మనిషి ఉనికిని ప్రధానంగా నిర్వచించేవి అనుభవాలూ,జ్ఞాపకాలూను..కానీ న్యూరాలజీకి సంబంధించిన వ్యాధుల కారణంగా ఈ రెండూ కోల్పోయిన మనిషి శరీరం ఒక ఖాళీ చేసిన ఇంటితో సమానం..ఎటువంటి అలికిడీ లేకుండా బావురుమంటున్న ఇంట్లో నాలుగ్గోడల మధ్యా ఊపిరాడకుండా తాను ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే మనిషి ఆరాటం,అప్పుడే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసిబిడ్డలా ఉంటుంది..సాంకేతిక విప్లవం వెన్నుదన్నుగా వైద్యవిజ్ఞాన రంగం ఎంత అభివృద్ధి సాధించినా వృద్ధాప్యానికీ,మృత్యువుకూ విరుగుడు కనిపెట్టలేకపోయింది..తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని భ్రమించే మనిషిని 'హ్యూమన్ మోర్టాలిటీ' ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉంది..అదే విధంగా న్యూరోసైన్సెస్ కూడా ఎంత అభివృద్ధి సాధించినా మానవ మస్తిష్కపు పద్మవ్యూహాన్ని ఇంకా ఛేదించలేకపోయిందనే అంటారు ప్రముఖ బ్రిటిష్ న్యూరోలజిస్ట్ ఆలివర్ సాక్స్..సాక్స్ 1985లో తన పేషెంట్స్ క్లినికల్ హిస్టరీ గురించి రాసిన కొన్ని వ్యాసాలు 'The Man Who Mistook His Wife for a Hat' పేరిట ప్రచురించారు..ఈ పుస్తకంలో ఆయన తన పేషెంట్స్ కి సంబంధించిన న్యూరోలజీ సంబంధిత వ్యాధులూ,వాటి లక్షణాలను గురించి విస్తృతంగా చర్చించారు..ఈ పుస్తకం చదువుతున్నప్పుడు జాన్ నాష్,ఐన్స్టీన్,అలాన్ ట్యూరింగ్ లాంటి కొందరు మేథావులు గుర్తొచ్చారు..అటువంటి వ్యక్తుల అసాధారణమైన మేథోశక్తికీ,వాళ్ళ బ్రెయిన్ ఫార్ములేషన్ కీ సంబంధం ఉండడం కేవలం ఒక అపోహ కాదని అనిపిస్తుంది.
ఇందులో Korsakov's syndrome,అమ్నిసియా,అఫేజియా,అగ్నోసియా,Tourette's syndrome వంటి పలు న్యూరోలాజికల్ డిజార్డర్స్ గురించి అనేక మంది పేషెంట్స్ కేస్ హిస్టరీస్ ఆధారంగా రాసిన వ్యాసాలున్నాయి..కొందరికి ఎంత వయసొచ్చినా రాయడం,చదవడం లాంటి అతి సాధారణ విషయాల్లో ఇబ్బందులు ఉండడం,లేని శరీరావయవాలు ఉన్నట్లుగా (ఫాంటమ్స్) గా కనిపించడం,జ్ఞాపకశక్తి పూర్తిగా పోయి తమ ఉనికిని మర్చిపోవడం,ముఖాలను పోల్చుకోలేకపోవడం,అన్ని శరీరావయవాలు సరిగ్గానే ఉన్నప్పటికీ అవి ఉన్నాయన్న స్పృహ లేక కదల్లేకపోవడం వంటి ఎప్పుడూ వినని రకరకాల క్లినికల్ టేల్స్ ని మన ముందుంచుతారు ఆలివర్ సాక్స్..వీటితో పాటు మానసిక సంతులనం సరిగ్గా లేనప్పటికీ బోర్హెసియన్ అబ్స్ట్రాక్ట్ ప్రపంచపు జీవుల్ని తలపించే ప్రాడిజీలను కొంతమందిని పరిచయం చేస్తారు.
న్యూరోలజీ మనిషి గ్రాహకశక్తిని 'కాంక్రీట్','అబ్స్ట్రాక్ట్' అనే రెండు ఆలోచనా విధానాలుగా విభజిస్తుందంటారు..మానవమేథ గొప్పదనమంతా మెదడులోని 'స్పష్టత' మరియు 'అబ్స్ట్రాక్ట్' లోనే కేంద్రీకృతమై ఉంటుందని సిస్టమాటైజర్ / న్యూరోలజిస్ట్ అయిన Kurt Goldstein ప్రతిపాదించారు..కానీ ఈ వాదనను వ్యతిరేకిస్తూ కేవలం ఈ రెండు దృక్పథాలను పరిగణనలోకి తీసుకుని బ్రెయిన్ డామేజ్ అయిన మనిషి మానసిక స్థితిని అంచనా వెయ్యడం,అతడిని సమాజంనుండి పనికిరానివాడిగా వెలివేయడం సరికాదంటారు సాక్స్..కాంక్రీట్ లేదా వాస్తవిక స్పృహ (capable of being perceived by the senses) కు న్యూరోలజిస్టులు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక రకమైన చులకన భావంతో (wretched thing, beneath consideration, incoherent, regressed) చూస్తారనేది ఆయన ఫిర్యాదు..ఆయన ఇందులో చర్చించిన పలు కేస్ స్టడీస్ అన్నీ న్యూరోలజీ మానసిక సంబంధిత రోగులకు చికిత్స చేసేటప్పుడు విస్మరిస్తున్న ఈ 'కాంక్రీట్' ను సమర్ధించే దిశగానే సాగుతాయి.
ఏదైనా ఒక వస్తువును 'వస్తువుగా' పసివాళ్ళు సైతం తమ సెన్సెస్ ఆధారంగా గుర్తిస్తారు (కాంక్రీట్) కానీ దాని లక్షణాలను గురించి స్పష్టంగా మాట్లాడమంటే మాట్లాడలేరు (అబ్స్ట్రాక్ట్)..ఈ వైరుధ్యాన్ని గుర్తిస్తూ తన తొలి కేస్ స్టడీ 'The Man Who Mistook His Wife for a Hat' లో Dr P. గా పిలిచే ఒక పేషెంట్ గురించి రాశారు..డాక్టర్.పి వస్తువుల్ని గుర్తించలేరు,ముఖాలను పోల్చుకోలేరు..ఆయనకు అందరిముఖాలూ,వస్తువులూ చుట్టూ ఔట్ లైన్స్ మినహా అలికేసినట్లుగా కనబడుతుంటాయి (Visually, he was lost in a world of lifeless abstractions)..కానీ డాక్టర్.పి ప్రత్యేకత ఏమిటంటే ఆయనో గొప్ప సంగీతకారుడు,అన్నా కరీనినా పాత్రలను గురించి అడిగినా చక్కని జ్ఞాపకశక్తితో మాట్లాడగలరు..అలాగే వస్తువుల గురించి కూడా ఎంతైనా మాట్లాడతారు గానీ వాటిని స్పష్టంగా గుర్తుపట్టే శక్తిని మాత్రం పూర్తిగా కోల్పోయారు..కానీ విచిత్రంగా 'Visual Agnosia' అనే ఈ వ్యాధి సంగీతకారునిగా ఆయన నైపుణ్యాన్ని కొంచెం కూడా తగ్గించలేదన్నది గమనించవలసిన విషయం అంటారు సాక్స్.
మానవమేథస్సుని నిర్వచించేది మెదడు సాధారణ పనితనాన్ని(కాంక్రీట్) మించిన 'అబ్స్ట్రాక్ట్' దృక్పథమే అని నమ్మే న్యూరోలజీ ప్రపంచానికి వ్యతిరేకంగా,మనిషి దైనందిన జీవితంలో రోజువారీ పనులు చేసుకుంటూ హుందాగా బ్రతకడానికి అబ్స్ట్రాక్ట్ కంటే కాంక్రీట్ దృక్పథమే ఎక్కువ అవసరమని వాదిస్తారు సాక్స్..ఇందులో వ్యాసాలన్నీ అనేకమంది పేషెంట్స్ గురించిన వివరాలను ఉదహరిస్తూ సాక్స్ తన వాదనను సమర్ధించుకునే దిశగానే సాగుతాయి.
ఇమ్మానుయేల్ కాంట్ సిద్ధాంతం ప్రకారం చూసినా,లేదా జీవపరిణామ క్రమం ప్రకారం చూసినా 'జడ్జిమెంట్' అనేది మనిషి ఆలోచనా విధానంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది..మనిషైనా,జంతువైనా 'అబ్స్ట్రాక్ట్ సెన్స్' విషయంలో విఫలమైనా మంచి జీవితాన్ని జీవించగలరు గానీ,'జడ్జిమెంట్' అనేది లేకపోతే పూర్తిగా నిర్వీర్యమైపోతారంటారు..కానీ ఒక మనిషి తన జీవితాన్ని సుగమం చేసుకోవడంలో ముఖ్య పోషించే ఈ 'జడ్జిమెంట్' ను క్లాసికల్ (కంప్యూటేషనల్) న్యూరోలజీ సరిగ్గా అర్థంచేసుకోలేక నిర్లక్ష్యం చేస్తోందంటారు సాక్స్..
డాక్టర్.పి భార్య ఆయన వేసిన కొన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని సాక్స్ కు గర్వంగా చూపిస్తూ అందులో ఆయన ఆర్టిస్టిక్ మెరిట్స్ గురించి చెప్పడాన్ని గురించి రాస్తూ,అది ఆర్ట్ కాదనీ పాథాలజీ అనీ అనడం పికాసో,మైఖేలాంజెలో,రింబాడ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిస్టుల,చైల్డ్ ప్రోడిజీల మానసిక స్థితిలో మామూలు మనుషులకు విరుద్ధమైన బ్రెయిన్ ఫార్ములేషన్ ఏమైనా ఉంటుందా అనే కుతూహలం రేకెత్తించింది.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
'What can be shown cannot be said.'
The aspects of things that are most important for us are hidden because of their simplicity and familiarity. (One is unable to notice something because it is always before one's eyes.) The real foundations of his enquiry do not strike a man at all. –Wittgenstein.
Jonathan Miller produced a beautiful television series, The Body in Question, but the body, normally, is never in question: our bodies are beyond question, or perhaps beneath question-they are simply unquestionably, there. This unquestionability of the body, its certainty, is, for Wittgenstein, the start and basis of all knowledge and certainty.
This "proprioception" is like the eyes of the body, the way the body sees itself. And if it goes, as it's gone with me, it's like the body's blind. My body can't "see" itself if it's lost its eyes, right? So I have to watch it-be its eyes. Right?'
'In the beginning is the deed,' Goethe writes. This may be so when we face moral or existential dilemmas, but not where movement and perception have their origin. Yet here too there is always something sudden: a first step (or a first word, as when Helen Keller said 'water'), a first movement, a first perception, a first impulse- total, 'out of the blue', where there was nothing, or nothing with sense before. 'In the beginning is the impulse.' Not a deed, not a reflex, but an 'impulse', which is both more obvious and more mysterious than either . . . We could not say to Madeleine, 'Do it!' but we might hope for an impulse; we might hope for, we might solicit, we might even provoke one . . .
She speaks very quickly, impulsively, and (it seems) indifferently … so that the important and the trivial, the true and the false, the serious and the joking, are poured out in a rapid, unselec-tive, half-confabulatory stream . . . She may contradict herself completely within a few seconds . . . will say she loves music, she doesn't, she has a broken hip, she hasn't . . .
They make me think, first, of Borges' 'Funes', and his remark, 'My memory, Sir, is like a garbage-heap', and finally, of the Dunciad, the vision of a world reduced to Pure Silliness-Silliness as being the End of the World:Thy hand, great Anarch, lets the curtain fall; And Universal Darkness buries All.
Hume, as we have noted, wrote: I venture to affirm . . . that [we] are nothing but a bundle or collection of different sensations, succeeding one another with inconceivable rapidity, and in a perpetual flux and movement.Thus, for Hume, personal identity is a fiction-we do not exist, we are but a consecution of sensations, or perceptions.
Dostoievski had 'psychical seizures', or 'elaborate mental states' at the onset of seizures, and once said of these: You all, healthy people, can't imagine the happiness which we epileptics feel during the second before our fit… I don't know if this felicity lasts for seconds, hours or months, but believe me, I would not exchange it for all the joys that life may bring.
Thus a gulf appears, indeed a chasm, between what we learn from our patients and what physiologists tell us. Is there any way of bridging this chasm ?
All of this was hinted at a hundred years ago-in Hughlings Jackson's original account of'reminiscence' (1880); by Korsakoff, on amnesia (1887); and by Freud and Anton in the 1890s, on agnosias. Their remarkable insights have been half-forgotten, eclipsed by the rise of a systematic physiology.
The final therapy, as Freud said, is work and love.
One must go to Dostoievsky who experienced on occasion ecstatic epileptic auras to which he attached momentous significance, to find an adequate historical parallel.There are moments, and it is only a matter of five or six seconds, when you feel the presence of the eternal harmony … a terrible thing is the frightful clearness with which it manifests itself and the rapture with which it fills you. If this state were to last more than five seconds, the soul could not endure it and would have to disappear. During these five seconds I live a whole human existence, and for that I would give my whole life and not think that I was paying too dearly . . .
No one has expressed this more beautifully than Kierkegaard, in the words he wrote on his deathbed.
Thou plain man!' (he writes, and I paraphrase slightly). 'The symbolism of the Scriptures is something infinitely high . . . but it is not "high" in a sense that has anything to do with intellectual elevation, or with the intellectual differences between man and man . . . No, it is for all . . . for all is this infinite height attainable.'
'I'm so cold,' she cried, huddling into herself. 'It's not outside, it's winter inside. Cold as death,' she added. 'She was a part of me. Part of me died with her.'
Image Courtesy Google |

A face, to us, is a person looking out-we see, as it were, the person through his persona, his face. But for Dr P. there was no persona in this sense-no outward persona, and no person within.I had stopped at a florist on my way to his apartment and bought myself an extravagant red rose for my buttonhole. Now I removed this and handed it to him. He took it like a botanist or morphol-ogist given a specimen, not like a person given a flower.బ్రిటిష్ న్యూరోలజిస్ట్ Hughlings Jackson ఈ అఫేజియా బారిన పడిన వాళ్ళని అబ్స్ట్రాక్ట్,‘prepositional’ thought కోల్పోయినవాళ్ళుగా కుక్కలతో పోలుస్తారు..(or, rather, he compares dogs to patients with aphasia)..కానీ సాక్స్ తన పేషెంట్ డాక్టర్.పి గురించి రాస్తూ,డాక్టర్.పి కోల్పోయింది కాంక్రీట్ ప్రపంచాన్ని మాత్రమేననీ,నిజానికి ఆయన వాస్తవ ప్రపంచాన్ని గుర్తించలేకపోయినా ఒక కంప్యూటర్ పనిచేసినంత సమర్థతతో పనిచెయ్యగలరనీ అంటారు..డాక్టర్.పి ప్రస్తుత ప్రపంచం పూర్తి 'అబ్స్ట్రాక్ట్' ప్రపంచం..ఈ కేస్ ని ఉదహరిస్తూ తమ న్యూరోలొజీ ఎప్పుడూ పేషెంట్ లో నయం చెయ్యలేని లోపాల మీదే దృష్టి పెట్టింది తప్ప పేషెంట్ కి సమాజంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం కల్పించే అతడిలో మిగిలిన శక్తిసామర్ధ్యాలపై దృష్టి పెట్టలేదంటారాయన.
మానవమేథస్సుని నిర్వచించేది మెదడు సాధారణ పనితనాన్ని(కాంక్రీట్) మించిన 'అబ్స్ట్రాక్ట్' దృక్పథమే అని నమ్మే న్యూరోలజీ ప్రపంచానికి వ్యతిరేకంగా,మనిషి దైనందిన జీవితంలో రోజువారీ పనులు చేసుకుంటూ హుందాగా బ్రతకడానికి అబ్స్ట్రాక్ట్ కంటే కాంక్రీట్ దృక్పథమే ఎక్కువ అవసరమని వాదిస్తారు సాక్స్..ఇందులో వ్యాసాలన్నీ అనేకమంది పేషెంట్స్ గురించిన వివరాలను ఉదహరిస్తూ సాక్స్ తన వాదనను సమర్ధించుకునే దిశగానే సాగుతాయి.
ఇమ్మానుయేల్ కాంట్ సిద్ధాంతం ప్రకారం చూసినా,లేదా జీవపరిణామ క్రమం ప్రకారం చూసినా 'జడ్జిమెంట్' అనేది మనిషి ఆలోచనా విధానంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది..మనిషైనా,జంతువైనా 'అబ్స్ట్రాక్ట్ సెన్స్' విషయంలో విఫలమైనా మంచి జీవితాన్ని జీవించగలరు గానీ,'జడ్జిమెంట్' అనేది లేకపోతే పూర్తిగా నిర్వీర్యమైపోతారంటారు..కానీ ఒక మనిషి తన జీవితాన్ని సుగమం చేసుకోవడంలో ముఖ్య పోషించే ఈ 'జడ్జిమెంట్' ను క్లాసికల్ (కంప్యూటేషనల్) న్యూరోలజీ సరిగ్గా అర్థంచేసుకోలేక నిర్లక్ష్యం చేస్తోందంటారు సాక్స్..
డాక్టర్.పి భార్య ఆయన వేసిన కొన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని సాక్స్ కు గర్వంగా చూపిస్తూ అందులో ఆయన ఆర్టిస్టిక్ మెరిట్స్ గురించి చెప్పడాన్ని గురించి రాస్తూ,అది ఆర్ట్ కాదనీ పాథాలజీ అనీ అనడం పికాసో,మైఖేలాంజెలో,రింబాడ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిస్టుల,చైల్డ్ ప్రోడిజీల మానసిక స్థితిలో మామూలు మనుషులకు విరుద్ధమైన బ్రెయిన్ ఫార్ములేషన్ ఏమైనా ఉంటుందా అనే కుతూహలం రేకెత్తించింది.
'Ach, you doctors, you're such Philistines!' she exclaimed. 'Can you not see artistic development-how he renounced the realism of his earlier years, and advanced into abstract, nonrepresenta-tional art?'The Lost Mariner అనే మరో కేస్ స్టడీలో ఆర్గానిక్ Amnesia / retrograde amnesia బారినపడి తన జీవితంలో కొన్నేళ్ళ జ్ఞాపకాలను పూర్తిగా కోల్పోయి,చిన్నప్పటి కొన్ని చెదురుమదురు జ్ఞాపకాలు మాత్రమే మిగిలిన జిమ్మీ గురించి రాస్తారు..సజావుగా సాగిపోతున్న జీవితంలో ఉన్నట్లుండి ఒక లోతైన బ్లాక్ హోల్ లాంటి అగాథం ఏర్పడి అంతవరకూ జీవించిన క్షణాలన్నిటినీ,ప్రోగుచేసుకున్న అనుభవాలన్నిటినీ ఒక్క చిహ్నం కూడా మిగలకుండా తనలోకి అమాంతం లాగేసుకుంటే ఎలా ఉంటుందో జిమ్మీ జీవితం అలా చీకటిగదిలా ఖాళీగా ఉంటుంది.
'No, that's not it,' I said to myself (but forbore to say it to poor Mrs P.). He had indeed moved from realism to nonrepresentation to the abstract, yet this was not the artist, but the pathology, advancing-advancing towards a profound visual agnosia, in which all powers of representation and imagery, all sense of the concrete, all sense of reality, were being destroyed. This wall of paintings was a tragic pathological exhibit, which belonged to neurology, not art.
You have to begin to lose your memory, if only in bits and pieces, to realise that memory is what makes our lives. Life without memory is no life at all . . . Our memory is our coherence, our reason, our feeling,even our action. Without it, we are nothing అంటారు Luis Bunuel.మరి జ్ఞాపకాలు ఏమీ మిగలని జిమ్మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం.
'He is, as it were,' I wrote in my notes, 'isolated in a single moment of being, with a moat or lacuna of forgetting all round him … He is man without a past (or future), stuck in a constantly changing, meaningless moment.'కానీ రష్యన్ న్యూరో సైకాలజిస్ట్ అలెగ్జాండర్ లూరియా, 'A man does not consist of memory alone. He has feeling, will, sensibility, moral being … It is here . . . you may touch him, and see a profound change.' అంటారు..అందుచేత జ్ఞాపకాలు,మెంటల్ ఆక్టివిటీ,మెదడు లాంటివాటిని మాత్రమే మనిషి ఉనికిని నిర్వచించే అంశాలుగా చూడడం సమంజసం కాదనీ,మోరల్ అటెన్షన్,అతడు శ్రద్ధగా చేసే పనుల్లాంటివి కూడా మనిషిని అతడి ఆత్మతో ఏకంచేసి, భావోద్వేగాలు,అనుభవాలతో కూడిన పరిపూర్ణమైన జీవితం జీవించే అవకాశాన్నిస్తాయని సాక్స్ వాదన..ముఖ్యంగా మనిషినీ,అతడి ఆత్మనూ ఏకం చేసే కళకూ,ఆధ్యాత్మికతకూ న్యూరోలాజికల్ డిజార్డర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తి ఉంటుందని అంటారాయన.
Jimmie, who was so lost in extensional 'spatial' time, was perfectly organised in Bergsonian 'intentional' time; what was fugitive, unsustainable, as formal structure, was perfectly stable, perfectly held, as art or will.The Disembodied Lady పేరిట రాసిన మరో కేస్ లో ఇరవయ్యేడేళ్ళ క్రిస్టినా అనే స్త్రీ తన కాళ్ళు,చేతులు మొదలైన శరీరావయవాలకు సంబంధించిన స్పృహ కోల్పోతుంది..
'I feel my body is blind and deaf to itself … it has no sense of itself-' అంటుందామె..these are her own words. She has no words, no direct words, to describe this bereftness, this sensory darkness (or silence) akin to blindness or deafness. She has no words, and we lack words too. And society lacks words, and sympathy, for such states.Witty Ticcy Ray అనే మరో వ్యాసంలో తీవ్రమైన నెర్వస్ ఎనర్జీ వ్యాధితో బాధపడే 'రే' అనే పేషెంట్ గురించి రాస్తారు..మెదడు,నాడీవ్యవస్థ సమతౌల్యంలో చిన్నపాటి తేడాలు కూడా మొత్తం శరీరం పనితీరుమీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఈ కేస్ హిస్టరీ చూస్తే అర్ధమవుతుంది..అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు..రే కు సంతోషం వచ్చినా,దుఃఖం వచ్చినా పట్టలేం,అతడిలో భావోద్వేగాల తీవ్రత ఎక్కువ..ఈ కారణంగా అతడు ఉద్యోగంలోనూ,వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఇబ్బందులకు గురయ్యేవాడు..ఇటువంటి వ్యాధిని Tourette's సిండ్రోమ్ అంటారు..ఈ వ్యాథికి వైద్యం తీసుకున్నాక రే జీవితం ఈ విధంగా ఉందంటారు.
So now there are two Rays-on and off Haldol. There is the sober citizen, the calm deliberator, from Monday to Friday; and there is 'witty ticcy Ray', frivolous, frenetic, inspired, at weekends. It is a strange situation, as Ray is the first to admit:Having Tourette's is wild, like being drunk all the while. Being on Haldol is dull, makes one square and sober, and neither state is really free ...You 'normals', who have the right transmitters in the right places at the right times in your brains, have all feelings, all styles, available all the time-gravity, levity, whatever is appropriate. We Touretters don't: we are forced into levity by our Tourette's and forced into gravity when we take Haldol. You are free, you have a natural balance: we must make the best of an artificial balance.ఇలా చెప్పుకుంటూ పోతే పాఠకులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇటువంటివెన్నో..ఇందులో మొదటి రెండు సెక్షన్స్ లో హ్యూమన్ బ్రెయిన్ లో excess లేదా deficit కారణంగా సంక్రమించే వ్యాధుల్ని గురించి చర్చించగా మూడో విభాగంలో న్యూరోలజీ,మెడిసిన్ ల పరిధిలోకి రాని reminiscence, altered perception, imagination,'dream' వంటి అంశాల గురించి చర్చిస్తారు..జ్ఞాపకాలు,మతిమరపు,అనుభవాలూ,గ్రహింపు మొదలైన అనేక విషయ విశేషాలతో కూడిన ఈ క్లినికల్ టేల్స్ చదువుతున్నప్పుడు పాఠకులు ఎక్కడో ఒకచోట తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారనిపించింది..ఉదాహరణకు నేను ముఖాలు జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇబ్బందిపడతాను,చాలా మంది అతి సహజంగా చేసే చిన్న చిన్న పనులైన షూ కి లేసులు కట్టుకోవడం లాంటివి నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను,డైరెక్షన్స్ గుర్తుపట్టడంలో ఇప్పటికీ తడబడతాను,ఇలాంటివి మరెన్నో..కానీ ఈ కథల్లాంటి వ్యాసాలు చదివినప్పుడు మానవ మేథస్సు మీద ఉన్న అపారమైన నమ్మకం సడలక మానదు..ఎంత శోధించినా ఇంకా మనకు తెలీని సృష్టి రహస్యాలను తనలో దాచుకున్న మనిషి మెదడు ఒక అద్భుతం అనిపించక మానదు..ఈ అనంత విశ్వంలో పరమాణువంత మన ఉనికి మనకు గుర్తురాక మానదు..షెర్రింగ్టన్ 'an enchanted loom' గా అభివర్ణించిన హ్యూమన్ బ్రెయిన్ ని మించిన మిరాకిల్ మరొకటుంటుందా అని అనిపించక మానదు.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
'What can be shown cannot be said.'
The aspects of things that are most important for us are hidden because of their simplicity and familiarity. (One is unable to notice something because it is always before one's eyes.) The real foundations of his enquiry do not strike a man at all. –Wittgenstein.
Jonathan Miller produced a beautiful television series, The Body in Question, but the body, normally, is never in question: our bodies are beyond question, or perhaps beneath question-they are simply unquestionably, there. This unquestionability of the body, its certainty, is, for Wittgenstein, the start and basis of all knowledge and certainty.
This "proprioception" is like the eyes of the body, the way the body sees itself. And if it goes, as it's gone with me, it's like the body's blind. My body can't "see" itself if it's lost its eyes, right? So I have to watch it-be its eyes. Right?'
'In the beginning is the deed,' Goethe writes. This may be so when we face moral or existential dilemmas, but not where movement and perception have their origin. Yet here too there is always something sudden: a first step (or a first word, as when Helen Keller said 'water'), a first movement, a first perception, a first impulse- total, 'out of the blue', where there was nothing, or nothing with sense before. 'In the beginning is the impulse.' Not a deed, not a reflex, but an 'impulse', which is both more obvious and more mysterious than either . . . We could not say to Madeleine, 'Do it!' but we might hope for an impulse; we might hope for, we might solicit, we might even provoke one . . .
She speaks very quickly, impulsively, and (it seems) indifferently … so that the important and the trivial, the true and the false, the serious and the joking, are poured out in a rapid, unselec-tive, half-confabulatory stream . . . She may contradict herself completely within a few seconds . . . will say she loves music, she doesn't, she has a broken hip, she hasn't . . .
They make me think, first, of Borges' 'Funes', and his remark, 'My memory, Sir, is like a garbage-heap', and finally, of the Dunciad, the vision of a world reduced to Pure Silliness-Silliness as being the End of the World:Thy hand, great Anarch, lets the curtain fall; And Universal Darkness buries All.
Hume, as we have noted, wrote: I venture to affirm . . . that [we] are nothing but a bundle or collection of different sensations, succeeding one another with inconceivable rapidity, and in a perpetual flux and movement.Thus, for Hume, personal identity is a fiction-we do not exist, we are but a consecution of sensations, or perceptions.
Dostoievski had 'psychical seizures', or 'elaborate mental states' at the onset of seizures, and once said of these: You all, healthy people, can't imagine the happiness which we epileptics feel during the second before our fit… I don't know if this felicity lasts for seconds, hours or months, but believe me, I would not exchange it for all the joys that life may bring.
Thus a gulf appears, indeed a chasm, between what we learn from our patients and what physiologists tell us. Is there any way of bridging this chasm ?
All of this was hinted at a hundred years ago-in Hughlings Jackson's original account of'reminiscence' (1880); by Korsakoff, on amnesia (1887); and by Freud and Anton in the 1890s, on agnosias. Their remarkable insights have been half-forgotten, eclipsed by the rise of a systematic physiology.
The final therapy, as Freud said, is work and love.
One must go to Dostoievsky who experienced on occasion ecstatic epileptic auras to which he attached momentous significance, to find an adequate historical parallel.There are moments, and it is only a matter of five or six seconds, when you feel the presence of the eternal harmony … a terrible thing is the frightful clearness with which it manifests itself and the rapture with which it fills you. If this state were to last more than five seconds, the soul could not endure it and would have to disappear. During these five seconds I live a whole human existence, and for that I would give my whole life and not think that I was paying too dearly . . .
No one has expressed this more beautifully than Kierkegaard, in the words he wrote on his deathbed.
Thou plain man!' (he writes, and I paraphrase slightly). 'The symbolism of the Scriptures is something infinitely high . . . but it is not "high" in a sense that has anything to do with intellectual elevation, or with the intellectual differences between man and man . . . No, it is for all . . . for all is this infinite height attainable.'
'I'm so cold,' she cried, huddling into herself. 'It's not outside, it's winter inside. Cold as death,' she added. 'She was a part of me. Part of me died with her.'
No comments:
Post a Comment