Friday, June 28, 2019

The Penelopiad - Margaret Atwood

Madelaine Miller 'Circe' చదువుతున్నప్పుడు అందులో ఒడీసియస్ భార్య 'పెనెలోప్' పాత్ర నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది..ఒడిసియస్ తో Circe కొంతకాలం సహజీవనం చేస్తుంది..స్పార్టన్ రాజకుమారి పెనెలోప్ స్థిరత్వానికి నిలువెత్తు నిర్వచనం..చెక్కుచెదరని ధృడమైన వ్యక్తిత్వంతో ఒడిస్సియస్ కు సరిసాటి తెలివితేటలున్న వ్యక్తిగా భర్త మరణానంతరం సిర్సే దగ్గరకి ఆశ్రయం కోరి వచ్చిన ఆమె గురించి మరింత తెలుసుకోవాలని కుతూహలం కొద్దీ సర్ఫ్ చెయ్యగా 'పెనెలోప్' పాత్ర ప్రధానంగా మార్గరెట్ ఆట్వుడ్ రాసిన 'The Penelopiad' అనే పుస్తకం కనిపించింది..ఈ కథకు మూలం హోమర్ 'ఒడిస్సి' అయినప్పటికీ పెనెలోప్ దృష్టికోణం నుండి రాసిన ఈ కథకు కొన్ని మార్పులూ-చేర్పులు చేసి 'పెనెలోపియాడ్' అని పేరు పెట్టారు..కానీ అసలు కంటే కొసరు అన్నరీతిలో నాకు సిర్సే కంటే పెనెలోపియాడ్ ఇంకా ఎక్కువ నచ్చింది..స్థిర గంభీరమైన నది లాంటి మాడెలైన్ మిల్లర్ నేరేషన్ తో పోలిస్తే తళుక్కున మెరిసే వ్యంగ్యాస్త్రాలు,హాస్యం మేళవించిన కథనం,చక్కని ఛలోక్తులతో మార్గరెట్ ఆట్వుడ్ నేరేషన్ లోని 'ease' ఉరకలు-పరుగుల జలపాతంలా మరింత ఆసక్తికరంగా సాగింది..ఒక స్త్రీవాద రచన చదువుతున్నామనే స్పృహ పాఠకులకు కలగకుండా గంభీరమైన సన్నివేశాన్ని సైతం సున్నితమైన హాస్యంతో తేలికపరుస్తూ చక్కని సమతౌల్యంతో ఈ కథను రాశారు మార్గరెట్ ఆట్వుడ్..Circe - The Penelopiad ఈ రెండూ జంట పుస్తకాల్లాంటివి..ఈ రెండు పుస్తకాలనూ వరుసగా చదివితే కుటిలతంత్రాల్లో చాణక్యుణ్ణి తలపించే ఒడీసియస్ వీరగాథల్ని(?) ఏకకాలంలో ఇద్దరి స్త్రీల దృష్టికోణాలనుంచి చూసిన అనుభవం కలుగుతుంది..కానీ ఈ రెండు నవలలు చదివేముందు హోమర్ ఒడిస్సి గురించి కొంచెం తెలిసుంటే మరికొంచెం నచ్చుతుంది.
Image Courtesy Google
గ్రీకు మైథాలజీ తెలిసినవారికి ఒడీసియస్ కథ పరిచయమే...అతనొక మహా వీరుడు,అపర చాణక్యుడు,కుతంత్ర బుద్ధి కలవాడు,తన మాటల గారడీతో ఎవరినైనా తనవైపుకు తిప్పుకోగల మేథావి,అఛిల్లిస్ మనసు మార్చి ట్రోజన్ యుద్ధానికి తీసుకెళ్ళిన సమర్ధుడు..ఇలా చెప్పుకుంటూ పోతే పురాణకాలం నుండీ ఈనాటి వరకూ ఒడీసియస్ వీరగాథలు మహా కావ్యాలన్నీ వీనులవిందుగా గానం చేస్తూనే ఉన్నాయి..కానీ ఒడీసియస్ తన కథలో నిజంగా నాయకుడేనా ? అతను చేసిన పనులన్నీ ధర్మబద్ధమైనవేనా ?

మనం ఏర్పరుచుకునే అభిప్రాయాల్లో నూటికి తొంభై శాతం విన్నవో,కన్నవో,ఎవరైనా మనతో అన్నవో అయ్యి ఉంటాయి..స్వానుభవంతో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రావడం బహు అరుదే కాదు అన్ని సమయాల్లోనూ అసాధ్యం కూడానూ..గ్రీకు పురాణాల ప్రకారం మృతి చెందిన తరువాత పాతాళ లోకానికి చేరిన అందరూ తమతో పాటు ఒక చిన్న సంచీ తీసుకుని వెళ్తారట..అన్నవీ,విన్నవీ,కన్నవీ అన్నీ కలిగిన ఆ సంచీలు ఒక్కొక్కటీ ఒక్కో బరువు ఉంటాయట..పెనెలోప్ సంచీ బరువు మధ్యస్థంగానే ఉన్నా,అందులో తొంభై శాతం ఆమె భర్త ఒడీసియస్ చెప్పిన విషయాలే ఉన్నాయి అంటుంది..నిజానికి పెనెలోప్ ఒడీసియస్ తత్వం గురించి స్పృహ లేని అమాయకురాలు కాదు..కానీ అతను మాట్లాడేవన్నీ అసత్యాలని తెలిసినా అతన్ని గుడ్డిగా  నమ్ముతుంది..జీవించి ఉన్నకాలంలో సీతా దేవంత సహన మూర్తిగా భర్త మాటకు ఎదురు చెప్పని పతివ్రతా శిరోమణిగా పేరు తెచ్చుకున్నపెనెలోప్ మరణానంతరం "Now that I’m dead I know everything" అంటూ తన అస్తిత్వాన్ని సత్యాసత్య విచారణ చేయ సంకల్పిస్తుంది.

ఈ కథను వర్తమానంలోనే చెప్తారు...కథ మొదలుపెట్టే సమయానికి మరణించిన పెనెలోప్ ఆత్మ మన సమాజంలో సంచరిస్తూ ఉంటుంది..గ్రీకు పురాణాల కాలానికీ,వర్తమానానికీ ఉన్న తేడాలను గమనిస్తూ తన గతాన్ని పునఃపరిశీలించుకుంటుంది..పెనెలోప్ పినతండ్రి కూతురు హెలెన్ స్వార్ధం కారణంగా జరిగిన ట్రోజన్ (ట్రాయ్) యుద్ధంలో ఒడీసియస్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు..పదేళ్ళ సుదీర్ఘకాలం పాటు జరిగిన ట్రోజన్ యుద్ధం,అటుపైన మరో పదేళ్ళ తిరుగుప్రయాణంలో సముద్రయానంలో మార్గ మధ్యంలో మాంత్రికురాలు సిర్సే తో సహజీవనం,సైక్లోప్ అనే ఒంటి కన్ను రాక్షసిని చంపడం లాంటి అనేక సాహసాలూ,మజిలీల కారణంగా సుమారు ఇరవై ఏళ్ళ తరువాత ఒడీసియస్ ఇల్లు చేరతాడు..పదిహేనేళ్ళ పసి ప్రాయంలో భర్త వదిలి వెళ్ళిన ఒడీసియస్ ఏ నాటికైనా తిరిగొస్తాడని కొడుకు టెలిమాచుస్ తో ఇథాకాలో అతడి కోసం వేచి చూస్తుంది..కానీ ఆ సమయం ఆమెకు కఠినమైన పరీక్షలు పెడుతుంది.

ఇథాకాలో ఒడీసియస్ లేని సమయాన్ని అదను చూసుకుని ఆ రాజ్యంలోని ప్రతి యువకుడూ పెనెలోప్ సంపద,అధికారం మీద ఆశతో వయసులో తమకంటే పెద్దదైన ఆమెను(35) ని తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వేధిస్తుంటారు..ఒడీసియస్ తిరిగిరాడన్న ధీమాతో ఆ అల్లరి మూక రాజభవనంలో చేరి ఆమె సంపదను తింటూ ఆమెను హింసిస్తూ ఉంటారు..కానీ పెనెలోప్ వందమంది పైగా ఉన్న ఆ యువకుల్ని తన తెలివితేటలతో మభ్య పెడుతూ భర్త రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది..ఈ సమయంలో పెనెలోప్ సొంత కూతుళ్ళలా చూసుకునే ఆమె పన్నెండుమంది దాసీలూ(కన్యలు) ఆమెకు సహాయపడుతూ ఉంటారు..కానీ ఆ యువకులతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు నటిస్తూ పెనెలోప్ ఆదేశం మేరకు వారి వ్యూహాల్ని ఆమెకు చేరవేసే క్రమంలో వారిలో కొందరు మానభంగానికి గురైతే మరి కొందరు అయిష్టంగానే వారికి లొంగిపోతారు..కానీ పెనెలోప్ మీద అభిమానంతో వారీ దురాగతాలన్నిటినీ ఓర్చుకుంటారు.

అప్పటికే భార్య గురించిన పుకార్లు ఆ నోటా ఈ నోటా వినియున్న ఒడీసియస్ ఇరవై ఏళ్ళ తరువాత రాజభవంతికి బిచ్చగాడి మారువేషంలో వస్తాడు..అక్కడ జరుగుతున్న వ్యవహారంలో ఆమె ప్రమేయం లేదని గ్రహించి ఆమెను వివాహమాడడానికి వేచి ఉన్న వరులను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు..తరువాత వందమందికి పైగా ఉన్న శవాలనూ,వాటి తాలూకా రక్తపు మరకలనూ పన్నెండుమంది దాసీల చేత శుభ్రం చేయిస్తాడు..ఆ కన్యలు పెనెలోప్ కి సహాయం చేస్తున్నారని తెలుసుకోకుండా కేవలం ఆ యువకులతో గడిపిన నేరానికి వారిని కూడా టెలిమాచుస్ చేత ఉరితీయిస్తాడు..ఈ కథలో మరణించిన పన్నెండుమంది కన్యలూ ఆత్మలుగా మారి వర్తమాన కాలంలో తమకు న్యాయం జరిపించమని కోర్టును ఆశ్రయిస్తారు..ఈ విషయంలో కోర్టులో జరిగే వాదోపవాదాలు హాస్యాన్ని పండిస్తాయి..పెనెలోప్ తనని సంప్రదించకుండా ఇంత మారణహోమం తలపెట్టిన ఒడీసియస్ కౄరత్వాన్ని ఖండించలేక,తాను అల్లారుముద్దుగా పెంచుకున్న పన్నెండుమంది కన్యల మృతినీ మౌనంగా దిగమింగుకుంటూ ఆ కాలంలో స్త్రీలకున్న పరిమితుల్నీ,అంతఃపురంలో దాసీలు ఎదుర్కునే ఘోరమైన పరిస్థితుల్నీ గుర్తు చేసుకుంటుంది..పద్యాన్నీ,గద్యాన్నీ మేళవించి రాసిన ఈ కథలో పద్య భాగం పన్నెండు మంది కన్యల దృష్టికోణం నుండీ,గద్యాన్ని పెనెలోప్ దృష్టికోణం నుండీ రాశారు..ఒడీసియస్ క్రూరత్వానికీ ,సోదరుడిలా పెంచిన టెలిమాచుస్  కిరాతకానికీ తాము బలైన వైనాన్ని పన్నెండుమంది యువతులూ పద్యాల రూపంలో గానం చేస్తారు..బేసిక్ స్టోరీ లైన్ తెలుసుకుని ఈ కథ చదివితే పుస్తకం మరింత బాగా నచ్చుతుంది..మాడెలైన్ మిల్లర్ 'సిర్సే' చదవడమంటూ జరిగితే వెనువెంటనే మార్గరెట్ ఆట్వుడ్ 'పెనెలోపియాడ్' కూడా తప్పక చదవండి..ఆట్వుడ్ అద్భుతమైన నేరేషన్ పుస్తకాన్ని క్రింద పెట్టనివ్వదు..Happy Reading.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
It was claimed she’d come out of an egg, being the daughter of Zeus who’d raped her mother in the form of a swan.She was quite stuck-up about it, was Helen. I wonder how many of us really believed that swan-rape concoction? There were a lot of stories of that kind going around then – the gods couldn’t seem to keep their hands or paws or beaks off mortal women, they were always raping someone or other.
Immortality and mortality didn’t mix well: it was fire and mud, only the fire always won.
The gods were never averse to making a mess. In fact they enjoyed it. To watch some mortal with his or her eyes frying in their sockets through an overdose of god-sex made them shake with laughter. There was something childish about the gods, in a nasty way. I can say this now because I no longer have a body, I’m beyond that kind of suffering, and the gods aren’t listening anyway. As far as I can tell they’ve gone to sleep. In your world, you don’t get visitations from the gods the way people used to unless you’re on drugs.
I know it isn’t me they’re after, not Penelope the Duck. It’s only what comes with me – the royal connection, the pile of glittering junk. No man will ever kill himself for love of me.And no man ever did. Not that I would have wanted to inspire those kinds of suicides. I was not a man-eater, I was not a Siren, I was not like cousin Helen who loved to make conquests just to show she could.
Odysseus won it. He cheated, as I later learned. My father’s brother, Uncle Tyndareus, father of Helen – though, as I’ve told you, some said that Zeus was her real father – helped him to do it. He mixed the wine of the other contestants with a drug that slowed them  down, though not so much as they would notice; to Odysseus he gave a potion that had the opposite effect. I understand that this sort of thing has become a tradition, and is still practiced in the world of the living when it comes to athletic contests
It’s hard to lose an argument to one’s teenaged son. Once they’re taller than you are, you have only your moral authority: a weak weapon at best.

Thursday, June 27, 2019

Circe - Madeline Miller

స్త్రీవాదాన్ని జీవపరిణామ క్రమాన్ననుసరించి నాగరిక సమాజానికి సంబంధించిన అంశంగా మాత్రమే చూడాలంటే ఎందుకో మనసొప్పదు..ఆనాడు సీతాదేవిని అగ్ని పరీక్షకి నిలబెట్టినప్పుడు ఒకసారి ఓర్చుకున్నా,రెండోసారి నిండు గర్భిణి అని తెలిసీ అడవులపాలు చేసి తుదకు మళ్ళీ  చేపడతానంటే వద్దుపొమ్మని ఒక నమస్కారం పెట్టి తల్లి వెంట వెళ్ళిపోయింది..ఇక నిండు సభలో చీరలాగి  అవమానించిన పాపానికి కురుక్షేత్రంలో చిందిన రక్తాన్ని తన కురులకు రాసుకున్నాక గానీ నిద్రపోలేదు ద్రౌపది (ఎందుకో పవర్ఫుల్ వుమన్ స్వర్గీయ జయలలిత గుర్తొస్తోంది :) )..ఇక గ్రీకు పురాణాలు పరిశీలిస్తే ప్రియమ్,హెక్టర్ లాంటి మహాయోధులకు నెలవైన అతి గొప్ప ట్రాయ్ నగరం హెలెన్ కారణంగా నేలకొరిగింది..ఇవి మచ్చుకి కొన్ని సంఘటనలంతే..ఆకాలంలో కూడా పురుష సమాజం రాయల్టీగా భావించే వర్గం మంచైనా,చెడైనా తమ మనోభీష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో రక్తాన్ని ఏరులుగా పారించడానికి సైతం వెనుకాడలేదు..పురాణేతిహాసాలు చూసినా,చరిత్ర తిరగేసినా ఇలాంటివి కోకొల్లలు..నేటి తరం రచయిత్రులు సాహితీ ప్రపంచంలో తమ సాధికారతను చాటుకుంటూ చరిత్రలో మరుగునపడ్డ స్త్రీవాదాన్ని ఇటువంటి కథల రూపంలో తవ్వి బయటకి తీస్తున్నారు..ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచిన మాడెలైన్ మిల్లర్ (Madeline Miller) రచన 'Circe' (Circe - గ్రీకు భాషలో 'కీర్కీ' ) అటువంటి ఒక స్త్రీమూర్తి కథే.
Image Courtesy Google
మాడెలైన్ మిల్లర్ సుప్రసిద్ధ రచన 'The Song of Achilles' చదువుదామని చాలా కాలం నుండీ అనుకుంటున్నా ఇంతవరకూ కుదరలేదు..ఈలోగా సిర్సే గురించి సాహితీ ప్రపంచంలో జరుగుతున్న హంగామా చూసి ఆసక్తి కొద్దీ ముందు ఇదే చదువుదామని మొదలుపెట్టాను..ఆ మధ్య ఇటాలో కాల్వినో 'Six Memos for the Next Millennium' చదివినప్పుడు భారతీయ సాహిత్యంపై మన పురాణాల్లాగే పాశ్చాత్య సాహిత్యంపై గ్రీకు మైథాలజీ ప్రభావం గురించి తెలిసింది..ముఖ్యంగా మ్యాజికల్ రియలిజం,ఫాంటసీ లాంటి జానర్స్ లో అనేక పాశ్చాత్య రచనలకు స్ఫూర్తినిచ్చిన అంశాలకు మూలాలు గ్రీకు పురాణాల్లోంచి వ్రేళ్ళూనుకున్నవే..ఈ 'సిర్సే' కూడా గ్రీక్ మైథాలజీ నుండి సంగ్రహించిన కథే.

గ్రీకు మైథాలజీలో సూర్యుణ్ణి 'హేలియోస్' అంటారు..'సిర్సే' సూర్యపుత్రిక...హేలియోస్ కీ,వనదేవత పెర్సె కీ జన్మించిన సిర్సే సౌందర్యవతి కాదు..అతి సాధారణమైన రూపు రేఖల్తో జన్మించిన ఆమెను చూసి ఆమె ఒక రాకుమారుణ్ణి (మానవుణ్ణి ) పెళ్ళాడుతుందని జోస్యం చెప్తాడు తండ్రి...ఆమె దేవతల హోదాకూ,దర్జాకూ సరితూగదని భావించి తల్లి సైతం పెదవి విరుస్తుంది..తోబుట్టువులతో సహా అందరూ మనుషుల్ని పోలిన ఆమె స్వరాన్ని కీచు గొంతుకంటూ అవహేళన చేస్తారు..దేవతలకున్నంత శక్తిసామర్ధ్యాలు లేని సాధారణమైన వనదేవత (nymph) సిర్సే..కానీ “Some birds are not meant to be caged" అని స్టీఫెన్ కింగ్ అన్నట్లు సిర్సే లోని తిరుగుబాటు ధోరణి,స్వేచ్చ కోసం ప్రాకులాడే విశిష్ట వ్యక్తిత్వం ఆమెను మిగతా టైటన్స్ నుండి వేరుగా నిలబెడతాయి..మానవులకు సహాయపడ్డాడనే నేరంపై టైటన్స్,ఒలింపియన్స్ కలిసి శిక్షించిన ప్రొమీథియస్ కు ఎవరూ చూడకుండా తాగడానికి తేనె అందించి చిన్నతనంలోనే తన ధైర్యాన్ని చాటుకుంటుంది..దేవలోకంలో ఆధిపత్య పోరాటాలూ,రాజకీయ ఎత్తుగడలూ,కుట్రలూ,కుతంత్రాల నడుమ జీవిస్తూ,వాటంతటికీ అతీతమైన తన సహజమైన ఉనికిని వెతుక్కుంటూ ఉంటుంది..విచిత్రంగా ఈ కథలో దేవుళ్ళు కూడా ప్రతినాయకుల్లా కనిపిస్తారు..దేవలోకంలో కూడా ఇక్కడిలాగే అన్ని జాఢ్యాలూ ఉంటాయి..తమ పని జరిపించుకోడం కోసం సౌందర్యాన్ని ఎరవేసే దేవతలూ,తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం కన్నపిల్లల్ని సైతం బలిపెట్టే దేవుళ్ళూ అక్కడ కూడా సర్వసాధారణం..దేవతలు బలుల పేరుతో మనుషుల్నితమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు,తమ మాట చెల్లకపోతే వారిని అష్టకష్టాల పాలు చేస్తుంటారు..సిర్సే తండ్రి హేలియోస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

తాను నమ్మినదాన్ని ఆచరించే సిర్సే ఒక దశలో Glaucos కాదన్నాడనే కోపంతో అతని ప్రియురాలు Scylla ను సముద్రపు రాక్షసిగా మార్చేస్తుంది..సిర్సే శక్తిసామర్ధ్యాలు తమకు ముప్పని భావించిన కారణంగా Zeus సూచనమేరకు హేలియోస్ ఆమెను ఒక ద్వీపంలో(Aiaia) ఒంటరిగా బ్రతకమని శాసిస్తాడు..ఓటమినంగీకరించని తత్వంతో,ఆ ద్వీపంలో ఒంటరితనాన్ని సైతం తన బలంగా మార్చుకుంటూ ఆమె వనమూలికలతో అనేక ప్రయోగాలు చేస్తుంది..మంత్రతంత్రాలతో సింహాలనూ,తోడేళ్ళనూ మచ్చిక చేసుకుంటుంది..సముద్ర ప్రయాణంలో యాదృచ్చికంగా ఆ తీరం చేరి ఆశ్రయంకోరి వచ్చిన మనుషుల్ని తాను దేవతనని మర్చిపోయి ప్రేమగా ఆదరిస్తుంది..ఇంతవరకూ బాగానే ఉన్నా,ఆమె ఒక స్త్రీ..ఎవరి రక్షణలోనూ లేని ఒంటరి స్త్రీ...కేవలం ఒక స్త్రీ కావడం వలన ఎదురయ్యే విపరీత పరిస్థితులు ఆమెక్కూడా ఎదురవుతాయి..ఒకసారి ఆమె దేవత అని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిని తన మంత్రశక్తితో పందులుగా మార్చేస్తుంది..ఒంటరి స్త్రీ అయిన కారణంగా అటు దేవతలతోనూ,ఇటు మానవులతోనూ కూడా పోరాడి నిలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది..కానీ అప్పుడు కూడా సిర్సేలో ధైర్యం చెక్కుచెదరదు.

అతిథులుగా వచ్చి ఆమెపై దాడి చెయ్యాలనుకునే వారినందరినీ పందులుగా మార్చేస్తూ ఉంటుంది..ఈ క్రమంలో డెడాలస్,హెర్మెస్,ఒడిస్సియస్ వంటి పలువురితో సహజీవనం చేసినా ఆ సంబంధాలేవీ వివాహానికి దారి తియ్యవు..చివరకు వివాహితుడైన ఒడిస్సియస్ ద్వారా ఒక మగపిల్లవానికి (టెలిగోనస్) జన్మనిస్తుంది..టెలిగోనస్ రాకతో ఆమె ప్రపంచమే మారిపోతుంది..కానీ ఎథేనా(Goddess of wisdom and war) వలన టెలిగోనస్ ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తెలిసి ఆ ద్వీపాన్నంతా తన మంత్రశక్తితో బంధించి టెలిగోనస్ ని రక్షిస్తూ ఉంటుంది...కానీ పదహారేళ్ళ ప్రాయానికి వచ్చిన టెలిగోనస్ లో సహజంగానే ఆలోచనలు రెక్కలు విప్పుకుంటుంటాయి..ఆ ద్వీపానికి ఆవలి ప్రపంచం చూడాలని కలలు గంటూ,తండ్రి ఒడిస్సియస్ ని కలుసుకోడానికి ఇథాకా (Ithaca) వెళ్తానని మంకుపట్టు పడతాడు..ఆ ద్వీపాన్ని వదిలి వెళ్తే అతడు ఎథెనా చేతిలో ఖచ్చితంగా మరణిస్తాడు..కానీ ప్రపంచం చూడకుండా ఇక్కడ వందేళ్ళు బ్రతికేకంటే ఎథెనా చేతిలో మరణమే నయమని వాదించే కొడుకు మాటను త్రోసిపుచ్చలేక తప్పనిసరై అంగీకరిస్తుంది సిర్సే..ఆ తరువాత సిర్సే ప్రాణానికి ప్రాణమైన టెలిగోనస్ భవిష్యత్తు ఏమైందనేది మిగతా కథ.

మంత్రతంత్రాల్లో ఆరితేరి 'Witch of Aiaia' గా ప్రసిద్ధికెక్కిన సిర్సే దేవలోకపు పురుషాధిపత్యాన్ని ధిక్కరించిన దేవత..అలనాటి గ్రీకు అంతఃపురాలకు అలంకారణాలుగా మిగిలిపోయిన అనేకమంది స్త్రీల మధ్య ఆమె ఒక విప్లవం..సిర్సే దేవలోకాన్నేలే టైటన్స్,ఒలింపియన్స్ చేసిన ఘాతుకాలకు ప్రత్యక్ష సాక్షిగా మారి మనకీ కథను చెప్తుంది..నిజానికి ఈ కథలో మనకు ఆమె ఒక దేవతగా కంటే,ఒక సాధారణమైన స్త్రీగానే కనిపిస్తుంది..Zeus కి భయపడి కుటుంబం వెలివేసినా చివరివరకూ ఆత్మస్థైర్యంతో జీవిస్తుంది..తనలోని ప్రతిభకు సానపెట్టుకుంటూ శక్తివంతమైన మహిళగా ఎదిగి తుదకు తండ్రికే ఎదురు తిరిగి నిలుస్తుంది..హేలియోస్ కుమార్తెగా మాత్రమే కాక తనకు తాను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది..ఈ కథలో మానవీయ విలువలకూ,దేవలోకపు ఆధిపత్యానికి మధ్య జరిగే సంఘర్షణలు అడుగడుగునా కనిపిస్తాయి..సిర్సేతో పాటు ఈ కథలో ఒడిస్సియస్ భార్య పెనెలోప్ పాత్రని కూడా శక్తిమంతంగా తీర్చిదిద్దారు..గ్లౌకోస్ టైటన్ గా మారడం,సిర్సే చేతుల్లో మినోటార్ జననం,సిర్సే కొడుకు టెలిగోనస్ ను రక్షించుకోడానికి చేసే సాహసాలు లాంటివి కథను రక్తికట్టిస్తాయి..ఈ కథ ముగింపు మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది..ఎందుకంటే రాక్షసులకే కాదు దేవతలకి కూడా వావీ వరుసలుండవట..సిర్సే పాత్ర రూపకల్పనలో నాకు నచ్చిన విషయమేంటంటే,ఆమెను గొప్ప స్త్రీ మూర్తిగా పరిపూర్ణతకు ప్రతీకగా చూపించే ప్రయత్నం ఎక్కడా చెయ్యకపోవడం..సిర్సే లో కూడా ఈర్ష్యా,ద్వేషం లాంటి సహజమైన లక్షణాలన్నీ ఉంటాయి,ఆమె కూడా కొన్ని తప్పులు చేస్తుంది..ఇక రెండో అంశం,సిర్సే స్త్రీవాదం ముసుగులో చుట్టూ ఉన్న సమాజాన్ని తూలనాడుతూ,తన జీవితానికి వేరొకరిని బాధ్యులను చేస్తూ పరనింద చేస్తూ కూర్చోకుండా తనలోని ప్రతిభకు మెరుగులద్దుకుని కథ ముగిసే సమయానికి సర్వస్వతంత్రురాలిగా ఆవిర్భవిస్తుంది..ఇందులో మాడెలైన్ శైలి చిత్రా బెనర్జీ దివాకరుని 'The palace of illusions',ఇందు సుందరేశన్ తాజ్ మహల్ ట్రయాలజీ లో 'The Twentieth wife' లాంటి పుస్తకాల్ని గుర్తుకు తెచ్చింది..సుమారు నాలుగొందల పేజీల పుస్తకమైనా వదలకుండా చదివిస్తుంది.

పుస్తకం నుండి కొన్ని,
For a hundred generations, I had walked the world drowsy and dull, idle and at my ease. I left no prints, I did no deeds. Even those who had loved me a little did not care to stay.Then I learned that I could bend the world to my will, as a bow is bent for an arrow. I would have done that toil a thousand times to keep such power in my hands. I thought: this is how Zeus felt when he first lifted the thunderbolt.
Daedalus did not long outlive his son. His limbs turned gray and nerveless, and all his strength was transmuted into smoke. I had no right to claim him, I knew it. But in a solitary life, there are rare moments when another soul dips near yours, as stars once a year brush the earth. Such a constellation was he to me.
“You are wrong about witchcraft,” I told her. “It does not come from hate. I made my first spell for love of Glaucos.”

Thursday, June 20, 2019

ఆర్టిస్టు , క్రిటిక్కు - ఒక బెస్ట్ సెల్లరు

Image Courtesy Google
ఒక పుస్తకాన్ని పాఠకులు ఎలా చదువుతారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు 'No two persons ever read the same book.' అని Edmund Wilson ను కోట్ చేస్తారు..'లోకో భిన్న రుచి' అన్నతీరులో ఒక పుస్తకం బెస్ట్ సెల్లర్ అయినప్పటికీ అందరికీ నచ్చాలని రూలేమీ లేదు..అలాగే ఒక బెస్ట్ సెల్లర్ నచ్చనంత మాత్రాన ఆ నచ్చనివారికి ఆ రచనను ఆస్వాదించే,అర్ధం చేసుకునే స్థాయి లేదనుకోవడం కూడా అవివేకం..'కళాతపస్వి' తీసిన కళాఖండాలు సైతం విమర్శకులకు మినహాయింపు కాదు..అలాగే ఒక వర్గానికి నచ్చనంత మాత్రాన ఆయన సినిమాల విలువ తగ్గిపోదు..ఒక ఆర్టిస్టు తన కళను నలుగురిలో ప్రదర్శనకు పెట్టినప్పుడే పాఠకులకూ/ప్రేక్షకులకూ దాన్ని జడ్జి చేసే హక్కును తన చేత్తో తానే స్వయంగా కట్టబెడతాడు..అలా కాకుండా తన కళకు ఎవరూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడానికి అర్హులు కాదనే నిశ్చితాభిప్రాయం ఉన్నవాళ్ళు ఫెర్నాండో పెస్సోవా తరహాలో జాగ్రత్తగా తమ రచనల్ని ట్రంక్ పెట్టెల్లో భద్రపరుచుకోవడం ఉత్తమం..వ్యక్తిగత విమర్శలు,దూషణలూ కానంతవరకూ ఒక రచన మీద ప్రశంసలనూ,విమర్శలనూ సమానంగా స్వీకరించగలిగే మానసిక సంసిద్ధత ఆర్టిస్టులో ఉండవలసిన ముఖ్య  లక్షణం..నచ్చకపోవడాన్నీ,విమర్శించడాన్నీ రసాస్వాదన చెయ్యలేని ఒక పాఠకుడి అపరిపక్వతగా భావించే బదులు దాన్ని ఒక వ్యక్తిగతాభిప్రాయంగా భావించి,ఆ వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించడం ఆర్టిస్టు కనీసం ధర్మం..ఎందుకంటే భావప్రకటనా స్వేచ్ఛ ఆవశ్యకతను ఒక కళాకారుడు అర్ధం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్ధం చేసుకోలేరు.

ఇక విమర్శకుడి విషయానికొద్దాం..ఒక వ్యక్తికి ఒక రచనని విమర్శించడానికి ఉండాల్సిన కనీసార్హతలేమిటన్నది ఈనాటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది..ఒక రచన చెయ్యడానికి రచయితకు పీహెచ్డీ సర్టిఫికెట్లు గానీ,సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీగానీ ఉండాలన్న నియమమేమీ లేదు..భావవ్యక్తీకరణలో ఈస్థెటిక్స్ తెలియడమే తప్ప మరే నియమమూ అక్కర్లేని కాల్పనిక ప్రపంచంలో కళాకారుడు నిత్యస్వతంత్రుడు..మరి ఆర్టిస్టుకి లేని అర్హతలూ,పరిమితులూ విమర్శకుడికి మాత్రం ఎందుకుండాలి అనేది కొందరి వాదన..సాధారణమైన ప్రపంచాన్ని ఒక ఆర్టిస్టు తన అసాధారణమైన దృష్టికోణంనుండి చూస్తూ,మనకు తానెన్నుకున్న ప్రత్యేక మాధ్యమంలో నుండి దర్శింపజేస్తాడు..కళ అనేది ఆర్టిస్టులో 'నేను' అనే స్పృహ(ఇగో) లోంచి పుడుతుందని అనేకమంది రచయితలు అంటూ ఉంటారు..ఇక విమర్శకుల విషయానికొస్తే ఒక కళాకారుడు తన కళపట్ల ఎంత పక్షపాత వైఖరితో వ్యవహరిస్తాడో,ఒక విమర్శకుడు కూడా ఆ కళను తన దృష్టికోణంనుంచి చూస్తూ విమర్శించడంలో అంతే పక్షపాతధోరణిని అవలంబిస్తాడు..All is fair in love & war అన్నతీరులో ఆర్టిస్టుకీ,క్రిటిక్ కీ మధ్య నిరంతరం జరిగే ఈ గెలుపోటముల యుద్ధం,ఒకరకంగా చూస్తే రెండు వర్గాల ఇగోల ఆధిపత్యపోరాటం...Authors are partial to their Wit, ’tis true.But are not Criticks to their Judgment too?....Those monsters, Criticks! అంటారు అలెగ్జాండర్ పోప్ “An Essay on Criticism” లో...ఆ మధ్య చదివిన విలియం.ఎస్.బరోస్ (William S Burroughs) 'The Adding Machine' అనే పుస్తకంలో పుస్తక సమీక్షల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రాశారు..ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కు వెళ్ళారు,అందులో ఒకరు హోటల్ ambiance బావుంది,ఫుడ్ బావుంది,కిచెన్ శుభ్రంగా ఉంది అని రాస్తే,మరొక వ్యక్తి అక్కడ హోటల్ ambiance బాగాలేదు,ఫుడ్ అస్సలు రుచిగా లేదు,కిచెన్ లో శుభ్రత లేదు అని రాస్తాడు..మొదటి వ్యక్తికి ఇటాలియన్ రుచులంటే ప్రీతి,ఇక రెండో వ్యక్తికి ఇటాలియన్ ఫుడ్ అంటే అయిష్టత..ఈ నచ్చకపోవడమే అతని జడ్జిమెంట్ కు కారణం కావచ్చు..లేదా ఆ హోటల్ లో వంటవాడి వ్యక్తిగత జీవితం పై అభ్యంతరాలు ఉండొచ్చు..అదీ కాకపోతే హోటల్ ప్రొప్రయిటర్ రాజకీయ అభిప్రాయాలు ఇతని అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండొచ్చు..జిహ్వకోరుచి పుర్రెకోబుద్ధి అన్నట్లు ఈ జడ్జిమెంట్ కు కారణాలేవైనా కావచ్చు..అలాగే ఒక పుస్తకం నచ్చకపోవడానికి కూడా ఇలాంటి కారణాలెన్నో ఉండవచ్చు..కొందరికి భాష నచ్చకపోవచ్చు,మరికొందరికి భావం నచ్చకపోవచ్చు..కొందరికి ఆ జానర్ అంటేనే రుచించకపోవచ్చు..కానీ ఒక పాఠకుడి జడ్జిమెంట్ మాత్రం తీసిపారెయ్యలేనిది..అది 'ఆర్టిస్టిక్ ఇంపెర్ఫెక్షన్' అంత స్వచ్ఛమైనది.

సాహిత్యం సైతం డిజిటలైజ్డ్ చెయ్యబడుతున్న ఈ టెక్నాలజీ యుగంలో సమీక్షకూ,విమర్శకూ మధ్య అంతరాలు చెరిగిపోతున్నాయి..నిజానికి ఒక రచనను సమీక్షించడానికీ,విమర్శించడానికీ చాలా భేదం ఉంది..సమీక్షకులు సాధారణంగా పుస్తకప్రియులై  ఉంటారు..వీరి పఠనం రచనలోని భావాన్ని ఆస్వాదించే దిశగా ఒక ఉపరితలంపై మాత్రమే సాగుతుంది..ఒక రచనను లోతుగా,క్రాఫ్ట్ ను కూలంకషంగా అధ్యయనం చేస్తూ చదవడం వీరికి సాధ్యపడదు..ఇక విమర్శకులు అనగా 'ప్రొఫెషనల్ క్రిటిక్స్' ఒక రచనను చదివేటప్పుడు,వారి దృష్టి భాష,భావం,వ్యాకరణం,శిల్పం ఇలా నలు దిశలకూ ప్రయాణిస్తూ సాగుతుంది..సద్విమర్శకులు ఏ రచననైనా కొన్ని నిర్దిష్టమైన సాహితీ విలువల తూకపు రాళ్ళను వేసి తూచాక గానీ విలువ కట్టరు..ఒక రచనకు అటువంటి విమర్శకుడు లభించాడంటే ఆ రచయిత అదృష్టవంతుడని చెప్పొచ్చు..మరి విమర్శించే వారికి ఉండాల్సిన అర్హతలేమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సాహిత్యం గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచి విమర్శకులు అవుతారని అనుకోవచ్చేమో..కేవలం ప్రాంతీయతకు పరిమితమయిపోకుండా జాతీయ,అంతర్జాతీయ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారు సాహితీ విమర్శకులుగా రాణిస్తారు..ఇటువంటి సద్విమర్శకుల అభిప్రాయాన్ని తప్ప మిగతా వారి అభిప్రాయాలను ఒక విమర్శగా చూడడం సరికాదు..అవి ఒక సామాన్య పాఠకుడి సమీక్షగా మాత్రమే పరిగణించాలి.

Yet what separates reviewing from criticism—pragmatically—are the reductive limits of space; the end is always near. What separates criticism from reviewing—intrinsically—is that the critic must summon what the reviewer cannot: horizonless freedoms, multiple histories, multiple libraries, multiple metaphysics and intuitions. Reviewers are not merely critics of lesser degree, on the farther end of a spectrum. Critics belong to a wholly distinct phylum.This is a phylum that, at present, hardly exists.అంటారు Cynthia Ozick.

ఈ కాలంలో సమీక్షలే ఉన్నాయి గానీ తులనాత్మక విమర్శలు దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి..Reviewers we have but no critic; a million competent and incorruptible policemen but no judge. Men of taste and learning and ability are for ever lecturing the young and celebrating the dead అంటారు Virginia Woolf...కానీ దీనికి కారణమేంటా అని ఆలోచిస్తే,ఒక రివ్యూయర్ కి  చనిపోయిన రచయిత యొక్క రచనను జడ్జి చేస్తే ఆయన ఖచ్చితంగా సమాధిలోంచి లేచొచ్చి తిట్టలేడనే ధైర్యం కావచ్చు :)  'Critics, Monsters, Fanatics & Other Literary Essays' అనే పుస్తకంలో అమెరికన్ రచయిత్రి Cynthia Ozick, బుక్ రివ్యూలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..డిజిటలైజేషన్ కారణంగా సమీక్షలూ,విమర్శలూ కూడా అమెజాన్ లాంటి మార్కెట్ ప్లేసెస్ చేతుల్లో పడి కొత్త రూపును సంతరించుకుంటున్నాయి..అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లో పాఠకుల రివ్యూలు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా యథాతథంగా ప్రచురించబడతాయి..తనకు అర్ధంకాని ఉన్నతమైన భాష,వ్యాకరణం,శైలి ఉన్న ఒక మంచి లిటరరీ పీస్ గురించి కూడా ఒక సామాన్య పాఠకుడు 'బోరింగ్'/'డిప్రెస్సింగ్ రీడ్' అంటూ 'సింగిల్ స్టార్' రివ్యూలు ఇవ్వడం ఇక్కడ సర్వసాధారణం..'The customer is always right' అన్నతీరులో అమెజాన్ ఎటువంటి ప్రాథమిక ప్రమాణాలూ లేకుండా 'పిచ్చివాడి చేతిలో రాయి' మాదిరిగా ప్రతి వ్యక్తికీ సాహిత్యాన్ని విమర్శించే హక్కుని సులభంగా కట్టబెట్టింది..అతి సాధారణ భాషలో,పాఠకులకు సులువుగా అర్ధమయ్యే సామాన్యమైన రచనలకి ఈ కారణంగా 5 స్టార్ రేటింగ్ లూ,బెస్ట్ సెల్లర్ ట్యాగ్ లూ లభించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు..అమెజాన్ బుక్ స్టోర్ ఓపెన్ చెయ్యగానే 'పాపులారిటీ/మెజారిటీ ఒపీనియన్' ప్రధానంగా జరిగే ఈ వ్యాపారంలో బుక్ suggestions లో కూడా రవీందర్ సింగ్,చేతన్ భగత్,అమిష్ త్రిపాఠి వంటి వారి రచనలు బెస్ట్ సెల్లర్ ట్యాగులతో తొలి పేజీలోనే దర్శనమివ్వడమే దీనికొక ఉదాహరణ..దీని వల్ల పెద్ద నష్టమేమీ లేదులే అనుకోడానికి వీల్లేకుండా 'ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' లాంటి చవకబారు రచనలు బెస్ట్ సెల్లర్లుగా ఫ్రంట్ పేజీలో కనిపించడం మరింత బాధాకరం..నిజానికి ఇక్కడ కూడా అమెజాన్ లాంటి సంస్థల్ని తప్పు పట్టాల్సిన పని లేదు..తప్పంతా అమెజాన్ చేస్తున్నది వ్యాపారమనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్న కస్టమర్ ది,అంటే పాఠకుడిది.

దీని తరువాత సాహిత్యంపై సోషల్ మీడియా ప్రభావం గురించి చెప్పుకోవాలి..సాహితీ గ్రూపులు,బ్లాగు సమూహాలు,బుక్ క్లబ్ లు,ఇండీ బ్లాగర్ లాంటి బ్లాగ్ జాలపత్రికలు పాఠకుల రీడింగ్ హ్యాబిట్స్ పై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి..శాస్త్రసాంకేతికత కళారంగాన్ని త్రోసిరాజని పురోగతి సాగిస్తోందనేది కాదనలేని సత్యం..దినపత్రికలూ,టీవీల స్థానంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు జర్నలిజాన్నీ,తద్వారా సమాజాన్ని పరోక్షంగా శాసించే స్థాయికి ఎదిగాయి..ఏ రకమైన ఫ్యాక్ట్ వెరిఫికేషన్/ప్రామాణికతలూ లేని సమాచారాన్నే సగటు సోషల్ మీడియా యూజర్ ప్రామాణికంగా తీసుకుంటున్నాడు..ఈ విషయాన్ని ఫేస్బుక్  ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన Roger McNamee రాసిన Zcked: Waking Up to the Facebook Catastrophe అనే పుస్తకంలో విపులంగా చర్చించారు..ఈ మొత్తం వ్యవహారాన్ని సాహిత్యానికి అన్వయిస్తే జరుగుతున్న చేటు అంతాఇంతా కాదు..పుస్తకాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లాంటి ఇన్ఫర్మేషన్ జెయింట్స్,Goodreads లాంటి అనేక పుస్తక సంబంధిత  భాండాగారాలు అందుబాటులో ఉన్నప్పటికీ  ఏ సమాచారం కావాల్సివచ్చినా ఫేస్బుక్,వాట్సాప్ లాంటి ఇరుకు ఏసీ గదుల్ని దాటి బయటకు వెళ్ళమని భీష్మించుకుని కూర్చునే పాఠకులు(?) ఈ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న 'సముద్రంలో ఒక నీటి బొట్టు'ని మాత్రమే సాహిత్యమనుకునే భ్రమలో ఉన్నారు..అక్కడ కుప్పలుతెప్పలుగా కనిపించే సామాన్యుల సమీక్షలనే (బుక్ రివ్యూస్) విమర్శలుగా భావించి,మెజారిటీ జడ్జిమెంటే 'నాణ్యమైన జడ్జిమెంట్' అన్న భావనలో కొట్టుకుపోతున్నారు..ఈ తరహా సమూహాల్లో,ఇతర సోషల్ మీడియా వెబ్సైట్స్ లో కనిపించే బుక్ రెకమెండేషన్స్ సైతం ఫేస్బుక్ పబ్లిసిటీ/మార్కెటింగ్ స్ట్రాటజీ లో భాగమని తెలీక సగటు పాఠకుడు కంప్యూటరైజ్డ్ ఎక్సప్లోయిటేషన్ బారిన పడి మోసపోతున్నాడు.

అన్నీ సమస్యలేగానీ పరిష్కారాలేవీ ఉండవా అంటే,ఉన్నాయి..నాది మంచి సాహిత్యమని ఆర్టిస్టూ,కాదు నీ రచన అసలు సాహిత్యమే కాదు,లోపభూయిష్టమని క్రిటిక్కూ తమ అభిప్రాయాలపై స్థిరంగా నిలబడినప్పుడు మధ్యలో ఉండే అర్భక పాఠకుడికి తనేం చదవాలో తెలియాలంటే మరో మధ్యేమార్గమే లేదా అంటే ఎందుకు లేదూ ? ఉంది..అదే కాలపరీక్ష..ఒక రచన ఉన్నత విలువలతో,మంచి సాహితీప్రమాణాలతో తుదకంటా మెరిసే మేలిమి బంగారమా లేదా కాస్త తడి అంటితేనే తుప్పుపట్టే ఇనుప లోహమా అనేది కాలమే నిర్ణయిస్తుంది..రివ్యూలూ,మార్కెటింగ్ ఇవేవీ పెద్దగా లేకపోయినా కేవలం  నోటి మాట ద్వారా మంచి సాహిత్యం కాలదోషం పట్టకుండా నిలుస్తుంది..అలా కానిపక్షంలో పబ్లిసిటీ,రివ్యూల పేరిట సమూహాలు రేపుకున్న దుమారంలో అది కూడా కొట్టుకుపోయి దానంతటదే అదృశ్యమయిపోతుంది.

Friday, June 14, 2019

There Once Lived a Woman Who Tried to Kill Her Neighbor's Baby: Scary Fairy Tales - Ludmilla Petrushevskaya

రచయితల్లో ఈ రష్యన్ రచయితల దారే వేరు..వీళ్ళ పేర్లు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో వీళ్ళ కథలు కూడా అంతే వైవిధ్యతను కలిగి ఉంటాయి..అసలు ఈ రష్యన్ సాహిత్యమే ఒక అక్షయపాత్రలాంటిది,ఎంత తవ్వితీసినా ఇంకా అట్టడుగున మన కంటబడని నిధులేవో మిగిలిపోతూనే ఉంటాయి..అలా దృష్టికి వచ్చిన ఈ కొత్త నిధే 'లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా'..అరే ఈవిడ గురించి ఎప్పుడూ వినలేదే అనుకునేలోపు ఆవిడ జానర్ భయానక రసమని (macabre) తెలిసింది..మనుషుల్లో మనిషిని,నాకు తెలియని భయానక రసమా అనుకుని ఇంతకాలం ఈ జానర్ చదవకుండా మడికట్టుకుని కూర్చున్నాను..సర్లెమ్మని,రచయితల్ని కూడా సరిసమానంగా ప్రేమించాలనే సమన్యాయం గుర్తుకు వచ్చి ,ఎందుకీ వివక్ష ? ఏమిటీ పక్షపాతం అని మరోసారి ఘాటైన ఆత్మ విమర్శ చేసుకుని ఈ కథలు చదవడం మొదలు పెట్టాను..ఈ మధ్య కాలంలో నాన్ ఫిక్షన్ అతిగా చదివి,రియాలిటీలో ఎక్కువ కాలం బ్రతికేసిన నైరాశ్యం నుండి బయటపడడానికినిన్నూ,మరికాస్త 'కలం' మార్పు కోసమునున్నూ అన్నమాట..కానీ 'You'll find beauty in the most unexpected places' అని ఎవరో అన్నట్లు ఈ పుస్తకం నాకో మంచి రచన చదివానన్న అనుభూతిని మిగిల్చింది.


సైన్స్ ఫిక్షన్,macabre లాంటి జానర్స్ లో 'ఫిలసాఫికల్ డెప్త్' ఉన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి..గత సంవత్సరం ఇదే జానర్ లో అర్జెంటీనా రచయిత్రి సిల్వినా ఒకేంపో రాసిన NYRB క్లాస్సిక్ 'Thus Were Their Faces' లో ఒక ముప్పై కథల వరకూ చదివి మిగిలిన వంద పేజీలు పూర్తి చేసే ఓపిక లేక ప్రక్కన పడేశాను,ఆ కథలు చాలా మొనోటోనస్ గా,ఒకటీరెండు కథల మినహా చాలా అర్ధరహితంగా ఉన్నాయి..పెట్రోషెఫ్స్కియా రాసిన ఈ ఫెంటాస్టిక్ ఫిక్షన్ కథలు వాటికంటే వెయ్యి రెట్లు బావున్నాయి..కానీ పెట్రోషెఫ్స్కియా కథలు చదివిన వారికెవరికైనా వాటినిలా ఒక జానర్ పేరుతో ఒకే గాటికి కట్టెయ్యడం అమానుషం అనిపించక మానదు..ఎందుకంటే వీటిలో 'macabre' ని మించిన అంశాలెన్నో ఉన్నాయి.

సోవియెట్ సమాజపు వాస్తవాన్నీ,కాఠిన్యాన్నీ తేటతెల్లం చేసిన పెట్రోషెఫ్స్కియా రచనలు చాలా కాలం నిషేధానికి గురై ,గోర్బచెవ్ అధికారంలోకి వచ్చిన తరువాత గానీ వెలుగుచూడలేదట..ఆ తరువాత ఆమెకు వచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు..The Pushkin Prize in Russian literature (2003) ,The Russian State Prize for arts (2004), The Stanislavsky Award (2005),World Fantasy Award (2010)  లతో పాటు రష్యా లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అయిన The Triumph Prize (2006) ను కూడా సొంతం చేసుకున్న ఈ రచయిత్రిని ప్రస్తుతం జీవించి ఉన్న సమకాలీన రష్యన్ సాహితీ దిగ్గజాల్లో ఒకరిగా పరిగణిస్తారు.

ఇందులో మొత్తం పంతొమ్మిది కథలుండగా వాటిని నాలుగు భాగాలుగా విభజించారు..'సాంగ్స్ ఆఫ్ ఈస్టర్న్ సావ్స్'  మరియు 'ఫెయిరీ టేల్స్' విభాగాల్లో కథలన్నీ బావున్నాయి..కానీ Allegories,Requiems లో ఫాంటసీ శైలి కథల గురించి ఇక్కడ ప్రత్యేకం చెప్పుకోవాలి..పెట్రోషెఫ్స్కియా కలంలోని  వాడీ,వేడీ ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

Songs of the Eastern Slavs : ఈ విభాగంలో కథలు అధివాస్తవిక ధోరణిలో సోవియెట్ సమాజంలోని చీకటి కోణాల్ని చూపిస్తాయి.

Allegories : ఈ  విభాగంలో నాలుగు కథలూ రూపకాలు..పెట్రోషెఫ్స్కియా కథల్లో ఆణిముత్యాలని చెప్పే  రెండు కథలు ఇందులోనే ఉన్నాయి...'Hygiene','The New Robinson Crusoe' అనే కథలు రాజకీయ సామజిక అస్థిరతను ప్రతిబింబించే కథలు..

మనిషిని మృగాన్నుంచి వేరు చేసేవి జ్ఞానం,ఆలోచనా శక్తి,నైతికత,మానవీయత లాంటి కొన్ని లక్షణాలే..కానీ మనిషి తనను మించిన మేథోజీవి ఈ విశ్వంలో లేదనుకుంటాడు..కానీ తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఎదురైనప్పుడు మనిషి ప్రవర్తన మృగానికి ఏ మాత్రం తీసిపోదు..ఈ విషయాన్ని స్పష్టం చేసే కథ హైజీన్...Hygiene కథలో R. కుటుంబం ఇంట్లో డోర్ బెల్ రింగ్ అయినప్పుడు చిన్న పాప తలుపు తీస్తుంది..ఎదురుగా లేత ఎరుపు రంగులో ఉన్న ఒక యువకుడు మూడు రోజులో మనుషుల్ని చంపే అంటువ్యాధి ప్రబలిందని 'R' కుటుంబాన్ని(నికొలాయి,అతని భార్య ఎలెనా,వాళ్ళ చిన్ని పాప,ఎలెనా తల్లితండ్రులు) హెచ్చరిస్తాడు..పరిశుభ్రత పాటిస్తూ,ఇల్లువదిలి బయటకు వెళ్ళవద్దనీ,ఆ వ్యాధి సంక్రమించినా ఎలాగో తాను బ్రతికిబయటపడ్డాననీ,అందుకే ఇంటింటికీ తిరిగి అవసరమైనవారికి తినడానికి బ్రెడ్,అవసరమైన సామాను లాంటివి అందజేస్తున్నాననీ,డబ్బిస్తే కావాల్సిన సరుకులు తెచ్చిపెడతానని అంటాడు..కానీ అతనిపై నమ్మకంలేక నికొలాయ్ తనే బేకరీకి స్వయంగా వెళ్ళి అవసరమైన ఆహారం తెస్తూ ఉంటాడు..తిరిగి వచ్చాకా కట్టుకున్న వస్త్రాలను బయటే వదిలేసి,కొలోన్ తో ఒంటిని శుభ్రం చేసుకున్నాకే ఇంట్లోకి అడుగుపెడుతుంటాడు..నికొలాయ్ తిండిపోతు,ఈ కారణంగా ఆహారాన్ని భాగాలు పంచుతారు..కానీ మొదట్లో 'అవసరం' కాస్తా క్రమేణా 'స్వార్ధం'గా పరిణమించగా నికొలాయ్ బేకరీ కి వెళ్ళి ఆహారం కోసం హత్యలు కూడా చేస్తాడు..ఇలా ఉండగా ఆ ఇంటి బాల్కనీలో ఉండిపోయిన పిల్లికి ఆహరం పెట్టడానికి ఇంట్లోకి తెస్తారు..ఎలుకను చంపి తిన్న ఆ పిల్లి నోటిని ఆ చిన్ని పాప ముద్దాడుతుంది..అది చూసిన ఆమె అమ్మమ్మ,తాతలు అంటువ్యాధి సోకుతుందని భయపడి పాపను పిల్లితో సహా గదిలో నిర్బంధిస్తారు..పాప తల్లి ఎలెనా అడ్డుపడితే తాత్కాలికంగా ఆమెను బాత్రూమ్లో బంధిస్తారు..ఇంకా స్వయంగా తన పనులు చేసుకోవడం తెలీని ఆ పాప ఎంత అరిచి గోల చేసినా తలుపులు తియ్యరు..బాత్రూం కూడా లేని ఆ చిన్నపాప గది కాస్తా ఉన్నట్లుండి Quarantine ఛాంబర్ గా మారిపోతుంది..నికోలాయ్ గదితలుపుకి పై భాగంలో చిన్న రంధ్రం చేసి దాని ద్వారా పై ఆ పాపకి ఆహారం మాత్రం అందిస్తుంటాడు..పాపకు ఆ గదిలో పరిశుభ్రత నేర్పించడానికి ఎలెనా తో సహా అందరూ అనేక పాట్లు పడతారు..మూడోరోజుకి ఆ పాప గదిలోనుంచి ఎటువంటి శబ్దమూ రాకపోయేసరికి అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు.

తెల్లారి నిద్ర లేచిన అమ్మమ్మ,తాత తమ మంచం క్రింద ఉన్న పిల్లిని చూస్తారు..అది makeshift విండో నుండి ఎలాగో తప్పించుకుని ఇవతలకు వస్తుంది..రక్తం అంటిన దాని మూతిని చూసి పిల్లి పాపను తినడం మొదలుపెట్టిందని భావిస్తారు..ఇదంతా విన్న నికోలాయ్ మెల్లిగా వారిద్దరూ ఉన్న గదిని మూసేసి దానికి కుర్చీని అడ్డుగా పెడతాడు..తలుపుపైన రంధ్రం చేసే ఉద్దేశ్యాన్ని కూడా విరమించుకుంటాడు..అదేమిటని అడ్డువచ్చిన ఎలెనాను మళ్ళీ బాత్రూం లో బంధిస్తాడు..ఈలోగా నికోలాయ్ శరీరంపై అంటువ్యాధి తాలూకా బొబ్బలు వస్తాయి..ఆలోచించగా ఆ రోజు బేకరీకి వెళ్ళి,అక్కడ ఒక స్త్రీని ఆహారంకోసం హత్య చేసి,ఇంటికి వచ్చేదాకా ఆగలేక,అందులో కొంత భాగాన్ని అక్కడే తిన్నానని అతనికి గుర్తొస్తుంది..ఆ కారణంగా నికోలాయ్ కి కూడా ఆ వ్యాధి సోకి,కళ్ళలోంచి రక్తం కారుతూ మరణిస్తాడు..ఈ విధంగా ఒక్కొక్కరుగా అందరూ ఆ వ్యాధి సోకి మరణిస్తారు.

మొదట వచ్చిన యువకుడు మళ్ళీ ఆరో రోజుకి వచ్చి ఆ ఇంటి తలుపు కొడతాడు..మ్యావ్ మ్యావ్ మంటున్న పిల్లి శబ్దం తప్ప ఇతరత్రా అలికిడి లేకపోయేసరికి ఆ జీవినైనా రక్షిద్దామనే సంకల్పంతో లోపలకి అడుగుపెట్టిన అతనికి లివింగ్ రూంలో,కుర్చీ అడ్డుపెట్టిన గదిలో,బాత్రూం లో అతనికి సుపరిచయమైన నల్లటి గుట్టలు కనిపిస్తాయి..ఒక గదికి makeshift విండో లోంచి పిల్లి వెళ్ళడం చూసి తలుపు గొళ్ళెం తీసి ఆ గదిలోకి అడుగు పెట్టిన అతనికి విరిగిన గాజు పెంకులు,మలమూత్రాదులూ,తలతెగిన ఎలుకలూ,చింపిన పుస్తకాల పేజీల మధ్య తనలాగే తలమీద లేత గులాబీరంగు చర్మంతో కూర్చున్న పసిపాప కనిపిస్తుంది,ఆ పాప ప్రక్కన పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళతో చూస్తూ పిల్లి కూర్చుని ఉంటుంది...పెట్రోషెఫ్స్కియా ఈ కథలో పరిశుభ్రతను నిర్వచించే ప్రయత్నం చేశారు..'పరిశుభ్రత' భౌతికమైనదే కాదంటూ మానసికమైన స్వచ్చత యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పే కథ ఇది..తనను తాను రక్షించుకునే క్రమంలో నైతికతకు తిలోదకాలిచ్చే మనిషిలోని స్వార్ధపూరిత మనుగడ స్వభావాన్ని లోడ్మిల్లా పట్టుకున్న విధానం చాలా బావుంది.

'మిరాకిల్' అనే మరో కథలో కొడుకుపై ధృతరాష్ట్ర ప్రేమను చంపుకోలేక,దారితప్పిన కొడుకును సరైన దారిలో పెట్టాలనే ఆశతో ఒక దేశదిమ్మరి అయిన తాగుబోతు ప్రవక్తను కలిసిన మహిళ,తుదకు కోరికలకు అంతం లేదనే విషయాన్ని గ్రహించి తన మనోవేదన నుండి విముక్తురాలై,జీవితాన్ని యధాతథంగా అంగీకరించాలనే విలువైన పాఠాన్ని నేర్చుకుని వెనుదిరుగుతుంది..చూడ్డానికి చాలా పేలవంగా కనిపించే ఈ స్కెలిటన్ లాంటి కథలకు పెట్రోషెఫ్స్కియా కూర్చిన కథనం 'Craft is everything' అనుకునేలా చేస్తుంది.

Requiems (An act or token of remembrance) : 
మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపించే మృత్యువు నీడల్ని చూపే కథలివి..ఈ కథల్లో 'కాలం' వేరుగా పని చేస్తుంది..పాత్రలు భౌతికవాస్తవికతని దాటి సమాంతరంగా భూతభవిష్యత్ వర్తమానాల్లోకి ఏకకాలంలో ప్రయాణిస్తూ ఉంటాయి.

Fairy Tales : 
ఇవి అచ్చంగా ఫెయిరీ టేల్సే.. 'Marilena's secret' అనే కథలో మారియా,లెనా అనే ఇద్దరు కవలలు నర్తకీమణులు ఒక మాంత్రికుని శాపం వల్ల ఏకమై 'మారేలినా' అనే ఊబకాయురాలిగా మారిపోతారు..'The Cabbage-patch mother' అనే మరో కథలో ఒక అమ్మకి నీటిబొట్టు అంతే ఉన్న Droplet అనే కూతురు ఉంటుంది..ఈ కథలన్నీ పాఠకులను ఖచ్చితంగా బాల్యంలోకి లాక్కుపోతాయి..

ఈ కథలు మొదలవ్వడం కూడా విచిత్రంగా జరుగుతుంది..'ఒకానొకప్పుడు ఒక స్త్రీ ఉండేది,ఆమె తన పొరుగింటి స్త్రీని ద్వేషిస్తుంది' అంటూనో,లేదా 'ఒకానొకప్పుడు ఒకమ్మాయి ఉండేది,ఆమె మరణించి పునర్జీవితురాలైంది' అంటూనో పాఠకులను ఏదో సరళమైన చందమామ కథ చెప్తున్నట్లు భ్రమింపజేస్తూ కథ మధ్యలోకి చేరేసరికి అలవోకగా సంక్లిష్టతను తెరపైకి తీసుకువస్తారు..ఇందులో కొన్ని కథల్లో దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కునే సగటు మనుషులు తారసపడతారు..ఈ కోవకి చెందిన 'There’s Someone in the House' కథలో ఇంట్లో 'కనిపించని శత్రువు' కి భయపడిన ఒక స్త్రీ,జరగబోయే దారుణాన్ని తిప్పికొట్టే క్రమంలో ఇంట్లో సామానంతా ఒకొక్కటిగా తానే ధ్వంసం చేసి,చివరకి రోడ్ మీదకు వచ్చేస్తుంది..చివర్లో ఆమెవైపు భయంగా,రక్షించమన్నట్లు చూస్తున్న పెంపుడు పిల్లిని చూసి,చేసిన పనికి పశ్చాత్తాపపడి 'This is life' అని నిట్టూరుస్తూ ఇంట్లోకి వెనుదిరుగుతుంది...ఈ కథలన్నిటిలో సాధారణంగా కనిపించే మరో అంశం ఏంటంటే,ఇందులో చాలా మంది తల్లితండ్రులు పిల్లలపై హద్దుల్లేని ప్రేమను కలిగి ఉంటారు..యుద్ధం నిర్వీర్యం చేసిన భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలనే తపన కలిగిన సగటు సోవియెట్ యువకులూ,వారి తల్లిదండ్రులూ ఈ కథల్లో తారసపడతారు..'ది న్యూయార్కర్' లో ప్రచురితమైన 'The Fountain House' అనే కథలో బస్సు ప్రమాదంలో పదిహేనేళ్ళ కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి ఆమె శవాన్ని అటాప్సీ జరగకుండా తీసుకెళ్ళిపోతాడు..డబ్బు కోసం ఏదైనా చేసే ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి కూతురి శవానికి వైద్యం చేయిస్తూ షాక్ కు గురైన ఉన్మాదంలో స్వప్నంలో కూతురు తినడానికి తెచ్చిన శాండ్విచ్ మధ్యలో ఉన్న మనిషి హృదయాన్ని తినేస్తాడు..నిద్రపోయి లేచిన తర్వాత,కూతురు కోలుకుని లేచి తన చెయ్యి పట్టుకుని నడుస్తోంది అంటాడు..ఏం జరుగుతోందో ఒక్క క్షణం అర్ధం కాని స్థితిలోకి పాఠకులను నెట్టేసి,మనం 'కూతురు బ్రతికే ఉందా' అని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ బుర్రకు పదును పెట్టేలోపు,తండ్రి తాను మనిషి హృదయాన్ని తిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ 'అయినా కలలు నిజం కాదుగా' అని మనసులో అనుకునే వాక్యంతో కథను ముగిస్తారు..ఈ ముగింపు వాక్యం నిజంగా అద్భుతం..ఈ ఒక్క వాక్యంతో సృజనాత్మకత పరిధుల్ని చెరిపేస్తూ పాఠకుల్లో జరుగుతున్నది వాస్తవమో లేక స్వప్నమో అర్ధం కాని సందిగ్ధతను సృష్టిస్తారు.

స్టాలిన్ శకంలో పుట్టి (1938),రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి రష్యాలో కడుపునిండా తిండికి కూడా నోచుకోలేక, పదేళ్ళ వయసు లోపే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన పెట్రోషెఫ్స్కియా కథల్లో యుద్ధం పట్ల ఏహ్యభావం,అసహనం,కోపం అంతర్లీనంగా కనిపిస్తాయి..అందుకేనేమో కాఠిన్యం ఎరుగని పసితనం యుద్ధ కాంక్షకు బలైన వైనం ఈ కథల్లో అనేకచోట్ల ప్రస్తావనకు వస్తుంది..ఉదాహరణకు ఒక కథలో మరణించిన స్త్రీ తన తోటి ప్రయాణీకుల్లో యుక్తవయసులో ఉన్న ఒకే రకం యూనిఫామ్ ధరించిన అనేకమంది సైనికులను నోళ్ళు తెరచుకుని నిద్రిస్తుండగా చూశానంటుంది ,మరో కథలో యుద్ధ సమయంలో ఒక కల్నల్ మరణానికి చేరువలో ఉన్న భార్య ఉత్తరం అందుకుని ఇంటికి వెళ్ళే లోపే ఆమె మరణిస్తుంది..పెట్రోషెఫ్స్కియా నిస్సంకోచంగా యుద్ధంలో మరణించిన వారి శవపేటికలను తెరచి అందులో సైనికుల యొక్క శిధిలమైన స్వప్నాల గాధలు వినమంటారు..ఈ కథల్లో చిన్నచిన్న సంగతులు కూడా విస్మరించలేని విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి..ఉదాహరణకు ఒక కథలో స్త్రీ తనకు ఆవలివైపు ఉన్న దేశాన్ని చూస్తూ అక్కడ దూరంగా ఒక క్యాథెడ్రల్,నీరూ ఉన్నాయంటుంది..మతమూ,నీరూ లేకపోతే మనుగడే లేని మనిషి ఉండే భూమిని రచయిత్రి ఇలా అస్పష్టంగా వర్ణిస్తారు..లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా కథల్లో వచనం అత్యంత సరళంగా కనిపించినప్పటికీ భావం మాత్రం సంక్లిష్టమైన నిగూఢతను కలిగి ఉంటుంది.

ఈ కథల్లో ఆత్మలు స్వైర విహారం చేస్తాయి..ఒకే ఆత్మ కలిగి ఏక కాలంలో వివిధ కాలమాన పరిస్థితుల్లో సంచరించే వేర్వేరు మనుషులుంటారు,నిర్ణీత సమయంలో భూతభవిష్యద్ వర్తమానాల్లో వారు ఏ కాలంలో ఉన్నారన్న సంగతి ఇందులో పాత్రలకే కాదు,మనకు కూడా తెలీదు...మరణానంతరం కూడా మనుషులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు,జీవన్మరణాల మధ్య గీతలు మన కళ్ళముందే మసకబారిపోతుంటాయి,వీటన్నిటి మధ్యా పాఠకులకు రహస్యాలమయమైన వింతలోకాల్లో సంచరిస్తూ ఊహేదో,వాస్తవమేదో,స్వప్నమేదో తెలీని మాయాజాలంలో చిక్కుకున్నామనిపిస్తుంది..పోస్ట్ వార్ సోవియెట్ సమాజాన్నీ ఫెంటాస్టిక్ శైలిలో ప్రతిబింబించే ఈ కథలు ఒక ప్రక్క భయంగొల్పుతూనే మరో ప్రక్క రష్యా సమాజంలోని వైఫల్యాలను ఎత్తిచూపుతాయి..పెట్రోషెఫ్స్కియా కథల్లో పాత్రలు 'నాన్ కన్ఫర్మ్మిస్టులు'..నిర్దిష్టమైన వ్యక్తిత్వాలు ఆపాదించబడని కారణంగా ఈ కథల్లో పాత్రలు కథనం తాలూకు ప్రవాహాన్ని బట్టి దారిచేసుకుంటూ వాటంతటవే దిశలు మార్చుకుంటూ ఉంటాయి..కథ కంచికి చేరి అవి తమ గమ్యం చేరే క్రమంలో తమ జీవితాల్లో ఏం జరగబోతోందో తెలీని అస్పష్టతను,సందిగ్ధతను మోసుకుంటూ ముందుకు వెళ్తున్న పాత్రల్ని మనం కూడా నిస్సహాయంగా అనుసరిస్తూ వెళ్ళాల్సిందే...ఇందులో ప్రతీకథా రసాత్మకం,వైవిధ్యభరితం..Keith Gessen,Anna Summers లు చేసిన అనువాదం చాలా బావుంది..ఇందులో లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా శైలిని పట్టుకుంటూ వారు రాసిన ముందుమాటను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..దానికోసం ప్రత్యేకించి మరో పోస్టు రాస్తాను..అంత వరకూ సెలవు..Happy reading.

Monday, June 10, 2019

The Storied Life of A.J.Fikry - Gabrielle Zevin

మనుషుల్లాగే కొన్ని పుస్తకాల కవర్లు కూడా చూడ్డానికి అందంగానూ,ఆసక్తికరంగానూ ఉంటాయి..తీరా పేజీలు తిప్పిచూస్తే గానీ కవర్లకీ కంటెంట్ కీ పోలిక లేదని అర్ధం కాదు..అలాగే కొన్ని టైటిల్స్ కూడా కథ మీద expectations ను పెంచుతాయి..టైటిల్ వైవిధ్యంగా అనిపించీ,పాపులారిటీ చూసీ చదివిన ఈ పుస్తకం ఆశించిన రీతిలో లేక కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమే అయినప్పటికీ 'అస్తమానం అస్తిత్వవాదమేనా ? పుస్తక ప్రియులన్నాకా అప్పుడప్పుడూ యంగ్ అడల్ట్,చిల్డ్రన్ బుక్స్ కూడా చదువుతుండాలి' అని ఒక మహానుభావురాలు చెప్పిన కోట్ (అంటే జస్ట్ ఇప్పుడే నేనే చెప్పాను :P ) కూడా గుర్తొచ్చింది..ప్రపంచాన్ని 'రోజ్ కలర్డ్ గ్లాస్సెస్' లోంచి చూడ్డం మర్చిపోయిన పాఠకుల్ని అన్నీ మంచే,అంతా మంచే అనుకునే అమాయకపు కాలంలోకి తీసుకెళ్తుందీ నవల..ఈ 'వన్ టైం రీడ్' ని చక్కగా మీ to-read ఖాతాలో వేసేసుకోవచ్చు..అమెరికన్ రచయిత్రి Gabrielle Zevin 2013 లో రాసిన 'The Storied Life of A.J.Fikry' పుస్తక ప్రియులకు ఒక చిరుకానుక లాంటి పుస్తకం.
Image Courtesy Google
కథ విషయానికొస్తే భారత సంతతికి చెందిన వ్యక్తి A.J.Fikry (అజయ్ ఫిక్రీ) అమెరికాలోని అలిస్ ఐలాండ్ (కల్పిత ప్రదేశం) లో 'ఐలాండ్ బుక్ స్టోర్' నడుపుతుంటాడు..Fredrik Backman 'A Man Called Ove' లో ఓవ్ పాత్రని తలపించే ఫిక్రీ స్వభావ రీత్యా కోపిష్టి..సాహిత్యం విషయంలో ఖచ్చితమైన అభిరుచులు కలిగిన వ్యక్తి..కథ మొదలయ్యే సమయానికి ఫిక్రీ (43) భార్య మరణించడం,బుక్ స్టోర్ నష్టాల్లో కూరుకుపోవడంతో అతని జీవితం తలక్రిందులవుతుంది..ఆ సమయంలో 'Knightley Press' పబ్లిషింగ్ విభాగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన అమీలియా లోమన్ 'ఐలాండ్ పుస్తకాల షాపు'కు కొన్ని ప్రచురణలు తీసుకుని వస్తుంది..తొలి పరిచయంలో ఫిక్రీ దురుసు ప్రవర్తన మూలంగా వెనుదిరిగినా మెల్లిగా ఐలాండ్ నుండి పుస్తకాల ఆర్డర్ రాబట్టాలని ప్రయత్నిస్తుంటుంది..ఇదిలా ఉండగా జీవితం పట్ల ఆశ కోల్పోయి భారంగా బ్రతుకు వెళ్ళ దీస్తున్న సమయంలో ఒక్క రాత్రిలో ఫిక్రీ జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు జరుగుతాయి..ఆ సంఘటనలేంటి ? వాటి కారణంగా ఫిక్రీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ.

స్పష్టమైన సాహితీ అభిరుచులు ఉన్నవారికి ఈ పుస్తకం నచ్చడం కష్టం..అయినప్పటికీ ఈ కథలో కొన్ని లోటుపాట్లతో పాటు పుస్తక ప్రేమికులకు నచ్చే అనేక అంశాలు కూడా ఉన్నాయి..ఉదాహరణకి షార్ట్ స్టోరీస్ అమితంగా ఇష్టపడే ఫిక్రీ ఇందులో ప్రతి అధ్యాయాన్నీ Roald Dahl,Bret Harte,F.Scott Fitzgerald,Flannery O'Connor.Raymond Carver,Mark Twain,Poe మొదలైనవారు రాసిన కథల గురించి ప్రస్తావిస్తూ ప్రారంభించడం బావుంటుంది..అలాగే ఇందులో మనసుని తేలిక పరిచే సునిశిత హాస్యం కూడా ఉంది..ఒక సందర్భంలో ఫిక్రీ కస్టమర్ Mrs.Cumberbatch 'బుక్ థీఫ్' పుస్తకాన్ని నచ్చలేదని ఫిక్రీకి తిరిగిస్తూ చెప్పిన కారణాలు హాస్యపు జల్లులు కురిపిస్తాయి..ఇకపోతే కథానాయకుడి పేరు 'ఫిక్రీ' అని ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు..అతని ఐడెంటిటీకీ ఈ కథకు ఎంతమాత్రం అవసరం లేదు.

కొన్ని జానర్స్ కి  లోబడిన రచయిత్రి పుస్తక ప్రపంచం చాలా పరిమితమైనది అనిపించింది..అంతా 'ఫీల్ గుడ్' వాతావరణంలా కనిపించే అలీస్,అందులో ఊహించనలవికానంత 'మంచి మనుషులు' ఒక ఉటోపియా ప్రపంచాన్ని తలపిస్తూ ఒక్కోచోట 'యంగ్ అడల్ట్ ఫిక్షన్' చదువుతున్నామేమోననిపిస్తుంది..ఏమాత్రం పరిపక్వత లేని సాధారణమైన శైలి అయినప్పటికీ ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే పుస్తకం ఆపకుండా చదివిస్తుంది..ఒకే మూసలో ఒకే జానర్ కి పరిమితమయిపోకుండా ఏదైనా చదివే సంసిద్ధత ఉన్న వాళ్ళకు ఈ పుస్తకం ఒక మోస్తరు నచ్చుతుందనే అనుకుంటున్నాను..పెద్దగా మెదడుకు పని చెప్పక్కర్లేకుండా చక్కని కరణ్ జోహార్ సినిమా చూసినట్లూ,విక్టోరియన్ రొమాన్స్ చదువుతున్నట్లూ ఇందులో ఒక పుస్తకాన్ని చదివించడానికి అవసరమైన మెలోడ్రామాతో కూడిన అన్ని కమర్షియల్ అంశాలూ పుష్కలంగా ఉన్నాయి..అన్నిటినీ మించి పుస్తకాల కబుర్లతో పుస్తక ప్రపంచాన్నీ,పబ్లిషింగ్ వ్యవస్థనీ చక్కగా ప్రతిబింబించిన కథ ఉంది..సాహిత్యం అనేది సీరియస్ గా ఉండాలి,సాహితీ విలువలు ఉండాలి అని సాహిత్యానికి కొన్ని ఖచ్చితమైన విలువలు ఆపాదించే కథానాయకుడు ఫిక్రీ లాగానే మనం కూడా ఆలోచించకపోతే ఈ పుస్తకాన్ని చక్కగా ఏ ఎయిర్ పోర్ట్ లోనో,రైల్వే స్టేషన్లోనో కూర్చుని ఒకసారి చదివి  ప్రక్కన పెట్టెయ్యొచ్చు..ఈ వేసవిలో సీరియస్ లిటరేచర్ నుండి ప్రక్కకి జరిగి చదివిన ఈ పుస్తకం నాకో ఆటవిడుపు...ఇది గొప్ప పుస్తకం అని అననుగానీ మంచి పుస్తకమే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..

ఫిక్రీ అమీలియాకు తన సాహితీ అభిరుచుల్ని గురించి చెప్తూ,
 “How about I tell you what I don’t like? I do not like postmodernism, postapocalyptic settings, postmortem narrators, or magic realism. I rarely respond to supposedly clever formal devices, multiple fonts, pictures where they shouldn’t be—basically, gimmicks of any kind. I find literary fiction about the Holocaust or any other major world tragedy to be distasteful—nonfiction only, please. I do not like genre mash-ups à la the literary detective novel or the literary fantasy. Literary should be literary, and genre should be genre, and crossbreeding rarely results in anything satisfying. I do not like children’s books, especially ones with orphans, and I prefer not to clutter my shelves with young adult. I do not like anything over four hundred pages or under one hundred fifty pages. I am repulsed by ghostwritten novels by reality television stars, celebrity picture books, sports memoirs, movie tie-in editions, novelty items, and—I imagine this goes without saying—vampires. I rarely stock debuts, chick lit, poetry, or translations. I would prefer not to stock series, but the demands of my pocketbook require me to. For your part, you needn’t tell me about the ‘next big series’ until it is ensconced on the New York Times Best Sellers list. Above all, Ms. Loman, I find slim literary memoirs about little old men whose little old wives have died from cancer to be absolutely intolerable. No matter how well written the sales rep claims they are. No matter how many copies you promise I’ll sell on Mother’s Day.”
“Infinite Jest is an endurance contest. You manage to get through it and you have no choice but to say you like it. Otherwise, you have to deal with the fact that you just wasted weeks of your life,” A.J. had countered.“Style, no substance, my friend.”
Despite the fact that he loves books and owns a bookstore, A.J. does not particularly care for writers. He finds them to be unkempt, narcissistic, silly, and generally unpleasant people. He tries to avoid meeting the ones who’ve written books he loves for fear that they will ruin their books for him. Luckily, he does not love Daniel’s books, not even the popular first novel. As for the man? Well, he amuses A.J. to an extent. This is to say, Daniel Parish is one of A.J.’s closest friends.
“Poe’s a lousy writer, you know? And ‘Tamerlane’ is the worst. Boring Lord Byron rip-off. It’d be one thing if it were a first edition of something fucking decent. You should be glad to be rid of it. I loathe collectible books anyway. People getting all moony over particular paper carcasses. It’s the ideas that matter, man. The words,” Daniel Parish says.     A.J. finishes his beer. “You, sir, are an idiot.”
I was on my way to a PhD in American literature before I quit that to open this bookstore. My specialty was Edgar Allan Poe. ‘The Fall of the House of Usher’ is a decent primer on what not to do with children.”
The town florist tells a story about leaving a pair of sunglasses in Island Books and coming back less than one day later to find that A.J. had thrown them out. “He said his store had no room for a lost-and-found. And that’s what happens to very nice, vintage Ray-Bans!” the florist says.
“Sometimes books don’t find us until the right time.”
“No one travels without purpose. Those who are lost wish to be lost.”
We are not quite short stories.In the end, we are collected works.He has read enough to know there are no collections where each story is perfect. Some hits. Some misses. If you’re lucky, a standout. And in the end, people only really remember the standouts anyway, and they don’t remember those for very long.     No, not very long.
I know what words do, he thinks. They let us feel less.

Saturday, June 8, 2019

Fahrenheit 451 - Ray Bradbury

* "పుస్తకపఠనం వల్ల ప్రయోజనం శూన్యం,ఎక్కువ చదివితే అనవసరమైన ఆలోచనలొచ్చి బుర్ర పాడవుతుంది" ---- బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎవరు ఫైనల్స్ కి వస్తారా అని తలబద్దలుకొట్టుకుంటూ బెట్టింగ్ కట్టుకునే ఒక పెద్దాయన.
* "హాయిగా నెట్ఫ్లిక్ లో 2 గంటల్లో సినిమా/సిరీస్ చూసేసే సౌలభ్యం ఉన్నప్పుడు అంత కష్టపడి పుస్తకం చదవడమెందుకు "----ఒక టీవీ సిరీస్ పధ్నాలుగో సీసన్ లో పదిహేడో ఎపిసోడ్ ను బింజ్ వాచ్ చేస్తున్న యువత.
* "చదవొద్దని ఎవరన్నారు ! ఎటొచ్చీ ఆ సీరియస్ పుస్తకాలకు దూరంగా ఉండు,హాయిగా ఏ ఫీల్ గుడ్ (?) పుస్తకాలో చదువుకో,గులాబీలూ,చందమామలూ,ఇంద్రధనుస్సులూ,విరహాలూ అంటూ కథలూ,కవిత్వాలు ఉంటాయి కదా అవి మంచివి(!)"----అత్తగారు,ఆడపడుచూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ కొడుకు నాలుగో భార్యకి పుట్టిన మూడో కూతుర్ని హింసిస్తున్న సీరియల్ చూస్తూ కంటతడిపెట్టుకునే ఒక పెద్దావిడ.
* "అబ్బే ఆ పుస్తకాలు చదువుతూ ఓ మూలాన కూర్చోడమేగానీ నలుగురితో కలిసి నవ్వడం రాదు,బొత్తిగా Anti-Social"---- టీవీ కామెడీ షోల పేరిట చూపించే మకిలి పట్టిన వెకిలి హాస్యానికి పగలబడి నవ్వే సంఘజీవులు. 

బహుశా సంతోషంగా ఎలా బ్రతకాలో ఈ తరానికి తెలిసినంత మరే తరానికీ తెలీదేమో అనిపించేలా 'హ్యాపీనెస్' స్లోగన్ తో హ్యాపీగా(?) బ్రతికేస్తున్న అసలు సిసలు 'ఆర్ట్ అఫ్ లివింగ్ గురువుల' గురించి రే బ్రాడ్బరీ ఎప్పుడో యాభైల్లో రాసిన ఫారెన్ హైట్ 451 అనే డిస్టోపియన్ నవలలో ప్రస్తావించిన అంశాలను ఇప్పటి సమాజానికి అన్వయించుకుంటే ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే..అన్నీ కాకపోయినా పైన ఉదహరించిన అంశాల్లో ఎక్కడో ఒక చోట నేటి తరం తనను తాను రిలేట్ చేసుకుంటుంది. 
Image Courtesy Google
సంతోషానికి ఈ తరమిచ్చే నిర్వచనాలు పూర్తిగా వేరు..ఉదాహరణకు నెగెటివిటీని చూసి కళ్ళు మూసుకోవడం,స్పందించవలసిన/ముఖ్యమైన విషయాలక్కూడా మన ఇంటి సంగతి కాదు లెమ్మని ప్రక్కకి తప్పుకోవడం(Please,I'm not referring to social media wars),కోపం,బాధ లాంటి సహజమైన భావాల్ని కూడా వ్యక్తిత్వ లోపాలుగా పరిగణించడం లాంటివి అన్నమాట..తటస్థ వైఖరి పేరిట తప్పుని తప్పని ఖండించకపోగా దుర్యోధనులకు సైతం మిత్రులమని సగర్వంగా చెప్పుకు తిరిగే 'వీర శూర కర్ణులు' ఎక్కువైపోయిన నేటి సమాజానికి కావాల్సిందొక్కటే,'సంతోషం'..అసలు నీకేం కావాలని ఏ మనిషిని అడిగినా 'శాంతి/సంతోషం' అనే ఖచ్చితమైన సమాధానమే తరచూ వినిపిస్తుంది..మరి ఈ రెండూ దొరకాలంటే మనిషిలో అనవసరమైన(?) ఆలోచనలు ఉండకూడదు..మరి అలా ఉండకూడదంటే ఆలోచన రేకెత్తించేవాటినన్నిటినీ లేకుండా నాశనం చేసేస్తే సరిపోతుంది కదా! ఇలా అనుకున్నదే తడవు వెంటనే గుర్తొచ్చేవి పుస్తకాలు..నిజానికి పుస్తకాలని మించి మనిషిని ఆలోచింపజేసేవేముంటాయి ? పుస్తకాల వల్ల బూజుపట్టిన భావాలు వదిలి,ఆలోచనా పరిధి పెరిగి,మనిషిలో ధర్మాధర్మ విచక్షణ మొదలవుతుంది..సంఘర్షణకు మూల కారణం ఇదే కాబట్టి అసలు ఆ దువిధంటూ లేకపోతే ఇక మిగిలేది శాంతే...ఎప్పుడైనా రెండు పరస్పర విరుద్ధ భావాలు సంఘర్షించుకోకపోతే ఇక అంతా శాంతిమయమే కదా..ఈ మెరుపు లాంటి ఆలోచన ఎవరికొచ్చిందో ఏమో గానీ దాన్ని వెంటనే అమలులో పెట్టింది ప్రభుత్వం...ప్రతి ఇంటినీ ఫైర్ ప్రూఫ్ గా మార్చి,ఆలోచనల్ని ప్రేరేపించే సాహిత్యాన్ని అంతటినీ వెలికితీసి దగ్ధం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన ఫైర్ విభాగాన్ని నెలకొల్పింది..నిషేధించబడిన పుస్తకాలు కలిగియున్న ఇళ్ళపై నిఘా పెట్టడానికి ఒక 'మెకానికల్ వేటకుక్కల'ను కూడా తయారు చేసింది..ముఖ్యంగా ఫిలాసఫీ,సోషియాలజీ లాంటి పుస్తకాలను లక్ష్యంగా చేసుకుని ఆ సిద్ధాంతాన్ని అమలుపరిచింది..రెండు ఆప్షన్స్ లేనప్పుడు మనిషి తనకున్న ఒకే ఒక్క ఆప్షన్ తో సంతోషంగా బ్రతికేస్తాడని వారి నమ్మకం.."Happiness in intelligent people is the rarest thing I know" అని ఎర్నెస్ట్ హెమ్మింగ్వే అన్నట్లు అజ్ఞానాన్ని మించిన ఆనందమేముంటుంది ? కథానాయకుడు గై మోంటాగ్ అటువంటి ఫైర్ విభాగంలో ఆఫీసర్ బియట్టి క్రింద పని చేసే ఒక ఫైర్ మాన్.
You ask Why to a lot of things and you wind up very unhappy indeed, if you keep at it.
You can't build a house without nails and wood. If you don't want a house built, hide the nails and wood. If you don't want a man unhappy politically, don't give him two sides to a question to worry him; give him one. Better yet, give him none.

'It was a pleasure to burn' అనుకుంటూ ఒక రోజు తన వృత్తిని సగర్వంగా పూర్తిచేసి ఇంటికి తిరిగి వస్తున్న మోంటాగ్ కు క్లారీస్ అనే అమ్మాయి పరిచయమవుతుంది..అంతవరకూ ఒక యంత్రంలా బ్రతుకుతున్న మోంటాగ్ దృక్పథాన్ని క్లారిస్ పరిచయం సమూలంగా మార్చేస్తుంది...ఆ తరువాత మోంటాగ్ జీవితం ఏ మలుపు తీసుకుందనేది మిగతా కథ..కొన్ని పుస్తకాల్ని ఏకాలంలో చదివినా రచయిత అప్పుడే తాజాగా కలం విదిల్చి వర్తమాన సమాజాన్ని ఉద్దేశించి రాసినట్లు,ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చక్కగా ఒదిగిపోతాయి..రే బ్రాడ్బరీ 'ఫారెన్ హైట్ 451' కాలదోషం పట్టకుండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అటువంటి ఒక రచన..ప్రతీ మనిషి జీవితంలో చదవవలసిన వంద పుస్తకాల్లో లిస్టుల్లో ఎక్కడ చూసినా కనిపించే ఈ పుస్తకాన్ని ఇప్పటివరకూ ఎందుకో చదవడం వీలుపడలేదు..కనీసం 'ది ఇల్లస్ట్రేటెడ్ మాన్' తో బ్రాడ్బరీ మేజిక్ పరిచయమయ్యాక కూడా వెంటనే ఈ పుస్తకం చదవలేదు..మొత్తనికి ఈ ఏడాది నిడివి తక్కువా-నాణ్యత ఎక్కువా ఉన్న ఈ పుస్తకాన్ని చదివే అదృష్టం దక్కింది..పుస్తకం పేరు విషయానికొస్తే,451 డిగ్రీల ఫారెన్ హైట్ ఉష్ణోగ్రత వద్ద ఒక పుస్తకంలో పేజీ మంటలకు ఆహుతవుతుంది,అందుకే దీనికి ఆ పేరు పెట్టారట..1953 లో తొలిసారిగా ప్రచురితమై 60th anniversary ఎడిషన్ తో షష్టిపూర్తి కూడా పూర్తి చేసుకున్న ఈ డిస్టోపియన్ నవల నేటి సమాజాన్ని యధాతథంగా ప్రతిబింబిస్తుంది.

పుస్తకాల్లో ఏముంటాయి ? కొన్ని అక్షరాలు ? వాక్యాలు ? పంక్తులు ? అంతేనా !!! కాదేమో..వాటి వెనుక నిజమైన   మనుషులుంటారు..వారి జీవితాలుంటాయి...ఆలోచనలుంటాయి...సంఘర్షణలుంటాయి..తరాల సంస్కృతి ఉంటుంది..చరిత్ర ఉంటుంది..కానీ శాంతి/సంతోషమే ప్రధానమని భావించే నాగరిక సమాజానికి ఇవేవీ అవసరం లేదని నమ్మే ప్రభుత్వం వాటిని కాల్చి బూడిద చెయ్యడానికి పూనుకుంటుంది..ఈ నవలలో ఆధునిక సమాజపు పోకడలకు అద్దం పట్టే పలు అంశాలుంటాయి..ఉదాహరణకు మోంటాగ్ ఇంట్లో పార్లర్ లో గోడలకి టీవీలుంటాయి..మోంటాగ్ భార్య మిల్డ్రెడ్ ఆ టీవీ ప్రసారాల్లో స్క్రీన్ మీద కనిపించే మనుషుల్ని 'బంధువులు' అంటుంటుంది..మిల్డ్రెడ్ తో పాటు మరి కొన్ని స్త్రీ పాత్రలు టెక్నాలజీకి బానిసలై,టీవీ,కంప్యూటర్ స్క్రీన్ ల ముందు కాలం గడుపుతూ,మాస్ మీడియా,సోషల్ మీడియా ప్రభావానికి లోనై,అదే యదార్థమని గుడ్డిగా నమ్ముతూ జీవిస్తున్న నేటి తరానికి ప్రతీకలుగా కనిపిస్తాయి...అలాగే "Peace, Montag." అంటూ బియట్టీ మోంటాగ్ ని ఉద్దేశించి చేసే దీర్ఘమైన ప్రసంగం ఈ పుస్తకానికంతటికీ హైలైట్..అది చదువుతున్నప్పుడు బియట్టీ మాటల్లో భవిష్యవాణిని సమర్ధవంతంగా వినిపించిన రే బ్రాడ్బరీ ప్రతిభకు నమస్కరించకుండా ఉండలేము..ప్రతి సమాజంలోనూ మైనారిటీల పేరిట పొంచి ఉన్న పెను ప్రమాదాన్నీ,లిబరల్ సొసైటీ చేసే హానినీ,'మెజారిటీ' చిమ్ముతున్న విషాన్నీ ఆనాడే హెచ్చరించారు..ఊహాత్మక శక్తిని నాశనం చేసే విధంగా పుస్తకాల అవసరం లేకుండా క్లాసిక్స్ ని కూడా 15 నిముషాల టీవీ షో గా కుదిస్తున్నారు అంటూ బియట్టీ ఒక సందర్భంలో అనడం చూస్తే,నేటి నెట్ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ రోజుల్ని రచయిత ముందుగానే ఊహించారా అనిపిస్తుంది..బియట్టి ఒక సందర్భంలో అంటాడు,"ప్రజలకి వాళ్ళకి తెలిసిన ప్రముఖమైన పాటల్లో పదాల్ని గుర్తుకు తెచ్చుకుని సులభంగా నెగ్గే పోటీలు పెట్టాలి..లేదా రాష్ట్రాలకి రాజధానులేంటో,గత ఏడాది ఒక రాష్ట్రం ఎంత జొన్నల్ని పండించిందో అడిగే పోటీలు పెట్టాలి..ఆలోచలనలకు ఆస్కారం లేని 'ఫాక్ట్స్' ని దట్టించాలి..అప్పుడు వారి మెదళ్ళు ఆ సమాచారంతో నిండిపోయి వాళ్ళు తాము గొప్పగా ఆలోచిస్తున్నామనే భ్రమలో ఉంటారు..తాము మేధావులమనుకుంటారు..కదలిక లేని స్థాన చలనాన్ని అనుభవిస్తారు..కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు,ఎందుకంటే 'ఫాక్ట్స్' ఎప్పటికీ మారవు." అని..ఇలా ఒక్కో వాక్యం నేటి సమాజానికి చెంపపెట్టులా ఉంటుంది..కథనంలో నిగూఢంగా నిక్షిప్తమైయున్న అనేకార్ధాలు నలు దిశలకూ చోటు చేసుకుంటూ మల్టీ డిమెన్షన్స్ లో ప్రయణిస్తూ మానవాళి ప్రగతిని పునః పరిశీలించుకోమంటాయి.

పేజీలకు పేజీల ఉపోద్ఘాతలూ,అనవసర నీతి బోధలూ లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా,పొదుపైన పదాల్లో చెప్పడం తెలిసిన అతి కొద్ది మంది రచయితల్లో బ్రాడ్బరీ కూడా ఒకరు..ఈ నవల డిస్టోపియన్ రచయితల్లో నాకు బాగా నచ్చే ఆర్వెల్,వన్నెఘాట్,లూయిస్ లౌరీ వంటి వారి రచనల్ని గుర్తుకు తెచ్చింది..ప్రతీ పేజీలోనూ బ్రాడ్బరీ కలంనుండి జారిపడిన అక్షరాలు ఆజ్యంగా మారి ఉవ్వెత్తున మంటలు ఎగసి పడినట్లనిపిస్తుంది..కథలో అబ్బురపరిచే అనేక సందర్భాలున్నా,ఒక సందర్భం గురించి మాత్రం ప్రత్యేకం చెప్పుకోవాలి..మోంటాగ్ ఒక వాక్యూమ్ అండర్గ్రౌండ్ లో రైల్లో ప్రయాణిస్తూ తాను రహస్యంగా దాచుకున్న ఒక పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేస్తుంటాడు..అతను రెండు వాక్యాలు చదివేలోపు ట్రైన్ రేడియోలో బిగ్గరగా "Denham's Dentifrice" అని ఒక టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది..అక్కడ కూర్చున్న జనాలు ఆ అడ్వర్టైజ్మెంట్ లోని పదాలకు లయబద్ధంగా పాదాలు కదుపుతుంటారు..
The people who had been sitting a moment before, tapping their feet to the rhythm of Denham's Dentifrice, Denham's Dandy Dental Detergent, Denham's Dentifrice Dentifrice Dentifrice, one two, one two three, one two, one two three. The people whose mouths had been faintly twitching the words Dentifrice Dentifrice Dentifrice. The train radio vomited upon Montag, in retaliation, a great ton-load of music made of tin, copper, silver, chromium, and brass. The people were pounded into submission; they did not run, there was no place to run; the great air-train fell down its shaft in the earth.
అవసరమైన/మంచి విషయం నుండి దృష్టిని మళ్ళిస్తూ అనవసరమైన చెత్తనంతా మనుషుల మెదళ్ళలో నింపుతున్న నేటి వాట్సాప్ మెసేజెస్,రియాలిటీ షోస్,సోషల్ మీడియా,కన్స్యూమర్ వెర్రి అన్నీ కలిపి ఈ రెండు పేరాగ్రాఫుల్లో మన సమాజం మన కళ్ళముందుకొచ్చేస్తుంది..ట్రైన్ రేడియో లోహపు ధ్వనులతో కూడిన సంగీతాన్ని (?) కక్కింది అన్నప్పుడు మానవ జాతి కృత్రిమత్వంతో విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిందన్న బాధ రచయితలో అంతర్లీనంగా వ్యక్తమవుతుంది...'ఫారెన్ హైట్ 451' నేటి సమాజంలో ఆధునికత పేరిట అమలులో ఉన్న అనేక సాంఘిక వైకల్యాలను సూటిగా వేలెత్తి చూపిస్తుంది..జీవ పరిణామ క్రమంలో మనిషి గర్వపడే మానవాళి ప్రస్థానాన్ని పునః సమీక్షించి చూసుకోమంటుంది...వస్తువుల్నే కాదు మనుషుల్ని కూడా 'use and throw' అనే సింపుల్ ఫార్ములాతో విసిరిపడేసి,'Being practical' అని గర్వంగా చెప్పుకుంటున్న నేటి సమాజానికి సంస్కృతి,చరిత్ర,నైతిక విలువల ఆవశ్యకతను తెలియజేస్తుంది..మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తే, 'నిజమే! ఈ పుస్తకాలు చదివి ఏం చెయ్యాలి ? లెక్చర్లు ఇవ్వాలా ? లిటరరీ కాన్ఫరెన్సుల్లో స్పీచ్ లు చెప్పాలా ? సాహితీ సృష్టి చెయ్యాలా ? మరి ఎందుకు ? ప్రయోజం అంటూ ఉండాలి కదా ! అసలు సాహితీ ప్రయోజనం ఏమిటి ? '..'ఇంటెలెక్చువల్' అనే పదం సైతం వ్యంగ్యార్థంలో,ఒక తిట్టులా ఉపయోగిస్తున్న నేటి తరంలో రే బ్రాడ్బరీ 'ఫారెన్ హైట్ 451' ఈ ప్రశ్నలన్నిటికీ సూటైన,ధీటైన సమాధానం.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
“Now let's take up the minorities in our civilization, shall we? Bigger the population, the more minorities. Don't step on the toes of the dog-lovers, the cat-lovers, doctors, lawyers, merchants, chiefs, Mormons, Baptists, Unitarians, second-generation Chinese, Swedes, Italians, Germans, Texans, Brooklynites, Irishmen, people from Oregon or Mexico. The people in this book, this play, this TV serial are not meant to represent any actual painters, cartographers, mechanics anywhere. The bigger your market, Montag, the less you handle controversy, remember that! All the minor minor minorities with their navels to be kept clean. Authors, full of evil thoughts, lock up your typewriters. They did. Magazines became a nice blend of vanilla tapioca. Books, so the damned snobbish critics said, were dishwater. No wonder books stopped selling, the critics said. But the public, knowing what it wanted, spinning happily, let the comic books survive. And the three-dimensional sex-magazines, of course. There you have it, Montag. It didn't come from the Government down. There was no dictum, no declaration, no censorship, to start with, no! Technology, mass exploitation, and minority pressure carried the trick, thank God. Today, thanks to them, you can stay happy all the time, you are allowed to read comics, the good old confessions, or trade journals.”
“Well, after all, this is the age of the disposable tissue. Blow your nose on a person, wad them, flush them away, reach for another, blow, wad, flush. Everyone using everyone else's coattails.
Technology, mass exploitation, and minority pressure carried the trick, thank God.
Books were only one type of receptacle where we stored a lot of things we were afraid we might forget. There is nothing magical in them at all. The magic is only in what books say, how they stitched the patches of the universe together into one garment for us.
With school turning out more runners, jumpers, racers, tinkerers, grabbers, snatchers, fliers, and swimmers instead of examiners, critics, knowers, and imaginative creators, the word 'intellectual,' of course, became the swear word it deserved to be. You always dread the unfamiliar. Surely you remember the boy in your own school class who was exceptionally 'bright,' did most of the reciting and answering while the others sat like so many leaden idols, hating him. And wasn't it this bright boy you selected for beatings and tortures after hours? Of course it was. We must all be alike.
Not everyone born free and equal, as the Constitution says, but everyone made equal. Each man the image of every other; then all are happy, for there are no mountains to make them cower, to judge themselves against. So! A book is a loaded gun in the house next door. Burn it. Take the shot from the weapon. Breach man's mind. Who knows who might be the target of the well-read man?
But remember that the Captain belongs to the most dangerous enemy of truth and freedom, the solid unmoving cattle of the majority. Oh, God, the terrible tyranny of the majority.
The books leapt and danced like roasted birds, their wings ablaze with red and yellow feathers.
“Everyone must leave something behind when he dies, my grandfather said. A child or a book or a painting or a house or a wall built or a pair of shoes made. Or a garden planted. Something your hand touched some way so your soul has somewhere to go when you die, and when people look at that tree or that flower you planted, you're there. It doesn't matter what you do, he said, so long as you change something from the way it was before you touched it into something that's like you after you take your hands away.
'I hate a Roman named Status Quo!' he said to me. 'Stuff your eyes with wonder,' he said, 'live as if you'd drop dead in ten seconds. See the world. It's more fantastic than any dream made or paid for in factories. Ask no guarantees, ask for no security, there never was such an animal. And if there were, it would be related to the great sloth which hangs upside down in a tree all day every day, sleeping its life away. To hell with that,' he said, 'shake the tree and knock the great sloth down on his ass.'”
But even when we had the books on hand, a long time ago, we didn't use what we got out of them. We went right on insulting the dead. We went right on spitting in the graves of all the poor ones who died before us.

Friday, June 7, 2019

Machines Like Me - Ian McEwan

మొహబ్బతే సినిమాలో ఒక సందర్భంలో బచ్చన్ గంభీరమైన స్వరంలో 'I don't like changes' అంటాడు..బిగ్ బీ వీరాభిమానిగా ఎంత బాగా చెప్పారో అని చప్పట్లు కొట్టినా మనకు నచ్చదని 'మార్పు' ఆగిపోదనేది మాత్రం సత్యం ..మనిషి చేతిలో ఉన్నదల్లా పాతను బంగారంలా భద్రంగా దాచుకుని,కొత్తను మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే..నేటి శాస్త్రసాంకేతికరంగం మానవసమాజాన్ని సమూలంగా మార్చేస్తూ అభివృద్ధి దిశగా(?) పరుగులుతీస్తోంది..Mark O'Connell రచన 'To Be a Machine' (నాన్ ఫిక్షన్) చదివినప్పుడు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషుల్ని పోలిన యంత్రాలను తయారు చెయ్యడంలో సఫలీకృతమైన శాస్త్ర సాంకేతిక రంగం హ్యూమన్ consciousness కోడ్ ని కూడా బ్రేక్ చేసే దిశగా చేస్తున్న పరిశోధనల గురించి రాశారు..ఆ చివరి ప్రయత్నం కూడా ఫలిస్తే తరువాత ఏం జరుగుతుంది ? మనుషులతో సరిసమానమైన భావోద్వేగాలు,consciousness కలిగి ఉండే రోబోట్స్ మానవ సమాజంలో సులభంగా ఇమిడిపోతాయా ? నిత్యజీవితంలో మనుషులతో వాటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతాయి ? హ్యూమనోయిడ్ రోబోట్స్ తో కలిసిమెలసి జీవించే మానవ సమాజాల  భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ? ఇటువంటి అంశాలను విశ్లేషిస్తూ బ్రిటీషు రచయిత Ian McEwan రాసిన నవలే ఈ 'Machines like me'.
Image Courtesy Google
అనగనగా 1980ల కాలంనాటి లండన్ లో ఛార్లీ ఫ్రెండ్(32) అనే ఒక యువకుడు..ఆంథ్రోపాలజీ చదివి వివిధ వృత్తులు చేసి చివరకు స్టాక్ బ్రోకర్ గా అస్థిరమైన జీవితం గడుపుతున్న ఛార్లీకి టెక్నాలజీ అంటే విపరీతమైన పిచ్చి..సాంకేతిక పురోగతికి స్వర్ణయుగంలాంటి ఎనభయ్ ల కాలంలో శాస్త్రజ్ఞులు ఆడమ్(12),ఈవ్(13) అనే 25 రోబోట్లను తయారు చేయగా అందులో ఒక ఆడమ్ ను ఛార్లీ కొనుగోలు చేస్తాడు..ఛార్లీ తల్లి వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మి,ఉన్న సొమ్మంతా వెచ్చించి కొన్న ఆడమ్ ప్రత్యేకత ఏంటంటే అతడు నీలికళ్ళతో అచ్చం మనిషిని పోలి ఉంటాడు..ఆడమ్ లో అన్ని మానవ సహజమైన భావోద్వేగాలూ ఉంటాయి..పసిబిడ్డలా ఆడమ్ కళ్ళు తెరచిన దగ్గర నుండీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వాటికనుగుణంగా తన వ్యక్తిత్వం రూపొందించుకుంటూ ఉంటాడు..ఎలక్ట్రానిక్స్,ఆంథ్రోపాలజీ లను దూరపు బంధువులనుకుంటే,నేటి ఆధునిక సమాజం వారిద్దరినీ వివాహ బంధంతో ముడివేసింది..వారి కలయికకు ప్రతిఫలమే ఈ 'ఆడమ్'.

ఇక ప్రొటొగోనిస్ట్ ఛార్లీ తన ప్రేమికురాలు మిరాండాతో సహజీవనం చేస్తూ ఉంటాడు..ఆడమ్ కు సంబంధించిన పాస్వర్డ్ వివరాలను మిరాండాకు ఇచ్చి అతడి వ్యక్తిత్వ నిర్మాణంలో ఆమెకు కూడా సరిసమానమైన భాగస్వామ్యం ఇస్తాడు ఛార్లీ..ఈ విధంగా వారు ముగ్గురూ కలిసి ఒకే అపార్టుమెంటులో జీవిస్తూ ఉంటారు..అన్ని మానవ సహజమైన భావోద్వేగాలూ ఉన్న ఆడమ్ కూడా మిరండాతో ప్రేమలో పడతాడు,ఆమె మీద తన ప్రేమను వర్ణిస్తూ హైకూలూ కూడా రాస్తుంటాడు..ఈ ప్రేమ వ్యవహారం ఛార్లీకి ఇబ్బందికరంగా ఉన్నాఆడమ్ ఒక రోబోట్ అని తన మనసుకు నచ్చజెప్పుకుంటుంటాడు..ఛార్లీ ఇచ్చిన పాత కంప్యూటర్లో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తాడు ఆడమ్..ఆ డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుని జీవితంలో స్థిర పడదామనుకుంటారు ఛార్లీ,మిరాండాలు..ఈ లోగా మిరాండా ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ఉదంతంతో కథ మలుపు తిరుగుతుంది..మిరాండాను అమితంగా ప్రేమించిన ఆడమ్(రోబోట్),ఛార్లీ ఇద్దరూ ఆమెను ఆ కేసు నుండి బయటపడెయ్యడానికి ఏం చేశారన్నది మిగతా కథ.

అటోన్మెంట్,చిల్డ్రన్ ఆక్ట్ వంటి ప్రసిద్ధి చెందిన నవలల్ని రాసిన Ian McEwan సరికొత్త నవల 'మెషీన్స్ లైక్ మీ' మానవీయ విలువలకీ,యాంత్రికతకీ మధ్య సంఘర్షణను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది..శాస్త్ర సాంకేతికాభివృద్ధి తారాస్థాయికి చేరిన ఈ కాలంలో నాన్ ఫిక్షన్ లోనే కాదు ఫిక్షన్ లో కూడా ఈ తరహా రచనలు విరివిగా ప్రచురితమవుతున్నాయి..ఈ కాల్పనిక కథలో ప్రపంచ యుద్ధ వీరుడుగా కొనియాడబడే సర్ అలాన్ ట్యూరింగ్ డెబ్భై ఏళ్ళ వృద్ధునిగా దర్శనమిస్తారు..టెక్నాలజీ పురోగతిని గురించి అలాన్ ట్యూరింగ్ బ్రతికుంటే ఎటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చారో ఇందులో చూడవచ్చు...ఆడమ్ కథ,బదులు తోచని అనేక ప్రశ్నలకు తెరతీస్తుంది..మనిషికీ యంత్రానికీ మధ్య ఉన్న భేదం కేవలం భావోద్వేగాలేనా ? లేక మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసే యోచించే గుణం,భావాలను నియంత్రించుకునే వివేకం లాంటి అంశాలతో పాటు మరింకేమైనా ఉన్నాయా ? మానవ సమాజంలో అధర్మం కూడా ఒక్కోసారి నైతిక కోణం నుంచి చూస్తే ధర్మంగా అనిపిస్తుంది..మన సమాజంలో ఒక మనిషిని హత్య చెయ్యడం నేరం..కానీ ఒక మృగాన్ని తలపించే క్రూరమైన నేరం చేసిన మనిషిని చట్టబద్ధంగా హత్య చేసి శిక్షిస్తాం..మాములు మనిషి చేస్తే హత్య చట్టం చేతిలోకి చేరేసరికి ధర్మంగా రూపాంతరం చెందుతుంది..అలాగే దైనందిన వ్యవహారాల్లో,మానవ సంబంధాల్లో అసత్యాలు నిత్యావసరాలు..మోర్టాలిటీని అంగీకరించని మనిషి జీవితం,దాని చుట్టూ పెనవేసుకునే మానవ సంబంధాలు సైతం అనేకమైన అసత్యపు పునాదుల మీదే నిలబడతాయనడం అతిశయోక్తి కాదేమో..ఎంత ధర్మబద్ధుడైనా ఒక మనిషి ఒక నిర్ణీత సమయంలో ఎలా వ్యవహరిస్తాడనేది ఊహించడం సాటి మనుషులకే కష్టం..అటువంటిది మనుషులకే  అర్ధం కాని మనిషి మెదడుని మనిషి తయారు చేసిన మరో యంత్రం అర్ధం చేసుకోగలదా !! నైతికత ముసుగులో నిత్యం ఒకర్నొకరు మోసం చేసుకుంటూ బ్రతికే మానవ సమాజంలో పేరుకున్న ఈ హిపోక్రసీ ఆడమ్ లాంటి యంత్రాలకు అర్ధం కాదు..అందువల్ల శాస్త్రజ్ఞులు తయారుచేసిన మొత్తం 25 రోబోట్స్ లో కొన్ని రోబోట్స్ మానవ సమాజాన్ని అర్ధం చేసుకోలేక ఒంటరితనంతో తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనై తమ టెక్నాలజీని తామే నిర్వీర్యం చేసుకుని ఆత్మహత్యలకు పాల్పడతాయి..మిరండా కేసును పరిశీలించిన దృష్ట్యా ఆమెకు శిక్షపడాలని ఆడమ్ భావిస్తాడు..కానీ తమ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుందన్న భయంతో ఆడమ్ తల మీద దాడి చేసి అతన్ని నిర్వీర్యుణ్ణి చేస్తాడు ఛార్లీ...చివరకు మనిషి మేథస్సు వల్ల జన్మించిన యంత్రం,మనిషి నైతికత వైఫల్యం వల్ల అతని చేతిలోనే హతమవుతుంది..ఈ కథలో తమకు అనుగుణంగా ధర్మాన్ని మార్చుకునే మనుషుల నైతికవైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది..ఈ విషయంపై అలాన్ ట్యూరింగ్ వ్యక్తపరిచే అభిప్రాయాలు చదివి తీరాల్సిందే..భావోద్వేగాలను అద్భుతంగా చిత్రించగల నేర్పున్న రచయిత ఇయాన్ మాకివాన్..అయినా నా వరకూ ఈ నవలలో నచ్చని అంశాలు కూడా చాలానే ఉన్నాయి..వర్తమానంతో ముడిపెట్టి రాసినా సరిపోయే ఈ నవలను ఎనభైల దశకానికి చెందిన లండన్ రాజకీయాలకు ముడిపెట్టి రాయవలసిన అవసరం నాకైతే ఎంత మాత్రం కనిపించలేదు..కథకు సమాంతరంగా,సంబంధం లేకుండా సాగే 1980 ల నాటి లండన్ రాజకీయ స్థితిగతుల సుదీర్ఘమైన వివరణలు విసుగు తెప్పిస్తాయి..అర్జెంటీనాకూ,యునైటెడ్ కింగ్డమ్ కూ మధ్య జరిగిన Falklands War లో మార్గరెట్ థాచర్ పాత్రను గురించీ రచయిత చేసిన లోతైన విశ్లేషణలు మెచ్చుకోదగినవైనా కథకు సంబంధించి చాలా అసందర్భంగా అనిపించాయి..

'మొరాలిటీ' మనిషికి అన్నివేళలా ఎండమావిలాగే మిగిలిపోయింది..నైతికత మనిషి ఏనాటికీ సాధించలేనిదీ,మనిషికి జీవితంలో అన్వయించుకోడానికి సాధ్యం కానిదీను..మన పురాణేతిహాసాలే దీనికి సాక్ష్యం..మనిషి రూపొందించుకున్న నియమావళిలో అసత్యాలు,అధర్మాలు కూడా ఒక్కోసారి నిత్యావసరాలు..పూర్తి స్థాయి నైతిక విలువలతో బ్రతికిన మనిషి లేడు..ఇక ముందు ఉండబోడు..ఈ విషయాన్ని ఆడమ్ స్పష్టం చేస్తాడు..అతని దృష్టిలో నేరం ఎవరు చేసినా నేరమే..అది ఆడమ్ ప్రేమించిన మిరాండా చేసినా సరే(Adam’s symmetrical notion of justice)..మనిషైన ఛార్లీకీ ,యంత్రమైన ఆడమ్ కీ ఉన్న భేదం ఇక్కడే కనిపిస్తుంది..మనుషుల్ని భావోద్వేగాలే నడిపిస్తాయి..అన్నిటినీ మించి గట్ ఫీలింగ్ అనే ఒక రకమైన conscience నడిపిస్తుంది..ఈ consciousness ని ఒక యంత్రానికి ఆపాదించడం సాధ్యమేనా అంటే,సాధ్యం కాదని ఈ నవల ఋజువు చేస్తుంది..యాంత్రికత ముందు తలదించుకున్న మనిషి నైతికతకు ఈ నవల ఒక మంచి ఉదాహరణ.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
I’d been expecting a friend. I was ready to treat Adam as a guest in my home, as an unknown I would come to know. I’d thought he would arrive optimally adjusted. Factory settings – a contemporary synonym for fate. My friends, family and acquaintance, all had appeared in my life with fixed settings, with unalterable histories of genes and environment. I wanted my expensive new friend to do the same. Why leave it to me? But of course, I knew the answer. Not many of us are optimally adjusted. Gentle Jesus? Humble Darwin? One every 1,800 years. Even if it knew the best, the least harmful, parameters of personality, which it couldn’t, a worldwide corporation with a precious reputation couldn’t risk a mishap. Caveat emptor.
Before us sat the ultimate plaything, the dream of ages, the triumph of humanism – or its angel of death.
Only anthropologists, who studied other cultures in depth, who knew the beautiful extent of human variety, fully grasped the absurdity of human universals. People who stayed behind at home in comfort understood nothing, not even of their own cultures. One of my teachers liked to quote Kipling – ‘And what should they know of England who only England know?'
He stood before me, perfectly still in the gloom of the winter’s afternoon. The debris of the packaging that had protected him was still piled around his feet.He emerged from it like Botticelli’s Venus rising from her shell.
I had a sense then of his loneliness, settling like a weight around his muscular shoulders. He had woken to find himself in a dingy kitchen, in London SW9 in the late twentieth century, without friends, without a past or any sense of his future. He truly was alone.
We could become slaves of time without purpose. Then what? A general renaissance, a liberation into love, friendship and philosophy, art and science, nature worship, sports and hobbies, invention and the pursuit of meaning? But genteel recreations wouldn’t be for everyone.Violent crime had its attractions too, so did bare-knuckle cage-fighting, VR pornography, gambling, drink and drugs, even boredom and depression. We wouldn’t be in control of our choices. I was proof of that.
Today, I welcomed and forgave everyone. We would all turn out well. We were all bound together in our own overlapping but distinct forms of comedy. Others might also have a lover living with a death threat. But no one else with an arm in a cast had a machine for a love rival.
‘We don’t see everywhere. We can’t see behind our heads. We can’t even see our chins. Let’s say our field of vision is almost 180 degrees, counting in peripheral awareness. The odd thing is, there’s no boundary, no edge. There isn’t vision and then blackness, like you get when you look through binoculars. There isn’t something, then nothing. What we have is the field of vision, and then beyond it, less than nothing.’‘So?’‘So this is what death is like. Less than nothing. Less than blackness. The edge of vision is a good representation of the edge of consciousness. Life then death. It’s a foretaste, Charlie, and it’s there all day
Transcribing human experience into words, and the words into aesthetic structures isn’t possible for a machine.
The collar of his suit jacket became snared on a chrome plate that housed a seat-belt reel. When I unhooked him, he seemed to think his dignity was compromised. As we began the long crawl through Wandsworth he was moody, our reluctant back-seat teenage son on a family outing.
ఆడమ్ లో పేరుకున్న నిరాశ, 
‘A self, created out of mathematics, engineering, material science and all the rest. Out of nowhere. No history – not that I’d want a false one. Nothing before me. Self-aware existence. I’m lucky to have it, but there are times when I think that I ought to know better what to do with it. What it’s for. Sometimes it seems entirely pointless'
I couldn’t quite say why, but it was both comic and sad that he was wearing a seat belt.