ఈ మధ్య ఏదో లిటరరీ రిఫెరన్సు కోసం వెతుకుతుంటే ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో తన భర్త డియాగో రివెరానుద్దేశించి రాసిన ఈ కవిత కనిపించింది..ఇప్పటివరకూ ఆమె చిత్రాల్ని చూడడమో,అంతకుమించిన ఆమె కాంట్రవర్షియల్ లైఫ్ స్టైల్ గురించి అక్కడక్కడా చదవడమో తప్ప ఫ్రిడా కవితలు కూడా రాస్తారన్నఎరుకలేదు..ఈ కవిత చదివాక ఆమె మరికొన్ని కవితలు చదివాను..కొన్ని కవితల్లో ఫ్రిడా స్వరంలో అంతర్లీనంగా కమలా దాస్ స్వరం ధ్వనించినట్లనిపించింది..తొలిపంక్తులు చదువుతున్నప్పుడు ఈ 'మెక్సికన్ కమలా దాస్' తన చిత్రాల వెనుక నీలెక్క నాకేంటన్నట్లు సర్వస్వతంత్రురాలిలా,ధీరవనితలా కనిపిస్తుంది కదా,మరి ఈ కవితలో ఇంతటి మనోదౌర్బల్యం, దైన్యమేమిటబ్బా అనుకున్నాను..ఈ కవిత చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రిడా ఈమె కాదే అని ఆమెను వెతుక్కుంటూ చదివాను..ఆమె స్థిరగంభీరమైన వ్యక్తిత్వం భర్త డియాగో విషయానికొచ్చేసరికి పేలవమైన రూపుదాల్చడంలో మర్మమేమిటో !! బహుశా ప్రేమ కావచ్చు !! కానీ చివర్లో ఆమె ఇవన్నీ నిన్ను అడగాల్సొస్తే అవేమీ నాకు అక్కర్లేదు పొమ్మంటుంది చూశారా,అప్పుడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఫ్రిడా మళ్ళీ కనిపించింది.
Image Courtesy Google |
ఏదేమైనా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టులను కొందర్ని చూసినప్పుడు వారిలో ఆత్మన్యూనతపాళ్ళు చాలా ఎక్కువ అనిపిస్తుంది..ఈ న్యూనతలూ ,బలహీనతలూ , వైఫల్యాలు ,నైరాశ్యాలూ , సమాజంలో ఇమడలేకపోవడాలూ , తత్పరిణామంగా నిరంతరం జరిగే అంతః సంఘర్షణలోనుండే కదా అద్భుతమైన ఆర్ట్ పుడుతుంది..మెదడునిండా గ్యాప్ లేని ఇంటెలెక్ట్,రేషనాలిటీ,లాజిక్ వీటన్నిటితో నిండిన సాధారణ వ్యక్తులు (నాలాంటివాళ్ళు ? :) ) ఒక చిన్న పీస్ ఆఫ్ ఆర్ట్ కూడా సృజించలేకపోవడానికి కారణం బహుశా ఇదేనేమో కదా !! 'స్పష్టత' సృజనకు ప్రధాన శత్రువు.
ఆమె అంటోంది "నేను నిన్నేమీ అడగను,నీవే తెలుసుకోవాలి..నిన్ను అడగాల్సివస్తే అది నాకొద్దు" అని.. ఫ్రిడా, నువ్వు పైకి కనిపించేటంత రాడికల్ కాదు సుమా :) నేటితరంలో అందరం 'స్ట్రెయిట్ ఫార్వర్డ్' , ఆమెలా ఓల్డ్ ఫ్యాషన్డ్ తరం కాదు కదా..మనకి సమయం చాలా విలువైనది,"క్యా పతా కల్ హో నహో"..ఈ క్షణం చేతిలోంచి జారిపోయేలోగా దాన్ని అర్జెంటుగా జీవించెయ్యాలి అని మేనేజ్మెంట్ గురువులు బోధిస్తూ ఉంటారు..అందుకే ఈ తరానికి రొమాన్స్ కు నిర్వచనాలు తెలీదు..'When all is said and done' మిగిలేదేమిటి !! ఎవరి మొబైల్ ఫోన్లు వాళ్ళు చెక్ చేసుకోవడం తప్ప..ఇదే విషయాన్ని మరో కాంటెక్స్ట్ లో మన ముళ్ళపూడి బాపు సినిమా 'పెళ్ళిపుస్తకం' లో విలన్ మాటల్లో నర్మగర్భంగా ఇలా చెప్పిస్తారు : "ఒలిచిన అరటిపండుకీ,ఒలుచుకు తినే అరటిపండుకీ తేడా లేదూ ?" అంటూ..ఆర్టిస్టులు వెర్రివాళ్ళు కాదు వారికీ విషయం బాగా తెలుసు..ఫ్రిడా కు కూడా ఖచ్చితంగా తెలుసు.
ఆమె కవిత 'If I Have to Say It' కు నా స్వేఛ్ఛానువాదం :
నన్ను ముద్దాడమని నేను నిన్ను అడగబోవడం లేదు.
నువ్వు పొరపాటో,తప్పో చేశావని నాకు నమ్మకంగా తెలిసినప్పుడు కూడా నన్ను క్షమాపణ కోరమని అడగబోవడంలేదు.
నీ సాన్నిహిత్యం నాకు చాలా అవసరమైనప్పుడు నన్ను నీ కౌగిలిలో బిగించి సేద తీర్చమని అడగబోవడంలేదు.
లేదా మన పెళ్ళిరోజు నన్ను విందుకి ఆహ్వానించమని నిన్ను అడగబోవడంలేదు.
కొత్త అనుభవాలకోసం ప్రపంచాన్ని చుట్టివద్దాం రమ్మనో లేదా ఆ కొత్త నగరంలో ఉన్నప్పుడు నాచేతిని నీ చేతిలోకి తీసుకొమ్మనో అంతకంటే అడగబోవడం లేదు.
అబద్ధమే అయినప్పటికీ నేను ఎంతటి సౌందర్యరాశినో చెప్పమనీ,లేదా నాకు అందమైన పదాలతో ఏర్చికూర్చిన లేఖ రాయమనీ నిన్ను అడగబోవడంలేదు.
నీ రోజు ఎలా గడిచిందో చెప్పడానికో, లేదా నన్ను మిస్ అయ్యావని చెప్పడానికో నాకు కాల్ చెయ్యమని నిన్ను అడగబోవడం లేదు.
నీ మీద ప్రేమతో నీకోసం నేను చేసిన ప్రతి చిన్న పనికీ కృతజ్ఞతలు చెప్పమనీ,నా చిరాకుపరాకుల్లో నా గురించి చింతపడమనీ నిన్ను అడగబోవడంలేదు.
అంతేకాదు,నా నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలబడమని కూడా నిన్ను అడగబోవడంలేదు.
నీకు చెప్పడానికి నా దగ్గర కథలూ,బాసలూ,ఊసులూ కోకొల్లలున్నా, అవన్నీ తీరిక చేసుకుని వినమని నిన్ను నేను అడగబోవడం లేదు.
కనీసం నిన్ను నా తోడూ నీడగా నాతో కడదాకా ఉండమని కూడా అడగబోవడం లేదు.
ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ నేను నిన్ను అడిగి సాధించుకోవాల్సిన పక్షంలో
అవేమీ నాకు అఖ్ఖర్లేదు.
If I Have to Say It
I’m not going to ask you to kiss me,
neither ask for forgiveness when I believe that you have done wrong,
or that you have made a mistake.
Nor am I going to ask you to hug me when I need it the most,
or to invite me to dinner on our anniversary.
I’m not going to ask you to go around the world
to live new experiences, much less
ask you to give me your hand when we are in that city.
I’m not going to ask you to tell me how pretty I am,
even if it’s a lie or that you write me anything nice.
Nor will I ask you to call me to tell me
how your day was or tell me you miss me.
I’m not going to ask you to thank me for everything I do for you,
for you to worry about me when my moods are down
and of course I will not ask you to support me in my decisions.
I’m not going to ask you to listen to me when I have a thousand
stories to tell you.
I’m not going to ask you to do anything,
not even to stay by my side forever.
Because if I have to ask you,
I do not want it anymore.
- Frida Kahlo, to her husband, Diego Rivera.
No comments:
Post a Comment