Image Courtesy Google |
ఇందులో మూడు కథలూ పేరుకి తగ్గట్టే చిత్రమైన కథలు..మొదటి కథ రషోమోన్ లో భూకంపాలు,అగ్నిప్రమాదాలూ,ఆహార కొరత మొదలైన అనేక ప్రకృతివైపరీత్యాల బారినపడి వినాశనానికి చేరువలో ఉన్న క్యోటో నగరంలో ఒక యజమాని (సమురాయ్) పనిలోనుండి తీసివేయగా జీవనోపాథి కోల్పోయిన పనివాడు శిథిలావస్థలో ఉన్న రషోమోన్ సింహద్వారం వద్ద కూర్చుని తన భవిష్యత్తును గురించిన ఆలోచనలో పడతాడు..క్షామం వలన తిండికి కూడా నోచుకోక చౌర్యం తప్ప మరోమార్గం లేదని తలపోస్తాడు,కానీ అలా చెయ్యడానికి అతడిలోని నైతికత అడ్డుపడుతుంది..ఇదిలా ఉండగా ఒకచోట మృతదేహాల తలలపై శిరోజాలను కత్తిరిస్తూ ఒక వృద్ధురాలు అతడి కంటబడుతుంది..దాన్నొక అనైతిక చర్యగా భావించి క్రోధంతో తన ఒరలోనుండి కత్తితీసి ఆమెను నిలదియ్యగా ఆ జుట్టుతో విగ్గులు చేసి అమ్ముతున్నాననీ,హీనమైన పని అని తెలిసినా కూడా ఆవిధంగా చెయ్యకపోతే తనకు మరణమే శరణ్యమనీ చెప్తుంది..సమురాయ్ వద్ద పని చేసివున్నవాడు కాబట్టి అతడికి అస్త్రశస్త్ర నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ,నీతీనియమాలు లాంటివి సహజంగా వంటబట్టిన లక్షణాలు..తొలుత ఆ వృద్ధురాలి మీద కోపంతో కత్తిదూసినా చివరకు ఆమె అన్నమాటల్లో యదార్థం గ్రహించినవాడై అంతవరకూ అడ్డుపడిన తన నైతికతకు కూడా తిలోదకాలిచ్చి నిర్ధాక్షిణ్యంగా ఆమె కిమోనోను లాక్కుని అక్కడనుండి వెళ్ళిపోతాడు..ఈ కథలో మానవీయవిలువలకూ,ఆకలిదప్పులతో కూడిన అవసరానికీ మధ్య జరిగే సంఘర్షణను అద్భుతంగా రక్తికట్టిస్తారు అకుతగవా..మనిషి అవసరాన్ని బట్టి మంచివాడూ,అవకాశాన్ని బట్టి చెడ్డవాడూ అవుతాడన్న ముళ్ళపూడివారి మాటను గుర్తు చేసిందీ కథ.
ఇక రెండో కథ 'A Christian Death' ఒక అనాథగా చర్చిలో ఆశ్రయం పొందిన లోరెంజో కథ..నిర్మలత్వం,మంచితనం కలగలిసి దేవుని సేవలో పవిత్రంగా జీవించే లోరెంజో అందరికీ ప్రీతిపాత్రుడు..అటువంటి లోరెంజో తనను మోసం చేసి గర్భవతిని చేశాడని ఒక యువతి ఆరోపించగా సమాజం నుండి వెలివెయ్యబడతాడు..చివరకు ఆ యువతి ఆరోపణ నిజమైందా లేదా అనే పలుప్రశ్నల మధ్య అనేక నాటకీయమైన మలుపులు తీసుకుంటుందీ కథ..ఈ కథ కూడా మతం ప్రాతిపదికగా మోరల్ ఎలిమెంట్ పై దృష్టిసారిస్తుంది..ఇక మూడో కథ 'అగ్ని' హైందవ తత్వం మూలాల్ని ఉపయోగించుకుంటూ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కలిపి రాశారు అకుతగవా..నాలుగో కథ రషోమాన్ 'ఇన్ ది గ్రోవ్' అందరికీ తెలిసిందే..ఈ కథా,సినిమా రెండూ రచయిత ఊహాత్మకతకూ,దర్శకుని దార్శనికతకూ పొంతనలుండవనీ,నిజానికి పొంతన అసాధ్యమనే జగమెరిగిన మౌలిక సూత్రాన్ని సవాలు చేస్తాయి..అకీరా కురోసావా అకుతగవా స్క్రిప్ట్ ను యధాతథంగా తెరకెక్కించారనడంలో అతిశయోక్తి లేదు.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు అన్న చందాన 35 ఏళ్ళకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా అకుతగవా కథలు మాత్రం ఈనాటికీ తాజాగానే అనిపిస్తాయి..అన్ని తరాలకూ అవసరమైన నైతికత,నిస్వార్థ తత్వం,మానవీయ విలువల ఆవశ్యకతను తన కథల్లో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చెయ్యడమే ఆయన రచనలు కాలదోషం పట్టకుండా ఉండడానికి ప్రధాన కారణం అనిపిస్తుంది..సరళమైన వచనంతో సంక్లిష్టమైన విషయాలను సైతం అవవోకగా చెప్పడమే అకుతగవా ప్రత్యేకత..సాధారణంగా జపనీస్ సాహిత్యంలో కనిపించే దిగాలుపరిచే నిరాశావాదం అదృష్టవశాత్తూ ఈ కథల్లో నాకైతే కనిపించలేదు..సైకాలజీ,అస్తిత్వవాదం అంటే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన కథలివి.

No comments:
Post a Comment