“The only way to deal with an unfree world is to become so absolutely free that your very existence is an act of rebellion.” అన్న ఆల్బర్ట్ కామూ మాటలు ఎవరికైనా అతికినట్లు సరిపోతాయంటే అది ఒక్క థామస్ బెర్న్హార్డ్ కే అనిపిస్తుంది. తిరుగుబాటునే తన జీవితానికి నిర్వచనంగా చేసుకున్న ఈ ఆస్ట్రియన్ రచయిత స్వదేశంలో జర్మన్ పదమైన Nestbeschmutzer [ person who fouls their own nest ] గా అభివర్ణించబడినా స్వదేశానికి ఆవల మాత్రం కుండబద్దలుకొట్టినట్లుండే ఆయన రచనల శైలికి గాను యావత్ సాహితీ ప్రపంచపు మన్ననలందుకున్నారంటారు.
బాల్యంలో తల్లిదండ్రుల తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం, చిన్న వయసులోనే క్షయ బారినపడడం, యువకుడిగా ఉండగా 'హిట్లర్ యూత్' లో భాగంగా బలవంతంగా పనిచెయ్యాల్సిరావడం వంటి కారణాల వల్ల బెర్న్హార్డ్ రచనలపై తీవ్రమైన నిరాశావాదపు ఛాయలు కనిపిస్తాయి. బెర్న్హార్డ్ "ది లూజర్" చదువుతున్నంతసేపూ జులియన్ బార్నెస్ "ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్" గుర్తుకువచ్చింది. ఆ రచనలో జీవితానికి అంతిమ లక్ష్యం, పరమార్థం మృత్యువేననే నిరాశావాదం ఈ రచనలో కూడా కనిపిస్తుంది. బార్నెస్ నిరాశావాదానికి తోడు జె.ఎమ్.కోట్జీ కళాత్మకత, మిలన్ కుందేరా రచనల్లో అంతర్లీనంగా ధ్వనించే కళాకారుడి అహంభావం కూడా కలిపితే ఒక థామస్ బెర్న్హార్డ్ తయారవుతాడు.
Image Courtesy Google |
"ది లూజర్" మనకు కథను చెబుతున్న పేరు తెలియని కథానాయకుడితో కలిపి పియానో ప్లేయర్స్ అయిన ముగ్గురు స్నేహితుల కథ. మిగతా ఇద్దరిలో ఒకరు ప్రపంచ ప్రసిద్ధ 'కెనెడియన్ ప్రాడిజీ' గ్లెన్ గౌల్డ్ కాగా మరొకరు Wertheimer. రచయిత కథను ఉత్తమపురుషలో చెబుతారు. కాగా 'బ్రెత్లెస్' టోన్ లో చెబుతున్నట్లుండే గొలుసుకట్టు వర్ణనలు బెర్న్హార్డ్ వచనానికి అదనపు ఆకర్షణ.
ప్రతి మనిషికీ అతడి శక్తిసామర్ధ్యాల దృష్ట్యా, వ్యక్తిగత నైపుణ్యాల దృష్ట్యా తనదంటూ ఒక ప్రత్యేకమైన గమ్యం నిర్దేశించబడి ఉంటుంది. దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తనదైన మార్గంలో అడుగు ముందుకు వెయ్యడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని గుర్తించకుండా నిరంతరం వేరొకరి విజయాలతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురై జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమంత మూర్ఖత్వం, పరాజయం మరొకటి ఉండదు. ఒక ప్రపంచ ప్రసిద్ధ పియానో వాద్యకారుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకునే క్రమంలో గ్లెన్ గౌల్డ్ లాంటి జన్మతః సాక్షాత్ సరస్వతీ పుత్రుడి స్థాయికి చేరలేక నిరంతరం ఆత్మన్యూనతతో సతమతమయ్యి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాడు Wertheimer, మరోవైపు ఎంత ప్రయత్నించినా సంగీత ప్రపంచంలో గ్లెన్ స్థాయికి ఎప్పటికీ చేరలేనని గుర్తించిన కథానాయకుడు తన తనదైన తాత్విక గమ్యం వైపు దిశను మార్చుకుంటాడు. నిజానికి గ్లెన్ సాహచర్యంలో వాళ్ళిద్దరూ కూడా బాగుపడే అవకాశం ఉన్నప్పటికీ, అతడి శిఖరసమానమైన కీర్తిప్రతిష్ఠలు మిగతా ఇద్దరు స్నేహితుల జీవితాలనూ తాత్విక, హేతువాద కోణాల్లో ప్రభావితం చేస్తూ పరోక్షంగా వారి జీవితాలను ఎలా అథఃపాతాళానికి నెట్టేశాయన్నదే ఈ కథ.
The whole time on my way to the teacher’s I kept on saying these three words: Absolutely no artist! Absolutely no artist! Absolutely no artist! If I hadn’t met Glenn Gould, I probably wouldn’t have given up the piano and I would have become a piano virtuoso and perhaps even one of the best piano virtuosos in the world, I thought in the inn. When we meet the very best, we have to give up, I thought.
ఈ కథలో పరాజితుడంటే ఎవరనే ప్రశ్నకి, తన బలాలూ, బలహీనతల సహితం తనను తానుగా అంగీకరించలేనివాడని Wertheimer జీవితం రుజువు చేస్తుంది. కథ జరుగుతున్న సమయంలో నేరేటర్ వేర్వేరు కారణాలతో మరణించిన తన ఇద్దరి స్నేహితులతో తన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. కథ మొదట్లోనే నేరేటర్ గ్లెన్ ను పరిచయం చేస్తూ, he was so possessed by his art that we had to assume he couldn’t continue in that state for very long and would soon die returning to Canada from Salzburg, destroy himself with his music obsession, with his piano radicalism. అంటాడు. అతడన్నట్లుగానే గ్లెన్ తనకున్న ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోడు, నలభై ఏళ్ళు తన కళను దైవసమానంగా సాధన చేస్తూ, ఆ కళారాధనలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడుస్తాడు.
We never attained the inhuman state that Glenn attained, who by the way never escaped this inhuman state, who didn’t even want to escape this inhuman state.
From the first moment ours was a spiritual friendship. The majority of even the most famous piano players haven’t a clue about their art, he said. But it’s like that in all the arts, I said, just like that in painting, in literature, I said, even philosophers are ignorant of philosophy. Most artists are ignorant of their art. They have a dilettante’s notion of art, remain stuck all their lives in dilettantism, even the most famous artists in the world.
ప్రపంచాన్ని అందరూ ఒకే కోణంలో చూడాలని కొన్ని నియమాలుంటాయి. అందరూ అలాగే చూడాలని సమాజాలూ, ప్రభుత్వాలూ, యజమాన్యాలూ నిర్ణయిస్తాయి. దానికి భిన్నంగా చూసేవాళ్ళు ఆ సమూహానికి చెందరు. అటువంటి "అవుట్ సైడర్" ఇమేజ్ థామస్ బెర్నార్డ్ సొంతం. "జర్మన్ తలబిరుసుతనం" ప్రపంచానికి కొత్తేమీ కాదు కానీ అదే జర్మన్ తలబిరుసుతనం ఆ దేశానికే తలనెప్పిగా మారితే ఎలా ఉంటుందో తెలియాలంటే థామస్ బెర్నార్డ్ రచనలు చదవాలి.
ప్రపంచమంతా తీవ్రమైన కన్ఫర్మిటీ రాజ్యమేలుతున్న ఈ కాలంలో విప్లవాత్మకమైన థామస్ బెర్న్హార్డ్ గళం పాఠకులకు సహజంగానే వైవిధ్యంగానూ, వినసొంపుగానూ అనిపిస్తుంది. ఇక ప్రపంచంలో ఏ మనిషి పట్లా, ఏ ప్రాంతం పట్లా కూడా కనీసమైన సహానుభూతీ, గౌరవం లేకుండా పుస్తకం మొదలుపెట్టిన దగ్గర్నుండి ముగింపు వరకూ నిరంతరం సాగే రచయిత విమర్శనాత్మకమైన విశ్లేషణలు చదువుతుంటే అసలు ఈ భూప్రపంచంలో బెర్న్హార్డ్ కి నచ్చే, అతడు మెచ్చుకునే అంశమంటూ ఏదైనా ఉండే అవకాశం ఉందా అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ "యాంటీ ఆస్ట్రియన్", "డెత్ అబ్సెస్డ్" రచనలో కథానాయకుడికి ఆస్ట్రియన్ ప్రభుత్వం నచ్చదు, అక్కడి ట్రైన్స్ నచ్చవు, హోటళ్ళు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న చిన్న చిన్న పట్టణాలూ కూడా నచ్చవు. అతడి ఫిర్యాదులు చాలా చోట్ల జర్మన్ తత్వవేత్త Arthur Schopenhauer సినిసిజాన్ని గుర్తుచేస్తున్నాయి అని నేను అనుకునేలోగా, ఈ ముగ్గురు స్నేహితులూ Schopenhauer, Kant, Spinoza ల రచనల్ని చదువుతున్నారని రాస్తారు రచయిత. అయితే ఇకనేం !! అస్సలు ఆశ్చర్యం లేదు అనుకున్నాను. "To exist means nothing other than we despair" అనే Wertheimer ఫిర్యాదులు కొన్ని చోట్ల అదుపు తప్పి అసలు మనిషి పుట్టడమే తప్పన్నట్లు మొత్తం మనవాళిపై వెళ్ళగక్కే విద్వేషంలా అనిపిస్తాయి.
“Battle not with monsters, lest ye become a monster, and if you gaze into the abyss, the abyss gazes also into you.” అని Nietzsche అన్నట్లు హేతువాదపు పరిధుల్ని సవాలు చేసే ప్రయత్నంలో Wertheimer తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి తనకు తెలీకుండానే తన జీవితంపై పట్టు కోల్పోయి ఒక ఉన్మాదిగా మారతాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మొదలు, నలభై ఏళ్ళపాటు తనకు చేదోడువాదోడుగా ఉన్న చెల్లెల్ని సైతం ప్రేమించలేని Wertheimer, చివరకు ప్రపంచంపై తీవ్రమైన విరక్తితో, ద్వేషభావంతో తన చెల్లెలి ఇంటిముందే ఉరిపోసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటాడు.
హేతువాదం పులి మీద స్వారీ లాంటిది. దాన్ని మన అధీనంలో ఉంచుకున్నామని మనం విర్రవీగేలోగా దానికెప్పుడు ఆహారంగా మారిపోతామో కనీసం మనక్కూడా తెలీదు. హేతువాదానికీ, ఉన్మాదానికీ మధ్య ఉండేది అతి సన్నని గీత మాత్రమే. అది అలికినట్లైపోయి స్పష్టంగా కనిపించని ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ ఆ గీతను స్పష్టంగా పునఃచిత్రించుకుంటూనే ఉండాలి. "ది లూజర్" చదివినప్పుడు Wertheimer జీవితం ద్వారా థామస్ బెర్న్హార్డ్ చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే, అది ఇదొక్కటే. థామస్ బెర్న్హార్డ్ భావజాలం కంటే ఆయన భావవ్యక్తీకరణ నాకు అమితంగా నచ్చింది. ఈ రచన ఆయన మరికొన్ని రచనలు చదవాలనిపించేలా చేసింది. హ్యాపీ రీడింగ్ :)
చివరగా, ఈ పుస్తకానికి తుదిపలుకు రాసిన మార్క్ ఎమ్. ఆండర్సన్ ఒక రచయితగా బెర్న్హార్డ్ జీవితం గురించి రాసిన అనేక విషయాలు ఈ రచన కంటే మరింత ఆసక్తికరంగా అనిపించాయి :
During his lifetime Thomas Bernhard’s texts provoked more than the ordinary share of scandals. But perhaps the most enduring scandal will turn out to be his very last text, his will: “Whatever I have written, whether published by me during my lifetime or as part of my literary papers still existing after my death, shall not be performed, printed or even recited for the duration of legal copyright within the borders of Austria, however this state identifies itself.” Bernhard had taken care not to reveal the contents of this will before he died; in fact, he even stipulated that news of his death not be announced until he was buried. This parting slap in the face of his native country thus came not only as a surprise; it came from the hand of a dead man, whose laughter rang out from the grave.
పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు ,
He had barricaded himself in his house. For life. All our lives the three of us have shared the desire to barricade ourselves from the world. All three of us were born barricade fanatics. But Glenn had carried his barricade fanaticism furthest.
Glenn confirmed what we sensed: New York is the only city in the world where a thinking person can breathe freely the minute he sets foot in it.
Immediately I quashed that idea, for I detested virtuosity and its attendant features from the very beginning, I detested above all appearing before the populace, I absolutely detested the applause, I couldn’t stand it, for years I didn’t know, is it the bad air in concert halls or the applause I can’t stand, or both, until I realized that I couldn’t stand virtuosity per se and especially not piano virtuosity. For I absolutely detested the public and everything that had to do with this public and therefore I detested the virtuoso (and virtuosos) personally as well.
Our loser is a fanatic, Glenn once said, he’s practically choking on self-pity all the time.
I had nothing to prove, only everything to lose, he said, I thought. Our wealth was probably our undoing, he said, but then immediately: Glenn’s wealth didn’t kill him, it allowed him to exploit his genius.
For fifty years are absolutely enough, I thought. We become contemptible when we go past fifty and are still living, continue our existence. We’re border-crossing weaklings, I thought, who have made ourselves twice as pitiful by putting fifty years behind us. Now I’m the shameless one, I thought. I envied the dead. For a moment I hated them for their superiority.
But we don’t always have to be studying something, I thought, it’s perfectly enough merely to think, to do nothing but think and give our thoughts free rein. To give in to our philosophical worldview, simply submit to our philosophical worldview, but that’s the hardest thing, I thought.
But simple people don’t understand complicated ones and thrust the latter back on themselves, more ruthlessly than any others, I thought. The biggest mistake is to think that one can be rescued by so-called simple people. A person goes to them in an extremely needy condition and begs desperately to be rescued and they thrust this person even more deeply into his own despair. And how are they supposed to save the extravagant one in his extravagance, I thought.
If a friend dies we nail him to his own sayings, his comments, kill him with his own weapons. On the one hand he lives on in what he said to us (and to others) all his life, on the other we kill him with it. We’re the most ruthless (toward him!) as far as his comments, his writings, are concerned, I thought, if we don’t have any more of his writings, because he prudently destroyed them, we go after his comments in order to destroy him, I thought. We exploit his unpublished papers in order to destroy even more the one who left them to us, to make the dead man even deader, and if he hasn’t left us the appropriate instructions to destroy his papers, we invent them, simply invent declarations against him, etc., I thought. Heirs are cruel, the survivors don’t have the slightest consideration, I thought. We’re searching for testimony against him, for us, I thought. We plunder everything that can be used against him in order to improve our situation, I thought, that’s the truth.
The so-called intellectual consumes himself in what he considers pathbreaking work and in the end has only succeeded in making himself ridiculous, whether he’s called Schopenhauer or Nietzsche, it doesn’t matter, even if he was Kleist or Voltaire we still see a pitiful being who has misused his head and finally driven himself into nonsense. Who’s been rolled over and passed over by history. We’ve locked up the great thinkers in our bookcases, from which they keep staring at us, sentenced to eternal ridicule, he said, I thought.
How good it is that none of these imperfect, incomplete works has ever appeared, I thought, had I published them, which would have posed no difficulty whatsoever, today I would be the unhappiest person imaginable, confronted daily with disastrous works crying out with errors, imprecision, carelessness, amateurishness. I avoided this punishment by destroying them, I thought, and suddenly I took great pleasure in the word destroying.
Everything about Wertheimer was always taken from somebody else, copied, he took everything from me, he copied me in everything, and so he even took my failure from me and copied it. Only his suicide was his own decision and came completely from him, I thought, and so he may have experienced, as they say, a sense of triumph in the end.
The lower classes are just as much a public menace as the upper classes, he said, they commit the same hideous acts, should be rejected just as categorically as the others, they’re different but they’re equally hideous, he said, I thought.
Wertheimer was an unrelieved emulator, he emulated anybody he thought was better off than he was, although he didn’t have the capacity for that, as I now see, I thought, he’d absolutely wanted to be an artist and thus walked into the mouth of disaster.
We say a word and destroy a person, although the person we’ve destroyed, at the moment we say out loud the word that destroys him, doesn’t take notice of this deadly fact, I thought.
No comments:
Post a Comment