జీవితం చాలా చిత్రమైంది.."ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది" అని ఎవరో సినీకవి రాసినట్లు దాని పట్ల నమ్మకం పూర్తిగా అడుగంటిపోయాకా ఉన్నట్లుండి కొత్త ఆశలు చిగురింపజేస్తుంది..అయితే మృత్యువు దానికంటే వింతైనది..మనిషి దాని ఉనికిని విస్మరిస్తూనే శాశ్వతత్వమనే భ్రమలో తనను తాను మభ్యపెట్టుకుంటూ జీవిస్తాడు ..నిజానికి మృత్యువు తన వరకూ వచ్చినా సంతోషమే గానీ తనవారిని ఎక్కడ కబళిస్తుందోననే భయమే మనిషిలో ఎక్కువ..59 ఏళ్ళ వయసులో ప్రపంచంలో తాను ప్రేమించిన ఏకైక వ్యక్తి వెళ్ళిపోతే,ఇక తన జీవితానికి అర్ధం లేదనుకుని మరణాన్ని కోరుకునే ఓవ్ కథ కూడా ఇలాంటిదే..ప్రాణానికి ప్రాణమైన సోంజా మరణం తరువాత జీవించమే మర్చిపోయిన ఓవ్ జీవితం ముగింపు దశలో ఈ కథ 'A Man Called Ove' ప్రాణంపోసుకుంటుంది..స్వీడిష్ రచయిత Fredrik Backman 2012 లో రాసిన ఈ నవల న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది..
'యదార్ధవాది లోక విరోధి' అన్నతీరుగా ప్రపంచానికి వింతమనిషిగా కనిపించే 'ఓవ్' నిజానికి వింతప్రపంచంలో సాధారణమైన వ్యక్తి...16 ఏళ్లొచ్చేసరికే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన అతడు అంతర్ముఖుడూ,మితభాషీ..రైల్వే ఉద్యోగి అయిన తండ్రి ఉన్నతమైన భావాలను పుణికిపుచ్చుకుని క్రమశిక్షణకు పర్యాయపదంగా పెరిగిన ఓవ్,తాను అమితంగా ప్రేమించి,పెళ్ళి చేసుకున్న భార్య సోంజా మరణానంతరం జీవితం పట్ల,సమాజం పట్ల విరక్తితో ఆత్మహత్య చేసుకుందామని విఫలయత్నం చేస్తుంటాడు..కానీ పాట్రిక్,పర్వానే(ఇరానియన్ మహిళ) అనే జంట ఇద్దరు పిల్లలతో పొరుగింట్లోకి కొత్తగా రావడంతో ఓవ్ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి..దానికి తోడు ఓవ్ కుటుంబానికి చిరకాల మిత్రులు అయిన రూన్,అనితా దంపతుల్ని కొన్ని సమస్యలనుండి బయటపడవేసే క్రమంలో ఓవ్ జీవితానికి ఒక లక్ష్యం,సార్థకత దొరికినట్లవుతుంది..
ప్రతి చిన్న పనికీ యంత్రాలమీద ఆధారపడుతూ,హద్దుల్లేని జీవితాన్ని గడపడమే ఆధునిక జీవనానికి పరమావధిగా 'ఇంపెర్ఫెక్షన్ ఈజ్ బ్యూటీ','పర్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపెర్ఫెక్షన్' అని,ఎవరికి వారు తమలోకి లోపాలకు ఒక సొంత ఫిలాసఫీ తయారుచేసేసుకుని సౌకర్యవంతంగా బ్రతికేస్తున్న ఆధునిక సమాజానికి అర్ధం కాడు ఈ ఓవ్..అలాగే జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారం గడపాలనీ,మనిషి దైనందిన జీవితంలో అవసరమయ్యే ప్రతి చిన్నపనినీ,ఒకరి మీద ఆధారపడకుండా స్వయంగా చేసుకోవడం చేతనవ్వాలనీ,నియమాలను గౌరవించి,పాటించాలనీ మనసావాచా నమ్మి,ఆచరించే ఓవ్ కు ఈ ఆధునిక ప్రపంచం అస్సలు కొరుకుడుపడదు..నియమోల్లంఘన,బాధ్యతా రాహిత్యం,నిర్లక్ష్య ధోరణులను ఓవ్ అస్సలు క్షమించడు..జరగాల్సినవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకోవడమే అత్యాసైన నేటి సమాజంలో ఓవ్ ఒక పెర్ఫెక్షనిస్టు/మిస్ ఫిట్..ఈ కారణంగా సహజంగానే ప్రభుత్వ ,కార్పొరేట్ సంస్థల ప్రతినిధులంటే ఓవ్ కు అస్సలు సరిపడదు..వారిని పుస్తకమంతా 'తెల్ల షర్టులు' అని సంబోధిస్తాడు..ఇదిలా ఉంటే ఈ వింతజీవి (?) ఓవ్ కు సరైన సమఉజ్జీ అతని పరమ మిత్రుడు/శత్రువు రెండూ అయిన పొరుగింటి రూన్..వీళ్ళిద్దరూ కలిసే సందర్భాలు రెండు పర్వతాలు ఢీకొనడం ఎలా ఉంటుందో అలా ఉంటాయి..ఇందులో ఈ ఇద్దరు హీరోలూ కలిసి చేసే పనులు భలేగా ఉంటాయి..
ఈ కథలో పరస్పర భిన్న ధ్రువాలైన సోంజా-ఓవ్ ల సంబంధాన్ని అద్భుతంగా మలిచారు..
He was a man of black and white...
And she was color. All the color he had.
On Sunday she was buried. On Monday he went to work. But if anyone had asked, he would have told them that he never lived before he met her. And not after either.
ఓవ్ ను ఒంటరితనం నుంచి రెక్కపట్టుకుని బాహ్య ప్రపంచంలోకి లాక్కొచ్చే మరో ప్రాత్ర పర్వానే అనే ఇరానియన్ మహిళది కాగా అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పిల్లిది..మనిషి సైకాలజీని చదివినట్లుండే ఈ పిల్లి ప్రవర్తన,ఓవ్ కూ,దానికీ జరిగే రహస్య సంభాషణలూ హాస్యాన్ని పండిస్తాయి..వీళ్ళతోపాటు యువకులైన అడ్రియన్,మిర్సాద్(గే),స్థూలకాయుడు జిమ్మీ లాంటి మరికొన్ని పాత్రలు కథలో భాగంగా క్రమేపీ జీవంపోసుకుంటాయి..
గడచిన తరానికి ప్రాతినిథ్యం వహించే ఓవ్ పాత్ర ఈ తరం వ్యక్తులు తమ జీవితాలను ఆత్మావలోకనం చేసుకునే దిశగా నడిపిస్తుంది..ఈ తరాన్ని "బాధ్యతకు అర్ధం తెలీకుండా,జీవితపు పగ్గాలను వదిలేసి కంప్యూటర్ల ముందు కూర్చుని బీరాలు పోయే షో ఆఫ్ మనుషులు అంటూ ఓవ్ ఎత్తిపొడుస్తాడు..కానీ విచిత్రంగా ఓవ్ విమర్శలు ఎక్కడా కోపం తెప్పించవు సరికదా,నిజమే కదా అనిపించేలా ఉంటాయి..ఇకపోతే కథంతా రచయిత మాటల్లోనే ఉంటుంది..ఈ పుస్తకంలో రచయిత అంతర్లీనంగా చెప్పదలచుకున్న గంభీరమైన అంశాల్ని సున్నితమైన హాస్యంతో కలగలిపి చెప్పడం చాలా బావుంది..ముఖ్యంగా ఓవ్ పాత్రను రచయిత తీర్చిదిద్దిన తీరు ఈ కథకు ఆయువుపట్టు..ఓవ్ ప్రత్యేకమైన వ్యవహారశైలీ,రెండు మూడు వాక్యాల్లోనే వ్యంగ్యం,వెటకారాలు తొణికిసలాడుతూ క్లుప్తంగా ఉండే అతని సంభాషణలూ కథనాన్ని మరింత రక్తికట్టించాయి..
ఇది చదువుతూ చదువుతూ మధ్యలో ఫక్కున నవ్వితే చేతిలో ఉన్న ఏ కాఫీకప్పులోంచో కాఫీ తొణికిపోయే అవకాశాలు చాలా ఎక్కువ..అలాగే సగం నవ్వు పూర్తయ్యేలోపు,ఆ చిలిపితనాన్ని ప్రక్కకి నెట్టే గాంభీర్యం చోటుచేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి..ఈ నవల ఆధునిక జీవన విధానంలో స్వతంత్రంగా జీవించడానికి అవసరమయ్యే ప్రాధమిక విషయాల్ని విద్యా వ్యవస్థలు బోధించకపోవడం,ఆ కారణంగా మనుషుల స్థానాన్ని యంత్రాలు తీసుకోవడం వల్ల,మనిషి తనకు తెలీకుండానే సాంకేతికపరిజ్ఞానానికి బానిస అవుతున్నాడని చెప్పకనే చెప్తుంది..అలాగే ఉరకలపరుగుల జీవితంలో ముందుకెళ్ళిపోతున్న తొందర్లో నేటి తరం మరచిపోతున్న విలువల్ని మరోసారి సునిశితంగా గుర్తుచేస్తుంది..మనిషి తన ప్రాముఖ్యతల్ని గుర్తెరిగి మసలుకోవాలని హితవు చెప్తుంది..పొట్టచెక్కలయ్యే హాస్యంతో రెండు తరాల అనుభవాల సారాన్ని ఒకేసారి అనుభవంలోకి తెచ్చే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే..
ఫిల్టర్ కాఫీ ప్రేమికురాలిగా ఈ వాక్యాలు నన్ను ఆకట్టుకున్నాయి..
Every morning for the almost four decades they had lived in this house, Ove had put on the coffee percolator, using exactly the same amount of coffee as on any other morning, and then drank a cup with his wife. One measure for each cup, and one extra for the pot—no more, no less. People didn’t know how to do that anymore, brew some proper coffee. In the same way as nowadays nobody could write with a pen. Because now it was all computers and espresso machines. And where was the world going if people couldn’t even write or brew a pot of coffee?
ఓవ్ సంధించిన మరికొన్ని విమర్శనాస్త్రాలు,
People don’t have useful things anymore. People just have shit. Twenty pairs of shoes but they never know where the shoehorn is; houses filled with microwave ovens and flat-screen televisions, yet they couldn’t tell you which anchor bolt to use for a concrete wall if you threatened them with a box cutter.
People have no respect for decent, honest functionality anymore, they’re happy as long as everything looks neat and dandy on the computer. But Ove does things the way they’re supposed to be done.
He came into his office on Monday and they said they hadn’t wanted to tell him on Friday as it would have “ruined his weekend.” “It’ll be good for you to slow down a bit,” they’d drawled. Slow down? What did they know about waking up on a Tuesday and no longer having a purpose? With their Internets and their espresso coffees, what did they know about taking a bit of responsibility for things?
“Taking it a bit easy,” they said to him. A lot of thirty-one-year-old show-offs working with computers and refusing to drink normal coffee.
Ove’s wife often quarrels with Ove because he’s always arguing about everything. But Ove isn’t bloody arguing. He just thinks right is right. Is that such an unreasonable attitude to life?
తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని పదహారేళ్ళ కుర్రవాడి మనస్థితి..
He was never able to properly explain what happened to him that day. But he stopped being happy. He wasn’t happy for several years after that.
“When people don’t talk so much they don’t dish out the crap either,” one of his older workmates said to him one afternoon down on the track. And Ove nodded. Some got it and some didn’t.
“Men are what they are because of what they do. Not what they say,” said Ove.
A time like that comes for every man, when he chooses what sort of man he wants to be. And if you don’t know the story, you don’t know the man.
“We’re not the sort of people who tell tales about what others do,” he answered.
సోంజా కి మాత్రమే కనిపించే ఓవ్ ...
To her, he was the slightly disheveled pink flowers at their first dinner. He was his father’s slightly too tight-fitting brown suit across his broad, sad shoulders. He believed so strongly in things: justice and fair play and hard work and a world where right just had to be right. Not so one could get a medal or a diploma or a slap on the back for it, but just because that was how it was supposed to be. Not many men of his kind were made anymore, Sonja had understood. So she was holding on to this one. Maybe he didn’t write her poems or serenade her with songs or come home with expensive gifts. But no other boy had gone the wrong way on the train for hours every day just because he liked sitting next to her while she spoke.
ఓవ్-రూన్ ల గురించి చెప్తూ ,
One of them a man who refuses to forget the past, and one who can’t remember it at all.
Some boys leave everything behind and never look back. That was all there was to it.
People need a function, he believes. And he has always been functional, no one can take that away from him.
Image courtesy Google |

No comments:
Post a Comment