Monday, March 15, 2021

The train that had wings - M.Mukundan

1960 ల ముందు వరకూ మలయాళీ కథ కేరళ ప్రాకృతిక పరిథుల్ని దాటి ఆవలకు వెళ్ళలేకపోయింది,కానీ తరువాతి కాలంలో వచ్చిన కథలు సంప్రదాయ కేరళ కథను దాటి ఇతర సంస్కృతుల ద్వారా ప్రభావితమై కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాయి..అటువంటి శైలిలో కథలు రాసిన O.V. VIjayan,ఆనంద్ లాంటి కొందరు ఆధునిక మలయాళీ రచయితల్లో ఎమ్. ముకుందన్ కూడా ఒకరు..కేరళ కథంటే కొబ్బరి తోటలూ,తాటిచెట్లు,వరి చేలూ,కాఫీ తేయాకు,అల్లం,మిరియాల తోటలూ,సముద్రతీరాలూ,నీటి కాలువలూ మాత్రమే కాదంటాయి ముకుందన్ కథలు..1960ల  తొలినాళ్ళ అస్తిత్వ వాదాల నడుమ చే గువేరా,మార్క్సిస్టు ,సాత్రే భావజాలాల వల్ల ప్రభావితమైన ముకుందన్ కథల్లో విచ్ఛిన్నమైన సామజిక నియమాలూ,అణచివేత లాంటివాటికి పెద్దపీట వేస్తారు..అందువల్ల భారత దేశానికి, అందునా దక్షిణ భారత దేశానికి చెందిన మూలాలున్న కథలైనప్పటికీ పాశ్చాత్య పాఠకులతో సహా అన్ని వర్గాల పాఠకులూ ఆ పాత్రల్లో తమను తాము సులభంగా ఐడెంటిఫై చేసుకుంటారంటారు అనువాదకులు డోనాల్డ్ ఆర్ డేవిస్ జూనియర్..ఈ  రచనకు ఆంగ్లానువాదం మూలాన్ని పట్టుకోవడంలో పూర్తిగా సఫలీకృతమైందనిపించింది.

Image Courtesy Google

ముకుందన్ కథల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో సంప్రదాయ మలయాళీ సాహిత్యపు వాసనలు ఉండవు..ఈ కథల్లో కొన్ని కేరళ నేపథ్యంలో రాసినవి కాగా 1980ల నాటి ఢిల్లీ సంస్కృతిని ప్రతిబింబించేవి మరికొన్ని..కానీ కేరళ నేపథ్యంలో రాసిన కథల్లో సైతం సంప్రదాయ మలయాళీ కథ దాఖలాలు కనిపించలేదు..'కామన్ మాన్' చుట్టూ తిరిగే ఈ కథలన్నీ బసు ఛటర్జీ సినిమాల్లో అమోల్ పాలేకర్,విద్యా సిన్హా లాంటివాళ్ళను పోలినట్లు అనిపించడం వల్ల నేను చదువుతున్నంతసేపూ వాళ్ళనే ఊహించుకుంటూ చదివాను..ముకుందన్ కథల్లో ఆధునిక సమాజం కాస్మోపోలిటన్ సంస్కృతికి ప్రతిరూపంగా కనబడుతుంది..ఆయన పాత్రలన్నీ సామజిక చట్రంలో చిక్కుకుని ఊపిరాడకుండా కొట్టుకునే సగటు మనుషులే..ముకుందన్ కథానాయకుడు తన ప్రమేయం లేని వ్యవస్థాగతమైన అణచివేతకు గురై సాంఘిక నియమాలను అనుసరిస్తూ,సాంస్కృతిక వైరుధ్యపు ఉచ్చులో చిక్కుకుని దారీతెన్నూ తోచక సతమతమవుతూ ఉంటాడు..కేరళలో ఆ కాలంలో వచ్చిన కొన్ని మూస కథల్లా ముకుందన్ కథలు కేవలం అణచివేతను ప్రతిబింబించేవనుకుంటే పొరపాటే.. I, the Scavenger కథలో కథానాయకుడికి పారిశుధ్య కార్మికుడిగా ఉద్యోగం దొరికినందుకు ఒక దేశానికి ప్రధాని అయినంతగా సంబరపడతాడు..ఈ ప్రభుత్వ ఉద్యోగం దొరకడం వల్ల నేను ప్రతిరోజూ దర్జాగా కాఫీ తాగగలను అనుకుంటాడు..'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ను హైలైట్ చేస్తూ ఎంత చెట్టుకు అంత గాలి అన్న రీతిగా ఎవరి సామజిక స్థితి ఏదైనా ఆనందం ఏ ఒక్కరి సొంతమూ కాదన్నదానికి ఈ కథ చక్కని ఉదాహరణ.

'ఆఫీస్' అనే మరో కథలో తన ఉద్యోగ బాధ్యతల్లో పీకల్లోతు మునిగిపోయి, వృత్తిగతానికీ-వ్యక్తిగతానికీ తేడా మరచిపోయి మరమనిషిలా మారిన కథానాయకుడు ఒక్క రోజు సెలవుని ఏం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటాడు..పనిలో తన ఉనికిని వెతుక్కోవడమే తప్ప,దొరికిన ఏకాంతాన్ని అనుభవించడం చేతకాక చివరకు సెలవురోజు కూడా ఆఫీసుకి ప్రయాణమవుతాడు..తనకు అలవాటైన ఆఫీసు పరిసరాల్లో తన డెస్క్ దగ్గర కూర్చుని పని మొదలుపెట్టాక మాత్రమే అతడికి స్వాంతన చిక్కుతుంది..He started checking old files and ledgers to collect the data. As he sat in the silent room happily working, he forgot it all—Shalini, his friends, the crowded roads . . . and not just that—himself. అంటూ ఈ కథను ముగిస్తారు ముకుందన్.

ముకుందన్ పాత్రలు ఉద్యోగంలోనో,బాంధవ్యాల మధ్యనో,సంసారం సాగరంలోనో,ఏదో ఒక సామజిక చట్రంలో చిక్కుకుని తమ ఉనికిని కోల్పోతాయి..అందువల్ల ఈ కథలన్నీ మనిషి తన అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో పెట్టే పొలికేకల్లా ఉంటాయి..పంజరంలో రామచిలుకల వంటి ముకుందన్ పాత్రలు పంజరపు ఖైదునుండి విముక్తి కోసం తపిస్తూ తమ కాళ్ళతో అప్పుడప్పుడు పంజరపు తలుపుని రక్కుతూ, తమకే గాయాలు చేసుకుంటాయి..విడుదల సాధ్యం కాదని తెలిసి నిరాశతో చతికిలబడతాయి..Parrots అనే కథ ఇటువంటి విముక్తి కోసం ప్రాకులాడే ధనికుడి కథ..విలాసాలతో కూడిన సౌకర్యవంతమైన జీవితం  ఖైదుగా మారగా స్వేఛ్ఛా విహంగంలా నింగిలోకి ఎగిరిపోవడంలో ఉన్న ఆనందం విలువ తెలిసిన మనిషిగా అతడు కారులో ఢిల్లీలో వీధులన్నిటినీ గాలించి పంజరంలో రామచిలుకలన్నిటికీ విముక్తి ప్రసాదిస్తాడు...కాఫ్కా శైలిని పోలిన 'బాత్రూమ్' అనే మరో కథలో ఉన్న జీవితాన్ని అనుభవించకుండా లేనిదాని కోసం ప్రాకులాడే పురుషోత్తమన్ తనను ఈగగా పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు..దేవుడు అతడి కోరికను మన్నించడంతో జరిగే పర్యవసానాలు భలే సరదాగా ఉంటాయి...'టీ' అనే మరో కథ వృద్ధాప్యపు సమస్యలకు అద్దం పడుతుంది..ఈ కథలో మిణుకుమిణుకుమంటున్న వీధిదీపాల వెలుతురులో పడక్కుర్చీలో కూర్చున్న తండ్రీ,వర్షంలో తడుస్తూ ఇల్లు చేరి తండ్రి మొహంలో సంతోషాన్ని చూడలేక నిరాశ చెందిన కొడుకూ,నశించిన ఓర్పు చెంపలపై కన్నీరై ప్రవహించగా చీర కొంగుతో కన్నీళ్ళు ఒత్తుకుంటున్న తల్లీ , ఈ పాత్రలన్నీ సజీవంగా పాఠకుల కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి..ముకుందన్ కథల్లో అందరూ మనకు ఎంతో కొంత పరిచయమున్న వ్యక్తుల్లాగే అనిపిస్తారు...ఇందులో నాకు బాగా నచ్చిన మరో కథ, భౌతికవాదపు కౄరత్వాన్ని చూపించే 'Piss'..మనిషి మృగంగా మారడానికి అట్టే సమయం పట్టదు, క్షణికమైన ఉన్మాదం దయగల వ్యక్తిలో కూడా దాక్షిణ్యాన్ని చంపెయ్యగలదనడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ..ఈ కథ చదివాకా పాఠకులు నైతికత,అనైతికతలకు నిర్వచనాలను సరిచూసుకునే పనిలో పడతారు..'Breast Milk' అనే మరో కథ అమ్మతనాన్నీ,పసిప్రాయాన్నీ హృద్యంగా చూపెడుతుంది.

కొన్ని ముకుందన్ కథల్లో రేమండ్ కార్వర్ శైలి కనిపించింది..స్పష్టమైన ఐడెంటిటీ లేని పాత్రలు తెరపైకి వస్తుంటాయి,కథ జరుగుతుంది,కథ ముగుస్తుంది..కానీ ముగింపులో స్పష్టత ఉండదు..పాఠకులం ఇంకా మిగులు తగులు వాక్యాలేమైనా ఉన్నాయేమో అని వెతుక్కుంటాం..నిరాశే ఎదురవుతుంది..నేను జరిగింది పూసగుచ్చినట్లు అన్ని వివరాలతో సహా చెప్పాను,దాన్ని మీరెలా గ్రహిస్తారో అది మీ ఇష్టం అంటారు రచయిత..నిజానికి కార్వర్ తో పోలిస్తే పదాల పొదుపు విషయంలో ముకుందన్ దే పైచెయ్యి అనిపించింది..ముకుందన్ పాత్రలకు తమకేం కావాలన్న విషయమై స్పష్టత ఉండదు సరికదా అవి సాంస్కృతిక వైవిధ్యపు జీవనగతిని తాళలేక  'గోయింగ్ విత్ ది ఫ్లో' తత్వంతో గాలివాటుకు కొట్టుకుపోతూ ఉంటాయి..కానీ ఆ తరహా జీవితం వల్ల తాము కోల్పోతున్నదేంటో మాత్రం ఆ పాత్రలకు స్పష్టంగా తెలుసు..ఖచ్చితమైన లక్ష్యం లేక తమ ఉనికిని కోల్పోయిన కారణంగా ముకుందన్ పాత్రలన్నీ నైరాశ్యానికి లోనై సందిగ్థతల మధ్య కొట్టుమిట్టాడుతుంటాయి..ఇది 'ఆఫీస్' కథలోనూ, 'రాధా, జస్ట్ రాధా' కథలోనూ స్పష్టంగా కనిపిస్తుంది..రాధ తన ప్రియుడు సురేష్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అతడు ఆమె ఎవరో తెలియదని నిరాకరిస్తాడు..బరువైన హృదయంతో ఇంటికి చేరిన రాధ ఎవరో తమకు తెలియదని ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరిస్తారు..కాఫ్కా పాత్రల్లో ఉండే డిటాచ్మెంట్ తో పాటు ముకుందన్ మార్కు అంతః సంఘర్షణ వెరసి మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్ ఉన్న ఈ కథ, నిరంతరం రూపాంతరం చెందే అస్తిత్వానికీ, కోల్పోయిన ఉనికికీ మంచి ఉదాహరణ..ఇందులో విశేషం ఏమిటంటే,ఈ కథకి ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వకుండా ముకుందన్ ఒక రకమైన మిస్టరీని కొనసాగిస్తారు.."రాధ ఎవరు ?" (మనిషి ఎవరు ?)  అనే ప్రశ్న కి స్పష్టమైన సమాధానం ఇవ్వడం అసాధ్యమని రచయిత అభిప్రాయం అనిపించింది..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో కథలన్నీ దేనికవే ప్రత్యేకంగా అనిపించాయి..ఇందులో చదివిన తరువాత ఆలోచనలో పడెయ్యని ఒక్క కథ కూడా లేదని చెప్పడం అతిశయోక్తి కాదు..మలయాళీ కథను దాని చరిత్రనుండీ,ప్రాంతీయత నుండీ వేరు చేసిన ముకుందన్ కథల్ని చదివి తీరాల్సిందే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు ,

He wove his hand in between her slender fingers, in her slender fingers, in her slender fingers.

There are people with syphilis and elephantiasis in Madras. There are no people with elephantiasis in Delhi. There are people with syphilis. The people with syphilis in Delhi do not lie around on the sidewalks; they do not lie down naked in the scorching sunlight; they do not beg. In Delhi, the people with syphilis wear three-piece suits, smoke pipes, drink imported liquor, and travel around in cars as big as cargo ships. Madras is Delhi naked. Delhi is Madras in a three-piece suit.

I opened the window and stood watching the sleeping city. If the world has any beauty at all, it could only be at night. In the daytime, the world shows its raw face. It casts off its clothes and exposes its naked body covered with festering ulcers. With a sinister grin, it parades before us. The world we see at night is a different one. In the bluish darkness, in the soft moonlight, the night envelopes us with its decorative stars, gentle breezes, and silence—this is the world I like.

"No. Up to May 1968, Europe was a fucking desert. A desert populated by snobs, pseudointellectuals, and pseudowhores. Europe is a sham. Their existentialism is bullshit. No whitey has ever said anything that wasn't already said in the Gita."

No comments:

Post a Comment