Tuesday, November 21, 2023

Reading Shakespeare in Modern Era

"క్లాసిక్స్ గురించి అందరూ అత్యుత్సాహంగా మాట్లాడతారు గానీ నిజానికి ఎవరూ చదవరని" తనదైన శైలిలో చమత్కరిస్తారు ఆస్కార్ వైల్డ్. పుట్టినప్పటినుండీ ఆనోటా,ఈనోటా వినీ వినీ నోట్లో నానిపోయి, విలువ కోల్పోయి వీగిపోయిన అనేక సార్వత్రిక పదాల్లో క్లాసిక్స్ కూడా ఒక భాగం. రచయితల్లో 'షేక్స్పియర్' పేరు కూడా ఒకవిధంగా అటువంటిదే.

Image Courtesy Google

పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఆయన్ను ఎంతో కొంత అందరం చదివే ఉంటాం. ఆయన కథలు అక్కడక్కడా వినే ఉంటాం. ఆయన తెలీనివారు ఎవరూ ఉండరు. కానీ ఆయనేం రాశారో, షేక్స్పియర్ ఎందుకంత గొప్పో తెలిసినవారు మాత్రం ఈరోజుల్లో అరుదుగా కనిపిస్తారు. 'బుక్ నెర్డ్', 'బుక్ వార్మ్' లాంటి టైటిల్స్ సంపాదించుకున్న చదువరులు సైతం నిజానికి షేక్స్పియర్ క్షుణ్ణంగా చదివి ఉండరు. 'షేక్స్పియర్' అంటే ఒక బ్రహ్మ పదార్థం, సామాన్య పాఠకుడికి అందని ద్రాక్ష, అకాడెమియాకి మాత్రమే సంబంధించిన రాతలు రాసే రచయిత, అబ్బే గ్రాంథికం, టీచర్లు, లెక్చరర్లు మాత్రమే చదువుతారు ఆయన్ని,మనకెందుకు ! 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' కంటెంట్ కాదేమో కదా !' ఇలా అనేక సాకులతో ఆయన్ని ప్రక్కకి నెట్టేసి నా మటుకు నేను పుస్తకాలు  చదువుకుంటుంటే, నా అభిమాన రచయితల్లో ఒకరైన రష్యన్ రచయిత సిగిజ్మన్డ్ క్రిఝిఝానోవ్స్కీ వ్యాసాలు కొన్ని చదువుతున్నప్పుడు ఆయన బెర్నార్డ్ షాకీ, షేక్స్పియరుకీ వీరాభిమాని అని తెలిసింది. ఇది నాలో సహజంగానే కుతూహలం రేకెత్తించింది. ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో అంతటి నైపుణ్యం గల వ్యక్తిని ప్రభావితం చేసిన రచయిత అంటే షేక్స్పియర్ సాహిత్యంలో కేవలం పదాడంబరాలు మాత్రమే ఉండవేమో ! అంతకుమించిందేదో ఖచ్చితంగా ఉండుండాలి అనిపించింది.

అకడెమిక్స్ లో భాగంగా కొంత చదవడం వల్ల ఆయన కథలు పరిచయమే. అయినప్పటికీ ఆయన లిరికల్ ప్రోజ్ తో పరిచయం లేదు. చాలా వరకూ ఆయన నాటకాలన్నీ కథలుగానే చదువుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి నేను చదివిన రచన 'A Midsummer Night's Dream'. మనసులో ఈ ఆలోచన వచ్చిందే తడవు ఎడాపెడా రోజుకో పుస్తకం నమిలి పారెయ్యడానికి షేక్స్పియరియన్ ఇంగ్లీషు అంత సులభమేమీ కాదు. అందువల్ల ఆయన్ని ఎలా చదవాలి అన్న విషయమై కొంత గూగుల్ రీసెర్చ్ చెయ్యాల్సొచ్చింది. షేక్స్పియరును చదవడం ఆంగ్లం మాతృభాషగా ఉన్నవాళ్ళకు సైతం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిప్రాయాలు చూసినప్పుడు అర్థమైంది. నిజానికి షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు. ప్రచురణకు తగిన ఉపకరాలు అందుబాటులో లేని కాలంలో సాహిత్యం లిఖితరూపంలో కాకుండా శబ్దరూపంలోనూ, దృశ్యరూపంలోనూ లేదా నాటకప్రదర్శనల ద్వారానూ వ్యాప్తిచెందే కాలానికి చెందినవి ఈ కథలు. అందువల్ల ఈ కథలన్నీ శబ్ద ప్రధానమైనవి. 'కోరా' వెబ్సైటులో "షేక్స్పియర్ ను ఎలా చదవాలి ?" అనే ప్రశ్నకు ఒక స్త్రీ భలే సమాధానం ఇచ్చారు. షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు కాబట్టి, పుస్తకరూపంలో ఆ 'స్క్రిప్టు' చదవడం గేమ్ ఆడకుండా ప్రోగ్రామర్ రాసిన 'కోడింగ్' చదవడంతో సమానమన్నారు. ఇది చదివి భలే నవ్వొచ్చింది. 

ఏది చదివినా పైపైన చదివి వదిలెయ్యకుండా క్షుణ్ణంగా చదవడం అలవాటు కాబట్టి, షేక్స్పియరును ఒక పద్ధతిలో చదువుదామని నిర్ణయించుకున్నాను. సముద్రంలో మునగాలని నిర్ణయించుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు, కొంచెం ప్లానింగ్ అవసరం కదా ! నేను "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ " క్లుప్తంగా ఇలా మూడు దశల్లో చదివాను/ చూసాను.

* మొదటి దశలో చార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ రాసిన షేక్స్పియర్ కథల్లో చదవాలనుకున్న నాటకాన్ని ఆధునికాంగ్లంలో కథలా చదివాను.

* రెండో దశలో మూలాన్ని లిరికల్ ఫామ్ లో పైకి చదువుకుంటూ క్రింద ఇచ్చిన ఫుట్ నోట్స్ లో అర్థాలు అన్వయించుకుంటూ చదివాను.

* మూడో దశలో Kenneth Branagh దర్శకత్వం వహించిన పలు షేక్స్పియర్ నాటకాలు ఆన్లైన్ లో లభ్యమైనవి డౌన్లోడ్ చేసి చూశాను. ఇంతా చేస్తే గానీ "షేక్స్పియర్ ఎస్సెన్స్" పూర్తిగా వంటబట్టదనిపించింది.

Thursday, November 2, 2023

బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు

సుబ్బరామయ్య గారికున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రైతుకుటుంబంలో పుట్టినప్పటికీ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, స్వల్పకాలంలోనే పరిశ్రమలు కూడా స్థాపించి తానే మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొని మారుతున్న కాలంతో బాటుగా ఆధునికతను అందిపుచ్చుకుని సమాజంలో అనతికాలంలోనే ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

Image courtesy Google 

కానీ ఎంత కీర్తి ప్రతిష్ఠలార్జించినా, తరతరాలూ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించినా సుబ్బరామయ్య గారిని లోలోపల ఏదో తెలీని వెలితితో కూడిన అసంతృప్తి తినేస్తూ ఉండేది. తన రంగంలో ఇక సాధించడానికేమీ మిగలకపోవడంతో కొందరి మిత్రుల సలహా మేరకు ఆధ్యాత్మికత బాట పట్టారు. "ఉన్నదొకటే జిందగీ" అని నమ్మే సుబ్బరామయ్యకూ, దేవుడికీ మొదట్నుంచీ పెద్దగా పొసగకపోయినా కాలక్షేపంకోసమో, కుతూహలం కొద్దీనో సాధుసంతుల సాంగత్యంలో గడుపుతూ ఆ నోటా ఈ నోటా విన్న ఆధ్యాత్మిక విషయాలను అందిపుచ్చుకున్నారు. మన సుబ్బరామయ్య గారికున్న వాక్చాతుర్యం ఎంతటిదంటే ఆయన పులిని చూపించి పిల్లి అని నమ్మబలికినా జనం ఇట్టే నమ్మేసేవారు. ఆయన సభల్లో ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంత సాధికారికంగా మాట్లాడేవారంటే విన్నవాళ్ళెవరైనా ముక్కున వేలేసుకుని "ఈయన సమస్త వేదాలూ ఔపాసన పట్టేశాడ్రోయ్" అనుకునేవారు. సుబ్బరామయ్యగారు ఆ ముఖస్తుతులనూ, కరతాళ ధ్వనులనూ కాదనకుండా ముసిముసి నవ్వులతో సవినయంగా స్వీకరించేవారు. కొంతకాలానికి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభ జరిగినా "ఆధ్యాత్మిక జీవి" సుబ్బరామయ్య గారే ముఖ్య అతిథి.

ఇలా కొంత కాలం గడిచింది. సుబ్బరామయ్యగారిలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఆధ్యాత్మిక రంగంలో తనను యెరుగనివారు లేరు. ఆయనకు సహజంగానే ఆ వాతావరణం బోర్ కొట్టసాగింది. ఈలోగా పక్కూరిలో ఏదో సాహితీ సభ జరుగుతోందని విని కండువా మీదేసుకుని ఆ సభకు బయలుదేరారు ఖాళీగా ఉన్న సుబ్బరామయ్యగారు. ఆ కొత్త వాతావరణంతో బాటు సాహితీ సమూహాల్లోని విప్లవాత్మక ధోరణులు, వింత పోకడలూ సుబ్బరామయ్యగారిని అమితంగా ఆకర్షించాయి. ముందుగా ఒకరిద్దరు ప్రముఖులతో మొదలైన పరిచయాలు క్రమేపీ ఆయన ఇంట్లో జరిగే సాహితీ సమావేశాలూ, ఆతిథ్యాలతో విస్తృత రూపం దాల్చాయి. త్వరలోనే ఆయన  పేరు సాహితీ సమూహాల్లో మారుమ్రోగసాగింది. సుబ్బరామయ్య గారింట్లో కుక్కు తయారుచేసే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు, చట్నీలూ, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మినప గారెల గురించి సాహితీ సంఘాల్లో పుంఖానుపుంఖాలుగా చర్చించుకునేవారు. సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని సుబ్బరామయ్యగారు మాత్రం రచయితలు, కవులతో కూర్చుని వారు చెప్పే కబుర్లు పొల్లుపోకుండా వినేవారు. అలా సాహిత్యం గురించి, గొప్ప గొప్ప పుస్తకాల గురించీ ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకునేవారు. పుస్తకాల్లో నుండి వాళ్ళూ వీళ్ళూ కోట్ చేసే వాక్యాల్ని అందిపుచ్చుకుని మరొకరితో మరో సందర్భంలో వాడి ఆయనకు సహజంగానే ఉన్న వాక్చాతుర్యంతో సాహిత్యం గురించి తనకు సర్వమూ తెలుసని నమ్మబలికేవారు. రైట్ వింగు, లెఫ్ట్ వింగుల్లో ఇందులో చేరాలా అని లాభనష్టాలు బేరీజు వేసుకోగా, సాహితీవర్గాల్లో బాగా పాపులర్ అయిన లెఫ్ట్ వింగులో చేరడం లాభదాయకమని భావించి "లెఫ్టిస్టు" టాగ్ తగిలించుకుని తిరగసాగారు. సభల్లో మైకు దొరికినప్పుడల్లా "దేవుడు, దెయ్యం ట్రాష్" అంటూ ఆధ్యాత్మికత మీద విరుచుకుపడి సాహితీ సమూహాల జయజయధ్వానాలు అందుకునేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. కాలంతో బాటు ఈ రైటు, లెఫ్టు తూకాలు మారసాగాయి. మళ్ళీ వెంటనే రైటు వైపు మొగ్గలేరు కాబట్టి సాహితీ సమూహాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సుబ్బరామయ్య గారు ఖాళీగా ఇంట్లో ఉండడం ఇష్టంలేక దేశాటనకు బయలుదేరారు. తిరిగొచ్చిన వెంటనే సాహితీ సమూహాల్లో తన ప్రాభవం తగ్గుతోందని గ్రహించారు. మిత్రులకు తన ఇంట్లో తిన్న ఇడ్లీ, దోశలనూ, వాటిల్లో తాను మరచిపోకుండా వేసిన ఉప్పునూ గుర్తుచేశారు. కృతజ్ఞతాభారంతో కృంగిపోయి "మీరు గొప్ప సాహితీవేత్త" అన్నారొకరు. మీలాంటి "సహృదయులైన విమర్శకులు అరుదు" అన్నారు మరొకరు. "మీరు చేసిన సాహితీ కృషి అజరామరం" వంతపాడారు వేరొకరు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు "సాహిత్య జీవి"గా మిగిలిపోయారు. ఎటొచ్చీ ఆయన చేసిన "సాహితీ కృషి"కి ఇడ్లీలూ, దోశలూ తప్ప ఎటువంటి ఆధారాలూ లేవు.

కొంతకాలం తరువాత సహజంగానే పాతనీటిని తోసేస్తూ కొత్తనీటి ప్రవాహం వెల్లువెత్తింది. తన వాక్పటిమ  వారిముందు పనిచేయకపోవడంతో సుబ్బరామయ్యగారిలో అసహనం పెల్లుబికింది. దాంతో "సాహిత్యం ఉత్తి డొల్ల", "ఈ రచయితలు తామేదో సర్వాంతర్యాములు అనుకుంటారు", "పుస్తకాల్లో ఏముందండీ, ఒట్టి బూడిద" అంటూ మేకపోతు గాంభీర్యంతో ప్లేటు ఫిరాయించారు సుబ్బరామయ్య గారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. "సాహిత్యం వాళ్ళూ , ఆధ్యాత్మికం వాళ్ళూ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యగారు ఇంట్లో లేరని చెప్పు" అని తన పనివాడికి పురమాయించి, ఈసారి తన ప్రతిభను నిరూపించుకోడానికి ఏ రంగం మీద దృష్టిపెడితే బావుంటుందా అని ఆలోచిస్తూ తలపంకించారు సుబ్బరామయ్యగారు. 

ఇందులో పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. 


Monday, September 25, 2023

The World According to Itzik : Selected Poetry and Prose - Itzik Manger

ఆధునిక యాంటీ సెమిటిజం "జ్యూయిష్ ఎన్లైటెన్మెంట్ మూవ్మెంట్" కి పీడకలలా మారిన తరుణంలో జ్యూయిష్ మేధోవర్గం తమ మూలాల్ని తిరిగి వెతుక్కునే పనిలో పడింది. ఏ జాతికైనా తన మనుషుల్నీ, సంస్కృతినీ గుర్తుపట్టాలంటే వాళ్ళెలా ఆలోచిస్తారో, వాళ్ళు మాట్లాడే భాష ఏమిటో, వాళ్ళు పాడుకునే పల్లెపదాలేమిటో, వాళ్ళ కలలేమిటో తెలియాలి. నాజీలు తమ జాతినీ, సంస్కృతిని సమూలంగా తుడిచేసే ప్రయత్నంలో బయటకి పొమ్మంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇల్లొదిలి భయంతో పారిపోయిన సగటు జ్యూ తనతో బాటు తనకు తెలీని సంకర భాషనీ, ఉనికినీ కూడా వెంటబెట్టుకుని తోడు తీసుకెళ్ళాడంటారు జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్. అవన్నీ వదిలించుకంటే తప్ప అతడు తన అసలుసిసలు జ్యూయిష్ అస్తిత్వాన్ని పొందలేడు. పురోగతిపేరిట వదిలేసుకున్న మూలాలవైపు అడుగు వెనక్కు వేసే క్రమంలో జ్యూయిష్ సంస్కృతిని పునర్జీవింపజేసే దిశగా వారి జానపదాలకు పూర్వవైభవం ఆపాదించే ప్రయత్నం మొదలైంది.

Image Courtesy Google

జ్యూయిష్ సాహిత్యంలో మతం కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల సహజంగానే వారి జానపదాల్లో మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ. నిజానికి జానపదాల మీద ఆధారపడని సాహిత్యం ఉండే అవకాశమే లేదు. అన్ని సంస్కృతుల సాహిత్యమంతా వాళ్ళ జానపదాల నుండి వేళ్ళూనుకున్నదే. ఒకరకంగా జానపదాలు ఆయా జాతుల "ఆత్మ"ను ప్రతిబింబిస్తాయి. జ్యూయిష్ జానపదాల ఆత్మ వాళ్ళ మార్కు "హాస్యం ". వాళ్ళ కథల్లో వ్యంగ్యంతో కూడిన "జ్యూయిష్ జోక్" చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందుకే ఇడ్డిష్ జానపదాలన్నీ హాస్యగాళ్ళతో, అవివేకులతో, కొంటె చేష్టలతో ప్రత్యేకమైన చతురతను కలిగి ఉంటాయి.

ఆ మధ్య జ్యూయిష్ కథల సంకలనం "A Treasury of Yiddish Stories" లో కొన్ని కథలు చదువుతుంటే జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్ గురించి తెలిసింది. తరువాత ఈయన గురించి జల్లెడపట్టగా అనేక వ్యాసాల్లో ఈయనను జ్యూయిష్ సాహిత్యంలో మంచి "Jokester" గా అభివర్ణించారు. బెల్జియం రచయిత  మచాడో డి అసిస్ తరహాలో ఈయన కూడా అంతర్జాతీయంగా పెద్దగా "గుర్తింపుకి నోచుకోని రచయిత" అనిపించింది. జ్యూయిష్ సాహిత్యంలో స్థానికంగా పేరుప్రఖ్యాతులార్జించిన ఈ "షెల్లీ ఆఫ్ ఇడ్డిష్" కథలు, కవిత్వం, వ్యాసాలూ అన్నీ కలిపి యేల్ యూనివర్సిటీ ప్రెస్ వారు "The World According to Itzik" పేరిట ఒక పుస్తకంగా తీసుకువచ్చారు. అందులో మాంగర్ రాసిన కథల్లో మూడు కథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మొదటి కథ "The Tales of Hershel Summerwind" : ఈ కథ ప్రారంభంలోనే "ఒక మధ్యాహ్నం వేళ జ్యూయిష్ కూలీలు, కార్మికులు, నీళ్ళ కావిళ్ళు  మోసేవాళ్ళు టీ తాగడానికి వచ్చి కూర్చునే చిన్న హోటల్లో హెర్షెల్ నాకు ఈ కథలన్నీ చెప్పాడు. హెర్షెల్ కథలన్నీ వింతగా, విపరీతంగా అనిపిస్తాయి గానీ అవన్నీ నిజాలే, ఎందుకంటే అవన్నీ అతని స్వానుభవాలు కాబట్టి. " అంటూ పాఠకుల ముందరి కాళ్ళకు బంధం వేస్తూ ఈ జానపదాలన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. మనం కూడా "అంత నమ్మకంగా చెబుతుంటే నమ్మేస్తే పోలా" అనుకుంటూ ఆయన కథలన్నీ చెవులప్పగించి వినడం మొదలుపెడతాం. హెర్షెల్ సవతి తల్లి తన మొదటి భర్త "మెండెల్" కోడిపుంజుగా పునర్జన్మించాడని నమ్ముతూ దాన్ని ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తూ ఉంటుంది. అదంటే మన హెర్షెల్ కి ఒళ్ళుమంట, దాని వెంటపడి వేధిస్తూ ఉంటాడు.
“Mendel, may your growth be stunted, 
I hope you’ll be forever hunted!”

“Mendel munches stars like mutton, 
He has no rival as a glutton.”
అని పాటలు కడుతూ దాని వెంటపడతాడు. మరో సందర్భంలో హెర్షెల్ తండ్రి  వేరే ఊళ్ళో ఉన్న మిత్రుడి వద్ద నుండి తనకోసం ఏళ్ళ తరబడి దాచిపెట్టిన సారాయి పీపా తెమ్మని పురమాయిస్తే, కొన్ని కొంటెపనులు చేసి పర్యవసానంగా పక్షుల గుంపులు పైకి తీసుకుపోగా వాటితో పాటు అమాంతంగా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఈ సరదా కథ చివర్లో ఒక మంచి నీతి కూడా జత చేస్తారు రచయిత. Irving Howe అనువాదం మూలకథ చదువుతున్నంత సహజంగా అనిపిస్తుంది. ఈ సరళమైన కథలో సందర్భానుసారంగా జ్యూయిష్ మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలూ కనిపిస్తాయి.  
From this story you can see what a great and good God we have. For if He helped such an idler as Hershel Summerwind, He will certainly help all faithful and God-fearing Jews, who follow His commandment and live by His word. 
రెండో కథ  "The Story of the Nobleman's moustaches" : ఈ కథ పోలిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథ. పోలిష్ ఉన్నత వర్గీయుల్లో గుబురైన కోర  మీసాలకు చాలా ప్రాముఖ్యత ఉండేదట. వాళ్ళ గౌరవమంతా ఆ మీసంలోనే ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఆ మీసం చుట్టూ ఒక చక్కని కథను అల్లుతూ పాపభీతి లేకుండా జీవించని వారి దుస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. ఈ కథ కూడా అంతర్లీనంగా హాస్యాన్ని పండిస్తూ చివరకు ఒక నీతితో ముగుస్తుంది. ఈ కథలో అలనాటి జ్యూయిష్ సమాజంలోని నమ్మకాలూ, పాపభీతి, శాపనార్థాలు నిజమవుతాయని నమ్మే మూఢవిశ్వాసాల్లాంటివి అనేకం కనిపిస్తాయి.
From this tale, one should draw the following moral: that one has to avoid being cursed. It’s true that this time, the nobleman well and truly deserved his curse. May the Lord preserve us from such noblemen, now and forever. Amen, selah.
మూడో కథ "The Rabbi of Chelm: May his memory be blessed": ఈ కథను అసలుసిసలు జ్యూయిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథగా చూడవచ్చు. తనను మహా జ్ఞానిగా భావించే పరమ అవివేకి రబ్బీ (మతగురువు) కథ ఇది. మూర్ఖులైన ప్రజలు ఆయన ప్రతి పిచ్చి మాటనూ శిరసావహిస్తూ చేసే పనులు చదువుతుంటే నవ్వురాక మానదు. ఏ సంస్కృతిలోనైనా సామెతలూ, వాడుక పదాలు ఎలా పుడతాయో తెలియాలంటే ఈ కథ ఒక మంచి ఉదాహరణ. ఈ మూడు కథల్లోనూ ఏది నచ్చిందంటే చెప్పడం కష్టం. జ్యూయిష్ జానపదాల గురించి తెలుసుకోవాలంటే ఇట్జిక్ మాంగర్ ని చదివితీరాల్సిందే.
The rabbi of Chelm called out for everyone to hear, “People, go home. Wash your hands. Say the asher-yotser prayer* and remember that Justice is—ugh.”
The crowd dispersed, everyone repeating to himself the phrase, “Justice is—ugh.”
To this day if you say the word “Justice” to a Chelmite, he will spit and, with a wave of his hand, he’ll say, looking directly at you, “Justice is—ugh.”
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :
For us, Goethe, in his ripest work, Faust, is an example of the highest artistic perfection and organic rootedness in the creation of his people.
The Faust motif, as is well known, is a German folk motif. It was in the Middle Ages that the German folk began to whisper the tale about the wonderful magician, Doctor Johannes Faust, who sold his soul to the devil. In Goethe’s work that motif received its highest expressive formulation.

You may be sure the barrel is waiting. With the years it’s become better.” Sighing, he said, “Ah, if only man were like a barrel of wine.”

Hershel knew that Zalman’s wife, Ziessel, never missed a funeral.
Coming home from a funeral she would always say, “May all Jewish children enjoy such a funeral.” That’s why she was nicknamed “Ziessel- may-all-Jewish-children.”

And, in general, where income is lacking, do-mestic peace is lacking, too.

The rabbi of Chelm, his high forehead furrowed, sat bent over a book.
He stroked his snow-white beard and sighed frequently. Each of the rabbi’s sighs nearly extinguished the tallow lamp burning on the table. And there was plenty to sigh about.

Tuesday, September 19, 2023

How To Be a Stoic (Penguin Great Ideas) - Epictetus, Seneca, Marcus Aurelius

'స్టోయిసిజం' అంటే స్వార్థంతో కూడిన తత్వమనీ, మనిషితనం లోపించిన ఫిలాసఫీ అనీ కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాగుల్లో నార్సిసిస్టిక్ లక్షణాలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. విరాగులు మనుషుల్ని భావోద్వేగాల నుండి పూర్తిగా వేరుపడి హేతుబద్ధతతో ఆలోచించమంటారు. తనకుమాలిన ధర్మం చెయ్యవద్దంటారు. వ్యక్తిత్వ నిర్మాణంపై, మానసిక అభివృద్ధిపై శ్రద్ధపెట్టమంటారు. వ్యక్తిగత సమయానికీ, ఏకాంతానికీ విలువిమ్మంటారు. సంఘజీవిగా ఉంటూనే తామరాకుపై నీటిబొట్టులా ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇక కొందరు విరాగులైతే అన్ని శాస్త్రాల్లోకీ తాత్వికత మాత్రమే అధ్యయనం చెయ్యవలసిన శాస్త్రమని బలంగా నమ్ముతారు. అందువల్ల స్టోయిక్ తత్వమంతా వ్యవస్థకు దూరంగా వ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది.

నిజానికి మార్కస్ ఆరీలియస్ వంటివారు ఒక సాధారణ జర్నల్ లా రాసుకున్న అంశాలే తదుపరి కాలంలో "మెడిటేషన్స్" పేరిట ఒక గొప్ప ఫిలాసఫీ పుస్తకంగా అవతరించాయి. సెనెకా రాసిన ఉత్తరాలే స్టోయిక్ ఫిలాసఫీలో కీలక భాగంగా మారాయి. ఎపిక్టెటస్ చేసిన ప్రసంగాలు కాలాలు మారి తాత్విక బోధనల రూపు దాల్చాయి. వీళ్ళ తత్వం చదువుతుంటే ఈ ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వవేత్తలు ఆధునిక మానవుడికంటే ఎన్నో రెట్లు వివేకవంతులనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక తరానికి భిన్నంగా వీరికి మొక్కకు పురుగు పట్టి కుళ్ళిపోవడం మొదలుపెడితే వైద్యం వేర్లకు చెయ్యాలని తెలుసు. వీళ్ళు నేటి తరంలోలా ఆకులకూ, కొమ్మలకూ మాత్రమే వైద్యం చేస్తూ కూర్చోకుండా మొక్క మూలాల దగ్గర మట్టిని మారిస్తేనో లేదా శుభ్రం చేస్తేనో మాత్రమే దానికి జీవం వస్తుందనే కనీస గ్రహింపు ఉన్నవాళ్ళు. అందువల్ల వ్యక్తి బాగుంటేనే వ్యవస్థ బావుంటుందని నమ్మే వీరి తత్వమంతా మనిషిని మంచి విలువలతో ఉన్నతుడిగా మార్చే  దిశగానే సాగుతుంది.

ఇక "Those who lack the courage will always find a philosophy to justify it." అని ఆల్బర్ట్ కామూ అన్నట్లు స్టోయిక్ ఫిలాసఫీని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులోని భావోద్వేగాలను జయించడం, స్వీయ స్పృహ కలిగి ఉండడం వంటి అంశాల్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలాంటివి ఏ ఫిలాసఫీ విషయంలోనైనా సహజంగా జరిగేదే. నేడు సూడో ఇంటెలెక్చువల్స్ రాస్తున్న బెస్ట్ సెల్లింగ్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఎదుటి మనిషిని ఎలా ఏమార్చాలి ? మన మాట ఎలా నెగ్గించుకోవాలి ? మనదే పైచెయ్యిగా ఆధిపత్యం ఎలా సాధించుకోవాలి ? మన స్వార్థానికి ఎదుటి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి ? వంటి అంశాలు  తరచూ కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా స్టోయిక్ ఫిలాసఫీ ఇతరులకు కీడు తలపెట్టకుండా ఆరోగ్యకరమైన / ఆమోదయోగ్యమైన 'ఆత్మరక్షణ' ఎలా చేసుకోవాలో నేర్పుతుంది.

ఏ మానవ మేధస్సు మనిషి ఉనికిని అర్థవంతంగా చేసిందో, నేడు అదే మేధస్సు కృత్రిమత్వంతో అదుపు తప్పి మనిషిని వినాశనంవైపు నడిపిస్తోంది. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లు ఆధునిక ప్రపంచంలో ప్రతీ స్వల్ప విషయాన్నీ సమస్యగా మార్చుకునే మానవ మేధను నియంత్రణలో ఉంచాల్సిన తరుణంలో కులమత జాతి విద్వేషాలు,  భిన్నవాదాలూ, గందరగోళాల మధ్య మనిషికి స్థితప్రజ్ఞత సాధించడానికి విరాగులు బోధించిన తత్వం యొక్క అవసరం మునుపటి కంటే నేడు మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.

పెంగ్విన్ వారు 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా గ్రీకు, రోమన్ తత్వవేత్తలైన మార్కస్ ఆరీలియస్, సెనెకా, ఎపిక్టెటస్ రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని ఎంపిక చేసి ఆ సారాన్ని 'How to be a stoic' పేరిట ప్రచురించారు. ఇందులో, ఎపిక్టెటస్ 'Enchiridion', సెనెకా 'On the shortness of life' మరియు మార్కస్ ఆరీలియస్ 'Meditations' నుండి సంగ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మునుపు 'ఎన్చిరిడియన్' తప్ప మిగతా రెండిటి గురించీ విడివిడిగా రాశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావించడం లేదు. 'ఎన్చిరిడియన్' లో కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం.

* మనిషి 'స్వేచ్ఛ' అంటే సకల సౌకర్యాల మధ్యా భౌతికంగా  స్వతంత్రంగా బ్రతకడం మాత్రమే అనుకుంటాడు. కానీ ఎదుటివాళ్ళ అభిప్రాయాలకు అవసరం లేనప్పుడు కూడా విలువిస్తూ, ఎవరేమనుకుంటారో అని నిత్యం భయంతో బ్రతుకుతూ, ఒక చట్రంలో ఇమిడే క్రమంలో మానసికంగా తన ఆలోచనల్లో బానిసగా మిగిలిపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేక తన అధీనంలో లేని విషయాలను గూర్చి తలపోస్తూ నిత్యం చింతలో, ఆందోళనలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.

* మన గురించి ఎదుటివారి అభిప్రాయాలు వారి మనసులో మనపట్ల కలిగే భావాలు, తలంపుల ఫలితం మాత్రమే. మనల్ని నిర్వచించేవి వారి భావాలు కాదు గనుక మన అధీనంలో ఎంతమాత్రమూ లేని ఆ అభిప్రాయాలతో మనకు నిమిత్తం లేదు.

* అజ్ఞాని తన దురదృష్టానికి ఎదుటివారిని నిందిస్తాడు. తనని తాను నిందించుకునేవాడు అభివృద్ధి మార్గం వైపు నడుస్తాడు. వివేకవంతుడు  తననూ నిందించుకోడు, ఇతరులనూ నిందించడు.

* జీవితంలో అన్ని సంఘటనలూ మనకు అనుకూలంగానే జరుగుతాయనుకోకూడదు. జరిగే సంఘటనలను యథావిధిగా అంగీకరించడమే శాంతికి మార్గం.

* ఎటువంటి సందర్భంలోనూ "నేనిది కోల్పోయాను" అనుకోకు. "నేనిది తిరిగిచ్చాను" అనుకో. ఒక యాత్రికుడు తాను తాత్కాలికంగా బస చేసిన  సత్రాన్ని ఎలా భావిస్తాడో అలా ఆ క్షణంలో నీకు దక్కినదానిని ఆనందించడం నేర్చుకో.

* నీ శరీరం ఎవరు పడితే వారి నియంత్రణలోకి వెళ్ళడాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. కానీ నీ మెదడుని మాత్రం నిన్ను విమర్శించిన ఎవరి నియంత్రణలోకైనా వెళ్ళడానికెందుకు అనుమతిస్తావు ? 

* నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండు, సమూహంలోనైనా, ఒంటరిగానైనా సరే.

* అధికభాగం మౌనాన్ని అలవరుచుకో. అవసరమైనంతే క్లుప్తంగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడమని కోరితే సామాన్యమైన, వ్యర్థమైన విషయాలను గూర్చి మాట్లాడకు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను గూర్చి పుకార్లు, ఫిర్యాదులు, పొగడ్తలు, నిందించడం, పోల్చుకోవడం లాంటివి చెయ్యకు.

* ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే సంజాయిషీ ఇస్తూ నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. దానికి బదులు- "వారికి విషయం సగం కూడా తెలియదు. తెలిస్తే మరికాస్త ఎక్కువ చెప్పి ఉండేవారు" అను.

* ఎవరైనా నిన్ను సత్యదూరంగా విమర్శిస్తుంటే, అది వారు సరైనదని నమ్ముతూ, తమ దృష్టి కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రహించు. వారి అభిప్రాయాలు తప్పైతే వారే మున్ముందు తమ అజ్ఞానంతో కూడిన స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం నీ విమర్శకుల పట్ల దయతో వ్యవహరించినవాడివవుతావు.

Wednesday, September 13, 2023

ఆంధ్రజ్యోతి "పలకరింపు"

ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకానుభవాన్ని పదిలపరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో... -- కె.ఎన్‌. మల్లీశ్వరి


1. సాహిత్య విమర్శ పరిధిని మీరెలా నిర్వచిస్తారు?

రచయిత వ్యక్తిగతాల జోలికి వెళ్ళ నంతవరకూ నిజానికి విమర్శకు ప్రత్యేకమైన పరిధులు, పరిమితులు అంటూ ఏవీ ఉండవలసిన అవసరం లేదు. పాఠకులు ఏదైనా రచనను తమ ఆలోచనా పరిధిలోకి తెచ్చుకుని తమ వైన ప్రత్యేకమైన సాహితీ విలువల తూకపురాళ్ళతో దాని నాణ్యతను నిర్ణ యిస్తారు. దేశ విదేశీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న పాఠకుల అభి ప్రాయాలను విమర్శగా భావించవచ్చు గానీ సాధారణ పాఠకుల సమీక్షనూ, అభిప్రాయాన్నీ విమర్శగా చూడడం సరికాదనుకుంటాను. ఇక ప్రొఫెషనల్‌ క్రిటిక్స్‌ చూపు కేవలం రచన ఉపరితలం వద్దే ఆగిపోకుండా మరికాస్త ముందుకెళ్ళి భాష, వ్యాకరణం, శిల్పం, భావం ఇలా నలుదిశలా ప్రసరిస్తూ రచన నాణ్యతను అంచనా వేస్తుంది. అటువంటి విమర్శకులు దొరికిన రచయితలు అదృష్టవంతులు. కానీ ప్రస్తుతం మనకు మొక్కుబడి సమీక్షలే ఉన్నాయి తప్ప నిక్కమైన విమర్శ లేదు. కమ్యూనిజం, మార్క్సిజం, మానవ పరిణామ క్రమం, చరిత్ర, గ్రీకు, రోమన్‌, భారతీయ పురాణాల వంటి విషయాల్లో కనీస ప్రాథమిక అవగాహన లేనివారు విమర్శకు పూనుకోకూడదనుకుంటాను.

2. ‘ప్రపంచ సాహిత్య వ్యాసాలు’ అన్న టాగ్‌లైన్‌తో వచ్చిన మీ తొలి పుస్తకం ‘ధీ’ కూర్పులో ఎటువంటి క్రమాన్ని పాటించారు?

‘ధీ’లో ముప్ఫై వ్యాసాలు సుమారు పదేళ్ళ కాలంలో వివిధ సమ యాల్లో బ్లాగులో, పత్రికల్లో రాసిన సుమారు మూడు వందల వ్యాసాల నుండి గ్రహించినవి. ప్రపంచ సాహిత్యం ప్రాతిపదికగా ఎంపిక చేసిన వ్యాసాలు కాబట్టి ఈ రచనలో భారతీయ సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు లేవు. మొదటి పుస్తకం కావడంతో- బాగున్నాయి అనిపించిన కొన్ని వ్యాసాల్ని ఎంపిక చేశామే కానీ ఒక క్రమం అంటూ ప్రత్యేకంగా ఏమీ పాటించలేదు. ‘కాగ్నిటివ్‌ రీడింగ్‌’ను ఇష్టపడే పాఠకురాలిని కాబట్టి సహజంగానే ఇందులోని వ్యాసాలు తర్కం, హేతుబద్ధతకు పనిపెడతాయి. ఈ కారణంగా మరీ పాఠం చెప్పినట్లు ఉండకుండానూ, అదే సమయంలో పాఠకుల మెదడు మీద వత్తిడి లేకుండానూ మధ్య మధ్యలో ఒక సరళమైన వాస్తవిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసం, వెనువెంటనే ఒక చిక్కనైన తర్కానికి సంబం ధించిన వ్యాసం వచ్చే పద్ధతిలో ఇందులోని వ్యాసాల్ని పొందుపరిచాము.

3. ప్రపంచ సాహిత్య విమర్శకి, తెలుగు సాహిత్య విమర్శకి మధ్య మీరు గ్రహించిన అంతరాలు?

సహజంగానే ప్రపంచ సాహిత్యం కాన్వాసు చాలా పెద్దది. నేను గమనించినంతలో తెలుగు సాహిత్య విమర్శలో భాషా సౌందర్యాలకు, పద గాంభీర్యాలకూ పెద్దపీట వేస్తారు. తెలుగు సాహిత్యంలో భాష, వ్యాకరణాల విషయంలో తీసుకునే శ్రద్ధ భావం విషయంలో కనబడదు. అదే సమయంలో ఇతర భారతీయ భాషల సాహిత్యంలో సైతం రచనలో సాంస్కృతిక అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగులో బహు అరుదుగా కనిపిస్తుంది. కథల్లోని పాత్రలను అన్ని అస్తిత్వ చిహ్నాలకూ దూరంగా మొండి గోడల్లా నిలబెట్టే ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఈ మధ్య అధికంగా కనబడుతోంది. మంచో, చెడో- మనిషికున్న చరిత్రను, సంస్కృతినీ, అన్ని అస్తిత్వ చిహ్నాలనూ సమూలంగా తుడిచేశాక ఇక చెప్పుకోడానికి మనకి కథలేం మిగులుతాయి! విమర్శకైనా ఆస్కారం ఏముంటుంది! ఇటువంటి రచనల మీద విమర్శ చెయ్యాలంటే భాష మీద పట్టు ఉంటే సరిపోతుంది. విమర్శకు వారికి ఇతరత్రా అర్హతలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. ఏదేమైనా మినహా యింపులు ఇక్కడ కూడా ఉన్నాయి. సింహభాగం తెలుగు సాహిత్యం గురించి మాత్రమే చెబుతున్నాను. అందువల్ల లోతులేని ఈ కాలపు సాహిత్యానికి తగ్గట్టే విమర్శ కూడా బలహీనంగానే ఉంటోంది. విమ ర్శకులు కూడా రచనల్లో ఏం చెప్పాలనుకున్నారు అన్నదాని కంటే భాషా ప్రావీణ్యం పైన మాత్రమే ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు అనిపిస్తుంది. రచనల్లో భాష, భావం విషయంలో ఇక్కడ సమతూకం శూన్యం.

4. మీ విమర్శని నడిపే చూపు గురించి చెప్పండి?

నావన్నీ పఠనానుభవాలే, విమర్శ అనుకోను. దానికి నేను ఎంచుకునే పుస్తకాలు కూడా కొంత కారణం. సద్విమర్శకు మరికొన్ని అదనపు అర్హతలు అవసరమవుతాయి. ఉదాహరణకు నేను ఏదైనా రచన చదువు తున్నప్పుడు నా దృష్టి రచయిత చెప్పాలనుకుంటున్న దేమిటో వినాలనే కుతూహలం దగ్గరే ఆగిపోతుంది. రచనలో శైలీ, శిల్పం వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ చదివే అలవాటు నాకు లేదు. చదువుతున్నప్పుడు ఆ రచన నన్ను ఆలోచింపజేసిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. మేధ విషయంలో విమర్శకులు రచయిత కంటే పై స్థాయిలో ఉండాలి. నేను చదివే రచయితల వద్ద నేనిప్పటికీ విద్యార్థినే.

5. వ్యాస నిర్మాణానికి భాషా పరంగా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు?

బాల్యంలో మూడు భాషలు సమాంతరంగా మాట్లాడే వాతావరణం నుండి వచ్చినదాన్నిగా నా భాషలో యాసతోబాటు కొన్ని సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు కూడా సహజంగానే వచ్చి చేరాయి. మా ముందు తరం వాళ్ళకు భిన్నంగా మా తరం వాడుక భాషలో అచ్చ తెలుగు అరుదుగానే కనిపిస్తుంది. వాడుక భాషలోనూ, రాయడంలోనూ కూడా విరివిగా ఆంగ్లపదాల వాడకం మా తరంలో చాలా సహజం. పదేళ్ళ క్రితం నా భాషలో ఆంగ్ల, హిందీ పదాలు అనేకం దొర్లేవి. కానీ తెలుగులో తరచూ రాయడం వల్ల క్రమేపీ ఆ అలవాటు తగ్గింది. ఇప్పుడా సమస్య లేదు. అనవసర వర్ణనలకు దూరంగా నా వ్యాసాల్లో సరళమైన భాషకు ప్రాముఖ్యతనిస్తాను.

ఇంటర్వ్యూ : కె.ఎన్‌. మల్లీశ్వరి

ప్రచురణ : ఆంధ్రజ్యోతి "పలకరింపు" - 28 ఆగస్ట్ 2023

https://www.andhrajyothy.com/2023/editorial/all-i-have-is-reading-experience-i-dont-think-of-criticism-1129015.html

Friday, July 21, 2023

ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!

బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ రచన "1984" పేరు వినగానే చాలామందికి  వెనువెంటనే గుర్తొచ్చేది అందులో ఆయన సృష్టించిన 'న్యూ స్పీక్' అనే పదమే. డిస్టోపియన్ సమాజాల్లో భాషను ఒక సమర్ధవంతమైన ఆయుధంగా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్వెల్ ముందుగానే హెచ్చరించారు. ఆర్వెల్ సృష్టించిన ప్రపంచంలోని ఫాసిస్టు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికీ, భ్రమలో ఉంచడానికీ వాడే ప్రత్యేకమైన భాషే 'న్యూ స్పీక్'.  ఉదాహరణకు ఆర్వెల్ కథలోని ప్రభుత్వం "క్రైమ్ థింక్" (స్వంతంగా ఆలోచించే తప్పు చెయ్యడం), "గుడ్ థింక్" (సంప్రదాయ ఆలోచనలు మాత్రమే చెయ్యడం) లాంటి కొత్త పదాల్ని తమ అజెండాలకు అనుకూలంగా సృష్టిస్తుంది. ఆ కాలంలోనే సాహిత్యంలో దీన్నొక గొప్ప ప్రయోగంగా చూడవచ్చు. నిరంకుశ పరిపాలనలో భాష ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో, ప్రజల్ని మోసపుచ్చే దిశగా దాన్ని ఆయుధంగా ఎలా వాడతారో వర్ణిస్తూ సంస్కృతిలో భాష యొక్క ప్రాథాన్యత అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని 'న్యూ స్పీక్' ద్వారా మరోసారి గుర్తుచేస్తారు ఆర్వెల్. భవిష్యత్తులో భాషను ఆయుధంగా వాడడం రాజకీయ, సామాజికాంశాల విషయంలోనే కాకుండా సాహితీరంగానికి కూడా పెనుప్రమాదంగా పరిణమిస్తుందని ఆర్వెల్ లాంటి వాళ్ళు బహుశా ముందే ఊహించి ఉండవచ్చు.

రచయితగా తాను నమ్మిన విలువలకు ఆర్వెల్ ఎంతగా కట్టుబడి ఉండేవారో తెలియాలంటే ఒక చిన్న సందర్భాన్ని గురించి చెప్పుకోవాలి. ఆర్వెల్ ఒక రచయితగా రచన కూర్పుపై ఎంత శ్రద్ధ పెట్టేవారో దాని సంపాదకీయం  విషయంలో కూడా అంతే పట్టుదలగా ఉండేవారట. తన స్వంత నవలలను ఎడిట్ చెయ్యడం పట్ల ఆర్వెల్ వైఖరి దీనికి ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ ప్రచురణ సంస్థ అధినేత Victor Gollancz తన రచనల్లో వేలుపెట్టడమే "A Clergyman’s Daughter" and "Keep the Aspidistra Flying" అనే రెండు నవలలు పాడైపోవడానికి కారణమని అంటారు ఆర్వెల్. తన రచనల్లో ఇతరుల ప్రమేయం పట్ల ఆర్వెల్ ఎంత మొండి వైఖరితో కూడిన విముఖత కనబర్చేవారంటే, చివరకు "అమెరికన్ బుక్ ఆఫ్ ది మంత్ క్లబ్" వారు "1984" ని ప్రచురించడానికి ‘The Principles of Newspeak’ appendix and the lengthy essay on Oligarchical Collectivism' ని పుస్తకంలోంచి తీసేస్తే తప్ప కుదరదంటే, ఆ ప్రతిపాదనని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఆయన కోల్పోయినదెంతో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్షరాలా ఆ కాలంలో నలభై వేల పౌండ్ల అమెరికన్ సేల్స్. ఆయన తన ఏజెంట్ తో "పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడా కోసుకుంటూపోతే నవల స్ట్రక్చర్ (నిర్మాణం) దెబ్బతింటుంది కాబట్టి కుదరదని అన్నారట. "ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీకి" ఇదొక మచ్చుతునక. ఏదేమైనా అది ఆర్వెల్ జీవించి ఉన్న సమయం కాబట్టి ఆయన తన రచనను సంపాదకీయాల నుండి కాపాడుకోగలిగారు. మరి ప్రస్తుతం జీవించిలేని రచయితలకు తమ కళను కాపాడుకునే అవకాశం ఉందా ? 

తరాలు మారుతున్నా, అప్పుడూ ఇప్పుడూ కూడా పాలనా వ్యవస్థకు ప్రతిబంధకాలుగా, ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్న సాహిత్యాన్ని బహిష్కరించడం పరిపాటే. నేడు అందరికీ సుపరిచితమైన క్లాసిక్స్ లో To Kill a Mockingbird (Harper Lee), The Handmaid’s Tale (Margaret Atwood), Of Mice and Men (John Steinbeck), Brave New World (Aldous Huxley), The Catcher in the Rye (J.D.Salinger) వంటివన్నీ ఒకప్పుడు బ్యాన్ చేసిన పుస్తకాలే. ఈ జాబితా చెప్పుకుంటూ వెళ్తే బహిష్కరణకు గురైన పుస్తకాలు కోకొల్లలు. కానీ నేడు అదే  బహిష్కరణ అందరికీ ఆమోదయోగ్యంగా (?) ఆధునికమైన రూపుదాలుస్తోంది.  టెక్స్ట్ ను అర్థం చేసుకోడానికి ఫ్రెంచ్ తత్వవేత్త జాక్వెస్ డెఱిడా ప్రతిపాదించిన "డీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్" ను పాఠకుల బదులుగా సంపాదకులు వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాహిత్యంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగానూ, అనుకూలంగానూ  లేని ప్రతీ పదాన్నీ మరో ఆలోచన లేకుండా తీసివెయ్యడం, దాని స్థానాన్ని తమకనుకూలమైన పదాలతో భర్తీ చెయ్యడం జరుగుతోంది.

ఈ పునఃనిర్మాణానికి అంకురార్పణగా మూలాలను పెకలిస్తూ ఈ మార్పులు బాలసాహిత్యంతో మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పఫిన్ బుక్స్ వారు బ్రిటిష్ రచయిత రోల్ డాల్ పుస్తకాలపై సెన్సార్షిప్ వేటు వేశారు. సాహితీవేత్తగా ఆయన లెగసీలో భాగమైన "చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ", "మెటిల్డా" వంటి రచనల్లో ఫాట్, అగ్లీ , మ్యాడ్ వంటి పదాలు సున్నితత్వానికి సుదూరంగా బాడీ షేమింగ్ ని ప్రోత్సహిస్తూ, అవమానకరంగానూ, వివక్షలకు దారితీసేవిగానూ ఉన్నాయనేది వారి వాదన. ఇదిలా ఉండగా రోల్ డాల్ తో బాటు బాలసాహిత్యంలో దిగ్గజాలైన ఎనిడ్ బ్లైటన్, డాక్టర్ సూస్, రుడ్యార్డ్ కిప్లింగ్ ల రచనలు సైతం జాతి వివక్షలనూ, లింగవివక్షలనూ ప్రోత్సహించే భావజాలాల్నీ, భాషనూ కలిగి ఉన్నాయని సెన్సార్షిప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అగాథా క్రిస్టీ రచనలపై కూడా ఇటువంటి ఆరోపణలే  వచ్చిన నేపథ్యంలో ఆమె మునిమనుమడు పత్రికాముఖంగా "క్రిస్టీకి ఎవరినీ అఫెండ్ ఉద్దేశ్యం లేదని" అన్నారట. భవిష్యత్తులో వీరందరి రచనల్లో ఉపయోగించిన పదాలనూ, భాషనూ మార్చి సమూలమైన మార్పులు చెయ్యాలనే ప్రతిపాదనలు వినబడుతున్నాయి.

ఈ చర్యలు సల్మాన్ రష్దీ, జూడీ బ్లూమ్ వంటి పలువురు సాహితీవేత్తల ఘాటు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. బంగ్లాదేశ్, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి వెనుకబడిన దేశాలే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కళాకారుడి స్వేచ్ఛకు పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. అకడమిక్ పుస్తకాల్లో సవరణలు చేసినట్లే సాహిత్యాన్ని కూడా నేటి సామజిక చట్రాల్లో ఇమిడ్చే యత్నాలు ఎటువంటి జీవ వైవిధ్యాన్నీ సహించలేని ప్రస్తుత సమాజపు అసహనానికి పరాకాష్ట. అందునా రచయితలు జీవించిలేని సమయంలో వారి రచనల్లో ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చెయ్యడం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి, వారి ప్రైవసీకి భంగం కలిగించడమే. పరిశీలిస్తే ఇది సమస్యలో ఒక పార్శ్వం మాత్రమే.

విజేతలు నిజాన్ని తమకనుగుణంగా వక్రీకరించే అవకాశం పుష్కలంగా ఉన్న చరిత్రలోని ప్రామాణికత ఎప్పటికీ అనుమానాస్పదమే. తులనాత్మకంగా చూస్తే, దీనికి భిన్నంగా ప్రతీ మనిషి యొక్క వ్యక్తిగత అనుభవాలకూ గళాన్నిచ్చే సాహిత్యంలో ఆ అవకాశం కాస్త తక్కువని చెప్పచ్చు. కళను కళాకారుడి యొక్క "స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన వ్యక్తీకరణగా" భావిస్తే ప్రతీ కళాకారుడి కళలోనూ ఆ కాలమాన పరిస్థితులకనుగుణంగా ఆ వ్యక్తి యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్న పలు సాంస్కృతిక, రాజకీయ, సామాజికాంశాలు అనేకం కనిపిస్తాయి. ఈ కారణంగా ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ కాలపు సంస్కృతిని ప్రతిబింబించే జీవన విధానాలూ, వేష భాషలూ, వివక్షలూ మొదలైనవి అనేకం గమనిస్తాం. నిజానికి సాహిత్యం యొక్క పరమావధి అదే కదా ! ప్రపంచంలో ఏ మారుమూలో, మరో కాలంలో జన్మించిన మనిషిలో పరకాయ ప్రవేశం చేసి అతడి కళ్ళతో ఆనాటి ప్రపంచాన్ని పరికించడం.

ఈ తరం పాఠకులకూ, సంస్కృతికీ అనుకూలంగా ప్రాచీన సాహిత్యంలో  భాషాపరమైన మార్పులు చెయ్యడంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ఈ చర్య ద్వారా మరణించిన కళాకారుణ్ణి అగౌరవపరచడమైతే రెండోది ఆ రచయిత అస్తిత్వాన్ని చెరిపేసే లేదా మార్చేసే ప్రయత్నానికి పూనుకోవడం. మంచో,చెడో ఏ కాలపు రచయితల భావజాలాలకైనా ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలనుబట్టి సందర్భానుసారంగా ఒక చారిత్రక నేపథ్యం అంటూ ఉండి తీరుతుంది. సంపాదకుడు తనకు నచ్చని పదాలనన్నిటినీ  ఎఱ్ఱని ఇంకుతో యథేచ్ఛగా కొట్టేసుకుంటూ పోతే ఇక ఆ రచనలో ఏ విధమైన ప్రామాణికతా మిగిలుండే అవకాశం లేదు. అంతేకాకుండా ఒక రచనను పునఃవిశ్లేషించే సంపాదకుల వ్యక్తిగత భావజాలాలు కూడా రచనపై ప్రభావం చూపిస్తాయనేది విస్మరించలేని విషయం. సాహిత్యంలో "బైగోటెడ్ వ్యూస్", "బైగోటెడ్ లాంగ్వేజ్" పేరిట ఆ కాలంలోని మతవిశ్వాసాలనూ, మూఢ భావజాలాలనూ, వివక్షలనూ ఈ కాలానికి తగ్గట్టు చెరుపుకుంటూనో, మార్చుకుంటూనో పోతే ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలూ, వేషభాషలూ, వివక్షల గురించి ఈ తరానికి తెలిసే అవకాశం మృగ్యమైపోతుంది. ఇది మనిషి కులమత జాతి వివక్షలను ఎన్నిటిని దాటుకుని ఈరోజు నాగరికమైన మనిషిగా నిలబడ్డాడో తెలిసే అవకాశం మన ముందు తరాలకు లేకుండా చెయ్యడమే.

ఆర్వెల్ 'The Prevention of Literature' అనే వ్యాసంలో భవిష్యత్తులో వ్యక్తిగత అనుభవాలూ, భావోద్వేగాలూ, నిజాయితీతో కూడిన పరిశీలనలూ లేని డొల్లతనంతో కూడిన కొత్త రకం సాహిత్యం పుడుతుందనీ, లిబరల్ సంస్కృతి అంతరించడంతో పాటే సాహిత్యం కూడా తుది శ్వాస విడుస్తుందని జోస్యం చెప్పడం సమకాలీన సాహితీ ప్రపంచపు విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే నిజమేననిపిస్తుంది. ఆ నిరంకుశత్వం నీడల్లో మెటాఫోర్ల ముసుగుల్ని ఆసరా చేసుకుని కవిత్వం కొంతవరకూ నిలదొక్కుకోగలుగుతుందేమో గానీ హేతువాదం పునాదుల మీద నిలబడే వచన రచన మాత్రం అంతరించిపోతుందంటారాయన. నిరంకుశ సంస్కృతిలో వచన రచన చేసే రచయితకి అయితే నిశ్శబ్దమూ లేదా మృత్యువూ తప్ప మధ్యే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పిన ఆర్వెల్ జోస్యాన్ని జీవించిలేని రచయితల యొక్క రచనల రూపంలో మిగిలిన అస్తిత్వాన్ని సమాధుల్లోంచి తవ్వితీసి మరీ పోస్ట్మార్టం చేస్తున్న నేటి ప్రచురణ సంస్థలూ, సంపాదకీయాలూ నిజమేనని నిరూపిస్తున్నాయి.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' : 17 జులై 2023

https://www.andhrajyothy.com/2023/editorial/orwells-prophecy-is-coming-true-1104593.html?fbclid=IwAR0qh_-4gDhI7xP-a85PGB3k7npmpAeBj0L9S5CkB7RSvK_2xiPChwfJiZc

Tuesday, May 16, 2023

Checkout 19 - Claire-Louise Bennett

గత ఏడాది చివర్లో న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యూ వారు 2022 లో ప్రచురితమైన పుస్తకాలలో చదవవలసిన పది పుస్తకాలంటూ ఒక చిన్న లిస్టును విడుదల చేస్తూ అందులో బ్రిటిష్ రచయిత్రి క్లైర్ లూయీస్ బెన్నెట్ రచన "చెక్ ఔట్ 19" పేరును కూడా ప్రస్తావించారు. సహజంగానే అంతఃప్రపంచానికి సంబంధించిన (సెరెబ్రల్ స్టఫ్) పుస్తకాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న నాకు రాయడం, చదవడం అనే రెండు అంశాల చుట్టూ తిరిగే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రత్యేకం కథంటూ ఏమీ లేని ఈ రచనలో కథానాయకురాలు బాల్యం నుండీ పుస్తకాల్లోని కాల్పనిక ప్రపంచాలూ, వ్యక్తులూ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చెప్పుకొస్తూ, వాటితో ముడిపడిన అనేక అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ఇక "చెక్ ఔట్ 19" అనేది ఆమె పనిచేసే డిపార్ట్మెంటల్ స్టోర్ లో కౌంటర్ నెంబర్ అని తప్ప ఈ పుస్తకంలో కథాంశానికీ, టైటిల్ కీ ఏమీ సంబంధం ఉండదు.

Image Courtesy Google

అంతఃప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ కాల్పనిక ప్రపంచాలూ, కల్పిత పాత్రలూ పాఠకుల జీవితాన్ని ఎలా ఉత్తేజంతో నింపుతాయో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ముఖ్యంగా బాల్యంనుండీ పుస్తకపఠనం జీవితంలో భాగమైనవాళ్ళు, ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయమున్నవారూ ఈ రచనతో అడుగడుగునా తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. మునుపు సుసాన్ సొంటాగ్ ను చదివినప్పుడు నాకు ఆవిడ ద్వారా పరిచయమైన రచయితలెంతమందో ! అప్పటికి మచాడో డి ఆసిస్, ఎలియాస్ కానెట్టి, వాల్టర్ బెంజమిన్ లాంటి వాళ్ళ పేర్లు పలుసార్లు విని ఉన్నప్పటికీ, వారి రచనల గురించీ, శైలి గురించీ సుసాన్ రాసిన వ్యాసాల కారణంగానే వారిని చదవాలనే ఆసక్తి కలిగింది. మళ్ళీ ఇంతకాలానికి బెన్నెట్ ను చదువుతుంటే నాకు సుసాన్ లాంటి మరో "బుక్ వోర్మ్ ఫ్రెండ్" తారసపడినట్లనిపించింది.

ఈ రచనను కథ చదివినట్లు ఒక్కసారిగా చదివిప్రక్కన పెట్టడం వీలుపడదు. ఇందులో పేజీల నిండా పఠనానుభావాలూ, పాఠకులకు పరిచయం లేని కొంతమంది రచయితలూ, రచనల ప్రస్తావనలు ఉండడం వల్ల ఆ రిఫరెన్సులు పట్టుకుని ఆయా రచనల్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ, వారి పేర్లు నోట్ చేసుకుంటూ మెల్లగా చదివాను. మున్ముందు కాలంలో చదవడానికి బెన్నెట్ వల్ల కొంతమంది కొత్త రచయితలు కూడా పరిచయమయ్యారు. ఎటొచ్చీ బెన్నెట్ విశ్లేషణలు సుసాన్ రచనలంత ఇంటెక్చువల్ గా ఉండవు. సరళంగా ఉండే ఆమె విశ్లేషణల వల్ల ఒక సాధారణ పాఠకుడు సైతం ఆమె లోతైన పఠనానుభవాల్లో తనను తాను చూసుకోగలుగుతాడు. ఇక ఈ రచయిత్రి వచనానికో ప్రత్యేకత ఉంది. కొన్ని వాక్యాలు చదివి ఇది బెన్నెట్ వచనమని ఇట్టే చెప్పెయ్యొచ్చు. మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే వాక్యాలతో కూడిన క్లైర్ లూయిస్ బెన్నెట్ వచనం అమెరికన్ రచయిత్రి గెర్ట్రూడ్ స్టైన్ ప్రోజ్ ని తలపిస్తుంది. ఈ పుస్తకమంతా గొలుసుకట్టులా ఇటువంటి వాక్యాలే కనిపిస్తాయి. ఈ తరహా వచనం అరుదుగా చూస్తాం.

ఉదాహరణకి ఈ ప్రారంభ వాక్యాలను చూడండి : 

Later on we often had a book with us. Later on. When we were a bit bigger at last though still nowhere near as big as the rest of them we brought over books with us. Oh loads of books. And sat with them there in the grass by the tree. Just one book, in fact. Just one, that’s right. Lots of books, one at a time. That’s it, one at a time.

No wonder at all that we are itching to turn it over. No wonder whatsoever that we anticipate turning the page so very fervidly. As if it were a matter of life or death in fact. Life or death. Life or death. It is a matter of life or death in fact. Yes. Yes. Yes, it is. Turning the pages. Turning the pages. When we turn the page we are born again. Living and dying and living and dying and living and dying. Again, and again. And really that’s the way it ought to be. The way that reading ought to be done. Yes. Yes. Turning the pages. Turning the pages. With one’s entire life.

ఇందులో బెన్నెట్ ఫిక్షన్ చదవడం గురించే కాకుండా ఒక రచయిత్రిగా కూడా తన అనుభవాల గురించి రాసుకొస్తారు. ఈ కథలో రీడింగ్ మరియూ రైటింగ్ లైఫ్ గురించి చిన్న చిన్న కథలుగా అమలిపోయిన ఆమె చెప్పిన అనేక పిట్ట కథలుంటాయి. ఒక కథలో ఆమె సృష్టించిన కథానాయకుడు Tarquin Superbus కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని తన ధనమంతా ధారపోసి ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తాడు. కానీ తీరా లైబ్రరీలో పుస్తకాలన్నీ కొని అమర్చాకా విచిత్రంగా వాటిల్లో పేజీలన్నీ ఒక్క అక్షరం కూడా లేని ఖాళీ కాగితాలని గమనించి నిరాశ చెందుతాడు. Tarquin కి నమ్మకస్తుడైన ఒక వ్యక్తి, మొత్తం లైబ్రరీలో పదాలున్న ఒకే ఒక్క పేజీ ఉందనీ, ఆ పేజీలో ఉన్న ఒకే ఒక్క వాక్యంలో మనం తెలుసుకోవలసిన సమస్తమూ నిక్షిప్తమై ఉంది గాన, ఆ పేజీ కనుగొన్నట్లైతే అతడు పూర్తి జ్ఞానసంపన్నుడవుతాడనీ, ఆ అనుభవం అతడికి మాత్రమే సొంతమనీ అంటాడు. ఈ కథ చెప్పడం ద్వారా రచయిత్రి అక్షరానికి ఉన్న శక్తిపైనా, చదవడం అనేది వ్యక్తిత్వ నిర్మాణంలో పోషించే పాత్రపైనా ఏకకాలంలో దృష్టిసారించారనిపిస్తుంది.

ఇక మనం లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం గురించి బెన్నెట్ రాసిన  విషయాలు సరదాగా ఉంటాయి, 

"మనకి టన్నుల కొద్దీ పుస్తకాల అవసరం లేదు. మనకొక్క పుస్తకం చాలు. మనకు అప్పుడో పుస్తకం, ఇప్పుడో పుస్తకం ఉంటే చాలు. కానీ మనం లైబ్రరీకెళ్ళినప్పుడల్లా ఆతృతగా ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు తీసేసుకుంటాం. సర్వసాధారణంగా ఎనిమిది పుస్తకాల వరకూ తీసుకుంటాం. చాలాసార్లు అయితే ఆరూ లేదా ఎనిమిదీ లేదా పన్నెండు పుస్తకాలు తీసుకుంటాం. మన అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపికచేసి తీసుకున్నవైతే సహజంగా నాలుగు వరకూ తీసుకుంటాం. పోనీ ఆ పుస్తకం తీసుకుందాం. ఈ పుస్తకం కూడా తీసుకుందాం. అయితే అయ్యింది, అదీ ఇదీ కూడా తీసుకుందాం అనుకుంటాం. పుస్తకాల ఎంపిక విషయంలో ఆదీ అంతం లేని డైలమా ఇది. పుస్తకాల షాపుల్లోనూ,లైబ్రరీల్లోనూ ఈ తతంగం అలా అంతులేని కథలా నడుస్తూనే ఉంటుంది. పోనీ ఇంటికి తీసుకెళ్ళిన పుస్తకాలన్నీ చదువుతామా అంటే, ఉహూ, సాధ్యం కాదు. మన చేతిలో ఎంత మంచి పుస్తకమున్నా మనదగ్గర లేని మరో పుస్తకంలో కొత్త కాల్పనిక ప్రపంచాలకు దారులు వేసే కొత్త కొత్త పదాలేవుండుంటాయా అని అన్యమనస్కంగా కుతూహలపడుతూనే ఉంటాం, అటువంటి ఆలోచనల నుండి తప్పించుకోవడం దాదాపూ అసంభవం."

We couldn’t help it could we. We just couldn’t stop ourself from thinking about the other books and the different kinds of words they each contained and when we picked up one of the other books in order to find out it was just the same. It really was just the same no matter which book we picked up. As long as there were other books we thought about the sorts of words they might contain nonstop and were thus precluded from becoming engrossed with the very book we had in our hands. The very book. A silly business. Yes, it was a silly business. Tossing one book down and picking one book up and tossing that to one side and picking up yet another and so on and getting nowhere. Nowhere at all. Over and over again.

ఇందులో ప్రొటొగోనిస్ట్ సహచరుడు డేల్ ఆలోచనల్లో వివక్షతో కూడిన  ఛాయలు కనిపిస్తాయి. "ఇంటెలెక్చువల్ రెల్మ్" స్త్రీలకు కాదనీ, అది కేవలం మగవారికోసమే ఉద్దేశింపబడిందనే భావనను సమర్ధించేవిగా ఉంటాయి. ఈ క్రింది వాక్యాలు చదివి ముందు "వాట్ ద రబ్బిష్" అనుకున్నప్పటికీ చివర రెండు వాక్యాలూ చదివి మాత్రం నవ్వుకోకుండా ఉండలేకపోయాను. :) "అమ్యూజింగ్" ఐ సే... 

Dale wrote poetry and read poetry and had plenty of poetry books, including volumes by Anne Sexton and Sylvia Plath—which he made sure to keep out of my reach. Probably if I got my hands on them and read them all up something terrible would befall me or else something terrible but infinitesimal already woven into me would get notions and take over and what on earth then? Women can’t withstand poetry, seemed to be Dale’s view. Women are beautiful and tender creatures and poetry breaks them, of course it does. Poetry rips right through you, makes shit of you, and a man can be made shit of and go on living because no one really minds, not even the man.

సహజంగా సాహితీ విద్యార్థులు జ్ఞానం సంపాదించడానికో, పరీక్షలు రాసి  ఎక్కువ మార్కులు తెచ్చేసుకోడానికో సాహిత్యాన్ని చదవరు. నిరంతరం తాము జీవించి ఉన్నామన్న స్పృహ కలగడం కోసం చదువుతారు. రోటీ కపడా మకాన్ లాంటివాటిని దాటి జీవితం నుండి ఇంకేదో కావాలనే తపన తీర్చుకోడానికి చదువుతారు. వీళ్ళు పుస్తకాల్లోనే కాకుండా వాస్తవ జీవితంలో కూడా మెటఫోర్లని, చిహ్నాలనీ, సారూప్యతల్నీ, సంకేతాలనీ ఛేదించడంలో నిష్ణాతులు. కానీ కొన్నిసార్లు వీళ్ళు వాస్తవానికీ, సాహిత్యానికీ మధ్య పరిధులు గుర్తించలేక పొరబడుతుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ విషయం తమకేదో సంకేతాలిస్తోందని భ్రమపడతారు, మన అల్పమైన అస్తిత్వం గురించో, అపరిపక్వమైన మన వ్యక్తిత్వాల గురించో, అన్నిటినీ మించి మున్ముందు ఏం జరగబోతుందో అన్న విషయం గురించో. What was to come? What was to come? We wanted to know, we wanted to know what lay ahead of us very very much, it was all we could think about and it was so unclear—yet at the same time it was all too clear.

ఈ మధ్య చదివిన సమకాలీన సాహిత్యానికి చెందిన రచనల్లో "చెక్ ఔట్ 19" నాకు మంచి పఠనానుభవాన్ని మిగిల్చిన రచన. హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :

That’s just the kind of uncomfortable scenario you’d find yourself in if you were popular, she knew that very well—she knew that popularity meant being trapped at every turn—no, it held no attraction at all and she was fed up of seeing how his popularity meant that they expected him to be fun every single time. What if he didn’t feel like it? Was he afraid of letting them down ?

You could get away with more on a Friday afternoon because no one was entirely there anyway.

The briefest love is also sometimes the longest love.

It was a nice bed. It was a nice bed. It was a nice room. The ceiling sloped and there were rafters. There was plenty of room. There was. It was spacious but cosy. We had plenty to read. Of course we did. We’d brought books over with us. And of course we acquired lots more very quickly. Everywhere we went people gave us books didn’t they. They did. They did. Everywhere we went. Very soon we had stacks of books. Stacks of them. We don’t much like stacks of books do we. No. No. Not really. We liked one book then and we like one book now. That’s right. We lay awake in bed all night long with one book on the duvet beside us. Wide awake. Yes. We couldn’t sleep could we. No, and our eyes were still ever so puffy. One book.

We could tell, had always known it—the encroaching inevitability of that life path had been a source of anxiety to us both since we were approximately eleven years old. We tried to keep that anxiety at bay with reading, with writing, with alcohol, with fantasies, with all the strength and imagination that those things gave us, and were on the lookout, always, for signs, proofs, indications, merest hints that we had promise, that we were special, that our lives would take a different turn.

I mostly read books by old white men such as Graham Greene and Edgar Allan Poe and Robert Louis Stevenson and that man who wrote Heart of Darkness, whose name escapes me. I hardly ever saw so much as a glimpse of myself in any of their books and I didn’t care to. I didn’t want to exist in books. I liked how the men talked to other men and I liked the places they went to. I liked being able to go with these men wherever they went and they went everywhere of course, all over the world, hardly ever really liking each other, so often paranoid, so often out on a street near the water last thing, or walking first thing down avenues churning with blossom, dying, dying weakly beneath a thin lapel, dying on the vine.

Drawing him kept him steady in the centre of her mind and brought him in closer, even closer, blotting everything else out. He wasn’t absent—she wasn’t remembering him—he was here—he was right here, moving through her mind, making it warm and luxuriant, and he could see of course all the many things she kept stored away in it, though only from an oblique angle—he couldn’t see all the way into those things in her mind which were all around him, not yet.

I’d come across a quote of hers (Anaïs Nin),that had really made me feel better: “We do not grow absolutely, chronologically. We grow sometimes in one dimension, and not in another; unevenly. We grow partially. We are relative. We are mature in one realm, childish in another. The past, present, and future mingle and pull us backward, forward, or fix us in the present. We are made up of layers, cells, constellations.”

You feel they wouldn’t exist without your seeing them. Like they wouldn’t exist without you. And isn’t the opposite true too—that the pages you read bring you to life? Turning the pages, turning the pages. Yes, that is how I have gone on living. Living and dying and living and dying, left page, right page, and on it goes. Sometimes all it takes is just one sentence. Just one sentence, and there you are, part of something that has been part of you since the beginning, whenever that might rightly be.

We’ve discovered haven’t we that something or other doesn’t have to belong to us in order for us to enjoy it. That’s right, it doesn’t matter does it, if whatever it is isn’t ours. An ostensibly permissive and uncommon attitude that got us into a lot of bother, once upon a time. Once. Yes. And only once.

Friday, April 21, 2023

Seduced by Story: The Use and Abuse of Narrative - Peter Brooks

ప్రముఖ అమెరికన్ సాహితీవేత్త, విమర్శకులూ అయిన పీటర్ బ్రూక్స్ రాసిన "Reading for the Plot"(1984) చదువుదామని చాలా కాలంగా అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఈలోగా ఇటీవలే ఆయన కొత్త పుస్తకాన్ని "Seduced by Story: The Use and Abuse of Narrative" పేరుతో న్యూయార్క్ రివ్యూ బుక్స్ వారు ప్రచురించారని తెలిసింది. ఈ పుస్తకం 2022 సంవత్సరానికి గాను న్యూయార్క్ మ్యాగజైన్ / వల్చర్ బెస్ట్ బుక్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. పుస్తకం పేరు  కుతూహలాన్ని రేకెత్తించగా, పాత పుస్తకం సంగతి వదిలేసి ఇది చదవడం మొదలుపెట్టాను. నిజానికి బ్రూక్స్ రాసిన ఈ రెండు పుస్తకాల మధ్య కాలంలో మన సంస్కృతిలో "కథనానికి" ఉన్న నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కళారంగానికి మాత్రమే పరిమితమైన "కథనాలు" (నేరేటివ్స్) నేడు వాస్తవంపై పూర్తిగా కమ్ముకున్న చీకటి నీడల్లా రాజకీయ సామజిక అంశాలపై సైతం తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. (Public civic discourse supposedly dedicated to reasoned analysis).

Image Courtesy Google

"గేమ్ ఆఫ్ థ్రోన్స్" సిరీస్లో నాకు ఇష్టమైన టిరియన్ పాత్రధారి “There’s nothing in the world more powerful than a good story. Nothing can stop it. No enemy can defeat it.” అన్న మాటల్ని ప్రారంభ వాక్యాలుగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకం మొదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కథలూ, కథనాలూ మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న అంశంపై రాసిన పుస్తకం ఇది. "ప్రపంచంలోని కథనాలు అసంఖ్యాకమైనవి" అంటారు రోలన్ బార్త్. ఎక్కడైనా, ఎప్పుడైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన కథ లేని మనిషంటూ ఉండడు. అంతర్జాతీయ, సాంస్కృతిక, చారిత్రక వైరుధ్యాలు ఎన్నున్నప్పటికీ జీవితమున్న ప్రతీ చోటా ఒక కథనం (నేరేటివ్) కూడా ఉంటుంది.

ఈ పుస్తకంలో సాహిత్యంలోని వివిధ నేరేటివ్స్ మనపై ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయో అంచనావేసే క్రమంలో రచయిత ప్రూస్ట్, సాకీ, బోర్హెస్, పౌలా హాకిన్స్, బల్జాక్, మొపాసా, హెన్రీ జేమ్స్ వంటి పలువురి రచనల్లోని కథనాల్ని విస్తృతంగా విశ్లేషించారు. సాహిత్యం చదివేటప్పుడు మనం వాస్తవం కాదని తెలిసి కూడా కాల్పనిక వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకుంటాం, మన భావోద్వేగాల్ని వెచ్చిస్తాం. ఎమ్మా బావరీ, అన్నా కరెనిన వంటి కల్పిత పాత్రల ఆశయాలూ, పొరబాట్లూ, అంతఃసంఘర్షణలూ మనకెంతో ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. పేజీలు తెరుస్తూనే ఆ పుస్తకంలోని పాత్రలు నిజం కాదని తెలిసినప్పటికీ వాళ్ళతో పరిచయం పెంచుకోడానికి తహతహలాడతాం, వాళ్ళను ఆరాధిస్తాం, ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, విమర్శిస్తాం. వాళ్ళ ఓటమి మనదైనంతగా బాధపడతాం, వాళ్ళ గెలుపుకి చప్పట్లు కొడతాం. Those unreal people and their dilemmas are deeply important to us. The psychologist Paul Harris confirms what we already know: fictions arouse emotions even when recognized to be fictional.

ఇక వాస్తవ ప్రపంచానికొస్తే, రోజువారీ జీవితంలో మనం అనేక కథనాలు వింటూ ఉంటాం. అనేక వివరాలతో కూడిన ప్రతీ కథనమూ కథకుడు (కథకుడంటే రచయితే కానఖ్ఖర్లేదు, ఎవరైనా కావచ్చు, కథకుడు అంటే ఇక్కడ కథగా విషయాన్ని చెప్పేవాడు) కథను చెప్పే విధానాన్ని బట్టి వాస్తవంగానే ధ్వనిస్తుంది. We know from literature as well as life that unreliable narrators can at times be charming and seductive, even that the non-truth they tell can have a certain value.  ఈ నేరేటివ్స్ లో వాస్తవమెంతో అభూత కల్పనెంతో  తెలియాలంటే ఇటువంటి పుస్తకాలు చదవడం అవసరం. ముఖ్యంగా ఈ కృత్రిమ మేథ కాలంలో మన జీవితాలను సామజిక మాధ్యమాలూ, మీడియా, రాజకీయాలూ, కార్పొరేట్ కంపెనీలూ తమ స్వార్ధప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా మానిప్యులేట్ చేస్తున్న తరుణంలో వారి కథనాల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్య గీతలు గీసుకోవడం గురించి విస్తృతంగా చర్చిస్తుందీ పుస్తకం. ఇందులో అనేక విశ్లేషణలు Ontological నేరేటివ్ కీ epistemological నేరేటివ్ కీ మధ్య భేదాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. రాజకీయ పార్టీలూ, పాలక వ్యవస్థలూ భాషను తమకనుగుణంగా మలుచుకుని సమర్ధవంతమైన  కథనాల్ని తయారుచేసి ప్రజల్ని మభ్యపెడుతున్న ఈ కాలంలో మనం ఏ కథను నమ్మాలో, ఏ కథను నమ్మకూడదో ఈ పుస్తకం చదివితే ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది. 

What seems more important than choosing between ontology and epistemology is recognizing that telling and living are not the same thing. We may live the world as an unfurling narrative, but when we tell of it, whether anecdotally or analytically, that’s a different operation.

"చెప్పేవాడు వినేవాడికి లోకువ" అనే ఒకప్పటి నానుడి ఇప్పుడు పాతబడిపోయింది. ఇప్పటి పరిస్థితి "వినేవాడు చెప్పేవాడికి లోకువ" అన్న తీరుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడి కథలో ఎంతోకొంత ప్రామాణికత ఉండేది, కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అనేక అజెండాల ప్రాతిపదికన కులమతవర్గ వైషమ్యాలను రెచ్చగొడుతూ, రాజకీయలబ్ది కోసం ప్రామాణికతకు తిలోదికాలిచ్చే సత్యదూరమైన కథనాలే నేడు అధికంగా ప్రాచుర్యంలో ఉంటున్నాయి. వాటిల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చుకోవాలంటే మనకు భిన్న కథనాల తీరుతెన్నులు తెలియాలి. ఈ రచన సాహిత్యం మొదలు మీడియా, రాజకీయాలూ, ఫిలాసఫీ, సైకాలజీ వంటి అనేక అంశాల ఆధారంగా కథనాలు (నేరేటివ్స్) మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒక అవగాహన కలిగిస్తుంది.   

ఈ రోజుల్లో మీడియాలో ప్రతీ ఒక్క వార్తా ఒక కథనమే. అందులోనూ వీటిల్లో ఏ విధమైన ప్రామాణికతా లేని కథనాలే అధికం. ఏ వార్త గురించైనా చెప్పాలన్నా ఈ మధ్య "మీడియా కథనాలను అనుసరించి", "రాజకీయ కథనాల్ని బట్టి" వంటి వాక్యాలు తరచూ వింటున్నాం. "ఆవిడ కథ ఏమిటంటే", "అతడి కథ మనకి తెలియాలంటే", "ఫలానా కంపెనీ కథని చూస్తే", "దీని వెనుక ఉన్న కథేమిటంటే" అంటూ న్యూయార్క్ టైమ్స్  మొదలు గార్డియన్, బీబీసీ, టైమ్స్ వంటి అనేక ప్రముఖ పత్రికల వరకూ అనేక వ్యాసాలు ప్రచురింపబడుతున్నాయి. 

That continues, in more and more virulent form, as rulers judge that controlling the media narrative is what governing is all about. “The nation needs a better story about the drivers of economic growth,” I read in The New York Times. Writing to the corporate world in Whoever Tells the Best Story Wins, Annette Simmons claims: “The really important issues of this world are ultimately decided by the story that grabs the most attention and is repeated most often.”

Every person has a story to tell, and the corporate person has understood, with a vengeance, that it must stake its identity, persuasion, and profits on telling a story, however bizarre or banal. Corporate reports have turned from the statistical to the narrative mode. And in the wake of the corporation are political candidates and parties, the military, the tourism industry, universities, hospitals, bakeries—even accounting firms. Salmon, the sociologist, has identified what he calls a “nouvel ordre narratif,” or NON: a new narrative order that dominates in business and politics.

ఈ కారణంగా పాఠకులపైనా లేదా విన్నవారిపైనా సదరు కథనాలను గుడ్డిగా నమ్మడం కంటే తమకు తాముగా విశ్లేషించుకోవలసిన (French Structuralists dubbed “narratology.”) బాధ్యత మునుపెన్నడూ లేనంతగా ఉందని గ్రహించడం అందరికీ అవసరం.

Recall the claim of Annette Simmons: “Every problem in the world can be addressed—solved, made bearable, even eliminated—with better storytelling.” Do we really want to subscribe to that belief ? Doesn’t it mystify more than it solves? 

భవిష్యత్తులో "నేరేటివ్ పవర్" మనల్ని శాసించకుండా దాన్ని మనం అదుపు చెయ్యవలసిన అవసరాన్ని గుర్తుచేస్తూ పీటర్ బ్రూక్స్ ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు అనే కంటే, ఈ రచనలో అనేక ఉదాహరణల సహితంగా పలు కథనాల్లోని ప్రామాణికతను అంచనా వేసే మార్గాలను సూచించారనడం సబబు. రోలన్ బార్త్ "మైథాలజీస్" తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత కలిగిన పుస్తకం ఇది. సాహితీప్రియులే కాకుండా ప్రతీ ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. హాప్పీ రీడింగ్. :) 

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు : 

Mortality can perhaps best be dealt with in story form. Whatever meanings life may have, or fail to have, develop through time.

Stories are regarded by law as suspiciously emotional, as making a kind of appeal to empathy—or prejudice—that legal rules must cabin and confine.

Story may be a necessary part of our cognitive interaction with the world because its mode of explaining takes place within time, and humans are time-bound in a way that they are not place-bound.

It’s quite true that we can’t ever find the proper repose, as Kierkegaard puts it, to see our lives in full retrospect. That view is denied to us. According to Walter Benjamin, this explains why we read fiction: we seek in the death of the fictional character the meaning of life that comes only with death. Death in fiction is the “flame” at which we warm “our shivering lives.”

Plato notes in his Phaedrus that the problem with written texts is that they roam around everywhere, promiscuously, and it’s impossible to know how they will be received, interpreted, acted upon. The oral storyteller, on the other hand, can gauge audience reaction, respond to questions or skeptical looks or bored body language. Many writers in the age of writing and print appear to look back upon the era of oral storytelling with nostalgia, as a less fallen age of communication and fellowship.

నేరేటివ్ పవర్ గురించి గై డి మొపాసా కథ " A Ruse" ను ఆధారంగా చేసుకుని  బ్రూక్స్ చేసిన విశ్లేషణ అద్భుతం. మీరు ఇప్పటికే ఈ కథ చదివున్నట్లైతే ఈ క్రింది విశ్లేషణ మరింత బాగా అర్థమవుతుంది. చదవని వాళ్ళు వీలైతే ఆ కథ చదివిన తరువాత ఈ వాక్యాలు చదవండి.  

This cynical, mocking—almost sneering—reply that ends the tale reverberates after we have closed the book. What has the doctor done to the young woman? The tale reads as a kind of verbal violation, really a kind of rape, destroying the young woman’s faith in marital fidelity, contaminating her mind with ideas it does not want, creating an unwholesome bond between her and her doctor. She has been changed by the story she has unwittingly and unwillingly listened to. She has gained a knowledge of good and evil of which she was innocent. She doesn’t want the story, its content, its lesson. But now she cannot get rid of them. They remain with her as a kind of poisonous residue. Maupassant’s story is trivial and bleak. But it demonstrates with a kind of fierceness the result of listening, of having to listen to, a story. In the words of T. S. Eliot: “After such knowledge, what forgiveness?” Some things we learn cannot be undone. We are forever changed by them.

Benjamin claims: “The flame that consumes this stranger’s fate warms us as our own fates cannot. What draws the reader to a novel is the hope of warming his shivering life at the flame of a life he reads about.”

As Freud said, much too simplistically but with much truth, fiction is all about “His Majesty, the ego.”

So what we think of as the teller’s tale can’t exist without it being the listener’s tale as well.

Language is an imperfect instrument of communication: “a cracked cauldron on which we beat out tunes for bears to dance to, while we would wish to move the stars to pity,” Flaubert claims in Madame Bovary.

But it’s what we have to hand to communicate with others, in the hope of hearing a response, of establishing a dialogue. When we fail to get a reponse, we try again, telling another story. We’re back to Scheherazade, telling one story after another to keep alive, knowing that in the long run we are condemned but believing that in the meanwhile we need to make others hear us out.

The Borges tale I mentioned earlier, “Tlön, Uqbar, Orbis Tertius,” offers a kind of parable: if you cease to recognize that fictions are the “discipline of men, not of angels,” if you start believing in them literally, they cease to be fictions and devolve into myth, which claims explanatory status and demands belief, whether it be in the “master race” or in the resurrection of the body. Fiction is playful precisely in its refusal to accept belief systems, its insistence on the “as if.”

“Let’s pretend” seems to be a statement and a state of mind that distinguishes humans from the so-called “higher apes.”

We live at a time when knowledge generated by the humanities in general and literary study in particular is often publicly devalued, or even derided. The only knowledge worth having is thought to be instrumental: that which gives you direct leverage on the world.

Monday, April 10, 2023

I Am God - Giacomo Sartori

సహనానికి కూడా హద్దులుంటాయంటారు. మనకి కోపం వస్తే ముందు ఎదుటివాళ్ళని తిడతాం, తరువాత మనల్ని మనం తిట్టుకుంటాం, ఇంకా కోపం తీరకపోతే, తిరిగి ఏమీ అనడు కాబట్టి ఆ పైవాణ్ణి నిందిస్తాం. కానీ దీనికి భిన్నంగా దేవుడికి మనమీద విసుగూ, కోపమూ వస్తే ! ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఇస్తే హాయిగా కలిసిమెలిసి బ్రతక్కుండా నిరంతరం విద్వేషాలతో, వైరాలతో ఈ భూమిని నరకంగా మారుస్తున్నారని అసహనం వెళ్ళగక్కితే ! సమస్త మానవాళి బాధ్యతారాహిత్యాన్నీ, హిపోక్రసీనీ, ద్వంద్వ వైఖరినీ, కుటిలత్వాన్నీ ఏకరువుపెడుతూ తిడితే ! అసలీ ఆలోచనే భలే ఉంది కదా ! దేవుడికి కోపం రావడం, చిరాకులూ పరాకులూ ప్రదర్శిస్తూ మనల్ని తిట్టడం. మనిషిని సృష్టించిన తొలి క్షణం నుండీ మానవజాతి వైఖరి పట్ల లోలోపలే దాచుకున్న అసహనాన్నీ, కోపాన్నీ ఉన్నపళంగా వెళ్ళగక్కుతూ తన ఫిర్యాదుల చిట్టా విప్పడం.

Image Courtesy Google

ఆలోచింపజేసే రచనలు అరుదుగా వస్తున్న ఈ కాలంలో ఇటాలియన్ రచయిత జియాకొమో సర్తోరి రచన "ఐయామ్ గాడ్" ఒక సరికొత్త ప్రయోగం. ఈ రచనకు మూలం ఆంగ్లమే అన్నంతగా Frederika Randall చేసిన అనువాదం ఒక ప్రవాహంలా సాగింది. మనం చేసే ప్రతీ పనికీ దేవుణ్ణి నిందించడమనే అలవాటైపోయిన ఎస్కేపిస్టు మెంటాలిటీ నుండి బయటపడి ఇకనైనా మనిషి తన కర్మలకు తానే బాధ్యత తీసుకోవలసిన అవసరం ఆసన్నమైందని గుర్తు చేస్తూ పాఠకుల్ని ఆలోచనలో పడేస్తుందీ రచన. 

"నేను దేవుణ్ణి, ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఇప్పటివరకూ నేనెప్పుడూ ఆలోచించలేదు, నిజానికి నాకు ఆ అవసరమే ఉందనిపించలేదు. మనుషులు ఎప్పుడూ అంత దారుణమైన పరిస్థితుల్లో ఎందుకుంటారో తెలుసా ! ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు. నిర్వచనాలననుసరించి చూస్తే ఆలోచన అసంపూర్ణమైనదీ, లోపభూయిష్టమైనదీ, భ్రమలతో కూడి పెడత్రోవపట్టించేది. ప్రతీ ఒక్క ఆలోచననూ ఖండించే మరో ఆలోచన నిరంతరం పుడుతూనే ఉంటుంది. ఇది ఆదీ-అంతమూ లేని వ్యవహారం." 

వంటి దేవుడి స్వగతాలు మానవ జీవితంలోని పలు హేతువాద, తాత్విక కోణాలను స్పృశిస్తూ సాగుతాయి. పుస్తకం పేరుకి తగ్గట్టే "అయామ్ గాడ్" అంటూ కథంతా దేవుడి గళంలోనే ఉత్తమపురుషలో చెబుతారు. ముఖ్యంగా ఈ రచన దైవత్వమంటే మనందరిలో ఏళ్ళతరబడి వ్రేళ్ళూనుకుపోయిన దృక్పథాలను కూకటివేళ్ళతో సహా పెకలించి పారేస్తుంది. 

ఒక సందర్భంలో "వాళ్ళెవరో నా కుమారుడు అంటూ ఎవరో ఊరూ-పేరూ లేని ఒక కుర్రవాడిని తెచ్చి కూర్చోబెట్టారు, నిజానికి అతడెవరో నాకు తెలీదు." అంటాడు.

మరొకచోట "ఈ మనుషులకు ఏదైనా నిందారోపణలు చెయ్యడానికో , ఏదైనా బాధ కలిగితేనో, లేదా వాళ్ళ అవసరం తీర్చడానికో మాత్రమే నేను గుర్తొస్తాను." అంటూ వాపోతాడు. 

ఇంకోచోట "మానవుడు శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరిట క్లోనింగ్ అనీ, ట్రాన్స్ హ్యూమనిజం అనీ, డిఎన్ఏ మోడిఫికేషన్ అనీ నేను సృష్టించిన ప్రపంచాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో మార్చివేస్తున్నాడు. జంతుజాలంతో కలిసి పంచుకోవలసిన పర్యావరణాన్ని మితిమీరిన స్వార్థంతో తానొక్కడే అనుభవిస్తున్నాడు. మనం ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళింట్లో వస్తువులన్నీ మనకు ఇష్టం వచ్చినట్లు మార్చేసే ఎలా ఉంటుంది ? నాకూ అలాగే అనిపిస్తుంది." అంటాడు దేవుడు. ఈ క్రింది వాక్యాలు చదివి దేవుడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ఎంతసేపు నవ్వుకున్నానో.

Cows are made to copulate with bulls, it’s all been foreseen right down to the minutest details, and instead today humans masturbate the bulls, and once they’ve obtained the seminal fluid, they dilute it and dilute it again to reduce the unit cost of each fertilization. Then they freeze it, like you freeze peas, or fish. Everything is rationalized and optimized (their terms) so as to get the best results and highest profits; they don’t give a hoot about how yours truly has organized things. Now I am not one who has to decide everything (contrary to what you may have heard) and in fact I’m open to any and all proposals for change. Yet it irks me to think they want to systematically alter everything I’ve done. How would they like it if I came to their house and moved all the living-room furniture around or used the toilet brush to stir a truffle-scented béchamel? I mean, a little respect.

Even so, the heifers are fortunate. Most of the junior bulls end up in the frying pan (with that system of theirs one bull is enough to impregnate thousands of females). I’d like to see their reaction if someone organized the same method for them, if the normal sexual act were replaced by a plastic syringe to the uterus guided via anal penetration, and there was just one male to every thousand females (the remaining nine hundred ninety-nine destined for steakhood). Not to mention that out on the street you’d see mobs of children all looking familiar: thousands of half-sibs, or at best cousins. And the widows, if we may call them that, all sleeping solo.

ఇటువంటి డార్క్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న దేవుడు డాఫ్నే అనే ఒక  నాస్తికురాలితో ప్రేమలో పడతాడు. "My eye could surely find many more interesting human specimens out there, with less repellent occupations. And instead my gaze falls on her, precisely as a laser beam." మైక్రో బయాలజిస్ట్ అయిన డాఫ్నే బాక్టీరియాపై పరిశోధనలు చేస్తుంటే ఆమెను వెన్నంటి అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల డాఫ్నే బై సెక్సువాలిటీ గురించీ, నాస్తికత్వం గురించీ, ప్రేమ గురించీ, ఆమె స్నేహితుల గురించీ దేవుడి హాస్యం, వ్యంగ్యం కలబోసిన వర్ణనలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఈ కథ దేవుడు చెబుతున్నప్పటికీ ఆయన స్వరం నేటి తరం పాఠకులు కనెక్ట్ అయ్యేలా చాలా సులభంగా, సంప్రదాయ వర్ణనలకు సుదూరంగా ఉంటుంది. 

ఈ రచనలో కాంట్రవర్సీకి తెరతీసే అంశాలు కూడా అనేకం ఉన్నాయి. దైవం ఉనికి గురించి దోబూచులాడుతూ చెప్పీచెప్పకుండా వదిలేసిన అభిప్రాయలు కొన్ని సందర్భాల్లో తేటతెల్లమైపోతాయి. ఉదాహరణకు, ఒక సందర్భంలో దేవుడికి విసుగేసి, "అసలీ మనుషుల్ని ఎందుకు తయారుచేసాన్రా బాబూ !" అనుకుంటాడు.  "Let me emphasize that it didn’t happen as the Bible asserts (one of the most unreliable and delusional storybooks ever written)." అన్నప్పుడు ఆస్తికత్వంపై, మతగ్రంథాలపై  రచయిత స్టాండ్ స్పష్టమవుతుంది.

"True, a father doesn’t enjoy seeing images of his son (especially an only son, and deceased young) set on fire, but there’s no point in making a tragedy out of it. There are hundreds of millions of crucifixes around; a dozen more, a dozen less, mean nothing. Anyway, I never much liked the pose in which the poor kid was immortalized: too bombastic, too melodramatic, too human."

"Even supposing that madman really is my son. Truth is, I knew nothing about it until he burst onto the scene and began proclaiming to the four winds of Palestine that he was the Son of God."

"If there’s one thing the theologians have always been good at, it’s smoke and mirrors: according to some religions he existed, for others, no; for some his nature is more human than divine, for others more divine than human—in short, a tremendous muddle."

ఆధ్యాత్మికతను కేవలం మత గ్రంథాలకూ, విగ్రహాలకూ పరిమితం చేసి  భోగవిలాసాల మధ్య యథేచ్ఛగా స్వార్థపూరితమైన జీవితం గడిపేస్తున్న మనిషి తనకు మాత్రమే అనుకూలంగా మార్చేసుకున్న "దేవుడి" ఉనికిని గురించి ఈ కథలో దేవుడు సంధించే అనేక ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. మధ్య మధ్యలో  "If you’ll forgive me for weighing in where a professional novelist would hesitate to tread."  / "forgive me if I turn up the hype, a story shouldn’t be boring" అంటూ తన శృతిమించిన వర్ణనలకు పాఠకుల్ని క్షమించమని వేడుకుంటూ సాగే దేవుడి మోనోలాగ్స్ భాష, మానవీయ  విలువలూ, శాస్త్ర సాంకేతికత, పర్యావరణం మొదలు సెక్స్ వరకూ అన్ని ప్రాముఖ్యత కలిగిన అంశాలపైనా దృష్టిసారిస్తూ మానవ నాగరికత ప్రస్థానాన్నీ సింహావలోకనం చేసే ప్రయత్నం చేస్తాయి.  

ఇందులో రచయిత ఎంచుకున్న అంశం చాలా వినూత్నంగా ఉన్నప్పటికీ పదాల్లో పొదుపు లేదు. సులభంగా 100 పేజీల్లో చెప్పగలిగే కథను 220 పేజీలకు సాగదీశారనిపించింది. కొన్ని చోట్ల అవసరంలేని శృంగార వర్ణనలు పంటిక్రింద రాయిలా తగుల్తాయి. ఈ రచనలో అనేక సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిశోధనల్నీ, తత్పరిణామాలనూ చర్చకు పెట్టడం వల్ల ఇందులో కాల్పనికతతో బాటుగా  వాస్తవికమైన అంశాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇది కాలక్షేపం కోసమో, జ్ఞానాన్ని బోధించడం కోసమో, నీతులు వల్లించడం కోసమో, సమస్యల్ని ఏకరువుపెట్టడమో చేసిన రచన కాదు. పాఠకుల్ని ఆలోచనలో పడేస్తూ, చదివిన చాలా కాలంపాటు దేవుడి మాటలు మర్చిపోనివ్వని రచన. మానవ జీవితానికి అన్ని లోటుపాట్లతో సహా సంపూర్ణంగా అద్దంపట్టిన రచన.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు : 

Don’t ask me how I came to be God, because I myself have no idea. Or rather I do know, just as I know everything, but it would take eons to put into words, and quite frankly, I don’t think it’s worth it. My rank (let’s call it that) alone guarantees a certain degree of credibility.

When you are a god, you see what’s taking place both inside and out, that’s your fundamental prerogative.

Let me repeat, and certainly not to boast (that would be absurd for a god): the cosmos is absolutely the most unbelievable work of art imaginable, and also the most tragic, most comic, most fabled.

For tens of thousands of years men worshiped river spirits, fish spirits, tree spirits, stag spirits, the spirits of hares, mountains, clouds, and rain: every type of spirit apart from that of yours truly. Some raving tramps had the gift (they thought) of communicating with this mob of spirits, and so were held in the highest esteem (like rock stars and athletes today). They would leap and spin around, waving their matted hair until they lost their senses, then, eyes rolled back in their heads and foaming at the mouth, intercede for their clients (or so they thought) hoping to obtain heaps of game, cures for diseases, assistance with various everyday problems. A pathetic spectacle. And meanwhile there I was, just waiting for them to notice I existed.

There are many other more recent liturgical customs that irritate me. If there’s a class of buildings I never liked (for example), it’s churches. I find them dark and gloomy, too tall, too truculently monumental. Depressing, macabre. Full of chilly marble, ghoulish statues, sanctimonious paintings, furnishings and symbols in bad taste. And I could never bear the smell of incense; it gives me a headache (as it were) even to think of it.

Or worse, they think of me only when things turn really awful, the way you call the fire department in an emergency. They praise me, pay me compliments, flatter me, but in fact their only concern is to cover their asses (apologies, but that is the most appropriate term), and of course to improve their material situation. They’d like to be able to acquire larger quantities of shares and real estate, they’d like to have access to more liquidity, they imagine this will make them happier. Above all, they don’t ever want to die.

I observe her every move, weigh her every sigh. You could call it a maniacal interest if it made any sense in the case of a god to speak of interest, let alone maniacal. You could call it a fixation, which suits me even less. If not an obsession. What’s certain is that nothing like this has happened to me in many billions of years; that’s what floors me. I’ve never felt less divine.

Atheists think they can do away with me by despising religious froufrou. They don’t realize that the more they go at it, the more they sink into the quicksand of their own faith in reverse, fall back on surrogates destined to leave them in the lurch (look what became of communism!).

Don’t get me wrong, I have nothing against homosexuals, but if I created men and women it was for some purpose, if you know what I mean.

However, if they think they can get at me by disparaging the church, they’ve got the wrong man (so to speak). I’ve never granted the slightest indulgence to the institution, nor to that kid they call my son (and who probably isn’t). If there’s an institution that has always caused me trouble, it’s the church.

If you want to gauge how discerning they are, just look at how well they understand one another. From scraps of information, misunderstandings and misinterpretations, they stitch up a crazy quilt of inferences, enhancing the picture with bits of their own unrelated experience, void of logic, far from the facts, often quite contradictory and even perfectly antithetical. Wrapped up in this Harlequin’s coat they spin mad plots and fairy-tale fantasies that explain little more than their own obsessions and failures.

And yet, most things (wo)men do are peculiarly in accord with the way they’d like to be seen. They spend most of their time misleading, pretending, feigning, and dissimulating. Truth is, every human being is a shrewd professional liar, a seasoned actor capable of great performances. Faking it is one of their native talents—also necessary and characteristic—just as nightingales are born to sing and kangaroos to hop. Every species has a specialty; theirs is charlatanism. In short, they were created defective, and things have only gone downhill with time. My self-appointed son, I mean the emaciated hippie who claims he came forth from third-party insemination, tried to sort them out, but he seems to have done more harm than good.

I have to admit, though, at times they’re entertaining. Not that a god needs amusement, God forbid, but these clowns are so full of themselves, they’re such hucksters, so reliably unpredictable, immoral, and nuts that anyone observing them is soon transfixed. They’re devious, like television: you end up glued to the screen even if you’re not interested, even when you know it’s just an indiscriminate ploy to grab your attention. Lucky for them they have no competition. There’s not a single form of organic matter in the entire universe that even faintly matches their sly industriousness, ubiquitous meddling, clumsy-but-cunning illogic, their skill at getting something out of every new situation.

Humans, rather than simply mate and be done with it like other animals, make a huge drama of so-called love. They suffer and sigh, they get all sentimental, become inebriated in a sea of noble aspirations, make crazy promises.

Humans throw themselves into their tiny scientific breakthroughs to distract themselves from their finite condition, the way elderly women sew cross-stitch patterns on table linen to keep the aches and the pains and the approaching end at bay.

Humans, incapable of being happy, spend their entire existence fantasizing they will be happy in the future. Five minutes later, half an hour later, that afternoon, next year, ten years hence, all the hitches and the problems will vanish, the desired state will materialize out of nothing and as if by magic everything will be easy, jolly. Unlike the other animals they are born premature, and no matter how hard they try they can never catch up; something about them always remains infantile, unfinished.* They try to make up for this by telling a million stories, twisting the facts, philosophizing, drowning in their own words. All vain efforts; unhappy they are, unhappy they remain. They even project this shortcoming of theirs on yours truly; it’s just impossible to have a mature relationship with them.

Maybe I should have inverted the life cycle, putting death at the beginning of their existence and birth at the end. And then they’d re-enter their mothers’ wombs without suffering and without regret, the way you park a car in the garage at night, to enjoy life’s one period of genuine tranquility and fusion with the universe. Eight to nine months and they’d be back to the embryonic stage, then just a rowdy spermatozoon or an ovum, and then nothing.

Other animals don’t get into trouble because they don’t speak and never have done, that’s the sole reason.* Divine language is silence; words are superfluous to express harmony and love, or even anger of the just variety. It’s enough to look one another in the face, or merely stare straight ahead; everyone will know who’s in agreement or that there’s a certain problem.

Saturday, April 1, 2023

First Love / My Phantoms - Gwendoline Riley

ఆధునిక సమాజంలో మనిషి ఒక సంఘజీవిగా ప్రపంచంతో చేసే యుద్ధాలకంటే  తనతో తాను చేసే యుద్ధాలే ఎక్కువ. ఈ యుద్ధంలో  గెలుపోటముల్లో ఏది దక్కినా వాటి తాలూకూ గాయాలు మాత్రం అతడి మనసుపై శాశ్వతమైన చిహ్నాలుగా మిగిలిపోతాయి. ఇక్కడ వార్ హీరో అయినా, విక్టిమ్ అయినా, క్యాజువాలిటీ అయినా అన్నీ తానే. వ్యక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతున్న సంస్కృతిలో ఆధ్యాత్మికత, తాత్వికతలు సమూలంగా అంతరించిపోతుండగా మనిషిని అన్నివిధాలా పట్టి ఉంచే కేంద్రం పూర్తిగా కనుమరుగైపోయింది. పర్యవసానంగా మనిషి తన శారీరక, మానసిక సంతులనం కోల్పోయి తనను తాను రక్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒకనాడు సత్యాన్వేషణలోనో, ఆత్మసాక్షాత్కారం దిశగానో గడిపే జీవితాలు నేడు కనీసపు నైతిక విలువలకు కట్టుబడడానికే తడబడుతూ సర్వైవల్ దిశగా ప్రయాణిస్తున్నాయి.

Image Courtesy Google

పిల్లలకు ఆదర్శంగా ఉంటూ, మార్గదర్శకత్వం చెయ్యవలసిన పెద్దలే తెగిన గాలిపటాల్లా జీవితాంతం తప్పటడుగులు వేస్తూనో, వేసిన అడుగులను సరిదిద్దుకుంటూనో గడిపేస్తూ తర్వాతి తరంపై నిర్దాక్షిణ్యంగా ఆ భారాన్ని మోపుతున్నారు. తత్ఫలితంగా తరువాతి తరం ట్రామాల బారిన పడుతోంది. అందుచేత ఇది ట్రామా కథల కాలం. సాహిత్యపు దారులు పునరుజ్జీవన కాలం నుండీ, రొమాంటిక్, విక్టోరియన్, జార్జియన్ దశల మీదుగా ప్రపంచ యుద్ధాలూ, అస్తిత్వవాదాలూ, ఐడెంటిటీ నిర్వచించుకోడాలూ అయిపోయాక, మోడరనిస్ట్, పోస్ట్ మోడరనిస్టు సాహిత్యాన్ని కూడా దాటుకుని ట్రామా కథల కాలానికి చేరుకున్నాయి. 

బ్రిటిష్ రచయిత్రి గ్వెండోలిన్ రిలే రచనలు 'ఫస్ట్ లవ్', 'మై ఫాంటమ్స్' , ఈ రెండూ ఈ కోవకి చెందిన [ ట్రామాలను ఆధారంగా చేసుకున్న] రచనలే. ఈ మధ్య సమకాలీన సాహిత్యానికి సాధ్యమైనంత దూరంగా ఉంటున్న నాకు ఇటీవల NYRB ప్రచురించిన గ్వెండోలిన్ రిలే పుస్తకాల కవర్లు ఆకర్షణీయంగా కనిపించాయి. అదేంటో ఇంతకాలమైనా కొన్నిసార్లు కవర్లు చూసి కథలు చదివే అలవాటు ఇంకా పోవడంలేదు. :) అసలు ఎవరీ రచయిత్రి అని రిలే గురించిన వివరాల కోసం చూడగా న్యూయార్క్ రివ్యూస్ తో పాటు అనేక ప్రముఖ పత్రికల్లో ఆమె రచనల పై అనేక రివ్యూలు కనిపించాయి. సమీక్షలూ, విమర్శలూ చదివి పుస్తకాలు చదివే అలవాటెటూ లేదు గనుక నేరుగా ఆవిడ రచనలే చదవడం మొదలుపెట్టాను. మందకొడి వచనాన్ని బట్టి రిలే శైలి నేను మునుపు చదివిన హెలెన్ మాక్ డోనాల్డ్, ఒట్టెస్సా మోష్ఫెగ్, శాలీ రూనీ, ఆన్ ప్రాట్చెట్ వంటి రచయిత్రుల శైలిని గుర్తుకు తెచ్చింది. 

ఫస్ట్ లవ్ : 

ఒక మనిషి బాల్యం వారు పెరిగి పెద్దయ్యాక వారి మానవ సంబంధాలపై, ముఖ్యంగా సన్నిహిత సంబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందంటారు. తల్లిదండ్రుల విచ్ఛిన్నమైన వివాహానికి తండ్రి హింసాత్మక ప్రవృత్తి తోడై  ప్రేమ, ఆదరణ కరువైన నెవ్ బాల్యం చైల్డ్ అబ్యూజ్  బారినపడి నలిగిపోతుంది. వదిలించుకోవడం వీలుకాని చేదు బాల్యం తాలూకూ నీడలు నెవ్ వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ మేమున్నామంటూ ఉపరితలంపైకి వస్తూనే ఉంటాయి. అవి ఆమె సన్నిహిత సంబంధాలను ప్రభావితం చెయ్యడం ఈ కథలో ప్రతిచోటా కనిపిస్తుంది. కథలో నెవ్ బాల్యాన్నీ, వర్తమానాన్నీ, తల్లితో ఆమెకున్న సంక్లిష్టమైన సంబంధాన్నీ బ్యాక్ టు బ్యాక్ చెప్పుకుంటూ రావడం వల్ల, ఈ సారూప్యతలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఆమె భర్త ఎడ్విన్ లోనూ, ఆమె తండ్రిలోనూ స్వాభావికమైన పొంతనలు అనేకం చూస్తాం. భర్త ఎడ్విన్ లో తండ్రి ఛాయలు ఇలాంటి వాక్యాల్లో తేటతెల్లంగా కనిపిస్తాయి. "But I would have been devalued whatever I’d said. That’s what I felt then. That he had a picture of me that he needed to deface. This was how he’d always proceeded, after all: reaching my periphery, meanly maundering there."

నిజానికి ఇటువంటి బాల్యం పెరిగి పెద్దయ్యాకా వారు జీవిత భాగస్వాముల్ని ఎన్నుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందంటారు. నెవ్ బాల్యం పెద్దయ్యాక ఆమె రొమాంటిక్ రిలేషన్షిప్స్ ని ఏ విధంగా ప్రభావితం చేసిందో తెలియాలంటే ఈ కథ చదవాలి. 

"I find I’ve never given much thought to the future. Beyond that sense of getting away. Derelictions, you see, left and right. Yet here I am." నెవ్ గతం నుండి దూరంగా పారిపోదామని ప్రయత్నిస్తూ మళ్ళీ అదే చోటికి మళ్ళీ మళ్ళీ వెనక్కు వెడుతుంది. ఆమె ఈ క్రమాన్ని దాటుకుని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందా, లేదా ఆ ప్రవాహంలో పడి తనను తాను కోల్పోతుందా అన్నది మిగతా కథ.

‘I was asking for reassurance. I’m not your father. He’s the one who belittled you, all right? That’s what I’m saying, I don’t exist, you don’t hear what I say, what you hear is your father.’

నెవ్ అబ్యూజివ్  తండ్రి గురించి రాస్తూ : 

He was ‘Just a big kid, really,’ Christine said. Well, quite. Somehow he was. A greedy child. A tyrant child. And for fifteen years, every Saturday, my brother and I were laid on to service him. To listen to him. To be frightened by him, should he feel like it. As a child with his toys, he exercised a capricious rule, and as with any little imperator, his rage was hellish were his schemes not reverenced. One wrong word unlatched a sort of chaos. The look in his eyes then! Licensed hatred. The keenest hunger. As the plates were swept off the counter, kicked around the floor. As the sofa was upended, pictures torn from the walls. He had to triumph.

'ఫస్ట్ లవ్' పేరు చూసి ఇదేదో రొమాంటిక్ ప్రేమకథనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ నవలలో కథానాయకురాలు 'నెవ్' తో బాటు ఆమె తల్లిదండ్రులూ, నెవ్ భర్త ఎడ్విన్, ఆమె మాజీ ప్రియుడు లాంటి మరికొన్ని పాత్రలున్నా కథ ప్రధానంగా పెళ్ళైన జంట నెవ్, ఎడ్విన్ ల చుట్టూనే తిరుగుతుంది. కథంతా నెవ్ గళంలో వారి మధ్య జరిగే సంభాషణల ఆధారంగానే చెప్తారు. ఈ కథ విషయంలో పాత్రల మంచిచెడ్డలను విశ్లేషించేపని రచయిత్రి తన భుజస్కంధాల మీదకెత్తుకోకపోవడం నాకు బాగా నచ్చింది. కథకు ఒక నిర్ధిష్టమైన కేంద్ర బిందువు గానీ, సన్నివేశాలకు స్పష్టమైన మొదలూ-తుదా గానీ లేకుండా లివింగ్ రూమ్ బుక్ షెల్ఫ్ దగ్గరో, బెడ్ రూమ్ కిటికీ ప్రక్కనో మొదలయ్యే సన్నివేశాలు రేమండ్ కార్వర్ కథ చెప్పే విధానాన్ని పలుమార్లు గుర్తుకు తెచ్చాయి.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు : 

Edwyn likes to say that ‘When people are done with each other, they’re done with each other.’ ‘People are a lot less interested in each other than you seem to think,’ he says.

It wasn’t that I imagined myself the only one being ‘reached out’ to, incidentally. There was a vacancy, that’s what I had to assume, and I knew him: he’d want to feel he was being fair.

People we’ve loved, or tried to: how to characterize the forms they assume? Michael sounded like a teenage girl, here, I thought—the queenish self-regard, the untroubled belief in his ability to coax, to blandish. That said, he didn’t seem insincere, so I tried to be honest, too.

I couldn’t blame him, and that’s what I’d lived with. Shame. Consequences. I believed—I believe, strongly—in both of those things. To what end, I wondered, did he think I’d want to buy in to his fiction? To a rewrite from Mr Reaching Out, Mr Reconnect? Some people will assume that we’re all up for a flattering fantasy. I didn’t like him, when I thought of that. 

I’d always had to affect such cool around his girlfriends, fiancées, when he’d brought them up, artlessly, full of carefree, saccharine sympathy for a hurt which I never expressed. He felt no such compunction, clearly. I have thought, sometimes, that there should be more to getting along with people than negotiating with this jumpy primordial goo. But no—there often isn’t. I back-pedalled a little.

Considering one’s life requires a horribly delicate determination, doesn’t it? To get to the truth, to the heart of the trouble. You wake and your dreams disband, in a mid-brain void. At the sink, in the street, other shadows crowd in: dim thugs (they are everywhere) who’d like you never to work anything out.

You read constantly, don’t you? Has none of this ever made you consider, or allow, or admit, that people can represent something other than an opponent to you? That people can operate from motives other than wanting to harm you or laugh at you or belittle you?’

I like the affection between us, but don’t kid me that it’s about love. It’s about need for love. If you love someone, you don’t want to frighten them or make them more worried than they have to be.’

-----------------------------------------------------------------------------------------------

My Phantoms :

'మై ఫాంటమ్స్' కథ కూడా చైల్డ్హుడ్ అబ్యూజ్ తో బాటు తల్లిదండ్రులతో పిల్లలకుండే సంక్లిష్టమైన సంబంధాల ఆధారంగా రాసిన కథ. పిల్లలు పెరిగి పెద్దయినా వాళ్ళను వదలక వెన్నంటే ఉండే బాల్యపు చీకటి నీడల్ని చర్చిస్తుందీ కథ. ఎమోషనల్ ఇంటిమసీకి పిల్లలకు సైతం అవకాశం ఇవ్వని వ్యక్తిత్వంతో బాటు రెండు విచ్ఛిన్న వివాహాలు హెలెన్ (హెన్) ను సంక్లిష్టమైన వ్యక్తిగా నిలబెడతాయి. చివరి దశలో క్యాన్సర్ బారినపడిన పడ్డ తల్లి హెలెన్ తో వివిధ దశల్లో తన సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె కూతురు బ్రిడ్జెట్ చెప్పే అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. ‘My mother’s had two terrible husbands, yes. She’s on the lookout for a third.’ అనే బ్రిడ్జెట్ మాటలు ఆమె తల్లిని గురించి పలు విషయాలు చెప్పకనే చెబుతాయి.
"My mother loved rules. She loved rules and codes and fixed expectations. I want to say – as a dog loves an airborne stick. Here was unleashed purpose. Freedom, of a sort. Here too was the comfort of the crowd, and of joining in. Of not feeling alone and in the wrong." 

"In conversation – or attempted conversation – her sights seemed set on a similar prize. She enjoyed answering questions when she felt that she had the right answer, an approved answer. I understood that when I was very small, and could provide the prompts accordingly. Then talking to her was like a game, or a rhyme we were saying together."
అంటూ తల్లి హెలెన్ వ్యక్తిత్వాన్ని గురించి చెబుతుంది బ్రిడ్జెట్. ఈ కథ చదువుతున్నంతసేపూ పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే వారిని తల్లిదండ్రులను చెయ్యదనే సత్యం పదే పదే గుర్తుకొస్తూనే ఉంటుంది. ఈ కథలో వివాహ వైఫల్యాలూ, వ్యక్తిగతంగా కూడా ఎటువంటి క్రమశిక్షణా, సెల్ఫ్ కంట్రోల్  లేని గాలివాటు జీవితాలూ భవిష్యత్తులో పిల్లలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో పలు సంభాషణల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తారు రచయిత్రి. ఆధునిక జీవనంలో మారుతున్న ప్రాధాన్యతలతో కుటుంబ వ్యవస్థ మెల్లిగా కనుమరుగైపోతుండగా నేడు పలు మానసిక, శారీరక సమస్యలకు మూలాలు అస్తవ్యస్తమైన కుటుంబ వ్యవస్థ నుండి వ్రేళ్ళూనుకుని ఉన్నాయన్న వాస్తవాన్ని మరోసారి రుజువు చేస్తుందీ కథ.

"సమకాలీన సాహిత్యం మనకెందుకూ హాయిగా క్లాసిక్స్ చదువుకోకా" అనుకున్న ప్రతీసారీ ఏదో ఒక కొత్త పుస్తకమో, కొత్త రచయిత్రో తారసపడతారు. మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూద్దామనే ఆశ చివురిస్తుంది. అందులోనూ న్యూయార్క్ రివ్యూ బుక్స్ వాళ్ళు ఆకాశానికి ఎత్తుతున్నారంటే, ఇందులో ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది అని మరో గుడ్డి నమ్మకం. ఈ రెండు పుస్తకాల్లో క్రాఫ్ట్ గురించి మాట్లాడుకోడానికి పెద్దగా నాకేమీ కనపడలేదు. నిత్యం జరిగే సంభాషణల్లో కథను చాలా సాధారణంగా చెప్పుకొచ్చారు రచయిత్రి. ఏదేమైనా వాస్తవానికి అద్దంపట్టడమే సాహిత్యం యొక్క లక్ష్యం అనుకుంటే రచయిత్రి లక్ష్యం నెరవేరినట్టేననిపించింది.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు : 
My mother left my father before I was two. My mother had no friends when I was small. There were no phone calls or evenings out; no visitors to the house except my grandmother, who came every couple of weeks to tidy up and clean.

I also thought my mother might enjoy the ‘joining in’ aspect of reading them; I knew she’d seen newspaper articles – Guardian articles – about the phenomenon; about ‘Ferrante fever’. When I was reading them, she’d asked me, ‘Have you got “Ferrante fever”?’ ‘And how!’ I’d replied. She would like, I thought, to be part of a phenomenon.

It just quickly became obvious that she wasn’t going to engage with anything that was actually being said. She had a stance, she was sticking to that, and that precluded reacting to what was actually happening. Or experiencing what was actually happening … There was an absolute refusal to do that. It was disorienting. I see what you mean about that. When she appeared to react, these weren’t reactions at all, were they? But her performing what she thinks she is. Or what she has decided she is. So the performance was desperately committed but gratingly false.’

Tuesday, March 28, 2023

The Art of Seduction - Robert Greene

అబిడ్స్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే రచనల్లో రాబర్ట్ గ్రీన్  పుస్తకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా "48 లాస్ ఆఫ్ పవర్" బావుందని కొందరు మిత్రులతో సహా మా పిల్లవాడు కూడా చెప్పడంతో (పిల్లల బుక్ క్లబ్ లో భాగంగా స్నేహితులు అందరూ చదివారని అన్నాడు), సరదాగా గ్రీన్ పాపులారిటీ ఏమిటో చూద్దామని ఈ పుస్తకం చదివాను. కరెంట్ ట్రెండ్స్ విషయంలో నా అజ్ఞానాన్ని నాకు మరోసారి గుర్తుచేసిందీ పుస్తకం. :)  

"నాలెడ్జ్ ఈజ్ పవర్" అంటారు. కానీ ఒక సూపర్ హీరో సినిమాలో అన్నట్లు "విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ". జ్ఞానాన్ని సంపాదించడంలో ఉండే జిజ్ఞాస మంచిదే గానీ దాన్ని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే లేదా వినియోగించే విధానంలో జాగ్రత్త, జాగరూకత లాంటివి అవసరమవుతాయి. కొన్నిసార్లు ఆ జ్ఞానాన్ని వినియోగించవచ్చా లేదా అనే విచక్షణకు ఖచ్చితమైన ఒక 'మోరల్ కంపాస్' మరింత అవసరమవుతుంది.

Image Courtesy Google

పుస్తకాల విషయంలో మంచి పుస్తకాలూ, చెడ్డ పుస్తకాలూ లాంటివేవీ ఉండవంటారు వైల్డ్, ఏ పుస్తకమైనా బాగా రాసినదైనా అయి ఉండాలి,లేదా చెత్తగా రాసినదైనా అయి ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. మానవ సమాజంలో పరమ అనైతికమైన (?) విషయాలుగా భావించే అంశాలను సైతం అద్భుతమైన భాషా సౌందర్యాన్ని ఉపయోగించి వినసొంపుగా చెప్పి ఒప్పించగలిగే నేర్పు కొందరు రచయితలకు ఉంటుంది. నేను చదివిన కొన్నిట్లో నబకోవ్ 'లోలిటా', ఆండ్రే గిడే 'ఇమ్మోరలిస్ట్', హెర్మన్ హెస్సే 'స్టెప్పెన్ వుల్ఫ్' లాంటివి ఈ కోవలోకి వస్తాయనుకుంటాను. ఏ పుస్తకమైనా నైతికానైతికమైన అనేక విషయాలను చెబుతుంది. అది ఏం చెబుతుంది అనేది ప్రక్కన పెడితే అందులోంచి ఏం తీసుకోవాలనేది పూర్తిగా పాఠకుల మానసిక పరిపక్వతా, విచక్షణల మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ తెలిసి ఉండడం ఎంత అవసరమో, దాన్ని అన్ని మానవసంబంధాల్లోనూ అమలుచెయ్యాలనుకోవడం అంతే అసంబద్ధం. ప్రతీ  మనిషీ ప్రత్యేకం, అన్నిటికీ ఒకే మూసలో పనిచేసే మంత్రం ఉపయోగించడం చాలా బ్యాడ్ ఐడియా.  

ఆ మధ్య చూసిన ఏదో తెలుగు సినిమాలో పెళ్ళిలో 'రొమాన్స్' అవసరం అని ఒక ముక్తాయింపునిచ్చారు. కానీ ఆ 'రొమాన్స్' అనే బ్రహ్మ పదార్థం ఏమిటనేది చాలామందికి తెలీదు. (పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకున్న ఓల్డ్ స్కూల్ పీసెస్ అయిన మాతో సహా :) ) రాబర్ట్ గ్రీన్ రాసిన నాన్ ఫిక్షన్ రచన 'ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్' లాంటి పుస్తకాలు ఆ సో కాల్డ్ 'రొమాన్స్' అంటే ఏమిటో కొంత వరకూ చెబుతాయి అనుకుంటాను. దాదాపు 500 పేజీల ఈ పుస్తకం ఇప్పటి  "కంట్రోల్" ప్రాతిపదికగా నడిచే మానవ సంబంధాలకు అద్దం పడుతుంది. అడ్రినలిన్ రష్, excitement ఇచ్చేది మాత్రమే ప్రేమని అనుకునే నేటి తరానికి గ్రీన్ చెప్పే చిట్కాలు సరిగ్గా సరిపోతాయి.

ఇవన్నీ తెలిసి ఉండడం మానసిక పరిపక్వతకు అవసరమే కానీ మానవ సంబంధాల్లో ఈ చాణక్య సూత్రాల ఎత్తుకు పై ఎత్తుల కంటే 'ప్యూరిటీ ఆఫ్ కన్సైన్స్' అత్యంత అవసరమని నమ్మే పాత తరం వ్యక్తులుగా చెప్పేదేమంటే ఈ పుస్తకాన్ని చదవండి కానీ ఇందులో ఉన్నవేవీ పాటించకండి. ఒక మనిషితో వ్యవహరించేటప్పుడు మీ జ్ఞానాన్నీ, తెలివితేటల్నీ వారి మీద ప్రయోగించకుండా మరో మనిషిగా ప్రేమతో, దయతో వ్యవహరిస్తే చాలు. మనకి నచ్చిన మనిషిని "విక్టిమ్" అనీ "టార్గెట్" అనీ అంటున్నప్పుడే రచయిత స్టాండ్ ఏంటో మనకి స్పష్టంగా తెలిసిపోతోంది. 

శాంపిల్ కి మోడరన్ చాణక్యుడు చెప్పిన కొన్ని మనిషిని టార్చర్ చేసే, సారీ.... సెడక్షన్ పద్ధతులు. కొన్ని చదువుతుంటే ఎంత షాకింగ్ గా అనిపించిందో చెప్పలేను.

1.Choose the Right Victim

2.Create a False Sense of Security—Approach Indirectly

3. Send Mixed Signals

4. Appear to Be an Object of Desire—Create Triangles

5. Create a Need—Stir Anxiety and Discontent

6. Master the Art of Insinuation

7. Enter Their Spirit

8. Create Temptation

9. Keep Them in Suspense—What Comes Next?

10. Use the Demonic Power of Words to Sow Confusion

11. Pay Attention to Detail

12. Poeticize Your Presence

13. Disarm Through Strategic Weakness and Vulnerability

15. Isolate the Victim 

17. Effect a Regression

18. Stir Up the Transgressive and Taboo

19. Use Spiritual Lures

20. Mix Pleasure with Pain

Saturday, March 18, 2023

Artist and the disease of Hero worship

చాలా కాలం క్రితం నా బ్లాగ్ ను ఏళ్ళ తరబడి శ్రద్ధగా చదువుతున్న మిత్రులొకరు, "మీ రీడింగ్ పాట్టర్న్స్ అర్థం కావడం లేదు నాకు". అన్నారు. నేను "ఎందుకంటే అక్కడ పాటర్న్ ఏమీ లేదు కాబట్టి " అన్నాను.

చిన్నప్పుడు అందరిలాగే పల్ప్ తో మొదలైన నా పఠనం అదృష్టవశాత్తూ అక్కడే ఆగిపోలేదు. ఏ ఒక్క మూసలోనూ ఇరుక్కోలేదు. పాత పేషంట్ కి డాక్టర్ కి ఉన్నంత అనుభవమూ ఉంటుందంటారు. ఈ కారణంగా రాయడం నా వొకేషన్ కాకపోయినా, రచనల క్వాలిటీ ఏమిటో చెప్పగల అనుభవం నాకు సహజంగానే చదవడం ద్వారా ఎంతో కొంత అబ్బిందనుకుంటాను. ఎవరైనా "మీరు ఎందుకు రాయరూ?" అని అడిగినా అదే చెప్తాను, "అద్భుతమైన రచనల రుచి బాగా తెలిసినదాన్నిగా అంతకంటే బాగా రాయలేనని నిస్సందేహంగా తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ప్రింట్ చెత్తలో మరికాస్త నా వంతు చెత్త కూడా కలిపే ఉద్దేశ్యం లేదు" అని.

Image Courtesy Google

ఇక సోషల్మీడియాలో ఏదైనా రచనో, సినిమానో బావుందనో,బాగాలేదనో  చెప్పినప్పుడో, లేదా ఏదైనా విషయం మీద మన అభిప్రాయం చెప్పినప్పుడో  వెంటనే, "మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ? అందరూ మేథావులే" అని ఆ "ఇంటెలెక్చువల్" అనే పదాన్ని ఘాటైన తిట్టులా వాడడం కూడా పరిపాటే.

"Where the mind is without fear and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls" 

అంటూ పసితనంలో ప్రియంగా పదే పదే పాడుకున్న రవీంద్ర గీతి 14 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోను. ఇన్నేళ్ళ చదువూ నాకేదన్నా నేర్పించింది అంటే అది మనిషి స్వేచ్ఛా జీవే గానీ సిద్ధాంతాలకూ, సంప్రదాయాలకూ, మాన్ మేడ్ గాడ్స్ కీ కట్టు బానిస కాదనీ, మెదడుకి స్వేచ్ఛని నేర్పించాలనీ, అన్ని రకాల అథారిటీలూ ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే యోగ్యత ఉన్నవి కావనీ మాత్రమే.

ఈరోజు మనం మళ్ళీ రాతియుగం వైపు ప్రయాణిస్తున్నట్లు ఒక రచయితనో, మరో కళాకారుణ్ణో ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టడమో, లేదా విగ్రహారాధన చేసినట్లు మెడలో దండేసి, దేవుణ్ణి చేసి కాళ్ళు కళ్ళకద్దుకోవడమో చెయ్యడం చూస్తున్నాం. నన్నడిగితే ఐడియలైజేషన్ లేదా హీరో వర్షిప్ మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి పట్టుకున్న దరిద్రం. మనకి మనిషిని మనిషిగా చూడడం చేతకాదు. వాళ్ళని దేవుళ్ళను చేసేస్తే గానీ నిద్రపట్టదు. కామూ అన్నదే మరో విధంగా, మనకి రెండే రెండు ఇష్టాలు, "ఒకటి ఫాలో అవ్వడం లేదా లీడ్ చెయ్యడం." మధ్యే మార్గం మనకి తెలీదు. 

ఇక్కడ ఇష్టం, ఆరాధన వరకూ పర్వాలేదు, కానీ అదొక ధృతరాష్ట్ర ప్రేమలా, గుడ్డి అనుసరణలానో, అబ్సెషన్ లానో తయారవుతోంది. తమకు నచ్చిన రచయితనో, రచయిత్రినో లేదా నటుడినో ఒక్క మాటనడానికి వీల్లేదు. వాళ్ళను అచ్చంగా దేవుళ్ళను చేసి మనం కొలిచినట్లే అందరూ కొలవాలనుకోవడం. "వాళ్ళు నా కళ్ళకు మామూలుగానే, మనుషుల్లానే కనబడుతున్నారు" అని ఎవరైనా అంటే," అబ్బే ఆ సినిమాను ఇలా మాత్రమే చూడాలి, లేదా ఈ పుస్తకాన్ని పవిత్ర గ్రంథంలా ఇలా మాత్రమే చదవాలి, నీకు చూడడం రాదు, బహుశా నీకు గుడ్డితనం ఉంది కావచ్చు" అనడం, మరికాస్త ముందుకెళ్ళి వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం. "No two people read the same book" అనే చిన్న విషయం అర్థం చేసుకోలేని మన గొప్ప గొప్ప చదువులెందుకు !! ప్రపంచాన్ని చూడడానికి ఎన్ని కళ్ళు ఉంటాయో అన్ని దృష్టి కోణాలు కూడా ఉంటాయన్న కనీస మానసిక పరిణితి లేని మన అనుభవమెందుకు !! ఆర్ట్ ఒక "ఇండివిడ్యుయల్ / పర్సనల్ ఎక్స్ప్రెషన్ " అనుకుంటే, ఆ ఆర్ట్ ని అర్థం చేసుకోవడం కూడా అంతే,  పూర్తిగా వ్యక్తిగతం. నేను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చదివిన రచనలు నా తర్వాతి తరానికి పరమ చెత్తలా అనిపించవచ్చు. తరాలను బట్టి అభిరుచులు కూడా  రూపాంతరం చెందుతూ ఉంటాయి. 

మనుషులం, ఋషులం కాదు కాబట్టి పోనీ మనకు నచ్చిన రచయితనో, రచయిత్రినో మన అభిమానం కొద్దీ దండేసి దణ్ణం పెట్టుకుందాం. మనిష్టం.  కానీ మనలాగే మరొకరు కూడా మోకరిల్లాలని ఆశించడం అపరిపక్వత క్రిందకి వస్తుంది. ఆర్ట్ కి పర్యాయపదమేదైనా ఉందంటే అది "స్వేచ్ఛ" అనుకుంటాను. కళారంగం మొదలు అన్ని చోట్లా తమ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళను ఆరాధించడం, అభిమానించడం, ఆదర్శంగా తీసుకోవడం మంచిదే. అది అవసరం కూడాను. కానీ ఉన్న దేవుళ్ళు చాలనట్లు మనుషుల్ని కూడా దేవుళ్ళను చేసి జీవితాంతం వారి కీర్తికి కాపుకాస్తున్నామనుకుంటూ వాళ్ళని  డిఫెండ్ చేసుకుంటూ అందరి మీదా బురద జల్లడంలో, భిన్నాభిప్రాయాల ప్రాతిపదికన శత్రుత్వాలు పెంచుకోవడంలో స్వేచ్ఛ లేదు. ఉన్నదల్లా కట్టు బానిసత్వమే.