పుష్కిన్ ప్రెస్ వారు 'The Unhappiness of Being a Single Man: Essential Stories' పేరిట కాఫ్కా కథల్లో ముఖ్యమైన 22 కథల్ని ఎంపికచేసి ప్రచురించారు..వీటిలో కొన్నిటిని కథలనడం కంటే చిన్న చిన్న దృష్టాంతాలు (allegories),parables,fables గా వర్గీకరించడం సమంజసం.
వాల్టర్ బెంజమిన్ కాఫ్కా గురించి రాసిన ఒక వ్యాసంలో ఒక కథ చెప్తారు..రష్యా మహారాణి క్యాథెరిన్ కి ప్రేమికుడే కాక ఆమె హయాంలో మంత్రిగా కూడా పని చేసిన Grigory Potemkin తరచూ డిప్రెషన్ బారినపడుతుంటాడు..ఆ సమయంలో అతడు ఎవర్నీ కలవడు,ఎవరూ అతడి గదిలోకి వెళ్ళే ధైర్యం కూడా చెయ్యరు..Potemkin సంతకాలు సేకరించడంలో విఫలమైన ఉన్నతాధికారుల కారణంగా ప్రభుత్వకార్యకలాపాల్లో జాప్యం జరుగుతుంటుంది..ఈ కారణంగా వారు క్యాథెరిన్ ఆగ్రహానికి గురవుతుంటారు..ఈ సమయంలో ఒక చిన్న గుమాస్తా Shuvalkin ఈ బృహత్కార్యాన్ని తన మీద వెయ్యమని అడుగుతాడు..అసలే నిస్సహాయంగా ఉన్న ఉన్నతాధికారులు ఇందులో వచ్చిన నష్టమేమీ లేదు గనుక దానికి సరేనంటారు..Shuvalkin హుషారుగా Potemkin గొళ్ళెం లేని గదిలోకి సరాసరి తలుపులు తోసుకుంటూ వెళ్ళిపోతాడు..భావరహితంగా అతణ్ణి చూస్తున్న Potemkin కి మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే ఇంకులో ముంచిన సిరాను అతడి చేతిలో పెట్టి పేజీలు తిప్పుతూ అవసరమైన సంతకాలు తీసేసుకుంటాడు..విజయగర్వంతో వెలిగిపోతున్న మొహంతో బయటికి వచ్చిన అతడి చేతిలోనుండి ఆ కాగితాలను ఆతృతగా లాక్కున్న ఆఫీసు సిబ్బంది కాగితాలను పరీక్షించగా Potemkin సంతకాలుండవలసిన అన్ని చోట్లా Shuvalkin..Shuvalkin..Shuvalkin అని అతడి పేరు రాసి ఉంటుంది..కాఫ్కా కథ పుట్టకముందు రెండు వందల ఏళ్ళ క్రితం పుట్టిన ఈ కథని మబ్బులా కమ్మేసిన ఎనిగ్మాను 'కాఫ్కా ఎనిగ్మా' గా అభివర్ణిస్తారు బెంజమిన్.
ఆఫీసులు,చీకటి గదులు,దుమ్ము పేరుకుపోయిన రిజిస్టర్లు ఇవన్నీ కాఫ్కా ప్రపంచానికి దారులు..ఈ ఇరుకు గదుల్లో ఇమడలేక అవస్థపడుతూ కూడా కాఫ్కా హీరో ఒక ఆశావహదృక్పథంతో హుషారుగా తన పని ప్రారంభిస్తాడు,కానీ చివరికివచ్చేసరికి మాత్రం చెయ్యాల్సిన పని అదుపు తప్పి చేజారిపోయి వైఫల్యం బారినపడి హతవిధీ అంటూ నీరసంగా కూలబడతాడు..కాఫ్కా కథల్లో ప్రధానంగా కనిపించే అంశం ఇది..ప్రతి మనిషీ జీవితంలో ఏదో దశలో ఇలాంటి ఒక కాఫ్కా కథలో తనను తాను ఒక పాత్రధారిగా చూసుకుంటాడు..కౄరత్వం నిండిన మానవ జీవితంలోని అస్థిరత్వాన్నీ,అబ్సర్డిటీనీ కాఫ్కా కథలు పదేపదే గుర్తు చేస్తుంటాయి..ఆయన కథల్లోని పాత్రలు సామజిక నియమాలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేసినా చివరికి వైఫల్యాల బారినపడుతుంటాయి.
ఏ పుస్తకమైనా చదివాక దాని గురించి నాలుగు మాటలు రాద్దామని కూర్చున్నప్పుడు ప్రేరణగా ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలిపే కేంద్రబిందువు ఒకటి ఉంటుంది..దాన్ని ఆసరాగా చేసుకుని మొదలును అందిపుచ్చుకుని ఒక్కో వాక్యాన్నీ విడిపోకుండా ఒక్కో కథ తాలూకూ పఠనానుభవాన్నీ చిన్న చిన్న ముడులేస్తూ చివరకు అక్షరమాల కట్టడం పూర్తి చేస్తాం..కానీ కాఫ్కా కథల్ని చదివాకా ఎప్పటిలాగే సారాంశం రాద్దామని కూర్చున్న నేను చాలా సేపు మొదలెక్కడో వెతుక్కుంటూనే ఉన్నాను..ఇలా జరగడం చాలా అరుదు..ఒకవేళ కష్టపడి ఆ మొదలు అందిపుచ్చుకున్నా చివరివరకూ దాన్ని తెగిపోకుండా కొనసాగిస్తాననే నమ్మకం కూడా కలగలేదు..ఈ కథలు చదవడం పూర్తి చేశాక అంతఃచేతనలో నిక్షిప్తమైన కథల తాలూకు దృశ్యాలన్నీ అస్పష్టంగా అలికేసినట్లు కనిపించసాగాయి..కథ చదువుతున్నప్పుడు ఎక్కడనించి వచ్చారో తెలీని ఫాంటమ్స్ లా పరిచయమైన వ్యక్తులందరూ పుస్తకం ముగిసేసరికి ఎలా వచ్చారో అలాగే అదృశ్యమైపోయారు..అందుకేనేమో కాఫ్కా పాత్రలను వాల్టర్ బెంజమిన్ భారతీయ పురాణాల్లో గంథర్వులుగా అభివర్ణిస్తారు..గంధర్వులు ఏ ఒక్క చోటుకీ చెందినవారూ కాదు,పరిమితమైన వారూ కాదు..వీరి ఉనికిని నిర్వచించడం సాధ్యపడదు..వారు ఒక ప్రత్యేక ప్రపంచానికి చెందిన వ్యక్తులూ కాదు,అలాగని ఏ లోకానికీ అపరిచితులూ కాదు..గంధర్వులు ఒకలోకం నుండి మరో లోకానికి సంచరించే దూతలు(మెసెంజర్స్)..కాఫ్కా పాత్రలు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి..Kafka tells us that they resemble Barnabas, who is a messenger. They have not yet been completely released from the womb of nature, and that is why they have "settled down on two old women's skirts on the floor in a corner. It was..their ambition..to use up as little space as possible.To that end they kept making various experiments, folding their arms and legs, huddling close together; in the darkness all one could see in their corner was one big ball." It is for them and their kind, the unfinished and the bunglers, that there is hope. అంటారు కాఫ్కా.
కాఫ్కా కథల్లో కనిపించే 'Absurdity of Existence' చదవడం పూర్తి చేసిన చాలాసేపటి వరకూ పాఠకుల్ని వెంటాడుతూనే ఉంటుంది..ఇంగ్లీషు భాషలో 'Kafkaesque' అనే పదాన్ని ఒక 'పీడకల'ను సూచించే అర్ధంలో వాడతారు..మరి పీడకలల్ని ఇష్టపడేవారు బహు అరుదు..ఈ పుస్తకానికి అనువాదకులు Alexander Starritt ముందుమాట రాస్తూ ఒక మాటంటారు,"Kafka's work is respected far more than it is loved" అని..ఎంత నిజం!!!! బోర్హెస్ కు కూడా మొదటిసారి కాఫ్కాను చదివినప్పుడు నచ్చలేదట !!తరువాత రెండోసారి చదివినప్పుడు ఆ అభిప్రాయం మారిందంటారు..బోర్హెస్ అభిప్రాయం ప్రకారం కాఫ్కా రచనను దగ్గరకి చేర్చే దారులు ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉంటాయి..కాఫ్కా జీవితంలో తండ్రి క్రూరత్వం,ప్రేమ వైఫల్యం,ఇన్సూరెన్సు కంపెనీ ఉద్యోగంలో అసంతృప్తి లాంటివి ఈ కథల్లో ప్రస్ఫుటంగా గోచరమవుతాయి..ఈ కథల్లోని పాత్రలు ఎల్లప్పుడూ అస్తిత్వ లేమితో బాధపడుతూ తమ మూలాలను వెతుక్కునే పనిలో ఉంటాయి..అస్తిత్వ భారాన్ని మోయలేని నిస్సహాయతలో 'The Married Couple' అనే కథలో ఒక చిరుద్యోగి "Oh, what futile paths we’re compelled to tread as we go about our business, and how much further we have to carry our burdens." అని వాపోతాడు.
A Message from the Emperor : అనే కథలో చక్రవర్తి ముఖ్యమైనవాళ్ళందర్నీ కాదని ఒక అతి సామాన్యుడికి ఒక ముఖ్యమైన సందేశం చెప్పడానికి అంతఃపురానికి పిలుస్తాడు..ఆ సందేశం అందుకున్న సామాన్యుడు ఆ భవంతిలో గుమిగూడిన ప్రజలను దాటి బయటకు వచ్చేదారిలేక ఆ కోట నుండి బయటపడే దారి వెతుక్కుంటూ పద్మవ్యూహంలో చిక్కుకుపోతాడు.
A Short Fable : ఇందులో ఒక ఎలుక ""ఒకప్పుడు విశాలమైన ప్రపంచం భయం గొలిపేది,కానీ అది రాన్రానూ ఇరుకుగా తయారవుతోంది..సుదూరంగా కుడి ఎడమలవైపు గోడలు కనిపిస్తున్న దిశగా పరిగెత్తితే,అవి రెండూ కలిసే చోట ఒక మూలలో చిట్టచివరి గదిలో నాకోసమొక ఉచ్చు తయారుగా ఉంది" అనుకుంటుంది..
"అలాంటప్పుడు నువ్వుచెయ్యాల్సిందల్లా వ్యతిరేక దిక్కుకి పరిగెత్తడమే" అని అంటూ పిల్లి ఉన్నపళంగా ఆ ఎలుకను తినేస్తుంది..ఈ పిట్టకథ 'It's a lovely little trap,Either way you're screwed' అనే జీవిత సత్యాన్ని చాటిచెప్తుంది.
'ది జడ్జిమెంట్' కథను ఇందులో 'The Verdict' గా పేరు మార్చారు..ఈ కథలో కాఫ్కా మీద తండ్రి నియంతృత్వపు ప్రభావం,కాఫ్కా కఠినమైన బాల్యపు ఛాయలు కనిపిస్తాయి..ఇందులో ప్రొటొగోనిస్ట్ జార్జ్,అతడి తండ్రి,జార్జ్ కాబోయే భార్య ఫ్రీడా లాంటి పాత్రలు వాస్తవంలో కాఫ్కా,నియంత లాంటి ఆయన తండ్రీ,కాఫ్కా ప్రియురాలు ఫెలిస్ లను తలపిస్తాయి..ఈ కథను కాఫ్కా ఫెలిస్ కు అంకితమివ్వడం గమనార్హం..ఈ కథల్లో దేనికవే ప్రత్యేకమైనవి అయినా నాకు అన్నిటికంటే బాగా నచ్చినవి ఈ మూడు కథలూ : 'Before The law','A First Heartache','A Hunger Artist'..ఈ మూడూ 'కాఫ్కా జీనియస్' కి మంచి ఉదాహరణలు..ఇలా చెప్పుకుంటూపోతే ఇందులో ప్రతి కథా జీవితంలోని అస్థిరత్వాన్నీ,అనిశ్చితినీ ప్రతిబింబించేదే..కాఫ్కా ప్రత్యేకం దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన కథలు మాత్రం 'హ్యూమన్ కండిషన్' కీ మానవ జీవితంలోని అనివార్యమైన స్థితికీ (Inevitability) మధ్య సంఘర్షణపై దృష్టిసారిస్తాయి..అందుకే కాఫ్కా కథల్లో సర్రియలిజం లాంటి అంశాలు కూడా ఒక సాధారణ పాఠకుడు సైతం తనను తాను సులభంగా ఐడెంటిఫై చేసుకునే విధంగా మానవీయ పరిధులకు లోబడి వుంటాయి..బహుశా ఇక్కడే బోర్హెస్ శైలికీ కీ కాఫ్కా శైలికీ మధ్య వైరుధ్యాలు కనిపిస్తాయి..బోర్హెస్ కథల్లో కాఫ్కా ఛాయలు అనేకం తొంగిచూసినా ఆయన కథల విస్తృతీ,పరిధీ అపరిమితమైనవి,అనంతమైనవీను..బహుశా ఈ కారణం చేతనే అవి సగటు పాఠకుడికి అందని ద్రాక్షలా అనిపిస్తాయి..కాఫ్కా ఒక సాధారణ పాఠకుణ్ణి ఆకట్టుకున్నంతగా బోర్హెస్ ఆకట్టుకోలేరు అనిపిస్తుంది.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
But they’re detached questions, of the kind very grand people ask,
It’s my father’s house, but each brick lies cold against the next, as if occupied with its own affairs, which I’ve partly forgotten, partly never knew.
Image Courtesy Google |

No comments:
Post a Comment