ఇటాలియన్ రచయిత, నోబెల్ గ్రహీతా లూగీ పిరాండెల్లో రాసిన అనేక నాటకాల్లో 'Six Characters in Search of an Author' అనే నాటకాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సంప్రదాయతకు సవాలు విసురుతూ ఈ నాటకంలో కనిపించే అసంబద్ధమైన శైలే దానికి కారణం. సహజంగా కథల్లో పాత్రలు రచయిత అధీనంలో ఉంటాయి, అవి రచయిత చేతిలో కీలుబొమ్మల్లా నుంచోమంటే నుంచుంటాయి, కూర్చోమంటే కూర్చుంటాయి. కానీ ఈ నాటకంలో పాత్రలు అలాంటి సాదాసీదా పాత్రలు కాదు. స్వతంత్ర భావాలు కలిగిన ఆ పాత్రలు తమకు జీవంపోయగల రచయితను వెతుక్కుంటూ వెడతాయి. ఒక రచయిత తమ కథకు ముగింపునివ్వకుండా మధ్యలోనే వదిలేశారంటూ తమ పాత్రలను తుదకంటా పోషించే అవకాశం ఇమ్మని ఈ కథలో ఆరు పాత్రలూ ఒక నాటక సంఘానికి వెళ్తాయి. ఇక అక్కడి నుంచీ మూడు భాగాలుగా రాసిన ఈ నాటకం మొదలవుతుంది. ఆ నాటకసంఘ నిర్వాహకుడు వాళ్ళను కథ చెప్పమంటూ తన దగ్గరున్న నటులతో నాటకాన్ని రిహార్సల్ చేయించడం మొదలుపెడతాడు. ఆ ఆరుగురూ తమ కథను ఉన్నదున్నట్లుగా తాము మాత్రమే చెప్పగలమనీ, అది వాళ్ళ raison d'être అంటూ తమ పాత్రలను యధాతథంగా తామే పోషించగలమనీ నిర్వాహకుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోడు.
Image Courtesy Google |
ఇక అక్కడినుండీ కథ ముదిరి పాకానపడుతుంది. వాళ్ళ వాస్తవం వేదిక మీదకొచ్చేసరికి నటుల మొహమ్మీది మేకప్ రంగుల్లో కలిసిపోయి పూర్తి సత్యాన్ని కోల్పోయి అర్థసత్యంగా మిగులుతుంది. దీనిపట్ల ఆ పాత్రలన్నీ తీవ్రమైన అసహనాన్ని వెళ్ళగక్కుతాయి. ఒకరినొకరు నిందించుకుంటూ తమ పాత్రకు న్యాయం జరగట్లేదని వాపోతాయి. ఆ నాటకసంఘ నిర్వాహకుడు కథను జనరంజకంగా మలిచి, నాటకాన్ని రక్తికట్టించే విధంగా వాళ్ళందర్నీ ఒక తాటిపైకి తేలేక తలపట్టుకుంటాడు. ఈ కథంతా మెటఫోర్ల మేళవింపుగా ఉంటుంది, మీ పఠనానుభవాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేదు కాబట్టి నేను కథ జోలికి వెళ్ళదల్చుకోలేదు. ఏకకాలంలో మనిషి వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ నిరంతరం రూపాంతరం చెందే వ్యక్తిత్వ వైరుధ్యాలనూ, అస్తిత్వవాదాన్నీ సరళమైన సంభాషణల్లో చర్చిస్తూ పిరాండెల్లో రాసిన నాటకం 'Six Characters in Search of an Author' వాస్తవానికీ-భ్రమకీ మధ్య ఉన్న అంతరాలను గుర్తించే దిశగా పాఠకుల సృజనాత్మకతకు పదునుపెడుతుంది.
నిర్వాహకుడికీ, సవతి కూతురుకీ మధ్య జరిగిన ఒక సంభాషణలో "సత్యం" వాస్తవంలో ఉన్నంత యదార్థంగా సాహిత్యంలోనో, మరో కళలోనో ఉండే అవకాశం లేదనే విషయాన్ని 'రంగస్థలాన్ని' మెటఫోర్ గా తీసుకుని రెండే వాక్యాల్లో వర్ణించిన తీరు "ఆహా !" అనిపించకమానదు.
సవతి కూతురు : నాకు "నిజం" కావాలి . "నిజం".
నిర్వాహకుడు : నేను కాదనను, నీ రంపపుకోత నాకు అర్థమవుతోంది. కానీ ఇదంతా రంగస్థలం మీద పనికిరాదు. "నిజం" అక్కడ చెల్లుబాటవ్వదు.
ఇటువంటిదే మరో సంభాషణ,
సవతి కూతురు : కానీ అది "నిజం".
నిర్వాహకుడు : అయితే ఏంటమ్మాయ్ ! నటించడం మన వ్యాపారం. ఇక్కడ "సత్యం" ఒక స్థాయి వరకే అమ్ముడుపోతుంది.
కాస్త పరిశీలిస్తే పై సంభాషణను పాఠకులు వివిధ కోణాల్లో అన్వయించుకోవచ్చు. Oh chuck it! "Wonderful art!" Withdraw that, please ! అంటూ తమ ట్రేడ్ మీదే వ్యంగ్యోక్తులు విసురుకోడానికి ఎవరికైనా చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. అటువంటి ధైర్యం పుష్కలంగా ఉన్న రచయిత పిరాండెల్లో. ఈ రచన ద్వారా కార్యశీలతకు సుదూరమైన కళారంగంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపించడంలో ఆయన పూర్తిగా సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు. ఈ సంభాషణ దానికొక చక్కని ఉదాహరణ.
The Manager. A bit discursive this, you know!
The Son [contemptuously]. Literature! Literature!
The Father. Literature indeed! This is life, this is passion!
The Manager. It may be, but it won't act.
Oh, all these intellectual complications make me sick, disgust me -- all this philosophy that uncovers the beast in man, and then seeks to save him, excuse him . . . I can't stand it, sir. When a man seeks to "simplify" life bestially, throwing aside every relic of humanity, every chaste aspiration, every pure feeling, all sense of ideality, duty, modesty, shame . . . then nothing is more revolting and nauseous than a certain kind of remorse -- crocodiles' tears, that's what it is.
"The empty form of reason without the fullness of instinct, which is blind." -- You stand for reason, your wife is instinct. It's a mixing up of the parts, according to which you who act your own part become the puppet of yourself. Do you understand?"
Do you suppose that with all this egg-beating business you are on an ordinary stage? Get that out of your head. You represent the shell of the eggs you are beating!
అనేకమంది మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనేకానేకమైన అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు పిరాండెల్లో.
The Father : But don't you see that the whole trouble lies here. In words, words. Each one of us has within him a whole world of things, each man of us his own special world. And how can we ever come to an understanding if I put in the words I utter the sense and value of things as I see them; while you who listen to me must inevitably translate them according to the conception of things each one of you has within himself. We think we understand each other, but we never really do.
చివరగా ఇదొక్కసారి చదివి ప్రక్కన పెట్టగలిగే పుస్తకం కాదు. చదివిన ప్రతిసారీ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ అనేక విధాలుగా కనిపించే మాయాదర్పణంలాంటిదీ నాటకం. మనకు నేడు వాస్తవంగా కనిపించే విషయం రేపు భ్రమగా తోచవచ్చు, నేడు భ్రమనుకున్నదే మరోరోజు వాస్తవంగా మారనూ వచ్చు. 'Change is only constant' అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనిషి తన వ్యక్తిత్వంలో పొరల్ని ఒక్కోటీ వలుచుకుంటూపోవడమే జీవితం అని గుర్తుచేస్తూ అస్తిత్వానికి ఒకే ఒక్క నిర్వచనం సాధ్యం కాదనీ, నిరంతరం రూపాంతరం చెందే మనిషి వ్యక్తిత్వానికి అనంతమైన నిర్వచనాలుంటాయని ఈ నాటకం ద్వారా నిరూపిస్తారు పిరాండెల్లో. ఆయన రచనల్లో అన్నిటికంటే ముందు చదవవలసిన ఈ పుస్తకాన్ని నేను చాలా ఆలస్యంగా చదివాను. పిరాండెల్లోను మీరు పరిచయం చేసుకోవాలంటే నేను మొదట ఈ రచన చదవమంటాను. హ్యాపీ రీడింగ్. :)
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
But every man knows what unconfessable things pass within the secrecy of his own heart. One gives way to the temptation, only to rise from it again, afterwards, with a great eagerness to re-establish one's dignity, as if it were a tombstone to place on the grave of one's shame, and a monument to hide and sign the memory of our weaknesses. Everybody's in the same case. Some folks haven't the courage to say certain things, that's all!
The Father. For the drama lies all in this -- in the conscience that I have, that each one of us has. We believe this conscience to be a single thing, but it is many-sided. There is one for this person, and another for that. Diverse consciences. So we have this illusion of being one person for all, of having a personality that is unique in all our acts. But it isn't true. We perceive this when, tragically perhaps, in something we do, we are as it were, suspended, caught up in the air on a kind of hook. Then we perceive that all of us was not in that act, and that it would be an atrocious injustice to judge us by that action alone, as if all our existence were summed up in that one deed.
The Father. But only in order to know if you, as you really are now, see yourself as you once were with all the illusions that were yours then, with all the things both inside and outside of you as they seemed to you -- as they were then indeed for you. Well, sir, if you think of all those illusions that mean nothing to you now, of all those things which don't even seem to you to exist any more, while once they were for you, don't you feel that -- I won't say these boards -- but the very earth under your feet is sinking away from you when you reflect that in the same way this you as you feel it today -- all this present reality of yours -- is fated to seem a mere illusion to you tomorrow?
The Father. I don't know to what author you may be alluding, but believe me I feel what I think; and I seem to be philosophizing only for those who do not think what they feel, because they blind themselves with their own sentiment. I know that for many people this self-blinding seems much more "human"; but the contrary is really true.
For man never reasons so much and becomes so introspective as when he suffers; since he is anxious to get at the cause of his sufferings, to learn who has produced them, and whether it is just or unjust that he should have to bear them. On the other hand, when he is happy, he takes his happiness as it comes and doesn't analyze it, just as if happiness were his right. The animals suffer without reasoning about their sufferings. But take the case of a man who suffers and begins to reason about it.
Drama is action, sir, action and not confounded philosophy.
No comments:
Post a Comment