బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ రైటర్స్ లో హెచ్.జి.వేల్స్ తరువాత ప్రముఖంగా వినబడే పేరు జాన్ విండమ్ ది..ఆయన రచనల్ని చదవాలనే కోరిక ఎట్టకేలకు నెరవేరింది..విండమ్ రాసిన 'ఛోకీ' (NYRB ) చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా అనుకోకుండా 'మీటియోర్ అండ్ అదర్ స్టోరీస్' తో ఆయన రచనలు చదవడం మొదలుపెట్టాను..'ఆక్స్ఫర్డ్ బుక్ వార్మ్స్ లైబ్రరీ' వారు ప్రచురించిన స్పెక్యులేటివ్ ఫిక్షన్ కు చెందిన ఈ పుస్తకంలో మరీ చిన్నవీ,మరీ పెద్దవీ కానీ నాలుగు కథలుంటాయి.
Image Courtesy Google |
విశ్వంలో పుట్టిన అన్ని జీవుల్లోనూ ఉమ్మడిగా ఉండే ఒక లక్షణం 'తమ ఉనికిని కాపాడుకోవడం'..ఏ గ్రహానికి చెందిన జీవులైనా,క్రిమికీటకాలైనా,ఇతర జంతుజాలమేదైనా సరే తన సర్వైవల్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది..నిజానికి భూమి మీద సహజవనరులన్నీ క్షయమైపోతే,మనకు కూడా నివాసయోగ్యమైన ఇతర గ్రహాలవైపు చూడక తప్పదు..మానవజాతి అంతరించిపోకుండా 'మంగళయాన్' ద్వారా ఇప్పుడు మార్స్ పై జరిపే పరిశోధనలన్నీ ఆ దిశగా జరుగుతున్నవే..మరి ఇతర గ్రహాలకు చెందిన జీవులు కూడా మనలాగే ఆలోచిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే దిశగా రాసిన కథే 'Meteor'..గ్రహాంతరవాసులు తమ గ్రహం నివాసయోగ్యం కాకుండా నాశనమైపోతున్నదని గమనించి తమ ఉనికిని కాపాడుకోడానికి ఇతర గ్రహాలకు ప్రయాణమవుతారు..అలా ఒక ఉల్క భూగ్రహాన్ని చేరుతుంది..కానీ అందులో జీవులకు భూగ్రహం అడుగడుక్కీ పొంచి ఉన్న ప్రమాదాలతో, వినాశనకారిగా కనిపిస్తుంది..అయినప్పటికీ అవి "We pray to God that beyond the tunnels we shall find a world that is not mad and evil like this one. Is it too much we ask - simply to live, to work, and to build, in peace…?" అనుకుంటూ భూగ్రహంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంటాయి..మరో ప్రక్క ఆ ఉల్కను పరిశీలిస్తున్న భూగ్రహ శాస్త్రవేత్తలు దానిపై పరోశోధనలు చెయ్యడం మొదలుపెడతారు..భూగ్రహం కూడా వినాశనానికి చేరువలో ఉంది కాబట్టి ఆ ఉల్కలో గ్రహాంతరవాసుల జాడలు ఉంటే వాళ్ళతో సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా మానవాళి అంతరించిపోకుండా కాపాడుకోగలమని భావిస్తూ ఉంటారు..ఈ కథను ఏకకాలంలో అటు గ్రహాంతరవాసుల వైపు నుండీ ,ఇటు మానవుల వైపునుండీ చెబుతారు..విచిత్రమేమిటంటే ఇరువైపులవారూ ఒకే రీతిగా ఆలోచిస్తారు..వైరం లేకుండా ఒకరితోఒకరు సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనే భావిస్తూ ఉంటారు.
An artificial meteor built to visit us is much more exciting than a secret weapon,’ said Sally, it gives us hope that one day we could travel in space ourselves … How wonderful it would be to do that! All those people who hate war, and secret weapons, and cruelty, could go to a clean, new planet. We could set out in a huge spaceship, and we could start a new life. We’d be able to leave behind all the things that are making this poor old world worse and worse. All we’d want is a place where people could live, and work, and build, and be happy. And if we could only start again, what a lovely, peaceful world we might—’ అనుకుంటారు మానవులు..కానీ ఒక ఉమ్మడి లక్ష్యం సాధించే దిశగా ఒకరికొకరు ఎదురుపడిన తరుణంలో, రెండు విభిన్న జాతుల మధ్య స్నేహం కుదిరిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ మెటియార్ కథ చదవాల్సిందే..ఈ కథ ముగింపు, చదివిన చాలా సేపటివరకూ మనతోనే ఉండిపోతుంది.
నాకు 'మెటియార్' ఎంత నచ్చిందో, రెండో కథ Dumb Martian కూడా అంతే నచ్చింది..స్త్రీవాద అంశాలతో పాటు మిస్టరీ,సస్పెన్స్ కలిపి రాసిన ఈ సైన్స్ ఫిక్షన్ కథలో, కథ జరిగే సమయానికి స్పేస్ ట్రావెల్ ఒక దేశంనుండి మరో దేశానికీ విమానమెక్కి వెళ్ళినంత తేలిక అయిపోతుంది .డంకన్ వీవర్ అనే భూగ్రహవాసి జూపిటర్ కు ఉద్యోగ నిమిత్తం వెళ్ళి,అక్కడ ఒంటరిగా ఐదేళ్ళ పాటు పనిచెయ్యాల్సిరావడంతో లెల్లీ అనే మార్షియన్ ను వెయ్యి పౌండ్లకు కొనుగోలు చేస్తాడు (భూగ్రహానికి చెందిన స్త్రీలు అక్కడ ఉండడానికి అనువు కాదు కాబట్టి )..ఇప్పటి వీసా తరహాలో ఆ గ్రహానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి కాబట్టి ఆమెను తప్పనిసరిగా వివాహమాడి,తనకు తోడుగా తీసుకెళ్తాడు..డంకన్ తనకన్నా భిన్నంగా ఉన్న లెల్లీ పట్ల తిరస్కారభావంతో అణచివేత ధోరణి చూపిస్తూ ఉంటాడు..He was especially annoyed by the fact that she seemed able to accept the problems of their life better than he could. She showed no anger or boredom. And all because she was a dumb Martian! It was unfair. అనుకుంటాడు డంకన్..అతనిలోని ద్వేషం ఒక సందర్భంలో ఆమెపై చెయ్యి చేసుకునే వరకూ వెడుతుంది..ఈలోగా అలాన్ వింటర్ అనే మరో భూగ్రహవాసి వీళ్ళిద్దరితో కలిసి ఒక ఏడాదిపాటు జూపిటర్ లో పని చెయ్యడానికి గాను నియమితుడవుతాడు..లెల్లీ పట్ల డంకన్ ధోరణి గమనించిన అలాన్ ఆమెను గౌరవంగా చూస్తూ, చదవడం,రాయడం నేర్పిస్తాడు..లెల్లీ తనకంటే తెలివైనదని ఒప్పుకోలేని పురుషాహంకారం తో డంకన్ అలాన్ ను ఆమెకు దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు..ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది..డంకన్ అలాన్ ను ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పన్నాగం పన్నుతాడు..తరువాత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి..ఈ కథలో లెల్లీ పాత్ర స్వభావంలోని విలక్షణత ఈ కథకు అదనపు ఆకర్షణ..ఆమె గురించి ‘You can never tell what Martians are thinking, or whether they are thinking,’ అంటూ లెల్లీ చుట్టూ ఒక మిస్టరీని తయారు చేస్తారు విండమ్..మనకన్నా తెలివైన జాతులతో సహజీవనంలో ఉండే సంక్లిష్టతల్ని ఎత్తి చూపించే కథ ఇది.
జూపిటర్ లో ఒంటరి జీవిగా ఐదేళ్ళ పాటు పనిచెయ్యాలని బెంగపడిన డంకన్ ఆలోచనలు :
Inside his heated space-suit Duncan felt suddenly cold. Never before had he felt so much alone. The cruel, dead heights of the bare, sharp rocks of his moon rose above him. There was nothing like them on Earth or Mars. The black sky that was endless space stretched out around him. In it, his own sun, and numberless other suns, burned endlessly without reason or purpose. The unchanging millions of years, and millions of kilometres, stretched out before and behind him. His life, indeed all life, was like a tiny bit of dust dancing for a short moment in the light of the suns that lasted for ever. Never before had he been so much aware of the loneliness of space.
ఇక మూడో కథ 'Surival' హారర్ ఎలిమెంట్స్ ఉన్న కథ..ప్రమాదవశాత్తూ స్పేస్ షిప్లో చిక్కుకుపోయిన మనుషులు తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చదివినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది..ఈ కథ ఆకలి విషయంలో మానవుడికీ మృగానికీ తేడాలేదని నిరూపిస్తూ మనం గర్వపడే మానవీయ విలువల్ని పునఃప్రశ్నించుకోమంటుంది..నాలుగో కథ Body and Soul లో పరకాయప్రవేశం మూలాంశంగా రాసిన కథ..ఈ నాలుగు కథలూ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి.
బ్రాడ్బరీ, బ్రియాన్ ఆల్డిస్, ఉర్సులా లెగైన్ లాంటి వాళ్ళతో పోలిస్తే విండమ్ శైలి మరింత సరళంగా జనరంజకంగా ఉంటుంది..పాఠకుల చేత పేజీలు తిప్పించగలిగేదే మంచి కథైతే జాన్ విండమ్ కథలు నిస్సందేహంగా ఆ కోవకు చెందుతాయి..కానీ అందర్నీ విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకునే బ్రియాన్ ఆల్డిస్ విండమ్ కథల్ని "cosy catastrophes" అంటూ తీసిపారేశారట..ఈ రచనతో ఆయన శైలి పరిచయమయ్యింది కాబట్టి , సరళమైన వచనంతో ఆలోచింపజేసే జాన్ విండమ్ కథల్ని మరికొన్నిటిని చదవాలనే ఆసక్తి కలుగుతోంది..హ్యాపీ రీడింగ్.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
'You know what I mean,’ said Duncan.
I never understand people who can’t say what they mean,’ said Alan. ‘Try again.’
Oh very nice. These cozy catastrophes are actually very good stories. Thank you.
ReplyDeleteThank you Sujatha garu :)
Deletehttps://www.youtube.com/watch?v=uqHXiJ5pGLY
ReplyDeleteThought i would just drop this here andi :)
Enjoyed watching it..Thank you for sharing Dheeraj :)
Delete