Friday, March 26, 2021

Meteor and Other Stories - John Wyndham

బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ రైటర్స్ లో హెచ్.జి.వేల్స్ తరువాత ప్రముఖంగా వినబడే పేరు జాన్ విండమ్ ది..ఆయన రచనల్ని చదవాలనే కోరిక ఎట్టకేలకు నెరవేరింది..విండమ్ రాసిన 'ఛోకీ' (NYRB ) చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా అనుకోకుండా 'మీటియోర్ అండ్ అదర్ స్టోరీస్' తో ఆయన రచనలు చదవడం మొదలుపెట్టాను..'ఆక్స్ఫర్డ్ బుక్ వార్మ్స్ లైబ్రరీ' వారు ప్రచురించిన స్పెక్యులేటివ్ ఫిక్షన్ కు చెందిన ఈ పుస్తకంలో మరీ చిన్నవీ,మరీ పెద్దవీ కానీ నాలుగు కథలుంటాయి.

Image Courtesy Google

విశ్వంలో పుట్టిన అన్ని జీవుల్లోనూ ఉమ్మడిగా ఉండే ఒక లక్షణం 'తమ ఉనికిని కాపాడుకోవడం'..ఏ గ్రహానికి చెందిన జీవులైనా,క్రిమికీటకాలైనా,ఇతర జంతుజాలమేదైనా సరే తన సర్వైవల్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది..నిజానికి భూమి మీద సహజవనరులన్నీ క్షయమైపోతే,మనకు కూడా నివాసయోగ్యమైన ఇతర గ్రహాలవైపు చూడక తప్పదు..మానవజాతి అంతరించిపోకుండా 'మంగళయాన్' ద్వారా ఇప్పుడు మార్స్ పై జరిపే పరిశోధనలన్నీ ఆ దిశగా జరుగుతున్నవే..మరి ఇతర గ్రహాలకు చెందిన జీవులు కూడా మనలాగే ఆలోచిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే దిశగా రాసిన కథే 'Meteor'..గ్రహాంతరవాసులు తమ గ్రహం నివాసయోగ్యం కాకుండా నాశనమైపోతున్నదని గమనించి తమ ఉనికిని కాపాడుకోడానికి ఇతర గ్రహాలకు ప్రయాణమవుతారు..అలా ఒక ఉల్క భూగ్రహాన్ని చేరుతుంది..కానీ అందులో జీవులకు భూగ్రహం అడుగడుక్కీ పొంచి ఉన్న ప్రమాదాలతో, వినాశనకారిగా కనిపిస్తుంది..అయినప్పటికీ అవి "We pray to God that beyond the tunnels we shall find a world that is not mad and evil like this one. Is it too much we ask - simply to live, to work, and to build, in peace…?" అనుకుంటూ భూగ్రహంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంటాయి..మరో ప్రక్క ఆ ఉల్కను పరిశీలిస్తున్న భూగ్రహ శాస్త్రవేత్తలు దానిపై పరోశోధనలు చెయ్యడం మొదలుపెడతారు..భూగ్రహం కూడా వినాశనానికి చేరువలో ఉంది కాబట్టి ఆ ఉల్కలో గ్రహాంతరవాసుల జాడలు ఉంటే వాళ్ళతో సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా మానవాళి అంతరించిపోకుండా కాపాడుకోగలమని భావిస్తూ ఉంటారు..ఈ కథను ఏకకాలంలో అటు గ్రహాంతరవాసుల వైపు నుండీ ,ఇటు మానవుల వైపునుండీ చెబుతారు..విచిత్రమేమిటంటే ఇరువైపులవారూ ఒకే రీతిగా ఆలోచిస్తారు..వైరం లేకుండా ఒకరితోఒకరు సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనే భావిస్తూ ఉంటారు.

An artificial meteor built to visit us is much more exciting than a secret weapon,’ said Sally, it gives us hope that one day we could travel in space ourselves … How wonderful it would be to do that! All those people who hate war, and secret weapons, and cruelty, could go to a clean, new planet. We could set out in a huge spaceship, and we could start a new life. We’d be able to leave behind all the things that are making this poor old world worse and worse. All we’d want is a place where people could live, and work, and build, and be happy. And if we could only start again, what a lovely, peaceful world we might—’ అనుకుంటారు మానవులు..కానీ ఒక ఉమ్మడి లక్ష్యం సాధించే దిశగా ఒకరికొకరు ఎదురుపడిన తరుణంలో, రెండు విభిన్న జాతుల మధ్య స్నేహం కుదిరిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ మెటియార్ కథ చదవాల్సిందే..ఈ కథ ముగింపు, చదివిన చాలా సేపటివరకూ మనతోనే ఉండిపోతుంది.

నాకు 'మెటియార్' ఎంత నచ్చిందో, రెండో కథ Dumb Martian కూడా అంతే నచ్చింది..స్త్రీవాద అంశాలతో పాటు మిస్టరీ,సస్పెన్స్ కలిపి రాసిన ఈ సైన్స్ ఫిక్షన్ కథలో, కథ జరిగే సమయానికి స్పేస్ ట్రావెల్ ఒక దేశంనుండి మరో దేశానికీ విమానమెక్కి వెళ్ళినంత తేలిక అయిపోతుంది .డంకన్ వీవర్ అనే భూగ్రహవాసి జూపిటర్ కు ఉద్యోగ నిమిత్తం వెళ్ళి,అక్కడ ఒంటరిగా ఐదేళ్ళ పాటు పనిచెయ్యాల్సిరావడంతో  లెల్లీ అనే మార్షియన్ ను వెయ్యి పౌండ్లకు కొనుగోలు చేస్తాడు (భూగ్రహానికి చెందిన స్త్రీలు అక్కడ ఉండడానికి అనువు కాదు కాబట్టి )..ఇప్పటి వీసా తరహాలో ఆ గ్రహానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి కాబట్టి ఆమెను తప్పనిసరిగా వివాహమాడి,తనకు తోడుగా తీసుకెళ్తాడు..డంకన్ తనకన్నా భిన్నంగా ఉన్న లెల్లీ పట్ల తిరస్కారభావంతో అణచివేత ధోరణి చూపిస్తూ ఉంటాడు..He was especially annoyed by the fact that she seemed able to accept the problems of their life better than he could. She showed no anger or boredom. And all because she was a dumb Martian! It was unfair. అనుకుంటాడు డంకన్..అతనిలోని ద్వేషం ఒక సందర్భంలో ఆమెపై చెయ్యి చేసుకునే వరకూ వెడుతుంది..ఈలోగా అలాన్ వింటర్ అనే మరో భూగ్రహవాసి వీళ్ళిద్దరితో కలిసి ఒక ఏడాదిపాటు జూపిటర్ లో పని చెయ్యడానికి గాను  నియమితుడవుతాడు..లెల్లీ పట్ల డంకన్ ధోరణి గమనించిన అలాన్ ఆమెను గౌరవంగా చూస్తూ, చదవడం,రాయడం నేర్పిస్తాడు..లెల్లీ తనకంటే తెలివైనదని ఒప్పుకోలేని పురుషాహంకారం తో డంకన్ అలాన్ ను ఆమెకు దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు..ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది..డంకన్ అలాన్ ను ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పన్నాగం పన్నుతాడు..తరువాత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి..ఈ కథలో లెల్లీ పాత్ర స్వభావంలోని విలక్షణత ఈ కథకు అదనపు ఆకర్షణ..ఆమె గురించి ‘You can never tell what Martians are thinking, or whether they are thinking,’ అంటూ లెల్లీ చుట్టూ ఒక మిస్టరీని తయారు చేస్తారు విండమ్..మనకన్నా తెలివైన జాతులతో సహజీవనంలో ఉండే సంక్లిష్టతల్ని ఎత్తి చూపించే కథ ఇది.

జూపిటర్ లో ఒంటరి జీవిగా ఐదేళ్ళ పాటు పనిచెయ్యాలని బెంగపడిన డంకన్ ఆలోచనలు :

Inside his heated space-suit Duncan felt suddenly cold. Never before had he felt so much alone. The cruel, dead heights of the bare, sharp rocks of his moon rose above him. There was nothing like them on Earth or Mars. The black sky that was endless space stretched out around him. In it, his own sun, and numberless other suns, burned endlessly without reason or purpose. The unchanging millions of years, and millions of kilometres, stretched out before and behind him. His life, indeed all life, was like a tiny bit of dust dancing for a short moment in the light of the suns that lasted for ever. Never before had he been so much aware of the loneliness of space.

ఇక మూడో కథ 'Surival' హారర్ ఎలిమెంట్స్ ఉన్న కథ..ప్రమాదవశాత్తూ స్పేస్ షిప్లో చిక్కుకుపోయిన మనుషులు తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చదివినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది..ఈ కథ ఆకలి విషయంలో మానవుడికీ మృగానికీ తేడాలేదని నిరూపిస్తూ మనం గర్వపడే మానవీయ విలువల్ని పునఃప్రశ్నించుకోమంటుంది..నాలుగో కథ Body and Soul లో పరకాయప్రవేశం మూలాంశంగా రాసిన కథ..ఈ నాలుగు కథలూ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. 

బ్రాడ్బరీ, బ్రియాన్ ఆల్డిస్, ఉర్సులా లెగైన్ లాంటి వాళ్ళతో పోలిస్తే విండమ్ శైలి మరింత సరళంగా జనరంజకంగా ఉంటుంది..పాఠకుల చేత పేజీలు తిప్పించగలిగేదే మంచి కథైతే జాన్ విండమ్ కథలు నిస్సందేహంగా ఆ కోవకు చెందుతాయి..కానీ అందర్నీ విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకునే బ్రియాన్ ఆల్డిస్ విండమ్ కథల్ని "cosy catastrophes" అంటూ తీసిపారేశారట..ఈ రచనతో ఆయన శైలి పరిచయమయ్యింది కాబట్టి , సరళమైన వచనంతో ఆలోచింపజేసే జాన్ విండమ్ కథల్ని మరికొన్నిటిని చదవాలనే ఆసక్తి కలుగుతోంది..హ్యాపీ రీడింగ్.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :

'You know what I mean,’ said Duncan.

I never understand people who can’t say what they mean,’ said Alan. ‘Try again.’

Time went by, and I learned much about the world’s past from Samine. She told me that my own age had not come to an end by blowing itself up. It had died slowly by becoming so safe and well-organized that it lost the power to change, to progress, to develop. She told me that although we visited other planets in space, our dream of mankind’s spreading to those planets never happened.

Saturday, March 20, 2021

The Interior Landscape : Classical Tamil Love Poems - A.K.Ramanujan

ది న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ వారు NYRB పోయెట్స్ సిరీస్ లో భాగంగా ఎ.కె.రామానుజన్ అనువాదం చేసిన క్లాసికల్ తమిళ్ లవ్ పోయెమ్స్ ను 'ది ఇంటీరియర్ ల్యాండ్ స్కేప్' పేరిట పునఃముద్రించారు..నేను రామానుజన్ జానపద కథలు (Folk tales from India) తప్ప ఆయన కవిత్వం గానీ, అనువాదాలు గానీ చదివింది లేదు..అందులోనూ తమిళ వ్యావహారిక భాష తప్ప రాయడం,చదవడం తెలియదు కాబట్టి తమిళ కవిత్వం అనగానే అర్థమవుతుందో లేదో అని ముందు సంకోచించాను..కవిత్వమంటే అన్నిసార్లూ వ్యక్తిగతమే కానక్కర్లేదు, అందునా ప్రాచీన కవిత్వం వ్యక్తిప్రధానమైన కవిత్వానికి బహు దూరం..కవిత్వం చదివేటప్పుడు కవి చరిత్ర,అతడి నేపథ్యం పాఠకుడికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ప్రాచీన కవిత్వం చదివేటప్పుడు ఇటువంటి వివరాలు తెలియడం మరింత ముఖ్యం, ఎందుకంటే అవి తెలియకుండా ఆ కవిత్వపు నాడి పట్టుకోవడం కష్టం..సహజంగా పుస్తకం ముందు మాటల్నీ,తుదిపలుకుల్నీ చివర చదివే అలవాటున్న నేను ఈ పుస్తకం విషయంలో మాత్రం తుదిపలుకు మొదట చదివి అప్పుడు కవితలు చదివాను..ఈ కవితల నిర్మాణం అర్ధం కావాలంటే కవిత్వంతో ఎక్కువ స్నేహం లేని వారికీ,పరాయి సంస్కృతికి సంబంధించిన కవిత్వం చదివేవారికి అది తప్పనిసరి అనిపించింది.

Image Courtesy Google

ఈ రచనలో 300 A.D కి చెందిన 55 మంది కవులు రాసిన తమిళ ప్రాచీన కవిత్వానికి సంబంధించిన ఎనిమిది సంకలనాల్లో ఒకటైన 'కురుంతోకై' అనే సంకలనం నుండి సంగ్రహించిన 76 కవితలు ఉంటాయి..ఈ సంకలనాల్లో కవిత్వాన్ని అకం(అంతర్గతం) ,పూరం(బహిర్గతం) అనే రెండు భాగాలుగా విభజించారు..మొదటి భాగం ప్రేమ కవిత్వం కాగా, రెండవ భాగంలో యుద్ధాలూ,రాజులూ,రాజ్యాలూ,మరణం,మంచి-చెడు లాంటివి థీమ్స్ గా ఉంటాయి..'పబ్లిక్ పోయెట్రీ' అయిన పూరంలో వీరమరణాలు,రాజుల కీర్తి,కవుల పేదరికం లాంటివి గానం చెయ్యబడతాయి..నిజానికి ప్రాచీన తమిళ కవితా సంప్రదాయం వ్యక్తిగతమైనది కాదంటారు రామానుజన్.

ఏదైనా ఒక పరాయి భాషను అనువదించడమంటే పాఠకుణ్ణి ఆ ప్రాంతీయతలోకి  'అనువదించడానికి' ప్రయత్నించడమే..తమిళ ప్రాకృతిక దృశ్య నేపథ్యంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమను మూలాధారంగా రాసిన ఈ పుస్తకంలోని కవితలు పైన చెప్పుకున్న 'అకం' శ్రేణి కి చెందుతాయి..ఈ వర్గానికి చెందిన కవిత్వంలో అంతః ప్రపంచాన్ని కవిత్వంలో పొదగడానికి స్త్రీపురుషుల మధ్య ప్రేమను ఒక అనువైన వ్యక్తీకరణ మార్గంగా వాడేవారు..ప్రేమ రూపురేఖలు నిరంతరం మారిపోయే ఈ 'అకం' కవిత్వానికి కలయిక,ఎడబాటు ,వివాహానంతర ప్రేమ ,పవిత్ర ప్రేమ,అపవిత్ర ప్రేమ లాంటి అన్ని రకాల ప్రేమలూ థీమ్స్ గా ఉంటాయి..రామానుజన్ తుదిపలుకులో ఏడు రకాలైన ప్రేమల్ని వర్ణిస్తారు : అందులో మొదటిది, సామజిక కట్టుబాట్లవల్ల ముడిపడిన బంధం అంటే ప్రేమలేని పెళ్ళి : ఎటువంటి ఆకర్షణా లేకపోయినా తప్పనిసరిగా,ఒక బాధ్యతగా నిలబెట్టుకోవాల్సినది కాగా చివరిది,వన్ సైడెడ్ ప్రేమ : మానసిక పరిపక్వత లేని వయసులో తొలి యవ్వనపు పొంగులో కలిగే ప్రేమ...అకం కవిత్వంలో ఆ ఈ మొదటి,చివరి ప్రేమలకు స్థానం లేదు..వాటిలో కవిత్వానికి అవసరమైన భావావేశాలు ఉండే అవకాశం లేదు..ఇక మిగిలిన ఐదు రకాలు మాత్రమే పరిపూర్ణమైన ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి కాబట్టి వీటినే అకం శైలిలో ఉపయోగించుకుంటారు..ఈ కవిత్వంలో స్త్రీ పురుషులిద్దరూ అన్నివిధాల ఒకరికొకరు సరిసమానులై ఉండాలి అంటే అందచందాల్లో,గుణగణాల్లో,వయసులో,సామజిక స్థితిగతుల్లో అన్ని విధాలా ఒకరికొకరు సమఉజ్జీలై ఉండాలి..సంస్కారవంతులై,నాగరికత తెలిసినవారై ఉండాలి..అటువంటి జోడీ  మాత్రమే పూర్తి స్థాయి ప్రేమకు/కలయికకు లేదా వియోగానికి అర్హమైనది అంటారు.

ఈ శైలికి చెందిన కవిత్వం క్రియాదూరమైనదీ, అనుభవ ప్రధానమయినదీను..దానికి తోడు అకం కవిత్వంలో వ్యక్తుల పేర్లు ప్రస్తావించకూడదన్న నియమం ఒకటి ఉంటుందట..'పూరం' శైలి చారిత్రక వివరాలతో కూడినది గనుక అందులో రాజులూ,కళాకారులూ మొదలైన వారి పేర్లు ప్రస్తావించవచ్చు..ఈ కారణంగా ఈ రచనలో స్త్రీ పురుషుల పేర్లు సర్వనామాల రూపంలో 'హి'/ 'షి' (He, She, Her Friend, Her Foster Mother, Passers-By, Concubine) అని వాడతారు..ఉదాహరణకు ఈ కవితను చూడండి : 

What She Said :
The still drone of the time
past midnight.
All words put out,
men are sunk into the sweetness
of sleep. Even the far-flung world
has put aside its rages
for sleep.

Only I
am awake.

 ఇక ఈ కవిత్వానికి ఉపయోగించిన వ్యాకరణం 'తోల్కాప్పియం' : శబ్దం (ఫోనోలజీ), పదాలు (సెమాంటిక్స్), అర్థం(మోర్ఫోలజీ) అనే మూడు అంశాల మిశ్రమ నిర్మాణంలో ఉంటుంది..నిజానికి ఈ రచనలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న వేర్వేరు కవులు రాసిన చిన్న చిన్న కవితల్ని కలిపి ఒకే కావ్యంగా తయారుచేశారు రామానుజన్..అంతేకాకుండా ఈ కవితల్ని పాఠకులు తమకు నచ్చిన క్రమంలో పేర్చుకుంటే ఒక పజిల్ లో ముక్కల్ని పేర్చినట్లు అనేక విభిన్నమైన నేరేటివ్స్ తయారవుతాయి.

ఐదు రకాల ప్రాకృతిక దృశ్యాలతో కూడిన భౌగోళికాంశాల కవితా నేపథ్యం ఈ కవిత్వంలో మరో ప్రత్యేకత..ఒక్కో లాండ్స్కేప్ కూ ఆహారం,దేవుళ్ళు,జంతువులు,పక్షులు,సంగీతం,వృత్తులు  వంటి కొన్ని స్వాభావికమైన అంశాలు ఉంటాయి..వీటిని ప్రేమలోని ఒక్కో దశనీ వర్ణించడానికి మెటఫోర్లుగా వాడడం వల్ల ఒక్కో దశలో ఒక్కో ఇమేజ్ తయారవుతుంది..వీటిని సింబాలిజంగా  ఉపయోగించడం వల్ల అడవి మల్లెలు,కురింజి పూలు,వసంత,గ్రీష్మ,వర్ష,శరద్ ,హేమంత,శిశిర ఋతువులన్నీ కలిగిన ఈ కవిత్వం జీవం తొణికిసలాడుతూ ఉంటుంది..ఉదాహరణకు ప్రేమికుల కలయికను కొండల్లోని కురింజి పూలతోనూ,ఎడబాటును ఎడారితోనూ, విరహంతో సహనంగా వేచి చూడడాన్ని దట్టమైన అడవులతోనూ, భావావేశాలు ఎగసిపడుతుండగా ఆతృతతో వేచి చూడడాన్ని సముద్రతీరంతోనూ వర్ణిస్తారు..ప్రేమలో నమ్మకద్రోహాన్నీ ,తద్వారా పెల్లుబికిన క్రోధాన్నీ వర్ణించడానికి మతవ్యవస్థ వ్రేళ్ళూనుకున్న కట్టుబాట్లతో కూడిన ప్రాంతాన్ని ఎన్నుకున్నారు..ఏదేమైనా ఈ కవిత్వం భాష తమిళం అని అనిపించదు..చారిత్రక అంశాలు లేకపోవడం,ప్రాకృతిక అంశాలు జోడించడం వల్ల 'అకం' విశ్వజనీనమైన కవిత్వంగా అగుపిస్తుంది.

ఆమె-అతడు ప్రేమించుకుంటారు..ఇచ్చినమాట తప్పి అతడు మగవాడి సహజ స్వభావంతో ప్రపంచంలో తన స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా (సంపద కోసమో,కీర్తి కోసమో,యుద్ధానికో అనే స్పష్టత ఉండదు) ఆమెను వదిలి వెళ్ళిపోతాడు..

అతడి ఎడబాటులో ఆమె ఈ విధంగా అంటుంది. 

What She Said :
Friend,
with no regard for youth
in search of riches he went
no one knows where,
and he will not come back.

మరోచోట అతడు ఆమెను ఈ విధంగా తలుచుకుంటాడు.

What He Said:

O did I not think of you?
and thinking of you,
did I not think and think again of you?
and even as I thought of you
was I not baffled
by the world’s demands
that held me to my work?

O love, did I not think of you,
and think of you till I wished
I were here to sate my passion
till this flood of desire
that once wet the branch of the tall tree
would thin
till I can bend and scoop a drink of water
with my hands ?

వర్షాకాలం-శరదృతువులను మేళవించి ఆమె విరహాన్ని  వర్ణించిన మరో కవిత :

What She Said : 
The rains, already old,
have brought new leaf upon the fields.
The grass spears are trimmed and blunted
by the deer.
The jasmine creeper is showing its buds
through their delicate calyx 
like the laugh of a wildcat. 
In jasmine country, it is evening 
for the hovering bees,
but look, he hasn’t come back.
He left me and went in search
of wealth.

Wednesday, March 17, 2021

The Life-Changing Magic of Tidying Up: The Japanese Art of Decluttering and Organizing - Marie Kondo

పుస్తకాలు చదివి వంట చెయ్యడం,పిల్లల్ని పెంచడం,ప్రేమించడం లాంటివి చెయ్యకూడదంటారు..సారీ ఎవరన్నారో నాకు గుర్తు లేదు అందుకే నేనే అంటున్నాననుకుంటే సరి..ఇలాంటివన్నీ సహజంగా జరిగిపోవాలి..వాటిక్కూడా థియరీలు,ఎనాలిసిస్ లూ వింటే విసుగ్గా ఉంటుంది..కానీ కొన్ని సార్లు చెయ్యకూడదనుకున్న పని చెయ్యాల్సి వస్తుంది..కొత్తగా ఏదో నేర్చుకోవడానికి కాదు..అవసరం లేనివి వదిలించుకునే దిశగా అవసరమైన నిర్దాక్షిణ్యమైన ప్రేరణ కోసం.

ఎన్ని పనులున్నా,ఎంత బిజీగా ఉన్నా,ప్రయాణాల్లో ఉన్నా రోజులో కొన్ని పేజీలైనా చదవడం నాకు రోటీ కపడా ఔర్ మకాన్ అంత అవసరం,వదుల్చుకోలేని వ్యసనం కాబట్టి ఇప్పుడున్న సమయంలో లోతైన ఫిలాసఫీలు చదివే మూడ్ తో పాటు,ఓపికా తీరికా రెండూ లేక ఈ రెండు వారాలూ కాస్త లైట్ రీడ్స్ ను ఎంచుకుని చదవడం జరిగింది..అందులో భాగంగా 'సమయానికి తగు పుస్తకం' కోటాలో రాబోయే రోజులకు సన్నద్ధమవుతూ ఇంట్లో అవసరం లేని సామాగ్రి తీసెయ్యడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ మేరీ కొండో బెస్ట్ సెల్లర్ చదివాను..మునుపు అక్కడక్కడా పేజీలు తిరగేసినా మనకు తెలియని కొత్త విషయాలేవీ చెప్పట్లేదు ఈ అమ్మాయి అని మళ్ళీ ప్రక్కన పడేశాను..కానీ బొత్తిగా మెడకు చుట్టుకున్న సంసార సామాగ్రిని వదిలించుకోవాలంటే మనసొప్పక,  కోండో ఏమైనా మాటసాయం చేస్తుందేమో అని మూసేసిన పుస్తకాన్ని మళ్ళీ తెరిచాను. 

Image Courtesy Google

ఒకే చోట ఉండిపోకుండా ఊర్లు తరచూ మారడం వలన ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే,  ఎప్పటికప్పుడు అవసరంలేని సామాను తీసేసే అవకాశం వస్తుంది,నిజానికి అవకాశం అనేకంటే అవసరం అనడం సబబు..ఎందుకంటే మారిన ప్రతిచోటా ఇంట్లో సామానుకు సరిపడా అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు దొరకడం అంత సులభం కాదు.. When you are choosing what to keep, ask your heart; when you are choosing where to store something, ask your house. అంటారు కోండో.. బాల్కనీ చిన్నదని ఉయ్యాలనూ,కప్ బోర్డులు తగిన విధంగా లేని చోట్ల అవసరం లేని వంట గిన్నెలు,అలంకరణ వస్తువులనూ,బట్టలూ,పుస్తకాలూ ఎవరో ఒకరికి ఇచ్చేసిన సందర్భాలు అనేకం..కానీ మళ్ళీ అక్కడ ఇంటికి తగిన విధంగా వేరే సామాను ప్రోగవుతూ ఉండేది..ఇది గమనించాక మూడేళ్ళ పాటు పండగలనీ,స్పెషల్ అకేషన్స్ అనీ షాపింగ్ జోలికి పోకుండా వార్డ్రోబ్ లు సగానికి సగం ఖాళీ చేశాం.

మధ్యలో కొన్ని పేజీల్లో బట్టలెలా మడతపెట్టాలి,సాక్స్ ని ఏ విధంగా ఫోల్డ్ చెయ్యాలి తదితర విషయాలు చదువుతుంటే కూడా " అమ్మా తల్లీ మాకు ఇవన్నీ అవసరమా" అనిపించింది..దానికంటే నేను చిన్నప్పుడు చదివిన స్వాతి లాంటి మ్యాగజైన్స్ లో ఇలాంటి విషయాలపై కోండో కంటే గొప్పగా రాసిన వాళ్ళకు ఒక పుస్తకం అచ్చు వేసి బెస్ట్ సెల్లర్ చేద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదబ్బా అనిపించింది..మేరీ కోండో ని కూడా 'డి క్లట్టరింగ్' లెసన్స్ చెబుతాను అంటే “Can you actually make money doing that?” / “Do people need lessons in tidying?” అని అడిగారటలేండి. 

The moment you first encounter a particular book is the right time to read it. అంటారు కోండో..కానీ రోజుకో కొత్త పుస్తకం కనిపిస్తే వెనువెంటనే చదవడానికి ఎలా కుదురుతుంది..అందునా చదివిన వాటి కంటే చదవని పుస్తకాలే అపురూపం అంటారు..పుస్తకాల గురించి ఆవిడ మాట వినడం నాకు కష్టమే గానీ గ్రీటింగ్స్ విషయంలో కోండో చిట్కా నాకు నచ్చింది..జపాన్ లో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ చివర లాటరి నంబర్స్ ఉంటాయట..ఆ గ్రీటింగ్స్ అందుకున్నవారు ఒకసారి ఆ కార్డ్స్ లో ఉన్న లాటరీ నంబర్స్ చూసేసుకున్నాక ఇక వాటి అవసరం లేదని అర్థమన్నమాట..ఇంట్లో కుప్పలుగా పేరుకున్న గ్రీటింగ్ కార్డ్స్ ని వదిలించుకోవడానికి ఈ మాటలు నన్ను కన్విన్స్ చేశాయి.

చుట్టూ అవసరం లేని వస్తువులను ప్రోగేసుకుంటూ ఉండడం వల్ల జీవితంలో నిజంగా  అవసరమైన విషయాలు మన దృష్టిని దాటిపోతూ ఉంటాయి..కోండో చాలా చోట పదే పదే ప్రస్తావించిన మాట : "మీకు సంతోషాన్నివ్వనిదేదీ మీకు అవసరం లేదు" ..అలా ఉన్న వస్తువులన్నీ మెడకో డోలు తగిలించుకున్నట్లు మనకు భారమే గానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు..చెత్త ను ఆర్గనైజ్ చేసుకోవడానికి మార్కెట్లో అనేక స్టోరేజ్ స్పేసేస్ లాంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వాటివల్ల ప్రాక్టికల్ గా ఉపయోగం ఉండదు..ఇది నా అనుభవం..ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంటిని చక్కగా ఉంచే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండే వారైతే తప్ప ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు..స్టోరేజ్ స్పేస్ లో పెట్టిన వస్తువులు తీసినవాళ్ళు మళ్ళీ తీసిన చోట పెట్టరు..ఈ కారణంగా ఇంట్లో యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి..ఈ తరహా మనుషుల్ని మూడు రకాలుగా వర్గీకరించారు కోండో..Using this approach, people who can’t stay tidy can be categorized into just three types: the “can’t-throw-it-away” type, the “can’t-put-it-back” type, and the “first-two-combined” type.

కోండో చెప్పిన విషయాలలా ఉంచితే,నేను ఎప్పటికప్పుడు అవసరం లేదనుకున్న బట్టలు,వంట సామాన్లూ,పిల్లవాడి పుస్తకాలూ,స్టేషనరీ లాంటివి తీసేస్తూ ఉంటాను..అందువల్ల చెత్త ఉండే అవకాశం చాలా తక్కువ..ఇక ఆఫీసుకి సంబంధించిన బుక్స్,డైరీస్,పేపర్స్,బిల్స్ లాంటివి ఏవి అవసరమైనవో, ఏవి కాదో తెలీదు గనుక అవి పేరుకుపోతుంటాయి..కనీసం రెండు మూడు నెలలకోసారి నరేన్ కి అవన్నీ అప్పగించి అవసరంలేని పేపర్స్ తీసెయ్యగా మిగిలినవి ఫైల్ చేస్తుంటాను..అందువల్ల అవసరంలేని చెత్త పేరుకుపోవడం తగ్గింది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :

People cannot change their habits without first changing their way of thinking.

If you tidy up in one shot, rather than little by little, you can dramatically change your mind-set.

When people revert to clutter no matter how much they tidy, it is not their room or their belongings but their way of thinking that is at fault.

Putting things away creates the illusion that the clutter problem has been solved.

However, the moment you start focusing on how to choose what to throw away, you have actually veered significantly off course.

Keep only those things that speak to your heart. Then take the plunge and discard all the rest. By doing this, you can reset your life and embark on a new lifestyle.

If you’re mad at your family, your room may be the cause.

To truly cherish the things that are important to you, you must first discard those that have outlived their purpose.

To quietly work away at disposing of your own excess is actually the best way of dealing with a family that doesn’t tidy.

“Does this spark joy?” If it does, keep it. If not, dispose of it.

Presents are not “things” but a means for conveying someone’s feelings.

No matter how wonderful things used to be, we cannot live in the past. The joy and excitement we feel here and now are more important.

As you reduce your belongings through the process of tidying, you will come to a point where you suddenly know how much is just right for you.

Believe what your heart tells you when you ask, “Does this spark joy?”

But when we really delve into the reasons for why we can’t let something go, there are only two: an attachment to the past or a fear for the future.

Life becomes far easier once you know that things will still work out even if you are lacking something.

Monday, March 15, 2021

The train that had wings - M.Mukundan

1960 ల ముందు వరకూ మలయాళీ కథ కేరళ ప్రాకృతిక పరిథుల్ని దాటి ఆవలకు వెళ్ళలేకపోయింది,కానీ తరువాతి కాలంలో వచ్చిన కథలు సంప్రదాయ కేరళ కథను దాటి ఇతర సంస్కృతుల ద్వారా ప్రభావితమై కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాయి..అటువంటి శైలిలో కథలు రాసిన O.V. VIjayan,ఆనంద్ లాంటి కొందరు ఆధునిక మలయాళీ రచయితల్లో ఎమ్. ముకుందన్ కూడా ఒకరు..కేరళ కథంటే కొబ్బరి తోటలూ,తాటిచెట్లు,వరి చేలూ,కాఫీ తేయాకు,అల్లం,మిరియాల తోటలూ,సముద్రతీరాలూ,నీటి కాలువలూ మాత్రమే కాదంటాయి ముకుందన్ కథలు..1960ల  తొలినాళ్ళ అస్తిత్వ వాదాల నడుమ చే గువేరా,మార్క్సిస్టు ,సాత్రే భావజాలాల వల్ల ప్రభావితమైన ముకుందన్ కథల్లో విచ్ఛిన్నమైన సామజిక నియమాలూ,అణచివేత లాంటివాటికి పెద్దపీట వేస్తారు..అందువల్ల భారత దేశానికి, అందునా దక్షిణ భారత దేశానికి చెందిన మూలాలున్న కథలైనప్పటికీ పాశ్చాత్య పాఠకులతో సహా అన్ని వర్గాల పాఠకులూ ఆ పాత్రల్లో తమను తాము సులభంగా ఐడెంటిఫై చేసుకుంటారంటారు అనువాదకులు డోనాల్డ్ ఆర్ డేవిస్ జూనియర్..ఈ  రచనకు ఆంగ్లానువాదం మూలాన్ని పట్టుకోవడంలో పూర్తిగా సఫలీకృతమైందనిపించింది.

Image Courtesy Google

ముకుందన్ కథల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో సంప్రదాయ మలయాళీ సాహిత్యపు వాసనలు ఉండవు..ఈ కథల్లో కొన్ని కేరళ నేపథ్యంలో రాసినవి కాగా 1980ల నాటి ఢిల్లీ సంస్కృతిని ప్రతిబింబించేవి మరికొన్ని..కానీ కేరళ నేపథ్యంలో రాసిన కథల్లో సైతం సంప్రదాయ మలయాళీ కథ దాఖలాలు కనిపించలేదు..'కామన్ మాన్' చుట్టూ తిరిగే ఈ కథలన్నీ బసు ఛటర్జీ సినిమాల్లో అమోల్ పాలేకర్,విద్యా సిన్హా లాంటివాళ్ళను పోలినట్లు అనిపించడం వల్ల నేను చదువుతున్నంతసేపూ వాళ్ళనే ఊహించుకుంటూ చదివాను..ముకుందన్ కథల్లో ఆధునిక సమాజం కాస్మోపోలిటన్ సంస్కృతికి ప్రతిరూపంగా కనబడుతుంది..ఆయన పాత్రలన్నీ సామజిక చట్రంలో చిక్కుకుని ఊపిరాడకుండా కొట్టుకునే సగటు మనుషులే..ముకుందన్ కథానాయకుడు తన ప్రమేయం లేని వ్యవస్థాగతమైన అణచివేతకు గురై సాంఘిక నియమాలను అనుసరిస్తూ,సాంస్కృతిక వైరుధ్యపు ఉచ్చులో చిక్కుకుని దారీతెన్నూ తోచక సతమతమవుతూ ఉంటాడు..కేరళలో ఆ కాలంలో వచ్చిన కొన్ని మూస కథల్లా ముకుందన్ కథలు కేవలం అణచివేతను ప్రతిబింబించేవనుకుంటే పొరపాటే.. I, the Scavenger కథలో కథానాయకుడికి పారిశుధ్య కార్మికుడిగా ఉద్యోగం దొరికినందుకు ఒక దేశానికి ప్రధాని అయినంతగా సంబరపడతాడు..ఈ ప్రభుత్వ ఉద్యోగం దొరకడం వల్ల నేను ప్రతిరోజూ దర్జాగా కాఫీ తాగగలను అనుకుంటాడు..'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ను హైలైట్ చేస్తూ ఎంత చెట్టుకు అంత గాలి అన్న రీతిగా ఎవరి సామజిక స్థితి ఏదైనా ఆనందం ఏ ఒక్కరి సొంతమూ కాదన్నదానికి ఈ కథ చక్కని ఉదాహరణ.

'ఆఫీస్' అనే మరో కథలో తన ఉద్యోగ బాధ్యతల్లో పీకల్లోతు మునిగిపోయి, వృత్తిగతానికీ-వ్యక్తిగతానికీ తేడా మరచిపోయి మరమనిషిలా మారిన కథానాయకుడు ఒక్క రోజు సెలవుని ఏం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటాడు..పనిలో తన ఉనికిని వెతుక్కోవడమే తప్ప,దొరికిన ఏకాంతాన్ని అనుభవించడం చేతకాక చివరకు సెలవురోజు కూడా ఆఫీసుకి ప్రయాణమవుతాడు..తనకు అలవాటైన ఆఫీసు పరిసరాల్లో తన డెస్క్ దగ్గర కూర్చుని పని మొదలుపెట్టాక మాత్రమే అతడికి స్వాంతన చిక్కుతుంది..He started checking old files and ledgers to collect the data. As he sat in the silent room happily working, he forgot it all—Shalini, his friends, the crowded roads . . . and not just that—himself. అంటూ ఈ కథను ముగిస్తారు ముకుందన్.

ముకుందన్ పాత్రలు ఉద్యోగంలోనో,బాంధవ్యాల మధ్యనో,సంసారం సాగరంలోనో,ఏదో ఒక సామజిక చట్రంలో చిక్కుకుని తమ ఉనికిని కోల్పోతాయి..అందువల్ల ఈ కథలన్నీ మనిషి తన అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో పెట్టే పొలికేకల్లా ఉంటాయి..పంజరంలో రామచిలుకల వంటి ముకుందన్ పాత్రలు పంజరపు ఖైదునుండి విముక్తి కోసం తపిస్తూ తమ కాళ్ళతో అప్పుడప్పుడు పంజరపు తలుపుని రక్కుతూ, తమకే గాయాలు చేసుకుంటాయి..విడుదల సాధ్యం కాదని తెలిసి నిరాశతో చతికిలబడతాయి..Parrots అనే కథ ఇటువంటి విముక్తి కోసం ప్రాకులాడే ధనికుడి కథ..విలాసాలతో కూడిన సౌకర్యవంతమైన జీవితం  ఖైదుగా మారగా స్వేఛ్ఛా విహంగంలా నింగిలోకి ఎగిరిపోవడంలో ఉన్న ఆనందం విలువ తెలిసిన మనిషిగా అతడు కారులో ఢిల్లీలో వీధులన్నిటినీ గాలించి పంజరంలో రామచిలుకలన్నిటికీ విముక్తి ప్రసాదిస్తాడు...కాఫ్కా శైలిని పోలిన 'బాత్రూమ్' అనే మరో కథలో ఉన్న జీవితాన్ని అనుభవించకుండా లేనిదాని కోసం ప్రాకులాడే పురుషోత్తమన్ తనను ఈగగా పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు..దేవుడు అతడి కోరికను మన్నించడంతో జరిగే పర్యవసానాలు భలే సరదాగా ఉంటాయి...'టీ' అనే మరో కథ వృద్ధాప్యపు సమస్యలకు అద్దం పడుతుంది..ఈ కథలో మిణుకుమిణుకుమంటున్న వీధిదీపాల వెలుతురులో పడక్కుర్చీలో కూర్చున్న తండ్రీ,వర్షంలో తడుస్తూ ఇల్లు చేరి తండ్రి మొహంలో సంతోషాన్ని చూడలేక నిరాశ చెందిన కొడుకూ,నశించిన ఓర్పు చెంపలపై కన్నీరై ప్రవహించగా చీర కొంగుతో కన్నీళ్ళు ఒత్తుకుంటున్న తల్లీ , ఈ పాత్రలన్నీ సజీవంగా పాఠకుల కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి..ముకుందన్ కథల్లో అందరూ మనకు ఎంతో కొంత పరిచయమున్న వ్యక్తుల్లాగే అనిపిస్తారు...ఇందులో నాకు బాగా నచ్చిన మరో కథ, భౌతికవాదపు కౄరత్వాన్ని చూపించే 'Piss'..మనిషి మృగంగా మారడానికి అట్టే సమయం పట్టదు, క్షణికమైన ఉన్మాదం దయగల వ్యక్తిలో కూడా దాక్షిణ్యాన్ని చంపెయ్యగలదనడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ..ఈ కథ చదివాకా పాఠకులు నైతికత,అనైతికతలకు నిర్వచనాలను సరిచూసుకునే పనిలో పడతారు..'Breast Milk' అనే మరో కథ అమ్మతనాన్నీ,పసిప్రాయాన్నీ హృద్యంగా చూపెడుతుంది.

కొన్ని ముకుందన్ కథల్లో రేమండ్ కార్వర్ శైలి కనిపించింది..స్పష్టమైన ఐడెంటిటీ లేని పాత్రలు తెరపైకి వస్తుంటాయి,కథ జరుగుతుంది,కథ ముగుస్తుంది..కానీ ముగింపులో స్పష్టత ఉండదు..పాఠకులం ఇంకా మిగులు తగులు వాక్యాలేమైనా ఉన్నాయేమో అని వెతుక్కుంటాం..నిరాశే ఎదురవుతుంది..నేను జరిగింది పూసగుచ్చినట్లు అన్ని వివరాలతో సహా చెప్పాను,దాన్ని మీరెలా గ్రహిస్తారో అది మీ ఇష్టం అంటారు రచయిత..నిజానికి కార్వర్ తో పోలిస్తే పదాల పొదుపు విషయంలో ముకుందన్ దే పైచెయ్యి అనిపించింది..ముకుందన్ పాత్రలకు తమకేం కావాలన్న విషయమై స్పష్టత ఉండదు సరికదా అవి సాంస్కృతిక వైవిధ్యపు జీవనగతిని తాళలేక  'గోయింగ్ విత్ ది ఫ్లో' తత్వంతో గాలివాటుకు కొట్టుకుపోతూ ఉంటాయి..కానీ ఆ తరహా జీవితం వల్ల తాము కోల్పోతున్నదేంటో మాత్రం ఆ పాత్రలకు స్పష్టంగా తెలుసు..ఖచ్చితమైన లక్ష్యం లేక తమ ఉనికిని కోల్పోయిన కారణంగా ముకుందన్ పాత్రలన్నీ నైరాశ్యానికి లోనై సందిగ్థతల మధ్య కొట్టుమిట్టాడుతుంటాయి..ఇది 'ఆఫీస్' కథలోనూ, 'రాధా, జస్ట్ రాధా' కథలోనూ స్పష్టంగా కనిపిస్తుంది..రాధ తన ప్రియుడు సురేష్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అతడు ఆమె ఎవరో తెలియదని నిరాకరిస్తాడు..బరువైన హృదయంతో ఇంటికి చేరిన రాధ ఎవరో తమకు తెలియదని ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరిస్తారు..కాఫ్కా పాత్రల్లో ఉండే డిటాచ్మెంట్ తో పాటు ముకుందన్ మార్కు అంతః సంఘర్షణ వెరసి మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్ ఉన్న ఈ కథ, నిరంతరం రూపాంతరం చెందే అస్తిత్వానికీ, కోల్పోయిన ఉనికికీ మంచి ఉదాహరణ..ఇందులో విశేషం ఏమిటంటే,ఈ కథకి ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వకుండా ముకుందన్ ఒక రకమైన మిస్టరీని కొనసాగిస్తారు.."రాధ ఎవరు ?" (మనిషి ఎవరు ?)  అనే ప్రశ్న కి స్పష్టమైన సమాధానం ఇవ్వడం అసాధ్యమని రచయిత అభిప్రాయం అనిపించింది..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో కథలన్నీ దేనికవే ప్రత్యేకంగా అనిపించాయి..ఇందులో చదివిన తరువాత ఆలోచనలో పడెయ్యని ఒక్క కథ కూడా లేదని చెప్పడం అతిశయోక్తి కాదు..మలయాళీ కథను దాని చరిత్రనుండీ,ప్రాంతీయత నుండీ వేరు చేసిన ముకుందన్ కథల్ని చదివి తీరాల్సిందే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు ,

He wove his hand in between her slender fingers, in her slender fingers, in her slender fingers.

There are people with syphilis and elephantiasis in Madras. There are no people with elephantiasis in Delhi. There are people with syphilis. The people with syphilis in Delhi do not lie around on the sidewalks; they do not lie down naked in the scorching sunlight; they do not beg. In Delhi, the people with syphilis wear three-piece suits, smoke pipes, drink imported liquor, and travel around in cars as big as cargo ships. Madras is Delhi naked. Delhi is Madras in a three-piece suit.

I opened the window and stood watching the sleeping city. If the world has any beauty at all, it could only be at night. In the daytime, the world shows its raw face. It casts off its clothes and exposes its naked body covered with festering ulcers. With a sinister grin, it parades before us. The world we see at night is a different one. In the bluish darkness, in the soft moonlight, the night envelopes us with its decorative stars, gentle breezes, and silence—this is the world I like.

"No. Up to May 1968, Europe was a fucking desert. A desert populated by snobs, pseudointellectuals, and pseudowhores. Europe is a sham. Their existentialism is bullshit. No whitey has ever said anything that wasn't already said in the Gita."

Tuesday, March 9, 2021

Klara and the Sun - Kazuo Ishiguro

బ్రిటిష్ (జాపనీస్) రచయితా,నోబుల్ గ్రహీతా కజువో ఇషిగురో 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్' చదివి చాలా ఏళ్ళైపోయింది..ఆ రచన బాగా నచ్చడంతో అప్పట్లో కొత్తగా ప్రచురించబడిన ఆయన మరో రచన 'బరీడ్ జెయింట్' కూడా చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యలేక ఉస్సూరుమంటూ సగంలో వదిలేశాను..మళ్ళీ ఇంతకాలానికి ఇషిగురో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి పుస్తకం రాశారని చదివి టెక్నలాజికల్ రెవల్యూషన్ మీద ఆయన అభిప్రాయాలు ఏమై ఉంటాయా అనే కుతూహలం కలిగింది..మునుపు చదివిన అయాన్ మాక్ ఇవాన్ 'మెషీన్స్ లైక్ మీ' లో క్రొత్తగా ఆవిర్భవించిన 'హ్యూమనోయిడ్ రోబోట్' కి హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చర్చించారు..ఈ రచనలో ఇషిగురో దాని తదుపరి దశపై దృష్టిసారిస్తూ మానవ సమాజంలో పూర్తి స్థాయిలో మమేకమై జీవిస్తున్న రోబోట్స్ వైపు నుండి ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు.  

Image Courtesy Google

ఈ బుక్ గురించి నేను నరేన్ తో మాట్లాడుతూ బ్రెయిన్ కోడ్ ని క్రాక్ చెయ్యడం, అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ని డీకోడ్ చెయ్యడం శాస్త్రజ్ఞుల వల్ల అయ్యే పని కాదేమో అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు హైందవ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికత మార్గంలో నడిచే వ్యక్తిగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేశారు..హ్యూమన్ కాన్షియస్నెస్ (స్పృహ/ఆత్మ ) మనిషికి ఒక్క రోజులోనో లేదా కొన్ని సంవత్సరాల్లోనో సంక్రమించింది కాదు,తరతరాలుగా జీవితచక్రంలో భాగంగా జననమరణాల మధ్య అనేక జీవితాలను కలుపుకుంటూ ఏర్పడినది..హైందవంలో 'పూర్వజన్మ వాసనలు' అనడం తరచూ వింటుంటాం,ఎప్పుడైనా కొత్తవారిని చూసినప్పుడు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించడం లాంటివి అన్నమాట..ఇదే విధంగా హ్యూమనోయిడ్ రోబోట్స్ కి సంబంధించిన కాన్షియస్నెస్ కూడా మానవ సమాజంలో భాగంగా ఉంటూ,ఆ నియమాలను పాటిస్తూ క్రమేపీ 'ఎవోల్వ్' అవ్వవలసి ఉంటుంది..ఇది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు,బహుశా కొన్నేళ్ళు పట్టొచ్చు, అప్పటికి అవి మనం ఊహించలేనంతగా మానవసమాజంలో భాగంగా మారిపోనూవచ్చు.

ఆర్టిస్టు లక్ష్యం జరిగే పరిణామాల్ని పాఠకుల దృష్టికి తీసుకువచ్చి వారిలో ఆలోచనలు రేకెత్తించడమే అయితే ఈ రచన ద్వారా ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించారు ఇషిగురో..కథ విషయానికొస్తే క్లారిస్సీ అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురు జోసీ (14) కి తోడుగా ఒక అడ్వాన్స్డ్ మోడల్ AF క్లారా అనే హ్యూమనోయిడ్ రోబోట్ ని కొనుగోలు చేస్తుంది..జోసీ,క్లారిస్సీ,ఇంటి వ్యవహారాలు చూసుకునే మెలనీలతో కలిసి నాలుగో సభ్యురాలిగా ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది క్లారా..క్లారా తన శక్తిని సూర్యరశ్మి ద్వారా గ్రహిస్తూ ఉంటుంది..భవిష్యత్తు సమాజాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించి చేసిన ఈ రచనలో స్త్రీ పురుషులిద్దరూ ఉన్నతమైన వృత్తుల్లో ఉంటూ ఉంటారు,భార్యాభర్తలు సహజంగా కలిసి జీవించరు..బహుశా జనాభా నియంత్రణ కారణంగా అందరికీ ఒక్క సంతానమే ఉంటుంది..అందరి ఇళ్ళల్లో పిల్లల కోసం ప్రత్యేకించి, ఒంటరితనం లేకుండా వారికి చేదోడువాదోడుగా ఉండడానికి క్లారా లాంటి AF హ్యూమనోయిడ్ రోబోట్స్ ఉంటాయి..చాలా అరుదుగా ఇరుగుపొరుగు పిల్లలూ,పెద్దలూ ఒక చోట సమావేశమవుతుంటారు..యంత్రాలతో సహజీవనం అలవాటైన పిల్లలు తోటి పిల్లల్ని కలిసినప్పుడు జాలీ,దయా,కరుణా,సహానుభూతి లాంటి లక్షణాలేమీ లేకుండా ఆత్మన్యూనతతో చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు..అటువంటి పిల్లల చెడు ప్రభావానికి మంచి మనసున్న జోసీ లోనుకాకుండా ఆమె బాల్య స్నేహితుడు రిక్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు..రిక్ కు అందరి పిల్లల్లా AF ఉండదు..అతడి తల్లి హెలెన్ అనారోగ్యం కారణంగా డబ్బు లేక అందరి పిల్లల్లా అతడు ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలు నేర్చుకోలేడు..అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించలేని కారణంగా మిగతా కుటుంబాలు రిక్ నూ అతడి తల్లినీ వెలివేసినట్లు చూస్తుంటారు..నేడు కంప్యూటర్ లేని ఇల్లు లాగే A child like that, with no AF, would surely be lonely అని రిక్ గురించి వాపోయేంతగా AI మనుషుల జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేస్తుంది..ఈ పాత్రలన్నీ తమ భవసాగరాల్ని ఈదే క్రమంలో తలమునకలుగా ఉన్నప్పుడు క్లారా ఒక ప్రక్క జోసీ గురించి తెలుసుకుంటూ,మానవ సమాజపు నియమాలను నేర్చుకుంటూ ఉంటుంది...As I say, these were helpful lessons for me. Not only had I learned that ‘changes’ were a part of Josie, and that I should be ready to accommodate them, I’d begun to understand also that this wasn’t a trait peculiar just to Josie; that people often felt the need to prepare a side of themselves to display to passers-by – as they might in a store window – and that such a display needn’t be taken so seriously once the moment had passed...ఇదిలా ఉండగా ఆరోగ్యం విషమించిన జోసీ ని రక్షించుకోవడానికి సూర్యునితో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటుంది క్లారా..ఆమె ఒప్పందం ఏమిటి ? జోసీ కోలుకుంటుందా లేదా ? ఇదంతా మిగతా కథ.

ఇక ఇషిగురో శైలిలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పే వచ్చిందనిపించింది..నేను చదివిన 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్' లో అంతర్లీనంగా ఉన్న గాఢత ఇందులో అణుమాత్రం కూడా లేదు..బహుశా అది మనుషుల గురించీ ఇది మెషీన్స్ గురించీ కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఫిక్షన్ కథలో గాఢతను ఆశించడం పిచ్చితనం కావచ్చు..ఇకపోతే పుస్తకం సగానికి వచ్చేసరికి ముఖ్యంగా రిక్,జోసీల స్నేహాన్నీ,సంభాషణలనూ చదువుతున్నప్పుడు కాస్త సాగదీతగా అనిపించింది..కానీ పట్టాలు తప్పిన నేరేషన్ పగ్గాలు మళ్ళీ త్వరలోనే చేజిక్కించుకుని మిగతా పేజీలను ఆసక్తికరంగా మలిచారు ఇషిగురో..కథగా ఎంచుకున్న అంశం ఎంత గొప్పదైనప్పటికీ ఇషిగురో కథను చెప్పడంలో సరళమైన శైలినే అవలంబిస్తారు..పాఠకుల్నిరోలర్ కోస్టర్ రైడ్ లకు తీసుకెళ్ళి షాక్ కి గురిచెయ్యడానికి ఎంతమాత్రమూ ఇష్టపడని ఆయన మామూలు సంభాషణల ద్వారానూ,తేలికపాటి మెటఫోర్ల సాయంతోనూ కథను చెప్పే తీరు అందరికీ ఆమోదయోగ్యంగా అయితే ఉండదు..ఉదాహరణకు రోబోట్ క్లారా,క్లారిస్సీ మోర్గాన్ ఫాల్స్ ని సందర్శించే క్రమంలో,ఆ ప్రాంతానికి దగ్గర్లో కంచె అవతల పచ్చికబయలులో గడ్డి మేస్తున్న ఎద్దుని చూసిన క్లారా ఆలోచనల్ని అంతరించిపోతున్న ప్రపంచానికి మెటాఫోర్ లా వాడడం ఇషిగురో ప్రత్యేకత.."As these words swept through my mind, I thought of the terrible bull on the way up to Morgan’s Falls, of its horns and its cold eyes, and of the feeling I’d had at that moment of some great error having been made to allow a creature so filled with anger to stand unconstrained up on the sunny grass." అయాన్ మాక్ ఇవాన్ ఇటువంటి ఒక కథనే చెప్పడానికి చేసిన కఠోరమైన రీసెర్చ్ ఇషిగురో చెయ్యలేదు..అందువల్ల చారిత్రాత్మక,శాస్త్రసాంకేతికపరమైన అంశాలు పుష్కలంగా ఉన్న ఇవాన్ రచన కంటే ఇషిగురో రచన సాధారణ పాఠకులకు మరికొంత సులభంగా చేరువై AI పరిణామాలనూ,పర్యవసానాలనూ అర్ధం చేసుకోడానికి తోడ్పడుతుందనిపించింది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనిషికి సమర్ధవంతమైన ప్రత్యామ్నాయం కాగలదా ? అనే ఒకే ఒక్క  ప్రశ్నను ఆధారంగా చేసుకుని ఈ కథ మొత్తాన్నీ రాశారు ఇషిగురో..చివర్లో ఆయనే ఇచ్చిన  సమాధానం కూడా గొప్పగా ఉంటుంది..రిక్ తల్లి హెలెన్ క్లారా (రోబోట్) తో అనే ఈ మాటలు  సహజసిద్ధమైన వాతావరణం,మనుషులూ అంతరించిపోయి నలువైపులా కృత్రిమత్వం చోటు చేసుకున్న భవిష్యత్ సమాజంలోని మనిషి నిరాశానిస్పృహలకు అద్దంపడతాయి..‘Just now, Klara, when I appeared to be in a dream. It wasn’t any dream, you know. I was looking out there’ – she pointed the shoe behind me – ‘and I was recalling. Turn and look all you like, I assure you there’s nothing there just now. But once, some time ago, I was looking out there and I did see something.’..ఈ రచనలో  మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇషిగురో వన్నెగట్ ,టోల్కీన్ , వర్గాస్ లోసా ల బాటలో టెక్నలాజికల్ అడ్వాన్స్మెంట్ పట్ల విముఖత వ్యక్తం చెయ్యలేదు..శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరిట వచ్చిన సౌకర్యాలను అనుభవిస్తూ దాన్ని తూలనాడలేదు..తన అభిప్రాయాలను రెండువైపుల నుంచీ చర్చించి ఊరుకున్నారు తప్ప AI పట్ల స్పష్టమైన 'స్టాండ్' తీసుకోడానికి నిరాకరించారు..అభివృద్ధి పేరిట జరిగే వినాశనాన్ని వేలు పెట్టి చూపెడుతూనే, "అనివార్యం అయిన ఇట్టి విషయమును గూర్చి శోకించ తగదు" అంటూ కృష్ణ పరమాత్ముడిలా గీతా బోధ కూడా చేసినట్లనిపించింది..ఈ పుస్తకంలో మొదటి భాగం కంటే రెండో భాగం ఆసక్తికరంగా ఉంటుంది..చివరకు ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుందా అనుకుంటూ బుగ్గలు నొక్కుకోవడం పాఠకులు వంతవుతుంది. 

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

It’s for the customer to choose the AF, never the other way round.

‘Let me tell you something, Klara. Children make promises all the time. They come to the window, they promise all kinds of things. They promise to come back, they ask you not to let anyone else take you away. It happens all the time. But more often than not, the child never comes back. Or worse, the child comes back and ignores the poor AF who’s waited, and instead chooses another. It’s just the way children are. You’ve been watching and learning so much, Klara. Well, here’s another lesson for you. Do you understand ?'

It must be great. Not to miss things. Not to long to get back to something. Not to be looking back all the time. Everything must be so much more…

‘What I saw was Chrissie, Josie’s mother, that is. I saw her come out of the grass, just over there, holding someone by the arm. I’m explaining myself rather poorly. What I mean is, it was as if this other person had been trying to run away, and Chrissie had been after her. And she’d caught hold of her, but hadn’t been able quite to stop her. So they’d both of them tumbled out, so to speak. Just over there, out from the grass onto our land.

The trouble is, Chrissie, you’re like me. We’re both of us sentimental. We can’t help it. Our generation still carry the old feelings. A part of us refuses to let go. The part that wants to keep believing there’s something unreachable inside each of us. Something that’s unique and won’t transfer. But there’s nothing like that, we know that now. You know that. For people our age it’s a hard one to let go. We have to let it go, Chrissie. There’s nothing there. Nothing inside Josie that’s beyond the Klaras of this world to continue. The second Josie won’t be a copy. She’ll be the exact same and you’ll have every right to love her just as you love Josie now. It’s not faith you need. Only rationality. I had to do it, it was tough but now it works for me just fine. And it will for you.'

‘Then let me ask you something else. Let me ask you this. Do you believe in the human heart? I don’t mean simply the organ, obviously. I’m speaking in the poetic sense. The human heart. Do you think there is such a thing? Something that makes each of us special and individual? And if we just suppose that there is. Then don’t you think, in order to truly learn Josie, you’d have to learn not just her mannerisms but what’s deeply inside her? Wouldn’t you have to learn her heart?’

AI కు వ్యతిరేకంగా జీవిస్తూ మైనారిటీ ఫాసిస్టు ముద్ర వేయించుకున్న జోసీ తండ్రి పాల్, క్లారా తో అనే మాటలు : I think I hate Capaldi because deep down I suspect he may be right. That what he claims is true. That science has now proved beyond doubt there’s nothing so unique about my daughter, nothing there our modern tools can’t excavate, copy, transfer. That people have been living with one another all this time, centuries, loving and hating each other, and all on a mistaken premise. A kind of superstition we kept going while we didn’t know better. That’s how Capaldi sees it, and there’s a part of me that fears he’s right. Chrissie, on the other hand, isn’t like me. She may not know it yet, but she’ll never let herself be persuaded. If the moment ever comes, never mind how well you play your part, Klara, never mind how much she wishes it to work, Chrissie just won’t be able to accept it. She’s too…old-fashioned. Even if she knows she’s going against the science and the math, she still won’t be able to do it. She just won’t stretch that far. But I'm different. I have…a kind of coldness inside me she lacks. Perhaps it’s because I’m an expert engineer, as you put it. This is why I find it so hard to be civil around people like Capaldi. When they do what they do, say what they say, it feels like they’re taking from me what I hold most precious in this life. Am I making sense?

‘Lifted or not, genuine ability has to get noticed. Unless this world’s completely crazy now.'

We’re protesting the proposal to clear the Oxford Building. There’s currently four hundred and twenty-three post-employed people living inside it, eighty-six of them children. Neither Lexdell nor the city have offered any reasonable plan regarding their relocation.

Perhaps all humans are lonely. At least potentially.

As these words swept through my mind, I thought of the terrible bull on the way up to Morgan’s Falls, of its horns and its cold eyes, and of the feeling I’d had at that moment of some great error having been made to allow a creature so filled with anger to stand unconstrained up on the sunny grass.

Friday, March 5, 2021

Moustache - S.Hareesh

ఈశాన్య కేరళలోని వయనాడ్ లో ఒక మారుమూల ప్రాంతంలో కొంతకాలం ఉన్న కారణాన మాకు కేరళ పల్లె జీవితం సుపరిచితమే..చెన్నై నుండి సరాసరి కోళికోడ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుండి క్యాబ్లో పచ్చని ప్రహరీలూ,కొండలూ కోనలూ దాటుకుంటూ కాఫీ,మిరియం,తేయాకు తోటల మధ్య కొలువుదీరిన మా ఇల్లు చేరేసరికి ఉన్నట్లుండి మాకు అలవాటైన ప్రపంచం ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లనిపించింది..అది పూర్తిగా వేరే లోకం..మీకు ఓపికున్నప్పుడు ఇంస్టాగ్రామ్,హోమ్ మేకర్స్ ఉటోపియా బ్లాగ్స్ చూస్తే కొన్ని పోస్టులూ,ఫోటోలూ కనిపిస్తాయి..సరే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే మలయాళీ రచయిత ఎస్.హరీష్ నన్ను మరోసారి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి తీసుకొచ్చారు..ఎస్.హరీష్ మలయాళ రచన 'మీష'(మీసం) 2020 సంవత్సరానికి గాను THE JCB PRIZE FOR LITERATURE ను గెలుచుకుంది (2018 లో బెన్యామిన్ 'జాస్మిన్  డేస్' కూడా ఇదే అవార్డు గెలుచుకుంది)..నేను గత ఏడాది చదివిన ఎన్.ప్రభాకరన్ రచన 'ది డైరీ ఆఫ్ ఎ మలయాళీ మాడ్' మాన్ ని ఆంగ్లంలోకి అనువదించిన జయశ్రీ కలథిల్ ఈ రచనను కూడా అనువదించారు.

Image Courtesy Google

పుస్తకం విషయానికొస్తే పులయన్ (దళిత) కులానికి చెందిన కథానాయకుడు వవచన్ ఒక నాటకంలో పోలీస్ వేషం వేసే క్రమంలో మీసాన్ని పెంచుతాడు..నిజానికి పులయన్ తెగలో మీసం పెంచడం నిషిద్ధం..నాటకంలో డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం రెండు సీన్స్ల లో మాత్రం కనిపించే వవచన్ ను చూసి ముందు వరుసలో ఉన్న ప్రేక్షకులు,ముఖ్యంగా ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు భయభ్రాంతులవుతారు..తరతరాలుగా అణచివేతకు గురైన జాతుల దళితాగ్రహానికి ప్రతీకగా సాక్షాత్తూ దశకంఠుడిలా (రావణుడు కూడా దళితుడని చివరి మాటలో రచయిత అంటారు-మన పురాణాల్లో రావణుడు బ్రాహ్మణుడు కదా ఇందులో దళితుడంటున్నారేమిటని అనుమానం రావచ్చు..'పులయన్' కులంలాగే కేరళలో వందలకొద్దీ ఆదివాసీ దళిత తెగలు ఉంటాయి..చాలా తెగలకు విడివిడిగా ప్రత్యేకమైన పురాణాలూ,గాథలూ ఉంటాయి..వారి పురాణాల్లో రావణుడికి సమున్నతమైన స్థానమే ఉంది..మనందరం ప్రామాణికంగా తీసుకునే పురాణాలు కాకుండా వీళ్ళు లోకల్ folklore ని ఎక్కువ నమ్ముతారు..వీళ్ళంతా ఆర్య సంస్కృతికి ప్రత్యర్థిగా నిలిచిన రావణుణ్ణి తమ జాతికి ఆదిగురువుగా,ప్రతినిధిగా భావిస్తారు..బహుశా అందుకే రావణుడు దళితుడని కొందరి నమ్మకం..హరీష్ కథ ఆ సంస్కృతిని ప్రతిబింబించేదిగా రాశారు కాబట్టి వారి నమ్మకం ప్రకారం రావణుణ్ణి దళితుడుగా పోల్చి ఉంటారు.)..అగ్నిగోళాల్లాంటి ఎర్రని కళ్ళతో స్టేజి మీద కనిపించిన వవచన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాడు..కానీ నాటకం ముగిసిపోయినప్పటికీ వవచన్ తన మీసం తీసెయ్యడానికి నిరాకరించి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు..దేశదిమ్మరిలా చెట్లమ్మటా పుట్లమ్మటా తిరుగుతూ అకస్మాత్తుగా ఎక్కడో అక్కడ ప్రత్యక్షమై మాయమైపోయే అతణ్ణి గూర్చి కుట్టనాడ్ ప్రాంతంలో చిలవలు పలవలుగా కథలు ప్రచారంలోకి వస్తాయి..ఎక్కడేం నేరం జరిగినా అది 'మీసం' గా పేరు మారిపోయిన వవచన్ ఖాతాలో పడిపోతూ ఉంటుంది..ఇవేమీ తెలియని మీసం మాత్రం తాను ప్రేమించిన సీత కోసం వెతుకుతూ అసమానతలకూ,అణచివేతలకూ బహుదూరమైన మలయ (మలబార్) కు వెళ్ళే దారి వెతుక్కుంటూ కాలినడకన తిరుగుతుంటాడు..మరి అతడికి సీత కపించిందా ? మీసం మలయకు వెళ్ళగలిగాడా అన్నది మిగతా కథ.

బ్రిటిషు వారి కాలంలో కూర్చిన ఈ కథను నైరుతి కేరళ లోని సముద్రమట్టానికి దిగువన ఉన్న వ్యవసాయ క్షేత్రమైన కుట్టనాడ్ ప్రాంతం నేపథ్యంలో రాశారు..ఇందులో ఆనాటి కేరళలో కులమత వ్యవస్థల తీరుతెన్నులూ,వర్ణవ్యవస్థ పటిష్టంగా ఉన్న సమాజంలో సాంఘిక దురాచారాలూ ప్రధానాంశాలుగా కనిపిస్తాయి..భారత దేశంలో బ్రిటిషు సంస్కృతికి పునాదులు పడిన కాలం గనుక సాంస్కృతిక సంఘర్షణల నేపథ్యంలో కూడా ఇందులో అనేక పిట్ట కథలుంటాయి..ఇకపోతే కేరళ గురించి ఏ కథ చెప్పాలన్నా జీవావరణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చెప్పాలనుకోవడం అసాధ్యమేమో అనిపిస్తుంది..అదృష్టవశాత్తూ ఇప్పటికీ అక్కడి మనుషుల జీవితంలో ప్రకృతి కూడా ఒక భాగం..వాసుదేవన్ నాయర్ రచనల్ని చూసినా,బషీర్ కథల్ని చదివినా ప్రతీ రచనలోనూ పాత్రలతో సరిసమానంగా దేవభూమిలోని ప్రకృతి కూడా కీలక పాత్ర పోషిస్తూ కనిపిస్తుంది..కేరళ రాజకీయాలూ,సామజిక విధి విధానాలూ ఇవన్నీ పర్యావరణంతో విడదీయలేనంతగా ముడిపడి ఉంటాయి,నేను చూసినంతవరకూ వాయనాడ్ లో ఇప్పటికీ ఉన్నాయి..అందుచేత ఈ రచనలో ప్రత్యేకత ఏమిటంటే,ఇది ఈ మధ్య వ్యక్తి ప్రధానంగా వస్తున్న అనేక మూస ధోరణి రచనల్లా కేవలం వవచన్ కథ మాత్రమే కాదు..ఇది అతడి చుట్టూ ఉన్న మనుషుల కథ,అతడి సంస్కృతి కథ,అతడి చుట్టూ ఉన్న ప్రతి చెట్టు,పుట్టా,పక్షీ,నేలా,నీరూ,గాలీ కథ.

ఈ పుస్తకంలో హరీష్ 'మీసం' కథ చెప్పడానికి చాలా హోంవర్క్ చేసి కేరళకు సంబంధించిన సాంస్కృతిక వివరాలు అనేకం పొందుపరిచారు..ఈ రచనను ఒక విధంగా పాఠకులకు 'సాంస్కృతిక విందు' అనవచ్చు..కానీ వాసుదేవన్ నాయర్ కథలకు భిన్నంగా ప్రకృతి నాడి తో పాటుగా పాత్రల భావోద్వేగాలను కూడా పట్టుకోవడంలో హరీష్ విఫలమయ్యారనిపించింది..కథలో పట్టు లేకపోవడం వల్ల నేరేషన్ ప్రవాహంలా సాగదు..ఉదాహరణకు బెన్యామీన్ 'గోట్ డేస్' లా ఇది 'పేజ్ టర్నర్' అస్సలు కాదు..అనేక పిట్టకథల్ని ఒక చోట ఏర్చి కూర్చిన కారణంగా సగం పుస్తకం పూర్తైనప్పటికీ పాఠకులు అనేక పాత్రల మధ్య ఎవరి గురించి చదువుతున్నారో అర్ధంకాక మరోసారి వెనక్కి వెళ్లి చూసుకునే పరిస్థితి అక్కడక్కడా ఎదురవుతుంది..ఫిక్షన్ చదవడానికి కూర్చున్న పాఠకురాలిగా నేనైతే కథకుడికి తన కథే ప్రధానంగా ఉండాలి అనుకుంటాను..మూల కథను దాటి ఏ వివరాలైనా అవసరార్ధం అద్దే అదనపు హంగులై ఉండాలి..అంటే కథకుడు తన కథలో  సాంస్కృతిక వివరాలు అంతర్భాగంగా ఉండేలా చూసుకోవాలి గానీ పాఠకుల్ని క్లాసులో కూర్చోపెట్టి చరిత్ర,భౌగోళిక శాస్త్రాల పాఠాలు వల్లెవేస్తున్నట్లు ఉండకూడదు..ఈ రచనలో కథ మీద కల్చర్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది..రెండిటినీ సమన్వయం చేసే క్రమంలో హరీష్ కఠోర పరిశ్రమ పుస్తకమంతా కనిపిస్తుంది..ఈ మధ్య వస్తున్న కొన్ని కథల్ని పరిశీలిస్తే,అయితే మూలాల్ని మొదలంటా నరికేసి మొండి స్కెలిటన్ లాంటి పాత్రలతో ఆకాశానికి భూమికీ మధ్య పేరు తెలియని ప్రాంతంలో కథనాన్ని నడుపుతున్నారు..లేదా ఇలా సాంస్కృతిక వివరాలను దట్టించి కథలో ఉండవలసిన బలాన్ని విస్మరిస్తున్నారు..ఇకపోతే ఈ పుస్తకంలో అడుగడుక్కీ ఎదురయ్యే మలయాళీ పదజాలం మొదటి 50-60 పేజీల్లో పంటిక్రింద రాయిలా తగిలి నేరేషన్ ను సాఫిగా సాగనివ్వక గతుకుల రోడ్డు ప్రయాణంలా అనిపిస్తుంది..అవి తిట్టుకోకుండా ఓపిగ్గా దాటేస్తే హరీష్ ప్రపంచం మనకు కాస్త  అలవాటవుతుంది.

నిజానికి ఈ కథలో బలం బలహీనతా రెండూ సాంస్కృతిక వివరాలే అనిపించాయి..రచయితకు తన చుట్టూ ఉన్న ప్రపంచంపట్ల కుతూహలం ఉండాలనీ,దృష్టిని దాటిపోనివ్వకుండా ప్రతి చిన్న వివరాన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలనీ ,మనుషుల పట్లే కాకుండా సమస్త జీవజాలం పట్లా కూడా సహానుభూతి ఉండాలనీ హరీష్ రచన సాధించిన విజయం చెప్పకనే చెబుతుంది..హరీష్ కథలో తనకు తెలిసిన ప్రపంచాన్ని తనకు చేతనైన రీతిలో పరిచయం చెయ్యాలనే నిజాయితీ తప్ప పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే  శైలి గానీ,ఉన్నత సాహితీ విలువల లాంటివి గానీ ఏమీ కనబడవు, ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకుని అందులో అందరి జీవితాలకూ యధాతథంగా అక్షరరూపం ఇస్తే అది హరీష్ 'మీసం' కథలా ఉంటుంది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు : 

The most significant piece of knowledge that Vidurar, the venerated scholar before the days of Google and Encyclopaedia Britannica, the steam engine and the polio vaccine, held was that the earth was flat and was supported on the shoulders of seven elephants. Even a five-year-old knows so much more than that these days!

I was all alone, like a man in a spaceship. No one in this universe knew I was here, and if I were to disappear, if God were to wipe me off with a damp cloth like a drawing on a blackboard, only a handful of people would remember me enough to notice my absence, and when they too were gone, no one would even know that I had existed. The vast majority of people who lived thousands, ten thousands of years ago have no names or identities. God has wiped them off the face of this earth, from people’s paltry memories.

Once it was out of sight, I began to wonder whether I had actually seen it or whether I had conjured it up in the sky of my imagination. I had to tell someone about this – it was the only way I could be sure that I had experienced this. What empty creatures we are! Our experiences and thoughts gain relevance only if endorsed by others; our lives lived only in the thoughts and memories of a handful of people who would also be dead and gone in a short period of time.

Why do we read stories and novels, I asked the audience. In order to enjoy a good story, I said, answering my own question. There was nothing else beyond that. Why did we read Poombatta or Ambiliyammavan as children, or listen to our grandmothers’ stories? Just for the enjoyment of a good story. Children’s stories usually ended with a moral, but that was only to deceive parents into thinking that stories were edifying. It is the same yearning that leads one to Panchatantram or to a novel by Pottekkad – the yearning for a good story. The idea that reading provides us with a compass for politics, philosophy, spirituality, or insight into life and all that was pure nonsense. But we don’t admit this. Instead, we read Joyce’s Ulysses with the help of guidebooks, and pretend to belong to some exclusive group who have understood the book, devour Benyamin’s Adujeevitham in one sitting only so that we can pick it apart. As far as I was concerned, I told my audience, the best stories in the world are those in One Thousand and One Nights, or stories like that of the hare and the tortoise, or the crocodile who plotted to eat the sweet heart of the monkey, and that nothing else piqued my curiosity as much as these stories.

‘Speechifying is not my medium. Writing is. Even Borges has said that writing is not a faithful copy of life, and that if a Bengal tiger in a story has three legs and speaks Sanskrit, so be it.’‘I’ve told you before,’ Joseph said. ‘Either stay away from these events and sit at home, and people will think you are an intellectual. Or stop saying crazy things at these events. You’re damaging your own reputation.'

He had always remained here, he felt, just like his ancestors who had only ever travelled as far as Pambadi to the east, Alappuzha to the west, Kottayam to the south and Vaikom to the north. Perhaps that was enough, he mused. Why leave one’s village and its intimate circles of familiarity, the people who knew one’s ancestors and every moment from one’s birth?

’I couldn’t believe the kind of nonsense his class teacher was telling him. Don’t they realise how dangerous it is to fill the minds of small children with rationalism? Rationalism is the most problematic philosophy in the world, one that completely kills a person’s imagination and instincts. It might explain the functioning of machines, but can it explain human beings? Could a rationalist ever write a story or a poem, or experience the intensity of the endless quest for love? Wouldn’t a rationalist, on hearing the story of the fly and the cat that cooked kanji, argue that they would be unable to wash the rice properly since they don’t have hands, and that they wouldn’t know the use of fire? One can only hope that rationalism doesn’t interfere in his bedroom as he lies with his wife. There was a rationalist in Kerala who had proclaimed that if he were ever able to build the rationalist nation he imagined, only men and women in full health would be allowed to procreate, so that there would be a generation of perfect human beings. I don’t see much of a difference between him and Hitler.

He’s hiding there. He’s scared of people,’ the white turtle continued.‘And they are scared of him,’ said the black turtle. ‘I don’t understand these human beings.’‘They’re mad, the lot of them. Never at peace. I don’t understand why they can’t eat and drink and be happy with these canals and fields like the rest of us. Instead they rush about all over the place. Haven’t you seen them talking to themselves when they think no one is looking?’‘They think the earth is round!’ The black turtle struggled to control its laughter.

Moustache had remained silent all through this, which made Avarachan suspicious. One must be wary of the silent types because their minds roil like an ocean. Hollow things make the most sound – a coconut shell, drums, a conch. Those whose minds are empty jabber on in order to cover up the emptiness, whereas those who are caught up in the agony of their own thoughts speak only to themselves.

Besides, if lots of people do strange things, that’s supposed to be all right. But if one person does something different, then everyone starts meddling. One is allowed to be crazy only if the whole land is crazy.

Too many people together can do nothing, not even kill a snake. Fearful people feel there is strength in numbers, but all they do is chatter amongst themselves in an effort to keep their fear at bay.