No one sees him; no one hears him. No one, perhaps, even knows about him..ఇవి ఈ పుస్తకంలోని తొలికథ వైల్డ్ గోట్ లో ప్రారంభ వాక్యాలు..ప్రతీ మనిషిలోనూ ఎవరికీ కనిపించనీ,వినిపించనీ మరో మనిషుంటాడు..సామజిక కట్టుబాట్లకు లోబడి నలుగురితో పాటూ అడుగులో అడుగేస్తూ నడిచే మనిషొకరైతే,సామజిక చట్రానికి దూరంగా సృష్టిలో అన్ని జీవాల్లాగే తాను కూడా ఒక జీవిననే స్పృహ కలిగి,ఆధునికత,నాగరికత బొత్తిగా వంటబట్టని స్వచ్ఛమైన పశుప్రవృత్తిని అంతర్లీనంగా కలిగుండే మనిషి మరొకరు..ఒక్కో విధమైన సామజిక చట్రంలో మనిషి ఒక్కో విధంగా వ్యవహరించాలనే పారదర్శకమైన సామజిక కట్టుబాటు ఒకటి ఉంటుంది..అలా వ్యవహరించలేని మనిషి సమాజంలో 'Odd man out' గా పరిగణింపబడతాడు.
ఈ 'Odd man out' కి కొన్ని ప్రత్యేక గుణగణాలుంటాయి..మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేకపోవడం,అందరూ ఆమోదించిన విషయంలో విభేదించడం,సామజిక నియమోల్లంఘన చెయ్యడం,టూకీగా చెప్పాలంటే అన్నిటికీ ఎడ్డెమంటే తెడ్డెమనడం ఈ లోపలి మనిషి ప్రవృత్తి..ఉదాహరణకు ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే రుచీపచీ లేని వంటని సంస్కారవంతమైన(?) మనిషి అద్భుతంగా ఉందని పొగిడే సందర్భంలో ఈ 'లోపలి మనిషి' మాత్రం అస్సలు తడుముకోకుండా "ఇది విందా ? నా బొంద !! " అని ఆతిథ్యం ఇస్తున్నవారు విస్తుపోయేలా వారి మొహం మీదే నిజాయితీగా తన అభిప్రాయం వెలిబుచ్చుతాడు..ఈ 'లోపలి మనిషి' మాటలు పొరపాటున గొంతుదాటి బయటకి వచ్చాయా ! అంతే సంగతులు,పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..సమాజం అతనికి మర్యాద,నాగరికత,సంస్కారం మొదలైన ఉత్తమపురుష లక్షణాలు లేవని తీర్మానించి అతనికి మతిభ్రమించిందని ఒక్కమాటలో తేల్చిపారేస్తుంది..కానీ నిశితంగా గమనిస్తే ఇక్కడ ఆ వ్యక్తి చేసిన తప్పల్లా ఎటువంటి వడపోతలూ లేకుండా నిజం నిజాయితీగా చెప్పడమే..ఈ విషయం తెలిసినా తెలీనట్లు నటించడం,నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకపోవడమే మానవసమాజపు 'నాగరికత'..పైన రాసిన ఒక సరదా ఉదాహరణ ప్రక్కన పెడితే నిత్యజీవితంలో ముఖ్యమైన ఎన్నో సందర్భాల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి గొంతుకడ్డుపడే సంస్కారం(?) సగటు సంఘజీవి నోరు కట్టేస్తుంది..అందరూ ముక్తకంఠంతో అవునంటూ ఆమోదించిన ఒక అసత్యాన్ని "కాదు" అని అరిచి మరీ నిజం చెప్పాలని తాపత్రయపడే అటువంటి కీలక సందర్భాల్లోనే మలయాళ రచయిత ప్రభాకరన్ కథలు జీవంపోసుకుంటాయి..ఆయన కథలన్నిటిలో నిత్య జీవితంలో నైతికత,నాగరికతల పేరిట గొంతుకడ్డంపడే అస్పష్టమైన మాటలేవో బయల్పడే వ్యర్ధ ప్రయత్నం చేస్తాయి..ప్రభాకరన్ తన కథల్లో ప్రతి మనిషిలోనూ ఉండే ఈ 'లోపలిమనిషి' అంతరాత్మకు గళాన్నిచ్చే ప్రయత్నం చేశారు రచయిత..
రచయిత కన్నూర్ జిల్లాకు చెందినవారు కావడంతో ఇందులోని ఐదు కథలూ ఉత్తర కేరళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి..ఆ ప్రాంతాల్లో కొంతకాలం నివసించిన కారణంగా ఈ కథలతో నేను మరింత దగ్గరగా కనెక్ట్ అయ్యాను..కాఫీ,తేయాకుల పచ్చదనాలతో జాతీయ అంతర్జాతీయ యాత్రికులకు కనువిందుచేసే కేరళ భౌతిక స్వరూపం అందరికీ సుపరిచితమే కానీ ఈ కథలు సుందర ప్రకృతి వర్ణనలతో బాటుగా యాత్రికుల దృష్టికందని కేరళ ఆత్మను కూడా పరిచయం చేస్తాయి..'వైల్డ్ గోట్' అనే కథలో జార్జ్ కుట్టి అనే యువకుడు తన చుట్టూ ఉన్న స్వార్ధపూరితమైన సమాజంలో ఇమడలేక పడే అంతఃసంఘర్షణను చిత్రిస్తారు..సామాజిక వైకల్యాలకూ,కల్మషాలకూ దూరంగా జార్జ్ అడవిలోకి పారిపోయి ప్రకృతితో మమేకమై స్వాంతనను పొందుతాడు.."అతడు రోదిస్తున్నాడు..మరోసారి రోదిస్తున్నాడు...ఎవరూ అతణ్ణి చూడలేరు,వినలేరు..ఎవరూ అతణ్ణి అర్ధం చేసుకోలేరు" అంటూ ఈ కథలో ఒక సంఘజీవిగా జార్జ్ అస్తిత్వవాద సంఘర్షణను ఆవిష్కరించారు ప్రభాకరన్..జార్జ్ తనను ఒక మనిషిగా కంటే కౄరత్వమున్నప్పటికీ కల్మషంలేని మృగంతోటి ఐడెంటిఫై చేసుకుంటాడు.
High up on the cliff, at the edge of the frightening drop, he is alone in the moonlight, a forlorn slice of darkness, a dream animal. He bleats. His gaze wanders the valley. In the countless lanes hidden beneath the undergrowth, he searches for me. Agitated wanderings, secret pleasures sprouting like new meadow grass, anxious thickets of thorn – his memories are endless. He waits for the moment when they will merge together in a brilliant dance, a moment like a drop of fire. In the intensity of his anticipation, he calls out, again and again.
రెండో కథ 'టెండర్ కోకొనట్' లో ఒక సైకియాట్రిస్ట్ తన దగ్గరకు వచ్చిన రోగి వ్యక్తిగత జీవితంపై కుతూహలంతో అతణ్ణి వెంబడించినప్పుడు అతని జీవితంలో కొన్ని రహస్యాలు వెలుగుచూస్తాయి..కేరళలో ఈనాటికీ వ్రేళ్ళూనుకుని ఉన్న మతమౌఢ్యాలకు ఈ కథ దర్పణం పడుతుంది..మూడో కథ 'పిగ్ మాన్' ఒక పందుల్ని పెంచే పరిశ్రమలో సూపర్వైజర్ గా పని చేసే వ్యక్తిని గూర్చిన కథ స్వలాభాపేక్షతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారుల జీవితాల్ని బట్టబయలు చేస్తుంది..రచయిత స్వానుభవాలనుండి జీవం పోసుకున్న ఈ కథల్లో కాల్పనికత కంటే వాస్తవికతే అధికంగా కనిపిస్తుంది.
ఈ కథల్లో 'Invisible Forests' అనే ఒక్క కథను మాత్రం ఒక స్త్రీ దృష్టికోణం నుంచి రాశారు..మాతృస్వామ్యం నామమాత్రపు వ్యవస్థగా అమలులో ఉన్న కేరళ రాష్ట్రంలో వివక్షల పేరిట స్త్రీలు ఎదుర్కునే సమస్యలను కృష్ణ అనే స్త్రీ జీవితానుభవాలను సాయంతో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశారు..చివర్లో అనేక జీవితానుభవాలను నెమరువేసుకుంటూ ఇంటి వైపుకి అడుగులు వేస్తున్న కృష్ణ అంతరంగాన్ని మన ముందుంచుతూ ఈ కథను ముగిస్తారు...Krishna felt that there were dense forests in front of her, behind her and around her, closing in on her from all sides. She felt the desperate urge to talk about something – anything – to rescue herself from the feeling of being engulfed. But what she muttered, as she struggled to breathe, was this: ‘Yes, forests. Definitely forests.’..
ఇక ఐదో కథ పేరుకు తగ్గట్టు 'డైరీ ఆఫ్ అ మాడ్ మాన్' తన చుట్టూ మామూలు మనుషుల్లా బ్రతికేస్తున్న పిచ్చి వాళ్ళని గురించి ఒక పూర్తి స్థాయి స్పృహలో ఉన్న వ్యక్తి పిచ్చివాడినని చెప్పుకుంటూ రాసుకునే డైరీ..ఈ కథ రాయడానికి గొగోల్ 'డైరీ ఆఫ్ అ మాడ్ మాన్' కథను ప్రేరణగా చెప్పుకుంటాడు..దేవభూమి యొక్క బాహ్య సౌందర్యం చాటున మరుగునపడిపోయిన స్వార్థపరత్వం,కుటిల రాజకీయం,కుతంత్రపు మాలిన్యాలకు ఈ కథ అద్దంపడుతుంది..ఇందులో రాక్షసులు రాజ్యమేలే ఒక సరికొత్త దేవభూమిని(?) చూస్తాం..ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే కేరళ సమాజం కూడా కుటిల రాజకీయ ప్రభావాలకు అతీతమైనదేమీ కాదు..ఈ కథల్లో కేరళలో వ్రేళ్ళూనుకున్న కులవ్యవస్థ,మాతృస్వామ్యం ముసుగులో శాసించే పురుషాధిక్యత,కమ్యూనిస్టు,మార్క్సిస్టు భావజాలాలూ ఇవన్నీ కేరళను కూడా మిగతా రాష్ట్రాల్లాగే ఎటువంటి ప్రత్యేకతలూ లేని ఒక సాధారణ భౌతిక స్వరూపంగా నిలబెడతాయి..ప్రభాకరన్ సృష్టించిన పాత్రలు ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాకుండా సమాజాన్ని యథాతథంగా చూసే ప్రయత్నం చేస్తాయి..ఈ 'ఆడ్ మాన్ అవుట్' లకు సమాజం మీద నమ్మకం,గౌరవం రెండూ ఉండవు..ఒక్కోచోట ఎటువంటి వడపోతలూ లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించే ఈ పాత్రల మాటలన్నీ దిశానిర్దేశంలేని 'Non-stop ranting' లా అనిపిస్తాయి..మార్క్సిస్టు,కమ్యూనిస్టు భావజాల మధ్య కేరళ రాజకీయ చిత్రాన్ని దగ్గరగా చూపించే ఈ కథలకు ప్రారంభంలో గీసిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ..ప్రతీ చిత్రంలో నీడలాంటి ప్రతిబింబాన్ని వాస్తవికతతో ముడివేసి దిశగా తీర్చిదిద్దారు..కేరళ అందచందాలు అందరికీ తెలిసినవే కానీ కేరళ అంతరాత్మను తెలుసుకోవాలంటే ఈ కథలు చదవండి.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
వాయనాడ్ లో ఉండగా అక్కడ వారి ఆహారపుటలవాట్లను దగ్గరగా చూశాను..కర్రపెండలం,చేపల పులుసు వారికి అక్కడ మెయిన్ కోర్స్ లో తింటారు..
Come, let’s go find some food – kanji and chammanthi, or perhaps some tapioca with fish curry.
This rule, that the deity of Kudungomkaavu – Kudungothappan – could not have a male priest and must be attended to by unmarried women priests, and a different one each day, was apparently set right at the time the temple was built.
People seem scared of developing anything other than a passing acquaintance with one another. Or perhaps they don’t wish for anything more than that.
“Psychology is a false science. It is nothing but a labyrinth of analysis. You never come out with a solution. Mental illness is the destiny of the mentally ill. The problems you face in your life are the result of that life – a life you have no control over, in which you have no choice. Even your choices are not of your own choosing.
Have you heard of a writer named Gogol? It is unlikely, if you are below the age of thirty. People below thirty are generally ignorant. They may have a degree or two, but when it comes to general knowledge they have none. There’s no way they would have heard of Gogol. In actual fact, Gogol is a great literary figure. Here, in Kerala, most people say they like Dostoevsky, or perhaps Tolstoy. Me, I like this fellow Gogol. Anyway, my intention is not to get into a literary discussion. The reason I thought of Gogol just now is because he has written a story called ‘Diary of a Madman’.
As my reading progressed, I began to feel that I should get acquainted with writers and theatre people. I met some in person and had telephone conversations with some others. Compared to the people at the places where I used to work, these literary people have several good qualities. For one thing, they seem to grasp quickly things that many others would never be able to understand. But commonalities aside, they are as varied as any other group of human beings. Among them are the good, the malevolent, the conceited, the clever, the extremely vulnerable, the crooks, the helpers, the cultured, and the rogues. At the mere hint of any situation that may cause personal harm or threat to them, they tend to withdraw rather quickly – some make strange arguments, while others slink away quietly. This tendency for self-preservation seems to be the other commonality among them. You must forgive me for saying these things about our highly respected literary figures.
So many things happen in this world that we’ll never be able to comprehend.
Image Courtesy Google |

Is that last paragraph continuation of the quotation begun above or your observations? Interesting analysis as usual.Malayali writers seem to be more candid than other language writers and it seems the society accepts without much ado .
ReplyDeleteThank you.That last paragraph is also a quotation from the book..But don't you think it is so very true ??
Delete