మనుషుల్లాగే కొన్ని పుస్తకాల కవర్లు కూడా చూడ్డానికి అందంగానూ,ఆసక్తికరంగానూ ఉంటాయి..తీరా పేజీలు తిప్పిచూస్తే గానీ కవర్లకీ కంటెంట్ కీ పోలిక లేదని అర్ధం కాదు..అలాగే కొన్ని టైటిల్స్ కూడా కథ మీద expectations ను పెంచుతాయి..టైటిల్ వైవిధ్యంగా అనిపించీ,పాపులారిటీ చూసీ చదివిన ఈ పుస్తకం ఆశించిన రీతిలో లేక కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమే అయినప్పటికీ 'అస్తమానం అస్తిత్వవాదమేనా ? పుస్తక ప్రియులన్నాకా అప్పుడప్పుడూ యంగ్ అడల్ట్,చిల్డ్రన్ బుక్స్ కూడా చదువుతుండాలి' అని ఒక మహానుభావురాలు చెప్పిన కోట్ (అంటే జస్ట్ ఇప్పుడే నేనే చెప్పాను :P ) కూడా గుర్తొచ్చింది..ప్రపంచాన్ని 'రోజ్ కలర్డ్ గ్లాస్సెస్' లోంచి చూడ్డం మర్చిపోయిన పాఠకుల్ని అన్నీ మంచే,అంతా మంచే అనుకునే అమాయకపు కాలంలోకి తీసుకెళ్తుందీ నవల..ఈ 'వన్ టైం రీడ్' ని చక్కగా మీ to-read ఖాతాలో వేసేసుకోవచ్చు..అమెరికన్ రచయిత్రి Gabrielle Zevin 2013 లో రాసిన 'The Storied Life of A.J.Fikry' పుస్తక ప్రియులకు ఒక చిరుకానుక లాంటి పుస్తకం.
కథ విషయానికొస్తే భారత సంతతికి చెందిన వ్యక్తి A.J.Fikry (అజయ్ ఫిక్రీ) అమెరికాలోని అలిస్ ఐలాండ్ (కల్పిత ప్రదేశం) లో 'ఐలాండ్ బుక్ స్టోర్' నడుపుతుంటాడు..Fredrik Backman 'A Man Called Ove' లో ఓవ్ పాత్రని తలపించే ఫిక్రీ స్వభావ రీత్యా కోపిష్టి..సాహిత్యం విషయంలో ఖచ్చితమైన అభిరుచులు కలిగిన వ్యక్తి..కథ మొదలయ్యే సమయానికి ఫిక్రీ (43) భార్య మరణించడం,బుక్ స్టోర్ నష్టాల్లో కూరుకుపోవడంతో అతని జీవితం తలక్రిందులవుతుంది..ఆ సమయంలో 'Knightley Press' పబ్లిషింగ్ విభాగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన అమీలియా లోమన్ 'ఐలాండ్ పుస్తకాల షాపు'కు కొన్ని ప్రచురణలు తీసుకుని వస్తుంది..తొలి పరిచయంలో ఫిక్రీ దురుసు ప్రవర్తన మూలంగా వెనుదిరిగినా మెల్లిగా ఐలాండ్ నుండి పుస్తకాల ఆర్డర్ రాబట్టాలని ప్రయత్నిస్తుంటుంది..ఇదిలా ఉండగా జీవితం పట్ల ఆశ కోల్పోయి భారంగా బ్రతుకు వెళ్ళ దీస్తున్న సమయంలో ఒక్క రాత్రిలో ఫిక్రీ జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు జరుగుతాయి..ఆ సంఘటనలేంటి ? వాటి కారణంగా ఫిక్రీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ.
స్పష్టమైన సాహితీ అభిరుచులు ఉన్నవారికి ఈ పుస్తకం నచ్చడం కష్టం..అయినప్పటికీ ఈ కథలో కొన్ని లోటుపాట్లతో పాటు పుస్తక ప్రేమికులకు నచ్చే అనేక అంశాలు కూడా ఉన్నాయి..ఉదాహరణకి షార్ట్ స్టోరీస్ అమితంగా ఇష్టపడే ఫిక్రీ ఇందులో ప్రతి అధ్యాయాన్నీ Roald Dahl,Bret Harte,F.Scott Fitzgerald,Flannery O'Connor.Raymond Carver,Mark Twain,Poe మొదలైనవారు రాసిన కథల గురించి ప్రస్తావిస్తూ ప్రారంభించడం బావుంటుంది..అలాగే ఇందులో మనసుని తేలిక పరిచే సునిశిత హాస్యం కూడా ఉంది..ఒక సందర్భంలో ఫిక్రీ కస్టమర్ Mrs.Cumberbatch 'బుక్ థీఫ్' పుస్తకాన్ని నచ్చలేదని ఫిక్రీకి తిరిగిస్తూ చెప్పిన కారణాలు హాస్యపు జల్లులు కురిపిస్తాయి..ఇకపోతే కథానాయకుడి పేరు 'ఫిక్రీ' అని ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు..అతని ఐడెంటిటీకీ ఈ కథకు ఎంతమాత్రం అవసరం లేదు.
కొన్ని జానర్స్ కి లోబడిన రచయిత్రి పుస్తక ప్రపంచం చాలా పరిమితమైనది అనిపించింది..అంతా 'ఫీల్ గుడ్' వాతావరణంలా కనిపించే అలీస్,అందులో ఊహించనలవికానంత 'మంచి మనుషులు' ఒక ఉటోపియా ప్రపంచాన్ని తలపిస్తూ ఒక్కోచోట 'యంగ్ అడల్ట్ ఫిక్షన్' చదువుతున్నామేమోననిపిస్తుంది..ఏమాత్రం పరిపక్వత లేని సాధారణమైన శైలి అయినప్పటికీ ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే పుస్తకం ఆపకుండా చదివిస్తుంది..ఒకే మూసలో ఒకే జానర్ కి పరిమితమయిపోకుండా ఏదైనా చదివే సంసిద్ధత ఉన్న వాళ్ళకు ఈ పుస్తకం ఒక మోస్తరు నచ్చుతుందనే అనుకుంటున్నాను..పెద్దగా మెదడుకు పని చెప్పక్కర్లేకుండా చక్కని కరణ్ జోహార్ సినిమా చూసినట్లూ,విక్టోరియన్ రొమాన్స్ చదువుతున్నట్లూ ఇందులో ఒక పుస్తకాన్ని చదివించడానికి అవసరమైన మెలోడ్రామాతో కూడిన అన్ని కమర్షియల్ అంశాలూ పుష్కలంగా ఉన్నాయి..అన్నిటినీ మించి పుస్తకాల కబుర్లతో పుస్తక ప్రపంచాన్నీ,పబ్లిషింగ్ వ్యవస్థనీ చక్కగా ప్రతిబింబించిన కథ ఉంది..సాహిత్యం అనేది సీరియస్ గా ఉండాలి,సాహితీ విలువలు ఉండాలి అని సాహిత్యానికి కొన్ని ఖచ్చితమైన విలువలు ఆపాదించే కథానాయకుడు ఫిక్రీ లాగానే మనం కూడా ఆలోచించకపోతే ఈ పుస్తకాన్ని చక్కగా ఏ ఎయిర్ పోర్ట్ లోనో,రైల్వే స్టేషన్లోనో కూర్చుని ఒకసారి చదివి ప్రక్కన పెట్టెయ్యొచ్చు..ఈ వేసవిలో సీరియస్ లిటరేచర్ నుండి ప్రక్కకి జరిగి చదివిన ఈ పుస్తకం నాకో ఆటవిడుపు...ఇది గొప్ప పుస్తకం అని అననుగానీ మంచి పుస్తకమే.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
ఫిక్రీ అమీలియాకు తన సాహితీ అభిరుచుల్ని గురించి చెప్తూ,
Image Courtesy Google |

“How about I tell you what I don’t like? I do not like postmodernism, postapocalyptic settings, postmortem narrators, or magic realism. I rarely respond to supposedly clever formal devices, multiple fonts, pictures where they shouldn’t be—basically, gimmicks of any kind. I find literary fiction about the Holocaust or any other major world tragedy to be distasteful—nonfiction only, please. I do not like genre mash-ups à la the literary detective novel or the literary fantasy. Literary should be literary, and genre should be genre, and crossbreeding rarely results in anything satisfying. I do not like children’s books, especially ones with orphans, and I prefer not to clutter my shelves with young adult. I do not like anything over four hundred pages or under one hundred fifty pages. I am repulsed by ghostwritten novels by reality television stars, celebrity picture books, sports memoirs, movie tie-in editions, novelty items, and—I imagine this goes without saying—vampires. I rarely stock debuts, chick lit, poetry, or translations. I would prefer not to stock series, but the demands of my pocketbook require me to. For your part, you needn’t tell me about the ‘next big series’ until it is ensconced on the New York Times Best Sellers list. Above all, Ms. Loman, I find slim literary memoirs about little old men whose little old wives have died from cancer to be absolutely intolerable. No matter how well written the sales rep claims they are. No matter how many copies you promise I’ll sell on Mother’s Day.”
“Infinite Jest is an endurance contest. You manage to get through it and you have no choice but to say you like it. Otherwise, you have to deal with the fact that you just wasted weeks of your life,” A.J. had countered.“Style, no substance, my friend.”
Despite the fact that he loves books and owns a bookstore, A.J. does not particularly care for writers. He finds them to be unkempt, narcissistic, silly, and generally unpleasant people. He tries to avoid meeting the ones who’ve written books he loves for fear that they will ruin their books for him. Luckily, he does not love Daniel’s books, not even the popular first novel. As for the man? Well, he amuses A.J. to an extent. This is to say, Daniel Parish is one of A.J.’s closest friends.
“Poe’s a lousy writer, you know? And ‘Tamerlane’ is the worst. Boring Lord Byron rip-off. It’d be one thing if it were a first edition of something fucking decent. You should be glad to be rid of it. I loathe collectible books anyway. People getting all moony over particular paper carcasses. It’s the ideas that matter, man. The words,” Daniel Parish says. A.J. finishes his beer. “You, sir, are an idiot.”
I was on my way to a PhD in American literature before I quit that to open this bookstore. My specialty was Edgar Allan Poe. ‘The Fall of the House of Usher’ is a decent primer on what not to do with children.”
The town florist tells a story about leaving a pair of sunglasses in Island Books and coming back less than one day later to find that A.J. had thrown them out. “He said his store had no room for a lost-and-found. And that’s what happens to very nice, vintage Ray-Bans!” the florist says.
“Sometimes books don’t find us until the right time.”
“No one travels without purpose. Those who are lost wish to be lost.”
We are not quite short stories.In the end, we are collected works.He has read enough to know there are no collections where each story is perfect. Some hits. Some misses. If you’re lucky, a standout. And in the end, people only really remember the standouts anyway, and they don’t remember those for very long. No, not very long.
I know what words do, he thinks. They let us feel less.
No comments:
Post a Comment