స్త్రీవాదాన్ని జీవపరిణామ క్రమాన్ననుసరించి నాగరిక సమాజానికి సంబంధించిన అంశంగా మాత్రమే చూడాలంటే ఎందుకో మనసొప్పదు..ఆనాడు సీతాదేవిని అగ్ని పరీక్షకి నిలబెట్టినప్పుడు ఒకసారి ఓర్చుకున్నా,రెండోసారి నిండు గర్భిణి అని తెలిసీ అడవులపాలు చేసి తుదకు మళ్ళీ చేపడతానంటే వద్దుపొమ్మని ఒక నమస్కారం పెట్టి తల్లి వెంట వెళ్ళిపోయింది..ఇక నిండు సభలో చీరలాగి అవమానించిన పాపానికి కురుక్షేత్రంలో చిందిన రక్తాన్ని తన కురులకు రాసుకున్నాక గానీ నిద్రపోలేదు ద్రౌపది (ఎందుకో పవర్ఫుల్ వుమన్ స్వర్గీయ జయలలిత గుర్తొస్తోంది :) )..ఇక గ్రీకు పురాణాలు పరిశీలిస్తే ప్రియమ్,హెక్టర్ లాంటి మహాయోధులకు నెలవైన అతి గొప్ప ట్రాయ్ నగరం హెలెన్ కారణంగా నేలకొరిగింది..ఇవి మచ్చుకి కొన్ని సంఘటనలంతే..ఆకాలంలో కూడా పురుష సమాజం రాయల్టీగా భావించే వర్గం మంచైనా,చెడైనా తమ మనోభీష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో రక్తాన్ని ఏరులుగా పారించడానికి సైతం వెనుకాడలేదు..పురాణేతిహాసాలు చూసినా,చరిత్ర తిరగేసినా ఇలాంటివి కోకొల్లలు..నేటి తరం రచయిత్రులు సాహితీ ప్రపంచంలో తమ సాధికారతను చాటుకుంటూ చరిత్రలో మరుగునపడ్డ స్త్రీవాదాన్ని ఇటువంటి కథల రూపంలో తవ్వి బయటకి తీస్తున్నారు..ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచిన మాడెలైన్ మిల్లర్ (Madeline Miller) రచన 'Circe' (Circe - గ్రీకు భాషలో 'కీర్కీ' ) అటువంటి ఒక స్త్రీమూర్తి కథే.
మాడెలైన్ మిల్లర్ సుప్రసిద్ధ రచన 'The Song of Achilles' చదువుదామని చాలా కాలం నుండీ అనుకుంటున్నా ఇంతవరకూ కుదరలేదు..ఈలోగా సిర్సే గురించి సాహితీ ప్రపంచంలో జరుగుతున్న హంగామా చూసి ఆసక్తి కొద్దీ ముందు ఇదే చదువుదామని మొదలుపెట్టాను..ఆ మధ్య ఇటాలో కాల్వినో 'Six Memos for the Next Millennium' చదివినప్పుడు భారతీయ సాహిత్యంపై మన పురాణాల్లాగే పాశ్చాత్య సాహిత్యంపై గ్రీకు మైథాలజీ ప్రభావం గురించి తెలిసింది..ముఖ్యంగా మ్యాజికల్ రియలిజం,ఫాంటసీ లాంటి జానర్స్ లో అనేక పాశ్చాత్య రచనలకు స్ఫూర్తినిచ్చిన అంశాలకు మూలాలు గ్రీకు పురాణాల్లోంచి వ్రేళ్ళూనుకున్నవే..ఈ 'సిర్సే' కూడా గ్రీక్ మైథాలజీ నుండి సంగ్రహించిన కథే.
గ్రీకు మైథాలజీలో సూర్యుణ్ణి 'హేలియోస్' అంటారు..'సిర్సే' సూర్యపుత్రిక...హేలియోస్ కీ,వనదేవత పెర్సె కీ జన్మించిన సిర్సే సౌందర్యవతి కాదు..అతి సాధారణమైన రూపు రేఖల్తో జన్మించిన ఆమెను చూసి ఆమె ఒక రాకుమారుణ్ణి (మానవుణ్ణి ) పెళ్ళాడుతుందని జోస్యం చెప్తాడు తండ్రి...ఆమె దేవతల హోదాకూ,దర్జాకూ సరితూగదని భావించి తల్లి సైతం పెదవి విరుస్తుంది..తోబుట్టువులతో సహా అందరూ మనుషుల్ని పోలిన ఆమె స్వరాన్ని కీచు గొంతుకంటూ అవహేళన చేస్తారు..దేవతలకున్నంత శక్తిసామర్ధ్యాలు లేని సాధారణమైన వనదేవత (nymph) సిర్సే..కానీ “Some birds are not meant to be caged" అని స్టీఫెన్ కింగ్ అన్నట్లు సిర్సే లోని తిరుగుబాటు ధోరణి,స్వేచ్చ కోసం ప్రాకులాడే విశిష్ట వ్యక్తిత్వం ఆమెను మిగతా టైటన్స్ నుండి వేరుగా నిలబెడతాయి..మానవులకు సహాయపడ్డాడనే నేరంపై టైటన్స్,ఒలింపియన్స్ కలిసి శిక్షించిన ప్రొమీథియస్ కు ఎవరూ చూడకుండా తాగడానికి తేనె అందించి చిన్నతనంలోనే తన ధైర్యాన్ని చాటుకుంటుంది..దేవలోకంలో ఆధిపత్య పోరాటాలూ,రాజకీయ ఎత్తుగడలూ,కుట్రలూ,కుతంత్రాల నడుమ జీవిస్తూ,వాటంతటికీ అతీతమైన తన సహజమైన ఉనికిని వెతుక్కుంటూ ఉంటుంది..విచిత్రంగా ఈ కథలో దేవుళ్ళు కూడా ప్రతినాయకుల్లా కనిపిస్తారు..దేవలోకంలో కూడా ఇక్కడిలాగే అన్ని జాఢ్యాలూ ఉంటాయి..తమ పని జరిపించుకోడం కోసం సౌందర్యాన్ని ఎరవేసే దేవతలూ,తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం కన్నపిల్లల్ని సైతం బలిపెట్టే దేవుళ్ళూ అక్కడ కూడా సర్వసాధారణం..దేవతలు బలుల పేరుతో మనుషుల్నితమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు,తమ మాట చెల్లకపోతే వారిని అష్టకష్టాల పాలు చేస్తుంటారు..సిర్సే తండ్రి హేలియోస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
తాను నమ్మినదాన్ని ఆచరించే సిర్సే ఒక దశలో Glaucos కాదన్నాడనే కోపంతో అతని ప్రియురాలు Scylla ను సముద్రపు రాక్షసిగా మార్చేస్తుంది..సిర్సే శక్తిసామర్ధ్యాలు తమకు ముప్పని భావించిన కారణంగా Zeus సూచనమేరకు హేలియోస్ ఆమెను ఒక ద్వీపంలో(Aiaia) ఒంటరిగా బ్రతకమని శాసిస్తాడు..ఓటమినంగీకరించని తత్వంతో,ఆ ద్వీపంలో ఒంటరితనాన్ని సైతం తన బలంగా మార్చుకుంటూ ఆమె వనమూలికలతో అనేక ప్రయోగాలు చేస్తుంది..మంత్రతంత్రాలతో సింహాలనూ,తోడేళ్ళనూ మచ్చిక చేసుకుంటుంది..సముద్ర ప్రయాణంలో యాదృచ్చికంగా ఆ తీరం చేరి ఆశ్రయంకోరి వచ్చిన మనుషుల్ని తాను దేవతనని మర్చిపోయి ప్రేమగా ఆదరిస్తుంది..ఇంతవరకూ బాగానే ఉన్నా,ఆమె ఒక స్త్రీ..ఎవరి రక్షణలోనూ లేని ఒంటరి స్త్రీ...కేవలం ఒక స్త్రీ కావడం వలన ఎదురయ్యే విపరీత పరిస్థితులు ఆమెక్కూడా ఎదురవుతాయి..ఒకసారి ఆమె దేవత అని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిని తన మంత్రశక్తితో పందులుగా మార్చేస్తుంది..ఒంటరి స్త్రీ అయిన కారణంగా అటు దేవతలతోనూ,ఇటు మానవులతోనూ కూడా పోరాడి నిలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది..కానీ అప్పుడు కూడా సిర్సేలో ధైర్యం చెక్కుచెదరదు.
అతిథులుగా వచ్చి ఆమెపై దాడి చెయ్యాలనుకునే వారినందరినీ పందులుగా మార్చేస్తూ ఉంటుంది..ఈ క్రమంలో డెడాలస్,హెర్మెస్,ఒడిస్సియస్ వంటి పలువురితో సహజీవనం చేసినా ఆ సంబంధాలేవీ వివాహానికి దారి తియ్యవు..చివరకు వివాహితుడైన ఒడిస్సియస్ ద్వారా ఒక మగపిల్లవానికి (టెలిగోనస్) జన్మనిస్తుంది..టెలిగోనస్ రాకతో ఆమె ప్రపంచమే మారిపోతుంది..కానీ ఎథేనా(Goddess of wisdom and war) వలన టెలిగోనస్ ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తెలిసి ఆ ద్వీపాన్నంతా తన మంత్రశక్తితో బంధించి టెలిగోనస్ ని రక్షిస్తూ ఉంటుంది...కానీ పదహారేళ్ళ ప్రాయానికి వచ్చిన టెలిగోనస్ లో సహజంగానే ఆలోచనలు రెక్కలు విప్పుకుంటుంటాయి..ఆ ద్వీపానికి ఆవలి ప్రపంచం చూడాలని కలలు గంటూ,తండ్రి ఒడిస్సియస్ ని కలుసుకోడానికి ఇథాకా (Ithaca) వెళ్తానని మంకుపట్టు పడతాడు..ఆ ద్వీపాన్ని వదిలి వెళ్తే అతడు ఎథెనా చేతిలో ఖచ్చితంగా మరణిస్తాడు..కానీ ప్రపంచం చూడకుండా ఇక్కడ వందేళ్ళు బ్రతికేకంటే ఎథెనా చేతిలో మరణమే నయమని వాదించే కొడుకు మాటను త్రోసిపుచ్చలేక తప్పనిసరై అంగీకరిస్తుంది సిర్సే..ఆ తరువాత సిర్సే ప్రాణానికి ప్రాణమైన టెలిగోనస్ భవిష్యత్తు ఏమైందనేది మిగతా కథ.
మంత్రతంత్రాల్లో ఆరితేరి 'Witch of Aiaia' గా ప్రసిద్ధికెక్కిన సిర్సే దేవలోకపు పురుషాధిపత్యాన్ని ధిక్కరించిన దేవత..అలనాటి గ్రీకు అంతఃపురాలకు అలంకారణాలుగా మిగిలిపోయిన అనేకమంది స్త్రీల మధ్య ఆమె ఒక విప్లవం..సిర్సే దేవలోకాన్నేలే టైటన్స్,ఒలింపియన్స్ చేసిన ఘాతుకాలకు ప్రత్యక్ష సాక్షిగా మారి మనకీ కథను చెప్తుంది..నిజానికి ఈ కథలో మనకు ఆమె ఒక దేవతగా కంటే,ఒక సాధారణమైన స్త్రీగానే కనిపిస్తుంది..Zeus కి భయపడి కుటుంబం వెలివేసినా చివరివరకూ ఆత్మస్థైర్యంతో జీవిస్తుంది..తనలోని ప్రతిభకు సానపెట్టుకుంటూ శక్తివంతమైన మహిళగా ఎదిగి తుదకు తండ్రికే ఎదురు తిరిగి నిలుస్తుంది..హేలియోస్ కుమార్తెగా మాత్రమే కాక తనకు తాను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది..ఈ కథలో మానవీయ విలువలకూ,దేవలోకపు ఆధిపత్యానికి మధ్య జరిగే సంఘర్షణలు అడుగడుగునా కనిపిస్తాయి..సిర్సేతో పాటు ఈ కథలో ఒడిస్సియస్ భార్య పెనెలోప్ పాత్రని కూడా శక్తిమంతంగా తీర్చిదిద్దారు..గ్లౌకోస్ టైటన్ గా మారడం,సిర్సే చేతుల్లో మినోటార్ జననం,సిర్సే కొడుకు టెలిగోనస్ ను రక్షించుకోడానికి చేసే సాహసాలు లాంటివి కథను రక్తికట్టిస్తాయి..ఈ కథ ముగింపు మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది..ఎందుకంటే రాక్షసులకే కాదు దేవతలకి కూడా వావీ వరుసలుండవట..సిర్సే పాత్ర రూపకల్పనలో నాకు నచ్చిన విషయమేంటంటే,ఆమెను గొప్ప స్త్రీ మూర్తిగా పరిపూర్ణతకు ప్రతీకగా చూపించే ప్రయత్నం ఎక్కడా చెయ్యకపోవడం..సిర్సే లో కూడా ఈర్ష్యా,ద్వేషం లాంటి సహజమైన లక్షణాలన్నీ ఉంటాయి,ఆమె కూడా కొన్ని తప్పులు చేస్తుంది..ఇక రెండో అంశం,సిర్సే స్త్రీవాదం ముసుగులో చుట్టూ ఉన్న సమాజాన్ని తూలనాడుతూ,తన జీవితానికి వేరొకరిని బాధ్యులను చేస్తూ పరనింద చేస్తూ కూర్చోకుండా తనలోని ప్రతిభకు మెరుగులద్దుకుని కథ ముగిసే సమయానికి సర్వస్వతంత్రురాలిగా ఆవిర్భవిస్తుంది..ఇందులో మాడెలైన్ శైలి చిత్రా బెనర్జీ దివాకరుని 'The palace of illusions',ఇందు సుందరేశన్ తాజ్ మహల్ ట్రయాలజీ లో 'The Twentieth wife' లాంటి పుస్తకాల్ని గుర్తుకు తెచ్చింది..సుమారు నాలుగొందల పేజీల పుస్తకమైనా వదలకుండా చదివిస్తుంది.
పుస్తకం నుండి కొన్ని,
Image Courtesy Google |

For a hundred generations, I had walked the world drowsy and dull, idle and at my ease. I left no prints, I did no deeds. Even those who had loved me a little did not care to stay.Then I learned that I could bend the world to my will, as a bow is bent for an arrow. I would have done that toil a thousand times to keep such power in my hands. I thought: this is how Zeus felt when he first lifted the thunderbolt.
Daedalus did not long outlive his son. His limbs turned gray and nerveless, and all his strength was transmuted into smoke. I had no right to claim him, I knew it. But in a solitary life, there are rare moments when another soul dips near yours, as stars once a year brush the earth. Such a constellation was he to me.
“You are wrong about witchcraft,” I told her. “It does not come from hate. I made my first spell for love of Glaucos.”
No comments:
Post a Comment