Friday, December 27, 2019

ఫిక్షన్ చదవడం ఎస్కేపిజమా ?

క్రిస్మస్ సెలవుల్లో మా పిల్లాడితో 1985 లో వచ్చిన కెనడియన్ మూవీ అడాప్టేషన్ 'ఆన్ ఆఫ్ గ్రీన్ గేబుల్స్' చూస్తున్నాను,మునుపు చూసిందే అయినా వాడి కోసమని రెండో సారి అన్నమాట..అందులో ఒక సందర్భంలో ఆన్,మెరిల్లా ల సంభాషణ ఈ విధంగా సాగుతుంది..

Anne: Do you never imagine things different from what they really are?
Marilla: No...
Anne: Oh! Oh, Miss Marilla, how much you miss!!!

Image Courtesy Google
ప్రపంచం ఇలా తప్ప మరో విధంగా ఉండే అవకాశం లేదని అనుకునేవాళ్ళు,కళ్ళెదుట కనిపించేదాన్నే తప్ప మస్తిష్కపు మూడోకంటితో మరో దృశ్యాన్ని చూడలేనివాళ్ళూ,చూసినా వాస్తవంలో జరగని విషయం గనుక దానికి విలువలేదనుకునేవాళ్ళు,అన్నిటినీ మించి తమకు అర్ధంకాని ప్రపంచాన్ని ద్వేషించకుండా కుతూహలంతో చూడాలనే స్పృహ లేని వాళ్ళూ పాపం నిజంగానే ఎంత కోల్పోతారో కదా అనిపించింది ఆ క్షణంలో.

స్వాప్నికుల కాల్పనిక ప్రపంచపు అనుభవాలతో సరితూగగలిగే నిధులెన్ని ?


'A reader lives a thousand lives before he dies, said Jojen. The man who never reads lives only one.' అంటారు 'A Dance with Dragons' లో George R.R.Martin..కాల్పనిక సాహిత్యం చదివేవాళ్ళు అందరూ తమకొక జీవితం లేక చదవరనుకుంటాను..వాళ్ళకు తామున్న ప్రపంచాన్ని మించిందేదో కావాలి..అదేమిటని నిలదీస్తే "It's complicated" అనడం మినహా స్పష్టమైన సమాధానం చెప్పలేరేమో కూడా..నిజానికి వాస్తవంలో జీవించేవారికంటే కాల్పనిక జీవితంలో విహరించగలిగిన వాళ్ళు జీవితం పట్ల ఒక వెర్రి వ్యామోహంతో ఉంటారు..భూమ్మీద కాళ్ళు గట్టిగా ఆన్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కలియజూసేకంటే రెక్కలుకట్టుకుని పైకెగరడంలో కంటికి కనిపించినంత మేరా ప్రపంచపు వైశాల్యాన్ని మరింత విస్తృతమైన పరిధిలో జూమ్ చేసి చూడొచ్చని నమ్ముతారు వాళ్ళు..వాళ్ళకి ఎంత అనుభవించినా ఇంకా జీవితంనుండి ఏదో పొందాలనే ఆర్తీ,ఆరాటం..ఒక్క దేహం...ఒక్క జీవితానుభవం...ఒక్క ప్రపంచం..ఉహూ సరిపోదు వాళ్ళకి..వేలు,కుదిరితే లక్షల జీవితాలు జీవించాలి..వేలూ లక్షల మైళ్ళు సుదూరతీరాలకు అలుపెరుగని ప్రయాణాలు చెయ్యాలి..అపరిచితుల్ని సైతం స్నేహితులుగా మార్చుకోవాలి..మంచి-చెడు అంటూ బ్లాక్ అండ్ వైట్ లో గీతలు గీయకుండా ప్రతి మనిషీ తన స్థానంలో నిజాయితీగానే ఉన్నాడు అని అర్ధం చేసుకోగలిగేలా ఇతరుల అంతరంగాల్ని,అనుభవాల్నీ,అనుభూతుల్నీ తమవిగా చేసుకోవాలి..ఇది ఒక్క జీవితంతో తీరగలిగే తృష్ణ కాదు..అవధుల్లేని జీవిత కాంక్ష..దాన్నొక అబ్సెషన్ అనో,అడిక్షన్ అనో,మరో జబ్బనో అనుకుంటే 'Literature is the most agreeable way of ignoring life' అని పెస్సోవా అన్నట్లు,ఈ వ్యాధికి ప్రతి సామాన్యుడికీ అందుబాటులో ఉన్నదీ,ఆక్షేపించలేనిదీ అయిన ఒకే ఒక్క విరుగుడు 'ఫిక్షన్'.

ఇక పై వాదనకు భిన్నంగా వాస్తవాన్ని భరించలేక పుస్తకాలను ఆశ్రయిస్తామని కొందరు చెప్పగా కూడా ఇదివరకూ విని ఉన్నాను..మరి దీనికి సమాధానమేంటి ? ఇది ఎస్కేపిజం కాదా ? చదివేవాళ్ళ గురించి వదిలేస్తే రాసేవాళ్ళకి వాళ్ళెందుకు రాస్తున్నారో స్పష్టత ఉంటుంది..ముఖ్యంగా 'ఎస్కేపిస్టు సాహిత్యం' రాసే రచయితలు అనే నిందను భుజాలపై మోసిన ప్రపంచ ప్రసిద్ధ ఫాంటసీ రచయితలు టోల్కిన్,లూయిస్,ఉర్సులా లెగైన్,ప్రాట్చెట్ లాంటి కొందరు తమ కళను సమర్ధించుకొస్తూ కొన్ని పుస్తకాలు రాశారు..టోల్కిన్ 'On Fairy Stories' అనే పుస్తకంలో ఒక సరదా సంగతిని ఉదహరిస్తారు..జైలులో బందీగా ఉన్నానని తెలుసుకున్న ఒక వ్యక్తి,ఆ ఖైదు నుండి విముక్తి కోరుకోవడంలో తప్పేంటీ అంటారు..అలాగే ఒకవేళ ఖైదునుండి తప్పించుకోలేని పక్షంలో అతడు కేవలం జైలరు గురించీ,జైలు గోడల గురించీ మాత్రమే కాకుండా వేరే విషయాల గురించి ఆలోచించినా,మాట్లాడినా తప్పేంటని అడుగుతారు..నిజానికి ఆ ఖైదీ దృష్టిని దాటిపోయినంత మాత్రాన ఆ గోడలకావల ప్రపంచపు వాస్తవికత తగ్గిపోదు కదా ! అందుచేత విమర్శకులు ఈ 'ఎస్కేప్' అనే పదాన్ని వాడడాన్ని ఒక 'సిన్సియర్ ఎర్రర్' గా పరిగణిస్తూ Escape of the Prisoner ని Flight of the Deserter తో పోల్చడం సరికాదన్నది టోల్కిన్ వాదన.మరి కాస్త ముందుకి వెళ్ళి,ఇలా నిందించడం ఎలా ఉందంటే "నిరంకుశత్వపు నియంతకు సంబంధించిన పార్టీ ప్రతినిధి ఆ ప్రభుత్వం నుండి బయటపడడాన్నో లేదా విమర్శించడాన్నో దేశద్రోహమని తీర్మానించడంలా ఉంది" అని వ్యంగ్యంగా ఛలోక్తి  విసురుతారు.. ఇండస్ట్రియల్ రివొల్యూషన్ పట్ల ఆ పెద్దాయనకున్న వ్యతిరేకత మనకందరికీ మొదట్నుంచీ తెలిసిందే..ఇంకా కదిలిస్తే "ఎల్మ్ ట్రీ కంటే ఫ్యాక్టరీ చిమ్నీ ఏమంత వాస్తవంగా అనిపిస్తుంది మీకు ?" అని ఎదురు ప్రశ్నిస్తారు..అదీ కాకపోతే "మేఘాలతో పోలిస్తే Bletchley station చూరులో వాస్తవికత పాళ్ళు ఎంతంటారు",చివరకి "నాలుగో నెంబరు ప్లాట్ఫారం కి వెళ్ళే బ్రిడ్జి,హేమ్డాల్ Gjallarhorn తో కావలి కాసే బైఫ్రాస్ట్ బ్రిడ్జి కంటే ఏమంత గొప్పగా ఉంటుందంటారు" ..ఇలా ఎడ్డెమంటే తెడ్డెమనే ఆయనతో మాటల్లో నెగ్గలేము..ఆ పెద్దాయనకు చాదస్తం జాస్తి :) చివరగా "The only people who inveigh against escape are jailers." అని ఒక స్టేట్మెంట్ మన మొహాన పారేస్తారు.

టోల్కిన్ 'టైరానికల్ జడ్జిమెంట్స్' గురించి ప్రక్కన పెడితే ఉర్సులా లెగైన్ 'The Language of the Night' అనే పుస్తకంలో ఫాంటసీ గురించి కొన్ని వ్యాసాలు రాశారు..అమెరికన్లకు డ్రాగన్లంటే ఎందుకంత భయం అని ఆరాతీస్తూ ఈ విధంగా రాశారు,
I will speak of modern Americans, the only people I know well enough to talk about. In wondering why Americans are afraid of dragons, I began to realize that a great many Americans are not only anti fantasy, but altogether antifiction. We tend, as a people, to look upon all works of the imagination either as suspect or as contemptible. "My wife reads novels. I haven't got the time." "I used to read that science fiction stuff when I was a teenager, but of course I don't now." "Fairy stories are for kids. I live in the real world." Who speaks so? Who is it that dismisses War and Peace, The Time Machine and A Midsummer Night's Dream with this perfect self-assurance? It is, I fear, the man in the street—the hard-working, over-thirty American male—the men who run this country. Such a rejection of the entire art of fiction is related to several American characteristics: our Puritanism, our work ethic, our profit-mindedness, and even our sexual mores.
'వార్ అండ్ పీస్' నో,'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నో చదవడం ఒక పని కాదు,అది సంతోషం కోసం చేసేది.ఒకవేళ అలా చెయ్యడంలో ఎడ్యుకేషనల్ వాల్యూస్,సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లాంటివి  లేకపోతే అప్పుడు ప్యూరిటన్ వేల్యూ సిస్టమ్లో అది 'self-indulgence' లేదా 'escapism' మాత్రమే అవుతుంది..ఎందుకంటే ప్యూరిటన్ల దృష్టిలో 'సంతోషానికి' విలువ శూన్యం ,వారికి సంబంధించినంత వరకూ అది ఒక 'పాపం'..అదే విధంగా ఒక బిజినెస్ మాన్ వేల్యూ సిస్టంలో,చేసిన పనికి వెనువెంటనే లాభం రాకపోతే,ఆ పని సమర్ధనకు నోచుకోదు.అందుచేత టోల్కిన్ నో,టాల్స్టాయ్ నో ఏ ఆక్షేపణా లేకుండా చదవగలిగే  ఎక్స్క్యూజ్ ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఇంగ్లీషు టీచర్ కి మాత్రమే,ఎందుకంటే అలా చదివినందుకు అతడు జీతం తీసుకుంటాడు గనుక..కానీ మన బిజినెస్ మాన్ మాత్రం అప్పుడోసారీ,ఇప్పుడోసారీ ఒక 'బెస్ట్ సెల్లర్' చదువుతుంటాడు,అది మంచి పుస్తకం అని భావించి కాదు,అది 'బెస్ట్ సెల్లర్' గనుక,ఆ పుస్తకం ఒక సక్సెస్ గనుక,దానికి డబ్బులొచ్చాయి గనుక అంటారు లెగైన్.

ఈ విషయంలో జెండర్ ఎలిమెంట్ కోణాన్ని గురించి కూడా మాట్లాడుతూ,లెగైన్ లోని స్త్రీవాది పురుషస్వామ్యం మీద ధ్వజమెత్తుతారు,నిజానికి ఈ anti-fiction ఆటిట్యూడ్ మగవాళ్ళదని అంటారు.
The last element, the sexual one, is more complex. I hope I will not be understood as being sexist if I say that, within our culture, I believe that this antifiction attitude is basically a male one. The American boy and man is very commonly forced to define his maleness by rejecting certain traits, certain human gifts and potentialities, which our culture defines as "womanish" or "childish."
And one of these traits or potentialities is, in cold sober fact, the absolutely essential human faculty of imagination. Having got this far, I went quickly to the dictionary. The Shorter Oxford Dictionary says: "Imagination. 1. The action of imagining, or forming a mental concept of what is not actually present to the senses; 2. The mental consideration of actions or events not yet in existence." Very well; I certainly can let "absolutely essential human faculty" stand. But I must narrow the definition to fit our present subject. By "imagination," then, I personally mean the free play of the mind, both intellectual and sensory. By "play" I mean recreation, re-creation, the recombination of what is known into what is new. By "free" I mean that the action is done without an immediate object of profit—spontaneously. That does not mean, however, that there may not be a purpose behind the free play of the mind, a goal; and the goal may be a very serious object indeed. Children's imaginative play is clearly a practicing at the acts and emotions of adulthood; a child who did not play would not become mature. As for the free play of an adult mind, its result may be War and Peace, or the theory of relativity. To be free, after all, is not to be undisciplined. I should say that the discipline of the imagination may in fact be the essential method or technique of both art and science.
It is our Puritanism, insisting that discipline means repression or punishment, which confuses the subject. To discipline something, in the proper sense of the word, does not mean to repress it, but to train it—to encourage it to grow, and act, and be fruitful, whether it is a peach tree or a human mind. I think that a great many American men have been taught just the opposite. They have learned to repress their imagination, to reject it as something childish or effeminate, unprofitable, and probably sinful. They have learned to fear it. But they have never learned to discipline it at all. Now, I doubt that the imagination can be suppressed. If you truly eradicated it in a child, that child would grow up to be an eggplant. Like all our evil propensities, the imagination will out. But if it is rejected and despised, it will grow into wild and weedy shapes; it will be deformed. At its best, it will be mere ego-centered daydreaming; at its worst, it will be wishful thinking, which is a very dangerous occupation when it is taken seriously.
సాహిత్యానికి సంబంధించి ఒకప్పటి ప్యూరిటన్ వ్యవస్థలో బైబిల్ ను మాత్రమే చదవడానికి అనుమతించేవారు.ఇప్పుడు సెక్కులర్ ప్యూరిటన్ కాలంలో మగవాళ్ళు,నవలలు వాస్తవం కాదు కాబట్టి వాటిని చదవడం 'unmanly' గా పరిగణిస్తూ టీవీల్లో వచ్చే బ్లడీ డిటెక్టివ్ థ్రిల్లర్స్  చూస్తున్నారంటారావిడ.అదీ కాకపోతే హాక్ వెస్ట్రన్ నో,స్పోర్ట్స్ కథనాల్నో చదువుతూ ప్లే బాయ్,పోర్నోగ్రఫీల దగ్గర ఆగుతున్నారంటారు.
It is his starved imagination, craving nourishment, that forces him to do so. But he can rationalize such entertainment by saying that it is realistic—after all, sex exists, and there are criminals, and there are baseball players, and there used to be cowboys—and also by saying that it is virile, by which he means that it doesn't interest most women. That all these genres are sterile, hopelessly sterile, is a reassurance to him, rather than a
defect. If they were genuinely realistic, which is to say genuinely imagined and imaginative, he would be afraid of them. Fake realism is the escapist literature of our time.
కాల్పనిక సాహిత్యం చదవడం ఒక ఎస్కేపిజం అన్న వాదన ఈమధ్య తరచూ వినిపిస్తోంది..ఫిక్షనల్ ప్రపంచాన్ని ప్రేమించడం విషయంలో ఈ 'ఎస్కేపిజం' అనే మాట ఒక విధమైన చులకనతోనో లేక జాలితోనో వాడబడుతోందని అనేకమంది రచయితలు  వాపోయారు కూడా..మరి నిజంగా ఫిక్షన్ చదవడం ఎస్కేపిజమా ? ఫిక్షన్ చదివేవాళ్ళు నిజజీవితంలో ఎస్కేపిస్టులుగా వాస్తవానికి దూరంగా బ్రతుకుతారా అని ఆలోచిస్తే,అది మనం ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం అనే విషయంపై మీద ఆధారపడి ఉంటుందని అంటారు లెగైన్..ఇమాజినేషన్ కి ఎంత మాత్రం ఆస్కారం లేని ఫాక్ట్స్ దట్టించిన పుస్తకాలూ,నాన్ ఫిక్షన్ లాంటివి అని బహుశా ఆవిడ ఉద్దేశ్యం కావచ్చు.ఈ క్రింది పేరాలో లెగైన్ చెప్పిన 'ట్రైనింగ్ ఆఫ్ మైండ్' కి ఆస్కారం ఇచ్చే జానర్ 'ఫాంటసీ'(ఫెంటాస్టిక్) మాత్రమే.రియలిస్టిక్ ఫిక్షన్ ఒక వయసు వరకూ చదివినా,ఆ తరువాత దాన్ని చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.వ్యక్తిత్వ వికాసం పూర్తైన తరువాత మరో రచయిత రాసిన ఏ ఫిలాసఫీ చదివినా అది మన సిద్ధాంతాలతో క్లాష్ అవుతుంది తప్ప,దాని వల్ల ఇమాజినేషన్ కి అవకాశం ఉండదని లెగైన్ భావన కావచ్చు.
And probably the ultimate escapist reading is that masterpiece of total unreality, the daily stock market report. Now what about our man's wife? She probably wasn't required to squelch her private imagination in order to play her expected role in life, but she hasn't been trained to discipline it either. She is allowed to read novels, and even fantasies. But, lacking training and encouragement, her fancy is likely to glom on to very sickly fodder, such things as soap operas, and "true romances," and nursy novels, and historico-sentimental novels, and all the rest of the baloney ground out to replace genuine imaginative works by the artistic sweatshops of a society that is profoundly distrustful of the uses of the imagination. What, then, are the uses of imagination? You see, I think we have a terrible thing here: a hardworking, upright, responsible citizen, a full-grown, educated person, who is afraid of dragons, and afraid of hobbits, and scared to death of fairies. It's funny, but it's also terrible. Something has gone very wrong. I don't know what to do about it but to try and give an honest answer to that person's question, even though he often asks it in an aggressive and contemptuous tone of voice. "What's the good of it all?" he says. "Dragons and hobbits and little green men—what's the use of it?" The truest answer, unfortunately, he won't even listen to. He won't hear it. The truest answer is, "The use of it is to give you pleasure and delight." "I haven't got the time," he snaps, swallowing a Maalox pill for his ulcer and rushing off to the golf course. So we try the next-to-truest answer. It probably won't go down much better, but it must be said: "The use of imaginative fiction is to deepen your understanding of your world, and your fellow men, and your own feelings, and your destiny." To which I fear he will retort, "Look, I got a raise last year, and I'm giving my family the best of everything, we've got two cars and a color TV. I understand enough of the world!" And he is right, unanswerably right, if that is what he wants, and all he wants. The kind of thing you learn from reading about the problems of a hobbit who is trying to drop a magic ring into an imaginary volcano has very little to do with your social status, or material success, or income. Indeed, if there is any relationship, it is a negative one. There is an inverse correlation between fantasy and money. That is a law, known to economists as Le Guin's Law.
నాకు ఉర్సులా లెగైన్ అంటే ఎందుకంత ఇష్టమో ఇది చదివాక మరోసారి అర్ధమైంది.ఈ పేరాగ్రాఫ్ లు చదివి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను :) సాహిత్యంతో అనునిత్యం స్నేహం నిజంగా చదివేవాళ్ళకి మేలే చేస్తుందా ? కాల్పనిక ప్రపంచంలో దిశానిర్దేశం లేని ప్రయాణం పాఠకుల్ని వాస్తవ జీవితపు లక్ష్యాల నుండి దూరం చేస్తుందా ? అనే ప్రశ్నలకు పైన రచయితల మాటల్లో కొంతవరకూ సమాధానాలు దొరికాయనే అనుకుంటున్నాను.

చివరగా హ్యరీ పాటర్ లో డంబుల్ డోర్ కీ,హ్యారీకీ మధ్య జరిగే చిన్న సంభాషణతో ఈ వ్యాసం ముగిస్తాను.

“Tell me one last thing,” said Harry. “Is this real? Or has this been happening inside my head?”

“…Of course it is happening inside your head, Harry, but why on earth should that mean that it is not real?” --------‘Harry Potter and the Deathly Hallows’

Friday, December 20, 2019

The Lifecycle of Software Objects - Ted Chiang

టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా లేని సమాజానికీ,టెక్నాలజీ నిత్యావసరంగా మారిపోయిన సమాజానికీ మధ్య సంధియుగానికి ప్రత్యక్ష సాక్షులం మనం.ఇది ఒకరకంగా అదృష్టమే అనిపిస్తుంది..ఇటాలో కాల్వినో Six Memos for the Next Millennium అనే పుస్తకంలో ఒకచోట అంటారు,"టెక్నాలజీ ఛాయలు పడని బాల్యాన్ని అనుభవించినవాళ్ళం మేము,ఎంత అదృష్టవంతులమో! "అని.టెక్నాలజీ వలన కలిగే ప్రయోజనాల్నీ,దుష్పరిణామాల్నీ రెండింటినీ బేరీజు వేసి చూడగలిగినవాళ్ళం మనం మాత్రమే..ఈ ఏడాది ప్రచురించిన 'Machines Like Me' అనే పుస్తకంలో బ్రిటిష్ రచయిత Ian Mcewan కాగ్నిటివ్ అబిలిటీస్ ఉన్న హ్యూమనోయిడ్ రోబోట్లని మానవసమాజంలో భాగంగా చేస్తూ ఫ్యూచర్ సొసైటీని చూపించే ప్రయత్నం చేశారు.కానీ ఇదే అంశాన్ని అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత టెడ్ చియాంగ్ తొమ్మిదేళ్ళ క్రితమే,అంటే 2010 లో రాసిన 'The Lifecycle of Software Objects' అనే పుస్తకంలో చర్చించారు.
Image Courtesy Google
సైన్స్ ఫిక్షన్ ప్రత్యేకత ఏంటంటే,అది ఫ్యూచర్ సొసైటీస్ ఎలా ఉండబోతున్నాయో ఊహాత్మక విశ్లేషణలు చేస్తూ ఆ పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది..గత దశాబ్ద కాలంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన పెనుమార్పులు,మనిషికి అపరిమితమైన సౌకర్యాలతో పాటు అంతులేని ఒంటరితనాన్ని కూడా తోడు తెచ్చిపెట్టాయి..ఈరోజు ఏ మారుమూల ప్రాంతాన్ని చూసినా,ఒక సగటు మనిషికి టీవీలు,మొబైల్ ఫోన్లు,టాబ్లెట్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సహాయం లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది.ఈ క్రమంలో మనుషుల స్థానాన్ని క్రమేపీ యంత్రాలు ఆక్రమించడం మొదలుపెట్టాయి.

ఈ పరిణామాల్ని మార్కెట్ చేసుకునే తలంపుతో,ఒంటరితనం బారిన పడుతున్న మనుషులకు తోడుగా పెంపుడు జంతువులను పోలిన వర్చ్యువల్ పెట్స్ ను తయారుచెయ్యడానికి 'బ్లూ గామా' అనే సంస్థ నడుం బిగిస్తుంది.'All the fun of monkeys, with none of the poop-throwing' పాలసీతో కుక్కలూ,పిల్లులూ,కోతులూ,పాండాలూ మొదలైన జంతువుల్ని పోలిన వర్చ్యువల్ ఆకారాల్ని తయారు చేస్తుంది..ఈ సంస్థలో పనిచేసే అన్నా ఆల్వరాడో,డెరెక్ బ్రూక్స్ అనే ఇద్దరు సైంటిస్టులు AI తో పనిచేసే డిజియంట్స్ అని పిలువబడే డిజిటల్ ఆర్గానిజమ్స్ ను తయారుచేస్తారు.కానీ నిరంతరం మారిపోయే వినియోగదారుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెంపుడు జంతువుల స్థానంలో మనుషుల్ని పోలిన రోబోట్లను తయారు చెయ్యమని 'బ్లూ గామా' ఆదేశిస్తుంది..ఇలా తయారైన డిజియంట్స్ కాగ్నిటివ్ అబిలిటీస్ కలిగి అచ్చం మనుషుల్లాగే ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ సైంటిస్టులు శిక్షణలో పెరుగుతూ(evolve) ఉంటాయి..పసికందుల్ని పుట్టుకతో సాకినట్లే మార్కో ,పోలో అనే రెండు పాండా బేర్ డిజియంట్స్ ను డెరెక్ పెంచుతుండగా,జాక్స్ అనే నియో విక్టోరియన్ డిజియంట్ ను అన్నా పెంచుతూ ఉంటుంది.ఈ డిజియంట్స్ నివాసముండే 'డేటా ఎర్త్ పోర్టల్' భౌతిక ప్రపంచాన్ని పోలిన విశాలమైన వర్చ్యువల్ ప్రపంచం (మల్టీప్లేయర్ గేమ్స్ తరహాలో) అన్నమాట.సైంటిస్టులు డిజియంట్స్ కి శిక్షణ ఇవ్వడానికి డేటా ఎర్త్ పోర్టల్ లో లాగ్ ఇన్ అవ్వగానే వాళ్ళ అవతార్ లతో ఆ ప్రపంచంలో భాగంగా మారతారు..అదే విధంగా ఈ వర్చ్యువల్ జీవులు మధ్య మధ్యలో వాళ్ళ ఓనర్లు తయారు చేసిన రోబోట్ శరీరాన్ని ధరించి వాస్తవ  ప్రపంచంలోకి వస్తూ-పోతూ ఉంటాయి..వర్చ్యువల్ ప్రపంచానికీ,భౌతిక ప్రపంచానికీ మధ్య ఉన్న తేడాలను చూసి ఆశ్చర్యానికి లోనవుతూంటాయి.వాటికి భౌతిక రూపం లేకపోయినా మనుషుల్లాగే అన్ని భావోద్వేగాలూ ఉండే విధంగా వాటి నిర్మాణం జరుగుతుంది.

ఇంతవరకూ బాగానే ఉన్నా,నిముష నిముషానికీ మారిపోయే సాఫ్ట్వేర్ రంగంలో ఈ 'నియో బ్లాస్ట్' రోబోట్ల స్థానంలో కొత్త Sophonce digients ప్రవేశిస్తాయి.అలాగే డేటా ఎర్త్ ను వెనక్కు నెట్టేస్తూ 'రియల్ స్పేస్ ప్లాట్ఫామ్' ఆవిర్భవిస్తుంది.కాలం చెల్లిపోయిన వెర్షన్స్ గా మిగిలిపోయిన మార్కో,పోలో,జాక్స్ లు అప్పటికే అన్నా,డెరెక్ లకు కుటుంబ సభ్యులైపోతారు..డిజియంట్స్ తో వాళ్ళకున్న అనుబంధం వల్ల వాళ్ళకి వాటిని సస్పెండ్ చెయ్యడానికి,అంటే మన భాషలో వాటిని చంపెయ్యడానికి మనస్కరించదు..పైపెచ్చు తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆ డిజియంట్స్ కనబరిచే ఆసక్తీ,జీవితేచ్ఛ వాళ్ళ చేతుల్ని కట్టేస్తాయి..ఆ డిజియంట్స్ ని పోర్టింగ్ చెయ్యడం చాలా ఖర్చుతో కూడుకున్నపని కావడంతో వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా ఏ కంపెనీ కూడా ముందుకు రాదు..చివరకు 'బైనరీ డిసైర్' అనే మరో కంపెనీ డిజియంట్స్ ను పోర్టింగ్ చెయ్యడానికి ముందుకు వచ్చినప్పటికీ వాటిని సెక్స్ వర్కర్స్ గా మార్చడానికి అంగీకరిస్తేనే పెట్టుబడి పెడతామని షరతు విధిస్తుంది.అప్పుడే ప్రపంచంలోకి కొత్తగా  రెక్కలు విప్పుకుంటున్న ఆ రోబోట్ల ను ఏం చెయ్యాలో తెలీని అనిశ్చితి నెలకొంటుంది.మరి మానవ సమాజంలో భాగంగా ఉండడానికి తయారైన ఆ డిజియంట్స్ భవిష్యత్తు ఏమైందనేది మిగతా కథ.

ఈ కథలో మనిషికీ,యంత్రానికీ మధ్య ఉన్న వ్యత్యాసాల్ని చెరిపేసే ప్రయత్నం చేశారు రచయిత..సర్ అలాన్ ట్యూరింగ్ ఆద్యుడిగా మొదలైన శాస్త్రసాంకేతిక విప్లవంలో రోబోట్స్ మానవసమాజంలో భాగం కావడానికి మరెంతకాలమో పట్టకపోవచ్చు..ఉదాహరణకు రోబోటిక్స్ అంటే ఆసక్తి ఉన్నవారందరికీ సోఫియా గురించి తెలిసే ఉంటుంది.సౌదీ అరేబియా పౌరసత్వంతో బాటుగా,క్రెడిట్ కార్డు కూడా పొందిన ఏకైక హ్యూమనోయిడ్ రోబోట్ అది.అంటే ఒక దేశపు పౌరుడికుండే సమస్త హక్కులూ,బాధ్యతలూ ఆ రోబోట్ కి కూడా ఉంటాయి.ఒకవేళ  సోఫియాకు తనవైన పొలిటికల్ వ్యూస్ ఉంటే,మనుషుల్లాగే స్వంత వ్యక్తిత్వం ఉండి స్వయం నిర్ణయాధికారం తీసుకుంటే ఆ పరిణామాన్ని మానవ సమాజం ధైర్యంగా,మనస్ఫూర్తిగా స్వాగతించగలదా ? ఈ పుస్తకం ముగింపులో ఆధునిక సమాజానికి ఇటువంటి పలు ప్రశ్నల్ని సంధిస్తూ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు సృష్టిస్తూ,తాను దేవుణ్ణని రుజువు చేసుకోవాలని వెంపర్లాడుతున్న మనిషికి తన ప్రాముఖ్యతల్ని గుర్తెరిగి మసలుకోవడం అవసరమేమో అన్న దిశగా ఆలోచనలు రేకెత్తిస్తారు.

The virtual world acts as a global village for raising the digients, a social fabric into which a new category of pet is woven.

మనిషికీ,యంత్రానికీ మధ్య ఉన్న తేడాలు చెరిగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని గుర్తుచేసే వివరణలు..
He's heartened to read this. The practice of treating conscious beings as if they were toys is all too prevalent, and it doesn't just happen to pets. Derek once attended a holiday party at his brother-in-law's house, and there was a couple there with an eight-year-old clone. He felt sorry for the boy every time he looked at him. The child was a walking bundle of neuroses, the result of growing up as a monument to his father's narcissism. Even a digient deserves more respect than that.

డిజియంట్స్ ను వినియోగదారుల చేతుల్లో పెట్టినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా వాటికి భౌతికంగా బాధ కలగకుండా చూసుకునే 'పెయిన్ సర్క్యూట్ బ్రేకర్స్' అమరిక ఉన్నప్పటికీ,మానవ సహజమైన నిర్లక్ష్యం నుండి కాపాడే వ్యస్థ లేదని శాస్త్రవేత్తలు భావించే సందర్భం..
Blue Gamma has done what it can to minimize abuses; all the Neuroblast digients are equipped with pain circuit-breakers, which renders them immune to torture and thus unappealing to sadists. Unfortunately,there's no way to protect the digients from things like simple neglect.

ఎంత ప్రయత్నించినా మనిషికి సరిసమానమైన జీవిని సృష్టించడం అసాధ్యమనే దిశగా కనిపించే కొన్ని వాదనలు..
"People always say that we're evolved to want babies, and I used to think that was a bunch of crap, but not anymore." Robyn's facial expression is one of transport; she's no longer speaking to Ana exactly. "Cats, dogs, digients, they're all just substitutes for what we're supposed to be caring for. Eventually you start to understand what a baby means, what it really means, and everything changes. And then you realize that all the feelings you had before weren't—" Robyn stops herself. "I mean, for me, it just put things in perspective."

ఔట్ డేటెడ్ సాఫ్ట్వేర్ కలిగిన డిజియంట్స్ ఒక్కొక్కటీ కనుమరుగైపోతుండగా 'డేటా ఎర్త్' స్థితిని వివరిస్తూ,
The private Data Earth resembles: a ghost town the size of a planet. There are vast expanses of minutely-detailed terrain to wander around in, but no one to talk to except for the tutors who come in to give lessons. There are dungeons without quests, malls without businesses, stadiums without sporting events; it's the digital equivalent of a post-apocalyptic landscape.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Developers are drawn to new, exciting projects, and right now that means working on neural interfaces or nanomedical software.

Jax is good at asking the tough questions. "The mice were the test suites," Ana admits. "But that's because no one has the source code to organic brains, so they can't write test suites that are simpler than real mice. We have the source code for Neuroblast, so we don't have that problem."

The avatars we'd give them would be humanoid, but not human. You see, we're not trying to duplicate the experience of sex with a human being; we want to provide non-human partners that are charming, affectionate, and genuinely enthusiastic about sex. Binary Desire believes this is a new sexual frontier.

The technology has undoubtedly improved since then, but it's still an impoverished medium for intimacy.

"Blue Gamma made you like food, but they didn't decide what specific kind of food you had to like"

The years she spent raising Jax didn't just make him fun to talk to, didn't just provide him with hobbies and a sense of humor. It was what gave him all the attributes Exponential was looking for: fluency at navigating the real world, creativity at solving new problems, judgment you could entrust an important decision to. Every quality that made a person more valuable than a database was a product of experience.

Sunday, December 15, 2019

Across Paris and Other Stories - Marcel Aymé

సాహితీ ప్రక్రియల్లో ఫాంటసీని ఒక అత్యుత్తమమైన ప్రక్రియగా పరిగణిస్తారు..ఈ ఫాంటసీని కాఫ్కా,బోర్హెస్ లాంటి వాళ్ళు తమ గంభీరమైన తాత్విక శైలిలో పాఠకులకు అందీ అందని పుల్లని ద్రాక్షగా చేస్తే కాల్వినో,కెరెట్ లాంటి వాళ్ళు కాస్త ఉదారంగా తమ సరళత్వంతో దానిని పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు..ఇక చాలా underrated ఫ్రెంచ్ రచయిత మార్సెల్ ఐమీ మాత్రం ఆ సరళత్వానికి చక్కని హాస్యాన్ని మేళవించి ఫాంటసీని సామాన్యులకు పళ్ళెంలో ఫలాహరంలా విందు చేస్తారు.
Image Courtesy Google
ఐమీ శైలిని గురించి చెప్పాలంటే "Martin the Novelist" అనే కథను మంచి ఉదాహరణగా చెప్పొచ్చు..గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నప్పుడు వరుసగా హీరోలూ,హీరోయిన్లు అనుకున్నవాళ్ళందరూ  చచ్చిపోతుంటే ఆ రచయిత కాస్త బ్రేక్ తీసుకుని కాఫీ తాగొస్తే బావుణ్ణనిపించింది..ఈ కథ చదివినప్పుడు George R. R. Martin అనేకసార్లు గుర్తొచ్చారు..కానీ ఈ కథలో రచయిత పేరు కూడా మార్టిన్ అని పెట్టడం కేవలం యాదృచ్ఛికమేనా అనిపించింది :) రచనా వ్యాసంగంలో రచయితలు పడే ఇబ్బందులు ఈ కథలో ప్రధానాంశం..సమాజానికి అనుగుణంగా తనను మార్చుకోలేకా,తన సృజనాత్మకతను చంపుకోలేకా ఒక నవలాకారుడు మార్టిన్ పడే సంఘర్షణను ఈ కథలో అద్భుతంగా చిత్రించారు..కథ విషయానికొస్తే,ఒకానొకప్పుడు తన రచనల్లో ప్రధాన పాత్రలనూ,ఇతరత్రా చిన్నాచితకా  పాత్రలనూ అలవాటుగా,ఇష్టంగా చంపేసే మార్టిన్ అనే ఒక నవలాకారుడుండేవాడు.అతడు ఎంత ప్రయత్నించినా ఈ పాత్రలను చంపేసే విచిత్రమైన అలవాటు మాత్రం పోయేది కాదు.

కానీ నిజానికి మార్టిన్ చాలా దయగల రచయిత..తన పాత్రలను పండుముసలి వయసు వరకూ సజీవంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా పాత్రల్ని చంపాలనే ప్రేరణ మాత్రం అతడిలో చాలా తీవ్రంగా ఉండేది..ఒకసారి ఒక నవలలో తన హీరోయిన్ ని ఎలా అయినా బ్రతికించుకోడానికి మిగతా పాత్రలన్నింటినీ చంపేస్తాడు..తన తెలివితేటలకు తానే మురిసిపోతూ భుజం తట్టుకుంటుండగా పాపం ఆ పేద హీరోయిన్ థ్రోమ్బోసిస్ (రక్తం గడ్డకట్టుట) అనే వ్యాధితో నవల ముగిసేలోపు కేవలం పదిహేను లైన్ల ముందు ఠపీమని మరణిస్తుంది..ఇక ఇది అయ్యేపని కాదని కూలబడిన మార్టిన్ కు మరో మెరుపులాంటి ఆలోచన వస్తుంది..ఈసారి అతడు తన నవలలో ఐదేళ్ళు దాటని పసిపిల్లలను ప్రధానపాత్రలుగా చేసుకుని కథ రాయడం మొదలుపెడతాడు..కానీ నవల పదిహేనువందల పేజీలకు చేరేసరికి వాళ్ళందరూ Octogenarians (ఎనభయ్యేళ్ళ వారు) గా మారతారు..ఇక ఆ దేవుడు కూడా వాళ్ళని చావకుండా కాపాడలేకపోతాడు..

కానీ ఈ కారణంగా అటు అతడి రచనల్ని ఎంతో ఇష్టంగా చదివే పాఠకులకూ,ఇటు ప్రచురణకర్తలకూ కూడా అతడిపై చాలా కోపంగా ఉండేది..క్రమేపీ మార్టిన్ రచనలకి పాఠకుల కొరత మొదలైంది..మార్టిన్ ఒక రచయితగా తన నిజాయితీని చంపుకోలేక,పేదరికాన్ని ఎదుర్కోలేక నానావస్థలూ పడుతుంటాడు..మార్టిన్ తీరుకి విసిగివేసారిన ప్రచురణకర్త,అతడు రాయబోయే మరో కొత్త కథను గురించి ప్రస్తావించడానికి వచ్చిన మార్టిన్ తో ఏ ముఖ్య పాత్రనూ చంపకుండా ఆ నవలను రాయమనీ,లేకపోతే అతడి నవలను ప్రచురించనని హెచ్చరిస్తూ మాట తీసుకుంటాడు.ఇక మన రచయిత మార్టిన్ గారి కష్టాలు మొదలవుతాయి..కథ పబ్లిషర్ అడిగినట్లు రాస్తే ఒక రచయితగా తన వృత్తికి న్యాయం చెయ్యలేడు..అలాగే తనకు నచ్చినట్లు కథ రాస్తే తన జీవనోపాథి కోల్పోతాడు..ఈ క్లిష్టమైన పరిస్థితిలో మార్టిన్ Alfred Soubiron అనే నలభై ఐదేళ్ళ నీలి కళ్ళ కథానాయకుడి గురించి ఒక కథను రాయడం మొదలుపెడతాడు.ఈ కథా,అందులోని మలుపులూ పాఠకులు చదివి తీరాల్సిందే..ఈ  మధ్యకాలంలో ఒక కథ చదివి ఇంత కడుపుబ్బ నవ్వుకున్నది లేదు..కథలోని పాత్రలు సజీవంగా మార్టిన్ కళ్ళముందు ప్రత్యక్షమవ్వగా రచయితకూ,పాత్రలను మధ్య జరిగే సంవాదం,రచయిత అంతః సంఘర్షణా ఈ కథను ఒక అసాధారణమైన కథగా నిలబెడతాయి.

పుస్తకంలోనుండి కొన్ని వాక్యాలు,

It is not unusual for a novelist to be visited by his characters, although they do not ordinarily
manifest themselves in so substantial a form.

 I have less responsibility in the matter than you might think. (An honest novelist is like God, he has only limited powers. His creatures are free. He can only suffer with them in their misfortunes and regret that their prayers are in vain. He has over them only the power of life and death; and in the sphere of chance, where destiny sometimes allows him a small margin, he may be able to afford them modest consolations. But we can no more change our minds than can God himself. All things are ordained in the beginning, and once the arrow has been loosed it cannot be drawn back.'

'What right? The novelist's right, of course! I can't make my characters laugh when they feel like crying. I can't make them behave according to impulses which are not theirs, but I can always bring their lives to an end. Death is something that everyone carries with him at every moment so that any moment I care to choose is the right one.'

And writers are nothing but bloody butchers! Come along, darling, you go first. He wanted to murder me. Jiji, I'm afraid. God knows what he'll be up to next, in his infernal novels. The man frightens me.

Friday, November 29, 2019

Suicide - Edouard Levé

'Nobody realizes that some people expend tremendous energy merely to be normal.' అంటారు ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామూ..అస్తిత్వవాదం అర్థం తెలీకో,లేక తెలిసినా తెలియనట్లు తెచ్చిపెట్టుకున్న అజ్ఞానంతోనో జీవితాన్ని ఆనందంగా బ్రతికేసే వివేకవంతులు కొందరైతే ,కళ్ళుమిరుమిట్లు గొలిపే వెలుగులో జీవితాన్ని సంపూర్ణంగా దర్శించాలని తపనపడుతూ నిత్యం అవిశ్రాంతంగా సత్యశోధనలో మునిగితేలేవాళ్ళు మరికొందరు..కొందరికి సరళంగా,సాధారణంగా అనిపించే విషయాలు కొందరికి మాత్రం అతి సంక్లిష్టంగా అనిపిస్తాయెందుకూ !! ఇంద్రధనుస్సును తలపించే జీవితం కొందరికి మాత్రం వర్ణవిహీనంగా ఎందుకనిపిస్తుంది !! జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురీది పోరాడి గెలవాలనే జీవితేఛ్ఛ కొందరిదైతే,దూదిపింజలాంటి అల్పమైన జీవితం పోరాటయోగ్యమైనది కాదని కొందరు ఎందుకనుకుంటారు !! మనిషిగా పుట్టినప్పటికీ ఈ భూమ్మీద తోటి మనుషులలో ఒకరిగా తనను తాను ఐడెంటిఫై చేసుకోవడంలో కొందరు మాత్రమే ఎందుకు విఫలమవుతారు !! ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పడం కష్టమంటారు ఫ్రెంచ్ రచయిత,ఆర్టిస్టు అయిన Edouard Leve..ఈ పుస్తకం రాసిన సరిగ్గా పది రోజులకు తన 42 ఏళ్ళ వయసులో ఆత్మహత్యకు పాల్పడిన లెవీ రచనను ఒక నవలగా కంటే ఒక 'పబ్లిక్ సూసైడ్ నోట్' లా చదవడం అవసరం.
Image Courtesy Google
ఈ కథంతా 'నువ్వు' అంటూ ఆత్మహత్య చేసుకున్న ఒక స్నేహితుణ్ణి సంభోదిస్తూ సెకండ్ పర్సన్ లో సాగుతుంది..ఇందులో కథంటూ ప్రత్యేకం ఏమీ లేకపోయినా ఈ రచనను చదివించేలా చేసిన అంశం సెకండ్ పర్సన్ నెరేషన్ కావడమే అనిపించింది..అనేక విడివిడి సందర్భాలను డాట్స్ లాగా కలుపుకుంటూ ఒక జర్నల్ ని తలపించే కథనంలో భాగంగా లేవనెత్తే అనేక అస్తిత్వవాద ప్రశ్నలు పాఠకులతో రచయిత ప్రత్యక్షంగా సంభాషిస్తున్న భావనను కలిగిస్తాయి..కాగా కొన్ని సార్లు ఈ కథలో పాఠకుల్ని కూడా భాగస్వాముల్ని చేసుకునే దిశగా సన్నిహితమైన సంభాషణలుంటాయి.

మనిషికి ప్రేమించేవాళ్ళకంటే అర్ధంచేసుకునేవాళ్ళు దొరకడం ఒక అదృష్టం..అలా కానినాడు చుట్టూ రక్తసంబంధీకులూ,స్నేహితులూ,సన్నిహితులూ ఇలా ఎంతమందున్నా వర్ణించనలవికాని పరాయీకరణ భావనలో కొట్టుకుపోతాడు..ఆత్మహత్యల కథలు వింటే ఒక్కోసారి మనిషి 'Belongingness' కోసం పడే తపన మరిదేని కోసమూ పడడేమో అని కూడా అనిపిస్తుంది.
"నువ్వు ఈ ప్రపంచంలో ఇమడలేవని నీకు అనిపించినప్పుడు నీకు ఆశ్చర్యం కలగలేదు కానీ ఈ ప్రపంచం చేత సృష్టించబడిన జీవి ఇక్కడే పరాయివాడిగా జీవిస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉంది..మొక్కలు ఆత్మహత్య చేసుకుంటాయా ? నిరాశానిస్పృహలతో మృగాలు మరణిస్తాయా ? అవి తమ ధర్మాన్ని నిర్వర్తిస్తాయి లేదా ఈ భూమ్మీద నుండి మౌనంగా అదృశ్యమైపోతాయి..బహుశా నీవొక దుర్బలుడివి,ఒక ఆకస్మిక పరిణామపు తుది మజిలీవి,పురోభివృద్ధికి ఎంతమాత్రమూ ఆస్కారంలేని ఒక తాత్కాలిక వ్యతిరిక్తానివి." అంటారొకచోట.
 "వయసుతోపాటు దుఃఖం కూడా తగ్గుముఖం పడుతుందని నువ్వు నమ్ముతావు,ఎందుకంటే అప్పుడు విచారంగా ఉండడానికి నీకు ఎక్కువ కారణాలు ఉంటాయనుకుంటావు..యవ్వనంలో ఉన్నప్పుడు నీ బాధ తీర్చలేనిది,ఎందుకంటే అది ఎవరి దృష్టికీ అందనిది..నిరాధారమైనదీ,నిరర్ధకమైనదీను..Your suicide was scandalously beautiful." అంటారు మరోచోట.
ఆత్మహత్య వివరణను కోరుతుంది.దానికి కారణభూతమైన అంశాలపై ఆరాతీస్తూ మృతుల సన్నిహితుల మధ్య చాలా కాలంపాటు సంతాపసహిత విశ్లేషణలకు దారితీస్తుంది..పైకి నవ్వుతూ తుళ్ళుతూ అతి సాధారణంగా కనిపించే వ్యక్తుల హృదయాంతరాల్లో ముసురుకున్న చీకట్లు ప్రాణాలు తీసుకునే దిశగా ఎలా ప్రేరేపిస్తాయో ఆ దారుల్లో తుదికంటా ప్రయాణం చేసినవారికి తప్ప చెప్పడం కష్టం..కానీ చిక్కేమిటంటే ఆ దారుల్లో ప్రయాణించి వెనుదిరిగి వచ్చినవారు లేరు..కానీ ఈ రచనలో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మనస్థితిని అంచనా వేసే దిశగా పలు విశ్లేషణలుంటాయి.
"నిజానికి నీకు చావంటే భయం లేదు..దానిని కోరుకోకుండానే నువ్వా మార్గంలో అడుగుపెట్టావు,యెఱుకలేనిదాన్ని ఎవరు కోరుకుంటారు ? నువ్వు జీవితాన్ని తిరస్కరించలేదు కానీ సుదూరతీరాలపట్ల నీకున్న రుచిని చాటుకున్నావు..నీకు అపరిచితమైన ఆవలితీరంలో ఉన్నదేదో ఇక్కడికంటే సుందరమైనదని పందెం వేశావు..నువ్వో పుస్తకం చదువుతున్నప్పుడు “Other Works By" పేజీకి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తావు..అవి చదివే ఉద్దేశ్యం నీకుందో లేదో తెలీదు గానీ ఆ కొత్త శీర్షికలు సూచించే కొత్త లోకాలను ఊహించుకుంటూ నీ మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుంది..'Neruda’s Residence on Earth' ను నువ్వు చదవలేదు,ఆ సంపుటిలో ఉన్న కవిత్వం ఆ శీర్షిక స్థాయికి తూగలేదేమోనని భయపడ్డావు..అపరిచితమైనవిగా ఉన్నపుడే అవి నీకు వాస్తవంగా,సన్నిహితంగా అగుపించాయి..పరిచయాలు నీకు నిరాశనే    మిగులుస్తాయనుకుంటావు."
"నీ జీవితం ఒక పరికల్పన..వృద్ధాప్యంతో మరణించినవారు భూతకాలపు సృష్టిగా మిగిలిపోతారు,వారి గురించి ఆలోచిస్తే వారి గతించిన జీవితం గుర్తొస్తుంది..నీ గురించి ఆలోచిస్తే నువ్వెలా జీవించి ఉండేవాడివో అని తలపోస్తాము..You were, and you will remain, made up of possibilities." అంటారు మరణించిన స్నేహితుణ్ణి గుర్తుచేసుకుంటూ.
ఈ రచన ఆద్యంతమూ ఒక 'రెస్ట్లెస్ టోన్' లో సాగుతుంది..పోగొట్టుకున్న దాని గురించి వెతుకులాట,తెలీని తీరాలను చేరుకోవాలనే తపన మనిషిలో స్వభావసిద్ధమైన అంశాలైనప్పటికీ ఈ రచనలో అవి ఒక ఉన్మాద స్థాయిలో కనిపిస్తాయి..ఎల్లపుడూ మెలకువగా ఉండే స్పృహ మనిషికి శాపమో వరమో అర్ధంకానీ సందిగ్ధంలోకి పాఠకుల్ని నెట్టేస్తుందీ కథ..జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే అనుక్షణం పూర్తిస్థాయి స్పృహతో ఉండాలని అంటుంటారు కానీ ఒక్కసారంటూ ఆ భావోద్వేగాల అలజడితో మమేకమయ్యాక మళ్ళీ జీవితంనుండి విడివడి నిర్లిప్తంగా ఉండగలగడం సాధ్యమేనా అనే పలు ప్రశ్నలు లేవనెత్తుతుందీ పుస్తకం..కొందరు రచయితలు పాఠకుల్ని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా గమ్యం చేరేవరకూ ప్రయాణం చేయిస్తారు,కానీ పాఠకులపై కించిత్ కన్సర్న్ కూడా లేకుండా తమతో పాటు సుళ్ళుతిరుగుతున్న లోతైన అగాథంలోకి లాగేసుకుని అమాంతం చెయ్యి వదిలేసే రచయిత ఈ లెవీ..ఈ పుస్తకంలో అంతర్లీనంగా ఉండే 'Melancholy' మూడ్ ని తప్పించుకోవడం పాఠకుల తరం కాదు..దుఃఖాన్ని ఆలింగనం చేసుకోగలిగే సంసిద్ధత ఉన్న సమయాల్లో మాత్రమే చదవాల్సిన పుస్తకం ఇది..జాగ్రత్త సుమా..

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
In front of an object whose function you did not know, but which you knew you could understand if you made the effort, you sometimes preferred to remain at the stage of speculation and spectacle, as when you basked in front of a beautiful landscape: to see it from a distance was enough for you; you didn’t need to walk through it. To catch sight of an island from a boat could be more pleasurable than ever setting foot on it.

Since you seldom spoke, you were rarely wrong. You seldom spoke because you seldom went out. If you did go out, you listened and watched. Now, since you no longer speak, you will always be right. In truth, you do still speak: through those, like me, who bring you back to life and interrogate you. We hear your responses and admire their wisdom. If the facts turn out to contradict your counsel, we blame ourselves for having misinterpreted you. Yours are the truths, ours are the errors.

You remain alive insofar as those who have known you outlive you. You will die with the last of them. Unless some of them have made you live on in words, in the memory of their children. For how many generations will you live on like this, as a character from a story?

You preferred reading standing up in bookstores to reading sitting down in libraries. You wanted to discover today’s literature, not yesterday’s. The past belongs to libraries, the present to bookstores. You were, however, more interested in the dead than in contemporaries. More than anything else, you used to read what you called “the living dead”: deceased authors still in print. You trusted publishers to bring yesterday’s knowledge into actuality today. You didn’t really believe in miraculous discoveries of forgotten authors. You thought time would sort them all out, and that it’s better to read authors from the past who are published today than to read today’s authors who would be forgotten tomorrow.

Being forgotten spares me the trouble of having to shine.”

In art, to reduce is to perfect. Your disappearance bestowed a negative beauty on you.

You renounced the future, the future that allows for survival, because we believe it is infinite. We want to be able to embrace all the earth, to taste all its fruits, to love all men. You rejected these illusions, which feed us with hope.

While traveling, a new destination would seem more desirable to you than wherever you were, right up to the moment you got there and found that your dissatisfaction had followed you: the mirage had shifted to the next stopover point. Yet your preceding stops would become more attractive as you got further away from them. For you, the past would be forever improving, the future would draw you forward, but the present would weigh you down.When you traveled, it was to taste the pleasures of being a stranger in a strange town. You were a spectator and not an actor: mobile voyeur, silent listener, accidental tourist. At random, you would visit public spaces, squares, streets, and parks. You would go into stores, restaurants, churches, and museums. You liked public places where no one was surprised if you stood still in the middle of the urban flux. The crowd guaranteed your anonymity.

You used to drift through a visual form of communism, according to which things belonged to those who looked at them. In the midst of this utopia, which only your fellow lone voyagers would perceive, you used to transgress society’s rules unknowingly, and no one would hold you accountable for it. You would mistakenly enter private residences, go to concerts to which you had not been invited, eat at community banquets where you could only guess the community’s identity when they started giving speeches. Had you behaved like this in your own country, you would have been taken for a liar or a fool. But the improbable ways of a foreigner are accepted. Far from your home, you used to taste the pleasure of being mad without being alienated, of being an imbecile without renouncing your intelligence, of being an impostor without culpability.

 In books, life, whether it was documented or invented, seemed to you more real than the life you saw and heard for yourself. It was when you were alone that you used to perceive real life. When you recalled it, it was made weaker by your memory’s many points of imprecision. But others had imagined life in books: what you were reading was the superimposition of two consciousnesses, yours and that of the author. You used to doubt what you had perceived, but never what others invented. You suffered real life in its continuous stream, but you controlled the flow of fictional life by reading at your own rhythm: you could stop, speed up, or slow down; go backward or jump into the future. As a reader, you had the power of a god: time submitted to you. As for words, even the best-chosen ones, they passed like the wind. They would leave traces in your memory, but your recollecting them made you doubt their existence. Did you reconstruct them as they had been spoken, or did you remodel them in your own style?

Saturday, November 23, 2019

Diary of a Malayali Madman - N.Prabhakaran

No one sees him; no one hears him. No one, perhaps, even knows about him..ఇవి ఈ పుస్తకంలోని తొలికథ వైల్డ్ గోట్ లో ప్రారంభ వాక్యాలు..ప్రతీ మనిషిలోనూ ఎవరికీ కనిపించనీ,వినిపించనీ మరో మనిషుంటాడు..సామజిక కట్టుబాట్లకు లోబడి నలుగురితో పాటూ అడుగులో అడుగేస్తూ నడిచే మనిషొకరైతే,సామజిక చట్రానికి దూరంగా సృష్టిలో అన్ని జీవాల్లాగే తాను కూడా ఒక జీవిననే స్పృహ కలిగి,ఆధునికత,నాగరికత బొత్తిగా వంటబట్టని స్వచ్ఛమైన పశుప్రవృత్తిని అంతర్లీనంగా కలిగుండే మనిషి మరొకరు..ఒక్కో విధమైన సామజిక చట్రంలో మనిషి ఒక్కో విధంగా వ్యవహరించాలనే పారదర్శకమైన సామజిక కట్టుబాటు ఒకటి ఉంటుంది..అలా వ్యవహరించలేని మనిషి సమాజంలో 'Odd man out' గా పరిగణింపబడతాడు.
Image Courtesy Google
ఈ 'Odd man out' కి కొన్ని ప్రత్యేక గుణగణాలుంటాయి..మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేకపోవడం,అందరూ ఆమోదించిన విషయంలో విభేదించడం,సామజిక నియమోల్లంఘన చెయ్యడం,టూకీగా చెప్పాలంటే అన్నిటికీ ఎడ్డెమంటే తెడ్డెమనడం ఈ లోపలి మనిషి ప్రవృత్తి..ఉదాహరణకు ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే రుచీపచీ లేని వంటని సంస్కారవంతమైన(?) మనిషి అద్భుతంగా ఉందని పొగిడే సందర్భంలో ఈ 'లోపలి మనిషి' మాత్రం అస్సలు తడుముకోకుండా "ఇది విందా ? నా బొంద !! " అని ఆతిథ్యం ఇస్తున్నవారు విస్తుపోయేలా వారి మొహం మీదే నిజాయితీగా తన అభిప్రాయం వెలిబుచ్చుతాడు..ఈ 'లోపలి మనిషి' మాటలు పొరపాటున గొంతుదాటి బయటకి వచ్చాయా ! అంతే సంగతులు,పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..సమాజం అతనికి మర్యాద,నాగరికత,సంస్కారం మొదలైన ఉత్తమపురుష లక్షణాలు లేవని తీర్మానించి అతనికి మతిభ్రమించిందని ఒక్కమాటలో తేల్చిపారేస్తుంది..కానీ నిశితంగా గమనిస్తే ఇక్కడ ఆ వ్యక్తి చేసిన తప్పల్లా ఎటువంటి వడపోతలూ లేకుండా నిజం నిజాయితీగా చెప్పడమే..ఈ విషయం తెలిసినా తెలీనట్లు నటించడం,నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకపోవడమే మానవసమాజపు 'నాగరికత'..పైన రాసిన ఒక సరదా ఉదాహరణ ప్రక్కన పెడితే నిత్యజీవితంలో ముఖ్యమైన ఎన్నో సందర్భాల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి  గొంతుకడ్డుపడే సంస్కారం(?) సగటు సంఘజీవి నోరు కట్టేస్తుంది..అందరూ ముక్తకంఠంతో అవునంటూ ఆమోదించిన ఒక అసత్యాన్ని "కాదు" అని అరిచి మరీ నిజం చెప్పాలని తాపత్రయపడే అటువంటి కీలక సందర్భాల్లోనే  మలయాళ రచయిత ప్రభాకరన్ కథలు జీవంపోసుకుంటాయి..ఆయన కథలన్నిటిలో నిత్య జీవితంలో నైతికత,నాగరికతల పేరిట గొంతుకడ్డంపడే అస్పష్టమైన మాటలేవో  బయల్పడే వ్యర్ధ ప్రయత్నం చేస్తాయి..ప్రభాకరన్ తన కథల్లో ప్రతి మనిషిలోనూ ఉండే ఈ 'లోపలిమనిషి' అంతరాత్మకు గళాన్నిచ్చే ప్రయత్నం చేశారు రచయిత..

రచయిత కన్నూర్ జిల్లాకు చెందినవారు కావడంతో ఇందులోని ఐదు కథలూ ఉత్తర కేరళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి..ఆ ప్రాంతాల్లో కొంతకాలం నివసించిన కారణంగా ఈ కథలతో నేను మరింత దగ్గరగా కనెక్ట్ అయ్యాను..కాఫీ,తేయాకుల పచ్చదనాలతో జాతీయ అంతర్జాతీయ యాత్రికులకు కనువిందుచేసే కేరళ భౌతిక స్వరూపం అందరికీ సుపరిచితమే కానీ ఈ కథలు సుందర ప్రకృతి వర్ణనలతో బాటుగా యాత్రికుల దృష్టికందని కేరళ ఆత్మను కూడా పరిచయం చేస్తాయి..'వైల్డ్ గోట్' అనే కథలో జార్జ్ కుట్టి అనే యువకుడు తన చుట్టూ ఉన్న స్వార్ధపూరితమైన సమాజంలో ఇమడలేక పడే అంతఃసంఘర్షణను చిత్రిస్తారు..సామాజిక వైకల్యాలకూ,కల్మషాలకూ దూరంగా జార్జ్ అడవిలోకి పారిపోయి ప్రకృతితో మమేకమై స్వాంతనను పొందుతాడు.."అతడు రోదిస్తున్నాడు..మరోసారి రోదిస్తున్నాడు...ఎవరూ అతణ్ణి చూడలేరు,వినలేరు..ఎవరూ అతణ్ణి అర్ధం చేసుకోలేరు" అంటూ ఈ కథలో ఒక సంఘజీవిగా జార్జ్ అస్తిత్వవాద సంఘర్షణను ఆవిష్కరించారు ప్రభాకరన్..జార్జ్ తనను ఒక మనిషిగా కంటే కౄరత్వమున్నప్పటికీ కల్మషంలేని మృగంతోటి ఐడెంటిఫై చేసుకుంటాడు.

High up on the cliff, at the edge of the frightening drop, he is alone in the moonlight, a forlorn slice of darkness, a dream animal. He bleats. His gaze wanders the valley. In the countless lanes hidden beneath the undergrowth, he searches for me. Agitated wanderings, secret pleasures sprouting like new meadow grass, anxious thickets of thorn – his memories are endless. He waits for the moment when they will merge together in a brilliant dance, a moment like a drop of fire. In the intensity of his anticipation, he calls out, again and again.

రెండో కథ 'టెండర్ కోకొనట్' లో ఒక సైకియాట్రిస్ట్ తన దగ్గరకు వచ్చిన రోగి వ్యక్తిగత జీవితంపై కుతూహలంతో అతణ్ణి వెంబడించినప్పుడు అతని జీవితంలో కొన్ని రహస్యాలు వెలుగుచూస్తాయి..కేరళలో ఈనాటికీ వ్రేళ్ళూనుకుని ఉన్న మతమౌఢ్యాలకు ఈ కథ దర్పణం పడుతుంది..మూడో కథ 'పిగ్ మాన్' ఒక పందుల్ని పెంచే పరిశ్రమలో సూపర్వైజర్ గా పని చేసే వ్యక్తిని గూర్చిన కథ స్వలాభాపేక్షతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారుల జీవితాల్ని బట్టబయలు చేస్తుంది..రచయిత స్వానుభవాలనుండి జీవం పోసుకున్న ఈ కథల్లో కాల్పనికత కంటే వాస్తవికతే అధికంగా కనిపిస్తుంది.

ఈ కథల్లో 'Invisible Forests' అనే ఒక్క కథను మాత్రం ఒక స్త్రీ దృష్టికోణం నుంచి రాశారు..మాతృస్వామ్యం నామమాత్రపు వ్యవస్థగా అమలులో ఉన్న కేరళ రాష్ట్రంలో వివక్షల పేరిట స్త్రీలు ఎదుర్కునే సమస్యలను కృష్ణ అనే స్త్రీ జీవితానుభవాలను సాయంతో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశారు..చివర్లో అనేక జీవితానుభవాలను నెమరువేసుకుంటూ ఇంటి వైపుకి అడుగులు వేస్తున్న కృష్ణ అంతరంగాన్ని మన ముందుంచుతూ ఈ కథను ముగిస్తారు...Krishna felt that there were dense forests in front of her, behind her and around her, closing in on her from all sides. She felt the desperate urge to talk about something – anything – to rescue herself from the feeling of being engulfed. But what she muttered, as she struggled to breathe, was this: ‘Yes, forests. Definitely forests.’..

ఇక ఐదో కథ పేరుకు తగ్గట్టు 'డైరీ ఆఫ్ అ మాడ్ మాన్' తన చుట్టూ మామూలు మనుషుల్లా బ్రతికేస్తున్న పిచ్చి వాళ్ళని గురించి ఒక పూర్తి స్థాయి స్పృహలో ఉన్న వ్యక్తి పిచ్చివాడినని చెప్పుకుంటూ రాసుకునే డైరీ..ఈ కథ రాయడానికి గొగోల్ 'డైరీ ఆఫ్ అ మాడ్ మాన్' కథను ప్రేరణగా చెప్పుకుంటాడు..దేవభూమి యొక్క బాహ్య సౌందర్యం చాటున మరుగునపడిపోయిన స్వార్థపరత్వం,కుటిల రాజకీయం,కుతంత్రపు మాలిన్యాలకు ఈ కథ అద్దంపడుతుంది..ఇందులో రాక్షసులు రాజ్యమేలే ఒక సరికొత్త దేవభూమిని(?) చూస్తాం..ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే కేరళ సమాజం కూడా కుటిల రాజకీయ ప్రభావాలకు అతీతమైనదేమీ కాదు..ఈ కథల్లో కేరళలో వ్రేళ్ళూనుకున్న కులవ్యవస్థ,మాతృస్వామ్యం ముసుగులో శాసించే పురుషాధిక్యత,కమ్యూనిస్టు,మార్క్సిస్టు భావజాలాలూ ఇవన్నీ కేరళను కూడా మిగతా రాష్ట్రాల్లాగే ఎటువంటి ప్రత్యేకతలూ లేని ఒక సాధారణ భౌతిక స్వరూపంగా నిలబెడతాయి..ప్రభాకరన్ సృష్టించిన పాత్రలు ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాకుండా సమాజాన్ని యథాతథంగా చూసే ప్రయత్నం చేస్తాయి..ఈ 'ఆడ్ మాన్ అవుట్' లకు సమాజం మీద నమ్మకం,గౌరవం రెండూ  ఉండవు..ఒక్కోచోట ఎటువంటి వడపోతలూ లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించే ఈ పాత్రల మాటలన్నీ దిశానిర్దేశంలేని 'Non-stop ranting' లా అనిపిస్తాయి..మార్క్సిస్టు,కమ్యూనిస్టు భావజాల మధ్య కేరళ రాజకీయ చిత్రాన్ని దగ్గరగా చూపించే ఈ కథలకు ప్రారంభంలో గీసిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ..ప్రతీ చిత్రంలో నీడలాంటి ప్రతిబింబాన్ని వాస్తవికతతో ముడివేసి దిశగా తీర్చిదిద్దారు..కేరళ అందచందాలు అందరికీ తెలిసినవే కానీ కేరళ అంతరాత్మను తెలుసుకోవాలంటే ఈ కథలు చదవండి.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

వాయనాడ్ లో ఉండగా అక్కడ వారి ఆహారపుటలవాట్లను దగ్గరగా చూశాను..కర్రపెండలం,చేపల పులుసు వారికి అక్కడ మెయిన్ కోర్స్ లో తింటారు..
Come, let’s go find some food – kanji and chammanthi, or perhaps some tapioca with fish curry.

This rule, that the deity of Kudungomkaavu – Kudungothappan – could not have a male priest and must be attended to by unmarried women priests, and a different one each day, was apparently set right at the time the temple was built.

People seem scared of developing anything other than a passing acquaintance with one another. Or perhaps they don’t wish for anything more than that.

“Psychology is a false science. It is nothing but a labyrinth of analysis. You never come out with a solution. Mental illness is the destiny of the mentally ill. The problems you face in your life are the result of that life – a life you have no control over, in which you have no choice. Even your choices are not of your own choosing.

Have you heard of a writer named Gogol? It is unlikely, if you are below the age of thirty. People below thirty are generally ignorant. They may have a degree or two, but when it comes to general knowledge they have none. There’s no way they would have heard of Gogol. In actual fact, Gogol is a great literary figure. Here, in Kerala, most people say they like Dostoevsky, or perhaps Tolstoy. Me, I like this fellow Gogol. Anyway, my intention is not to get into a literary discussion. The reason I thought of Gogol just now is because he has written a story called ‘Diary of a Madman’.

As my reading progressed, I began to feel that I should get acquainted with writers and theatre people. I met some in person and had telephone conversations with some others. Compared to the people at the places where I used to work, these literary people have several good qualities. For one thing, they seem to grasp quickly things that many others would never be able to understand. But commonalities aside, they are as varied as any other group of human beings. Among them are the good, the malevolent, the conceited, the clever, the extremely vulnerable, the crooks, the helpers, the cultured, and the rogues. At the mere hint of any situation that may cause personal harm or threat to them, they tend to withdraw rather quickly – some make strange arguments, while others slink away quietly. This tendency for self-preservation seems to be the other commonality among them. You must forgive me for saying these things about our highly respected literary figures.

So many things happen in this world that we’ll never be able to comprehend.

Tuesday, November 19, 2019

3 Strange Tales - Ryūnosuke Akutagawa

Image Courtesy Google
అకిరా కురోసావా మాస్టర్ పీస్ 'రషోమోన్'  సినిమా చూసినవారికి అకుతగవా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు..పటిష్టమైన స్క్రిప్ట్ రషోమోన్ సినిమా ప్రత్యేకత..మన కళ్ళతో చూసిందే నిజం,మనం మాట్లాడేదే సత్యం,మన జీవితమే ఆదర్శం అనుకునే మానవ సహజమైన అవివేకాన్ని సవాలు చేసే ఈ కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఒక సంఘటనకు ఎన్ని కోణాలుంటాయో ఈ సినిమాలో పలు మానవీయ దృక్పథాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తారు..రషోమోన్ చూసినప్పటినుంచీ దానికి మూలమైన కథను చదవాలనే కోరిక ఇప్పటికి తీరింది..మోడరన్ జపనీస్ క్లాసిక్ సిరీస్ లో భాగంగా ప్రచురించిన ర్యునోసుకే అకుతగవా '3 స్ట్రేంజ్ టేల్స్' లో Rashomon,A Christian Death,Agni అనే మూడు కథలతో పాటు  రషోమోన్ సినిమాకు మూలాధారమైన 'In a Grove' కథను కూడా బోనస్ గా ప్రచురించారు..నేను మొదటి కథ పేరు 'Rashomon' అని చూసి అదే సినిమా కథేమో అని పొరబడ్డాను,కానీ ఆ కథ వేరు.

ఇందులో మూడు కథలూ పేరుకి తగ్గట్టే చిత్రమైన కథలు..మొదటి కథ రషోమోన్ లో భూకంపాలు,అగ్నిప్రమాదాలూ,ఆహార కొరత మొదలైన అనేక ప్రకృతివైపరీత్యాల బారినపడి వినాశనానికి చేరువలో ఉన్న క్యోటో నగరంలో ఒక యజమాని (సమురాయ్) పనిలోనుండి తీసివేయగా జీవనోపాథి కోల్పోయిన పనివాడు శిథిలావస్థలో ఉన్న రషోమోన్ సింహద్వారం వద్ద కూర్చుని తన భవిష్యత్తును గురించిన ఆలోచనలో పడతాడు..క్షామం వలన తిండికి కూడా నోచుకోక చౌర్యం తప్ప మరోమార్గం లేదని తలపోస్తాడు,కానీ అలా చెయ్యడానికి అతడిలోని నైతికత అడ్డుపడుతుంది..ఇదిలా ఉండగా ఒకచోట మృతదేహాల తలలపై శిరోజాలను కత్తిరిస్తూ ఒక వృద్ధురాలు అతడి కంటబడుతుంది..దాన్నొక అనైతిక చర్యగా భావించి క్రోధంతో తన ఒరలోనుండి కత్తితీసి ఆమెను నిలదియ్యగా ఆ జుట్టుతో విగ్గులు చేసి అమ్ముతున్నాననీ,హీనమైన పని అని తెలిసినా కూడా ఆవిధంగా చెయ్యకపోతే తనకు మరణమే శరణ్యమనీ చెప్తుంది..సమురాయ్ వద్ద పని చేసివున్నవాడు కాబట్టి అతడికి అస్త్రశస్త్ర నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ,నీతీనియమాలు లాంటివి సహజంగా వంటబట్టిన లక్షణాలు..తొలుత ఆ వృద్ధురాలి మీద కోపంతో కత్తిదూసినా చివరకు ఆమె అన్నమాటల్లో యదార్థం గ్రహించినవాడై అంతవరకూ అడ్డుపడిన తన నైతికతకు కూడా తిలోదకాలిచ్చి నిర్ధాక్షిణ్యంగా ఆమె కిమోనోను లాక్కుని అక్కడనుండి వెళ్ళిపోతాడు..ఈ కథలో మానవీయవిలువలకూ,ఆకలిదప్పులతో కూడిన అవసరానికీ మధ్య జరిగే సంఘర్షణను అద్భుతంగా రక్తికట్టిస్తారు అకుతగవా..మనిషి అవసరాన్ని బట్టి మంచివాడూ,అవకాశాన్ని బట్టి చెడ్డవాడూ అవుతాడన్న ముళ్ళపూడివారి మాటను గుర్తు చేసిందీ కథ.

ఇక రెండో కథ 'A Christian Death' ఒక అనాథగా చర్చిలో ఆశ్రయం పొందిన లోరెంజో కథ..నిర్మలత్వం,మంచితనం కలగలిసి దేవుని సేవలో పవిత్రంగా జీవించే లోరెంజో అందరికీ ప్రీతిపాత్రుడు..అటువంటి లోరెంజో తనను మోసం చేసి గర్భవతిని చేశాడని ఒక యువతి ఆరోపించగా సమాజం నుండి వెలివెయ్యబడతాడు..చివరకు ఆ యువతి ఆరోపణ నిజమైందా లేదా అనే పలుప్రశ్నల మధ్య అనేక నాటకీయమైన మలుపులు తీసుకుంటుందీ కథ..ఈ కథ కూడా మతం ప్రాతిపదికగా మోరల్ ఎలిమెంట్ పై దృష్టిసారిస్తుంది..ఇక మూడో కథ 'అగ్ని' హైందవ తత్వం మూలాల్ని ఉపయోగించుకుంటూ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కలిపి రాశారు అకుతగవా..నాలుగో కథ రషోమాన్ 'ఇన్ ది గ్రోవ్' అందరికీ తెలిసిందే..ఈ కథా,సినిమా రెండూ రచయిత ఊహాత్మకతకూ,దర్శకుని దార్శనికతకూ పొంతనలుండవనీ,నిజానికి పొంతన అసాధ్యమనే జగమెరిగిన మౌలిక సూత్రాన్ని సవాలు చేస్తాయి..అకీరా కురోసావా అకుతగవా స్క్రిప్ట్ ను యధాతథంగా తెరకెక్కించారనడంలో అతిశయోక్తి లేదు.

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు అన్న చందాన 35 ఏళ్ళకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా అకుతగవా కథలు మాత్రం ఈనాటికీ తాజాగానే అనిపిస్తాయి..అన్ని తరాలకూ అవసరమైన నైతికత,నిస్వార్థ తత్వం,మానవీయ విలువల ఆవశ్యకతను తన కథల్లో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చెయ్యడమే ఆయన రచనలు కాలదోషం పట్టకుండా ఉండడానికి ప్రధాన కారణం అనిపిస్తుంది..సరళమైన వచనంతో సంక్లిష్టమైన విషయాలను సైతం అవవోకగా చెప్పడమే అకుతగవా ప్రత్యేకత..సాధారణంగా జపనీస్ సాహిత్యంలో కనిపించే దిగాలుపరిచే నిరాశావాదం అదృష్టవశాత్తూ ఈ కథల్లో నాకైతే కనిపించలేదు..సైకాలజీ,అస్తిత్వవాదం అంటే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన కథలివి.

Thursday, November 14, 2019

Pessoa on Wilde : Aesthetics & Intellect

ఆ మధ్య ఫెర్నాండో పెస్సోవా సెలెక్టెడ్ ప్రోస్ చదువుతుంటే అందులో 'On the literary art and its artists' విభాగంలో ప్రత్యేకం ఆస్కార్ వైల్డ్ గురించిన పెస్సోవా రాసిన వ్యాసం ఒకటి కనిపించింది..ఒక కొత్త స్నేహితుణ్ణి కలిస్తే,అతడు ఇద్దరికీ ఉమ్మడిగా పరిచయమున్న మరో మంచి మిత్రుడి ప్రస్తావన తెస్తే !! ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా !!అలాంటి భావన కలిగి అసలు వైల్డ్ గురించి పెస్సోవా ఏమంటారో చూద్దామని నా కళ్ళు ఆతృతగా ఆ అక్షరాల వెంబడి పరిగెత్తాయి..ఆర్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆస్కార్ వైల్డ్ ప్రస్తావన తీసుకురాని సందర్భం ఉండదంటే అతిశయోక్తి కాదేమో( ఈ మాట రాయడం బహుశా ఏ వందోసారో )..ఇష్టంగానో కష్టంగానో వైల్డ్ ను తలుచుకోవడం ఒకరకంగా సాహితీలోకపు సంప్రదాయం..కానీ కళతో అంత సాన్నిహిత్యం ఉండి,కళ పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చే వ్యక్తిని పెస్సోవా అసలు ఆర్టిస్టే కాదు పొమ్మన్నారు..ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది..కానీ తన వాదనను సమర్ధించుకుంటూ పెస్సోవా ఇచ్చిన వివరణ చదివాకా నేను వైల్డ్ ను మరో కొత్త వెలుగులో చూశాను..అప్పుడు కనిపించిన వ్యక్తి పూర్తిగా వేరు.
Image Courtesy Google
నిజమే ఆస్కార్ వైల్డ్ లాంటి వాళ్ళని చదవడంలో లాజిక్/ఇంటెలెక్ట్ అవసరపడినంత భాష మీద పట్టు అవసరం పడదు..వైల్డ్ తనలోని సౌందర్య పిపాసకు ప్రతీకగా సుదీర్ఘమైన భౌతిక వస్తు వివరణలతో దట్టించి వదిలిపెట్టే గద్యానికి మధ్య మధ్యలో ఉన్నపళంగా విసిరే వ్యంగ్యోక్తులను ఏ విధమైన ఏమరుపాటూ లేకుండా పూర్తి మెలకువతో ఒడిసిపట్టుకోగల నేర్పు పాఠకులకుంటే చాలు..నిజానికి ఆయన కథలూ,నాటకాలు మెరిసినంతగా నవల మెరుపులీనదు..పెస్సోవా అభిప్రాయం చదివాక నేను చాలా ఏళ్ళ క్రిందట చదివిన 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' గుర్తొచ్చింది..ఒక క్లాసిక్,ఒక మాస్టర్ పీస్ అంటూ జనాలు వేనోళ్ళ పొగడగా విని ఆ నవల చదివానేమో,ఇదేమి క్లాసిక్ రా నాయనా అని అనేక సార్లు  తలపట్టుకున్నాను..పేజీలకు పేజీలు వెల్వెట్ పరదాల గురించీ,వెలుగుజిలుగుల షాండలియర్స్ గురించీ వైల్డ్ విపరీత వర్ణనలు విసుగు తెప్పిస్తాయి..ఇందులో ఎస్తెటిక్స్ పేరిట అనవసరమైన ఆర్భాటాలు అనేకం ఉంటాయి..కథలూ,నాటకాల్లో వైల్డ్ కున్న పదాల పొదుపూ,నైపుణ్యం గద్య రచనలో భూతద్దం పెట్టి వెతికినా కనపడదు..పైగా నవలలో పేజీలను నింపడానికి చేసే విఫలయత్నం అడుగడుక్కీ కనిపిస్తుంది..పుస్తకం ఎప్పుడైపోతుందా అని విసిగివేసారిపోయిన పాఠకులం ఒక గాఢమైన నిట్టూర్పు విడుస్తాం చూశారా !! సరిగ్గా అప్పుడే...అదే సమయంలో ఒక గొప్ప విస్ఫోటనం జరిగినట్లు కొన్ని వాక్యాలేవో కనిపిస్తాయి..అంతవరకూ నిద్రావస్థలో ఉన్న మనం ఒక్కసారి తలవిదిల్చి మరోసారి ఆ వాక్యాలను చదువుతాము..ఇహ ఆ వాక్యాలనే కళ్ళతో ప్రేమగా నిమురుకుంటూ కాసేపు అక్కడే ఆగిపోతాం..ఈ టెక్నిక్ తో పాఠకుల్ని హఠాత్తుగా ఒక అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యేలా చేసి ఒకరకంగా దారుణంగా మోసం చేస్తారు వైల్డ్..ఈ విషయం 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' చదివినవాళ్ళకి అనుభవమయ్యే ఉంటుంది...అలాంటి విస్ఫోటనాలు పది పేజీలకొకటి జరిగి,చివరికి వచ్చేసరికి వైల్డ్ చేసిన మోసాన్ని మర్చిపోయి,మనం అమాయకంగా వైల్డ్ జీనియస్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకుని చప్పట్లు కొట్టేలా చేస్తుంది..ఆయన స్ట్రైకింగ్ quotes ఇచ్చే మత్తు అలాంటిది..అందుకేనెమో వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఆర్ట్ తో సంబంధం ఉన్న వ్యక్తిగా ఎక్కువ ఆరాధిస్తానంటారు పెస్సోవా..కనిపించే వైల్డ్ హీరో కాదు,ఆయనలో ఆటిట్యూడ్ ఇక్కడ హీరో అని అంటారాయన..వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఒక 'ఇంటలెక్చువల్' గా చూడాలంటారు పెస్సోవా.
His pose is conscious,whereas all around him there are but unconscious poses.He has therefore the advantage of consciousness.He is representative:He is conscious,
All modern art is immoral,because all modern art is indisciplined.Wilde is consciously immoral,so he has the intellectual advantage.
He did not know what it was to be sincere.Can the reader conceive this ?
He was a gesture,not a man.

Friday, October 4, 2019

The Seasons of the Soul: The Poetic Guidance and Spiritual Wisdom of Herman Hesse - Hermann Hesse

హెర్మన్ హెస్సే రాబర్ట్ వాల్సర్ గురించి మాట్లాడుతూ “if he had a hundred thousand readers, the world would be a better place,” అంటారు..వాల్సర్ ను చదివినవారికి ఆ మాటలెంత కమ్మగా అనిపిస్తాయో..ఇప్పుడు హెస్సే కవిత్వం చదివినప్పుడు సరిగ్గా నాకు అటువంటి భావనే కలిగింది..ఇలాంటి రచయితల అనుభవసారాన్ని వంటబట్టించుకుంటే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అనిపించింది..ఇరవయ్యో శతాబ్దంలో అనేక సాంస్కృతిక సంక్లిష్టతలనడుమ ఏ మార్గాన్ననుసరించాలో స్పష్టత లేక సతమతమవుతూ ఆధ్యాత్మికాన్వేషణలో ఉన్న యువతకు నోబుల్ గ్రహీత హెర్మన్ హెస్సే 'సిద్ధార్థ' కొన్ని ఆచరణయోగ్యమైన మార్గాలను సూచించిందనడంలో అతిశయోక్తి లేదు..జర్మన్ దేశీయుడైన హెస్సే తూర్పు పడమరల ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసంధానం చేస్తూ రాసిన సిద్ధార్ధను చదవనివారు బహు అరుదు..కానీ హెస్సే గద్యం తెలిసినంతగా పాఠకులకు ఆయన పద్యం గురించి తెలియదు..హెస్సే రాసిన 'The Seasons of the Soul' అనే కవితా సంపుటిలో ఆయన 64 ఏళ్ళ జీవనకాలంలో వివిధ దశల్లో రాసిన 68 కవితలు ఉంటాయి..నేను సిద్ధార్థ,Steppenwolf లు చదివిన చాలా ఏళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఆయన కవిత్వం చదవడం తటస్థించింది,కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయన స్వరంలోని అదే సుపరిచితమైన సహజత్వం,నిజాయితీ,పదాడంబరాలు లేని శైలిలో ఎటువంటి మార్పూ కనిపించలేదు..హెస్సే గద్యంలో కనిపించే సరళత్వమే పద్యంలో కూడా కనిపిస్తుంది..ఈ కవితలు కష్టసుఖాలన్నిటినీ సమానంగా స్వీకరించి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని దర్శించిన వయోవృద్ధుని అనుభవసారాలని చెప్పొచ్చు.
Image Courtesy Google
హెస్సే రచనల్లో ఎంతో సునిశిత పరిశీలన చేత మాత్రమే దర్శించగలిగే సూక్ష్మమైన ఆధ్యాత్మిక,తాత్వికపరమైన అంశాలు ఆయన్నొక సాధారణ నవలా రచయితగా కాక ఒక తత్వవేత్తగా నిలబెడతాయి..హెస్సే మీద ఈస్టర్న్ ఫిలాసఫీ,ముఖ్యంగా చైనా ఫిలాసఫీ ప్రభావం ఈ కవితల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది..అదే దేశానికీ చెందిన Friedrich Nietzsche,Arthur Schopenhauer వంటి వారి ఫిలాసఫీలో కనిపించే సంక్లిష్టత,మార్మికత,వాస్తవికతకు దూరం ఉండే ఉన్మాదం లాంటి తీవ్రమైన అంశాలు  అణుమాత్రం కూడా కనిపించకపోవడం హెస్సే తత్వంలోని ప్రత్యేకత..సత్యదూరమైన సిద్ధాంతాలు హెస్సే పదాల్లో ఇమడలేవు..ఈ కవితల్లో ఆయన బోధించిన తత్వం కర్మ సిద్ధాంతాన్ననుసరించిన ఒక సామాన్యుని అనుభవాల్లో నుండి పుట్టుకొచ్చినవే గానీ కేవలం పుస్తక జ్ఞానంతోనో,సత్యదూరమైన విశ్లేషణల ఆధారంగానో ఊహామాత్రంగా రాసినవి ఎంతమాత్రం కాదు,బహుశా ఈ కారణంగానే ఆయన కవితల్లో ఒక స్వచ్ఛమైన నిజాయితీ కనిపిస్తుంది..చైనీస్ ఆధ్యాత్మిక గురువులు Li po,Wang Wei వంటివారి ప్రభావం హెస్సే మీద ఉండటం వల్లనేమో ఆయన కవితలు కూడా చైనీస్ కవిత్వమంత సరళంగానూ,సూటిగానూ ఉంటాయి..సహజంగా ఏ ఫిలాసఫీ అయినా స్వార్ధపూరితమైన ఆత్మాభిమానం,అహంకారం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ Self-gratification దిశగా సాగడం ఎక్కువ చూస్తుంటాం..కానీ హెస్సే కవితలు దీనికి విరుద్ధంగా మనిషికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ జీవితపు వైశాల్యాన్ని అర్ధంచేసుకోవడంలో మనిషిని యవ్వనం మొదలు వృద్ధాప్యం వరకూ చేసే ప్రయాణంలో మానసికంగా బలోపేతం చెయ్యడానికి దోహదపడతాయి..ఆయన కవితలన్నీ అనుభవం,విచారణ,విశ్లేషణ, తత్పరిణామంగా జరిగే అనేక అంతఃశోధనల ఫలితం..

ఈ కవితల్లో ద్యోతకమయ్యే ప్రేమరాహిత్యం హెస్సే కు బాల్యం నుండీ వెన్నంటే ఉన్న నేస్తం..ఆయన ఒక సందర్భంలో "I was an orphan whose parents happened to be alive" అంటూ తన బాల్యాన్ని చేదుగా గుర్తు చేసుకుంటారు..అలాగే ఆయన కవిత్వానికి ఎంచుకున్న థీమ్స్ కూడా ప్రకృతితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తాయి..హెస్సే దృష్టికోణంలో ప్రకృతిలోని ప్రతీ పక్షీ,పువ్వూ,ఆకూ మనిషి నుండి వేరు కాదు..ఈ కవితల్లో ప్రకృతిలోని ఋతువులను మెటాఫోర్లుగా వాడుతూ మానవజీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు..స్థలకాలాదులనూ,ఋతువులనూ మానవజీవనానికి మూలాధార సత్యంగా చూపించడం హెస్సే ప్రధానోద్దేశ్యం..మానవ జీవితంలో ప్రతీదీ ఒక విశిష్ట సమయాన్ననుసరించి జరుగుతుంది...తపించడానికో సమయం...విరహానికో సమయం...స్వంతం చేసుకోడానికో సమయం...సేదతీరడానికో సమయం..విడుదలకో సమయం..ఇలా హెస్సే కవిత్వంలో మనిషి కూడా ప్రకృతిలో ఋతువులు రంగులు మార్చుకున్నట్లు ఒక్కో దశలో ఒక్కో తీరుగా రూపాంతరం చెందుతూ ఉంటాడు.

'The Tides of Love' విభాగంలోని కొన్ని కవితల్లో లో హెస్సే వ్యక్తిగత జీవితంలోని విఫలప్రేమల ఛాయలు కనిపిస్తాయి..ఈ కవితల్లో స్త్రీని మనిషిని మస్తిష్కాన్ని కమ్మేసే సుందరమైన మాయగా అభివర్ణిస్తారు..జీవితంలో ప్రేమతో పాటుగా ప్రేమరాహిత్యాన్ని కూడా తుది శ్వాసవరకూ ప్రేమించమంటూ,ఈ విధంగా రాస్తారు..

Wild heart of mine, remember this.
And love each feverish passion
and the bitterness of pain, love too
before you have to enter your eternal rest.

ఇరవయ్యో శతాబ్దాన్ని ఏలుతున్న 'ఆధునికత సంస్కృతి' దుష్పరిణామాలు హెస్సే దృష్టిని దాటిపోలేదు..ఒకానొకప్పుడు ఒక భారతీయ సాధువు డిస్నీ ల్యాండ్ ను సందర్శించినప్పుడు ఆ 'Temple of Distraction' ని చూస్తూ “There must be very little joy in a culture which needs to have that much fun.” అని వ్యాఖ్యానించారట..హెస్సే కూడా ఆయన వాదననే సమర్థిస్తారు..ఆత్మను విస్మరించి భౌతికమైన క్షణికానందాలకు అర్రులుచాస్తున్ననేటి తరానికి స్వాప్నికుని సృజనాత్మక ప్రపంచపు ఔన్నత్యాన్ని వివరించే దిశగా కవిత్వం ప్రాముఖ్యతను గూర్చి 'To Imagine is to Inspire' విభాగంలో కొన్ని కవితలు రాశారు.

'The Living Word' అనే కవితలో ఈ విధంగా రాస్తారు..

Poetry and music invite you
to understand the splendors of creation.
A look into a mirror will confirm it.
What disturbs us often as disjointed
becomes clear and simple in a poem:
Flowers start laughing, the clouds release their rain,
the world regains its soul, and silence speaks.

'In dialogue with the divine' విభాగం అక్కడక్కడా రవీంద్రుని గీతాంజలిని జ్ఞప్తికి తెస్తుంది.. జాతివిద్వేషాల మధ్య యుద్ధం,అశాంతి,హింసలతో సమిధగా మారుతున్న ప్రపంచాన్ని నిస్సహాయంగా చూస్తూ గీతాసారాన్ని గుర్తుచేసుకుంటూ 'భగవద్గీత' అనే ఒక కవిత రాశారు..

“War and peace, they count the same
 because no death can touch the spirit realm.

 “Whether peace reigns or is ruined,
 the world’s woes will wear on.

 “You have to struggle, cannot rest.
 Apply your strength, it is God’s will!

 “But even if you succeed a thousand times,
 the world’s heart will beat on unchanged."

అనేక ఇజాలు,ఫిలాసఫీలూ,ఆధ్యాత్మికపరమైన మార్గాలలో ఏది అనుసరణీయమో,ఏది కాదో తెలీక ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి సంక్లిష్టమైన ప్రపంచానికి తన సరళమైన కవిత్వంతో స్వాంతన చేకూర్చే స్వచ్ఛమైన గళం హెర్మన్ హెస్సేది..సూఫీ కవిత్వంలో ప్రశాంతతనూ,గిబ్రాన్ కవిత్వంలో వివేకాన్నీ,జ్ఞానాన్ని కలబోసినట్లుండే హెస్సే కవిత్వం ఈ తరం వారికి ఏ సెల్ఫ్ హెల్ప్,పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లో లేని జీవిత తత్వాన్ని బోధిస్తుంది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

"In spite of all the pain and sorrow I’m still in love with this mad, mad world"

My mind gazes on life’s landscape with detachment and keeps the homesick, quickened heartbeats at an even pace like a well-tempered tune.

Demons and devils will haunt you everywhere because your true enemy rules your heart, from whom you cannot run or flee.

నాకు నచ్చిన కొన్ని కవితలు..

1) My Misery

 My misery comes from my great talent
 to wear too many masks too well.
 I learned to deceive every one, myself included.
 I became a master manipulator of my feelings.
 No true song could reach my heart.
 Behind each step I take lurks a shrewd scheme.

 I know the source of all my suffering.
 I have traced it to my innermost core:
 Even my heartbeat is controlled and calculated.
 I make sure no dream’s deep, dark foreboding,
 no imprisoned passion, no stirring sorrow
 can break through this armor to my soul.

 2) Books

 All the books of the world
 will not bring you happiness,
 but build a secret path
 toward your heart.

 What you need is in you:
 the sun, the stars, the moon,
 the illumination you were seeking
 shines up from within you.

 The quest for wisdom
 made you comb the libraries.
 Now every page speaks the truth
 that flashes forth from you

3) Alone

 You can travel so many roads
 and so many trails all over this world,
 but remember all paths
 lead to the same finish.

 You can ride, you can drive
 in twos or in threes,
 but you must take
 the last step alone.

 No schooling, no skill
 will suffice or save you
 from having to face
 each grave challenge alone

Friday, September 27, 2019

Reading as a meditation..

One of the most effective forms of healing has been largely neglected by doctors and patients—that’s healing by reading. If you are in the dumps or in bed with a bug, or recovering from a serious illness, or waiting for a fracture to heal, get hold of books by your favourite authors and read as much as you can. You will start feeling better far sooner than if you simply lie on your back and feel sorry for yourself. (If the books put you to sleep, all the better.) And it’s safe, too: I have yet to hear of anyone dying from an overdose of reading. -- Ruskin Bond.'
Image Courtesy Google
ఇది చదవగానే ముందు నవ్వొచ్చినా తరువాత నిజమే కదా అనిపించింది..ఈ వాక్యాలు రస్కిన్ బాండ్ 'A Little Book of Life' లోనివి..ఇది చదివాకా సొంత ఘోషనుకోకపోతే ఈ రెండు ముక్కలూ రాద్దామని అనిపించింది..ఒకరికైనా ఉపయోగపడుతుందేమోనని..గత మూడేళ్ళలో మా కుటుంబంలో ఆరుగులు వ్యక్తులు వరుసగా వెళ్ళిపోయారు..వెళ్ళిపోయినవాళ్ళందరూ చిన్నప్పటినుండీ నా మీద ఎంతో ప్రభావం చూపించినవాళ్ళు,నాతో బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నవాళ్లూను.. అమ్మ,అన్నయ్య,అత్త ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన వెలితిని నింపేసి వెళ్ళిపోయారు..సరే ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా వదిలేస్తే ఓ మూడేళ్ళ క్రితం అంతా సజావుగా ఉన్న లైఫ్ ఒక్కసారిగా తలక్రిందులైపోయినట్లైంది..జీవితం నాకేం నేర్పిందో తెలీదు గానీ ఒక్క మరణం మాత్రం మనిషికి చాలా నేర్పిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను..రెండేళ్ళపాటు వరుస దెబ్బలు తిని తిని,చూస్తుండగానే అందమైన ప్రపంచం అనుకున్నదంతా భ్రమ అని తీవ్రమైన నిరాశ, నిస్పృహలు, వైరాగ్యం వచ్చేశాయి..అమ్మ తో పాటు,నన్ను ఎత్తుకు పెంచినవాళ్ళు,కుటుంబంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు ఒక్కొక్కరూ మెల్లిగా నిష్క్రమిస్తుంటే నా చిన్నతనాన్ని కూడా వాళ్ళతో ఒక్కసారిగా తీస్కెళ్ళిపోయినట్లనిపించింది..వెళ్ళేవాళ్ళు వెళ్తూ వెళ్తూ వాళ్ళతో పాటు ముడిపడి ఉన్న నా అస్తిత్వాన్ని తలా నాలుగు ముక్కలూ పంచుకుని తీసుకెళ్ళిపోయారు..ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి గానీ అవి నిజమని నన్ను నమ్మించగలిగే కంటికి కనిపించే సాక్ష్యం ఒక్కటీ మిగల్చలేదు..నా వయసు ఉన్నట్లుండి రెట్టింపైపోయిన భావన..ఏం జరుగుతోందో అర్థంకాక,మెదడులో ఏమీ ప్రాసెస్ చెయ్యలేక అదొకరకమైన నిస్సహాయతా,నిర్లిప్తతా అలముకుంది..

అలాంటి సమయంలో నన్ను ఆ వైరాగ్యం నుండి బయటకు లాగిపడేసినవి పుస్తకాలు..వినడానికి ఫన్నీగా అనిపించినా ఇది నిజం..ఇది నా అనుభవం..మనందరికీ హ్యూమన్ మోర్టాలిటీ గురించి అంతా తెలిసిందే అయినా సరే ఎందుకో అస్సలు ఒప్పుకోబుద్ధి వెయ్యదు...Grief ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హేండిల్ చేస్తారంటారు..ఒక్కోసారి నాలోకి నేను వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోయినా,మరోసారి వాస్తవంలోకి లాక్కొచ్చి పడేసే చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం 'All is well' అనుకునేలా చేస్తుంది...కడుపునిండా తింటున్నాం,చల్లగా ఉంటున్నాం..ఇంకా వీటికి మించి ఆశించడం అత్యాశ కదూ అని ఒకప్రక్క మనసు హితవు చెప్తూనే ఉంటుంది..ఓ రెండ్రోజులు అంతా బావున్నట్లే అనిపిస్తుంది..మళ్ళీ మూడోరోజు మనసు మూలల్లో ఎక్కణ్ణుంచో తెలీదు పెను తుఫానులా మనసంతా చీకట్లు కమ్మేసినట్లు అనిపిస్తుంది...ఆ 'Emptiness' ని వర్ణించతరం కాదు..Grief గురించి చదవడం వేరు,అనుభవించడం వేరు..ఏ వ్యక్తీకరణకూ అందని భావన అది...సరిగ్గా అటువంటి సమయాల్లో పుస్తకం పట్టుకుంటే కళ్ళు అక్షరాలవెంట అలుపు లేకుండా పరిగెత్తేవి..మొదట్లో కళ్ళని వీడి మనసు మాత్రం ఎక్కడెక్కడో చీకటి ప్రపంచాల్లో విహరించి వచ్చేది..కానీ కళ్ళు మాత్రం నిరాఘాతంగా వాటి పని అవి చేసుకుంటూపోయేవి..నేనైతే అదొక రకమైన 'మెడిటేషన్' అంటాను..కానీ ఈ క్రమంలో మెల్లిగా ఆ chaos లో ఒక మెంటల్ బాలన్స్ అలవడింది..ఆ సమయంలో నన్ను వెతుక్కుంటూ (నిజమే నన్ను వెతుక్కుంటూనే వచ్చాయి ) వచ్చిన కొన్ని పుస్తకాలు అతుల్ ఘవన్డే 'బీయింగ్ మోర్టల్',హెలెన్ మాక్ డోనాల్డ్ 'H is for Hawk',Oliver Sacks 'Gratitude',Dalai Lama 'The Book of Joy', Rebecca Skloot 'The Immortal Life of Henrietta Lacks', Mary Roach 'Stiff: The Curious Lives of Human Cadavers' లాంటివి ఎటువంటి డిప్రెషన్ బారినా పడకుండా ఆ వైరాగ్యం నుంచి నన్ను బయటకు లాగి పడేశాయి..ఆ సమయంలో దొరికిన,కనిపించిన ప్రతీ పుస్తకమూ చదివేదాన్ని..ఎప్పుడో జీవితాన్ని కాచి వడపోసి పుస్తకాల రూపంలో మనకు అందించిన ఎంతోమంది రచయితల సాహచర్యంలో నా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయనిపిస్తుంది..మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి..Thanks to the books and so many authors who kept me perfectly sane(?) in those horrible moments...అంతకు ముందు కూడా ఎన్నో పుస్తకాలు చదివాను కానీ ఆ తరువాత పఠనానుభవాలు మాత్రం పూర్తిగా వేరు..అంతవరకూ ఒక హాబీగా ఉన్న పుస్తక పఠనం నాకు ఒక నిత్యావసరంగా ఎప్పుడు మారిపోయిందో చెప్పడం కష్టం..

నిన్ననే హెర్మాన్ హెస్సేని చదువుతుంటే "In spite of all the pain and sorrow I'm still in love with this mad,mad world." అనే వాక్యాలు కనిపించాయి..నా పెదాల మీదకొక చిరునవ్వు వచ్చింది.

Tuesday, September 24, 2019

బోర్హెస్ 'కాంగ్రెస్' ఏం చెబుతోంది..

జార్జ్ లూయీ బోర్హెస్ 'బుక్ ఆఫ్ సాండ్' లో 'కాంగ్రెస్' అనే ఒక కథ ఉంటుంది..నిజానికి ఇది పరిచయం అఖ్ఖర్లేని కథ,చాలా మందికి సుపరిచితమైన కథే..

Image Courtesy Google
ఈ కథ లో మానవజాతికీ,మానవత్వానికీ ప్రాతినిథ్యం వహించడానికి ఒక సంస్థను ప్రారంభిస్తారు..ఆ సంస్థలో పలు దేశాలకు,ప్రాంతాలకూ,భాషలకూ,వృత్తులకూ సంబంధించి పలు విభాగాలను తయారు చేసి వాటికి వివిధ దేశాలకు చెందిన కొందరు వ్యక్తుల్ని ప్రతినిధులుగా నియమిస్తారు..ఈ క్రమంలో ఆ సంస్థకు పెద్ద లైబ్రరీ అవసరమని ప్రపంచం నలుమూలల్నుంచీ పుస్తకాలు తెప్పిస్తారు..ఇలా అన్నిటినీ వర్గీకరించుకుంటూ,వ్యవస్థీకరించుకునే క్రమంలో అసలు లక్ష్యం మూలనపడి పుస్తకాలూ,ప్రతులూ,అంతర్గత విభేదాలతో కూడిన ఆర్గనైజేషన్ మాత్రమే మిగులుతుంది..ఇది గ్రహించిన ఆ సంస్థ అధ్యక్షుడు చివర్లో పుస్తకాలన్నిటినీ దగ్గరుండి మరీ తగలబెట్టిస్తాడు..ఎగసిపడే మంటల్లో కాలుతున్న పుస్తకాలను చూసిన తరువాత అందరూ స్వేచ్ఛగా ఆ సంస్థ తాలూకూ భవనం నుండి బయటకి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు..టూకీగా చెప్పాలంటే ఇదే కథ..మానవాళి తమకంటే ముందు పుట్టినదనీ,తమ తరువాత కూడా స్థిరంగా ఉంటుందనీ,మానవాళినీ,మానవత్వాన్నీ వ్యవస్థీకరించడం అసంభవమనీ,అంత పిచ్చిపని మరొకటి లేదనీ వాళ్ళు గ్రహించడం ఈ కథ సారాంశం.

నిశితంగా గమనిస్తే ఈ కథను మనం వివిధ కోణాల్లో చూడచ్చు..నేటి సమాజం కూడా అనేక తరాల వ్యవస్థీకరణల ఫలితం..ఉదాహరణకు మన భారతీయ సమాజాన్ని తీసుకుంటే మనుధర్మ శాస్త్రాల పేరిట వర్ణ వ్యవస్థల్నీ,రాజ్యాంగాన్నీ,సైన్యాల్నీ వ్యవస్థీకరించుకుంటూ పోయి ఈరోజు ఆ వర్గవిభేదాలతో,జాతిమత వైషమ్యాలతో ఒకరిమీదొకరు కత్తులు దూసుకుంటున్నాం..బోర్హెస్ చెప్పిన ఈ కథ ఏ సమాజానికి అన్వయించి చూసుకున్నా సులభంగా ఆ ఫ్రేమ్ లో ఇమిడిపోతుంది..ఇదే కథను నేటి సాహితీ రంగానికి అన్వయించి చూస్తే ఎలా ఉంటుందనే ఒక సరదా ఆలోచన వచ్చింది..టెక్నాలజీ పుణ్యమాని ఒకప్పుడు ప్రత్యేకమైన సమూహాలుగా మసలే సాహితీ సంఘాలు కూడా నేడు సోషల్ మీడియా వీధి వసారాల్లోనో,మరో వెబ్ పత్రికల మండువాల్లోనో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..బుక్ క్లబ్బులూ,బ్లాగులూ,సోషల్ మీడియా పత్రికలూ ఇలా ప్రతీదాన్నీ వ్యవస్థీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం..ఫలితంగా వెలసిన అనేక సమూహాల్లో తన ఉనికిని చాటుకునే దిశగా కళాకారుడు కూడా నచ్చినా నచ్చకపోయినా బిక్కుబిక్కుమంటూ ఏదో ఒక సమూహపు మూలన నక్కి తీరాలి (?) సమాజంలో అంతర్భాగంగా ఉంటూ తన ఉనికిని చాటుకోడానికి కళాకారుడు తన అస్తిత్వాన్నీ,వ్యక్తిత్వాన్నీ పణంగా పెట్టక తప్పే పరిస్థితులు లేవు..ఇదేదో బ్రహ్మ రహస్యమైన విషయం కాదు..ప్రతీ సమూహానికీ కొన్ని నియమనిబంధనలుంటాయి..అందులో ప్రతి వ్యక్తీ  కొన్ని కనిపించని నియమాలకనుగుణంగా వ్యవహరించవలసి వస్తుంది..సింపుల్ గా చెప్పాలంటే If you want to be part of a crowd,you have to play by their rules..ఈ క్రమంలో ఆర్టిస్టుకు తనకు సంబంధం లేనీ,తనకు నచ్చని విషయాలను కూడా ఆమోదించాల్సిరావడం,గట్ ఫీలింగ్ ను ప్రక్కనపెట్టి మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తూ 'సెల్ఫ్ క్యారెక్టర్ అస్సాసినేషన్' చేసుకోవడం తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి..అడిగిన సంస్థలకు రాయననడం తప్పు...ఆదేశించిన పుస్తకాలపై ప్రశంస/విమర్శ రాయకపోతే తప్పు..అసలు సంస్థాగతంగా వ్యవహరించడానికి నిరాకరించడం తప్పు..ఇదంతా ఈ వ్యవస్థీకరణల ఫలితమే..కానీ ఆర్టిస్టుకు ఉండవలసిన ఏకైక లక్షణం/అవసరం 'స్వయంప్రతిపత్తి కలిగి సర్వ స్వతంత్రుడిగా వ్యవహరించడం'...కానీ ఈ వ్యవస్థీకరణల కారణంగా ఆర్టిస్టు ఈస్థటిక్స్ లో ప్రాథమిక అంశాలు కూడా నేర్వకుండానే బేసిక్స్ దగ్గరే ఆగిపోతున్నాడా !! ఆర్ట్ ను institutionalize చెయ్యడం మంచికా ? చెడుకా ? దీనివల్ల ప్రయోజనం ఏమిటి ? కళ అనేది ప్యాషన్ నుండి పుట్టాలి గానీ,డెడ్ లైన్స్ ఆధారంగా పుట్టేదానిలో సృజనాత్మకత పాళ్ళు ఎంత ?? బహుశా బోర్హెస్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నిష్క్రమించారు అనిపించింది.

Monday, September 23, 2019

Fly Already : Stories- Etgar Keret

ఇజ్రాయెల్ సాహిత్యానికి సంబంధించి 2017 మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్న David Grossman 'A Horse Walks into a Bar' తప్ప ఇతరత్రా రచనలేవీ నేను చదవలేదు..కానీ అమోస్ ఓజ్ నీ,ఎట్గర్ కెరెట్ నీ చదవాలని చాలా కాలం నుండీ అనుకుంటూ వాయిదా వేస్తు వచ్చాను..ఈలోగా ఎట్గర్ కెరెట్ తాజా కథల పుస్తకం 'ఫ్లై ఆల్రెడీ' కనిపించింది..ప్రస్తుతం చదువుతున్నవి ప్రక్కన పెట్టి మరీ చదివినందుకు ఈ కథలు మంచి పఠనానుభవాన్ని మిగిల్చాయి..ఇందులో మొత్తం 22 కథల్నీ మరో ప్రముఖ జ్యూయిష్ రచయిత నాథన్ ఇంగ్లాండర్ తో పాటు మరి కొందరు అనువదించారు.
Image Courtesy Google
ఆ మధ్య ఎవరో రచయిత ఓప్రా విన్ఫ్రె చాలా తెలివైనావిడనీ,ఆవిడ రివ్యూలలో తొంభై శాతం స్టోరీ కలెక్షన్స్ ని రివ్యూ చెయ్యరనీ అన్నారు..ఈ పుస్తకం చదివాకా ఆ విషయం  గుర్తొచ్చింది..ఇరవై రెండు ఆణిముత్యాల్లాంటి కథల్లో ఏ ఒక్క కథనొదిలేసినా ఈ పుస్తకానికి రాసే వ్యాసానికి న్యాయం చెయ్యలేననిపించింది..ఇందులో ఒక్కో కథా ఒక్కో అద్భుతం..ఒక కాల్వినో..ఒక బోర్హెస్..ఒక సిగిస్మన్డ్... ఒక కెరెట్....ఒక షార్ట్ స్టోరీ రైటర్ గా ఇంతకంటే ఎట్గర్ కెరెట్ సత్తాను చాటిచెప్పడం నాకు సాధ్యం కాని పని..అందుకే ప్రతిసారి కంటే భిన్నంగా ఇందులో నాకు బాగా నచ్చిన ఒక కథను స్వేచ్ఛానువాదం చేశాను.

ఇందులో ఒక కథ 'The Birthday of a Failed Revolutionary' కి నా స్వేచ్ఛానువాదం :

అనగనగనగా ఒకూళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడట..చాలా ఏళ్ళ క్రితం అతడు ఏదో కనిపెట్టాడో లేక ఎవరో కనిపెట్టిన దాన్ని తస్కరించాడో సరిగ్గా గుర్తులేదు.కానీ ఆ కనుగొన్నది చాలా పెద్ద మొత్తానికి అమ్ముడుకాగా అతడు దాన్ని నీటి మీద,నేల మీద పెట్టుబడులు పెట్టాడు..నేలమీద అతడు చిన్న చిన్న కాంక్రీట్ క్యూబికల్స్ కొని తలపై చూరుకోసం ప్రాకులాడేవారికి అమ్మితే,నీటిని బాటిళ్ళలో నింపి దాహార్తితో ఉన్నవాళ్ళకి అమ్మి దాహం తీర్చాడు..ఈ అమ్మకాలు అయిపోయాక అతడు తన ఇంద్రభవనంలాంటి ఇంటికి తిరిగి వెళ్ళి గడించిన సంపదతో ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు..నిజానికి అతడు తన జీవితంతో ఏం చెయ్యవచ్చని ఆలోచించవచ్చు,ఇది కూడా అంత తక్కువ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు కాదు మరి.. but people with that much money are usually too busy to find time for that kind of thinking..అతడు తన సంపదను రెట్టింపు చేసే మార్గాలను యోచిస్తూ వాటితో పాటు తనను సంతోషపెట్టే వాటిని కూడా సంపాదించుకోవాలనుకుంటాడు..స్వభావరీత్యా సున్నిత మనస్కుడూ,అనుమానం మనిషీ కావడంతో అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవర్నీ నమ్మడు..నిజానికి అతడూహించింది నిజమే..అతడి చుట్టూ స్నేహితులుగా ఉన్నవాళ్ళందరూ అతడు సంపదకు ఆశపడి అతడి చుట్టూ చేరినవాళ్ళే,ఒక్క వ్యక్తి తప్ప..నిజానికి ధనవంతుడు మంచివాడు కాకపోవడం వల్ల ఒంటరికాలేదు..అతడు నిజానికి చాలా మంచివాడూ,ప్రముఖుడూను.

ఒకరోజు ధనవంతుడి సంపాదనకు ఆశపడని ఆ ఒక్క స్నేహితుడూ తన ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటాడు..ఇదిలా ఉండగా ధనవంతుడు తన తెల్లని పాలరాతి నేల మీద పడుకుని ఒంటరితనంతో రోజులు వెళ్ళదీస్తూ ఇలా అనుకుంటాడు “There must be something in the world that I want, that could make me happy. Something another person might have to spend his whole life trying to acquire but that I could buy without any effort.” నాలుగు రోజులు ఇలాగే గడిచాయి..ఒకరోజు ధనవంతుడికి  జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అతడి తల్లి ఫోన్ చేస్తుంది..మతిమరపు మనిషైన ఆవిడకి ఏమీ గుర్తులేకపోయినా అతి కొద్ది సన్నిహితుల వివరాలు మాత్రం గుర్తుంటాయి..తల్లితో మాట్లాడడం వల్ల కలిగిన సంతోషంతో అతడు సంభాషణ ముగించి ఫోన్ పెట్టేలోగా డోర్ బెల్ మోగుతుంది..ఎవరో తెలిసిన వ్యక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పుష్పగుచ్ఛంతో పాటు బర్త్డే కార్డు ఉంటుంది..పంపిన వ్యక్తి మీద ధనవంతుడికి సదభిప్రాయం లేకపోయినప్పటికీ  అతడికి ఆ పూల పరిమళాలు  అమితానందాన్నిస్తాయి..ఆ క్షణంలో అతడిలోని వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది..ఒక్క పుట్టినరోజు ఇంతటి ఆనందానిస్తే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దానిని ఎందుకు జరుపుకోవాలి అనుకుంటాడు..అనుకున్నదే తడవుగా పేపర్ లో పుట్టినరోజులు కొనుక్కుంటానని పెద్ద ప్రకటన ఇస్తాడు..నిజానికి పుట్టినరోజులు కొనడం సాధ్యపడదు కదా,అందుకే అచ్చంగా పుట్టినరోజులు కాకపోయినా ఆ రోజుతో పాటొచ్చే బహుమతులూ,శుభాకాంక్షలూ,పార్టీలూ కొనుగోలు చేద్దామని తలపోస్తాడు..అప్పట్లో ఉన్న ఆర్ధికమాంద్యం వల్లనో,లేక ప్రజలకు తమ పుట్టినరోజులు అంత ప్రాముఖ్యత లేనివిగా అనిపించడం వల్లనో గానీ వారం తిరిగేలోపు అతడి ప్రకటనకు గొప్ప స్పందన వచ్చి అతడి డైరీ అంతా జన్మదినాల తాలూకూ తారీఖులతో నిండిపోతుంది..జన్మదినాలు అమ్మినవాళ్ళు అందరూ నిజాయితీపరులే గానీ ఒక్క వృద్ధుడు మాత్రం అన్నీ ఇవ్వకుండా తనకోసం కొన్ని తడి ముద్దుల్నీ,మనవలు బహుమతిగా ఇచ్చిన ఒక పిచ్చి పెయింటింగ్ నీ రహస్యంగా దాచుకుంటాడు.

ఇక ధనవంతుడికి ప్రతిరోజూ పుట్టినరోజుగా మారిపోతుంది..అపరిచితులైన పిల్లలూ,స్త్రీలూ ఎవరో ఒకరు అతడికి రోజూ ఫోన్ చేసి "హ్యాపీ బర్త్డే టూ యూ" అని పాడుతుంటారు..ఇంటికి రంగురంగుల గిఫ్ట్ రేపర్లు చుట్టిన బహుమతులు ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి..అతడి ఈమెయిలు బాక్సు శుభాకాంక్షల మెసేజీలతో నిండిపోతుంది..ఫిబ్రవరి నెలలో అక్కడక్కడా కొన్ని ఖాళీలు మిగిలిపోయినా అవి కూడా భర్తీ అయిపోతాయని అతడి మనుషులు నమ్మబలుకుతారు..ఇదిలా ఉంటే,ఇదంతా చూస్తూ భరించలేని ఎవరో వ్యక్తి ఒక ప్రముఖ దినపత్రికలో దీన్నొక 'అనైతిక చర్యగా' అభివర్ణించినా అది ధనవంతుడి సంతోషాన్ని కొంచెం కూడా తగ్గించలేకపోయింది,ఎందుకంటే ఆ రోజే అతడు ఒక పద్దెనిమిదేళ్ళ యువతి పుట్టినరోజు జరుపుకున్నాడు..ఆమె స్నేహితురాళ్ళు చెప్పిన శుభాకాంక్షలకు అతడికి కళ్ళ ముందు తన ఉజ్వల భవిష్యత్తు కదలాడింది.

కానీ ఈ సంతోషమంతా మార్చ్ 1 నాటికి అంతమైపోతుంది..నిజానికి ఆరోజు ధనవంతుడు 'భార్యను కోల్పోయి వైధవ్యం బారినపడ్డ ఒక కోపిష్టి' జన్మదినం జరుపుకోవాలి..కానీ ఆ రోజు ఉదయం నుండీ ఒక్క బహుమతిగానీ,శుభాకాంక్షలుగానీ ఏవీ రావు..అయినా ధనవంతుడు ఆశావాదికావడంతో ఆ రోజును ఎలాగైనా సద్వినియోగపరచుకుందామనుకుంటాడు..తననుంచి ఏమీ ఆశించక ఆత్మహత్య చేసుకున్న ఒకే ఒక్క స్నేహితుడి సంవత్సరీకం అదేరోజు కావడంతో స్మశానానికి బయలుదేరతాడు..అక్కడ సంతాపం ప్రకటించడానికి చాలా మంది జనం హాజరవడం చూస్తాడు..వచ్చినవాళ్ళందరూ సమాధిమీద ఎర్రగులాబీలుంచి,ఆ వ్యక్తి  మరణం తమ జీవితంలో ఎలా భర్తీచేయలేని వెలితిగా మిగిలిపోయిందో గుర్తుచేసుకుంటూ బాధపడతారు..ఇదంతా చూసిన ధనవంతుడి మదిలో మరో మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.."మరణానంతరం జనాలు చూపించే ప్రేమ మరణించినవారికి తెలిసే అవకాశం లేదు,కానీ నాకుంది..ఒకవేళ నేను చనిపోయినవాళ్ళ సంవత్సరీకాల్ని కొనుక్కుంటే !! అచ్చంగా వాళ్ళనుండి కాదుగానీ వాళ్ళ వారసుల వద్ద కొనుక్కుంటే ! అప్పుడు ఆ సమాధి మీద ఒక నల్లటి 'వన్ వే గ్లాస్' మీద ఒక మంచం ఏర్పాటు చేసుకుంటే అందరూ నన్నెంత మిస్ అవుతున్నారో నేను వినచ్చు" అనుకుంటాడు..ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉందిగానీ ఈ ఆలోచనను అమలుపరచడానికి మరునాడు ఆ ధనవంతుడు మాత్రం జీవించి లేడు..మరునాడు ఉదయం అతడు మరణించాడు..అతడు ఇటీవలే పండుగలా జరుపుకున్న అనేక సందర్భాల వలెనే అతడి మరణం కూడా అతడిది కాదు,అది వేరొకరి కోసం ఉద్దేశించబడినది..విప్పేసి ఉన్న గిఫ్టు రేపర్ల మధ్య అతడి శవం దొరికింది..ఆ తరువాత తెలిసిన విషయమేంటంటే ఆరోజు అతడు కొనుక్కున్న పుట్టినరోజు ఒక విఫలమైన విప్లకారుడిది,ఆ విప్లవకారుణ్ణి చంపడానికి గిఫ్ట్ రూపంలో వచ్చిన బాక్సు ఒక నిరంకుశ వ్యవస్థ పన్నిన పన్నాగం.

ధనవంతుడి అంత్యక్రియలకు జనం వేలల్లో హాజరయ్యారు..వచ్చిన వాళ్ళందరికీ అతడి సంపద మీదే కన్నున్నప్పటికీ వ్యక్తిగా అతడంటే కూడా ఎంతో అభిమానం..అందుకే వాళ్ళందరూ అతణ్ణి గంటలకొద్దీ శ్లాఘిస్తూ,సంతాప గీతాలు పాడారు..ఇది ఎంతగా మనసుని కదిలించిన విషయమంటే చివరకు ధనవంతుడి  అంత్యక్రియలకు చట్టపరమైన హక్కుల్ని కొనుక్కున్న యువ చైనీస్ బిలియనీర్ కూడా సమాధి అడుగున రహస్యంగా కట్టుకున్న నల్లని క్యూబికల్ లో కూర్చుని ఇదంతా చూస్తూ రెండు కన్నీటి బొట్లు కార్చాడు.

Publishers : Granta Books
Pages        : 224 pages

Tuesday, September 10, 2019

The Unhappiness of Being a Single Man: Essential Stories - Franz Kafka

పుష్కిన్ ప్రెస్ వారు 'The Unhappiness of Being a Single Man: Essential Stories' పేరిట కాఫ్కా కథల్లో ముఖ్యమైన 22 కథల్ని ఎంపికచేసి ప్రచురించారు..వీటిలో కొన్నిటిని కథలనడం కంటే చిన్న చిన్న దృష్టాంతాలు (allegories),parables,fables గా వర్గీకరించడం సమంజసం.
Image Courtesy Google 
వాల్టర్ బెంజమిన్ కాఫ్కా గురించి రాసిన ఒక వ్యాసంలో ఒక కథ చెప్తారు..రష్యా మహారాణి క్యాథెరిన్ కి ప్రేమికుడే కాక ఆమె హయాంలో మంత్రిగా కూడా పని చేసిన Grigory Potemkin తరచూ డిప్రెషన్ బారినపడుతుంటాడు..ఆ సమయంలో అతడు ఎవర్నీ కలవడు,ఎవరూ అతడి గదిలోకి వెళ్ళే ధైర్యం కూడా చెయ్యరు..Potemkin సంతకాలు సేకరించడంలో విఫలమైన ఉన్నతాధికారుల కారణంగా ప్రభుత్వకార్యకలాపాల్లో జాప్యం జరుగుతుంటుంది..ఈ కారణంగా వారు క్యాథెరిన్ ఆగ్రహానికి గురవుతుంటారు..ఈ సమయంలో ఒక చిన్న గుమాస్తా Shuvalkin ఈ బృహత్కార్యాన్ని తన మీద వెయ్యమని అడుగుతాడు..అసలే నిస్సహాయంగా ఉన్న ఉన్నతాధికారులు ఇందులో వచ్చిన నష్టమేమీ లేదు గనుక దానికి సరేనంటారు..Shuvalkin హుషారుగా Potemkin గొళ్ళెం లేని గదిలోకి సరాసరి తలుపులు తోసుకుంటూ వెళ్ళిపోతాడు..భావరహితంగా అతణ్ణి చూస్తున్న Potemkin కి మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే ఇంకులో ముంచిన సిరాను అతడి చేతిలో పెట్టి పేజీలు తిప్పుతూ అవసరమైన సంతకాలు తీసేసుకుంటాడు..విజయగర్వంతో వెలిగిపోతున్న మొహంతో బయటికి వచ్చిన అతడి చేతిలోనుండి ఆ కాగితాలను ఆతృతగా లాక్కున్న ఆఫీసు సిబ్బంది కాగితాలను పరీక్షించగా Potemkin సంతకాలుండవలసిన అన్ని చోట్లా Shuvalkin..Shuvalkin..Shuvalkin అని అతడి పేరు రాసి ఉంటుంది..కాఫ్కా కథ పుట్టకముందు రెండు వందల ఏళ్ళ క్రితం పుట్టిన ఈ కథని మబ్బులా కమ్మేసిన ఎనిగ్మాను 'కాఫ్కా ఎనిగ్మా' గా అభివర్ణిస్తారు బెంజమిన్.

ఆఫీసులు,చీకటి గదులు,దుమ్ము పేరుకుపోయిన రిజిస్టర్లు ఇవన్నీ కాఫ్కా ప్రపంచానికి దారులు..ఈ ఇరుకు గదుల్లో ఇమడలేక అవస్థపడుతూ కూడా కాఫ్కా హీరో ఒక ఆశావహదృక్పథంతో హుషారుగా తన పని ప్రారంభిస్తాడు,కానీ చివరికివచ్చేసరికి మాత్రం చెయ్యాల్సిన పని అదుపు తప్పి చేజారిపోయి వైఫల్యం బారినపడి హతవిధీ అంటూ నీరసంగా కూలబడతాడు..కాఫ్కా కథల్లో ప్రధానంగా కనిపించే అంశం ఇది..ప్రతి మనిషీ జీవితంలో ఏదో దశలో ఇలాంటి ఒక కాఫ్కా కథలో తనను తాను ఒక పాత్రధారిగా చూసుకుంటాడు..కౄరత్వం నిండిన మానవ జీవితంలోని అస్థిరత్వాన్నీ,అబ్సర్డిటీనీ కాఫ్కా కథలు పదేపదే గుర్తు చేస్తుంటాయి..ఆయన కథల్లోని పాత్రలు సామజిక నియమాలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేసినా చివరికి వైఫల్యాల బారినపడుతుంటాయి.

ఏ పుస్తకమైనా చదివాక దాని గురించి నాలుగు మాటలు రాద్దామని కూర్చున్నప్పుడు ప్రేరణగా ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలిపే కేంద్రబిందువు ఒకటి ఉంటుంది..దాన్ని ఆసరాగా చేసుకుని మొదలును అందిపుచ్చుకుని ఒక్కో వాక్యాన్నీ విడిపోకుండా ఒక్కో కథ తాలూకూ పఠనానుభవాన్నీ చిన్న చిన్న ముడులేస్తూ చివరకు అక్షరమాల కట్టడం పూర్తి చేస్తాం..కానీ కాఫ్కా కథల్ని చదివాకా ఎప్పటిలాగే సారాంశం రాద్దామని కూర్చున్న నేను చాలా సేపు మొదలెక్కడో వెతుక్కుంటూనే ఉన్నాను..ఇలా జరగడం చాలా అరుదు..ఒకవేళ కష్టపడి ఆ మొదలు అందిపుచ్చుకున్నా చివరివరకూ దాన్ని తెగిపోకుండా కొనసాగిస్తాననే నమ్మకం కూడా కలగలేదు..ఈ కథలు చదవడం పూర్తి చేశాక అంతఃచేతనలో నిక్షిప్తమైన కథల తాలూకు దృశ్యాలన్నీ అస్పష్టంగా అలికేసినట్లు కనిపించసాగాయి..కథ చదువుతున్నప్పుడు ఎక్కడనించి వచ్చారో తెలీని ఫాంటమ్స్ లా పరిచయమైన వ్యక్తులందరూ పుస్తకం ముగిసేసరికి ఎలా వచ్చారో అలాగే అదృశ్యమైపోయారు..అందుకేనేమో కాఫ్కా పాత్రలను వాల్టర్ బెంజమిన్ భారతీయ పురాణాల్లో గంథర్వులుగా అభివర్ణిస్తారు..గంధర్వులు ఏ ఒక్క చోటుకీ చెందినవారూ కాదు,పరిమితమైన వారూ కాదు..వీరి ఉనికిని నిర్వచించడం సాధ్యపడదు..వారు ఒక ప్రత్యేక ప్రపంచానికి చెందిన వ్యక్తులూ కాదు,అలాగని ఏ లోకానికీ అపరిచితులూ కాదు..గంధర్వులు ఒకలోకం నుండి మరో లోకానికి సంచరించే దూతలు(మెసెంజర్స్)..కాఫ్కా పాత్రలు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి..Kafka tells us that they resemble Barnabas, who is a messenger. They have not yet been completely released from the womb of nature, and that is why they have "settled down on two old women's skirts on the floor in a corner. It was..their ambition..to use up as little space as possible.To that end they kept making various experiments, folding their arms and legs, huddling close together; in the darkness all one could see in their corner was one big ball." It is for them and their kind, the unfinished and the bunglers, that there is hope. అంటారు కాఫ్కా.

కాఫ్కా కథల్లో కనిపించే 'Absurdity of Existence' చదవడం పూర్తి చేసిన చాలాసేపటి వరకూ పాఠకుల్ని వెంటాడుతూనే ఉంటుంది..ఇంగ్లీషు భాషలో 'Kafkaesque' అనే పదాన్ని ఒక 'పీడకల'ను సూచించే అర్ధంలో వాడతారు..మరి పీడకలల్ని ఇష్టపడేవారు బహు అరుదు..ఈ పుస్తకానికి అనువాదకులు Alexander Starritt ముందుమాట రాస్తూ ఒక మాటంటారు,"Kafka's work is respected far more than it is loved" అని..ఎంత నిజం!!!! బోర్హెస్ కు కూడా మొదటిసారి కాఫ్కాను చదివినప్పుడు నచ్చలేదట !!తరువాత రెండోసారి చదివినప్పుడు ఆ అభిప్రాయం మారిందంటారు..బోర్హెస్ అభిప్రాయం ప్రకారం కాఫ్కా రచనను దగ్గరకి చేర్చే దారులు ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉంటాయి..కాఫ్కా జీవితంలో తండ్రి క్రూరత్వం,ప్రేమ వైఫల్యం,ఇన్సూరెన్సు కంపెనీ ఉద్యోగంలో అసంతృప్తి లాంటివి ఈ కథల్లో ప్రస్ఫుటంగా గోచరమవుతాయి..ఈ కథల్లోని పాత్రలు ఎల్లప్పుడూ అస్తిత్వ లేమితో బాధపడుతూ తమ మూలాలను వెతుక్కునే పనిలో ఉంటాయి..అస్తిత్వ భారాన్ని మోయలేని నిస్సహాయతలో 'The Married Couple' అనే కథలో ఒక చిరుద్యోగి "Oh, what futile paths we’re compelled to tread as we go about our business, and how much further we have to carry our burdens." అని వాపోతాడు.

A Message from the Emperor : అనే కథలో చక్రవర్తి ముఖ్యమైనవాళ్ళందర్నీ కాదని ఒక అతి సామాన్యుడికి ఒక ముఖ్యమైన సందేశం చెప్పడానికి అంతఃపురానికి పిలుస్తాడు..ఆ సందేశం అందుకున్న సామాన్యుడు ఆ భవంతిలో గుమిగూడిన ప్రజలను దాటి బయటకు వచ్చేదారిలేక ఆ కోట నుండి బయటపడే దారి వెతుక్కుంటూ పద్మవ్యూహంలో చిక్కుకుపోతాడు.

A Short Fable : ఇందులో ఒక ఎలుక ""ఒకప్పుడు విశాలమైన ప్రపంచం భయం గొలిపేది,కానీ అది రాన్రానూ ఇరుకుగా తయారవుతోంది..సుదూరంగా కుడి ఎడమలవైపు గోడలు కనిపిస్తున్న దిశగా పరిగెత్తితే,అవి రెండూ కలిసే చోట ఒక మూలలో చిట్టచివరి గదిలో నాకోసమొక ఉచ్చు తయారుగా ఉంది" అనుకుంటుంది..
"అలాంటప్పుడు నువ్వుచెయ్యాల్సిందల్లా వ్యతిరేక దిక్కుకి పరిగెత్తడమే" అని అంటూ పిల్లి ఉన్నపళంగా ఆ ఎలుకను తినేస్తుంది..ఈ పిట్టకథ  'It's a lovely little trap,Either way you're screwed' అనే జీవిత సత్యాన్ని చాటిచెప్తుంది.

'ది జడ్జిమెంట్' కథను ఇందులో 'The Verdict' గా పేరు మార్చారు..ఈ కథలో కాఫ్కా మీద తండ్రి నియంతృత్వపు ప్రభావం,కాఫ్కా కఠినమైన బాల్యపు ఛాయలు కనిపిస్తాయి..ఇందులో ప్రొటొగోనిస్ట్ జార్జ్,అతడి తండ్రి,జార్జ్ కాబోయే భార్య ఫ్రీడా లాంటి పాత్రలు వాస్తవంలో కాఫ్కా,నియంత లాంటి ఆయన తండ్రీ,కాఫ్కా ప్రియురాలు ఫెలిస్ లను తలపిస్తాయి..ఈ కథను కాఫ్కా ఫెలిస్ కు అంకితమివ్వడం గమనార్హం..ఈ కథల్లో దేనికవే ప్రత్యేకమైనవి అయినా నాకు అన్నిటికంటే బాగా నచ్చినవి ఈ మూడు కథలూ : 'Before The law','A First Heartache','A Hunger Artist'..ఈ మూడూ 'కాఫ్కా జీనియస్' కి మంచి ఉదాహరణలు..ఇలా చెప్పుకుంటూపోతే ఇందులో ప్రతి కథా జీవితంలోని అస్థిరత్వాన్నీ,అనిశ్చితినీ ప్రతిబింబించేదే..కాఫ్కా ప్రత్యేకం దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన కథలు మాత్రం 'హ్యూమన్ కండిషన్' కీ మానవ జీవితంలోని అనివార్యమైన స్థితికీ (Inevitability) మధ్య సంఘర్షణపై దృష్టిసారిస్తాయి..అందుకే కాఫ్కా కథల్లో సర్రియలిజం లాంటి అంశాలు కూడా ఒక సాధారణ పాఠకుడు సైతం తనను తాను సులభంగా ఐడెంటిఫై చేసుకునే విధంగా మానవీయ పరిధులకు లోబడి వుంటాయి..బహుశా ఇక్కడే బోర్హెస్ శైలికీ కీ కాఫ్కా శైలికీ మధ్య వైరుధ్యాలు కనిపిస్తాయి..బోర్హెస్ కథల్లో కాఫ్కా ఛాయలు అనేకం తొంగిచూసినా ఆయన కథల విస్తృతీ,పరిధీ  అపరిమితమైనవి,అనంతమైనవీను..బహుశా ఈ కారణం చేతనే అవి సగటు పాఠకుడికి అందని ద్రాక్షలా అనిపిస్తాయి..కాఫ్కా ఒక సాధారణ పాఠకుణ్ణి ఆకట్టుకున్నంతగా బోర్హెస్ ఆకట్టుకోలేరు అనిపిస్తుంది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
But they’re detached questions, of the kind very grand people ask,

It’s my father’s house, but each brick lies cold against the next, as if occupied with its own affairs, which I’ve partly forgotten, partly never knew.

Saturday, September 7, 2019

Mr Salary - Sally Rooney

ఫాబర్ పబ్లిషింగ్ సంస్థ 19 వ వార్షికోత్సవం సందర్భంగా 'ఫాబర్ స్టోరీస్' పేరిట తమ రచయితలు రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి కథలను ఎంపిక చేసి చిన్న చిన్న పుస్తకాల రూపంలో ప్రచురించింది..నవలికకూ,కథకూ మధ్యస్థంగా తక్కువ నిడివి కలిగి ఉండే ఈ కథల్ని చదవడం చాలా తేలిక..ఈ కాలంలో పఠనాభిరుచి ఉన్నా కూడా చదవడానికి తగిన సమయం వెచ్చించలేని సాహితీప్రియుల కోసం పెద్ద పెద్ద నవలలు చదవడానికి తీరిక లేని సమయాల్లో చదువుకోడానికి వీలుగా ఏర్చి కూర్చిన కథలివి.
Image Courtesy Google
ఈ మధ్య Sally Rooney "Normal People" గురించి పత్రికల్లో జరుగుతున్న హంగామా చూసి ఆ పుస్తకం చదువుదామని ప్రయత్నించి పట్టుమని పది పేజీలు కూడా చదవలేకపోయాను..ఆవిడ శైలి నాకు రుచించలేదు..ఒకవేళ నేనేమన్నా మిస్ అవుతున్నానా అనుకునేలోగా ఈ ఫాబెర్ స్టోరీస్ సిరీస్ లో భాగంగా ప్రచురించిన శాలీ రూనీ కథ "మిస్టర్ శాలరీ" కనిపించింది..కథ పూర్తి చేశాక ఫాబెర్ వారికి నా విలువైన సమయం వృథాపోనివ్వనందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను..ఆ మధ్య Ottessa Moshfegh రచన "My year of rest and relaxation" అనే సుమారు మూడొందల పేజీల 'నాన్స్టాప్ నాన్సెన్స్' ఓపిగ్గా చదివి నా సహనానికి నేనే భుజం తట్టుకున్నాను..Moshfegh తరహాలో అదే కోవకి చెందిన మరో రచయిత్రి ఈ శాలీ రూనీ..శైలి విషయంలో వీళ్ళిద్దరూ అచ్చంగా అక్క చెల్లెళ్ళే..వీళ్ళిద్దరి శైలిలో చాలా సారూప్యతలున్నాయి..వీళ్ళిద్దరూ సారహీనమైన కథావస్తువును పట్టుకుని కథనాన్ని మాత్రం సారవంతంగా రక్తికట్టిస్తారు..చెప్పే విషయం గొప్పది కాకపోయినా వీరిద్దరూ కథ చెప్పే విధానం మాత్రం అద్భుతంగా ఉంటుంది..వీరిద్దరికీ భాషపై మంచి పట్టుంది కానీ వీరి కథల్లో హేతువాదం,తార్కికత వంటి పరిణితి చెందిన అంశాలు మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు..అయినా అందరూ కథల్ని హేతువాదం,తర్కం కోసం మాత్రమే చదవరు కదా ! అందుకే వీళ్ళ రచనల్ని పూర్తిగా తీసిపారెయ్యడానికి వీల్లేదు..ఎందుకంటే ఒక్కోసారి భావానికి పదీ భాషాసౌందర్యానికి తొంభై మార్కులూ ఇస్తూ కూడా మనం కథలు చదువుతాం మరి..త్రాసులో వేసినప్పుడు ఈ రెండు అంశాలూ సమపాళ్ళలో తూగినప్పుడు పుట్టే కథ నిస్సందేహంగా ఒక మంచి కథ అవుతుంది,కానీ ఇప్పుడది అప్రస్తుతం.

ఈ ఇద్దరి శైలిలో కనిపించే మరో సారూప్యత వీరి కథల్లో కనిపించే నిరాశావాదం..ఇరవయ్యేళ్ళ వయసు యువతుల్లో కూడా గూడుకట్టుకున్న నిరాశానిస్పృహల్నీ,గమ్యం తెలీకుండా గాలివాటుకి కొట్టుకుపోయే తత్వాన్నీ వీళ్ళు అద్భుతంగా చిత్రిస్తారు..It was in my nature to absorb large volumes of information during times of distress, like I could master the distress through intellectual dominance అంటుంది ఈ కథలో Sukie అనే అమ్మాయి..బహుశా ఈ సమకాలీన రచయిత్రుల కథలు ఆధునిక యువత మనస్థితికి అద్దంపడుతున్నాయేమోననిపిస్తుంది..ఈ కథలో సూకీ కాన్సర్ వైద్యం జరుగుతున్న తండ్రి ఫ్రాంక్ ను కలవడానికి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వస్తుంది..తల్లి మరణానంతరం సూకీకి 19 ఏళ్ళ వయసులో చదువుకునే నిమిత్తం బంధువు నేథన్ (Nathan-34) తో కలిసి అతని ఫ్లాట్ లో కొంతకాలం జీవిస్తుంది..ఇద్దరి మధ్యనా ఉన్న వయోభేదం,బంధుత్వం వారిద్దరి మధ్యా చిగురించిన ఒక అనిర్వచనీయమైన బంధానికి అడ్డంకి కావు..ఇద్దరి మధ్యా ఏ శారీరక సంబంధం లేకపోయినా We were predictable to each other, like two halves of the same brain అంటూ ఒక సందర్భంలో తమ సంబంధాన్ని నిర్వచిస్తుంది సూకీ..నేథన్,సూకీ ల మధ్యనున్న 'ఎమోషన్' ని చివరివరకూ పట్టుసడలనివ్వరు రూనీ..ఒక వ్యక్తిగా,ఒక సోషల్ ఆనిమల్ గా మనిషి అంతరంగానికీ,సామజికపరమైన కట్టుబాట్లకీ మధ్య జరిగే ఘర్షణ ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది..యుక్తవయసులో కళ్ళాల్లేని గుఱ్ఱంలాంటి మనసుకీ,పరిణితి చెందిన వయసులో జనించే వివేచనా,విచక్షణలకీ మధ్య జరిగే నిరంతర సంఘర్షణ ఈ కథలో సూకీ,నేథన్ ఇద్దరు పాత్రల ద్వారా వర్ణించే ప్రయత్నం చేశారు రూనీ..మరి వారిద్దరి సంబంధం చివరికే మలుపు తీసుకుందనేది మిగతా కథ.. I had read that infant animals formed attachments to inappropriate things sometimes, like falcons falling in love with their human breeders, or pandas with zookeepers, things like that.అని సూకీ అంటున్నప్పుడు ఎందుకో లమ్హే సినిమాలో శ్రీదేవి కళ్ళముందు మెదిలింది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

Death was, of course, the most ordinary thing that could happen, at some level I knew that. Still, I had stood there waiting to see the body in the river, ignoring the real living bodies all around me, as if death was more of a miracle than life was. I was a cold customer. It was too cold to think of things all the way through.