"It is better, I believe, to kill oneself than to endure spiritual bankruptcy" అనే వాక్యాలు చదివిన వారికి అకుతాగావా రచనలు పైకి కనిపించినంత సరళం కావని ఇట్టే అర్థమవుతుంది.
రెండేళ్ళ క్రితం ప్రఖ్యాత జాపనీస్ రచయిత Ryūnosuke Akutagawa 'త్రీ స్ట్రేంజ్ టేల్స్' అనే రచన చదివిన్నప్పుడు ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో ఆయన విలక్షణ శైలికి దాసోహం అయిపోయాను. తరువాత అకుతాగావా కథలు మరికొన్ని చదువుదామనుకున్నా వేరే పుస్తకాల ధ్యాసలోపడి కుదరలేదు, ఈలోగా పుష్కిన్ ప్రెస్ వారు ఆయన కథల్లో కొన్నిటిని "Murder in the Age of Enlightenment: Essential Stories" పేరిట పుస్తకంగా తీసుకొచ్చారని తెలిసింది. ఎందుకో తెలీదు గానీ, "పుష్కిన్ ప్రెస్" రచనలంటే అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కొత్త చందమామ కథల పుస్తకాన్ని మిరపకాయ బజ్జీల పొట్లంతో కలిపి ఆఫీసు నుంచి వస్తూ వస్తూ నాన్నగారు తెచ్చి చేతిలో పెట్టినంత సంతోషంగా అనిపిస్తుంది. ఇక సగం సగం చదువుతున్న పుస్తకాలు కూడా ప్రక్కన పెట్టి ఈ పుస్తకం పట్టుకున్నాను. విచిత్రం ఏమిటంటే ఇది పూర్తి చేసినా కూడా ఎందుకో నాకు తనివితీరలేదు. మరికొన్ని కథల్ని చదవాలనిపించింది. ఒక రచయితని ఒకసారంటూ చదివాక మళ్ళీ వెంటనే రెండో పుస్తకం చదవడం నా వరకూ చాలా అరుదూ, అద్భుతమూను. అటువంటిది "హెల్ స్క్రీన్", "కాగ్ వీల్స్", "డెత్ రిజిస్టర్", "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" ఇలా చిన్న చిన్న నవలికల్ని పోలిన ఆయన రచనలన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్ళాను.
Images Courtesy Google |
13 ఏళ్ళ సాహితీ ప్రస్థానానికి స్వల్పకాలంలోనే ముగింపు పలుకుతూ 35 ఏళ్ళకే జీవితాన్ని అంతం చేసుకున్న అకుతాగావా జీవితంపై మనోవైకల్యం ఉన్న ఆయన తల్లి ప్రభావం ఎక్కువ ఉందంటారు. తల్లిదండ్రుల దగ్గర బాల్యం రేకెత్తించిన భయాలకు దూరంగా తల్లి సోదరి చేరదీసినప్పుడు తాత్కాలికంగా సాహితీ లోకంలో శాంతిగా బ్రతికినప్పటికీ, బాల్యం తాలూకూ చీకటి నీడలు ఆయన్ను జీవితాంతం వదిలిపోలేదు. ఈ కారణంగా స్కిజోఫ్రీనియా తాలూకూ భ్రమలతో, భ్రాంతులతో నిరంతరం భయాందోళనల మధ్యే జీవించారంటారు.
బహుశా ఈ కారణంగానే ఆయన కథల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్యనుండే లోకాలకు చెందిన అస్పష్టమైన, అసంబద్ధమైన వర్ణనలు సృజనాత్మకత వైశాల్యపు పరిథుల్ని పూర్తిగా చెరిపేస్తూ పాఠకుల ఊహలకు రెక్కలిస్తాయి. ఆయన కథ చెప్పే తీరు కొన్నిసార్లు ఖాళీ కాన్వాసు మీద కళాకారుడు గీసిన అందమైన చిత్రంగానూ, అదే సమయంలో అస్తవ్యస్తంగా, అపసవ్యమైన వెతుకులాటను తలపిస్తూ అసంబద్ధంగానూ అనిపిస్తుంది. ముఖ్యంగా 'కాగ్ వీల్స్', 'డెత్ రిజిస్టర్' , 'ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్' ఈ మూడు రచనలూ అకుతాగావా స్వానుభవాల ఆధారంగా రాసినవి కావడంతో రచయితగా ఆయన మెదడులోని మెకానిజమ్స్ ని మరికాస్త సానుభూతితో అర్థం చేసుకునే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. 'హెల్ స్క్రీన్' కథ అకుతాగావాలోని స్వచ్ఛమైన కళాకారుడి విశ్వరూపాన్ని చూపిస్తుంది.
Hell Screen : "హెల్ స్క్రీన్" ఒక కళాకారుడిగా తన స్వేచ్ఛ యొక్క పరిధుల్ని సవాలు చేసిన చిత్రకారుడు యోషిహిడే కథ. యోషిహిడే జీవితాన్ని అడ్డం పెట్టుకుని అకుతాగవా ఈ కథలో అంతర్లీనంగా ఒక రచయితగా తన అంతఃసంఘర్షణనీ, మనఃస్థితినీ చెప్పుకున్నారా అనిపిస్తుంది.
ఏ కళాకారుడి జీవితం అయినా సాధారణ సంఘజీవి మానసిక స్థితికి చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే సాహిత్యంలో కళను 'స్వేచ్ఛ' కు పర్యాయపదంగా వాడడం చూస్తుంటాం. కానీ కళాకారుడి స్వేచ్ఛకు పరిధులు ఏమిటనేదే నేటి వరకూ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏదేమైనా గతాన్ని పరిశీలిస్తే, ఆ పరిధుల్ని సవాలు చేసినవారు మాత్రమే చరిత్రలో గొప్ప గొప్ప కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు, అటువంటి కళ ఉత్కృష్టమైన కళగా పరిగణింపబడుతోంది. దీనికి భిన్నంగా ఒక చట్రంలో ఇమడడానికి ప్రయత్నించిన కళాకారుడి సృష్టీ, సృజనాత్మకతలు అంతంతమాత్రమే. కళాసృజన విషయంలో నైతిక,సామాజిక విలువలకు సైతం తిలోదకాలివ్వడనికి వెనుకాడని యోషిహిడే అంతఃసంఘర్షణకూ, కళ పట్ల అతడికున్న నిబద్ధతకూ అద్దంపడుతుందీ కథ.
నేను ఒకానొక సమయంలో చదివిన జె. ఎమ్. కోట్జీ, మిలన్ కుందేరా, హెస్సే , గిడే లాంటివాళ్ళతో బాటు ఇటీవలే చదివిన థామస్ బెర్న్హార్డ్ లాంటి రచయితలు కూడా ధృవీకరించినట్లు కళాకారుడికి సామజిక నైతికానైతికతలు వర్తించవు (?) , ఎటువంటి సామజిక చట్రంలోనూ అతణ్ణి ఇమడ్చడం సాధ్యపడదు. నిజమైన కళాకారుడి మానసిక స్థితి నిరంతరం వాస్తవానికీ, కల్పనకూ మధ్య హేతువాదం, తర్కం చొరబడ వీలులేని ఒక రహస్య ప్రదేశంలో ఊగిసలాడుతూ ఉంటుంది.
కానీ సాంఘికంగా ఆమోదయోగ్యమైన సంప్రదాయవాదపు విలువలు వేరు. బౌద్ధంలో మానవజాతి నీతి నియయమాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి గాను ప్రధానంగా ఐదు ధర్మాలను ప్రతిపాదిస్తారు.
* జీవహింస చేయరాదు. అనగా జీవించి ఉన్న ఏ ప్రాణినీ చంపరాదు.
* నీకు ఇవ్వనిదేదీ బలవంతంగా లాక్కోరాదు, అనగా చౌర్యం చెయ్యరాదు.
* ఇంద్రియాలను దుర్వినియోగం చెయ్యరాదు. అనగా భోగలాలసత్వాన్ని అదుపులో ఉంచుకుని ఇంద్రియ నిగ్రహం పాటించాలి.
* దుర్భాషలాడరాదు.
* చిత్తమును భ్రమింపజేయు మత్తుపదార్థాలు ఉపయోగించరాదు.
కానీ యోషిహిడే కథ చదివినప్పుడు నిజమైన కళాకారుడి జీవితం ఈ ఐదు ధర్మాలనూ దాటుకుని గానీ మొదలవ్వదేమో అనిపిస్తుంది. ఈ కథలో ఒక పాత్ర ద్వారా, “Excel though he may in art, if a man does not remember the Five Virtues, his path can lead only to Hell.” అనిపించడంలో, కళాకారుడి నిబద్ధతను పాటించే క్రమంలో అకుతాగావా తన నైతిక పతనపు భారాన్ని దించుకునే ప్రయత్నం చేశారేమోననిపిస్తుంది.
"Murder in the Age of Enlightenment" లో అకుతాగావా రాసిన వాటిల్లో ప్రముఖమైన ఏడు కథలున్నాయి. [In a grove, Hell screen, Murder in the age of enlightenment, The General, Madonna in black, Cogwheels]
The Spider's thread : ఇందులో చదివిన కథలన్నిటిలోనూ నైతికతను బోధించే కథ ఇదొక్కటే. ఇది పిల్లలకు కూడా చెప్పగలిగిన చిన్న ఫేబుల్ లాంటి నీతి కథ. నరకకూపంలోని రక్తపు సరస్సులో కాందాత తాను చేసిన పాపాలకు మిగతా జీవులతో శిక్షననుభవిస్తూ ఉంటాడు. అనేక పాపాల మధ్య అతడు చేసిన చిన్న దయగల పనికి సంతసించిన బుద్ధ శాక్యముని కాందాతకు నరకంనుండి విముక్తి కలిగించాలనుకుంటాడు. ఈ కథలో కాందాత సాలెగూడు దారాన్ని పట్టుకుని స్వర్గానికి ఎగబాకడం గురించిన వర్ణనల్లో అకుతాగావా జీవితంలో స్వర్గ-నరకాల నడుమ నిరంతరం జరిగిన ఊగిసలాట, మనోవైకల్యాలను అధిగమించి శాంతిగా బ్రతకాలనే తపన కనిపిస్తాయి.
ఇక ఈ కథల్లో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఒకటుంది. రాయడం విషయంలో నేను మునుపు చదివిన హెర్మన్ హెస్సే, ఉర్సులా లెగైన్, బోర్హెస్ , కాల్వినో, సిగిజ్మండ్ లాంటి కొందరు రచయితల శైలిలో కనిపించిన సారూప్యతే అకుతాగావా రచనల్లో కూడా కనిపించడం విశేషం. వీరందరి రచనల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం ఏమిటంటే, వీరికి పురాణేతిహాసాలూ, గ్రీకు రోమన్ మైథాలజీలతో పాటు, దేశ విదేశీ రచనలపై ఉన్న అపారమైన పట్టు. "కాగ్ వీల్స్" లో కనిపించే అనేకానేకమైన సాహితీ ప్రస్తావనలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. Strindberg’s Legends, Madame Bovary, డాంటే ఇన్ఫెర్నో, Stendhal, Anatole France, A Dark Night’s Passing, The Collected Letters of Prosper Mérimée వంటి అనేక ప్రస్తావనలు పాఠకులకు మునుపు పరిచయం లేని కాల్పనిక ప్రపంచాలకు తలుపుల్ని తెరుస్తాయి.
దీనికి తోడు "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" రచన మొదలవ్వడమే అకుతాగావా పఠనానుభవాలతో కూడిన ఈ ప్రారంభపు వాక్యాలతో మొదలవుతుంది.
He was upstairs in a bookstore. Twenty years old at the time, he had climbed a ladder set against a bookcase and was searching for the newly-arrived Western books: Maupassant, Baudelaire, Strindberg, Ibsen, Shaw, Tolstoy, Nietzsche, Verlaine, the Goncourt brothers, Dostoevsky, Hauptmann, Flaubert …
Life is not worth a single line of Baudelaire.
హెల్ స్క్రీన్ కథ నుండి,
After that, almost no one—at least not in the Horikawa mansion—spoke ill of Yoshihide. Perhaps this was because anyone who viewed the screen, no matter his accustomed loathing for the artist, was struck by the mysteriously solemn sentiment inspired by witnessing the mighty and wondrous tortures of Hell in all their manifest reality.
కురసోవా మాస్టర్ పీస్ 'రషోమాన్' పేరుతో తీసిన 'In a Grove' కథ గురించి తెలియని వారు అరుదు. ఈ వాక్యాలు అందులోవి.
Oh, come off it. Killing a man isn’t as difficult as you people seem to think it is. At any rate, if you want to rob a man of his woman, it’s only natural that you’re going to have to kill him. Only, when I do it, I do it with a sword. People like you don’t use swords. You gentlemen kill with power, with money, sometimes with words alone—all on the pretence of doing a man a favour. True enough, no blood is shed. He might even live well. But you’ve killed him all the same. It’s hard to say whose sin is greater—yours or mine. [An ironic smile.]
ది జనరల్ కథ నుండి,
Stendhal: Whenever I see a man decked in medals, I cannot help thinking how many cruelties he must have committed in order to be given such reward …
మడోన్నా ఇన్ బ్లాక్ కథ నుండి,
Take a look. Do you see the engraving? Desine fata deum flecti sperare precando … ‘Cease to hope that the decrees of Heaven can bend to prayer.’”
With an instinctive sense of fear, I beheld the Madonna—the very embodiment of fate. Clad in blackest ebony, she wore a look of eternal indifference, her beautiful ivory face crossed by a cruel smile tinged with malice.
"కాగ్ వీల్స్" నుండి,
“Great man”: this was the worst possible epithet anyone could have bestowed on me back then. I believed that I had committed all manner of sin, but still, whenever the opportunity arose, they went on calling me a “great man”. I couldn’t help but feel that I was somehow being mocked. By whom though? My affirmation of materialism did not allow such mysticism. Only a few months previously, I had written in a certain little niche magazine: “I have no artistic conscience; indeed, I have no conscience whatsoever. I have only nerves.”
Soon enough, I began to feel that anything and everything was a lie. Politics, industry, arts, science—all this seemed to me little more than a gaily coloured enamel concealing the true horror of human life.
“The Four Most Terrible Adversaries: Doubt, Fear, Arrogance, Lust”
As I sat there, staring at Napoleon, I thought of the works I had written. The first to drift into mind was “Words of a Dwarf” and its aphorisms—particularly the line, “Life is more hellish than Hell itself.” Then it was the fate of my artist Yoshihide, the protagonist of “Hell Screen”.
This mercurial change in attitude, from customary diffidence to sudden boldness, is one of my worse traits.
An hour later I found myself shut away in my room, seated at the desk in front of the window and making a start on a new story. My pen raced over the manuscript paper with a speed that I found quite astonishing, but after two or three hours it came to a halt, as though stayed by some invisible force. Having no other recourse, I stood up and began pacing about the room. It was at times like this that my megalomania was at its most extreme. In my savage joy, I felt that I had no parents, no wife or children, but only the life that gushed forth from my pen.
Not long after that, I was alarmed by the unexpected sight of a small white signboard hanging from the eaves of a shop. It was emblazoned with a trademark: an automobile tyre with wings. It made me think of the ancient Greek who placed his faith in artificial wings. He soared up high into the sky, until his wings were burnt by the sun and he went plunging into the ocean, where he drowned.
My only salvation now was sleep. But I didn’t have a single sleeping pill left. The grim prospect of more insomnia was utterly intolerable, but still, mustering a sort of desperate courage, I ordered coffee to be brought to the room and, like one demented, took up my pen. Two pages, five, seven, ten pages—the manuscript kept growing before my very eyes. I was filling the world of this novel with supernatural beasts, one of which was a self-portrait. But all of a sudden, fatigue began to cloud my head. At last I got up from the desk and lay down on the bed. I must have slept for forty or fifty minutes, when again I heard a voice whispering to me: “Le diable est mort.”
“To think, one minute you can be so detached from the world around, and the next, at the mercy of violent human passions …”
“To think, man can be virtuous one moment, and wicked the next.”