Tuesday, March 9, 2021

Klara and the Sun - Kazuo Ishiguro

బ్రిటిష్ (జాపనీస్) రచయితా,నోబుల్ గ్రహీతా కజువో ఇషిగురో 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్' చదివి చాలా ఏళ్ళైపోయింది..ఆ రచన బాగా నచ్చడంతో అప్పట్లో కొత్తగా ప్రచురించబడిన ఆయన మరో రచన 'బరీడ్ జెయింట్' కూడా చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యలేక ఉస్సూరుమంటూ సగంలో వదిలేశాను..మళ్ళీ ఇంతకాలానికి ఇషిగురో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి పుస్తకం రాశారని చదివి టెక్నలాజికల్ రెవల్యూషన్ మీద ఆయన అభిప్రాయాలు ఏమై ఉంటాయా అనే కుతూహలం కలిగింది..మునుపు చదివిన అయాన్ మాక్ ఇవాన్ 'మెషీన్స్ లైక్ మీ' లో క్రొత్తగా ఆవిర్భవించిన 'హ్యూమనోయిడ్ రోబోట్' కి హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చర్చించారు..ఈ రచనలో ఇషిగురో దాని తదుపరి దశపై దృష్టిసారిస్తూ మానవ సమాజంలో పూర్తి స్థాయిలో మమేకమై జీవిస్తున్న రోబోట్స్ వైపు నుండి ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు.  

Image Courtesy Google

ఈ బుక్ గురించి నేను నరేన్ తో మాట్లాడుతూ బ్రెయిన్ కోడ్ ని క్రాక్ చెయ్యడం, అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ని డీకోడ్ చెయ్యడం శాస్త్రజ్ఞుల వల్ల అయ్యే పని కాదేమో అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు హైందవ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికత మార్గంలో నడిచే వ్యక్తిగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేశారు..హ్యూమన్ కాన్షియస్నెస్ (స్పృహ/ఆత్మ ) మనిషికి ఒక్క రోజులోనో లేదా కొన్ని సంవత్సరాల్లోనో సంక్రమించింది కాదు,తరతరాలుగా జీవితచక్రంలో భాగంగా జననమరణాల మధ్య అనేక జీవితాలను కలుపుకుంటూ ఏర్పడినది..హైందవంలో 'పూర్వజన్మ వాసనలు' అనడం తరచూ వింటుంటాం,ఎప్పుడైనా కొత్తవారిని చూసినప్పుడు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించడం లాంటివి అన్నమాట..ఇదే విధంగా హ్యూమనోయిడ్ రోబోట్స్ కి సంబంధించిన కాన్షియస్నెస్ కూడా మానవ సమాజంలో భాగంగా ఉంటూ,ఆ నియమాలను పాటిస్తూ క్రమేపీ 'ఎవోల్వ్' అవ్వవలసి ఉంటుంది..ఇది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు,బహుశా కొన్నేళ్ళు పట్టొచ్చు, అప్పటికి అవి మనం ఊహించలేనంతగా మానవసమాజంలో భాగంగా మారిపోనూవచ్చు.

ఆర్టిస్టు లక్ష్యం జరిగే పరిణామాల్ని పాఠకుల దృష్టికి తీసుకువచ్చి వారిలో ఆలోచనలు రేకెత్తించడమే అయితే ఈ రచన ద్వారా ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించారు ఇషిగురో..కథ విషయానికొస్తే క్లారిస్సీ అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురు జోసీ (14) కి తోడుగా ఒక అడ్వాన్స్డ్ మోడల్ AF క్లారా అనే హ్యూమనోయిడ్ రోబోట్ ని కొనుగోలు చేస్తుంది..జోసీ,క్లారిస్సీ,ఇంటి వ్యవహారాలు చూసుకునే మెలనీలతో కలిసి నాలుగో సభ్యురాలిగా ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది క్లారా..క్లారా తన శక్తిని సూర్యరశ్మి ద్వారా గ్రహిస్తూ ఉంటుంది..భవిష్యత్తు సమాజాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించి చేసిన ఈ రచనలో స్త్రీ పురుషులిద్దరూ ఉన్నతమైన వృత్తుల్లో ఉంటూ ఉంటారు,భార్యాభర్తలు సహజంగా కలిసి జీవించరు..బహుశా జనాభా నియంత్రణ కారణంగా అందరికీ ఒక్క సంతానమే ఉంటుంది..అందరి ఇళ్ళల్లో పిల్లల కోసం ప్రత్యేకించి, ఒంటరితనం లేకుండా వారికి చేదోడువాదోడుగా ఉండడానికి క్లారా లాంటి AF హ్యూమనోయిడ్ రోబోట్స్ ఉంటాయి..చాలా అరుదుగా ఇరుగుపొరుగు పిల్లలూ,పెద్దలూ ఒక చోట సమావేశమవుతుంటారు..యంత్రాలతో సహజీవనం అలవాటైన పిల్లలు తోటి పిల్లల్ని కలిసినప్పుడు జాలీ,దయా,కరుణా,సహానుభూతి లాంటి లక్షణాలేమీ లేకుండా ఆత్మన్యూనతతో చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు..అటువంటి పిల్లల చెడు ప్రభావానికి మంచి మనసున్న జోసీ లోనుకాకుండా ఆమె బాల్య స్నేహితుడు రిక్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు..రిక్ కు అందరి పిల్లల్లా AF ఉండదు..అతడి తల్లి హెలెన్ అనారోగ్యం కారణంగా డబ్బు లేక అందరి పిల్లల్లా అతడు ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలు నేర్చుకోలేడు..అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించలేని కారణంగా మిగతా కుటుంబాలు రిక్ నూ అతడి తల్లినీ వెలివేసినట్లు చూస్తుంటారు..నేడు కంప్యూటర్ లేని ఇల్లు లాగే A child like that, with no AF, would surely be lonely అని రిక్ గురించి వాపోయేంతగా AI మనుషుల జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేస్తుంది..ఈ పాత్రలన్నీ తమ భవసాగరాల్ని ఈదే క్రమంలో తలమునకలుగా ఉన్నప్పుడు క్లారా ఒక ప్రక్క జోసీ గురించి తెలుసుకుంటూ,మానవ సమాజపు నియమాలను నేర్చుకుంటూ ఉంటుంది...As I say, these were helpful lessons for me. Not only had I learned that ‘changes’ were a part of Josie, and that I should be ready to accommodate them, I’d begun to understand also that this wasn’t a trait peculiar just to Josie; that people often felt the need to prepare a side of themselves to display to passers-by – as they might in a store window – and that such a display needn’t be taken so seriously once the moment had passed...ఇదిలా ఉండగా ఆరోగ్యం విషమించిన జోసీ ని రక్షించుకోవడానికి సూర్యునితో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటుంది క్లారా..ఆమె ఒప్పందం ఏమిటి ? జోసీ కోలుకుంటుందా లేదా ? ఇదంతా మిగతా కథ.

ఇక ఇషిగురో శైలిలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పే వచ్చిందనిపించింది..నేను చదివిన 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్' లో అంతర్లీనంగా ఉన్న గాఢత ఇందులో అణుమాత్రం కూడా లేదు..బహుశా అది మనుషుల గురించీ ఇది మెషీన్స్ గురించీ కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఫిక్షన్ కథలో గాఢతను ఆశించడం పిచ్చితనం కావచ్చు..ఇకపోతే పుస్తకం సగానికి వచ్చేసరికి ముఖ్యంగా రిక్,జోసీల స్నేహాన్నీ,సంభాషణలనూ చదువుతున్నప్పుడు కాస్త సాగదీతగా అనిపించింది..కానీ పట్టాలు తప్పిన నేరేషన్ పగ్గాలు మళ్ళీ త్వరలోనే చేజిక్కించుకుని మిగతా పేజీలను ఆసక్తికరంగా మలిచారు ఇషిగురో..కథగా ఎంచుకున్న అంశం ఎంత గొప్పదైనప్పటికీ ఇషిగురో కథను చెప్పడంలో సరళమైన శైలినే అవలంబిస్తారు..పాఠకుల్నిరోలర్ కోస్టర్ రైడ్ లకు తీసుకెళ్ళి షాక్ కి గురిచెయ్యడానికి ఎంతమాత్రమూ ఇష్టపడని ఆయన మామూలు సంభాషణల ద్వారానూ,తేలికపాటి మెటఫోర్ల సాయంతోనూ కథను చెప్పే తీరు అందరికీ ఆమోదయోగ్యంగా అయితే ఉండదు..ఉదాహరణకు రోబోట్ క్లారా,క్లారిస్సీ మోర్గాన్ ఫాల్స్ ని సందర్శించే క్రమంలో,ఆ ప్రాంతానికి దగ్గర్లో కంచె అవతల పచ్చికబయలులో గడ్డి మేస్తున్న ఎద్దుని చూసిన క్లారా ఆలోచనల్ని అంతరించిపోతున్న ప్రపంచానికి మెటాఫోర్ లా వాడడం ఇషిగురో ప్రత్యేకత.."As these words swept through my mind, I thought of the terrible bull on the way up to Morgan’s Falls, of its horns and its cold eyes, and of the feeling I’d had at that moment of some great error having been made to allow a creature so filled with anger to stand unconstrained up on the sunny grass." అయాన్ మాక్ ఇవాన్ ఇటువంటి ఒక కథనే చెప్పడానికి చేసిన కఠోరమైన రీసెర్చ్ ఇషిగురో చెయ్యలేదు..అందువల్ల చారిత్రాత్మక,శాస్త్రసాంకేతికపరమైన అంశాలు పుష్కలంగా ఉన్న ఇవాన్ రచన కంటే ఇషిగురో రచన సాధారణ పాఠకులకు మరికొంత సులభంగా చేరువై AI పరిణామాలనూ,పర్యవసానాలనూ అర్ధం చేసుకోడానికి తోడ్పడుతుందనిపించింది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనిషికి సమర్ధవంతమైన ప్రత్యామ్నాయం కాగలదా ? అనే ఒకే ఒక్క  ప్రశ్నను ఆధారంగా చేసుకుని ఈ కథ మొత్తాన్నీ రాశారు ఇషిగురో..చివర్లో ఆయనే ఇచ్చిన  సమాధానం కూడా గొప్పగా ఉంటుంది..రిక్ తల్లి హెలెన్ క్లారా (రోబోట్) తో అనే ఈ మాటలు  సహజసిద్ధమైన వాతావరణం,మనుషులూ అంతరించిపోయి నలువైపులా కృత్రిమత్వం చోటు చేసుకున్న భవిష్యత్ సమాజంలోని మనిషి నిరాశానిస్పృహలకు అద్దంపడతాయి..‘Just now, Klara, when I appeared to be in a dream. It wasn’t any dream, you know. I was looking out there’ – she pointed the shoe behind me – ‘and I was recalling. Turn and look all you like, I assure you there’s nothing there just now. But once, some time ago, I was looking out there and I did see something.’..ఈ రచనలో  మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇషిగురో వన్నెగట్ ,టోల్కీన్ , వర్గాస్ లోసా ల బాటలో టెక్నలాజికల్ అడ్వాన్స్మెంట్ పట్ల విముఖత వ్యక్తం చెయ్యలేదు..శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరిట వచ్చిన సౌకర్యాలను అనుభవిస్తూ దాన్ని తూలనాడలేదు..తన అభిప్రాయాలను రెండువైపుల నుంచీ చర్చించి ఊరుకున్నారు తప్ప AI పట్ల స్పష్టమైన 'స్టాండ్' తీసుకోడానికి నిరాకరించారు..అభివృద్ధి పేరిట జరిగే వినాశనాన్ని వేలు పెట్టి చూపెడుతూనే, "అనివార్యం అయిన ఇట్టి విషయమును గూర్చి శోకించ తగదు" అంటూ కృష్ణ పరమాత్ముడిలా గీతా బోధ కూడా చేసినట్లనిపించింది..ఈ పుస్తకంలో మొదటి భాగం కంటే రెండో భాగం ఆసక్తికరంగా ఉంటుంది..చివరకు ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుందా అనుకుంటూ బుగ్గలు నొక్కుకోవడం పాఠకులు వంతవుతుంది. 

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

It’s for the customer to choose the AF, never the other way round.

‘Let me tell you something, Klara. Children make promises all the time. They come to the window, they promise all kinds of things. They promise to come back, they ask you not to let anyone else take you away. It happens all the time. But more often than not, the child never comes back. Or worse, the child comes back and ignores the poor AF who’s waited, and instead chooses another. It’s just the way children are. You’ve been watching and learning so much, Klara. Well, here’s another lesson for you. Do you understand ?'

It must be great. Not to miss things. Not to long to get back to something. Not to be looking back all the time. Everything must be so much more…

‘What I saw was Chrissie, Josie’s mother, that is. I saw her come out of the grass, just over there, holding someone by the arm. I’m explaining myself rather poorly. What I mean is, it was as if this other person had been trying to run away, and Chrissie had been after her. And she’d caught hold of her, but hadn’t been able quite to stop her. So they’d both of them tumbled out, so to speak. Just over there, out from the grass onto our land.

The trouble is, Chrissie, you’re like me. We’re both of us sentimental. We can’t help it. Our generation still carry the old feelings. A part of us refuses to let go. The part that wants to keep believing there’s something unreachable inside each of us. Something that’s unique and won’t transfer. But there’s nothing like that, we know that now. You know that. For people our age it’s a hard one to let go. We have to let it go, Chrissie. There’s nothing there. Nothing inside Josie that’s beyond the Klaras of this world to continue. The second Josie won’t be a copy. She’ll be the exact same and you’ll have every right to love her just as you love Josie now. It’s not faith you need. Only rationality. I had to do it, it was tough but now it works for me just fine. And it will for you.'

‘Then let me ask you something else. Let me ask you this. Do you believe in the human heart? I don’t mean simply the organ, obviously. I’m speaking in the poetic sense. The human heart. Do you think there is such a thing? Something that makes each of us special and individual? And if we just suppose that there is. Then don’t you think, in order to truly learn Josie, you’d have to learn not just her mannerisms but what’s deeply inside her? Wouldn’t you have to learn her heart?’

AI కు వ్యతిరేకంగా జీవిస్తూ మైనారిటీ ఫాసిస్టు ముద్ర వేయించుకున్న జోసీ తండ్రి పాల్, క్లారా తో అనే మాటలు : I think I hate Capaldi because deep down I suspect he may be right. That what he claims is true. That science has now proved beyond doubt there’s nothing so unique about my daughter, nothing there our modern tools can’t excavate, copy, transfer. That people have been living with one another all this time, centuries, loving and hating each other, and all on a mistaken premise. A kind of superstition we kept going while we didn’t know better. That’s how Capaldi sees it, and there’s a part of me that fears he’s right. Chrissie, on the other hand, isn’t like me. She may not know it yet, but she’ll never let herself be persuaded. If the moment ever comes, never mind how well you play your part, Klara, never mind how much she wishes it to work, Chrissie just won’t be able to accept it. She’s too…old-fashioned. Even if she knows she’s going against the science and the math, she still won’t be able to do it. She just won’t stretch that far. But I'm different. I have…a kind of coldness inside me she lacks. Perhaps it’s because I’m an expert engineer, as you put it. This is why I find it so hard to be civil around people like Capaldi. When they do what they do, say what they say, it feels like they’re taking from me what I hold most precious in this life. Am I making sense?

‘Lifted or not, genuine ability has to get noticed. Unless this world’s completely crazy now.'

We’re protesting the proposal to clear the Oxford Building. There’s currently four hundred and twenty-three post-employed people living inside it, eighty-six of them children. Neither Lexdell nor the city have offered any reasonable plan regarding their relocation.

Perhaps all humans are lonely. At least potentially.

As these words swept through my mind, I thought of the terrible bull on the way up to Morgan’s Falls, of its horns and its cold eyes, and of the feeling I’d had at that moment of some great error having been made to allow a creature so filled with anger to stand unconstrained up on the sunny grass.

No comments:

Post a Comment