Thursday, February 17, 2022

Nothing Personal - James Baldwin, Richard Avedon

2020 లో నాగరిక సమాజం సిగ్గుతో తలొంచుకునే రీతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ తెల్లజాతీయుల జాత్యహంకారానికి బలైన ఘటనకు మనందరం ప్రత్యక్ష సాక్షులమే. ఈ ఆధునిక యుగంలోనే పరిస్థితి ఇలా ఉంటే బానిసత్వపు మూలాలు లోతంటా వేళ్ళూనుకుని ఉన్న కాలంలో నల్లజాతీయులు ఇంకెంత దయనీయ పరిస్థితుల్లో ఉండేవారో ఊహించడం కష్టం. ఆ కాలానికి చెందిన ప్రఖ్యాత అమెరికన్ రచయిత జేమ్స్ బాల్డ్విన్ ఫిక్షన్ కంటే ఆయన వ్యాసాలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ప్యూరిటన్ వ్యవస్థనుండి వచ్చిన బాల్డ్విన్ విలువల పట్లా, 'అమెరికన్ అహంకారానికి' నిస్సంకోచంగా తన కలంతో తూట్లుపొడిచే ఆయన గళం పట్లా నాకు ప్రత్యేకమైన గౌరవమూ, అభిమానమూను.

ఈ వ్యాసాలు చదవడం పూర్తిచేసి, పుస్తకం మూసేశాక ఆ 'నథింగ్ పర్సనల్' అన్న టైటిల్ చూసి నవ్వొచ్చింది, కముకు దెబ్బలు కొట్టేముందు ఒంటికి సుతారంగా వెన్నరాయడం అంటే ఇదేనేమో అనుకున్నాను. "నథింగ్ పర్సనల్" అంటూనే ఈ వ్యాసాల్లో అమెరికా నార్సిసిజాన్నీ, కన్స్యూమరిజాన్నీ తీవ్రంగా విమర్శిస్తారు బాల్డ్విన్. బాల్డ్విన్ వచనానికి ధీటుగా Richard Avedon తీసిన ఫోటోలు ఈ వ్యాసాలకు అదనపు వన్నె తీసుకొచ్చాయి. ఇవి వ్యాసాలు కాబట్టి ఇందులో నాకు నచ్చిన కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను.

Image Courtesy Google

నాలుగు భాగాలుగా విభజించిన ఈ వ్యాసాలు న్యూయార్క్ వెలుగుజిలుగుల వెనుక గాఢాంధకారాన్నీ, శ్వేతవర్ణపు మంచుదుప్పట్ల వెనుక కాఠిన్యాన్నీ బహిర్గతం చేస్తాయి. ఆకాశహర్మ్యాల్లో నివాసం ఉండేవాళ్ళని వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అడిగితే "It's a wonderful world" అనే అంటారు, ఏ సంస్కృతి గురించైనా నిజానిజాలు తెలియాలంటే ఆ సంస్కృతిలో అణచివేతకు గురవుతున్న వర్గాన్నో, ఆకలితో అలమటించేవారినో, జాత్యహంకారపు కోరల్లో చిక్కుకుని దినదినగండంగా రోజులు వెళ్ళదీసే వాళ్ళనో అడగాలి. ఈ దిగువ ప్రపంచానికి చెందిన వ్యక్తిగా బాల్డ్విన్ న్యూయార్క్ ను ఒక నల్లజాతీయుని కళ్ళతో చూపిస్తారు. అంతులేని ధనదాహానికి పరాకాష్ఠగా మారిన అమెరికన్ సంస్కృతిలో ప్రేమరాహిత్యానికి చిరునామాలాంటి న్యూయార్క్ నగరంలోని వీధుల్ని ఎటువంటి ఫ్యాబ్రికేషన్స్ లేకుండా ఆయనతో కలిసిచేసే ప్రయాణంలో మరింత యథాతథంగా చూసే అవకాశం పాఠకులకు కలుగుతుంది. గెలుపుకూ, ఆధిపత్యానికీ, అత్యాశకూ తప్ప ప్రేమకూ, ప్రేమించే మనుషులకూ స్థానం లేని ప్రపంచమిదని నిరాశ వ్యక్తం చేసిన బాల్డ్విన్ వచనంలో 'Loveless world' అనేమాట పునరావృతమవుతూ ఉంటుంది.

ప్రపంచానికి కన్స్యూమరిజం కమర్షియల్స్ లో కనిపించే 'అమెరికన్ మిత్' వెనుక ఎటువంటి మెటీరియలిస్టిక్ పొస్సెషన్స్ తోనూ పూడ్చలేని ఒంటరితనం (unspeakable loneliness) ఉందంటారు బాల్డ్విన్. ఇందులో అనేకచోట్ల సంపాదనా,గెలుపూ,స్వార్థం తప్ప మరో ధ్యాసలేని మెటీరియలిస్టిక్ మనస్తత్వాలతో ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో కూడా స్పృహలేని గుంపుల మధ్యలో మనుష్యత్వాన్ని వెతుక్కునే మామూలు మనిషిగా కనిపిస్తారు బాల్డ్విన్.

Where do they come from? how did they become—these faces—so cruel and so sterile? they are related to whom? they are related to what? They do not relate to the buildings, certainly—no human being could; I suspect, in fact, that many of us live with the carefully suppressed terror that these buildings are about to crash down on us; the nature of the movement of the people in the streets is certainly very close to panic. You will search in vain for lovers. 

Everyone is rushing, God knows where, and everyone is looking for God knows what—but it is clear that no one is happy here, and that something has been lost. Only, sometimes, uptown, along the river, perhaps, I’ve sometimes watched strangers here, here for a day or a week or a month, or newly transplanted, watched a boy and a girl, or a boy and a boy, or a man and a woman, or a man and a child, or a woman and a child; yes, there was something recognizable, something to which the soul responded, something to make one smile, even to make one weep with exultation. They were yet distinguishable from the concrete and the steel. One felt that one might approach them without freezing to death.

బాల్డ్విన్ వచనానికో ప్రత్యేకత ఉంది. కళ్ళు పేజీ చివరకి వచ్చేస్తాయి గానీ వాక్యం ఓ పట్టాన ముగియదు. ఫుల్ స్టాప్స్ అంత త్వరగా  కనపడవు. ఈ కారణంగా పటిష్టమైన గొలుసుకట్టులా సాగే ఆయన వచనానికి ఆపకుండా చదివించే గుణం మెండు. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలు చూడండి.

A EUROPEAN FRIEND of mine and myself were arrested on Broadway, in broad daylight, while looking for a taxi. He had been here three days, had not yet mastered English, and I was showing him the wonders of the city of New York. He was impressed and bewildered, though he also seemed rather to wonder what purpose it served—when, suddenly, down from heaven, or up through the sidewalk, two plain-clothes men appeared, separated us, scarcely a word was spoken.

"అక్కడికి నేను పుట్టిన గడ్డ మీద నాకెటువంటి హక్కూ లేనట్లు వీళ్ళకి నేను  సంజాయిషీ ఇచ్చుకోవాలా" అని ఆగ్రహిస్తూ రాసిన ఈ క్రింది వాక్యాలను చూస్తే అమెరికన్ జాత్యహంకారాన్ని"around here" అంటూ అలతిపదాల్లో తూర్పారబట్టడం బాల్డ్విన్ కే సాధ్యం అనిపించింది,

I watched my friend, carried by the scruff of the neck, vanish into the crowd. Not a soul seemed to notice; apparently it happened every day. I was pushed into the doorway of a drugstore, and frisked, made to empty my pockets, made to roll up my sleeves, asked what I was doing around here—“around here” being the city in which I was born.

బాల్డ్విన్ వచనాన్ని చూస్తే ఆగ్రహాన్ని వెళ్ళగక్కడం కూడా ఒక కళ అనిపిస్తుంది. ఇంత మృదువుగా తిట్టొచ్చా ! అతి మామూలుగా విషయాన్ని చెబుతూనే ఈ క్రింది వాక్యాల్లో 'in the land of the free' అని వాక్యాన్ని ముగించడంలో ఎంత వ్యంగ్యం,కోపం ధ్వనిస్తుందో !

I am an old hand at this—policemen have always loved to pick me up and, sometimes, to beat me up—so I said nothing during this entire operation. I was worried about my friend, who might fail to understand the warmth of his reception in the land of the free; worried about his command of English, especially when confronted by the somewhat special brand used by the police.

అమెరికన్ల లో జెనెటిక్ డిసార్డర్ లా నరనరాల్లోనూ ఇంకిపోయిన 'అపనమ్మకం' వల్ల ఒకరితోనొకరూ స్వేచ్ఛగా నోరువిప్పి నిజం మాట్లాడుకోలేరంటారు.

Talking to Americans is usually extremely uphill work. We are afraid to reveal ourselves because we trust ourselves so little. American attitudes are appalling, but so are the attitudes of most of the people in the world. What is stultifying here is that the attitude is presented as the person; one is expected to justify the attitude in order to reassure the person—whom, alas, one has yet to meet, who is light-years away, in some dreadful, private labyrinth. And in this labyrinth the person is desperately trying not to find out what he really feels. Therefore, the truth cannot be told, even about one’s attitudes: we live by lies. And not only, for example, about race—whatever, by this time, in this country, or, indeed, in the world, this word may mean—but about our very natures. The lie has penetrated to our most private moments, and the most secret chambers of our hearts.

నేటి అమెరికన్ సంస్కృతి పిల్లలకు మంచి విలువలు ఇచ్చేదిగా ఉందా అని పదేపదే ప్రశ్నిస్తారు బాల్డ్విన్. ఆరోగ్యకరమైన ఆశయాలకీ, అంతులేని స్వార్థానికీ మధ్య గీత గీసుకోవడం నేటి తరానికి నేర్పడంలో విఫలమవుతున్నామని అభిప్రాయపడతారు. 

How is it possible for the child to grow up if the child is not loved? Children can survive without money or security or safety or things: but they are lost if they cannot find a loving example, for only this example can give them a touchstone for their lives. Thus far and no further: this is what the father must say to the child. If the child is not told where the limits are, he will spend the rest of his life trying to discover them. For the child who is not told where the limits are knows, though he may not know he knows it, that no one cares enough about him to prepare him for his journey.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు : 

People who work at the most disgraceful jobs in order to pay, for the luxury of someone else’s attention, twenty-five dollars an hour. To my black and toughened, Puritan conscience, it seems an absolute scandal; and, again, this peculiar self-indulgence certainly has a dreadful effect on their children, whom they are quite unable to raise. And they cannot raise them because they have opted for the one commodity which is absolutely beyond human reach: safety.

This is one of the reasons, as it seems to me, that we are so badly educated, for to become educated (as all tyrants have always known) is to become inaccessibly independent, it is to acquire a dangerous way of assessing danger, and it is to hold in one’s hands a means of changing reality. This is not at all the same thing as “adjusting” to reality: the effort of “adjusting” to reality simply has the paradoxical effect of destroying reality, since it substitutes for one’s own speech and one’s own voice an interiorized public cacophony of quotations

And love will simply have no choice but to go into battle with space and time and, furthermore, to win.

God help the innocent here, that man or woman who simply wants to love, and be loved.

Unless this would-be lover is able to replace his or her backbone with a steel rod, he or she is doomed. This is no place for love. I know that I am now expected to make a bow in the direction of those millions of unremarked, happy marriages all over America, but I am unable honestly to do so because I find nothing whatever in our moral and social climate—and I am now thinking particularly of the state of our children—to bear witness to their existence. I suspect that when we refer to these happy and so marvelously invisible people, we are simply being nostalgic concerning the happy, simple, God-fearing life which we imagine ourselves once to have lived. In any case, wherever love is found, it unfailingly makes itself felt in the individual, the personal authority of the individual. Judged by this standard, we are a loveless nation. The best that can be said is that some of us are struggling. And what we are struggling against is that death in the heart which leads not only to the shedding of blood, but which reduces human beings to corpses while they live.

And look at the New York buildings, rising up like tyrannical eagles, glass and steel and aluminum smiting the air, jerry-built, inept, contemptuous; who can function in these buildings and for whose profit were they built? Unloved indeed: look at our children. They roam the streets, as arrogant and irreverent as business-men and as dangerous as those gangs of children who roamed the streets of bombed European cities after the last World War. Only, these children have no strange and grinning soldiers to give them chocolate candy or chewing gum, and no one will give them a home.

Saturday, February 12, 2022

Time Lived, Without Its Flow - Denise Riley

కొన్ని పుస్తకాలు అమెజాన్ టాప్ 100, టైమ్ మ్యాగజైన్ బుక్స్, ఓప్రా బుక్ క్లబ్ పిక్స్ లాంటి బెస్ట్ సెల్లర్ క్యాటగిరీల్లో కనపడవు. అవి "ఒక పాఠకుడి నుంచి మరో పాఠకుడికి ఒక విలువైన రహస్యాన్ని అందించినట్లు చేతులు మారతాయి" అంటారు 'Time Lived, Without Its Flow' అనే ఈ పుస్తకానికి అద్భుతమైన ముందుమాట రాసిన మాక్స్ పోర్టర్. నాకు 'Grief is the Thing with Feathers' పుస్తకం ద్వారా మాక్స్ పోర్టర్ ను ఏడెనిమిదేళ్ళ క్రిందట పరిచయం చేసిన నాగరాజు పప్పు గారే ఈ పుస్తకాన్ని కూడా 'ఒక విలువైన రహస్యంలా' చదవమని రికమెండ్ చేశారు. అమ్మతో సహా,అనేకమంది ఆత్మీయుల్నీ వరుసగా పోగొట్టుకున్న ఆ మూడు నాలుగేళ్ళ సమయంలో గ్రీఫ్ గురించి అనేక రచనలు చదివినా, చక్కని వర్ణనలతో పద్యానికీ,గద్యానికీ పరిథుల్ని చెరిపేసిన పోర్టర్ రచన నాకు ఇప్పటికీ ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.

Image Courtesy Google

2008 లో లండన్ కు చెందిన కవయిత్రి డెనిస్ రిలే కుమారుడు జాకబ్ రోగనిర్ధారణకు లొంగని ఒక అంతుబట్టని హృదయసంబంధిత వ్యాథితో హఠాత్తుగా మరణించాడు. చేతికందొచ్చిన వయసులో కొడుకు హఠాన్మరణం తాలూకా షాక్ నుండి తేరుకునే సమయంలో ఆమె తన అనుభవాలకు వివిధ దశల్లో అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులకు విడో/ విడోవర్ అని పేర్లున్నట్లు బిడ్డను కోల్పోయిన తల్లికి ప్రత్యేకమైన పదమేదీ లేదని నిష్టూరపడతారు రచయిత్రి.

సంతాప సమయంలో కాలప్రవాహం కదలిక లేకుండా స్థంభించిపోతుందంటారు డెనిస్. అందువల్ల ఈ రచన మరణం తాలూకా సంతాపాన్ని ఒక ప్రేక్షక స్థానంలో ఉండి అనుభవించడం కంటే, తానే స్వయంగా సంతాపంగా మారిపోవడంలా ఉంటుంది. ఈ కారణంగా ఈ పుస్తకంలో మూలాంశం 'మృత్యువు' కాదు, 'స్థంభించిన కాలం' అంటారు పోర్టర్. 

Riley’s project is to describe and interrogate ‘that acute sensation of being cut off from any temporal flow after the sudden death of your child.’

నిజానికి ఈ వ్యాసం మృత్యువును గురించి కంటే ఆ కారణంగా చలనరహితంగా ఆగిపోయిన క్షణాల గురించే ఎక్కువ చెబుతుంది. ఇది మృత్యువు తుఫానులా వచ్చి మన ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన తరువాత వచ్చే ప్రశాంతతను తలపిస్తూ కాలప్రవాహపు అడుగులతో అడుగు కలపలేని నిస్సహాయ,నిశ్శబ్ద, నిశ్చలమైన నిముషాలూ, గంటలూ, రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలను గురించిన వ్యాసం. 

No tenses any more. Among the recent labels for temporality is ‘time dilation’, referring to our perception’s elasticity, its capacity to be baggy. But are there any neurological accounts of this feeling of completely arrested time? It feels as if some palpable cerebral alteration has taken place. As if, to make the obvious joke, your temporal lobes have been flooded and are now your a-temporal lobes.

ఇలాంటి సమయాలో భావోద్వేగాలను భాషతో పొదివి పట్టుకోవడమంత కష్టం మరొకటి ఉండదు. మహా అయితే వాటి చుట్టూ అల్లిబిల్లిగా అటూఇటూ పదవిన్యాసాలు చేస్తూ తిరుగాడగలం. ఒక్కోసారి యాధృచ్ఛికంగా వాటికి సన్నిహితంగా జరిగిన లిప్తకాలపు అనుభూతిని చూసి వాటిని అచ్చంగా అందిపుచ్చుకున్నామని అపోహపడతాం. తీరాచూస్తే ఇదంతా భ్రమే. మనిషి తెలివిడిని తప్పించుకోలేని కల్పనల కల్తీ సోకకుండా వాటిని సహజసిద్ధమైన రూపంలో పట్టుకోవడం ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా అసంభవం అనిపిస్తుంది. కానీ ఇదంతా డెనిస్ ని చదవడానికి మునుపు. ఆగిపోయిన కాలాన్నీ, ఆ కాలంలో  అనుభవించిన సంతాపాన్నీ ఆమె భాషలో పొదిగిన తీరు సంతాపాన్ని గురించి ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక రచనలను అమాంతం ప్రక్కకు తోసి ఈ రచనను మొదటివరుసలో నిలబెడుతుంది. తనివితీరక కొన్ని వాక్యాలను రెండు మూడుసార్లు చదువుకున్న క్షణాలూ, మరోసారి చదివితే దృష్టినిదాటిపోయిన గుప్తనిధులేమన్నా దొరుకుతాయేమో అని పదాలను తడుముకుంటూ, వెతుక్కుంటూ చదివిన అనుభవాలూ పాఠకులకు ఈ చిన్న పుస్తకం చదువుతున్నప్పుడు అనేకం ఎదురవుతాయి. ఒక ఫిక్షన్ రచయిత రాసే పదాలకూ, కవి రాసే పదాలకూ తేడా ఉండదూ ! 

పోర్టర్ అన్నట్లే ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన తరువాత మళ్ళీ అలవోకగా మన వాస్తవ జీవితానికి తిరుగుప్రయాణం కట్టడం అంత తేలికైన విషయమేమీ కాదు. డెనిస్ శైలికి మనం చదివినదాన్ని పునఃసమీక్షించుకోమని ఆజ్ఞాపించే శక్తి ఉంది. ఉదాహరణకు డెనిస్ రాసిన ఈ క్రింది వాక్యాలు చూడండి, ఇవి పుస్తకం పూర్తిచేసిన తరువాత కూడా పాఠకుల్ని అంత సులువుగా వదిలిపోవు.

Not that I have delusions, as such. But a strong impression that I’ve been torn off, brittle as any dry autumn leaf, liable to be blown onto the tracks in the underground station, or to crumble as someone brushes by me in this public world where people rush about loudly, with their astonishing confidence. Each one of them a candidate for sudden death, and so helplessly vulnerable. If they do grasp that at any second their own lives might stop, they can’t hold on to that expectation. As I do now. Later everyone on the street seems to rattle together like dead leaves in heaps.

రాయాలంటే మృత్యువు గురించి ఎంతైనా రాయొచ్చు.కానీ ముందు చెప్పుకున్నట్లు ఈ పుస్తకం 'ఒక రహస్యం'. ఎవరికివారు ఛేదించుకోవాల్సిన రహస్యం. హ్యాపీ రీడింగ్ :) 

పుస్తకంనుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు,

Far from taking refuge deeply inside yourself, there is no longer any inside, and you have become only outward. As a friend, who’d survived the suicide of the person closest to her, says: ‘I was my two eyes set burning in my skull. Behind them there was only vacancy.’

And you yourself will not be the same. But something, nevertheless, stays: recognition as re-cognition; to know again, but because of the interval, to know a bit differently.

సంతాప సమయంలో ఆగిపోయిన కాలాన్ని గురించి రచయిత్రి ఇందులో ప్రస్తావించిన  Emily Dickinson రెండు కవితలు చాలా అర్థవంతంగా ఉన్నాయనిపించింది :

The thought behind I strove to join
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.
--------------------------
I felt a cleaving in my mind
As if my brain had split;
I tried to match it, seam by seam,
But could not make them fit.
The thought behind I strove to join
Unto the thought before,
But sequence raveled out of sound
Like balls upon a floor.

Previously I hadn’t believed that speech is simply the translation of something already formulated in thought. Now I was faced with the evidence that sometimes it is, but that the translation can fail. 

Perhaps only through forgetting the dead could it become possible to allow them to become dead. To finally be dead. And that could only follow – once time itself had taken the initiative here – from consigning them to a time that had decided to resume its old flow. Of its own accord. When or if this may ever happen, I can’t know. And can’t want it.

You’ve slipped into a state of a-chronicity. From its serene perspective you realize, to your astonishment, that to dwell inside a time that had the property of ‘flowing’ was merely one of a range of possible temporal perceptions. For your time can pause, and you with it – though you’re left sharply alive within its stopping. Your apprehension of sequence itself is halted. Where you have no impression of any succession of events, there is no linkage between them, and no cause. Anything at all might follow on from any one instant. You are tensed for anything – or, equally, are poised for nothing. No plans can be entertained seriously, although you keep up an outward show of doing so. Where induction itself has failed, so does your capacity for confident anticipation. So your task now is to inhabit the only place left to you – the present instant – with equanimity, and in as much good heart as you can contrive. For one moment will not, now, carry you onward to the next.

సంతాప సమయంలో సాహిత్యంలో సాంత్వనను వెతుక్కోవడం గురించి రాస్తూ,  

Nevertheless your search for any evidence of fellow feeling is restless, almost comically so. You’re paralysed and not, as far as you know, temporarily (for this condition feels eternal) but temporally. And yet some longing drives you onward to comb through any writing that might carry the reassurance that this cessation of your time is both well known and fully recorded. At times of great tension, we may well find ourselves hunting for some published resonances in literature of what we’ve come to feel. I realize that this might quickly be condemned as a sentimental search for ‘identification’, for the cosiness of finding one’s own situation mirrored in print. Still, I think we can save it from that withering assessment. Instead we might reconsider the possibility of a literature of consolation, what that could be or what it might do.

Monday, February 7, 2022

When We Cease to Understand the World - Benjamín Labatut

పరుగు ఆపడం ఒక కళ. అది తెలియని జీవి ఏదన్నా ఉంటే అది ఒక్క మనిషి మాత్రమేననిపిస్తుంది. ఆదీ-అంతం లేని జీవన కాంక్షతో వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసి, ముందు తరాలకు సహజవనరులేవీ మిగల్చకుండా అభివృద్ధి పేరిట మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. "ఇందులో కొత్త విషయం ఏముందీ ! ప్రజలూ,పర్యావరణవేత్తలూ అరిగిపోయిన రికార్డులా అస్తమానం అనే మాటేగా ఇదీ." అంటారా ! నిజమే, అయితే ఈ పుస్తకంలో చర్చించిన విషయాలవి కాదు. ఈ పుస్తకం మానవజాతి పురోభివృద్ధికి మొదటి వరుసలో నిలబడి మనకు దిశానిర్దేశం చేసినవారి అనుభవాల గురించి. వారు ఇటువంటి పరిస్థితులను ముందే ఊహించారా ! ఒకవేళ తమ ఆవిష్కరణల ఫలితాలను ముందే ఊహించి ఉంటే వాటిపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలేమిటి అనే దిశగా రాసిన రచనే చిలీ దేశస్థుడైన రచయిత Benjamín Labatut రాసిన ఈ 'When We Cease to Understand the World'. ఇది 2021 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలూ,గ్లోబల్ పాండెమిక్ వంటి అనేక సంక్లిష్టతల నేపథ్యంలో మానవజాతిపై శాస్త్రీయ పరిశోధనల పర్యవసానాలెలా ఉంటాయోనన్న దిశగా రాసిన ఈ పుస్తకంలోని మూలాంశం నాకు సహజంగానే ఆసక్తి కలిగించింది. 

Image Courtesy Google

శాస్త్రసాంకేతికాభివృద్ధి పురోగమనం వైపా లేక తిరోగమనం వైపా అన్నది ఈనాటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. ఒకవేళ ఐన్స్టీన్, హైసెన్బర్గ్ , బోర్, Grothendieck, Schrödinger, Schwarzschild లాంటి వాళ్ళు ఇప్పుడు జీవించి ఉంటే, వాళ్ళు ఆద్యులుగా పునాదులు వేసిన క్వాంటమ్ మెకానిక్స్, గణితం, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వంటివి భవిష్యత్తు తరాల చేతుల్లోపడి ఏవిధంగా దుర్వినియోగమవుతున్నాయో చూసి తమను తాము ఖచ్చితంగా నిందించుకునేవారేమో, లేదా కళ్ళకు గంతలు కట్టుకుని అభివృద్ధి పేరిట సైన్సును గుడ్డిగా నమ్మడం వల్ల కలిగే దుష్పరిణామాలేమిటో చూసి బాధపడి ఉండేవారేమో అనుకుంటే, నిస్సందేహంగా అవుననే అంటుంది ఈ రచన. ఈ వ్యాసాల్లో పలువురు శాస్త్రజ్ఞులు మానవజాతిలో యుద్ధోన్మాదాన్నీ, పెచ్చుమీరిన స్వార్థాన్నీ ప్రత్యక్షంగా చూసి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనవ్వడం చూస్తాం.

ఏ శాస్త్రవేత్తనైనా నడిపించేవి అతడికి తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతా, అకుంఠిత దీక్షా, passion మాత్రమే. నిజానికి ఒక కళాకారుడిలాగే శాస్త్రవేత్త కూడా ఒక ఉన్మాద స్థాయిలో, ఏదో మానవాతీత శక్తి ఆవహించినట్లు తనకు ఆసక్తి ఉన్న రంగంలో తీవ్రంగా కృషి చేస్తాడు. కానీ అతడికి తన ఆవిష్కరణల ప్రభావం మానవజాతిపై ఎలా ఉండబోతుందోనన్న విషయంపై కనీస అవగాహన ఉండదు. ఇదే అంశాన్ని సాహిత్యంలో నోబెల్ గ్రహీత Mario Vargas Llosa 'Notes on the death of culture' పేరిట రాసిన కొన్ని వ్యాసాల్లో ఈ విధంగా రాస్తారు : "శాస్త్రజ్ఞులు తమ రంగాల్లో మాత్రమే ప్రతిభావంతులు. ఈ స్పెషలిస్టులకు తమ రంగానికి ఆవలి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు. తాము సాధించిన విజయాలు సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కూడా కనీస స్పృహ ఉండదు." అంటూ లోసా ఈ 'వన్ డైమెన్షనల్ మనుషుల్ని' "ఏకకాలంలో ప్రతిభావంతులూ,సంస్కృతి లేని అనాగరికులూ" అని కూడా అంటారు. వారి సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం అందరితోనూ కలవడానికి బదులు వారిని ఏకాకిని చేస్తోందని ఘాటుగా విమర్శిస్తారు. వాస్తవానికి దూరంగా తమదైన ప్రపంచంలో అహోరాత్రాలూ నిద్రాహారాలు మాని కృషి చేసినప్పటికీ, చివరకు తమ ఆవిష్కరణల ద్వారా పరోక్షంగా మానవజాతి వినాశనంలో వీరంతా కీలక పాత్ర పోషించారని అంటారు.

రెండు ప్రపంచ యుద్ధాలనీ, శాస్త్ర సాంకేతికాభివృద్ధికి పునాదులు పడిన  కాలాన్నీ, చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారెవరూ ప్రస్తుత పాండెమిక్  పరిస్థితులను చూసి మరీ ఎక్కువ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన, అనాగరికమైన కాలాన్ని దాటివచ్చిన సౌకర్యవంతమైన సంస్కృతి మనది. దీనికి సాక్ష్యాలుగా ఈ పుస్తకంలో అనేక 'పెద్ద గీత' లు కనిపిస్తాయి. ఆధునిక వైద్యవిధానాలకు బీజాలు పడుతున్న కాలంలో ఆల్కెమిస్టులు సజీవంగా ఉన్న జంతువుల అవయవాలను వేరుచేసి వాటిని ఎలక్ట్రిక్ ఛార్జ్ తో పునర్జీవింపజేసే ప్రయత్నం చెయ్యడం వంటివి చూసినప్పుడు మేరీ షెల్లీ మోడరన్ ప్రొమీథియస్ గా మలిచిన Frankenstein ను రాసినప్పుడు అన్ని కళలకంటే ప్రమాదకరమైన కళ అయిన 'సైన్స్' ను అభివృద్ధి పేరిట గుడ్డిగా నమ్మి అనుసరించడం వల్ల రాబోయే ప్రమాదాలను ముందుగానే ఊహించి ఆ పేజీల్లో హెచ్చరించారా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాల్లో విరివిగా వినియోగించిన సైనేడ్, ఇతరత్రా డ్రగ్స్, కెమికల్ వెపన్స్ సర్ అలాన్ ట్యూరింగ్ ప్రాణాలే కాకుండా, సైనిక దళాల మొదలు సాధారణ ప్రజానీకం వరకూ ఎన్ని ప్రాణాలను బలికొందో రాసిన విషయాలు చదువుతున్నప్పుడు "ఈ మానవ మేథోసృష్టి అంతా దేనికోసం ?" అని అనుకోకుండా ఉండలేం.

ఐన్స్టీన్ రెలెటివిటీ థియరీ లో తన వంతు పాత్ర పోషించిన జర్మన్ ఫిజిసిస్టు Schwarzschild మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఆర్మీలో వాలంటీర్ గా పనిచేసిన కారణంగా ఆ వినాశనానికి ప్రత్యక్ష సాక్షి. Schwarzschild సైనికుల ద్వారా సాధారణ ప్రజలపై జరిగిన అత్యాచారాలనూ,నరమేథాన్ని,దొమ్మీలనూ గూర్చిన పలు కథనాలను వినేవారు. పట్టణాలు రాత్రికి రాత్రే ప్రపంచపటంలోనుండి కనీస ఆనవాళ్ళు మిగలకుండా మాయమైపోవడం చూశారు. జరిగిన మారణ కాండకు ఎటువంటి 'Martial logic' లేదు, ఈ వినాశనానికి బాధ్యత ఎవరిదంటే చెప్పడం కష్టం. చివరకు Schwarzschild ఒకరోజు తన సైనికులు కొందరు తప్పించుకునే శక్తి కూడా లేని ఒక బక్కచిక్కిన కుక్కపిల్ల మీద నోరులేని ప్రాణి అన్న దయ కూడా లేకుండా తమ టార్గెట్ ను టెస్ట్ చేసుకోవడం చూసి చలించిపోయారు. శరీరం మీద యుద్ధోన్మాదం తాలూకా బొబ్బలతో ఆయన స్నేహితుడు Ejnar Hertzsprung కి రాసిన ఒక ఉత్తరంలో,“We have reached the highest point of civilization. All that is left for us is to decay and fall.” అన్నారట. ఇది ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే నిజమని అనిపించక మానదు.

ఈ కథలన్నిటిలోనూ Grothendieck మరియు Schrödinger ను గురించిన సంగతులు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకవేళ ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ప్రచురించగానే ఫిజిక్స్ ని వదిలేస్తానంటే ? మారడోనా ప్రపంచ కప్పు గెలవగానే బంతిని మళ్ళీ ముట్టుకోనని శపథంచేస్తే ? ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు Alexander Grothendieck నిజానికి అటువంటి నిర్ణయమే తీసుకున్నారు. తన పరిశోధనల వల్ల ప్రపంచానికి వినాశనం జరిగితీరుతుందని ముందే ఊహించి నలభయ్యేళ్ళకే  కుటుంబాన్నీ,స్నేహితులనూ,ఉద్యోగాన్నీ,పరిశోధనల్నీ అన్నిటినీ వదిలేసి అస్త్ర సన్యాసం చేశారు. ఒక సన్యాసిలా జీవిస్తూ,  రాయడం,చదవడం,ధ్యానం చేసుకోవడం వంటివి చేస్తూ తన శేషజీవితాన్ని గడిపారు.

Influenced by the clamour of the May ’68 protests all around him, he called on more than a hundred students during a masterclass at the University of Paris in Orsay to renounce “the vile and dangerous practice of mathematics” in light of the hazards humanity was facing. It was not politicians who would destroy the planet, he told them, but scientists like them who were “marching like sleepwalkers towards the apocalypse”.

From that day forward, he refused to participate in any maths conference that would not allow him to devote equal time to ecology and pacifism. During his talks, he gave away apples and figs grown in his garden and warned about the destructive power of science: “The atoms that tore Hiroshima and Nagasaki apart were split not by the greasy fingers of a general, but by a group of physicists armed with a fistful of equations.” Grothendieck could not stop fretting over the possible effects that his own ideas could have on the world. What new horrors would spring forth from the total comprehension that he sought? What would mankind do if it could reach the heart of the heart?

Grothendieck తన ఏకాకి జీవితానికి కారణం మానవ జాతిపై ద్వేషమో, తిరస్కారమో కాదనీ, తన పరిశోధనల కారణంగా మానవజాతికి నష్టం వాటిల్లకుండా వారిని రక్షించడానికే సన్యసించాననీ చెప్పుకునేవారట. మరో నాలుగేళ్ళలో మరణిస్తారనగా 2010 లో ఒక మిత్రుడికి చేరిన ఉత్తరంలో “Declaration of Non-Publication” ను కోరుతూ అన్ని లైబ్రరీల నుండీ, యూనివర్సిటీల నుండీ తన గణితశాస్త్ర ప్రచురణలను తొలగించాలనీ, భవిష్యత్తులో కూడా వాటిని ఏ రూపంలోనూ పునఃప్రచురించడంగానీ , క్రయవిక్రయాలు జరుపడం వంటివిగానీ నిషిద్ధమనీ హెచ్చరించారు. ఈ విధంగా Grothendieck మానవజాతిపై తన ప్రభావాన్నిసమూలంగా తుడిచేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకంటే శాస్త్రీయపరిజ్ఞానం చేసే మేలే కాదు, కీడు గురించి కూడా స్పృహ ఉన్నవాడిగా దాని ప్రభావాన్ని తగ్గించడంలో తనవంతు ఉడతాభక్తి ప్రయత్నం మాత్రమే. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, జూకర్బర్గ్ వంటివారు తమ పిల్లలను పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ తమ సృజించిన ఎలక్ట్రానిక్ ఉపకరాలూ, టెక్నాలజీలకు దూరంగా పెంచారనీ(పెంచుతున్నారనీ) చదివిన గుర్తు. ఆ మేథావులకి వాటి వల్ల వాటిల్లే నష్టాలు తెలియకపోతే కదా !

“My first impression on hearing him lecture was that he had been transported to our planet from an alien civilization in some distant solar system in order to speed up our intellectual evolution,” a professor from the University of California at Santa Cruz said of him. Despite how radical they were, the mathematical landscapes Grothendieck conjured up gave no impression of artificiality.

మరో వ్యాసంలో క్వాంటమ్ థియరీలో అనేక ప్రాథమిక ప్రతిపాదనలు చేసి కీలకమైన 'వేవ్ ఫంక్షన్' ని నిర్వచించిన ఆస్ట్రియన్-ఐరిష్ నోబెల్ గ్రహీత Erwin Schrödinger అనుభవాలూ,జీవిత విశేషాలూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. క్షయ వ్యాధి కారణంగా ఆల్ప్స్ పర్వతశ్రేణులు మధ్య అరోసా అనే ప్రాంతంలో ఉన్న డాక్టర్ హెర్విగ్ శానిటోరియంలో చికిత్సపొందుతున్న కాలంలో డాక్టర్ కుమార్తె పదహారేళ్ళ మిస్ హెర్విగ్ తో Schrödinger సాన్నిహిత్యం విశేషణాలకందదు. చిన్నతనంనుండీ అనారోగ్య కారణాల చేత మంచంపట్టి ఉండడంతో విస్తృతంగా చదువుతూ తండ్రి పర్సనల్ లైబ్రరీలో ఉన్న సైంటిఫిక్ వాల్యూమ్స్ అన్నిటినీ ఔపాసన పట్టేసిన ఆమెకు తెలియని విషయమంటూ ఉండదు. వయసుకి మించిన పరిపక్వత ఉన్న మిస్  హెర్విగ్ Schrödinger కోలుకోవడంలోనూ, వేవ్ ఈక్వేషన్ ని కనిపెట్టడంలోనే కాకుండా అతడికి తనలోని 'దెయ్యాలను' జయించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పెడోఫీలియా అని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. వీరి సంబంధం లోతు తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

Her eclectic reading and constant isolation had produced an unusually alert mind and an insatiable curiosity; during Schrödinger’s previous visit, she had assailed him with questions about the most recent advances in theoretical physics, about which she seemed to be thoroughly informed, despite having had virtually no contact with the outside world and never having ventured beyond the region surrounding the sanatorium. At just sixteen years old, Herwig had the mind, the bearing and the presence of someone much older. Schrödinger was quite the opposite.

The physicist sat down next to her, and she opened a book she held in her hands, reading the following passage: “One ghost succeeds the other like waves on the illusory sea of birth and death. In the course of a life, there is nothing but the rise and fall of material and mental forms, while the unfathomable reality remains. In every creature sleeps an infinite intelligence, hidden and unknown, but destined to awaken, to tear the volatile web of the sensory mind, break the chrysalis of flesh, and conquer time and space."

మిస్ హెర్విగ్ పట్ల తన అబ్సెషన్ నుండి బయటపడడానికి Schrödinger శతవిధాలా ప్రయత్నిస్తారు. చివరకు నిద్రపోతున్న ఆమెను తాకడానికి ప్రయత్నించే ఒక సందర్భంలో ఆయనకు హఠాత్తుగా కాళికాదేవి కనిపించడం, మరుక్షణం ఆయన హాస్పిటల్ బిల్లు కూడా కట్టకుండా తన పరిశోధనల తాలూకూ కాగితాలూ, సూట్ కేసూ తీసుకుని పెనుతుఫానును సైతం లెక్కచెయ్యకుండా  రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తడం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ నిజజీవిత విశేషాల్లో సైతం వాస్తవికత పరిథుల్ని ప్రశ్నించుకోని పాఠకులుండరు.

It was not the first time he had become obsessed with a woman that young, but there was something different about Miss Herwig, something that disarmed him, that put his self-confidence in jeopardy. 

Then he would call his wife to pick him up and would never set foot in the clinic again, even if it meant coughing himself to death in the streets like a beggar. Anything was better than bearing this infantile infatuation, which deepened the longer they spent together. 

మిస్ హెర్విగ్ ఒక సందర్భంలో Schrödinger కి భగవద్గీతను ఇచ్చినప్పుడు వేదాలను అభ్యసించడం మొదలుపెట్టిన తరువాత తనకు తరచూ వచ్చే ఒక పీడకలను గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తారాయన. ఆ విచిత్రమైన కల గురించి ఈ విధంగా రాస్తారు : పలు విదేశీ శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలకు మూలాల్ని మన వేదాలనుండి గ్రహించారనడానికి ఇదొక సాక్ష్యం. 

In his nightmare, the goddess Kali would sit on his chest like an enormous beetle, crushing him so that he could not move. With her necklace of human heads, and brandishing swords, axes and knives in her many arms, she would bathe him in drops of blood that fell from the tip of her tongue and jets of milk from her swollen breasts, rubbing his groin until he was no longer capable of bearing the arousal, at which point she would decapitate him and swallow his genitals. Miss Herwig listened to him impassively and told him his dream was not a nightmare, but a blessing: of all the forms taken on by the female aspect of the divine, Kali was the most compassionate, because she granted moksha—liberation—to her children, and her love for them extended beyond all human comprehension. Her black skin, she said, was the symbol of the void that transcends all form, the cosmic uterus in which all phenomena gestated, while her necklace of skulls comprised the egos she had freed from the principal object of their identification, which was nothing less than the body itself. The castration Schrödinger suffered at the Dark Mother’s hands was the greatest gift he could receive, a mutilation necessary so that his new consciousness could be born.

ఇలా రాస్తూపోతే మరెన్నో అనుభవాలు, భయాలు, అసూయలూ, ఉన్మాదాలూ, ఆనందాలూ. పరిమితికి మించినదేదైనా విషమేనన్న సూత్రం అభివృద్ధికి కూడా వర్తిస్తుంది. సాధారణ వ్యక్తులకే కాదు, ప్రస్తుత ప్రపంచం సర్వజ్ఞులైన పండితులకూ, శాస్త్రజ్ఞులకూ కూడా అర్థంకానిదిగా తయారైంది. మానవజాతికి 'crown jewel' గా పరిగణింపబడే క్వాంటమ్ మెకానిక్స్ థియరీనే తీసుకుంటే, దాని ఉనికంతా మన స్మార్ట్ ఫోన్ల సుప్రీమసీ వెనుకా, ఇంటర్నెట్ వెనుకా, మానవ మేథస్సుకి సవాళ్ళు విసురుతున్న కంప్యూటింగ్ పవర్ వెనుకా నిక్షిప్తమైపోయి ఉంది. మన ప్రపంచాన్ని సమూలంగా మార్చేసిన ఈ మహాద్భుతాన్ని మనకు వీలుగా ఎలా వాడుకోవాలో మనకందరికీ తెలుసు, కానీ అందులో లోపమల్లా అది మానవ మేథస్సు అవగాహనకు మించినది. ఇంతవరకూ దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా అర్థంచేసుకున్నవారు లేరు. ఆ పారడాక్స్ లనూ, వైరుధ్యాలనూ పట్టుగోగలగడం మనిషి మెదడుకి సాధ్యం కాలేదు. ఆకాశాన్నుంచి ఒక అద్భుతంలా ఊడిపడిన ఆ థియరీని మనం అబ్బురంగా చూస్తూ కోతుల్లా దాన్ని గురించి ఏమీ అర్ధం కాకుండానే దాని చుట్టూ తిరుగుతూ దానితో ఆడుకుంటున్నామేమో అంటారు రచయిత బెంజమిన్.

చివరగా వాస్తవానికీ, కల్పనకూ మధ్యనున్న పరిథులు చెరిపేస్తూ శాస్త్రజ్ఞుల అనుభవాలకు ఎటువంటి భేషజాలూ లేకుండా న్యాయం చేసిన అరుదైన రచన ఇది. ఇది ఒక నాన్ ఫిక్షన్ రచన అని అనుకోడానికి వీల్లేదు. ఫిక్షన్ ను మించిన ఆసక్తికరమైన కథలు ఇందులో బోలెడున్నాయి. తప్పకుండా చదవండి. హ్యాపీ రీడింగ్ :) 

ఈ పుస్తకాన్ని రికమెండ్ చేసిన ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ గారికి ధన్యవాదాలు.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :   

No one dared deny the importance of this new wave mechanics, but pretty soon some began to ask themselves the same questions that had troubled Schrödinger in the Villa Herwig. “It is a truly beautiful theory. One of the most perfect, precise and elegant man has discovered. But there is something strange in it. It’s as if it were warning us: don’t take me seriously. The world I reveal is not the one you are thinking of when you employ me,” wrote Robert Oppenheimer, one of the first to question what wave functions actually had to say about reality. 

He spilled the contents of the bottle into what was left of his beer and pushed the glass towards Heisenberg. “You look tired, Professor. You should take better care of yourself. Did you know the first symptom of a psychological disturbance is the inability to contend with the future? If you consider that, you will realize how implausible it is that we are able to exert control over even an hour of our lives. How hard it is to control our thoughts! You, for example—it is obvious you are possessed. That you are in thrall to your intellect as a degenerate is in thrall to a woman’s cunt. You are bewitched, Professor, you’ve been sucked inside your own head. Come on, drink. Don’t make me ask you twice.”

Reality, they said to those present, does not exist as something separate from the act of observation. A quantum object has no intrinsic properties. An electron is not in any fixed place until it is measured; it is only in that instant that it appears. Before being measured, it has no attributes; prior to observation, it cannot even be conceived of. It exists in a specific manner when it is detected by a specific instrument. Between one measurement and the next, there is no point in asking how it moves, what it is, or where it is located. Like the moon in Buddhism, a particle does not exist: it is the act of measuring that makes it a real object.

He renounced his post at the University of Kyoto, and wrote a last entry before shutting down his blog, stating that, in mathematics, certain things should remain hidden, “for the good of all of us”. This incomprehensible and apparently capricious gesture only confirmed what many had feared: Mochizuki had succumbed to Grothendieck’s curse.

“Doing mathematics is like making love,” wrote Grothendieck, whose sexual impulses rivalled his spiritual inclinations. 

Wednesday, January 26, 2022

I Who Have Never Known Men - Jacqueline Harpman

There’s no continuity and the world I have come from is utterly foreign to me. I haven’t heard its music, I haven’t seen its painting, I haven’t read its books, except for the handful I found in the refuge and of which I understood little. I know only the stony plain, wandering, and the gradual loss of hope. I am the sterile offspring of a race about which I know nothing, not even whether it has become extinct. Perhaps, somewhere, humanity is flourishing under the stars, unaware that a daughter of its blood is ending her days in silence. There is nothing we can do about it.

మనకి అలవాటైన ప్రపంచానికీ మూడేళ్ళ కోవిడ్ వినాశనం తరువాత ప్రపంచానికీ భేదం విస్మరించలేనంత స్పష్టంగా కనబడుతోంది. మానవ తప్పిదాలకు (తప్పిదం అనేది చిన్నమాటేమో కదా !) ముందు తరాలు భారీమూల్యం చెల్లించవలసివస్తుందని ఈ పాండెమిక్ మరోమారు కటువుగా గుర్తుచేసింది. ఆన్లైన్ క్లాసులతో విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, ఆటపాటల్లో స్వేచ్ఛగా బాల్యాన్ని గడపవలసి పిల్లలు గృహనిర్బంధంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో కాలక్షేపం చెయ్యవలసి వస్తోంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పెద్దలు పలు శారీరక,మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సింగీతం శ్రీనివాసరావు సినిమా 'ఆదిత్య 369' లో అందరూ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూగర్భంలో ఇళ్ళు కట్టుకుని, శరీరాన్ని పైనుండి క్రిందవరకూ పూర్తిగా సూట్స్ లో కప్పుకుని తిరుగుతుంటేనో, "టొమాటోలు కేజీ 200 రూపాయలేనటండీ,చాలా చవగ్గా ఉన్నాయి,ఇంటికొచ్చేటప్పుడు కొని పట్టుకురండి" అని భార్య భర్తకు కంప్యూటర్ స్క్రీన్ లో పురమాయిస్తేనో చూసి "భలే హాస్యం" అనుకుంటూ నవ్వుకున్నాం. 2020 తరువాత ఇటువంటి అనేక ఫాంటసీలు వాస్తవాలుగా ఎప్పుడు మారిపోయాయో కూడా తెలీలేదు.

Image Courtesy Google

మనకు తెలిసినవారెవరైనా మరణిస్తే మనమందరం బాధపడతాం, "అయ్యో" అంటాం. ఆ అనడంలో అంతర్లీనంగా మృత్యువు మనవరకూ రాదన్న ధీమా కనిపిస్తుందంటారు తత్వవేత్త సెనెకా. ఈ మధ్య నెట్ఫ్లిక్ లో డేవిడ్ అటెన్బరో 'Our Planet' లో స్వార్ధంతో మానవజాతి కోరితెచ్చుకుంటున్న వినాశనాన్ని గురించి చెప్పిన విషయాలు చూసినప్పుడు అలాగే అనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ భూమికీ,దాని మీద జీవులకీ ఎక్కువ సమయం లేదు. మరో 'మాస్ ఎక్స్టింక్షన్' కి మన చేతులతోనే ఒక్కొక్క సమిధనూ పేరుస్తున్నాం. 

భూమిపై సహజ వనరులన్నీ మెల్లిగా క్షయమైపోతే, మనిషి మేథస్సుతో కట్టుకున్న సౌథాలన్నీ కూలిపోతే, మనిషికీ పశువుకీ తేడా ఇదొక్కటేనని చూపించే కళలూ, సంగీత సాహిత్యాలవంటి సాంస్కృతికపరమైన చిహ్నాలన్నీ క్రమంగా అంతరించిపోతే, మానవజాతి కూడా అంకెల్లో లెక్కపెట్టగలిగే సమూహాలకు కుదించుకుపోతే, అటువంటి జీవితం ఎలా ఉంటుందో జాక్విలిన్ హార్ప్మ్యాన్ పోస్ట్ అపోకలిప్టిక్, ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ నవల 'I Who Have Never Known Men' కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. జ్యూయిష్ మూలాలున్న బెల్జియం రచయిత్రి జాక్విలిన్ హార్ప్మ్యాన్ నవలల్లో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి నవల ఇదే. ఇదే రచన తొలుత 'The Mistress of Silence' పేరుతో అనువదించబడింది. ఈ రచన శైలిలోనూ, నేపథ్యంలోనూ కూడా రెండేళ్ళ క్రితం చదివిన మార్గరెట్ ఆట్వుడ్ నవల 'ది హ్యాండ్ మెయిడ్స్ టేల్' ని గుర్తుకుతెచ్చింది. ఈ కథ నేపథ్యాన్ని చూసి ఇది కూడా ఫెమినిస్ట్ డిస్టోపియన్ కథేమో అని పొరబడ్డాను. నిజానికి ఈ కథలో స్త్రీవాదానికి సంబంధించిన అంశాలు బహు తక్కువ. సమస్త మానవజాతికీ సంబంధించిన కథను ఒక స్త్రీ దృష్టి కోణంలో నుంచి చెప్పిన కథ ఇది.

‘We’re not very resourceful, are we!’ said Greta ruefully.

‘We come from a world where it wasn’t necessary, everything was ready-made and we never asked how things were produced,’ replied Frances.

ఇక కథ విషయానికొస్తే, ఈ పుస్తకం మానవజాతి వినాశపుటంచుల్లో ఉన్న సమయంలో మొదలవుతుంది. భూగర్భంలో 39 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్న ఒక బంకర్. వారికి కాపలాగా కొంతమంది గార్డులు, వీరందరూ మగవారు. ఆ 39 మంది స్త్రీలలో అన్ని వయసుల వారూ ఉండగా పేరు తెలియని కథానాయకురాలు మాత్రం అందరికంటే చిన్నది. కథ మొదలయ్యే సమయానికి ఆమెకు సుమారు 14 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె రజస్వల కాని కారణంగా మిగతా స్త్రీలు ఆమె పట్ల భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు, ఈ కారణంగా ఆమె ఊహల్లో తనకంటూ ఒక అంతఃప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. మిగతా స్త్రీలు మానవజాతి పురోగతికీ, వినాశనానికీ ప్రత్యక్ష సాక్షులు కావడంతో వారికి భూమిపై పూర్వపు వైభవాన్ని గూర్చిన అవగాహన ఉండేది. కానీ కథానాయకురాలి జీవితం ఆమెకు ఊహ తెలిసేసరికే బంకర్లో మొదలవుతుంది. ఆ కారణంగా ఆమె జీవితం ఎటువంటి అస్తిత్వ చిహ్నాలూ, సాంస్కృతిక మూలాలూలేని తెల్ల కాగితం వంటిది. మిగతా స్త్రీలందరూ జంతువులను పోలిన తమ నిర్బంధ జీవితాన్ని నిందించుకుంటూ రోజులు వెళ్ళదీస్తుంటే, ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాని ఆమె మాత్రం తన భిన్నత్వాన్నే తన ప్రత్యేకతగా మార్చుకుంటూ క్రమంగా మిగతావారిని కూడా ప్రభావితం చేస్తుంది. తన హృదయ స్పందనను లెక్కిస్తూ కాలాన్ని అంచనావెయ్యడంతో మొదలుపెట్టి, బంకర్లోంచి బయటపడి అందరికీ సొంతంగా ఇళ్ళు నిర్మించి ఇచ్చే వరకూ ఆమె ప్రయాణం అత్యంత  ఆసక్తికరంగా సాగుతుంది.

I would have sworn it couldn’t happen to me; I’d seen women trembling, crying and screaming, but I’d remained unaffected by their tragedy, a witness to impulses I found unintelligible, remaining silent even when I did what they asked of me to assist them.

Admittedly, we were all caught up in the same drama that was so powerful, so all-embracing that I was unaware of anything that wasn’t related to it, but I had come to think that I was different. And now, racked with sobs, I was forced to acknowledge too late, much too late, that I too had loved, that I was capable of suffering and that I was human after all.

How can you feel privileged not to have something that everyone else has? I felt they were deceiving me.

ఆహార నిద్రా మైథునాలను మించి మనిషిని మృగంనుంచి వేరు చేసే ఒకే ఒక్క సాధనం 'కళ'. అంతవరకూ తన ఉనికిని కాపాడుకోవడం తప్ప మరో ధ్యేయంలేని ఆమెకు ఒక చోట విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. వినాశనాన్ని దాటుకుని మిగిలిన ఒక ఇంట్లో మానవ వైభవం తాలూకా చిహ్నాలు కనిపిస్తాయి. ఆ ఇంట్లో కనిపించిన పుస్తకాలూ, గృహోపకారణాలూ, చిత్రాలూ వంటి వాటిని చూసి మానవ మేథస్సుకి అబ్బురపడిన ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతాయి.

I was choked with admiration. I’d never seen anything so beautiful, because I’d never seen anything beautiful that was the work of a human hand. I had seen the beauty of the sky, the changing shapes of the clouds, softly falling rain; I had seen the slowly moving stars, and a few flowers, but here, I was seeing furniture, paintings hanging on the walls, vases, a small carving – but I shouldn’t be describing these things so precisely, because that first moment I saw only the interplay of lines, shapes and harmonious colours, an unfathomable configuration that completely overwhelmed me, and brought tears to my eyes because of the feeling of calm and tranquillity that reminded me of the women’s singing, in the past, when it rose up over the plain. The colours were beautifully in tune with each other, and harmonised with the volumes and dimensions of the room.

బంకర్లో అడవిమనిషుల్లా జీవితం, దాన్నుండి బయటపడిన తరువాత తిండీ,బట్ట కోసం ఒక బంకర్ నుండి మరో బంకర్ ను వెతుక్కుంటూ ఏళ్ళ తరబడి కొనసాగిన వారి ప్రయాణంలో ఆమెకు తోడుగా ఉన్న మిగతా స్త్రీలందరూ ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతుండగా చివరకు ఈ భూమిపై ఆమె ఏకాకి జీవితం ఎటువంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ. 1995 లో రాసిన ఈ నవలలో మూలకథలో ఉన్న వైవిధ్యం కథనంలో ఎక్కడా కనబడదు. బల్లపరుపు వర్ణనలతో కూడిన వాక్యనిర్మాణం పేజీలు త్వరాగా తిప్పనివ్వదు. ఆట్వుడ్ వర్ణనల్లో పదును ఈ రచనలో ఎక్కడా కనబడలేదు. అనువాద లోపమో, లేదా మూలమే ఈ విధంగా ఉందో చెప్పడం కష్టం కాబట్టి ఈ పుస్తకానికి ఐదుకి మూడు స్టార్లు ఇవ్వవచ్చు.

పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు : 

I’d listened closely, and I was surprised at how much they had to say, the passion with which they repeated the same thing in ten different ways so as to avoid accepting that they’d had absolutely nothing to say to one another for ages. But human beings need to speak, otherwise they lose their humanity, as I’ve realised these past few years. And gradually, I began to feel sorry for those women determined to carry on living, pretending they were active and making decisions in the prison where they were locked up for ever, from which death was the only release – but would they remove the bodies? – and where they couldn’t even kill one another.

Oh! That first time I went up the stairs! When I think of it, my eyes fill with tears and I feel that compulsion, that surge of triumph. I think I’d be prepared to relive twelve years of captivity to experience that miraculous ascent, the wonderful certainty that made me so light that I flew up the hundred steps in one go, without stopping for breath, and I was laughing.

It wasn’t until we reached the ninth bunker that we found fabric, but already in the second, we’d found a packet of coffee. I’d never tasted coffee and I didn’t like it very much. I watched my companions shriek with delight and pleasure as they imagined the others’ joy when they returned with such a wonderful find, but I was unable to share their excitement.

I gazed at the ten houses in the village which I’d so enjoyed building. Behind the biggest one was the cemetery where I’d buried Anthea. Only now, I tell myself that what I’d felt for her, the trust that slowly built up, the constant preference for her company and the joy each time I was reunited with her after an expedition were probably what the women called love.

Anthea had taught me the alphabet and the rudiments of reading by drawing the letters in the sand. At the time, it bored her, because she couldn’t see what I would do with such knowledge, but I had insisted: there was too little to learn for me not to grasp at everything I could. I had words in my head for things I’d never seen, let alone touched, as I was now doing. I recognised the book at once and I was so overwhelmed that I felt almost giddy. I think that if I’d been standing, I’d have collapsed. I had in my hands the most precious of treasures, a spring from which to drink the knowledge of that world to which I would never have access.

Tuesday, December 14, 2021

ముళ్ళకంపల వాస్తవంపై విరబూసిన కల్పన - ‘సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ

1932 లో మాక్సిమ్ గోర్కీ ని సిగిజ్మండ్  క్రిఝిఝానోవ్‍స్కీ (1887–1950) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని కోరారట. నిజానికి  సిగిజ్మండ్ సాహితీరంగంలో ఆనాటికి ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. అప్పటికే 'ఆల్ యూనియన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియెట్ రైటర్స్' కి తొలి ఛైర్మన్ గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్న గోర్కీ, సోవియెట్ యువ రచయితలకు 'సోషలిస్ట్ వాస్తవిక సాహిత్యం' భవిష్యత్తు విషయంలో దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కానీ తన రచనల్ని పరిశీలించే నిమిత్తం గోర్కీ చేతిలో పెట్టడమనే ఈ ఒక్క తప్పిదానికీ సిగిజ్మండ్ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సొచ్చింది. గోర్కీ విమర్శలు సిగిజ్మండ్ కు ఒక రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన 'సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ' అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్ రచనలు ఆనాటి 'సోవియెట్ లిటరరీ ఎస్థెటిక్స్' కి  తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పరబట్టారట : "నేను మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్ని వాటి యొక్క తాత్వికమైన విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో, తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం,పాండిత్య ప్రకర్ష ఆనాటి మేథావి వర్గాల్లో ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలమది. పండితులందరూ సమోవర్ చుట్టూ సమావేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్ వర్డ్ ప్లే - lukavoe prazdnoslovie) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవజాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి కంటే అతడి కర్మల ద్వారానే సృష్టించబడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అందువల్ల మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనలకు ప్రచురణకర్తలు దొరుకుతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ  దొరికినప్పటికీ వాళ్ళు నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా ! "

Image Courtesy Google

ఇటువంటి తీవ్రమైన విమర్శలు చెయ్యడం ద్వారా గోర్కీ సిగిజ్మండ్ ఒక రచయితగా వాస్తవదూరమైన  విషయాసక్తితో (Self-indulgent untimeliness) ఘోరమైన పాపానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బాధ్యతగల రచయితగా సోసియెట్ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. యుద్ధ సమయంలో రచయితలు  వాస్తవాన్ని విస్మరించి పదసౌందర్యాలపై అనురక్తితో తాత్వికమైన విషయాల్లో మునిగితేలడం నేరమన్నది గోర్కీ భావన. నిజానికి గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్ ను 19 వ శతాబ్దానికి చెందిన రచయితగానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్ పై 19వ శతాబ్దపు రష్యన్ సింబాలిజాన్ని పెద్ద ఎత్తులో నిర్వచించిన నీకొలాయ్ గొగోల్, ఎడ్గర్ అలాన్ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్ శైలికీ  గొగోల్ శైలికీ చాలా పొంతనలుంటాయి. ఉదాహరణకు 'ది రన్ అవే ఫింగర్స్' (1922) అనే కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతడి చెయ్యినొదిలి పారిపోవడం గొగోల్ 'ది నోస్' కథను తలపిస్తుంది. సిగిజ్మండ్ కథానాయకులు కూడా గొగోల్ కథానాయకుల్లాగే కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్ 'ది ఓవర్ కోట్', సిగిజ్మండ్ 'క్వాడ్రాటురిన్' కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథానాయకులు వృత్తి,ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టు సిగిజ్మండ్ ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయినట్లుండే ఆయన కథలు అర్థంకావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్ లాంటి సిగిజ్మండ్ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.

ఉక్రెయిన్ లోని కీవ్ లో పుట్టిన పోలిష్ మాట్లాడే కుటుంబానికి చెందిన సిగిజ్మండ్ డొమినికోవిచ్ క్రిఝిఝానోవ్‍స్కీ 1919-1950 ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే ప్రచురించబడ్డాయి. మాస్కో సాహితీలోకంలో పలు మేథావుల మన్ననలందుకున్నప్పటికీ క్రిఝిఝానోవ్‍స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల,ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగా 1949 లో గుండెపోటుతో రచయితగా సిగిజ్మండ్ కెరీర్ ముగిసిపోయేవరకూ ఆయన మాస్కో సాహితీలోకంలో (నాన్ అకడమిక్) విమర్శకునిగా,సంపాదకునిగా మాత్రమే పనిచేశారు. దీనికి తోడు సిగిజ్మండ్ స్టాలిన్ కంటే మూడేళ్ళు ముందుగానే మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధవాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్ లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్ 1920 ల తొలి కాలంలో ఈ నియంతృత్వపు కాలాన్ని 'ఫెంటాస్టిక్' శైలిలో రూపకాలు,ఉపమానాలతో కూడిన కాల్పనిక  సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు. 

భావవ్యక్తీకరణ నేరమైన నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయితలూ,కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్ శకంలో ఇటువంటి రచయితలు  రెండు రకాలనుకుంటే,  అలెగ్జాండర్‌ సోల్జెనిత్సిన్‌, విక్టర్ సెర్జీ, మిఖాయిల్ బల్గకోవ్, బోరిస్ పాస్టర్నాక్ వంటి రచయితలు స్టాలిన్ సోవియెట్ రష్యా విప్లవం, సివిల్ వార్ కాలం నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవిధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృదయాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిఝిఝానోవ్‍స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని కౄరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి తీసుకువెళతాయి. 1930 ల్లో సిగిజ్మండ్ జీవించి ఉన్న కాలంలో తనను తాను రచయితగా కంటే థియేటర్ ప్రొఫెషనల్ గా, సాహితీ విమర్శకునిగానే చూసుకున్నారంటారు. షేక్స్పియర్,జార్జ్ బెర్నార్డ్ షా ల ప్రభావం అధికంగా ఉన్న తన కథలను నిర్లక్ష్యం చేసినా వారిద్దరి రచనల్నీ మాత్రం తనదైన శైలిలో విశ్లేషిస్తూ విస్తృతమైన పరిశోధనలు చేసి పలు వ్యాసాలు ప్రచురించారు. ఈ కారణంగా సాహితీ రంగంలో సిగిజ్మండ్ ఒక ప్రత్యేకమైన 'nonacademic sort of Shakespeare critic'  గా పేరు తెచ్చుకున్నారు. 

క్రిఝిఝానోవ్‍స్కీ రచనలపై షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన తనను తాను ప్రప్రథమంగా 'ఎక్స్పెరిమెంటల్ రియలిస్టునని' చెప్పుకునేవారు. స్టాలినిస్ట్ సెన్సార్షిప్ కారణంగా సిగిజ్మండ్ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా Joanne Turnbull, Nikolai Formozov వంటి సంపాదకుల దృష్టికి వచ్చి 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలు వెలువడ్డాయి. రచయితలుగా భిన్న ధృవాలైనప్పటికీ సిగిజ్మండ్ రచనా శైలిని ఆధునిక రచయితల్లో ఒకరైన వ్లాదిమిర్ షరోవ్ శైలితో పోలుస్తారు కార్ల్ ఎమర్సన్. వీరిద్దరి శైలుల్లో ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సినెస్థీసియా అంటారు, అంటే కథ చెప్పేటప్పుడు ఇద్దరూ సినెస్థీసియాను మూలాధారంగా చేసుకుని చెబుతారు. నిజానికి మనిషికుండే  పంచేంద్రియాలు మెదడులోని వేర్వేరు భాగాలను చైతన్యవంతం చేస్తాయంటారు. కానీ సినెస్థీసియా కారణంగా ఒక ఇంద్రియ చైతన్యం మరో ఇంద్రియం చేత ఉద్దీపితమవుతుంది. ఉదాహరణకు సంగీతం విన్నప్పుడు మనం కొన్ని రంగుల్ని చూడడం తటస్థిస్తుంది. లేదా ఏవైనా అంకెలు చూసినప్పుడు మనకు కొన్ని రంగులు జ్ఞప్తికి వస్తాయి, ధ్వనులకు వాసనలుంటాయి, స్వరాలకు వర్ణాలుంటాయి, లేదా ఏదైనా వాక్యాలను విన్నా,చదివినా శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణం జనించిన భావన కలుగుతుంది, ఇలా మెదడు అనేక అనుభూతులకు లోనవుతుంది. నిజానికి జీవశాస్త్ర పరంగా చూస్తే ఈ సినెస్థీసియా ఇంద్రియ సంబంధమైనది కాదు. ఈ సాహితీ ప్రక్రియ పాఠకులపై ప్రభావం చూపే రీతిలో అర్ధవంతమైన వాక్యాలను శ్రద్ధగా ఏర్చి కూర్చిన కృత్రిమమైన నిర్మాణం. ఈ సినెస్థీసియాను పాఠకులపై సమర్థవంతంగా ప్రయోగించడానికి రష్యన్ విప్లవం, సివిల్ వార్లను వేదికగా చేసుకున్నారు సిగిజ్మండ్.

సిగిజ్మండ్ దృష్టిలో భాష గతిశీలమైనది. కొన్ని కథల్లో సిగిజ్మండ్ పదాలూ,అక్షరాలూ పేజీని వీడి పైకి ఎగసిపడుతున్న అలల్లా ఒకదానితో ఒకటి తలపడుతున్నట్లుంటాయి. దీనికి తోడు ప్రవృత్తి రీత్యా ఏకాకి జీవితాన్ని ఇష్టపడే అంతర్ముఖత్వం సిగిజ్మండ్ కథల్లో కాంటియన్ భావజాలానికి సంబంధించిన మెటాఫిజికల్ ప్రపంచాలు ఎక్కువ కనబడడానికి ఒక ముఖ్య కారణం. కథ చెప్పే సమయంలో సిగిజ్మండ్ దృష్టి ఎల్లప్పుడూ మానవ మస్తిష్కం లోలోపలి పొరల్లో ఎవరూ చొరబడడానికి సాహసించని మారుమూల ఏకాంత ప్రదేశాలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన కథా వస్తువు (లేదా కథానాయకుడు) ఆ మెదడు లోపలి పొరల్లోంచి సూటిగా వెలుపలికి ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున వెలుపలికి దూసుకువచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ సమయంలో ఎటువంటి వైకల్యాలకూ తావివ్వకపోవడం సిగిజ్మండ్ ప్రత్యేకత.

యుద్ధంతో వినాశనాన్ని చవిచూసిన కీవ్ నుండి బయటపడి 1922 లో మాస్కో లో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్. కాసేపు సిగరెట్ ముట్టించి అది కాలే లోగా కథ రాసి సిగరెట్ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచయితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ,ప్రవృత్తికీ నిజాయితీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్. నార్వే రచయిత కనూట్ హాంసన్ బాటలోనే సిగిజ్మండ్ కూడా కథ రాయడం కోసం ఏకంగా తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సిగిజ్మండ్ అనువాదకుల్లో ఒకరైన కార్ల్ ఎమర్సన్ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. ఎమర్సన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి రాసిన ఒక వ్యాసంలో సిగిజ్మండ్ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలిలోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునేవారని అంటారు. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక,మానసిక సమతౌల్యంలోనుంచి పుడుతుందనీ సిగిజ్మండ్ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి. 

అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి  'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్ ఎమర్సన్ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిఝిఝానోవ్‍స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవిచూసిన క్రిఝిఝానోవ్‍స్కీ  ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "డూ యూ లవ్ పుష్కిన్ ?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక "ఐ...ఐ......" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య బోవ్షెక్ చెప్తూ, ఆ సమయంలో ముప్ఫయ్ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అన్న ఊహ రాక మానదు. 'కాంటియన్ థింకర్' (ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న క్రిఝిఝానోవ్‍స్కీ రచనలు మోతాదుమించిన తార్కికతతో ఉండడం వల్ల వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ  తీర్మానించడంతో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" క్రిఝిఝానోవ్‍స్కీ వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం.

క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి 'లెటర్ కిల్లర్స్ క్లబ్' లో టైడ్ (రచయిత) అనే పాత్ర ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్' అనే అంశం తోడ్పడుతుంది. కథలను అల్లే విధానాన్ని బట్టి సాహితీ ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్, పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయంటాడు టైడ్. వీటిల్లో పీపుల్ ప్లాట్స్ అనేవి వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే సాధారణమైన కథలన్నమాట. ఈ కథల్లో వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది. కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి, ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించివై ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్ అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యవు, పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన క్రిఝిఝానోవ్‍స్కీ కి ఈ రెండవ పద్ధతి అంటే ప్రాణం, ఈ కారణంగానే ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాశారు.

'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరికొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్ అనే రచయిత చెప్పే 'ఎక్సెస్' (Exes) అనే డిస్టోపియాన్ హారర్ స్టోరీ మరో కథల సంపుటి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆరోజుల్లోనే అలవోకగా రాశారు క్రిఝిఝానోవ్‍స్కీ. కొన్ని చోట్ల కథలో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి తత్వాన్ని ప్రస్తావిస్తూ సాగే సిగిజ్మండ్ లోతైన కథనంలోని ప్రవాహపు వేగాన్ని అందుకుంటూ చదవడం పాఠకులకు కత్తిమీద సాములా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు రచయితకు దైనందిన జీవితంలో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలే కాకుండా పలు రాజకీయ, సామాజిక, విజ్ఞాన, తత్వ, శాస్త్ర సాంకేతికత వంటి విభిన్నమైన అంశాలపై ఉండవలసిన జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది.  మరోచోట ఫెవ్ అనే రచయిత చెప్పిన 'టేల్ ఆఫ్ ది త్రీ మౌత్స్' అనే కథలో ఇంగ్, నిగ్, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిఝిఝానోవ్‍స్కీ ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. "తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని" ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిఝిఝానోవ్‍స్కీ. ప్రవాహానికి ఎదురెళ్ళడమనేదే విప్లవమనుకుంటే మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంపై తన వినూత్నమైన కథలతో తిరుగుబాటు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠకులు ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఈయన రచనల్లో దొరకని ఒకే ఒక్క వస్తువు 'అనుసరణ' (conformity).

క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివే భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం, బోర్హెస్ కథల్లోలాగే ఆయన కథల్లో కూడా తరచూ కనిపించే భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు !! బోర్హెస్, ఉర్సులా లెగైన్ వంటి కొందరు 'ఫెంటాస్టిక్ జానర్' రచయితల్లాగే క్రిఝిఝానోవ్‍స్కీ కి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిఝిఝానోవ్‍స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక రుజువులు కనిపిస్తాయి. గూగుల్ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు దేశవిదేశీ  సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్, కాఫ్కా వంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్ కు అందుబాటులో లేనప్పటికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్, పో, గోగోల్  వంటివారు కొలువుదీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న 'షూ బాక్స్' సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ ని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

రచయితగా క్రిఝిఝానోవ్‍స్కీ దృష్టి అంతా తనలో చెలరేగే నిరంతరమైన తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనిపించదు. 'ఇన్ ది ప్యూపిల్'  వంటి కథల్ని చూస్తే పాఠకులు తన వేగాన్ని అందుకుంటున్నారో లేదో కూడా గమనించని లోతైన క్రిఝిఝానోవ్‍స్కీ కథనం సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి, ,కెమిస్ట్రీ నుంచి కాల్పనికతకూ పాదరసంలా చురుకుగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది. ప్రేమలూ, వాటిల్లో రకాలూ, మానవ సంబంధాలను సర్రియలిస్టిక్ అంశాలతో జతచేసి రాసిన ఇటువంటి కథల్లో వ్యక్తుల బదులు చిత్రాలు (ఇమేజస్) ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి. క్రిఝిఝానోవ్‍స్కీ అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే  'నేను' కథా, కథనాల్ని బట్టి రూపాంతరం చెందుతుంటుంది. ఈ 'నేను' కి ప్రత్యేకమైన ఆకారంగానీ గుణగణాలుగానీ ఉండవు, సైన్సు పరిభాషలో చెప్పాలంటే క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో 'నేను' ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే కనపడుతుంది. "Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని ఆడమ్ థిర్వెల్ ఒక పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగథాల్లోకి తొంగి చూడమంటాయి. ఈ రష్యన్ రచయితను ఒకసారి చదివితే పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా  క్రిఝిఝానోవ్‍స్కీ ని చదవక మునుపు, క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి. 

రెండు స్థితుల నడుమ ఊగిసలాడే క్రిఝిఝానోవ్‍స్కీ స్థిర స్థావరమైన ఈ ఫెంటాస్టిక్ జానర్ కూడా అత్యంత సంక్లిష్టమైనది. ఒక స్థితిలో వట్టి భ్రమలా అద్భుతంగా  కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది. మరో ప్రక్క కొన్ని కథల్లో ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు. కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన తాత్వికత క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో కీలకమైన అంశం. ఈయన్ని చదివేటప్పుడు పదాలనూ, వాక్యాలనూ దాటి reading between the lines/seeing through the gaps తప్పనిసరి. ఎందుకంటే ఆయన పాఠకులతో చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య ఇరుకు సందుల్లో దాచేస్తారు. నిజానికి మన దృష్టిని దాటిపోయిన అతి చిన్న బిందువు వద్దే క్రిఝిఝానోవ్‍స్కీ కథకు రూపకల్పన మొదలవుతుంది. అదే విధంగా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.

ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది. ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్తిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం. కానీ క్రిఝిఝానోవ్‍స్కీ కథలెన్ని చదివినా ఆయన పాఠకులకు ఒక అంతుపట్టని ఎనిగ్మా గానే మిగిలిపోతారు. ఇలాంటి రచయితలు పాఠకుల ఊహలకు రెక్కలిస్తారే గానీ దిశానిర్దేశం చెయ్యరు. వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన. ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేస్తారు క్రిఝిఝానోవ్‍స్కీ. మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా, కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా, పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా, ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే, మరో ప్రక్క నిజమేనని తొందరగానే నమ్మేస్తాం. వాస్తవంలో సాధ్యం కాని విషయాలను సృజనాత్మకతతో సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక సాధనంగా ఎంత నేర్పుగా ఉపయోగించవచ్చో క్రిఝిఝానోవ్‍స్కీ కథలు చదివితే అర్థమవుతుంది. ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో, మాన్ బుకర్, నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో క్రిఝిఝానోవ్‍స్కీ లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉండే ఉంటారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 13  డిసెంబర్ 2021

https://www.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977

https://m.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977?fbclid=IwAR06wgTQdLluiVRwc4uLBCImxKt1WnUCln4jsO1qRa17Tut07np3RtPv_Ko

Tuesday, October 19, 2021

The Secret Heart of the Clock : Notes, Aphorisms, Fragments, 1973-1985 - Elias Canetti

ప్రఖ్యాత జర్మన్ రచయితా, నోబెల్ గ్రహీతా ఎలైస్ కానెట్టి పేరు పలుమార్లు విని చాలా కాలంగా ఆయన రచనలు చదవాలనుకున్నప్పటికీ గత ఏడాది చదివిన సోంటాగ్ వ్యాసాల్లో ఆయన గురించిన ప్రస్తావనలు ఎట్టకేలకు ఆయన రచనల్ని వెలికి తీయించాయి. కానెట్టి వ్యాసాలు అప్పుడొకటీ ఇప్పుడొకటీ మినహా ఆయన రచనలేవీ నేను పూర్తి స్థాయిలో చదివింది లేదు. అనుకున్నంతలో ఆయన నోట్స్, ఫ్రాగ్మెంట్స్, అఫోరిజంస్ కలిగిన 'ది సీక్రెట్ హార్ట్ ఆఫ్ ది క్లాక్'  కనిపించింది.  ఈ రచన పాక్షికంగా మెమోయిర్ లా, మరికొంత మ్యూజింగ్స్ లా ఉండడం ఆయనను తొలిసారిగా పరిచయం చేసుకోవడాన్ని సులభం చేసింది.

Image Courtesy Google

ఈ పుస్తకంలో కానెట్టి తన జీవితసారాన్నంతటినీ చిన్న చిన్న వాక్యాల్లో పొందుపరిచినట్లు ఉంటుంది. ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉండడం వల్ల కథలా చెప్పే మెమోయిర్స్ లో ఉండే అనవసర ప్రస్తావనలు ఈ పుస్తకంలో కనపడవు. మరో విషయం ఏమిటంటే ఆయన ఫస్ట్ పర్సన్ నెరేటివ్ ని వాడకుండా థర్డ్ పర్సన్ నేరేటివ్ లో ఈ పుస్తకాన్నంతా రాయడం ఈ రచనకు అదనపు హంగు అనిపించింది. ఉత్తమ పురుషలో రాయకుండా ప్రథమ పురుషలో రాయడం వల్ల ఇటువంటి రచనలు ఆత్మవిమర్శగా, స్వోత్కర్షగా ధ్వనించే అవకాశం ఉండదు. రచయిత కూడా 'నేను' అనకుండా రచనలు చెయ్యడం వల్ల తన ఇజాలనూ,తీర్మానాలనూ, దృక్పథాలనూ పాఠకుల మీద రుద్దినట్లు అనిపించదు. రాండీ పాష్చ్ 'ది లాస్ట్ లెక్చర్' లో అనుకుంటా "మన అభిప్రాయాలను ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పడం మేలుచేస్తుంది" అంటారు. కానెట్టి ఈ రచనలో థర్డ్ పర్సన్ నేరేటివ్ లో 'He' అని సంబోధిస్తూ తనకు తాను దూరంగా నిలబడి ఒక ప్రేక్షకుడిలా జీవితమనే వేదికపై నిలబడ్డ తననూ, తన గతాన్నీ విశ్లేషించుకున్నట్లు తోస్తుంది. ఈ పుస్తకంలో అధిక భాగం వృద్ధాప్యం, మృత్యువు వంటి అంశాల గురించిన విశ్లేషణలు ఉంటాయి. 

ఇందులో కొన్ని వాక్యాలకు నా స్వేచ్ఛానువాదం :

* జీవితంలో మృత్యువు కూడా భాగమన్న సత్యాన్ని ఎందుకు ప్రతిఘటిస్తావు ?  మృత్యువు నీలో లేదా ? 

* ప్రపంచ సాహిత్యం అంటే వారికి పూర్తిగా విస్మరించదగ్గదని అర్థం.

* తన పరిథులకు అతి జాగ్రత్తగా కావలికాసుకునే వ్యక్తి సమక్షంలో ఎక్కువ సమయం గడపడం కోసం నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవడమనేది అస్సలు భరించలేని విషయం. 

* నీ జీవితాన్ని కథగా రాసేటప్పుడు అందులో ప్రతి ఒక్క పేజీలో ఎప్పుడూ ఎవరూ వినని ఒక కొత్త సంగతి ఉండాలి. 

నాకు ఉనామునో అంటే ఇష్టం : నాలో ఉన్న చెడు లక్షణాలే అతడిలో కూడా ఉన్నాయి, కానీ అతడికి తనలోని ఆ లక్షణాలను చూసి సిగ్గుపడాలని స్ఫురించదు.

* ఏమీ ఆశించనివాడే స్వేచ్ఛాజీవి. మరి స్వేచ్ఛగా ఉండడం కోసం ఏమాశిస్తాడు ?  

* నిజానికి నిన్ను నిన్నుగా పూర్తిగా ప్రేమించే స్నేహితులెవరూ ఉండరు, అది అవినీతి. 

నీ గురించి ప్రతి ఒక్క 'సెల్ఫ్ డిస్ప్లే' నీ విలువను కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది. 

తనను తాను అదుపులో పెట్టుకుంటూ రాసే రచయితలంటే నాకు గౌరవం. తమ తెలివితేటల్ని ఒక పరిథిని మించకుండా, వాటి నుండి తనను తాను రక్షించుకుంటూ, అలాగని వాటిని పూర్తిగా వదిలివెయ్యకుండా రాసేవాళ్ళంటే నాకు అభిమానం. అదీ కాకపోతే కొత్తగా తెలివి వచ్చిన రచయితలూ, కాస్త ఆలస్యంగా తెలివిని సంపాదించినవాళ్ళూ / తమకు తెలివితేటలున్నాయని గ్రహించినవాళ్ళూ  నా దృష్టిలో మంచి రచయితలు. స్వల్పమైన  విషయాలను సైతం కళ్ళువిప్పార్చుకుని చూస్తూ ఉత్తేజితమయ్యేవాళ్ళు : అద్భుతం. నిరంతరం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న గొప్ప గొప్ప విషయాల వల్ల  మాత్రమే ఉత్తేజాన్ని పొందేవాళ్ళు : భయానకం.

అతడికి తెలియనీ, అతడు చూడని ప్రతీదీ అతణ్ణి సజీవంగా ఉంచుతుంది.

అతడు వెలుగులోకి నెట్టివేయబడ్డాడు. ఇంతకీ అతడు ఆనందంగా ఉన్నాడా ?

నువ్వు అందుబాటులో లేకుండా దాక్కుంటున్నావని వారికి నువ్వంటే ద్వేషం. నువ్వు ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేస్తూ వారి ముందు ఊరేగినా వారు నిన్నేమీ తక్కువ ద్వేషించరు.  

ఏ స్థాయిలోనూ ఒకర్నొకరు అర్ధం చేసుకోవాల్సిన అవసరంలేని వృద్ధాప్యంలో సన్నిహితంగా కూర్చోవడం పరమానందం.

ఎనభయ్యోపడిలో పడిన తరువాత ఆదర్శాలు లేకుండా బ్రతకడం సాధ్యమేనా ! మరచిన కుతూహలాన్ని మళ్ళీ నేర్చుకో, జ్ఞాన సముపార్జనకోసం వెంపర్లాడకు, గతించినకాలపు అలవాట్లను త్యజించు, ఆ ఖరీదైన అలవాట్లలో నువ్వు మునిగిపోతున్నావని గ్రహించు, కొత్తవాళ్ళను గమనించు, నువ్వు ఆదర్శవంతంగా తీసుకోలేనివారిపై దృష్టిసారించు. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్కు నీ కర్మకు సరితూగేలా జీవించు. 

తనను తాను త్యజించిన పిమ్మట అతడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడికి తన గురించి మరెప్పుడూ ఇంకేమీ తెలుసుకోవాలనే ఇచ్ఛ లేదు.

* స్నేహితులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం స్నేహితులను మనం బహిరంగంగా గొప్పగా అందరికీ పరిచయం చేసుకుంటాం. నలుగురిలో వారిని నోరారా కీర్తిస్తాం. వారి మీద ప్రతి చిన్న అవసరానికి ఆధారపడతాం. వాళ్ళెప్పుడూ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులోనే ఉంటారని భావిస్తాం, వాళ్ళు కూడా సాధారణంగా అలాగే ఉంటారు. ఏదైనా సాక్ష్యానికి అవసరమైతే వాళ్ళనే పిలుస్తాం. వాళ్ళ బలాలూ,బలహీనతలూ మనకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఎంత భారమైనా మనల్ని భరించగల శక్తి వారికి ఉందని విశ్వసిస్తాం. వాళ్ళకి పూర్తిగా స్వార్ధం లేకుండా ఉండడం సాధ్యంకాకపోయినా వాళ్ళని నిస్వార్ధపరులుగా,సొంత రక్తసంబంధీకుల కంటే ఎక్కువగా అనుకుంటాం. వాళ్ళ గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ గురించి తెలిసిన వారందరికీ వారు కూడా తెలుస్తారు.

* ఇక రెండవ రకం స్నేహితులు : నీ రహస్యాలు తెలిసినవాళ్ళు , వాటిని దాచేవాళ్ళు. మొహాన ముసుగు లేకుండా నిన్నూ,నీ ఉనికినీ పూర్తిగా ఎరిగిన వాళ్ళు. వారి ప్రస్తావన మనం ఎవరివద్దా తీసుకురాము, వాళ్ళ గురించి మాట్లాడకుండా తప్పించుకుంటాము. వారి నుండి తగినంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, వారిని అరుదుగా కలుస్తాం. మనకు వాళ్ళను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండదు, వాళ్ళకు మనకు తెలియని అనేక లక్షణాలు ఉంటాయి. చివరకు కాలయంత్రపు రహస్యం అయినాసరే , ఒకసారంటూ నీకు తెలిసిపోయాక అది నీ ఆలోచనలను ఆహ్వానించదు, అవి ఎప్పటికీ అస్పృశ్యంగా ఉండిపోతాయి, ఎంత అంటరానివిగా ఉండిపోతాయంటే అవి ప్రతీ ఒక్క కలయికతోనూ నిన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇటువంటి స్నేహితులు శాశ్వత స్నేహితులమని చెప్పుకునే వారికంటే చాలా అరుదైనవారు.

* ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా రెండవ రకం రహస్య స్నేహితుల్ని కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే అటువంటి స్నేహితుల స్నేహాన్ని ఎవరూ తమ హక్కుగా భావించరు. అటువంటి స్నేహితులు జీవితంలో చివరి మజిలీగా ఉంటారు. ఈ ఒక్క విషయంలో వాళ్ళ స్నేహాన్ని హక్కుగా భావించవచ్చు. మన జీవితంలో వాళ్ళ స్థానం కదిలించ వీలులేనిది, కానీ విచిత్రంగా వారికి ఆ నిజాన్ని గూర్చిన స్పృహ ఉండదు.

Monday, October 11, 2021

The Ink Dark Moon : Love Poems by Ono no Komachi and Izumi Shikibu, Women of the Ancient Court of Japan

జాపనీస్ సాహిత్యంలో స్వర్ణయుగంగా (Heian era) పరిగణించే 794-1185 ల మధ్య కాలానికి చెందిన ఇద్దరు కీలకమైన కవయిత్రులు ఓనో నో కొమచి,ఇజుమీ షికిబు ల కవితలను అమెరికన్ కవయిత్రి జేన్ హిర్ష్ఫీల్డ్  'ఇంక్ డార్క్ మూన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కవయిత్రులిద్దరూ జపాన్ రాజ్యసభలో (అనగా ఇప్పటి క్యోటో) భాగంగా ఉండేవారట. ఓనో కొమచి తన కవితల్లో ప్రేమ విరహం,శృంగారం,సంతాపం వంటి విషయాల్లో స్త్రీ సహజమైన భావోద్వేగాలకూ,స్పందనలకూ తాత్విక దృష్టితో అక్షరరూపమిస్తే , షికిబు కవితలలో శృంగారంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాముఖ్యతనిస్తూ రాసిన కవితలు ఉంటాయి. నిజానికి విరహాన్నీ,ప్రేమనూ స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో మగవారికి ఉండే స్వేచ్ఛ గానీ,సాధనాలు గానీ స్త్రీకి అందుబాటులో లేని కాలం అది. 4,5 శతాబ్దాలలో చైనీస్ భాష జపాన్ లో మొట్ట మొదటి లిపి ఉన్న భాషగా వ్యవహారంలో ఉండేదట, కానీ 8 వ శతాబ్దం వరకూ ఆ భాష స్త్రీలకు అందుబాటులోకి రాలేదు.

జపాను కవిత్వానికి మూలాలు మానవ మస్తిష్కంలోనుండి వ్రేళ్ళూనుకుని  ఉంటాయి కాబట్టి గాఢమైన అనుభవప్రధానమైన ఈ కవితలు హృదయపు లోతుల్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. ఎంతమంది మనుషులుంటే అన్ని విధాలైన వ్యక్తీకరణ మార్గాలు గనుక ఈ కవితల్లో ఆ కాలపు సంస్కృతిలో కన్నవీ,విన్నవీ యథాతథంగా అక్షరీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. కొమ్మల్లో దాక్కుని కూసే కోయిల, తటాకాల్లోని కలువల మధ్య నుండి వినిపించే కప్పల సందడి వంటివి ఈ కవితల్లో విరివిగా ప్రస్తావనకొస్తాయి.

Image Courtesy Google

సహజంగా ఎప్పుడూ ముందుమాట పుస్తకం చివర్లో చదివే అలవాటు నాకు. గద్యం చదివేటప్పుడు ఈ అలవాటు ఫర్వాలేకపోయింది కానీ ఈ మధ్య కవిత్వం చదివేటప్పుడు ఖచ్చితంగా ముందుమాట చదివిన తరువాతే మిగతా పేజీల్లోకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కవిత్వం చదివేముందు పరిచయ వాక్యాలు చదివితే కవితల నేపథ్యం అర్థమై ఆ వాక్యాలు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి, లేకపోతే కాంటెక్స్ట్ తెలీని ఖాళీ వాక్యాల్లా మిగిలిపోతాయి. ముఖ్యంగా ప్రాచీన కవిత్వం చదివే విషయంలో కవితల నేపథ్యం తెలియడం మరింత ముఖ్యమని తమిళ కవి ఎ.కె. రామానుజన్ కూడా అభిప్రాయపడతారు. నిజానికి ఈ కవితలు విడివిడిగా చదివినప్పుడు నాకంత గొప్పగా అనిపించలేదు. కానీ నేపథ్యం తెలిశాకా అవే కవితలు మరింత అర్థవంతంగా ధ్వనించాయి. 

స్త్రీ పురుష సంబంధాలు ప్రధాన వస్తువుగా ఉండే ఈ కవితలపై ఆ కాలపు సామజిక పరిమితులూ, పితృస్వామ్యం వంటి అంశాల ప్రభావం కనిపిస్తుంది. ఆ కాలంలో కులీన వర్గాల్లో వివాహితుడైన పురుషుడు ఎంత మంది స్త్రీలతోనైనా సంబంధం కలిగి ఉండవచ్చు. కానీ వివాహిత అయిన స్త్రీ మాత్రం పాతివ్రత్యంతో భర్త పట్ల విధేయతతో మెలగాలి. అవివాహిత స్త్రీలకు మాత్రం ఈ  విషయంలో మినహాయింపు ఉండేది కానీ సాధారణంగా వారు ఇటువంటి సంబంధాలను రహస్యంగా నెరపేవారట. ఈ పుస్తకంలో కోర్టింగ్ విషయంలో రాసిన మరి కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ కాలంలో మగవారు ఎవరినైనా ఇష్టపడితే ఆ స్త్రీకి లిఖితరూపంలో నాలుగైదు పంక్తుల కవిత రాసి పంపేవారట. ఆమెకు ఆ కవిత్వం, కవిత్వపు భాష గనుక నచ్చితే అదే మార్గంలో తిరిగి జవాబు అందేదట. అంటే కవిత్వానికీ, భాషకీ ఆ కాలంలో అంతటి ప్రాముఖ్యత ఉండేదని అర్ధమవుతుంది.

ఇందులోని కొన్ని కవితలకు నా స్వేచ్ఛానువాదం :

నీ విరహంలో ఈ హృదయం వెయ్యి ముక్కలైంది

నేనొక్క ముక్కను కూడా కోల్పోలేదు. 

 

నేను నీకోసం పరితపిస్తున్నప్పుడు నీవు చేరువకాకుండా దూరంగా ఉండి ఉంటే

ఈపాటికి నేను నిన్ను మరచిపోయి ఉండేదాన్ని.


ఈ ప్రపంచమొక జాగృత స్వప్నమని నీకు తెలియదా ?

నేను నీకోసం తపించిన ఆనాటి క్షణాలు, అవి కూడా అశాశ్వతమైన భావనలే  కదా !


నేను నీ పేరు పదేపదే పలవరించినా  ఈ వాస్తవం నా హృదయపు  తీవ్రతను ప్రతిబింబించగలదా ?  


నా సన్నిహితుడూ, నా శరీరమూ  కూడా  త్వరలో మేఘాలుగా  రూపాంతరం చెంది  

తలోదిక్కుకీ ప్రవహిస్తాయి.


నిరంతరం అలుపెరగక నా స్వప్నాల దారుల వెంట అతన్ని చేరుకోవడం

వాస్తవ ప్రపంచానికి వచ్చేసరికి ఒక క్రీగంట చూపుతో  సరిసమానం కాదు.  

 

అతడి ఆలోచనలతో నిద్రకుపక్రమించాను కాబట్టి అతడు నా నిదురలో అగుపించాడా !

అది స్వప్నమని అవగతమైతే నేను నిదుర మేల్కొనేదాన్నే కాదు !

 

ఈ విరహపు తీవ్రత అవధుల్లేనిది. 

నిశీధి స్వప్నాల దారులవెంట నీ చెంతకు చేరుకునే వేళ

కనీసం నన్నెవరూ నిందించలేరు.

   

నీవు వదిలివెళ్ళిన జ్ఞాపకాల బహుమతులు

నాకు శత్రువులుగా  మారాయి. 

అవి లేకపోతే కనీసం క్షణకాలపు మరుపు సాధ్యమయ్యేది.