Image courtesy Google |
నేను J.M.Coetzee 'Youth' చదివే సమయానికి సత్యజిత్ రే 'అపు ట్రయాలజీ' పూర్తిగా చూడలేదు..అందులో అపు సినిమాలో అద్భుతమైన సన్నివేశాల గురించీ,ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ గురించీ రాశారాయన..సినిమా కంటే ఆ సంగీతం తననెక్కువ ఆకట్టుకుందని చెప్తారు..అప్పటికి చాలా కాలం క్రిందట 'పథేర్ పంచాలి' చూసినా,సత్యజిత్ రే సినిమాను ఆస్వాదించి,అభినందించే పరిపక్వత బహుశా నాలో లేకపోవడం వల్ల కావచ్చు,బిభూతి భూషణ్ పుస్తకం నచ్చినంతగా ఆ సినిమా నన్ను ఆకట్టుకోలేదు..Coetzee ని చదివాక మళ్ళీ అపు ట్రయాలజీ మరోసారి చూశాను..అప్పుడు కలిగిన అనుభవం మాత్రం పూర్తిగా వేరు..'14 Stories that Inspired Satyajit Ray' లో ఒక దర్శకుడిగా ప్రపంచ స్థాయి కీర్తినార్జించిన రే సినిమాలకు స్ఫూర్తినిచ్చిన కొన్ని కథల్ని ఎంపిక చేసి రచయిత భాస్కర్ ఛటోపాధ్యాయ్ మనకందించారు...సత్యజిత్ రే అభిమానులకు ఈ పుస్తకం,మరోసారి తమ అనుభవాల్ని నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
బెంగాలీ సాహిత్యంతోనూ,వారి సంస్కృతీ సంప్రదాయాలతోను శరత్,టాగోర్ లాంటి వారి రచనల ద్వారా సుపరిచితులైన పాఠకులకు ఈ కథలేవీ కొత్తగా అనిపించవు..ఈ పధ్నాలుగు కథలకూ భాస్కర్ ఛటోపాధ్యాయ్ చేసిన అనువాదాలతో పాటు పుస్తకం చివర్లో Translator's నోట్ ; సత్యజిత్ రే బెంగాలీ నటుడు Chhabi Biswas గురించి రాసిన ఒక వ్యాసం ; షర్మిలా ఠాగోర్ మాటల్లో 'దేవి' సినిమా గురించిన అనుభవాలు ; ధ్రితిమాన్ ఛటర్జీ తో ఇంటర్వ్యూ లాంటివి దర్శకుడు 'సత్యజిత్ రే' గురించి మనకు తెలియని మరిన్ని విషయవిశేషాల్ని తెలియజేస్తాయి..ఇందులో ఠాగోర్ 'తీన్ కన్యా సిరీస్' లో మూడు కథలూ,సత్యజిత్ రే రాసిన 'అతిథి','పికూస్ డైరీ' అనే రెండు కథలూ మినహాయిస్తే మిగతా కథలన్నీ వేర్వేరు రచయితల నుండి సంగ్రహించినవే..కాగా మున్షీ ప్రేమ్ చంద్ రాసిన రెండు హిందీ కథలు 'సద్గతి (ఓంపురి) ,షత్రంజ్ కే ఖిలాడీ' తప్ప మిగతావన్నీ బెంగాలీ కథలే.
ఇందులో తొలి కథ 'దేవి' (The Goddess)..19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో బెంగాలీ సమాజంలో వేళ్ళూనుకుపోయి ఉన్న మూఢ మతఛాందసవాదాలపై ప్రభాత్ కుమార్ ముఖోపాధ్యాయ్ రాసిన 'దేవి' (The Goddess) కథను షర్మిళా ఠాగోర్ ప్రధాన పాత్రలో నిర్మించారు..ఈ సినిమా షర్మిళా నటజీవితంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు..మరో కథ 'అతిథి' ని రే ముఖ్యంగా పిల్లలు/యువత కోసం రాశానని చెప్తారు..ఆ కథను 'ఆగంతుక్' గా ఉత్పల్ దత్ ప్రధాన పాత్రలో నిర్మించారు..అందులో ఉత్పల్ దత్ నటన ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉంటుంది..నేను కూడా ఈ కథ చదువుతున్నంతసేపూ ఉత్పల్ దత్ ను ఊహించుకుంటూనే చదివాను..కానీ సత్యజిత్ రే ఇందులో చాలా కథల్ని యథాతథంగా చిత్రించకుండా,సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు-చేర్పులూ చేశారు..ఉదాహరణకి ఆగంతుక్ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో ఉన్న ధ్రితిమాన్ ఛటర్జీ పాత్ర కథలో నిజానికి ఉండదు..ఇలాంటి మార్పులు ఆయన సినిమాల్లో చాలానే ఉన్నాయి..కానీ బెంగాలీ సినిమాలు ముఖ్యంగా సాహిత్యాన్ని ఆధారంగా చేసుకునే రూపొందుతాయి కాబట్టి,సినిమా కథలే ప్రేక్షకులకు తొలిగా పరిచయమవుతాయి..ముఖ్యంగా 5% ను మించి మూలకథ తెలిసిన ప్రేక్షకులు ఉండరని రచయిత అంటారు.
ఒక కథను రాసినప్పుడు రచయిత ఆలోచనలు,దర్శకుని దృష్టికోణం నుంచి చూసేటప్పుడు రూపాంతరం చెందడం సహజం,అనివార్యం..రచయిత చెప్పాలనుకున్న విషయం,దర్శకుడు ఊహించిన విషయం మధ్యా గ్యాప్ రావడం తప్పనిసరి..కానీ రే సినిమాల్ని పరిశీలిస్తే,ఆయన తన క్రాఫ్టింగ్ తో ఆ గ్యాప్ ను అత్యంత ప్రతిభావంతంగా చెరిపేస్తారు..అయినప్పటికీ ఈ కథలు చదివినప్పుడు,విజువల్ మీడియానికీ,పుస్తకానికీ ఉన్న తేడా చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది..
ఉదాహరణకు ఒక కథ రాసేటప్పుడు రచయిత ఒక సంభాషణ గురించి రాస్తున్నప్పుడు తన భావాలకు తగిన మాటలు రాస్తే సరిపోతుంది..అంటే ఇక్కడ ఇమాజినేషన్ ను పూర్తిగా పాఠకులకు వదిలివేసే స్వేఛ్చ రచయితలకు ఉంటుంది..మరి దర్శకుడికి ఆ అవకాశం ఉండదు అంటూ,దర్శకత్వంలోని ఇబ్బందుల గురించి ఈ క్రింది విధంగా రాశారు.
The filmmaker does not have the luxury to leave the character’s description to the imagination of his audience.He has to show a person, her build, her age, her attire, her mental state of mind. His art is, in some sense, that of a more specific projection. And in that sense, telling a story in a cinematic medium is quite different from telling a story through the pages of a book. Both have their own challenges, both present difficulties of varying nature in front of their creators. And what works in one medium may not work in the other.
ఈ కథల్లో 'దేవి','ఆగంతుక్','తీన్ కన్య సిరీస్','పికు','షత్రంజ్ కే ఖిలాడీ','మహానగర్' లాంటి కొన్ని సినిమాలు నేను చూశాను..ఇవి మెజారిటీ సత్యజిత్ రే అభిమానులకు కూడా సుపరిచితమైనవే..వీటితో పాటు నాకు తెలియని సినిమాలు కూడా చాలానే ఉన్నాయి..ప్రేమేంద్ర మిత్రా రాసిన 'కాపురుష్', తారాశంకర్ బందోపాధ్యాయ్ రాసిన 'జల్ సాగర్',రాజ్ శేఖర్ బసు రాసిన 'పరష్ పత్తర్' లాంటి మరి కొన్ని కథలు చదివాకా ఆ సినిమాలను రే ఎలా తీశారో చూడాలనే ఆసక్తి కలిగింది..మధ్యతరగతివారు తన ప్రేక్షకులని చెప్పుకునే రే సినిమాల్లో(కథల్లో) ఒక సామాన్యుడు సులువుగా ఐడెంటిఫై చేసుకునే అన్ని అంశాలూ పుష్కలంగా ఉంటాయి..మిగతా పుస్తకాలేవైనా ఇలాంటి కథల్ని ఆపకుండా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు..కానీ రే చేతుల్లో కళాఖండాలుగా రూపొందిన ఈ కథల్లో కొన్ని సంఘటనల్ని చదువుతున్నప్పుడు,సత్యజిత్ రే ఈ సందర్భాన్ని ఎలా స్క్రీన్ మీద చూపించారా అనే కుతూహలం మధ్యమధ్య లో అడ్డుపడుతూ త్వరగా పేజీలు తిప్పనివ్వదు..అదృష్టవశాత్తూ యూట్యూబ్ లో ఈ సినిమాలు అన్నీ అందుబాటులో ఉండడం వల్ల,ఏకకాలంలో ఒక్కో కథనీ చదువుతూ,మధ్యలో యూట్యూబ్ లో ఆ సినిమా తాలూకూ కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలను చూస్తూ పుస్తకం పూర్తి చేసేసరికి నాకు చాలా సమయం పట్టింది..చాలా ఏళ్ళ క్రిందట చదివిన ఠాగోర్ కథలు మరోసారి రచయిత మాటల్లో అపురూపంగా చదువుకున్నాను..
'సినిమా పుస్తకానికి న్యాయం చెయ్యదు' అనేది జగమెరిగిన సత్యం.అందులోనూ పుస్తకప్రియుల్ని ఈ విషయంలో సంతృప్తి పరచడం అంత తేలికైన విషయం కాదు..కానీ సత్యజిత్ రే సినిమాలకి ఎందుకో ఈ సిద్ధాంతం వర్తించదనిపిస్తుంది..మూలకథను మర్చిపోయేలా చెయ్యగల నైపుణ్యం బహుశా రే కి మాత్రమే సాధ్యమేమో అన్నంతగా ఆయన పాత్రల చిత్రీకరణ ఉంటుంది..స్క్రీన్ ప్లే,బ్యాక్గ్రౌండ్ స్కోర్ ల మీద ఆయనెంత శ్రద్ధ పెడతారంటే,ప్రతి ఫ్రేమ్ లోనూ 'రే మార్కు' స్పష్టంగా కనిపిస్తుంది..ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన 'తీన్ కన్యా' సిరీస్ లో భాగంగా వ్యవహరించే ఠాగోర్ మూడు కథల్నీ (Monihara,Postmaster,Samapthi ) చదువుతున్నప్పుడు నాకు అసలు ఒరిజినల్ కథ ఇదీ అని గుర్తు రాలేదు..పైపెచ్చు సినిమానే ఒరిజినల్ వెర్షనేమో,ఆ కథలే సినిమా ఆధారంగా రాశారేమో అన్నంత భ్రమలో ప్రేక్షకుల్ని ఉంచేశారు రే..ఇందులో అన్ని కథలూ ఒక ఎత్తైతే,సత్యజిత్ రే తాతగారైన ఉపేంద్ర కిశోర్ రే రాసిన 'Goopy Gyne Bagha Byne' కథ ఒక్కటీ మరొకెత్తు..పిల్లలకు కూడా చాలా నచ్చే ఈ కథ మనల్ని అమాంతం చందమామ కథల కాలం నాటికి తీసుకువెళ్తుంది..
ఠాగోర్ ముగ్గురు స్త్రీల మనస్తత్వాలను విశ్లేషిస్తూ వివిధ దశల్లో స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించిన కథల్లో 'మోనీహార' కథ ఇపుడు మరోసారి చదివినప్పుడు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది..ఈ కథలో ఠాగోర్ స్త్రీ-పురుషుల మనస్తత్వాలను చిత్రీకరించిన తీరు ఆయన్ను 'స్త్రీ పక్షపాతి' అనడానికి అంగీకరించనివ్వదు..ఈ కథ ఒక్కటీ నాకు సినిమా కంటే కూడా బావుందనిపించింది.
‘A woman strives to acquire the love of her husband. If a man, because of his good nature, doesn’t provide her with that opportunity, then such a couple is doomed. In the new-age mantra of marital life, men have lost their intrinsic, inherent, god-gifted and well-meaning barbarism, and Phanibhushan was no exception. He was not successful in business, and he was a complete failure in his marital life.
At twenty-four, she looked like a fourteen-year-old. Perhaps people who have icy hearts, with no room for love, longing and emotions, are able to stay fresh and beautiful for a long time, without withering away with age.
‘The wife often understands her husband much better than he can ever hope to understand her. But the new-age weak-spirited man of today is a different animal altogether. There are broad, age-old categories under which to classify men—brave, blind, buffoon and so on. But these modern men can’t really be slotted into such categories.
పుస్తకం నుండి మరికొన్ని..
'The Story of a Coward' (కాపురుష్)నుండి,
I hadn’t realized I would begin to feel that she was being too normal with me. We both knew the sun had set. But had the faint hue of the rays clung to the clouds of the west, my sensitive ego would have been satisfied.
'ఆగంతుక్' నుండి,
‘We, on the other hand, have always considered the rooted and settled life as the one true way of life. We can’t afford to run around aimlessly. We need to earn our living, we have responsibilities to shoulder, we have to raise our children. I’m assuming you aren’t married?
He told me that once you take the first step out of your house, the whole world becomes a home to you. And then, you simply stop differentiating between black and white, rich and poor, wild and civilized—everything becomes the same.
'మోనిహారా' నుండి,
Even when one leaves an apparently empty space behind, one really leaves several impressions of one’s love, fond signatures of one’s care, on inanimate, insignificant objects.
'పోస్ట్ మాస్టర్' నుండి,
Oh, the human heart! It keeps hoping against hope. It ignores all logic. It doesn’t learn from mistakes. It overlooks the strongest of evidences and clutches at the faintest of hopes, trying to keep the glimmer of expectation locked within itself. And one day, when that very hope cuts through the heart to drink its blood and escapes, the heart simply looks for some other hope to lean on.
ఠాగోర్ రాసిన 'సమాప్తి' కథలో మృణ్మయి బాల్యం నుండి యవ్వనానికి మారే దశను ఠాగోర్ వర్ణించినట్లు వర్ణించడం ఎవరికీ సాధ్యం !!
Ancient stories talk about highly skilled ironsmiths who are adept at making such sharp swords that if such a sword is used to cut a person in half, he would not even realize it until he is pushed and the two halves fall off. God’s sword was as sharp as that. He had cut through Mrinmoyi’s childhood and youth so swiftly that she hadn’t even realized it, and all it needed was a shove for the two to be separated from each other, leaving her in a dazed and wounded state of mind.
No comments:
Post a Comment