Thursday, March 16, 2017

The Palace of Illusions - Chitra Benarji Diwakaruni

మనకు మహాభారతం అంటే కృష్ణుడు,అర్జునుడు,భీష్ముడు లాంటి యోధుల వీర గాధలే జ్ఞప్తికి వస్తాయి.కానీ ఇందులో స్త్రీల ను గురించి స్ఫురణకు వచ్చేది కేవలం ఒక కురు సభలో ఘోర అవమానం పొందిన పాంచాలి అనో లేక కర్ణుణ్ణి నిసహ్హాయం గా నదిలో వదిలిపెట్టిన కుంతీ దేవి అనో,భర్త కోసం అంధత్వాన్ని అక్కున చేర్చుకున్న గాంధారి అనో మాత్రమే.ఈ విధంగా మహాభారతం లో స్త్రీ మనకు ఒక నిస్సహాయురాలిగానే స్ఫురణకు వస్తుంది.ఆమె పాత్ర పలు పరిమితులతో కూడి,ఆమె తండ్రి,భర్త,పిల్లలకు సహాయకారిగా మాత్రమే చిత్రీకరించబడింది.ఈ విధంగా ఆమె ఉనికికి సరైన న్యాయం జరగలేదు అని భావించిన రచయిత్రి,చిత్రా బెనర్జీ దివాకరుని,ఈ నవలలో 'మహా భారత స్త్రీ'ని  ఒక శక్తివంతమయిన,విశిష్టమైన పాత్రగా ఆవిష్కరించారు.భారతంలో అతి ముఖ్యమైన స్త్రీ,ద్రౌపదిని ప్రధాన పాత్రగా చేసి,ఆమె దృష్టి కోణం నుంచి మహాభారత గాధని మనకు వర్ణిస్తారు.ద్రౌపది కథకురాలిగా ఈ నవల సాగుతుంది.


Image Courtesy Google
ప్రతీకారమే బీజంగా ద్రౌపది,పాంచాలాధిపతి ద్రుపదుని పుత్రికగా తన సోదరుడు ద్రుష్ట ద్యుమ్నుడు చేయి పట్టుకుని యజ్ఞశిఖల మధ్యనుండి ఆవిర్భవిస్తుంది.స్వతంత్ర భావాలతో,తిరుగుబాటు ధోరణి వ్యక్తిత్వంగా రాణి వాసపు అదుపాజ్ఞలలో ఇమడలేక తను సర్వ స్వతంత్రురాలిగా ఎప్పటికైనా తనకు నచ్చిన విధంగా ఒక సౌధం (The palace of illusions) నిర్మించుకోవాలని,దానిని తనే ఏలాలనీ కలలు కంటుంది.స్త్రీకి నిషిద్ధమయిన యుద్ధ విద్యలూ,రాజనీతి వంటివి అభ్యసించాలని ప్రయత్నించి విఫలమవుతుంది.ఆమెకు ప్రాపంచిక విషయాలు తెలిసేది కృష్ణుడి ద్వారా  మాత్రమే.సోదరుడు ధ్రి (దృష్టద్యుమ్నుడు) అంటే ఆమెకు పంచప్రాణాలు.స్వయంవరానికి వరుల చిత్రపటాలు చూస్తూ వాటిల్లో కర్ణుణ్ణి మొదటి సారిగా చూస్తుంది ద్రౌపది.ఒక విధమైన లోతైన విచారం,ఉదాసీనతతో నిండిన అతని కళ్ళు ఆమెను ఆకర్షిస్తాయి.కానీ తన సోదరుని ప్రాణాలను కాపాడటానికి,తను ప్రాణ ప్రదం గా ప్రేమించిన కర్ణుణ్ణి నిండు సభలో,స్వయంవరం లో తండ్రి ఎవరని అడిగి అవమానిస్తుంది.తరువాత తను కర్ణుణ్ణి పూర్తిగా కోల్పోయానని గ్రహించి,అతని గురించి తపనపడే లోపు ఐదుగు భర్తలకి భార్య గా హస్తిన చేరుతుంది.

My situation was very different from that of a man with several wives.Unlike him,I had no choice as to whom I slept with,and when.Like a communal drinking cup I would be passed from hand to hand whether I wanted it or not.

If the sage was cared to inquire I'd have requested the gift of forgetting,so that when I went to each brother I'd be free of the memory of the previous one.

When I asked him what kind of palace he thought I should have,Krishna said,"Already you live with in a nine-gated palace,the most wondrous structure of all.Understand it well:It will be your salvation or your downfall."

ఈ కథ చదువుతున్నంత సేపూ ద్రౌపది పాత్ర స్వరూప స్వభావాలు ఇది ఒక ఇతిహాసం అని మర్చిపోయేలా చేస్తాయి.ఒక సాధారణ స్త్రీ కి ఉండే అన్ని భావావేశాలూ,దౌర్బల్యాలు  ద్రౌపదిలో మనకు కనిపిస్తాయి.తన ఐదుగురు భర్తల పట్లా భార్యగా నిబద్ధతతో వ్యవహరించినప్పటికీ,ఏనాడూ తన మనసులో వారికి కర్ణుడికి ఇచ్చిన స్థానం ఇవ్వనందుకు మధనపడుతుంది.తుది వరకూ కర్ణుణ్ణి ఆరాధించినా,అతను ఎదురైన ప్రతి సందర్భం లోనూ అతన్ని యాదృచ్చికం గా అవమానిస్తుంది.మనిషి దురదృష్టం,తనను ప్రేమించిన వారిని గుర్తించలేకపోవడం,తను ప్రేమించిన వారి  ప్రేమను పొందలేకపోవడం.ద్రౌపదిని తుది వరకూ ఈ దురదృష్టం వెన్నాడుతుంది.తనను తొలి చూపులోనే ప్రేమించిన భీముణ్ణి చిన్న చూపు చూస్తుంది.అర్జునుడితో  ప్రేమ సఫలమయ్యేలోపు ,కుంతి కారణం గా తనను మిగతా నలుగురితో పంచుకోవాల్సొచ్చినందుకు,ద్రౌపదికి మాత్రమె అర్థమయ్యే రీతిలో,ఆమె పట్ల కోపం,విముఖత ప్రదర్శించి,సుభద్రను పెళ్ళాడిన అర్జునుడి ప్రేమనూ పూర్తీ గా పొందలేకపోతుంది.స్త్రీలు సంశయ స్వభావులనడానికి ద్రౌపదికి మించిన ఉదాహరణ లేదని చెప్పొచ్చు.ఒక కోటకి రాణి గా ఇంద్రప్రస్థం లో ఆమె జీవనం,సుభద్ర వంటి సవతులని ఆమోదించలేని బలహీనత,సభలో ఘోర అవమానం పొంది భర్తల వెంట నడిచి,వారిని పగ ప్రతీకారాలతో అనుక్షణం సాధించే సగటు స్త్రీ మనస్తత్వం,కర్ణుణ్ణి పెళ్ళాడి ఉంటె ఈ బాధలు ఉండేవి కావని,అతన్ని మర్చిపోలేని మానసిక దౌర్బల్యం వెరసి ఆమె జీవితం అతి విలక్షణం,పలు వర్ణాల మయం.కురుక్షేత్రం లో తన సోదరులు,ఐదుగురు బిడ్డల మరణం చూసాకా కూడా భర్తలకి అండగా నిలబడి,మొక్కవోని ఆత్మస్థైర్యం తో యుద్ధ బాధితులను,విధవలను ఒక రాణి గా ఆదుకునే ఆమె ధైర్య సాహసాలు,మహా భారతంలో ఏ ఒక్క యోధునికీ తీసిపోవు అంటే అతిశయోక్తి కాదు.

The princess who longed for acceptance,the guilty girl whose heart wouldn't listen,the wife who balanced her five-fold role precariously,the rebellious daughter-in-law ,the queen who ruled in the most magical of palaces,the distracted mother,the beloved companion of Krishna,who refused to learn the lessons he offered,the woman obsessed with vengeance - none of them were the true Panchali. If not who I was ?

Yes I broke the first rule,the unwritten one,meant not just for warriors but all of us.I took love and used it as a balm to sooth my ego.

She laughed our loud." I can't teach you that",she said."Love comes like lightening,and disappears the same way.If you are lucky it strikes you right.If not you spend your life yearning for a man you can't have.I advise you to forget about love,princess.Pleasure is simpler,and duty,more important.Learn to be satisfied with them.

మిగతా పాత్రల విషయానికి వస్తే కుంతీ దేవి పాత్రలో,ఐదుగురు వీరులకు గొప్ప తల్లి మాత్రమే కాకుండా,కోడలిపై అధికారం చెలాయించే సగటు అత్తగారి ఛాయలు కనిపిస్తాయి.ఆమెకూ,ద్రౌపదికి మధ్య సన్నిహిత సంబంధం తుదికంటా ఏర్పడదు.చివరకు కుంతి,కర్ణుణ్ణి కురుక్షేత్రం ముందు కలిసే సందర్భంలో కర్ణుడికి తన ఐదుగురు కొడుకులతో పాటు ద్రౌపదిని కూడా భార్యగా పంచుతాననడం చాలా విస్మయపరుస్తుంది.లక్క ఇంటిలో కుమారుల రక్షణార్థం హత్యా నేరాన్ని కూడా నెత్తిన వేసుకునే తల్లిగా ఆమె పాత్ర వైవిధ్యం.

ఈ నవలలో ద్రౌపదితో సమానమైన ప్రాధాన్యత కలిగిన పాత్ర కర్ణుడిదే.ద్రౌపదిని ప్రేమించినప్పటికీ ఆమె అంతరంగాన్ని గ్రహించలేక ఆమెపై ద్వేషం పెంచుకుంటాడు.పర్యవసానం గా కురు సభలో ఆమె అంత నిస్సహాయ స్థితి లోనైనా తనను సహాయార్ధం ప్రాధేయపడుతుందేమో అని  వేచి చూసి,ఆమె అలా చెయ్యకపోయే సరికి ఆగ్రహం తో,ఆమెను వివస్త్రను చెయ్యమని దుర్యోధనుణ్ణి పురిగొల్పుతాడు.తరువాత తీవ్రం గా పశ్చాత్తాప పడతాడు .ప్రేమ,అహంకారం, ఆత్మాభిమానం వీటన్నిటిలో లో సమవుజ్జీలైన ద్రౌపది-కర్ణుల మధ్య ఒక అవ్యక్త,అనిర్వచనీయమైన బంధం తుది వరకూ కొనసాగుతుంది.

I realized now that the main reason I'd accepted the sight from Vyasa was for the opportunity to watch Karna the way I never could in real life,to decipher the enigma that he was.Now I understood him-his nobility,his loyalty,his pride,his anger,his uncomplaining acceptance of the injustice of his life,his forgiveness.But the weight of this knowledge that I could not share with anyone was crushing me.

ఈ నవలలో దృష్టద్యుమ్నుడు,శిఖండి,గాంధారి,ఉత్తర,భానుమతి లాంటి పాత్రల నిడివి పెంచారు.ముఖ్యంగా వయసులో ద్రౌపది కన్నా చాలా చిన్నపిల్ల,దుర్యోధనుని భార్య అయిన భానుమతి,ద్రౌపదికి తన గాజులను చూపించి మురిసిపోవడం,మరియు కళ్ళల్లో కాంతి ప్రకాశిస్తుండగా కర్ణుని గురించి ప్రస్తావించే సందర్భాలు ఆసక్తికరం గా ఉంటాయి.కర్ణుడి పట్ల భానుమతికీ,ద్రౌపది కీ ఉన్న అభిమానానికి తేడా ఉన్నప్పటికీ,అతను వారిద్దరి అంతరంగంలో ముఖ్యుడు. ద్రౌపది వ్యాసుని వరంతో యుద్ధాన్ని దగ్గరగా చూసే సందర్భం లో,కర్ణుడు కూడా రహస్యంగా తనను అంతగానే ప్రేమించాడు అని అతను భీష్మునికి చెప్పడం చూసి ఆశ్చర్య పోతుంది.కానీ కర్ణుడు మొదలు ఆమె జీవితం లోకి వచ్చిన వారెవరూ ఆమెని తమ ధర్మం కంటే ఎక్కువ ప్రేమించలేదని నిర్ధారణ చేసుకుని,నిజమైన ప్రేమ అంటే కృష్ణ ప్రేమ తప్ప వేరే లేదని తెలుసుకుంటుంది.కురుక్షేత్రానికి పూర్తి బాధ్యత తనదిగా భావించి వ్యధ చెందుతున్న ఆమెకి మరణ సమయంలో, కృష్ణుడు  సంశయ నివృత్తి చేసి,స్వాంతన చేకూరుస్తాడు.
ఈ నవలను ఇతిహాస దృష్టి కోణం నుంచి చూడకుండా ఉంటె దీన్నొక అసఫలీకృత ప్రేమ కావ్యం గా నిర్వంచిచొచ్చు.ఈ నవల చదివితే మహాభారతం లో మరుగున పడిపోయిన కొంతమంది స్త్రీల మనసుల్లోకి తరచి చూసిన అనుభూతి కలుగుతుంది.

No comments:

Post a Comment