Saturday, March 18, 2023

Artist and the disease of Hero worship

చాలా కాలం క్రితం నా బ్లాగ్ ను ఏళ్ళ తరబడి శ్రద్ధగా చదువుతున్న మిత్రులొకరు, "మీ రీడింగ్ పాట్టర్న్స్ అర్థం కావడం లేదు నాకు". అన్నారు. నేను "ఎందుకంటే అక్కడ పాటర్న్ ఏమీ లేదు కాబట్టి " అన్నాను.

చిన్నప్పుడు అందరిలాగే పల్ప్ తో మొదలైన నా పఠనం అదృష్టవశాత్తూ అక్కడే ఆగిపోలేదు. ఏ ఒక్క మూసలోనూ ఇరుక్కోలేదు. పాత పేషంట్ కి డాక్టర్ కి ఉన్నంత అనుభవమూ ఉంటుందంటారు. ఈ కారణంగా రాయడం నా వొకేషన్ కాకపోయినా, రచనల క్వాలిటీ ఏమిటో చెప్పగల అనుభవం నాకు సహజంగానే చదవడం ద్వారా ఎంతో కొంత అబ్బిందనుకుంటాను. ఎవరైనా "మీరు ఎందుకు రాయరూ?" అని అడిగినా అదే చెప్తాను, "అద్భుతమైన రచనల రుచి బాగా తెలిసినదాన్నిగా అంతకంటే బాగా రాయలేనని నిస్సందేహంగా తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ప్రింట్ చెత్తలో మరికాస్త నా వంతు చెత్త కూడా కలిపే ఉద్దేశ్యం లేదు" అని.

Image Courtesy Google

ఇక సోషల్మీడియాలో ఏదైనా రచనో, సినిమానో బావుందనో,బాగాలేదనో  చెప్పినప్పుడో, లేదా ఏదైనా విషయం మీద మన అభిప్రాయం చెప్పినప్పుడో  వెంటనే, "మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ? అందరూ మేథావులే" అని ఆ "ఇంటెలెక్చువల్" అనే పదాన్ని ఘాటైన తిట్టులా వాడడం కూడా పరిపాటే.

"Where the mind is without fear and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls" 

అంటూ పసితనంలో ప్రియంగా పదే పదే పాడుకున్న రవీంద్ర గీతి 14 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోను. ఇన్నేళ్ళ చదువూ నాకేదన్నా నేర్పించింది అంటే అది మనిషి స్వేచ్ఛా జీవే గానీ సిద్ధాంతాలకూ, సంప్రదాయాలకూ, మాన్ మేడ్ గాడ్స్ కీ కట్టు బానిస కాదనీ, మెదడుకి స్వేచ్ఛని నేర్పించాలనీ, అన్ని రకాల అథారిటీలూ ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే యోగ్యత ఉన్నవి కావనీ మాత్రమే.

ఈరోజు మనం మళ్ళీ రాతియుగం వైపు ప్రయాణిస్తున్నట్లు ఒక రచయితనో, మరో కళాకారుణ్ణో ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టడమో, లేదా విగ్రహారాధన చేసినట్లు మెడలో దండేసి, దేవుణ్ణి చేసి కాళ్ళు కళ్ళకద్దుకోవడమో చెయ్యడం చూస్తున్నాం. నన్నడిగితే ఐడియలైజేషన్ లేదా హీరో వర్షిప్ మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి పట్టుకున్న దరిద్రం. మనకి మనిషిని మనిషిగా చూడడం చేతకాదు. వాళ్ళని దేవుళ్ళను చేసేస్తే గానీ నిద్రపట్టదు. కామూ అన్నదే మరో విధంగా, మనకి రెండే రెండు ఇష్టాలు, "ఒకటి ఫాలో అవ్వడం లేదా లీడ్ చెయ్యడం." మధ్యే మార్గం మనకి తెలీదు. 

ఇక్కడ ఇష్టం, ఆరాధన వరకూ పర్వాలేదు, కానీ అదొక ధృతరాష్ట్ర ప్రేమలా, గుడ్డి అనుసరణలానో, అబ్సెషన్ లానో తయారవుతోంది. తమకు నచ్చిన రచయితనో, రచయిత్రినో లేదా నటుడినో ఒక్క మాటనడానికి వీల్లేదు. వాళ్ళను అచ్చంగా దేవుళ్ళను చేసి మనం కొలిచినట్లే అందరూ కొలవాలనుకోవడం. "వాళ్ళు నా కళ్ళకు మామూలుగానే, మనుషుల్లానే కనబడుతున్నారు" అని ఎవరైనా అంటే," అబ్బే ఆ సినిమాను ఇలా మాత్రమే చూడాలి, లేదా ఈ పుస్తకాన్ని పవిత్ర గ్రంథంలా ఇలా మాత్రమే చదవాలి, నీకు చూడడం రాదు, బహుశా నీకు గుడ్డితనం ఉంది కావచ్చు" అనడం, మరికాస్త ముందుకెళ్ళి వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం. "No two people read the same book" అనే చిన్న విషయం అర్థం చేసుకోలేని మన గొప్ప గొప్ప చదువులెందుకు !! ప్రపంచాన్ని చూడడానికి ఎన్ని కళ్ళు ఉంటాయో అన్ని దృష్టి కోణాలు కూడా ఉంటాయన్న కనీస మానసిక పరిణితి లేని మన అనుభవమెందుకు !! ఆర్ట్ ఒక "ఇండివిడ్యుయల్ / పర్సనల్ ఎక్స్ప్రెషన్ " అనుకుంటే, ఆ ఆర్ట్ ని అర్థం చేసుకోవడం కూడా అంతే,  పూర్తిగా వ్యక్తిగతం. నేను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చదివిన రచనలు నా తర్వాతి తరానికి పరమ చెత్తలా అనిపించవచ్చు. తరాలను బట్టి అభిరుచులు కూడా  రూపాంతరం చెందుతూ ఉంటాయి. 

మనుషులం, ఋషులం కాదు కాబట్టి పోనీ మనకు నచ్చిన రచయితనో, రచయిత్రినో మన అభిమానం కొద్దీ దండేసి దణ్ణం పెట్టుకుందాం. మనిష్టం.  కానీ మనలాగే మరొకరు కూడా మోకరిల్లాలని ఆశించడం అపరిపక్వత క్రిందకి వస్తుంది. ఆర్ట్ కి పర్యాయపదమేదైనా ఉందంటే అది "స్వేచ్ఛ" అనుకుంటాను. కళారంగం మొదలు అన్ని చోట్లా తమ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళను ఆరాధించడం, అభిమానించడం, ఆదర్శంగా తీసుకోవడం మంచిదే. అది అవసరం కూడాను. కానీ ఉన్న దేవుళ్ళు చాలనట్లు మనుషుల్ని కూడా దేవుళ్ళను చేసి జీవితాంతం వారి కీర్తికి కాపుకాస్తున్నామనుకుంటూ వాళ్ళని  డిఫెండ్ చేసుకుంటూ అందరి మీదా బురద జల్లడంలో, భిన్నాభిప్రాయాల ప్రాతిపదికన శత్రుత్వాలు పెంచుకోవడంలో స్వేచ్ఛ లేదు. ఉన్నదల్లా కట్టు బానిసత్వమే.

Saturday, March 4, 2023

Foster / Small things like these - Claire Keegan

ఈ మధ్య  గ్రోవ్ ప్రెస్ర్ వారు 2022 లో పునర్ముద్రించిన ఐరిష్ రచయిత్రి క్లైర్ కీగన్ 'Foster' చదివాక ఆసక్తి అనిపించి ఆవిడ ఇతర రచనల కోసం ఆన్లైన్ లో వెతికితే క్లైర్ మరో రచన 'Small Things Like These' బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టు (2022) లో పోటీ చెయ్యడమే కాకుండా పొలిటికల్ ఫిక్షన్ విభాగంలో 'ఆర్వెల్ ప్రైజ్' కూడా గెలుచుకుందని తెలిసింది. తరువాత అది కూడా చదివాను. ఈ మధ్య సమకాలీన సాహిత్యం పెద్దగా రుచించడం లేదు, కానీ రూరల్ ఐరిష్ సంస్కృతిని ప్రతిబింబించే పాత వాసనలతో కూడిన క్లైర్ కీగన్ శైలి నాకు బాగా నచ్చింది.

Foster :

కథ చెప్పడమంటే కలాన్ని కుంచెగా చేసి రంగుల్లో ముంచి అక్షరాలతో అందమైన చిత్రాల్ని గీయడం లాంటిదే. పాఠకుల్లో ఏ భావోద్వేగాన్ని కలిగించడానికి ఏ వర్ణాన్ని ఎటువంటి మిశ్రమంగా చేసి వాడాలో క్లైర్ కీగన్ కు బాగా తెలుసునని 'ఫోస్టర్' చదివినప్పుడే అర్థమైంది. అక్కడక్కడా ఈ కథలో ఎంచుకున్న నేపథ్యం, సరళమైన వచనం లాంటివి కొంతకాలం క్రితం చదివిన అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ స్ట్రౌట్ (మై నేమ్ ఈజ్ లూసీ బార్టన్ ) ని గుర్తుకు తెచ్చాయి.

Image Courtesy Google

నేను చిన్నతనంలో చదివిన ఠాగోర్ 'పోస్ట్ మాస్టర్' అనే కథలో (సత్యజిత్ రే "తీన్ కన్య" సిరీస్లో ఇది కూడా ఒక కథ) ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ తన ఇంట్లో పనులు చేసి పెట్టే చిన్న పిల్ల రతన్ ను చేరదీసి రాయడం,చదవడం నేర్పిస్తాడు. అతడికి జ్వరం వచ్చినప్పుడు రతన్ దగ్గరుండి సపర్యలు చేస్తుంది. ఈ క్రమంలో పోస్ట్ మాస్టర్ తో అనుబంధం పెంచుకుంటుంది. ఈలోగా అతడికి వేరే ఊరికి బదిలీ అవుతుంది, అతడు ఈ విషయం చెప్పి రతన్ కు వెళ్తూ వెళ్తూ డబ్బులు ఇవ్వబోతాడు. రతన్ ఆ డబ్బు తీసుకోకుండా మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఈ కథలో రతన్ అనుభవించే 'sense of abandonment' పాఠకుల మనసుల్ని మెలితిప్పి వదిలిపెడుతుంది. 'ఫాస్టర్' కథ చదివినప్పుడు అచ్చంగా ఆ కథ చదివిన అనుభూతి గుర్తుకువచ్చింది. 

మరి 'ఫోస్టర్' కథలో విడిచిపెట్టడంతో మొదలయ్యే ప్రయాణం, చేరదీయడంతో ముగుస్తుందా లేదా అన్నది మిగతా కథ చదివి తెలుసుకోవాల్సిందే. ఐర్లాండ్ లోని Wexford లో జరిగే ఈ కథలో ఒక వేసవిలో తల్లి మేరీ కాన్పు సమయంలో 'పెటల్' అనే  చిన్నపిల్లను ఎడ్నా, కిన్సెల్లా అనే భార్యాభర్తల సంరక్షణలో వదిలేస్తారు. తల్లిదండ్రులకు దూరంగా ఆ కొత్త ప్రపంచంలోకి పెంపుడు కూతురుగా అడుగుపెట్టిన పెటల్ క్రమేపీ వారిద్దరూ పంచిచ్చిన ప్రేమతో కిన్సెల్లాను తండ్రికంటే మిన్నగా ఇష్టపడుతుంది. ఈ కథను పెటల్ దృష్టికోణం నుండే చెబుతారు.

The sun, at a slant now, throws a rippled version of how we look back at us. For a moment, I am afraid. I wait until I see myself not as I was when I arrived, looking like a tinker’s child, but as I am now, clean, in different clothes, with the woman behind me. I dip the ladle and bring it to my lips. This water is cool and clean as anything I have ever tasted: it tastes of my father leaving, of him never having been there, of having nothing after he was gone.

మరి పెటల్ తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెడుతుందా లేదా అన్నది మిగతా కథ. నిజానికి ఏ మాత్రం కొత్తదనం లేని ఈ కథలో ప్రత్యేకత ఏమిటంటే, కథలో సాదాసీదా పాత్రల మధ్య సంభాషణలు చాలా మామూలుగా జరుగుతున్నట్లున్నా, తన కథనంతో అంతర్లీనంగా ఒక మిస్టరీని సృష్టిస్తారు కీగన్. కథలో ఎవరూ ఏ విషయాన్నీ బహిర్గతం చెయ్యరు. ఏమీ చెప్పకుండానే ఎన్నో విషయాలను చెప్పినట్లుండే ఈ కథకు ముగింపు కూడా అలాగే ఉంటుంది. 

'Many’s the man lost much just because he missed a perfect opportunity to say nothing.’

దీనికి తోడు ఐరిష్ సంస్కృతినీ, యాసనూ, భాషనూ ఒడిసిపట్టుకుని కథను చెప్పడం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. నాకైతే ఏ బీబీసీ పీరియడ్ డ్రామానో అక్షరాల రూపంలో చూస్తున్న అనుభవం కలిగింది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు :

‘Where there’s a secret,’ she says, ‘there’s shame, and shame is something we can do without.’

Everything changes into something else, turns into some version of what it was before.

We fold my clothes and place them inside, along with the books we bought at Webb’s in Gorey: Heidi, What Katy Did Next, The Snow Queen.

-------------------------------------------------------------------------------------------

Small things like these :

ఇక మరో రచన "Small things like these" ఐర్లాండ్ నేపథ్యంలో రాసిన ఒక హిస్టారికల్ ఫిక్షన్ కథ. చరిత్ర చూస్తే మతం ముసుగులో క్యాథలిక్ చర్చ్ చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ఐర్లాండులో క్యాథలిక్ చర్చి ఆధిపత్యంలో  అనేక దుర్మార్గాలకు చిరునామాలైన "మాగ్డలెన్ లాండ్రీల" పేరిట స్త్రీల కోసం నడిపిన హోమ్స్ గురించిన విశేషాలు మానవత్వం సిగ్గుతో తల దించుకునేలా ఉంటాయి. 1922 లో మొదలైన ఈ హోమ్స్ లో 1996 లో చిట్టచివరి మాగ్డలెన్ లాండ్రీ మూతపడేదాకా ఈ దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్ళికి ముందే గర్భవతులైన అమ్మాయిలూ, చట్టవిరుద్ధమైన పనులు చేసిన వాళ్ళూ, నేరస్థులూ, సాంఘికంగా వెలివేతకు గురైన స్త్రీలను చిన్న పెద్దా తేడా లేకుండా ఈ హోమ్స్ చేరదీసేవి. వారి పేర్లు మార్చేసి, గుర్తింపు చిహ్నాలన్నిటినీ తుడిచేసి, జీతం భత్యం లేని కట్టుబానిసల్లా పగలూ రాత్రీ వెట్టి చాకిరీ చేయించేవి. ఆశ్రయం పేరిట ఆ ఎత్తైన గోడల వెనుక జరిగే హింస నాజీల కాన్సంట్రేషన్ క్యాంపులకు ఎంతమాత్రం తీసిపోదు. 

ఈ నరకకూపంలో చిక్కుకుపోయిన అనేక మంది స్త్రీలు తమ ప్రాణాల్ని కోల్పోయారు, ఎంతోమంది తమ బిడ్డల్ని కోల్పోయారు. ఈ హోమ్స్ గురించి ఆన్లైన్ లో లభ్యమయ్యే అనేక వ్యాసాలు చదివే కొద్దీ ఒళ్ళు గగుర్పొడిచింది. రికార్డుల్లో పదివేల మంది అన్నప్పటికీ సుమారు 30,000 మంది అనేది సరైన సంఖ్య కావచ్చు అంటారు క్లైర్. నిజానికి ఇవేమీ వెలుగులోకి రాకుండా ఆ రికార్డుల్ని నాశనం చేసి చరిత్ర పుటల్లోంచి ఆ పేజీల్ని చింపేశారు. 

[ Earlier this year, the Mother and Baby Home Commission Report found that nine thousand children died in just eighteen of the institutions investigated. In 2014, the historian Catherine Corless made public her shocking discovery that 796 babies died between 1925 and 1961 in the Tuam home, in County Galway. These institutions were run and financed by the Catholic Church in concert with the Irish State. No apology was issued by the Irish government over the Magdalen laundries until Taoiseach Enda Kenny did so in 2013.]

ఇక పుస్తకం కథ విషయానికి వస్తే , క్లైర్ ఇటువంటి ఒక అంశంపై కథను కూడా తన ఎస్తెటిక్స్ నూ, సున్నితత్వాన్నీ వదులుకోకుండా చెప్పడం ఈ రోజుల్లో కాస్త ఆశ్చర్యం, అద్భుతమూను. కథ మొదటి నుండీ చివరి పేజీ వరకూ క్లైర్ స్వరంలో సంతులనం కోల్పోని వాక్యం పాఠకుల్ని ఆపకుండా చదివిస్తుంది. పాఠకులకు పఠనానుభవానికి దూరం చెయ్యడం ఇష్టం లేదు కాబట్టి కథలోకి వెళ్ళడం లేదు కానీ ఈ కథకు ముగింపు నాకు చాలా నచ్చింది. సహజంగా దుర్మార్గాల గురించి ఎలుగెత్తి చెప్పే అనేక స్వరాలు వాటికి పరిష్కారాలు సూచించే దగ్గరకు వచ్చేసరికి హఠాత్తుగా మూగవైపోతాయి. దానికి భిన్నంగా "నా చిన్నిపొట్టకు శ్రీరామరక్ష" అనుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చివర్న Furlong తీసుకునే నిర్ణయం ఈ కథను మిగతా కథలకంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. మనిషై పుట్టాక సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించి, తన పరిధిలోనే తాను చెయ్యగలిగింది చెయ్యడం ఎంత గొప్ప విషయం ! చిన్న జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మరో జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయని రుజువు చేసిన "సామాన్యుడైన గొప్ప వ్యక్తి" Furlong కథను అందరూ చదివి తీరాల్సిందే. ఈ రెండు రచనలూ చదివాకా 1946 నాటి ఐరిష్ లాండ్స్కేప్ పాఠకుల్ని ఓ పట్టాన వదిలిపోదు.

In October there were yellow trees. Then the clocks went back the hour and the long November winds came in and blew, and stripped the trees bare. In the town of New Ross, chimneys threw out smoke which fell away and drifted off in hairy, drawn-out strings before dispersing along the quays, and soon the River Barrow, dark as stout, swelled up with rain.

ఈ పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు, 

Before long, he caught a hold of himself and concluded that nothing ever did happen again; to each was given days and chances which wouldn’t come back around. And wasn’t it sweet to be where you were and let it remind you of the past for once, despite the upset, instead of always looking on into the mechanics of the days and the trouble ahead, which might never come.

So many things had a way of looking finer, when they were not so close.

To get the best out of people, you must always treat them well, Mrs Wilson used to say.

He found himself asking was there any point in being alive without helping one another? Was it possible to carry on along through all the years, the decades, through an entire life, without once being brave enough to go against what was there and yet call yourself a Christian, and face yourself in the mirror?

He thought of Mrs Wilson, of her daily kindnesses, of how she had corrected and encouraged him, of the small things she had said and done and had refused to do and say and what she must have known, the things which, when added up, amounted to a life.

Monday, February 27, 2023

The Carrier Bag Theory of Fiction - Ursula K. Le Guin

నాటి నుండీ నేటి వరకూ సాంస్కృతిక ఆధిపత్యం అంతా పితృస్వామ్య వ్యవస్థ  చెప్పుచేతల్లోనే ఉంది. చరిత్ర లిఖించడం మొదలుపెట్టిన తొలినాళ్ళనుండీ దాన్ని ఒక తరంనుండి మరో తరానికి వంశపారంపర్య ఆస్తిగా బంగారు పళ్ళెంలో పెట్టి ముట్టచెబుతూనే ఉన్నారు. ఈ విధానాన్ని సాంస్కృతిక వారసత్వం పేరిట శిలాశాసనంగా భావించి తలొగ్గేవారి సంగతి ప్రక్కన పెడితే, ఎప్పుడూ "బిగ్ పిక్చర్" చూస్తూ తమకంటూ స్వంత ఆలోచనా, అభిప్రాయాలూ ఉన్నవాళ్ళు ఈ హెచ్చుతగ్గుల్నీ, వివక్షనూ తమ రచనల ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Image Courtesy Google

పితృస్వామ్యం నిర్దేశించిన చట్రం నుండి బయటపడి తమ రచనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో అమెరికన్ రచయిత్రి ఉర్సులా కె లెగైన్ కూడా ఒకరు. సాహిత్యంలో వివక్షలపై దృష్టి సారిస్తూ "The Carrier Bag Theory of Fiction" పేరిట ఆమె రాసిన ఈ  వ్యాసాన్ని ఆమె వ్యాసాల సంపుటి నుండి వేరు చేసి మరీ ప్రత్యేకమైన పుస్తకంగా పునర్ముద్రించారంటేనే ఆధునిక సాహిత్యంలో దీని ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది.

మనిషికి ఆహారంగా తొలుత అందుబాటులో ఉండేవి కందమూలాలు. నిజానికి ఆకులూ, దుంపలూ, పళ్ళూ వంటివి మాత్రమే మనిషికి ప్రకృతిలో ఆహారంగా కేటాయింపబడినవి. కానీ మనిషి స్వేచ్ఛాజీవే కాదు స్వార్థ జీవి కూడా. అతడికి ఉన్నదెప్పుడూ చాలదు, ఇంకా ఏదో కావాలి. ఒక సినీ కవి అన్నట్లు, అప్పటికీ, ఇప్పటికీ "మనిషి మారలేదూ, ఆతడి కాంక్ష తీరలేదు".

కానీ మనిషికి కందమూలాలు తిని బ్రతికేస్తే పనివేళలు తగ్గిపోతాయి. తోచింది చేసుకోడానికి చేతినిండా కావాల్సినంత సమయం మిగులుతుంది. కానీ అబ్బే, మనకది నచ్చదు. మనిషికి రుచులు అధికం, అందునా "జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ" అన్నారు. గొడ్డులా చాకిరీ చెయ్యాలి, మనిషన్నాకా ఏదో ఒకటి సాధించే తీరాలి. అందుకే మనిషికి నిరంతరం కొత్త కొత్త రుచులు కావాలి. అందుకే ఆదిమ మానవుడు గుహల్లోంచి బయటకొచ్చి తన జిహ్వను సంతృప్తి పరుచుకోడానికి వ్యవసాయం చేశాడు. అలా ఒకరోజు ఆహార సముపార్జన కోసం అరణ్యంలో సాగుచేసిన పొలాల్లో కాయకష్టం చేస్తుండగా ఉన్నట్లుండి ఒక పెద్ద సింహం కనబడింది. మనిషి దానితో వీరోచితంగా పోరాడి, తన బల్లెంతో దాన్ని మట్టుబెట్టి, చేత రక్తమోడుతున్న అదే ఆయుధం ధరించి, ఆహారంతో బాటు విజయగర్వంతో తన సమూహం వద్దకు తిరిగి వచ్చాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు తెచ్చిన ఆహరం అనుకుంటే పొరపాటే, ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు ఆహారంతో బాటుగా వెంటబెట్టుకుని తెచ్చిన "కథ". 

యుద్ధం, సాహసం, రక్తపాతం, హింస లాంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఆ కథను విని అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆ కథ ఒక చెవి నుంచి మరో చెవికి చేరింది, తీరాలు దాటింది. అతడు కథానాయకుడయ్యాడు. ఇక కథను విన్నవాళ్ళూ, చూసిన వాళ్ళూ, చిలవలు పలవలల్లి చెప్పిన మిగతా వాళ్ళంతా సహాయపాత్రల్లా ప్రాముఖ్యత లేకుండా మిగిలిపోయారు. కానీ ఈ వీరోచిత గాథనే ఏళ్ళ తరబడి అటు తిప్పి, ఇటు తిప్పి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఈ కథలో కథానాయకుడు ఒక్కడే. తరాలు మారే కొద్దీ ఒక కథానాయకుడి పీఠంలో మరొకరొచ్చి కూర్చుంటారు. ఇది సాంస్కృతిక వారసత్వంగా, పురుషుడి హక్కుగా మారింది.

నిజానికి అతడి కథలో అసలు కథానాయకి పాత్ర చాలా కాలం వరకూ లేనే లేదు. తరువాత మెల్లిగా తమ సౌకర్యార్థం ఆ పాత్రను కథ మధ్యలో ఇరికించారు. ఆ పాత్రకు కూడా వాళ్ళే పరిమితమైన సంభాషణలు రాశారు. కథానాయకి వాళ్ళు చెప్పిందే చిలక పలుకుల్లా చెప్పాలి. అంటే హీరో కథని "ప్రాపగాండా" చెయ్యడానికే హీరోయిన్ ఉనికి పరిమితం. ఇదే మౌల్డ్ లో పోతపోసినట్లున్న కథనే వినీ వినీ మనకి విసుగొచ్చింది. కొత్తగా చెప్పుకోడానికి ఇక కథలేమీ మిగలని పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఆ సమయంలో మరో కథా నాయకుడు / నాయకురాలు ? కోణం నుంచి కథలు చెప్పడం ఆరంభమైంది.

నిజానికి హీరో ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ఆమె కథ అతడి కథంత అడ్రినలిన్ రష్ ఇచ్చే కథ కాదు. ఆమె కథ సాదాసీదాగా ప్రేమ, దయ,  ఆదరణ, సేవ, సంతానోత్పత్తి, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి అతి సామాన్యమైన అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎటువంటి హింసా, రక్తపాతం, సంఘర్షణా లేని, సాహసగాథలు కాని, చెప్పకుండా వదిలేసినా ఇటువంటి కథలు మనకు మరిన్ని అవసరం. నిజానికి ఉర్సులా కథల్లో లింగవివక్ష  కనపడదు. నాకు తెలిసి స్త్రీ పురుష భేదాన్ని సమూలంగా చెరిపేస్తూ తన పాత్రలకి ఏ ఒక్క జెండర్ నూ ఆపాదించకుండా "The Left Hand of Darkness" వంటి రచనలు చేసిన సాహసం చేసిన ఒకే ఒక్క రచయిత్రి ఆమె. అందుకే అటు స్త్రీవాదం వైపు కూడా పూర్తిగా మొగ్గు చూపని ఆమె రచనలు ఇంతవరకూ పెద్దగా ప్రాముఖ్యతను నోచుకోలేదు.

ఇటువంటి వ్యాసాలు చదివాక ఎంతో మంది ఫెమినిస్టు రచయిత్రులు  ప్రముఖులుగా వెలుగొందగా, ఆవిడ పేరు ఆవిడ జీవించి ఉన్నకాలంలో పెద్దగా వినపడకపోవడానికి కారణం కూడా ఆవిడలో "పితృస్వామ్యానికి ప్రమాదికారిగా మారే భావజాలం" ప్రధాన కారణం అని అర్థమవుతుంది. ఈ డిస్కోర్స్ ఆధునిక సాహిత్యపు తీరుతెన్నుల్ని సమూలంగా మార్చగల అవకాశాలు మున్ముందు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

Monday, February 20, 2023

Novelist as a Vocation - Haruki Murakami

కొత్త రచయితలకు మాత్రమే ఇచ్చే అకుతాగవా ప్రైజుకు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి "used goods" అని ముద్ర వేయించుకున్నా, స్వదేశంలోనే సాహితీ ప్రపంచం మొత్తం ఏకమై ఆయన రచనలు సాహితీ విలువలకు సుదూరమైనవంటూ తూర్పారబట్టినా, "ఆకుతాగవా ప్రైజు గెలుచుకోడంలో మురాకమీ వైఫల్యానికి కారణాలు" వంటి ఛీసీ పేర్లతో కొందరు విమర్శకులు పుస్తకాలు రాసి పరిహసించినా ప్రఖ్యాత జపాన్ రచయిత హరుకి మురాకమీ మాత్రం తాను చెయ్యాలనుకున్నదే చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన పంథాలోనే రచనావ్యాసంగాన్ని కొనసాగించి బెస్ట్ సెల్లర్స్ రాసే నవలాకారుడిగా సొంత గడ్డైన జపాన్లోనే కాక అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించారు. ప్రతీ తరంలోనూ సాహితీ విలువల కొలమానాల్లో తూగగలిగిన రచనలు కొన్నైతే, ఆ నిర్ణీత కొలమానాలకు దూరంగా జనాదరణ పొందిన సాహిత్యంగా పాఠకుల అభిమానాన్ని చూరగొనేవి మరికొన్ని. తెలుగులో యద్దనపూడీ, ఆంగ్లంలో జేన్ ఆస్టెన్ వంటివారు అటువంటి రచనలే చేసి పాఠకుల మనసుల్లో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. మురాకమీ రచనలు కూడా అటువంటి కోవకే చెందుతాయి.  

Image Courtesy Google

మురాకమీ జపాన్ లోని క్యోటోలో మొదలై న్యూయార్క్ టైమ్స్ వరకూ సాగిన తన సాహితీ ప్రయాణాన్ని గురించి "Novelist as a Vocation" పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. కానీ ఒక స్థాయికి చేరుకున్నాకా వర్ధమాన రచయితలకు రాయడం విషయంలో సూచనలిచ్చే చాలామంది రచయితల్లా మురాకమీ ఈ పుస్తకంలో నవలలు ఎలా రాయాలో, ఎలా రాయకూడదో చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఒక నవలాకారునిగా ఆయన వ్యక్తిగత అనుభవాల సమాహారంగా రాసిన ఈ వ్యాసాలు యువ రచయితలకు దిశానిర్దేశం చేసే గైడ్ లా కంటే ఆయన రచయితగా ఎదిగే క్రమంలో ఎదుర్కున్న ఆటుపోట్లనూ, అనుభవాలను గురించే ఎక్కువ చెబుతాయి.

ఏ రంగంలో నైనా ఒక పోతపోసినట్లుండే శైలికి భిన్నంగా ఏది కనిపించినా ముందు తిరస్కారంతో కూడిన విమర్శలు వెల్లువెత్తడం సహజమే. సాహిత్యం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నిజానికి ఈ పోకడలూ ఈనాటివి కాదు. చిత్రకళా రంగంలో విన్సెన్ట్ వాన్ గో, క్యూబిజం శైలికి ఆద్యుడైన పాబ్లో పికాసో వంటి దిగ్గజాల పెయింటింగ్స్ ని తొలిసారిగా చూసిన కళాప్రియులు కూడా అప్పట్లో విస్తుపోయి పెదవి విరిచారంటారు. అదే విధంగా ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, Natsume Sōseki వంటివారి రచనలు నేడు నీరాజనాలందుకుంటున్నప్పటికీ, వారు కూడా తమ సమకాలీనులనుండి నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కున్నారు. అలనాటి సాంస్కృతిక మేథోవర్గం తీవ్రంగా విమర్శించిన వారి రచనలు నేడు ప్రామాణికమైనవిగా నిలబడడంలో ఎంతమాత్రమూ ఆశ్చర్యం లేదు. మురాకమీ కూడా తన రచనలు కాలగతికి ఎదురీది నిలబడతాయో లేదో భవిష్యత్తులో తన పాఠకులే చెప్పాలంటారు.

మురాకమీ రచయితగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్ళలో సాహితీ వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. "దీన్ని నవల అనలేం" అని కొందరూ, "ఇది సాహిత్యం కాదని" మరికొందరూ ఆయన రచనల్ని తరచూ  విమర్శించేవారు. కథలూ, నవలికలూ రాయడంలో కూడా తనదైన ప్రత్యేకమైన ముద్రను వేసినప్పటికీ ఎక్కువ నిడివి ఉన్న పెద్ద నవలలు రాయడాన్ని తన ప్రత్యేకతగా చెప్పుకుంటూనే, ఏ రచయితకైనా తానొక కళాకారుణ్ణని చెప్పుకోకపోవడం మనసుమీద నుండి పెద్ద గుదిబండ దింపుకోవడంతో సమానమంటారు. నిజానికి తానొక "ఆర్టిస్టుని" అనుకోకపోవడం వల్ల రచయితలపై వత్తిడి ఉండదు. ముఖ్యంగా రచయితలు తాము రచయితలని భావించుకోకపోవడంలో ఒకవిధమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచం వాళ్ళనెలా చూస్తుందనే దానితో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా కావాలంటే అలా చేసే స్వాతంత్య్రం ఉంటుంది. ఇటువంటి స్వేచ్ఛ సృజనాత్మకతలో కీలక పాత్ర పోషిస్తుంది. "వ్యవస్థ తన మార్గంలో తాను వెళ్తుంది, నేను నా మార్గంలో నా పని చేసుకుంటాను." అని ఆత్మవిశ్వాసంతో అనగలిగే మురాకమీ, ఎవరికీ జవాబుదారీ లేని విధంగా తనకు వీలైన షెడ్యూల్స్ ని బట్టి నచ్చినట్లు రాసుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండడం ఒక రచయితకు మిక్కిలి అవసరమంటారు.

"నవలలు రాయడమంటే నిజానికి నీ గురించి నీవు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పుకోవడం లాంటిదే. అందువల్ల ఒక రచయితగా రాయడం గురించి మాట్లాడడమంటే, నీ గురించి నువ్వు మాట్లాడడమే." అంటూ మురాకమీ ఒకవేళ తానొక రచయిత గనక కాకపోయుంటే తన ఉనికిని గుర్తించే ప్రత్యేకతలు తనలో ఏమీ లేవని అంటారు. భాష మీద పట్టూ, సృజనాత్మకత మినహా నవలాకారులవ్వడానికి ఎవరికైనా ప్రత్యేకార్హతలేవీ అవసరం లేదు కానీ మురాకమీ పరిశీలనలో బాగా తెలివైనవాళ్ళు నవలాకారులు కాలేరు. కొంత విద్య, కాసిన్ని తెలివితేటలూ, విభిన్న విషయాలపై అంతో ఇంతో జ్ఞానం రచయిత కావడానికి అవసరమే అయినా "నువ్వు తెలివైన వాడిననుకుంటున్నావా ?" అని ఎవరైనా అడిగితే, అవునని ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడానికి కష్టపడతానంటారాయన. "మీరొక ఊరిలో నడుస్తూ వెళ్తుంటే, నాలాంటి సాధారణ వ్యక్తులు మీకు అడుగడుక్కీ తారసపడతారు. వీళ్ళు నలుగురిలో ప్రత్యేకంగా నిలబడే వ్యక్తులు కాదు, తెలవారుతుండగా కాకా హోటళ్ళలో పరమ అశుభ్రంగా ఉండే టేబుల్స్ దగ్గర టీ తాగుతూ కూర్చునే మామూలు మనుషులు. ఒకవేళ నేను నవలలు రాయకపోయి ఉంటే బహుశా నా ఉనికిని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు." అనడం ఆయనలో ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే తత్వానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

కొంతమంది నవలాకారులు పత్రికల వాళ్ళో, ప్రచురణ సంస్థలో రాయమని కోరితే రాస్తారు. ఇది చాలామంది ప్రొఫెషనల్ రైటర్స్ సహజంగా చేసేదే. కానీ మురాకమీ ఒక పూర్తి స్థాయి రచయితగా నిలదొక్కుకునే వరకూ ఆ విధంగా రాయలేదని అంటారు. బహుశా ఆయనలాంటి వాళ్ళు ఈ  కాలంలో అరుదు కావచ్చు. బాల్యంలో అన్ని రకాల పుస్తకాలూ చదివినప్పటికీ ప్రత్యేకం రష్యన్ అనువాదాలంటే ప్రీతిగా ఉండేదని చెప్పుకునే మురాకమీ, తనకు ఆధునిక జాపనీస్ సాహిత్యం (సీరియస్ వెరైటీ) పట్ల ఎటువంటి అవగాహనా లేదని చెప్పడం గమనార్హం. నిజానికి మురాకమీ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో జాపనీస్ సాహిత్యం అంటే కావబాతా, తనిజాకి, మిషిమా వంటి వారి పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఈ రచనలు కూడా నిర్ణీత మేథోవర్గానికి చెందినవి కావడంతో వాటిని చదివే పాఠకవర్గం కూడా మితంగానే ఉండేది. అటువంటి సమయంలో సాధారణ పాఠకులు సైతం తమను తాము సులభంగా గుర్తుపట్టుకోగల పాత్రల రూపకల్పన చేసిన మురాకమీ వినూత్నమైన శైలి జపాన్ సాహిత్యంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

సమకాలీన జాపనీస్ సాహిత్యం చదవనందువల్ల తాను నవలలు రాయడం మొదలుపెట్టే సమయానికి జపాన్లో ఎటువంటి పుస్తకాలు రాసేవారో, ఎటువంటి సాహిత్యాన్ని జనం ఎక్కువగా ఆదరించేవారో తనకు తెలీదంటారు మురాకమీ. బహుశా ఈ అవగాహనాలేమే పొంతనలూ, పోటీతత్వాలకు దూరంగా నవలాకారుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన శైలిని తయారుచేసుకోవడంలో మార్గం సుగమం చేసిందనిపిస్తుంది. అందుకే, "నా వరకూ నేను ఇలా మాత్రమే రాయగలను, అందుకే అదే చేస్తాను." అంటారాయన. ప్రశంసలూ, విమర్శలకతీతంగా, వాస్తవానికి ఏ రచయితకైనా అనుకరణలకు దూరంగా తనదైన ప్రత్యేకమైన శైలీ ఉండడం ఎంతో అవసరమని ఒడిదుడుకుల మురాకమీ సాహితీ ప్రయాణం నిరూపిస్తుంది. ఈ విషయాలన్నీ పంచుకుంటున్నా మురాకమీ "నవలలు అంటే ఇలాగే రాయాలి" అని ఎక్కడా చెప్పిన దాఖలాల్లేవు. నిజమే కదా ! మనమో వందమంది నవలాకారుల్ని తీసుకుంటే, వందమంది వంద రకాలుగా రాయడం గమనిస్తాం.

ఫిక్షన్ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో మురాకమీ శైలిపై విమర్శలు ఏ స్థాయిలో వెల్లువెత్తేవంటే, చివరకు ఒక ప్రఖ్యాత విమర్శకుడు ఆయన్ని "కాన్ మాన్" అని అవమానించారట. అయినప్పటికీ దాన్ని కూడా మెచ్చుకోలుగానే తీసుకుంటానంటారు మురాకమీ. ఒక నవలాకారుడిగా పాఠకులకు కట్టు కథలు చెప్పి మభ్యపెట్టడాన్ని మించిన బాధ్యత మరొకటుంటుందా అన్నది ఆయన వాదన. అదే సమయంలో ఎంత సానుకూల ధోరణి అవలంబించినా ఇటువంటి  విమర్శలు చేదు మాత్రల్లా నిరుత్సాహపరుస్తాయి. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే పోలిష్ రచయిత హెర్బర్ట్ అన్నట్లు, "నీ లక్ష్యాన్ని చేరాలంటే ప్రవాహానికి ఎదురీదాలి. కేవలం చెత్త మాత్రమే ప్రవాహంతో బాటు వెళ్తుంది" అన్న మాటలు నిరాశ అలుముకున్న సందర్భాల్లో తన మీద ఎంతో ప్రభావం చూపించాయని చెప్పే మురాకమీ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక  నవలలు రాయడానికి విదేశాల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సంప్రదాయతకు పెద్ద పీట వేసే అనేక ఆసియా దేశాల్లాగానే జపాన్ లో కూడా అధిక శాతం జనాభాకు ప్రవాహానికి ఎదురీదే వాళ్ళంటే ద్వేషం ఉంటుందంటారు. ఈ కారణంగా జపాన్ లాంటి దేశాల్లో సాంస్కృతికపరమైన భారాన్ని మోస్తూ ముందుకు అడుగు వెయ్యడం కళాకారులకు పెనుసవాలుగా ఉండేది.

ఫిక్షన్ విషయంలోనే కాక నాన్ ఫిక్షన్ రాయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మురాకమీకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తన రచనలకు భిన్నంగా "టోక్యో సబ్వే గ్యాస్ ఎటాక్" నేపథ్యంలో "అండర్ గ్రౌండ్" ని ప్రచురించినప్పుడు ప్రొఫెషనల్ నాన్ ఫిక్షన్ రచయితల తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారాయన : “a display of ignorance of the basic rules of nonfiction”; “a tearjerker of the first order”; “the work of a dilettante.” లాంటి విమర్శనాస్త్రాలెన్నో.  "నిజానికి నాకు నాన్ ఫిక్షన్ రాసే ఉద్దేశ్యం లేదు. ఏ జానర్ నియమాలకూ లోబడని రచన చేద్దామని ప్రయత్నించాను. కానీ ఈ క్రమంలో 'నాన్ ఫిక్షన్ పవిత్ర స్థలాన్ని' పరిరక్షించే పులుల తోకల మీద తెలీకుండానే కాలేసి వాళ్ళకి కోపం తెప్పించానని" చిరునవ్వు నవ్వుతారాయన. కారణాలేవైనా ఒక రంగంలో నిష్ణాతులు ఆ రంగంలో కొత్తగా వచ్చినవారి పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సహజమే. ఆ అథారిటీ ఎంత శక్తిమంతంగా ఉంటే కొత్తవారిపై వ్యతిరేకత కూడా అంతే తీవ్రంగా ఉంటుంది.

కొన్ని వ్యాసాల్లో మనుషుల్నీ, మనస్తత్వాల్నీ చదవడంలో మురాకమీకి సహజంగా అబ్బిన నైపుణ్యం ఆయనపై వచ్చే విమర్శలకు సహేతుకమైన కారణాలు విశ్లేషించడంలోనూ కనిపిస్తుంది. ఆయన రచనలపై సదభిప్రాయం లేని వారి గురించి రాస్తూ, "నిజానికి చాలామంది విమర్శకులు రచనల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు, ఒకవేళ ఏదైనా నవలో, కథో అర్థమైనా దాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించడం వారికి చేత కాదు. సాధారణంగా ఇటువంటి విమర్శకుడు నవలాకారుడి కంటే చాలా తెలివైన వాడు, అతి వేగంగా పనిచేసే అతడి మెదడు మెల్లగా నడిచే వాహనమైన నవల వేగానికి సర్దుకోలేదు. ఈ కారణంగా వారు ఆ నవల మొత్తం వచనాన్ని తమ వేగానికి తగ్గట్లు చిన్న సారాంశంగా కుదించి అనువదించుకుని, దాన్ని బట్టే విమర్శను చేస్తారు. ఈ క్రమంలో నవలకు ప్రాణంపోసే ప్రాముఖ్యత కలిగిన వివరాలనూ, చిన్న చిన్న సంగతులనూ వదిలేస్తారు." అని చెప్పడంలో విమర్శకులే కాదు, పాఠకులు కూడా ఒక నవలను ఓపిగ్గా ఎలా చదవాలో, ఎలా చదవకూడదో చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. అందులోనూ నవలా ప్రక్రియ మెల్లిగా అంతరించిపోతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఆధునిక తరానికి ఈ సలహా అనుభూతి చెందడంలో వేగాన్ని తగ్గించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

మురాకమీ ఒక సందర్భంలో నవల రాయడాన్ని ఒంటరి ప్రయాణంతో పోలిస్తే మరోచోట  నవలాకారుడిగా మారే విధానాన్ని రెజ్లింగ్ రింగ్ లోకి ప్రవేశించడంతో పోలుస్తారు. ఆయన ఉద్దేశ్యంలో : "నవలదేముంది !! ఎవరైనా రాయగలరు." ఇలా అనడంలో ఆయనకు నవల రాయడాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపించదు. ఆయన దృష్టిలో అదొక పొగడ్త. తీవ్రమైన కృషీ, సాధనా అవసరమైన అనేక కళారూపాల కంటే ఇది సులభమని ఆయన భావన. అర్హతలూ, సర్టిఫికెట్లతో సంబంధం లేని నవలాకారుల ప్రపంచం ధైర్యంగా బరిలోకి దిగి కుస్తీకి సిద్ధపడ్డ ఎవరినైనా స్వాగతించే ప్రొఫెషనల్ రెజ్లింగ్ రింగ్ లాంటిది. ఆ రెస్లింగ్ రింగ్ చుట్టూ ఉండే తాళ్ళ మధ్య అంతరం ఎవరైనా అందులో ప్రవేశించడానికి అనువైనంత వెడల్పుగా ఉంటుంది. ఆ రింగ్ లోపలి వైశాల్యం కూడా ఎక్కువే. ఇక ఎవరినైనా అందులో ప్రవేశించకుండా ఆపడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉండరు, లోపల రిఫరీ బయటకి పొమ్మని మీ మీద అరవడు. అప్పటికే రింగ్ లోపల ఉన్న రెజ్లర్స్, అంటే ప్రసిద్ధ నవలాకారులు, "రావోయ్, సరదాగా ఒక పట్టు పడదాం"  అని మిమ్మల్ని కూడా రింగ్ లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. The ring is—how shall I put this?—an airy, easy, accommodating, altogether laid-back environment." అంటారు మురాకమీ. కానీ కంటికి కనిపించిన ఏ విషయంపైనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసేవాళ్ళు నవలాకారులుగా రాణించే అవకాశం తక్కువన్నది మురాకమీ భావన. అటువంటి వాళ్ళు రచయితలుగా కంటే పాత్రికేయులుగా, విమర్శకులుగా బాగా పనికొస్తారంటారు.

మురాకమీ తన వ్యాసాల్లో అనేక అంశాలను చర్చించగా, ముఖ్యంగా సాహితీ పురస్కారాల గురించీ, రచయితల శారీరక, మానసిక ఆరోగ్యం గురించీ విశ్లేషించిన అంశాలు పాఠకుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆయన అవార్డుల గురించి రాసిన వ్యాసంలో, ఎన్ని బెస్ట్ సెల్లర్స్ రాసినప్పటికీ సాహితీ విలువలు లేవంటూ మేథోవర్గం చేసిన విమర్శల కారణంగా తన రచనల్ని సాహితీ పురస్కారాలు వరించకపోవటం పట్ల మురాకమీలో కాస్త నిరాశతో కూడిన కోపం ఉన్నట్లు కనిపిస్తుంది. మురాకమీ కోవలోనే పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న పలు రచనలు చేసిన అమెరికన్-బ్రిటిష్ రచయిత రేమండ్ చాండ్లెర్ సైతం ఒక సందర్భంలో తనకు నోబెల్ బహుమతి రావకపోవడం పట్ల స్పందిస్తూ అప్పటికే నోబెల్ ను అనేకమంది సెకండ్ రేట్ రచయితలకి ఇచ్చిన కారణంగా దానికి వెలువ లేదనీ, అయినా ఆ ప్రైజు తీసుకోడానికి హుందాగా డ్రెస్ చేసుకుని, ప్రసంగం తయారుచేసుకుని మరీ స్వీడన్ వరకూ వెళ్ళేంత విలువ నోబెల్ కి లేదనీ వ్యంగ్యాస్త్రాలు విసిరారంటారు.

సాహితీ రంగంలో తన వ్యక్తిగతానుభవాల్ని ఒక్కొక్కటిగా విప్పి చెబుతూ "ఆర్టిస్టు" ల చుట్టూ ఉండే అనేక భ్రమల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు మురాకమీ. రచయితల్ని అందర్నీ ఒకే గాటన కట్టెయ్యకపోయినా, చాలా మంది నవలాకారులు నిజాయితీ, స్నేహపూర్వక స్వభావం కలిగిన వాళ్ళు కాదనీ, అందరూ అనుకున్నట్లు మంచి స్ఫూర్తినిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే వాళ్ళూ అంతకంటే కాదనీ అంటారు. మురాకమీ మాటల్లోనే చూస్తే  రచయితలు సహజంగా విపరీత స్వభావాలతో, విచిత్రమైన జీవన విధానాలతో, భిన్నమైన ప్రవర్తనలతో ఉంటారన్నది నిజమే అయినప్పటికే, "నా లెక్క ప్రకారం నాతో కలిపి 92% మంది రచయితలు మిగతా రచయితలందరూ తప్పు, నా దారే సరైన దారనే అప్రకటితమైన ఊహతో ఉంటారని" ఈ విమర్శలో సైతం తనను మినహాయించుకోకపోవడమే ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది.

మురాకమీ నవలలు ఎలా రాయాలో చెప్పకపోయినా, రచయితలు దీర్ఘకాలం పాటు రచనావ్యాసంగంలో కొనసాగడానికి మాత్రం వారి శారీరక,మానసికారోగ్యాల పై దృష్టి పెట్టడం చాలా అవసరమని పదేపదే సూచిస్తారు. రచయితలు  గంటల తరబడి కదలకుండా రాయడంలో నిమగ్నమైనప్పుడు క్రమేపీ వయసు పెరిగే కొద్దీ వారి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలుపెడుతుంది. దీనికి తోడు ఆర్టిస్టులందరూ క్రమశిక్షణ లేని జీవితాలు మాత్రమే గడుపుతారని వారి జీవన విధానాన్ని రొమాంటిసైజ్ చేస్తూ కనిపించే అనేక సాక్ష్యాలూ, ఊహాగానాలను సవాలు చేస్తూ తన దైనందిన జీవన విధానం గురించి కొన్ని విషయాలను పంచుకుంటారు. ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ, క్రమం తప్పకుండా రోజూ జాగింగ్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, ఖచ్చితమైన వేళలకు నిద్రపోయే తన జీవన విధానాన్ని గురించి పాఠకులకు తెలిస్తే ఒక రైటర్ గా తనను రొమాంటిసైజ్ చెయ్యడం మానేస్తారేమో అని హాస్యమాడతారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత ఆంథోనీ ట్రోల్లోప్ విషయంలో ఇటువంటిదే జరిగింది. మరణానంతరం ట్రోల్లోప్ క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి అంతవరకూ తెలియని వివరాలు తెలుసుకున్న యావత్ పాఠకలోకం నివ్వెరపోయిందట. మొజార్ట్, షూబర్ట్, పుష్కిన్, రిమ్బాడ్ , వాన్ గో వంటి ప్రాడిజీల మార్గంలో తక్కువకాలంలో ఒక వెలుగు వెలిగి నిష్క్రమించే ఉద్దేశ్యం ఉంటే తప్ప నవలాకారుడిగా సుదీర్ఘకాలంపాటు కొనసాగే ఉద్దేశ్యం ఉంటే మాత్రం పైన చెప్పిన సూచనలు పాటించడం తప్పనిసరంటారు మురాకమీ. నిజానికి ఒకటో రెండో నవలలు రాయడం కష్టమేమీ కాదు. కానీ అలా రాస్తూనే ఉండడం, రాయడాన్ని జీవనోపాధిగా మార్చుకోవడమే తన అనుభవంలో అత్యంత కష్టంతో కూడుకున్నపని అంటారు మురాకమీ. నలభై ఏళ్ళుగా ప్రొఫెషనల్ రచయితగా అనేక రచనలు చేసిన మురాకమీ ఈ హెర్క్యూలియన్ టాస్క్ ని సమర్ధవంతంగా పూర్తి చేసి యువ రచయితలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' 20 ఫిబ్రవరి 2023. 

https://www.andhrajyothy.com/2023/editorial/extremely-professional-1014523.html?fbclid=IwAR0igKR6Pk60WCgAzQrKdY0vVd_PodxrxOM-kUI4fHalVzOITE6FWriUi_c

విత్ లాగిన్ : https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=20/02/2023&pgid=365447

Wednesday, February 8, 2023

Love and Youth : Essential Stories - Ivan Turgenev

కొన్ని రోజులు ఫిలాసఫీలూ, సైకో ఎనాలిటిక్ విశ్లేషణలకు సెలవిచ్చి ఆడుతూ పాడుతూ "పుష్కిన్ ప్రెస్ ఫెస్టివల్" జరుపుకుంటున్నాను. మునుపు పుష్కిన్ ప్రెస్ ప్రచురణల్లో మార్సెల్ల్ ఐమీ, కాఫ్కా, ఆకుతాగవా కథలు చదివాను. ఇది నాలుగో కలెక్షన్. ఫిబ్రవరి కదా, కాస్త ఆహ్లాదకరమైన తేలికపాటి కథలేమన్నా చదువుదామని చూస్తే ఇవాన్ తుర్గేనెవ్ కథల పుస్తకం "లవ్ అండ్ యూత్" కనిపించింది. నాకు తుర్గెనెవ్ రచనలతో తొలిపరిచయం ఆయన నవలిక "ఫస్ట్ లవ్" తో జరిగింది. ఈ కథల సంపుటిలో మొట్టమొదటి కథే అది. ఇందులో మూడు ప్రేమ కథలతో బాటు 'Notes of a Hunter', 'A Sportsman's Sketches'  నుండి సంగ్రహించిన కొన్ని కథలూ, స్కెచెస్ ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటికంటే ఆకట్టుకున్న కథ మొదటిదే : 'ఫస్ట్ లవ్'. దాని గురించి మునుపు బ్లాగ్ లో రాశాను కాబట్టి మళ్ళీ ప్రస్తావించడం లేదు.

Image Courtesy Google

మిగతా కథల విషయానికొస్తే తుర్గెనెవ్ కథలన్నీ మంచి ల్యాండ్ స్కేప్ నేపథ్యంలో మొదలవుతాయి. కెంజాయ రంగులో మెరిసే ఆకాశం, అల్లంత దూరం వరకూ విస్తరించిన పచ్చిక మైదానాలూ, తుప్పలతో కూడిన చిక్కని అడవి దారులూ, మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ కురిసే చిరుజల్లుల జూలై వానలూ, ఇలా కథ మొదలు పెడుతూనే ప్రకృతి వర్ణనలు చదువుతున్నామంటే అది ఖచ్చితంగా తుర్గెనెవ్ అయ్యుండాలి అని ఆయన పేరు తెలీకుండా ఏ కథ చదివినా ఊహించడం సులభం.

Bezhin Meadow కథలో అడవిలో దారితప్పిన వేటగాడు ఆ రాత్రి గడపడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతుండగా, గుర్రాలను మేపడానికొచ్చిన 16 ఏళ్ళ లోపు వయసున్న ఐదుగురు కుర్రవాళ్ళు చలి కాచుకుంటూ కనిపిస్తారు. వారి అనుమతితో ఆ రాత్రి అక్కడే విశ్రమించిన కథానాయకుడు, ఆ యువకులు ఒక్కొక్కరూ చలిమంట చుట్టూ చేరి పొద్దుపుచ్చడానికి తమలో తాము చెప్పుకునే కథల్ని మనకు చెబుతూ ఉంటాడు. ఆ కథలో కథలన్నీ రష్యన్  జానపదాలని తలపించే పిట్టకథల్లా ఉంటాయి. వాస్తవాన్నీ, కల్పననూ చెరిపేస్తూ ఫాంటసీ, గాసిప్, హారర్ లాంటి అంశాలను జత చేసిన ఈ కథలు వారి ఊళ్ళో తెలిసిన మనుషుల మధ్య జరిగిన (?) అనేక సంఘటనల గురించి చిలవలు పలవలు అల్లి చెప్పుకునే కథల్లా అనిపిస్తాయి. 'పుస్తకం' పుట్టుకకు ముందు ఆ నోటా ఈ నోటా కథలెలా వ్యాప్తి చెందేవో తెలియాలంటే ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ కథ చిన్నప్పుడు చదివిన చందమామ కథల్ని గుర్తుకుతెచ్చింది. అలాగే Biryuk కూడా దారితప్పిన వేటగాడికి ఆశ్రయం ఇచ్చిన ఒక అటవీశాఖ అధికారి కథ. బిర్యుక్ అంటే "లోన్ వుల్ఫ్" అని అర్థం ఉందట. ఈ కథలో ప్రత్యేకం పాత్రల్ని మలిచిన తీరూ, వారి హావభావాల వర్ణనా కథకు ప్రాణం పోశాయి. తుర్గెనెవ్ కథనాన్ని రక్తి కట్టిస్తూ భావోద్వేగాలను పండించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక The Rattling, అడవి దారిలో దోపిడీ దొంగల భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గుర్రపు బగ్గీలో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు చివరకు తమ గమ్యాన్ని చేరారో లేదో చెప్పే కథ. తుర్గెనెవ్ వర్ణనల్లో ప్రత్యేకత ఏంటంటే, పాత్రలతో బాటు మనల్ని కూడా ఆ ప్రయాణంలో భాగస్వాముల్ని చేస్తారు. వాళ్ళు భయంతో వణికిపోతున్నప్పుడూ, మళ్ళీ తేరుకుని స్పృహలోకి వచ్చినప్పుడూ కూడా మనం వారి అనుభవాన్ని మనదిగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా పాఠకుల ఏకాగ్రతను కథమీద నుండి మళ్ళకుండా కథనంలో అలవోకగా కలిసిపోయి కోటగోడలా కాపుకాసే రష్యన్ లాండ్స్కేప్ కథకు తగిన పరిసరాల ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ఈ తరం కథల్లో ఏ నేపథ్యమూ, మూలాలూ లేని మొండి గోడల్లా నిలిచే పాత్రల్లోని డొల్లతనానికి కారణాలు కూడా ఇలాంటి కథలు చదివినప్పుడు అర్థమవుతుంది. ఆనాటి కథకూ, నేటి కథకూ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మనిషి ప్రకృతి నుండి పూర్తిగా విడిపోయి ఒంటరిగా మరో ప్రక్క నిలబడి చెప్తున్న కథలు నేటివి. ఇక 'ఫస్ట్ లవ్' తో బాటు ఇందులో ఉన్న మరో రెండు ప్రేమ కథలు 'The District Doctor', 'The Lover's Meeting'. మొదటిది తన పేషెంట్ తో ప్రేమలో పడే డాక్టర్ కథైతే, రెండోది అమాయకంగా ఒక యువకుణ్ణి నమ్మి మోసపోయిన యువతి  కథ.

ఈ కథలు ఆధునిక సమాజం అధికంగా చెప్పుకుంటున్న 'కడుపునిండిన కథలు' కావు. తాత్వికత, ఆధ్యాత్మికత అంతర్వాహినిగా ప్రవహించే వచనంతో కూడిన కథలు. వీటిల్లో పల్లె జీవుల సమస్యలూ, పామరుల సంఘర్షణలూ, వారి భ్రమలూ, భయాలూ, ఊహాగానాలూ, సామాన్యుల సాధకబాధకల్లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అదే సమయంలో అన్ని కథల్లోనూ జీవన చిత్రాన్ని చూపించే ప్రయత్నమే కనబడుతుంది. ఎక్కడా నీతులు చెప్పకుండా, భావజాలాల్ని ప్రోపగాండా చెయ్యకుండా అలనాటి రష్యన్ లాండ్స్కేప్ ని అందమైన చిత్రంలా గీసి మనిషిగా మనడానికి అవసరమయ్యే ప్రాముఖ్యతలేవో మనల్నే తేల్చుకోమని అక్కడితో తన పనైపోయిందని  చేతులు దులుపుకుంటారు తుర్గెనెవ్. :)

హ్యాపీ రీడింగ్. :) 

Monday, January 30, 2023

Recipe for reading a book

ముందుగా ఒక మెత్తని సౌకర్యవంతమైన కుర్చీనీ, దానికెదురుగా గట్టి చెక్కతో చేసిన బల్లనూ వేసుకోండి. ఇప్పుడు ఆ చెక్క బల్లపై చదవాలనుకుంటున్న పుస్తకాలను ఒకదానిపై ఒకటి బొత్తిగా పెట్టుకోండి. ప్రక్కనే కిటికీలుంటే వాటికి రంగురంగుల కర్టెన్లు గానీ, నర్సరీలో కొన్న మొక్కల్నీ గానీ వ్రేలాడదీసుకోండి. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎస్తెటిక్స్ మర్చిపోకూడదు. ప్రక్కన గోడకి మీరు చదవని వాళ్ళైనా పర్వాలేదు, ఓ నలుగురైదుగురు రచయితల ఫోటోలు పోస్టర్స్ అంటించుకోండి.

Copyright A Homemaker's Utopia

ఇప్పుడు పుస్తకం పేజీపై సగం వెలుగూ, మీ మొహంపై మిగతా సగం వెలుగూ పడే విధంగా రాత్రి వేళల్లో చదువుకోడానికి వీలుగా ఒక టేబుల్ లాంపును కూడా అమర్చుకోవడం మర్చిపోవద్దు. ఆ వెలుగు మీ తలలోకి వెళ్ళబోతున్న జ్ఞానానికి సూచన. ఒకవేళ మీకు కళ్ళజోడు లేకపోయినా పుస్తకం ప్రక్కన కళ్ళజోడు  పెట్టడం వల్ల "intellectual aura" క్రియేట్ అవుతుంది.

ఇప్పుడు ముందుగా ఏర్పాటుచేసుకున్న కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉంచి మెల్లగా కూర్చోండి. ఒకవేళ మీది వత్తుగా కొబ్బరి నూనె పెట్టుకున్న తలైతే గనుక, ప్లీజ్... దయచేసి ఆ రీడింగ్ చైర్ కి మీ నూనె జిడ్డు అంటించకుండా తల దగ్గర ఏదైనా వేసుకోండి. ఇప్పుడు పుస్తకం పేజీలు ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టండి. ప్రక్కనే చల్లారిపోయిన కాఫీ కప్పు గురించి మర్చిపోండి.

చెయ్యవలసిన పనులు చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు చదువుతున్నప్పుడు చెయ్యకూడని పనులేమిటో కూడా చూద్దాం. తలను అటూ ఇటూ తిప్పుతూ వంట గదిలో స్టవ్ మీద పెట్టి మర్చిపోయిన కూర మూకుళ్ళ గురించీ, లివింగ్ రూమ్ లో కట్టకుండా వదిలేసిన ఫ్యాన్ గురించీ, పిల్లాడు స్నానం చేసి తుడుచుకుని మంచం మీద ఆరెయ్యకుండా పడేసిన టవల్ గురించీ, అయ్యవారు మెయిన్ డోర్ గుమ్మం దగ్గరే విప్పి పడేసిన సాక్స్ గురించీ, ముందురోజు binge watch చేస్తూ సగంలో వదిలేసిన కొరియన్ డ్రామాలో హీరోయిన్ ఉద్యోగం గురించీ ఆలోచిస్తూ ఫ్రస్ట్రేషన్ తో ప్రక్క చూపులు చూస్తే మీ చదువు ఒఖ్ఖ పేజీ కూడా ముందుకు సాగదని గుర్తుపెట్టుకోండి. కూర మాడిపోయినా, కరెంటు బిల్లు పెరిగిపోయినా, తువ్వాలు దండానికి బదులు మంచం మీదే ఆరేసినా, సాక్సులు అక్కడే పడున్నా, చివరకు భూకంపం వచ్చి మీ కుర్చీ ప్రక్కన భూమి బీటలు వారినా సరే, మీరు మాత్రం చలించకుండా కార్యదీక్షలో మడమ తిప్పని యోధుల్లా పేజీలు తిప్పుతూనే ఉండాలి. ఈ చిట్కాలు గుర్తుపెట్టుకోండి.

"Truth is stranger than fiction" అంటారు కదా ! :)

ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. :))

ఇంస్టాగ్రాముల్లో చూపించినట్లు అధికశాతం చదువు కాఫీ షాపులూ, రీడింగ్  నుక్స్ లోనూ కంటే మిత్రులు అన్నట్లు మంచాలూ / దివాన్ కాట్స్ మీదా, బాల్కనీల్లోనూ, కిచెన్ కౌంటర్ల దగ్గరా, బస్సు /రైల్వే / ఎయిర్పోర్ట్ / హాస్పిటల్ లాంటి వెయిటింగ్ స్పేసేస్ లోనూ, చెట్ల క్రిందా, కారులో వెయిటింగ్ సమయంలోనే ఎక్కువ జరుగుతుంది. పిల్లల్ని పెంచడం, పుస్తకాలు చదవడంలాంటి వాటికి రెసిపీలేమీ ఉండవు. నాకైతే తెలీదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. :)

ఏంటి, చివరిదాకా చదివారా ? అయితే Sorry !! :)))

One-way street - Walter Benjamin

సహజంగా ప్రోజ్ పీసెస్ లాంటివి రాసినప్పుడు కూడా రచయితలు వచనంలో ఒక ఏదో ఒక ఉమ్మడి అంశాన్ని ప్రధానంగా చేసుకుని రాయడం చూస్తుంటాం. రాసినవి చిన్న చిన్న పేరాగ్రాఫులైనా కూడా వాటిక్కూడా ఎంతోకొంత ఆకార స్వరూపాలుంటాయి. అవి ఒక ప్రాంతమో, భావోద్వేగమో, తత్వమో, హేతువో, శాస్త్రమో ఇలా ఏదైనా  కావచ్చు. కానీ మల్లెచెండులో పువ్వుల్ని తెంపేసి ఇష్టం వచ్చినట్లు వెదజల్లేసినట్లుండే వచనం రాయడంలో సిద్ధహస్తులు జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకులు వాల్టర్ బెంజమిన్. మునుపు కూడా ఆయన రచనలతో పరిచయం ఉంది కాబట్టి ఇదేదో అనువాద సమస్య మాత్రమే కావచ్చనిపించలేదు.

Image Courtesy Google

ఈ విషయంలో వాల్టర్ బెంజమిన్ అభిమాని సుసాన్ సోంటాగ్ వచనం కూడా పొందిగ్గా రాసిన ఉత్తరాన్ని చింపి పీలికలు చేసిపారేసి తిరిగి అతికించినట్లు ఉండటంలో వింతేమీ లేదు. కాల్పనిక ప్రపంచపు దారితెన్నులు అంత సుస్పష్టంగా తెల్సిన ఇలాంటివాళ్ళు సృజన విషయంలో మాత్రం ఎందుకు విఫలమవుతారా అనిపించేది. దానికి కారణం వారి తీక్షణమైన హేతువాద తాత్విక దృక్కోణమేననిపిస్తుంది. ఆ హేతువాదపు తీవ్రత "వన్ వే స్ట్రీట్" లాంటి రచనల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, వాక్యాలకు దిశానిర్దేశం చెయ్యడంలో, వాక్యనిర్మాణాన్ని క్రమబద్దీకరించడంలో బెంజమిన్ వైఫల్యం పలు వ్యాసాల్లో సుస్పష్టం. ఎటొచ్చీ ఈ పుస్తకంలో ఆ వైఫల్యం పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయనిపించింది. ఈ పుస్తకంలో వచనానికి బెకెట్ ఫిక్షన్ కూ "form" విషయంలో అనేక సారూప్యతలున్నాయి. ఇందులో వచనం కూడా నిరాకారమైనది (Formless). ఒక దారివెంట ప్రయాణించే వ్యక్తి ఆ దారిలో కంటికి కనిపించిన విషయాలకు తన వ్యక్తిగత దృక్కోణంతో బాటు హేతువాద, రాజకీయ, సామజిక, సాంస్కృతిక అధ్యయనాలను జోడించి విశ్లేషణలు చేసి రాస్తే ఇటువంటి ఒక పుస్తకం తయారవుతుంది. ఇందులో ప్రస్తావించిన అనేక రాజకీయ సాంస్కృతిక అంశాల్లో పాఠకులు ఐడెంటిఫై చేసుకోగల విశ్వజనీనత లోపించడం వల్ల ఈ రచనను పాఠకులు "own" చేసుకోవడం ఒకింత కష్టం.

కానీ ఈ పుస్తకం కూడా మునుపు చదివిన బెంజమిన్ పుస్తకాలూ, వ్యాసాలూ చదివినట్లే ఆసక్తికరంగా ఉంటుందని అపోహపడ్డ నాకు తీవ్ర నిరాశే ఎదురైంది. మునుపు చదివిన NYRB ప్రచురణ "ది స్టోరీ టెల్లర్ ఎస్సేస్" లో సాహితీ వ్యాసాలు సింహభాగం కావడం వల్ల అది ఎంతో నచ్చింది. ఈ రచనలో  కలగూరగంపలా విభిన్న అంశాలను కలిపి రాశారు. ఏదేమైనా, రాసేది చిన్న వ్యాసమైనా కూడా పాఠకుల చేత చదివించే గుణం ఉండాలి. అది ఇందులో పూర్తిగా శూన్యం. బెంజమిన్ తన ఆలోచనలకు అక్షర రూపమిచ్చే క్రమంలో అర్భక పాఠకులను ఏమాత్రం దృష్టిలో పెట్టుకున్నట్లు అనిపించదు. నిజానికి పాఠకులపై కొద్దిపాటి గౌరవం కూడా ఉన్నట్లనిపించదు. ఇక చదివేవాళ్ళ సంగతి అటుంచితే, కొన్ని కొన్ని చోట్ల "మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా సారూ ? " అని నిలబెట్టి అడిగి కడిగెయ్యాలనిపిస్తుంది. :) ఈ రచన ఆయన సాహితీ ప్రతిభకు (Literary Virtuoso) మచ్చు తునక అనేవాళ్ళ పట్ల కూడా కాస్త అపనమ్మకం కలుగుతుంది. "మీ 'లిటరరీ మెరిట్' తూనిక రాళ్ళేవో మాలాంటి అజ్ఞానులకి ఓసారి చూపించరూ ?" అని ప్రాథేయపడాలనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం బెకెట్ "వెయిటింగ్ ఫర్ గోడోట్" చదివి బుర్రగోక్కున్న చందంగానే ఉంది ఈ రచన కూడా. మళ్ళీ ఏమన్నా అంటే ఈ రచయితలందరూ, "రసపట్టులో తర్కం కూడదంటారు." పుస్తకం మొదట్నుంచీ చివరి వరకూ పొల్లుపోకుండా ఓపిగ్గా చదవడం పూర్తి చేశాక కూడా, ఇంతకూ ఏం చదివాను అనుకుంటే, చెల్లాచెదురుగా విసిరిపడేసిన భావాలను ఏరుకోవడంతోనే సరిపోయింది. వాటిని మాలగా గుదిగుచ్చడం కూడా వృథా ప్రయత్నమే. 

నిజానికి ఆయన ఈ పుస్తకం మధ్యలో పాఠకులకు చెప్పీ చెప్పనట్లు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. అదేమిటంటే,

"A witty Frenchman has said: “A German seldom understands himself. If he has once understood himself, he will not say so. If he says so, he will not make himself understood.”

పుస్తకం చదవడం పూర్తి చేశాక, ఆ ఫ్రెంచ్ మాన్ ఎవరో గానీ నిజంగా దేవుడు అనుకోకుండా ఉండలేం. :) 

నాకు అర్థంకాని ప్రతీదాన్నీ ద్వేషించే అలవాటు నాకు లేదు కాబట్టి, బెకెట్ శైలి కూడా కొంతకాలానికి అర్థమైనట్లే ఈ బెంజమిన్ రచనలో కూడా నా అవగాహనకు మించిన కొన్ని అంశాలను మరికొంతకాలం తరువాత మరోసారి చదవవలసిన అవసరం ఉందని అనుకుంటూ, హ్యాపీ రీడింగ్. :) 

పుస్తకం నుండి ఏరుకున్న బెంజమిన్ మార్కు తర్కంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు,

Construction Site :

It is folly to brood pedantically over the production of objects—visual aids, toys, or books—that are supposed to be suitable for children. Since the Enlightenment, this has been one of the mustiest speculations of the pedagogues. Their infatuation with psychology keeps them from perceiving that the world is full of the most unrivaled objects for children’s attention and use. And the most specific. For children are particularly fond of haunting any site where things are being visibly worked on. They are irresistibly drawn by the detritus generated by building, gardening, housework, tailoring, or carpentry. In waste products they recognize the face that the world of things turns directly and solely to them. In using these things, they do not so much imitate the works of adults as bring together, in the artifact produced in play, materials of widely differing kinds in a new, intuitive relationship. Children thus produce their own small world of things within the greater one. The norms of this small world must be kept in mind if one wishes to create things specially for children, rather than let one’s adult activity, through its requisites and instruments, find its own way to them.

Ministry of the Interior :

The more antagonistic a person is toward the traditional order, the more inexorably he will subject his private life to the norms that he wishes to elevate as legislators of a future society. It is as if these laws, nowhere yet realized, placed him under obligation to enact them in advance, at least in the confines of his own existence. In contrast, the man who knows himself to be in accord with the most ancient heritage of his class or nation will sometimes bring his private life into ostentatious contrast to the maxims that he unrelentingly asserts in public, secretly approving his own behavior, without the slightest qualms, as the most conclusive proof of the unshakable authority of the principles he puts on display. Thus are distinguished the types of the anarcho-socialist and the conservative politician.

Flag …How much more easily the leave-taker is loved! For the flame burns more purely for those vanishing in the distance, fueled by the fleeting scrap of material waving from the ship or railway window. Separation penetrates the disappearing person like a pigment and steeps him in gentle radiance.

Noble indifference to the spheres of wealth and poverty has quite forsaken manufactured things. Each thing stamps its owner, leaving him only the choice of appearing a starveling or a racketeer. For although even true luxury can be permeated by intellect and conviviality and so forgotten, the luxury goods swaggering before us now parade such brazen solidity that all the mind’s shafts break harmlessly on their surface.

Caution: Steps :

Work on good prose has three steps: a musical stage when it is composed, an architectonic one when it is built, and a textile one when it is woven.

అయినా పుస్తకాలను కేటలాగ్ లాగా రాయడమేంటి స్వామీ !!! సాహిత్యంలో మనం హిస్టారికల్ రికార్డు రాయడం లేదేమో కదా !!! ఆ పని "చరిత్రకారులకు" వదిలేద్దాం.

The typical work of modern scholarship is intended to be read like a catalogue. But when shall we actually write books like catalogues? If the deficient content were thus to determine the outward form, an excellent piece of writing would result, in which the value of opinions would be marked without their being thereby put on sale.

రచయితల టెక్నిక్ కు 13 ప్రతిపాదనలు : 

I.  Anyone intending to embark on a major work should be lenient with himself and, having completed a stint, deny himself nothing that will not prejudice the next.

II.  Talk about what you have written, by all means, but do not read from it while the work is in progress. Every gratification procured in this way will slacken your tempo. If this regime is followed, the growing desire to communicate will become in the end a motor for completion.

III.  In your working conditions, avoid everyday mediocrity. Semi-relaxation, to a background of insipid sounds, is degrading. On the other hand, accompaniment by an étude or a cacophony of voices can become as significant for work as the perceptible silence of the night. If the latter sharpens the inner ear, the former acts as touchstone for a diction ample enough to bury even the most wayward sounds.

IV.  Avoid haphazard writing materials. A pedantic adherence to certain papers, pens, inks is beneficial. No luxury, but an abundance of these utensils is indispensable.

V.  Let no thought pass incognito, and keep your notebook as strictly as the authorities keep their register of aliens.

VI.  Keep your pen aloof from inspiration, which it will then attract with magnetic power. The more circumspectly you delay writing down an idea, the more maturely developed it will be on surrendering itself. Speech conquers thought, but writing commands it.

VII.  Never stop writing because you have run out of ideas. Literary honor requires that one break off only at an appointed moment (a mealtime, a meeting) or at the end of the work.

VIII.  Fill the lacunae in your inspiration by tidily copying out what you have already written. Intuition will awaken in the process.

IX.  Nulla dies sine linea7—but there may well be weeks.

X.  Consider no work perfect over which you have not once sat from evening to broad daylight.

XI.  Do not write the conclusion of a work in your familiar study. You would not find the necessary courage there.

XII.  Stages of composition: idea—style—writing. The value of the fair copy is that in producing it you confine attention to calligraphy. The idea kills inspiration; style fetters the idea; writing pays off style.

XIII.  The work is the death mask of its conception.

విమర్శకుల టెక్నిక్ కు 13 ప్రతిపాదనలు :

THE CRITIC’S TECHNIQUE IN THIRTEEN THESES

I.  The critic is the strategist in the literary struggle.

II.  He who cannot take sides must keep silent.

III.  The critic has nothing in common with the interpreter of past cultural epochs.

IV.  Criticism must speak the language of artists. For the concepts of the cénacle are slogans. And only in slogans is the battle-cry heard.

V.  “Objectivity” must always be sacrificed to partisanship, if the cause fought for merits this.

VI.  Criticism is a moral question. If Goethe misjudged Hölderlin and Kleist, Beethoven and Jean Paul,8 his morality and not his artistic discernment was at fault.

VII.  For the critic, his colleagues are the higher authority. Not the public. Still less, posterity.

VIII.  Posterity forgets or acclaims. Only the critic judges in the presence of the author.

IX.  Polemics mean to destroy a book using a few of its sentences. The less it has been studied, the better. Only he who can destroy can criticize.

X.  Genuine polemics approach a book as lovingly as a cannibal spices a baby.

XI.  Artistic enthusiasm is alien to the critic. In his hand, the artwork is the shining sword in the battle of minds.

XII.  The art of the critic in a nutshell: to coin slogans without betraying ideas. The slogans of an inadequate criticism peddle ideas to fashion.

XIII.  The public must always be proved wrong, yet always feel represented by the critic.

[The tight-folded book, virginal still, awaiting the sacrifice that bloodied the red edges of earlier volumes; the insertion of a weapon, or paper-knife, to effect the taking of possession.]

—Stéphane Mallarmé

 పుస్తకాల గురించి ఇటువంటి పోలిక మునుపు ముందూ వినలేదు. :)

Books and harlots: both have their type of man, who lives off them as well as harasses them. In the case of books, critics.

Books and harlots: “Old hypocrites—young whores.” How many books that were once notorious now serve as instruction for youth!

ప్రేమ గురించి అవీ, ఇవీ :

Pocket diary.—Few things are more characteristic of the Nordic man than that, when in love, he must above all and at all costs be alone with himself—must first contemplate, enjoy his feeling in solitude—before going to the woman to declare it.

To be happy is to be able to become aware of oneself without fright.

Relief.—One is with the woman one loves, speaks with her. Then, weeks or months later, separated from her, one thinks again of what was talked of then. And now the motif seems banal, tawdry, shallow, and one realizes that it was she alone, bending low over it with love, who shaded and sheltered it before us, so that the thought was alive in all its folds and crevices like a relief. Alone, as now, we see it lie flat, bereft of comfort and shadow, in the light of our knowledge.

Nothing is poorer than a truth expressed as it was thought.

The killing of a criminal can be moral—but never its legitimation.

The only way of knowing a person is to love that person without hope.

Geranium.—Two people who are in love are attached above all else to their names.

Carthusian carnation.—To the lover, the loved one appears always as solitary.

Cactus bloom.—The truly loving person delights in finding the beloved, arguing, in the wrong.

కళారంగంలో "ప్రకటన" (అడ్వర్టైజ్మెమెంట్) ప్రాతిపదికన జరుగుతున్న  వ్యాపారంలో "విమర్శ" స్థానాన్ని వివరిస్తూ,

Fools lament the decay of criticism. For its day is long past. Criticism is a matter of correct distancing. It was at home in a world where perspectives and prospects counted and where it was still possible to adopt a standpoint.

Now things press too urgently on human society. The “unclouded,” “innocent” eye has become a lie, perhaps the whole naive mode of expression sheer incompetence. Today the most real, mercantile gaze into the heart of things is the advertisement. It tears down the stage upon which contemplation moved, and all but hits us between the eyes with things as a car, growing to gigantic proportions, careens at us out of a film screen.

And just as the film does not present furniture and façades in completed forms for critical inspection, their insistent, jerky nearness alone being sensational, the genuine advertisement hurls things at us with the tempo of a good film. Thereby “matter-of-factness” is finally dispatched, and in the face of the huge images spread across the walls of houses, where toothpaste and cosmetics lie handy for giants, sentimentality is restored to health and liberated in American style, just as people whom nothing moves or touches any longer are taught to cry again by films. For the man in the street, however, it is money that affects him in this way, brings him into perceived contact with things. And the paid reviewer, manipulating paintings in the dealer’s exhibition room, knows more important if not better things about them than the art lover viewing them in the gallery window.

What, in the end, makes advertisements so superior to criticism? Not what the moving red neon sign says—but the fiery pool reflecting it in the asphalt.

ఈ పుస్తకంలో ప్రచురణకర్తకూ, రచయితకూ మధ్య జరిగే ఈ సంభాషణ 'కళ' పట్ల బెంజమిన్ భావాలను వెల్లడి చేస్తాయి.

Publisher: My expectations have been most rudely disappointed. Your work makes no impression on the public; you do not have the slightest drawing power. And I have spared no expense. I have incurred advertising costs.—You know how highly I think of you, despite all this. But you cannot hold it against me if even I now have to listen to my commercial conscience. If there is anyone who does what he can for authors, I am he. But, after all, I also have a wife and children to look after. I do not mean, of course, that I hold you accountable for the losses of the past years. But a bitter feeling of disappointment will remain. I regret that I am at present absolutely unable to support you further.

Author: Sir, why did you become a publisher? We shall have the answer by return mail. But permit me to say one thing in advance. I figure in your records as number 27. You have published five of my books; in other words, you have put your money five times on number 27. I am sorry that number 27 did not prove a winner. Incidentally, you took only coupled bets. Only because I come next to your lucky number 28.—Now you know why you became a publisher. You might just as well have entered an honest profession, like your esteemed father. But never a thought for the morrow—such is youth. Continue to indulge your habits. But avoid posing as an honest businessman. Don’t feign innocence when you’ve gambled everything away; don’t talk about your eight-hour workday, or your nights, when you hardly get any rest. “Truth and fidelity before all else, my child.” And don’t start making scenes with your numbers! Otherwise you’ll be thrown out.