క్రిందటి సంవత్సరం చదివిన జాన్ బెర్జర్ పుస్తకం 'ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పికాసో' చిత్రలేఖనాన్ని నాకు సరికొత్త ప్లేన్ లో పరిచయం చేసింది..అందులో పికాసో లాంటి చిత్రకారులు కొందరు ఆద్యులుగా ఉండి,వృద్ధి చేసిన 'క్యూబిజం' అనే శైలిని గురించి వివరిస్తారు..అధికశాతం చిత్రకారులు సహజంగా రెండు లేదా మూడు డైమెన్షన్స్ లో వేసే చిత్రాలకు సరికొత్త నాలుగో డైమెన్షన్ ని పరిచయం చేసింది ఈ క్యూబిజం..ఒకే వస్తువుని మూడు కంటే ఎక్కువ డైమెన్షన్స్ లో చూపగలగడం ఈ శైలి ప్రత్యేకత అన్నమాట..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావూ అంటే,అందులో క్యూబిజానికీ,జార్జ్ లూయిస్ బోర్హెస్ కలానికీ చాలా పొంతనలుండడమే కారణం..కథానిర్మాణంలో అధికశాతం రచయితలు ఒక సంఘటనని రెండు,మూడు కోణాల్లో చూస్తే,బోర్హెస్ కలం అదే సంఘటనని అనంతమైన కోణాల్లో పరిశీలించి,పరిశోధిస్తుంది..ఈ పరిశీలన ఆధారంగా ఒకే కోణంలో కథలు రాసేవాళ్ళు ఒక మోస్తరు రచయితలనుకుంటే,బోర్హెస్ ఉన్నత స్థాయికి చెందిన రచయిత అని ఘంటాపథంగా చెప్పొచ్చు.
Image Courtesy Google |
*ఒక దర్పణంలో ఒకలా కనిపించిన మన రూపం,మరో దర్పణంలో రూపాంతరం చెందుతుంది..కానీ ఇక్కడ 'వస్తువు' ఒకటే..
*అలాగే మనం మన దృష్టిని కేవలం ఒకటి లేదా రెండు దర్పణాల్లో ప్రతిబింబంపై నిలిపితే,మిగతా ప్రతిబింబాలు మన దృష్టిని దాటిపోయే అవకాశం మెండు..
*ఒక దర్పణంలో చూసిన రూపం మరో దర్పణంలో (ఇక్కడ కాలం అనుకోవచ్చు) మరో విధంగా కనిపిస్తుంది..
ఈ అంశాలు బోర్హెస్ కథల్లో సంక్లిష్టతకు కారణాలు..కానీ ఆ సంక్లిష్టతే ఈ కథల్ని మిగతా కథల నుండి వేరుగా నిలబెడుతుంది..అందువల్ల బోర్హెస్ కథలు ఒకసారి చదివితే అర్ధం అయ్యేవి కాదు..ఓకే కథని రెండు మూడు సార్లు చదివినప్పుడు కొత్త అర్ధాలు స్ఫూరిస్తాయి..(ఈ 'స్ఫూ' దీర్ఘం పోవడం లేదు క్షమించాలి)
ఈ విషయాన్ని ఒక కథలో ఆయన కూడా ప్రస్తావిస్తారు..Besides, rereading, not reading, is what counts.
బోర్హెస్ కు తన శైలి మీద,పాఠకుల అజ్ఞానం మీద ఎంత నమ్మకమంటే,"నా రాతలు అందరికోసమో/కొందరికోసమో కాదు" అని హెచ్చరించే మనల్ని ఈ కథలు చదవడానికి ఆహ్వానిస్తారు..ఆయన రెండు మూడు చోట్ల ఉపయోగించిన 'demagogue' అనే పదం భలే నచ్చింది నాకు :)
I do not write for a select minority, which means nothing to me, nor for that adulated platonic entity known as ‘The Masses’. Both abstractions, so dear to the demagogue, I disbelieve in. I write for myself and for my friends, and I write to ease the passing of time.
కానీ "మా కోసమే మేము రాసుకుంటాము" అనే చాలా మంది రచయితలు,విషయానికొచ్చే సరికి పాఠకుల అభిరుచి మేరకు రాజీపడే సందర్భాలే అధికం..కానీ బోర్హెస్ కథల్లో ఆ రాజీతత్వం మచ్చుకి కూడా కనపడదు..మన కళ్ళకు కనిపించాలని,ఆయన తన కాల్పనిక ప్రపంచాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నమేదీ చెయ్యరు,ఆయన విస్తృతమైన ప్రపంచాన్ని ఆయన కళ్ళతోనే చూడమంటారు..పరిధుల్లేని ఆ ప్రపంచపు వైశాల్యం కొలవడం కష్టం..మరో విషయం ఏంటంటే ఇందులో బోర్హెస్ శైలి,ఒక పసిపిల్లవాడు ఆటలో భాగంగా ఒక మెట్టుమీంచి దూకి మరో మెట్టు మీదికి దూకినంత సులభంగా ఒక ఉపరితలంలోనుంచి మరో ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది..కానీ ఆ వేగంతో మనమాయన్ని అనుసరించగలమా అనేది అనుమానమే..బోర్హెస్ కథలు కొంత స్వప్నం,మరికొంత వాస్తవం..కానీ ఎంత జాగరూకతతో ఉన్నా,ఎప్పుడు మెలకువగా ఉన్నామో,ఎప్పుడు స్వప్నావస్థలో ఉన్నామో గుర్తించడం చదివేవాళ్ళకి చాలా కష్టం..ఒక కథలో ఆర్ట్ ని 'కామన్ మాన్' కి అందుబాటులో లేకుండా రక్షించడానికి కట్టుదిట్టమైన metaphors ని వాడానని ఒక కవి చేత చెప్పించిన బోర్హెస్ లో ఒక ఆర్టిస్ట్ కి తన కళ పట్ల ఉండే నిజాయితీ కూడిన స్వాధీనతా భావం (possessiveness),మరికాస్త కళాకారుడికి అలంకారప్రాయంగా ఉండే అహం ధ్వనిస్తుంది..
ఇందులో మొత్తం 13 కథలున్నాయి..కొన్ని కథలు కల్పితాలు కాగా,మరి కొన్ని కథలు బోర్హెస్ నిజ జీవిత అనుభవాల్లోంచి పుట్టినవి..ఇందులో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మొదటి కథ 'The Other'.. ఇందులో డెబ్భై తొమ్మిదేళ్ళ బోర్హెస్-ఇరవయ్యేళ్ళ బోర్హెస్ ను ఒక నదీ తీరంలో కలుసుకుంటాడు.."నువ్వూ నేనూ ఒకటే" అంటూ వృద్ధుడైన బోర్హెస్ తనను తాను పరిచయం చేసుకుంటారు..ఆ ఇద్దరిలో ఎవరిది కలో,ఎవరిది నిజమో అర్ధంకాని సందిగ్ధం ఏర్పడుతుంది..చివరిగా డెబ్బయ్యేళ్ళ బోర్హెస్ తాను మెలకువగా ఉన్నాననీ,అందుకే ఆ యువకుడు తనకి వాస్తవమనీ,అలాగే ఆ యువకునికి తానొక స్వప్నమనీ నిర్ధారణకొస్తాడు..ఈ కథలో 'elder self' , 'younger self' మధ్య జరిగే సంభాషణల్లో బోర్హెస్ మనకు ఒక వ్యక్తిగా కాక,ఇద్దరు విడి విడి వ్యక్తులుగా గోచరిస్తారు..ఈ కథ చాలా కాలం క్రితం చదివిన జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్' ను గుర్తుకు తెచ్చింది..మనిషి నైజంలో కన్ఫర్మిటీని ఎద్దేవా చేస్తూ కాలంతో పాటు రూపాంతరం చెందిన ఇద్దరు అపరిచిత వ్యక్తుల మానసికస్థితి,దృక్పథాలను అద్భుతంగా ఆవిష్కరించిందీ కథ..
ఇందులో భావి రచయిత బోర్హెస్ గురించి వృద్ధుడి తలంపు..
It pleased me that he did not ask about the success or failure of his books.
“The man of yesterday is not the man of today,” some Greek remarked. We two, seated on this bench in Geneva or Cambridge, are perhaps proof of this.
He barely listened to me. Suddenly, he said, ‘If you have been me, how do you explain the fact that you have forgotten your meeting with an elderly gentleman who in 1918 told you that he, too, was Borges?’
మరో కథ 'Ulrike' ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్రేమకథ..ఈ కథలో Ulrike అనే అమ్మాయి బోర్హెస్ ఆలోచనల్లో ప్రాణంపోసుకున్న ఒక ప్రతిబింబమా లేక యదార్ధమా అనేది ఇంతవరకూ తేలలేదు మరి..
O nights, O darkness warm and shared, O love that flows in shadows like some secret river, O that instant of ecstasy when each is both, O that ecstasy’s purity and innocence, O the coupling in which we became lost so as then to lose ourselves in sleep, O the first light of dawn, and I watching her.
'కాంగ్రెస్' అనే అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి,దానికి ఒక భవన నిర్మాణం చేయ సంకల్పించి,ఆ కార్యాలయంలో ఉండాల్సిన పుస్తకాలూ వగైరాలు సమకూర్చుకునే క్రమంలో యదార్ధానికి చాలా దూరం వెళ్ళిపోయిన కొందరు వ్యక్తుల కథ 'The Congress','ప్రాముఖ్యతలు' ప్రాతిపదికగా నడుస్తుంది..
I came from Santa Fe, my native province, in 1899. I have never gone back. I have grown accustomed to Buenos Aires, a city I am not fond of, in the same way that a man grows accustomed to his own body or to an old ailment. Without much caring, I am aware that I am going to die soon; I must, consequently, control my digressive tendencies and get on with my story.
There Are More Things,ఫాంటసీ ఎలిమెంట్ ఉన్న ఈ కథని H.P.Lovecraft కు అంకితమిచ్చారు బోర్హెస్..ఈ కథలో ఇంజినీర్ అయిన తన అంకుల్ తనకు ఫిలాసఫీని బోధించిన పద్ధతుల్ని గురించి ఈ క్రింది విధంగా రాశారు..బోర్హెస్ శైలికి మూలాలు ఈ కథలో వెతుక్కోవచ్చు అనిపించింది..
One of the after-dinner oranges was his aid in initiating me into Berkeley’s idealism; a chessboard was enough to illustrate the paradoxes of the Eleatics. Years later, he was to lend me Hinton’s treatises which attempt to demonstrate the reality of four-dimensional space and which the reader is meant to imagine by means of complicated exercises with multicoloured cubes. I shall never forget the prisms and pyramids that we erected on the floor of his study.
ఇక ప్రేమనూ,మరణాన్నీ ఒకే రాత్రి అనుభవపూర్వకంగా తెలుసుకున్న పిల్లవాడి కథ 'The Night of the Gifts',
'The Mirror and the Mask',తన విజయాన్ని పొగడమని ఒక కవిని కోరిన రాజు కథ..ఈ కథలో ముగింపు చాలా చిత్రంగా ఉంటుంది..
The sin of having known Beauty, which is a gift forbidden to men. Now it behoves us to expiate it. I gave you a mirror and a golden mask; here is my third present, which will be the last.’
http://www.salabhanjikalu.canopusconsulting.com/?p=276
ReplyDelete