స్తీలు సమాజానికి,సంప్రదాయాలకి తలొగ్గి బ్రతికే ఆ కాలంలో ఒక సాధారణ పెర్షియన్ శరణాగతుల కుటుంబంలో జన్మించిన ఆమె ఒక శక్తివంతమైన సామ్రాజ్యానికి చక్రవర్తిణి కావాలనుకుంది..ఎనిమిదేళ్ళ వయసులో ఒక రాకుమారుణ్ణి నేనెందుకు వివాహమాడకూడదు అని తనలో తాను ప్రశ్నించుకుంది..పర్షియాకు చెందిన
ఘియాస్ బేగ్ (Ghias Beg) ఇంట నాలుగో సంతానం గా జన్మించిన 'మెహరున్నిసా' (నూర్జహాన్) జన్మించేసరికి ఆ బిడ్డకి గుక్కెడు పాలు పట్టలేని దీనావస్థలో ఆ పాపని ఒక చెట్టు దగ్గర వదిలేస్తాడు ఘియాస్..స్నేహితుడు,మసూద్ కంటపడి అదృష్టవశాత్తూ మళ్ళీ తల్లిదండ్రులని చేరిన ఆ పసిపాప,భవిష్యత్తులో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిణి అవుతుందని ఆనాడు ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు.
ఇందు సుందరేశన్ రచించిన 'The Twentieth Wife','తాజ్ మహల్ ట్రయాలాజి'లో మొదటి భాగం..ఇది 2002 లో పబ్లిష్ అయ్యింది..దీని తర్వాత 'The Feast of Roses','Shadow Princess' వెలువడ్డాయి..
నవలలోకి వెళ్తే,మెహరున్నిసా తండ్రి ఘియాస్ కు అక్బర్ కొలువులో ఉన్నతమైన స్థానం లభించడంతో అతని కుటుంబం ఆగ్రాలో స్థిరపడుతుంది..బాల్యం నుంచీ తన అందంచందాలతో,తెలివితేటలతో,వివేకం తో తండ్రికి ప్రియ పుత్రికగా పెరుగుతున్న మెహరున్నిసా,యువరాజు సలీం ప్రథమ వివాహం సమయం లో మహారాణి రుకయ్యా బేగంను తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది..ఆ ఎనిమిదేళ్ళ వయసులో తొలిసారి సలీం గురించి,అతని వివాహం గురించి విన్నప్పుడు ఆ రాకుమారుని గురించిన విశేషాలు మెహెరున్నిసాను అమితంగా ఆకర్షిస్తాయి..సలీం ని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆ వయసులోనే ఆమెలో మొగ్గ తొడుగుతుంది..ఈ లోగా రుకయ్యా ఆజ్ఞ తో అంతఃపురానికి రోజూ మెహెరున్నిసా రాకపోకలు సాగుతూ ఉండేవి..ఈ సమయం లోనే ఆమె రుకయ్యా మంత్రాంగం నడిపే తీరు,రాజనీతిజ్ఞత,జేనానా (అంతఃపురం లో స్తీల విభాగం) బరువు బాధ్యతలు నిర్వహించడం వంటి విషయాలను దగ్గరగా పరిశీలించి ఆకళింపు చేసుకుంటుంది..యుక్తవయస్సు చేరేసరికి ఆమెలో సలీం పట్ల ఆకర్షణ,అతన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక మరింత బలీయంగా మారుతుంది..ఒక సందర్భంలో ఆమెను జెనానా తోటలో చూసిన సలీం తొలి చూపు లోనే ఆమె అందం పట్ల ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు..ఈలోగా అక్బర్ చక్రవర్తి కోరిక మేరకు ఆమె వివాహం ఒక సైనికుడు అలీ కులీ తో జరిపించాలని తలపోస్తాడు ఘియాస్..ఈ విషయం తెలిసిన సలీం,అక్బర్ తో ఆమె విషయం మాట్లాడినప్పటికీ వచనాబద్ధుడైన అక్బర్ అలీ కులీ తో ఆమె వివాహం ఆపడానికి తిరస్కరిస్తాడు..ఫలితంగా తండ్రి పరువుప్రతిష్టలకు భంగం కలగకూడదని అయిష్టంగానే అతన్ని వివాహాడుతుంది మెహెరున్నిసా..ఆమెకంటే వయసులో బాగా పెద్దవాడవడమే కాకుండా,అలీ కులీ ఏ విధంగానూ ఆమెకు తగిన భాగస్వామి కాలేక పోతాడు..మొరటుతనం,కఠినత్వం కలబోసినట్లుండే అలీతో ఆమె వైవాహిక జీవితం ఒక రాజీగా పరిణమిస్తుంది..పైగా చాలా కాలం పాటు సంతానలేమితో ఆమె జీవితం మరింత నరకప్రాయమవుతుంది..
మరో ప్రక్క సలీం సింహాసనం కోసం తండ్రి అక్బర్ తో పరోక్ష యుద్ధం చేస్తుంటాడు..వయసు మీద పడుతున్నా అక్బర్ తనకి సింహాసనం అప్పగించకపోవడం అతనిలో తీవ్ర ఆగ్రహావేదనలు కలిగిస్తుంది..దీనికి తోడు మెహరున్నిసా ను కేవలం మూడు సందర్భాల్లో కలిసినా,ఆమె మీద వ్యామోహం కూడా అతన్ని కుదురుగా ఉండనివ్వదు..
సింహాసనం కోసం సలీం పన్నాగాలు పన్నుతూ ఉంటె,సలీం కోసం మెహరున్నిసాలో వివాహానంతరం కూడా అంతర్మధనం కొనసాగుతూ ఉంటుంది..ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరి దారులూ మళ్ళీ కలిసాయా ? సమాజం,సంప్రదాయాలు మెహెరున్నిసాను తను కోరుకున్నది దక్కించుకోడానికి అంగీకరిస్తాయా ? ప్రజలకి ఆదర్శమైన ఒక చక్రవర్తి స్థానాన్ని ఆశిస్తూ,మరో వ్యక్తి భార్యని కోరుకోవడం సలీంని సింహాసనానికి దూరం చేస్తుందా ? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న,అసలు వారిద్దరిదీ ప్రేమేనా ? ఇలా పలు ప్రశ్నలతో కథ అనేక మలుపులు తిరుగుతుంది..
He had wanted her longer than he had wanted the throne.It was not just that she was beautiful woman.Beautiful women he could command at the snap of his fingers,the merest inclination of his head..He admired her fierce independence,her deep sense of self,her conviction about her actions.She scorned the rules,trod on them.
ఈ నవలలో అక్బర్ కాలంలో సమాజం స్థితిగతులు,అధికారం కోసం ఎత్తుకు పై ఎత్తులూ చాలా ఆసక్తికరం గా ఉంటాయి..ఇందులో అక్బర్ ఒక చక్రవర్తిగా కంటే,ఒక తండ్రిగానే ఎక్కువ కనిపిస్తాడు..సలీం అధికారం కోసం తనపై విష ప్రయోగం చేసాడని తెలిసి కూడా అతన్ని ఏమీ అనకుండా,తనలో తను కుమిలిపోవడం,అదే సమయం లో ఒక చక్రవర్తిగా తన హోదాకి భంగం కలగకుండా గాంభీర్యం ముసుగు వేసుకోవడం అక్బర్ ది గ్రేట్ లోని మరో కోణాన్ని మనకు పరిచయం చేస్తాయి..మనవడు,ఖుస్రో (సలీం ప్రథమ సంతానం)-సలీంల మధ్య ఆధిపత్య పోరుకి మౌన సాక్షిగా,ప్రపంచాన్ని జయించినా ఇంటి పోరుని అడ్డుకోలేని నిస్సహాయుడైన చక్రవర్తి మనకి ఒక సాధారణ కుటుంబ పెద్దని జ్ఞప్తికి తెస్తాడు..
Akbar could see only the heat-broiled plains beyond the Yamuna river,dotted here and there with stunted trees.But somewhere out there,in the dust of the plains,its sandstone buildings decaying,lay the city of Fatepur Sikri.The city he had built for Salim.
ఇందులో రుకయ్యా బేగం,జగత్ గోసిని,అస్మత్ బేగం,సలీమా సుల్తానా వంటి మరికొందరు శక్తి వంతమైన స్త్రీల వ్యక్తిత్వాలు చాలా ఆకట్టుకుంటాయి..రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రాధాన్యత లేకపోయినా తెర వెనుకనుండి వారు మంత్రాంగం నడిపే తీరు,కీలక రాజకీయ నిర్ణయాల్లో వారి ప్రాధాన్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..కానీ ఇది ప్రత్యేకం మొఘల్ రాణుల్లో వివాదాస్పద చక్రవర్తిణి నూర్జహాన్ కథ..కోరుకున్నది సాధించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డిన జహంగీర్ కథ..అయితే,నాకు 'The Twentieth Wife' ఒక ప్రేమ కథగా కంటే ఇద్దరు విడి విడి వ్యక్తుల జీవిత లక్ష్య సాధనగానే అనిపించింది..అధికారం సలీం జీవిత లక్ష్యం..దానికోసం తండ్రినీ,చివరకి కన్న కొడుకు ఖుస్రోని కూడా శత్రువులని చేసుకుంటాడు...కొన్ని సందర్భాలో సలీం ప్రవర్తన చిన్న పిల్లాడి మంకుపట్టుని తలపిస్తుంది..అంతలోనే అతనిలో కరడుగట్టిన రాజనీతిజ్ఞుడు ఉన్నట్టుండి ప్రత్యక్ష్యమై మనల్ని విస్మయపరుస్తాడు ..సలీం,జహంగీర్ చక్రవర్తిగా మారాక,తనకు ఎదురుతిరిగిన కొడుకుని ఖైదీగా చేసి ప్రక్కన కూర్చోపెట్టుకుని,లాహోర్ వీధుల్లో ఖుస్రో సైన్యాన్ని కిరాతకం గా ఊచకోత కోసిన శవాలని చూపించడం అతని అధికార దాహానికి పరాకాష్ట..ఒకనాడు పావురాలకి గింజలు వేస్తూ ఆనందించిన ఆ యువకుడు,ఈ కరడు గట్టిన మొఘల్ చక్రవర్తిలో మనకి వెతికినా కనిపించడు..
ఇందులో మెహెరున్నిసా,సలీంని ఒక వ్యక్తిగా కంటే,ఒక రాకుమారుడుగా ఎక్కువ ప్రేమించింది అనిపిస్తుంది..అతనిలో ఆమెను ఆకర్షించిన మరో విషయం,తను కోరుకున్నది దక్కించుకోవడం లో సలీం చూపే పట్టుదల,తెగింపు..ఆ క్రమంలో అతను వేసే ఏ ఒక్క అడుగూ ఆమెకు తప్పు గా తోచదు..వారిద్దరి మనస్తత్వాలలో ఈ విషయం లో చాలా సారూప్యత కనిపిస్తుంది..ప్రవృత్తులు వేరైనా వారు ఇద్దరూ ఉమ్మడిగా కోరుకునేది ఒక్కటే,అధికారం..అధికార దాహంతో సలీం పదిహేనేళ్ళు పాటు పరితపిస్తాడు..అలాగే మెహరున్నిసా తుదికంటా సలీం భార్య కావాలని కోరుకుంటుంది,తద్వారా పట్టపురాణిగా తెర వెనుకనుండి మొఘల్ సామ్రాజ్య భవితవ్యాన్ని శాసించాలని కలలు కంటుంది..ఓపిగ్గా తగిన సమయం వరకూ వేచి చూసి మరీ తను అనుకున్నది సాధించుకుంటుంది..వీరిద్దరి అనుబంధం నిర్వచించడానికి కొంచెం సంక్లిష్టం గా అనిపిస్తుంది..సలీం అప్పటికే 19 వివాహాలు చేసుకుంటాడు..కానీ ఆ వివాహాలు అన్నీ రాజకీయ ప్రాతిపదికన జరిగినవే..మెహరున్నిసాను వివాహమాడటం మాత్రం వీటన్నిటికీ అతీతంగా జరుగుతుంది..ఆ కోణం లో ఆలోచిస్తే సలీం ప్రేమలో ఎంతో కొంత స్వచ్ఛత కనిపిస్తుంది..కానీ ఆమె విషయంలో సలీం పట్ల ప్రేమ కన్నా రాణి కావాలన్న స్వార్ధమే ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది..కానీ ఆమె భర్త అలీ కులీ మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆమె నిర్ణయం కూడా సబబేనని అనిపించక మానదు..
Everyone sensed that this marriage would be unusual..For the first time in his forty-two years,Jahangir had made his own choice,motivated by a charming pair of azure eyes and a bewitching smile,not by political strategy.
ఇందులో రచయిత్రి కథను నడిపించిన తీరు చాలా నచ్చింది..ఈ నవల,మనల్ని సరాసరి మొఘలాయి రాజవంశంపు అంతఃపురానికి అతిథులుగా ఆహ్వానిస్తుంది..అక్బర్ కుటుంబంలో మూడు తరాల వారిని ఒకేసారి మనకి పరిచయం చేస్తుంది..అంత గొప్ప రాజవంశంలో కూడా గులాబీకి ముళ్ళలా అంతర్గత వైషమ్యాలు,ఆధిపత్యపు పోరులూ,పగా ప్రతీకారాలు,వెన్నుపోట్లు ఉంటాయని సోదాహరణంగా వివరిస్తుంది..ఏదేమైనా ఇది చదివాకా పోయిన సంవత్సరం చూసిన ఫతేపూర్ సిక్రీ,ఆగ్రా ఫోటోలను ఒక్కొక్కటీ మరొక్కసారి తీసి చూశాను..ఆ పరిసరాలతో పెనవేసుకున్న ఈ కథను మరొక్కసారి కళ్ళతో చూడాలని ప్రయత్నించాను..చివరగా,సలీం,మెహెరున్నీసాలు కూడా అందరూ నడిచే దారిలోనే నడిస్తే మంచి వారిగా(?) మిగిలిపోయేవారేమోగానీ వారి ఉనికిని మాత్రం కోల్పోయేవారు..మనకి స్వార్ధం గా తోచినా కూడా వారు అనుకున్న జీవిత లక్ష్యాలను ఛేదించారు కాబట్టే వారిద్దరూ చరిత్ర లో చిరస్థాయిగా మిగిలిపోయారు..
Pages :375
Publisher :Harper Collins
Price :399/-

No comments:
Post a Comment