గత ఏడాది చివర్లో న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యూ వారు 2022 లో ప్రచురితమైన పుస్తకాలలో చదవవలసిన పది పుస్తకాలంటూ ఒక చిన్న లిస్టును విడుదల చేస్తూ అందులో బ్రిటిష్ రచయిత్రి క్లైర్ లూయీస్ బెన్నెట్ రచన "చెక్ ఔట్ 19" పేరును కూడా ప్రస్తావించారు. సహజంగానే అంతఃప్రపంచానికి సంబంధించిన (సెరెబ్రల్ స్టఫ్) పుస్తకాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న నాకు రాయడం, చదవడం అనే రెండు అంశాల చుట్టూ తిరిగే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రత్యేకం కథంటూ ఏమీ లేని ఈ రచనలో కథానాయకురాలు బాల్యం నుండీ పుస్తకాల్లోని కాల్పనిక ప్రపంచాలూ, వ్యక్తులూ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చెప్పుకొస్తూ, వాటితో ముడిపడిన అనేక అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ఇక "చెక్ ఔట్ 19" అనేది ఆమె పనిచేసే డిపార్ట్మెంటల్ స్టోర్ లో కౌంటర్ నెంబర్ అని తప్ప ఈ పుస్తకంలో కథాంశానికీ, టైటిల్ కీ ఏమీ సంబంధం ఉండదు.
Image Courtesy Google |
అంతఃప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ కాల్పనిక ప్రపంచాలూ, కల్పిత పాత్రలూ పాఠకుల జీవితాన్ని ఎలా ఉత్తేజంతో నింపుతాయో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ముఖ్యంగా బాల్యంనుండీ పుస్తకపఠనం జీవితంలో భాగమైనవాళ్ళు, ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయమున్నవారూ ఈ రచనతో అడుగడుగునా తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. మునుపు సుసాన్ సొంటాగ్ ను చదివినప్పుడు నాకు ఆవిడ ద్వారా పరిచయమైన రచయితలెంతమందో ! అప్పటికి మచాడో డి ఆసిస్, ఎలియాస్ కానెట్టి, వాల్టర్ బెంజమిన్ లాంటి వాళ్ళ పేర్లు పలుసార్లు విని ఉన్నప్పటికీ, వారి రచనల గురించీ, శైలి గురించీ సుసాన్ రాసిన వ్యాసాల కారణంగానే వారిని చదవాలనే ఆసక్తి కలిగింది. మళ్ళీ ఇంతకాలానికి బెన్నెట్ ను చదువుతుంటే నాకు సుసాన్ లాంటి మరో "బుక్ వోర్మ్ ఫ్రెండ్" తారసపడినట్లనిపించింది.
ఈ రచనను కథ చదివినట్లు ఒక్కసారిగా చదివిప్రక్కన పెట్టడం వీలుపడదు. ఇందులో పేజీల నిండా పఠనానుభావాలూ, పాఠకులకు పరిచయం లేని కొంతమంది రచయితలూ, రచనల ప్రస్తావనలు ఉండడం వల్ల ఆ రిఫరెన్సులు పట్టుకుని ఆయా రచనల్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ, వారి పేర్లు నోట్ చేసుకుంటూ మెల్లగా చదివాను. మున్ముందు కాలంలో చదవడానికి బెన్నెట్ వల్ల కొంతమంది కొత్త రచయితలు కూడా పరిచయమయ్యారు. ఎటొచ్చీ బెన్నెట్ విశ్లేషణలు సుసాన్ రచనలంత ఇంటెక్చువల్ గా ఉండవు. సరళంగా ఉండే ఆమె విశ్లేషణల వల్ల ఒక సాధారణ పాఠకుడు సైతం ఆమె లోతైన పఠనానుభవాల్లో తనను తాను చూసుకోగలుగుతాడు. ఇక ఈ రచయిత్రి వచనానికో ప్రత్యేకత ఉంది. కొన్ని వాక్యాలు చదివి ఇది బెన్నెట్ వచనమని ఇట్టే చెప్పెయ్యొచ్చు. మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే వాక్యాలతో కూడిన క్లైర్ లూయిస్ బెన్నెట్ వచనం అమెరికన్ రచయిత్రి గెర్ట్రూడ్ స్టైన్ ప్రోజ్ ని తలపిస్తుంది. ఈ పుస్తకమంతా గొలుసుకట్టులా ఇటువంటి వాక్యాలే కనిపిస్తాయి. ఈ తరహా వచనం అరుదుగా చూస్తాం.
ఉదాహరణకి ఈ ప్రారంభ వాక్యాలను చూడండి :
Later on we often had a book with us. Later on. When we were a bit bigger at last though still nowhere near as big as the rest of them we brought over books with us. Oh loads of books. And sat with them there in the grass by the tree. Just one book, in fact. Just one, that’s right. Lots of books, one at a time. That’s it, one at a time.
No wonder at all that we are itching to turn it over. No wonder whatsoever that we anticipate turning the page so very fervidly. As if it were a matter of life or death in fact. Life or death. Life or death. It is a matter of life or death in fact. Yes. Yes. Yes, it is. Turning the pages. Turning the pages. When we turn the page we are born again. Living and dying and living and dying and living and dying. Again, and again. And really that’s the way it ought to be. The way that reading ought to be done. Yes. Yes. Turning the pages. Turning the pages. With one’s entire life.
ఇందులో బెన్నెట్ ఫిక్షన్ చదవడం గురించే కాకుండా ఒక రచయిత్రిగా కూడా తన అనుభవాల గురించి రాసుకొస్తారు. ఈ కథలో రీడింగ్ మరియూ రైటింగ్ లైఫ్ గురించి చిన్న చిన్న కథలుగా అమలిపోయిన ఆమె చెప్పిన అనేక పిట్ట కథలుంటాయి. ఒక కథలో ఆమె సృష్టించిన కథానాయకుడు Tarquin Superbus కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని తన ధనమంతా ధారపోసి ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తాడు. కానీ తీరా లైబ్రరీలో పుస్తకాలన్నీ కొని అమర్చాకా విచిత్రంగా వాటిల్లో పేజీలన్నీ ఒక్క అక్షరం కూడా లేని ఖాళీ కాగితాలని గమనించి నిరాశ చెందుతాడు. Tarquin కి నమ్మకస్తుడైన ఒక వ్యక్తి, మొత్తం లైబ్రరీలో పదాలున్న ఒకే ఒక్క పేజీ ఉందనీ, ఆ పేజీలో ఉన్న ఒకే ఒక్క వాక్యంలో మనం తెలుసుకోవలసిన సమస్తమూ నిక్షిప్తమై ఉంది గాన, ఆ పేజీ కనుగొన్నట్లైతే అతడు పూర్తి జ్ఞానసంపన్నుడవుతాడనీ, ఆ అనుభవం అతడికి మాత్రమే సొంతమనీ అంటాడు. ఈ కథ చెప్పడం ద్వారా రచయిత్రి అక్షరానికి ఉన్న శక్తిపైనా, చదవడం అనేది వ్యక్తిత్వ నిర్మాణంలో పోషించే పాత్రపైనా ఏకకాలంలో దృష్టిసారించారనిపిస్తుంది.
ఇక మనం లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం గురించి బెన్నెట్ రాసిన విషయాలు సరదాగా ఉంటాయి,
"మనకి టన్నుల కొద్దీ పుస్తకాల అవసరం లేదు. మనకొక్క పుస్తకం చాలు. మనకు అప్పుడో పుస్తకం, ఇప్పుడో పుస్తకం ఉంటే చాలు. కానీ మనం లైబ్రరీకెళ్ళినప్పుడల్లా ఆతృతగా ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు తీసేసుకుంటాం. సర్వసాధారణంగా ఎనిమిది పుస్తకాల వరకూ తీసుకుంటాం. చాలాసార్లు అయితే ఆరూ లేదా ఎనిమిదీ లేదా పన్నెండు పుస్తకాలు తీసుకుంటాం. మన అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపికచేసి తీసుకున్నవైతే సహజంగా నాలుగు వరకూ తీసుకుంటాం. పోనీ ఆ పుస్తకం తీసుకుందాం. ఈ పుస్తకం కూడా తీసుకుందాం. అయితే అయ్యింది, అదీ ఇదీ కూడా తీసుకుందాం అనుకుంటాం. పుస్తకాల ఎంపిక విషయంలో ఆదీ అంతం లేని డైలమా ఇది. పుస్తకాల షాపుల్లోనూ,లైబ్రరీల్లోనూ ఈ తతంగం అలా అంతులేని కథలా నడుస్తూనే ఉంటుంది. పోనీ ఇంటికి తీసుకెళ్ళిన పుస్తకాలన్నీ చదువుతామా అంటే, ఉహూ, సాధ్యం కాదు. మన చేతిలో ఎంత మంచి పుస్తకమున్నా మనదగ్గర లేని మరో పుస్తకంలో కొత్త కాల్పనిక ప్రపంచాలకు దారులు వేసే కొత్త కొత్త పదాలేవుండుంటాయా అని అన్యమనస్కంగా కుతూహలపడుతూనే ఉంటాం, అటువంటి ఆలోచనల నుండి తప్పించుకోవడం దాదాపూ అసంభవం."
We couldn’t help it could we. We just couldn’t stop ourself from thinking about the other books and the different kinds of words they each contained and when we picked up one of the other books in order to find out it was just the same. It really was just the same no matter which book we picked up. As long as there were other books we thought about the sorts of words they might contain nonstop and were thus precluded from becoming engrossed with the very book we had in our hands. The very book. A silly business. Yes, it was a silly business. Tossing one book down and picking one book up and tossing that to one side and picking up yet another and so on and getting nowhere. Nowhere at all. Over and over again.
ఇందులో ప్రొటొగోనిస్ట్ సహచరుడు డేల్ ఆలోచనల్లో వివక్షతో కూడిన ఛాయలు కనిపిస్తాయి. "ఇంటెలెక్చువల్ రెల్మ్" స్త్రీలకు కాదనీ, అది కేవలం మగవారికోసమే ఉద్దేశింపబడిందనే భావనను సమర్ధించేవిగా ఉంటాయి. ఈ క్రింది వాక్యాలు చదివి ముందు "వాట్ ద రబ్బిష్" అనుకున్నప్పటికీ చివర రెండు వాక్యాలూ చదివి మాత్రం నవ్వుకోకుండా ఉండలేకపోయాను. :) "అమ్యూజింగ్" ఐ సే...
Dale wrote poetry and read poetry and had plenty of poetry books, including volumes by Anne Sexton and Sylvia Plath—which he made sure to keep out of my reach. Probably if I got my hands on them and read them all up something terrible would befall me or else something terrible but infinitesimal already woven into me would get notions and take over and what on earth then? Women can’t withstand poetry, seemed to be Dale’s view. Women are beautiful and tender creatures and poetry breaks them, of course it does. Poetry rips right through you, makes shit of you, and a man can be made shit of and go on living because no one really minds, not even the man.
సహజంగా సాహితీ విద్యార్థులు జ్ఞానం సంపాదించడానికో, పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చేసుకోడానికో సాహిత్యాన్ని చదవరు. నిరంతరం తాము జీవించి ఉన్నామన్న స్పృహ కలగడం కోసం చదువుతారు. రోటీ కపడా మకాన్ లాంటివాటిని దాటి జీవితం నుండి ఇంకేదో కావాలనే తపన తీర్చుకోడానికి చదువుతారు. వీళ్ళు పుస్తకాల్లోనే కాకుండా వాస్తవ జీవితంలో కూడా మెటఫోర్లని, చిహ్నాలనీ, సారూప్యతల్నీ, సంకేతాలనీ ఛేదించడంలో నిష్ణాతులు. కానీ కొన్నిసార్లు వీళ్ళు వాస్తవానికీ, సాహిత్యానికీ మధ్య పరిధులు గుర్తించలేక పొరబడుతుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ విషయం తమకేదో సంకేతాలిస్తోందని భ్రమపడతారు, మన అల్పమైన అస్తిత్వం గురించో, అపరిపక్వమైన మన వ్యక్తిత్వాల గురించో, అన్నిటినీ మించి మున్ముందు ఏం జరగబోతుందో అన్న విషయం గురించో. What was to come? What was to come? We wanted to know, we wanted to know what lay ahead of us very very much, it was all we could think about and it was so unclear—yet at the same time it was all too clear.
ఈ మధ్య చదివిన సమకాలీన సాహిత్యానికి చెందిన రచనల్లో "చెక్ ఔట్ 19" నాకు మంచి పఠనానుభవాన్ని మిగిల్చిన రచన. హ్యాపీ రీడింగ్. :)
పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :
That’s just the kind of uncomfortable scenario you’d find yourself in if you were popular, she knew that very well—she knew that popularity meant being trapped at every turn—no, it held no attraction at all and she was fed up of seeing how his popularity meant that they expected him to be fun every single time. What if he didn’t feel like it? Was he afraid of letting them down ?
You could get away with more on a Friday afternoon because no one was entirely there anyway.
The briefest love is also sometimes the longest love.
It was a nice bed. It was a nice bed. It was a nice room. The ceiling sloped and there were rafters. There was plenty of room. There was. It was spacious but cosy. We had plenty to read. Of course we did. We’d brought books over with us. And of course we acquired lots more very quickly. Everywhere we went people gave us books didn’t they. They did. They did. Everywhere we went. Very soon we had stacks of books. Stacks of them. We don’t much like stacks of books do we. No. No. Not really. We liked one book then and we like one book now. That’s right. We lay awake in bed all night long with one book on the duvet beside us. Wide awake. Yes. We couldn’t sleep could we. No, and our eyes were still ever so puffy. One book.
We could tell, had always known it—the encroaching inevitability of that life path had been a source of anxiety to us both since we were approximately eleven years old. We tried to keep that anxiety at bay with reading, with writing, with alcohol, with fantasies, with all the strength and imagination that those things gave us, and were on the lookout, always, for signs, proofs, indications, merest hints that we had promise, that we were special, that our lives would take a different turn.
I mostly read books by old white men such as Graham Greene and Edgar Allan Poe and Robert Louis Stevenson and that man who wrote Heart of Darkness, whose name escapes me. I hardly ever saw so much as a glimpse of myself in any of their books and I didn’t care to. I didn’t want to exist in books. I liked how the men talked to other men and I liked the places they went to. I liked being able to go with these men wherever they went and they went everywhere of course, all over the world, hardly ever really liking each other, so often paranoid, so often out on a street near the water last thing, or walking first thing down avenues churning with blossom, dying, dying weakly beneath a thin lapel, dying on the vine.
Drawing him kept him steady in the centre of her mind and brought him in closer, even closer, blotting everything else out. He wasn’t absent—she wasn’t remembering him—he was here—he was right here, moving through her mind, making it warm and luxuriant, and he could see of course all the many things she kept stored away in it, though only from an oblique angle—he couldn’t see all the way into those things in her mind which were all around him, not yet.
I’d come across a quote of hers (Anaïs Nin),that had really made me feel better: “We do not grow absolutely, chronologically. We grow sometimes in one dimension, and not in another; unevenly. We grow partially. We are relative. We are mature in one realm, childish in another. The past, present, and future mingle and pull us backward, forward, or fix us in the present. We are made up of layers, cells, constellations.”
You feel they wouldn’t exist without your seeing them. Like they wouldn’t exist without you. And isn’t the opposite true too—that the pages you read bring you to life? Turning the pages, turning the pages. Yes, that is how I have gone on living. Living and dying and living and dying, left page, right page, and on it goes. Sometimes all it takes is just one sentence. Just one sentence, and there you are, part of something that has been part of you since the beginning, whenever that might rightly be.
We’ve discovered haven’t we that something or other doesn’t have to belong to us in order for us to enjoy it. That’s right, it doesn’t matter does it, if whatever it is isn’t ours. An ostensibly permissive and uncommon attitude that got us into a lot of bother, once upon a time. Once. Yes. And only once.
Wonderful writeup
ReplyDelete