చరిత్ర పుటల్లో లో కొందరు చిరస్థాయి గా నిలచిపోయే వారైతే,మరి కొందరు తమ ఉనికి తెలీకుండా కేవలం ఉత్ప్రేరకంగా మిగిలిపోయేవారు..ఈ రెండో కోవకి చెందిన వారి గురించి చెప్పుకోడానికి వీర గాధలు ఏమీ ఉండవు,కానీ వారి ఉనికి నిశ్శబ్దం గా చరిత్రకి దిశానిర్దేశం చేస్తుంది..యుద్ధ కౌశలాన్ని ఉగ్గుపాలతోనే వంటబట్టించుకునే రాజపుత్రులు తమదైన అధికారం,పౌరుషం,గౌరవ మర్యాదల విషయం లో ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడరు..కానీ గెలుపోటములు దైవ నిర్ణయాలంటారు మరి సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుని తోనే స్పర్ధ అంటే ?? ఒక ప్రక్క ఆ దేవ దేవుడితో వ్యక్తిగత వైరం,మరో ప్రక్క సింహాసనం కోసం సోదరునితో వైరం..మరి రాజపుత్ర వంశం లో జన్మించిన మహారాజ్ కుమార్ ఈ రెండు యుద్ధాల్లో అంతిమ విజయం సాధించాడా లేదా అనేదే కిరణ్ నాగర్కర్ రచించిన Cuckold సారాంశం..ఇది మహారాజ్ కుమార్ గా పిలవబడే భోజరాజు కథ..అతని భార్య,కృష్ణ భక్తురాలు మీరా కథ..2001 లో సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న ఈ నవల 15వ శతాబ్దం నాటి మేవార్ రాజపుత్రుల సంప్రదాయాలకూ,జీవన విధానానికి నిలువెత్తు దర్పణం పడుతుంది.
A kingship survives on institutions,and there's no greater institution than tradition.
The bed time stories of our children are about these larger-than life monarchs and warriors from the past. Our arteries and veins are clogged with them.Some times I think we have no present,only past.
The options of doubt and fear and retreat are unthinkable because these areas in our minds have been sealed off.In truth,they are no options at all.There is no discrimination or willingness in our valour.It is blind,headlong and unflinching because we don't know any other way of reaching in a confrontation.
రాణా సంగ్రామ్ సింహ (ఉరఫ్ రాణా సంగ) ప్రథమ పుత్రుడు మరియు చిత్తోర్ సింహాసనం మీద హక్కు దారైన మహారాజ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రధారిగా తన కథను చెప్తాడు..మెర్తా రాజ కుమారిని వివాహమాడిన నాటి నుండీ అతని జీవితం లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి..ఆమె పెళ్లి నాటి రాత్రే తనకు అంతకు పూర్వమే వివాహమైందని చెప్పడంతో నిర్ఘాంత పోతాడు..ఆమె కృష్ణున్ని తన భర్తగా భావిస్తుందని తెలిసి ఆమెలో మార్పు కోసం వేచి చూస్తాడు.కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఆమెలో ఏ మార్పూ రాదు సరి కదా,ఆమె ఒక (Little Saint) సాధువుగా అవతరిస్తుంది.. రాజపుత్రుల సంప్రదాయాలను కాదని బహిరంగంగా,ఆమె తన మార్గాన్ని అనుసరించడం తో మహారాజ్ కుమార్ కు ఇంటా బయటా తీవ్ర అవమానాలు ఎదురవుతాయి..ఆమె నలుగురిలో పారవశ్యంతో గానం చేస్తూ నృత్యం చెయ్యడం చూసి అతన్ని వ్యభిచారికి భర్త గా (Cuckold) పరిగణిస్తారు.ఈ పరిస్థితుల్లో అతను రాచరికపు గౌరవాన్ని పొందాలంటే అటువంటి భార్యను వదిలివెయ్యాలి లేకపోతే సింహాసనాన్ని కోరుకోకూడదు.
Why did the Rajput code of honour and chivalry always devolve upon the sacrifice of their own lives ?
It was delirious raving,a mad outpouring of passion and plaint,the most abject grovelling and fits of temper and tantrums.Haughty rejections,passages of fierce and naked eroticism,begging and pleading with him to come and visit her,take her away once and for all from the rest of man kind,hold her in his arms,tightly,giddily till every bone in her body was broken.
ఇదిలా ఉండగా సింహాసనం కోసం సవతి తల్లి రాణీ కర్మావతి కొడుకు విక్రమాదిత్య మహారాజ్ కుమార్ పై అనేక కుట్రలు పన్నుతూ ఉంటాడు..తండ్రి సంగ్రామ్ సింహ కూడా కొడుకుల మధ్య స్పర్ధలు తలెత్తకూడదని తటస్థంగా వ్యవహరిస్తూ ఉంటాడు..ఇటువంటి పరిస్థితుల్లో మహారాజ్ కుమార్ తీవ్ర మానసిక సంఘర్షణ కు గురవుతాడు..చరిత్రలో జరిగిన ఏ యుద్ధం అయినా ఒకటి ఆధిపత్యం కోసం లేకపోతే అతివ కోసం..కానీ రెంటినీ ఒకే సారి జయించాలనుకోవడం మహారాజ్ కుమార్ విషయంలో రెండు పడవల మీద ఒకే సారి కాళ్ళు వెయ్యడం లాంటిది.ఆ కాలం లో రాచరికపు వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా స్త్రీల ప్రాధాన్యత తక్కువేమీ కాదు.అప్పటికే రాణీ కర్మావతి తన కొడుకుని రాజుని చేద్దామని సామ్రాట్టు దగ్గర పావులు కదుపుతుంది,వాటిని తిప్పి కొట్టగల నేర్పు తన తల్లికి లేదని,తన ప్రక్కన పట్టపు రాణిగా సమర్ధురాలైన మరో స్త్రీ అండ ఉండాలని భావిస్తాడు మహారాజ్ కుమార్..కానీ భార్యని వదులుకోలేడు..లీలావతి లాంటి సౌందర్య రాశి,సమర్ధురాలు అతన్ని కోరుకున్నప్పటికీ ఆమెను అంగీకరించడు..సంధి వ్యవహారం లో భాగంగా అయిష్టంగా మేదిని రాయ్ కుమార్తె సుగంధని రెండో వివాహమాడినా ఆమెకు చేరువకాలేకపోతాడు,తత్పరిణామం గా ఆమె విక్రమాదిత్య తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది..అంతఃపుర వ్యవహారాలూ ఇలా ఉండగా ప్రిన్స్ బహదూర్ చేతిలో రాజేంద్ర మరణం,మహారాజ్ కుమార్ నాయకత్వంలో ఇదార్ కోసం గుజరాత్ తో జరిగిన యుద్ధంలో ముఖా ముఖీ పోరాటం కాకుండా గెరిల్లా పోరాట నియమాల ద్వారా గుజరాత్ సైన్యాలను దొంగ దెబ్బ కొట్టి గెలవడం లాంటి పలు అంశాలను రాజపుత్రుల నీతి నియమాలకు తీవ్ర అవమానంగా భావిస్తారు..ఇలా అన్ని కోణాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న మహా రాజ్ కుమార్ చివరకు తన పోరాటంలో విజయం సాధిస్తాడా లేదా అనేదే తరువాతి కథ..
Deception,diplomacy,intrigue,prestidigitation,machination,all these and many small and great things,the Flautist had taught me,were the tricks of a king's dharma and trade.But where had I inherited this wanton cruelty from ? I remembered then how the great warrior Arjun and his mentor,The Falutist-mine too till a few years ago-had burnt the whole of the Khandava forest and all its inhabitants without cause or provocation.It was one of the strangest episodes in the Mahabharatha,one that I could not understand ,nor make sense of,try as I might.Perhaps that is the point the great epic is trying to make,that life is inexplicable,nor does it pass the test of reason ; that some if not much of it,is meaningless.No amount of culture and civilization can subdue or hide the wanton violence in man.
ఈ నవలలో మీరా ప్రేమను పొందేందుకు మహారాజ్ కుమార్ పడే తపన చాల అద్భుతం గా ఆవిష్కరించబడింది..కృష్ణుని పట్ల ఆమె ఎందుకు ఆకర్షించబడిందో అర్థం కాక,తనను తాను ప్రతి విషయంలో ఆయనతో పోల్చుకోవడం విస్మయపరుస్తుంది..అంతర్ముఖుడైన అతను గంభీరీ నది ఒడిలో సేద తీరే సందర్భాలను చాలా అందం గా వర్ణించారు..మహారాజ్ కుమార్ మనస్తత్వం రాజపుత్రులకు భిన్నమైనది..అతను అందరూ నడిచే దారిలో కాక కొత్త మార్గాలను ఎన్నుకునే వాడవడంతో మార్పును ఇష్టపడనివారు అతన్ని పరిహసించేవారు..యుద్ధతంత్రం రచనలో సంప్రదాయ పద్ధతులను కాదని నూతన వ్యూహా రచన చెయ్యడాన్ని వ్యతిరేకించేవారు..మీరా పాత్ర చిత్రీకరణ మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది..ఆమె భక్తురాలైనప్పటికీ పిల్ల చేష్టలతో అల్లరి చెయ్యడం,సవతి సుగంధ పట్ల శత్రుత్వం,భర్త పట్ల గౌరవం,మామగారు రాణా సంగపై అభిమానం వెరసి ఆమెలో సహజ స్వాభావికతకు,భక్తితత్పరత కూ ఎక్కడా పొంతన కుదరనియ్యవు..ఈ నవలలో రాణా కుంభ,రాణా సంగ మొదలైన రాజపుత్ర వంశం లోని కొందరి వీరుల గురించిన కథనాలున్నాయి..విక్రమాదిత్య,బృహన్నాద,రాణీ కర్మావతి,బహదూర్,మంగళ, కౌసల్య,లక్ష్మణ సింహ,తేజ్ సింహ లాంటి విభిన్న వ్యక్తిత్వాలను ఆసక్తికరం గా మనకు పరిచయం చేస్తారు..ప్రత్యేకించి రాణా సంగ రాజకీయ,కుటుంబ వ్యవహారాల్లో ఏ ఒక్కరి జోక్యానికి లొంగకుండా మంత్రాంగం నడిపే తీరు,ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే తీరు అమితంగా ఆకట్టుకుంటుంది..
You can't please everybody,a king certainly can't Father had said to me when I was a child.He had forgotten to mention the other half of the preposition.You can displease everybody and get some peace of mind for yourself.The whole court,including the queen was at liberty to keep guessing who father had in mind as his successor while the princes could keep themselves busy scheming and intriguing against each other and with some luck kill each other off.
కధా వస్తువు చరిత్రకు సంబంధించినది కావడంతో నవల నిడివి ఎక్కువ గా ఉంటుంది..కొన్ని చోట్ల యుద్ధాలను గూర్చి మితిమీరిన వర్ణనలు విసిగించినా వెనువెంటనే ముఖ్య విషయం నుంచి ప్రక్కకు పోకుండా కథను నడిపించిన తీరు బావుంది..ఈ రచన రాజపుత్రుల జీవితం కత్తి మీద సాము వంటిదని తెలియజేస్తుంది..ఆ కాలం లో సింహాసనం కోసం సోదరుల మధ్యే హింసాత్మకమైన వైరం రాజవంశాల్లో చాలా సహజం..యుద్ధంలో మరణించడం వారికి గౌరవప్రదమైన విషయం..అలాగే ఆ నాటి రాణివాసపు స్త్రీల జీవితం చాలా ఒంటరితనంతో కూడుకున్నది..సామ్రాట్టులూ,రాకుమారులూ ప్రత్యేకించి మగవారి కోసం ఏర్పాటైన చంద్ర మహల్ లో స్త్రీలతో గడిపేవారు..ఇందులో ఎంత మాత్రం నచ్చని ఒక విషయం మహారాజ్ కుమార్ తనకు పాలిచ్చి పెంచిన దాయి కౌసల్యతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం..ఇది చాల అభ్యంతరకరం గా తోచింది..ఈ నవలలో బాబర్ ఇండియా లో మొగల్ వంశ పునాదులు ఏర్పరచడం నుండి Khanua యుద్ధం లో రాణా సంగ ఓటమి వరకూ పలు చారిత్రాత్మక విషయాల గూర్చిన ప్రస్తావనలుంటాయి..ఇందులో 15 వ శతాబ్దం నాటి ఆర్ధిక,సాంఘిక,మరియు రాజకీయ పరిస్థితులను గూర్చి విస్తృతం గా చర్చించారు..చరిత్ర ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పేజెస్ : 609
వెల :రూ 499 /-

No comments:
Post a Comment