కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన వోల్గా తెలుగు రచన 'విముక్త' ను 'ది లిబరేషన్ ఆఫ్ సీత' గా ఆంగ్లంలో అనువదించారు..'ప్రేమ' కి మల్లే ఫెమినిజానికి కూడా నేటితరం ఆపాదిస్తున్న నిర్వచనాల్ని చూసి స్త్రీవాదమంటే వెగటు పుట్టిన సమయంలో ఈ రచన, మూసస్త్రీవాద రచనలకంటే విభిన్నంగా అనిపించింది..
Image Courtesy Google |
మన భారతీయులకి రామాయణమంటే 'రాముడి కథే' గానీ 'సీత కథ' కాదు..హైందవ సంస్కృతిలో వేళ్ళూనుకుపోయిన ఆర్యధర్మం తాలూకా విషపుశాఖలు ఇక్కడే మొదలవుతాయి..రామునితో సమానంగా కష్టనష్టాలకోర్చిన ఆమెను అగ్నిలో దూకి శీలపరీక్ష చేసుకోమన్నా,నిండు గర్భిణిగా అడవులకు పంపినా,మానవరూపంలో సంచరించిన రాముణ్ణి దేవుడిగానే కొలిచే సంస్కృతి మనది..రామాయణానికి దైవత్వాన్ని ఆపాదించి,నరుడిగా పుట్టిన రాముడిలో కూడా లోపాలుంటాయని అంగీకరించలేని మూఢ భక్తి మనది..భారతీయ సమాజంలో పితృస్వామ్య ఆధిపత్యపు మూలాలు ఈనాటివి కాదు..ఈ వ్యవస్థలో తరతరాల నుండీ స్త్రీ అస్తిత్వం ఎప్పుడూ పురుషుడితోనే ముడిపెట్టబడి ఉంది..ఈనాటికీ ఫలానా వారి భార్య అనో,ఫలానా వారి కుమార్తె అనో,లేదా ఫలానా వారి తల్లి అనో ఆమెకు పురుషునితో ఉన్న సంబంధాల ఆధారంగానే ఆమె అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తారు..ఆనాటి నుండీ స్త్రీ కూడా అదే నిజమని నమ్ముతూ,తనని తాను మభ్యపెట్టుకుంటూ జీవిస్తోంది..ఆర్యధర్మాలు,మనుధర్మ శాస్త్రాలు ఔపాసన పట్టి మనిషి తయారు చేసుకున్న ఈ కాల్పనిక అస్తిత్వపు ముసుగులు తీసేస్తే,వీటన్నిటి మధ్యా 'ఆమె' ఎవరు అనే ప్రశ్నకు,ఈ రచన ద్వారా సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు ఓల్గా..మరి ఈ ప్రశ్నలన్నీ సాక్షాత్తూ సీతాదేవికే వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథల్లో చర్చకొచ్చిన ప్రధానాంశం.
ఇందులో The Reunion, Music of the Earth,The Sand Pot,The Liberated, The Shackled అని మొత్తం ఐదు కథలున్నాయి..అన్ని కథలూ దేనికవే విడివిడిగా ఉన్నప్పటికీ ఇంటర్కనెక్టడ్ గా ఉంటాయి.. తొలి నాలుగు కథలూ సీత,శూర్ఫణఖ,అహల్య,రేణుకా దేవి,ఊర్మిళ దృష్టికోణాలనుంచి రాస్తే,చివరి కథ మాత్రం రాముడి దృష్టి కోణం నుంచి రాశారు..మొదటి కథలో వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీత,శూర్ఫణఖని కలుస్తుంది..శూర్ఫణఖ అనగానే ఒక భయంకరమైన రాక్షసి అని మనలో ఉగ్గుపాలతో వేసిన ముద్రను చెరిపేస్తూ శూర్ఫణఖ పాత్రను సరికొత్తగా మలిచారు రచయిత్రి..ఆమె ద్రావిడజాతికి చెందిన స్త్రీ అనీ,ఆర్యధర్మాన్ని స్థాపించే క్రమంలో ఆర్యులు కానివారిని ఆ కాలంలో రాక్షసులుగా వ్యవహరించేవారనీ అంటారు..ఈ కథలో సీత,శూర్ఫణఖల సమాగమాన్ని,ఒకే పురుషుని ప్రేమించి అవమానాలపాలైన ఇద్దరు తోబుట్టువుల కలయికలా చిత్రించారు..సీతలాగే రాముణ్ణి ప్రేమించి అన్నీ కోల్పోయిన శూర్ఫణఖ చివరకు తనను తాను తెలుసుకునేదిశగా అడుగులు వేస్తుంది..స్త్రీకి అసలైన విజయం,ఆమెకు పురుషుడితో ఉండే సంబంధాన్ని బట్టి ఉండదనీ,అంతఃసౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదనీ శూర్ఫణఖ సీతకు వివరిస్తుంది..పితృస్వామ్యపు సమాజంలో సహబాధితులుగా ఈ ఇద్దరూ తోబుట్టువులుగా మారతారు.
Surpanakha’s coming—how beautifully she had walked in. White jasmines in her hair. Garlands of yellow ganneru around her neck. Bracelets of nilambara on her wrists. She was like a walking creeper in bloom.
"Was anguish inevitable for women who love Sri Rama ? "
'I’ve realized that the meaning of success for a woman does not lie in her relationship with a man. Only after that realization, did I find this man’s companionship.’
'ది మ్యూజిక్ ఆఫ్ ఎర్త్' అహల్య కథ..ఇందులో నాకు అన్నిటికంటే నచ్చిన కథ ఇదే..వనవాస సమయంలో అహల్యను కలిసిన సీతతో స్త్రీ శీల పరీక్ష చేయడాన్ని పురుషులు హక్కుగా భావిస్తారంటూ,బ్రాహ్మణోత్తములు,తపోధనులు కూడా ఈ విషయాలకొచ్చేసరికి గుడ్డిగా వ్యవహరిస్తారు అని తన భర్త గౌతముణ్ణి ఉద్దేశించి అంటుంది..తిరిగి మళ్ళీ వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతను కలవడానికొచ్చి 'జరిగిందంతా మంచికే,ఈ పరీక్షలన్నీ నిన్ను నువ్వు తెలుసుకోడానికి మార్గాలే,ఈ ప్రకృతినీ,మనిషి పుట్టుకనీ,జీవపరిణామాన్నీ గురించి ఆలోచిస్తే నువ్వు రాముడికి మాత్రమే చెందవు సమస్త విశ్వంలో నువ్వు కూడా ఒక భాగమని తెలుస్తుంది' అని ఓదారుస్తుంది.
His property, even if temporarily, had fallen into the hands of another. It was polluted. Pollution, cleanliness, purity, impurity, honour, dishonour—Brahmin men have invested these words with such power that there is no scope in them for truth and untruth. No distinction.’
‘But he has disowned you.’ ‘Pity, that’s his loss.’ ‘And you … they say you lived like a lifeless stone for years.’ ‘That’s what you think. I have spent all these years thinking about my identity in this universe. I have learned how the world runs—on what morals and laws, and what their roots are. I have gained a lot of wisdom.’
What does conducting an enquiry mean, Sita? Distrust, isn’t it? Wouldn’t it be better, instead, to believe in either your innocence or guilt? … All men are the same, Sita.
మరో కథ రేణుకది ..జమదగ్ని ముని భార్య అయిన ఆమె ఆర్యధర్మపాలనలో విచక్షణ కోల్పోయి కన్నతల్లైన తన తలను నరకడానికి వచ్చిన పరశురాముణ్ణి గురించి సీతకు చెప్తూ,కొడుకులు కూడా పితృస్వామ్య వ్యవస్థలో భాగమేనంటూ,లవకుశులు కూడా తుదకు తండ్రి రాముణ్ణే అనుసరిస్తారు అని సీత కళ్ళకు కమ్మిన తల్లిప్రేమ తాలూకా తెరల్ని తొలగిస్తుంది.
Most often, women don’t realize that they are part of the wider world. They limit themselves to an individual, to a household, to a family’s honour. Conquering the ego becomes the goal of spirituality for men. For women, to nourish that ego and to burn themselves to ashes in it becomes the goal. Sita, try to understand who you are, what the goal of your life is.
'If they understand that their paativratyam and fidelity are like these sand pots, they will be able to live in peace.’
'But such is the wisdom of these spiritual seekers. No matter how much wisdom they earn through penance, they continue to have a dogmatic view on the paativratyam of their wives.'
‘Does a woman have a world other than her husband’s? Is there a higher meaning to a woman’s life than motherhood?
'ది లిబరేటెడ్' ఊర్మిళ కథ..తనను కనీసం సంప్రదించకుండా,తన ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండా లక్ష్మణుడు అన్నవెంట అడవులకు వెళ్ళడం వల్ల తీవ్రవేదనను అనుభవించిన ఊర్మిళ,పధ్నాలుగు సంవత్సరాలు ఒంటరిగా ఒకే గదిలో ఉండిపోతుంది..ఈ సమయంలో ఆమె ఆలోచనలు బంధాలన్నిటినుంచీ విముక్తి వైపు ప్రయాణించి ఆమెను ఆత్మశోధన దిశగా నడిపిస్తాయి..
Power is the root cause of all sorrow, Akka. Do you know another strange thing? We must
acquire this power. And then give it up. I shall not submit to anyone’s power. Nor will I bind anyone with my power. Then I will feel I have liberated myself. I will feel only joy within myself! Great peace! Much love! Compassion for all!
‘It’s a pity how people get bogged down by structures of power. Unable to see how they can liberate themselves, they rot in unrest, sorrow and hatred.
చివరి కథ 'The Shackled' ప్రత్యేకం రాముడి కథ..ఇక్కడే ఓల్గా నాకు బాగా నచ్చారు..స్త్రీవాదమంటూ రాముణ్ణో,రావణుణ్ణో విలన్స్ ని చెయ్యకుండా రెండు వైపులనుండీ సంతులనం పాటిస్తూ కథను రాయడం చాలా నచ్చింది..రాముడు రాజుగా స్వతంత్రుడు కాదు..ఆర్యధర్మమనే కారాగారంలో బందీగా మారి,సమాజశ్రేయస్సు కోసం మనస్సాక్షికి వ్యతిరేకంగా సీతను కష్టాలపాలు చేశాననే వేదన ఆయనలో కనపడుతుంది..ఈ కథలో ఆయన ఒక దేవుడుగా కాక ప్రజాక్షేమం కాంక్షించే రాజుగా,సీతను అమితంగా ప్రేమించే భర్తగా,రెండు విధాలా నలిగిపోతూ,యాంత్రికంగా తన రాజధర్మం నిర్వర్తించే ఒక నిస్సహాయుడైన మనిషిగా మాత్రమే కనిపిస్తాడు..
Human laws change. Human beings change them. Unable to cope with the change, they get perturbed. Slowly they get used to the change. Once the change stabilizes, they desire change again. Human law becomes the law of the time, and the law of the moment becomes the law of human beings. During the period of transition, the lives of the people who are key to the change go haywire. Rama was in exactly such a situation now.
‘Mind? My mind? I who execute the Arya Dharma without a second thought, do I have a mind of my own?’
నేను వోల్గా రచనల్లో ఒక్క 'సహజ' తప్ప ఇతరత్రా రచనలేవీ చదవలేదు..కానీ మా ముందు తరానికి ఆవిడంటే ఎందుకిష్టమో ఈ పుస్తకం చదివాకా అర్ధం అయ్యింది..విజయ్ కుమార్,విజయశ్రీ గార్ల అనువాదం బావుంది..అక్కడక్కడా 'అన్న,తాత,గన్నేరు పూలు,వదిన' లాంటి తెలుగు భాషా పదాలు చాలానే దొర్లాయి..ప్రాంతీయ భాషానువాదాల్లో ఇది సహజమే,నేను చదివిన కొన్ని మలయాళ అనువాదాల్లో అయితే ఈ మూలభాషాపదాల వాడకం ఇంకా హెచ్చు..'చరిత్రను విజేతలు రాశారు' అని చర్చిల్ అన్నమాట వాస్తవమైతే,ఆర్యధర్మ సంస్థాపన దిశగా జరిగిన చరిత్ర చూస్తే,పితృస్వామ్య వ్యవస్థలో పావులుగా నలిగిపోయిన స్త్రీల ఆత్మఘోష వినిపించే ప్రయత్నం ఈ రచన..సందర్భాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ రూపాంతరం చెందవలసిన నియమాలను గుడ్డిగా అనుసరిస్తూ,శాస్త్రాలూ,పురాణాలూ ఘోషిస్తున్నాయని అంటూ కాలదోషం పట్టిన కొన్ని మూఢనమ్మకాలను పట్టుకువేలాడే ప్రతి సమాజానికీ ఈ కథలు చెంపపెట్టు లాంటివి,ఆనాటి సీత నుండీ ఈతరం స్త్రీ వరకూ,ఏకాలానికైనా అన్వయించుకోతగ్గవీను..ఈ కథల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే,ఎక్కడా కూడా ఇదొక కల్పిత కథని పాఠకులకు అనిపించకుండా రాశారు ఓల్గా..ఇదే నిజమైన రామాయణమేమో,సీత ఇలాగే మథనపడిందేమో అన్నంతగా,ప్రతిఘట్టాన్నీ జాగ్రత్తగా మలిచారు..రాముడు అనుమానిస్తే,రాముడి కంటే తన మీద వ్యామోహంతో సర్వం కోల్పోయిన రావణుడే అసలైన ప్రేమికుడు అని సీత భావించి రావణుడి చితిలో దూకిందని చలం ఒక సందర్భంలో రాశారని చదివినప్పుడు,ఆ మధ్య మణిరత్నం సినిమా 'రావణ్' గుర్తుకొచ్చింది..పుస్తకం చివర్లో ఓల్గా ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి..చివరగా రామదాసు 'మముబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ! ' అని ప్రార్ధిస్తాడు,కానీ 'మనల్ని రక్షించడానికి సీతా దేవే చాలు' అని ఇంటర్వ్యూ ముగించారు .. :) స్త్రీవాద రచనలు పెద్దగా ఇష్టపడని నాకు చిత్ర బెనర్జీ దివాకరుని రాసిన 'ది ప్యాలస్ ఆఫ్ ఇల్యూషన్స్' తరువాత బాగా నచ్చిన పుస్తకం అంటే ఇదే.
పుస్తకం నుండి మరికొన్ని,
Since Rama insulted Surpanakha, Ravana wanted to take revenge on Rama by abducting me. Do women exist only to be used by men to settle their scores? Rama and Lakshmana would not have done this to Surpanakha if they did not know that she was Ravana’s sister. Rama’s objective was to provoke Ravana; his mission, to find a cause to start a quarrel with Ravana, was accomplished through Surpanakha. It was all politics.
‘Why do you look down upon animals, Sita? We should love animals and nature. We should worship them. We should befriend them. That’s the duty of humans. Ignoring that basic duty, you think what is written in books is civilization. Is that right? You have come to the forest from the city. Why insist so much on the civilization of the cities? Isn’t nature the best teacher?'
No comments:
Post a Comment