పుస్తకాలు చదివి వంట చెయ్యడం,పిల్లల్ని పెంచడం,ప్రేమించడం లాంటివి చెయ్యకూడదంటారు..సారీ ఎవరన్నారో నాకు గుర్తు లేదు అందుకే నేనే అంటున్నాననుకుంటే సరి..ఇలాంటివన్నీ సహజంగా జరిగిపోవాలి..వాటిక్కూడా థియరీలు,ఎనాలిసిస్ లూ వింటే విసుగ్గా ఉంటుంది..కానీ కొన్ని సార్లు చెయ్యకూడదనుకున్న పని చెయ్యాల్సి వస్తుంది..కొత్తగా ఏదో నేర్చుకోవడానికి కాదు..అవసరం లేనివి వదిలించుకునే దిశగా అవసరమైన నిర్దాక్షిణ్యమైన ప్రేరణ కోసం.
ఎన్ని పనులున్నా,ఎంత బిజీగా ఉన్నా,ప్రయాణాల్లో ఉన్నా రోజులో కొన్ని పేజీలైనా చదవడం నాకు రోటీ కపడా ఔర్ మకాన్ అంత అవసరం,వదుల్చుకోలేని వ్యసనం కాబట్టి ఇప్పుడున్న సమయంలో లోతైన ఫిలాసఫీలు చదివే మూడ్ తో పాటు,ఓపికా తీరికా రెండూ లేక ఈ రెండు వారాలూ కాస్త లైట్ రీడ్స్ ను ఎంచుకుని చదవడం జరిగింది..అందులో భాగంగా 'సమయానికి తగు పుస్తకం' కోటాలో రాబోయే రోజులకు సన్నద్ధమవుతూ ఇంట్లో అవసరం లేని సామాగ్రి తీసెయ్యడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ మేరీ కొండో బెస్ట్ సెల్లర్ చదివాను..మునుపు అక్కడక్కడా పేజీలు తిరగేసినా మనకు తెలియని కొత్త విషయాలేవీ చెప్పట్లేదు ఈ అమ్మాయి అని మళ్ళీ ప్రక్కన పడేశాను..కానీ బొత్తిగా మెడకు చుట్టుకున్న సంసార సామాగ్రిని వదిలించుకోవాలంటే మనసొప్పక, కోండో ఏమైనా మాటసాయం చేస్తుందేమో అని మూసేసిన పుస్తకాన్ని మళ్ళీ తెరిచాను.
Image Courtesy Google |
ఒకే చోట ఉండిపోకుండా ఊర్లు తరచూ మారడం వలన ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, ఎప్పటికప్పుడు అవసరంలేని సామాను తీసేసే అవకాశం వస్తుంది,నిజానికి అవకాశం అనేకంటే అవసరం అనడం సబబు..ఎందుకంటే మారిన ప్రతిచోటా ఇంట్లో సామానుకు సరిపడా అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు దొరకడం అంత సులభం కాదు.. When you are choosing what to keep, ask your heart; when you are choosing where to store something, ask your house. అంటారు కోండో.. బాల్కనీ చిన్నదని ఉయ్యాలనూ,కప్ బోర్డులు తగిన విధంగా లేని చోట్ల అవసరం లేని వంట గిన్నెలు,అలంకరణ వస్తువులనూ,బట్టలూ,పుస్తకాలూ ఎవరో ఒకరికి ఇచ్చేసిన సందర్భాలు అనేకం..కానీ మళ్ళీ అక్కడ ఇంటికి తగిన విధంగా వేరే సామాను ప్రోగవుతూ ఉండేది..ఇది గమనించాక మూడేళ్ళ పాటు పండగలనీ,స్పెషల్ అకేషన్స్ అనీ షాపింగ్ జోలికి పోకుండా వార్డ్రోబ్ లు సగానికి సగం ఖాళీ చేశాం.
మధ్యలో కొన్ని పేజీల్లో బట్టలెలా మడతపెట్టాలి,సాక్స్ ని ఏ విధంగా ఫోల్డ్ చెయ్యాలి తదితర విషయాలు చదువుతుంటే కూడా " అమ్మా తల్లీ మాకు ఇవన్నీ అవసరమా" అనిపించింది..దానికంటే నేను చిన్నప్పుడు చదివిన స్వాతి లాంటి మ్యాగజైన్స్ లో ఇలాంటి విషయాలపై కోండో కంటే గొప్పగా రాసిన వాళ్ళకు ఒక పుస్తకం అచ్చు వేసి బెస్ట్ సెల్లర్ చేద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదబ్బా అనిపించింది..మేరీ కోండో ని కూడా 'డి క్లట్టరింగ్' లెసన్స్ చెబుతాను అంటే “Can you actually make money doing that?” / “Do people need lessons in tidying?” అని అడిగారటలేండి.
The moment you first encounter a particular book is the right time to read it. అంటారు కోండో..కానీ రోజుకో కొత్త పుస్తకం కనిపిస్తే వెనువెంటనే చదవడానికి ఎలా కుదురుతుంది..అందునా చదివిన వాటి కంటే చదవని పుస్తకాలే అపురూపం అంటారు..పుస్తకాల గురించి ఆవిడ మాట వినడం నాకు కష్టమే గానీ గ్రీటింగ్స్ విషయంలో కోండో చిట్కా నాకు నచ్చింది..జపాన్ లో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ చివర లాటరి నంబర్స్ ఉంటాయట..ఆ గ్రీటింగ్స్ అందుకున్నవారు ఒకసారి ఆ కార్డ్స్ లో ఉన్న లాటరీ నంబర్స్ చూసేసుకున్నాక ఇక వాటి అవసరం లేదని అర్థమన్నమాట..ఇంట్లో కుప్పలుగా పేరుకున్న గ్రీటింగ్ కార్డ్స్ ని వదిలించుకోవడానికి ఈ మాటలు నన్ను కన్విన్స్ చేశాయి.
చుట్టూ అవసరం లేని వస్తువులను ప్రోగేసుకుంటూ ఉండడం వల్ల జీవితంలో నిజంగా అవసరమైన విషయాలు మన దృష్టిని దాటిపోతూ ఉంటాయి..కోండో చాలా చోట పదే పదే ప్రస్తావించిన మాట : "మీకు సంతోషాన్నివ్వనిదేదీ మీకు అవసరం లేదు" ..అలా ఉన్న వస్తువులన్నీ మెడకో డోలు తగిలించుకున్నట్లు మనకు భారమే గానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు..చెత్త ను ఆర్గనైజ్ చేసుకోవడానికి మార్కెట్లో అనేక స్టోరేజ్ స్పేసేస్ లాంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వాటివల్ల ప్రాక్టికల్ గా ఉపయోగం ఉండదు..ఇది నా అనుభవం..ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంటిని చక్కగా ఉంచే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండే వారైతే తప్ప ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు..స్టోరేజ్ స్పేస్ లో పెట్టిన వస్తువులు తీసినవాళ్ళు మళ్ళీ తీసిన చోట పెట్టరు..ఈ కారణంగా ఇంట్లో యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి..ఈ తరహా మనుషుల్ని మూడు రకాలుగా వర్గీకరించారు కోండో..Using this approach, people who can’t stay tidy can be categorized into just three types: the “can’t-throw-it-away” type, the “can’t-put-it-back” type, and the “first-two-combined” type.
కోండో చెప్పిన విషయాలలా ఉంచితే,నేను ఎప్పటికప్పుడు అవసరం లేదనుకున్న బట్టలు,వంట సామాన్లూ,పిల్లవాడి పుస్తకాలూ,స్టేషనరీ లాంటివి తీసేస్తూ ఉంటాను..అందువల్ల చెత్త ఉండే అవకాశం చాలా తక్కువ..ఇక ఆఫీసుకి సంబంధించిన బుక్స్,డైరీస్,పేపర్స్,బిల్స్ లాంటివి ఏవి అవసరమైనవో, ఏవి కాదో తెలీదు గనుక అవి పేరుకుపోతుంటాయి..కనీసం రెండు మూడు నెలలకోసారి నరేన్ కి అవన్నీ అప్పగించి అవసరంలేని పేపర్స్ తీసెయ్యగా మిగిలినవి ఫైల్ చేస్తుంటాను..అందువల్ల అవసరంలేని చెత్త పేరుకుపోవడం తగ్గింది.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :
People cannot change their habits without first changing their way of thinking.
If you tidy up in one shot, rather than little by little, you can dramatically change your mind-set.
When people revert to clutter no matter how much they tidy, it is not their room or their belongings but their way of thinking that is at fault.
Putting things away creates the illusion that the clutter problem has been solved.
However, the moment you start focusing on how to choose what to throw away, you have actually veered significantly off course.
Keep only those things that speak to your heart. Then take the plunge and discard all the rest. By doing this, you can reset your life and embark on a new lifestyle.
If you’re mad at your family, your room may be the cause.
To truly cherish the things that are important to you, you must first discard those that have outlived their purpose.
To quietly work away at disposing of your own excess is actually the best way of dealing with a family that doesn’t tidy.
“Does this spark joy?” If it does, keep it. If not, dispose of it.
Presents are not “things” but a means for conveying someone’s feelings.
No matter how wonderful things used to be, we cannot live in the past. The joy and excitement we feel here and now are more important.
As you reduce your belongings through the process of tidying, you will come to a point where you suddenly know how much is just right for you.
Believe what your heart tells you when you ask, “Does this spark joy?”
But when we really delve into the reasons for why we can’t let something go, there are only two: an attachment to the past or a fear for the future.
Life becomes far easier once you know that things will still work out even if you are lacking something.
No comments:
Post a Comment