మళ్ళీ కాస్త తేలికపాటి పుస్తకం ఏదైనా చదువుదామనుకుంటున్నంతలో 'The Art of Novella' సిరీస్ లో భాగంగా ప్రచురించిన టాల్స్టాయ్ 'ది డెవిల్' కంటపడింది..నా వరకూ టాల్స్టాయ్ ని చదవడం ఒక ఉపశమనం..మనసులో ఏ చిన్న అలజడినైనా ఆయన మాటల్తో ఇట్టే మటుమాయం చేసేస్తారు..భారీ ఇంటెలెక్చువల్ స్టఫ్ ని కూడా,అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు అమ్మ ఊరడింపులా మార్చెయ్యగల నైపుణ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది,అలాంటి వారిలో టాల్స్టాయ్ ఒకరు.
చిన్నప్పుడు యద్దనపూడి 'సెక్రటరీ' చదివి ఆహా,ఓహో అంటుంటే మా అమ్మగారు,అత్తా కోడూరి కౌసల్యా దేవి 'శాంతి నికేతన్' ఇంకా బావుంటుంది తెలుసా అని చాలా హైప్ క్రియేట్ చేశారు..ఆ పుస్తకం అప్పట్లో నాకు వెంటనే దొరకలేదు..తరువాత చాలా కాలానికి చదివినప్పుడు,"ఏంటి ఈ నస,చదువుకున్నవారై కూడా ఆ అమ్మాయీ,అబ్బాయీ కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా ఆ బాధపడిపోవడమేంటి!" అనిపించింది..నాకు అలా అనిపించడం ఎంత సమంజసమో,మా పెద్దవాళ్ళకి ఆ కథ అంతగా ప్రాణం కావడం కూడా అంతే సమంజసం..ఏ కథైనా అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండడం సహజం,ముఖ్యంగా ఠాగూర్,శరత్ వంటివారి రచనలు కొన్ని చదివేటప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది..టాల్స్టాయ్ రచనల్ని వాటితో పోల్చలేముగానీ ఈ రచన ప్రత్యేకం అటువంటి కోవలోకి వస్తుంది..
యువకుడైన Yevgeny Irtenev తన శారీరక అవసరాల నిమిత్తం Stepanida అనే ఒక రైతు కుటుంబంలోని స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు..ఆమెను తన అవసరాలు తీర్చే సాధనంగా చూస్తాడే తప్ప ఆమెపట్ల అతనికి ఏ భావనా ఉండదు..తరువాత Liza ను ప్రేమించి,పెళ్ళిచేసుకుని సుఖమైన సంసారం జీవితం గడుపుతుంటాడు..సంవత్సరంపాటు అంతా సజావుగానే ఉన్నా,మళ్ళీ ఒక సందర్భంలో Stepanida ఎదురుపడటంతో ఆమెపై లేదనుకున్న వ్యామోహం తిరిగి అతనిలో ప్రవేశిస్తుంది..ఒక వైపు Stepanida పై వాంఛను చంపుకోలేకా,మరోవైపు ఆదర్శవంతమైన వ్యక్తిగా,మంచి భర్తగా,మంచి మనిషిగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోలేకా,Yevgeny తనలో తనే మథనపడుతూ ఉంటాడు..గతించినకాలం Stepanida రూపంలో కళ్ళెదురుగా వచ్చి అతని ఆలోచనలు పూర్తిగా అదుపు తప్పుతాయి..Stepanida ఆలోచనలను మనసులో నింపుకుని ఒక గృహస్థుగా పాపం చేస్తున్నాననే భావన Yevgeny లో రోజురోజుకీ పెరిగిపోతుంటుంది...అపరాధభావన పూర్తిగా వశపరుచుకోగా,Yevgeny చివరకు ఒక నిర్ణయం తీసుకుంటాడు..ఆ ముగింపు ఏంటనేది మిగతా కథ..మొదట ఇచ్చిన ముగింపును మారుస్తూ,ఈ కథకి కొంతకాలం తరువాత మరో ముగింపునిచ్చారు టాల్స్టాయ్.
కథలు టైమ్ ట్రావెల్ చేయిస్తాయంటారు..కానీ కొన్ని కథల విషయంలో టైమ్ ట్రావెల్ చేసే సంసిద్ధత,ముందుగా పాఠకుల్లో ఉండాలి..టాల్స్టాయ్,ఠాగోర్ లాంటి వారిని చదివినప్పుడు ఆ సంసిద్ధత మరింత అవసరం..ఈ నవలికని కేవలం ఒక మగవాడి 'సెక్సువల్ ఎమోషన్స్' దృష్టికోణం నుంచి మాత్రమే చూస్తే,టాల్స్టాయ్ ని అర్ధం చేసుకునే పరిపక్వత ఇంకా రాలేదంటాను..ఉదాహరణకి అన్నాకరీనినా లో కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ నే తీసుకున్నారు..Yevgeny కథని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో అంతర్లీనంగా అద్భుతమైన సైకోఅనాలిసిస్ కనపడుతుంది..మనిషి జీవితమంతా అదుపుతప్పే కోరికల్ని అణుచుకుని,సమాజం ఆమోదించే నియమాల మధ్య సౌకర్యవంతంగా ఇమిడిపోయే దిశగా చేసే సాధనలోనే గడిచిపోతుంది..ఇక్కడ Stepanida పాత్ర,మనిషిలో మోహానికి ఒక ప్రతినిధి మాత్రమే..Yevgeny చివరకు వచ్చేసరికి ఈ నరకయాతన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం మొదటి ముగింపైతే,రెండో ముగింపులో తనను వ్యామోహంలో ముంచేసిన Stepanida ను దోషిగా భావించి ఆమెను చంపి,శిక్షననుభవించి తిరిగివచ్చి,తాగుడుకు బానిసవ్వడం రెండో ముగింపు..
And indeed, if Yevgeny Irtenev was mentally deranged when he committed this crime, then everyone is similarly insane. The most mentally deranged people are certainly those who see in others indications of insanity they do not notice in themselves.
అంటూ ఈ రెండు ముగింపుల్లో అసలు 'డెవిల్' ఎక్కడుందనేది పాఠకుల్నే తేల్చుకోమంటారు టాల్స్టాయ్.
Image Courtesy Google |

No comments:
Post a Comment