"క్లాసిక్ ని అందరూ పొగుడుతారు గానీ ఎవరూ చదవరని" మార్క్ ట్వైన్ అంటారు..అలాగే మహామహులైన కొందరు రచయితల్ని గురించి తెలిసి కూడా ఎందుకో వారి పుస్తకాల మీద సీతకన్నేస్తాం..అన్నా కరెనీనా చదివిన తరువాత టాల్స్టాయ్ మీద వ్యామోహం నన్ను చెఖోవ్ వైపు అసలు చూడనివ్వలేదు..అప్పుడో కథా,ఇప్పుడో కథా తప్పితే ప్రత్యేకం చెఖోవ్ ని ఎప్పుడూ చదవలేదు..మొత్తానికి ఈ 'అబౌట్ లవ్' తో చెఖోవ్ ని చదవడం మొదలైంది..మూడు కథలున్న ఈ పుస్తకంలో,చెఖోవ్ కథలకు David Helwig అనువాదం,Seth కూర్చిన దృష్టాంతాలూ(illustrations) మరింత వన్నె తెచ్చాయి..ఆ కారణంగా పిల్లలకు కూడా చెఖోవ్ ని పరిచయం చెయ్యడానికి ఈ పుస్తకం అనువుగా ఉంటుంది..
Image courtesy Google |
మొదటి కథకు ఇప్పటివరకూ వాడుకలో ఉన్న పేరు 'ది మాన్ ఇన్ అ కేస్' ను ఇందులో 'అ మాన్ ఇన్ అ షెల్' గా మార్చారు..రెండో కథ 'గూస్ బెర్రీస్' కాగా మూడో కథ 'అబౌట్ లవ్' ..పశువైద్యుడు Ivan Ivanych మరియు స్కూల్ టీచర్ Burkin లు వేటనుంచి తిరిగి వస్తూ Mironositskoe అనే గ్రామం పొలిమేరలు చేరే సరికి చీకటి పడటంతో ఒక షెడ్డులో విశ్రమిస్తూ,కాలక్షేపం కోసం తమ అనుభవాలను కథలుగా చెప్పుకుంటారు..ఇవాన్ ఇవానిచ్ అంతర్ముఖి అయిన తన భార్య Mavra ప్రస్తావన తీసుకురాగానే అటువంటివారు చాలా మందే ఉంటారంటూ బర్కిన్ తన సహోపాధ్యాయుడు బెలికోవ్ కథ చెప్తాడు..బెలికోవ్ విచిత్రమైన వ్యక్తి..వర్షం లేనప్పుడు కూడా మోకాళ్ళ వరకూ ఉండే బూట్లు ధరిస్తాడు.. పూర్తిగా శరీరాన్ని కప్పివేసే పొడవాటి కోటు,మడవని కాలర్ చెవుల్ని కప్పేస్తూ,మొహం కూడా కనిపించకుండా,చేతిలో గొడుగుతో తిరుగుతుంటాడు..నియమాలను శ్వాసిస్తూ,అన్నిటికీ భయపడుతూ,అందర్నీ అనుమానిస్తూ,ఎప్పుడు ఏమవుతుందో అని తన చుట్టూ గోడ కట్టుకు బ్రతుకుతూ తన వ్యవహారశైలితో అందర్నీ తనకి తెలీకుండానే ఇబ్బందులకి గురిచేస్తుంటారు..బర్కిన్ ఈ కథంతా చెప్పి చివర్లో బెలికోవ్ మరణించాక,"అసలు బెలికోవ్ లాంటివారిని పాతిపెట్టడం ఎంత సంతోషకరమో కదా !ఆహా ఇది స్వేఛ్చ" అంటూ మరోప్రక్క బెలికోవ్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మందే ఉన్నారు కదా ! అంటూ నిట్టూరుస్తాడు..దానికి ఊతంగా ఇవాన్ కూడా "ఆ మాటకొస్తే మనమందరం కూడా మన చుట్టూ గోడలు కట్టుకునే బ్రతుకుతున్నాం కదా !" అని వాఖ్యానించి పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తాడు..సామాజిక కట్టుబాట్ల మధ్య ఊపిరాడకుండా జీవించే ప్రతి మనిషి చుట్టూ పైకి కనిపించని షెల్ ఒకటి ఉంటుందంటూ,సంఘజీవిగా మనిషికుండే పరిధుల్నీ,పరిమితుల్ని పునర్విశ్లేషించుకోమంటుంది ఈ కథ..ఈ కథలో బెలికోవ్ పాత్ర చిత్రీకరణ,అతని ఆహార్యం,ఉక్రెయిన్ యువతీ వరెంకా 'హ హ హ' అంటూ నవ్వడం లాంటివి సరదాగా ఉంటాయి..
“You watch and listen while they tell lies,” pronounced Ivan Ivanych, turning on his other side, “and they call you a fool because you put up with the lies; you put up with injuries, humiliations, not daring to declare openly that you are on the side of the free, honest people, and you lie to yourself, you smile, and all this for the sake of a loaf of bread and warm coals, for the sake of a propriety that’s not worth a penny – no, it’s impossible to live any longer like this.”
రెండో కథ 'గూస్ బెర్రీస్' పల్లెటూర్లో తెలతెలవారుతుండగా మొదలవుతుంది..ఇవాన్,బర్కిన్ లు వర్షం బారినపడకుండా సమీపంలో ఉన్న మిల్లు యజమాని అల్యోఖిన్ ఇంటిలో సేదతీరుతున్న సమయంలో ఇవాన్,తనకంటే రెండేళ్ళు చిన్నవాడైన తమ్ముడు నీకొలాయ్ గురించి చెప్పే మరో అద్భుతమైన కథ..తాను కోరుకున్న ఆనందకరమైన జీవితం కోసం వృద్ధాప్యం వరకూ వేచి చూసిన తమ్ముణ్ణి ఒక మూర్ఖుడిలా చూసిన ఇవాన్ ను చివర్లో తన స్వార్ధపూరిత జీవితాన్ని కూడా పునఃసమీక్షించుకునే దిశగా నడిపిస్తుంది.. మనిషిలో నిజమైన సంతోషానికి నిర్వచనాలను సూచిస్తునే ఈ కథ,"జీవితానికి లక్ష్యం,పరమార్థం అంటూ ఏదైనా ఉంటే అది సంతోషంగా జీవించాలనుకోవడం కాదు,నలుగురికి మంచి చెయ్యడం" అంటూ చెఖోవ్ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది..
While you’re young and powerful and brisk, don’t weary in doing good. Happiness is nothing, inessential; if there is a reason, a purpose to life, that reason and purpose is not to aim at happiness, but something higher and wiser. Do good.”
It was hard and sour, but as Pushkin said, ‘Deception that exalts is dearer than thousands of truths.’
మూడో కథలో అల్యోఖిన్ తన విఫలమైన ప్రేమకథను చెప్తాడు..ఈ కథలో అల్యోఖిన్,పెలగేయా ల మధ్య చిగురించిన ప్రేమ ద్వారా ప్రేమ ఎప్పుడు,ఎందుకు, ఎలా పుడుతుందో చెప్పడం కష్టమంటూ,అన్ని ప్రేమ కథల్నీ ఒకే గాటికి కట్టెయ్యడం సరికాదంటారు..ఈ కథ ప్రేమను నిర్వచించాలనుకోవడం కంటే మూర్ఖత్వం లేదని తేల్చేస్తుంది..
It’s obvious that the happy man feels good only because the unhappy carry their burden in silence, and without this silence happiness would be impossible.
I understood that when you love, and when you think about this love, you must proceed from something higher, of more importance than happiness or unhappiness, sin or virtue in the commonplace sense; or you mustn’t think about it at all.
ఒక రచయితగా చెఖోవ్ గురించి మళ్ళీ ప్రత్యేకం చెప్పాలనుకోవడం ఖచ్చితంగా దుస్సాహసమే..సో ఇప్పుడాపని నేను చెయ్యబోవటం లేదు..కానీ ఈ కథల గురించి నాలుగు ముక్కలు చెప్పి ముగిస్తాను..ఆయన కథను మొదలుపెట్టిన,ముగించిన తీరూ అమితంగా ఆకట్టుకున్నాయి..అన్ని కథల్నీ సాదాసీదాగా మొదలు పెట్టి అసాధారణమైన రీతిలో ముగించారు..ఈ కథలన్నీ చదివి ప్రక్కన పెట్టేస్తే మర్చిపోయేవి కాదు,చెఖోవ్ పాత్రలూ,వాటి నేపథ్యం చదివిన చాలా కాలం పాటు మనల్ని వెంటాడతాయి..ఇందులో చెఖోవ్ తన సిద్ధాంతాల్ని ఎక్కడా బట్టీ వేయించలేదు..ప్రతి కథకూ చివర మనకేదో పొడుపు కథలాంటి ప్రశ్నవేసి,హోమ్ వర్క్ ఇచ్చి గానీ వదిలిపెట్టరు..ఇందులో ఏ విషయమైనా,ఏం చెప్పారో,ఎందుకు చెప్పారో మన దృష్టికోణం నుంచి కూడా ఆలోచించి తెలుసుకోమంటారు..నా వరకూ ఒక అత్యుత్తమైన రచయిత నైపుణ్యం తెలిసేది ఇక్కడే...చెఖోవ్ పాత్రలు సర్వసాధారణంగా కనిపించినప్పటికీ జాతి,వర్ణ,లింగ భేదాల వంటి వాటికతీతంగా ప్రతి మనిషి మనస్తత్వాన్నీ తమలో ప్రతిబింబింపజేస్తాయి..ఇవి చదివాకా మనలోనూ,మన చుట్టుపక్కలా ఎందరో బెలికోవ్ లూ ,నీకొలాయ్ లూ ,అల్యోఖిన్ లూ కోకొల్లలు ఉన్నారనిపిస్తుంది..ఈ సారూప్యత కారణంగా కథలన్నీ మనసుకి బాగా దగ్గరగా అనిపిస్తాయి..మూడు కథల్నీ రష్యన్ గ్రామీణ నేపథ్యపు పునాదుల మీద నిర్మించారు చెఖోవ్..రష్యన్ పల్లె అందాలను చెహోవ్ వర్ణించిన తీరు ఆద్యంతం అబ్బురపరుస్తుంది..1898 లో తొలిసారి 'రష్యన్ థాట్' అనే పత్రికలో ఈ మూడు కథల్నీ వరుసగా ప్రచురించారు..

Far ahead, scarcely visible, the windmills of the village of Mironositskoe stretched to their right, and then a row of low hills disappeared into the distance beyond the village; they were both familiar with the riverbank, the meadows, yellow willows, farmsteads; if one stood on one of the little hills there was a view of the vast field, the telegraph, and the train, which came forth like a creeping caterpillar and in clear weather was visible all the way to the city. Now in calm weather when all nature seemed gentle and pensive, Ivan Ivanych and Burkin were inspired by love of this landscape, and both thought how grand and beautiful the country was.
No comments:
Post a Comment