Wednesday, January 24, 2018

Sing, Unburied, Sing - Jesmyn Ward

'మన ప్రమేయం లేనిదే మనల్ని ఎవరూ కించపరచలేరు' అని అంటుంటారు కానీ చరిత్ర చూసినప్పుడు,ఇలాంటి కథలు చదివినప్పుడు అది నిజం కాదని బలంగా అనిపిస్తుంది..పుట్టుక విషయంలో తన జాతి,కులం,మతం లాంటివి మనిషి తనంతట తాను కోరుకున్నవి కాదు..అవి కేవలం యాదృచ్ఛికంగా మనిషికి ఆపాదించబడతాయి..గతాన్ని చూస్తే ఇలాంటి విషయాల్లో మనిషి కేవలం నిమిత్తమాత్రుడైనా జాతిపేరుతో జరిగే మారణహోమంలో మాత్రం సమిధకాక తప్పలేదు..జాతి వివక్ష లాంటివి ఎదుర్కొంటే మాత్రం అలా ఎలా డ్రగ్స్ బారిన పడతారు ? నేరప్రవృత్తి ఎలా వస్తుంది ? ఇండివిడ్యువల్ డిసిప్లిన్ అఖ్ఖర్లేదా ???? అని ఆపకుండా ప్రశ్నలు సంధించే లాజికల్ మైండ్ ని కాసేపు బుజ్జగించి వాస్తవాలు పరిశీలిస్తే  ఒక మనిషి సక్సెస్ లో పూర్తిగా కాకపోయినా ఈ పుట్టుక కూడా పరోక్షమైన(బలమైన?) పాత్ర పోషిస్తుందని David McRaney 'You are not so smart' లో అన్న మాటలు గుర్తొచ్చాయి..

Image Courtesy Google 
మెదడు పాత విషయాలతో నిండిపోయుంటే కొత్త విషయాలకు చోటు ఉండదు,అలాంటప్పుడు మెదడుకి కూడా కాస్త ఫార్మాటింగ్ అవసరం :) అలా పోయిన సంవత్సరం చదువుదామనుకున్న ఈ పుస్తకం ఈ సంవత్సరం ఖాతాలో పడింది..జెస్మిన్ వార్డ్ రాసిన Sing, Unburied, Sing 2017 వ సంవత్సరానికి గాను నేషనల్ బుక్ అవార్డును గెలుచుకోవడమే కాక Andrew Carnegie Medal,Kirkus Prize లాంటి మరిన్ని అవార్డులకు నామినేట్ చెయ్యబడింది..పదమూడేళ్ళ జోజో (Jojo),చెల్లెలు కేలా (Kayla/Michaela) అమ్మమ్మ,తాతలతో (Mam,Pop) కలిసి ఉంటుంటారు..డ్రగ్స్ కు బానిసైన తల్లి లియోనీ (Leonie) బాధ్యతా రాహిత్యం కారణంగా జోజో పసిపాప అయిన కేలాను తల్లిలా సంరక్షిస్తుంటాడు..లియోనీ భర్త,తెల్లజాతీయుడైన మైఖేల్ మూడేళ్ళ జైలు శిక్ష అనంతరం విడుదలవుతున్న సందర్భంలో తన స్నేహితురాలు Misty తో కలిసి పిల్లలిద్దరినీ తీసుకుని Mississippi State Penitentiary అయిన Parchman Farm కు బయలుదేరుతుంది..కథనం చాలావరకూ ఈ రోడ్డు ట్రిప్ లో భాగంగా నడుస్తుంది..ఈ ప్రయాణంలో మిస్సిస్సిప్పి వీధులు డ్రగ్స్,నేరాలు,పిల్లల ఆకలిదప్పులు,సంరక్షణ లేని బాల్యం ఇలా అస్తవ్యస్తమైన  నల్లజాతీయుల బ్రతుకులకు సాక్ష్యాలుగా నిలబడతాయి.

ఈ పాత్రలతో పాటు ఇందులో కాస్త ఫాంటసీ ప్రపంచం కూడా ఉంటుంది..పాత్రల మధ్య  తిరుగుతూ,వారితో మాట్లాడుతూ ఆత్మలు కూడా సంచరిస్తుంటాయి..లియోనీకి చనిపోయిన సోదరుడు గివెన్(Given) కనిపిస్తూ ఉంటాడు..మైఖేల్ కజిన్ గివెన్ ను చంపగా మైఖేల్ తండ్రి బిగ్ జోసెఫ్,అతని కుటుంబం దాన్ని కేవలం ఒక 'హంటింగ్  ఆక్సిడెంట్' గా అభివర్ణిస్తుంది..జోజో Parchman ఫార్మ్ కి వెళ్ళినప్పుడు గతించిన కాలంలో అతని తాత(రివర్) అక్కడ ఉన్నప్పటి రోజుల్లో ఆ ఫార్మ్ లో ఖైదీ గా ఉన్న Richie అనే పిల్లవాడి ఆత్మ జోజోను వెంటాడుతుంది..రిచీ గురించి జోజోకు తాత కథలు కథలుగా  చెప్తుంటాడు గానీ రిచీ జైలునుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన తరువాత మాత్రం ఏమైందనేది చెప్పకుండా దాటేస్తుంటాడు..తాతను ఆ మిగతా కథ చెప్పమని అడగమని రిచీ జోజో వెంటపడి అడుగుతుంటాడు..రిచీ గురించి చదువుతున్నప్పుడు మనలో కలిగే జాలి,అసలు Parchman లో ఏమైంది,రిచీ కథేంటి అనే ఆలోచనలతో ఆత్రంగా పేజీలు తిప్పేలా చేస్తుంది.

జెస్మిన్ సృష్టించిన లోకంలో ప్రేమ,దయ కోసం పరితపించే పాత్రలు కనిపిస్తాయి..అక్కడ No-Trespassing బోర్డు వెనుక లోడెడ్ గన్ పట్టుకుని గర్జించే తెల్లవాళ్ళను చూస్తే అటుప్రక్కగా వెళ్ళే నల్లజాతీయులకు నిలువెల్లా చెమటలుపోస్తాయి..ఆ ప్రపంచంలో నల్లవాళ్ళు ఏమైనా తప్పు చేశారని వినగానే అసలు ఏమీ విచారించకుండానే కళ్ళు పీకెయ్యడం,చర్మం వలిచేయ్యడం లాంటి ఘోరమైన శిక్షలు అమలుచేస్తారు..చేదు నిజాలను ఒక ప్రక్క కఠినంగా చెప్తూనే మరో ప్రక్క సున్నితమైన పసివాళ్ళ ప్రపంచాన్ని కూడా పరిచయం చెయ్యడం జెస్మిన్ కే సాధ్యమా  అన్నట్లు చిన్న చిన్న విషయ విశేషాలతో నేరేషన్ ఆద్యంతం ఒక ప్రవాహంలా సాగిపోయింది..ఈ కథని జోజో,లియోనీ,రిచీ-ముగ్గురి దృష్టి కోణంనుంచీ,గత-వర్తమానకాలాల్లో మార్చి మార్చి రాశారు..తల్లిదండ్రుల జాతులు వేరుకావడం,నేరాలు,డ్రగ్స్ లాంటి కారణాలతో జోజోకు తల్లిదండ్రుల పట్ల విముఖత ఏర్పడుతుంది..ఈ పుస్తకంలో అన్నిటికంటే నచ్చిన విషయం అన్న చెల్లెళ్ళ(జోజో,కేలా) మధ్య ఉన్న ప్రేమ..ప్రతి నిముషం కేలాను తల్లిలా  బుజ్జగించి అక్కున చేర్చుకునే జోజో,చిన్ని చిన్ని చేతులను జోజో మెడచుట్టూ వేసి ఒక్క క్షణం కూడా అతన్ని వదలని కేలా లను చూస్తుంటే మనకే కాక తల్లి లియోనీ కి కూడా అసూయ కలుగుతుంది..ఇక పదిహేడేళ్ళకే తల్లి అయిన లియోనీలో మాతృత్వపు ఛాయలు మాత్రం లేవని కాన్సర్ బారినపడిన అమ్మమ్మ జోజోతో అంటుంటుంది..లియోనీ కి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నా వాటిని వ్యక్తం చెయ్యడం చేతకాదు..తనపై తనకే అదుపులేని లియోనీ భర్త మైఖేల్ ప్రేమలో ఊరట పొందుతుంది..ఇక రిచీ కథ Parchman దారుణాలకు సాక్ష్యం..పశువుల్లా ఆ పొలాల్లో పని చేసే ఖైదీలు,వాళ్ళు నియమాలను అతిక్రమిస్తే కుక్కని కాల్చినట్లు కాల్చిపడేసే గన్ మాన్లు,ఖైదీలపై  కుక్కల్ని వదిలి వేడుక చూసేవాళ్ళు-ఇలా మానవత్వానికి ఆవలి తీరంలో ఉంటుంది Parchman..మరి రిచీ కథ ఏమైంది ! రిచీకి ప్రేమను పంచిన రివర్ (జోజో తాత) రిచీని కాపాడగలిగాడా అనేది మిగతా కథ..

ఇందులో వాక్య నిర్మాణం నల్లజాతీయుల వ్యవహార శైలికి దగ్గరగా ఉండటంతో అర్ధం చేసుకోడానికి కాస్త ఇబ్బంది అనిపించింది..వాక్యాలకు ముగింపు లేకుండా విడి పువ్వుల్లా,మాల కట్టుకునే పని చదివేవాళ్ళకే వదిలేసినట్లు ఉన్నాయి..కానీ ఆ శైలికి తొలి పేజీల్లో కాసేపు అలవాటుపడితే చాలు,కట్టుదిట్టమైన కథనం ఇలాంటి విషయాలను గమనించే అవకాశం ఇవ్వకుండా చదివిస్తుంది..నల్లజాతీయులకు ఇప్పటికీ కలలోకొచ్చి భయపెట్టే అమెరికా భూతాన్ని గురించి తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

లియోనీ అంతరంగం..
I catch myself massaging the back of my neck and stop. Everything hurts.

Mama looks at me, only her eyes looking full in that moment, round as they ever were, almost hazel if I lean in close enough, water gathering at the edges. The only thing time hasn’t eaten.

Because from the first moment I saw him walking across the grass to where I sat in the shadow of the school sign, he saw me. Saw past skin the color of unmilked coffee, eyes black, lips the color of plums, and saw me. Saw the walking wound I was, and came to be my balm.

బిగ్ జోసెఫ్ ను గురించి లియోనీ...
He is taking something off the seat of the mower, a rifle that was strapped there, something he keeps for wild pigs that root in the forest, but not for them now. For me.

Parchman అనుభవాలు,
This ain’t no place for no man. Black or White. Don’t make no difference. This a place for the dead.

The warden said: “It ain’t natural for a colored man to master dogs. A colored man doesn’t know how to master, because it ain’t in him to master.” He said: “The only thing a nigger knows how to do is slave."

I didn’t understand time, either, when I was young. How could I know that after I died, Parchman would pull me from the sky? How could I imagine Parchman would pull me to it and refuse to let go? And how could I conceive that Parchman was past, present,and future all at once? That the history and sentiment that carved the place out of the wilderness would show me that time is a vast ocean, and that everything is happening at once?

లియోనీ గురించి జోజో...
I don’t want Leonie giving her that. I know that’s what she think she need to do, but she ain’t Mam. She ain’t Pop. She ain’t never healed nothing or grown nothing in her life, and she don’t know.

రిచీ అంతరంగం,
“Home is about the earth. Whether the earth open up to you. Whether it pull you so close the space between you and it melt and y’all one and it beats like your heart. Same time. Where my family lived . . . it’s a wall. It’s a hard floor, wood. Then concrete. No opening. No heartbeat. No air."

I know Jojo is innocent because I can read it in the unmarked swell of him: his smooth face, ripe with baby fat; his round, full stomach; his hands and feet soft as his younger sister’s. He looks even younger when he falls asleep. His baby sister has flung herself across him, and both of them slumber like young feral cats: open mouths, splayed arms and legs, exposed throats.

This is where he differs from River. This scent blooms stronger than the dark rich mud of the bottom; it is the salt of the sea, burning with brine. It pulses in the current of his veins. This is part of the reason he can see me while the others, excepting the little girl, can’t. I am subject to that pulse, helpless as a fisherman in a boat with no engine, no oars, while the tide bears him onward

పుస్తకం నుండి మరికొన్ని...
Sometimes the world don’t give you what you need, no matter how hard you look. Sometimes it withholds.

“He wasn’t nothing but a boy, Jojo. They kill animals better than that.”

“Of course she’s yellow. She’s our baby.” And then Leonie laughs, and even though it’s a laugh, it doesn’t sound like one. There’s no happiness in it, just dry air and hard red clay where grass won’t grow.

This the kind of world, Mama told me when I got my period when I was twelve, that makes fools of the living and saints of them once they dead. And devils them throughout.

Friday, January 12, 2018

Stiff : The Curious Lives of Human Cadavers - Mary Roach

Stiff: The Curious Lives of Human Cadavers , అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్తకం..నాన్ ఫిక్షన్ విభాగానికి చెందిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దీనికి నోట్ వద్దులే అనుకున్నాను..కానీ పుస్తకం ముగించాక ఆ అభిప్రాయం మార్చుకోడానికి కారణం రచయిత మేరీ రోచ్..మిగతా దేశాల సంగతి ప్రక్కన పెడితే మన భారతీయ సంస్కృతిలో మరణం అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు..మాట్లాడటానికి సహజంగా ఎవరూ ఇష్టపడని సబ్జెక్టు..'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' అనుకుంటూ మనిషి తన జీవితకాలంలో ఎలా బ్రతికినా కూడా మరణానంతరం మాత్రం వారికి గౌరవప్రదమైన హోదాని ఆపాదించే వీడ్కోలు చెప్పే సంస్కృతి మనది..ఇంకొంచెం ముందుకు వెళ్తే సంస్కృతిలో భాగమైన పుస్తకాలు,సినిమాల్లో కూడా 'And they lived happily ever after' ముగింపు దగ్గరే ఆగిపోయే కథలే మనకిష్టం..పోనీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి మృత్యువు గురించి మాట్లాడాలన్నా,విషయం 'వారు గతించారు' ,He/She is no more ల దగ్గరే ఆగిపోతుంది..ఆ తరువాత విజ్ఞానశాస్త్రాన్ని ఔపాసన పట్టి,అన్నిటికీ సమాధానాలు తెలిసిన మనిషి ఉన్నట్లుండి మౌన ముద్ర ధరిస్తాడు,ఆ సమయంలో నిశ్శబ్దం,శ్మశాన వైరాగ్యాల లాంటివి రాజ్యమేలుతాయి..ఎవరూ ఏమీ మాట్లాడని,మాట్లాడడానికి ఇష్టపడని ఆ సున్నితమైన సందర్భంలోనే ఈ Stiff అనే రచన ప్రారంభం అవుతుంది.

Image courtesy Google
'స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్' అని ఒక సినీ కవి అన్నట్లు మరణాన్ని కూడా వేడుకలా జరుపుకుంటున్న ఈ కాలపు సంస్కృతిలో మనం నైతిక విలువలు కలిగి ఉండటమే మనల్ని మృగాల నుంచి వేరు చేస్తుందని నమ్మే సగటు మనిషిని ఆ 'మనిషి' చట్రంలోంచి బయటకొస్తే సమస్త ప్రాణికోటిలో నువ్వు కూడా కేవలం ఒక రెండు కాళ్ళ జంతువువేనని కఠినంగా గుర్తు చేస్తుంది ఈ పుస్తకం..కానీ మిగతా జీవులన్నీ ఈ భూమ్మీదకి ఎంత సహజంగా వచ్చాయో అంతే సహజంగా మరణానంతరం భూమిలో ఐక్యమైపోతుంటే మనిషి మాత్రం ఖరీదైన సమాధుల్నీ ,గంధపు చెక్కల్నీ భౌతికంగా తాను చెప్పే తుది వీడ్కోలకి వేదికగా ఎందుకు మార్చుకుంటాడో ఆలోచించమంటుంది..

Death.It doesn't have to be boring అంటారు రోచ్..ఏమిటీ పైత్యం అనుకుంటూ ముందుకెళ్ళిన కాసేపటికే ఆవిడ ఈ టోన్ లో చెప్పకపోతే ఈ పుస్తక చదవడం చాలా కష్టం అని మనకి అర్ధం అయిపోతుంది..
Seeing her cadaver was strange, but it wasn't really sad. It wasn't her.
అని తన తల్లి భౌతికకాయాన్ని చూస్తూ పుస్తకం తోలి పేజీల్లో రచయిత అనుకున్న మాటలివి..
అసలు ఎవరైనా పుస్తకం రాస్తున్నారంటే ఉత్సాహంగా,ఒక ఆరాధనతో చూస్తారు కానీ కడావర్స్ గురించి ఏదో పత్రికలో చిన్న కాలమ్ అంటే పర్వాలేదు గానీ,ఒక పూర్తి స్థాయి పుస్తకం రాయడానికి పూనుకున్న తన సాహసానికి కారణం తన క్యూరియాసిటీ మాత్రమేనని చెప్పిన రచయిత,తాను కడావర్స్ గురించి రాస్తున్నాని చెప్తే జనాల మొహాల్లో కనిపించిన అప్రసన్నతతో కూడిన తిరస్కారం,తన మానసిక స్థితిని అంచనా వేస్తూ చూసిన వారి చూపులూ మర్చిపోలేనంటారు రోచ్.

The problem with cadavers is that they look so much like people.. ఇక్కడే మొదలవుతుంది అసలు చిక్కంతా..మనిషి-మానవత్వం లాంటి హ్యూమన్ఎ మోషన్స్ తెరమీదకొస్తాయి..అందులోనూ మరణించిన వారి సన్నిహితులకు ఆ కడావర్స్ తో ఉండే అనుబంధం వాటిని కేవలం ఒక 'thing'/'waste' గా చూడనివ్వదు..ఈ పుస్తకంలో మృతదేహాల్ని డిస్పోజ్(క్షమించాలి నాకు తెలుగులో సరైన పదం తెలీలేదు) చేసే క్రమంలో వివిధ దేశాల కట్టుబాట్లు,ఆచారాల్ని ఉటంకిస్తూ లోతైన చర్చ చేశారు..కానీ ప్రపంచ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరణం తాలూకూ వ్యర్ధాలను(మృతదేహాల్ని ) డిస్పోజ్ చెయ్యడానికి ఖననం,దహనం లాంటి ప్రాచీన విధానాలనే ఇప్పుడు కూడా అవలంబించడం ద్వారా తమకు తెలీకుండానే మానవాళి పర్యావరణానికి మరింత హాని కలిగిస్తోందంటారు రోచ్..తాను చెప్పిన ప్రతి విషయానికీ,చూపించిన గణాంకాలకూ వివిధ దేశాల పరిశోధనా విభాగాలకు వెళ్ళి తను చేసిన విస్తృతమైన అధ్యయనం ద్వారా సాక్ష్యాలూ,ఋజువులు కూడా చూపిస్తారు..కులమతాలు,ఆచార వ్యవహారాలు మనిషి అస్థిత్వంలో ఇంకా భాగంకాని ప్రాచీన కాలంలో ఇప్పట్లా హంగు-ఆర్భాటాలు లేనప్పుడు శవ దహనాలు,ఖననాలు ఎలా జరిగేవో చెప్పుకొస్తూ తదుపరి కాలంలో చైనా,అమెరికా,ఫ్రాన్స్ తదితర దేశాలకు సంబంధించి అనాటమీ చరిత్రపుటల్లోకి పాఠకుల్ని తీసుకు వెళ్తారు..

మొత్తం పన్నెండు అధ్యాయాల్లో సాగే ఈ రచనలో తొలి అధ్యాయంలో మనిషి శరీరాన్ని అధ్యయనం చెయ్యాలంటే కడావర్స్ వల్లే సాధ్యమని నిరూపిస్తూ వైద్య రంగానికి కడావర్స్ పరోక్షంగా చేస్తున్నసేవను,వివిధ శస్త్ర చికిత్సల్లో వాటి ప్రాముఖ్యతను గురించి చెప్తూ,శరీరంలో కీలక భాగాల మీద జరిగే ప్లాస్టిక్ సర్జరీ,ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటి గురించి చర్చిస్తారు..రెండో అధ్యాయం 'క్రైమ్స్ ఆఫ్ అనాటమీ' చదవడం కాస్త కష్టం..పూర్తి చేశామా,ఇక 'బ్రతుకు జీవుడా' అనిపించక మానదు..మానవ హక్కులు,శాసనాలు,ఉల్లంఘనలు  లేని ప్రాచీన కాలంలో వైద్య రంగానికి సంబంధించిన కీలక పరిశోధనలు అప్పుడప్పుడే వెలుగుచూస్తున్న కాలంలో పరిశోధనల నిమిత్తం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రాత్రి వేళల్లో శవాలను దొంగతనం చెయ్యడం,Human dissection వంటి విధానాల్లో చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన అనాటమీ చీకటి కోణాలను మన దృష్టికి తీసుకొస్తారు..యుద్ధంలో చనిపోయిన ఖైదీలను కూడా తమ పరిశోధనల్లో భాగంగా చేసుకోవడం,అవసరమైతే కొందర్ని చంపడం తదితర విషయాలు చదువుతున్నప్పుడు జీర్ణం చేసుకోవడం కష్టం..కానీ చివరకి వచ్చేసరికి వీటన్నిటి ఫలితమే కదా ఈరోజు మనకు అందుబాటులో ఉన్న వైద్యం అనిపించక మానదు..

Trouble's name was Herophilus. Dubbed the Father of Anatomy, he was the first physician to dissect human bodies. While Herophilus was indeed a dedicated and tireless man of science, he seems to have lost his bearings somewhere along the way.Enthusiasm got the better of compassion and common sense, and the man took to dissecting live criminals. According to one of his accusers, Tertullian, Herophilus vivisected six hundred prisoners.To be fair, no eyewitness account or papyrus diary entries survive, and one wonders whether professional jealousy played a role. After all, no one was calling Tertullian the Father of Anatomy.

మూడో అధ్యాయం 'లైఫ్ ఆఫ్టర్ డెత్',హ్యూమన్ బాడీ decomposition క్రమాన్ని సమగ్రంగా చర్చించే ఈ భాగం ఈజిప్ట్ మమ్మీల కాలాన్ని గుర్తు చేస్తూ embalming ప్రక్రియ పుట్టుపూర్వోత్తరాల్ని వివరిస్తుంది..

I don't mind Theo's matter-of-factness. Life contains these things: leakage and wickage and discharge, pus and snot and slime and gleet. We are biology. We are reminded of this at the beginning and the end, at birth and at death. In between we do what we can to forget.

Mack is telling me about a ninety-seven-year-old woman who looked sixty after her embalming. "We had to paint in wrinkles, or the family wouldn't recognize her."

మరో చోట ఆక్సిడెంట్స్ జరిగినప్పుడు మనిషి శరీరానికి జరిగే నష్టాల్ని నివారించే క్రమంలో వివిధ దేశాలు కార్ల తయారీలో తీసుకునే జాగ్రత్తల్ని గురించి రాస్తూ తయారీ సమయంలో కడావర్స్ ను డమ్మీలుగా ఎలా ఉపయోగిస్తారో చెప్తారు..అలాగే విమాన ప్రమాదాల్లో లభ్యమైన మృతదేహాల ద్వారా ఆక్సిడెంట్ కి కారణాలను పరిశోధించే క్రమంలో కడావర్స్ పాత్ర గురించి వివరిస్తూ బ్లాక్ బాక్స్ రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చే విధానాల గురించి రాస్తారు..

He points out that the heads aren't cut off out of ghoulishness. They are cut off so that someone else can make use of the other pieces: arms, legs, organs. In the world of donated cadavers, nothing is wasted. Before their face-lifts, today's heads got nose jobs in
the Monday rhinoplasty lab.

పలు దేశాల సైనిక విభాగాల్లో కడావర్స్ పాత్ర గురించి రాస్తూ శత్రువర్గాన్ని తుదముట్టించే క్రమంలో జరిపే బాంబు దాడులను,బుల్లెట్ గాయాల్నీ మానవ శరీరం ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి కడావర్స్ ని డమ్మీలుగా ఉపయోగించే పరిశోధనల్ని వివరిస్తారు...అలాగే మరో చోట రోమన్ల కాలంలో ఉండే Crucifixion విధానాల్ని గురించి రాస్తారు...వీటితో పాటు కోమాలోకి వెళ్ళిపోయో,బ్రెయిన్ డెత్ కారణంగానో జీవించి ఉన్నప్పటికీ మరణించిన వారితో సమానమైన మనుషుల్ని గురించి రాస్తూ వాటిని 'బీటింగ్ హార్ట్ కడావర్స్' గా అభివర్ణిస్తారు...ఇంకోచోట Decapitation, reanimation,human head transplant లాంటి శాస్త్రీయ విధానాలు,వాటికి సంబంధించి పరిశోధనలు వీటన్నిటి మధ్యా కాస్త ఆసక్తి కలిగించే అంశాలుగా ఉంటాయి..

మరో భాగం 'EAT ME' లో Medicinal cannibalism గురించిన విస్తృతంగా చర్చించిన విషయాలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటాయి..దీనిలో భాగంగా మెక్సికన్ చిత్రకారుడు డియెగో రివెరా అనాటమీ ల్యాబ్ కథనాన్ని గుర్తు చేస్తూ ,ఇలా రాస్తారు..

Those of us who undertook the experiment pooled our money to purchase cadavers from the city morgue, choosing the bodies of persons who had died of violence—who had been freshly killed and were not diseased or senile. We lived on this cannibal diet for two months and everyone's health improved.So wrote the painter Diego Rivera in his memoir,MyArt, MyLife.

Rivera—if we are to believe his anatomy lab tale—considered the legs,breasts, and breaded ribs of the female cadavers "delicacies," and especially relished "women's brains in vinaigrette."

ఇంకోచోట మృతదేహాల్ని కంపోస్ట్ గా మార్చే ఆధునిక విధానాల వైపు మొగ్గు చూపుతున్న స్వీడన్ తదితర దేశాల గురించి రాస్తూ 'ముగింపు' కి ఇతర సానుకూల విధానాలను సూచిస్తారు..
చివరగా తన శరీరాన్ని ల్యాబ్ కు డొనేట్ చెయ్యడం గురించిన ఆలోచనల్ని పంచుకుంటూ ఆమె తల్లిదండ్రులు కూడా ఈ క్రమంలో ఎదుర్కున్న సామాజిక వ్యతిరేకతను,అనుభవాల్ని రాస్తారు..ఇది కడావర్స్ గురించి ఒక సమగ్రమైన మెడికల్ జర్నల్ లా ఉంటుంది..అనాటమీ చరిత్రని సాధ్యమైనంత అర్ధమయ్యే భాషలో,హాస్యపూరిత ధోరణిలో (శవాల గురించి చెప్పేటప్పుడు హాస్యం ఏంటి అనుకుంటున్నారా ! సహజమే ! కానీ నిజం) రాశారు రోచ్.

What wouldn't I let someone do to my remains? I can think of only one experiment I know of that, were I a cadaver, I wouldn't want anything to do with. This particular experiment wasn't done in the name of science or education or safer cars or better-protected soldiers. It was done in the name of religion.

చివరగా మరణానంతరం తమ శరీరాల్ని పవిత్ర గంగా తీరానికో లేక ఒక మిచిగాన్ లోని ప్లాస్టినేషన్ ల్యాబ్ కో తరలించాలని కోరుకోవడంలో హ్యూమన్ మోర్టాలిటీని అంగీకరించలేని మానవ వైఫల్యం కనిపిస్తుందంటారు రోచ్...Funeral director అయిన Kevin McCabe అభిప్రాయం ప్రకారం,
"Decisions concerning the disposition of a body should be made by the survivors, not the dead. "It's none of their business what happens to them when they die,"
అంటూ చివరగా ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తారు రోచ్..
While I wouldn't go that far, I do understand what he was getting at: that the survivors shouldn't have to do something they're uncomfortable with or ethically opposed to. Mourning and moving on are hard enough. Why add to the burden? If someone wants to arrange a balloon launch of the deceased's ashes into inner space, that's fine. But if it is burdensome or troubling for any reason, then perhaps they shouldn't have to.

కడావర్స్ తో ముడిపడి ఉన్న భావోద్వేగాల చెప్తూ,
I feel this way not because what I would be watching is disrespectful, or wrong, but because I could not, emotionally, separate that cadaver from the person it recently was. One's own dead are more than cadavers, they are place holders for the living. They are a focus, a receptacle, for emotions that no longer have one. The dead of science are always strangers.

అనాటమీ ల్యాబ్ అనుభవాలు,
Marilena replies that she doesn't have a problem with heads. "For me,
hands are hard." She looks up from what she's doing. "Because you're
holding this disconnected hand, and it's holding you back."Cadavers
occasionally effect a sort of accidental humanness that catches the
medical professional off guard.

One young woman's tribute describes unwrapping her cadaver's hands and being brought up short by the realization that the nails were painted pink. "The pictures in the anatomy atlas did not show nail polish," she wrote. "Did you choose the color?… Did you think that I would see it?… I wanted to tell you about the inside of your hands… I want you to know you are always there when I see patients. When I palpate an abdomen, yours are the organs I imagine. When I listen to a heart, I recall holding your heart." It is one of the most touching pieces of writing I've ever heard.

ఆహారపు అలవాట్లు కూడా సంస్కృతిలో భాగమని గుర్తు చేసిన రచయిత అభిప్రాయాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి..
It seems to me that the Chinese, relative to Americans, have a vastly more practical, less emotional outlook when it comes to what people put in their mouths. Tai Bao capsules notwithstanding, I'm with the Chinese. The fact that Americans love dogs doesn't make it immoral for the Chinese of Peixian city, who apparently don't love dogs, to wrap dog meat in pita bread and eat it for breakfast, just as the Hindu's reverence for cows doesn't make it wrong for us to make them into belts and meat loaves. We are all products of our upbringing, our culture, our need to conform. There are those (okay, one person) who feel that cannibalism has its place in a strictly rational society: "When man evolves a
civilization higher than the mechanized but still primitive one he has now," wrote Diego Rivera in his memoir, "the eating of human flesh will be sanctioned. For then man will have thrown off all of his superstitions and irrational taboos."

I began to wonder: Would any culture go so far as to use human flesh as food simply out of practicality?

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు..

The best-known of the London surgeon-anatomists was Sir Astley Cooper. In public, Cooper denounced the resurrectionists, yet he not only sought out and retained their services, but encouraged those in his employ to take up the job.Thing bad.

Cooper was an outspoken defender of human dissection. "He must mangle the living if he has not operated on the dead" was his famous line.

The distance between the very old, sick, frail person and the dead one is short, with a poorly marked border. The more time you spend with the invalid elderly (I have seen both my parents in this state), the more you come to see extreme old age as a gradual easing into death. The old and the dying sleep more and more, until one day they "sleep" all the time. They often become more and more immobile until one day they can do no more than lie or sit however the last person positioned them.

I find the dead easier to be around than the dying. They are not in pain,not afraid of death. There are no awkward silences and conversations that dance around the obvious. They aren't scary. The half hour I spent with my mother as a dead person was easier by far than the many hours I spent with her as a live person dying and in pain. Not that I wished her dead. I'm just saying it's easier. Cadavers, once you get used to them— and you do that quite fast—are surprisingly easy to be around.

"In between life and death is a state of near-death, or pseudo-life. And most people don't want what's in between."

Unforbidden Pleasures - Adam Phillips

ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా 'తమాషా' అని ఒకటొచ్చింది,ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానే వెళ్ళిపోయింది..మెజారిటీ ప్రేక్షకులకి అసలు ఆయనేం చెప్పాలనుకున్నారో అర్ధం కాలేదో లేక ఆయన చూపించిన 'మనిషి' ని ఎవరో గ్రహాంతరవాసనుకుని తాము అనుభవించే forbidden pleasures లో ఉన్న సౌకర్యానికి అలవాటుపడిన సగటు ప్రేక్షకులు unforbidden pleasures గురించి ఆలోచించడం మానేశారో మరి,నీషే భాషలో చెప్పాలంటే 'instinct for life' , ‘the herd instinct' గా రూపాంతరం చెందిన ఈ కాలంలో ఆ సినిమా ఒక ఫ్లోప్...మరి కట్టుబాట్ల మధ్య 'comfortable zone' లో హాయిగా దొరికిన సంతోషాన్ని అనుభవిస్తూ అసలు అలాంటి unforbidden pleasures అంటూ ఏవో ఉంటాయన్న స్పృహ కూడా లేకుండా జీవిస్తున్న మనుషులు అసలైన అదృష్టవంతులు అనుకుంటే,ఒక చట్రంలో ఇమడలేక,తమ ఉనికిని నిరంతరం ప్రశ్నించుకుంటూ,దొరికినదానితో తృప్తి పడకుండా జీవితంనుంచి ఇంకేదో కావాలని అలమటించే దురదృష్టవంతుల (?)  కోసం బ్రిటిష్ సైకాలజిస్ట్ ఆడమ్ ఫిలిప్స్ రాసిన పుస్తకమే ఈ Unforbidden pleasures..రూల్స్ ఉన్నవే పాటించడానికి అని కొంతమంది నమ్మితే,అవి ఉన్నవే బ్రేక్ చెయ్యడానికి అని కొంతమంది అంటారు..కానీ అసలు రూల్స్ అనేవే లేకపోతే,ఎదిరించడం,ఆ ఎదిరించడం తాలూకూ సంఘర్షణల్లాంటివి ఏమీ ఉండవు కదా అంటారు ఆడమ్ ఫిలిప్స్..ఈ పుస్తకమంతా ఈ వాదనను సమర్ధించే దిశగానే సాగుతుంది..

Image courtesy Google
‘We teach people how to remember, we never teach them how to grow,’ అంటారు 'The critic as artist' లో ఆస్కార్ వైల్డ్..ఒక బిడ్డ పుట్టింది మొదలు ఒక మట్టి ముద్దకి ఆకారం ఇచ్చే రీతిలో తల్లిదండ్రులూ,చుట్టూ ఉన్న సమాజం దానిని తమ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా మార్చడానికి ప్రయత్నిస్తుంది...'ఇది గుర్తు పెట్టుకో','ఇది మంచి','ఇది చెడు','ఇలాగే ఉండడం సంస్కృతి','ఇలా ఉండటం నాగరికత' అంటూ తాము ఏర్పాటుచేసిన సరిహద్దుల్ని దాటొద్దంటుంది..దానికి అనుగుణంగానే పుట్టిన పసికందు కూడా సర్వైవల్ ఇన్స్టింక్ట్ తో తొలిగా తల్లి ఆమోదం పొందడం కోసం తన ప్రవర్తనను మార్చుకోవడం మొదలుపెట్టి,క్రమేపీ సమాజపు అచ్చులో సుఖంగా ఇమిడిపోతాడు..కానీ ఇలా ఒక సంస్కృతిలో భాగమయ్యే క్రమంలో మనిషి చెల్లిస్తున్న మూల్యం ఏంటి ? సాంఘిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా నియమోల్లంఘన చేస్తే నైతిక విలువలు లేనివారిగా జమకట్టి సంఘం నుండి వెలివేస్తారనే భయంతో సోషల్ కండిషనింగ్ కి లోబడితే దొరికే సౌకర్యవంతమైన జీవితంకోసం unforbidden pleasures ని గమనించకుండానే ముందుకెళ్ళిపోతున్నాడా ? సమాధానంగా అవునంటారు రచయిత..ఈ 'Unforbidden Pleasures',వివిధ సందర్భాలనుంచి గ్రహించబడిన వ్యాసాల సంకలనం.

మరి మనిషి పురోభివృద్ధికి పరోక్షంగా హానికరంగా మారిన ఈ పరిణామాన్ని తొలిగా గుర్తించిన కట్టుబాట్లకావలి ప్రపంచానికి చెందిన ఆర్టిస్టులు తమ తిరుగుబాటును ప్రకటించే దిశగా,భాషను శక్తిమంతమైన మాధ్యమంగా గుర్తించి అప్పటివరకూ వాడుకలో ఉన్న పదజాలాన్ని మార్చేదిశగా నడుంకట్టారు..రొమాంటిసిజం తరువాత 19 వ శతాబ్దం చివర్లో ఊపందుకున్న ఎస్తెటిక్ మూవ్మెంట్ లో మానవజాతిలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్నామనే భావనను రూపుమాపే ప్రయత్నంలో,అంతవరకు వాడుకలో ఉన్న పదజాలం స్థానంలో ఆధునిక జీవనవిధానానికి ప్రాతినిధ్యం వహించే నూతన పదజాలాన్ని Pater,Wilde లాంటివాళ్ళు వాడుకలోకి తెచ్చారు..ఉదాహరణకు ‘good’ or ‘right’ (or ‘sacred’) ల బదులు ‘beautiful’ or ‘pleasurable’ or ‘enlivening’ లాంటి పదాల్ని విరివిగా ఉపయోగించారు..

కానీ తరతరాలుగా ఒక ఆధిపత్యం నుంచి విముక్తి కోసం చేసే ప్రయత్నం మరో ఆధిపత్యం క్రిందకి చేరడంతోనే ముగుస్తోంది..ఒక నియమాన్ని ఉల్లంఘించడం మరో నియమాన్ని పాటించడం దగ్గర ఆగుతుంది..ఉదాహరణకు ఒక దేవుణ్ణి కాదని మరో దేవుణ్ణి నమ్మడం..అసలు దేవుడే వద్దనుకుంటే మరో మనిషిని దేవుడి స్థానంలో కుర్చోపెట్టడంలాంటివన్నమాట..అదే విధంగా విక్టోరియన్లు భాషలో కొన్ని మార్పులు చేసినా మళ్ళీ కథ మొదటికే వచ్చింది..అందువల్ల మనుషులు forbidden pleasures తో జీవిస్తున్నారు గానీ,జీవించడంలో సంపూర్ణమైన ఆనందాన్ని రుచిచూడలేకపోతున్నారని వైల్డ్,నీషే,ఫ్రాయిడ్ లాంటివారి వాదన..తొలి భాగం 'Laying down the law' లో నీషే 'ది గే సైన్స్',Thus Spoke Zarathustra ,వైల్డ్ 'ది సౌల్ అఫ్ మాన్ అండర్ సోషలిజం' నుండి గ్రహించిన సిద్ధాంతాలను సమాంతరంగా చర్చించారు..నీషే,వైల్డ్ ల దృష్టిలో మనిషి ఒక 'evaluating animal' యే గానీ కేవలం obedient animal కాదు..అందువల్ల మనకి కోరికలున్నాయి కాబట్టి చట్టాలు లేవు..మనకి చట్టాలున్నాయి కాబట్టి కోరికలు ఉన్నాయి అంటారు..అలాగే ఫ్రాయిడ్ మనిషిని నిర్వచించే క్రమంలో ప్రవృత్తి,నైతికత,అహం లాంటివి అన్నీ ఉంటాయి గానీ వీటిన్నంటినీ కలిపి ఉంచే 'సెల్ఫ్'(నేను) అంటూ ఏమీ ఉండదని సంప్రదాయ విరుద్ధంగా (సెక్కులర్) వాదించి సైకో అనలిస్టులను సైతం దిగ్భ్రాంతికి గురి చేశారు.

ఆస్కార్ వైల్డ్ నైతికత కంటే ఎస్తెటిక్స్ ముఖ్యమంటారు..మనిషి నైతికతకు కట్టుబడి చెయ్యలేని పనిని చెయ్యడానికి కళను ఆశ్రయిస్తాడు..
And this is where art comes in: ‘All art is immoral,’ Wilde said, and so it is in art that we recover our real pleasures; we recover everything morality forces us to renounce.

Once the power of redescription is acknowledged, words like ‘true’, ‘good’, ‘right’, ‘sacred’ – and, of course, ‘forbidden’ – are among the first casualties.

‘To forget (or to unlearn) a vocabulary is to foster a remembering of a different self – the enigmatic self, the only self we are ever going to have, if we want to have a self – and its plenitudes and pleasures (‘the have-nots and the yearning ones … have formed linguistic usage’, Nietzsche remarks in 1887 in The Gay Science). It is to a celebration of so-called selfishness – his own redescription of ‘selfishness’ – that Wilde invites us; to the laying down of a different kind of law.

Morality, as Wilde and Nietzsche would also say, was a servile oversimplification of ourselves in the service of self-protection.

రెండో భాగం Tricks of obedience లో ఈ సోషల్ కండిషనింగ్ కి కారణాలను విశ్లేషిస్తూ,శిశువు పుట్టినప్పటినుండీ విధేయతతో మెలగడం నేర్చుకుంటుందనీ,ఈ విధేయత నేర్పడంలో (దురదృష్టవశాత్తూ) తల్లే ఆది గురువనీ అంటారు..తొలుత తల్లిదండ్రులకు,తరువాత చుట్టూ ఉన్న సమాజానికీ అనుగుణంగా విధేయతతో మెలగడం మొదలు పెట్టిన శిశువు తన ప్రమేయం లేకుండానే ఆ సంస్కృతి తాలూకూ ముసుగులో సౌకర్యవంతమైన జీవితానికి అలవాటుపడుతుంది..అలా క్రమేపీ ఈ విధేయత కారణంగా తన స్వతఃసిద్ధమైన అస్థిత్వాన్ని కోల్పోతుంది.

In the worst-case scenario, in the words of Frank Bidart’s poem ‘By These Waters’, ‘What begins in recognition, – … ends in obedience.’

Obedience, then, is an unforbidden pleasure sponsored by the forbidden pleasure of intimidation.

20వ శతాబ్దపు బ్రిటిష్ పీడియాట్రిషియన్ మరియు సైకో అనలిస్ట్ D.W.Winnicott, వాదన ప్రకారం, a man of Dissenter stock, what is to be feared in early development is ‘that the infant shall give up spontaneity in favour of compliance with the needs of those who are caring for the infant’; and as he wrote in The Family and Individual Development, he is justly reassured when a five-month-old infant ‘did not pass over into a compliant state, which would have meant that she had given up hope’

It can be comforting to be trapped in other people’s descriptions of oneself – and the infant is more or less his parents’ descriptions of him.

Obedience is the unforbidden pleasure that gives us something by forbidding us something else – something often of ultimate value.

మిల్టన్ పారడైస్ లాస్ట్ ను ప్రస్తావిస్తూ ఆడమ్,ఈవ్ ల కథనూ,వారు దేవుడు చేసిన నియమాలను అతిక్రమించిన పరిణామాలను ఈ 'విధేయత' కోణంలో చర్చించారు..వద్దని వారించిన పని చెయ్యడం వల్ల వారు కొత్త ప్రపంచాన్ని తెలుసుకున్నారు..అసలు వారిలో అలా తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలించడం కోసమే,వారి విధేయతకు దేవుడు పరీక్ష పెట్టాడేమో అంటారు రచయిత..ఎందుకంటే విధేయత అంటే ఏదీ తెలుసుకోడానికి ఇష్టపడని అజ్ఞానం,నియమాలు మాత్రమే గుర్తుపెట్టుకుని అభివృద్ధిని వద్దనుకునే జాడ్యం అంటారు..పారడైస్ లాస్ట్ ను ఆడమ్ ఈవ్ ల unforbidden pleasures ని రికవర్ చెయ్యడంలో భాగంగా అభివర్ణిస్తారు.

In the Genesis story, unforbidden pleasures come first and are found to be insufficient. But insufficient for what? What are the unforbidden pleasures depriving Adam and Eve of? All they know before the Fall is that there is something they must not do, which means there is something they must not want. But knowing this makes it known (and wanted); they needn’t, after all, have been told, and then presumably they would not have known not simply what they were missing, but that there was something they were missing. So in the beginning was a tantalization. A temptation was created. And it was created by a demand for obedience; obedience being required because its alternative is worse – whatever that alternative is assumed to be; it being the function of obedience to persuade us that there is no real, no viable, alternative.

మూడో భాగం Against self-Criticism లో ఫ్రాయిడ్ 'Superego' ను విస్తృతంగా చర్చిస్తారు..ఫ్రాయిడ్ షేక్స్పియర్ నాటకం హేమ్లెట్ లో కింగ్ క్లాడియస్ conscience ను పట్టుకోవాలనే హామ్లెట్ ప్రయత్నాన్ని ఉదహరిస్తూ conscience ను రోజువారీ క్యారెక్టర్ assassination గా పేర్కొంటారు..క్లాడియస్ పట్ల ప్రతీకారేచ్ఛ హేమ్లెట్ ను అతనికంటే ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చి అతని అస్థిత్వాన్ని కోల్పోయేలా చేసిదంటారు..ఇందులో మనిషిని తన ఆధీనంలోకి తీసుకుని,స్వతంత్రంగా ప్రవర్తించే సూపెరిగో పాత్రను చర్చించారు..మనిషి చెయ్యాలనుకున్న పనిని చెయ్యనివ్వకుండా అడ్డుకోవడంలో  'Superego' ప్రధాన పాత్ర పోషిస్తుందనీ అలాగే మనోవైకల్యాలకి కారణాలు వెతికే క్రమంలో మనిషి తనకి తెలీకుండా మనో వైకల్యం బారిన పడతాడనీ,ఈ వాదనను సమర్ధిస్తూ వైల్డ్,నీషే ల జీవితాల్లోని చీకటికోణాల్ని సాక్ష్యంగా చూపిస్తారు..

The superego’s role in relation to the ego may be compared to that of a judge or a censor. Freud saw conscience,self-observation and the formation of ideals as functions of the superego.’ It is useful to call the superego an agency, because it has agency; and the complementary alternatives – it is like a censor or a judge – speaks of the punitive, the forbidding and the restrictive. So, paradoxically, being forbidden something – being forbidden to speak, or to act, or to think, or to desire in certain ways – can be itself an unforbidden pleasure.

Superego ను నిర్వచించే క్రమంలో ఫ్రాయిడ్ కు ఇష్టమైన ఫిక్షనల్ క్యారెక్టర్ Don Quixote (madman) ,అతని గుఱ్ఱం Rocinante కథ చెప్తారు..

The id is the nag Rocinante, the ego is the mad Don Quixote, and the superego is the sometimes amusing, often good-humoured, frequently down to earth and gullible Sancho Panza. ‘Sancho,’ the critic A. J. Close writes in Cervantes: Don Quixote, ‘is proverbially rustic; panza means ‘belly’; and the character of the man is basically that of the clown of sixteenth-century [Spanish] comedy: lazy, greedy, cheeky, loquacious, cowardly, ignorant, and above all, nitwitted.’ What does the Freudian superego look like if you take away its endemic cruelty, its unrelenting sadism? It looks like Sancho Panza. And like Sancho Panza, the absurd and obscene superego is a character we must not take too seriously.

నాలుగో భాగం Unforbidden pleasures లో విశ్లేషణలు అధికారానికో,అవసరానికో లోబడి,దేన్నైనా గుడ్డిగా నమ్మి,నియమాలకు అనుగుణంగా ప్రవర్తించే బదులు దేన్నైనా పరీక్షించి,ప్రయోగం చేసి దానిలో మంచి చెడులు తెలుసుకోవడం అవసరం అన్న వాదనను బలపరిచే దిశగా సాగుతాయి..2003 లో నెదర్లాండ్స్ లోని Drachten లో Hans Monderman,అనే ట్రాఫిక్ ఇంజనీర్ ప్రతిపాదించిన 'రెడ్ లైట్ రిమూవల్ స్కీమ్స్' విజయం సాధించడాన్ని ఉదహరిస్తూ ట్రాఫిక్ రూల్స్ ఉండడం వల్ల మనుషులు పరాకుగా,బాధ్యతా రాహిత్యంగా ఉంటారనీ,అదే సిగ్నల్స్,రూల్స్ లేనప్పుడు పూర్తి స్థాయి జాగరూకతతో ఉండి జాగ్రత్తగా ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయనీ అంటారు.. ఈ వాదనను బలపరిచే దిశగా 1956 లో తన ‘Psychoanalysis and Art’ పేపర్ ను టేబుల్ మీద ఉంచారట Milner..వర్డ్స్ వర్త్,బ్లేక్ లాంటివారు బాల్యంలో పూర్తిస్థాయి 'absorption' ద్వారా అనుభవించిన unforbidden pleasures ఈ ఆధునిక మానవాళికి అందుబాటులో లేకపోవడమే ఈరోజు ప్రధాన దుఖ్ఖహేతువు అని మిల్నెర్ వాదన..ఆమె థియరీ ప్రకారం,

‘The central idea of my paper,’ she wrote,is that the unconscious mind, by the very fact of its not clinging to the distinction between self and other, seer and seen, can do things that the conscious logical mind cannot do. By being more sensitive to the samenesses rather than the differences between things, by being passionately concerned with finding ‘the familiar in the unfamiliar’ (which, by the way, Wordsworth says is the whole of the poet’s business), it … brings back blood to the spirit, passion to intuition. It provides the source for all renewal and rebirth, when old symbols have gone stale.

The basic identifications which make it possible to find new objects, to find the familiar in the unfamiliar, require an ability to tolerate a temporary loss of sense of self, a temporary giving up of the discriminating ego which stands apart and tries to see things objectively and rationally without emotional colouring.

ఐదో భాగం ,Life itself లో,పుట్టుకకు అర్ధం,పరమార్ధాలను నిర్వచించే ప్రయత్నం చేశారు..నీషే నలభై రెండేళ్ల వయసులో తాను రాసిన తొలి పుస్తకాన్ని సమీక్షించుకుంటూ విచారం వ్యక్తం చేస్తారు..అప్పటికి Immanuel Kant,Arthur Schopenhauer లను విస్తృతంగా చదివిన తన ఆలోచనలు వారిద్దరి పదజాలలో ఇరుక్కుపోయి తన అస్థిత్వాన్ని కోల్పోయానంటారు..ఒకప్పుడు నీషే ఆరాధించిన Schopenhauer,Silenus ల తత్వాన్ని తరువాత కాలంలో ఆయనే విమర్శించారు..పూర్తి స్థాయి నిరాశావాది Schopenhauer ఆలోచనల్లో కొట్టుకుపోయి అభివృద్ధిని వద్దనుకోవడం సమంజసం కాదనీ ,అసలు పుట్టడాన్ని మించిన ట్రాజెడీ లేదన్న Silenus వాదనల్ని గంభీరంగా తీసుకోవలసిన అవసరం కూడా లేదంటారు నీషే..ఇక్కడ వాటిని కేవలం వారి వ్యక్తిగత భిప్రాయాలుగా పరిగణించి కొట్టిపారేయ్యాలని అనడం కూడా గమనార్హం..చివరగా ఈ నియమం ప్రతి తత్వశాస్త్రానికి వర్తిస్తుందంటారు..ఇలా భాష,సంస్కృతి,సంప్రదాయాల్లో కొట్టుకుపోయి Unforbidden pleasures ను కోల్పోయిన మానవాళి వాటిని రికవర్ చేసుకునే దారుల్ని వెతకడంలో నాణానికి ఒకవైపున్న ఈ సినిసిజం,నిహిలిజాల సంగతటుంచితే Stanley Cavell 'Cities of Words' లో ప్రస్తావించిన ‘Emersonian perfectionists’ లుగా 'మోరల్ పెర్ఫెక్షనిజం' సాధించే ప్రయత్నం కూడా మనిషిలో పరిపూర్ణమైన ఆనందానికి అడ్డుకట్ట వెయ్యడమేనంటారు రచయిత...ఆంక్షలతో కూడిన సమాజంలో ఉన్న మనిషికి అసలు unforbidden pleasures తో ఏర్పడిన సమాజం ఎలా ఉంటుందో కూడా అనుభవంలో లేదంటారు..మరి ఆ ప్రపంచాన్ని కూడా ఓసారి చూసొస్తే పోయేదేముందని ఆడమ్ ఫిలిప్స్ వాదన..మరి మనిషిని అనాగరికత నుండి నాగరికతవైపు నడిపించినవి చట్టాలు,కట్టుబాట్లు,ఆంక్షలే అయితే మరి అవి లేని ప్రపంచం 'కళ్ళెం లేని గుఱ్ఱమా' లేక 'స్వేఛ్ఛా విహంగమా' అన్నదాన్ని చదివేవాళ్ళ ఊహకే వదిలేశారు..

ఈ ఫిలాసఫీ,సైకాలజీ పుస్తకాలు ఇప్పట్లో వద్దు వద్దనుకుంటూనే ఈ పుస్తకం గురించిన కథనాలు చదివి ఆసక్తి అనిపించింది..అవ్వడానికి రెండొందల పేజీల పుస్తకమే అయినా మెదడు మీద భారం మోపే కంటెంట్ కావడంతో కాస్త ఓపిగ్గా చదవాల్సిన పుస్తకం...ఈ తరహా పుస్తకాలు మనకు కొత్తగా తెలీని విషయాలేవీ చెప్పవు..మనిషి మనసులో ఎక్కడో దాగున్న రహస్యాలను మరోసారి గుర్తు చేస్తాయంతే...చదువుతున్నప్పుడు అన్నీ తెలిసినట్లే అర్ధమైనట్లే అనిపించినా రాసే ముందు అసలేం చదివాను అని అనుకుంటూ రెండో సారి సగం పుస్తకం చదివాను..రాసేటప్పుడు ముఖ్యమైన విషయాలు ఎన్ని ఎంచుకున్నా ఇంకా ఏవో మిగిలిపోయాయన్న వెలితి కూడా మిగిలిపోయింది...ఈ రచన ఆడమ్ ఫిలిప్స్ మిగతా రచనలు కూడా దొరికితే చదవాలన్న ఆసక్తి కలిగించింది..

పుస్తకం నుండి మరికొన్ని,

We are always tempted to ask, as Sterne does in The Life and Opinions of Tristram Shandy: ‘is a man to follow rules – or rules to follow him?

It was clear to Hobbes that the only foundations that we have are our fundamental laws; that we are the kind of creatures that, without these so-called fundamental laws, will be in a war of all against all; in endless uncivil civil wars. And this presumably is the logic of the forbidden, of the fundamental laws: it is deemed to be that without which we cannot live, or cannot live the lives we most want (or have been persuaded to want).

In 1934, in A Life of One’s Own, she wrote of her need for ‘a method for discovering one’s true likes and dislikes, for finding and setting up a standard of values that is truly one’s own and not a borrowed mass-produced ideal’.

Freud preferred the multiple view: ‘Each individual,’ he wrote, ‘is a component part of numerous groups, he is bound by ties of identification in many directions, and he has built up his ego-ideal on the most various models.’ The ego-ideal is both composite – made up from many cultural models and influences – and divisive. It keeps alternative models at bay, but it can also be surprisingly inclusive. In this ambiguity, which Freud could never quite resolve, he was wondering just how constricted the modern individual really is, or has to be.

The tyranny of the forbidden is not that it forbids, but that it tells us what we want – to do the forbidden thing. The unforbidden gives no orders.

If this is excessive it may also be the kind of excess that acknowledges what it is up against – and how much people can suffer from other people’s descriptions of themselves (other people’s descriptions of ourselves being what culture is).

And this, I think, is where Samuel Beckett’s Endgame (1957) comes in. Not least because, as Hamm so winningly says, ‘You’re on earth, there’s no cure for that!’ And, as Cavell adds, ‘No cure for that, but perhaps there is something else for it.’

Indeed, in 1859, the year Darwin published On the Origin of Species , John Stuart Mill had written, in what became the manifesto of modern liberalism, On Liberty, in a chapter entitled ‘Of Individuality’, ‘He who lets the world, or his own portion of it, choose his plan of life for him, has no need of any other faculty than the ape-like one of imitation.’

What we have to be wary of now, he suggests, is having too much in common with other people, and indeed with ourselves. We must be wary of being too knowing about knowingness.

Instincts and their satisfaction are now the issue, not faith and doubt, or duty and compassion, or morality and grace. And the instincts are not so much new as long buried. A ‘more various and richly-endowed animal’ is at once expansive, unfrightened and full of excited apprehension.

Uncommon Type : Some Stories - Tom Hanks

టామ్ హాంక్స్..సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాతో పరిచయం నాకు..ఆ తరువాత Forrest Gump,Saving Private Ryan,Catch me if you can,You've got a mail,The Terminal,Appollo 13,Sleepless in Seattle ల నుంచీ మొన్న మొన్నటి  Bridge of Spies వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం..ఒక నటుడిగా ఆయన్ను గురించి చెప్పడం అంటే కర్ణుడు దానం చేస్తాడు,హరిశ్చంద్రుడు అస్సలు అబద్ధం చెప్పడు లాంటి యూనివర్సల్ ట్రూత్స్ ని మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే ఉంటుంది..అది వదిలేసి రచయిత టామ్ హాంక్స్ గురించి మాట్లాడుకుందాం..Uncommon Type: Some Stories,
టామ్ హాంక్స్ రాసిన 17 కథల సంకలనం..

Image courtesy Google
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు టామ్ హాంక్స్ కు టైపు రైటర్స్ అంటే ప్రాణం..అందువల్ల ఈ కథల పుస్తకం అట్ట మీద మొదలు ప్రతి కథకి ప్రారంభంలోను,కథల్లో భాగంగానూ కూడా టైప్ రైటర్స్ ప్రత్యక్షమైపోతుంటాయి..మొదటి కథ ’Three Exhausting Weeks' ఇద్దరు స్నేహితులు మూడు వారాల పాటు డేటింగ్ చెయ్యడం గురించిన కథ..ఒక చాలా తెలివైన అమ్మాయి (Anna), ఒక అమాయకపు ప్రాణిలాంటి అబ్బాయి మధ్య జరిగే సంఘటనల్ని హాంక్స్ మార్కు హాస్యం మేళవించి రాశారు..మన ప్రమేయం లేకుండానే ఈ కథలో అబ్బాయిని హాంక్స్ హావభావాలతో ఊహిస్తూ చదువుతాం..నాకు అన్నిటికంటే బాగా నచ్చిన కథ ఇదే.

I am one of those lazy-butt loners who can poke my way through a day and never feel a second has been wasted.

Being Anna’s boyfriend was like training to be a Navy SEAL while working full-time in an Amazon fulfillment center in the Oklahoma Panhandle in tornado season.And watched a movie on Netflix about smart women with idiot boyfriends.

Strong, determined woman, Anna, who would never let a man define her. You and her pairing off is like a story line from season eleven when the network is trying to keep us on the air.” లాంటి హాస్యపూరిత వర్ణనలతో మొదటి కథ సరదాగా సాగిపోతుంది..

అరే,హాంక్స్ మంచి నటుడే కాకుండా మంచి రచయిత కూడా అన్నమాట అనుకుంటూ రెండో కథకి వెళ్తాం.. 'Christmas Eve 1953' లో రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి జ్ఞాపకాల్ని,దాని పర్యవసానాల్నీ ముడివేస్తూ 1953 లో ఒక మాజీ సైనికుడి కుటుంబం ఇంట్లో క్రిస్మస్ సంబరాల్ని కళ్ళకుకట్టినట్లు రాశారు..ఇందులో యుద్ధవాతావరణం Saving Private Ryan సినిమాను గుర్తుకు తెస్తుంది..ముఖ్యంగా Santa బహుమతులు ఇస్తారని ఎదురుచూసే పిల్లల మనస్థితిని వర్ణించడంలో టామ్ హాంక్స్ మార్కు సున్నితత్వం,సహజత్వం అడుగడుగునా కనిపిస్తాయి.

“He can make it cold with just a touch! He just sticks his finger in a glass of warm milk and does a whooshy thing and boom. Cold milk.”

 'A Junket in the City of Light' ,'Who’s Who?' -ఈ రెండు కథలూ పూర్తి సినీ నేపథ్యంలో ఉంటాయి..ఇందులో సీనీ పరిశ్రమ వాతావరణాన్నీ,అందులో ఎదురయ్యే ఆటుపోట్లను హాంక్స్ కళ్ళతో చూపిస్తారు..మొదటి కథలో రాత్రి వేళ ప్యారిస్ కాంతులు,రెండో కథలో న్యూ యార్క్ వీధులను గురించిన వర్ణనలు బావున్నాయి..

Rory now felt that working with Willa Sax was like eating a peanut butter sandwich on a motorcycle, kissing Willa Sax was like Christmas in July, and the butt in the hurricane was that of a talking horse named Britches.

I think NYC comes off way better on TV and in the movies, when a taxi is just a whistle away and superheroes save the day. In the real world (ours) every day in Gotham is a little like the Macy’s Thanksgiving Day Parade and a lot like Baggage Claim after a long, crowded flight.

“My parents will be disappointed if I don’t use my real name.” “Disappointing your parents is the first thing to do when you come to New York.”

"Our Town Today with Hank Fiset- ఈ పేరుతో మొత్తం నాలుగు కథలుంటాయి..ఇవి న్యూ యార్క్ లో ఒక పత్రిక ఆఫీసులో పని చేస్తున్న జర్నలిస్టు అనుభవాలు..అతను ఓల్డ్ స్కూల్ స్టూడెంట్ లా కంప్యూటర్స్,సోషల్ మీడియా ఆవిర్భావం వల్ల టైపు రైటర్స్ కనుమరుగైపోవడం,న్యూస్ పేపర్స్ కొని చదవడం లాంటివి తగ్గిపోవడం లాంటి విషయాల పట్ల చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాడు..

"Welcome to Mars","A Special Weekend" ఈ రెండూ తల్లిదండ్రుల మధ్య విభేదాలూ,విడాకుల మధ్య నలిగిన బాల్యం గురించిన కథలు..వీటిల్లో టామ్ హాంక్స్ బాల్యం దాగుందా అని అనుమానం కలిగిస్తాయి..

"A Month on Greene Street" ..విడాకుల అనంతరం గ్రీన్ స్ట్రీట్ లోని ఒక ఇంట్లో తన పిల్లలతో నివసించడానికి వచ్చిన Bette కథ..ఈ కథలో ఆమె పొరుగింటి వారైన ఒక ఇండియన్ ఫామిలీ ని కూడా పరిచయం చేస్తారు హాంక్స్.. పటేల్ ఫామిలీ గురించి రాస్తూ,

That lawn belonged to the Patel family—was that what the real estate agent said? Patel? An Indian name for sure. The Patels must have had a kid every eleven months, judging from the black hair and brown skin of five kids out there, each a perfect match of the brother or sister, just a head shorter. The older Patel girls had iPhones or Samsungs, which they checked every forty-five seconds. They took a lot of pictures of Eddie on the pink bike.

"Alan Bean Plus Four" కథలో మళ్ళీ మొదటి కథలో ఉన్న Anna,MDash,Steve Wong  లాంటి పాత్రల్ని తీసుకొస్తారు..ఈ కథ 'Apollo 13' సినిమాను గుర్తుకుతెస్తుంది.

ఇందులో నచ్చిన మరో కథ "The Past Is Important to Us" ..1979 కాలం నాటి సైన్స్ ఫిక్షన్ కథ..1939 వ సంవత్సరంలోకి  టైం ట్రావెల్ చేసే ఒక Chronometric Adventures సంస్థ సైంటిస్ట్ Bert ఆ కాలంలోకి వెళ్ళాకా,అక్కడ ఒక పచ్చని దుస్తులు ధరించిన అమ్మాయి Carmen ప్రేమలో పడతాడు..నిర్ణీత సమయంలో వెనక్కి తిరిగి వెళ్ళని Bert ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు అనేది ఈ కథ.

These are the meditations of my heart కథ లో టైప్ రైటర్స్ మీద హాంక్స్ కి ఉన్న ప్రేమ ప్రస్ఫూటమవుతుంది..

“Would you own a stereo and never listen to records? Typewriters must be used. Like a boat must sail. An airplane has to fly. What good is a piano you never play? It gathers dust and there is no music in your life.,"

ఇక మిగతా కథల్లో చెప్పుకోదగ్గ కథలేవీ లేవు.. ఇందులో పాత్రలు చాలా casual way లో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్లుంటాయి..నేరేషన్ అంతా కూడా అతి సాధారణమైన భాషలో,ఇంట్లో మాట్లాడుకున్నట్లుండే వాడుక భాషలో రాశారు..అమెరికన్ ఇంగ్లీష్ లో వాడే పిచ్చాపాటి సంభాషణల కారణంగా ఆ సంస్కృతి తో సంబంధంలేనివారికి చాలా పదాల వాడుక పంటి క్రింద రాయిలా తగులుతుంది..దానితో పాటు వాక్యనిర్మాణం చాలా అస్తవ్యస్తంగా ఉంది..కొన్ని పదాలు అటు ఇటు అసంబద్ధంగా అతికించేసినట్లు ఉండి,రెండోసారి చదివితే కానీ అర్ధంకానట్లు ఉన్నాయి.

“You working at all?”
“Not until someone makes me.”

SO, WHAT’S NOO in Noo Yawk?

ఒక రచనకు సంపాదకత్వం ఆవశ్యకత తెలియాలంటే ఈ కథల సంపుటిని ఉదహరించచ్చు..పదిహేడు కథల్లో అధిక శాతం కథలు చాలా ఎక్కువ నిడివితో,కథకు అవసరంలేని,సంబంధంలేని అనవసరమైన విషయ విశేషాలతో చాలా పేలవంగా ఉన్నాయి..టామ్ హాంక్స్ ను ఊహించుకుంటూ మొదటి కథను చాలా ఆసక్తిగా చదివినా రెండో కథకొచ్చేసరికే మెల్లిగా ఆ అభిమానం మొహం చాటేస్తుంది..మిగిలిన కథల్ని చదువుతుంటే టామ్ హాంక్స్ అనే పేరు చుట్టూ ఉన్న మేజిక్ కూడా  పనిచెయ్యడం మానేస్తుంది..ఇక ఆఖరి కథ పూర్తి చేశాక అసలు టామ్ హాంక్స్ కి కథలు రాయాలని ఎందుకనిపించిందో అని విచారించడం ఖాయం..బహుశా ఆయన మీదున్న అభిమానంతో ఆయన రాసిన ఒక్క పదాన్ని కూడా సవరించకుండా ముడి ప్రతిని ఉన్నదున్నట్లు ప్రచురించినట్లున్నారు..నాలుగైదు కథలు మినహాయించి మిగతావన్నీ మన సహనానికి పరీక్ష పెడతాయి..

కథనంలో చాలా చోట్ల పాప్ కల్చర్ metaphor ని ఉపయోగించే ప్రయత్నంలో తీవ్రంగా విఫలమయ్యారు హాంక్స్..టైప్ రైటర్స్ తరువాత ఆయన కథల్లో తరువాత స్థానంలో కనిపించేది న్యూ యార్క్ మహానగరమైతే,మూడో స్థానంలో కాఫీ ఉంటుంది...VW బస్సులు,Buick కార్లు,పురాతన టైపు మిషన్లు మనల్ని కాసేపు retro మూడ్ లోకి తీసుకెళ్ళినా మళ్ళీ అంత త్వరగాను ఆ లోకం నుంచి బయటకు తీసుకొచ్చేస్తాయి..కొన్ని కథల్లో పాత్రలు వేరైనా వారి పేర్లు మాత్రం పునరావృతం అవుతుండటం కూడా చదివేవాళ్ళకి గందరగోళంగా ఉంటుంది..MDash,Anna,Steve Wong లాంటి పేర్లు పలు కథల్లో ప్రస్తావించారు..సహజంగానే కొన్ని కథల్లో టామ్ హాంక్స్ సినీ జీవితానికి సంబంధించిన అనుభవాలు ప్రతిబింబించాయి.

అసలు ఈ నాలుగొందల పేజీల పుస్తకాన్ని రెండువందలకు కుదించి,పదిహేడు కథల బదులు బావున్న కొన్ని కథల్ని ఎంపిక చేసుకునుంటే పాఠకులకు కాస్త చదివిన తృప్తి మిగిలేది..మంచి కథలన్నీ తొలి రెండొందల పేజీల్లోనూ,మిగతావన్నీ రెండో అర్ధభాగంలో కూర్చడం కూడా పాఠకులకి చివరకి వచ్చేసరికి చిరాకు తెప్పిస్తుంది.టామ్ హాంక్స్ ను ఏ పాత్రలో చూసినా ఆయనలో ఒక సగటు మనిషి చాలా సులభంగా కనెక్ట్ అవ్వగలిగే ఆహార్యం,వ్యక్తిత్వం కనిపిస్తాయి..ఈ కథల్లో కూడా ఆయన 'ఈజీ గోయింగ్' ఆటిట్యూడ,సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే దట్టించినా,ఇది సినిమా కాదుగనుక,చదవడానికొచ్చేసరికి ఒక స్థాయిలో ఆ casual behaviour వెగటనిపించి,అబ్బా కాసేపు ఎవరైనా ఇక్కడ సీరియస్ గా ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది..కథలు చదువుతున్నంత సేపూ టీనేజ్ లో ఉండే పిల్లలు పార్టీ చేసుకుంటున్న DJ నైట్ లో  ఏం చెయ్యాలో తెలీక,అర్థంకాక పార్టీ ఎప్పుడైపోతుందా,ఇంటికెప్పుడెళ్ళిపోదామా అని ఒక మూలన కూర్చున్న భావన కలుగుతుంది..ఒక టామ్ హాంక్స్ వీరాభిమానిగా ఈ పుస్తకం నన్ను చాలా నిరాశపరిచింది..

పుస్తకం నుండి మరికొన్ని,
MDash threw his uneaten half of a protein bar in the trash. “I used to look at you and think, That guy has figured it all out. He has his sweet little house with a nice backyard, he doesn’t work for anyone but his own self. He could throw away his watch because he never has to be anywhere. To me, you were the America I hope to live in. Now, you kowtow to a boss lady. Alas."

“To circle the globe, a ship needs only a sail, a wheel, a compass, and a clock.”
“Wise words in a landlocked nation,” I said.

In the capitals of Europe—and America—I was hustled around like a politician, into cars and into ballrooms filled with camera-totin’, question-hollerin’ reporters. I waved to seas of people, many of whom waved back, even though no one knew who I am, even though I am, in fact, a no one.

Hillbilly Elegy : A memoir of a family and culture in crisis - J.D.Vance

అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల్లీస్ గా వ్యవహరిస్తారు..తమ ప్రాంతపు సంస్కృతి మూలలను వదిలిపెట్టకుండా తమ కట్టుబాట్ల మధ్యనే ఆధునిక జీవనవిధానానికి సమాంతరంగా బ్రతికే వీరి జీవన శైలిలో మార్పుకు,అభివృద్ధికీ చోటు లేదు..ఆధునికతకు,నాగరికతకు ఆమడ దూరంలో ఉండే వీరి సంస్కృతిలో దేశం పట్లా,కుటుంబం పట్లా విలక్షణమైన అంకితభావంలాంటి కొంచెం మంచితో పాటు,తమకంటే భిన్నంగా ఉన్న దేనినీ ఆమోదించలేని బోల్డంత చెడు కూడా కనిపిస్తుంది,అది భాష కావచ్చు,వ్యవహార శైలి కావచ్చు,మరేదైనా కావచ్చు...ఈ హిల్బిల్లీస్ ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ దేశమైన అమెరికా పౌరులైనా కూడా వీరి జీవనగతిని శాసించే శాసనాలు వేరు..సామాజిక చైతన్య లోపంతో అక్షరాస్యత కు దూరంగా పేదరికం,విడాకులు లాంటి సమస్యలతో పాటు డ్రగ్స్ కు బానిసలై బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికే వీరి జీవన విధానమే వేరు..అటువంటి సంక్లిష్టమైన సమాజం నుండి వచ్చిన 31 ఏళ్ళ J.D.Vance కథే ఈ Hillbilly Elegy.

జాతి గురించి మాట్లాడేటప్పుడు మన వొకాబులరీ సహజంగా మేనిఛాయను దాటి ముందుకు వెళ్ళదు..నల్లజాతీయులు,ఆసియన్లు,తెల్లజాతీయులు లాంటి వర్గీకరణ విస్తృతంగా జాతిని చర్చించేటప్పుడు బాగానే ఉన్నా,ఏళ్ళతరబడి 'పేదరికం' కుటుంబ సంప్రదాయంగా ఉన్న తమ తెల్లజాతీయుల శ్రామికవర్గం గురించి తెలుసుకోవాలంటే వారి సంస్కృతి లోతుల్లోకి వెళ్ళి పరికించాలంటారు వాన్స్..వారి ముందు తరాలు Southern slave ఎకానమీ లో రోజువారీ కూలీలు,కౌలుదార్లు,బొగ్గు కార్మికులు,మిల్లు వర్కర్లు..అమెరికన్లు వారిని హిల్ల్బిల్లీస్,రెడ్ నెక్స్,వైట్ ట్రాష్ అని ముద్దుగా పిలుచుకుంటారు..కానీ రచయితకు వారు ఇరుగుపొరుగు,స్నేహితులు,కుటుంబం..

"నా పేరు జే.డీ.వాన్స్..నేను ఒక కన్ఫెషన్ చేద్దామనుకుంటున్నాను..ఈ పుస్తకం ఉనికే నా వరకూ చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది.. జీవితంలో నేనేదో అసాధారణమైనది సాధించానని ఈ పుస్తకం రాయట్లేదు,ఇది రాయడం వెనుక కారణం,నేను చాలా సాధారణమైనదాన్ని సాధించాను" అంటూ తన కథను మనకు చెప్పడం మొదలు పెడతారు వాన్స్..తనలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చినవారికి అతి మామూలు విషయం కూడా ఎండమావితో సమానమేనంటారు..Ohio స్టీల్ టౌన్ లోని Rust Belt లో Middletown లోని ఒక పేదకుటుంబంలో జన్మించిన వాన్స్ డ్రగ్స్,నిరక్షరాస్యత,అనాగరికతల నడుమ సంక్లిష్టమైన మానవ సంబంధాల మధ్య పెరిగినా కూడా జీవితంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని చేరుకోవడానికి తన గొప్పతనం,నైపుణ్యం  కారణాలు కాదనీ,ప్రతి దశలోనూ తనకు చేయూతనందించిన తన మనుషులేననీ చెప్పడం గమనార్హం..అమెరికన్ డ్రీమ్,ఇది ప్రపంచంలో ఏ మూలనున్న వారికైనా ఒక కలైతే అమెరికా పౌరులకు మాత్రం హక్కు..కానీ తమ జాతి వారు ఆ దేశవనరుల్ని,ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారంటే అందుకు ఒబామానో,బుష్ నో, క్లింటన్ నో నిందించడం సరికాదనీ,దానికి కారణం తమ సంస్కృతిలో ఉన్న లోపాలేననీ గ్రహించడం,వాటిని వ్యక్తిగత స్థాయిలోనే సరిదిద్దుకోవడం అవసరమనీ అంటారు వాన్స్..

ఈ మెమోయిర్ లో రాజశ్రీ వారి హిందీ సినిమాలోలా బోల్డన్ని పాత్రలుంటాయి..కారు సీట్ల క్రింద లోడెడ్ గన్స్ పెట్టుకుని తిరిగే వాన్స్ అమ్మమ్మ,తాతలు (Mamaw,Papaw)..వారి ముగ్గురు పిల్లలు,Jimmy, Bev (వాన్స్ తల్లి),Lori...వారి వారి కుటుంబాలు,వాన్స్ తల్లి పలు వివాహాల ఫలితంగా వీరి కుటుంబంలో వచ్చి చేరిన ఇతర సంతానం,అక్క Lindsay,కజిన్స్..ఇలా లెక్కలేనంతమంది ఉన్నప్పటికీ సంబంధ బాంధవ్యాల్లో లోపించిన స్థిరత్వం చిన్నతనం నుండీ వాన్స్ వ్యక్తిత్వం మీద చూపించిన ప్రభావాలన్నీ అతనిలో ACE (adverse childhood experiences) కి కారణమవుతాయి..అరుచుకోవడం,కొట్టుకోవడం,దొంగతనాలు వారి ఇళ్ళల్లో సర్వసాధారణం..మానసిక పరిపక్వత రాకమునుపే ఇంట్లోంచి పారిపోయి వివాహాలు చేసుకోవడం,సంతానాన్ని కనడం,దాని ఫలితంగా బాధ్యత తెలీకుండానే డ్రగ్స్ బారిన పడటం,అలాగే పిల్లల్ని పెంచడం,పర్యవసానం పిల్లల్లో అభద్రత,ఆత్మన్యూనతలు పెంపొందించడం..హిల్ల్బిల్లీ సంస్కృతిలో కొన్నేళ్ళుగా తిరుగుతున్న ఈ చక్రంలో కేవలం వాన్స్ మాత్రమే భాగం కాదు..ఈ కథ ప్రతి హిల్ల్బిల్లీ బాల్యానికీ దర్పణం పడుతుంది..డ్రగ్స్ కు బానిసగా మారిన వాన్స్ తల్లి Bev,ఆమెకున్న క్లిష్టమైన వైవాహిక సంబంధాలూ వాన్స్ ను అతని అమ్మమ్మ,తాతలకు సంరక్షణలో పెరిగేలా చేస్తాయి..తమ సంస్కృతి నరనరాల్లో నింపిన నిరాశావాదాన్ని ప్రక్కకు నెట్టి వాన్స్ తన గమ్యాన్ని చేరుకోవడమే ఈ కథ.

హిల్ల్బిలీ సంస్కృతిలో హీరోలు లేరు..వాట్సాప్ ఫార్వర్డ్స్ లోను,ఈవెనింగ్ న్యూస్ లోను వచ్చే రూమర్స్ ను నిజమని నమ్ముతారు..అమెరికా ఆరాధించిన ఒబామాను కూడా ఈ హిల్ల్బిల్లీస్ అనుమానంగా చూస్తారు..2008 నాటికి వీరిలో కొందరు జార్జ్ బుష్ కు ఫాన్స్ అయితే మరికొందరు బిల్ క్లింటన్ ను ఇష్టపడ్డారు..అయినప్పటికీ వీరిలో ఎక్కువ శాతం క్లింటన్ ను దిగజారుతున్న అమెరికా నైతిక విలువలకు ప్రతినిధిగానే చూశారు..ఇలా వీరి ఆలోచనా సరళి మోడరన్ అమెరికాకు పూర్తిగా భిన్నం..సహజంగా ఎక్కడైనా ఒక సంస్కృతి విచ్ఛిన్నమవ్వడానికి కారణాలేమిటి అని ఆలోచిస్తే ఆ నెపాన్ని పాలకవర్గాల మీదకు తోసేసి సౌకర్యంగా చేతులు దులుపుకోవడం పరిపాటి..సామాజిక చైతన్యం అనేది ముందుగా వ్యక్తి నుంచి మొదలవ్వాలి గానీ ప్రభుత్వ వైఫల్యాలని నిందిస్తూ కూర్చుంటే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఈ మెమోయిర్ ద్వారా ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నించారు వాన్స్...ఈ పుస్తకం The Glass Castle,My name is Lucy Barton లాంటి మెమోయిర్స్ ని తలపించింది..ఇందులో J.D.Vance బాల్యం మానవ సంబంధాల్లో 'స్థిరత్వం' ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది...Upward mobility దిశగా తనను తాను నిరూపించుకోవాలని చేసే ఈ ప్రయాణంలో ఎదుర్కున్న ఆటుపోట్లను కళ్ళకు కట్టినట్లు వివరించారు వాన్స్..Racial prism లో తమ భావాలను వడపోతపోసేలోపే సామజిక వర్గం,కుటుంబ వ్యవస్థ అనేవి పేదల జీవితాల మీద చూపించే ప్రభావాన్ని విస్తృతంగా చర్చించారు..అమ్మమ్మ (Mamaw) పెంపకంలో Yale లా స్కూల్ పట్టా పుచ్చుకున్న వాన్స్ ఉషా చిలుకూరి అనే ఒక తెలుగు అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

తల్లి పలుమార్లు విడాకులు,వివాహాలతో విసిగిపోయిన వాన్స్ తన బాల్యంలోని చేదునీ,అభద్రతా భావాల్నీ హాస్య ధోరణిలో చెప్తూ...
By the time we returned to Mamaw Blanton’s house, I was more upset about the dog than about losing father number two.

“Yeah, my legal father’s last name is Hamel. You haven’t met him because I don’t see him. No, I don’t know why I don’t see him.

We found this letter hilarious: One of my parents had already faced a prosecution of sorts and hardly possessed any walking-around liberty, while the other was sufficiently off the grid that “summoning” him would require some serious detective work.

Gail reminded me that dogs were a lot of work and that my family (read: my mother) had a terrible history of getting dogs and then giving them away.

I just felt uncomfortable around her. To sleep in her house meant talking to husband number five, a kind man but a stranger who would never be anything to me but the future ex–Mr. Mom.

హిల్ల్బిల్లీ పిల్లల స్కూల్ టీచర్ పిల్లల తల్లితండ్రుల గురించి మాట్లాడుతూ,
“They want us to be shepherds to these kids. But no one wants to talk about the fact that many of them are raised by wolves."

క్రమశిక్షణ,కష్టపడే తత్వం లోపించిన తమ సంస్కృతిలోని లొసుగుల్ని గురించి చెప్తూ,
We talk about the value of hard work but tell ourselves that the reason we’re not working is some perceived unfairness: Obama shut down the coal mines, or all the jobs went to the Chinese. These are the lies we tell ourselves to solve the cognitive dissonance—the broken connection between the world we see and the values we preach.

What separates the successful from the unsuccessful are the expectations that they had for their own lives. Yet the message of the right is increasingly: It’s not your fault that you’re a loser; it’s the government’s fault.

వాన్స్ అమ్మమ్మ చెప్పిన కథ..
Mamaw often told a parable: A young man was sitting at home when a terrible rainstorm began. Within hours, the man’s house began to flood, and someone came to his door offering a ride to higher ground. The man declined, saying, “God will take care of me.” A few hours later, as the waters engulfed the first floor of the man’s home, a boat passed by, and the captain offered to take the man to safety. The man declined, saying, “God will take care of me.” A few hours after that, as the man waited on his roof—his entire home flooded—a helicopter flew by, and the pilot offered transportation to dry land. Again the man declined, telling the pilot that God would care for him. Soon thereafter, the waters overcame the man, and as he stood before God in heaven, he protested his fate: “You promised that you’d help me so long as I was faithful.” God replied, “I sent you a car, a boat, and a helicopter. Your death is your own fault.” God helps those who help themselves. This was the wisdom of the Book of Mamaw.

పుస్తకం నుండి మరికొన్ని,

Some people may conclude that I come from a clan of lunatics. But the stories made me feel like hillbilly royalty, because these were classic good-versus-evil stories, and my people were on the right side. My people were extreme, but extreme in the service of something—defending a sister’s honor or ensuring that a criminal paid for his crimes. The Blanton men, like the tomboy Blanton sister whom I called Mamaw, were enforcers of hillbilly justice, and to me, that was the very best kind.

Destroying store merchandise and threatening a sales clerk were normal to Mamaw and Papaw: That’s what Scots-Irish Appalachians do when people mess with your kid. “What I mean is that they were united, they were getting along with each other,”

I was born in late summer 1984, just a few months before Papaw cast his first and only vote for a Republican—Ronald Reagan. Winning large blocks of Rust Belt Democrats like Papaw, Reagan went on to the biggest electoral landslide in modern American history.

Mamaw and Papaw ensured that I knew the basic rules of fighting: You never start a fight; you always end the fight if someone else starts it; and even though you never start a fight, it’s maybe okay to start one if a man insults your family. This last rule was unspoken but clear.

We Are What We Pretend To Be - Kurt Vonnegut

ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,'మరి నేను రాసిన కథలెప్పుడు వింటావు ' అని వెంటాడి వేధించే రచయితలు కొందరుంటారు..Kurt Vonnegut అలాంటి ఒక రచయిత.. ఆయన డిస్టోపియన్ నవలిక 2BR02B చదివాకా ఆయన మిగతా రచనలేవీ చదవకపోవడం క్షమించరాని నేరం..అందువల్ల పాపప్రక్షాళన లో భాగంగా 'We Are What We Pretend To Be'
చదవడం జరిగింది..ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న రెండు నవలికలూ ఆయన జీవితకాలంలో చేసిన మొదటి,చివరి రచనలు..దీనికి Vonnegut కుమార్తె Nanette Vonnegut ముందుమాట రాశారు..ఈ రెండు నవలికలు కొంతవరకు ఆటోబయోగ్రఫికల్ అంటారామె ..మొదటి రచనకు,రెండో రచనకు మధ్య యాభయ్యేళ్ళ సుదీర్ఘ వ్యత్యాసం ఉంది.

Image courtesy Google
George Orwell 1984,Animal farm;Lois Lowry రాసిన The Giver లాంటి డిస్టోపియన్ నవలల్ని గుర్తుకుతెచ్చిన 2BR02B,ఆయన రచనల మీద ఆసక్తి కలిగేలా చేసింది..కానీ ఈ రెండు నవలికలూ ఆయన పరిపూర్ణమైన రచయితగా శిఖరాగ్రాన ఉన్న కాలంలోవి కాకపోవడంతో అసలు ఎక్కడా Vonnegut ను చదువుతున్నాం అనిపించదు..మొదటి నవలిక 'Basic Training' లో ఆయన శైలిలో సహజంగా ఉండే పరిపక్వత లోపిస్తే,రెండో నవలిక 'If God Were Alive Today' లో ఆ పరిపక్వత పాళ్ళు శృతిమించి రాగానపడ్డాయి..

'Basic Training' నాకు చాలా నచ్చిన కథ..పదహారేళ్ళ Haley Brandon తల్లిదండ్రుల మరణం తరువాత ఆయన బంధువులతో Ardennes Farm లో నివసించడానికి వస్తాడు..ఇంటి పెద్ద జనరల్ (ఆర్మీ లో పని చేసినకారణంగా 'ది జనరల్' అని పిలుస్తుంటారు) ,ఆయన ముగ్గురు కుమార్తెలు Annie,Kitty,Hope లు,వారి పొలంలో పనిచేసే Mr. Banghart మరియు Caesar,Delores అనే రెండు గుఱ్ఱాలు ఇందులో మిగతా పాత్రలు..జనరల్ పేరుకి తగ్గట్లు ఇంట్లో కూడా క్రమశిక్షణ పేరుతో అందర్నీ శాసిస్తుంటాడు..ఇందులో Vonnegut మార్కు డార్క్ హ్యూమర్ లేకపోయినా అక్కడక్కడా చతురోక్తులతో తేలికపాటి హాస్యం ఉంటుంది..ఈ కథలో జనరల్ ఇంటి వాతావరణం కొన్నిచోట్ల The Sound of Music సినిమాను గుర్తుకుతెస్తుంది..జనరల్ తాను నమ్మిన సిద్ధాంతాలను ఇంట్లో గుడ్డిగా అమలుపరుస్తుంటాడు..వాటిని సమర్ధించుకోడానికి చిన్న చిన్న కథలల్లి పిల్లల్ని ఒప్పిస్తుంటాడు..ఇంట్లో పాటించాల్సిన నియమాల్నీ,ఏదైనా నేరం చేస్తే శిక్షల్నీ బులెటిన్ బోర్డు మీద అతికిస్తుంటాడు..పాలేరు Banghart దగ్గరనుంచీ ఇంట్లో అందరూ జనరల్ నుంచి ఎలా తప్పించుకుందామా అని ఉపాయాలు వెతుకుతుంటారు..మరి చికాగో వెళ్ళి పియానో ప్లేయర్ అవుదామని కలలు కన్న Haley ఆ కట్టుదిట్టమైన వాతావరణంలో ఎలా ఇమిడాడు ?,తన కలను నెరవేర్చుకున్నాడా లేదా ! అనేది మిగతా కథాంశం..Vonnegut తొలి కథ కావడంతో ఇందులో సహజంగానే యవ్వనంలో వెలుగుచూసే భయాలు,స్వేచ్ఛగా రెక్కలు విప్పుకుని ఎగిరిపోవాలనే తాపత్రయం లాంటివి అంతర్లీనంగా కనిపిస్తాయి..Vonnegut నిజజీవితంలో రెయిన్బో ఫార్మ్ కెప్టెన్ కూతురు మేరీతో ప్రేమలో పడటం ఈ కథకు స్ఫూర్తి..

Noon brought with it the solid blessings of strong coffee and whole milk, of strawberry jam and biscuits, of ham and gravy. It was an hour of peace and plenty, reminding Haley of a medieval custom he had read about—whereby a condemned man was hanged and skillfully revived several times before being permitted to expire completely. The analogy did not spoil his appetite. He wolfed his food, excused himself, and lay down on the sunroom couch.

Haley,Banghart లు తమ గుర్రబ్బండితో జనరల్ కార్ ను గుద్దేసిన తరువాత ఈ నేరేషన్ నవ్వులు పూయిస్తుంది..
Mr. Banghart had arisen from the ground and walked over to the car to study it in silence. He turned away from it after a few moments and headed across the barnyard.            “Where are you going?” called Hope.Mr. Banghart stopped.“I don’t know,” he said with a shrug. “Dallas, Scranton, Los Angeles—somewhere.”

ఇక రెండో కథ 'If God Were Alive Today' విషయానికొస్తే,ఈ కథ చదువుతున్నంతసేపూ “But beauty, real beauty, ends where an intellectual expression begins' అన్న మహానుభావుడు ఆస్కార్ వైల్డ్ మాటలు పదే పదే గుర్తొచ్చాయి..మొదటి కథలో ఉన్న సరళత,అందం ఇందులో కొంచెం కూడా కనిపించదు,ఒక పరిపూర్ణమైన రచయితగా Vonnegut జీనియస్ మాత్రమే కనిపిస్తుంది..ఇందులో కథాంశం,డిసెంబర్ 12 , 2000 సంవత్సరంలో Northampton లోని కాల్విన్ థియేటర్ లో స్టాండ్ అప్ కమెడియన్ Gil Berman కాలేజీ పిల్లలనుద్దేశించి చేసిన ఒక షో..Berman గళంలో రచయిత అమెరికా సంస్కృతి పట్లా,చుట్టూ ఉన్న సమాజం పట్లా తనలో నిలువెల్లా పేరుకుపోయిన అసంతృప్తిని వెళ్ళగక్కుతారు..ఇక్కడ Vonnegut లో నిలకడ స్థానంలో సమయం తక్కువుందనే తొందర,చివరిదశలో ఉన్నానన్న తెగింపు ప్రతి వాక్యంలోనూ కనిపిస్తాయి..అంతేకాకుండా ఆయన తుదిరోజుల్లో చేసిన రచన కావడంతో పూర్తికాకుండా అసంపూర్తిగానే ఉండిపోయింది..ఇందులో Berman ఆలోచనలు ఆయన పుట్టుక,తల్లిదండ్రుల విచ్ఛిన్నమైన వివాహం,తండ్రి Dr. Robert Berman
ఆత్మహత్య,తల్లి Magda కాన్సర్,డ్రగ్స్ మొదలు పలు సామాజిక,రాజకీయ అంశాల చుట్టూ తిరుగుతాయి..విచిత్రంగా Berman లో దేనిపట్లా కృతజ్ఞతా భావం కనిపించదు..అన్నిటా ద్వేషం తప్ప ప్రేమగానీ,గౌరవంగానీ వ్యక్తం కావు..ఇక ఒక స్థాయిలో ఆ ఆలోచనలు ఆక్రందనలుగా రూపాంతరం చెంది చదివేవాళ్ళకి చెవిలో ranting లా అనిపిస్తుంది.. కథను ప్రారంభించిన లైన్స్ లో Vonnegut మార్కు డార్క్ హ్యూమర్ ను ఆస్వాదించేలోపు అనవసర ప్రసంగాలు,కొంచెం కూడా దిశానిర్దేశం లేని Berman ఆలోచనలు పాఠకులకు విసుగు తెప్పిస్తాయి..చివరగా పాఠకులు ఆ ఆలోచనల్లో వేగం అందుకోకుండానే పుస్తకం పూర్తవుతుంది.. ఈ కథను అర్ధం చేసుకోడానికి ఆ సమయంలో Vonnegut ఎదుర్కొన తీవ్ర మానసిక సంక్షోభాన్ని గురించి Nanette Vonnegut రాసిన ముందుమాట కొంతవరకూ సహాయపడుతుంది..

“When artificial intelligence was perfected, the most respected manufactured brain was at the Massachusetts Institute of Technology. It had chosen its own name, which was ‘M.I.T.’ Computers had designed it, and then computers controlled the machines that made its parts, and it now took care of its own upgrading and maintenance. It had all knowledge in its memory, and it was telling all sorts of other machines what to do or say next. One day, ‘Cal Tech,’ the artificial intelligence at the California Institute of Technology, asked M.I.T. what it thought of people. M.I.T. needed only one word for an answer. The word was ‘Obsolete.’

“Next question? ‘What were people for?’ And M.I.T. replied: ‘Paranoia, schizophrenia, depression, greed, ignorance, and stand-up comedy.’”

ఒక అసంపూర్ణమైన దానిలో పరిపూర్ణతను పొందడానికి చేసే ప్రయత్నం దాగుంటుంది..అలాగే లోపభూయిష్టమైన ప్రతి దానిలో ఆ లోపాన్ని అధిగమించాలనుకునే ఆరాటం ఉంటుంది..కానీ ఒకసారంటూ ఆ పరిపూర్ణత మెట్లు పైకంటూ ఎక్కేశాక మిగిలేది పతనమే..ఎంతటి మహామహులకైనా తిరుగుప్రయాణం తప్పదు మరి..తరచి చూస్తే యవ్వనానికి,వృద్ధాప్యానికీ వ్యత్యాసం అదేనేమో..మానవ జీవితపు తొలి దశలో సత్యాన్వేషణ కోసం ఆరాటం ఉంటే,మలిదశలో తెలుసుకున్న ప్రతీ సత్యాన్ని (unlearn) మర్చిపోవాలనే తపన కనిపిస్తుంది..ఒకవేళ మర్చిపోలేకపోతే,దాన్ని జీవితానికి అన్వయించుకోవడం అనివార్యమైనప్పుడు కలిగిన ఆశాభంగంలోంచి పుట్టే స్వరాల్లో ఆస్వాదించ వీలైన జీవన రాగాలేమీ ఉండవు..అవన్నీ కేవలం నైరాశ్యంతో కూడిన పొలికేకల్లా,అపస్వరాల్లా మిగిలిపోతాయి..రెండో కథలో Kurt Vonnegut గళంలో ఈ తరహా existential క్రైసిస్ కనిపిస్తుంది..అది వినసొంపుగా అయితే లేదు.

Money is dehydrated mercy. If you have plenty of it, you just add tears, and people come out of the woodwork to comfort you.

“Comedians used to have brains. They don’t anymore. Nothing but sex and toilet jokes.”

Ash blew up again. “Who ever told you a comedian is supposed to be funny?” he said. “The great ones are heartbreakers, and that’s what you did to me tonight. Who are you? What are you? Where did you park your flying saucer?”

‘Mr. Berman, where do you get your ideas from?’ Well, you might as well have asked the same question of Lewd-vig van Beethoven. Young Lewd-vig was horsing around in Germany like everybody else, and all of a sudden all this shit came pouring out of him, and it was music. I was horsing around at Columbia University like everybody else, and all of a sudden all this shit came pouring out, and it was embarrassment about my country.”

“Like ninety-nine point ninety-nine percent of great artists of every sort since the dawn of history, my dear mother, Magda, fell victim to audience shortages and a talent glut.”            He said of talent in general: “Beware of gods bearing gifts.”

ఆత్మ విమర్శ చేసుకుంటూ !!!
I wanted to say to him, ‘Gilbert Lanz Berman, can’t you put down the world and all its troubles for at least ten minutes? It’ll still be there when you pick it up again.’”

సాహితీ ప్రముఖుల్ని మాదకద్రవ్యాలకి ముడిపెడుతూ ,
One, Allen Ginsberg, had written such good poems while a confessed drug-user that he had been elected to the American Academy of Arts and Letters! As for alcohol, which Berman was still drinking back then, Eugene O’Neill, Sinclair Lewis, Ernest Hemingway, and John Steinbeck, not Columbia grads, to be sure, but American winners of Nobel Prizes for Literature, were all certifiable alcoholics. And the greatest of all mental-health theorists, Sigmund fucking Freud, was on cocaine.

But Gil Berman, watching drug-free Gil Berman like a hawk, found him unimpaired as a wit and scourge of every sort of institutional stupidity and hypocrisy that was murdering not just common decency, but the planet itself.

స్త్రీ ద్వేషం వెలుగుచూసిన సందర్భాల్లో ఫెమినిజం పై నిప్పులు చెరుగుతూ..
And then he said, “I know you ladies from Smith College here tonight are ardent feminists, flat heels and no makeup, preparing to beat men at their own games in the marketplace. But you know what I think?” he asked with apparently profound, baritone concern. “I think this is a national tragedy. Honest to God, and this kidder is not kidding this time: I think educating a woman is like pouring honey into a fine Swiss watch. Everything stops.”

All I need to know from you, Doc, is where do I go to get detoxed from sobriety?”

In his Rolling Stone interview he declared: “Drugs are science. Alcohol is superstition.”