలో కాలప్రవాహం కదలిక లేకుండా స్థంభించిపోతుందంటారు డెనిస్. అందువల్ల ఈ రచన మరణం తాలూకా సంతాపాన్ని ఒక ప్రేక్షక స్థానంలో ఉండి అనుభవించడం కంటే, తానే స్వయంగా సంతాపంగా మారిపోవడంలా ఉంటుంది. ఈ కారణంగా ఈ పుస్తకంలో మూలాంశం 'మృత్యువు' కాదు, 'స్థంభించిన కాలం' అంటారు పోర్టర్.
Riley’s project is to describe and interrogate ‘that acute sensation of being cut off from any temporal flow after the sudden death of your child.’
నిజానికి ఈ వ్యాసం మృత్యువును గురించి కంటే ఆ కారణంగా చలనరహితంగా ఆగిపోయిన క్షణాల గురించే ఎక్కువ చెబుతుంది. ఇది మృత్యువు తుఫానులా వచ్చి మన ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన తరువాత వచ్చే ప్రశాంతతను తలపిస్తూ కాలప్రవాహపు అడుగులతో అడుగు కలపలేని నిస్సహాయ,నిశ్శబ్ద, నిశ్చలమైన నిముషాలూ, గంటలూ, రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలను గురించిన వ్యాసం.
No tenses any more. Among the recent labels for temporality is ‘time dilation’, referring to our perception’s elasticity, its capacity to be baggy. But are there any neurological accounts of this feeling of completely arrested time? It feels as if some palpable cerebral alteration has taken place. As if, to make the obvious joke, your temporal lobes have been flooded and are now your a-temporal lobes.
ఇలాంటి సమయాలో భావోద్వేగాలను భాషతో పొదివి పట్టుకోవడమంత కష్టం మరొకటి ఉండదు. మహా అయితే వాటి చుట్టూ అల్లిబిల్లిగా అటూఇటూ పదవిన్యాసాలు చేస్తూ తిరుగాడగలం. ఒక్కోసారి యాధృచ్ఛికంగా వాటికి సన్నిహితంగా జరిగిన లిప్తకాలపు అనుభూతిని చూసి వాటిని అచ్చంగా అందిపుచ్చుకున్నామని అపోహపడతాం. తీరాచూస్తే ఇదంతా భ్రమే. మనిషి తెలివిడిని తప్పించుకోలేని కల్పనల కల్తీ సోకకుండా వాటిని సహజసిద్ధమైన రూపంలో పట్టుకోవడం ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా అసంభవం అనిపిస్తుంది. కానీ ఇదంతా డెనిస్ ని చదవడానికి మునుపు. ఆగిపోయిన కాలాన్నీ, ఆ కాలంలో అనుభవించిన సంతాపాన్నీ ఆమె భాషలో పొదిగిన తీరు సంతాపాన్ని గురించి ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక రచనలను అమాంతం ప్రక్కకు తోసి ఈ రచనను మొదటివరుసలో నిలబెడుతుంది. తనివితీరక కొన్ని వాక్యాలను రెండు మూడుసార్లు చదువుకున్న క్షణాలూ, మరోసారి చదివితే దృష్టినిదాటిపోయిన గుప్తనిధులేమన్నా దొరుకుతాయేమో అని పదాలను తడుముకుంటూ, వెతుక్కుంటూ చదివిన అనుభవాలూ పాఠకులకు ఈ చిన్న పుస్తకం చదువుతున్నప్పుడు అనేకం ఎదురవుతాయి. ఒక ఫిక్షన్ రచయిత రాసే పదాలకూ, కవి రాసే పదాలకూ తేడా ఉండదూ !
పోర్టర్ అన్నట్లే ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన తరువాత మళ్ళీ అలవోకగా మన వాస్తవ జీవితానికి తిరుగుప్రయాణం కట్టడం అంత తేలికైన విషయమేమీ కాదు. డెనిస్ శైలికి మనం చదివినదాన్ని పునఃసమీక్షించుకోమని ఆజ్ఞాపించే శక్తి ఉంది. ఉదాహరణకు డెనిస్ రాసిన ఈ క్రింది వాక్యాలు చూడండి, ఇవి పుస్తకం పూర్తిచేసిన తరువాత కూడా పాఠకుల్ని అంత సులువుగా వదిలిపోవు.
Not that I have delusions, as such. But a strong impression that I’ve been torn off, brittle as any dry autumn leaf, liable to be blown onto the tracks in the underground station, or to crumble as someone brushes by me in this public world where people rush about loudly, with their astonishing confidence. Each one of them a candidate for sudden death, and so helplessly vulnerable. If they do grasp that at any second their own lives might stop, they can’t hold on to that expectation. As I do now. Later everyone on the street seems to rattle together like dead leaves in heaps.
రాయాలంటే మృత్యువు గురించి ఎంతైనా రాయొచ్చు.కానీ ముందు చెప్పుకున్నట్లు ఈ పుస్తకం 'ఒక రహస్యం'. ఎవరికివారు ఛేదించుకోవాల్సిన రహస్యం. హ్యాపీ రీడింగ్ :)
పుస్తకంనుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు,
Far from taking refuge deeply inside yourself, there is no longer any inside, and you have become only outward. As a friend, who’d survived the suicide of the person closest to her, says: ‘I was my two eyes set burning in my skull. Behind them there was only vacancy.’
And you yourself will not be the same. But something, nevertheless, stays: recognition as re-cognition; to know again, but because of the interval, to know a bit differently.
సంతాప సమయంలో ఆగిపోయిన కాలాన్ని గురించి రచయిత్రి ఇందులో ప్రస్తావించిన Emily Dickinson రెండు కవితలు చాలా అర్థవంతంగా ఉన్నాయనిపించింది :
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.
As if my brain had split;
I tried to match it, seam by seam,
But could not make them fit.
The thought behind I strove to join
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.
Previously I hadn’t believed that speech is simply the translation of something already formulated in thought. Now I was faced with the evidence that sometimes it is, but that the translation can fail.
Perhaps only through forgetting the dead could it become possible to allow them to become dead. To finally be dead. And that could only follow – once time itself had taken the initiative here – from consigning them to a time that had decided to resume its old flow. Of its own accord. When or if this may ever happen, I can’t know. And can’t want it.
You’ve slipped into a state of a-chronicity. From its serene perspective you realize, to your astonishment, that to dwell inside a time that had the property of ‘flowing’ was merely one of a range of possible temporal perceptions. For your time can pause, and you with it – though you’re left sharply alive within its stopping. Your apprehension of sequence itself is halted. Where you have no impression of any succession of events, there is no linkage between them, and no cause. Anything at all might follow on from any one instant. You are tensed for anything – or, equally, are poised for nothing. No plans can be entertained seriously, although you keep up an outward show of doing so. Where induction itself has failed, so does your capacity for confident anticipation. So your task now is to inhabit the only place left to you – the present instant – with equanimity, and in as much good heart as you can contrive. For one moment will not, now, carry you onward to the next.
సంతాప సమయంలో సాహిత్యంలో సాంత్వనను వెతుక్కోవడం గురించి రాస్తూ,
Nevertheless your search for any evidence of fellow feeling is restless, almost comically so. You’re paralysed and not, as far as you know, temporarily (for this condition feels eternal) but temporally. And yet some longing drives you onward to comb through any writing that might carry the reassurance that this cessation of your time is both well known and fully recorded. At times of great tension, we may well find ourselves hunting for some published resonances in literature of what we’ve come to feel. I realize that this might quickly be condemned as a sentimental search for ‘identification’, for the cosiness of finding one’s own situation mirrored in print. Still, I think we can save it from that withering assessment. Instead we might reconsider the possibility of a literature of consolation, what that could be or what it might do.
Monday, October 4, 2021
Because He Is - Meghna Gulzar
"ప్రముఖుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కూతుళ్ళూ,అల్లుళ్ళూ లాంటి వారు వారి బయోగ్రఫీలు రాసే సాహసం చెయ్యరాదు. ఒకవేళ చేసినా పాఠకుల విలువైన సమయం వృథా చెయ్యరాదు." (పైన వేరే తెలుగు పదాలు వాడాలని స్ట్రాంగ్ గా అనిపించినా , I'm just trying to be decent & polite) గుల్జార్ గురించి ఆయన కుమార్తె మేఘనా గుల్జార్ రాసిన 'బికాజ్ హీ ఈజ్' అనే పుస్తకం చదివాక నాకనిపించిన మొట్టమొదటి ఆలోచన ఇది. నిజానికి నేను బయోగ్రఫీలు,మెమోయిర్స్ లాంటివి ఎందుకు చదువుతాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ప్రముఖుల గురించి అందునా సినిమా రంగంలో ఉన్నవారి గురించి మనకు ఎక్కడ చూసినా కావాల్సినంత సమాచారం లభ్యమవుతూనే ఉంటుంది. ఫలానా నటుడు ఫలానా హోటల్ లో ఇడ్లీ,చట్నీ రోజూ తెప్పించుకుని తింటాడనీ, ఫలానా నటికి మనుషుల కంటే కుక్కలూ,పిల్లులూ,బల్లులూ అంటే ఎక్కువ ప్రీతీ అనీ, ఫలానా సింగర్ కి చీర కంటే సల్వార్ సూట్ వేసుకోవడమే ఇష్టమనీ, ఫలానా దర్శకుడికి స్విట్జర్లాండ్ వెళ్తేనే గానీ షూటింగ్ కి అవసరమైన 'క్రియేటివ్ మ్యూజ్' రాదనీ, ఫలానా సపోర్టింగ్ ఆక్టర్ షూటింగ్ లో రోజుకో పుస్తకం నమిలెయ్యనిదే నిద్రపోడనీ పత్రికలూ,మీడియా అరిగిపోయిన రికార్డుల్లా రోజుకో పదిసార్లు టీవీల్లో,సోషల్ మీడియాలో,పత్రికల్లో చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ పుస్తకం విషయానికొద్దాం.
![]() |
Image Courtesy Google |
నేను 'తల్వార్' చూసినప్పటి నుండీ మేఘన ఫ్యాన్ ని. 'రాజీ' తో ఆమె అంటే ఇష్టం మరింత పెరిగింది. సహజంగా నేను ముట్టని ఇటువంటి ఒక పుస్తకం చదవడానికి కారణం అదే. ఆమె రాసింది ఎవరి గురించో కాదు 'గుల్జార్' గురించి. చాలా లోతైనమనిషి గుల్జార్ గురించి ఆమె ఏం రాసుంటుందా అనే కుతూహలం. కానీ ఈ పుస్తకం రాసిన రచయిత్రి మేఘన తనకు అత్యంత ఇష్టమైన తండ్రి గురించి అంతే ప్రేమగా ఐదేళ్ళ పసిపాప పరిణితితో రాసిందనిపించింది. ఉదాహరణకు మనం సహజంగా మన అమ్మా,నాన్న గురించి చెబుతాం చూడండి, "మా నాన్నగారు అలా చేసేవారూ" , "మా అమ్మగారు ఇలా అన్నారు" , "అప్పుడేమైందో తెలుసా, మా ఇంటికి చుట్టాలొచ్చారు", " ఆ అంకుల్ నాకెప్పుడూ చాకోలెట్స్ తేకుండా రారు తెలుసా "," అపుడు మేమంతా కలిసి పిక్నిక్ కి వెళ్ళాం". మేమంతా కలిసి ఫలానా చోట క్రికెట్ ఆడుకున్నాం." etc etc వివరాలు అన్నమాట. మేఘన ఈ రచనలో ఒక తండ్రిగా 'పాపి' ని (ఆయన్ను కూతురు అలా పిలుస్తుంది) పరిచయం చేశారు. నిజానికి గుల్జార్ కంటే ఆయన కూతురుగా మేఘనా గుల్జార్ గురించే ఈ పుస్తకంలో ఎక్కువ విషయాలున్నాయి. ఇందులో రచయిత్రి గుల్జార్ పుట్టిన ఊరు మొదలు,ఆయన హిస్టారికల్ డీటెయిల్స్ వగైరా వగైరా అంటే ఏమేం సినిమాలు తీశారు,ఎంతమందితో కలిసి పనిచేశారూ వంటి ఆధార్ కార్డుకి అవసరమైన అన్ని పైపై వివరాలూ చదివి అలసి సొలసి విరక్తి వచ్చేసింది. ఏమన్నా అంటే అన్నామంటారు, గుల్జార్ తన పంచె లాల్చీ ఎక్కడ ఐరన్ చేయించుకుంటే మనకెందుకు చెప్పండి ! మనలో మనమాట ఆయన గెడ్డం ఎవరు గీస్తే మనకెందుకు. ఏదేమైనా మేఘనకి ఇంత ఛాదస్తం ఉంటుందనుకోలేదు. ఇక గుల్జార్ బాల్యం, ఒంటరితనం, కుటుంబం గురించి ఆమె రాసిన కొన్ని వివరాలు మాత్రం ఆ మహాకవిని మరో సాధారణ కోణంలో చూసే అవకాశాన్నిస్తాయి.
పుస్తకం ముందుమాటలో గుల్జార్ :
One thing we all fail to realize is that as they are growing up, our children observe and absorb so much about their parents, about us, that their truths about their parents, about us, could shock us…
They know if we don’t wash our hands before meals … They know the language we use if we abuse our servants … They know if we are at home and have conveyed a message on the phone saying that we have left … They know we tell lies … They instinctively know our relations with our friends and relatives. They know our hypocrisies…
తల్లి రాఖీ,తండ్రి గుల్జార్ విడిపోవడం గురించి ఆమె రాసిన వాక్యాలు నాకు నచ్చాయి :
Speculations are aplenty, as are the reasons. I would like to believe that they are two good people, who were just not good together. And since nobody questioned why they came together, they needn’t have to explain why they parted. What transpires between two people should remain just there – between the two people. I was raised to respect their reasons and appreciate the fact that I was spared the emotional scars of squabbling parents and bitter mudslinging.
He’s been a very egalitarian father – never talking down to me, but always talking to me, never instructing, but rather suggesting. And yet, he instilled a sense of discipline and respect in me. It was a very novel way of parenting, according to me.
Dil kuchh is tarah se bhar aaya tha mera ke pet bharne ki gunjaaish nahin thi.
sheher ki bijli gayi
band kamre mein bahot der talak kuchh bhi dikhai na diya
tum gayi thi jis din
us roz bhi aisa hi hua tha
aur bahot der ke baad
aankhen tariki se maanus hui toh
phir se darvaaze ka khaaka sa nazar aaya mujhe
kai pinjron ka qaidi hoon
kai pinjron mein basta hoon
mujhe bhaata hai qaiden kaatna
aur apni marzi se
chunav karte rehna
apne pinjron ka
meyaaden tai nahin karta main rishton ki
aseeri dhoondta hoon main
aseeri achchhi lagti hai
‘You must give respect to earn respect’ – it’s not just a hollow saying. But very often parents erroneously expect respect from their children just because they’re parents. What the child really feels is probably more fear than respect. Papi respected me as an individual even while I was a toddler and, as a result, I have grown up with a tremendous sense of respect for the person he is – not only because he is my father.
Tuesday, January 5, 2021
The Cynical Idealist : A Spiritual Biography of John Lennon - Gary Tillery
![]() |
Image Courtesy Google |
ప్రతి మనిషీ తనకు ప్రత్యేకం నిర్దేశింపబడిన లక్ష్యం దిశగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఏదో ఒక దశలో చివరి మెట్టుకు చేరుకుంటాడు..ఈ గమ్యం చేరడానికి చాలామందికి ఒక జీవితకాలం పడితే, అతి కొద్ది మంది అదృష్టవంతులు (?) మాత్రం జీవితపు తొలిదశల్లోనే చివరి మెట్టు చేరుకుంటారు..సంగీతమంటే ప్రేమ,తద్వారా వచ్చిన బీటిల్స్ పాపులారిటీ లెనన్ కు పాతికేళ్ళ ప్రాయంలోనే ఒక జీవితకాలానికి సరిపడా అనుభవాలన్నీ సొంతం చేసింది..ఇక ఎక్కడానికి మెట్లు లేవని గ్రహింపుకొచ్చిన సమయంలో లెనన్ లో సహజంగానే ఒక ఖాళీ,స్తబ్దత చోటు చేసుకున్నాయి..సరిగ్గా ఇలాంటి సమయంలోనే జీవితేఛ్ఛ సన్నగిల్లి అస్తిత్వవాదం తెరపైకి వస్తుంది..జీవితం అంటే ఇంతేనా ? ఇంకేమీ లేదా ? నా ఉనికికి అర్థం ఏమిటి ? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి..ఇంకేదో లేదనుకోవడం,కావాలనుకోవడం మనిషి సహజ స్వభావం..ఒక సినీకవి అన్నట్లు 'మనిషి మారడు,ఆతని కాంక్ష తీరదు'..కానీ ఈ స్పిరిట్యుయల్ కాలింగ్ కొందరికి జీవితపు తొలి దశలోనే ఎదురైతే మరికొందరికి తుది దశకి చేరే వరకూ అనుభవంలోకి రాదు,ఇక పొట్టకూటికి కర్మసిద్ధాంతాన్ని అనుసరించి కులాసాగా బ్రతికే అధికశాతం సాధారణ ప్రజానీకానికి ఇటువంటి స్పిరిట్యుయల్ కాలింగ్ అనేదొకటుంటుందనేదే తెలియదు..ఒక్కోసారి ఈ స్పిరిట్యుయల్ క్వెస్ట్ అంతా ఒక కడుపు నిండిన వ్యవహారం ఏమో అనిపిస్తుంది.
బీటిల్స్ బిజీ షెడ్యూల్స్ తో,ప్రపంచ పర్యటనలతో పట్టిందల్లా బంగారంగా మారిన దశలో సృజనాత్మకతను పెంపొందించుకోడానికి LSD వినియోగానికీ ,ఇతరత్రా డ్రగ్స్ కి అలవాటుపడిన లెనన్ ఒక స్థాయిలో బ్రేకింగ్ పాయింట్ కు చేరుకున్నారు..జీవితపు అర్థరాహిత్యాన్ని భరించలేక "But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret; and thy Father which seeth in secret shall reward thee openly." అన్న జీసస్ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుని, ఒక శీతాకాలపు రాత్రి వేళ వేబ్రిడ్జి లోని తన ఇంట్లో బాత్రూమ్ తలుపు గడియ వేసుకుని మోకాళ్ళపై కూర్చుని దేవుణ్ణి ఒక చిన్న చిహ్నాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డారు ,అయినా ఆయనకు ఏ విధమైన సమాధానం దొరకలేదు..కానీ లెనన్ జీవితంలో ఆ క్షణంలో మొదలైన సత్యాన్వేషణ మరో దశాబ్దంపాటు నిర్విరామంగా కొనసాగింది..అంతవరకూ జీవిత పరమార్ధాన్ని బాహ్య ప్రపంచంలో వెతికిన లెనన్ ఆలోచనలు మహర్షి మహేష్ యోగి పరిచయంతో అంతఃప్రపంచం దిశగా ప్రయాణించాయి..యోగితో మనస్పర్థల కారణంగా విడిపోయినప్పటికీ ఆయన ఆధ్వర్యంలో నేర్చుకున్న ధ్యానం చివరి వరకూ కొనసాగించారు లెనన్..భార్య సింథియానూ,కుమారుణ్ణీ వదిలేసి యోకో ఓనోని వివాహమాడిన తరువాత నుండీ లెనన్ జీవితం ఇంకా సంక్లిష్టంగా మారింది..ఈ దశలో ఓనో తో కలిసి దేశదేశాలూ తిరుగుతూ శాంతిమంత్రం జపిస్తూ అటు బ్రిటన్,ఇటు అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ 'సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ' దిశగా అడుగులు వేశారు లెనన్.
ఈ రచనలో బీటిల్స్ ప్రస్థానం గురించీ,జాన్ లెనన్ వ్యక్తిగత జీవితం గురించీ ఆసక్తికరమైన విషయవిశేషాలుంటాయి..జాన్ లెనన్ లో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ను వివిధ దశల్లో వివరిస్తూ రాసిన అధ్యాయాలను చివర్లో 'Suggested Listening' పేరిట ఆయన ఆయా సమయాల్లో కంపోజ్ చేసిన బీటిల్స్ పాటల్ని రిఫర్ చేస్తూ ముగించడం బావుంది..ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదవగలిగినప్పటికీ నేనలా చదవలేదు,నిజానికి బీటిల్స్ ఫాన్స్ ఎవరూ అలా చదవలేరు..పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అందులో ప్రస్తావించిన బీటిల్స్ పాటల్ని వింటూ ప్రతీ వాక్యాన్నీ లెనన్ ఆలోచనలతో రిలేట్ చేసుకుంటూ చదవడం వల్ల వివిధ దశల్లో లెనన్ లో మానసిక పరిపక్వతా,పరిణితీ స్పష్టంగా తెలుస్తాయి..“I think, therefore I am ” అనే Descartes సిద్ధాంతానికి భిన్నంగా లెనన్ వెర్షన్ ను “I don’t believe, therefore I am.” అనవచ్చు అంటారు రచయిత.
ఆధ్యాత్మిక మార్గంలో తొలి అడుగు (స్పిరిట్యువల్ అవేకెనింగ్ ) అందరికీ ఒక్కలా అనుభవమయ్యే విషయం కాదు..నలుగురూ నడిచే సౌకర్యవంతమైన దారుల్లో,గుంపులో ఒకడిగా 'గోయింగ్ విత్ ది ఫ్లో' తో నడిచి మూకుమ్మడిగా సాధించే లక్ష్యం అంతకంటే కాదు..ఆధ్యాత్మికత దిశగా ప్రయాణంలో ఎవరి 'కాలింగ్' వారిదే,ఎవరి మార్గం,మజిలీ,గమ్యం వారిదే..మనిషిలో తన జీవిత పరమార్ధం ఏమిటనే ప్రశ్న తలెత్తినప్పుడు, సమాధానం ఇదీ అంటూ ఏ మతగ్రంథాలూ ఉద్బోధించలేవు ,ఏ గురువులూ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేరు..ఇవన్నీ సత్యాన్వేషణ దిశగా ప్రయాణించే మనిషికి తాత్కాలికంగా సంశయనివృత్తి చేసే ఉత్ప్రేరకాలుగా ఉండవచ్చు..'జీవిత పరమార్ధం'(పర్పస్ ఆఫ్ లైఫ్ ) మనిషి మనిషికీ ప్రత్యేకమైనది..సమస్త భారత జాతినీ ఒకే తాటిపై నడిపించిన స్వాతంత్య్ర సమరం మహాత్ముడి కాలింగ్ అయితే,పిన్న వయసులోనే అన్నీ పరిత్యజించి సన్యసించడం వివేకానందుడి కాలింగ్..అలాగే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి,సచిన్,కలాం ఇలా అందరూ తమవైన రంగాల్లో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినవారే..ఇదంతా చెప్పడంలో ఉద్దేశ్యం ఆధ్యాత్మికత ఒక మతానికో,వ్యవస్థకో,సంస్కృతికో సంబంధించిన విషయం కాదని చెప్పడమే..ఇది పూర్తిగా వ్యక్తిగతం,బహుశా వ్యక్తిగత కర్మఫలానుసారం జరిగే ప్రక్రియ కావచ్చును..మనిషికి తనదైన సత్యాన్వేషణలో తలెత్తే సంశయాలకు సమాధానాలు మనిషి బయట దొరికే అవకాశం లేదు..వాటిని వెతకాలంటే మనిషి తన అంతః ప్రపంచంలోకి దృష్టి సారించాలి.
Lennon thought that we ourselves have the power to reshape culture and world events if we will only recognize the fact and act individually and in concert. The first key to achieving this power is self-transformation. When considering how to improve the world, people almost always focus their attention outside themselves, which too often leads to resistance, confrontation, frustration, and defeat. Actually, the only thing over which we have control is our own attitudes and behavior. If we first focus on changing ourselves, internalizing love instead of possessiveness and violence, we take a small but significant step toward positive change.
ప్రేమ, శాంతి : ఈ రెండూ ముఖ్యంగా జాన్ లెనన్ ప్రొమోట్ చేసిన అంశాలైనప్పటికీ , వాటిని సాధించే దిశగా ఆయన ప్రతిపాదించిన మార్గాలు వాస్తవదూరమనీ, ఆచరణయోగ్యం కావనీ, ఆయన 'సినికల్' ధోరణి కామూ తరహా నిహిలిస్టిక్,పెస్సిమిస్టిక్ అప్రోచ్ అనీ అధికశాతంమంది విమర్శించారు..లెనన్ కలలుగన్న 'NUTOPIA' ను చూడడానికి ఆయన జీవించి లేకపోయినప్పటికీ తన జీవితకాలంలో మనసావాచాకర్మణా నమ్మి ఆచరించి,ప్రతిపాదించినవి ముఖ్యంగా మూడు సూత్రాలు :
1.We owe it to ourselves to question the “truths” our culture passes on to us and to be cynical about the motives of experts and those in authority.
అథారిటీ ని ప్రశ్నించడం లెనన్ కు చిన్నతనంలోనే అలవడింది..లివర్పూల్ లో ఇంగ్లీషు ఇంపీరియలిస్ట్ సొసైటీలో వర్కింగ్ క్లాస్ కుటుంబంలో పెరిగిన లెనన్ మొదట్నుంచీ సామజిక కట్టుబాట్లను ధిక్కరించారు.
2.We owe it to ourselves to live our lives as though creating works of art, using the resources fate has dealt us.
సంఘంలో తన స్థానం ఏదైనా మనిషి నిర్భీతిగా తన జీవితాన్ని ఒక కళగా మలుచుకోగల సమర్థుడని తన జీవితం ద్వారా చాటిచెప్పారు లెనన్.
3. We owe it to ourselves and our posterity to aim at self-transformation, being aware of the “ripple” influence of our words and actions.
మనిషిని సమాజంలో భాగంగా కాకుండా ఒక ఇండివిడ్యువల్ (A free-thinking, self-directing individual ) గా చూస్తారు లెనన్..సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యక్తిగత అంశమే గానీ సామజికాంశం కాదనేది నిర్వివాదం..యుద్ధాలు,మతవిద్వేషాలు,ఆర్ధిక/సామాజిక అసమానతలూ లేని శాంతియుతమైన సమాజం కోసం వ్యక్తి తనలో మార్పు దిశగా కృషి చెయ్యాలనేది ఆయన సిద్ధాంతం.
పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు :
He had eluded the “system” that molded young minds into useful parts of the socioeconomic machine, only to realize that rebellion against it had given him meaning while freedom from it left him directionless.
He confided to his close friend Pete Shotton: “The more I have, the more I see, and the more experience I get, the more confused I become as to who I am, and what the hell life is all about.”
లెనన్ క్రమశిక్షణారాహిత్యం కారణంగా రిపోర్ట్ కార్డు మీద స్కూల్ వారి రిపోర్ట్ : The headmaster of Quarry Bank wrote a dismissive note at the bottom of his final report card: “This boy is bound to fail.”
సోషల్ కండిషనింగ్ కి లొంగని లెనన్ బలమైన వ్యక్తిత్వానికి కారణమైన పుస్తక పఠనం గురించి : The problem was not with his initiative or intelligence. His Aunt Mimi owned a twenty-volume set of the world’s best short stories, and by the time Lennon was ten he had read and reread most of them, being particularly enthralled by Balzac. At twelve he ploughed through her encyclopedia. By sixteen he had read the complete works of Winston Churchill. He also enjoyed Edgar Allan Poe, James Thurber, Edward Lear, and Richmal Crompton, and his favorite books were Treasure Island, Alice in Wonderland, and Through the Looking Glass.
“The more I have, the more I see, and the more experience I get, the more confused I become as to who I am,and what the hell life is all about.” Seeking some direction, or at least a compass, Lennon began to study the works of Sigmund Freud, C. G. Jung, and Wilhelm Reich.
Lennon’s academic problem was with academia itself. He felt stifled by the regimentation. He resented the assumptions that were inherent in the educational system—that those in charge had a right to direct his life, to tell him where to go and when to be there, to judge his work and his behavior by their own standards, and to expect him to study and master information "they" considered important.
Curiously for a man envied by millions of fans around the world, he wrote a song called “I’m a Loser.” He characterized himself as wearing a mask (“I’m not what I appear to be”) and punctuated self-pitying lyrics with Dylanesque harmonica riffs.
క్రిస్టియానిటీపై లెనన్ విమర్శలు బ్రిటన్ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి : “Christianity will go. It will vanish and shrink. I needn’t argue with that; I’m right and I will be proved right. We’re more popular than Jesus now; I don’t know which will go first—rock ’n’ roll or Christianity. Jesus was all right but his disciples were thick and ordinary. It’s them twisting it that ruins it for me.
Lennon came to hold the view that a personified God was a defense mechanism of the human brain confronted by the stresses of life. In his song “God,” he concisely expresses this point of view with an aphorism: “God is a concept by which we measure our pain."
The song, written when he was turning thirty, could be considered Lennon’s declaration of independence. After beginning with the aphorism, he offers a litany of subjects in which he declares he does not believe, among them Jesus, Buddha, the Bible, and the Bhagavad Gita. He also includes Kennedy, Elvis, and Zimmerman (Bob Dylan) in the list, and culminates with the Beatles. His objective is quite straightforward: to stand alone intellectually—rejecting all belief systems and all idols, even the idol he had helped to create and to which he owed his power and influence.
His message is blunt: stop accepting what you’ve been told; assert your independence and individuality; don’t be mentally shackled by rules that someone else devised.
Through engagement with the world you risked entanglement and defeat, and even if successful you achieved nothing that someone else couldn’t achieve. The one thing you could do that absolutely no one else could do was to change yourself—to “learn how to be you in time.”
History’s most famous Cynic and John Lennon have fascinating similarities. Diogenes had a strong predisposition to speak the truth, to “say it all,” no matter what the consequences. He was committed to moral freedom and contemptuous of traditional ideals. He insisted on mental independence and enjoyed defying social norms. In the words of Professor Luis E. Navia, he had “an unusual degree of intellectual lucidity, and, above all, a tremendous courage to live in accord with his convictions.”
He had nowhere to turn for help; the coterie of aides and hangers-on who surrounded him had a stake in his persona as Beatle John and facilitated his captivity. “The king is always killed by his courtiers, not by his enemies. The king is overfed, overdrugged, overindulged, anything to keep the king tied to his throne. Most people in that position never wake up. They either die mentally or physically or both. And what Yoko did for me, apart from liberating me to be a feminist, was to liberate me from that situation.”
Along with Mahatma Gandhi and Martin Luther King, Jr., John Lennon stands out prominently as one of the twentieth century’s three icons of peace. All three would die by gunfire.
ఇంగ్లీష్ వ్యవస్థలో వేళ్ళూనుకున్న పురుషాధిక్యతకు లెనన్ కూడా మినహాయింపు కాదు అనడానికి లెనన్ ఒక సందర్భంలో అన్నమాటల్ని గుర్తు చేస్తారు As a cocky young man he had summed up his view with a one-liner: “Women should be obscene and not heard.”
యోకో ఓనో తన పురుషాధిక్య ధోరణిని మార్చి స్త్రీల పట్ల గౌరవాన్ని కలిగించింది అంటూ ..Now, in his thirties, he was finally opening his eyes to the pain he had caused in his blindness. “I was a working-class macho guy that didn’t know any better. … I was used to being served, like Elvis and a lot of the stars were. And Yoko didn’t buy that. … From the day I met her, she demanded equal time, equal space, equal rights. I didn’t know what she was talking about. … Well, I found out. And I’m thankful to her for the education.”
నిద్రలేచిన ప్రతి క్షణం నుండీ లెనన్ తన బీటిల్స్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి ఏం కోల్పోయారో గ్రహించిన వెంటనే ఆ చట్రంనుండి బయటపడడానికి ప్రయత్నించారు : From his early twenties, Lennon had been living at a furious pace. He was a gifted person and he accomplished extraordinary things, but he finally came to understand that he had climbed onto a merry-go-round of illusion and that every day he focused on trying to be “John Lennon” he sacrificed another part of himself. In time he realized he was caught up in a hopeless quest. He had only one choice—to let it all go.
లెనన్ ఇమేజ్ నుండి బయటపడిన క్రమం : The first key to his escape had been linking up with Yoko Ono, who related to him not as a legend but as a person. Another had been Primal Scream therapy, which pried the lid off his deepest insecurities and engendered raw honesty. The final key had been the lost weekend, which tantalized him with freedom, then coldly drove home the point that the price of remaining “John Lennon” would be Faustian.
“If I can’t deal with a child, I can’t deal with anything. No matter what artistic gains I get, or how many gold records, if I can’t make a success out of my relationship with the people I supposedly love, then everything else is bullshit".
“Life is what happens to you while you’re busy making other plans".
ఐదేళ్ల పాటు లైమ్ లైట్ కి దూరంగా 'హౌస్ వైఫ్' బాధ్యతలు స్వీకరించిన లెనన్ ఆలోచనలు :
His househusband experiences gave him a firsthand education about the daily life of housewives. "I’ll say to all housewives, I now understand what they’re screaming about. Because . . . what I’m describing is most women’s lives. . . . I was being just like a million, a hundred million people who are mainly female, I just went from meal to meal. Is he well? Has he brushed his teeth? Has he eaten enough vegetables? Is he overeating? Am I limiting his diet too much? Did he get some goodies? What condition is the child in? How is she when she comes back from the office? Is she going to talk to me or is she just going to talk about business ? "
His last five years were spent as a mentally liberated, mature man. Not a man who had fully overcome his demons and his weaknesses, but a man who drew strength from his family relationships. Not a man who no longer had aspirations, but a man who knew the importance of pausing to savor the simple pleasures of life.
Why? Because with Lennon they knew they were going to hear a genuine iconoclast with the courage to speak from the heart. “I’ve never claimed divinity. I’ve never claimed purity of soul. I’ve never claimed to have the answer to life. I only put out songs and answer questions as honestly as I can, but only as honestly as I can—no more, no less.”
మీరు బీటిల్స్ ఫ్యాన్ అయితే ఇది తప్పకుండా చదవవలసిన రచన. హ్యాపీ రీడింగ్ :)
Friday, June 26, 2020
The Book of Eels: Our Enduring Fascination with the Most Mysterious Creature in the Natural World Book - Patrik Svensson
మనిషికి జన్మతః ఉండే కుతూహలంతో సృష్టిలో ప్రతిదానికీ సమాధానాలు వెతుకుతున్నప్పటికీ ఇంకా కొన్ని సృష్టి రహస్యాలు సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి..అస్పష్టత,అశాశ్వతత్వం ఈ రెండూ స్వతః సిద్ధంగా మేథోజీవి అయిన మనిషికి కొరుకుడుపడని రెండు విపరీతాంశాలుగా మిగిలిపోయాయి..ఇటువంటి సందర్భాల్లోనే మనిషి అయిష్టంగానే అయినప్పటికీ తనకు తెలీని 'సూపర్ పవర్' ఏదో ఈ సమస్త విశ్వాన్నీ నడిపిస్తోందన్న అభిప్రాయానికొస్తాడు..ఈ నమ్మకాన్ని సమర్ధించుకునే దిశగా ఆధ్యాత్మికతకు పునాదులు పడ్డాయి..నిజానికి లాజిక్ / రీజనింగ్ ఈ రెండిటికీ అందనివన్నీ 'నమ్మకం' (Faith) ఖాతాలో వేసేసుకోవడం మనిషి అహంభావానికి కాస్త స్వాంతన చేకూరుస్తుంది.
![]() |
Image Courtesy Google |
అట్లాంటిక్ సముద్రంలో భాగమైన సర్గాస్సో సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది..దీనికి స్పష్టమైన భూపరిమితులు లేని కారణంగా,ఈ సముద్రం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో కనుక్కోవడం కష్టం..ఈ సముద్రం క్యూబా కూ,బహమాస్ కూ కొద్దిగా ఈశాన్యంలో,ఉత్తర అమెరికా తీరానికి కాస్త తూర్పులో నాలుగు పాయల సమాగమంగా (In the west by the life-giving Gulf Stream; in the north by its extension, the North Atlantic Drift; in the east by the Canary Current; and in the south by the North Equatorial Current) ఉందని సుమారుగా చెప్పవచ్చు..ఈ సముద్రాన్ని ఒక కలగా అభివర్ణిస్తూ,The Sargasso Sea is like a dream: you can rarely pinpoint the moment you enter or exit; all you know is that you’ve been there.అంటారు పాట్రిక్.
అరిస్టాటిల్ పరిశోధనల అనంతరం రెండువేల సంవత్సరాల తరువాత కూడా 'ఈల్' ఒక సైంటిఫిక్ ఎనిగ్మా గా,మెటాఫిజికల్ సింబల్ గా మిగిలిపోయింది..ప్రకృతి జీవాల్లో అందులోనూ జలచరాల్లో ఈ 'ఈల్' ను జీవశాస్త్రజ్ఞులు ఒక సవాలుగానే చూశారు..ఈ ఈల్ పరిణామక్రమం కూడా విచిత్రంగా ఉంటుంది..మొదట్లో పసుపుపచ్చని రంగులో ఉండే ఈల్ సరస్సులనూ,కాలువలనూ దాటుకుంటూ మహానదుల్ని,చెరువుల్నీ అన్నిటినీ అవలీలగా దాటి క్రమేపీ సిల్వర్ కలర్ లోకి మారిపోతుంది..ఈ మార్పు అది ప్రత్యుత్పత్తికి సిద్ధంగా ఉందన్న సంకేతం అన్నమాట..ఈల్ అవసరమైన సందర్భాల్లో చిత్తడినేలల్నీ,మురుగుకాలువల్నీ కూడా దాటుకుంటూ అన్ని ప్రతికూల పరిస్థితుల్నీ ఎదుర్కొంటు కూడా ప్రయాణం చెయ్యగలదు..ఇక నీటి ప్రవాహం లేని చోట్ల కూడా పొడి నెలల్లో తేమ తో కూడిన గడ్డిని ఆసరా చేసుకుని నీటి వైపు ప్రయాణిస్తూ చాలా గంటలు పైగానే జీవించగలదు..The eel is, thus,a fish that transcends the piscine condition. Perhaps it doesn’t even realize it is a fish.అంటారు పాట్రిక్...బ్రౌనిష్ ఎల్లో కలర్ ఈల్ నిర్థిష్ట గమ్యం లేకుండా హైబర్నేషన్ కూ,ఆక్టివిటీకీ మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది..జీవితానికి ప్రత్యేకమైన లక్ష్యం అంటే సెన్స్ ఆఫ్ పర్పస్ అనేది లేకుండా తన జీవితాన్ని ఆహారాన్నీ,నివాసాన్ని వెతుక్కోడానికి మాత్రమే పరిమితం చేసుకుంటుంది..As though life was first and foremost about waiting and its meaning found in the gaps or in an abstract future that can’t be brought about by any means other than patience.అంటారు.
మానవజాతికి తమ ఉనికి అశాశ్వతమని తెలుసు కాబట్టి తమ తదనంతరం తన గుర్తుగా ఈ భూమ్మీద కొన్ని జాడలు వదిలివెళ్ళాలని తాపత్రయపడుతుంది..అందునా మానవీయ అనుభవం అంటే అది కేవలం ఒక వ్యక్తిగత అనుభవానికి పరిమితం కాదు..అది ముందు తరాలకు పదే పదే కథలుగా చెప్పుకుంటూ ఆచరించడానికీ అందించగలిగిన ఒక మొత్తం జాతికి సంబంధించిన అనుభవంగా చూడాల్సిన అవసరం ఉంది..ఈల్స్ ను పట్టడం క్లాస్ రూమ్ లోనో,లేబొరేటరీలోనో నేర్చుకుంటే అబ్బె విద్య కాదు,ఇది శతాబ్దాల తరబడి ఒక తరం మరొక తరానికి అందిస్తూ వచ్చిన సంస్కృతి..దీనిని 'ఎవరూ రాయడానికి పూనుకోని ప్రాచీన చరిత్ర'గా అభివర్ణిస్తారు పాట్రిక్. How to craft a homma or how to flay an eel, how to read the sea and the weather and how to interpret the eel’s movements under the surface: this specific and particular knowledge has been transmitted through practical work, as a shared experience transcending the ages.
ఈల్స్ ను పట్టడమనే అంతరించిపోతున్న ఫిషింగ్ సంస్కృతిని గురించి ఈ విధంగా రాస్తారు,
After all, people have a need to be part of something lasting, to feel that they are part of a line that started before them and will continue after they’re gone. They need to be part of something bigger.
Knowledge can, of course, be the bigger context. All kinds of knowledge, about crafts or work or ancient insane fishing methods. Knowledge can, in and of itself, constitute a context, and once you become a link in the chain of transmission, from one person to another, from one time to another, knowledge becomes meaningful in itself, quite apart from considerations of utility or profit. It’s at the heart of everything.
ఈల్ గురించి మనం చదువుతున్న కొద్దీ,ఈల్ జీవితానికీ,మనకు పరిచయమున్న విశ్వపు పరిమితులకూ చాలా దగ్గర పరిచయం ఉన్నట్లు అనేక సారూప్యతలు కనిపిస్తాయి..తీవ్రమైన సముద్రపు అలల తాకిడిని ఎదుర్కుంటూ ఈల్ దాని నివాస స్థానాన్ని వదిలి ఆదీ అంతం ఎరుగని సరగాస్సో సముద్రానికి ఐదువేల మైళ్ళు ప్రత్యుత్పత్తి కోసం ప్రయాణం చెయ్యడం..మళ్ళీ అక్కడ నుండి తిరుగుప్రయాణం చెయ్యడం లాంటివన్నీ చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో 'ఈల్ మిస్టరీ',మనుషులు తమలో తాము వేసుకునే "నేనెవరు ?" ,"ఎక్కడ నుండి వచ్చాను ?" "ఎక్కడికి ప్రయాణిస్తున్నాను ?" లాంటి సంక్లిష్టమైన ప్రశ్నలకు మెటాఫోర్ లా కనిపిస్తుంది.
ఈ పుస్తకంలో ఈల్ తో ముడిపడిన పలు సాంస్కృతికపరమైన విషయవిశేషాలున్నాయి ..1620 లో 'మే ఫ్లవర్' నార్త్ అమెరికా తీరం చేరిన సమయంలో సుమారు సగం మంది యాత్రికులు క్షయ,నిమోనియా వంటి వ్యాధుల బారిన పది మరణించగా (53/102) మిగిలిన యాభై మంది 'టిస్క్వాంటమ్' అనే బానిస సాయంతో ఈల్ ను పట్టుకుని తినడం ద్వారా కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు..అదే నార్త్ అమెరికన్ కలోనైలేజషన్ కి నాంది..ఈల్ పట్ల ఉండే ఏహ్యభావం వల్ల కావచ్చు నార్త్ అమెరికన్ కలోనలైజేషన్లో,థాంక్స్ గివింగ్ కి సంబంధించిన మిత్స్,లెజెండ్స్ లలో ఈ ఈల్ కథ మాత్రం ఎక్కడా కనిపించదు అంటారు రచయిత.
On Thanksgiving, Americans eat turkey, not eel, and other animals—buffalo, eagles, horses—have been the ones to shoulder the symbolic weight of the patriotic narrative of the United States of America. True, the colonizers continued to catch and eat eels, and by the end of the nineteenth century the eel was still an important ingredient in the American kitchen. But it gradually disappeared from dinner tables.
ఈల్ కథ మానవజాతిలో ఉన్న ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలాన్ని గురించీ,సృష్టిలో ప్రతిదానికీ ఆదీ అంతం ఎక్కడో,దానికి అర్ధ పరమార్థం ఏమిటో సత్యశోధన చేసి తెలుసుకుని తీరాలనే బలమైన ఆరాటం గురించీ చెప్తుంది..అంతేకాకుండా మానవాళి మనుగడకు 'మిస్టరీ' ఆవశ్యకతను గురించి కూడా చెప్తుంది.“Now there is much the eel can tell us about curiosity—rather more indeed than curiosity can inform us of the eel.
మానవేతర జీవులకు మానవ లక్షణాలను ఆపాదించడం సాహిత్యం,సినిమా,ఆర్ట్,ఫెయిరీ టేల్స్ లో చాలా సహజంగా చూస్తూ ఉంటాము..ఇలా 'ఆంథ్రోపోమోర్ఫైజ్' చెయ్యబడిన జీవులు మనుషుల్లాగా మాట్లాడడం,భావావేశాలు కలిగుండడం,మొరాలిటీ స్పృహ కలిగి ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం..రిలీజియన్ లో కూడా ఇది కొత్తేమీ కాదు..మన వినాయకుడు,హనుమంతుడు ఇలా అనేక ఉదాహరణలు చూపించవచ్చు..అమెరికన్ మెరైన్ బయాలజిస్ట్,రచయిత్రి అయిన రేచెల్ కార్సన్ ఈ ఈల్ ను కేవలం తన పరిశోధనలో భాగంగా చూడకుండా,తన రచనల్లో దానికి మానవీయ లక్షణాలను ఆపాదించి 'ఆంథ్రోపోమోర్ఫైజ్' చేశారట.
As soon as Rachel Carson learned how to read and write, she started making little books, illustrated pamphlets with fact-filled stories about mice, frogs, owls, and fish. It’s said she was a lonely child, with few, if any, close friends, but she never felt alone or out of place in nature. That was the world she got to know better than any other.
కార్సన్ దృష్టిలో 'ఈల్' మిస్టరీ :
She explains in a letter to her publisher: “I know many people shudder at the sight of an eel. To me (and I believe to anyone who knows its story) to see an eel is something like meeting a person who has traveled to the most remote and wonderful places of the earth; in a flash I see a vivid picture of the strange places that eel has been—places which I, being merely human, can never visit.
ఈ 'ఈల్' మిస్టరీని ఛేదించడంలో అరిస్టాటిల్ 'ది హిస్టరీ ఆఫ్ ఆనిమల్స్' నుండీ ,సిగ్మన్డ్ ఫ్రాయిడ్ ట్రిస్టే లో చేసిన పరిశోధనల నుండీ అనేక అంశాలు ప్రస్తావించారు..సిగ్మన్డ్ ఫ్రాయిడ్ ట్రిస్టే లో ఈల్ గురించి చేసిన పరిశోధనలు ఈల్ మిస్టరీని ఛేదించలేకపోయినా,ఈల్స్ తో పాటు మానవమస్తిష్కంలో కూడా కొన్ని రహస్యాలు ఎంత లోతైనవో అనే అవగాహనను ఆయనలో కలిగించాయి,తత్పరిణామంగా 'మోడరన్ సైకో ఎనాలిసిస్' జీవం పోసుకుంది.. Johannes Schmidt మొదలు రేచెల్ కార్సన్ వరకూ పలు జీవశాస్త్రజ్ఞుల పరిశోధనలను గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇందులో చదవవచ్చు..అంతే కాకుండా సాహిత్యంలో ఈ ఈల్ ను వికర్షణకు మెటాఫోర్ గా వాడడం గురించి రాస్తూ గుంటెర్ గ్రాస్ 1959లో రాసిన 'టిన్ డ్రమ్' ను ప్రస్తావిస్తారు..ఇలా చదువుతూపోతే ఈల్ తో ముడిపడి ఉన్న అనేక ఆసక్తికరమైన పిట్ట కథలు,మిత్స్,లెజెండ్స్ ఇందులో ఎన్నో..ఈ ఈల్స్ గురించి చదువుతున్నప్పుడు చిన్నప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మిరాకల్స్ గురించి చాలా ఆసక్తిగా చదివిన సందర్భాలు అనేకం గుర్తుకొచ్చాయి..కొన్నేళ్ళ క్రితం చదివిన హెలెన్ మెక్ డోనాల్డ్ 'H is for Hawk' అనే మెమోయిర్ లో తండ్రి మృతి తాలూకా దుక్ఖంలో ఉన్న హెలెన్ కథలో ఆమె పెంపుడు హాక్ గురించి చదివినప్పుడు మనిషితో ఆకారస్వరూపాల్లో ఏమాత్రం సారూప్యతలేని ఆ పక్షి స్వభావంలో మనిషి స్వభావపు సారూప్యతలు అనేకం కనిపిస్తాయి..ఆ మెమోయిర్ చదివినప్పుడు మనిషీ, ప్రకృతీ వేర్వేరు కావనే విశ్వాసం కలుగుతుంది..అదేవిధంగా ఈ పుస్తకం అంతా ముఖ్యంగా ఈల్స్ గురించే అయినప్పటికీ,ఈ ఈల్ మిస్టరీని ఛేదించే క్రమంలో మనం ఈల్స్ గురించి కంటే మన గురించే మనం ఎక్కువ తెలుసుకుంటున్నామని అర్ధమవుతుంది..ఆంథ్రోపాలజీ,సైన్స్ లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన రచన ఇది.
పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు,
A PERSON SEEKING THE ORIGIN OF SOMETHING IS ALSO SEEKING HIS own origin.
Perhaps there are people who simply don’t give up once they’ve set their minds to answering a question that arouses their curiosity, who forge ahead until they find what they seek, no matter how long it takes, how alone they are, or how hopeless things seem. Like a Jason aboard the Argo, seeking the Golden Fleece.
Ambition and self-realization had to yield to duty and family loyalty.
I CAN’T RECALL US EVER TALKING ABOUT ANYTHING OTHER THAN eels and how to best catch them,down there by the stream. I can’t remember us speaking at all.Maybe because we never did. Because we were in a place where the need for talking was limited, a place whose nature was best enjoyed in silence. The reflected moonlight, the hissing grass, the shadows of the trees, the monotonous rushing of the stream, and the bats like hovering asterisks above it all. You had to be quiet to make yourself part of the whole.
More specifically, the uncanny is the unique unease we experience when something we think we know or understand turns out to be something else. The familiar that suddenly becomes unfamiliar. An object, a creature, a person, who is not what we first thought. A well-crafted wax figure. A stuffed animal. A rosy-cheeked corpse.
Despite the contradictory feeling the eel arouses, up close, in its natural habitat, it gives the impression of being fairly jovial. It rarely puts on airs. It doesn’t cause a scene. It eats what its surroundings offer. It stays on the sidelines, demanding neither attention nor appreciation. The eel is different from, for instance, the salmon, which sparkles and shimmers and makes wild dashes and daring jumps. The salmon comes off as a self-absorbed, vain fish. The eel seems more content. It doesn’t make a big deal of its existence.
From this we can learn that time is unreliable company and that no matter how slowly the seconds tick by, life is over in the blink of an eye: we are born with a home and a heritage and we do everything we can to free ourselves from this fate, and maybe we even succeed, but soon enough, we realize we have no choice but to travel back to where we came from, and if we can’t get there, we’re never really finished, and there we are, in the light of our sudden epiphany, feeling like we’ve lived our whole lives at the bottom of a dark well, with no idea who we really are, and then suddenly, one day, it’s too late.
We should be glad that knowledge has its limits. This response isn’t just a defense mechanism; it’s also a way for us to understand the fact that the world is an incomprehensible place. There is something compelling about the mysterious.
Maybe eels are, quite simply, individuals, who not only have different abilities but also different means and methods of reaching their goal. Maybe they’re all aiming for the same destination, but no two journeys back to the origin are exactly the same.
The ideomotoric effect cannot explain this, of course. Maybe it depends on our subtle sensory impressions. Maybe we subconsciously read our surroundings and come to conclusions we don’t even understand ourselves. Either way, we’re making these same unconscious decisions continuously.
Perhaps, after all, it’s just chance that tells us when it is time to move a muscle. When it is time to stay, or when it is time to leave.
The underlying premise is a belief that nonliving matter can be turned into living matter, that the living and the dead are in fact dependent on one another and that some kind of life can exist in something seemingly dead. When the eel could not be understood or explained, that kind of thinking was clearly close at hand; the eel became a reflection of the deeper mystery of life’s origins.
What makes eels special, however, is that we’re still forced to rely on faith to some extent as we try to understand them. We may think we now know everything about the life and reproduction of the eel—its long journey from the Sargasso Sea, its metamorphoses, its patience, its journey back to breed and die—but even though that is all probably true and correct, much of it is nevertheless still based on assumption.
The stream represented his roots, everything familiar he always returned to. But the eels moving through its depths, occasionally revealing themselves to us, represented something else entirely. They were, if anything, a reminder of how little a person can really know, about eels or other people, about where you come from and where you’re going.
Saturday, February 29, 2020
Sontag : Her Life and Work - Benjamin Moser
![]() |
Image Courtesy Google |
---------------------------------------------------------------------------------
1970 ల ముందు వరకూ బయోగ్రఫీలకు అయితే రాచరికపు స్త్రీలవో,లేక ప్రముఖ పురుషుల జీవితాల్లో కీలక పాత్రను పోషించిన స్త్రీలవో మాత్రమే అర్హత కలిగుండేవంటారు స్త్రీవాదీ,విమర్శకురాలు అయిన Carolyn Heilbrun..అంతవరకూ పురుషుని విజయాల్లో అతడి పట్ల అంకితభావంతో తెరవెనుక ఉంటూ సహాయసహకారాలనందించిన స్త్రీల గాథలు మాత్రమే చెప్పబడేవి..స్వతంత్రంగా తమతమ రంగాల్లో విజయపతాకాల్ని ఎగురవేసిన స్త్రీల జీవిత చరిత్రలపై పురుషస్వామ్యపు సమాజం సీతకన్నువేసేది..సాహితీ రంగంలో ఉత్కృష్ట శిఖరాలనధిరోహించిన వర్జీనియా వూల్ఫ్ ని సైతం అమెరికన్ విమర్శకుల్లో 'డీన్' హోదాకలిగిన లియోనెల్ ట్రిల్లింగ్ తీసిపారేశారు..చివరకు ట్రిల్లింగ్ భార్య వ్యంగ్యంగా,తన స్వంత విజయాలు ఎన్నున్నా తుదకు తన సమాధిపై “Diana Trilling Dies at 150. Widow of Distinguished Professor and Literary Critic Lionel Trilling.” అని రాయడం అనివార్యమని చురక అంటించారుట. :)
-----------------------------------------------------------------------------------------
సోంటాగ్ గురించి మాట్లాడేటప్పుడు ఆవిణ్ణి ఒక గొప్ప అమెరికన్ ఇంటెలెక్చువల్ గా మాత్రమే మాట్లాడడం అసంభవం..ఆమెకు చరిత్ర లేదు,ఆమె తన చరిత్రను తిరస్కరించింది..సాహితీలోకంలో జ్యూయిష్ మూలాలున్న స్త్రీ రచయితల్లో క్లారిస్ లిస్పెక్టర్,సుసాన్ సోంటాగ్,హన్నా ఆరెండ్ట్ లు ముగ్గురూ శిఖర సామానులు కాగా,లిస్పెక్టర్ కళ మానవ మస్తిష్కపు పరిథుల్ని దాటి ఆవలకు వెళ్ళలేదు,హన్నా ఫిలాసఫీలో పొలిటికల్ థియరీలకు ప్రాధాన్యతనిచ్చారు..ఇక సుసాన్ విషయానికొస్తే ఆమె ఫోటోగ్రఫీ,సినిమా,పెయింటింగ్,లిటరేచర్ ఇలా అన్ని రకాల 'ఆర్ట్' ఫార్మ్స్ గురించీ విస్తృతంగా వ్యాసాలు రాశారు..అక్కడే ఆగిపోకుండా రాజకీయాలూ,సామాజికాంశాల మొదలు ఎయిడ్స్,కాన్సర్ వంటి క్రానికల్ డిసీజస్ వరకూ సోంటాగ్ దృష్టి ప్రసరించని రంగమంటూ లేదు..Susan Rosenblatt పేరుతో జ్యూయిష్ కుటుంబంలో పుట్టినప్పటికీ సోంటాగ్ తన ఉనికిని కేవలం ఒక జాతికో,ఒక ప్రాంతానికో పరిమితం చేసుకోకుండా ప్రపంచం నలుమూలలకూ విస్తరించుకున్నారు..సోంటాగ్ ను చదవడం అంటే మొత్తం ప్రపంచ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఇక సాధారణంగా బయోగ్రఫీలనగానే మహాత్ముడూ,ఐన్స్టీన్ లాంటి 'లార్జర్ దాన్ లైఫ్' పర్సనాలిటీలను కూడా తీసుకొచ్చి డొమెస్టిక్ పరిథిలో కుదించే ప్రయత్నం జరుగుతుంటుంది..ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే,సుసాన్ వ్యక్తిగత జీవితం వద్దే ఆగిపోకుండా ఆమె అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో వేసిన ముద్రల్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తుంది..ముఖ్యంగా ఇందులో ప్రస్తావించిన పలు అంశాలు సోంటాగ్ జర్నల్స్ నుండీ,ఆమె స్నేహితుల,సన్నిహితుల,గురువుల,మెంటర్ల,కుటుంబ సభ్యుల అభిప్రాయాలూ,అనుభవాల నుండీ సంగ్రహించినవి..కేవలం ఒక సమూహానికో,ఒక జాతికో,ఒక రంగానికో పరిమితం కాని ఆమె గురించి అనేక వ్యక్తుల అభిప్రాయాల్ని పొందుపరచడం వల్ల ఈ బయోగ్రఫీలో సోంటాగ్ పై ప్రశంసలెన్ని ఉన్నాయో విమర్శలూ కూడా అదే స్థాయిలో ఉంటాయి..ఈ పేజీల్లో 1960-70 ల కాలంలో న్యూయార్క్ సాహితీ ప్రపంచంలో ఒక సమున్నత స్థానంలో వెలుగొందిన సోంటాగ్ మేథస్సుకి అబ్బురపడుతూ అనేక పర్యాయాలు ఆమెను ఒక Outworldly పర్సనాలిటీగా ఆరాధిస్తే,కొంచెం కూడా సాటి మనిషి భావాల పట్ల సున్నితత్వంలేని ఆమెను అంతే ద్వేషిస్తాం.
అయినా ఇటువంటి అసాధారణమైన వ్యక్తుల్ని ఒక సాధారణ వ్యక్తికి సంబంధించిన మేలు విలువల తూకపురాళ్ళతో తూచాలని ప్రయత్నించడం ఎంతటి దుస్సాహసం !!
-------------------------------------------------------------------------------------------
సంక్లిష్టమైన బాల్యం రచయితకు వరమని కొందరు రచయితలంటుంటారు..
వాస్తవాన్ని అంగీకరించని "The queen of denial" మిల్డ్రెడ్ ఇద్దరు కూతుళ్ళలో ఒకరైన సుసాన్ పుట్టిన నిముషం నుండీ తల్లి నిర్లక్ష్యానికి గురైంది..ఐదవ ఏటనే తండ్రి టీబీ తో మరణించగా,సుసాన్ లో ఒంటరినైపోతానేమోననే భయం,తత్పరిణామంగా సన్నిహితంగా వచ్చిన వాళ్ళని ఆ భయంతోనే దూరంగా నెట్టెయ్యమని ప్రేరేపించే తత్వం సుసాన్ వ్యక్తిత్వానికి హాల్ మార్క్ గా మారాయి..మొదట్నుంచీ తల్లి మీద సుసాన్ కు ఒక అబ్సెషన్ ఉండేదట..మిల్డ్రెడ్ attention కోసం ఆమె నిరంతరం తపించేది..ఈ సమయంలో మిల్డ్రెడ్ ను కలిసిన సుసాన్ మొదటి గర్ల్ ఫ్రెండ్ Harriet Sohmers “She was clearly in love with her mother,She was always criticizing her about how cruel she was, how selfish she was, how vain she was, but it was like a lover talking about a person that they were in love with.” అంటారు.
తాగుబోతు తల్లి మిల్డ్రెడ్ తో సుసాన్ అనుభవాలు ఆమెను మొదట్నుంచీ బాల్యానికి దూరం చేశాయి..మిల్డ్రెడ్ తన వివాహేతర సంబంధాలతో పిల్లల్ని ఒక్కోసారి పట్టించుకోవడం,ఒక్కోసారి పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం చేసేది. .ఈ 'కేరింగ్,నాట్ కేరింగ్' అనే సందిగ్ధత మధ్య సుసాన్ వ్యక్తిత్వాన్ని జీవితాంతం వెంటాడిన 'Sadomasochism' జీవంపోసుకుంది..కానీ ఆమె బాల్యాన్ని అంతగా కాలరాసిన మిల్డ్రెడ్ కూడా సుసాన్ కు ఒక మేలు చేసింది,"నీకేదైనా నచ్చకపోతే నీ గదికి వెళ్ళి చదువుకో" అంటూ సుసాన్ ను ఫెయిరీ టేల్ ప్రపంచంలో సేద తీరమని ప్రోత్సహించేది.అలా సుసాన్ జీవితంలో వివర్ణమైన వాస్తవాన్ని సుందరమయం చేస్తూ పుస్తకాలు ఆమెకు స్వాంతన చేకూర్చేవి..వాస్తవంనుండి దూరంగా జరగాలనుకున్న ప్రతిసారీ పుస్తకాలు ఆమెకు చేదోడువాదోడుగా నిలబడ్డాయి.
“She was never able to know what goes on in another person,” అంటారు సుసాన్ ప్రేమికుల్లో ఒకరు..దైనందిన జీవితంలో మనం సహజంగా తోటిమనిషి భావలపట్ల చూపే సున్నితత్వం సుసాన్ లో ఉండేది కాదు..దీనికి తోడు పుస్తకాలతో స్నేహం పూర్తిగా కుదరకుండానే సుసాన్ కు తానొక misfit అనే విషయం అర్ధమైంది..స్కూల్లో తోటిపిల్లల మధ్య ఇమడలేని నిరాసక్తత,ఇంట్లో దుఃఖ్ఖపూరిత వాతావరణం,అనారోగ్యం వీటన్నిటి మధ్యా ఆమె బంగారు భవిష్యత్తు గురించి ఆశగా ఎదురుచూసేది..But the woman who would inspire bookish girls everywhere had few models when she herself was a bookish girl.
సాహిత్యంతో సాహచర్యం తనకు జాత్యాహంకారపు సంకెళ్ళనుండీ,ప్రాంతీయ దురభిమానాలనుండీ,బ్రష్టుపట్టిన విద్యావిధానాలనుండీ,లోపభూయిష్టమైన తన విధినుండీ,భోగలాలసత్వంనుండీ విముక్తి ప్రసాదించిందంటారు సోంటాగ్..ఆవిడ నమ్మకం ప్రకారం మానసిక స్వేఛ్చ శారీరక స్వేఛ్చతో సమానం.
-----------------------------------------------------------------------------------------
సుసాన్ సోంటాగ్ సాంస్కృతిక ప్రపంచంలో ఒక 'ఇన్సైడర్' మాత్రమే కాదు,ఆ 'ఇన్సయిడెర్నెస్' ని సింబలైజ్ చేసింది కూడా ఆవిడే..ఆమెలా మునుపూ ముందూ ఆర్ట్ కీ ఆర్టిస్టుకీ ప్రాధాన్యతను ఆపాదించిపెట్టగలిగిన వాళ్ళు లేరు..చివరకు సోంటాగ్ విమర్శకులు సైతం హేతువుపట్ల శ్రద్ధ కనబర్చడంలో ఆమె వైఫల్యాన్ని ఒకవైపు నిందిస్తూనే మరోవైపు ఆమెను ప్రశంసిస్తారు..మన్హట్టన్ తాళాలు తన చేతుల్లోకి తీసుకుని న్యూయార్క్ నగరంలో సాంస్కృతిక ప్రాభవం నలుదిశలా ప్రసరించడానికి ఆవిడ తరంలో మరే రచయితా చెయ్యనంత కృషి చేశారామె..
----------------------------------------------------------------------------------------------
తొలినాళ్ళలో రచనా వ్యాసంగంలో రచయిత ఎదుర్కునే ఆటుపోట్లను గురించి జాక్ లండన్ రాసిన 'మార్టిన్ ఈడెన్' సుసాన్ మీద చాలా ప్రభావం చూపించింది..ఆ నవలలో ప్రొటొగోనిస్ట్ అనుభవించే ఏకాకితనం,స్వాప్నికతల్లో ఆమె తనను తాను చూసుకుంది..ప్రచురణకు పంపిన తన రచన కి సంబంధించి మొదటి రిజెక్షన్ లెటర్ అందుకున్నప్పుడు, "నేనేమి నిరాశ చెందడం లేదు,పైగా చాలా ఉద్వేగంగా ఉంది,ఎందుకంటే మార్టిన్ ఈడెన్ ను గురించి ఆలోచిస్తే నాకర్థమైన విషయం ఏంటంటే ఈ తిరస్కారం ఒక రచయిత్రిగా నా ఉనికికి తొలి చిహ్నం." అంటుంది.
1966 లో 33 ఏళ్ళ వయసులో Against Interpretation పేరిట సోంటాగ్ ప్రచురించిన వ్యాసాలు రివ్యూయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి..
స్పష్టత కంటే అబ్స్ట్రాక్ట్ పట్ల సుసాన్ కున్న అబ్సెషన్ గురించి రాస్తూ అమెరికన్- జర్మన్ తత్వవేత్త Herbert Marcuse “She can make a theory out of a potato peel,” అంటారు.
ఫిక్షన్ రాయడంలో సోంటాగ్ శైలి లో 'అనిశ్చితి' ప్రధానంగా కనిపిస్తుంది..ఏమీ చెప్పకుండానే ఏదో చెప్పాలనే తపనతో,తన పాత్రల గురించి గానీ,అవి ఉన్న సందర్భం గురించి గానీ ఎటువంటి స్పష్టతా లేని ఆమె నేరేటివ్స్ పాఠకుల్లో భావోద్వేగాలను కదిలించడంలో ఘోరంగా విఫలమయ్యేవి..పాఠకులు కూడా తమను ఏవో సిద్ధాంతపరమైన వర్ణనలతో జిమ్మిక్కు చేసి రచయిత మోసం చేసినట్లు భావించేవారు..కానీ ఈ తరహా శైలిని అవలంబించడంలో సుసాన్ ఉద్దేశ్యం వేరు..దీనికి 'ఫాసినేటింగ్ ఫాసిజం' అనే వ్యాసాన్ని ఉదహరిస్తే,'ఆ వ్యాసం ఉద్దేశ్యం నిజానికి ఏదో నొక్కి చెప్పాలనో లేదో ఎవర్నో దూషించాలనో కాదు..మృతమైనదాన్ని(తండ్రి) పునర్జీవింపజెయ్యాలనే తపన..తన ఆలోచనకందనిదాన్ని ఆలోచించాలనే కోరిక (Artaud),అనిర్వచనీయమైనదాన్ని నిర్వచించాలనే తాపత్రయం (ఆమె రాసిన Camp అనే వ్యాసం)..నిజానికి ఇవన్నీ చర్చల్ని సమాధి చేసే రాతలు కావు,చర్చను ఆహ్వానించే రాతలు..ఆమె రాతలు ఆలోచనలు రేకెత్తిస్తాయి,మేథస్సుకు పదును పెట్టమంటాయి..చర్చకు ప్రేరణగా నిలవడం ఒక గొప్ప విమర్శకురాలి లక్షణం.'
-----------------------------------------------------------------------------------------
కేవలం వారం రోజుల పరిచయం తరువాత 17 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ ఫిలిప్ రీఫ్ ను వివాహం చేసుకున్న సోంటాగ్,వివాహబంధాన్ని 'యజమాని-బానిస' సంబంధంగా మాత్రమే చూశారు..ఒకరి స్వేచ్ఛనొకరు హరించేసుకుంటూ,ఒకరికొకరు లొంగిబ్రతకడం అనే భావంతో మొదలైన వాళ్ళ సంసారం విఫలం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
రీఫ్ తో వివాహ వైఫల్యం గురించి సోంటాగ్ ఇలా రాశారు :
"పెళ్ళిని నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లైతే నేనసలు పెళ్ళిచేసుకునేదాన్ని కాదు..పెళ్ళిలో ఉండే 'ప్రత్యేకత','ఊపిరిసలపనివ్వని అతిప్రేమ' అంటే నాకు ఏవగింపు..ప్రతీ జంటా ఆ సాన్నిహిత్యంలో ఒకప్రక్క విసిగిపోతూ కూడా తమ బంధాన్ని ప్రపంచానికెదురీది మరీ కాపాడుకుంటూ ఉంటారు..
ఒకవేళ మొదట్నుంచీ మేము వివాహాన్ని వేరుగా అర్ధం చేసుకునుంటే...ఒకవేళ మేము ప్రేమలో కాకుండా,ప్రేమ అనే ఐడియా తో పీకల్లోతు ప్రేమలో ఉండి ఉండకపోతే....ఈలోకంలో వ్యభిచారం,నాగరికమైన సర్దుబాట్లు,సౌకర్యార్ధం చేసుకునే పెళ్ళిళ్ళు లేదా సహజీవనాలూ ఇవన్నీ ఉంటాయి,అన్నిసార్లూ చెల్లుబాటవుతాయి కూడా..కానీ ఇవేవీ నీకూ,నాకూ వర్తించవు..అవునా ?
మనమిద్దరం పిరికివాళ్ళం,సులువుగా గాయపడేవాళ్ళం,సెంటిమెంటల్ ఫూల్స్ మనం.."
సెక్సువల్ ప్లెషర్ విషయంలో Freud ప్రతిపాదించిన “the sadistic conception of coitus” ప్రభావానికి లోనుకావడంతో బాటుగా,తల్లితండ్రుల ప్రభావంలేని 'ఆదర్శవంతమైన ప్రేమ' (Freud again) ను సాధించడం సోంటాగ్ విషయంలో అసాధ్యం కావడంతో ఆమె సన్నిహిత సంబంధాలన్నీ ఒకదాని వెంబడి మరొకటి తెగిపోసాగాయి..తనపై తల్లితండ్రుల ప్రభావాన్ని సోంటాగ్ ఒక “profoundest experience” గా అభివర్ణిస్తారు..వివాహ వైఫల్యానంతరం కొన్నేళ్ళకు ఆమె ఇలా రాశారు, “In each case, which was I to be? I found more gratification as a slave; I was more nourished. But—Master or slave, one is equally unfree.”
Ironically, though, she turned her lovers, including Irene, Carlotta, Nicole, and Lucinda, into avatars of her own mother.
---------------------------------------------------------------------------------------------
'సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్' దిశగా అడుగులు వేసే వారిపట్ల మాత్రమే నాకు ఆసక్తి అంటారు సుసాన్..సుసాన్ కుమారుడు డేవిడ్ రీఫ్ తల్లి వ్యక్తిత్వం గురించి చెప్తూ,"వర్తమానంలో ఆనందంగా ఎలా జీవించాలో తెలీకపోవడం సుసాన్ జీవితంలోని ఒక గొప్ప విచారం" అంటారు.
"Susan had grown up “trying both to see and not to see,” ప్రపంచాన్ని ఉన్నదున్నట్లుగా చూడడమనే అతి సాధారణమైన పని సోంటాగ్ చాలా ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సొచ్చేది..ఒక్కోసారి ఆమెలో ఇలా చూడడాన్ని ప్రతిఘటించే అంశమేదో ఆమెలో బలంగా ఉండేది..బస్సుల్లోనూ,ట్రైన్లలోనూ ప్రయాణించేటప్పుడు ఆమె డేవిడ్ ను కిటికీ బయటకు చూడనిచ్చేది కాదని డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ Joanna Robertson అంటారు..ఒక ప్రాంతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాస్తవాలూ,చరిత్రా రూపంలో వింటేనే అర్ధమవుతుంది గానీ,కేవలం కిటికీలోంచి ఆ ప్రదేశాల్ని చూడడం వల్ల ఆ ప్రాంతం గురించి తెలిసే అవకాశం లేదనేవారట సోంటాగ్.. ఒకసారి డేవిడ్ లండన్ వెళ్ళిన కొత్తల్లో కిటికీ బయటకి చూస్తుంటే వద్దని తీవ్రంగా శాసించారట సోంటాగ్..సోంటాగ్ చివరి రోజుల్లో ఒకసారి ముగ్గురూ ట్రైన్లో ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా ఎదురుగా చూస్తూ కూర్చున్న ఆమెను చూసి ఇద్దరం నవ్వుకున్నామంటారు జోన్నా..“I remember David and I winking at each other—an inside joke about her utter refusal to just look out there and take in what she saw. The world as is, in the raw, happening now. No connection.”
------------------------------------------------------------------------------------------
'సుసాన్ సోంటాగ్' అనే సాహితీ దిగ్గజపు ముసుగు చాటు 'సుసాన్' నిజానికి చాలా బలహీనురాలని అంటారు ఆమె గర్ల్ ఫ్రెండ్ హారియట్,సోంటాగ్ కూడా కొన్ని చోట్ల తనని తాను 'puny' అని రాసుకునేవారు..కాల్పనిక ప్రపంచంలో పెస్సోవా,వలేరి వంటి రచయితలు ఆల్టర్ ఇగోలను తమ గళాన్ని వినిపించడానికి ఉపయోగించుకున్నంత సహజంగా సుసాన్ తన ఆల్టర్ ఇగోలను వాస్తవ జీవితంలో తన బై సెక్సువాలిటీ ని దాచుకునే రక్షణ కవచాలుగా ధరించింది..ఆల్టర్ ఇగోలను అంత సమర్ధవంతంగా నిజజీవితానికి అన్వయించిన సోంటాగ్ ను ఈ కారణంగా ఒక్క వ్యక్తిగా చూడడం అసంభవం..బోస్నియా యుద్ధ వాతవరణంలో ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రాణాలు సైతం లెక్ఖ చెయ్యకుండా సరజేవో చేరుకొని,ప్రపంచానికి అక్కడి ఆర్తనాదాలు వినిపించేలా బెకెట్ 'వెయిటింగ్ ఫర్ గోడోట్' నాటకాన్ని పలుమార్లు నిర్వహించిన ధీరోదాత్తత ఆమెదే,సహచరి Anne Leibovitz పట్ల అథారిటీతో కూడిన కాఠిన్యం ఆమెదే,కొడుకు డేవిడ్ ను క్యాన్సర్ సమయంలో వదిలేసి సహచరితో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన స్వార్థం కూడా ఆమెదే..సల్మాన్ రష్దీ కి కష్టకాలంలో కోటగోడలా నిలబడిన బలమైన వ్యక్తిత్వం ఆమెదే..సుసాన్ సోంటాగ్ అనేక వ్యక్తులూ,వ్యక్తిత్వాల మేళవింపు.
డేవిడ్ ఫ్రెండ్ మరియు రచయిత అయిన Jamaica Kincaid డేవిడ్ కాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా మాములుగా తిరిగి వచ్చిన సుసాన్ గురించి రాస్తూ,
Then Susan came back and became the adoring mother. But David was very wounded by this, and that was the first exposure I had to her. It’s not ruthlessness. It’s just Susan-ness. None of the words or the ways of characterizing her behavior really fit. Yes, she was cruel and so on, but it wasn’t that, she was also very kind. She was just a great person. I don’t think I ever wanted to be a great person after I knew Susan. అంటారు.
ఆమె అందం,లైంగికత ఆమెలో అసలు వ్యక్తి కంటే 'సోంటాగ్ అనే ఇమేజ్' ను తయారుచేసుకోవడంలో ఆమెకు ఎక్కువగా సహాయపడ్డాయి..తన బలహీనతల్ని కప్పేస్తూ ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో వ్యక్తిత్వాన్ని ప్రదర్శనకు పెట్టిన ఆ 'సోంటాగ్ ఇమేజ్' ఆమెకు ఊపిరాడనిచ్చేది కాదు..దీనికితోడు సేదతీరడానికి కుటుంబం,ఆస్తిపాస్తులు-వృత్తి అందించే స్థిరత్వం,రక్షణ లాంటివేవీ లేని ఆమె చివరకు తనకు అత్యంత సన్నిహితుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ జీవితాంతం ఒక 'ఆల్టర్నేట్ సెల్ఫ్' క్రింద తలదాచుకున్నారు.. Through writing, she said, “I create myself.”And it was to this other self that she appealed now: “Give me strength, tall lonely walker of my journals!” “To have two selves is the definition of a pathetic fate,” she later wrote.
సోంటాగ్ చుట్టూ ఎవరూ లేనప్పుడు వ్యక్తమయ్యే ఆమె ప్రైవేట్ సెల్ఫ్/సెక్సువల్ సెల్ఫ్ ఒకవైపైతే, నలుగురిలోనూ ఆమెకు ప్రాతినిథ్యం వహించే సోషల్ సెల్ఫ్ (ఒక మెటఫోర్/ ఒక మాస్క్) మరోవైపు ఉండేవి..వీటితోపాటు సోంటాగ్ ను జీవితాంతం వెంటాడిన మరో ఆల్టర్ ఇగో,సుసాన్ సోంటాగ్ తాను ఇలా ఉండాలని కలలుగన్న 'ఐడియల్ సెల్ఫ్'.“That person who has been watching me as long as I can remember is looking now,” she wrote at just fourteen.
తనలోని ఈ ఆల్టర్ ఈగోలే తాను రచయితగా మారడానికి కారణమంటూ 1959 లో ఆవిడ ఈవిధంగా రాశారు : "నాలో రాయాలనే కోరిక నా హోమోసెక్సువాలిటీతో బలంగా ముడిపడి ఉంది..నా హోమోసెక్సువాలిటీకి సమాజం నుండి ఎదురయ్యే తిరస్కారమనే ఆయుధాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మరో ఆయుధం నాకు చాలా అవసరం..ఆ ఆయుధం నాకు 'రచయిత' అనే ఐడెంటిటీ."
-------------------------------------------------------------------------------------------
సుసాన్ తొలినాళ్ళలో లెఫ్ట్వింగ్ ఇంటెలెక్చువల్ గా మనిషి లైంగికతనూ,conformity భావజాలాల్నీ ప్రశ్నిస్తూ పాలనా వ్యవస్థపై ధిక్కారస్వరం వినిపించారు..'రాడికలిజాన్ని' వ్యక్తి స్వేఛ్చకూ,సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి వాటికి అవకాశమిచ్చేదిగా భావించారు..కానీ సోంటాగ్ వాదాలన్నీ నర్మగర్భంగా,అస్పష్టంగా ఉండేవి..But when she hinted at her attraction to women, she only did so obliquely. “She would talk about how you’ve got to grow out of this society where it assumes you’re all one thing,” he said.
సుసాన్ కు కళపట్ల సెన్సిటివిటీ లేదని చాలా మంది అభిప్రాయపడతారు..
కానీ ఆ లేకపోవడంలోనే ఆవిడ వ్యాసాలను మిగతావాటికంటే వేరుగా నిలబెట్టే ప్రత్యేకత కూడా ఉంది..తనలో రాయాలనే కోరికకు ప్రేరణ గురించి రాస్తూ, "నాలో అహంకారానికి ప్రతిగా నాకు రాయడం అవసరం అనుకుంటాను..నేనేదో చెప్పితీరాలి కాబట్టి రాస్తాను అనేకంటే,కాస్త గర్వాన్ని ప్రోగేసుకుని ఈ జర్నల్స్ లో ఉన్న fait accompli లాగా నేను 'రచయిత' అనే ప్రత్యేకమైన వ్యక్తిని కావాలనుకుంటాను కాబట్టి రాస్తాను..నిజానికి మంచి రచయితలందరూ ఉన్మాద స్థాయిలో గొంతెత్తి తమ ఉనికిని చాటుకునే అహంకారులే." అంటారు.
నిజమైన సుసాన్ పబ్లిక్ లో తెరవెనుక అదృశ్యంగా ఉంటూ తన రచనల ద్వారా తనకు తెలియని అపరిచిత పాఠకుడికి తనను తాను తెలియజేసుకునేది..ఒక ఎంటర్టైన్మెంట్ గా కంటే ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' గా చూడవలసిన ఆమె రచన 'The Benefactor' ను దీనికి ఒక ఉదాహరణగా చెప్తారు..సోంటాగ్ లో ఇతరుల్ని నిజమైన మనుషులుగా యధాతథంగా చూడలేనితనం ఈ రచనలో కనిపిస్తుందంటారు..As much as this question is intellectualized and abstracted in The Benefactor—and Sontag always abstracted and intellectualized precisely the things she cared about most.
“X, The Scourge” offers a magnificent example of her ability to see things and situations with uncanny accuracy—and of her inability to use this intellectual knowledge in a practical, emotional way.
---------------------------------------------------------------------------------------
'న్యూ యార్క్ రివ్యూ బుక్స్' ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన సుసాన్ సోంటాగ్ ను ఒక వ్యాసకర్తగానే చూడాలంటూ,ఆమెకు ఫిక్షన్ రాయడం చేతకాదని తరచూ వినిపించే అభిప్రాయం ఆమె స్థాయిని తగ్గించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు బెంజమిన్.
It is a need to cut Sontag down to size: to humble a person who seemed so intimidating. It is, moreover, twice wrong. Sontag wrote some excellent fiction, and she wrote some awful essays. Her successes were inextricable from her failures, both products of a mind in constant flux.
సోంటాగ్ "On Style" లో ప్రపంచాన్ని ఒక 'aesthetic phenomenon' గా అభివర్ణిస్తారు..ఈ కారణంగా ఆమె జీవితంలో తొలినాళ్ళలో రాజకీయాలకూ,ఐడియాలజీలకూ,మానవసంబంధాలకూ--వీటన్నిటిపై మానవీయ దుష్ప్రభావాలకూ అతీతంగా గడిపారు..ఆమె మలినాళ్ళలో రాజకీయాలకు చాలా దగ్గరగా గడపడానికి కారణం కూడా ఇదే కావచ్చు.
-------------------------------------------------------------------------------------
ఈ పుస్తకంలో సుసాన్ ను ఒక రచయిత్రిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా,ఆమె కష్టసుఖాల్లో తోడు నీడలా వెన్నంటి నిలచిన Farrar, Straus & Giroux (FSG) పబ్లిషింగ్ సంస్థ అధినేత రోజర్ స్ట్రాస్,'రోలింగ్ స్టోన్' పత్రిక కవర్ పేజీ ఫోటోలతో పాటు అనేక మంది ప్రముఖుల్ని తన కెమెరాలో బంధించిన ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ Annie Leibovitz,ఫిలిప్ రీఫ్,డేవిడ్ రీఫ్,జోసెఫ్ బ్రాడ్స్కీ,డియాన్ ఆర్బస్,Lucinda Childs,పాల్ థెక్,వార్హోల్,వాల్టర్ బెంజమిన్,బార్తెస్ మొదలగు అనేకమంది కళాకారుల,సాహితీలోకపు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయవిశేషాలుంటాయి..ఈ పుస్తకం పాఠకులకు ఒక పూర్తి స్థాయి 'కల్చరల్ ఫీస్ట్'.
------------------------------------------------------------------------------------------
కొంచెం కూడా దయాదాక్షిణ్యంలేని 'సెల్ఫ్ అవేర్నెస్' సోంటాగ్ సొంతం..ఆమెకు జీవితంపై ఎంత వ్యామోహమంటే చిన్న కునుకు పడితే కూడా,ఆ క్షణాల్లో జీవితం ఎక్కడ చేజారిపోతుందేమో అన్నంత ఉన్మాద స్థాయిలో ఉండేదట..వారాల తరబడి నిద్రలేకుండా,కార్టన్ల కొద్దీ మార్ల్బోరోస్ సిగరెట్లు,కాఫీ ప్రవాహాల్లో గొంతులోకి జారిపోయే డెక్సీడ్రైన్ బాటిళ్ళ మధ్య మెదడుకీ,శరీరానికీ భేదాన్ని పూర్తిగా చెరిపేసిన వ్యక్తి సోంటాగ్ : "నాకు శరీరం లేదు,నాకున్నదల్లా మెదడూ,దాని ఆలోచనా మాత్రమే" అని అనడం పైపైన నటించే వ్యక్తికి సహజమైనప్పటికీ,ఆ వ్యక్తి తాలూకూ ఇమేజ్ వెనుక అసలైన భౌతిక శరీరం ప్రతిఘటించకుండా ఊరుకోదు కదా ! నలభై ఏళ్ళ వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది.."నా స్వభావసిద్ధతను ప్రపంచం నుండి దాచి ఒక పిరికిదానిలా జీవించాను కాబట్టి నేను కాన్సర్ ను కోరి ఆహ్వానించుకున్నానంటారు" సోంటాగ్.
This portrait of repression, inwardness, and sadness—the one she denounces as punitive and medieval—coincides, however, exactly with the self-portrait in her journals, the hidden self that she almost never allowed to appear in public or in her writings: the persona, or mask, that she had evolved as a means of survival. “I’m responsible for my cancer,” she wrote. “I lived as a coward, repressing my desire, my rage.” Susan blamed herself bitterly.
-----------------------------------------------------------------------------------------------
ఈ పుస్తకం మొత్తంలో సోంటాగ్ ఒక మామూలు స్త్రీ లా ఆలోచించిన ఒకే ఒక సందర్భం :
"నాకెప్పుడూ బుల్లీస్ నచ్చుతారు..నేను అందంగా ఉండనని ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళై ఉంటారు..ఆ తిరస్కరించడంలో వాళ్ళలో నాకు సుపీరియర్ క్వాలిటీస్ ,మంచి అభిరుచి కనిపిస్తాయి" అంటారు (ఉదాహరణకు ఆమెను చులకనగా చూసిన హారియట్,ఆల్ఫ్రెడ్,ఐరీన్ ల పట్ల ఆమెకున్న ప్రేమ).."నా మీద నాకు గౌరవం లేదు..నేను ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తున్నా,ఆ ప్రేమరాహిత్యానికి ఎదురెళ్ళి పోరాడుతున్న నాలోని సైనికురాల్ని గౌరవిస్తాను..నేను మళ్ళీ బుల్లీస్ పట్ల ఎప్పుడూ ఆకర్షితురాల్ని అవ్వను" అంటారు.
---------------------------------------------------------------------------------------
'Styles of Radical Will' పుస్తకంలో ‘Thinking Against Oneself’: Reflections on Cioran.” పేరిట రాసిన వ్యాసంలో “To exist is a habit I do not despair of acquiring.” అంటారు సుసాన్..మనం మానవీయ స్పృహ(మేథస్సు) కారణంగా ఉత్పన్నమైన అనేక ఉపద్రవాలను సవరించే ప్రయత్నం ఎంత చేసినా 'హ్యూమన్ కాన్షియస్నెస్' ను ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని అంటూ,ఈ మార్గంలో మనిషికి వెనక్కి తిరగడం అసాధ్యమనీ,ముందుకు అడుగేసి 'ఆలోచన' తుదివరకూ పూర్తి స్పృహతో ప్రయాణించడంలోనే మనిషికి గౌరవం ఉందనీ అంటారు.
For Sontag, it would be no easy thing to unite the beastly body to the intellectual realm, the realm of language, metaphor, and art.
----------------------------------------------------------------------------------------------
ఫోటోగ్రఫీ గురించి రాస్తూ, “Photographing is essentially an act of non-intervention,” అంటారు సోంటాగ్. 'On Photography' అనే పుస్తకంలో ఆమె ఫోటోగ్రాఫ్ ని 'వినియోగదారుని చవకబారు కృత్రిమ కళా సృష్టి' (consumerist kitsch) గా అభివర్ణిస్తారు..ఫొటోగ్రాఫ్స్ ను 'నిరంకుశత్వపు నిఘా' అంటూ, కెమెరాలను “వేటగాని ఆయుధాలనీ',ఫొటోగ్రాఫర్లను 'పీపింగ్ టామ్స్' అనీ,voyeurs,సైకోపాత్స్ అనీ అంటారు : కెమెరాను ప్రతి వాడకంలోనూ నిస్సందేహంగా ఒక 'దురాక్రమణ ధోరణి' ఉంటుందంటారు.
ఇందులో డియాన్ ఆర్బస్ ఫోటోగ్రఫీ గురించి ఆమె రాసిన వ్యాసాలను బెంజమిన్ విశ్లేషించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది :
ఆర్బస్ ఫోటోగ్రఫీని సోంటాగ్ ఏ దృష్టితో చూశారో రాస్తూ,
ఆ వ్యాసాల్లో 'ఫోటోగ్రాఫర్ ఆర్బస్' ఆమే,అతడు ఫోటో తీసిన 'పిచ్చివాడూ' ఆమే..'ఫోటోగ్రాఫరూ',అతడి 'సబ్జెక్టు' ఈ రెండూ కూడా ఆమే..ఇందులో జడ్జి,నిందితుడూ రెండూ ఆమే అంటూ సోంటాగ్ లో ఈ సందిగ్ధతకి కారణం,ఈ రాతలన్నీ ఆమె తనకోసం తాను రాసుకోవడమేనంటారు..సుసాన్ వ్యక్తిత్వంలో కీలక భాగమైన అపనమ్మకాన్ని ఈ వ్యాసాల ద్వారా ప్రక్షాళన చేసుకునే దిశగా ఇదంతా తనకు తాను చెప్పుకుంది,అందుకే సుసాన్ కి ఫోటోగ్రఫీ అంటే ద్వేషమని అనుకునేవాళ్ళదెంత మూర్ఖత్వమో,ఆమెకు ఫోటోగ్రఫీ అంటే ప్రేమ అనుకునేవాళ్ళదంతే మూర్ఖత్వం అంటారు.
ఆమె తనను తానెంత అపనమ్మకంతో చూసుకుందో,ఫోటోగ్రఫీని కూడా సరిగ్గా అదే దృష్టితో చూసింది సుసాన్ : the division she had described in 1960 between “I’m no good” and “I’m great".
ఆర్బస్ ఫోటోగ్రఫీ లో ప్రధానంగా కనిపించే 'విషాదపూరితమైన స్పృహ' సోంటాగ్ రచనల్లో కూడా ప్రస్ఫు టంగా కనిపిస్తుంది..'On photography' లో ఫోటోగ్రఫీ అనే సబ్జెక్టును వస్తువులూ,వాటి ప్రతిబింబాలూ / వర్ణన,దాని చుట్టూ ఉన్న వాస్తవికతల్లా విభజిస్తూ ఒక 'డివైడెడ్ కాన్షియస్' తో చూసినా, వాస్తవానికీ,కల్పనకూ మధ్య ఉండే స్పేస్ ని అర్థంచేసుకోవడం పట్ల ఆమెకున్న అబ్సెషన్ కనిపిస్తుంది.. the camera, which packages reality into an easily accessible consumer good. The desire to “acquire” reality should not be reduced to consumerism, since for Sontag it went far deeper. But it is true that the camera allows people’s freakishness—their suffering—to be sliced up, placed on the wall, sold: transformed into a product.
---------------------------------------------------------------------------------------------
ఈ పుస్తకంలో సోంటాగ్ గర్ల్ ఫ్రెండ్స్ Harriet, Irene, and Carlotta, Nicole లతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని పేజీలు కేటాయించారు..కాగా
సుసాన్ స్నేహితుల్లోకెల్లా చాలా ముఖ్యమైన మిత్రుడు మరియు మెంటర్ అయిన కవి జోసెఫ్ బ్రాడ్స్కీ తో ఆమె అనుబంధాన్ని గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి..సుసాన్ లాంటి వ్యక్తిని సైతం తన అథారిటీతో కూడిన వ్యక్తిత్వంతో కట్టిపడెయ్యగల సమర్థత ఉన్న ఏకైక వ్యక్తి బ్రాడ్స్కీ..అతడు 'ఆమె టస్కన్ లోను,షెర్మాన్ ఓక్స్ లోనూ కలలుగన్న మిత్రుడు..భర్త ఫిలిప్ రీఫ్ లో చూడాలని కలలుగన్నగురువు..జీవిత సహచరుడు,తనకు సరిసాటైన మేథావీ,కళాకారుడూ..కొన్నిసార్లు అతడు ఆమెకు సుపీరియర్ కూడా'..అతడికంటే సోంటాగ్ కు అభిరుచులు కలిసిన అనుకూలమైన వ్యక్తి మరొకరు తారసపడలేదు.,and it was in these terms that she mourned his premature death, at fifty-five: “I’m all alone,” she told a friend. “There’s nobody with whom I can share my ideas, my thoughts.”
ఈ పుస్తకంలో జోసెఫ్ బ్రాడ్స్కీ తో పాటు సుసాన్ జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ఒకరైన వాల్టర్ బెంజమిన్ కి కేటాయించిన పేజీలు అద్భుతంగా ఉన్నాయి..సుసాన్ శైలినీ,బెంజమిన్ శైలినీ పోలుస్తూ చేసిన విశ్లేషణలు సుసాన్ లో melancholic తత్వాన్ని అర్ధం చేసుకోడానికి మరింత దోహదపడతాయి..'Under the sign of Saturn' పుస్తకంలో వాల్టర్ మీద ఆమె ఒక వ్యాసాన్ని రాశారు..Saturnine sign క్రింద పుట్టిన వ్యక్తులు స్వభావసిద్ధంగా విచారగ్రస్తమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు..అసత్యమాడడం,రహస్యాలు దాచడం వీరికి సహజం..కానీ ఇవన్నీ ఆ వ్యక్తిత్వానికి కవచ కుండలాల్లాంటివి..దీనికితోడు వీళ్ళు స్వేఛ్ఛాజీవులు కావడంతో సుసాన్ లాగే వాల్టర్ కూడా స్నేహితుల్ని దూరంగా తోసేసేవారట ..ఈ ఇమడలేకపోవడాన్నీ,అసంతృప్తినీ విస్తృతంగా చదవడం,రాయడం వెనుక దాచుకునేవారు వాల్టర్.
ఈ తత్వం ఉన్న వ్యక్తులకు వాళ్ళ అస్తిత్వంతో సమానమైన 'కళ' ను పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరం..వాల్టర్ పుస్తకాలను ఒక ఉన్మాదంతో ప్రోగుచేసేవారట..పుస్తకాల ద్వారా,ఆబ్జెక్ట్స్ ద్వారా తనను తాను నిరంతరం పునర్నిర్మించుకుంటూ ఉండేవారట..ఆయన ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాల్లో నాజీల చేత చిక్కి కోల్పోయిన ఆయన లైబ్రరీ కూడా ఒక కారణం అంటారు.
“The only pleasure a melancholic permits himself, and it is a powerful one, is allegory,” Benjamin wrote, and Sontag quoted him approvingly.
--------------------------------------------------------------------------------------------
ఇంత గొప్ప వ్యక్తి కదా మరి ఫెమినిస్టుల జాబితాలో సుసాన్ పేరు కనిపించదెందుకని ఒకప్పుడు ఆశ్చర్యం వేసేది..దీనికి కూడా ఒక కారణం ఉంది..ఆమె 1974 లో ప్రచురించిన 'Fascinating Fascism' అనే వ్యాసంలో 'నాజీ ప్రాపగోండిస్ట్' గా ముద్ర పడిన అమెరికన్-జర్మన్ దర్శకురాలు Leni Riefenstahl పై ఆధారాలు లేని విమర్శలు చేశారు..Leni కి కేవలం ఒక స్త్రీ కావడం వలన గుర్తింపు వచ్చిందే గానీ ఆమె ఆర్ట్ కూడా 'ఒక అందమైన ఫాసిజం' అని అని విమర్శించారట..అప్పట్లో సోంటాగ్ స్థాయికి తగ్గని రచయిత్రి,విమర్శకురాలు అయిన Adrienne Rich సోంటాగ్ వ్యాఖ్యల్ని ఖండించగా,సోంటాగ్ రిచ్ పై విమర్శలతో ఎదురుదాడికి దిగిన కారణంగా సాటి ఫెమినిస్టు ప్రపంచం ఆమెను ఎప్పుడూ తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడలేదంటారు..సోంటాగ్ స్త్రీవాద రచనలు కాలగర్భంలో కలిసిపోడానికి ఇదొక కారణం.
Although it is a lot of fun to do, the essay that was written most quickly was, of course, the Leni Riefenstahl because it’s much easier to write when you feel angry, self-righteous and you know you are right.”
ఈ పుస్తకంలో సరజేవోలో ఉన్నసమయంలో సోంటాగ్ “You have no right to a public opinion unless you’ve been there.” అన్న తన మాటలకే విరుద్ధంగా సెప్టెంబర్ 11 అటాక్స్ జరిగిన సమయంలో అమెరికా విదేశాంగ విధానాల్ని దుయ్యబడుతూ రాసిన వ్యాసం చదివి తీరాల్సిందే..ఈ సందర్భంగా ఆమెను విమర్శిస్తూ ఆమెకు వ్యతిరేకంగా క్యాంపైన్లు జరిగినప్పటికీ సోంటాగ్ తన మాటల్ని వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం.
---------------------------------------------------------------------------------------
చివరగా సుసాన్ రాయడం గురించి ఒక యువ రచయితకు సూచనలు చేస్తూ
నోబుల్ గ్రహీత Halldor Laxness 'Under the Glacier' నవలలో ఒక బిషప్ రచయితకు చేసిన సూచనలను quote చేస్తారు :
"మరీ వ్యక్తిగతంగా రాయకు..పొడిపొడిగా రాయి !.. సాధ్యమైనంత ప్రథమ పురుషలోనే రాయడానికి ప్రయత్నం చెయ్యి..రాసినదాన్ని పరీక్షించకు !..బహుశా చాలామంది మొత్తం నిజాన్ని కాదు సరికదా,అసలు నిజంలో కూడా చాలా కొద్ది భాగమే చెప్తారని మర్చిపోవద్దు..నిజం చెప్తున్నా,అబద్ధం చెప్తున్నా కూడా మనుషులు మాట్లాడుతున్నప్పుడు తమని తాము తెలియపరుచుకుంటారు..ఉద్దేశ్యపూర్వకంగా నీకు చెప్పిన అబద్ధం కూడా,నీకు నిజాయితీతో చెప్పిన నిజం కంటే కూడా అనేకసార్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకో..వాళ్ళని సరిచెయ్యకు,సరిదిద్దకు,వాళ్ళని అర్థం చేసుకోవాలని(interpret) అసలే ప్రయత్నించకు."
--------------------------------------------------------------------------------------
కొందరు వ్యక్తుల్ని తెలుసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదు..కేవలం కంటికి కనిపించే మనిషి కంటే లోపల అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ కలిగి ఉంటారు వాళ్ళు..అటువంటి వారిని చదవడం సాగర మధన సమానం..సుసాన్ సోంటాగ్ అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు..ఈ పేజీల మధ్య 'సుసాన్' అనే ఐడియా తో ఎన్నోసార్లు ప్రేమలో పడ్డాను..అలాగే 'సోంటాగ్' ను అనేకసార్లు ద్వేషించాను..ప్రేమ్ నగర్ లో నాగేశ్వర్రావు డైలాగ్ ఒకటుంటుంది,"ఇవన్నీ భరించాలంటే మనిషి మీద అభిమానం ఉండాలని" :) సోంటాగ్ మీద ఆ అభిమానం ఉంటే మాత్రం ఈ పుస్తకం తప్పక చదవండి.
“Susan literally sat at the feet of only two people. If she came into a room and saw either of these two people she’d sit right here on the floor: Hannah Arendt and Carlotta.
Inauthenticity was the price Sontag paid for maintaining her cultural centrality; and the center of that culture was about to shift.
Fritz told me that what got him through his nearly three years in the prison camp in Arizona was that he was allowed access to books: he had spent those years reading and rereading the English and American classics. And I told him that what saved me as a schoolchild in Arizona, waiting to grow up, waiting to escape into a larger reality, was reading books, books in translation as well as those written in English.
To have access to literature, world literature, was to escape the prison of national vanity,of philistinism, of compulsory provincialism, of inane schooling, of imperfect destinies and bad luck. Literature was the passport to enter a larger life; that is, the zone of freedom. Literature was freedom. Especially in a time in which the values of reading and inwardness are so strenuously challenged, literature is freedom.
Susan exploded. “It is not your job to reject yourself. It is their job. You put your name in the hat. If they reject you, that is their job. It has nothing to do with you! Why are you making it all about yourself? You are so egotistical!” Brenda dutifully applied—and applied, and applied, and applied, and applied. Finally, on her eleventh attempt, she got it.
Annie Leibovitz సోంటాగ్ గురించి రాస్తూ,
She was very, very tough. She was very hard to please. Ever since I met her, I tried to please her, but it didn’t always work. She was always raising the bar. . . . She was a very tough critic, but also a great admirer, my biggest fan
A belief in the reality of dreams had created Sontag and kept her going through a difficult life. So many of her difficulties came from her refusal to see what most people thought of as reality. But there was a usefulness to the dreamworld. “Create ‘dream picture,’” the Smokenders instructor said. “Something pleasing, relaxing . . . use for distraction.” As it happened, she had lived her life in the “dream picture.” In certain respects, this was a strength, and an anesthetic. She refused to accept limitations—to her talent, to her achievements, to her possibilities for reinvention—that would have stymied more clear-eyed people.
It was as if I had accused her of never having read Proust, or of watching soap operas all day. Her face instantly darkened and she snapped at me violently. Why on earth did I think she’d been having a nap? Didn’t I know she never had naps? Of course she wasn’t having a nap! She would never have a nap! Never in a million years! What a stupid remark to make! How had I gotten so stupid? A nap—for God’s sake!
America, we’re told, is “where the poor can become rich and everyone stands equal before the law, where streets are paved with gold.” America is “where the future is being born.” America is where “everything is supposed to be possible.” “The American,” Ryszard declares in a letter, “is someone who is always leaving everything behind.”
జోసెఫ్ బ్రాడ్స్కీ గురించి సుసాన్,
” With his red hair and bright green eyes, he was very attractive to women, and much of his magnetism derived from the authority he claimed, unapologe“He made a stunning impression,” Susan said. “He was so authoritative personallytically, as a great poet’s birthright. That status brought obligations, the first of which was a dedication to the very highest artistic standards, those his syllabus reflected: “One should write to please not one’s contemporaries but one’s predecessors,” he declared; Susan might have written the same, and in his idea of culture, she found her own.“Man’s greatest enemy is not Communism, not Socialism, not Capitalism,” Brodsky wrote, “but rather the vulgarity of the human heart, of human imagination."
The modern authors can be recognized by their effort to disestablish themselves, by their will not to be morally useful to the community, by their inclination to present themselves not as social critics but as seers, spiritual adventurers, and social pariahs.
Friday, January 12, 2018
Hillbilly Elegy : A memoir of a family and culture in crisis - J.D.Vance
జాతి గురించి మాట్లాడేటప్పుడు మన వొకాబులరీ సహజంగా మేనిఛాయను దాటి ముందుకు వెళ్ళదు..నల్లజాతీయులు,ఆసియన్లు,తెల్లజాతీయులు లాంటి వర్గీకరణ విస్తృతంగా జాతిని చర్చించేటప్పుడు బాగానే ఉన్నా,ఏళ్ళతరబడి 'పేదరికం' కుటుంబ సంప్రదాయంగా ఉన్న తమ తెల్లజాతీయుల శ్రామికవర్గం గురించి తెలుసుకోవాలంటే వారి సంస్కృతి లోతుల్లోకి వెళ్ళి పరికించాలంటారు వాన్స్..వారి ముందు తరాలు Southern slave ఎకానమీ లో రోజువారీ కూలీలు,కౌలుదార్లు,బొగ్గు కార్మికులు,మిల్లు వర్కర్లు..అమెరికన్లు వారిని హిల్ల్బిల్లీస్,రెడ్ నెక్స్,వైట్ ట్రాష్ అని ముద్దుగా పిలుచుకుంటారు..కానీ రచయితకు వారు ఇరుగుపొరుగు,స్నేహితులు,కుటుంబం..
"నా పేరు జే.డీ.వాన్స్..నేను ఒక కన్ఫెషన్ చేద్దామనుకుంటున్నాను..ఈ పుస్తకం ఉనికే నా వరకూ చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది.. జీవితంలో నేనేదో అసాధారణమైనది సాధించానని ఈ పుస్తకం రాయట్లేదు,ఇది రాయడం వెనుక కారణం,నేను చాలా సాధారణమైనదాన్ని సాధించాను" అంటూ తన కథను మనకు చెప్పడం మొదలు పెడతారు వాన్స్..తనలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చినవారికి అతి మామూలు విషయం కూడా ఎండమావితో సమానమేనంటారు..Ohio స్టీల్ టౌన్ లోని Rust Belt లో Middletown లోని ఒక పేదకుటుంబంలో జన్మించిన వాన్స్ డ్రగ్స్,నిరక్షరాస్యత,అనాగరికతల నడుమ సంక్లిష్టమైన మానవ సంబంధాల మధ్య పెరిగినా కూడా జీవితంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని చేరుకోవడానికి తన గొప్పతనం,నైపుణ్యం కారణాలు కాదనీ,ప్రతి దశలోనూ తనకు చేయూతనందించిన తన మనుషులేననీ చెప్పడం గమనార్హం..అమెరికన్ డ్రీమ్,ఇది ప్రపంచంలో ఏ మూలనున్న వారికైనా ఒక కలైతే అమెరికా పౌరులకు మాత్రం హక్కు..కానీ తమ జాతి వారు ఆ దేశవనరుల్ని,ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారంటే అందుకు ఒబామానో,బుష్ నో, క్లింటన్ నో నిందించడం సరికాదనీ,దానికి కారణం తమ సంస్కృతిలో ఉన్న లోపాలేననీ గ్రహించడం,వాటిని వ్యక్తిగత స్థాయిలోనే సరిదిద్దుకోవడం అవసరమనీ అంటారు వాన్స్..
ఈ మెమోయిర్ లో రాజశ్రీ వారి హిందీ సినిమాలోలా బోల్డన్ని పాత్రలుంటాయి..కారు సీట్ల క్రింద లోడెడ్ గన్స్ పెట్టుకుని తిరిగే వాన్స్ అమ్మమ్మ,తాతలు (Mamaw,Papaw)..వారి ముగ్గురు పిల్లలు,Jimmy, Bev (వాన్స్ తల్లి),Lori...వారి వారి కుటుంబాలు,వాన్స్ తల్లి పలు వివాహాల ఫలితంగా వీరి కుటుంబంలో వచ్చి చేరిన ఇతర సంతానం,అక్క Lindsay,కజిన్స్..ఇలా లెక్కలేనంతమంది ఉన్నప్పటికీ సంబంధ బాంధవ్యాల్లో లోపించిన స్థిరత్వం చిన్నతనం నుండీ వాన్స్ వ్యక్తిత్వం మీద చూపించిన ప్రభావాలన్నీ అతనిలో ACE (adverse childhood experiences) కి కారణమవుతాయి..అరుచుకోవడం,కొట్టుకోవడం,దొంగతనాలు వారి ఇళ్ళల్లో సర్వసాధారణం..మానసిక పరిపక్వత రాకమునుపే ఇంట్లోంచి పారిపోయి వివాహాలు చేసుకోవడం,సంతానాన్ని కనడం,దాని ఫలితంగా బాధ్యత తెలీకుండానే డ్రగ్స్ బారిన పడటం,అలాగే పిల్లల్ని పెంచడం,పర్యవసానం పిల్లల్లో అభద్రత,ఆత్మన్యూనతలు పెంపొందించడం..హిల్ల్బిల్లీ సంస్కృతిలో కొన్నేళ్ళుగా తిరుగుతున్న ఈ చక్రంలో కేవలం వాన్స్ మాత్రమే భాగం కాదు..ఈ కథ ప్రతి హిల్ల్బిల్లీ బాల్యానికీ దర్పణం పడుతుంది..డ్రగ్స్ కు బానిసగా మారిన వాన్స్ తల్లి Bev,ఆమెకున్న క్లిష్టమైన వైవాహిక సంబంధాలూ వాన్స్ ను అతని అమ్మమ్మ,తాతలకు సంరక్షణలో పెరిగేలా చేస్తాయి..తమ సంస్కృతి నరనరాల్లో నింపిన నిరాశావాదాన్ని ప్రక్కకు నెట్టి వాన్స్ తన గమ్యాన్ని చేరుకోవడమే ఈ కథ.
హిల్ల్బిలీ సంస్కృతిలో హీరోలు లేరు..వాట్సాప్ ఫార్వర్డ్స్ లోను,ఈవెనింగ్ న్యూస్ లోను వచ్చే రూమర్స్ ను నిజమని నమ్ముతారు..అమెరికా ఆరాధించిన ఒబామాను కూడా ఈ హిల్ల్బిల్లీస్ అనుమానంగా చూస్తారు..2008 నాటికి వీరిలో కొందరు జార్జ్ బుష్ కు ఫాన్స్ అయితే మరికొందరు బిల్ క్లింటన్ ను ఇష్టపడ్డారు..అయినప్పటికీ వీరిలో ఎక్కువ శాతం క్లింటన్ ను దిగజారుతున్న అమెరికా నైతిక విలువలకు ప్రతినిధిగానే చూశారు..ఇలా వీరి ఆలోచనా సరళి మోడరన్ అమెరికాకు పూర్తిగా భిన్నం..సహజంగా ఎక్కడైనా ఒక సంస్కృతి విచ్ఛిన్నమవ్వడానికి కారణాలేమిటి అని ఆలోచిస్తే ఆ నెపాన్ని పాలకవర్గాల మీదకు తోసేసి సౌకర్యంగా చేతులు దులుపుకోవడం పరిపాటి..సామాజిక చైతన్యం అనేది ముందుగా వ్యక్తి నుంచి మొదలవ్వాలి గానీ ప్రభుత్వ వైఫల్యాలని నిందిస్తూ కూర్చుంటే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఈ మెమోయిర్ ద్వారా ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నించారు వాన్స్...ఈ పుస్తకం The Glass Castle,My name is Lucy Barton లాంటి మెమోయిర్స్ ని తలపించింది..ఇందులో J.D.Vance బాల్యం మానవ సంబంధాల్లో 'స్థిరత్వం' ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది...Upward mobility దిశగా తనను తాను నిరూపించుకోవాలని చేసే ఈ ప్రయాణంలో ఎదుర్కున్న ఆటుపోట్లను కళ్ళకు కట్టినట్లు వివరించారు వాన్స్..Racial prism లో తమ భావాలను వడపోతపోసేలోపే సామజిక వర్గం,కుటుంబ వ్యవస్థ అనేవి పేదల జీవితాల మీద చూపించే ప్రభావాన్ని విస్తృతంగా చర్చించారు..అమ్మమ్మ (Mamaw) పెంపకంలో Yale లా స్కూల్ పట్టా పుచ్చుకున్న వాన్స్ ఉషా చిలుకూరి అనే ఒక తెలుగు అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
తల్లి పలుమార్లు విడాకులు,వివాహాలతో విసిగిపోయిన వాన్స్ తన బాల్యంలోని చేదునీ,అభద్రతా భావాల్నీ హాస్య ధోరణిలో చెప్తూ...
By the time we returned to Mamaw Blanton’s house, I was more upset about the dog than about losing father number two.
“Yeah, my legal father’s last name is Hamel. You haven’t met him because I don’t see him. No, I don’t know why I don’t see him.
We found this letter hilarious: One of my parents had already faced a prosecution of sorts and hardly possessed any walking-around liberty, while the other was sufficiently off the grid that “summoning” him would require some serious detective work.
Gail reminded me that dogs were a lot of work and that my family (read: my mother) had a terrible history of getting dogs and then giving them away.
I just felt uncomfortable around her. To sleep in her house meant talking to husband number five, a kind man but a stranger who would never be anything to me but the future ex–Mr. Mom.
హిల్ల్బిల్లీ పిల్లల స్కూల్ టీచర్ పిల్లల తల్లితండ్రుల గురించి మాట్లాడుతూ,
“They want us to be shepherds to these kids. But no one wants to talk about the fact that many of them are raised by wolves."
క్రమశిక్షణ,కష్టపడే తత్వం లోపించిన తమ సంస్కృతిలోని లొసుగుల్ని గురించి చెప్తూ,
We talk about the value of hard work but tell ourselves that the reason we’re not working is some perceived unfairness: Obama shut down the coal mines, or all the jobs went to the Chinese. These are the lies we tell ourselves to solve the cognitive dissonance—the broken connection between the world we see and the values we preach.
What separates the successful from the unsuccessful are the expectations that they had for their own lives. Yet the message of the right is increasingly: It’s not your fault that you’re a loser; it’s the government’s fault.
వాన్స్ అమ్మమ్మ చెప్పిన కథ..
Mamaw often told a parable: A young man was sitting at home when a terrible rainstorm began. Within hours, the man’s house began to flood, and someone came to his door offering a ride to higher ground. The man declined, saying, “God will take care of me.” A few hours later, as the waters engulfed the first floor of the man’s home, a boat passed by, and the captain offered to take the man to safety. The man declined, saying, “God will take care of me.” A few hours after that, as the man waited on his roof—his entire home flooded—a helicopter flew by, and the pilot offered transportation to dry land. Again the man declined, telling the pilot that God would care for him. Soon thereafter, the waters overcame the man, and as he stood before God in heaven, he protested his fate: “You promised that you’d help me so long as I was faithful.” God replied, “I sent you a car, a boat, and a helicopter. Your death is your own fault.” God helps those who help themselves. This was the wisdom of the Book of Mamaw.
పుస్తకం నుండి మరికొన్ని,
Some people may conclude that I come from a clan of lunatics. But the stories made me feel like hillbilly royalty, because these were classic good-versus-evil stories, and my people were on the right side. My people were extreme, but extreme in the service of something—defending a sister’s honor or ensuring that a criminal paid for his crimes. The Blanton men, like the tomboy Blanton sister whom I called Mamaw, were enforcers of hillbilly justice, and to me, that was the very best kind.
Destroying store merchandise and threatening a sales clerk were normal to Mamaw and Papaw: That’s what Scots-Irish Appalachians do when people mess with your kid. “What I mean is that they were united, they were getting along with each other,”
I was born in late summer 1984, just a few months before Papaw cast his first and only vote for a Republican—Ronald Reagan. Winning large blocks of Rust Belt Democrats like Papaw, Reagan went on to the biggest electoral landslide in modern American history.
Mamaw and Papaw ensured that I knew the basic rules of fighting: You never start a fight; you always end the fight if someone else starts it; and even though you never start a fight, it’s maybe okay to start one if a man insults your family. This last rule was unspoken but clear.