Monday, March 26, 2018

Family Happiness - Leo Tolstoy

మేము ప్రకృతితో సహజీవనం చేసిన కాలంలో,ఎంతో కాలం నుంచీ చూద్దామనుకుని ఎట్టకేలకు చూసిన ఒక సినిమా 'In to the wild'..మొదటి నుంచీ చివరి వరకు ఒక రకమైన ఉద్వేగంతో చూసిన ఈ సినిమాలో,జనారణ్యానికి దూరంగా,ఒంటరిగా క్రిస్ తన మేజిక్ బస్ లో టాల్స్టాయ్ రాసిన 'ఫామిలీ హ్యాపీనెస్' అనే పుస్తకంలోని ఈ వాక్యాల్ని పైకి చదువుకుంటాడు..ఆ సీన్ రెండు మూడు సార్లు రిపీట్ చేసి చూశాము..అప్పట్లో ఆ మాటలు క్రిస్ నోటినుండి వింటే ఏదో కవిత్వం వింటున్నట్లనిపించింది..

“A quiet secluded life in the country, with the possibility of being useful to people to whom it is easy to do good, and who are not accustomed to have it done to them; then work which one hopes may be of some use; then rest, nature, books, music, love for one's neighbor — such is my idea of happiness.”

Image courtesy Google
ఒక ప్రపంచ ప్రఖ్యాత రచయిత తన దృష్టిలో 'సంతోషాన్ని' నిర్వచించిన వాక్యాలు ఇవి..కేవలం చెప్పడమే కాకుండా తన ఆలోచనల్ని ఆచరణలో కూడా పెట్టిన వ్యక్తి టాల్స్టాయ్..1859 లో రాసిన 'ఫ్యామిలీ హ్యాపీనెస్' అనే ఈ నవలిక,పదిహేడేళ్ళ మార్యా (Marya Alexandrovna/Masha ) కథ..కథ మొదలయ్యే సమయానికి మార్యా తల్లిని కూడా పోగొట్టుకుని చెల్లెలు సోన్యా,గవర్నెస్ కాత్యాలతో కలిసి Pokrovskoye ఎస్టేటులో నివసిస్తూ ఉంటుంది..తల్లి మరణం తాలూకూ వైరాగ్యం కారణంగా జీవితం పట్ల ఆశావహ దృక్పథం లోపించిన మార్యాలో క్రమేపీ నిరాసక్తత చోటుచేసుకుంటుంది..అదే సమయంలో గతించిన తండ్రికి స్నేహితుడైన (తండ్రి కంటే వయసులో చిన్న వాడు) 36 ఏళ్ళ Sergey Mikhaylych రాక మార్యాకు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తుంది..చిన్నతనం నుండీ ఎరిగిన సెర్జీతో మార్యా తొందరగానే ప్రేమలో పడుతుంది..కానీ ఇద్దరి మధ్యా ఉన్న వయోభేదం వారిని త్వరగా బయటపడనివ్వదు..ఆ సమయంలో సెర్జీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన మార్యాని చూస్తే 'బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది' అంటూ యువతిలో తొలి యవ్వనపు పొంగుని వర్ణిస్తూ యద్దనపూడి రాసిన పదాలు జ్ఞాపకం వచ్చాయి..సెర్జీ,మార్యాల ప్రేమ కథ చదువుతున్న అనేక సందర్భాల్లో నాకు తెలీకుండానే ఆ పదహారేళ్ళ వయసుకి వెళ్ళిపోయాను..ఏదేమైనా కొన్ని నిద్రలేని రాత్రులూ,మరి కొన్ని అందమైన కలయికల మధ్య వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది..

ఆ ప్రేమ భావన ఎక్కడ వదిలిపోతుందోనని మిగతా కథ చదవబుద్ధి కాలేదు..పుస్తకం ప్రక్కన పెట్టేసి ఒకరోజు చదవలేదు..ఈ కథ ఇక్కడితో ఆపేస్తే ఎంత బావుంటుంది అనిపించింది..మరి జేన్ ఆస్టిన్ కాదు కదా,టాల్స్టాయ్ ఇక్కడ.. కలలు కన్నది చాలు,కాసేపు నిజాలు కూడా మాట్లాడుకుందాం పదమంటారు.. అయిష్టంగానే ఆయన్ని అనుసరించాను..మరొక్కసారి తృప్తిగా రెండో సారి మొదట్నుంచీ చదివాకా అప్పుడు మిగతా కథ చదివాను..అంత అద్భుతమైన ప్రేమకథా అతి మాములుగా ముగుస్తుంది..ఆస్కార్ వైల్డ్ అంటారు 'They spoil every romance by trying to make it last forever.' అని..అలాగే మాములుగా సెర్జీ,మార్యాలకు పెళ్ళైపోతుంది..ఇద్దరు పిల్లలు..కానీ కాలం నేనున్నానంటూ వారి మధ్య అనుకోని అగాథం సృష్టిస్తుంది..సెర్జీ పల్లెజీవితంలోని స్థిరత్వం కోరుకుంటే,మార్యా పట్టణాల్లోని హంగూ ఆర్భాటాలవైపు పరుగులు తీస్తుంది..అలజడి చేసే మనసుతో,అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న  స్వేచ్ఛతో ఎగిరిపోవాలనే యవ్వనపు ప్రవాహానికి అడ్డు కట్ట వెయ్యలేని మార్యా సెయింట్ పీటర్స్బర్గ్ తళుకుబెళుకుల సమాజం మత్తులో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.. కానీ తన తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చిన మార్యా,సెర్జీ ప్రేమలో (సెర్జీలో ?) వచ్చిన మార్పుల్ని భరించలేకపోతుంది..మరి వారి ప్రేమ మళ్ళీ మునుపటి రూపాన్ని సంతరించుకుందా లేదా అనేది వారి కథకు ముగింపు..

జేన్ ఆస్టిన్ ఎలిజబెత్ గురించీ,ఎలిజబెత్ గాస్కెల్ మిస్ హేల్ గురించీ,బ్రాంట్ మిస్ అయిర్ గురించీ రాయడంలో వింతేమీ లేదుగానీ..స్త్రీ తత్వాన్ని మనసుకి హత్తుకునే విధంగా మలచడం ఒక పురుషుడికి అంత సులభమేమీ కాదు..అదే ఈ కథలో మరో ప్రత్యేకత..శరత్,టాగోర్ లాంటి  వారి తరహాలో ఈ కథంతా మార్యా దృష్టికోణం నుంచి చెప్పారు టాల్స్టాయ్..ఒకరకంగా మార్యా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు..

జీవితంలో కొన్ని అపురూప క్షణాలు ఒక్కోసారి మనకు తెలీకుండానే పలుకరించి వెళ్ళిపోతుంటాయి..తరువాతెప్పుడో వాటి ఉనికిని గూర్చిన స్పృహ కలిగినప్పుడు మార్పుని నిరంతరం ఆలింగనం చేసుకోవాలనీ,ఆ క్షణాల్ని పూర్తిగా జీవించాననీ తెలిసిన మనసుని ఎంత మభ్య పెట్టుకున్నా,దాటిపోయిన క్షణాల్లోని తియ్యదనం గుర్తొచ్చి మనసు చేదుగా అయిపోతుంటుంది..అందులోనూ అవధుల్లేని ఆనందాన్ని ఒకసారి చవిచూసిన మనసు ఇంకా ఇంకా కావాలనే ఆరాటపడుతుంది తప్ప ఆనందంలో నిశ్చలత్వాన్నీ,పరిమితుల్నీ అంగీకరించదు..మార్యా అదే ఆనందాన్ని మళ్ళీ కోరుకోవడం ఒకరకంగా అత్యాశే..

ప్రకృతితో మమేకమై జీవించడం ఒక్కసారి రుచి చూసిన తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే అసహజత్వాన్ని అంగీకరించడం కష్టం..ఈ అనుభవాలన్నీ కాచి వడపోసిన సెర్జీ మనకి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపిస్తాడు..ప్రేమతో సహా కాలగతికి తలవంచనిదేదీ ఉండదని ఈ కథ మరోసారి రుజువు చేస్తుంది..మారే కాలంతో పాటు మనుషులూ,వారి మనస్తత్వాలూ,వాటితో  పాటు సంతోషం,దుఖ్ఖము,ప్రేమ,మానవ సంబంధాలూ ఇలాంటివన్నీ జీవితంలోని ఒక్కో దశలో,ఒక్కో విధంగా రూపాంతరం చెందుతాయి..ఆ మార్పుని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని,ఆనందాన్ని మూటగట్టుకున్న క్షణాల్ని స్మృతిపథంలో జాగ్రత్తగా పొదివిపట్టుకుని ముందుకెళ్ళమని హితవు చెప్తుందీ నవలిక..
ఇది చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన Charlotte Bronte రాసిన 'Jane Eyre',యాష్ చోప్రా లమ్హే సినిమాలు గుర్తుకొచ్చాయి..నాలాగే మీక్కూడా ప్రేమ కథలు ఇష్టమా ? అయితే తప్పకుండా చదవండి :)

మార్యా అంతరంగం..
“I wanted movement and not a calm course of existence. I wanted excitement and the chance to sacrifice myself for my love. I felt it in myself a superabundance of energy which found no outlet in our quiet life.”

సెర్జీ దృష్టిలో స్త్రీ ...
“I can't praise a young lady who is alive only when people are admiring her, but as soon as she is left alone, collapses and finds nothing to her taste--one who is all for show and has no resources in herself”

Thursday, March 22, 2018

The Book of Sand - Jorge Luis Borges

క్రిందటి సంవత్సరం చదివిన జాన్ బెర్జర్ పుస్తకం 'ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పికాసో' చిత్రలేఖనాన్ని నాకు సరికొత్త ప్లేన్ లో పరిచయం చేసింది..అందులో పికాసో లాంటి చిత్రకారులు కొందరు ఆద్యులుగా ఉండి,వృద్ధి చేసిన 'క్యూబిజం' అనే శైలిని గురించి వివరిస్తారు..అధికశాతం చిత్రకారులు సహజంగా రెండు లేదా మూడు డైమెన్షన్స్ లో వేసే చిత్రాలకు సరికొత్త నాలుగో డైమెన్షన్ ని పరిచయం చేసింది ఈ క్యూబిజం..ఒకే వస్తువుని మూడు కంటే ఎక్కువ డైమెన్షన్స్ లో చూపగలగడం ఈ శైలి ప్రత్యేకత అన్నమాట..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావూ అంటే,అందులో క్యూబిజానికీ,జార్జ్ లూయిస్ బోర్హెస్ కలానికీ చాలా పొంతనలుండడమే కారణం..కథానిర్మాణంలో అధికశాతం రచయితలు ఒక సంఘటనని రెండు,మూడు కోణాల్లో చూస్తే,బోర్హెస్ కలం అదే సంఘటనని అనంతమైన కోణాల్లో పరిశీలించి,పరిశోధిస్తుంది..ఈ పరిశీలన ఆధారంగా ఒకే కోణంలో కథలు రాసేవాళ్ళు ఒక మోస్తరు రచయితలనుకుంటే,బోర్హెస్ ఉన్నత స్థాయికి చెందిన రచయిత అని ఘంటాపథంగా చెప్పొచ్చు..
Image Courtesy Google
సృష్టిలో రహస్యమైనదేదైనా సహజంగానే మనిషిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది..అర్ధంకానివీ,అందుబాటులో లేనివీ మనిషిలో వాటిని అందుకోవాలని కోరికని కలిగిస్తాయి..బోర్హెస్ అలాంటి ఒక రహస్యం..ఆ రహస్యాన్ని ఛేదించే కొద్దీ కొత్త కొత్త విషయాలు బహిర్గతమవుతాయి..మా చిన్నప్పుడు పిల్లల్నందర్నీ ఒక అద్దాల మందిరానికి తీసుకెళ్ళారు..మా చుట్టూ అన్నివైపులా,తలెత్తి చూస్తే పై భాగంలో,ఎటువైపు చూసినా కుంభాకార,పుటాకార దర్పణాలు,మరి కొన్ని మాములు అద్దాలతో నిండి ఉన్న ఆ గదిలో ఎక్కడ చూసినా మన ప్రతిబింబమే కనిపిస్తుంది..బోర్హెస్ శైలి అటువంటి ఒక అద్దాల గది..ఇక్కడ కొన్ని విషయాలు :
*ఒక దర్పణంలో ఒకలా కనిపించిన మన రూపం,మరో దర్పణంలో రూపాంతరం చెందుతుంది..కానీ ఇక్కడ 'వస్తువు' ఒకటే.. 
*అలాగే మనం మన దృష్టిని కేవలం ఒకటి లేదా రెండు దర్పణాల్లో ప్రతిబింబంపై నిలిపితే,మిగతా ప్రతిబింబాలు మన దృష్టిని దాటిపోయే అవకాశం మెండు..
*ఒక దర్పణంలో చూసిన రూపం మరో దర్పణంలో (ఇక్కడ కాలం అనుకోవచ్చు) మరో విధంగా కనిపిస్తుంది..
ఈ అంశాలు బోర్హెస్ కథల్లో సంక్లిష్టతకు కారణాలు..కానీ ఆ సంక్లిష్టతే ఈ కథల్ని మిగతా కథల నుండి వేరుగా నిలబెడుతుంది..అందువల్ల బోర్హెస్ కథలు ఒకసారి చదివితే అర్ధం అయ్యేవి కాదు..ఓకే కథని రెండు మూడు సార్లు చదివినప్పుడు కొత్త అర్ధాలు స్ఫూరిస్తాయి..(ఈ 'స్ఫూ' దీర్ఘం పోవడం లేదు క్షమించాలి)

ఈ విషయాన్ని ఒక కథలో ఆయన కూడా ప్రస్తావిస్తారు..Besides, rereading, not reading, is what counts.

బోర్హెస్ కు తన శైలి మీద,పాఠకుల అజ్ఞానం మీద ఎంత నమ్మకమంటే,"నా రాతలు అందరికోసమో/కొందరికోసమో కాదు" అని హెచ్చరించే మనల్ని ఈ కథలు చదవడానికి ఆహ్వానిస్తారు..ఆయన రెండు మూడు చోట్ల ఉపయోగించిన 'demagogue' అనే పదం భలే నచ్చింది నాకు :) 

I do not write for a select minority, which means nothing to me, nor for that adulated platonic entity known as ‘The Masses’. Both abstractions, so dear to the demagogue, I disbelieve in. I write for myself and for my friends, and I write to ease the passing of time. 

కానీ "మా కోసమే మేము రాసుకుంటాము" అనే చాలా మంది రచయితలు,విషయానికొచ్చే సరికి పాఠకుల అభిరుచి మేరకు రాజీపడే సందర్భాలే అధికం..కానీ బోర్హెస్ కథల్లో ఆ రాజీతత్వం మచ్చుకి కూడా కనపడదు..మన కళ్ళకు కనిపించాలని,ఆయన తన కాల్పనిక ప్రపంచాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నమేదీ చెయ్యరు,ఆయన విస్తృతమైన ప్రపంచాన్ని ఆయన కళ్ళతోనే చూడమంటారు..పరిధుల్లేని ఆ ప్రపంచపు వైశాల్యం కొలవడం కష్టం..మరో విషయం ఏంటంటే ఇందులో బోర్హెస్ శైలి,ఒక పసిపిల్లవాడు ఆటలో భాగంగా ఒక మెట్టుమీంచి దూకి మరో మెట్టు మీదికి దూకినంత సులభంగా ఒక ఉపరితలంలోనుంచి మరో ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది..కానీ ఆ వేగంతో మనమాయన్ని అనుసరించగలమా అనేది అనుమానమే..బోర్హెస్ కథలు కొంత స్వప్నం,మరికొంత వాస్తవం..కానీ ఎంత జాగరూకతతో ఉన్నా,ఎప్పుడు మెలకువగా ఉన్నామో,ఎప్పుడు స్వప్నావస్థలో ఉన్నామో గుర్తించడం చదివేవాళ్ళకి చాలా కష్టం..ఒక కథలో ఆర్ట్ ని 'కామన్ మాన్' కి అందుబాటులో లేకుండా రక్షించడానికి కట్టుదిట్టమైన metaphors ని వాడానని ఒక కవి చేత చెప్పించిన బోర్హెస్ లో ఒక ఆర్టిస్ట్ కి తన కళ పట్ల ఉండే నిజాయితీ కూడిన స్వాధీనతా భావం (possessiveness),మరికాస్త కళాకారుడికి అలంకారప్రాయంగా ఉండే అహం ధ్వనిస్తుంది.. 

ఇందులో మొత్తం 13 కథలున్నాయి..కొన్ని కథలు కల్పితాలు కాగా,మరి కొన్ని కథలు బోర్హెస్ నిజ జీవిత అనుభవాల్లోంచి పుట్టినవి..ఇందులో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మొదటి కథ 'The Other'.. ఇందులో డెబ్భై తొమ్మిదేళ్ళ బోర్హెస్-ఇరవయ్యేళ్ళ బోర్హెస్ ను ఒక నదీ తీరంలో కలుసుకుంటాడు.."నువ్వూ నేనూ ఒకటే" అంటూ వృద్ధుడైన బోర్హెస్ తనను తాను పరిచయం చేసుకుంటారు..ఆ ఇద్దరిలో ఎవరిది కలో,ఎవరిది నిజమో అర్ధంకాని సందిగ్ధం ఏర్పడుతుంది..చివరిగా డెబ్బయ్యేళ్ళ బోర్హెస్ తాను మెలకువగా ఉన్నాననీ,అందుకే ఆ యువకుడు తనకి వాస్తవమనీ,అలాగే ఆ యువకునికి తానొక స్వప్నమనీ నిర్ధారణకొస్తాడు..ఈ కథలో 'elder self' , 'younger self' మధ్య జరిగే సంభాషణల్లో బోర్హెస్ మనకు ఒక వ్యక్తిగా కాక,ఇద్దరు విడి విడి వ్యక్తులుగా గోచరిస్తారు..ఈ కథ చాలా కాలం క్రితం చదివిన జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్' ను గుర్తుకు తెచ్చింది..మనిషి నైజంలో కన్ఫర్మిటీని ఎద్దేవా చేస్తూ కాలంతో పాటు రూపాంతరం చెందిన ఇద్దరు అపరిచిత వ్యక్తుల మానసికస్థితి,దృక్పథాలను అద్భుతంగా ఆవిష్కరించిందీ కథ..

ఇందులో భావి రచయిత బోర్హెస్ గురించి వృద్ధుడి తలంపు..
It pleased me that he did not ask about the success or failure of his books.

“The man of yesterday is not the man of today,” some Greek remarked. We two, seated on this bench in Geneva or Cambridge, are perhaps proof of this.

He barely listened to me. Suddenly, he said, ‘If you have been me, how do you explain the fact that you have forgotten your meeting with an elderly gentleman who in 1918 told you that he, too, was Borges?’

మరో కథ 'Ulrike' ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్రేమకథ..ఈ కథలో  Ulrike అనే అమ్మాయి బోర్హెస్ ఆలోచనల్లో ప్రాణంపోసుకున్న ఒక ప్రతిబింబమా లేక యదార్ధమా అనేది ఇంతవరకూ తేలలేదు మరి.. 


O nights, O darkness warm and shared, O love that flows in shadows like some secret river, O that instant of ecstasy when each is both, O that ecstasy’s purity and innocence, O the coupling in which we became lost so as then to lose ourselves in sleep, O the first light of dawn, and I watching her.

'కాంగ్రెస్' అనే అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి,దానికి ఒక భవన నిర్మాణం చేయ సంకల్పించి,ఆ కార్యాలయంలో ఉండాల్సిన పుస్తకాలూ వగైరాలు సమకూర్చుకునే క్రమంలో యదార్ధానికి చాలా దూరం వెళ్ళిపోయిన కొందరు వ్యక్తుల కథ 'The Congress','ప్రాముఖ్యతలు' ప్రాతిపదికగా నడుస్తుంది.. 

I came from Santa Fe, my native province, in 1899. I have never gone back. I have grown accustomed to Buenos Aires, a city I am not fond of, in the same way that a man grows accustomed to his own body or to an old ailment. Without much caring, I am aware that I am going to die soon; I must, consequently, control my digressive tendencies and get on with my story.

There Are More Things,ఫాంటసీ ఎలిమెంట్ ఉన్న ఈ కథని H.P.Lovecraft కు అంకితమిచ్చారు బోర్హెస్..ఈ కథలో ఇంజినీర్ అయిన తన అంకుల్ తనకు ఫిలాసఫీని బోధించిన పద్ధతుల్ని గురించి ఈ క్రింది విధంగా రాశారు..బోర్హెస్ శైలికి మూలాలు ఈ కథలో వెతుక్కోవచ్చు అనిపించింది..

One of the after-dinner oranges was his aid in initiating me into Berkeley’s idealism; a chessboard was enough to illustrate the paradoxes of the Eleatics. Years later, he was to lend me Hinton’s treatises which attempt to demonstrate the reality of four-dimensional space and which the reader is meant to imagine by means of complicated exercises with multicoloured cubes. I shall never forget the prisms and pyramids that we erected on the floor of his study.

ఇక ప్రేమనూ,మరణాన్నీ ఒకే రాత్రి అనుభవపూర్వకంగా తెలుసుకున్న పిల్లవాడి కథ 'The Night of the Gifts',

'The Mirror and the Mask',తన విజయాన్ని పొగడమని ఒక కవిని కోరిన రాజు కథ..ఈ కథలో ముగింపు చాలా చిత్రంగా ఉంటుంది.. 

The sin of having known Beauty, which is a gift forbidden to men. Now it behoves us to expiate it. I gave you a mirror and a golden mask; here is my third present, which will be the last.’

చివరి కథ 'The Book of Sand',బికనేర్ (ఇండియా) లో దొరికిన ఒక వింత పుస్తకం గురించిన కథ..కాగా మిగతా కథలు The Sect of the Thirty,Undr ,Utopia of a Tired Man,The Bribe,Avelino Arredondo,The Disk లు బోర్హెస్ ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో పరిచయం చేస్తాయి..ఇందులో బోర్హెస్ సగటు పాఠకుణ్ణి ఏ మాత్రం పరిచయంలేని దారుల్లో నడిపిస్తారు..ఆయన కథలు అల్లడానికి ఎన్నుకున్న సందర్భాలు సామాజిక,రాజకీయ,చరిత్రాత్మక విశేషాలతో పాటు,ఒక ప్రొఫెసర్ గా ఆయన అకాడమిక్ అనుభావాల్తో కూడా ముడిపడి ఉండటంతో అడుగడుక్కీ గూగుల్ ను ఆశ్రయించక తప్పలేదు..అంతకుముందు బోర్హెస్ ను చదువుదామని ప్రయత్నించి,ఆయన అర్ధంకాక నెట్లో చాలా విశ్లేషణలు చదవడం జరిగింది..నేను చదివిన కొన్నివ్యాసాల్లో బోర్హెస్ గురించిన  ఫాక్ట్స్ కనిపించాయే తప్ప,బోర్హెస్ సారాన్ని లోతుగా అర్ధం చేసుకున్నవాళ్ళు పెద్దగా కనపడలేదు..ఆ సమయంలో ఆంధ్ర జ్యోతి లో ప్రచురించిన  'పింగాణీ పాత్రని తన్నేసిన పిల్లి కథ' అని నాగరాజు పప్పుగారు రాసిన వ్యాసం కంటపడింది..(నాలాంటి వాళ్ళకోసం లింకు ఇక్కడ కామెంట్లలో ఇవ్వడం జరిగింది.) ఆ వ్యాసం బోర్హెస్ ను అర్ధం చేసుకోడానికి నాకు కొంతవరకూ ఉపయోగపడింది..ఈ పుస్తకంతో నాకు బోర్హెస్ ను పరిచయం చేసిన నాగరాజు గారికి ధన్యవాదాలు.. 

Monday, March 19, 2018

2017 Reading List

 Once again I failed to reach my goal..But Once again I learned a lot in the process..41/50.. 😊
Here are my Goodreads statistics of the year 2017.Friday, March 16, 2018

A Man Called Ove - Fredrik Backman

జీవితం చాలా చిత్రమైంది.."ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది" అని ఎవరో సినీకవి రాసినట్లు దాని పట్ల నమ్మకం పూర్తిగా అడుగంటిపోయాకా ఉన్నట్లుండి కొత్త ఆశలు చిగురింపజేస్తుంది..అయితే మృత్యువు దానికంటే వింతైనది..మనిషి దాని ఉనికిని విస్మరిస్తూనే శాశ్వతత్వమనే భ్రమలో తనను తాను మభ్యపెట్టుకుంటూ జీవిస్తాడు ..నిజానికి మృత్యువు తన వరకూ వచ్చినా సంతోషమే గానీ తనవారిని ఎక్కడ కబళిస్తుందోననే భయమే మనిషిలో ఎక్కువ..59 ఏళ్ళ వయసులో ప్రపంచంలో తాను ప్రేమించిన ఏకైక వ్యక్తి వెళ్ళిపోతే,ఇక తన జీవితానికి అర్ధం లేదనుకుని మరణాన్ని కోరుకునే ఓవ్ కథ కూడా ఇలాంటిదే..ప్రాణానికి ప్రాణమైన సోంజా మరణం తరువాత జీవించమే మర్చిపోయిన ఓవ్ జీవితం ముగింపు దశలో ఈ కథ 'A Man Called Ove' ప్రాణంపోసుకుంటుంది..స్వీడిష్ రచయిత Fredrik Backman 2012 లో రాసిన ఈ నవల న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది..
Image courtesy Google
'యదార్ధవాది లోక విరోధి' అన్నతీరుగా ప్రపంచానికి వింతమనిషిగా కనిపించే 'ఓవ్' నిజానికి వింతప్రపంచంలో సాధారణమైన వ్యక్తి...16 ఏళ్లొచ్చేసరికే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన అతడు అంతర్ముఖుడూ,మితభాషీ..రైల్వే ఉద్యోగి అయిన తండ్రి ఉన్నతమైన భావాలను పుణికిపుచ్చుకుని క్రమశిక్షణకు పర్యాయపదంగా పెరిగిన ఓవ్,తాను అమితంగా ప్రేమించి,పెళ్ళి చేసుకున్న భార్య సోంజా మరణానంతరం జీవితం పట్ల,సమాజం పట్ల విరక్తితో ఆత్మహత్య చేసుకుందామని విఫలయత్నం చేస్తుంటాడు..కానీ పాట్రిక్,పర్వానే(ఇరానియన్ మహిళ) అనే జంట ఇద్దరు పిల్లలతో పొరుగింట్లోకి కొత్తగా రావడంతో ఓవ్ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి..దానికి తోడు ఓవ్ కుటుంబానికి చిరకాల మిత్రులు అయిన రూన్,అనితా దంపతుల్ని కొన్ని సమస్యలనుండి బయటపడవేసే క్రమంలో ఓవ్ జీవితానికి ఒక లక్ష్యం,సార్థకత దొరికినట్లవుతుంది..

ప్రతి చిన్న పనికీ యంత్రాలమీద ఆధారపడుతూ,హద్దుల్లేని జీవితాన్ని గడపడమే ఆధునిక జీవనానికి పరమావధిగా 'ఇంపెర్ఫెక్షన్ ఈజ్ బ్యూటీ','పర్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపెర్ఫెక్షన్' అని,ఎవరికి వారు తమలోకి లోపాలకు ఒక సొంత ఫిలాసఫీ తయారుచేసేసుకుని సౌకర్యవంతంగా బ్రతికేస్తున్న ఆధునిక సమాజానికి అర్ధం కాడు ఈ ఓవ్..అలాగే జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారం గడపాలనీ,మనిషి దైనందిన జీవితంలో అవసరమయ్యే ప్రతి చిన్నపనినీ,ఒకరి మీద ఆధారపడకుండా స్వయంగా చేసుకోవడం చేతనవ్వాలనీ,నియమాలను గౌరవించి,పాటించాలనీ మనసావాచా నమ్మి,ఆచరించే ఓవ్ కు ఈ ఆధునిక ప్రపంచం అస్సలు కొరుకుడుపడదు..నియమోల్లంఘన,బాధ్యతా రాహిత్యం,నిర్లక్ష్య ధోరణులను ఓవ్ అస్సలు క్షమించడు..జరగాల్సినవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకోవడమే అత్యాసైన నేటి సమాజంలో ఓవ్ ఒక పెర్ఫెక్షనిస్టు/మిస్ ఫిట్..ఈ కారణంగా సహజంగానే ప్రభుత్వ ,కార్పొరేట్ సంస్థల ప్రతినిధులంటే ఓవ్ కు అస్సలు సరిపడదు..వారిని పుస్తకమంతా 'తెల్ల షర్టులు' అని సంబోధిస్తాడు..ఇదిలా ఉంటే ఈ వింతజీవి (?) ఓవ్ కు సరైన సమఉజ్జీ అతని పరమ మిత్రుడు/శత్రువు రెండూ అయిన పొరుగింటి రూన్..వీళ్ళిద్దరూ కలిసే సందర్భాలు రెండు పర్వతాలు ఢీకొనడం ఎలా ఉంటుందో అలా ఉంటాయి..ఇందులో ఈ ఇద్దరు హీరోలూ కలిసి చేసే పనులు భలేగా ఉంటాయి..

ఈ కథలో పరస్పర భిన్న ధ్రువాలైన సోంజా-ఓవ్ ల సంబంధాన్ని అద్భుతంగా మలిచారు..
He was a man of black and white...
And she was color. All the color he had.

On Sunday she was buried. On Monday he went to work. But if anyone had asked, he would have told them that he never lived before he met her. And not after either.

ఓవ్ ను ఒంటరితనం నుంచి రెక్కపట్టుకుని బాహ్య ప్రపంచంలోకి లాక్కొచ్చే మరో ప్రాత్ర పర్వానే అనే ఇరానియన్ మహిళది కాగా అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పిల్లిది..మనిషి సైకాలజీని చదివినట్లుండే ఈ పిల్లి ప్రవర్తన,ఓవ్ కూ,దానికీ జరిగే రహస్య సంభాషణలూ హాస్యాన్ని పండిస్తాయి..వీళ్ళతోపాటు యువకులైన అడ్రియన్,మిర్సాద్(గే),స్థూలకాయుడు జిమ్మీ లాంటి మరికొన్ని పాత్రలు కథలో భాగంగా క్రమేపీ జీవంపోసుకుంటాయి..
గడచిన తరానికి ప్రాతినిథ్యం వహించే ఓవ్ పాత్ర ఈ తరం వ్యక్తులు తమ జీవితాలను ఆత్మావలోకనం చేసుకునే దిశగా నడిపిస్తుంది..ఈ తరాన్ని "బాధ్యతకు అర్ధం తెలీకుండా,జీవితపు పగ్గాలను వదిలేసి కంప్యూటర్ల ముందు కూర్చుని బీరాలు పోయే షో ఆఫ్ మనుషులు అంటూ ఓవ్ ఎత్తిపొడుస్తాడు..కానీ విచిత్రంగా ఓవ్ విమర్శలు ఎక్కడా కోపం తెప్పించవు సరికదా,నిజమే కదా అనిపించేలా ఉంటాయి..ఇకపోతే కథంతా రచయిత మాటల్లోనే ఉంటుంది..ఈ పుస్తకంలో రచయిత అంతర్లీనంగా చెప్పదలచుకున్న గంభీరమైన అంశాల్ని సున్నితమైన హాస్యంతో కలగలిపి చెప్పడం చాలా బావుంది..ముఖ్యంగా ఓవ్ పాత్రను రచయిత తీర్చిదిద్దిన తీరు ఈ కథకు ఆయువుపట్టు..ఓవ్ ప్రత్యేకమైన వ్యవహారశైలీ,రెండు మూడు వాక్యాల్లోనే  వ్యంగ్యం,వెటకారాలు తొణికిసలాడుతూ క్లుప్తంగా ఉండే అతని సంభాషణలూ కథనాన్ని మరింత రక్తికట్టించాయి..

ఇది చదువుతూ చదువుతూ మధ్యలో ఫక్కున నవ్వితే చేతిలో ఉన్న ఏ కాఫీకప్పులోంచో కాఫీ తొణికిపోయే అవకాశాలు చాలా ఎక్కువ..అలాగే సగం నవ్వు పూర్తయ్యేలోపు,ఆ చిలిపితనాన్ని ప్రక్కకి నెట్టే గాంభీర్యం చోటుచేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి..ఈ నవల ఆధునిక జీవన విధానంలో స్వతంత్రంగా జీవించడానికి అవసరమయ్యే ప్రాధమిక విషయాల్ని విద్యా వ్యవస్థలు బోధించకపోవడం,ఆ కారణంగా మనుషుల స్థానాన్ని యంత్రాలు తీసుకోవడం వల్ల,మనిషి తనకు తెలీకుండానే సాంకేతికపరిజ్ఞానానికి బానిస అవుతున్నాడని చెప్పకనే చెప్తుంది..అలాగే ఉరకలపరుగుల జీవితంలో ముందుకెళ్ళిపోతున్న తొందర్లో నేటి తరం మరచిపోతున్న విలువల్ని మరోసారి సునిశితంగా గుర్తుచేస్తుంది..మనిషి తన ప్రాముఖ్యతల్ని గుర్తెరిగి మసలుకోవాలని హితవు చెప్తుంది..పొట్టచెక్కలయ్యే హాస్యంతో రెండు తరాల అనుభవాల సారాన్ని ఒకేసారి అనుభవంలోకి తెచ్చే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే..

ఫిల్టర్ కాఫీ ప్రేమికురాలిగా ఈ వాక్యాలు నన్ను ఆకట్టుకున్నాయి..
Every morning for the almost four decades they had lived in this house, Ove had put on the coffee percolator, using exactly the same amount of coffee as on any other morning, and then drank a cup with his wife. One measure for each cup, and one extra for the pot—no more, no less. People didn’t know how to do that anymore, brew some proper coffee. In the same way as nowadays nobody could write with a pen. Because now it was all computers and espresso machines. And where was the world going if people couldn’t even write or brew a pot of coffee?

ఓవ్ సంధించిన మరికొన్ని విమర్శనాస్త్రాలు,
People don’t have useful things anymore. People just have shit. Twenty pairs of shoes but they never know where the shoehorn is; houses filled with microwave ovens and flat-screen televisions, yet they couldn’t tell you which anchor bolt to use for a concrete wall if you threatened them with a box cutter.

People have no respect for decent, honest functionality anymore, they’re happy as long as everything looks neat and dandy on the computer. But Ove does things the way they’re supposed to be done.

He came into his office on Monday and they said they hadn’t wanted to tell him on Friday as it would have “ruined his weekend.” “It’ll be good for you to slow down a bit,” they’d drawled. Slow down? What did they know about waking up on a Tuesday and no longer having a purpose? With their Internets and their espresso coffees, what did they know about taking a bit of responsibility for things?

“Taking it a bit easy,” they said to him. A lot of thirty-one-year-old show-offs working with computers and refusing to drink normal coffee.

Ove’s wife often quarrels with Ove because he’s always arguing about everything. But Ove isn’t bloody arguing. He just thinks right is right. Is that such an unreasonable attitude to life?

తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని పదహారేళ్ళ కుర్రవాడి మనస్థితి..
He was never able to properly explain what happened to him that day. But he stopped being happy. He wasn’t happy for several years after that.

“When people don’t talk so much they don’t dish out the crap either,” one of his older workmates said to him one afternoon down on the track. And Ove nodded. Some got it and some didn’t.

“Men are what they are because of what they do. Not what they say,” said Ove.

A time like that comes for every man, when he chooses what sort of man he wants to be. And if you don’t know the story, you don’t know the man.

“We’re not the sort of people who tell tales about what others do,” he answered.

సోంజా కి మాత్రమే కనిపించే ఓవ్ ...
To her, he was the slightly disheveled pink flowers at their first dinner. He was his father’s slightly too tight-fitting brown suit across his broad, sad shoulders. He believed so strongly in things: justice and fair play and hard work and a world where right just had to be right. Not so one could get a medal or a diploma or a slap on the back for it, but just because that was how it was supposed to be. Not many men of his kind were made anymore, Sonja had understood. So she was holding on to this one. Maybe he didn’t write her poems or serenade her with songs or come home with expensive gifts. But no other boy had gone the wrong way on the train for hours every day just because he liked sitting next to her while she spoke.

ఓవ్-రూన్ ల గురించి చెప్తూ ,
One of them a man who refuses to forget the past, and one who can’t remember it at all.

Some boys leave everything behind and never look back. That was all there was to it.

People need a function, he believes. And he has always been functional, no one can take that away from him.

Saturday, March 10, 2018

About Love - Anton Chekhov

"క్లాసిక్ ని అందరూ పొగుడుతారు గానీ ఎవరూ చదవరని" మార్క్ ట్వైన్ అంటారు..అలాగే  మహామహులైన కొందరు రచయితల్ని గురించి తెలిసి కూడా ఎందుకో వారి పుస్తకాల మీద సీతకన్నేస్తాం..అన్నా కరెనీనా చదివిన తరువాత టాల్స్టాయ్ మీద  వ్యామోహం నన్ను చెఖోవ్ వైపు అసలు చూడనివ్వలేదు..అప్పుడో  కథా,ఇప్పుడో కథా తప్పితే ప్రత్యేకం చెఖోవ్ ని ఎప్పుడూ చదవలేదు..మొత్తానికి ఈ 'అబౌట్ లవ్' తో చెఖోవ్ ని చదవడం మొదలైంది..మూడు కథలున్న ఈ పుస్తకంలో,చెఖోవ్ కథలకు David Helwig అనువాదం,Seth కూర్చిన దృష్టాంతాలూ(illustrations) మరింత వన్నె తెచ్చాయి..ఆ కారణంగా పిల్లలకు కూడా చెఖోవ్ ని పరిచయం చెయ్యడానికి ఈ పుస్తకం అనువుగా ఉంటుంది..

Image courtesy Google
మొదటి కథకు ఇప్పటివరకూ వాడుకలో ఉన్న పేరు 'ది మాన్ ఇన్ అ కేస్' ను ఇందులో 'అ  మాన్ ఇన్ అ షెల్' గా మార్చారు..రెండో కథ 'గూస్ బెర్రీస్' కాగా మూడో కథ 'అబౌట్ లవ్' ..పశువైద్యుడు Ivan Ivanych మరియు స్కూల్ టీచర్ Burkin లు వేటనుంచి తిరిగి వస్తూ Mironositskoe అనే గ్రామం పొలిమేరలు చేరే సరికి చీకటి పడటంతో ఒక షెడ్డులో విశ్రమిస్తూ,కాలక్షేపం కోసం తమ అనుభవాలను కథలుగా చెప్పుకుంటారు..ఇవాన్ ఇవానిచ్ అంతర్ముఖి అయిన తన భార్య Mavra ప్రస్తావన తీసుకురాగానే అటువంటివారు చాలా మందే ఉంటారంటూ బర్కిన్ తన సహోపాధ్యాయుడు బెలికోవ్ కథ చెప్తాడు..బెలికోవ్ విచిత్రమైన వ్యక్తి..వర్షం లేనప్పుడు కూడా మోకాళ్ళ వరకూ ఉండే బూట్లు ధరిస్తాడు.. పూర్తిగా శరీరాన్ని కప్పివేసే పొడవాటి కోటు,మడవని కాలర్ చెవుల్ని కప్పేస్తూ,మొహం కూడా కనిపించకుండా,చేతిలో గొడుగుతో తిరుగుతుంటాడు..నియమాలను శ్వాసిస్తూ,అన్నిటికీ భయపడుతూ,అందర్నీ అనుమానిస్తూ,ఎప్పుడు ఏమవుతుందో అని తన చుట్టూ గోడ కట్టుకు బ్రతుకుతూ తన వ్యవహారశైలితో అందర్నీ తనకి తెలీకుండానే ఇబ్బందులకి గురిచేస్తుంటారు..బర్కిన్ ఈ కథంతా చెప్పి చివర్లో బెలికోవ్ మరణించాక,"అసలు బెలికోవ్ లాంటివారిని పాతిపెట్టడం ఎంత సంతోషకరమో కదా !ఆహా ఇది స్వేఛ్చ" అంటూ మరోప్రక్క బెలికోవ్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మందే ఉన్నారు కదా ! అంటూ నిట్టూరుస్తాడు..దానికి ఊతంగా ఇవాన్ కూడా "ఆ మాటకొస్తే మనమందరం కూడా మన చుట్టూ గోడలు కట్టుకునే బ్రతుకుతున్నాం కదా !" అని వాఖ్యానించి పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తాడు..సామాజిక కట్టుబాట్ల మధ్య ఊపిరాడకుండా జీవించే ప్రతి మనిషి చుట్టూ పైకి కనిపించని షెల్ ఒకటి ఉంటుందంటూ,సంఘజీవిగా మనిషికుండే పరిధుల్నీ,పరిమితుల్ని పునర్విశ్లేషించుకోమంటుంది ఈ కథ..ఈ కథలో బెలికోవ్ పాత్ర చిత్రీకరణ,అతని ఆహార్యం,ఉక్రెయిన్ యువతీ వరెంకా 'హ హ హ' అంటూ నవ్వడం లాంటివి సరదాగా ఉంటాయి..

“You watch and listen while they tell lies,” pronounced Ivan Ivanych, turning on his other side, “and they call you a fool because you put up with the lies; you put up with injuries, humiliations, not daring to declare openly that you are on the side of the free, honest people, and you lie to yourself, you smile, and all this for the sake of a loaf of bread and warm coals, for the sake of a propriety that’s not worth a penny – no, it’s impossible to live any longer like this.”

రెండో కథ 'గూస్ బెర్రీస్' పల్లెటూర్లో తెలతెలవారుతుండగా మొదలవుతుంది..ఇవాన్,బర్కిన్ లు వర్షం బారినపడకుండా సమీపంలో ఉన్న మిల్లు యజమాని అల్యోఖిన్ ఇంటిలో సేదతీరుతున్న సమయంలో ఇవాన్,తనకంటే రెండేళ్ళు చిన్నవాడైన తమ్ముడు నీకొలాయ్ గురించి చెప్పే మరో అద్భుతమైన కథ..తాను కోరుకున్న ఆనందకరమైన జీవితం కోసం వృద్ధాప్యం వరకూ వేచి చూసిన తమ్ముణ్ణి ఒక మూర్ఖుడిలా చూసిన ఇవాన్ ను చివర్లో తన స్వార్ధపూరిత జీవితాన్ని కూడా పునఃసమీక్షించుకునే దిశగా నడిపిస్తుంది.. మనిషిలో నిజమైన సంతోషానికి నిర్వచనాలను సూచిస్తునే ఈ కథ,"జీవితానికి లక్ష్యం,పరమార్థం అంటూ ఏదైనా ఉంటే అది సంతోషంగా జీవించాలనుకోవడం కాదు,నలుగురికి మంచి చెయ్యడం" అంటూ చెఖోవ్ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది..

While you’re young and powerful and brisk, don’t weary in doing good. Happiness is nothing, inessential; if there is a reason, a purpose to life, that reason and purpose is not to aim at happiness, but something higher and wiser. Do good.”

It was hard and sour, but as Pushkin said, ‘Deception that exalts is dearer than thousands of truths.’

మూడో కథలో అల్యోఖిన్ తన విఫలమైన ప్రేమకథను చెప్తాడు..ఈ కథలో అల్యోఖిన్,పెలగేయా ల మధ్య చిగురించిన ప్రేమ ద్వారా ప్రేమ ఎప్పుడు,ఎందుకు, ఎలా పుడుతుందో చెప్పడం కష్టమంటూ,అన్ని ప్రేమ కథల్నీ ఒకే గాటికి కట్టెయ్యడం సరికాదంటారు..ఈ కథ ప్రేమను నిర్వచించాలనుకోవడం కంటే మూర్ఖత్వం లేదని తేల్చేస్తుంది..

It’s obvious that the happy man feels good only because the unhappy carry their burden in silence, and without this silence happiness would be impossible.

I understood that when you love, and when you think about this love, you must proceed from something higher, of more importance than happiness or unhappiness, sin or virtue in the commonplace sense; or you mustn’t think about it at all.

ఒక రచయితగా చెఖోవ్ గురించి మళ్ళీ ప్రత్యేకం చెప్పాలనుకోవడం ఖచ్చితంగా దుస్సాహసమే..సో ఇప్పుడాపని నేను చెయ్యబోవటం లేదు..కానీ ఈ కథల గురించి నాలుగు ముక్కలు చెప్పి ముగిస్తాను..ఆయన కథను మొదలుపెట్టిన,ముగించిన తీరూ అమితంగా ఆకట్టుకున్నాయి..అన్ని కథల్నీ సాదాసీదాగా మొదలు పెట్టి అసాధారణమైన రీతిలో ముగించారు..ఈ కథలన్నీ చదివి ప్రక్కన పెట్టేస్తే మర్చిపోయేవి కాదు,చెఖోవ్ పాత్రలూ,వాటి నేపథ్యం చదివిన చాలా కాలం పాటు మనల్ని వెంటాడతాయి..ఇందులో చెఖోవ్ తన సిద్ధాంతాల్ని ఎక్కడా బట్టీ వేయించలేదు..ప్రతి కథకూ చివర మనకేదో పొడుపు కథలాంటి ప్రశ్నవేసి,హోమ్ వర్క్ ఇచ్చి గానీ వదిలిపెట్టరు..ఇందులో ఏ విషయమైనా,ఏం చెప్పారో,ఎందుకు చెప్పారో మన దృష్టికోణం నుంచి కూడా ఆలోచించి తెలుసుకోమంటారు..నా వరకూ ఒక అత్యుత్తమైన రచయిత నైపుణ్యం తెలిసేది ఇక్కడే...చెఖోవ్ పాత్రలు సర్వసాధారణంగా కనిపించినప్పటికీ  జాతి,వర్ణ,లింగ భేదాల వంటి వాటికతీతంగా ప్రతి మనిషి మనస్తత్వాన్నీ తమలో ప్రతిబింబింపజేస్తాయి..ఇవి చదివాకా మనలోనూ,మన చుట్టుపక్కలా ఎందరో  బెలికోవ్ లూ ,నీకొలాయ్ లూ ,అల్యోఖిన్ లూ కోకొల్లలు ఉన్నారనిపిస్తుంది..ఈ సారూప్యత కారణంగా కథలన్నీ మనసుకి బాగా దగ్గరగా అనిపిస్తాయి..మూడు కథల్నీ రష్యన్ గ్రామీణ నేపథ్యపు పునాదుల మీద నిర్మించారు చెఖోవ్..రష్యన్ పల్లె అందాలను చెహోవ్ వర్ణించిన తీరు ఆద్యంతం అబ్బురపరుస్తుంది..1898 లో తొలిసారి 'రష్యన్ థాట్' అనే పత్రికలో ఈ మూడు కథల్నీ వరుసగా ప్రచురించారు..

Far ahead, scarcely visible, the windmills of the village of Mironositskoe stretched to their right, and then a row of low hills disappeared into the distance beyond the village; they were both familiar with the riverbank, the meadows, yellow willows, farmsteads; if one stood on one of the little hills there was a view of the vast field, the telegraph, and the train, which came forth like a creeping caterpillar and in clear weather was visible all the way to the city. Now in calm weather when all nature seemed gentle and pensive, Ivan Ivanych and Burkin were inspired by love of this landscape, and both thought how grand and beautiful the country was.

Where The Wild Things Are - Maurice Sendak

మా బుజ్జిగాడికి సెలవులు కావడంతో వాడితో కూర్చుని కొన్ని పిల్లల పుస్తకాలు చదవడం జరిగింది..నిజం చెప్పొద్దూ,భారీ నవలలు చదివినప్పటికంటే ఇవి చాలా ఆహ్లాదకరంగా  అనిపించాయి..అసలు ఈ 'Where The Wild Things Are' అనే పిల్లల పుస్తకానికి అంత పాపులారిటీ ఏంటా అని ముందు నేనే చదివాను..వింపీ కిడ్ లూ,కాల్విన్ హాబ్స్ లూ చదివి మావాడు కూడా బుల్లి వైల్డ్ థింగ్ లా ఉన్నాడని,ఈ పుస్తకం వాడి చేత చదివించాలనిపించింది..ఇల్లస్ట్రేటెడ్ బుక్స్ లో Maurice Sendak చిత్రాలు గీసి,కథ రాసిన ఈ 'Where The Wild Things Are' గురించి చాలా చోట్ల (ముఖ్యంగా బ్రెయిన్ పికింగ్స్లో ) వినడం జరిగింది..ఇది మాక్స్ అనే పిల్లవాడి కథ..బొమ్మల పుస్తకం కాబట్టి కథను వివరించే చిత్రాలు దీనికి అదనపు ఆకర్షణగా ఉంటాయి..ఆ మాటకొస్తే అసలిలాంటి పుస్తకాల్లో చిత్రాలే కీలకం..ఆ ఇల్లస్ట్రేషన్స్ చూస్తూ చదువుతున్నప్పుడు పిల్లల మొహాల్లో చిరునవ్వులు పూయడం ఖాయం..

Image courtesy Google
ఈ బొమ్మల కథలో మాక్స్ అనే అల్లరి ఒక పిల్లవాడుంటాడు..ఆ పిల్లవాడు ఒకరోజు తన wolf suit ధరించి అల్లరి పనులు చేస్తుంటాడు..ఆ అల్లరి చూసిన మాక్స్ తల్లికి కోపం వచ్చి మాక్స్ ను 'వైల్డ్ థింగ్' అంటుంది..అప్పుడు మాక్స్ "నేను నిన్ను కూడా తినేస్తాను" అంటూ అమ్మని బెదిరిస్తాడు..దాంతో అమ్మకు కోపం మరి కాస్త హెచ్చి మాక్స్ కు ఆ రాత్రి అన్నం పెట్టకుండా, వెళ్ళి నిద్రపొమ్మని పంపించేస్తుంది..అమ్మ మీద అలిగిన మాక్స్ మూతి ముడుచుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు..

అదే రాత్రి మాక్స్ గదిలో ఉన్నట్లుండి ఒక అడవి మొలుస్తుంది..ఇంటికప్పు మాయమై ఆ స్థానంలో పొదలు,తుప్పలూ,చెట్లూ నిండిపోగా,గోడలు పోయి నదీనదాలు,పర్వతాలతో విశాల ప్రపంచం అంతా మాక్స్ కళ్ళ ముందుకొచ్చేస్తుంది..దానితో పాటుగా సముద్రం మాక్స్ కోసం ఒక ప్రైవేటు పడవని మోసుకొస్తుంది..అదెక్కి మన మాక్స్ రాత్రీ పగలూ ప్రయాణించి వారాలూ,నెలలూ దాటి ఒక సంవత్సరం అయ్యేసరికి ఒక ద్వీపాన్ని చేరతాడు..అక్కడన్నీ 'వైల్డ్ థింగ్స్'  ఉంటాయన్నమాట..అవి పంజాలు విసురుతూ,భయంకరంగా గర్జిస్తూ,పళ్ళు పటపటా కొరుకుతూ,పసుపు పచ్చని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ,పెద్ద పెద్ద కోరలతో మాక్స్ మీదకొస్తాయి..మాక్స్ ఏమాత్రం బెదరకుండా 'కదలకండి' అంటూ ఆజ్ఞాపించి వాటి కళ్ళలోకి సూటిగా చూస్తూ,ఒక మంత్రం వేసేసి వాటన్నిటినీ వశపరుచుకుంటాడు..మాక్స్ కి భయపడి ఆ వైల్డ్ థింగ్స్ అన్నీ నువ్వు మాకంటే వైల్డ్ గా ఉన్నావు అంటూ మాక్స్ ను తమకు రాజును చేసుకుంటాయి..మాక్స్ వాటితో ఆటపాటల్లో మునిగితేలతాడు..అలా అల్లరి చేసి చేసి చివరకి విసుగొచ్చి ఆ వైల్డ్ థింగ్స్ కి కూడా అన్నం పెట్టకుండా వెళ్ళి నిద్రపొమ్మని పంపించేస్తాడు..ఒంటరిగా కూర్చుని తనని అందరికంటే,అన్నిటికంటే మిన్నగా ప్రేమించే వాళ్ళెవరైనా ఉంటే బావుండు అనుకుంటుండగా దూరంగా ఎక్కడినుంచో మంచి తినుబండారాల సువాసన వస్తుంది..వెంటనే మన మాక్స్ వైల్డ్ థింగ్స్ కి రాజుగా ఇక  ఉండబోనని చెప్పేసి తన పడవెక్కి ఆ ఘుమఘుమల దిశగా పయనమవుతాడు..అప్పుడు వైల్డ్ థింగ్స్ అన్నీ బోలెడు బాధపడి నువ్వు వెళ్ళద్దు,వెళ్తే నిన్ను తినేస్తాం అని ఏడుస్తాయి..అయినా మాక్స్ వాటికి టాటా చెప్పేసి వారాలూ,నెలలూ దాటి సంవత్సరం దాటేసరికి మళ్ళీ తన ఇంట్లో,తన గదిలోకి వచ్చేస్తాడు..వచ్చేసరికి మాక్స్ కోసం ఆ గదిలో మంచి భోజనం ఎదురుచూస్తుంటుంది..విచిత్రం ఏంటంటే ఆ భోజనం వేడి వేడిగా పొగలు కక్కుతుంటుంది..
Image courtesy Google
పిల్లల ఊహాత్మక శక్తిని పలు డైమెన్షన్స్ లో చూపించే ఈ పుస్తకం,అమాయకత్వంతో కూడిన వారి ప్రపంచపు స్వరూపాన్ని విశ్లేషిస్తుంది..ఒకసారి కాల్విన్ కూడా ఇలాగే మార్స్ వెళ్ళిపోతున్నానంటూ హాబ్స్ ని తీసుకుని అమ్మకి చెప్పి బయలుదేరతాడు..కాసేపు ఆడుకోగానే మళ్ళీ అన్నీసర్దుకుని,అమ్మ గుర్తొచ్చి వెంటనే ఇంటికొచ్చేస్తాడు..ఈ కథ పిల్లలకు ప్రేమతో కూడిన ఇంటి వాతావరణం అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది..ప్రేమతో,ఆప్యాయతతో ఎలాంటి వైల్డ్ థింగ్స్ నయినా మచ్చిక చేసుకోవచ్చని మరోసారి నిరూపిస్తుంది..ఇలాంటి మరికొన్ని మంచి పుస్తకాల గురించి మళ్ళీ తీరిక దొరికినప్పుడెప్పుడైనా..

Wednesday, March 7, 2018

Season of Migration to the North - Tayeb Salih

సూడాన్ సాహిత్యంలో ప్రముఖంగా వినిపించే పేరు తాయెబ్ సలీహ్ ది...అరబ్ సంస్కృతిని ప్రతిబింబించే రచనల్లో తాయెబ్ రాసిన ఈ 'సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్' ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది..వలసవాదాల మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని ఆంగ్ల సాహిత్యంలోని క్లాసిక్,జోసెఫ్ కాన్రాడ్ 'హార్ట్ ఆఫ్ డార్క్నెస్' తో పోలుస్తారు..ఈ నవల,రచయితగా తాయెబ్ కు అశేషమైన కీర్తినార్జించిపెట్టినప్పటికీ,ఇస్లాం మత విశ్వాసాలనూ,సంస్కృతినీ కించపరిచేదిగా ఉందని ఆయన స్వదేశమైన సూడాన్ లో చాలా సంవత్సరాలు బహిష్కరణకు గురైంది..1960 లో మొదలు పెట్టి 1966 లో ముగించిన ఈ పుస్తకం,ఏళ్ళ తరబడి సూడాన్ పై బ్రిటన్,ఈజిప్ట్ దేశాల ఉమ్మడి నియంత్రణ,తదుపరి ఎదుర్కున్న సివిల్ వార్,వలసవాదాల కారణంగా సుడాన్ లో ఉత్పన్నమైన దుష్పరిణామాలను విస్తృతంగా చర్చిస్తుంది..
Image courtesy Google
ఏడేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత బ్రిటన్ లో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించి స్వదేశానికి తిరిగొచ్చిన పేరు తెలియని కథకుడు మనకు నైలు నదీ తీరాన ఉన్న వాద్ హమీద్ (Wad Hamid) గ్రామాన్ని పరిచయం చేస్తాడు..వ్యవసాయదారులు ఎక్కువగా ఉండే ఆ గ్రామంలో అంతకుమునుపెన్నడూ చూడనీ,అందరిలోనూ విభిన్నంగా ఉన్న వ్యక్తి ముస్తఫా సయీద్ ని కలుస్తాడు..ముస్తఫా పరిచయంతో మన కథకుని జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి..అక్కడినుండి నేరేటర్ అనుభవాల్లో ముస్తఫా జీవితంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తాయి..మన నేరేటర్ లాగానే ముస్తఫా కూడా యూరోప్ లో విద్యనభ్యసించి,ఒక రచయితగా ఆ సమాజంలో ఉన్నత పదవుల్లో కొనసాగుతాడు..కానీ అతని జాతి మూలాల్లో పేరుకున్న ద్వేషం కారణంగా పలు యూరోపియన్ మహిళల చావుకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ కారణమవుతాడు..అతనిలోని అపారమైన మేధోశక్తి అతని
విపరీత మనస్తత్వం ముందు ఓడిపోయి,చివరకు జైలు పాలవుతాడు..కానీ విడుదలైన తరువాత తన మూలాలను వెతుక్కుంటూ వాద్ హమీద్ చేరి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ భార్య హోస్నా,ఇద్దరు పిల్లలతో సర్వ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు..

ఇందులో ముస్తఫా,కథకుడూ ఇద్దరూ ఒకే సమస్యకు రెండు పార్శ్వాలు..వాళ్ళిద్దరూ మనకు పాశ్చాత్య సంస్కృతిలోంచి వేళ్ళూనుకున్న మేధావి వర్గానికి ప్రతినిధుల్లా కనిపిస్తారు..ఎటొచ్చీ వలసవాదపు తాకిడిలో కొట్టుకుపోకుండా ఉండటానికి ముస్తఫా ఎన్నుకున్న మార్గం హింసాత్మకమైన తిరుగుబాటైతే,కథకుడు కనీసం తన సొంత గడ్డ  మీద కూడా మూఢ సంప్రదాయవాదాన్ని ఎదుర్కోలేని విఫలమైన వ్యక్తిగా మిగిలిపోతాడు..యువతరం కోసం ఆధునికత రంగులు పులుముకున్నా జాతి మూలాల్లో పేరుకున్న జాడ్యాలను ప్రక్కన పెట్టలేని వాద్ హమీద్ పెద్దలు,గ్రామస్థులు ముస్తఫా భార్య హోస్నాకు జరిగిన దారుణాన్ని ఖండించకపోవడం,వాద్ రయీస్ దుర్మార్గానికి కొమ్ముకాయడం ఇందులో సమాంతరంగా నడిచే మరో కథ..ముస్తఫా,కథకుడూ ఇద్దరు కూడా రెండు సమాజాల్లోనూ భాగమైనప్పటికీ కలోనైజేషన్,ఓరియెంటలిజం చేతుల్లో పావుల్లా మారతారు,వారి విద్య,వివేకాలు స్వదేశానికి మేలు చెయ్యడంలో ఘోరంగా విఫలమవుతాయి..ఈ పుస్తకంలో రచయితతో ప్రయాణం కాసేపు నైలు నదీ తీరాన నడకలా ఉంటే,మరోసారి మంచు కురిసే యురోపియన్ వీధుల్లో వ్యాహ్యాళిలా ఉంటుంది..నైలు నది వరదలో సమయంలో ముస్తఫా హఠాన్మరణం (మరణించాడో లేదో ఖచ్చితంగా తెలీదు,అదొక  ఊహాగానం) నేరేటర్ ని 'ముస్తఫా' అనే అబద్ధాన్ని తేటతెల్లం చేసే మార్గంలో నడిపిస్తుంది..

ఇందులో వాద్ హమీద్ గ్రామాన్ని పెత్తందారీ వ్యవస్థ చేతుల్లో నలిగిన సమాజానికి ఒక చిన్న ఉదాహరణగా చిత్రిస్తారు..అరబ్ సంస్కృతిలో పురుషాధిక్య వ్యవస్థను వివరిస్తూ స్త్రీలను గాడిదలతో పోల్చడం,సంప్రదాయం పేరుతో వారిపై జరిగే లైంగిక దాడులను సమర్ధించడం లాంటివి ఆ సమాజంలో 'స్త్రీ' స్థానాన్ని వివరిస్తాయి..స్త్రీలపై జరిగే అమానుషాలను ఈ కథలో భీతి గొలిపేలా చిత్రించారు..వాటితో పాటు ముస్తఫా పర్వర్షన్,సంబంధాలూ హింసాత్మకంగా ఉండి చదవడం కాస్త కష్టంగా అనిపించింది..చివరగా మూలాలను పెకలించివేసే దిశగా సాగుతున్న ఆధునికీకరణ,సంస్కృతుల మేళవింపులూ,వలసవాదాలూ పురోగమనం వైపో లేక తిరోగమనం వైపో పాఠకుల్నే తేల్చుకోమంటారు తాయెబ్..కాలాలు మారి ఆధిపత్యాలు చేతులు మారినా తన అస్థిత్వపు మూలాల్ని వదల్లేని సగటు మనిషి అంతఃసంఘర్షణకు,తాయెబ్ తన కలంతో జీవం పోశారు..దీన్ని అరబిక్ నుండి Denys Johnson -Davies ఇంగ్లీషులోకి అనువదించారు..

పుస్తకం తొలి పేజీల్లో ఈ వాక్యాలు,మనిషికి తన మూలాలతో ఉన్న సంబంధాన్ని చూపిస్తాయి..
I listened intently to the wind: that indeed was a sound well known to me, a sound which in our village possessed a merry whispering — the sound of the wind passing through palm trees is different from when it passes through fields of corn. I heard the cooing of the turtle-dove, and I looked through the window at the palm tree standing in the courtyard of our house and I knew that all was still well with life. I looked at its strong straight trunk, at its roots that strike down into the ground, at the green branches hanging down loosely over its top, and I experienced a feeling of assurance. I felt not like a storm-swept feather but like that palm tree, a being with a background, with roots, with a purpose.

I hear a bird sing or a dog bark or the sound of an axe on wood — and I feel a sense of stability; I feel that I am important, that I am continuous and integral. No, I am not a stone thrown into the water but seed sown in a field.

నేరేటర్ ను వెంటాడే ముస్తఫా వ్యక్తిత్వం...
Occasionally the disturbing thought occurs to me that Mustafa Sa’eed never happened, that he was in fact a lie, a phantom, a dream or a nightmare that had come to the people of that village one suffocatingly dark night, and when they opened their eyes to the sunlight he was nowhere to be seen.

ముస్తఫాకు యురోపియన్ స్త్రీలతో ఉన్న సంబంధాలను నిర్వచించే క్రమాన్ని వలసవాదానికి ఒక మెటాఫోర్ గా వాడారు తాయెబ్..
I wasn’t so much concerned with her love for the world, or for the cloud of sadness that crossed her face from time to time, as I was with the redness of her tongue when she laughed, the fullness of her lips and the secrets lurking in the abyss of her mouth. I pictured her obscenely naked as she said: “Life is full of pain, yet we must be optimistic and face life with courage."

A tree grows simply and your grandfather has lived and will die simply. That is the secret. You are right, my lady: courage and optimism. But until the meek inherit the earth, until the armies are disbanded, the lamb grazes in peace beside the wolf and the child plays water-polo in the river with the crocodile, until that time of happiness and love comes along, I for one shall continue to express myself in this twisted manner.

ఈ క్రింది వాక్యాలు ఈ కథలోని ఆత్మను పట్టి చూపిస్తాయి..
I would imagine the faces over there as being brown or black so that they would look like the faces of people I knew. Over there is like here, neither better nor worse. But I am from here, just as the date palm standing in the courtyard of our house has grown in our house and not in anyone else’s. The fact that they came to our land, I know not why does that mean that we should poison our present and our future? Sooner or later they will leave our country just as many people throughout history left many countries. The railways, ships, hospitals, factories and schools will be ours and we’ll speak their language without either a sense of guilt or a sense of gratitude. Once again we shall be as we were — ordinary people — and if we are lies we shall be lies of our own making.

కథ,కథనం కంటే ఈ పుస్తకంలో అమితంగా ఆకట్టుకున్న విషయం తాయెబ్ శైలి..ముఖ్యంగా ఒక సందర్భాన్ని వివరించే క్రమంలో ప్రకృతిని అందులో భాగంగా చేసుకునే విధానం చాలా బావుంది...

When I emerged from Mustafa Sa’eed’s house that night the waning moon had risen to the height of a man on the eastern horizon and that I had said to myself that the moon had had her talons clipped. I don’t know why it looked to me as if the moon’s talons had been clipped.

A stone’s throw from the Equator, with a bottomless historical chasm separating the two of them.

I am South that yearns for the North and the ice.

సూడాన్ సంస్కృతిని కలుషితం చేసిన 'యూరోపియన్ సంస్కృతి మోసుకొచ్చిన వ్యాధి'...
The ships at first sailed down the Nile carrying guns not bread, and the railways were originally set up to transport troops; the schools were started so as to teach us how to say “Yes" in their language. They imported to us the germ of the greatest European violence, as seen on the Somme and at Verdun, the like of which the world has never previously known, the germ of a deadly disease that struck them more than a thousand years ago.

ముస్తఫా గదిని వర్ణిస్తూ,
This room is a big joke — like life. You imagine it contains a secret and there’s nothing there. Absolutely nothing.’

ముస్తఫా అంతరంగం..
I remember his saying that before passing sentence on him at the Old Bailey the judge had said, ‘Mr Sa’eed, despite your academic prowess you are a stupid man. In your spiritual make-up there is a dark spot, and thus it was that you squandered the noblest gift that God has bestowed upon people — the gift of love.’

‘Everything which happened before my meeting her was a premonition; everything I did after I killed her was an apology; not for killing her, but for the lie that was my life.

"This Mustafa Sa’eed does not exist. He’s an illusion, a lie. I ask of you to rule that the lie be killed."

Friday, March 2, 2018

The Subject Tonight Is Love - Hafiz ( Hafez)

Image courtesy Google
ఒక్కోసారి తిరిగి తిరిగి మళ్ళీ మొదలుపెట్టిన చోటికే వస్తాం..అలాంటప్పుడు విపరీత భావజాలాలూ,తార్కిక వాదనలకి దూరంగా చందమామ చేతికి అందుతుందని మురిసే పసివాడి గుడ్డి నమ్మకమేదో కావాలనిపిస్తుంది..ఈ పుస్తకం చదవాలనిపించడం అలాంటిదే..లోలోపల్నుంచి అప్పుడో ఎప్పుడో వినపడే సున్నితమైన చిరపరిచిత స్వరాన్ని జాగ్రత్తగా నోరునొక్కేసి,మేకపోతు గాంభీర్యాలుపోయే లోకంలో అచ్చమైన చంటిబిడ్డ నవ్వులా వినిపిస్తుంది హాఫిజ్ కవిత్వం..మనసు కలతపడ్డప్పుడు చదివిన వాళ్ళకి ఓదార్పులా అనిపిస్తుంది..

రూమి తరువాత సూఫీ హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన మరో ఆధ్యాత్మిక గురువు  హాఫిజ్ గురించి చెప్పుకోవాలి..'కవులకే కవి' అని Ralph Waldo Emerson కొనియాడినా,హాఫిజ్ కు సాటిరాగల కవులు లేరని Goethe వ్యాఖ్యానించినా,ఆయన కవిత్వం Nietzsche,Arthur Conan Doyle వంటి దిగ్గజాల ప్రశంసలు పొందినా,క్వీన్ విక్టోరియా సైతం తనకు అవసరమైన సందర్భాల్లో హాఫిజ్ పదాల్ని ఆశ్రయించినా కూడా దురదృష్టవశాత్తూ పశ్చిమ దేశాల్లో హాఫిజ్ గురించి కొద్ది మందికే  తెలుసు అని ఆయన కవిత్వాన్ని అనువదించిన Daniel Ladinsky అంటారు..ఇందులో మొత్తం 60 కవితల్ని H. Wilberforce Clarke అనువాదం 'Divan of Hafiz' నుండి సంగ్రహించారు..హాఫిజ్ కవితలన్నీ ఇద్దరి మధ్య తాత్విక సంభాషణ జరుగుతున్నట్లుగా సాగిపోతాయి..ఆ సంభాషణల్లో ప్రేమకే అగ్రతాంబూలమిచ్చారు..పెర్షియన్ కవిత్వంలో ప్రధానంగా వినిపించే భక్తి,ప్రేమ,శాంతి లాంటి అంశాలే ఈ కవితల్లో కూడా వినిపిస్తాయి..పదాలు అటు ఇటుగా అనిపించినా మళ్ళీ నాకు రుమీని చదువుతున్న భావనే కలిగింది..

సో ది సబ్జెక్ట్ టునైట్ ఈస్ లవ్...

The subject tonight is Love
And for tomorrow night as well,
As a matter of fact
I know of no better topic
For us to discuss
Until we all
Die!

My words are a divine potter’s wheel.
If you stay near to me,
Please, Stay near to me—And Hafiz will spin you into Love. అంటూ తన ప్రేమ తన్మయత్వంలో మనల్ని కూడా కలుపుకుంటాడు హాఫిజ్..

ఇందులో అధికశాతం కవితల్లో హాఫిజ్ ఒక భక్తుడిలా కనిపిస్తాడు..కొన్నిచోట్ల దేవుణ్ణి తన తండ్రిలా,యజమానిలా,గురువులా గౌరవంగా సంబోధిస్తే,మరికొన్ని చోట్ల ఆ ప్రక్కనున్న వ్యక్తి,'Clever rascal' అంటూ హాస్యమాడతాడు..కాగా చాలా చోట్ల పాఠకుణ్ణి ఒక మిత్రునిలా,తోటి యాత్రికునిలా/ప్రయాణికునిలా సంబోధిస్తారు..

ఇందులో నాకు నచ్చిన రెండు కవితలు..

Will Beat You Up

Jealousy And most all of your sufferings
Are from believing You know better than God.
 
Of course, Such a special brand of arrogance as that
Always proves disastrous,
And will rip the seams In your caravan tent

Then cordially invite in many species
Of mean biting flies and Strange thoughts—

That will Beat you Up.

Because of Our Wisdom

In many parts of this world water is
Scarce and precious.
People sometimes have to walk
A great distance
Then carry heavy jugs upon their
Heads.
Because of our wisdom, we will travel
Far for love.
All movement is a sign of
Thirst.
Most speaking really says
"I am hungry to know you."
Every desire of your body is holy;
Every desire of your body is
Holy.
Dear one,
Why wait until you are dying
To discover that divine
Truth?

హాఫిజ్ కవిత్వం ఎలా ఉంటుందో హాఫిజ్ మాటల్లోనే...

The verse of Hafiz is a Turkish bath;
The glance of Hafiz is a beatific ocean Bath
Where all can clean their bodies
In the sounds from my flute and mirth-
In the tenderness of my drum's alluring beat.