చాలాకాలంగా వాయిదా వేస్తూ ఎట్టకేలకు అమెరికన్ రచయిత్రి కార్సన్ మాక్ కుల్లర్స్ ని చదివాను. సహజంగా ప్రతీ రచయితనూ ఏదో ఒక చట్రంలో ఇమిడ్చేసినట్లే 'సదరన్ గోథిక్ ఫిక్షన్' రచయిత్రిగా ఆమెకు తగిలించిన ట్యాగ్ వలన ఆ జానర్ అంటే మొదట్నుంచీ పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆమెను చదవకుండా చాలా కాలమే తాత్సారం చేశాను. కానీ ఈ మధ్యనే ఆమె గురించి ప్రచురించిన ఒక వ్యాసం చదివిన్నప్పుడు ఆమెను చదవాలనే కుతూహలం కలిగింది. ఉర్సులా లెగైన్ విషయంలో కూడా ఆమె రచనల్ని చాలా కాలంపాటు చదవకపోవడానికి ఆమెకున్న 'సైన్స్ ఫిక్షన్' రచయిత్రి ట్యాగే కారణం. కానీ కొందరు రచయితలను చదివిన తరువాత గానీ అర్థంకాని విషయం ఏమిటంటే, వాళ్ళ శైలి ఏ ఒక్క చట్రంలోనూ ఇమిడేది కాదు. మాక్ కుల్లర్స్ కూడా అటువంటి కోవకు చెందిన రచయిత్రే.
Image Courtesy Google |
"Reflections in a Golden Eye" కథ విషయానికొస్తే, ఇది చాలా సాధారణమైన కథే. రచయిత్రి శైలి చూస్తే గంభీరపదజాలాలూ, మెటఫోర్ల వాడకాలూ ఇవేమీ లేని సరళమైన నేరేషన్. మరి కుల్లర్స్ ని ఎందుకు చదవాలీ అంటే, అసలు కథెలా చెప్పాలో తెలుసుకోవడం కోసం చదవాలంటాను. అడ్రినలిన్ రష్ ఇచ్చే షాక్ ఎలిమెంట్స్ గానీ, బర్నింగ్ ఇష్యూస్ గానీ ఇవేమీ లేకుండా పాఠకులను కేవలం తన నేరేషన్ తో కట్టి పడేసే కుల్లర్స్ అందమైన ప్రోజ్ కోసం చదవచ్చు. రచయిత్రి తన దృష్టిని దాటిపోనివ్వకుండా చిన్న చిన్న సంగతులను సైతం ఒక్కొక్కటిగా అందిపుచ్చుకుంటూ వాటిని సాధారణమైన కథలో చేర్చి కథనాన్ని రక్తికట్టించిన విధానం కోసం చదవచ్చు.
ముఖ్యంగా మానవ ప్రవృత్తిలో కుల్లర్స్ దృష్టిని దాటిపోయే అంశాలంటూ ఉండవు. ఆమె ఈ కథను రాసినప్పుడు, "I am so immersed in my characters that their motives are my own. When I write about a thief, I become one; when I write about Captain Penderton, I become a homosexual man. I become the characters I write about and I bless the Latin poet Terence who said 'Nothing human is alien to me." అన్నారట. మానవ స్వభావాలను సునాయాసంగా అంచనావెయ్యగలిగే నేర్పు కుల్లర్స్ ప్రత్యేకతల్లో ఒకటి.
యుద్ధకాలం కాని సమయంలో దక్షిణ అమెరికాలోని జార్జియాలో ఒక ఆర్మీ బేస్ లోని నిరాసక్త జీవితపు నేపథ్యంలో అల్లిన ఈ కథ ప్రధానంగా కెప్టెన్ పెండెర్టన్ - లియోనారా, మేజర్ లాంగ్డన్ - అలిసన్ అనే రెండు జంటల మధ్య నడుస్తుంది. వీళ్ళు కాకుండా కథలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో పాత్ర సైనికుడు 'ప్రైవేట్ విలియమ్స్' ది. కథంతా ప్రధానంగా వీళ్ళమధ్యే నడుస్తుంది. ఈ పాత్రల చిత్రీకరణలో కుల్లర్స్ 'సదరన్ రూట్స్' సుస్పష్టంగా కనిపిస్తాయి. హోమోసెక్సువల్ అయిన కెప్టెన్ పెండెర్టన్ కి భార్య ప్రేమికులంటే ఎవరికీ చెప్పుకోలేని ఒకరకమైన వ్యామోహం ఉంటుంది. 'గే' సంస్కృతి ఇంకా ఆమోదయోగ్యం కాని సమాజంలో ఇటువంటి కథ రాయడానికి పూనుకోవడం నిజంగా సాహసమనుకోవాలి. మేజర్ తో వివాహేతర సంబంధం కలిగి ఉండడమే కాకుండా తనను ఎగతాళి చేసే భార్య పట్ల పెండెర్టన్ లోలోపల తీవ్రమైన అసూయా ద్వేషాలతో రగిలిపోతుంటాడు. అయినప్పటికీ సామజిక చట్రంలో ఇమిడే క్రమంలో, "He carried his cuckoldry with a cynical good grace that was respected on the post." అని పెండెర్టన్ గురించి రాస్తారు. అదే సమయంలో లియోనారాను మనకు పరిచయం చేస్తూ క్లుప్తంగా రెండే వాక్యాల్లో, "Leonora Penderton feared neither man, beast, nor the devil; God she had never known." అంటారు కుల్లర్స్.
When she married the Captain she had been a virgin. Four nights after her wedding she was still a virgin, and on the fifth night her status was changed only enough to leave her somewhat puzzled. As for the rest it would be hard to say. She herself would probably have reckoned her affairs according to a system of her own giving the old Colonel at Leavenworth only half a count and the young Lieutenant in Hawaii several units in her calculations. But now for the past two years there had been only Major Morris Langdon and no one else. With him she was content.
లియోనారా, మేజర్ ల మధ్య ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసిన మేజర్ భార్య అలిసన్ తీవ్రమైన మానసిక, శారీరక అనారోగ్యాల బారినపడి సతమవుతూ ఉంటుంది. విశేషమేమిటంటే, ఈ నలుగురికీ వాస్తవం తెలుసు, కానీ ఎవరికీ దాన్ని ఎదుర్కునే ధైర్యం మాత్రం ఉండదు. ఈ కారణంగా నిజాన్ని ఉపేక్షిస్తూ బోనులో పడ్డ ఎలకల్లా కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఈ కథలో ఆర్మీ బేస్లో 'మానసిక వ్యాథిగ్రస్తురాలిగా' ముద్రవెయ్యడబడిన అలిసన్, 'తెలివితక్కువవాడంటూ' అందరూ అపహాస్యం చేసే ఆమె సేవకుడు అనక్లెటో మాత్రమే కాస్తో కూస్తో మిగతా అందరికంటే ఆరోగ్యకరమైన మనుషులనిపిస్తారు. మిగతా అందరూ తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎదుటివాళ్ళ మీద నెపం నెట్టేసే స్వార్థపరులుగానే కనిపిస్తారు. ఇక సామజిక చట్రంలో అస్సలు ఇమడని తీవ్రమైన నిర్లిప్తత, నిర్లక్ష్యం కలగలసిన 'ప్రైవేట్ విలియమ్స్' మనస్తత్వం మిగతా పాత్రలన్నిటికంటే మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది.ఈ రెండు జంటల కథా అనేక మలుపులు తీసుకోడానికి 'ప్రైవేట్ విలియమ్స్' ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా కారణమవుతాడు. అదేమిటన్నది మిగతా కథ.
మానవ ప్రవృత్తిని కుల్లర్స్ దృష్టికోణం నుండి చదువుతున్నప్పుడు, సాధారణ దృష్టిని దాటిపోయే అంశాలెన్నో అనిపించకమానదు. ప్రైవేట్ విలియమ్స్ కి లియోనారా పట్ల కలిగే అబ్సెషన్ గురించి ఆమె రాస్తున్నప్పుడు, మానవ సంబంధాల్లోని అబ్సర్డిటీనీ , నలుపు-తెలుపుల మధ్య ఒదగని అనంతమైన భావోద్వేగాలనూ, ప్రవర్తనలనూ ఒక్కొక్కటిగా మైక్రోస్కోప్ లో పెట్టి మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది !
He never thought of her in connection with the stables or the open air. To him she was always in the room where he had watched her in the night with such absorption. His memory of these times was wholly sensual. There was the thick rug beneath his feet, the silk spread, the faint scent of perfume. There was the soft luxurious warmth of woman flesh, the quiet darkness the alien sweetness in his heart and the tense power in his body as he crouched there near to her. Once having known this he could not let it go; in him was engendered a dark, drugged craving as certain of fulfillment as death.
కొందరు మనుషులుంటారు, వీరి ఆలోచనలు వీళ్ళు జీవించిన కాలంకంటే చాలా ఆధునికంగా ఉంటాయి. మాక్ కుల్లర్స్ రచనల్ని పరిశీలిస్తే అవన్నీ కనీసం ఒక అర్థ శతాబ్దం తరువాత వెలుగు చూడవలసిన రచనలుగా తోస్తాయంటారు ఆవిడ విమర్శకులు. సోక్రటీస్, అలాన్ ట్యూరింగ్, ఆస్కార్ వైల్డ్ వంటి మేథావుల విషయంలో వారి మేథను ఎదుర్కోలేని సమాజం వాళ్ళ బలహీనతల్ని లక్ష్యంగా చేసుకుని వారిని తమ స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఎన్ని హింసలపాలు చేసిందో తెలియాలంటే చరిత్రే సాక్ష్యం. "It is no measure of health to be well adjusted to a profoundly sick society" అని జిడ్డు కృష్ణ మూర్తి అన్నట్లు, కుల్లర్స్ తన జీవిత కాలమంతా సాంఘిక నియమాలకు తలవంచని తెగింపుతో, తన జెండర్ పరిమితులను సవాలు చేస్తూ బ్రతికారంటారు.
తీరా పుస్తకం చదివాక దీన్ని సినిమాగా కూడా తీశారని తెలిసింది. సాధారణంగా పుస్తకం చదివేస్తే మళ్ళీ సినిమా చూసే సాహసం చెయ్యను. ఆ చదివిన అనుభూతి ఖచ్చితంగా పాడవుతుందని గట్టి నమ్మకం. కానీ హీరో, హీరోయిన్లు మార్లన్ బ్రాండో, ఎలిజబెత్ టేలర్ అని తెలియగానే ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి కలిగింది. మ్యాన్లీనెస్ కి నిర్వచనంలా ఉండే బ్రాండోని 'కెప్టెన్ పెండెర్టన్' పాత్రలో ఊహించుకోవడం చాలా కష్టం. బ్రాండో ఈ పాత్రలో ఎలా ఉన్నాడో చూడ్డానికైనా సినిమా చూద్దామనిపించింది. కానీ ఒకసారి చూశాక సినిమా ప్రభావం పఠనానుభవాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసేస్తుంది కాబట్టి ఈ వ్యాసం రాయడం పూర్తయ్యాకే సినిమా కూడా చూద్దామని నిర్ణయించుకున్నాను.
'గే' అయిన కెప్టెన్ పెండెర్టన్ వ్యక్తిత్వాన్ని గురించి వర్ణిస్తూ,
He spoke and wrote three languages gracefully. He knew something of astronomy and had read much poetry. But in spite of his knowledge of many separate facts, the Captain never in his life had had an idea in his head. For the formation of an idea involves the fusion of two or more known facts. And this the Captain had not the courage to do.
దైవ భక్తీ, పాపభీతీ ఇవేమీ లేకుండా భోగవిలాసాలతో అనుభవ ప్రధానంగా జీవించడమే ధ్యేయంగా ఉండే లియోనారా, కళాభిరుచి కలిగిన సున్నితమనస్కురాలైన అలిసన్ కు పూర్తి భిన్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. లియోనారా వ్యక్తిత్వం గురించి కుల్లర్స్ ఈ విధంగా రాస్తారు. స్త్రీ వ్యక్తిత్వంలో ఉల్లిపొరల్లాంటి సంక్లిష్టతల్ని గురించి ఇంత సరళమైన వర్ణనలు చదవడం బహు అరుదు.
On the post Leonora Penderton enjoyed a reputation as a good hostess, an excellent sportswoman, and even as a great lady. However, there was something about her that puzzled her friends and acquaintances. They sensed an element in her personality that they could not quite put their fingers on. The truth of the matter was that she was a little feebleminded.
This sad fact did not reveal itself at parties, or in the stables, or at her dinner table. There were only three persons who understood this: her old father, the General, who had worried no little about it until she was safely married; her husband, who looked on it as a condition natural to all women under forty; and Major Morris Langdon, who loved her for it all the more.
భార్య అలిసన్ గురించి మేజర్ ఆలోచనలు "స్తీ ఉనికి మగవాణ్ణి సంతోషపెట్టడం వరకే పరిమితం" అనుకునే ఆనాటి సామజిక స్థితిగతులకు అద్దంపడతాయి, స్త్రీ సహజమైన ప్రవృత్తినీ, అది తనకు సంబంధంలేని విషయంగా నిర్లిప్తంగా ఉంటూ దాన్ని నిర్లక్ష్యం చేసే మగవాడి నైజాన్నీ కుల్లర్స్ ఈ విధంగా వర్ణిస్తారు.
He tried, and succeeded, in looking on her obvious unhappiness as something morbid and female, altogether outside his control.
Then she had burst into tears. That was the sort of thing the Major meant by 'female' and 'morbid'; and it did a man no good to try to figure it all out.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
And Lord! when they were scrambling around those bushes together filling his hat with berries, it had first happened. At nine in the morning and two hours after they met! Even now he could hardly believe it. But what had it seemed like to him at the time? Oh, yes it was like being out on maneuvers, shivering all through a cold rainy night in a tent that leaked. And then to get up at dawn and see that the rain was over and the sun was out again. And to watch the fine looking soldiers making coffee over camp fires and see the sparks rise up into a clear white sky. A wonderful feeling the best in the world!
There are times when a man's greatest need is to have someone to love, some focal point for his diffused emotions. Also there are times when the irritations, disappointments, and fears of life, restless as spermatozoids, must be released in hate. The unhappy Captain had no one to hate and for the past months he had been miserable.
The mind is like a richly woven tapestry in which the colors are distilled from the experiences of the senses, and the design drawn from the convolutions of the intellect The mind of Private Williams was imbued with various colors of strange tones, but it was without delineation, void of form.
He thought of the soldier in terms neither of love nor hate; he was conscious only of the irresistible yearning to break down the barrier between them. When from a distance he saw the soldier resting before the barracks, he wanted to shout to him, or to strike him with his fist, to make him respond in some way to violence.
ఎంత చక్కగా వ్రాసావో. చదవటం కాదు చదివినదాన్ని అర్ధం, అవగాహన చేసుకుని దాన్ని చక్కగా వివరించే మీ ప్రతిభా పాటవం అసామాన్యం కాదు అద్భుతమైనది. బాగా వ్రాసావమ్మా.
ReplyDeleteThank you Prasad garu. :)
Delete