An Evening with Susan :
శుక్రవారం సాయంత్రం అవగానే లేజీ మూడ్ వచ్చేస్తుంది. వారం అంతా ఉరుకుల-పరుగుల రొటీన్ నుండి చిన్న బ్రేక్ అనే తప్ప పెద్దగా ఏమీ మారదనుకోండి. హైదరాబాద్ లో పుస్తకాల మార్కెట్లతో పాటు నన్ను బాగా ఆకర్షించినవి ఇక్కడ కేఫ్ లు. కొండాకోనల్లో నిశ్శబ్దానికి అలవాటుపడి ఉండడంతో ఇంకా జనారణ్యపు శబ్ద కాలుష్యానికి చెవులు పూర్తిగా అలవాటుపడలేదు. లైఫ్ లో పెద్దగా అడ్రినలీన్ రష్ అక్కర్లేని quiet & comfortable స్టేజిలో పెద్దగా సందడి లేని చోట్లు నచ్చే మాలాంటి వాళ్ళకి వీకెండ్ రాగానే "దో దీవానే ఇస్ షెహర్ మే" అని పాడుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న కేఫ్ వెతుక్కుని వెళ్ళి ఓ పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడం ఈ మెట్రో జీవితంలో ఒక అదనపు సౌకర్యం. ఎటొచ్చీ ఆయనకు రుచికరమైన సూపు, నాకొక చిక్కని కాఫీ దొరికితే చాలు.
Copyright A Homemaker's Utopia |
కూర్చుని కాసేపు సెటిల్ అయ్యాక కొన్ని క్షణాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు కళ్ళతో కాప్చర్ చెయ్యడంతో సరిపోతుంది. ఈరోజు ఇక్కడ మూడు విడివిడి టేబుల్స్ లో లాప్టాప్స్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుని పనిచేసుకుంటున్నవాళ్ళు (ఒక స్త్రీ, ఇద్దరు మగవారు) ముగ్గురు కనిపించారు. ముగ్గుర్లో ఒక మేల్ అండ్ ఫిమేల్ పనిచేసుకుంటున్నంతసేపూ చాలా సీరియస్ గా సిగార్స్ ఊదుతూనే ఉన్నారు. మరో టేబుల్ దగ్గర సుమారు ఐదేళ్ళున్న పాపాయిని ఎంగేజ్ చేస్తూ కూర్చున్న ఒక టీనేజ్ కేర్ టేకర్ కనిపించింది. ఆ పాపాయి అమ్మగారు జాబ్ అనుకుంటా, ఆవిడొచ్చేవరకూ పాపాయిని ఆడిస్తూ అక్కడ వెయిట్ చేసింది. మరో టేబుల్ లో నలుగురు, కాలేజీ పిల్లలనుకుంటా, ముగ్గురబ్బాయిలూ, ఒకమ్మాయీ హుషారుగా కబుర్లలో మునిగిపోయి ఉన్నారు. "ఏం పుస్తకం చదువుతున్నారూ ?" అని డిస్టర్బ్ చేస్తూ అడగడానికి దురదృష్టవశాత్తూ ఈరోజు ఎవరూ కనబడలేదు. నలుగురిలో ఏకాంతాన్ని అనుభవిస్తూ నేను ఈ మధ్యే ఆర్డర్ చేసుకున్న సుసాన్ సొంటాగ్ జర్నల్స్ తిరగెయ్యడం మొదలుపెట్టాను. రేపు ఎప్పుడైనా హైదరాబాద్ విడిచి వెళ్ళేటప్పుడు గుర్తుగా నాతో వెంట తీసుకెళ్ళడానికి కొన్ని చలిగాలుల సాయంత్రపు జ్ఞాపకాల్ని పోగుచేసుకోవాలి కదా !!
ఈ సాయంత్రానికి సొంటాగ్ డార్క్ హ్యూమర్ జతకలిసి మరింత అందమైన అనుభవాన్నిచ్చింది.
* Not only must I summon the courage to be a bad writer - I must dare to be truly unhappy. Desperate. And not save myself, short-circuit the despair.
By refusing to be as unhappy as I truly am, I deprive myself of subjects. I’ve nothing to write about. Every topic burns. (6/19/76,NY) ( Is she trying to prove that all writers are unhappy ? )
* TB : Consumed (dissolved) by passion - passion leads to dissolution of the body. It was tuberculosis but they called it 'Love'. (Sigh !)
* Beckett found a new subject for the drama :- What am I going to do in the next second ? Weep, take out of my comb, sigh , sit, be silent, tell a joke, die. (He he he)
*Poets self-limited by some actual or mental regionalism, deliberately cultivated - so he / she will be seen to have [created ] his / her "universe".
Weakness of American poetry- It's anti-intellectual. Great poetry has ideas. ( You are hurting the egos of Eliot clan Susan )
No comments:
Post a Comment