ఆ మధ్య ఫెర్నాండో పెస్సోవా సెలెక్టెడ్ ప్రోస్ చదువుతుంటే అందులో 'On the literary art and its artists' విభాగంలో ప్రత్యేకం ఆస్కార్ వైల్డ్ గురించిన పెస్సోవా రాసిన వ్యాసం ఒకటి కనిపించింది..ఒక కొత్త స్నేహితుణ్ణి కలిస్తే,అతడు ఇద్దరికీ ఉమ్మడిగా పరిచయమున్న మరో మంచి మిత్రుడి ప్రస్తావన తెస్తే !! ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా !!అలాంటి భావన కలిగి అసలు వైల్డ్ గురించి పెస్సోవా ఏమంటారో చూద్దామని నా కళ్ళు ఆతృతగా ఆ అక్షరాల వెంబడి పరిగెత్తాయి..ఆర్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆస్కార్ వైల్డ్ ప్రస్తావన తీసుకురాని సందర్భం ఉండదంటే అతిశయోక్తి కాదేమో( ఈ మాట రాయడం బహుశా ఏ వందోసారో )..ఇష్టంగానో కష్టంగానో వైల్డ్ ను తలుచుకోవడం ఒకరకంగా సాహితీలోకపు సంప్రదాయం..కానీ కళతో అంత సాన్నిహిత్యం ఉండి,కళ పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చే వ్యక్తిని పెస్సోవా అసలు ఆర్టిస్టే కాదు పొమ్మన్నారు..ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది..కానీ తన వాదనను సమర్ధించుకుంటూ పెస్సోవా ఇచ్చిన వివరణ చదివాకా నేను వైల్డ్ ను మరో కొత్త వెలుగులో చూశాను..అప్పుడు కనిపించిన వ్యక్తి పూర్తిగా వేరు.
Image Courtesy Google |
నిజమే ఆస్కార్ వైల్డ్ లాంటి వాళ్ళని చదవడంలో లాజిక్/ఇంటెలెక్ట్ అవసరపడినంత భాష మీద పట్టు అవసరం పడదు..వైల్డ్ తనలోని సౌందర్య పిపాసకు ప్రతీకగా సుదీర్ఘమైన భౌతిక వస్తు వివరణలతో దట్టించి వదిలిపెట్టే గద్యానికి మధ్య మధ్యలో ఉన్నపళంగా విసిరే వ్యంగ్యోక్తులను ఏ విధమైన ఏమరుపాటూ లేకుండా పూర్తి మెలకువతో ఒడిసిపట్టుకోగల నేర్పు పాఠకులకుంటే చాలు..నిజానికి ఆయన కథలూ,నాటకాలు మెరిసినంతగా నవల మెరుపులీనదు..పెస్సోవా అభిప్రాయం చదివాక నేను చాలా ఏళ్ళ క్రిందట చదివిన 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' గుర్తొచ్చింది..ఒక క్లాసిక్,ఒక మాస్టర్ పీస్ అంటూ జనాలు వేనోళ్ళ పొగడగా విని ఆ నవల చదివానేమో,ఇదేమి క్లాసిక్ రా నాయనా అని అనేక సార్లు తలపట్టుకున్నాను..పేజీలకు పేజీలు వెల్వెట్ పరదాల గురించీ,వెలుగుజిలుగుల షాండలియర్స్ గురించీ వైల్డ్ విపరీత వర్ణనలు విసుగు తెప్పిస్తాయి..ఇందులో ఎస్తెటిక్స్ పేరిట అనవసరమైన ఆర్భాటాలు అనేకం ఉంటాయి..కథలూ,నాటకాల్లో వైల్డ్ కున్న పదాల పొదుపూ,నైపుణ్యం గద్య రచనలో భూతద్దం పెట్టి వెతికినా కనపడదు..పైగా నవలలో పేజీలను నింపడానికి చేసే విఫలయత్నం అడుగడుక్కీ కనిపిస్తుంది..పుస్తకం ఎప్పుడైపోతుందా అని విసిగివేసారిపోయిన పాఠకులం ఒక గాఢమైన నిట్టూర్పు విడుస్తాం చూశారా !! సరిగ్గా అప్పుడే...అదే సమయంలో ఒక గొప్ప విస్ఫోటనం జరిగినట్లు కొన్ని వాక్యాలేవో కనిపిస్తాయి..అంతవరకూ నిద్రావస్థలో ఉన్న మనం ఒక్కసారి తలవిదిల్చి మరోసారి ఆ వాక్యాలను చదువుతాము..ఇహ ఆ వాక్యాలనే కళ్ళతో ప్రేమగా నిమురుకుంటూ కాసేపు అక్కడే ఆగిపోతాం..ఈ టెక్నిక్ తో పాఠకుల్ని హఠాత్తుగా ఒక అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యేలా చేసి ఒకరకంగా దారుణంగా మోసం చేస్తారు వైల్డ్..ఈ విషయం 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' చదివినవాళ్ళకి అనుభవమయ్యే ఉంటుంది...అలాంటి విస్ఫోటనాలు పది పేజీలకొకటి జరిగి,చివరికి వచ్చేసరికి వైల్డ్ చేసిన మోసాన్ని మర్చిపోయి,మనం అమాయకంగా వైల్డ్ జీనియస్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకుని చప్పట్లు కొట్టేలా చేస్తుంది..ఆయన స్ట్రైకింగ్ quotes ఇచ్చే మత్తు అలాంటిది..అందుకేనెమో వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఆర్ట్ తో సంబంధం ఉన్న వ్యక్తిగా ఎక్కువ ఆరాధిస్తానంటారు పెస్సోవా..కనిపించే వైల్డ్ హీరో కాదు,ఆయనలో ఆటిట్యూడ్ ఇక్కడ హీరో అని అంటారాయన..వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఒక 'ఇంటలెక్చువల్' గా చూడాలంటారు పెస్సోవా.
His pose is conscious,whereas all around him there are but unconscious poses.He has therefore the advantage of consciousness.He is representative:He is conscious,
All modern art is immoral,because all modern art is indisciplined.Wilde is consciously immoral,so he has the intellectual advantage.
He did not know what it was to be sincere.Can the reader conceive this ?
He was a gesture,not a man.
No comments:
Post a Comment