ఫ్రెంచి సాహితీ విమర్శకులు రోలాండ్ బార్త్ పుస్తకం పేరు 'మైథాలజీస్' అని ఉండడం చూసి ఇందులో ఏవో గ్రీకు పురాణాల్లో,రోమన్ గాథలో ఉంటాయని భ్రమపడి చాలా కాలంపాటు చదవకుండా ప్రక్కన పెడుతూ వచ్చాను..ఇన్నేళ్ళకు యాదృచ్ఛికంగా కొన్ని పేజీలు తిప్పినప్పుడు ఇందులో మైథాలజీకి ఏమాత్రం సంబంధంలేని విషయాలు చదివి ఆశ్చర్యం వేసింది..'పుక్కిట పురాణాలని' మనం తరచూ వినే ఒక మాటను ఈ పుస్తకం పేరుకి అన్వయిస్తే,అసత్యాలను అందమైన అభూతకల్పనలుగా చేసి మీడియా,ఇంటెలెక్చువల్ వర్గాలూ,ప్రభుత్వాలూ ఇవన్నీ కలిసి సామాన్య ప్రజానీకానికి కట్టుకథలు (మైథాలజీలు) చెప్పి ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను విశ్లేషించిన కొన్ని వ్యాసాలు ఇందులో ఉన్నాయి..మన కంటికి కనిపించేవి,చెవులకు వినిపించేవి అన్నీ నిజాలు కావు..కానీ ఈ విషయం గ్రహించడానికి ఎప్పుడూ 'బిట్వీన్ ది లైన్స్' చదవడం చేతనవ్వాలి..అటువంటి విద్యలో బార్త్ నిష్ణాతులు..ఇందులో వాస్తవానికీ,మిథ్ కూ ఉన్న తేడాలను పలు శాస్త్రీయమైన విశ్లేషణలతో సహా వివరించారు బార్త్.
అసలు మిత్ అంటే ఏమిటి ? ఇది ఒక రకమైన స్పీచ్ అంటారు బార్త్..వాస్తవం నుండి మిత్ ను వేరు చేసి చూసే విధంగా రూపొందిన ఫీల్డ్ స్టడీని 'సెమియోలజీ' అంటారు..మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచంనుండి అర్ధాలను భాష,సింబల్స్,ఫోటోగ్రాఫ్స్,పెయింటింగ్స్ మొదలైన అనేక అంశాల నుండి ఎలా అర్ధం చేసుకుంటారో అధ్యయనం చేస్తుంది ఈ 'సెమియోటిక్స్'..ఈ స్టడీస్ లో 'మిత్' ని వివరించడానికి 'సైన్,సిగ్నిఫయర్,సిగ్నిఫయడ్' అనే ఒక ట్రై డైమెన్షనల్ పాటర్న్ ను పరిచయం చేస్తారు..మరింత లోతుగా చర్చిస్తూ ఫామ్,స్ట్రక్చర్ వంటి మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి..ఉదాహరణకు ఒక 'గులాబీల గుత్తి'ని తీసుకుంటే,దానిని ప్యాషన్ కు చిహ్నంగా భావిస్తారు..అంటే ఇక్కడ గులాబీలు 'సిగ్నిఫయర్' అయితే ప్యాషన్ 'సిగ్నిఫయిడ్' అవుతుంది..కానీ నిజానికి ఇక్కడ ఉన్నది 'Passionified roses'..కానీ ఈ గులాబీలను ప్యాషన్ కు కలిపితే మరో మూడో ఆబ్జెక్ట్ తయారవుతోంది,అదే సైన్.
ప్రేమలో ఉండడం కంటే,ప్రేమలో ఉన్నామన్న భావన మరింత అద్భుతంగా ఉంటుందంటారు..అలాగే మనుషులు తమను గురించి తాము చెప్పే మాటలకంటే,చెప్పకుండా వదిలేసిన మాటలే వారిని ఎక్కువ నిర్వచిస్తాయని అంటారు,ఇకపోతే పదాలకంటే వ్యవహారశైలి ఒక వ్యక్తిని గురించి మరింత ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది..ఇవన్నీ వాస్తవానికీ,మిథ్ కూ తేడా గ్రహించగలిగి,కేవలం ఉపరితలంలో కనిపించే విషయాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కాస్త లోతుగా విషయాలను అధ్యయనం చేసే అలవాటున్నవాళ్ళకి అర్ధమవుతాయి..కానీ నేటి తరంలో అసలైన అనుభవం కంటే ఆ అనుభవాన్ని ప్రతిబింబించే అంశానికి ప్రాథాన్యత ఎక్కువ..సాధారణ సమయాల్లోనే కాకుండా కోవిడ్ లాంటి గ్లోబల్ ఎపిడెమిక్ కారణంగా వర్గ తారతమ్యాలు లేకుండా ప్రతీ సగటుమనిషి జీవితం ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్,ట్విట్టర్ వంటి పలు సోషల్ మీడియా కిటికీలకు పరిమితమైపోయిన సమయంలో 'We are what we pretend to be' అన్న తీరులో అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ,సోషల్ మీడియాలోనూ అసలు కంటే నకలు ఎక్కువ చెల్లుబాటవుతోంది..ఇదే విషయాన్ని బార్త్ 1972 లో రాసిన ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.
చేగువేరా లాంటి ఒక రివల్యూషనరీని ఉదాహరణగా తీసుకుంటే ఒకప్పటి అసలుసిసలు చేగువేరా సిద్ధాంతాలూ,ఆయన స్వచ్ఛమైన జీవితాశయాలూ ఈ తరంలో క్యాపిటలిజం ఉత్పత్తి చేసే టీ షర్ట్లకు పరిమితమైపోయాయి..రివల్యూషనరీ చేగువేరా కాస్తా ఒక కార్పొరేట్ 'బ్రాండ్' గా మారిపోయారు..విచిత్రం ఏమిటంటే నిజానికి ఆ టీ షర్టును డబ్బుపెట్టికొనుక్కున్న వ్యక్తి,ఆ షర్టు వేసుకుని తనను చేగువేరా ఆశయాలకు ప్రాతినిథ్యం వహించే వ్యక్తిగా చూసుకోవాలని ఆశపడతాడు..కానీ కాస్త నిశితంగా గమనిస్తే,చేగువేరా ఏ పెట్టుబడిదారీ వ్యవస్థనైతే వ్యతిరేకించారో అదే పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊతమిస్తూ వారి వ్యాపారంలో అతడు భాగంగా మిగిలిపోతున్నాడు..చేగువేరా అనే కమ్యూనిస్టు ఐకాన్ ప్రస్తుతం ఒక క్యాపిటలిస్టు కమోడిటీగా మారిపోవడం బార్త్ వ్యాసాలను గురించి చెప్పడానికి నేను ఎన్నుకున్న ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..అన్ని ప్రచార మాధ్యమాలూ,సినిమా,ఆర్ట్ వంటివన్నీ ఇటువంటి నిజమైన ఆకారాలను పోలిన అభూతకల్పనలని తన వ్యాసాల్లో రుజువులతో సహా నిరూపిస్తారు బార్త్.
తొలి వ్యాసంలో మల్లయుద్ధం గురించి ఇలా రాస్తారు,
The Writer on Holiday అనే మరో వ్యాసంలో 'Gide was reading Bossuet while going down the Congo' అని పేపర్లో Le Figaro తీసిన గిడే ఫొటోతో సహా ప్రచురించిన వార్తను విశ్లేషిస్తూ బార్త్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు చదవడానికి మహా సరదాగా అనిపించాయి..' Here is therefore a good piece of journalism, highly efficient sociologically, and which gives us, without cheating, information on the idea which our bourgeoisie entertains about its writers అని 'మీడియా మిథ్స్' ను తూర్పారబడుతూ చాలా సాధారణమైన అంశాలకు మన మీడియా అనవసరమైన ప్రాధాన్యతను ఆపాదించి,ఐడియలైజేషన్ పేరిట కట్టుకథల్ని ఎలా తయారుచేస్తుందో,మధ్యతరగతి దాని ప్రభావానికి ఎలా లోనవుతుందో తెలిపే వ్యాసం ఇది..మనిషన్నాకా ప్రయాణాలు చెయ్యడమైనేది సర్వసాధారణం..నిజానికి 'రచయిత' అనేవాడు సెలవు తీసుకున్నా అతడి మ్యూజ్ మాత్రం సెలవు తీసుకోదు..అందువల్ల రచయిత ఆటవిడుపు ప్రయాణాల్లో కూడా పని చేస్తూనే ఉంటాడు..అతణ్ణి నిరంతరం ఘోస్ట్ లా అంటిపెట్టుకుని ఉండే 'మ్యూజ్' అతణ్ణి విశ్రాంతిగా ఉండనివ్వదు..ఏ హోటల్ గదిలోనో పెన్నూ పేపర్ చేతబట్టుకుని అతడు నిరంతరం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉండాలి,ప్రస్తుతం రాస్తున్న పుస్తకాలకో,భవిష్యత్తులో ప్రచురించబడే పుస్తకాలకో గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉండాలి..పేద శ్రామికవర్గాల ఆటవిడుపు ప్రయాణాలతో పోలిస్తే ఒక రచయిత పరిస్థితి కడు దయనీయం..కానీ మీడియా ఈ యదార్ధాన్ని కప్పిపుచ్చి రచయిత ప్రయాణాన్ని అందంగా గ్లోరిఫై చేస్తుంది..మరో మిత్ అన్నమాట.
కౌటిల్యుని అర్థ శాస్త్రంలా,కృష్ణ గీతలా సత్యానికీ,అసత్యానికీ,మంచీ చెడులకీ మధ్యనున్న భేదం తెలియాలంటే రోలాండ్ బార్త్ రాసిన ఈ సైంటిఫిక్ భగవద్గీతను తప్పకుండా నిరంతరం పారాయణ చెయ్యడం అవసరం.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Image Courtesy Google |

A wrestler can irritate or disgust, he never disappoints, for he always accomplishes completely, by a progressive solidification of signs, what the public expects of him. In wrestling, nothing exists except in the absolute, there is no symbol, no allusion, everything is presented exhaustively. Leaving nothing in the shade, each action discards all parasitic meanings and ceremonially offers to the public a pure and full signification, rounded like Nature. This grandiloquence is nothing but the popular and age-old image of the perfect intelligibility of reality.రెండో వ్యాసంలో కుందేరా 'Kitsch' ను తలపించే 'Bourgeois art' గురించి రాస్తూ Mankiewicz జూలియస్ సీజర్ సినిమాలో సింబాలిజంను ప్రస్తావిస్తారు..ఇందులో రోమన్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దాదాపూ అన్ని పాత్రలకూ నుదుటిమీద పడే చిన్న చిన్న జాలర్లవంటి కేశాలంకరణ కనిపిస్తుంది,బట్టతల ఉన్న వాళ్ళు ఎక్కడా కనిపించరు..కానీ నిజానికి అన్ని రకాలవాళ్ళూ ఉండే రోమన్ సంస్కృతిని సింబలైజ్ చేస్తూ వారి తలమీద ఫ్రిన్జెస్ ని అమర్చడం చవకబారు ఆర్ట్ అంటారు బార్త్.
Those who have little hair have not been let off for all that, and the hairdresser—the king-pin of the film—has still managed to produce one last lock which duly reaches the top of the forehead, one of those Roman foreheads, whose smallness has at all times indicated a specific mixture of self-righteousness, virtue and conquest.
What then is associated with these insistent fringes? Quite simply the label of Roman-ness. We therefore see here the mainspring of the Spectacle—the sign—operating in the open. The frontal lock overwhelms one with evidence, no one can doubt that he is in Ancient Rome. And this certainty is permanent: the actors speak, act, torment themselves, debate 'questions of universal import', without losing, thanks to this little flag displayed on their foreheads, any of their historical plausibility.ఈ సినిమాలో మరొక సింబాలిజం ఏంటంటే అన్ని పాత్రల మొహాలకూ వేజలైన్ రాసి చెమటోడుతూ ఉన్నట్లు కనిపించేలా జాగ్రత్త తీసుకోవడం..ఈ మొహాలు చెమటకారుతూ ఉండడం ఒక 'మోరల్ ఫీలింగ్' ని చూపిస్తూ ప్రతి ఒక్కరూ అంతః సంఘర్షణకు లోనవుతున్నారని చెప్పకనే చెపుతుంది..అందరూ సీజర్ కు పడే శిక్షను గురించి తర్జనభర్జనలు పడుతున్నారు..ఒక్క సీజర్ మాత్రమే మొహం మీద చెమట లేకుండా,ఎటువంటి భావోద్వేగాలూ కనిపించనీయకుండా,స్థిరంగా చలనం లేనట్లు ఈ సినిమాలో కనిపిస్తాడు..ఎందుకంటే ఇక్కడ 'ఆబ్జెక్ట్ ఆఫ్ క్రైమ్' సీజర్ కాబట్టి అతడికి ఏమి జరుగుతుందో తెలీని ఖాళీతనం అతడి మొహంలో ద్యోతకమవుతుంది అంటారు బార్త్.
The Writer on Holiday అనే మరో వ్యాసంలో 'Gide was reading Bossuet while going down the Congo' అని పేపర్లో Le Figaro తీసిన గిడే ఫొటోతో సహా ప్రచురించిన వార్తను విశ్లేషిస్తూ బార్త్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు చదవడానికి మహా సరదాగా అనిపించాయి..' Here is therefore a good piece of journalism, highly efficient sociologically, and which gives us, without cheating, information on the idea which our bourgeoisie entertains about its writers అని 'మీడియా మిథ్స్' ను తూర్పారబడుతూ చాలా సాధారణమైన అంశాలకు మన మీడియా అనవసరమైన ప్రాధాన్యతను ఆపాదించి,ఐడియలైజేషన్ పేరిట కట్టుకథల్ని ఎలా తయారుచేస్తుందో,మధ్యతరగతి దాని ప్రభావానికి ఎలా లోనవుతుందో తెలిపే వ్యాసం ఇది..మనిషన్నాకా ప్రయాణాలు చెయ్యడమైనేది సర్వసాధారణం..నిజానికి 'రచయిత' అనేవాడు సెలవు తీసుకున్నా అతడి మ్యూజ్ మాత్రం సెలవు తీసుకోదు..అందువల్ల రచయిత ఆటవిడుపు ప్రయాణాల్లో కూడా పని చేస్తూనే ఉంటాడు..అతణ్ణి నిరంతరం ఘోస్ట్ లా అంటిపెట్టుకుని ఉండే 'మ్యూజ్' అతణ్ణి విశ్రాంతిగా ఉండనివ్వదు..ఏ హోటల్ గదిలోనో పెన్నూ పేపర్ చేతబట్టుకుని అతడు నిరంతరం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉండాలి,ప్రస్తుతం రాస్తున్న పుస్తకాలకో,భవిష్యత్తులో ప్రచురించబడే పుస్తకాలకో గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉండాలి..పేద శ్రామికవర్గాల ఆటవిడుపు ప్రయాణాలతో పోలిస్తే ఒక రచయిత పరిస్థితి కడు దయనీయం..కానీ మీడియా ఈ యదార్ధాన్ని కప్పిపుచ్చి రచయిత ప్రయాణాన్ని అందంగా గ్లోరిఫై చేస్తుంది..మరో మిత్ అన్నమాట.
And the 'naturalness' in which our novelists are eternalized is in fact instituted in order to convey a sublime contradiction: between a prosaic condition, produced alas by regrettably materialistic times, and the glamorous status which bourgeois society liberally grants its spiritual representatives (so long as they remain harmless)
By having holidays, he displays the sign of his being human; but the god remains, one is a writer as Louis XIV was king, even on the commode.ఇందులో చార్లీ చాప్లిన్ ఆర్ట్ యొక్క శైలిని విశ్లేషిస్తూ గురించి రాసిన మరొక వ్యాసం నన్ను ఆకట్టుకుంది..ఆయన సినిమాలను గమనిస్తే చాప్లిన్ శ్రామిక వర్గాన్ని ఎప్పుడూ పేదరికానికి ప్రతినిథులుగానే చూస్తారు..కానీ ఈ శ్రామికవర్గపు కష్టాలను ఎక్కడా రాజకీయాలకు ముడిపెట్టిన దాఖలాలు కనిపించవు..తన శ్రామికవర్గ పక్షపాతం విషయంలో స్పష్టత లేని ఒకవిధమైన రాజకీయ సందిగ్ధం గురించి విశ్లేషిస్తూ,మనం చాప్లిన్ సినిమా చూస్తున్నప్పుడు శ్రామికవర్గంపై రాజకీయపరమైన ప్రభావం చాప్లిన్ కథానాయకుడి దృష్టిని కూడా దాటిపోతుంది..అరే అసలు విషయాన్ని గమనించకుండా ఎంతసేపూ ఆకలీ,నిద్దురా అంటూ తన ముందున్న అవసరాలమీదే అతడి దృష్టి పెడతాడేంటి అని మనకి అనిపిస్తుంది..ఈ చిన్న లాజిక్ ను చాప్లిన్ తన ఆర్ట్ లో సమర్ధవంతంగా వాడుకున్నారంటారు బార్త్.
Now Chaplin, in conformity with Brecht's idea, shows the public its blindness by presenting at the same time a man who is blind and what is in front of him. To see someone who does not see is the best way to be intensely aware of what he does not see: thus, at a Punch and Judy show, it is the children who announce to Punch what he pretends not to see.
All told, it is perhaps because of this that Chaplin-Man triumphs over everything: because he escapes from everything, eschews any kind of sleeping partner, and never invests in man anything but man himself. His anarchy, politically open to discussion, perhaps represents the most efficient form of revolution in the realm of art.ఈ పుస్తకంలో ఫ్రాన్స్ లో 1957లో అలజడి సృష్టించిన ముగ్గురు బ్రిటీషర్ల హత్య కేసు Dominici ట్రయల్ గురించి ఒక వ్యాసం ఉంది..ఈ కేసు స్టడీ ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లు,వాటిలో మీడియా పాత్రను మరోసారి చర్చిస్తుంది..మీడియా,సాహిత్యం అన్నీ కలిసి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకపోయినా,వాస్తవాలకు ఎవరికి తోచిన ఊహాగానాల్ని (మిత్) ను వారు జోడించి నిందితుడు Gaston Dominici కు మరణశిక్ష పడేలా ఎలా చేశారన్నది ఈ వ్యాసం సారాంశం..బార్త్ వాదన ఇంతకుమునుపు నాకుండే కొన్ని మూఢ నమ్మకాలను పునరాలోచించుకునేలా చేసింది.
Periodically, some trial, and not necessarily fictitious like the one in Camus's The Outsider, comes to remind you that the Law is always prepared to lend you a spare brain in order to condemn you without remorse, and that, like Corneille, it depicts you as you should be, and not as you are.
Justice took the mask of Realist literature, of the country tale, while literature itself came to the court-room to gather new 'human' documents, and naively to seek from the face of the accused and the suspects the reflection of a psychology which, however, it had been the first to impose on them by the arm of the law.
Only, confronting the literature of repletion (which is always passed off as the literature of the 'real' and the 'human'), there is a literature of poignancy; the Dominici trial has also been this type of literature. There have not been here only writers hungering for reality and brilliant narrators whose 'dazzling' verve carries off a man's head; whatever the degree of guilt of the accused, there was also the spectacle of a terror which threatens us all, that of being judged by a power which wants to hear only the language it lends us. We are all potential Dominicis, not as murderers but as accused, deprived of language, or worse, rigged out in that of our accusers, humiliated and condemned by it. To rob a man of his language in the very name of language: this is the first step in all legal murders.
I am only wondering about the enormous consumption of such signs by the public. I see it reassured by the spectacular identity of a morphology and a vocation, in no doubt about the latter because it knows the former, no longer having access to the real experience of apostleship except through the bric-a-brac associated with it, and getting used to acquiring a clear conscience by merely looking at the shop-window of saintliness; and I get worried about a society which consumes with such avidity the display of charity that it forgets to ask itself questions about its consequences, its uses and its limits.మరోవ్యాసంలో పిల్లల బొమ్మల్ని గురించిన మనకున్న కొన్ని మిత్స్ ని బ్రేక్ చేస్తూ,ఊహాత్మకతను పెంపొందించేవిగా తయారు చెయ్యవలసిన బొమ్మల బదులు ప్లాస్టిక్ బొమ్మలు వారి మానసిక ఎదుగుదలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తారు.
However, faced with this world of faithful and complicated objects, the child can only identify himself as owner, as user, never as creator; he does not invent the world, he uses it: there are, prepared for him, actions without adventure, without wonder, without joy. He is turned into a little stay-at-home householder who does not even have to invent the mainsprings of adult causality; they are supplied to him ready-made: he has only to help himself, he is never allowed to discover anything from start to finish. The merest set of blocks, provided it is not too refined, implies a very different learning of the world: then, the child does not in any way create meaningful objects,
French toys are usually based on imitation, they are meant to produce children who are users, not creators.ఇలా రాసుకుంటూపోతే బార్త్ రాసిన ఒక్కో వ్యాసం గురించి ఒక్కో నోట్ రాయవలసి ఉంటుంది..ఇందులో మొదటి వంద పేజీల వరకూ మిత్ ను ఉదాహరణలతో సహా చర్చించారు..ఇవి చదవడం తేలికే..కానీ ఆ తరువాత 'మిత్' కు శాస్త్రీయమైన థియరీని గురించి ఆయన రాసిన అంశాలు ఒకటికి రెండుసార్లు చదివితే గానీ కొరుకుడు పడలేదు..చదువుతున్నప్పుడు అర్ధమైనట్లే అనిపించినా కొన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ మళ్ళీ రిఫర్ చెయ్యాల్సొచ్చింది..ఇది చదువుతున్నప్పుడు పీటర్ మెండెల్సండ్ రాసిన 'What we see when we read' అని గత ఏడాది చదివిన పుస్తకం ఒకటి జ్ఞాపకం వచ్చింది..మనం చదివే పదాలు మన మెదడులోని సృజనాత్మకతకు తోడై ఎన్ని వైవిధ్యమైన అర్ధాలనూ,ఇమేజ్ లనూ సంతరించుకుంటాయో వివరించిన పుస్తకం అది..ఈ పుస్తకంలో మల్ల యుద్ధం మొదలు మార్గరైన్ వరకూ,సబ్బులు మొదలు సాహిత్యం వరకూ,ఫెమినిజం మొదలు స్ట్రిప్ టీస్ వరకూ,ఐన్స్టెయిన్ రిలేటివిటీ మొదలు జెట్ మాన్ వరకూ,కుకరీ మొదలు ట్రావెల్ గైడ్స్ వరకూ,ఇలా చెప్పుకుంటూ పోతే బార్త్ స్పృశించని అంశమంటూ లేదు..మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో రచయిత విశ్లేషణాలన్నీ కేవలం ఒక ఉపరితలం వద్ద ఆగిపోకుండా అన్ని కోణాల్లోనూ చర్చిస్తూ భ్రమకూ,వాస్తవికతకూ తేడాలను ఎత్తిచూపేవిధంగా లోతుగా సాగుతాయి..ఇది చదివిన తరువాత విన్న మాటల్ని విన్నట్లు నమ్మలేం,చూసినదాన్ని చూసినట్లు నిజమనుకోలేం..దేన్నైనా గ్రహించే విషయంలో మన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసే రచన ఈ మైథాలజీస్..
కౌటిల్యుని అర్థ శాస్త్రంలా,కృష్ణ గీతలా సత్యానికీ,అసత్యానికీ,మంచీ చెడులకీ మధ్యనున్న భేదం తెలియాలంటే రోలాండ్ బార్త్ రాసిన ఈ సైంటిఫిక్ భగవద్గీతను తప్పకుండా నిరంతరం పారాయణ చెయ్యడం అవసరం.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Semiology is a science of forms, since it studies significations apart from their content.
We must here recall that the materials of mythical speech (the language itself, photography, painting, posters, rituals, objects, etc.), however different at the start, are reduced to a pure signifying function as soon as they are caught by myth.
Myth sees in them only the same raw material; their unity is that they all come down to the status of a mere language. Whether it deals with alphabetical or pictorial writing, myth wants to see in them only a sum of signs, a global sign, the final term of a first semiological chain.
As a total of linguistic signs, the meaning of the myth has its own value, it belongs to a history, that of the lion or that of the Negro: in the meaning, a signification is already built, and could very well be self-sufficient if myth did not take hold of it and did not turn it suddenly into an empty, parasitical form. The meaning is already complete, it postulates a kind of knowledge, a past, a memory, a comparative order of facts, ideas, decisions.When it becomes form, the meaning leaves its contingency behind; it empties itself, it becomes impoverished, history evaporates, only the letter remains. There is here a paradoxical permutation in the reading operations, an abnormal regression from meaning to form, from the linguistic sign to the mythical signifier.
To be a critic by profession and to proclaim that one understands nothing about existentialism or Marxism (for as it happens, it is these two philosophies particularly that one confesses to be unable to understand) is to elevate one's blindness or dumbness to a universal rule of perception, and to reject from the world Marxism and existentialism: 'I don't understand, therefore you are idiots.'
But if one fears or despises so much the philosophical foundations of a book, and if one demands so insistently the right to understand nothing about them and to say nothing on the subject, why become a critic?
There is a single secret to the world, and this secret is held in one word; the universe is a safe of which humanity seeks the combination: Einstein almost found it, this is the myth of Einstein.
No comments:
Post a Comment